Thursday, November 24, 2011

విజయం కోసం ముందడుగు వెయ్యరా

ఎన్నాళ్ళు ఈ నిరాశపు చీకట్లు
ఎన్నేళ్ళు ఈ నిస్తేజపు ఇక్కట్లు
వేకువ రావాలి...
వేదన తీరాలి ....
తగిలే ప్రతి గాయం తో పైకెదుగు....
రగిలే హృదయం తో విదిని గెలిచెందుకు...
రానియ్యకు కన్నీళ్ళ వర్షం ....
కానియకు కలలను కన్నిటికి దాసోహం ..
ఉండాలోయ్ దిశానిర్దేశం ..
ఇక జారగాలి అపజయాలతో అలుపెరుగని పోరాటం..
అటుపై కురవాలి నిప్పుల వర్షం....
అడియాసల సంద్రం నిండగా.
జగమంత సౌఖ్యం పండగా ....
విజయం కోసం ముందడుగు వెయ్యరా మొండిగా జగమొండిగా .......

అమ్మా ..పెళ్ళామా ?

అమ్మ <............>పెళ్ళామా "
అమ్మ అడుగులు నేర్పింది.ఎందుకో తెలుసా? నీ అడుగుల్లో నడవాలని,
అమ్మ గోరు ముద్దలు పెట్టింది ఎందుకో తెలుసా?నిన్ను గారాబంగా చూసుకోమని,
అమ్మ కొంగుతో మూతి తుడిచింది ఎందుకో తెలుసా?నీ భార్య కొంగు విడవకని,
అమ్మ ఒడిలో పడుకోపెట్టింది ఎందుకో తెలుసా ?నిన్ను కంట్లో పెట్టుకొని చూసుకోమని ,
అమ్మ నాకు జన్మ ఇచ్చింది ఎందుకో తెలుసా?నీకు తోడుగా ఉండమని ,
అమ్మ.నీను తప్పు చేస్తే దెబ్బలు వేసింది ఎందుకో తెలుసా ?
ఆ దెబ్బ కూడా నీకు పడకూడదని ,
అమ్మ నాకు జ్వరం వస్తే సేవ చేసింది ఎందుకో తెలుసా?అలంటి సేవ నీకు చేయమని,
అమ్మ అని మొదటి పదం నేర్పింది ఎందుకో తెలుసా?ఆ పదం నీకు ప్రసాదించమని,
అమ్మ నాకు తెలివి నేర్పింది ఎందుకో తెలుసా?నీ మీద తెలివిలేకుండా ముర్కకంగా ప్రవర్తించవద్దని ,
అమ్మ విద్య బుద్దులు సెప్పించింది ఎందుకో తెలుసా?నిన్ను బుద్దిగా,ముద్దుగా చూసుకోమని,
అమ్మ నన్ను పెద్దవాన్ని చేసింది ఎందుకో తెలుసా?నీకోసమేనని ,ఆ జీవితం నీకే అంకితమని

Saturday, November 5, 2011

జీవితం…

జీవితం అన్నది మూడక్షరాలే,కానీ ఏ బాషకీ అందని,ఏ భావంలోనూ ఇమడని మహత్తర శక్తి ఉంది దానిలో…
జీవితాన్ని క్షణికమని అనబోయేముందు ఈ సృష్టిలో శాశ్వతమైనదేదో చెప్పగలగాలి.
ఆశ మనిషికి నిజమైన ఊపిరి అందుకే జీవితం క్షణికమని తెలిసికూడా అదంటే ఏదో తెలియని మమతని పెంచుకుంటాడు మనిషి…
తామరాకు మీద నీటిబిందువు ముత్యంలా మెరుస్తుంది. అది శాశ్వతం కాదని తెలుసు.
అయినా దాని ముత్యపు మెరుపు చుసినపుడు ఎందుకు హృదయంలో స్పందన?
ఈ సాయంత్రం విరిసిన పువ్వు మరునాటికి వాడిపోతుందని తెలిసినా ఎందుకు ఆ మల్లెపై అంత మమకారం..
పసిపాప నవ్వులో ఎందుకు చూడగలుగుతాడు వెన్నెల వెలుగులు.. ఆశ గురించి ప్రశ్నించే వ్యక్తి నిరాశలో ఏమి చూసుకొని బ్రతుకుతాడు. మనిషి మనిషిగా బ్రతికేందుకు మంచి చెడుల్ని విడివిడిగా చూడగలిగే వివేకం కావాలి. విచక్షణ ఉండాలి. స్థూల దృష్టే కాదు,సూక్ష్మ దృష్టి ఉండాలి.

అసలు మనిషికి కావలసింది తనమీద తనకు నమ్మకం. మంచి చేస్తున్నానన్న అత్మవిశ్వాసం. దేన్నయినా ఎదురించి నిలబడగలిగే దైర్యం. అనుకున్న పనిని చివరకంటూ సాధించగలిగే పట్టుదల. ఇవన్నీ అశలకు అండ. అపుడు జీవితానికి సరైన అర్థం వుంటుంది. వ్యర్థజీవి అన్న పదం నిఘంటువులోనుండి తొలగించబడుతుంది.

జీవితమే ఒక కవితగా మరపురాని మమతగా మిగిలిపోతుంది.

