Tuesday, April 26, 2011

నాన్నా ఇవే నీకు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు...!

నాన్నా ఇవే నీకు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు...!

అమ్మకు ఆరో ప్రాణం నేను, నాకు పంచ ప్రాణాలు నీవు...
అల్లరి చేసే నన్ను అదిలించేది అమ్మైతే ఆత్మీయంగా కొమ్ముకాచేది నీవు...

తప్పటడుగు వేసే నన్ను గొప్పగా నడిపించే పాదం నీవు...
నిప్పుల ఉప్పెనలో నేచిక్కుకుంటే చల్లని చినుకల్లే చేరి చల్లార్చేది నీవు...

అడుగకనే అన్నీ ఇచ్చే నన్ను కన్న అద్భుత ద్వీపం నీవు...
కలత చెందిన క్షణాన నేచెప్పకనే తప్పులనెంచి సరిదిద్దే గురువు నీవు...

కల్మషంలేని పియూష ప్రేమ పంచే తల్లికి సరి జోడు నీవు...
జన్మ జన్మలకు మరపురాని అనురాగాలాపన చేసే గంధర్వుడవు నీవు...

ఉలిక్కి పడి నేభయపడితే నన్ను చేరే ధైర్య సాహసానివి నీవు...
జననికి ఐదో తనం నీవు, ప్రాణ కోటి మనుగడకు సృష్టి ప్రధాతవు నీవు...

విసురుగా కసురుతూ అక్కున చేర్చుకొనే అభయ హస్తం నీవు...
దిక్కు తోచని తికమకలో నేనుంటే సన్మార్గాన్ని చూపే మార్గదర్శివి నీవు...

ఓటమిలో నేకృంగిపోతే, ఆత్మ విశ్వాసాన్ని నింపే కాలం నీవు...
గెలుపులో నేపొంగిపోతే, గర్వాన్ని అణిచే అభినందన బృందావనం నీవు...

ఎన్నెన్నో జన్మల బంధం నేడు నీలా మారి నన్ను చేరి నిలువు...
ఎన్నని చూపగలను నీ కీర్తి శిఖరాల్ని, అవి అంతంలేని త్యాగాల నెలవు...

ఏన్ని పదాలతో నిన్ను కీర్తించినా ఇంకనూ నీ విలువలు కలవు...
ఏమని చెప్పగలను నీ స్పూర్తి సుగుణాల్ని, అవి వెలలేని వజ్రాల కొలువు...

శిలను శిల్పంగా మలచే ఉలి పుట్టిన రోజు సంబరాలకు సెలవు...
ఆజన్మాంతం మా కోసం కరిగే దీపానికి శుభాకాంక్షలు తెలుపగా కాదేదీ సులువు...!

Monday, April 18, 2011

మదర్ థెరీసా

డబ్బుతో మనుషులను గెలువచ్చేమో కాని .. మనసులను గెలువలేము ..
అమ్మ అని ప్రపంచం మొత్తం పిలిచే భాగ్యం తనకు మాత్రమె సొంతం ..
ఆ అమ్మ ఏవరో కాదు .. మన మదర్ థెరిస్సా అమ్మ ..
ప్రేమతోనే సమస్తం సాధ్యం అని నిరూపించిన .. మా మాతృమూర్తి ..
ఎప్పుడూ ప్రేమ మాటలే .. ఆ కళ్లలో కనిపించే దీన మనస్సు ..
తన వృత్తిని సైతం వదులుకొని..
ఎంతకు వర్ణించలేము ... నన్ను మార్చిన తన మాటలలో కొన్ని మీతో .

ఒకరోజు ... మురికి వీధి ఆనాథ పిల్లతో .. బిక్షనికి వెళ్లినపుడు ..
ఒక పెద్ద ధనికుడు దగ్గరకు వెళ్తే .. తూ అని ఉమ్మేశాడు ..
తన కొంగు చేతితో దాన్ని తుడుచుకుంటూ .. ఇది నాకు
మరి నా పిల్లలకు ... అంది .. అతను వేంటనే అమ్మ అని పిలిచి ..
సహాయం చేశాడట ... ప్రేమతో మనుషులు మారుతారు .. మనస్సులు మారుతాయి ..
తను చెప్పింది ఒక్కటే .. అన్నం లేకపోయినా అప్యాయత కరువవడం అసలైన పేదరికం ..
అమ్మ ప్రేమకు ... ఏమి చేయగలం అంటారా .. తను చూపిన ప్రేమను మన ఎదుటి వాళ్లకు చూపటమే ..
మన ఇంట్లోనే ఎవరి మనస్సులో ఎలాంటి బాధ ఉందో .. మీకు తెలుసా?
ఎందరో అభాగ్యులు .. వారి మనస్సు లోతుల్లొకి వేళ్లావా ..
గొప్ప గొప్ప పనులు . చేయనవసరం లేదు .. చిన్న చిన్న పనులనే గొప్ప ప్రేమతో చేస్తే చాలు ..
కడుపు నిండా అన్నం పెట్టకపోయినా ... గుండే నిండా ప్రేమ చూపితే చాలు ...

ఒక్కసారి .. తన దగ్గరకు వచ్చిన వారిలో ఒకరు .. అమ్మ ఇక్కడ ఉన్న అందరూ .. సంతోషంగా ఉన్నారు ..
నీ దగ్గరా ఏదైనా మంత్ర శక్తి ఉందా అంటే ...
అవును .. నా దగ్గర ప్రేమ అనే శక్తి ఉంది .. అని మెల్లగా సమాధానం ఇచ్చింది .. ఆ ప్రశాంతమైనా వేళ ఆ మాట చూట్టు కనిపించింది అని ఆ వ్యక్తి చెప్పాడు ..

మనం అనుకుంటాం కడుపు నిండా భోజనం పెడుతున్నాం .. కదా అని కాని కంటి నిండా కునుకు ఉందా అని చూస్తున్నామా ..

ప్రపంచానికి అమ్మ పుట్టిన రోజు .....
మనముందు నలిగిపోతున్నా .. చిన్నారులను .. అభాగ్యులను .. ఆదరిద్దాం ..
అమ్మ చేసిన వాటిలో కొన్నైనా మనం చెద్దాం ఆ ప్రేమ శక్తిని అందరికి పంచుదాం ...

అమ్మ ఐ లవ్ యూ .................................

Saturday, April 9, 2011

నా మంచి మాటలు తరువాయి భాగం పార్ట్ -2

=================================================================================================
నా మంచి మాటలు తరువాయి భాగం
=================================================================================================
1001)మన వద్ద సిరిసంపదలు ఉన్న లేకున్నా,అధికారం కలిగిన లేకున్నా -మంచి గుణాలు కలిగి ఉంటె ..ఎప్పటికి ఒంటరి వాళ్ళం

1002)విద్య వల్ల వినయం,వినయం వల్ల గౌరవం,గౌరవం వల్ల ధనం,ధనం వల్ల సుఖం సమకూరుతాయి.

1003)సంపాదనకైనా ,సంపాదించాలన్న ఆశకైనా ఓ పరిమితి ముఖ్యం.ఆ సంతృప్తి లేకపోతే మనస్సంతి కరువు అవుతుంది.మనం ఎంత సంపాదించినా ..అందులో ఐదుశాతమో పదిశాతమో సమజానికి కేటాయించాలన్న నిర్ణయం తీసుకుంటే,ఆ నిర్ణయాన్ని జీవిత ప్రణాళిక లో భాగం చేసుకుంటే ,మనకి ఆస్తులతో పాటు ఆత్మ సంతృప్తీ పెరుగుతుంది.

1004)వైఫల్యం నిరాశకి కారణం కాకూడదు.కోత్హ ప్రేరణకి పునాది కావాలి

1005)మనిషి ఉన్నతంగా ఎదగడానికి తనకి ప్రపంచం కావాలి.తాను ఉన్నతంగా ఎదగడానికి ఈ ప్రపంచానికి తాను కావలి.అందుకే ఈ ప్రపంచం గర్వించే విదంగా మనిషి ఎదగాలి

1006)నీకు జీవితంలో ఆనందం కావాలా...?
అయితే ఎప్పుడూ ప్రేమను అర్ధించే వానిగా ఉండకు...
ప్రేమను అందించే వానిగానే ఉండు...
అప్పుడే నీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది...! విశ్వ..!

1007)విజయం అంటే ఏమిటి...? ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే...
ఏ రోజైతే నీ "సంతకం", "ఆటోగ్రాఫ్"గా రూపాంతరం చెందుతుందో...
ఆ రోజు నువ్వు నిజమైన విజయాన్ని సాధించావనే చెప్పాలి...! విశ్వ..!

1008) జననం మన జీవితానికి ప్రారంభం...
అందం మన జీవనానికి పరమార్ధం...
ప్రేమనేది మన జీవితాన ఒక భాగం...
మరణం మన జాతకానికి అంతం...
కాని స్నేహమనేది జీవన్మరణాలకు అనంతం...! విశ్వ..!

1009) కష్టాలకు భయపడితే అవి దగ్గరగా చేరి నిన్ను మారిత భయపెడతాయి...
అదే కష్టాను భయపెట్టేలా తిరగబడితే తిరిగి చూడకుండా పరుగు పెడతాయి...! విశ్వ..!

1010) నీ జీవితంలో కష్టాలనేవి నిన్ను నాశనం చేసేవి కావు...
నీలో దాగున్న ఆత్మవిశ్వాసాన్ని వెలికి తేసే సాధనాలు మాత్రమే...
కష్టానికి తెలియజేయి నిన్ను ఓడించడం కష్టానికి కష్టమేనని...! విశ్వ..!

1011)ఆలోచించు.కానీ సమయం మించిపోకముందే ఆలోచనలని పక్కనబెట్టి ఆచరణకు దిగు.

