Friday, August 17, 2012

మంచి మాట

'వ్యక్తిత్వం' కు మించిన అందం లేదు
'సాధనకు' కు మించిన అదృష్టం లేదు
'ప్రేమకు' కు మించిన తోడు లేదు
'ప్రతిభ' కు మించిన ధనం లేదు
'విజయం' కు మించిన ఆనందం లేదు
'ధైర్యం' కు మించిన శక్తి లేదు
'త్యాగం' కు మించిన గొప్పదనం లేదు

లక్ష్యం

మనిషి సందర్భానుసారంగా తన ఆలోచనలను మారుస్తూ వుంటాడు. ఎన్ని ఆలోచనలు మారిన తను అనుకున్నది సాధించాలంటే అన్నింటికన్నా ముందు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోగలననే నమ్మకముండాలి. ఆ నమ్మకాన్ని నిజం చేసే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలకు సడలని ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రతతో మనం చేసే పని మీద దృష్టి నిలుస్తుంది. నువ్వు చేసే ఆ పనే నీ లక్ష్యాన్ని చేదించే ఆయుధమవుతుంది.నువ్వు చేయాల్సిన పేని ఏంటో నీకు మాత్రమే తెలుస్తుంది. పని మొదలపెట్టు, ఆ పనిమీదే నీ దృష్టి.ఆ దృష్టి ఏకాగ్రతగా మారుతుంది.ఆ ఏకాగ్రత నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకం నీ లక్ష్యాన్ని చేదిస్తుంది....ఇక మొదలుపెట్టు...లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టూ..

లక్ష్యం

మనిషి సందర్భానుసారంగా తన ఆలోచనలను మారుస్తూ వుంటాడు. ఎన్ని ఆలోచనలు మారిన తను అనుకున్నది సాధించాలంటే అన్నింటికన్నా ముందు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోగలననే నమ్మకముండాలి. ఆ నమ్మకాన్ని నిజం చేసే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలకు సడలని ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రతతో మనం చేసే పని మీద దృష్టి నిలుస్తుంది. నువ్వు చేసే ఆ పనే నీ లక్ష్యాన్ని చేదించే ఆయుధమవుతుంది.నువ్వు చేయాల్సిన పేని ఏంటో నీకు మాత్రమే తెలుస్తుంది. పని మొదలపెట్టు, ఆ పనిమీదే నీ దృష్టి.ఆ దృష్టి ఏకాగ్రతగా మారుతుంది.ఆ ఏకాగ్రత నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకం నీ లక్ష్యాన్ని చేదిస్తుంది....ఇక మొదలుపెట్టు...లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టూ..

అమ్మ

ప్రతి ప్రాణి మొదటి ప్రేమను ఆస్వాదించేది తల్లి వల్లే.మనం పుడుతూ అమ్మని ఎదిపిస్తాం-కాని మనం పుట్టాక మనల్ని చూసి ఆనందపడే మొదటి వ్యక్తి అమ్మ.
మనం గొప్ప పని చేసాం అని తెలిస్తే "నా కొడుకు గొప్ప పని చేసాడు" అని మొదట సంతోష పాడేది అమ్మ.
మనం తప్పు చేసాం అని తెలిస్తే "నా కొడుకు తప్పు చేయడు"అని మొదట బాధపడేది అమ్మే.
మనం పెడదోవ పట్టకుండా సక్రమమైన మార్గంలో నడవాలని ప్రతిక్షణం ఆవేదన పడుతుంది అమ్మ.
మనం తనను బాధపెట్టినా,తను మాత్రం మనం బాగుండాలనే కోరుకుంటుంది అమ్మ.
మనం గెలిచినప్పుడు అందరూ మనకి దగ్గరవ్వాలని చూస్తారు,కాని మనం ఓటమిలో ఉన్నప్పుడు తను బాధపడుతూ మనల్ని ఓదార్చేది మాత్రం అమ్మ.
అందుకే అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది.

ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు.
కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా-మనల్ని మాత్రం బాధపెట్టని ఒకే ఒక వ్యక్తి అమ్మ.
మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం-కాని మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేది అమ్మ ఒక్కటే.

అందుకే అమ్మంటే నాకు ప్రాణం

నాన్న

నాలో నమ్మకాన్ని పెంచిన వ్యక్తి నాన్న...
నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వ్యక్తి నాన్న...
నాలో ధైర్యాన్ని మేల్కొలిపిన వ్యక్తి నాన్న...
మంచి చెడుల తారతమ్యతని తెలిపిన వ్యక్తి నాన్న...
నాకు మంచి ఆలోచనలు కలిగేల మంచి విషయాలు చెప్పిన వ్యక్తి నాన్న...
నాకు సమాజం పట్ల అవగాహన కల్పించిన వ్యక్తి నాన్న...
నేను నిరుత్సాహపడ్డప్పుడు నా భుజం తట్టి నాలో ఆత్మస్తైర్యాన్ని మేల్కొలిపిన వ్యక్తి నాన్న...
నాన్న... కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు...నా మార్గదర్శి

మాట


ఈ ప్రపంచంలో చాల రకాల జీవరాసులు ఉన్నాయి. జంతువులు,పక్షులు, మనుషులు అన్ని ప్రాణులే.
కాని 'మనిషి' అనే ప్రాణికి అన్ని జీవరాసుల్లో కన్నా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనిషి సాంఘిక జీవి,అన్ని జీవరాసుల కన్నా తెలివి ఉంది..ఒకరి భావాలను ఒకరు 'మాట' ద్వార తేలికగా తెలుసుకో గలరు,అర్ధం చేసుకో గలరు..
ఆయుధం కన్నా పదునైనది 'మాట'.
ఆ 'మాట' ఆలోచనాత్మకంగా ఉండలేగాని అవమానించేలా ఉండకూడదు.
మన మాటలు ఎదుటివారిని ఉత్తేజ పరిచేవిగా ఉండలేగాని వెటకారంగా ఉండకూడదు.
అర్ధం చేసుకునేలా ఉండాలేగానే కించపరిచేలా ఉండకూడదు.
నీకు శత్రువునైన మిత్రువులనైన సృస్టించగలిగే సృష్టికర్త నీ మాట.
నలుగురిలో నిన్ను తలఎత్తుకు నిలబడేలా చేయలన్నా నీ మాటే - అదే నలుగురితో ఛీ కొట్టించుకోవలన్నా నీ మాటే కారణం.
పదిమందీ నిన్ను అభిమానించాలంటే ఆప్యాయంగా పలకరించే నీ మాటే కారణం.
అదే పది మంది నిన్ను అసహ్యించు కోవాలంటే నీ నుంచి వచ్చే అసబ్యాకరమైన నీ మాటే కారణం.
ప్రాణులన్నీటిల్లోకల్లా ఒక్క మనిషికే ఆలోచనాశక్తి ఎక్కువగా ఉంటుంది. మనం జంతువులంకాదు మనుషులం కాబట్టి మాటలు ఆలోచించి సక్రమంగా మాట్లాడితే నీతో పాటు నిన్ను అభిమానించే పదిమంది ఉంటారు. లేదు అనాలోచితంగా, అసహనంగా, అసభ్యకరంగా, అవ్యవహరికంగా, అనుచితంగా మాట్లాడితే మిగిలేది నువ్వొక్కడివే..

మాట అనే ఆయుధాన్ని పద్దతిగా వాడితే పైకోస్తావ్ - పద్ధతి తప్పి మాట్లాడితే అదే ఆయుధానికి నువ్వే బలైపోతావ్.
అందుకే సభ్యత సంస్కారంతో మాట్లాడుతూ అందరిచేత గౌరవాన్ని అభిమానాన్ని అందుకుంటూ మనిషి అనే పదానికి సరైన అర్దాన్ని ఇవ్వు.