నా మంచి మాటలు తరువాయి భాగం పార్ట్ -3

1269)అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే.మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది.మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరిని సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లు అవుతుంది
1270)డబ్బుంటే కోరిన సౌకర్యాలన్నీ సమకూర్చుకోవచ్చు. కానీ, అభిమానాలు, ఆప్యాయతలు - డబ్బులు ధారపోసినా లభ్యం కావు.మన సంపద ఏడేడు తరాలకు అందివ్వకపోయినా సద్గుణాలు ఒక్క తరానికి అందిస్తే అది ఏడేడు తరాల దాకా నిలిచి ఉంటుంది.కాబట్టి ‘సంతృప్తిని మించిన’ సంపద లేనే లేదు.
1271)మానవత్వం లేని మేధస్సు కంటే , మేధస్సు లేని మానవత్వం ఎంతో మంచిది
1272)మానవ సేవ మానేసి మాధవ సేవ చెయ్యమని ఏ మతము చెప్పలేదె,విధి ని మానేసి విదాతను కొలవమని ఏ పుస్తకంలోను రాయలేదె,చిత్తశుద్ధి లేని పూజలు ఎన్ని చేసిన అవి వృధానే !! చిత్తశుద్ధితో మానవసేవ చేసే ప్రతి మనిషి మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది,మాట మంచిదవుతుంది.మర్యాద కాపాడుతుంది..మన్నన సంప్రాతప్తినిస్తుంది..కాబట్టి ప్రతి ఒక్కరు మాధవసేవ కంటే మానవసేవకే ప్రాముఖ్యత ఇవ్వాలి.
1273)అధికారం వుంటేనే గొప్పవారు కారు - దాన్ని వినియోగించే తీరును బట్టి గొప్పవారవుతారు
1274)మనిషి ఆశావాదంతో జీవించాలి. కృషి ఉంటే ఎవరికైనా, ఎప్పటికైనా విజయం వరిస్తుంది. చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించే చొరవ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది
1275)కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత
1276)లక్ష్యాన్ని సాదించేవరకు నిరాశకు, నిస్పృహకు చోటివ్వక పట్టుదలతో కొనసాగితే తప్పక విజయం నిన్నే వరిస్తుంది
1277)చెయ్యవలసిన పని ఆలస్యంగా చేయడం అమాయకత్వం కాని చెయ్యకూడని పని ముందుగానే చేయడం మూర్ఖత్వం.కాబట్టి కాలమే జీవితం. కాలం వృథా చేయటం అంటే జీవితాన్ని వృథా చేయటమే!!!
1278)మనం కష్టాలకు కృంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం, విజయాలకు విర్రవీగడం, అపజయాలకు అణగారి పోవడం కాకుండా రెండింటినీ ఒకేలా భావిస్తే ఈ కష్ట సుఖాలూ, జయాపజయాలూ, లాభనష్టాలూ మొదలైన ద్వంద్వాలు మనల్ని బాధించలేవు.
1279)మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు చూస్తూవుంటాయి...ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మంచే కనిపిస్తుంది...నా దృష్టిలో తప్పులు చేయని వారు వుండరు కాని తప్పును ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు ఎంతో ఉన్నతులు...
1280)మన ప్రవర్తన నలుగురికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి కాని పదిమంది అసహ్యించుకునేలా ఉండకూడదు.కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం.
1281)నాణేనికి ఉన్న బొమ్మబొరుసుల్లాగా సభ్యతాసంస్కారాలు మనిషి లో ఉంటే వారికి సమాజంలో విలువని గౌరవాన్ని తెచ్చిపెడతాయి..కాబట్టి ఓ వ్యక్తి విద్యావంతుడు కాకపోయనా ఫర్వాలేదుకాని సంస్కారవంతుడు మాత్రం కావాలని పెద్దలు అంటారు.
1282)ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి
1283)ఒక మంచి వ్యక్తి ఎదురైనప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకో,ఒక చెడ్డ వ్యక్తి తారసిల్లినప్పుడు నీ హృదయాన్ని పరిక్షించుకో.
1284)విద్య వల్ల వినయం ,వినయం వల్లన వ్యక్తిత్వం,వ్యక్తిత్వం వల్ల ధనం,ధనం వల్ల సుఖం అన్ని వరుసుగా అవే లభిస్తాయి..అందుకే పెద్దలు విద్య లేని వాడు వింత పశువు అన్నారు
1285)శత్రువు మీద గెలుపు సాధించడం కన్నా ,నీకున్న శత్రుత్వాన్ని నిర్మూలించడం మిన్న !!
1286)మంచితనం తల్లి నేర్పుతుంది..సంస్కారం తండ్రి నేర్పిస్తాడు...బ్రతకడం సమాజం నేర్పిస్తుంది ..నేర్చుకో అంతే గాని సమాజానికి నువ్వు నేర్పకు...కింగ్...
1287)బాధంటే క్షణం లో కన్నీరు కురిపించి మరు క్షణలో మర్చిపోయేది కాదు....మనసులో ఎంత బాధపడుతున్న పైకి చెప్పలేనిది నిజమైన బాధ....కింగ్...
1288)మనిషి తన బాధలు తీర్చుకోవడానికి దేవుడికి లంచం ఇస్తున్నాడు గాని..ఆ దేవుడు తనకు ఇచ్చిన తెలివిని ఉపయోగించుకోవటం లేదు..కింగ్...
1289)ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది.స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు..స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..!
1290)ప్రేమ అనేది నీడ లాంటిది ..చీకటి పడితే వెళ్ళిపోతుంది...స్నేహం అనేది అమ్మ లాంటింది కడ దాకా కలిసి ఉంట్టుంది...కింగ్...
1291)"ప్రేమ అనేది నీడ లాంటిది..అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది..కానీ స్నేహం దీపం లాంటిది.అది చీకటిలో కూడా నీ గమ్యంని చూపిస్తుంది.
1292)పరిష్కరించలేని సమస్యంటూ ఏది ఉండదు ..ఉండాల్సింది సరైన ఆలోచన. కాలాన్ని ,మార్పును అధ్యయనం చేసుకుంటూ సమస్యను అధిగమించే చాతుర్యం కలిగివుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు.
1293)జీవితం ముళ్ళబాట అని చింతిస్తూ కూర్చునేకంటే ,గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని నిర్మించుకుని ప్రయత్నాలు ఆరంభించడం ధీరుల లక్షణం.అటువంటివారే ముళ్ళబాటైన జీవితాన్ని సైతం పూలబాటగా మార్చుకోగలరు.
1294)జ్ఞానం ఏదో సంపాదిస్తే వచ్చేది కాదు,మనలో ఉన్న అజ్ఞానం వీడిపోతే వచ్చేది.
1295)తనను తాను శోదించుకున్నవాడికి తన బలాలూ బలహీనతలు తెలుస్తాయి.బలాలను బలోపేతం చేసుకుని,బలహీనతలను అడిగామించడమే ఆత్మవిశ్వాసం.ఆ ఆత్మవిశ్వాసంతో తనను తానూ ఆవిష్కరించుకున్నవాడు జీవితంలో ఏదైనా సాదించగలుగుతాడు.
1296)అమ్మ ప్రేమను వదులుకోలేక ఆ దేవుడే దివి నుండి భువికి దిగి వచ్చాడు ...అహో....అమ్మ ప్రేమలో మాధుర్యం ఆ దేవుడికే కరువయనే ...కింగ్....
1297)జీవితానికి ఎన్నో మెట్లు ,మెట్టు మెట్టు పై ఎన్నో ముళ్ళు ,ఈ ముళ్ళ బాటను దాటాలంటే ధైర్యపు చెప్పులు వాడలంతే !ఇలా ధైర్యంగా ఒక్కో అడుగు వేస్తూ పోతే విజయం నీదే.
1298)విజయం మన నేస్తం కాదు..ఎప్పుడైతే మనం కష్టపడి సాదించుకుంటామో అప్పుడే అది మన సొంతం అవుతుంది
1299)గెలుపుకోసం పరితపించే వాడు. తన లక్ష్యం కోసం వంద సార్లు ప్రయత్నిస్తాడు...కానీ సర్దుకుపోయే వాడు మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతాడు.....కింగ్....
1300)"లక్ష్యం చూడటానికి సముద్రమంత కనిపిస్తుంది కానీ....ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది ..దాన్ని చేదిన్చాగలమా లేదా అని.....కింగ్..."
1301)ప్రయత్నించే వాడు గెలుస్తాడు,లేదా ఓడిపోతాడు ,కాని ప్రయత్నించని వాడు తప్పక ఓటమి పాలవుతాడు
1302)గౌరవం లేకపోయినా నష్టం లేదు గాని ,అవమానం మాత్రం కలగకూడదని ,అది మచ్చవంటిదని గ్రహిస్తే జీవితంలో సంతృప్తి మిగులుతుంది
1303)ఆహ్లాదకరమైన ఆలోచనలు, స్పూర్తినిచ్చే ప్రేరణలు , మంచి సంగీతం చక్కని పుస్తకాలు, మంచి స్నేహితులు, మంచి కృషి అవన్నీ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయని గమనించండి ,ఉన్నవాటిని కాపాడుకుంటూ కొత్తవాటిని సమీకరించుకోండి
1304)నీవు ఎవరికైన ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు . ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మరిచిపోకు
1305)బలము లేని పడవతో నదిని ఈదలేము . ద్రుడత్వము లేని చిత్తముతో పనులు సాధించలేము . కాబట్టి ధృడమైన చిత్తమే కార్య సాధనకు అవసరము
1306)చలనం లేని ప్రకృతి కంటే,చలనమున్న ఇంద్రియములు గొప్పవి,చలనమున్న ఇంద్రియముల కంటే,ఆలోచన శక్తి ఉన్న మనస్సు గొప్పది,ఆలోచన శక్తి కంటే విచక్షణ జ్ఞానమున్న బుద్ధి గొప్పది,విచక్షణ జ్ఞానమున్న బుద్ధి కంటే,మంచి చెడ్డలు అనుభవించే ఆత్మ గొప్పది,కాబట్టి పరిశుద్ధమైన ఆత్మ తో నిస్వార్ధ సేవ చేసిన వారిని దేవుడు తప్పక విజయ బాట లో నడిపిస్తాడు
1307)అంధకారం తరువాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది . అలాగే దుఖం తరువాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది
1308)ప్రతి వాడు సమాజం సమాజం అని సమాజం గురించి మాట్లాడేవాడే కానీ సమాజం లో ఉన్న మనుషులు గురించి ఎవడు పట్టించుకోడే....కింగ్....
1309)పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది . ఆత్మవిశ్వాసం మనిషిని విజయపధం వైపు నడిపిస్తుంది.
1310)సంపాదన ద్వారా సాధించిన వస్తువులకి మనం యజమానులం అవుతున్నామని అనుకుంటాం.కానీ నిజానికి మనం బానిసలం అవుతున్నాం.సంపద వల్ల మనకి సేవా బలం పెరగాలేగాని లోపలి శత్రువులు (అంటే అహంకారం) పెరగకూడదు .అవసరాలకు మించిన సంపదలు అనవసర సమస్యలను సృష్టిస్తాయి.సద్వినియోగం చేసే సామర్ద్యం లేనప్పుడు ఎంత సంపద వున్నా అది వృధానే!!
1311)పూల పరిమళం గాలివాటుకె వెళుతుంది . కాని మంచితనం ప్రతి ధిక్కుకూ ప్రస్తరిస్తుంది ..కాబట్టి అందరితో మంచిగా ఉండు.
1312)మెరుగు పెట్టకుండా రత్నానికి ,కస్టాలు ఎదుర్కోకుండా మనిషికి రాణింపు రాదు.నీకు ఒక్కటే లోకంలో కష్టాలున్నాయని కుమిలిపోకు,నీకున్న సౌక్యాలని చూసి సంతృప్తి చెందుతూ ముందుకు అడుగు వేస్తూపోతే జీవితంలో నీవు ఏదైనా సాదించగలవు.
1313)అదృష్టం కలసివచ్చినప్పుడు అడవి మధ్యలో ఉన్నా అన్ని సంపదలూ అక్కడికే వస్తాయి. దురదృష్టం వెంట ఉన్నప్పుడు బంగారు పర్వతాన్ని ఎక్కినా ఏమీ లభించదు.
1314)గ్లాసు పాలల్లో ఓ చిన్న ఉప్పుగల్లు ,తళతళలాడే ఓ తెల్లటి వస్త్రం పై ఓ నల్లటి మరక .అవి వాటి సహజాతత్వాన్ని ఎలా భంగుపరుస్తాయో -అలాగే ఎన్ని సుగుణాలున్న ,ప్రవర్తనలోని దురుసుతనం వ్యక్తిత్వాన్ని మాసిబారేటట్లు చేస్తుంది. కఠిన పరుషపదజాలం ఎదుటివారిని గాయపరుస్తుంది మనకు చేటు చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా దురుసుతనపు మాటలు,చేతలు మానవ సంభందలనుంచి మనల్ని దూరం చేస్తుంది ,అందుకే పెద్దలన్నారు ,ఒక దెబ్బ కొట్టిన మర్చిపోవచ్చు గాని,మాటంటే మర్చిపోలేరని...
1315)చేసిన తప్పును సమర్ధించుకోవడానికి ప్రయత్నించకు. మంచిని పెంచుకుంటే నువ్వు చేసిన తప్పులు తొలగిపోతాయి
1316)ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను నీవు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది.
1317)నీ భాధకు కారణం ఏమైనా కావచ్చు కాని అ కారణం తో ఇతరులను మాత్రం హాని చేయకు .
1318)ఏ పనైనా చేసేటప్పుడు ఎంతో కొంత తెగింపు ఉండాలి. భయపడుతూ కూర్చుంటే జరిగేదేమి ఉండదు..అలా తెగించి ధైర్యంతో సన్మార్గంలో ముందుకుపోతే ఎవరికైనా విజయాలు సొంతమవుతాయి.
1319)చావడానికి సిద్ధపడే వాళ్ళ కన్నా విపత్తు లో పోరాడే వాళ్ళు నిజమైన ధైర్యవంతులు
1320)తల్లిద్రనులు బ్రతకడం నేర్పుతారు. సన్నిహితులు ప్రవర్తన నేర్పుతారు ...పుస్తకం ని తల్లిద్రనులకు ..నువ్వు ప్రేమించే వాళ్ళకి అన్నం పెట్టె మార్గాన్ని చూపుతుంది....కింగ్....
1321)సమస్య వెనుక సమాదానం ఉంటుంది దుఃఖం వెనుక సుఖం ఉంటుంది ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఉంటుంది
1322)అంతా అయిపొయింది ఇంకేమీ లేదు." అని అనుకున్న చోట ఆగిపోకు. ప్రక్కకు తిరుగు.మరో దారి కనిపిస్తుంది ఇలా ముందుకు సాగుతుపోతే ఏదో ఒక రోజున నీ జీవితం అనుకోకుండా మలుపు తిరుగుతుంది.
1323)చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం ,ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకొని పూర్తి చెయ్యడమే సామర్ధ్యం
1324)మనం ఇష్టపడేవాళ్ళ వెంటపడే కంటే ..మనల్ని ఇష్టపడేవాళ్ళ వెంట పడితే జీవితం ఆనందమయమవుతుంది
1325)పరి స్థితులు ఒక్కొక్కప్పుడు ప్రతికూలంగా ఉం టాయి. ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండవు. మనం అనుకున్నట్లు సంఘటనలు జరుగవు.పరిస్థితులకు అనుకూలంగా మనం మారుతూ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషిచేయాలి. అపజయం ఎదుర యినపుడు దాని కారణాలు అన్వేషించుకుని వాటిని సరిదిద్దుకోవాలి. మనం తప్పుచేసినట్లు ఎదుటివారు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా మన తప్పుల్ని మనమే తెలుసుకుని సరిదిద్దుకోవాలి.
1326)మన స్వభావాన్ని బట్టే మన ఆలోచనలుంటాయి. వ్యతిరేక దృష్టితో మనం ప్రపంచాన్ని చూసినప్పుడు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. అందువల్ల మనసు అశాంతికీ, అల్లకల్లోలానికి లోనవుతుంది. అలాకాక ఎదుటివారిని అనుకూల దృష్టితో చూడండి. అప్పుడు మనస్సు ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
1327)మన జీవితంలో ఏదైనా సరే నమ్మకం పైనే ఆధారపడుతుంది. నమ్మకం మనిషికి ఒక ఆయుధం లాంటిది. మనం చేసే ప్రతిపని విష యంలో నిరాశ పడకూడదు. ప్రతీ పనికి ప్రతిఫలం అనేది వెంటనే రాదు. దానికి సమయం పడుతుంది. నిరాశ చెందకుండా ఓపికతో వుంటే అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి
1328)ప్రేమ బంధం ఒక బావి లాంటిది, అందులో నీరు (ప్రేమ) నిండుగా ఉంటే పడినా దెబ్బలు తగలవు...
1329)అదే నీరు లేని బావిలో పడితే..? ఆ పడిన వ్యక్తికి మర్చిపోలేని గాయాలు తగలక మానవు, కనుక చూసుకొని దూకండి...! విశ్వ..!
1330)పట్టు పరుపులపై నిద్రరాక అవస్థపడే ధనవంతుడి కన్నా ..కటిక నేలపై గాడనిద్రపోయే పేదవాడు ఎంతో మిన్న.సుఖాలను వెతుకుంటూ సంతోషాలకి దూరమవుతున్నాం...ఇలా జీవితమంతా సమస్యలతో మనిషి జీవితం నలగకుండా ..ప్రతీ నిమిషం జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిస్తే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు
1331)మనం కేవలం కృతజ్ఞతతో మనకు సహాయపడైనవారి రుణం తీర్చుకోలేం .మనలాగే అవసరంలో ఉన్న మరొకరికి అలంటి సహాయం చేసి వారి రుణం తీర్చుకోగలం .
1332)మన మనస్సు బట్టే లోకం మనకు కనపడుతుంది.మనస్సులో ఏ కుళ్ళు లేకుండా,సంతోషంగా నిలుపుకున్నవారికి ,లోకమంతా మీకు ఆనందప్రదంగా గోచరిస్తుంది.ఈర్శాసూయలు పరవళ్ళు తొక్కే హృదయంగలవారికి లోకంలో ఎవరిని చూసినా ఎక్కడ చూసినా అలాగే కనపడతాయి.అందుకే మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోవాలి.
1333)నాణేనికి రెండు వైపులూ ఉంటేనే దానికి విలువ అలాగే- కొంచెం కష్టం కొంచెం సుఖం ఉంటేనే జీవితానికి అర్ధం.కష్టం సుఖం తెలియని వాడి జీవితం వ్యర్ధం!!అదే జీవిత పరమార్ధం
1334)ధన సంపాదనలో ఎవరికైనా తృప్తి ఉండాలి.లభించినదానితో సంతుష్టి చెందకపోతే దురాశకు దారితీస్తుంది.దురాశ ఈర్షాఅసూయలకు తావిస్తుంది.ఆపైన మానసిక వ్యధ కలుగుతుంది.జీవితం అశాంతమయమవుతుంది.అందుకే 'తృప్తి' అనే పదం చాలా చిత్రమైనది..అది ఒకరిని భయపెడుతుంది.మరొకరిని ఆనందపెడుతుంది.ఇంకొకరిని సందిగ్ధావస్థలో పడేస్తుంది.
1335)మన అహంకారంతో పదిమంది మీద ఆధిపత్యం చేసినా, మన అహాన్ని చల్లబరుచుకోవడానికి ఇతరులని తక్కువ చేసి మాట్లాడినా , ఇతరులు పొందే నష్టం కన్నా మనం పొందే నష్టమే అధికం.కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనలోని ఉన్న అహాన్ని విస్మరిస్తే జీవితాంతం ఆనందంగా బ్రతికేస్తాము
1336)వ్యక్తులు రంగు కాగితాలకిచ్చే విలువలతో పోలిస్తే , అంతకంటే వేయిరెట్లు విలువ ఉన్న మానవ జీవితానికి ఇవ్వకపోవడం దురదృష్టకరం. మనిషి బ్రతకడం కోసం సంపాదించడం సరైనదేకానీ ,మనిషికి మనిషికి మధ్య ఉన్న ఆత్మీయత,అనుబంధాలనూ విస్మరింవాడు జీవితంలో పైకి ఎదగలేడు.
1337)దిగులు పడకు...అధైర్యపడకు .... నేటి గురించి ,కన్నీరు పెట్టకు ...క్రుంగిపోకు... ...నేటిని తలచి
1338)ఓటమిని ఒప్పుకోకు..ఆగిపోకు ....నేటి పలితం చూసి ,ప్రతి అస్తమయం రేపటి ఉదయానికి సూచన అయితే .....ప్రతి ఓటమి రేపటి విజయం కధా !!అందుకే ప్రతి కష్టం జీవితానికి ఓ విలువైన గుణపాటం నేర్పుతుంధి.
1339)చంద్రుడిలో వెన్నల,సూర్యుని లో కాంతి ఎలా అయితే దాగివుంది అలాగే ,ప్రతి సవాలులోనూ విజయమనేది దాగి వుంటుంది.'కటిన శ్రమ' అనే రాపిడి దానిని వెలుగులోకి తెస్తుంది..అందుకే కృషితో నాస్తి దుర్బిక్షం అని అన్నారు
1340)నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే పది వేళ్ళ కంటే,నువ్వు కనీళ్ళుపెట్టినప్పుడు తుడిచే ఒక్క వేలు గొప్పది.
1341)నిస్వార్థం, సంయమనం, సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, బంధుప్రేమ, స్నేహసౌరభం ఇరుగుపొరుగులతో ఆత్మీయత ఇలాంటివన్నీ ఈతరం మనుషులు అలావరచుకుంటే ..మానవ సంభందాలని ఎవరు రూపుమాపలేరు.కాబట్టి ఆస్తులు, సంపదలు గతించినా, తిరిగి తెచ్చుకోగలం. కానీ మానవ సంభందాలని వదులుకుంటే మనిషి అనే వాడు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేడు
1342)ఏ పని చేస్తూనప్పుడైనా స్వల్ప ఆటంకాలు సహజం.వాటిని పూర్తిగా నియంత్రించే సామర్ధ్యం లేకపోవచ్చు,కానీ వాటి గురుంచి అలోచించి ,ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ,లక్ష్యాలను విస్తరించుకుంటూ సాగినప్పుడే ప్రతికూలతలు తగ్గుతాయి.అలా ఎదురువచ్చే సమస్యను ఓ సవాలుగా అనుకుంటే మనిషి ఎదగడానికి సోపానం అవుతుంది.మనకెందుకు అనుకుంటే వెనకబడేలా చేస్తుంది .
1343)ప్రపంచంలో ఎవడూ డబ్బు పెట్టి కొనలేనిది శాంతి. దాన్ని సాధనచేసి సంపాదించుకోవాలేగాని ఊరికే లభించదు. లోకంలో ఉన్న పదార్థాలలో అతివిలువైనది కూడా శాంతి ఒక్కటే. అహంకారం, కోపం ఉన్నంతవరకు ఎవ్వరికీ శాంతిలభించదు. ఆ రెండు పోతేనే శాంతి లభించేది
1344)ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కావచ్చు కాలేకపోవచ్చేమో కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటె చాలు
1345)ఈ లోకంలో ఏం సాధించాలన్నా,ఏమున్నా లేకున్నా మనిషికి ధైర్యం ఉండాలి.అది ఉంటేనే ముందడగు వేయగలడు.వెనకడుగు వేసేవారు,లేదా ఉన్నచోటనుంచి అసలు అడుగు కదపలేనివారు ధనం,బలం ,బలగంలాంటి ఎన్ని వసతులున్నా ఏమీ సాధించలేరు.ధైర్యంతో ముందుకు వెళ్లి మార్గాన్ని అన్వేషించి నలుగురికి మార్గదర్శకంగా నిలవాలి.
1346)కోపం,అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్ధం చేసుకోనివ్వవు..సరైన నిర్ణయం తీసుకోనివ్వవు ..కాబట్టి ఈ రెండు వదిలేసి చూడు నీ జీవితం ఆనందమయమవుతుంది
1347)ప్రక్క మనిషి గురించి నువ్వు ఆలోచించు,దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు
1348)ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ అతిత్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు.
1349)వేలాది వ్యర్ధమైన మాటలకన్న విన్నంతనే శాంతిని ,కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు.
1350)అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు. తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞులు.
1351)అందరూ నిన్నొదిలి పోతున్నప్పుడు అందర్నీ వదిలి నీ కోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు.
1352)ప్రతి ఒక్కరు ఎదుటివాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప, తమని తాము మార్చుకోవాలని అనుకోరు.
1353)మనిషిని మనిషిగా గుర్తించాలంటే కొన్ని మానవత్వపు విలువలు కలిగి ఉండడం తప్పనిసరి. అయినప్పటికీ ఎదుటివానిలోని మంచితనం, వ్యక్తిత్వం గుర్తించడానికి ఐదులక్షణాలతో గుర్తించవచ్చు ,అవే (1) వస్త్రం (2)వదనం (3) వాక్కు (4) విద్య (5) వినయం. ఈ ఐదు లక్షణాలు ఆయా వ్యక్తుల వస్త్ర ధారణ, వారు మాట్లాడే తీరు, వారు పొందిన
1354)విద్య , వారిముఖ కవళికలు, వారికి మంచివారిపట్ల కలిగియున్న వినయ విధేయతలు వారివారి వ్యక్తిత్వానికి కొలబద్దలుగా నిలుస్తాయి
1355)ఎవరికీ అన్యాయం చేయకపోవటం,చేసిన మేలు మరువకపోవటం ,అడగకుండానే పక్క వాడి భాదను అర్ధం చేసుకొని సహాయం చెయ్యడం ఇవన్నీ ప్రతి మనిషి దగ్గర సహజ గుణాలుగా ఉండాలి.ఈ గుణాలే మనిషిని దైవత్వానికి దగ్గరగా తీసుకు వెళ్ళగలుగుతాయి.
1356)వచ్చే జన్మలో ఐన నాకు సర్వం ప్రసాదించు దేవుడా అని అడిగాను...దేవుడు : అన్నిటి మించిన అమ్మని ప్రసాదిస్తున్న అని చెప్పి మాయం అయ్యాడు .కింగ్..
1357)పెద్దలంటే భయం,దైవమంటే భీతి,కలిగిన మనిషి నడవడిక సజావుగా సాగుతుంది.నేరం చేస్తే శిక్షకు భయపడాలి.తప్పు చేస్తే తనకు తానే భయపడాలి.సమాజ వ్యతిరేఖ కార్యకలాపాలు చేస్తే సమాజం ఈసడిస్తుందని భయపడాలి.చీకటికి భయపడితేనే వెలుగు కోసం ప్రయతించగలం.కాబట్టి మన చేసే పనిలో నిజాయితి వుంటే ,మనం నిర్వహించే పనులు వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా వుంటే మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.
1358)మరణానంతరం కూడా నువ్వు అందరికి గుర్తుండాలంటే చదవదగిన పుస్తకాలు వ్రాయి లేదా వ్రాయదగిన పనులు చెయ్యి.
1359)మనలోని గొప్పదనం, మనకి వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంది
1360)ప్రతీమనిషిలోను మంచి,చెడు స్వభావాలు రెండూ ఉంటాయి. మంచి దైవస్వభావమైతే ,చెడు రాక్షస స్వభావం.మంచి బలపడితే బంధనాల నుంచి,భాదల నుంచి విముక్తి కలుగుతుంది.చెడు బలపడితే బందానాలు మరింత పెరిగి జీవితం దు:ఖమయమవుతుంది.అలాకాకుండా అనాధలని ఆదరిస్తూ ,పక్క వాళ్ళ కష్టాలని కొంచం పట్టించుకోని
1361)గొప్ప అంకితభావంతో ముందుకు పోతుఉంటే ప్రతీ ఒక్కరి హృదయం ఒక దైవ నిలయంగా మారుతుంది.
1362)తొందరపాటుతో చేసిన పని మనల్ని చిక్కుల్లో పడతోసి ఫలితం దక్కకుండా చేస్తుంది. దుఖంలో ముంచేస్తుంది. అందుచేత ఒక కార్యాన్ని చెయ్యాలని సంకల్పించినప్పుడు దాని పూర్వాపరాలను బాగా పరిశీలించి,అలోచించి తరవాతనే ఆ కార్యానికి శ్రీకారం చుట్టాలని పెద్దలంటారు. అప్పుడే కోరుకున్న ఫలం చేతికి చిక్కి మనకు ఆనందం దక్కుతుంది.
1363)మనుషులు నువ్వు చెప్పేదాన్ని నమ్మకపోవచ్చు, కానీ నువ్వు చేసేదాన్ని మటుకు తప్పక నమ్ముతారు అందుకే చెప్పేదానికంటే చేసి చూపించు
1364)అందరూ ఎట్లా చేస్తే అట్లా చెయ్యడం నీతి కాదు, ఇతరుల మెప్పు పొందడం కోసం కాకుండా నీకు నిజమని, మంచిదని మనస్ఫుర్తిగా తోచిన విషయాలను ఆచరణలో పెట్టడం నీతి.
1365)మనసులో అనుక్షణం డబ్బు గురించి బెంగ పెట్టుకునే మనుష్యులు జీవితంలో సాహసించి ఏ సుఖము పొందలేరు.
1366)మమకారం నీకు తోడును తెస్తుంది,అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది,అందుకే ప్రతి ఒక్కరు అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి
1367)ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు. హృదయంలో ఉంటుంది.అందుకే మాట్లాడే పెదవుల కన్నా స్పందించే హృదయం మిన్న అని పెద్దలు అన్నారు
1368)ఇతరులకి ఉపయోగపడటం,అబద్దాలాడకుండటం, ధర్మాన్ని ఆచరించడం,ఎవ్వరికి ద్రోహం చెయ్యకుండా ఉండటం, దయ కలిగి ఉండటం ,సిగ్గు పడవలిసిన పని ఏదీ చెయ్యకుండా ఇవ్వన్ని ఉండగలిగిన వాడే జీవితంలో పైకి రాగలడు
1369)అధికారం రెండు రకాలు,భయపెట్టి సంపాదించేది, ప్రేమతో వచ్చేది. ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికన్నా శక్తివంతమైనది.
1370)మనకి తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే వ్యవధి కూడా మనకి లేకుండా పోతోంది .సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్థానముండదు . మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచి చూసినా అయినవళ్ళతోనూ సంబంధానికి దూరమైనప్పుడు ఆ మనిషి జీవితమే వృధా!!
1371)తిరిగిరాని "నిన్న" కోసం "నేటిని" దుర్వినియోగం చేసేవాడికి "భవిష్యత్తు" ఉండదు. కాబట్టి గతం నుంచి పాటలు నేర్చుకొని బంగారు భవిష్యత్తు కోసం వర్తమానం విలువ తెలుసుకున్నవారే విజేతలుగా నిలుస్తారు.
1372)ఒక ఆలోచనని స్వీకరించు. అదే ప్రధానముగా జీవించు. దాని గురించే ఆలోచించు.. కలలు కను.. ఊపిరిగా భావించు.. నీ మనసు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగమూ ఆ ఆలోచనతోనే నిండిపోనీ.. అదే విజయానికి రహదారి.
1373)గెలుపులో ఏముంది.. మహా అయితే మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కానీ ఒక్కసారి ఓడి చూడు ప్రపంచమే నీకు పరిచయం అవుతుంది.
1374)ఎక్కడికి విసిరితే అక్కడే అంటుకపోయే లక్షణం బంకమన్నుకి ఉంటుంది. మన ఆలోచనలూ అలాగే ఉండాలి. ఏ పనిని చేస్తే ఆ పనిమీదే మనసు లగ్నం చేసిన రోజు నువ్వు జీవితంలో సాధించనది ఏదీ లేదు
1375)దుఃఖము నలుగురితో పంచుకొంటే దూరమవుతుంది . సుఖం నలుగురితో పంచుకొంటే ఎక్కువవుతుంది. మనం సంతోషంగా ఉండాలన్న సంకల్పం మనలోవుంటే సంతోషంగా ఉండగలం. కొందరు చిన్న కష్టం వచ్చునప్పుడు దాడ్నిని భూతద్దముతో చూచి పెద్దగా భావించి బాధపడుతూ వుంటారు . కాని సుఖదుఃఖాలు ఏవీ శాశ్వతంగా ఉండిపోవు.కాబట్టి దేవుడు ఎవ్వరికి అతనికి మించిన కష్టాలు పెట్టడు. ఎవడు, ఎంత 1376)బరువు మోయగలడో అంతే బరువు అతని తలపై పెడ్తాడని పెద్దలు చెప్తుంటారు
1377)చదువు పాఠాలు చెప్పి పరీక్షలు పెడితే జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు చెబుతుంది.
1378)గడిచిన క్షణం తిరిగి రాదు , నేటి క్షణం ఏమవునో లీదు.అనుక్షణం ఆలోచనలతో ఈక్షణం వృదా కానీకు.ఏమి రావు అనుకోకు, అనుకుంటే అన్ని సాధ్యమే నీకు
1379)అవాంతరాలను కనిపెట్టు. అందమైన జీవితం ఉహించు, అందుకోవాలని పరితపించు.అనుకున్నది సాదించు, అందరికి ఆదర్శంగా జీవించు..
1380)ప్రతి శిల ఒక శిల్పాన్ని దాచుకుంటుంది . సుత్తితో బద్దలు కొడితే బయటకి రాదు .ఉలితో కష్టపడి చెక్కాలి , అలాగే ప్రతి మనిషి తనలో ఒక శక్తిని దాచుకుంటాడు . వెంటనే బద్దలుకొడదమనే ఊహల్లో బ్రతికితే అది బయటకిరాదు . తపన అనే ఉలితో కష్టపడి చెక్కాలి . ఆ తపనలేని మనిషి రాయిలాగే ఉండిపోతాడు --ఎక్కడో చదివింది
1381)నీకు తెలివి రావాలంటే ప్రతి రోజు కొంత నేర్చుకో . నీకు జ్ఞానం రావాలంటే ప్రతి రోజు కొంత వదులుకోవడానికి సిద్దపడు.
1382)ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం...
భాధలున్నా దిగమింగి నవ్వడమే జీవితం...
గెలుపొంది ఆనందించడమే కాదు జీవితం...
ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం కూడా జీవితమే !