1012)నువ్వు లేకపోయినా ఉన్నట్టే...
ఎందుకంటే ఎవరైనా మన ముందు లేకపోతే...
మనం వారిని కోల్పోయామని బాధపడితే...
వారు మన హృదయంలో ఉన్నారనే అర్ధం, ఎవరికైనా అంతకన్నా ఏమి కావాలి...! విశ్వ..!

1013)విజయం మన నేస్తం కాదు. ఎప్పుడైతే కష్టపడి సాదించుకుంటామో అప్పుడే అది మన సొంతం అవుతుంది

1014)ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది

1015)భోగి భోగ భాగ్యాలు.. కనుమ కనక వర్షాలు.. సంక్రాంతి పాడి పంటలు...
మీ ఇంట సంతోషాల పంట పండాలని.. సరదాల వంట వండాలని.. ఆనందాల అందాలు నిందాని...
మనస్పూర్తిగా కోరుకుంటూ "మకర సంక్రాంతి" శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను...! విశ్వ..!

1016)అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు ..అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు..పోరాడు...పోట్లాడు...జీవితమను ఆటాడు...గెలుపును వేటాడు..

1017)విజయం సంతోషానికి కారణం కాదు.సంతోషమే విజయానికి కారణం.

1018)ఓటమిని చూసి భయపడకూడదు. ఓటమి గురువులాంటిది.ఏమి చెయ్యకూడదో ,ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది.జీవించు నీ జీవితం.సాధించు నీ ఆశయం.తల వంచావా అపజయమే,ఎదిరించావా విజయం నీదే

1019)గెలుపు అనేది భయట దొరికే వస్తువు కాదు.అది కస్టపడి పని చేసే వారి దెగ్గర దాగి వుంటుంది.కష్టపడనిదే ఏదీరాదు.కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు.అందుకనే విజయఫలం కోసం అనుక్షణం శ్రమించు,ఆ మధుర ఫలాన్ని అందుకొని ఆనదం గ ఆరగించు..సోమరితనం వీడి కష్టపడి పనిచేసినవాడి వెన్నంటువుంటుంది విజయం

1020)ఆహ్లాదకరమైన ఆలోచనలు, స్పూర్తినిచ్చే ప్రేరణలు , మంచి సంగీతం
చక్కని పుస్తకాలు, మంచి స్నేహితులు, మంచి కృషి
అవన్నీ మిమ్మల్ని సంతోషంగా ఉంటాయని గమనించండి
ఉన్నవాటిని కాపాడుకుంటూ కొత్తవాటిని సమీకరించుకోండి

1021)ఆచరణ లేని ఆలోచన,ఆలోచన లేని ఆచరణ ,రెండూ ఓటమికి కారణాలే

1022)శత్రువుని జయించాలంటే చేయెత్తి కొట్టాల్సినవసరం లేదు,వాడికి అందనంత సతికి ఎదిగితే చాలు.

1023)ఒక్క టన్ను బరువైన నిరాశ తొలగించుకునేందుకు ఒక్క చుక్క ధైర్యం చాలు .

1024)విజయం వేళ కన్నా విపత్తులోనే మనిషి గొప్పతనం భయటపడుతుంది

1025)ఒక ఆడదానికి చదువుకున్న భర్త రావడం సహజం,కానీ తనని చదివిన వాడు రావడం అదృష్టం

1026)చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు కానీ ,చేయూత నిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకూడదు

1027)గతం నుంచి పాటలు నేర్చుకుని బంగారు భవిష్యత్కోసం వర్తమానాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నవాడికి విజయం తద్యం

1028)తనలోని బలహీనతలను గుర్తెరిగి బలమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికాబద్దంగా లక్ష్యాలను ఏర్పరుచుకుని ముందకు సాగినవాడే విజయం సాదిస్తాడు.

1029)జీవించిన ఈ కొద్ది పాటి ఈ జీవితంలో మనం ఏమి సాదించమన్నది మాత్రమే ముఖ్యం...
ఎన్ని ఆస్తులు సంపాదించాం, ఎన్ని అంతస్తులు నిర్మించాం, ఎన్ని లక్షలు కూడపెట్టామన్నది ముఖ్యం కాదు...
జీవించినంత కాలం ఉన్న దానితో తృప్తిగా జీవించు, ఉన్నంతలో మనస్శాంతిగా జీవించు...
ఈ భూమి మీద ఎవ్వరు శాస్వతంగా ఉండేది లేదు, ప్రేమ ఒక్కటే శాస్వతంగా ఉండేది కనుక మానవత్వంతో అందరితో ప్రేమగా ప్రేమిస్తూ జీవించు...

1030)ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కూడా కొన్ని కొనలేనివేన్నోవున్నాయి అని గమనించాలి మనం.మూడు వేళ్ళతో దానం చేస్తే ఐదు వేళ్ళతో తినగలం.పది వేళ్ళతో ఎదుటివాడికి సహాయం చేయగలిగితే పదుల వేలు సంపాదించుకోగలం.ఎంత సేపు వాడు 'నాకేం చేసాడని నేను చెయ్యాలి?' అనడం మానుకోవాలి.మనం చెయ్యడమే ప్రధానం.భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం పదిమందికి తోడ్పడాలి.పది మంది మన మాట వల్ల ,మన చర్య వల్ల ఆనందపడాలి...ఆ ఆనందమే మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.

1031)సమస్యలు లేని జీవితం ,గాలి లేని ప్రదేశం ఉండవు.

1032)మనశ్శాంతి లేని ధనికుడు కన్నా ప్రశాంతత ఉన్న నిరు పేద మిన్న ..

1033)మనం బాధపడినపుడు సంతోషం ఉండదు ..సంతోశాపడినపుడు బాధ ఉండదు...ఇవి రెండు ఒక దగ్గర ఉండవు...ఇది అర్ధం చేసుకున్నవాడు జీవితం లో పైకి వస్తాడు....

1034)ఎదుటి మనిషి దూరం అవుతాడు అని తెలిసికూడా తనతో స్నేహం చేస్తాము.....అందుకే నేమో ఈ ప్రంపంచం లో స్నేహానికి చాల విలువ ఉంది.....

1035)కొందరికి దేవుడు అన్ని ఇస్తాడు ప్రేమను తప్ప. కొందరికి ప్రేమను ఇస్తాడు అన్ని ఇవ్వడం మర్చిపోతాడు. జీవితంలో మీ జీవితానికి ఏదీ కావాలో తేల్చుకోండి....కింగ్.....

1036)పక్కవారిని ఎక్కువగా నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు ...అందుకే ఫ్రెండ్స్ ఎవరిని ఎక్కువగా నమ్మకు ...

1037)బండెడు పాండిత్యం కన్నా గుప్పెడు ధార్మిక జీవితం గొప్పది

1038)ఒకరి గుణగుణాలు పరిక్షించి చూడాలంటె అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే సరిపోతుంది

1039)చనిపోతమని తెలిసి, బ్రతుకు బండిని ఆశా చక్రాలతో నడిపే జీవితం మంది.......ఈ చిన్ని ఆశ జీవితం లో పక్కవాడితో గొడవలు అవసరమా....

1040)ఏ ప్రయత్నం చేసినా తన మీద తనకు నమ్మకం ఉంటేనే విజయం వరిస్తుంది .ప్రయత్నం చేసి ఓడిపో కాని ప్రయత్నం మానకు. అది తెలుసుకున్నప్పుడు నువ్వు సాదించలేనిది లేదు

1041)దేవుడిని నువ్వు బాగుండాలి అనుకోరుకుంటే అది స్వార్ధం ...అందరం బాగుండాలి అని కోరుకుంటే అది మంచితనం..దేవుడు ఎప్పుడు మంచితనాన్నే దీవిస్తాడు.

1042)గాలిలో దీపం పెట్టి వెలుగు దేవుడా అంటే దేవుడు కూడా కరుణించాడు.నీ ప్రయత్నం లేకుండా విజయాన్ని ఆశించడం ,పగటి పూట చుక్కలకోసం వెతకడం లాంటిది

1043)దానమంటే మన ధనం అవతలి వ్యక్తికి ఇచ్చివేయడమని అర్ధం.దానమెప్పుడు దాన్ని తీసుకునే అర్హత కలవారికే ఇవ్వాలి.ఇచ్చేశాక ఆ డబ్బు మీద మనకు మమకారం ,ఇది నాది అనే భావం ఎంత మాత్రం ఉండకూడదు ప్రతిఫలం ఆశించి చేసే సహాయం ,సహాయమే కాదు ,దానిని దేవుడు కూడా క్షమించాడు

1044)సమాజంలో ప్రతి వాడు ఆకలి తీరిన తరువాత....ఆకలి తీరింది కదా అని సంతోషపడకుండా ...మల్లి ఆకలి వేస్తే అనే ఆలోచన తో బ్రతుకుతున్నాడు..కింగ్...

1045) గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో ,నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపవుతుంది

1046)కాగితం ఏం వ్రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది. కానీ కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయి.

1047)కష్టాలతో ఎంత పోరాడగలిగితే అంత బలం మనిషికి లభిస్తుంది. కష్టాలే మనిషి విజయానికి సోపానాలు.మనిషిలోని యుక్తి ,శక్తీ కష్టాలు వచినప్పుడే అవి భయట పడతాయి .

1048)మనస్సును అదుపులో ఉంచుకోవటం అలవరచుకుంటే ,కోరికలను అదుపు లో ఉంచుకున్నట్లే.అప్పుడు మనిషి ఈ ప్రపంచాన్ని జయించినట్లే.

1049)ఏదీ లభించినా ,ఎంతో కొంత లభించినా ,ఆ లభించిన దానితో సంతృప్తి చెందుతూ ,బ్రతికినంత కాలం 'నాది' అనే భావన కలగకుంటే మన జీవితం ఆనందదాయకమవుతుంది.

1050)తోటివారి కష్టాలను తన కష్టాలుగా చూసినవాడు,తోటి వారి సంతోషమే తనదిగా ఎంచినవాడే గొప్పవాడు

1051)ప్రపంచంలో భారి విజయాలు సాధించిన వారంతా జీరో నుండి ప్రారంబించినవారే . అవకాశాల కోసం ఎదురుచూడవద్దు ,సృష్టించు కొండి .

1052)ఆన్ లైన్లో సంభంధాలనేవి అరిటాకుల్లాంటివి....
తిన్నంతసేపూ తృప్తిగా తినాలేకాని.. బాగుందని కంచంలా కడిగి కలకాలం దాచుకోవాలనుకోవడం....
మూర్ఖత్వమే అవుతుంది....!! నీలిమ !!

1053)విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్.

1054)సంకల్పం మంచిది అయితే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది

1055)గొప్ప మనస్సుగలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు
ఇబ్బందులకు లోనై కిందపడినా ,బంతిలా మళ్ళీ పైకి ఎగురుతాడేగాని నేలకు
అతుక్కొని ఉండిపోడు.అందుకే మనం బంతిలా ఉండడానికి ప్రయత్నించాలే గాని మట్టిముద్దలా కాదు

1056)విజయం ఒక గమ్యం కాదు .గమనం మాత్రమే .ఎన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.

1057)జీవితంలో జయాలు,అపజయాలు ఉంటాయి.విజయం కోసం ఓటమిని ఎదుర్కొనక తప్పదు.ఓటమి గెలుపునకు స్ఫూర్తి కావలి కానీ నిరాస కాకూడదు

1058)ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు వస్తువుంటై,పోతువుంటై.ఆ సమస్యలకే మనం భయపడి,భాదపడి ,మన చుట్టూ ఉన్నవాళ్ళని భాదపెట్టకుండా

1059)మనస్సే ఒక అందాల బృందావనం ..అనుకుంటూ జీవితంలో విలువైన ప్రతి నిమిషాన్ని ,సంతోషం సగం బలం అంటూ హాయిగా నవుతూ బ్రతికితే ఈ జీవితం సఫలము రాగసుధ మధురము అవుతుంది

1060)తనను తాను మలచుకొని సర్దుకు పోగాలగినవాడే ఈ ప్రపంచములో బ్రతకటం తెలిసినవాడు

1061)మంచిని తలపెట్టి ఆశయ సాధనకై అడుగు ముందుకు వేస్తే జయం వెన్నంటేవుంటుంది.అపజయం ఆమడ దూరం పారిపోతుంది

1062)ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే.

1063)విజయం తలుపు తెరిచేవరకు విసుగే చెందకు...విసుగే చెంది నిస్పౄహతో నీ వెనుకే చూడకు ...చిందే చమట చుక్కకు సైతం ఉంది ఫలితమే...అది అందే వరకు సహనంతో సాగాలి మన జీవిత పయనమే

1064)కాయలు కాచిన చెట్టు కొమ్మలు వంగి వేలాడుతుంటాయి. గొప్పవాడివి కావాలనుకుంటే వినయంగా, నిరాడంబరంగా ఉండాలి

1065)ఒక మంచి వాక్యం రాస్తే దానిని ఎంతోమంది చదువుతారు. వాళ్లు చదివేటప్పుడు చదువు రాని వాళ్లు విని తెలుసుకుంటారు. వాళ్లు చెప్పగా మరికొంతమందికి తెలుస్తుంది. అలా అది లక్షలమందికి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఆ మంచివాక్యంలోని విషయం అన్ని మెదళ్లకు చేరుతుంది. ఆలోచింప చేస్తుంది. ఆ మేరకు వాళ్ల ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అక్షరం అంత విలువైనది

1066)మంచిని తలపెట్టి ఆశయ సాధనకై అడుగు ముందుకు వేస్తే జయం వెన్నంటేవుంటుంది.అపజయం ఆమడ దూరం పారిపోతుంది

1067)సుఖం - దుక్కం , వేడుక-వేదన ,గెలుపు -ఓటమి ,లాభం -నష్టం వీటి సమ్మేళనమే జీవితం .గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా,ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా సమతుల్యతతో జీవితం సాగించే ప్రతి మనిషి గొప్పవాడే అన్నాడో మహా కవి.

1068)మేఘంనుంచి జాలువారిన ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది

1069)హరివిల్లులో ఏడు రంగులుంటాయి. ఆ సప్తవర్ణాల సమ్మేళనంతో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. ఆ హరివిల్లు ఏర్పడాలంటే ఎండావానా రెండూ కావాలి. సంతోషం దుఃఖం, మంచి చెడు, ఆశ నిరాశల సమ్మేళనమే జీవితం. అలా ప్రతికూల, అనుకూల పరిస్థితులతోనే ప్రతి జీవి బతుక్కీ స్థిరత్వమూ, సార్థకతా! అవే మనిషిని స్థితప్రజ్ఞుడిగా నిలబెడతాయి. అందుకే జీవితం ఒక హరివిల్లు

1070)మనం ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకు దక్కుతుంది. ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ. ఈ లోకం నుంచి ఏది కావాలని కోరుకుంటామో అదే లోకానికి ఇవ్వాలి. మనం కోరుకున్నదే మనకు దక్కుతుంది. 'యద్భావం తద్భవతి'. మనం శుభం జరగాలని మనసా వాచా కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచే జరగాలని కోరుకుందాం. సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!

1071)కష్టాలు ..కన్నీళ్లు ..సంబరాలు …కేరింతఃలు....ఇవి అన్ని ఒక మనిషి జీవితం లో ఉంటేనే కదా ఆది పరిపూర్ణం అవుతుంది ….!! :)


1072)తీసుకోవడం కన్నా ఇవ్వడంలోనే సంతృప్తి వుంది. అధికారం కన్నా సేవే పవిత్రం

1073)ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తునప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని,దానినొక అవమానంగా భావిస్తూ క్రుంగిపోవడం కంటే స్థిరచిత్తంతో అవమానాల్ని సైతం ఎదుర్కుంటూ సాగిపోయినవారే జీవితంలో విజేతలుగా మిగులుతారు.

1074)మంచి ఆలోచనలకి మనస్సు తలుపులెప్పుడు తెరిచే ఉంచాలి.చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిరచిత్వంతో మనస్సును అడుపులో పెట్టుకున్నవాడికి ప్రతి కార్యంలోను విజయం చేకూరుతుంది.శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది

1075)పట్టుదలా , పరిశ్రమా ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధించండి. కష్టపడితే విజయం మీ కోసం ఎదురుచూస్తుంటుందని మరిచిపోకండి

1076)మంచి ఆలోచనలకి మనస్సు తలుపులెప్పుడు తెరిచే ఉంచాలి.చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిరచిత్వంతో మనస్సును అడుపులో పెట్టుకున్నవాడికి ప్రతి కార్యంలోను విజయం చేకూరుతుంది.శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది

1077)సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము,అందుకని నీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు.

1078)కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు

1079)ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోకుండా అయిన దానికి, కానిదానికి అహంకారం తో విర్రవీగడం, ప్రతీవారు తన కంటే అల్పులని భావించి మిడిసిపడితే అది వారి పతనానికే నిదర్శనం అని గుర్తుంచుకోవాలి. వినయ విధేయతలు మనిషికి అందానిచ్చే ఆభరణాలు..

1080)ఆడదాన్ని గౌరవించడం పురుష లక్షణం, అలా గౌరవించని మగాడు పురుషుడూ కాడు మానవుడూ కాలేడు...
- విశ్వ..!

1081)విజయం సాధించుటకు తగిన మూల రహస్యం,సూత్రం తమలోనే వున్నదని గ్రహించి పట్టుదల, దీక్ష తపనలతో క్రమబద్ధమైన ప్రణాళికతో ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ ముందుకు సాగిన వారికే అనితర సాధ్యమైన విజయాలు సొంతమవుతాయి

1082)ప్రేమించాలనే కోరిక అందరికీ ఉంటుంది కాని ప్రేమించగలిగే అర్హత కొందరికే ఉంటుంది...! విశ్వ..!

1083)నిజాయితీగా పని చేసేవారికి కాలం తప్పక అనుకూలిస్తుంది .కాకపోతే సహనం తో వేచి వుండాలి.

1084)పాలకులు నిష్పక్షపాతం గా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బంధుప్రీతికి, అవినీతికి తావ్వివక నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే దేశం అత్యున్నతం గా పురోగమిస్తుంది.

1085)జీవితానికొక గమ్యం, లక్ష్యం చాలా ముఖ్యం.ఆ లక్ష్య సాధనకు నిర్ధుష్ట్యమైన ప్రణాళిక ఉండి శక్తి సామర్ధ్యాలను కూడ గట్టుకొని కష్టాలకు,సమస్యలకు చెదరక చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం తో కార్య సాధనే ధ్యేయం గా ఏకోన్ముఖం గా
ముందుకు సాగితే అనితర సాధ్యమైన కార్యములను సాధించుట సాధ్యం." కృషితో నాస్తి దుర్భిక్షం."

1086)మనిషి ఓ పని మొదలు పెట్టాక ఒక్కోసారి ఫలితం కనపడకపోవచ్చు.అయినా మనోబలంతో అదే పనిని తదేకంగా చేస్తూపోతే తప్పక ఫలితం చేకూరుతుంది .మనిషి తన మార్గాన్ని మార్చుకోవచ్చు కానీ,లక్ష్యాన్ని మార్చుకోకూడదు ..అదే విజేతల లక్షణం.

1087)ప్రయత్నిచకుండా,శ్రమించకుండా కీర్తిశికరాలను అధిరోహించినవారు ఎవ్వరు చరిత్రలో లేరు ,కాబట్టి కష్టే ఫలి:,నువ్వు ఎంత కష్టపడతావో అంతే ఫలితం

1088)రేవులో వుండడం ఓడకి క్షేమమే .కానీ ఓడ తయారుయ్యింది రేవులో ఉండడానికి కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి లక్ష్యాలని మర్చిపోకుండా గమ్యాలని చేరుకునేల ప్రయత్నించాలి.

1089)ఉన్నవాడికి ఎన్ని మేడలున్న చాలదు,ఎంత బంగారమున్న తృప్తి చాలదు ,ఎంత ఆదాయం వస్తున్న సరిపోదు ,వారెవరికో ఇంత వుంది కనుక తనకు రావట్లేదన్న బాధతో అశాంతి తో తను సంతోషంగా వుండలేకున్నాడు.
ఉన్న స్థితిలో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళినా ,ఎలా మారినా సంతోషంగా ఉండలేవు. ,ఉన్నంతలోనే ప్రతిఫలం ఆశించకుండా ఇతరులు యొక్క కష్టాలని తమ కష్టాలు అని పంచుకున్నప్పుడే పరిపూర్ణ ఆనందం దక్కుతుంది.సంతోషమనేది ఒక మానసిక స్థితి మాత్రమే అది ఎక్కడ నుంచో రాదు.

1090)మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలనీ ,అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయేగానీ ,స్థిరంగా ఉండవనీ ప్రతి ఒక్కరు గ్రహించాలి

1091)జీవితం ఒక ఆట – ఆడి గెలువు
జీవితం ఒక ప్రయాణం – కొనసాగించు
జీవితం ఒక యుద్ధం – పోరాడి గెలువు
జీవితం ఒక బహుమానం – స్వీకరించు
జీవితం ఒక రహస్యం – పరిశోధించు
జీవితం ఒక నాటకం – నీ పాత్రను ప్రదర్శించు
జీవితం ఒక చాలెంజ్ – ధైర్యంగా ఎదుర్కో
”జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది”
వెనకడుగు వేయకు – ముందడుగేసి ఆగకు

1092)ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండాదొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.నిరంతర ప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు

1093)అరుదుగా వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నవాడే తెలివైనవాడు

1094)ఆచరణ లేని ఆలోచన,ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి కారణాలే అవుతాయి.

1095)కృషి వుంటే మనుషులు ఋషులు అవుతారు.ఏ మనిషి విజయంలోకి తొంగి చూసినా ,కనపడేది ఒకే ఒక సూత్రం "కృషి" ..అది ఉంటె జీవితంలో పైకి వస్తాం,అది వుంటే ఒక మార్గంలో అపజయం పొందిన వేరే మార్గం లో తప్పనిసరిగా విజయం చేకూరుతుంది ..."కృషితో నాస్తి దుర్బిక్షం"

1096)మనం జీవితాన్ని క్యాజువల్గా తీసుకుంటూ పోతే జీవితం కూడా మనకంత నిరాసక్తతనే ఇస్తుంది. దానికి కొత్త అనుభవాలు ఇవ్వడం ప్రారంబిస్తే అది వాటి ద్వారా మార్చి మనకి కొత్త అనుభూతులను ఇస్తుంది. ఈ చిన్న విషయం గ్రహిస్తే జీవితంలో బోర్కి చోటే వుండదు. అందుకే కొత్తను చూసి భయపడకండి. ఆహ్వానించండి

1097)అద్దాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులోనే అన్ని వస్తువులు కనపడతాయి. అలాగే మన ఆలోచనలకు ఏ రంగు పులుమితే అదే రంగులో జీవితం కనపడుతుంది

1098)ఒక మనిషి ఇంకో మనిషి కి చేరువైతే మనసుకి దూరం అవుతాడు ...
అదే మనిషి ఒంటరి వాడైతే తన మనసుకి చేరువవుతాడు...
ఒక మనిషితో తన మనసు పడే అంతర సంఘర్షనే "ఒంటరితనం"

1099)సమస్య అనేది లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు .మీరెప్పుడు ఓడిపోలేదంటే ,మీరెప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని అర్ధం..

1100)పరిపూర్ణ ఏకాగ్రత లేనిదే ఏ పనిలోనూ విజయం సాదించలేం

1101)ప్రేమాభిమానాలతో మానవ సంభంధాలు మెరుగు పడుతాయి...."ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును ..ద్వేషించిన,వడ్డీతో సహా ద్వేషం తిరిగి వచ్చును..కాబట్టి అందరిని ప్రేమించండి ..అందరి చేత ప్రేమించబడతారు

1102)సహనం చేదుగానే ఉంటుంది.కానీ దాని ఫలితం చాలా తియ్యగా ఉంటుంది..కాబట్టి సహనో రక్షతి ఫలితః అని అంటున్నాను

1103)మంచి గుణాలు గలవాడు మరణించినా,కీర్తితో జీవించే ఉంటాడు.చెడు నడక గలవాడు జీవించి ఉన్న మరణించినవాడితో సమానమే.కేవలం చావుపుట్టుకలతోనే కీర్తి పొందే మనిషి జీవితానికి ఏ సార్ధకతా ఉండదు.తన పుట్టుకవల్ల తన వంశానికీ,చుట్టూ ఉన్న సమాజానికీ,విశాల ప్రపంచానికీ ఎవడు మేలు కలిగిస్తాడో వాడే నిజంగా పుట్టినవాడి కింద లెక్క లేకుంట్ అలాంటివాడు వ్యర్ధజీవే

1104)బంగారం పై ఎన్ని దెబ్బలు వేసినా అది హారమవుతుందే తప్ప బూడిద కాదు.అలాగే ప్రతి ఒక్కరు మనోనిగ్రహంతో కూడిన ఒక నమ్మకం,పట్టుదల ,సహనం,దైవం మీద విశ్వాసం,ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పక నిన్నే వరిస్తుంది....ఎటువంటి సమయంలోను నీలోని ఆత్మస్థైర్యాన్ని

1105)కన్నుల్లో బాసలే కాని నీ ఊసులు లేవు......గుండెల్లొ బాధలే కాని నీ భావాలు లేవు...

1106)కన్నుల్లో కారే బాసలకే తెలుసు నీ ఊసుల జ్ఞాపకాలు.....గుండెల్లో నిండిన బాధలకే తెలుసు నీ భావాల గుర్తులు.....

1107)నేను కలలో ఉన్నాను కలతలో ఉన్నాను కానీ నీ పేరు కలవరిస్తూ ఉన్నాను....
ఏ పయనం ఎటు సాగునో ఎవరికెరుక ఈశ్వరా... నీ నావకు చుక్కానివి నేవేనోయి సోదరా...

1108)రాతికి రూపం ఇస్తే దేవుడైతే.....దానికి మనసిస్తే మనిషి.......అదే మనిషి గొప్పతనం....

1109)కళ్లను తడిపిన నీళ్లకు తెలుసు మనసులో కలిగే ఆనందం బరువెంతో....
ప్రేమ నేర్పించేది పాఠం కాదు....గుణ పాఠం.....వివేక్

1110)కలలు కనే కళ్ళు నావి .. నా కళ్ళు కనే కలలు నీవి .

1111)ప్రపంచాన్ని శాసించే అంత మొండితనం నాకున్నా.....నీ మౌనాన్ని భరించే శక్తి మాత్రం లేదు...

1112)వలపు చేసిన దాడిలో నేను కోల్పోయిన ధనం.....దరహాసం!!!!...

1113)నా గుండెలో నీ జ్ఞాపకం, ఒక మధుర సంతకం .....

1114)నీ చిరునవ్వు ఉంటె చాలు నా తోడూ , జయిస్తాను ఈ విశ్వాన్ని సైతం ఓ నాడు
1115)నువ్వే రానప్పుడు నీ ఊహలతో పనేంటనీ దయతో వాటికి చెప్పవ వచ్చే శ్రమ తీసుకో వద్దనీ. -జిగర్ మురాదా బాదీ
1116)కాలం కరిగి మన మధ్య దూరం పెరిగినా... నేస్తమా అన్న పిలుపు చాలు నే నిన్ను చేరడానికి...

1117)ప్రేమంటే కన్నీళ్లతో కరిగేది కాదు........ఆ కన్నీటికి దొరకనిది.....

1118)గుండెల్లో కసిఎగసి ఆకాశాన్ని అంటితే ఎంలాభంఅంతా శూన్యమే కనిపించెను...... ఎండినకనుపాప వర్షించే ఆఖరికన్నీటి బొట్టులోఆర్తనాదం ఎవరికీ వినిపించును

1119)పగలే వెన్నెల కురిస్తే.. సంద్రంపై నడిస్తే.. మేఘాలు రాగాలు తీస్తే.. చందమామ గోగుపూలు తెస్తే..
అందని అందమైన ఊహాకీ అంతం లేదు..!
1120)అట్టుడికే నగరాలూ అలుపెరుగని విలయాలు..ఇంకెక్కడి స్వేచ జీవనం

1121)మరణమంటే చనిపోయిన తరువాత నరాల్లో నెత్తురు కదలక పోవడం కాదు,బతికి వున్నపుడు అను మాత్రం స్పందించక పోవడం ......

1122)హార్దికంగా దెబ్బ తిన్న వాడికి చెయ్యాల్సింది ఆర్దిక సహాయం కాదు...మాట సహాయం... నేనున్నాననే గుండె ధైర్యం.........వివేక్

1123)కాలం కలిసిరాకపోతే బెల్లం లాంటి పెళ్ళం కూడా అల్లంలా ఘాటుగా ఉంటుంది...! విశ్వ..!

1124)ప్రతి పదం నా కలంలోంచి వచ్చినా...దాని భావం నువ్వు కనిపించిన కలల నుండి వచ్చింది...వివేక్

1125)ప్రేమంటే కలిసున్నప్పుడు కలిగే ఆనందం కాదు...దూరంగా ఉన్నప్పుడు పుట్టే బాధ...వివేక్

1126)గుడిలో ఉండే దేవుడి కన్నా..నా గుండెల్లో ఉండే నా తల్లి మీదే నాకు ప్రేమ ఎక్కువ.......

