Saturday, November 21, 2009

అమృతవాక్కు

తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.

గమ్యంపట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గంపట్ల కూడా అంత శ్రద్ధ వహించాలి.

గతాన్ని దేవుడు కుడా మార్చలేడు

మనం చదవడమే నేర్చుకున్నాం కాని ఆలోచించడానికి శిక్షణను పొందలేదు.

నేరాలలో సర్వ సామాన్యమైనది కాలాన్ని వృధా చేయడం.

తనను తాను మలచుకొని సర్దుకు పోగాలగినవాడే ఈ ప్రపంచములో బ్రతకటం తెలిసినవాడు

ఒక వ్యక్తి సంతోషముగా వుంటే తప్ప ఇతరులకు సంతోషం కలిగించలేడు .

నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.-

నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు

ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.-

నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు

బంగారాన్ని గాని, గంధాన్ని గాని ఏం చేసినా వాటి గుణం మారుదు. అదే విధంగా ఉత్తముడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఉత్తమ గుణం మారుదు.

జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.

కడుపు నింపుకొవడం కొసమె తింటే పది రొట్టెలైనా చాలవు. పంచుకుని తింటే ఒక్క రొట్టె ముక్కైనా కడుపు నిండుతుంది. పంచుకొవడం లో ఉన్న ఆనందం అది. ఈ మానవ సూత్రాన్ని ప్రచారం చెయ్యండి

మిత్రుడ్ని మించిన అద్దం లేదు ,మిత్రుడు లేకుండా ఏఎ మనిషి సర్వ సంపూర్ణుడు కాలేడు

మనము వెదికేది మనకు దొరకదు మనకు దొరికినది మాత్రం కచ్చితంగా మనము వెదికినది మాత్రం కాదు

ఆలోచన అవసరం లేకుండా వాస్తవాలు గ్రహించగలం కానీ వాస్తవాలు లేకుండా ఆలోచనలు రావు .

Friday, November 20, 2009

ప్రేమలు - పెటాకులు

పెళ్ళి-పెటాకులు ఓల్డ్ కాన్సెప్ట్. అప్పట్లో పెళ్ళి చేసుకున్న తర్వాత పెటాకులు వచ్చేవి. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ముందు ప్రేమ......తర్వాత??? పెళ్ళా?????......చాలా దూరప్రయాణం....అక్కడికి చేరేలోపే పెటాకులు వచ్చేస్తున్నాయి.

అసలు ఈ ప్రేమలో పెటాకులు ఎక్కువగా ఎందుకొస్తున్నాయ్ అని నేను చేసిన పరిశోధనల సారాంశం ఏమిటంటే, మన కుర్రాళ్ళు తుప్పుపట్టిన, బూజు పట్టిన ప్రేమ సూత్రాలు ఇంకా ఫాలో అవటమే అని తేలింది. దాని ఫలితమే ఈ తెల్లకాగితం, ఐ మీన్ శ్వేతపత్రం ఉరఫ్ వైట్ పేపర్. నా తోటి కుర్ర ప్రేమికుల కోసం .....

* ఆ మధ్యన ఎవరో ఒకాయన ప్రేమించటం అంటే ప్రేమని ఇవ్వటం అని ఓ సినిమాలో ఓ సుత్తి సలహా ఇచ్చాడు. సినిమా హిట్టయ్యేసరికి కుర్రాళ్ళందరూ ప్రేమని షరతుల్లేకుండా ఇవ్వటం మొదలెట్టారు ఆ హీరో లాగా. కానీ పదాకులు ఎక్కువ చదివిన అమ్మాయిలు మాత్రం వేరే సినిమా చూసి ప్రేమని కేవలం తీసుకోటం మొదలు పెట్టి ఆపై తిరిగి ఇవ్వకపోగా, కనపడటమే మానేసారు. కాబట్టి సోదరులారా, ప్రేమిస్తున్నా ... ప్రేమిస్తున్నా అని ఒకటికి పదిసార్లు చెప్పటం మానెయ్యండి. రజనీ లాగా ఒక్కసారి చెపితే వంద సార్లు చెప్పినట్లే ఈ విషయంలో.