1383)నీకు తెలివి రావాలంటే ప్రతి రోజు కొంత నేర్చుకో . నీకు జ్ఞానం రావాలంటే ప్రతి రోజు కొంత వదులుకోవడానికి సిద్దపడు.
1384)తృప్తి అనేది ఒక అమూల్యమైన ముత్యం.ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని మరియు ఆనందాన్ని పొందగలుగుతాడు ...ఇది లేకుండా ఎన్ని ఉన్న వాడి జీవితం వృధా !!
1385)ప్రతి విషయంలో మనకి సమస్యలు ఎదురవుతున్నాయి ' అని బాధపడుతుంటాం.సమస్య ఉన్నప్పుడు అదే శాశ్వతం అనుకోవడం వల్లే బాధ కలుగుతుంది 'ఎ క్షణం శాశ్వతంగా ఉండిపోదు. ప్రతిక్షణం మారుతూ ఉంటుంది' అన్న విషయం అనుభవ పూర్వకంగా తెలిసిన క్షణం బాధే ఉండదు. సముద్రంలో అలజడి ఎప్పటికీ ఆగదు.. అందులో మన పడవను ఎంత చాకచక్యంగా నడిపామన్నదే ముఖ్యం. మన మనోబలాన్ని పెంచుకుంటూ, చుట్టూ ఉన్న సమస్యలని అధిగమిస్తూ పోతే నీకు జీవితంలో సమస్య్లలనవే నీ దరిచేరవు.
1386)మనిషి చనిపోయేటప్పుడు ఆస్తిపాస్తులు గాని,అన్నాతమ్ములు గాని, బార్యపిల్లలు గాని అవేవి వారి వెంటరావు..చుట్టలు,స్నేహితులు నిన్ను సాగనంపే దాకే ఉంటారు.చేసిన పాపం-పుణ్యం మాత్రమే నీ వెంట వస్తాయి..కాబట్టి నలుగురుకి నువ్వు ఉపయోగపడి , నీ జీవితాన్ని ఒక అర్ధం కల్పించుకొని సార్ధకం చేసుకో..
1387)కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే,మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చెయ్యడానికి దేవుడో ఎవరో ఒకరిని పంపిస్తాడు.దానగుణంలోని పరమార్ధాన్ని గ్రహించి ఇతరులకు సహాయపడితే మనకు అపారమైన ఆత్మసంప్త్రుప్తి మిగులుతుంది.ఇది దక్కని నాడు మనం ఎంత కూడపెట్టినా ,ఎంత సంపాదిచ్చినా అది వృధానే!!!
1388)మనస్సు ఒక అద్భుతమైన వరం మనిషికి.మన ఆలోచనలు ఎలా ఉంటె,అలాగే మన జీవితం కూడా అలాగే మలుపులు తిరుగుతూఉంటుంది.అంటే దాదాపు మనం కోరుకున్నవిధంగానే మన జీవితం ఉంటుందన్నమాట.ఈ ప్రపంచాన్ని మనం చూసే దృష్టి సానుకూలంగా ఉన్నప్పుడే అంతా ఆనందమయంగా కనిపిస్తుంది.లేకపోతే అంతా విచారం,భాదలే కనిపిస్తాయి.
1389)తప్పు చేసి తప్పుకునేవాడు దోషి ఐతే ,తన తప్పు తెలుసుకుని మార్చుకోగలిగిన వాడే మనిషి...కాబట్టి ఎవరైనా తప్పు చేసిన దానిని సరిదిద్దుకొని మనిషిగా మారాలి.అలా ప్రతి ఒక్కరు మనిషిగా మారితే, ప్రపంచం మొత్తం మారుతుంది.
1390)అంతులేని దరిద్రం నుండి,అవధులు లేని సంపద కలిగిన స్థితికి వస్తే మన అదృష్టాన్ని అహంకారంగా కాకుండా ఉదాత్తమైన సంస్కారంగా మలుచుకున్నప్పుడే నిన్ను నలుగురు సమాజంలో గౌరవిస్తారు
1391)మనిషి ఎప్పుడూ కష్టాలనే లెక్కపెట్టుకుంటాడే తప్ప,సంతోషాలను లెక్కపెట్టుకోడు .సంతోషాలను లెక్కపెట్టుకోవడం ఆరంభిస్తే ప్రతి చోటా ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు
1392)తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి.
1393)ప్రతి మనిషికి దేవుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు..మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు..దానిని గుర్తించడం ముఖ్యం. జీవితమంటే ప్రాణమున్నప్పుడు బ్రతికేది కాదు..ప్రాణం పోయిన తరువాత కూడా బ్రతకగలిగేది ..అలాంటి అవకాశాన్ని గుర్తించి దానిని సద్వినియోగపరుచుకున్నవాడే జీవితంలో పైకి రాగలడు.
1394)సిసలైన బంగారం కొలిమిని చూసి భయపడదు. ఆ వేడిని తట్టుకుని మాలిన్యాలను వదుల్చుకుని మరింత మెరుపుతో ప్రకాశిస్తుంది..ఉత్తముడైన మనిషీ అంతే ,కష్టాలకు కుంగిపోకుండా ఆ అనుభవాలు నేర్పిన పాటాలతో లోపాలను సవరించుకొని మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుపోతే జీవితంలో సాధించలేనిది ఏది ఉండదు.
1395)బుద్దిని జ్ఞానంతో నింపుకోవాలి.హృదయం ప్రేమతో నిండి ఉండాలి.అప్పుడు బ్రతుకు తియ్యగా ఉంటుంది.దాంతో నీవు శాంతంగా ఉంటావు.
అదృష్టం సులభంగా అందని ఫలమైతే.. దురదృష్టం తరచూ తలుపుతట్టే అతిథి.అందుకే మనల్ని సమస్య చుట్టుముట్టేంత సులభంగా విజయం వరించదు. దాని కోసం ఎంతో కష్టపడాలి. పోరాడాలి. చెమటోడ్చాలి.అహర్నిశలు శ్రమిస్తూ ధ్యాస శ్వాస పనిపై పెట్టాలి. అప్పుడు కూడా విజయం మనల్నే వరిస్తుందని చెప్పలేం. కానీ పోరాడాలి. ఆ పోరు విరామం తీసుకోకుండా, విశ్రాంతిని ఆశించకుండా చేస్తూనే ఉండాలి.కాబట్టి అదృష్టం మనల్ని అందలం ఎక్కించకపోయినా కఠోర శ్రమ, వెనక్కి తగ్గని మనస్తత్వం, మడమ తిప్పని నైజం మనల్ని విజేతగా నిలిపే అవకాశం ఉంది.అందుకే కష్టే ఫలి : అన్నారు పెద్దలు
1396)డబ్బు విలువ తెలుసుకోండి. జీవితం సుఖంగా ఉంటుంది.
డబ్బుకు ఎంత విలువ ఇవ్వాలో నేర్చుకోండి. జీవితం సంతోషంగా ఉంటుంది.
1397)చక్కటి ఆదర్శాలు, సంస్కారవంతమైన భావాలతో కూడిన జీవితం ఉన్నతమైనది . మనం ఎంచుకున్న ఆదర్శానికి అనుగుణంగా మన అలోచనలు సాగుతాయని, మనం చేసే పనులు కూడా వాటికి అనుగుణంగానే ఆచరించాలి . ఎటువంటి ఆదర్శాలకూ తావు లేకుండా జీవించే వ్యక్తి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను మార్చుకుంటూ, దిశానిర్దేశం లేకుండా గాలువాటుకు కొట్టుకుపోయే ఎండుటాకులా జీవించాల్సి వస్తుంది . అందుకే మనం ఎంచుకునే ఆదర్శం ఎంత ఉన్నతంగా ఉంటే మన జీవితం అంతటి ఔన్నత్యంతో ఆదర్శప్రాయంగా ఉంటుందన్నమాట.
1398)మనిషన్న తరువాత కొంచం జాలి,కరుణ,మమత ఉండాలి.సాటి మనిషి గురించి ఆలోచించాలి.అవసరమున్నంత మేర, మన శక్తి కొద్దీ, సహాయసహకారాలు ఏదో ఓ రూపంలో అందించాలి. దాన గుణం లేని వారిని మంచివారుగా సమాజం అంగీకరించదు. ఎందుకంటే ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. మన సంపాదన ఏరీతిగా, వినియోగపడ్తున్నది కూడా ముఖ్యమే. . కానీ కొందరు వారి కున్న సంపద అంతా వృధా అవుతున్నా, ఆకలితో ఉన్న వారికి పట్టెడు మెతుకులు విదిల్చరు.కాబట్టి దానం చెయ్యని చెయ్యీ, కాయలు కాయని చెట్టూ ఒకటే..ఇలాంటి వారి జీవితం వృధా!!
1399)మంచి మాటలంటే ఎవరికైనా ఇష్టమే. అలాగే మంచి మాటలు మాట్లాడే వాళ్లను ఎవరైనా ఇష్టపడతారు, అలాంటి వాళ్లతో స్నేహాన్ని కోరుకుంటారు. అలా కాకుండా ఎప్పుడూ ఏదో ఒక విషయంలో, ఎవరో ఒకరిని తప్పు పడుతూ, దెప్పిపొడుస్తూ మాట్లాడేవాళ్లతోనూ, ఏదో ఒక విషయానికి గొడవ పెట్టుకునే వాళ్లతోనూ స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రారు. మనం ఎవరితోటి గొడవలు పడకుండా, అందరితో మంచిగా ఉంటే అందరూ మనకు స్నేహితులుగా ఉంటారు. అంటే మనం మాట్లాడే మాటలు ఎవరినీ నొప్పించనివిగానూ, సౌమ్యంగానూ, హితవుగానూ ఉండాలని అర్థం.
1400)ఆపదల్తో, కష్టాల్తో, ఇబ్బందుల్తో సతమతమవుతున్న అనాథలకూ చిత్తశుద్ధితో అందించే సహాయమే ‘సేవ’. ఈ సహాయం ఆర్థిక రూపేణా, వస్తు రూపేణా, మనోబలం చేకూర్చిదిగానూ, జీవితంపై ఆశలు చిగురింపచేసేదిగానూ ఉండాలి . అటువంటి సేవలు నిస్వార్థంగానూ, త్రికరణశుద్ధిగానూ, హృదయ పూర్వకంగానూ చేయాలి.సేవలు చేసేవారు ప్రచారం చేసుకోవడం కానీ గుర్తింపు పొందాలని ఆశించడం కానీ, ప్రశంసలుపొందాలని అనుకోవడం కాని, అవార్డులూ, రివార్డులూ, ప్రతిఫలం ఆశించి చేసేదిగా. ఉండకూడదు..కాబట్టి సేవ చేయాలి అనే దృఢ సంకల్పం ఉన్నవారికి ఏ పదవీ, అధికారమూ, ఆర్థికస్థోమతా అక్కరలేదు. సేవానిరతితో మెలగాలి అనుకునే వారికి అప్రయత్నంగా సహాయ సహకారాలూ, ఆర్థికవనరులూ సమకూరుతాయి. సేవానిరతికి ఉదార గుణం, త్యాగభావం, నిర్మలహృదయం తొలిమెట్టు."మానవ సేవయే మాధవ సేవ "
1401)దేవుడు కోసం ప్రపంచంలోని గుడిలన్ని తిరిగాను.......కానీ నాకు కావలిస్న దేవత నా ఇంట్లోనే ఉంది అని తెలుసుకోలేఖపోయాను..అదే మా అమ్మ.....కింగ్..
1402)తెలియక చేస్తే పొరపాటు.. తెలిసి చేస్తే తప్పు.. తప్పని తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరం....! విశ్వ..!
1403)గంగ యమునాలో మునిగితే పాపం పోతుంది అంటే నిజం అనుకున్న కానీ దాని కన్నా ఎక్కువ, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే ఇంకా పుణ్యం వస్తుందంట
1404)జయ,అపజయాలనేవి ప్రతి మనిషికి ఒక పరీక్షా లాంటిది.అపజయం అనేది నిన్ను పరీక్షా పెట్టటమే కానీ పాలించేది కాదు.అపజయం ఆనేది నీ సొత్తు కాదు ,నీలో సత్తా ఎంతో చూస్తుంది.
అపజయం నీకు శాశ్వతం కాదు,నీ శ్వాస, విజయం మీద ఎంత ఉందొ తెలుసుకొనేది .
1405)బతుకంతా తప్పస్సు చేస్తే మనం పోయేరోజు ప్రత్యక్షం అవుతాడు ఆ దేవుడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మనం పుట్టగానే ఓ దేవత ప్రత్యాక్షం అవుతుంది..అమ్మ.కింగ్..
1406)స్నేహం నిదానంగా వికసించేది.నెమ్మదిగా వర్ధిల్లేది,ఒకరినొకరు అర్ధం చేసుకోవడం వల్ల అది మరింత విస్తరించేది.అందుకే పెద్దలు అన్నారు " సృష్టిలో అతి గొప్పది-అత్యంత మధురమైనది ఈ స్నేహం "
1407)విజయం మేధావిని వినయవంతుడ్ని చేస్తుంది.సామాన్యుడ్ని ఆశ్చర్యపరుస్తుంది.అవివేకిని అహంభావిగా మారుస్తుంది.
1408)నాన్నకి ప్రేమను ఎలా చూపించాలో తెలియదు..అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు.. వాళ్ళు ఏమి చేసినా అది నీ మంచి కోరే చేస్తారు .కాబట్టి అమ్మ మనస్సు,నాన్న మనస్సు తెలుసుకొని మెలగండి
1409)ప్రతి వాడు మార్పు ఎదుటివానిలో కోరుకుంటాడు...తనలో ఎందుకు కోరుకోడు...తనలో మార్పును కోరుకున్న రోజు వాడు కూడా నేటి గాంధీ అవుతాడు...కింగ్...
1410)మనం చేసే పనులలో ఎదుటివారికి నష్టం కలుగకుండా చూడడం, స్వార్థం విడనాడి పక్కవారికి ఉన్నంతలో సాయం చేయడం లాంటివి చేస్తే చాలు అపుడే మన కు భగవంతుడిని చేరుకునే అవకాశం లభిస్తుంది. మనసు ప్రశాంతతని పొందుతుంది.ప్రకృతిచెప్పే పాఠాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతిలా మనం పరులసాయం కోసం కాస్తయనా పాటుపడాలి
1411)మనమేదైనా కోరుకోగానే దొరికితే దాని విలువ తెలియదు.,అదే దాని కోసం తాపత్రయపడిన తరువాత దొరికితే దానంత విలువయినది దేంతో కూడా సరితూగదు
1412)తల వంచినవాడు ఎప్పటికీ చెడిపోడు అన్నది అనుభవం ద్వారా తెలిసే నిజం.
ఈ నిజం తెలుసుకొని ప్రతి ఒక్కరు వినయ, విధేయతలతో మెలిగతే ఓటమి ఉండదు. గెలుపు మనదవుతుంది.
1413)మనిషి శరీరం నవరంద్రాల జల్లేడర అందులో నిల్లుపోసి అపలనుకోవడం అవివేకం ..అలాగే మనిషి జీవితం సుకసంతోశాల సగ్గమంరా అందులో ఎల్లప్పుడూ సంతోషాన్ని మాత్రమే కోరుకోవడం ని అవివేకంరా మానవ....
1414)అజ్ఞానులు గతాన్ని, బుద్ధిమంతులు వర్తమానాన్ని, మూర్ఘులు భవిష్యత్తును మాట్లాడతారు
1415)మనతో మాట్లాడేవారిని మనం అన్ని విధాలా గమనించగలిగితే మనం చేసే పనిలో మనకి విజయం ఖాయం
1416)మట్టి తీసేకొద్ది బావిలో నీరు ఊరినట్టే ..చదివిన కొద్ది మనిషిలో విజ్ఞానం పెరుగుతుంది.
1417)కష్టాలు,సుఖాలు జీవితంలో వస్తు పోతు ఉంటాయి.కేవలం సుఖాలనే జీవితమంతా అనుభవించినవారు ఇంతవరకు పుట్టలేదన్న సత్యాన్ని గుర్తేరాలి.కష్టాలు వచినప్పుడు కుంగిపోకుండా గతంలో ఎవరెవరు ఎలా భయటపడ్డారన్న సూక్ష్మాన్ని గ్రహించాలి.ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉండనే ఉంటుంది.ముందు దాన్ని అన్వేషించాలి.ఆ దిశగా అడుగులు వేస్తుపోతే జీవితంలో దేనికి వెనక్కితిరిగిచూడబల్లేదు
1418)పెట్టినా విమర్శించేది బిడ్డ అయితే ,విమర్శించినా పెట్టేది తల్లి..అందుకే అమ్మ చాలా గొప్పది.
1419)మంచి మాట మాట్లాడితే మనిషికి గౌరవం పెరుగుతుంది.మంచి నడవడిక ఉన్న వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.మంచిని ప్రేమించే ప్రతీ ఒక్కరూ మానవతామూర్తులై వెలుగొందుతారనడంలో ఏటువంటి సందేహం లేదు.కాబట్టి ప్రతీ ఒక్కరూ మంచిగా బ్రతకడం నేర్చుకోవాలి
1420)ఎనబైనాలుగు లక్షల జీవరాశిలో మనిషిని అత్యున్నత స్థితిలో నిలిపేది బుద్ధి మాత్రమే.సద్బుద్ధి వివేకానికి మూలం .మంచి - చెడ్డలు ,చేయదగినవి,చేయకూడనవి తెలియచెప్పేది వివేకం.వివేకశాలిగా చక్కని నడవడి అలవరచుకున్న వ్యక్తికి సమాజంలో కీర్తిప్రతిష్టలతోపాటు ఆదరాభిమానాలకు ఎ లోటు ఉండదు
1421)భయం వలన పొందే ఆధిపత్యం కంటే అభిమానంతో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.
1422)మనశ్శాంతితో బతకాలంటే ఇతరుల దోషాల్ని ఎంచకుండా ఉండడం, మన ప్రవర్తనలోని లోపా లను గమనించి సరిదిద్దుకోవడం చెయ్యాలి.
1423)పొరపాట్లను గుర్తించడంలో మాత్రం వాయిదా పనికి రాదు. ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దు కుంటూంటే, అంతకు మించి అభివృద్ధి లేదు!
1424)భగవంతుడు మనకు ప్రసాదించిన విలువైన వరాలలో మాట ఒకటి. ఎన్నో పెద్ద పెద్ద సమస్యలని ఆత్మీయమైన ఒక మాటతో పరిష్కరించుకోవచ్చు.అది మన చేతిలోనే ఉంది.కొద్దిసేపు మన అహాన్ని విడిచి ప్రేమ పూర్వకంగా అవతలి వ్యక్తిని అనునయిస్తే ,ఇక ఆ మనిషికి తిరుగేలేదు. అందుకే "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని " పెద్దలు అన్నారు
1425)ప్రతి ఆటంకం కావాలి మీ తోలి ప్రయత్నం....ప్రతి ప్రయత్నము పెంచాలి మీ లక్ష్యం....ప్రతి లక్ష్యం ఒక విజయానికి సంకేతం..ప్రతి విజయం నీ జీవితానికి ఒక ఆధారం.కాబట్టి విజయం వరించాలంటే సహనం ఉండాలి..పోరాటం సాగిస్తూనే గెలుపుకోసం నిరీక్షించే తత్త్వం ఉండాలి.