1127)కాగితం ఏం వ్రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది. కాని కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయ్.

1128)గుండెకు తగిలిన గాయం పేరు నీ దూరం.....ఊపిరి పోయే వేదన పేరు నీ మౌనం...వివేక్

1129)ని ప్రతీ గ్యాపకం గాయమై వేదిస్తూ ఉంటె .. నిన్ను మరువాలని నేను చేసే ప్రతీ ప్రయత్నం నన్ను చూసి నవ్వుతుంది ప్రియతమా....

1130)కోపం కల్లలో ఉండాలి...బాధ గుండెలో ఉండాలి...పెదాలపై ఎప్పుడు చిరునవ్వు ఉండాలి...

1131)నా కంటి నుంచి రాలిన ఒక్కొక్క అశ్రువు ఒక్కో కధ చెపుతుంది...

1132)కులం అంటే పుట్టడానికే కానీ బతకడానికి పనికిరానిది...వివేక్

1133)ప్రేమ మైకంలో కలిగే మత్తు గమత్తుగా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను...
నీ పరిచయం అయ్యాక ప్రణయంలో దాగున్న మర్మాన్ని గ్రహించా ప్రియా...! విశ్వ..!

1134)గుండెని తడితే తగిలే గాయం పేరు నీ విరహం..మనసును తడితే కలిగే స్పందన పేరు నీ ప్రణయం...వివేక్

1135)నీ కన్నుల అలల్లో చూసా నాపైన ఉన్న సంద్రమంత ప్రేమ......వివేక్

1136)నీ కళ్లలో ప్రపంచాన్ని చదివేంత అర్ధం ఉంది...ఆ కన్నీళ్లలో ప్రపంచాన్ని ముంచేంత ప్రళయం ఉంది....వివేక్

1137)ఈ ప్రపంచంలో ఉన్నవి రేండే కులాలు...ప్రేమ,ద్వేషం....ప్రేమ కోసం చచ్చిపోతారు..ద్వేషం కోసం చంపుతారు....వివేక్

1138)మార్పు..కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.కొత్త సవాళ్ళను విసురుతుంది.ఆ అవకాశాలను అందిపుచ్చుకుని సవాళ్ళను సవాల్ చేసేవారే చివరికి విజేతలుగా నిలుస్తారు!..
1139)వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాము పోయేటప్పుడు ఏమి తిసుకుపోము ...ఇది అర్ధం చేసుకున్నవాడు సమాజానికి మంచి చేస్తాడు....king
1140)మిత్రమా నువ్వు చెసే పనిలో నిన్ను నువ్వు నమ్ముకో..నీ కన్నా ఎక్కువగా ఎవరిని నమ్మకు...ఎందుకంటే చీకటి పడితే నీ వెంట నీ నీడ సైతం రాదు..కింగ్
1141)శిష్యులకు ఎం బోధిస్తున్నడో.. దాన్ని స్వయం గా ఆచరించి చూపించే వాడె నిజమైన గురువు....వివేకానంద...


1142)హిందువులు తమ గత చరిత్రను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే వారి భవిష్యత్తు అంత ఉజ్వల స్థితి పొందుతుంది...స్వామి వివేకానంద...
1143)మనం చేసే పని మంచిదా చెడ్డద అనేది...మనం చెసే పని లో కాదు చూసే దృష్టిలో ఉంటుంది ..................కింగ్...."
1144)ఎదుటివాడిని ఎప్పుడు తక్కువ అచ్చనవేయకూడదు ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుది అని...కింగ్...
1145)ప్రపంచమంతా నిన్ను దూరంగా వేలివేసినపుడు నికు తోడుగా ఉండే వాడె నిజమైన స్నేహితుడు అంటారు ...ఆ నిజమైన స్నేహితుడు కూడా దూరం ఐన
1146)మస్కరానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు...కానీ ఇది పెద్దవాళ్ళ దగ్గర ఆశించడం తప్పు కదా ...కింగ్....
1147)కండ బలం లేకపొయినా ఫర్వాలేదు,తెలివితేటలు లేకపొయినా ఫర్వాలేదు.మార్పును స్వాగతించే ధైర్యం,మార్పును జీర్ణించుకునె నైజం,మార్పుకు పెద్దపీట వేసె గుణం ..ఇవి చాలు మనం జీవితంలొ ఎదగడానికి .
1148)ఒకరి గుణగుణాలను పరీక్షించి చూడాలనుకుంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే సరిపోతుంది.
1149)సృష్టిలో అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద..ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు అ సంపద ఉన్నా లేనట్లే.ఉన్నవారికి ,లేని వారికి కావాల్సిన ఏకైక సంపద ఆరోగ్యం...ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి...ఎందుకంటే ఆ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి..
1150)తెలివిగలవారు తాము చేయదలచుకున్న పనికి అవకాశం మీద ఆదారపడరు
1151)'ప్రేమ ' ఒక కల లాంటిది ,అది ఎప్పుడైనా చెదిరిపోవచ్చు 
1152)'పెళ్లి ' ఒక వల లాంటిది ,ఆ బంధం ఎప్పుడైనా విడిపోవచ్చు 
1153)కానీ 'స్నేహం ' ఒక నీడ లాంటిది,అది నిన్ను ఎప్పుడు వీడిపోదు ,అదే మరి "స్నేహమంటే"
1154)కష్టసుఖాలు పగలూ రేయిల్లాంటివి. అవి ఒకదాని తరువాత ఒకటి వచ్చి పోతుండడం సహజం. కాబట్టి కష్టం వచ్చినా ,సుఖం వచ్చినా "ఇదీ మారుతుంది" అని గ్రహించగలిగిన వాడు ప్రశాంతంగా జీవించగలడు
1155)కల్మషం లేని ఒక మనసు చాలు మన మోములో నవ్వురావడానికి ... 
1156)మనసుని విరిచే ఒక మాట చాలు కంట్లో నీరు రావడానికి .. కల్మషం లేని మనసుతో అందరిని అర్ధంచేసుకొని ఆనందంగా గడుపుదాం.... అందరిని ఆనందంగా ఉంచుదాం...
1157)గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు గౌరవం కలిగిన వారు అన్నింటిలోను విజయం పొందుతారు.
1158)"ఏదైనా వస్తువు లేదా మనిషి విలువ మనం దానికి కోల్పోయినప్పుడే మాత్రమే తెలుస్తుంది.. కానీ నిజమేంటంటే అప్పుడు ఎంత బాధపడ్డా అది తిరిగిరాదు...."
1159)కలిగా ఉంటె కర్చు పెట్టాలి అనిపిస్తుంది కానీ సంపాదించాలి అని అనిపించదు...ఆకలితో ఉన్నవాడే బాగుపడేది..ఆకలితో ఉన్నాము కదా అని ఆగిపోకుడదు..
1160)విజేత వెనుక ఉండేది అదృష్టమో ,మంత్ర దండమో కాదు .. చక్కని ప్రణాళిక , కటిన శ్రమ ,
1161)అంకిత భావం ".. "వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి ,ప్రపంచాన్నే సైతం తన అభీష్టానికి అనుగుణంగా మలచుకుంటాడు "
1162)చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేమోనన్నభయం వెంటాడుతుంటుంది.భయం అంత శక్తివంతమైనది.కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమయినది.నమ్మకం తో మొదలుపెట్టిన పనులవల్ల విజయం ఎప్పుడూ... నీతోనే ఉంటుంది
1163)పక్షికింత ధాన్యం.. పశువుకింత గ్రాసం.. సాటి మనిషికింత సాయం.. వీటికన్నా గొప్ప పూజలు ఏమైనా ఉన్నాయా ఈ లోకం లో.....
1164)ద్వేషంతోకాక ,ప్రేమతోనే ఏదైనా సాధించగలం.శత్రువులను సైతం మిత్రులుగా మార్చే మహత్తర తత్త్వం ప్రేమలోనే ఉంది.ప్రేమ,సేవాతత్వం,మానవత్వం ఇవే జీవితానికి సోపానాలు
1165)పది మందికి మంచి చేయాలి అనుకో అంతే కానీ ఆ పది మంది నికు మంచి చేయాలి అనుకోకు...అది స్వార్ధం అవుతుది..
1166)పది మంది చెప్పింది నువ్వు వినలనుకోవటం వివేకం... నువ్వు చెప్పిందే పది మంది వినాలి అనుకోవటం అవివేకం..
1167)ఏదైనా పని చెసే ముందు వందసార్లు ఆలోచించమంటారు.. ఆత్మహత్య ప్రయత్నం ( ప్రేమించే ) చెసే ముందు నీ తల్లి ద్రనుల గురించి ఒక్కసారి ఆలోచించు చాలు.........
1168)గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసిన వ్యర్ధమే...అలాగే లక్ష్యం లేని జీవితం ఎన్ని రోజులు బ్రతిక వ్యర్ధమే....కింగ్...
1169)సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం ఎప్పుడూ సత్ఫలితాలను ఇస్తుంది.ఆలస్యమే కాదు,ఆలక్ష్యం కూడా పనికి రాదు.అప్పుడే లక్ష్యాన్ని సాధించాగాలుగుతాం.
1170)మనిషికి అనుమానమే రోగం ..నమ్మకమే వైద్యం.........అనుమానమనే రోగానికి నమ్మకమే ఒక వైద్యం...
1171)పుట్టామా పెరిగామా పోయామా అనేలా ఉండకూడదు, పదిమందిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొనేదే నిజమైన జన్మ...! విశ్వ..!
1172)విజయం అనేది ఒక్కరోజులో రాదు.....ప్రతి క్షణం శ్రమించేవాడే విజయం సాధిస్తాడు......
1173)మితిమీరిన ధనం అమిత ప్రమాదాలకు దారి తీస్తుంది.ధనం బాగా సంపాదించేవారు వేదన చెందుతూనే ఉంటారు.చాలినంత సంపాదనతో జీవించేవారు మరింత తృప్తిగా రోజులు గడుపుతుంటారు. శాంతి,సామరస్య,సౌజన్యతే వారి పొదుపు.ప్రేమానురాగాలే వారి బ్యాంకు ఖాతా.
1174)కళలు కంటే సరిపోదు...నేరవేర్చుకోవాలన్న ఆలోచన పట్టుదల నిలో ఉండాలి..... అప్పుడే నీ కల నిజం అవుతుంది ...
1175)తక్కువ మాట్లాడడం ,ఎక్కువ వినడం వివేకవంతుని లక్షణం.
1176)జీవించే కొద్దికాలం గౌరవంగా జీవించాలి.లేకపోతే మనిషికి పశువుకూ తేడాయే లేదు.భగవంతుడు మనకు ప్రత్యేకంగా బుద్ధీ ,హ్రుదయమూ ఇచ్చాడు.ఈ రెంటికి విజ్ఞత,విద్య,వినయం తోడైతే వాళ్ళ జీవితం కళ్యాణమయమే.
1177)మనం తెలివిగాలవారమైనా ,సమర్దులైనా - చేసే పనిపట్ల తగిన మానసిక అనుకూల్యత లేకపోతే మనలోని మిగిలిన నైపుణ్యాలన్నీ వృధా అయిపోతాయి .కాబట్టి చేసే పని మీద ఏకాగ్రత ఉంటె తప్పక విజయం తధ్యం!!!
1178)ఒకరి పై ఆధారపడి ,వారి కోసం వేచి చూసేకంటే ,మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది.సక్రమంగా పూర్తవుతుంది.ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురుచూడటంకంటే ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి.పనిని కష్టపడి చేస్తునట్లుగాగాక ఇష్టపడి చేస్తే ,అప్పుడు ఎంత పెద్ద పనైనా శ్రమ అనిపించదు.
1179)పాలను మించిన గొప్ప వస్తువు వేరొకటి లేదు.ఎందుచేతననగా తనతో కలిసినంతమాత్రం చేతనే నీటిని తనతో సమనామైన దానినిగా చేస్తుంది.ఇలానే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరని సమానంగా చూడాలి
1180)"కనిపించని ఆ దేవుడు కేవలం ""అమృతం"" తో సరిపెట్టుకుని!
కని పెంచమని ఆ ""అమ్మ"" ని మనకోసం నేలకు పంపాడు!!
అంతటి అమూల్యమైన కానుకని..మనం సదా ప్రేమించాలని కోరుకుంటూ
ఈ ప్రపంచంలో మాతృమూర్తులందరికి ""మదర్స్ డే"" శుభాకాంక్షలు .."

