Sunday, February 27, 2011

గెలువు

సముద్రమంత శక్తి నీదిరా,అలజడులేవీ నీకు అడ్డుకాదురా.....
పాతబాట విడువు సోదరా,కొత్తదారి వెదుకుదామురా.....
ఓటమంటే నిచ్చెనేనురా,గెలుపు కొరకు ఓడు సోదరా...
స్థితనిశ్చయం నీలో నిలపరా,గెలుపొక్కటే నువ్వు తలవరా....
ఓటమేమీ అడ్డు కాదురా,గెలుపుకే అది తొలి భీజమౌనురా...
విజేతలంటే వింత వ్యక్తులు కాదురా,వాళ్ళు కూడా మనలాంటి మనుష్యులేనురా...
ఓటమంటూ ఎరగని వాడు ఒక్కడూ లేడురా,పుట్టుకతోనే ఎవ్వడూ విజేత కాడురా...
కృషితోనే జీవితం సార్ధకమౌనురా,నిరంతర పరిశ్రమతో సాధ్యం కానిదంటూ లేదురా...
పట్టువదలక ప్రయత్నించి చూడరా,నీ జీవితాశయం నెరవేర్చి చూపరా
తలపు గెలుపుపై నిలపరా,విధిరాతను మార్చి నువ్వు రాయరా...

Sunday, February 13, 2011

ప్రియ సఖి!!!!

నీలాల కళ్ళు... చిలిపి చూపుల బాణాలు సంధించి వేసావు యదకు సంకెళ్ళు...
ముత్యాల పళ్ళు... చిరు నవ్వుల జల్లులు కురిపించి ముత్యాలతో నింపావు దోసిళ్ళు...

కెంపుల ఒళ్ళు... చిన్నగా తాకితే చాలు సిగ్గుతో ఎరుపెక్కే నునులేత చెక్కిళ్ళు...
పగడాల అధరాలు... అదరహొ అనిపించే దరహాస కుసుమాల సుగంఘ మధురాలు...

బంగారు మేని ఛాయ... చూసి చూడగనే చేసావు నన్ను మాయ...
నుదుటిపై ఉదయించిన రవి సిందూరం... సిగలో వికసించిన ముద్ద మందారం...

వజ్రాల కర్ణాలు... అణువణువున నిండిన వైడూర్య వర్ణాలు...
అయ్యారే చెలి అందాల సిరుల సాటి... జగమున లేదోయి ఆమెకు మేటి...

ముద్దొచ్చే ముగ్ధ మనోహర రూపం... నయనాలయంలో సదా అపురూపం...
వెన్నెల వెలుగు విరజిమ్మే శశి ముఖి... నీ వన్నెల వగలు నావేలే ప్రియ సఖి

ప్రేమికుల రోజు....!

ప్రేమకు సన్నిధి ఈ రోజు.. ప్రేమికుల పెన్నిధి ఈ రోజు...
ప్రేమ మహిమాన్మిత త్యాగానికర్ధం ఈ రోజు.. ప్రేమ పరమ పధానికి పరమార్ధం ఈ రోజు...

యుగ యుగాలుగా తర తరాలుగా తరగని చరగని ప్రేమ సుగంధపు పరిమళ మీ రోజు...
ప్రేమికుల రోజు.. ప్రేమకు పుట్టిన రోజు.. హృదయ లయలో ప్రియ రాగం పలికిన రోజు...

మనసున దాగి ఉన్న మాట.. తెలుపగా పెదవి దాటు చోట...
ఇరు హృదయాల మధ్య ఆట.. రెండు ఉదయాల మధ్య వేట...
మనసున ఊగిసలాడే పాట.. పాడాలి అలుపెరుగక ఈ పూట...

హృదయ ప్రేమ గీతం :

నాలోని ప్రేమని, నీతో తెలుపమని.. మనసే తొందర చేసెనే...
మదిలోని మాటని, పెదవే దాటమని.. హృదయం తొందర చేసెనే...

మనసు ఆపుకోలేక, పెదవి దాట లేక..
మదిన దాచుకోలేక, నీకు చెప్పలేక...
చెప్పుకుంటున్నా.. చెలియకు తెలియజేస్తున్నా...

I Love You.. I Love You.. I Love You.. I Love You... ! రెండు సార్లు !

ఊహలే గుస గుస లాడే.. ఊపిరే ఊగిసలాడే...
నీ ప్రేమ సరిగమలే హృదయం అణువణువు పాడెనే...

అడుగులే తడపడ సాగే.. పిలుపులే వినపడ కాగే...
నీ ప్రేమ మధురిమలే తనువంతా నిండి ఆడెనే...

ఏ మాయ చేసేవే, ఏ మంత్ర మేసావే...
ఏదేదో చేసేవే.. నా కొంప ముంచావే...

నిదురలో కలల లాహిరి, కలలలో స్వప్న సుందరి...
కల్పనలా మదిన దూరి, దోచావు మదిని దరి చేరి...

నా మదిని దోచావే, నీ మదిన దాచావే...
నన్ను నీలా మార్చావే, నిన్ను నాలో కూర్చావే...

