అమ్మ తన కడుపులో తొమ్మిది నెలలు మోస్తే...
నాన్న మనల్ని జీవితాంతం మోస్తాడు...రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు.ఇంట్లో ఏమి తీసుకోకుండా అమ్మ...కష్టపడి సంపాదన అంతా ఇంటికే పెడుతూ నాన్న...ఇద్దరి కష్టం, శ్రమ ఒకటే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు...ఏది అడిగితే అది వండి,వడ్డిస్తూ అమ్మ...ఏది అడిగితే అది లేదనకుండా ఇచ్చే నాన్న...ఇద్దరి ప్రేమా సమానమే అయినా అమ్మకంటే నాన్నెందుకో వెనకబడ్డాడు..ఫోను చేసినా అమ్మ అనే పేరే..దెబ్బ తగిలినప్పుడూ అమ్మా అనే పిలుపే..అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పమిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధ పడ్డాడా అంటే..ఏమో??అమ్మకి పిల్లలకి ఇంట్లో నిండా రంగురంగుల బట్టలు లెక్క లెన్నన్ని ఉన్నా..నాన్న బట్టలు మాత్రం ఒకటో రెండో జతలు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో వెనకబడ్డాడు.పిల్లల ప్రేమ పొందడం లో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనక పడ్డాడా అంటే ఏమో?? అమ్మకు పిల్లలకు బంగారు ఆభరణాలు...నాన్నకి మంచి బంగారు రంగు వాచీకూడా లేదాయే,కుటుంబం కోసం ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలనే తపన ఎంటో నాన్నకి..తగిన గుర్తింపు తెచ్చుకోవడం లో నాన్నేందుకో బాగా వెనకబడ్డాడు.వయసు మళ్ళిన అమ్మైతే ఇంట్లో పనికి పని కొస్తుంది...అదే నాన్నైతే ఎందుకూ పనికిరాడని మనం సూటి పోటీ మాటలన్నపుడు కూడా వెనకబడింది నాన్నే! నాన్న ఇలా వెనకబడి పోవడానికి కారణం ఎవరు?అందుకే మనం నాన్నకు, అమ్మకు..కావాల్సినంత ప్రేమను ,ఆనందాన్నీ ఇద్దాం..ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ ఇచ్చారుగా కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వారిని బాగా చూసుకుందాం..నాన్నా ఎపుడూ వెనుక బడినా మా గెలుపు కోసమే ఇది ప్రతి అమ్మకి నాన్నకి అంకితం..ఎక్కడో విన్నది చదివినది..*ఇట్లు ఓ నాన్న*
No comments:
Post a Comment