1181)ఆలోచన అనేది ఉత్తమం, అనాలోచన అనేది వినాశకరం, ఆలోచన ఆచరణకు మార్గదర్శకం - డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం (మాజీ భారత ప్రధమ పౌరుడు)Thinking is a process, Non-thinking is destruction, Thinking leads to action

1182)టన్ను సిద్ధాంతం కన్నా గ్రాము పని గొప్పది
1183)మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాడుకునే వాడు జీవితం లో ఎప్పటి బాగుపడడు ...కింగ్ ..."
1184)ఒక మంచి పని చేసి ఊరుకో .. దాని బాగోగుల గురుంచి చర్చించు కావలసింది నీవు కాదు ,ఇతరులు
1185)జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనది .ఏదైనా కోల్పోవడానికి క్షణం పట్టదు .దాన్ని తిరిగి సాధించాలంటే దశాబ్ధమైన చాలకపోవచ్చు .
1186)గెలవాలనే ప్రయత్నాన్ని ఆపేయడమే మహా వైఫల్యం..లక్ష్యాన్ని చేరే దాక ప్రయత్నిస్తూనే ఉండాలి
1187)జీవితంలో నువ్వంటే నమ్మకం లేని వాణ్ణి మోసం చేయి అంతే గాని నిన్నే నమ్మకం గా భావించే వాణ్ణి మోసం చేయకు......కింగ్...
1188)నేను మనిషి కన్నా ఎక్కువగా బాగావంతున్ని నమ్మాను...ఏదొక రూపం లో వచ్చి కాపాడతాడు అని..చివరకు తాను మనిషి రూపంలోనే వచ్చాడు..
1189)నువ్వు ఉన్నప్పుడు పొగిడే ( తిట్టే ) నలుగురి కన్నా నువ్వు పోయాక నిన్ను మోయడానికి సరిపోయే నలుగురిని సంపాదించుకో...........కింగ్...
1190)ఓటమి అంటే పని పూర్తి కాకపోవడం కాదు,అదే పని చెయ్యటానికి ఉన్న వేరే మార్గం తెలియకపోవటం.
1191)నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. యుక్తుడుకానివానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేనివాడికి శాంతి లేదు. శాంతి లేనివాడికి సుఖమెక్కడ?
1192)ఒక క్లిష్టమైన పని ప్రారంభించటం వల్ల కష్టలోస్తాయేమోనని భయపడకండి.ఏ పనిలోనైన కష్టం ఉంటుందని ,కష్టం లేకుండా ఏ విజయమూ సాధించబడదన్న చిన్న విషయం మీకింత కాలమూ తెలియనందుకు భయపడండి. ప్రతి ఓటమికి వెనకవున్న కారణమే ఈ భయం ,ఇది తెలుసుకున్న వారికి ఓటమే లేదు.
1193)తప్పును ఒప్పుగా చూపాలనుకుంటే కాలం నీ మూర్కత్వాన్ని చూసి నవ్వుకుంటుంది.
1194)శ్రద్ధతో చేసే పనులు క్రమపద్ధతిలో ఉండడమే కాదు పని చేసేవ్యక్తికి ఏకాగ్రతత్త, అనుభవజ్ఞానాన్ని ఇస్తుంది
1195)మంచి కార్యాలు చేయలేకపోయనా చేసే వారికి కాస్త సాయం చేయగలిగినా కూడా మంచి పనులు చేసినట్టు అవుతుంది. మనిషి జన్మ పొందిన వారు వారి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. దానికి మనసావాచా సిద్ధపడాలి. ప్రకృతిలోని చెట్టు చేమాలాగా, నీరు గాలి లాగా పరోపకార జీవనులై మెలుగుతూ నలుగురికీ మంచిచేసి పనులు చెయ్యాలి . వారు ఒకవేళ మరణించినా బతికున్న వారితో సమానం అవుతారు.
1196)ఓర్పు, ఓరిమి, సహనములు, కోల్పోయినట్లయితే ఎంతోకాలం శ్రమించి, కష్టించి, కృషిచేసి సంపాదించిన మంచిపేరు, ప్రతిష్ఠలు ఒక క్షణంలో మటుమాయం అయిపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు. దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఈ మంచి గుణాలు లోపించినందువల్లనే ఎంతోమంది ఎందుకూ పనికి రాకుండా పతనమై పోయారు.
1197)ఎవరైనా ఓ పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంతవరకు పట్టుదల వీడకూడదు. అదే కార్యదీక్ష. అందుకు దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం అవసరం
1198)"ద్వేషం వద్దు,అది హృదయాన్ని నాశనం చేస్తుంది
దురాశ వద్దు,అది సంస్కారాన్ని దిక్కరిస్తుంది
భేదభావం వద్దు,అది మనుష్యుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది
స్వార్ధం వద్దు,అది జీవితాన్నే మింగేస్తుంది
ఇవన్నీ వద్దునకునే ప్రతి మిషి గొప్పవాడే"
1199)ప్రతి మనిషికి కొన్ని ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ ఆశయాలను, లక్ష్యాలను సాధించడానికి తగినంత సామర్థ్యం ఉండి తీరాలి. ఆ సామర్థ్యాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో తెలిసుండాలి. అంతేకాని, పెద్ద పెద్ద ఆశయాలు, లక్ష్యాలను పెట్టుకొని తగిన సామర్థ్యం లేకుండా వాటిని సాధించడానికి కృషి చేస్తే అవి ఘోరంగా విఫలమవుతాయి "కృషి "తో నాస్తి దుర్బిక్షం
1200)ఆకాశం నీ హద్దు ..ఏ అవకాశం వదలొద్దు ! విజయం ఊపిరిలా జీవించు! ప్రతి క్షణం సాధన లో పరవశించు!
1201)మనిషి మంచికి బానిస కావలేగాని,చెడుకు బానిసగా మారకూడదు.మనిషి పతనం సమాజానికి మచ్చవంటిది.ఆ మచ్చ బాహ్య సౌందర్యానికి చెడగొట్టి,అంతస్సౌన్దర్యాన్ని హరించివేస్తుంది
1202)కష్టం దేవుడిచ్చిన వరం...సుకం మనిషి చేసుకున్న పాపం.ఎందుకంటే కష్టం తరువాత వచ్చే సుకం విలువ చాల గొప్పది..సుకపడిన తరువాత వచ్చే కష్టం బరించలేనిది ..
1203)జీవితంలో ఏదైనా సాదించాలని అందరు అనుకుంటారు ..అనుకోవడం దగ్గరనే ఆగిపోకుండా ,ఆచరణలో ముద్నుకు పోగలగడం ఎంతో అవసరం.సరైన ఆలోచనలతో, ప్రణాళికబద్ధంగా ప్రయత్నించడమే .విజయావకాశాలను మెరుగుపరుస్తుంది.
1204)కష్టపడి సాధించిన దానిలో ఉన్న తృప్తి అయాచితంగా సంపాదించిన దానిలో పొందలేము. ఒకవేళ అలా సంపాదించినా చివరికి అది నిర్వీర్యమైపోతుంది. అందుకే పెద్దలు ‘కష్టే ఫలి’ అని పదే పదే చెబుతుంటారు. దీనికి అర్థం కష్టపడినవాడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు అని. ఇది కొన్ని సందర్భాలలో ముందు వెనకలుగా ఉంటుంది. కానీ ఫలితం మాత్రం చాలా సంతృప్తిని మిగుల్చుతుంది. సంతృప్తి లేని జీవితం వృధా !!
1205)ఇష్టపడిన వారిని ఇష్టం తోనే గెలవాలి గాని ఇతరులను కష్టపెట్టి కాదు....ఇతరులను కష్టపెట్టి గెలుచుకున్నది ఏదీ మనకు దక్కదు
1206)నీ పై నీకు నమ్మకం ఎప్పటికీ పోకూడదు .ఎన్నిసమస్యలువచ్చినా పరిష్కారం ఆలోచించాలి కాని విచారిస్తూ వుంటే సమస్య తీరదు. నేను చేయగలను అనే నమ్మకం మనల్ని విజయ సోపానాల్ని ఎక్కిస్తే నేనే చేయగలను అనే అహంకారం మనల్ని అధోగతి పాలుచేస్తుంది.
1207)విజయాన్ని కోరే వ్యక్తులు రెండు విషయాలు మరచిపోరాదు. ఒకటిమౌనం,రెండు చిరునవ్వు.చిరునవ్వుసమస్యలను పరిష్కరిస్తీ మౌనం సమస్య రానీయదు.
1208)ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి .దారిలో మీరు కింద పడి పోవచ్చు ,ఊపిరి అందాకా పోవచ్చు ,కాళ్ళు నొప్పి పుట్టవచ్చు కానీ పరుగు ఆపకండి కచ్చితంగా ఏదో ఓ చోటికి చేరతారు .అంతే కానీ మీరు మొదలు పెట్టకముందే పడిపోతే ఎలా ,ఎవరినా నవ్వితే ఎలా అని ఆలోచిస్తువుంటే ఉన్న చోటే వుంది పోతారు
1209)ఏకాగ్రత అంటే పక్షి కన్నును మాత్రమె చూస్తూ కొట్టడం కాదు .తోటను చెట్టును పండ్లను చూస్తూ పక్షి కన్నును కొట్టడం నిజమిన ఏకాగ్రత .
