Saturday, December 30, 2023

వసుదైక కుటుంబం

 ప్రస్తుతం బాగా దెబ్బతింటున్న వ్యవస్థలలో కుటుంబ వ్యవస్థ ముందు వరుసలో ఉంది..కుటుంబమంటే కేవలం భార్యా,భర్త పిల్లలేనా! అటు భర్త వైపు బంధాలు ఇటు భార్యవైపు బంధాలు కూడా కుటుంబమే.. ఎప్పుడయితే పెళ్లై రెండు జీవితాలు ముడిపడ్డాయో... భర్తవైపు వారందరినీ పూర్తిగా తనవారు అని భార్య అనుకోవాలి..భార్యవైపు అందరినీ తనవారని భర్త అనుకోవాలి..ఇరువైపులా అత్తమామలు తమ‌ తల్లితండ్రుల లాంటివారే అనుకోవాలి..మన రక్తసంబంధం మనకెలా తీపినో మన భాగస్వామికి కూడా అంతేగా? కానీ కుటుంబంలోనే  "చాలా అసమానత" నడుస్తుంది..మన అన్నదమ్ములు మన అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని కోరుకునే ఒక‌ భార్య,భర్త మరి అత్తామామలను బాగా ఎందుకు చూసుకోరు? భారంగా ఎందుకు భారంగా ఫీలవుతున్నారు.అలాగే....తన కూతురుని తన‌ అత్తామామలను ఏలాగైతే ఆదరించాలని అనుకుంటారో అలాగే తమ‌ కోడలును కూడా అలాగే ఆదరించాలి.చాలా వరకు పెళ్ళి అయ్యాక భర్త భార్య తన పుట్టింటి బంధాలను వదులుకోవాల్సి వస్తుంది..నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం...ఎవరి రక్తసంబంధాన్ని విడదీసె హక్కు మనకులేదు ప్రపంచంలో రూపాయలు పెట్టి అన్నీ కొన్నుక్కోవచ్చు..కొనలేనిది కేవలం రక్త సంబంధాన్ని మాత్రమే...కత్తెరలా బంధాలను విడదీయడం కాదు..వీలైతే సూదిలా అల్లుకు పోవాలి..మనమందరితో బాగున్నప్పుడే మన‌పిల్లలు బంధాల విలువ తెలుసుకుంటారు..ఎందుకంటే పిల్లలు పెద్దలను చూస్తూ పెరుగుతారు,నేర్చుకుంటారు..మనం వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్థులు, భూములు కాదు.వ్యక్తిత్వాన్ని,విలువలను,బంధాలను,బంధువలను ఇవ్వాలి అందరూ మనకి నచ్చినట్లుండరు..మనం నదిలా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి..వెంటరాని ఆస్థుల కోసం పంతాలు,పట్టింపుల కోసం రక్తసంబంధాలను దూరం చేసుకుంటే ఎలా! మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వేదనకు గురి కాకుండా చూసుకోవాలి. మనం తలచుకుంటే  "వసుదైక కుటుంబం" ఏర్పరచగలం..కాదంటారా?..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

Tuesday, December 26, 2023

నాన్నెందుకో వెనకబడ్డాడు.

 అమ్మ తన కడుపులో తొమ్మిది నెలలు మోస్తే... 

నాన్న మనల్ని జీవితాంతం మోస్తాడు...రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు.ఇంట్లో ఏమి తీసుకోకుండా అమ్మ...కష్టపడి సంపాదన అంతా ఇంటికే పెడుతూ నాన్న...ఇద్దరి కష్టం, శ్రమ ఒకటే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు...ఏది అడిగితే అది వండి,వడ్డిస్తూ అమ్మ...ఏది అడిగితే అది లేదనకుండా ఇచ్చే నాన్న...ఇద్దరి ప్రేమా సమానమే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు..ఫోను చేసినా అమ్మ అనే పేరే..దెబ్బ తగిలినప్పుడూ అమ్మా అనే పిలుపే..అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పమిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా అంటే..ఏమో??అమ్మకి పిల్లలకి ఇంట్లో నిండా రంగురంగుల బట్టలు లెక్క లెన్నన్ని ఉన్నా..నాన్న బట్టలు మాత్రం ఒకటో రెండో జతలు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో వెనకబడ్డాడు.పిల్లల ప్రేమ పొందడం లో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనక పడ్డాడా అంటే ఏమో?? అమ్మకు పిల్లలకు బంగారు ఆభరణాలు...నాన్నకి మంచి బంగారు రంగు వాచీకూడా లేదాయే,కుటుంబం కోసం ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలనే తపన ఎంటో నాన్నకి..తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు.వయసు మళ్ళిన అమ్మైతే ఇంట్లో పనికి పని కొస్తుంది...అదే నాన్నైతే ఎందుకూ పనికిరాడని మనం సూటి పోటీ మాటలన్నపుడు కూడా వెనకబడింది నాన్నే! నాన్న ఇలా వెనకబడి పోవడానికి కారణం ఎవరు?అందుకే మనం నాన్నకు, అమ్మకు..కావాల్సినంత ప్రేమను ,ఆనందాన్నీ ఇద్దాం..ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ ఇచ్చారుగా కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వారిని బాగా చూసుకుందాం..నాన్నా ఎపుడూ వెనుక బడినా మా గెలుపు కోసమే ఇది ప్రతి అమ్మకి నాన్నకి అంకితం..ఎక్కడో విన్నది చదివినది..*ఇట్లు ఓ నాన్న*