Saturday, December 30, 2023

వసుదైక కుటుంబం

 ప్రస్తుతం బాగా దెబ్బతింటున్న వ్యవస్థలలో కుటుంబ వ్యవస్థ ముందు వరుసలో ఉంది..కుటుంబమంటే కేవలం భార్యా,భర్త పిల్లలేనా! అటు భర్త వైపు బంధాలు ఇటు భార్యవైపు బంధాలు కూడా కుటుంబమే.. ఎప్పుడయితే పెళ్లై రెండు జీవితాలు ముడిపడ్డాయో... భర్తవైపు వారందరినీ పూర్తిగా తనవారు అని భార్య అనుకోవాలి..భార్యవైపు అందరినీ తనవారని భర్త అనుకోవాలి..ఇరువైపులా అత్తమామలు తమ‌ తల్లితండ్రుల లాంటివారే అనుకోవాలి..మన రక్తసంబంధం మనకెలా తీపినో మన భాగస్వామికి కూడా అంతేగా? కానీ కుటుంబంలోనే  "చాలా అసమానత" నడుస్తుంది..మన అన్నదమ్ములు మన అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని కోరుకునే ఒక‌ భార్య,భర్త మరి అత్తామామలను బాగా ఎందుకు చూసుకోరు? భారంగా ఎందుకు భారంగా ఫీలవుతున్నారు.అలాగే....తన కూతురుని తన‌ అత్తామామలను ఏలాగైతే ఆదరించాలని అనుకుంటారో అలాగే తమ‌ కోడలును కూడా అలాగే ఆదరించాలి.చాలా వరకు పెళ్ళి అయ్యాక భర్త భార్య తన పుట్టింటి బంధాలను వదులుకోవాల్సి వస్తుంది..నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం...ఎవరి రక్తసంబంధాన్ని విడదీసె హక్కు మనకులేదు ప్రపంచంలో రూపాయలు పెట్టి అన్నీ కొన్నుక్కోవచ్చు..కొనలేనిది కేవలం రక్త సంబంధాన్ని మాత్రమే...కత్తెరలా బంధాలను విడదీయడం కాదు..వీలైతే సూదిలా అల్లుకు పోవాలి..మనమందరితో బాగున్నప్పుడే మన‌పిల్లలు బంధాల విలువ తెలుసుకుంటారు..ఎందుకంటే పిల్లలు పెద్దలను చూస్తూ పెరుగుతారు,నేర్చుకుంటారు..మనం వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్థులు, భూములు కాదు.వ్యక్తిత్వాన్ని,విలువలను,బంధాలను,బంధువలను ఇవ్వాలి అందరూ మనకి నచ్చినట్లుండరు..మనం నదిలా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి..వెంటరాని ఆస్థుల కోసం పంతాలు,పట్టింపుల కోసం రక్తసంబంధాలను దూరం చేసుకుంటే ఎలా! మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వేదనకు గురి కాకుండా చూసుకోవాలి. మనం తలచుకుంటే  "వసుదైక కుటుంబం" ఏర్పరచగలం..కాదంటారా?..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

Tuesday, December 26, 2023

నాన్నెందుకో వెనకబడ్డాడు.

 అమ్మ తన కడుపులో తొమ్మిది నెలలు మోస్తే... 

నాన్న మనల్ని జీవితాంతం మోస్తాడు...రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు.ఇంట్లో ఏమి తీసుకోకుండా అమ్మ...కష్టపడి సంపాదన అంతా ఇంటికే పెడుతూ నాన్న...ఇద్దరి కష్టం, శ్రమ ఒకటే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు...ఏది అడిగితే అది వండి,వడ్డిస్తూ అమ్మ...ఏది అడిగితే అది లేదనకుండా ఇచ్చే నాన్న...ఇద్దరి ప్రేమా సమానమే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు..ఫోను చేసినా అమ్మ అనే పేరే..దెబ్బ తగిలినప్పుడూ అమ్మా అనే పిలుపే..అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పమిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా అంటే..ఏమో??అమ్మకి పిల్లలకి ఇంట్లో నిండా రంగురంగుల బట్టలు లెక్క లెన్నన్ని ఉన్నా..నాన్న బట్టలు మాత్రం ఒకటో రెండో జతలు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో వెనకబడ్డాడు.పిల్లల ప్రేమ పొందడం లో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనక పడ్డాడా అంటే ఏమో?? అమ్మకు పిల్లలకు బంగారు ఆభరణాలు...నాన్నకి మంచి బంగారు రంగు వాచీకూడా లేదాయే,కుటుంబం కోసం ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలనే తపన ఎంటో నాన్నకి..తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు.వయసు మళ్ళిన అమ్మైతే ఇంట్లో పనికి పని కొస్తుంది...అదే నాన్నైతే ఎందుకూ పనికిరాడని మనం సూటి పోటీ మాటలన్నపుడు కూడా వెనకబడింది నాన్నే! నాన్న ఇలా వెనకబడి పోవడానికి కారణం ఎవరు?అందుకే మనం నాన్నకు, అమ్మకు..కావాల్సినంత ప్రేమను ,ఆనందాన్నీ ఇద్దాం..ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ ఇచ్చారుగా కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వారిని బాగా చూసుకుందాం..నాన్నా ఎపుడూ వెనుక బడినా మా గెలుపు కోసమే ఇది ప్రతి అమ్మకి నాన్నకి అంకితం..ఎక్కడో విన్నది చదివినది..*ఇట్లు ఓ నాన్న*