1210)సలహాలు తీసుకోవటం లో ఎలాంటి ఇబ్బంది లేదు కాని ఈ సలహా అనే సుత్తితో మనల్ని ఎలా కోతతరంటే మన శరీరం మెదడు పాతాళానికి కూరుకు పోయి చివరికి ఆలోచించే శక్తిని కూడా కోల్పోతాం
1211)ఒక పువ్వు ఎంత అందమైనరంగులో ఉన్న సువాసన లేకపోతే ఎలా శోభించదో అలాగే ఎన్ని మధుర వాక్యాలు మాట్లాడినా వాటిని ఆచరణలో పెట్టని వ్యక్తి కూడా జీవితంలో రాణించడని పెద్దలమాట .మన నాలుకతో మనం మాట్లాడే మంచిమాటలే మనకు సంపదలను, సన్నిహితులను సమకూర్చగలవు. చెడు మాటలైతే మనకు బంధనాన్నీ, మరణాన్నీ కూడా సంప్రాప్తింపజేయగలవు.
1212)జీవితం అనే కెమెరా ఎప్పుడు మన మీద ఫోకస్ అయ్ వుండాలి అనుకుంటాం .అది పక్క వాడి మీదకు తిరిగిందంటే అసూయతో రగిలిపోతాం .
1213)జీవితకాలంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఎవరోఒకర్ని ఆశ్రయించక తప్పదు.మనకు ఎన్నో అవసరాలుంటాయి.వాటి కోసం మరొకరిని ఆశ్రయిస్తాం.ఏ ఆశ్రయం లేకుండా మనిషి జీవించలేడు.దేనికోసమైన ఎవరో ఒకర్ని ఆశ్రయించాల్సి వచినప్పుడు సద్గుణుడు సమర్ధుడైన వాడినే ఆశ్రయించాలని పెద్దలు చెప్పిన మాట.సంపదలు కలిగి హీనుడైన మిత్రుడికన్నా సిరులు లేని వివేకవంతుడైన శత్రువుని ఆశ్రయించడం అన్నివేళలా ఆచరణీయం
1214)మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ,నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞాపకశక్తి యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉంటాం. దీని వలన మనస్సే కాక ,శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
1215)ప్రతి ఒక్కరు నచ్చని గుణాలను మార్చుకోడానికి ..నచ్చిన గుణాలను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తే జీవితంలో తప్పనిసరిగా విజయ శికరాలను అధిరోహిస్తారు
1216)మరి తియ్యగా (మంచిగా) ఉంటే నిన్ను మింగేస్తారు. మరీ చేదుగా (చెడ్డగా) ఉంటే ఉమ్మేస్తారు..కాబట్టి ఈ సమాజంలో బ్రతకాలంటే ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి
1217)మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి.
1218)అడ్డంకులు వచ్చాయని కుంగిపోతే అపజయం కలుగుతుంది , వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం తప్పక నిన్ను వరిస్తుంది .
1219)మనం దేనికోసమిన కారణాలు వెతుకుతాం ఎందుకంటే అది మనకు కావాలి.మనం దేన్నైనా వద్దు అనుకుంటాం ఎందుకంటే దానికి కారణాలు మనకు ముందే తెలుసు
1220)స్నేహం చెయ్యడానికి ఒకటికి పదిసార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసివస్తే వందసార్లు అలోచించు.
1221). మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. -
1222)సమాజం నికు ఎప్పుడు ఏమి చేయదు ...అది మట్టి ముద్ద వంటిది..దాన్ని మనం ..మనకు ఉపయోగపడేలా చేసుకోవాలి అంతే...కింగ్...
1223)సమాజం శిల లాంటిది, కోపంగా కొడితే పగిలిపోతుంది.. సహనంతో కొడితే శిల్పం అవుతుంది...! విశ్వ..!
1224)నువ్వు ఏదైనా అవకాశాన్ని వదులుకుంటే నీ కళ్ళను కన్నిరుతో నిప్పుకోకు..అది నీ కళ్ళముందు ఉన్న ఇంకో అవకాశాన్ని కనిపించకుండా చేస్తుంది..కింగ్...
1225)నువ్వు ఏదైనా అవకాశాన్ని వదులుకుంటే నీ కళ్ళను కన్నిరుతో నిప్పుకోకు..అది నీ కళ్ళముందు ఉన్న ఇంకో అవకాశాన్ని కనిపించకుండా చేస్తుంది..కింగ్..."
1226)మనిషి కేవలం తనకోసం తానుకాక, తన విలువైన సమయంలో అమూల్యమైన మాటల్లో, తన సంపదలో తన సేవలో కొంతైనా నిస్వార్థంగా ఏ కొద్దిమందికి అందించగలిగినా కలిగే సంతృప్తి, సంతోషం సమాజంలోని ఏ కొలమానాలకు అందనివి. అందమైన జీవితంలో సద్వినియోగం అన్న పదానికి ఇంతకన్న సార్థకత మరేముంటుంది....Utility of time
1227)తెలివిలేని నిజాయితీ, బలహీనం, నిరుపయోగం. నిజాయతీ లేని తెలివి.. భయానకం, ప్రమాదకరం.
1228)జీవితంలో పురోగతి సాధించాలంటే నిరంతర సాధన,కటోర శ్రమ,క్రమశిక్షణ కలిగి ఉండాలి.ఇవన్నీ ఉన్నవాడికి సాధ్యం కానిదంటూ లేదు.సంకల్పబలంతో,ఆత్మవిశ్వాసంతో ముందడుగువేసి విజయం చేజిక్కించుకున్న ఉదాహరణలెన్నో మనకు చరిత్రలో దర్శనమిస్తాయి.వాటిని స్పూర్తిగా తీసుకొని మనమందరమూ లక్ష్యసాధనకై అడుగులు వెయ్యడమే మనము చెయ్యాల్సిన పని
1229)క్షమించు అనే పధం ఎదుటి మనిషిలో కోపాన్ని దహిస్తుంది...ఎదుటి వారితో వాదులాడటం కన్నా క్షమించు అనటం చాల మంచిది
1230)గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప
1231)గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక. గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.
1232)భూతద్దం పెట్టి సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ఎం చూస్తావు మిత్రమా....నీ మనసు పెట్టి భూమి మీద ఉన్న సామాన్య మానవుని బాధను చూడు...కింగ్...
1233)కొంత మంది జీవితం లో ఏ నిచ్చన ఎక్కలేరు ..వాళ్ళు చేయగలిగేదల్ల నిచ్చన ఎక్కుతున్నవాడు ఎప్పుడు పడతాడో అని ఆశగా ఎదురుచూదడమే
1234)నువ్వు దేన్నైనా ఎంచుకున్తున్నపుడు సరైన దాన్ని ఎంచుకున్నవ లేదా అన్నది ప్రశ్నే కాదు ......నువ్వు దాన్ని ఎంత గాడతతో,ఆత్రుతతో ,శక్తితో ఎంచుకున్తున్నావ్ .నీ వ్యక్తిత్వం స్తిరపడిది అక్కడే
"1235)ఇ భూమి మీద ప్రతి దేవుడికి ఒక్కో రోజు ఉంది పూజ చేయడానికి....కానీ పేదవాడికి సహాయం చేయడానికి ఒక్క రోజు ఐన ఉందా..
చాల మంది చెప్తారు సహాయం చేయడానికి టైం అవసరం లేదు చెసే మనసు ఉండాలి అని...కానీ అది చాల వరకు కుదరని పని...
చాల మంది చెప్తారు నాకు టైం లేకపోవటం వల్ల సహాయం చేయాలనీ ఉన్న చేయలేకపోతున్న అని..అందుకే ఫ్రెండ్స్...పేదవాడికి సహాయం చెసే రోజు నిర్నైచ్చి ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తే ప్రతి వాడు సహయడం చేయడానికి కొంతవరకైన ముందుకు వస్తాడు నా అభిప్రాయం.....
ఇ రోజు చాల సమస్యలను తీరుస్తుంది సహాయం తీసుకునే వాడికి ..అలాగే సహాయం చెసే వాడికి కూడా...."
1236)విజయం ఊరకనే తనంత తాను మనల్ని వరించదు. సాధించేందుకు ఎంతో శ్రమించాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదురవవచ్చు. అంతమాత్రాన మనం ఈ పనికి తగినవారము కాదనే నిర్ణయానికి రాకూడదు. సాధించేవరకూ పట్టు వదలకూడదు. అవమానించినవారితోనే భేష్ అనిపించుకోవాలి. ప్రతి ఒక్కరికీ తమదైన ఆత్మస్థైర్యం ఉండాలి. దాన్ని వెలికి తీసి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి
1237)చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
