ప్రస్తుతం బాగా దెబ్బతింటున్న వ్యవస్థలలో కుటుంబ వ్యవస్థ ముందు వరుసలో ఉంది..కుటుంబమంటే కేవలం భార్యా,భర్త పిల్లలేనా! అటు భర్త వైపు బంధాలు ఇటు భార్యవైపు బంధాలు కూడా కుటుంబమే.. ఎప్పుడయితే పెళ్లై రెండు జీవితాలు ముడిపడ్డాయో... భర్తవైపు వారందరినీ పూర్తిగా తనవారు అని భార్య అనుకోవాలి..భార్యవైపు అందరినీ తనవారని భర్త అనుకోవాలి..ఇరువైపులా అత్తమామలు తమ తల్లితండ్రుల లాంటివారే అనుకోవాలి..మన రక్తసంబంధం మనకెలా తీపినో మన భాగస్వామికి కూడా అంతేగా? కానీ కుటుంబంలోనే "చాలా అసమానత" నడుస్తుంది..మన అన్నదమ్ములు మన అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని కోరుకునే ఒక భార్య,భర్త మరి అత్తామామలను బాగా ఎందుకు చూసుకోరు? భారంగా ఎందుకు భారంగా ఫీలవుతున్నారు.అలాగే....తన కూతురుని తన అత్తామామలను ఏలాగైతే ఆదరించాలని అనుకుంటారో అలాగే తమ కోడలును కూడా అలాగే ఆదరించాలి.చాలా వరకు పెళ్ళి అయ్యాక భర్త భార్య తన పుట్టింటి బంధాలను వదులుకోవాల్సి వస్తుంది..నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం...ఎవరి రక్తసంబంధాన్ని విడదీసె హక్కు మనకులేదు ప్రపంచంలో రూపాయలు పెట్టి అన్నీ కొన్నుక్కోవచ్చు..కొనలేనిది కేవలం రక్త సంబంధాన్ని మాత్రమే...కత్తెరలా బంధాలను విడదీయడం కాదు..వీలైతే సూదిలా అల్లుకు పోవాలి..మనమందరితో బాగున్నప్పుడే మనపిల్లలు బంధాల విలువ తెలుసుకుంటారు..ఎందుకంటే పిల్లలు పెద్దలను చూస్తూ పెరుగుతారు,నేర్చుకుంటారు..మనం వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్థులు, భూములు కాదు.వ్యక్తిత్వాన్ని,విలువలను,బంధాలను,బంధువలను ఇవ్వాలి అందరూ మనకి నచ్చినట్లుండరు..మనం నదిలా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి..వెంటరాని ఆస్థుల కోసం పంతాలు,పట్టింపుల కోసం రక్తసంబంధాలను దూరం చేసుకుంటే ఎలా! మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వేదనకు గురి కాకుండా చూసుకోవాలి. మనం తలచుకుంటే "వసుదైక కుటుంబం" ఏర్పరచగలం..కాదంటారా?..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
No comments:
Post a Comment