* మా కిరణ్ గాడు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి పేరు ప్రేమ. కళ్ళద్దాలు ఉండేవి. ఇంట్లో వీడి దోమ వ్యవహారం తెల్సింది. ఆర్గ్యుమెంట్లు జరిగాయి. ఓ రోజు ప్రేమని తీసుకుని నేరుగా ఇంటికెళ్ళాడు. వాళ్ళ నాన్నకి తిక్కరేగి, ఏం చూసి ప్రేమించావురా అని అడిగాడు కిరణ్ గాణ్ణి. ఏం చూసి అంటే ఏం చెప్తా డాడీ, ప్రేమ గుడ్డిది అన్నాడు. అది విన్న ప్రేమ, కిరణ్ తనని గుడ్డిది అని జాలితో పెళ్ళి చేసుకుంటున్నాడని చాచి ఓ చెంపదెబ్బ వాళ్ళ నాన్న ముందే కొట్టి వెళ్ళిపోయింది. కాబట్టి నోరుంది కదాని లొకేషన్లతో సంబంధం లేకుండా కొటేషన్స్ వాడకూడదు. మ్యాటర్ రివర్సయ్యే ఛాన్సులు ఎక్కువ.


* అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా అమ్మాయి కోసం కార్లు, షికార్లు అని డబ్బులు తగలెయ్యడం పాత పద్ధతి. కానీ నవలోకపు యువకుల్లారా, ముందు లోకాస్ట్ అప్రోచ్ ద్వారా పనికానిచ్చి, మీ ప్రేమ దోమగా కాకుండా సీతాకోకచిలుకలా మారిందన్న నమ్మకం కలిగినప్పుడే ఓ నాలుగు రూకలు ఖర్చుపెట్టుకోండి. ఇంతా కష్టపడ్డాక ఈ ప్రేమ దోమగా మారితే, మళ్ళీ పెట్టుబడి ఎవరు పెడతారు మీకు?


* ప్రేమించే అమ్మాయి ఎదురుగా నిలబడి ఎప్పుడూ ఐ లవ్ యూ అని పొరపాటున కూడా చెప్పకు. ఓ పక్కగా నిలబడి చెప్పటం వల్ల , మన మొహం చెళ్ళు మనిపించటానికి అమ్మాయికి అవకాశం తక్కువ. ఖచ్చితంగా చెప్పాలంటే, 45 డిగ్రీలు లేదా అంతకు తక్కువ కోణంలో కుడివైపు నిలబడి చెప్పటం ఎంతో శ్రేయస్కరం. ఖర్మకాలి ఎవరైనా భద్రకాళి కొడదామని ప్రయత్నించినా మన వంటికి జరిగే డామేజ్ చాలా తక్కువ. ఇది మర్చిపోయి, 90 డిగ్రీల లంబకోణంలో అమ్మాయి ఎదుట నిలబడి కూస్తే, ఇంకెప్పుడూ మరెవరితోనూ మళ్ళీ కూసే అవకాశం ఉండకపోవచ్చు.(గమనిక: ఈ చిట్కా కుడిచేతి వాటం అమ్మాయికి మాత్రమే పనికొస్తుంది, ఎడమచేతి వాటం అమ్మాయికి బాగా ఎడమవైపు నిలబడాలి. లేనిచో ఫలితాలు మరింత దారుణంగా ఉండవచ్చు)


* పెద్దల మాట చద్ది మూట. అలాగే పెద్దలు తిన్న చెప్పుదెబ్బలు కూడా చద్దిమూటలే. అందుచేత గతంలో చెంప దెబ్బలు మరియు చెప్పు దెబ్బలు తిన్న వాళ్ళని కలుసుకుని ఎలాంటి వంకర మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్దో తెలుసుకుని ఆ మాటలు ఎలిమినేట్ చెయ్యటం ద్వారా మన పరువు దక్కించుకోవచ్చు.