1426)నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరానికి స్వాగాతం.మరిచిపోదాం ఒక వేళ మన జీవితంలొ జరిగివుంటే చేదు గతం. ఈ కొత్త సంవత్సరంకావాలి మనం కోరుకునే ప్రతీది ఇచ్చే ఒక అందమైన వరం .ఈ కొత్త సంవత్సరం, తుడిచేయాలి ప్రస్తుతం సమాజంలొ ఉన్న గందరగోళం. ఆనందనిలయంగా అవ్వాలి ఈ భూగోళం. ఈ కొత్త సంవత్సరంలొ ఈ ప్రపంచంఅవ్వాలి ఎల్లపుడూ అన్ని దేశాలలో శాంతిని కాపాడే కవచం..కొత్త ఆలోచనలతో చేసుకుందాం మన జీవితంలో మెరుగులు తద్ద్వార వేద్దాం మున్ముందుకు అడుగులు ..గత సంవత్సరపు ప్రతి కష్టం యొక్క ఫలితం ఈ సంవత్సరం మనకి అవ్వాలి అంకితం...365 రోజులు మన జీవితంలొ ఉండాలి ఆనందం ...365 రోజులు మన మధ్య ఉండాలి చక్కటి అనుబంధం...ఈ కొత్త సంవత్సరం మనం కొరుకునే విధంగా ఉంటుందని కచ్చితంగా ఆశ తొ గడుపుదాం ... నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ---రఘు