Tuesday, July 25, 2023

ఒక కప్ప కథ

 #ఒక_కప్పను_ఒక_నీళ్ళగిన్నెలో...#ఉంచి_ఆ_గిన్నెను_పొయ్యి_మీద_ఉంచితే...#కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి అవ్వటం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది...#ఇంకొంచెంసేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి, అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకుని నీటి వేడిని ఓర్చుకోగలుగుతుంది...

#ఇలా_కొన్నిసార్లు జరిగిన తరువాత ఇక నీళ్ళు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంక మార్చుకోలేదు, ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది, నీళ్ళ గిన్నెలోంచి ఇక బయటకు దూకేద్దాము అని...

#కానీ_దూకలేకపోయింది, ఎందుకంటే అప్పటి వరకూ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించటంలోనే కప్ప శక్తి అంతా హరించుకుపోయింది, వేడి నీళ్ళ గిన్నెలోంచీ దూకే శక్తి లేక నీరసపడిపోయింది...#కాసేపటికి కప్ప చనిపోయింది...కారణం వేడినీళ్ళా... కానే కాదు...

#ఎప్పుడు గిన్నెలోంచి దూకాలో సరైన సమయంలో సరైన నిర్ణయం కప్ప తీసుకోలేకపోయింది... అదే అసలైన కారణం...


#ఇప్పుడు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు..భరిస్తున్నారు కదా అని రాళ్లు విసిరినా ఓర్చుకోవడమే మనం చేసే తప్పు.. ఎందుకంటే 

#ఎవరో_వస్తారని_ఏదో_చేస్తారని ఎదురు చూస్తూ సమయం ముగిసిపోయే వరకు ఉండి భలై పోయేకంటే, సమయం ఉన్నప్పుడే కళ్ళు 

తెరుచుకుని ధైర్యంగా, సరైన శక్తి ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అవసరం చాలా అవసరం..!! మేలుకో మిత్రమా మేలుకో.ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


Tuesday, March 28, 2023

నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??

 *నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??*

*మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే సగం మానసిక, శారీరక రోగాలు తొలగిపోతాయి.* 


🏵️ *రాత్రి గాఢనిద్ర పోయి ఈ రోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే, దేశంలో నిన్న రాత్రి లోపు అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు ఎంతో అదృష్టవంతుడివన్నమాట.*

🏵️ *నువ్వింత వరకు  కరువులో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే, ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*

🏵️ *ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు వేసుకొని, కంటినిండా నిద్ర పోగలిగితే, ప్రపంచములోని 75 శాతం ప్రజల కన్నా ధనవంతుడివి నువ్వే అన్నమాట.*

🏵️ *నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, bank account లో balance ఉంటే, world లోని 8 శాతం ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*

🏵️ *నీ పిల్లల ద్వారా నీవు ఆప్యాయత, అనురాగం మరియు ఆనందం పంచుకుంటూ జీవితం గడుపుతూ ఉన్నట్లైతే ప్రపంచపు 5 శాతం పిల్లలు పడే మానసిక, శారీరక బాధ వారి తల్లి తండ్రి విడి పోవడం వల్ల కలిగే దాంట్లో నువ్వు ఒకడివి కాదు అన్నమాట.*

🏵️ *నువ్వు హాయిగా తలెత్తి, ఆహ్లాదంగా నవ్వగలిగితే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట.*

🏵️ *నీవు ఈ మెసేజును చదువుతున్నావు అంటే ప్రపంచంలో 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వే అదృష్టవంతుడివన్నమాట..*

🏵️ *నీవు ఈ భువి లోని అంద చందాలను చూసి ఆనందిస్తున్నావు అంటే అంధకారంలో ఉన్న కోట్ల మంది కన్నా నీవు ఎంతో అదృష్ట వంతుడివి.*

