Tuesday, March 28, 2023

నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??

 *నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??*

*మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే సగం మానసిక, శారీరక రోగాలు తొలగిపోతాయి.* 


🏵️ *రాత్రి గాఢనిద్ర పోయి ఈ రోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే, దేశంలో నిన్న రాత్రి లోపు అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు ఎంతో అదృష్టవంతుడివన్నమాట.*

🏵️ *నువ్వింత వరకు  కరువులో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే, ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*

🏵️ *ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు వేసుకొని, కంటినిండా నిద్ర పోగలిగితే, ప్రపంచములోని 75 శాతం ప్రజల కన్నా ధనవంతుడివి నువ్వే అన్నమాట.*

🏵️ *నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, bank account లో balance ఉంటే, world లోని 8 శాతం ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*

🏵️ *నీ పిల్లల ద్వారా నీవు ఆప్యాయత, అనురాగం మరియు ఆనందం పంచుకుంటూ జీవితం గడుపుతూ ఉన్నట్లైతే ప్రపంచపు 5 శాతం పిల్లలు పడే మానసిక, శారీరక బాధ వారి తల్లి తండ్రి విడి పోవడం వల్ల కలిగే దాంట్లో నువ్వు ఒకడివి కాదు అన్నమాట.*

🏵️ *నువ్వు హాయిగా తలెత్తి, ఆహ్లాదంగా నవ్వగలిగితే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట.*

🏵️ *నీవు ఈ మెసేజును చదువుతున్నావు అంటే ప్రపంచంలో 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వే అదృష్టవంతుడివన్నమాట..*

🏵️ *నీవు ఈ భువి లోని అంద చందాలను చూసి ఆనందిస్తున్నావు అంటే అంధకారంలో ఉన్న కోట్ల మంది కన్నా నీవు ఎంతో అదృష్ట వంతుడివి.*

🏵️ *నీవు ఏది తిన్నా అరిగించుకొని హాయిగా నిద్రపోతే కోట్ల మంది గుప్పెడు గోలీలు మింగినా అరగక నిద్ర రాక ఆయాసపడుతున్నవారి కంటే నీవెంతో అదృష్టం ఉన్న వాడివి.*

🏵️ *నీవు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, నడువగలుగుతున్నావు, నీ చేతులతో నీ పనులన్నీ చేయగలుగుతున్నావంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది అంగవైకల్యం ఉన్న వారి కంటే నీవు ఎంతో అదృష్ట వంతుడివి.* 

🏵️ *నువ్వింకా అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న స్థిర చర ఆస్తుల విలువలని, నీలోని శక్తులని, నీకున్న అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట..*

*ఇప్పటికైనా నీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని సన్నిహితులతో పంచుకుంటూ తగ్గించుకుంటూ, ఉన్నంతలో నీవు సంతోషంగా ఉండు.*

🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment