Tuesday, July 25, 2023

ఒక కప్ప కథ

 #ఒక_కప్పను_ఒక_నీళ్ళగిన్నెలో...#ఉంచి_ఆ_గిన్నెను_పొయ్యి_మీద_ఉంచితే...#కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి అవ్వటం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది...#ఇంకొంచెంసేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి, అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకుని నీటి వేడిని ఓర్చుకోగలుగుతుంది...

#ఇలా_కొన్నిసార్లు జరిగిన తరువాత ఇక నీళ్ళు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంక మార్చుకోలేదు, ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది, నీళ్ళ గిన్నెలోంచి ఇక బయటకు దూకేద్దాము అని...

#కానీ_దూకలేకపోయింది, ఎందుకంటే అప్పటి వరకూ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించటంలోనే కప్ప శక్తి అంతా హరించుకుపోయింది, వేడి నీళ్ళ గిన్నెలోంచీ దూకే శక్తి లేక నీరసపడిపోయింది...#కాసేపటికి కప్ప చనిపోయింది...కారణం వేడినీళ్ళా... కానే కాదు...

#ఎప్పుడు గిన్నెలోంచి దూకాలో సరైన సమయంలో సరైన నిర్ణయం కప్ప తీసుకోలేకపోయింది... అదే అసలైన కారణం...


#ఇప్పుడు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు..భరిస్తున్నారు కదా అని రాళ్లు విసిరినా ఓర్చుకోవడమే మనం చేసే తప్పు.. ఎందుకంటే 

#ఎవరో_వస్తారని_ఏదో_చేస్తారని ఎదురు చూస్తూ సమయం ముగిసిపోయే వరకు ఉండి భలై పోయేకంటే, సమయం ఉన్నప్పుడే కళ్ళు 

తెరుచుకుని ధైర్యంగా, సరైన శక్తి ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అవసరం చాలా అవసరం..!! మేలుకో మిత్రమా మేలుకో.ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


No comments:

Post a Comment