🏵️ *నీవు ఏది తిన్నా అరిగించుకొని హాయిగా నిద్రపోతే కోట్ల మంది గుప్పెడు గోలీలు మింగినా అరగక నిద్ర రాక ఆయాసపడుతున్నవారి కంటే నీవెంతో అదృష్టం ఉన్న వాడివి.*

🏵️ *నీవు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, నడువగలుగుతున్నావు, నీ చేతులతో నీ పనులన్నీ చేయగలుగుతున్నావంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది అంగవైకల్యం ఉన్న వారి కంటే నీవు ఎంతో అదృష్ట వంతుడివి.* 

🏵️ *నువ్వింకా అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న స్థిర చర ఆస్తుల విలువలని, నీలోని శక్తులని, నీకున్న అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట..*

*ఇప్పటికైనా నీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని సన్నిహితులతో పంచుకుంటూ తగ్గించుకుంటూ, ఉన్నంతలో నీవు సంతోషంగా ఉండు.*

🙏🙏🙏🙏🙏🙏

Sunday, March 26, 2023

అంతా నీ చేతిలోనే ఉంది

ఏదైనాసరే మన దృష్టిలోనే ఉంది మనం వీక్షించ గలిగితే అంతటా మంచే కనిపిస్తుంది...మనం దర్శించగలిగితే ప్రతిమంచిలోనూ దైవం కనిపిస్తుంది..మనం సవరించుకో గలిగితే ప్రతి బలహీనతా  ఒక బలమవుతుంది..మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి అపార్థమూ అర్థమవుతది..మనం అన్వేషించగలిగితే ప్రతి సమస్యా ఒక పరిష్కారమవుతుంది..మనం చదవగలిగితే ప్రతి పరిచయమూ ఒక పుస్తకమవుతుంది..మనం నేర్చుకోగలిగితే ప్రతి అనుభవమూ ఒక పాఠమవుతుంది..మనం స్వీకరించగలిగితే ప్రతి కష్టమూ ఒక ప్రేరణవుతుంది..మనం మలచుకోగలిగితే తగిలిన ప్రతిరాయీ పునాదిలో బాగమవుతుంది..మనం భరించగలిగితే ప్రతి గాయమూ గేయమవుతుంది..మనం  ప్రయత్నించగలిగితే ప్రతి ఓటమీ మన విజయానికి సోపానమవుతుంది..మనం ధైర్యంగా పోరాడగలిగితే ప్రతి సవాలు సూక్ష్మ మవుతుంది..మనం ఆహ్వానించగలిగితే ప్రతిపరిచయమూ ఒక‌ స్నేహమవుతుంది..మనం ఆస్వాదించగలిగితే ప్రతి స్నేహమూ ఒక అనుబంధమవుతుంది..మన‌ం మన హృదయాన్ని  విశాలం‌ చేసుకోగలిగితే ప్రతి అనుబంధమూ ఒక అద్భుతమవుతుంది..మనం సంకల్పిస్తే..మన జీవితమే ఒక‌ అందమైన ప్రపంచమవుతుంది.....ఏదయినా మనం "అనుకునేదానిలోనే" ఉంది..ఇది నిజం

Saturday, March 25, 2023

వదిలెయ్

 *🍁వదిలెయ్ 🍁*

🌹🌻💦🌸🥀🪷


*ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం*


*వదిలెయ్*


*పిల్లలు ఎదిగినప్పుడు, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాలా పడడం*

*వదిలెయ్*


*కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను*

*వదిలెయ్*


*ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టు కోకుండా* 

*వదిలెయ్*


*మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం*

*వదిలెయ్*


 *మనలోని కోరికకు, మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే, నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం* 

*వదిలెయ్*


*ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు, రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం*

*వదిలెయ్*


*నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరేసరి, లేదంటే నన్ను కూడా*

*వదిలెయ్*


*వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం*

*వదిలెయ్*


*మీకు ఈ సందేశం నచ్చితే సరి. ఒకవేళ మీకు నచ్చకపోతే, సీరియస్ గా తీసుకోకుండా*

*వదిలెయ్*....

*ప్రియ మిత్రమా* 


*వృద్ధుడు వ్యర్థుడు కాదు*

*ఇంటికి ఈశ్వరుడు*


*మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు*

*ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు...*


*బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి.* 

*కాపాడే సిద్ధుడు వృద్ధుడు...*

 *వృద్ధులు సారధులైతే యువకులు *విజయులౌతారు...* *అనుభవాల గనులు...*

*ఆపాత బంగారాలు...*


*వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు...* 

*చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు*

*ఓ బుద్ధుడు..* 

*నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ల ముసలివాడు..*

*తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు...*


*ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు...* 

 *తనను పట్టించుకోకున్నా,* 

 *నువ్వు పచ్చగా ఉండాలని* *తపించే ఉదాత్తుడు వృద్ధుడు...*


*పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు...* 

*వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు... అంతర్గతంగా తలపండిన పండితుడు...*     


*వృద్ధుడు వ్యర్థుడు కాదు... ఇంటికి ఈశ్వరుడు...*


*వృద్దులకు గౌరవం ఇద్దాం*

*మన గౌరవం పెంచుకుందాం ---//-*

*మేము అరవై లో ఇరవై.* 


*పచ్చగా మెరిసే పండుటాకులమే గాని*

             *చప్పుడు చేసే ఎండుటాకులం కాదు*

 *కలలు పండినా* *పండకపోయినా* 

            *మేము తలలు పండిన తిమ్మరుసులం*


 *కొరవడింది కంటి చూపు గాని* 

          *మందగించలేదు ముందు చూపు* 


 *అలసిపోయింది దేహమే గాని* 

          *మనసుకు లేనే లేదు సందేహం* 


 *ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా* 

                      *ఈ భూమికి కాబోము భారం* 


 *అరవై లో ఇరవై కాకున్నా* 

                      *అందని ద్రాక్ష కై అర్రులు చాచం* 


 *కుందేళ్ళమై పరుగులు తీయకున్నా* 

               *తాబేళ్లమై గెలుపు బాట చూపగలం* 


 *చెడుగుడు కూతల సత్తా లేకున్నా* 

              *చదరంగపు ఎత్తులు నేర్పగలం* 


 *సమయం ఎంతో మాకు లేకున్నా* 

            *సమయమంతా మీకు సమర్పిస్తాం* 


 *అనుకోకుంటే అధిక ప్రసంగం* 

    *అనుభవ సారం* *పంచుకుంటాం* 


 *వాడిపోయే పూవులమైనా* 

    *సౌరభాలు వెదజల్లుతాం* 


 *రాలిపోయే తారలమైనా* 

   *కాంతి పుంజాలు* *వెదజల్లుతాం. 💐* 


*🙏🏻🪷DEDICATED TO ALL SENIOR CITIZENS🪷🙏🏻*


_*శుభ...శుభోధయం*_


*"#మహాభారతం" నుండి* 

*నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలు**


*#1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:*

కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.


*#2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:*

శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.


*#3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:*

పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.


*#4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:*

కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.


*#5. ఎవరి పనులు వారే చేసుకోవడం:*

అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.


*#6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:*

కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.


*#7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:*

ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.


*#8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:*

అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.


*#9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:*

కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణాదులు పరోక్షం గా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే .


*#10.స్రీలని ఆపదల నుండి కాపాడటం 

నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.


*#11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:*

పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.


*#12. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తోంది*

కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది.


*#13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:*

చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.


*#14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:*

పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.


*#15.మంచి ఫలితాలు రావాలంటే కష్టాలు అవసరం:*

పాండవులు జుధంలో ఓడిపోయి అవమానాలు భరించి 

రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలు అయినారు 

వీళ్ళు అరణ్యంలో ఉన్నంత సేపు ఒకే దగ్గర ఉండక చాలా కష్టాలు పడి ప్రయత్నంతో ఋషుల సంగమంతో అస్త్రాలు శస్త్రాలూ సంపాదించి 

సాదు సంగమంతో చాలా విషయాలు నేర్చుకున్నారు 

అర్జునుడు వివేకంతో చాలా అస్త్రాలు సంపాదించి చివరికి ఇంద్రుడిని ఓడించే అస్త్ర సంపదను సంపాదించాడు భీముడు ఆవేశాన్ని తగ్గించి ఆవేశం తో ఏమి చేయలేము ప్రతి దానికి సహనం అవసరం సహనంతో ఎంత పెద్ద విజయాన్ని అయినా తృణపాయంగా గెలువవచ్చు అని నిరూపించుకుంటాడు యుద్ధంలో 

ధర్మరాజు యొక్క ధర్మ నిష్ఠ కష్టాల్లో కుడా ధర్మాన్ని వదలకుండా దృడంగా పట్టువదలకుండా నిష్కమ కర్మలు చేసి చివరికి తన ధర్మంతో 

సాక్షాత్తు ధర్మ రూపం అయినా యమధర్మరాజు ఆశీస్సులు పొందుతాడు 

 చివరికి వీరు అరణ్యవాసం లో చాలా కష్టాలు పడి చివరికి అదే 

కృషి ప్రయత్నంతో కురుక్షేత్రం లో విజయం సాధించారు ప్రతి కష్టం వెనుక విజయం తప్పనిసరి 

మంచి ఆలోచనలు

🙏🙏🙏🙏🚩🚩


🌹🌼🌻🪷🥀🌸