1427)స్వాగతించే మంచి మార్పులే..మనల్ని విజేతలుగా నిలబెడుతాయి.ఉన్నంతంగా తీర్చిదిద్దుతాయి.ఆలోచనల్లో సానుకూలత ..గమ్యంలో స్పష్టత ..అడుగులో ఆత్మవిశ్వాసం ప్రతిఫలించేలా ..చేస్తాయి
1428)లక్ష్యం అంటూ ఉన్నప్పుడే వడివడిగా గమ్యం వైపు అడుగులు వేయగలం ..ఈ కొత్త సంవ్సరంలో మీకంటూ ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోండి దాన్ని సాధించుకోవడానికి చక్కని ప్రణాళిక రూపొందించుకొని కచ్చితంగా అమలుచేయండి.అవుతుందో కాదో అన్న అనుమానం వద్దు.సాధించగలమా లేదా అన్న సందేహం వలదు.మీ ఆలోచన అమలైతే అదో వ్యూహం అవుతుంది.దానికి ఓ గడువంటు పెట్టుకుంటే అదో లక్ష్యమవుతుంది అవరోదాలకు నిలిచి గెలిస్తే అది విజయమవుతుంది.మిమ్మల్ని శక్తివంతులని చేసే ఆలోచనలతో కొత్త సంవ్సరంలోకి ప్రవేశించండి.
1429)డబ్బు తప్ప ఇతరత్రా ఏమి లేనివాడే ప్రపంచంలో అందరికంటే నిరుపేద.
1430)ఏది అంతిమ విజయం కాదు ..తదుపరి ఆశయం ,తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి..ఆశయంతో జీవించు తప్పినసరిగా నీవు ఉన్నతశికరాలు అధిరోహించగలవు
1431)ఒక ఆలోచనను నాటితే ఒక పనిగా ఎదుగుతుంది..ఒక పనిని నాటితే ఒక అలవాటుగా మారుతుంది..ఒక అలవాటును నాటితే అందులోంచి ఒక వ్యక్తిత్వం ఎదుగుతుంది..ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది ఒక తలరాతగా మారుతుంది..కాబట్టి మీ తలరాతను సృష్టించుకున్నది మీరే
1432)"అంతా అయిపొయింది ఇంకేమి లేదు" ,అన్ని అనుకున్నచోట ఆగిపోకు ,ప్రక్కకు తిరుగు.మరోదారి కనపడుతుంది ..నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.
ఏది అంతిమ విజయం కాదు ..తదుపరి ఆశయం ,తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి..ఆశయంతో జీవించు తప్పినసరిగా నీవు ఉన్నతశికరాలు అధిరోహించగలవు
1433)మనిషి శిలలా మారడానికి కారణం ఓ గాయం కావచ్చు ... అలాంటి గాయం తగిలితేనే కదా శిలకి జీవం వస్తుంది... గాయం మనిషికి భాధ కలిగించవచ్చు... కానీ ఆ గాయాలే మనిషికి జీవించడాన్ని నేర్పుతాయి..."
1434)మంచితనం మనిషికి మరొకరు ఇవ్వలేని మరొక మకుటం,సామర్ధ్యం ఆ మనిషికి కృషితో వచ్చే మంచుగంధమంటారు
1435)తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషికి మిగిలేదేమీ వుండదు
1436)అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది
1437)గొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే దుర్బలులు ఆశల కోసం జీవిస్తారు
1438)మంచి జ్ఞానానికి ఊహ తోడైతే, అది మనిషికే కాకుండా మానవ జాతికంతటికి మహోపకారం చేస్తుంది
1439)ఇతరుల మీద బురదజల్లేవారు ఎప్పుడో ఒకప్పుడు తామే బురదలో పడతారు
1440)నీతి వున్నవారు నిందను గురించి భయపడవలసిన పని లేదు
1441)డబ్బు తప్ప ఇతరత్రా ఏమి లేనివాడే ప్రపంచంలో అందరికంటే నిరుపేద.
1442)ఒక్కోసారి మనం చేయగలిగిన పనులకన్నా చేయకూడని పనులు తెలుసుకోవడం చాలా అవసరం
1443)భగవంతుడు మనకు ప్రసాదించిన విలువైన వరాలలో మాట ఒకటి. ఎన్నో పెద్ద పెద్ద సమస్యలని ఆత్మీయమైన ఒక మాటతో పరిష్కరించుకోవచ్చు.అది మన చేతిలోనే ఉంది.కొద్దిసేపు మన అహాన్ని విడిచి ప్రేమ పూర్వకంగా అవతలి వ్యక్తిని అనునయిస్తే ,ఇక ఆ మనిషికి తిరుగేలేదు. అందుకే "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని " పెద్దలు అన్నారు
1444)ప్రతి ఆటంకం కావాలి మీ తోలి ప్రయత్నం....ప్రతి ప్రయత్నము పెంచాలి మీ లక్ష్యం....ప్రతి లక్ష్యం ఒక విజయానికి సంకేతం..ప్రతి విజయం నీ జీవితానికి ఒక ఆధారం.కాబట్టి విజయం వరించాలంటే సహనం ఉండాలి..పోరాటం సాగిస్తూనే గెలుపుకోసం నిరీక్షించే తత్త్వం ఉండాలి.
1445)స్వాగతించే మంచి మార్పులే..మనల్ని విజేతలుగా నిలబెడుతాయి.ఉన్నంతంగా తీర్చిదిద్దుతాయి.ఆలోచనల్లో సానుకూలత ..గమ్యంలో స్పష్టత ..అడుగులో ఆత్మవిశ్వాసం ప్రతిఫలించేలా ..చేస్తాయి
1446)లక్ష్యం అంటూ ఉన్నప్పుడే వడివడిగా గమ్యం వైపు అడుగులు వేయగలం ..ఈ కొత్త సంవ్సరంలో మీకంటూ ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోండి దాన్ని సాధించుకోవడానికి చక్కని ప్రణాళిక రూపొందించుకొని కచ్చితంగా అమలుచేయండి.అవుతుందో కాదో అన్న అనుమానం వద్దు.సాధించగలమా లేదా అన్న సందేహం వలదు.మీ ఆలోచన అమలైతే అదో వ్యూహం అవుతుంది.దానికి ఓ గడువంటు పెట్టుకుంటే అదో లక్ష్యమవుతుంది అవరోదాలకు నిలిచి గెలిస్తే అది విజయమవుతుంది.మిమ్మల్ని శక్తివంతులని చేసే ఆలోచనలతో కొత్త సంవ్సరంలోకి ప్రవేశించండి.
1447)డబ్బు తప్ప ఇతరత్రా ఏమి లేనివాడే ప్రపంచంలో అందరికంటే నిరుపేద.
1448)ఏది అంతిమ విజయం కాదు ..తదుపరి ఆశయం ,తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి..ఆశయంతో జీవించు తప్పినసరిగా నీవు ఉన్నతశికరాలు అధిరోహించగలవు
1449)ఒక ఆలోచనను నాటితే ఒక పనిగా ఎదుగుతుంది..ఒక పనిని నాటితే ఒక అలవాటుగా మారుతుంది..ఒక అలవాటును నాటితే అందులోంచి ఒక వ్యక్తిత్వం ఎదుగుతుంది..ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది ఒక తలరాతగా మారుతుంది..కాబట్టి మీ తలరాతను సృష్టించుకున్నది మీరే
1450)అంతా అయిపొయింది ఇంకేమి లేదు" ,అన్ని అనుకున్నచోట ఆగిపోకు ,ప్రక్కకు తిరుగు.మరోదారి కనపడుతుంది ..నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.
ఏది అంతిమ విజయం కాదు ..తదుపరి ఆశయం ,తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి..ఆశయంతో జీవించు తప్పినసరిగా నీవు ఉన్నతశికరాలు అధిరోహించగలవు
1451)మనిషి శిలలా మారడానికి కారణం ఓ గాయం కావచ్చు ... అలాంటి గాయం తగిలితేనే కదా శిలకి జీవం వస్తుంది... గాయం మనిషికి భాధ కలిగించవచ్చు... కానీ ఆ గాయాలే మనిషికి జీవించడాన్ని నేర్పుతాయి..."
1452)జింక బ్రతకాలంటే వేగంగా పరుగెత్తడం నేర్చుకోవాలి.లేదా పులికి ఆహారం అవుతుంది.పులి బ్రతకాలంటే అత్యంత వేగంగా పరుగెత్తాలి.లేదా జింక పారిపోతుంది.అలాగే మన నిత్యజీవితంలో కూడా ప్రతి దినం ఒక చాలెంజ్ గా తీసుకున్నవారికి విజయం లభించడం ఖాయం .
1453)తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మనిషికి మిగిలేదేమీ వుండదు
1454)ఉత్తములుని వివేకం నడిపిస్తుంది,మధ్యములని అనుభవం నడిపిస్తుంది,అధములని అవసరం నడిపిస్తుంది ,జంతువులని స్వభావం నడిపిస్తుంది .మనుషులు మధ్యములు కాబట్టి అనుభవం నడిపించాలి ,మనకు వెనకల ఏమి జరుగుతుందో అనేటటువంటిది ఊహించి మనం జాగార్తపడాలి.
1455)గొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే దుర్బలులు ఆశల కోసం జీవిస్తారు
1456)రాపిడి లేనిదే వజ్రాలు మెరవవు.నిప్పుతో కాల్చనిదే బంగారం శుద్ధి కాదు.కష్టాలను ఎదుర్కొనిదే గాని మంచితనం రాణించదు.సమస్యలు మానసిక శక్తిని పెంచుతాయి.కాబట్టి మనిషికి మంచితనం ఉండడం ఎంతో ముఖ్యం.ఏ మనిషికైనా గొప్ప పేరు తెచ్చేది,ఎక్కడైనా రాణించడానికి తోడ్పడేది ఆ మంచి గుణం మాత్రమే!!!
1457)మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు
1458)మానవ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దోకోవడానికి కావాల్సిన ఒకే ఒక ఆయుధం "ఆలోచన" ... ఆలోచనలు మంచివైతే నీ పయనం మంచి వైపు...ఆలోచనలు చెడువైతే నీ దారి చెడువైపు...అంటే ఒక్క నీ ఆలోచనల సమాహారమే నీ జీవితాన్ని నడిపే ఆయుధం... నీ మాటే నీవు సృష్టించుకొనే ప్రపంచం (Word Makes World)
1459)భాద నుండి ఓర్పుని ,ప్రమాదం నుండి ధైర్యాన్ని ,పొరపాట్లు నుండి గుణపాటాలను నేర్చుకున్నవాడే జీవితంలో ఎదగగలడు
1460)మనం అంటే మన ఆలోచనలే. అవే మనల్ని రూపొందించాయి. మాటల కన్నా అవే ముందుంటాయి, జీవిస్తాయి, నడిపిస్తాయి. మనం పెంపొందించుకునే ఆలోచనా విధానమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మన హృదయ క్షేత్రంలో ఏ విత్తనాలు నాటుతామో వాటి పంటనే రేపు మనం అనుభవిస్తాం. జీవితం ఓ నిండుకుండలా ఉండాలనుకోవటం సరికాదు. అనేక అడ్డంకులు, సవాళ్లు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితానికి మనమే రూపకర్తలం. భవిష్యత్తును అద్భుత చిత్రంగా మలచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది
1461)ఆ నలుగురు!!!!