1238)చేతులున్నందుకు దానంచేయాలి. చెవులున్నం దుకు మంచి మాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాట మాట్లాడాలి. అందుకే ఒకమంచిమాట తలకు కిరీటాన్ని పెడితే, ఒక చెడుమాట తలను తీసేస్తుంది. ఒక మంచి మాట తృప్తిని కల్గిస్తే, ఒక చెడుమాట మనసును కలిచివేసి, ఆబాధ జీవితాంతం గుర్తు ఉండేలా చేస్తుంది. ఒక చెట్టును నరి కితే, అది కొంతకాలానికి చిగురిస్తుంది. కానీ మాట ద్వారా చెడిపోయిన పని మాత్రం చక్కబడదు
1239)ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తధ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం.
1240)పర్వతం ఎత్తు చూసి జంకితే.. శాశ్వితంగా కిందనే ఉండిపోతావు .. సాహసించి ఒక్కో అడుగూ పైకి నడిస్తేనే .. శిఖరాగ్రం చేరుకుంటావు కాబట్టి కష్టాలని ఒక్కొక్కటి ఎదురుకుంటు పోతేనే నీ గమ్యాల్ని చేరుకొని విజయాలు సాధిస్తావు
1241)నీ మీద నికు అపార నమ్మకం ఉండొచ్చు కానీ ఎదుటి వాణి మీద అపనమ్మకం ఉండకుడదు....కింగ్
1242)అడ్డంకులు వచ్చాయని కుంగిపోతే అపజయం కలుగుతుంది , వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం తప్పక నిన్నే వరిస్తుంది
1243)ఆత్మగౌరవం... ఆత్మవిశ్వాసం... అత్మస్థైర్యం.... ఈ పదాలు పలకడానికి చాలా భారంగా, బరువుగా అనిపిస్తాయి. పలకడానికి ఎంత భారంగా ఉన్నాయో ఈ మూడింటితో సహజీవనం చేయడం అంతే కష్టం. ఆచరిస్తే అంతులేని ఆనందం.
1244)అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
1245)చీకటి పడుతుందని సూర్యుడు ,తెల్లవారుతుందని చంద్రుడు బయపడితే లోకానికి వెలుగే వుండదు ,అలాగే అపజయానికి బయపడితే విజయాన్ని అందుకోలెం .
1246)తప్పు చేసే అవకాశంరోజుకు వంద సార్లు వస్తుంది ,కానీ మంచి చేసే అవకాశం ఏడాదికి ఒక సారే వస్తుంది కాబట్టి నీకు మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు దానిని జాడ విడుచుకోకు
1247)నిన్నటి గురించి ఆలోచించడం..రేపటి గురించి బాధ పడటం...రెండు తోడు దొంగలు..అవి రెండు కలసి ఈరోజును దొంగతనం చేస్తాయి....కాబట్టి ఈరోజుని నిర్లక్ష్యం చెయ్యకుండా ఆనందించే ప్రయత్నం చెయ్యండి.."
1248)మనం పాజిటివ్ గా ఉంటే సగం పని మనమే చేయగలం. అప్పుడు దేవునికి మన కోరిక నెరవేర్చడం సులభం అవుతుంది.
1249)బలహీనులు అవకాశాల కోసం ఎదురు చూస్తారు,బలవంతులు వాటిని కల్పించుకుంటారు .
1250)మనం చెప్తుంది ఎవరికీ పూర్తిగా అర్ధం అవదు అని మనకి పూర్తిగ్గా అర్ధం అయ్యాక , వాళ్ళకి అర్ధం అయ్యేలా చెయ్యాలి అనుకోవడం లో అర్ధం లేదు
1251)నిన్నటి నుంచి నేర్చుకో ,నేడు జీవించు ,రేపటి కోసం ఆలోచించు ..అప్పుడే నువ్వు జీవితంలో పైకి వస్తావు
1252)నీకు ఉన్న కష్టాల చిట్టా విప్పకు ,అందరికి అవి మామూలే .నీకున్న సుఖాలను చూసుకో ,కొందరికే అవి పరిమితం .ఇలా అనుకోని ముందుకు సాగిన వాడికి జీవితం ఒక రంగుల హరివిల్లుగా మారుతుంది
1253)జీవితంలో సంతృప్తిపడటం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనదంగానే ఉంటాడు.ఇది చేత కానీ వ్యక్తికి ఎప్పుడూ దుక్కనికి గురవుతూనే ఉంటాడు. అందుకే సంతృప్తే మన బలంగా మలుచుకోవాలి
1254)మనశ్శాంతితో బతకాలంటే ఇతరుల దోషాల్ని ఎంచకుండా ఉండడం, మన ప్రవర్తనలోని లోపా లను గమనించి సరిదిద్దుకోవడం చెయ్యాలి.
1255)జీవితం ఒక ఆట ...ఆటడి గెలువు అంతే గాని...ఆటలాడి కాదు.....
1256)కడుపు నిండిన వాడు..కడుపు నింపుకోవాలి అనుకునే వాడె ప్రజాసామ్యం గురించి మాట్లాడుతారు...
1257)కొండ అద్దమందు కొంచెమై ఉండదా? అలా అని కొండ గొప్పది కాదనగలమా? గజరాజుని చూసి గ్రామసింహాలు చెలరేగినంత మాత్రాన గజరాజు విశిష్టత తరిగి పోతుందా, ఆలోచించండి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం, సామాన్యునిలా ప్రవర్తించటం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది. ఎవరో, ఏదో అన్నారని కుంగిపోకండి. అలా అనే అవకాశం ఎదుటివారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి. ఎదిగే కొలదీ ఒదిగిపొండి. తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చుగా ఎదుగుతాడు. ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
1258)ధనార్జన కోసం సద్గుణాన్ని విక్రయించవద్దు. అధికారం కోసం స్వేచ్ఛను అమ్ముకోవద్దు. -బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌
1259)పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలకన్నా చిన్న సూక్తులే మనిషి గుండెకి సూటిగా తగిలి హృదయానికి గాఢంగా హత్తుకోగలుగుతుంటాయి
1260)కురిసే ప్రతి చినుకూ ముత్యపు చిప్పను చేరుకోవలనుకుంటుంది. అనుకున్నది జరగవచ్చు ,జరగకపోవచ్చు.కొన్ని మనచేతిలో ఉండవు.కానీ ప్రతిక్షణంలో ఆనందాన్ని నింపుకునే శక్తి,సంతృప్తిని పొందగలిగే అవకాశం మాత్రం మన చేతిలోనే ఉంటాయి. అలా పొందగలగాలంటే జీవితంలో కష్టమైనా సుఖమైన ఆహ్వానించగలగాలి.నూతన మార్గాలకు నాంది పలకాలి.అదే గెలుపుకు తొలి మెట్టు అవుతుంది .ఇది తెలుసుకొని పాటించిన వారే విజేతలుగా మిగులుతారు.
1261)మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు. అది మంచిదైతే మనకు అన్నీ సుఖాలను తెస్తుంది. చడ్దదైతే కష్టాలను తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి.
1262)మనకు తెలిసో తెలియకో మన జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది.డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది,కానీ మంచితనం అనేది మనకి మనుషుల్ని సంపాందించి పెడుతుంది.ఆ మంచితనం సంపాదించుకున్న ఆ మనిషికి పేదరికం రావచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు..అందుకే "మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోవాలని" పెద్దలు చెప్పారు
1263)పొరపాట్లను గుర్తించడంలో మాత్రం వాయిదా పనికి రాదు. ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దు కుంటూంటే, అంతకు మించి అభివృద్ధి లేదు!
1264)జయాపజయాలు మన మీద ఎలాంటి ప్రభావము చూపలేవు...మన మనస్సుకు నచ్చిన పనిని చేస్తే ఆ తృప్తి వంద విజయాలతో సమానం అవుతుంది
1265)ప్రపంచ వినాశనానికి మారణాయుధాలను తయారుచేసే మానవుడు తన దృక్పథాన్ని మార్చుకొంటే.. విధ్వంసం... రోదనలు, హాహాకారాలు... అరాచకాలకి, రాక్షసత్వానికి, దారుణ మారణహోమాలకి ముగింపు పలికి , సాటి మనిషి చేతిని స్నేహపూర్వకంగా అందుకున్నప్పుడే మానవుడు స్వర్గాన్ని భూమిమీదకి దించగలడు
1266)బాష లేనిది బంధం ఉన్నది ,సృష్టిలో అతి మధురమైనది,జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే..
1267)శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది. అసాధ్యమైన దాన్నిఆశించు. కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది.
1268)అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం.