ఏదైనాసరే మన దృష్టిలోనే ఉంది మనం వీక్షించ గలిగితే అంతటా మంచే కనిపిస్తుంది...మనం దర్శించగలిగితే ప్రతిమంచిలోనూ దైవం కనిపిస్తుంది..మనం సవరించుకో గలిగితే ప్రతి బలహీనతా ఒక బలమవుతుంది..మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి అపార్థమూ అర్థమవుతది..మనం అన్వేషించగలిగితే ప్రతి సమస్యా ఒక పరిష్కారమవుతుంది..మనం చదవగలిగితే ప్రతి పరిచయమూ ఒక పుస్తకమవుతుంది..మనం నేర్చుకోగలిగితే ప్రతి అనుభవమూ ఒక పాఠమవుతుంది..మనం స్వీకరించగలిగితే ప్రతి కష్టమూ ఒక ప్రేరణవుతుంది..మనం మలచుకోగలిగితే తగిలిన ప్రతిరాయీ పునాదిలో బాగమవుతుంది..మనం భరించగలిగితే ప్రతి గాయమూ గేయమవుతుంది..మనం ప్రయత్నించగలిగితే ప్రతి ఓటమీ మన విజయానికి సోపానమవుతుంది..మనం ధైర్యంగా పోరాడగలిగితే ప్రతి సవాలు సూక్ష్మ మవుతుంది..మనం ఆహ్వానించగలిగితే ప్రతిపరిచయమూ ఒక స్నేహమవుతుంది..మనం ఆస్వాదించగలిగితే ప్రతి స్నేహమూ ఒక అనుబంధమవుతుంది..మనం మన హృదయాన్ని విశాలం చేసుకోగలిగితే ప్రతి అనుబంధమూ ఒక అద్భుతమవుతుంది..మనం సంకల్పిస్తే..మన జీవితమే ఒక అందమైన ప్రపంచమవుతుంది.....ఏదయినా మనం "అనుకునేదానిలోనే" ఉంది..ఇది నిజం
No comments:
Post a Comment