ఒక రాజుగారికి నలుగురు భార్యలు....
నాలగవభార్య అంటే ఎంతో ముద్దు అందుకే ఆవిడని వస్త్రవైఢూర్యాలతో మురిపించేవాడు.
మూడవ భార్యని కూడా మురిపంగానే చూసుకునేవాడు, ఆవిడని ఒంటిస్తంభం మేడలోవుంచి ఎప్పుడూ ఒక కన్నేసి వుంచేవాడు ఆవిడ తనని వదిలి సామంతరాజులతో వెళ్ళిపోతుందేమోనని భయం.
రెండవభార్య అంటే అమితమైన అభిమానం, ఆవిడ రాజుగారికి అన్నివిధాల సహాయం చేసే శాంతమూర్తి మరియు సలహాదారిణిగా వ్యవహరించేది.
మొదటి భార్య గురించి చెప్పాలంటే, ఆవిడ పట్టపురాణి. రాజుగారికి చేదోడువాదోడుగా ఉంటూ, ఆయన ఆలనాపాలనా చూసుకునేది. కాని రాజుగారు ఆవిడని పట్టించుకునేవారుకాదు, అది కనపడకుండా గాంభీర్యం అనే ముసుగువేసుకుని ఆవిడతో గడిపేవారు.
ఇలా జరుగుతుండగా కొన్నాళ్ళకి.....
రాజుగారికి అనారోగ్య కారణంగా ఆయనలో మృత్యుభయం చోటు చేసుకుంది.
నాలగవభార్యని పిలచి నిన్ను నేను అమితంగా ప్రేమించాను నాతో పాటు మృత్యువులో తోడుంటావా అని అడిగితే లేదు అని ఆవిడ చెప్పిన సమాధానం రాజుగారి గుండెలో బాకులాదిగింది.
మూడవభార్యాని తోడు రమ్మంటే...నేను రాలేను నా జీవితం ఎంతో మధురమైనది మీరు మరణించిన పిదప నేను వేరొకరిని వివాహమాడుతానన్న మాటలకి రాజుగారు కృంగిపోయారు.
రెండవభార్యతో నీవైనా నా వెంట వస్తావా, నాకు ఇన్నాళ్ళు అన్నింటిలో సహాయ, సలహాలనిచ్చావుగా చరమాంకంలో కలసి పయనించమని వేడుకున్నాడు. దానికి ఆవిడ మీతో కలసి రాలేను కాని కడవరకు మిమ్మల్ని సాగనంపుతానంది.
"నేను వస్తాను మహారాజా మీవెంట మీరు ఎటువెళితే అటు"... అంటూ మొదటిభార్య గొంతు నిస్తేజంగా కృంగిపోతున్న మహారాజవారికి వినిపించింది. అప్పుడు చూసారు నీరసంతో క్షీణించిన మహారాణిగారి వంక, మనసుని నులిపెట్టే భాధతో అనుకున్నారు అయ్యో! నేను ఇంతకాలం ఈవిడనా నిర్లక్ష్యం చేసింది, తనని శ్రద్దగా చూసుకోలేక పోయానని అప్పుడు పశ్చాతాప పడ్డారు.

మనజీవితంలో ఆ నలుగురు.....
నాల్గవభార్య మన శరీరం:- మన శరీరాన్ని యవ్వనంలో ఎంతో మోహించి, శ్రద్దవహించి, ఎంతో సమయాన్ని వెచ్చించినా సమయానికి అది మనతో సహకరించదు.
మూడవభార్య మన అధికారం ఆడంబరం:- మనల్ని మృత్యువులో వీడి వేరొకరికి సొంతమౌతాయి.
రెండవభార్య సంసారం సంతానం:-ఎంతమనకి సహాయంచేసి సహకరించి సలహాలిచ్చినా వారు సాగనంపటానికే కాని సాంతం మనతోరారు. మొదటిభార్య మన ఆత్మ:- ఆడంబరాలకి, ఐశ్వర్యార్జనకు, పేరు ప్రతిష్ఠలకై మనం ఆత్మని ఎంత అశ్రద్ద చేసినా కడవరకు తోడుంటుంది.
1462)నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము
1463)నీకు బాధ కలిగిందంటే అందుకు నీ స్వీయ స్వభావమే కారణం.వేరెవరూ కారకులు కారు . . .
నీ స్వభావాన్ని ప్రేమ మయంగానూ,తియ్యన్దనంగానూ తీర్చి దిద్దుకో ,నిన్ను అందరూ ప్రేమిస్తారు…
1464)జీవితము నాలుగు అక్షరాలేకాని అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ.ప్రతి మనిషి చూడడానికి బాగానే అనిపించినా మనస్సులో ఎన్నో బాధలు..కావాలన్నది దొరకదు..దొరికినది మనతో ఉండదు.ప్రతి క్షణం సంతోషంగా ఉండాలనే తపన కానీ సంతోషం మనిషి జీవితంలో కొన్ని నిమిషాలు మాత్రమే..కష్టానికి అలవాటుపడిన మనిషికి ప్రతి క్షణమూ సంతోషమే..కాబట్టి దొరికినదానితో సంత్రుప్తిపడటమే జీవితము
1465)అరటిపండును తొక్క తీసే తింటాం. సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం .సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం,పై తొక్కు,లోపలి గింజలు వదిలేస్తాం.ఆపిల్,జామ పళ్ళని మొత్తం తినేస్తాం.ఇలాగ మనం ఒక పండులో టెంకని,ఒక పండులో గింజని ,ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం .ఒక్కోటి ఒక్కో రుచి.తీపి,పులుపు,వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు.అన్ని ఇష్టమే ,ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు.మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తమంతే.అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు. కుటుంబంలో భార్య భర్త ,అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు,అందరు ఒక్కో రకం పండు ,ఒక్కోరిది ఒక్కో స్వభావం .అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే ,వాళ్ళు చూపించిన కోపమో ,చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా !!పండులాగే కోపతాపాలు,ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం.ఇది గుర్తించగలిగితే ,వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.కుటుంబమనేది -ఏ మిక్సిడ్ భ్యాగ్ అఫ్ ఫ్రూట్స్
1466)తన మీద విసరబడిన రాళ్ళను మైలురాళ్లుగా మార్చుకోగలిగినవాడు తప్పకుండావిజయుడవుతాడు
1467)ప్రేమతో క్రోధాన్ని, పవిత్రతతో మొహాన్ని, దాతృత్వంతో పేరాశను, వినయంతో గర్వాన్ని, ఆత్మశుద్దితో అహంకారాన్ని జయించవచ్చు.
1468)నాలుక కత్తిలాంటిది, ఎలాంటి రక్తపాతం లేకుండానే ఇది మనుషులను చంపివేయగలదు.పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే , మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.కాబట్టి ఏదన్న మాట్లాడేముందు జాగ్రత్తగా అలోచించి మాట్లాడండి
1469)చదువంటే జీవితాంతం జీర్ణం కాని సిద్ధాంతాలను బట్టిపట్టి పట్టాలు పొందటం కాదు. చదివిన చదువుకు సార్ధకత ఉండాలి. అది వ్యక్తి నిర్మాణం, ప్రవర్తన నియమావళి, సత్ప్రవర్తన, సత్సంకల్పాలు, మంచి పనులు చేయటానికి దోహదపడాలి.
1470)తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు
1471)నువ్వు క్రింద పడిపోయినపుడు,ఎక్కడ పడ్డావో చూడకు,ఎక్కడనించి పడిపోయావో చూడు. ఎందుకంటే పడిపొయిన ప్రాంతం నించే నువ్వు మళ్ళీ వెరే దారి లొ పయనం మొదలుపెట్టాలి . జీవితం అంటే సరిదిద్దు కోవడం,తప్పులని పదే పదే తలచుకోవడం కాదు. అన్ని మూసిన తలుపులకి తాళాలు వుండవు !!!నేను "జీవితంలొ చాలా సందర్భాలలో ఓడిపోయా" అనేమాటనే ఇలా చెప్పండి"నేను చాలా సందర్భాలలో ఓడిపొవడం ఎలా అని విజయవంతం గా తెలుసుకున్నా"జీవితం నీకు కావలసింది ఇవ్వదు ,నువ్వు కోరుకున్నదే ఇస్తుంది
1472)సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం" .ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యం . ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు .
1473)మనిషి ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది.భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం.లేని వాటి కోసం చేతులు చాచకూడదు.ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు.ఆయనకు అందరూ సమానమే.మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి.
అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.
1474)మంచి ఒక్కటే నిజానికి శాశ్వతంగా నిలుస్తుంది. సజ్జన సాంగత్యంవల్ల తృప్తి, సంతోషం, సుఖం, మనశ్శాంతి, నిర్భయత్వం ఒనగూడుతాయి. సంఘ శ్రేయస్సుకూ, వ్యక్తి వికాసానికీ పనికివచ్చే సజ్జన సాంగత్యం చేయడం సదా ఆచరణీయం.
1475)సాధారణంగా మనకు సహాయం చేసిన వాళ్ళకు మనం మేలు చెయ్యాలనుకుంటాం. మనకు హాని తలపెట్టిన వాళ్ళపై ద్వేషం పెంచుకుంటాం. కానీ పెద్దలు అపకారికి కూడా ఉపకారం చేసి చూడు అంటారు. మనకు కష్టం కలిగించిన వారికి మనం మంచి చేస్తే దాని పర్యవసానాలు, ఫలితాలు వేరుగా వుంటాయి. అవి మన ఊహకు అందవు కానీ అవి గొప్పగానే వుంటాయి. వాటివల్ల మనుషుల్లో ఎంత మార్పు వస్తుందో తెలుసుకుని మనం ఆశ్చర్యపోతాం. మనం సమగ్రంగా, సంపూర్ణంగా, ప్రేమపూరితంగా వుంటే ఈ ప్రపంచంలో ఏదీ మనను బాధపెట్టలేదు. నిజమైన ప్రేమతో మనసు నిండి వుంటే రాగద్వేషాలు మనిషిని తాకలేవు.
1476)ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు.
1477)జీవితం అంటే.. దారిలో దొరికిన పండుని కూర్చొని తినడం కాదు.. చెట్టులోంచి వచ్చిన పండుని కోసుకు తినడం ..అలా తిన్నప్పుడే దానియొక్క విలువ తెలిసేది
1478)అదృష్టంతో పైకి వచ్చినవాడు చెట్టు ఎక్కటం మాత్రమే తెలిసి వుంటుంది,అదే స్వయంకృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం, దిగటం తెలిసి ఉంటుంది.. మొదటి వాడు ఎప్పుడూ పడిపోతానెమో అనే భయంతో ఉంటే, రెండోవాడు పడినా పైకెక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు..అది అదృష్టానికి,స్వయంకృషికి తేడా !!!
1479)ఎంత కాలం చేసినా కూటికే..ఎంత కాలం బ్రతికినా కాటికే ..కాబట్టి మంచినే వినండి ,మంచినే చూడండి మంచిగా ఉండండి.
1480)ఆవేశంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు.
అధికంగా మాట్లాడితే ప్రశాంతత ని కోల్పోతారు.
అనవసరంగా మాట్లాడితే అర్దాని కోల్పోతారు.
అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు
అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతారు.
అలోచించి మాట్లాడితే ప్రత్యేకత తో జీవిస్తారు..
1481)రెండోవాడు పడినా పైకెక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు..అది అదృష్టానికి,స్వయంకృషికి తేడా !!!
1482)నేను, నాది, నాకు అనే పదాలు 'స్వార్థానికి పర్యాయపదాలు'..\
మనము, మనది, మనకు అనే పదాలు 'స్వార్థానికి వ్యతిరేకపదాలు'..
స్వార్థం నిండిన మనసు ఎన్నటికీ ఒంటరే..
'నేను' అనే పదంలో 'కలవని పెదవులు',
'మనము' అనే పదానికి 'కలుస్తాయి'..
కలిసిన పెదవులకే కదా ముద్దు ముచ్చట..!!
1483)స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే..కాబట్టి మనస్సుని జయించినవాడు జీవితంలో దేనినైన సాధించగలడు
1484)మీ హృదయంలో ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది.కనుక అసూయకు దూరంగా ఉండండి..
1485)మానవజాతి మంచికోసం ఏదైనా చేయవలసివచ్చినప్పుడు దేవుడు ఆ పనిని తానూ స్వయంగా చేయలేదు.ఒక చిన్నారి శిశువుకు జన్మనిచ్చాడు.న్యూటన్ నుంచి గాంధి వరకు అలా సృష్టింపబడినవారే .అటువంటి ఏ ప్రయోజనంకోసం మనం జన్మించంమో తెలుసుకోవటమే జీవితం..
భయం అనేది క్షణం మాత్రమే బ్రతుకుతుంది.ఒక్కసారి దానిని అధిగమిస్తే అది మన చెప్పుచేతల్లో వుంటుంది.
1486)ప్రతి మనిషి పుట్టుక ఒకేలా ఉంటుంది.కొందరు జరిగే ప్రతీ సంఘటననూ సమస్యగా భావించి తలమునకలవుతారు.కొందరు మాత్రమే జరుగుతున్న ప్రతీ సంఘటననూ ఒక అనుభవంగా మార్చుకోగలుగుతారు .మనిషి జీవితకాలంలో కష్టాలూ-సుఖాలూ ఎదుర్కొంటూనే ఉంటాడు.ఎదుర్కునేకొద్ది జీవితం గడపడానికి సులభమవుతుంది.కష్టంతోనే సుఖాన్ని పొందవచ్చని అవగతం చేసుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతే జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలడు.
1487)జీవితం మనోహరమైన పుష్పం అయితే ప్రేమ అందులో నిరంతరం స్రవించే మధురమైన మకరందం వంటిది.ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు..ప్రేమికుల రోజు శుబాకాంక్షలు !!!
1488)ప్రేమించడం సులభం..ప్రేమించబడడం కష్టం...
నమ్మడం సులభం..నమ్మించడం కష్టం...
గుర్తుంచుకోవడం సులభం..మరచి పోవడం కష్టం....
అసత్యమాడడం సులభం..నిజం ఒప్పుకోవడం కష్టం...
ఏడిపించడం సులభం..నవ్వించడం కష్టం..
1489)మొదలుపెట్టిన పని విఫలమైతే ,చేసినదంతా నష్టమైపోయింది కదా..అని భయపడకండి.మరొక్కసారి ప్రయత్నించివుంటే ఆపని పూర్తయ్యే అవకాశం వుండేది అన్న ఆలోచన రానందుకు చింతిచండి."సక్సెస్ ఇస్ నెవెర్ ఎండింగ్ ,ఫెయిల్యూర్ ఇస్ నెవెర్ ఫైనల్
1490)బాధ వచ్చినప్పుడు, ఏకాంతాన్ని చేదించే అంత ధైర్యం ఉండాలి..... కాని ఏకాంతంలో కూరుకుపోయే అంత భయం కాదు......వివేక్
1491)వస్తువుల అవసరం మనకుంది. అది అవసరంగా వున్నంత మేరకు భయముండదు. అది వ్యామోహంగా మారితే, అనుబంధంగా మారితే అది భయంగా పరివర్తన చెందుతుంది. డబ్బు, కీర్తి, యిల్లు ఇవే జీవితమనుకుంటాం. అవి వుండడం తప్పుకాదు, వాటిని సంపాదించడం తప్పు కాదు. అవే జీవితం అనుకోవడం తప్పు. అవే జీవితం అనుకుంటే అక్కడే ఆగిపోతాం.ఒక మొగ్గ పువ్వుగా వికసించడంలో పరిపూర్ణత్వముంది. జీవితం కూడా అనుభవాలతో వికసించాలి. సంపూర్ణత్వాన్ని సంతరించుకోవాలి. జీవిత లక్ష్యం అదే కావాలి. అక్కడ అపుడు ఎట్లాంటి భ్రమలూ, భయాలూ వుండవు.
1492)పరిపూర్ణంగా నిన్ను నువ్వు ఎరిగినప్పుడే నీ మనస్సుకు,శాంతి,సుఖం.అప్పుడు ఎలాంటి భాద,అసంతృప్తి,ఆందోళన,ఒత్తిడి,అన్నది నీ దరి చేరవు.చిత్రమేమిటంటే మనం తెలుసుకోవాల్సిన దాని గురించి మనం తగినంత శ్రద్ధ పెట్టం.ఇతరులకు తెలియనివాటి గురించి ఎక్కువుగా ఆలోచిస్తాం,మాట్లాడతాం.కాబట్టి ఇలా మాట్లాడి కాలం వృధా చేసేవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు.
1493)కష్టాలు ఏడ్చినా పోవు – సుఖాలు నవ్వినా రావు!....అలవాటైతే కష్టాలే సుఖాలౌతాయి – అధికమైతే సుఖాలే కష్టాల్లాఉంటాయి !!
1494)నోటంట వెలువడే ప్రతి పలుకు అర్ధవంతంగా ఉంటూ, కోపావేషాలకు తావివ్వకుండా , పరిణితి చెందిన అలోచాన విధానానికి సర్వసమత్వ భావనలకు కేంద్రంగా ఉంటూ మంచి మనస్సుతో అపకారికి సైతం ఉపకారం చేయాలన్న గుణం నీకు కలిగివుంటే దేవుడు తప్పక నీకు మేలే చేస్తడుగాని కీడు చెయ్యడు.
1495).బద్ధకం కనపడని శత్రువు – వివేకం విడిపోని మిత్రుడు !!
1496).అందకుంటే అది అందం – అందుకుంటే అది బంధం
1497).ధర్మానికి నీతికి కొలతలు లేవు – అనురాగానికి ఆప్యాయతకు హద్దులు లేవు !
1498).సమర్ధుడికి ఎదురు లేదు – అసమర్ధుడికి ఎదుగు లేదు !
1499).ప్రతి జంతువుకు తన జాతి లక్షనాలు ఉంటాయి – మనిషిలో మాత్రం సర్వ జంతు లక్షనాలు ఉంటాయి !
1500)కష్టాలలో దేవుడు కనపడతాడో లేడో – సుఖాలలో మాత్రం జీవుడే కనపడతాడు.

నీతి

పూచిన ప్రతి మల్లెపువ్వు వాడిపోక తప్పదు.. అరుదెంచిన యవ్వనం సడలిపోక తప్పదు..

ఉదయించిన భాస్కరుడు అస్తమించక మానడు.. పుట్టిన ప్రతివాడు మట్టికాక మానడు..

కానీ ! ఆ బ్రతికిన కొద్దికాలం మహనీయుడిగా మారలేకపోయినా..

నీతిగా బ్రతికితే చాలు.. మంచిగా జీవిస్తే మేలు.. మన మనుగడకది చాలు..

మన జీవిత ఘట్టాలు పదిమందికి పాఠాలై మిగిలితే చాలు..

లోకమనే చీకట్లో మన బ్రతుకొక చిరుదివ్వె అయి పరులకు వెలుగులందిస్తే సమాజానికి మేలు .