* త్వరగా తెమలని ప్రేమ చెరువులో దిగిన గేదెల్ని ఒడిసి పట్టుకునే జలగ లాంటిది. త్వరగా తెమిల్చి బయటపడ్డావా తప్పించుకుంటావ్, కాదు ఇంకా మునుగుతా అంటే ఆ జలగ నీ జేబునీ, నీ జాబుని కూడా పీల్చి పిప్పిచేయటం ఖాయం.


* ప్రేమ ఒక పద్మవ్యూహం లాంటిది. అభిమన్యుడిలా ఇరుక్కోక బయటపడే తెలివి కూడా ఉండాలి. ఎలా అంటే, రాజు, రాణి ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక దూకటానికి కొండెక్కారు. యమా ఫీలయిపోయిన మన రాజు గారు ఆవేశంగా ముందుకి లోయలో దూకాడు. అంతలో రాణి గారు మనసు మార్చుకుని "ప్రేమ ఎంత గుడ్డిది" (ఈ రాజు గాడు ఎంత గుడ్డివాడు అనర్ధం) అని ఎనక్కెళ్ళిపోయిందిట. ఆమాట విన్న రాజు, "ప్రేమకి చావులేదు" అని వాడి వీపుకున్న పారాచూట్ నొక్కి పైకొచ్చాట్ట. సో ఇషయం ఏందంటే, ప్రేమ ఫెయిలయిందని ఫీలైపోకుండా ముందుకి ఎల్లిపోవాలన్నమాట.


* ప్రేమ అనేది మాంచి హిట్ సినిమాకి ముందేసే న్యూస్ రీల్ లాంటిది. న్యూస్ రీల్ చిన్నగా ఉంటే, సినిమాని ఎంజాయ్ సెయ్యొచ్చు. అలాంటి న్యూస్ రీల్ లాంటి ప్రేమని సినిమా లాగా నడిపేసావ్ అనుకో, ఇంక పెళ్ళయ్యాక నీకు మిగిలేది సినిమా కాదు, న్యూస్ రీలు. ఇంతకనా ఎక్కువ నేను సెప్పలేను.


బెస్ట్ ఆఫ్ లక్............

మరి మగాళ్ళకో?

ఓ ఆడపిల్ల కష్టాల గురించి చెప్పాలన్నా, రాయాలన్నా ప్రపంచంలోని ప్రతివాడు తగుదునమ్మా అని సిద్ధపడిపోవటమే. అక్కడికేదో కష్టం ఆడపిల్ల సొత్తు అన్నట్లు, ఆ కష్టాల పుట్టుపూర్వోత్తరాలన్నీ వీళ్ళకే తెలిసినట్లు. ఆదివారం పూట పొద్దున్నే కాస్త ఆనందిద్దాం అని టీవీ నొక్కటం ఆలస్యం .. కళంకిత, అకళంకిత, అలౌకికత, అవివేకిత, అన్వేషిత, అన్వేషించనిత, అన్వేషిస్తున్నత, విధివంచిత, అంతరంగాలు, బహిరంగాలు, స్త్రీ, వనిత, మగువ, ఆడది ఓరి వీళ్ళ సీరియళ్ళు దొంగలు ఎత్తుకెళ్ళిపోను, తెలుగు డిక్షనరీలో ఆడ అన్న ప్రతి పదంతోనూ ఓ సీరియల్ తీసి పారేసారు. ఏమిటి అసలేమిటి జరుగుతోందిక్కడ? మగాళ్ళకి కష్టాలే లేవా? ఏనాటికి అలౌకికుడు, విధివంచితుడు, కళంకితుడు లాంటి సినిమాలు, సీరియళ్ళు వస్తాయో ఆ రోజే మగాడు పడుతున్న కష్టాలకి గుర్తింపు.

అసలు మగపిల్లాడిగా పుట్టి పెరగటం ఎంత కష్టమో ఈ పురుషద్వేషులకి ఏం తెలుసంట?