నీ ప్రేమ వరమును కోరి, నడిచాను నీ అడుగుల దారి...
వలపు గుడిలో వెలసిన వయ్యారి, పిలుపు జడిలో తడిసిన సుకుమారి...
బిగి కౌగిలి వడిలో మరిగి, జిగి బిగి ప్రేమ బడిలో కరిగి...

భయము మరచి.. నన్ను వలచి...
ప్రణయ లోకం తలపు తెరచి.. ప్రణవ గీతం మదిన తలచి...
ప్రేమగా తెలుపనీయవే నీ ప్రేమని, నీ మనసు మాటున మధన పడే మాటని...

I Love You.. I Love You.. I Love You.. I Love You... ! రెండు సార్లు !



:
ప్రేమికులకు ముఖ్య గమనిక


ప్రేమ ఒక్కటే జీవితం కాదు, అలాగే ప్రేమించ లేని జీవితం ఎప్పటికి పరిపూర్ణం కాదు...
ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు...
జీవితాంతం.. అనంతం నీ తోడుగా నిలిచే బంధం, నీ నీడగా సాగే అనుబంధం ఈ ప్రేమ...
కుల, మత, జాతి, వర్ణ, ప్రాంతీయ భేదాలు.. విభేదాలు లేని ఒకే ఒక్క పదం ఈ ప్రేమ...
తల్లీ బిడ్డల తోలి స్పర్సలో వికసించే కుసుమం ఈ ప్రేమ...
భార్యా భర్తల తోలి అడుగులో చిగురించే మహా వృక్షం ఈ ప్రేమ...
ప్రేమించకుండా ప్రాణం ఉండలేదేమో, ప్రేమకు అందకుండా హృదయం స్పందించలేదేమో...
ప్రేమ విజయాన్ని కోరుకోనేదే కాని అపజయాన్ని కాదు...
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కాని ఆత్మ త్యాగాన్ని కాదు...
ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకోనేదే నిజమైన ప్రేమ...
నాది నిజమైన ప్రేమ... మరి మీది...?
పిల్లలకు, పెద్దలకు, నవ యువతకు, కురు వృద్ధులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు...!

Tuesday, February 1, 2011

గుర్తుంచుకో...!

జన్మించిన ప్రతి జీవి ఏదో ఒక రోజు జీవితాన్ని ముగించి ప్రాణాన్ని విడువక తప్పదు...
కృశించిన ఈ దేహాన్ని వదిలి మరో కొత్త రూపంలోకి ప్రవేశించక తప్పదు, అది దైవ శాసనం...

భవ బంధాల నుంచి విముక్తిని ప్రసాదించే వరం, మరణం...
జనన మరణ చక్ర ప్రయాణం నుంచి ముక్తిని ప్రసాదించే భగవన్నామ స్మరణం ఈ మరణం...

ఎన్ని దేశాలు చూసినా, ఎన్ని మార్గాలలో పయనించినా...
భక్తి మార్గం చూడలేని కన్నులెందుకు, ముక్తి మార్గం చేరలేని పయనమెందుకు...?

ఎన్ని విద్యలు అభ్యసించినా, ఎన్ని లక్షలు సంపాదించినా...
లోకజ్ఞానం అభ్యసించలేని విజ్ఞానమెందుకు, లక్షణమైన లక్షణాలు లేని లక్షలెందుకు...?

ఒంటరిగా మనలోకి వచ్చిన ప్రాణం ఒంటరిగానే పోతుంది...
అమ్మ నాన్న, భార్యా భర్త, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవడు మనవరాలు అంతా మాయ...

ప్రాణం లేని దేహం విలువ లేనిది, చితిలో అస్తికలుగా మారేది...
ఆస్తి అంతస్తు, పరువు మర్యాద, మంచి చెడు, కష్టం సుఖం, మానవత్వం మనల్ని అమరత్వంలోకి తీసుకెల్లేవి...

మరణించేది మరలా జన్మించడానికే అన్నది ఎంత నిజమో...
జన్మించేది ఏదో ఒక రోజు మరణించడానికేనన్నది కూడా అంతే నిజం కాని...

జీవించిన ఈ జీవితంలో బారసాలకు కర్మకాండకు మధ్య, ఏమి సాధించామన్నదే ముఖ్యం...
ఎన్ని ఆస్తులు సంపాదించాం, ఎన్ని అంతస్తులు నిర్మించాం, ఎన్ని లక్షలు కూడపెట్టామన్నది ముఖ్యం కాదు...

జీవించినంత కాలం ఉన్న దానితో తృప్తిగా జీవించు, ఉన్నంతలో మనస్శాంతిగా జీవించు...
ఈ భూమి మీద ఎవ్వరు శాస్వతంగా ఉండేది లేదు, ప్రేమ ఒక్కటే శాస్వతంగా ఉండేది కనుక మానవత్వంతో అందరితో ప్రేమగా ప్రేమిస్తూ జీవించు...

ఆశాస్వామైనా ఈ ప్రాణాన్ని దైవం నీ నుంచి దూరం చేయవచ్చు కాని...
అనంతమైన ఈ ప్రేమను ఆ దైవం సైతం నీ నుంచి దూరం చేయలేదని గుర్తుంచుకో...!