పుట్టి నాలుగడుగులు వెయ్యటమే లేటు, మొగపిల్లవాడికి సిగ్గేమిటంటూ చిన్ని గోచీ గుడ్డ కట్టి ఊరిమీదకి వొదిలేసిన హృదయవిదారక దృశ్యం ఎంతమందికి తెలుసని నేనడుగుతున్నా? అసలు ఇది కూడా (గోచీ) పెట్టి పుట్టిన వాడికి, లేకపోతే మొండిమొలతో ఊళ్ళేలాల్సిందే. ఎంత మగ వెధవయినంత మాత్రాన ఇంత పక్షపాతమా? గుడ్డముక్క వాడి ఒంటికి బరువా? ఆ సీను ఫోటో తీసి పెద్దయ్యేదాకా దాచి, ఎదురింటి మీనాకి, పక్కింటి ప్రియకి చూపించి కొద్దోగొప్పో కష్టపడి అన్నేళ్ళుగా పోగేసుకున్న సిగ్గుని పూర్తిగా తీసేసిగానీ నిద్రపోరు ఈ అమ్మలక్కలు.

అమ్మాయి పుడితే మహాలక్ష్మి అంటారు, అదే అబ్బాయి పుడితే కుబేరుడు అనరు, కుబేరుడి దగ్గర అప్పులపాలయిన శ్రీనివాసుడు అంటారు. ఎంత దారుణం?

స్కూల్లో చేరాక కళంకిత, అకళంకిత, అలౌకికత, అవివేకిత, అన్వేషిత, అన్వేషించనిత, అన్వేషిస్తున్నత, విధివంచితనీ మాత్రం మేస్టారు అరచేతిలో ముద్దుపెట్టినట్లు సుతిమెత్తగా కొట్టి, మగవెధవలంటూ అలౌకికుడు, విధివంచితుడు, కళంకితుడులను అరచేయి వెనక్కి తిప్పి వేళ్ళిరిగేలా స్కేలుతో కొడతాడు. విధించే శిక్షలోనూ అన్యాయమే.

కాలేజీకెళ్ళటానికని సిటీ బస్సు ఎక్కి కూర్చుంటే, అక్కడ కూర్చోనే సీట్లని కూడా ఆడపిల్లలకి రిజర్వు చేసి, వాళ్ళు రాగానే సీట్లు ఇచ్చి, వాళ్ళముందే నిలబడి ప్రయాణం చేసిన రోజుల్ని ఎలా మరిచిపోగలం? బస్సు సీట్ల రిజర్వేషన్ అంటే యాదుకొచ్చింది, మంద కృష్ణ అన్నకి ఈ అయిడియా వస్తే, ఆర్టీసీ బస్సుల్లో కూచొనే సీట్లకి కూడా రిజర్వేషను అమలు చేస్తే, సీటు కోసం బస్సు ఎక్కటం అంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు. ఎవరూ ఈ సీక్రెట్ లీకు చెయ్యకండి ప్లీజ్...

ప్రతి మగాడి విజయం వెనకాల ఓ ఆడది ఉంటుందిట, కానీ ప్రతి ఆడదాని విజయం వెనకాల ఓ మగవాడు ఉంటాడు అని కోట్ ఎవరయినా చెపితే విన్నారా? క్రెడిట్ ఇవ్వకపోగా భరించువాడు భర్త అని ఓ దిక్కుమాలిన టైటిలు పడేసి భరించలేనంతగా బాధపెట్టేదెవరు?

ఏ రకంగా చూసినా మగ పిల్లాడి మెయింటెనెన్సు ఖర్చు తక్కువ. చొక్కా, లాగు, పాంటు, షర్టు. చిన్ని జుట్టు, చింపిరి జుట్టూ, నెలరోజులుగా మడ్డిపట్టిన ప్యాంటు కూడా ఫ్యాషను అని చెప్పి గడిపెయ్యగలరే పాపం.

ఉద్యోగం చెయ్యని ఆడపిల్ల గృహలక్ష్మి, కానీ ఉద్యోగం చెయ్యని మగవాడు గృహపురుషుడు కాదు కదా అసలు పురుషుడు కింద లెక్క కాదట. ఎందుకంటే ఉద్యోగమే పురుష లక్షణమట. మరి ఉద్యోగం చెయ్యకపోతే స్త్రీ లక్షణము అవ్వాలి కదా. అంటే గృహలక్ష్మిలా గృహనారాయణుడు అవ్వాలి న్యాయంగా. కానీ జరుగుతున్నదేమిటి. ఉద్యోగం లేని పురుషుడి బతుకు ... అమ్మో.. ఎంత దారుణం చూసారా?

ఆడపిల్లని ఇంప్రెస్స్ చెయ్యటానికి మగ పిల్లలు పడే కష్టాలు ఎన్నెన్ని? ఎన్ని చీవాట్లు, ఎన్ని చెంప దెబ్బలు, ఎన్నెన్ని చె..దెబ్బలు. అసలు ఆడ పిల్లలు అలా మగ పిల్లల్ని ఇంప్రెస్ చేసే కష్టాలు పడతారా? అని నేను అడుగుతున్నాను.

సెలవంటూ వస్తే ఇంటిపట్టునే ఉండకుండా రోడ్లమీద పడి తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుకునే మగ పిల్లలతో ఎంత ఆదా?

నడిపే డ్రైవరు మగే అయినా, మగాళ్ళు చెయ్యూపితే ఇంకా స్పీడుగా పోయే సిటీ బస్సుడ్రైవరు గాడు అదే ఆడ పిల్లలు ఎక్కడ చెయ్యూపితే అక్కడే ఆపుతాడు, జాతి ద్రోహి.

పోనీ మా హీరో సినిమా చూట్టానికి మరో ఇద్దరు పురుగుల్ని ఎనక రమ్మని టిక్కట్టు కోసం వెళితే అక్కడ ఇంకో జాతి ద్రోహి. మగాళ్ళకి తలకొకటి, ఆడోళ్ళకి తలకి రెండు టిక్కట్లుట. ఎందుకీ అసమానత ఓరీ జాతిద్రోహీ అని వాళ్ళముందే నిలదీసా. బాగా కాలినట్లుంది. మనకు ఒక బాడీకి ఒక బుర్ర తెలివే ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్కరికీ రెండు బుర్రల తెలివి ఉంటుంది, అందుకని రెండు టిక్కట్లని అని ఎదవ సిగ్గు లేకుండా సెటైరేసాడు. తర్వాత తెలిసింది, వాడి పెళ్ళాం అదే షో చూట్టానికొచ్చి లోపల వాడి పక్కనే నుంచుందని.

బోర్డు లేని లేడీస్ స్పెషల్ బస్సులోకి రన్నింగ్ లో పొరపాటున ఎక్కి, ఎన్నో క్రూరమైన చూపుల తాకిడికి జింకపిల్లలా భయపడుతూ లోపలికి వెళ్ళలేక, పోనీ తెలియక బస్సెక్కాడన్న జాలి కూడా లేకుండా మరింత స్పీడుగా బస్సు పోనిచ్చే మరో జాతిద్రోహి వల్ల కిందకి దిగలేక, ఫుట్ బోర్డుపై ఆ మగ ప్రాణి అనుభవించే చిత్రవ్యధ ఎవరికి తెలుసు?

లేడీస్ స్పెషల్ బస్సులు, బోగీలు, లేడీసు స్పెషలు ఎగ్జిబిషన్... మరి మగాళ్ళకో?

అందమైన జీవితం

“ప్రతి వాళ్ళకి ఓ ఫిలాసఫీ లేదా ఓ నమ్మకం ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళ జీవితం నడుస్తుంది. ’చక్కగా జీవించడం ’ అన్నది మా ఫిలాసఫి. ”

“ప్రతిరోజు కనీసం ఒక్క ఆనందమయిన అనుభూతి అయినా పొందాలన్నది మా ధ్యేయం. ఆనందం అంటే బ్యాంక్ బాలన్స్ కాదు, ఆస్తులు కాదు. మంచి ఉద్యోగం లేదా కారు కాదు. ఆనందం అంటే సింపుల్ ప్లెషర్స్. సాధారణమయినవి, చిన్నవి, అతి చిన్నవి కూడా, మనకిష్టమైన పాట వినడమో, ఉదయమే వెచ్చని నీరెండలో చేతులు పట్టుకొని అయిదు నిముషాలు నడవడమో, చకటి పుస్తకంలోని కొన్ని పేజీలు చదవడమో, వసంతకాలంలో కోకిల గానం వినడమో, ఆ సంవత్సరంలో ఆరోజు మొదటిసారి మామిడిపండు తినడమో, పూర్తిగా విచ్చుకొన్న గులాబి పువ్వుని కోసి మనకి పరిచయంలేని చిన్నపిల్లకి ఇచ్చి ఆ పాప మొహంలో చిరునవ్వు చూడడమో … ఇలాంటి ఆనందమయిన అనుభూతులని వెదుక్కోడం వాటితో జీవించడం ఎంత చక్కటి ఆనందరకమైన జీవితమో కదా.”

అతను చెప్పేది ఆసక్తితో కూడిన శ్రద్ధ తో వింటోంది ఆమె. అతను అకస్మాత్తుగా చెప్పటం ఆపేసి ఆమె వంక చూసి..

“సారి మీకు విసుగేసే మాటలు చెప్పా కదా! ఒకోసారి ఎదుటివాళ్ళని గమనించకుండా మాట్లాడుతాను.” అన్నాడు.

“నాదీ మీ స్వభావమే, కాని మనలాంటివారిని చాలా మంది పిచ్చివాళ్ళు , సెంటిమెంటల్ ఫూల్స్, అనుకుంటారు, వాటిల్లో ఆనందం అందరికీ అర్థం కాదు”.

నిజమే ప్రస్తుత యాంత్రిక జీవితాలకి, ఉరుకుల పరుగుల సంపాదన జీవితాలకి కొన్ని ఆనందాలు అర్థం కావు. చెప్పేవాళ్ళని పిచ్చివాళ్ళనుకొంటారు.

పైన అతను - ప్రియతమ్, ఆమె – శాంతి. వీరిద్దరికి ఏ రక్త సంబంధంలేదు. ఏ బీరకాయ పీచు చుట్టరికంలేదు. కాలేజ్ లో కాని, స్కూల్లో కాని కలిసి చదువుకోలేదు. ఒక లోకల్ రైల్ లోని యాదృచ్ఛికంగా పరిచయమయిన ఒక ఆడ – మగ, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కాని ఆ పెళ్ళి వాళ్ళ స్నేహానికి అడ్డురాలేదు.

GETTING MARRIED IS EASY. STAYING MARRIED IS DIFFICULT. STAYING HAPPILY MARRIED FOR A LIFETIME SHOULD RANK AMONG THE FINE ARTS

ఏది మంచి ఏది చెడు..?

మనం కోరుకున్నవి సాకారమైతే మంచి జరిగిందని, కోరుకోనిదేదైనా తటస్థిస్తే చెడు జరిగిందని అపోహ పడుతుంటాం. ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా అది మనల్ని ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని జరగదు. అంతెందుకు మన జీవితాన్ని ప్రభావితం చేసేవిగా మనం భావించే పెళ్లి, పిల్లలు పుట్టడం, ఆత్మీయులకు దూరం కావలసి రావడం వంటివన్నీ మనకెంత ముఖ్యమైనవిగా తోస్తాయో 'నేను' అనే వలయాన్ని ఛేధించుకుని ఆవలి నుండి చూస్తే మనతోపాటే ఆయా సంఘ టనల వల్ల ప్రభావితం అయ్యే జీవితాలు ఎన్నో! పెళ్లనేది జరిగితే అది కేవలం ఇద్దరి వ్యక్తులకే పరిమితమైన సంఘటన కాదు. దాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యుల్లోనూ అంతర్లీనంగా కొద్ది సర్ధుబాట్లు చోటుచేసుకుంటాయి. ఆ కొత్త దంపతులు, ఆ కొత్త బంధాలు మరిన్ని అనూహ్యమైన సంఘటనలకు దారితీస్తాయి. ఈరోజు మనకు డబ్బు వచ్చిందంటే అది మరొకరి చేతుల నుండి పోబట్టే! ఈ క్షణం మనకు ఎదురైయ్యే ఆనందాలు, విషాదాలు అన్నింటికీ తీగలాగితే వెనుక మనకు తెలియని ఎన్నో అంశాలు చిక్కుముళ్లుగా ముడిపడి ఈ క్షణాన్ని మన కళ్లెదుట నిలుపుతాయి. గతం తాలూకు మేళవింపుగా, భవిష్యత్‌ తాలూకు నిర్ణయాత్మకశక్తిగా మాత్రమే 'ఈ క్షణం' నిర్మితమై ఉంటుంది. అందుకే ఈ క్షణం మనం అనుకున్నది జరిగినంత మాత్రాన సంతోషించడం, కష్టం కలిగితే కుంగిపోవడం అనాలోచితమైన వ్యక్తీకరణలు.



జీవితం అంటేనే ఓ గొలుసుకట్టు అనుభవాల సమాహారం. ఈ క్షణం మనం ఆస్వాదించేదీ, కుంగదీసేదీ గతం తాలూకు చిహ్నం కావచ్చు, భవిష్యత్‌లో పూర్తి విభిన్నమైన అనుభవాన్ని మిగల్చడానికి ఆదిబిందువు కావచ్చు. అన్నింటికీ మించి ఇప్పుడు తటస్థించిన అనుభవం ఏదైనా కావచ్చు, అది మనకు మాత్రమే మంచి జరిగింది, మనకు మాత్రమే చెడు జరిగింది అని నిర్థారణకు రావడం హాస్యాస్పదమే. మన ప్రమేయం లేకుండా గడిచిపోయే జీవితంలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే. మన పనిని చిత్తశుద్ధితో చేసుకుంటూ కర్మయోగిగా ముందుకు సాగాల్సిన వాళ్లమే తప్ప సంఘటనల వెనుక కార్యాకారణ సంబంధాలను అన్వేషించడానికి పూనుకుంటే ఏదో ఒక దశలో ఏ సంఘటన యొక్క ఆద్యంతమూ మనకు ఊహకు అందదు. అలా పూనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. సృష్టి లయబద్ధంగా ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేస్తూ తన ధర్మం పాటిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని క్షణాలు కొందరికి సంతోషదాయకమైనవి అయితే మరికొన్ని క్షణాలు మరికొందరికి నిరాశనే మిగుల్చుతాయి. ఈ క్షణం ఇలాగున్నంత మాత్రాన ప్రతీ క్షణమూ ఇలాగే ఉంటుందని నిర్థారణకు రావడం అపరిపక్వమైన ఆలోచనాసరళి! అలాగే ఏది ఎవరికి మంచో, ఎవరికి చెడో తెలుసుకోగలిగిన స్థూలదృష్టి మనకు లేనప్పుడు.. చిత్తశుద్ధిగా మనం చేసేదంతా మంచికే అనుకుని మౌనంగా పనిచేసుకువెళ్లడమే ఉత్తమం.

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం

పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని వేమన మహాకవి చెప్పిన మాటకు అర్ధం తెలియక పోయినా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించం ఎందుకంటే మన చదువులంత ఇంగ్లిష్మయంకధ " తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు" అన్నాడో మహానుబావుడు. బిజీ లైఫ్ లో డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన . ఒక్కసారి కుడా అవసరానికి మించిన డబ్బెండుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వర్ధమనే ముసుగుతో దాచిపెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు .

ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచేగా కాని, కొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తిన్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.