Saturday, July 19, 2025

జీవితం అంటేనే...అందమైన అనుభూతుల పుష్పగుచ్చం

జీవితం అంటేనే...అందమైన అనుభూతుల పుష్పగుచ్చం.ఆనందం, ఆశ్చర్యం, ఆశ, ప్రేమ అనే వాసనలతో నిండిన పూలబాకెట్..కాని చాలా సార్లు ఇది ఒక అనుకోని సంఘటనల సమాహారం కూడా అవుతుంది.మనం ఊహించని మలుపులు, ఎదురుచూచే కన్నీళ్లు,నిశ్శబ్దాల్లో ఒంటరితనాలు ఇవీ కూడా జీవితంలో భాగాలు.

ఒక గాయం మాత్రమే కాదు, దాన్ని మోయగల శక్తి కూడ మనలో ఉందని గుర్తు చేసే సాక్ష్యం.ఒక బాధ మాత్రమే కాదు, మన మనస్సు ఎంత లోతైనదో అర్థమయ్యే క్షణం.ఒక అలజడి మాత్రమే కాదు, అంతకన్నా లోతుగా మనశ్శాంతిని కోరే మన తత్వం.
ఒక ఆందోళన మాత్రమే కాదు, మనకు అవసరమైన ప్రశాంతతను వెతికే మన ఆత్మ...ఇలా...ఒక సంఘటన ఎదురయ్యాకే తెలుస్తుంది.ఈ జీవితంలో నీ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో,ఈ ప్రపంచంలో నీ స్థానం ఎంత ప్రత్యేకమైనదో.

ప్రతీ గాయం,ప్రతీ ఎదురుదెబ్బ మనని కొట్టివేయాలనే కాదు,అవి మనలోని లోతులను బయటకు తీస్తాయి.
మన పరిమితులు ఏవో, మన బలం ఎక్కడ ఉందో మనకు నేర్పిస్తాయి.ఇది మనం జీవితాన్ని ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే ఆధారపడుతుంది.

ఒక చెదురు కాగితంలా తేలిపోతూ ఉండే మన ఆత్మ...ఒక్క మాట, ఒక్క అర్ధం, ఒక్క ప్రేమతో అణచివేయబడుతుంది,లేదా గగనాన్ని తాకే రీతిలో లేచిపడుతుంది.ఇది గమనించే కన్ను ఉంటే, ప్రతి అనుభవం ఓ గురువు అవుతుంది.ఒక అర్ధరాత్రి కన్నీటిలో తడుస్తే, ఉదయం మృదువైన తేజస్వితను తీసుకురాగలదు.ఈ జీవితాన్ని గౌరవించాలి.
అది మన నుండి మనకు తిరిగి ఇచ్చుకునే 
బహుమతి అవుతుంది...కొందరు మన జీవితంలో ఎలా భాగం అవుతారో తెలీదు. ఇంకొందరు మన పరిస్థితిని అలా ఎలా అర్థం చేసుకోగలరో అస్సలు అంతుబట్టదు. అప్పుడే అనిపిస్తుంది మనుషులకు ఎంతదూరం ఉందాం అనుకున్న ఎవరో ఒకరు, సందర్భం వచ్చినప్పుడు, వారి మానవత్వపు సుగంధద్రవ్యం మనపై కురిపిస్తారు.అది ఒక మాటవ్వచ్చు. ఒక చూపవ్వచ్చు.ఒక్క చిన్న సందేశం గానీ, చేతి సాయం కాని సాహచర్యంగా తలుస్తుంది. మనం అడగకపోయినా,ఆకాంక్షించకపోయినా, అవసరమైన నిమిషంలో వాళ్ల మౌనం కూడా ఓ బలాన్నిస్తుంది. అప్పుడే తెలుస్తుంది ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా రాలేదు. అనుకోని తలుపు తెరిచి ఎవరో మన లోపలకి వచ్చి, మనకన్నా ముందే మనను తాము గుర్తించగలిగినప్పుడు, అదే ప్రేమ. అదే బంధం.జీవితంలోని గొప్ప అనుభవాలు, విలువైన గుర్తులు సజీవంగా మిగిలిపోవడం అలాంటి క్షణాలతోనే. మనకన్నా ముందే మన మనస్సు ఎవరో చదవగలిగితే, అదే దేవుడి దివ్య ఆశీర్వాదం లాంటిది.మనం ఒకరికి అవసరమవ్వడం,ఎవరో మనకోసం ఇలా అవసరమవ్వడం... ఈ రెండూ జీవితాన్ని తేలిక చేస్తాయి, బోధనగా మారతాయి, శాంతిగా మారతాయి.జీవితం అంటేనే అది కదా.
అనుకోని అనుభూతుల పరంపర.అనుభవాల లోతుల్లో మనల్ని మనమే పునఃపరిచయం చేసుకునే ప్రయాణం.మనమంతా జీవితంలో ఒకోసారి తిరుగులేని పేజీలమైతే,కానీ మన మాటలు ఎవరికో కొత్త అధ్యాయాలుగా మారుతాయి.రూమీ అన్నట్టు
You were born with wings, 
why prefer to crawl through life?
మన జీవితంలో అనుభవాలే రెక్కలుగా మారి, మనల్ని మేఘాల లోకి నడిపిస్తాయి. అవి సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా… ప్రతి క్షణమూ మనలో ఏదో మార్చేస్తుంది. అందుకే, జీవితాన్ని ప్రేమించాలి, దాన్ని ఎదుర్కొనాలి not just with courage, but with గ్రాతీతుడే too.



సంకల్పం

శ్రీమాన్ పేర్ల రఘురామ్, ధర్మపత్ని ప్రత్యూష, కుమార్తె లాస్య — మా కుటుంబం ఇనకాల గోత్రం.

నా కుటుంబ క్షేమం, సుఖసంతోషాలు, శ్రేయస్సు మరియు సర్వాభీష్టసిద్ధి కోసం క్రింది సంకల్పములు:

1. నాకు ఉన్న సమస్త రుణబాధలు తొలగి, రుణవిమోచనం కలగాలి.
2. నాకు మానసిక ప్రశాంతత, స్థిరమైన మనస్సు కలగాలి.
3. నాకు ఆర్థిక వృద్ధి, ధనసంపద మరియు ఐశ్వర్యం సమృద్ధిగా కలగాలి.
4. నాకు కుటుంబ వృద్ధి, సుఖసంతోషాలు మరియు ఐకమత్యం ఎల్లప్పుడూ ఉండాలి.
5. నాకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు మరియు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి.
6. నాకు ఉన్న సమస్త దోషాలు, అడ్డంకులు మరియు ప్రతికూల ప్రభావాలు తొలగి, శుభఫలితాలు కలగాలి.
7. నాకు వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో అభివృద్ధి, స్థిరత్వం మరియు మంచి అవకాశాలు కలగాలి.
8. నా కుమార్తె లాస్యకు విద్యాభివృద్ధి, జ్ఞానం, మంచి భవిష్యత్తు మరియు సర్వవిధాలా శ్రేయస్సు కలగాలి.
9. మా కుటుంబ సభ్యులందరికీ సర్వకార్యసిద్ధి, విజయము, కీర్తి మరియు గౌరవము లభించాలి.
10. మా కుటుంబానికి సర్వశుభాలు, సౌభాగ్యం, శాంతి, సంతోషం మరియు దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉండి, మా కోరికలన్నీ సఫలీకృతం కావాలి.


ఋగ్వేద మంత్రము: 

 ఓం హందేవా అసపత్నం సువధ్వం మహతే క్షత్రాయ మహతే జ్యేష్టాయ మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ !


ఈ శ్లోకం ప్రతి రోజు ఉదయం ఒక జపమాల ( 108 సార్లు ) మరుయు సాయంత్రం మరో జపమాల ( 108 సార్లు ) ... నెల రోజులు సాధన చేసి గుర్తు చేయగలరు. మరింత powerful శ్లోకాలు ఇస్తాను. ఇలా ప్రతి నెల శ్లోకాలు మార్చుకుంటూ, శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది.  

 

ఈ శ్లోకం సాధన చేయటంతో పాటు ప్రతి శనివారం నవగ్రహ మండపానికి 9 ప్రధాక్షణాలు చేయగలరు.

 

ఈ విధంగా...

 #1 నిరంతరం భగవంతుని నామస్మరణ చేస్తూ

 #2 నిరంతరం భగవంతుని సన్నిధికి వెళుతూ

మనవ ప్రయత్రం గట్టిగ చేస్తూ, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ రెండు పరిహారాలు చేయుటకు one rupee కూడా మీకు ఖర్చు కాదు.

 

భక్తులకు గమనిక :-

 

# మీ జాతక విశ్లేషణ ... మా స్వహస్తాలతో పుస్తకంలో వ్రాసి ✍ ✍ బద్రపరిచాము. Book Number M- 45.. అనగా M అనే rack లో 45 వ పుస్తకంలో మీ జాతక విశ్లేషణ బద్రపరిచి ఉంటుంది.

 

# మీకు Life Long validity వర్తిస్తుంది. అనగా Life Long ఎప్పుడైనా , ఎన్ని సార్లు అయినా consult చేయవచ్చు.

 

# time to time మీ జీవితంలో.. జాతక రీత్యా వచ్చే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వివాహ యోగం, సంతాన యోగం, గృహ యోగం, వాహన యోగం, విదేశీయాన యోగం, ధన యోగం, వివాహ పొంతన, ముహూర్తం, Money problems, Family problems, Job / Business problems , Health problems etc .. నిమిత్తం unlimited times సంప్రదించ వచ్చును.

 

# ఇక నుండి Next day కి ఫలితాలు సిద్ధంగా ఉంటాయి.

 

# ఇక నుండి per every question కి ఫీజు 100 మాత్రమే

 

# మీ పుట్టిన వివరాలు మరల పంపించనక్కర లేదు, అన్ని వివరాలు ఇక్కడ పుస్తకంలో ఉంటాయి. just మీ book number # M - 45 whatsup లో code చేసి, మీ సమస్య text మెసేజ్ గాని Voice మెసేజ్ చేసి, ఫీజు 100 రూపాయలు Phonepay చేస్తే చాలు- next day కి ఫలితాలు సిద్ధంగా ఉంటాయి. కావున ఈ Life Long validity అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.

 

# మిగిలిన మీ కుటుంబ సభ్యుల జాతక పరిశీలన నిమిత్తం కూడా సంప్రదించవచ్చు. ఎవరికైనా Life Long validity వర్తిస్తుంది.

 

# మా service మీకు నచ్చితే మీ relatives, friends, కొలీగ్స్, neibours కి reffer చేయగలరు.

 

# వివాహ పొంతన , ముహూర్తం, పిల్లలకు జన్మ పత్రిక, వివాహ లగ్న పత్రిక నిమిత్తం కూడా సంప్రదించవచ్చును.

 

# ధన యోగం, మానసిక ప్రశంతాత, కార్య సిద్ధి పొందుటకు “ వేదిక్ థెరపీ ” spirtual motivation workshop నిమిత్తం సంప్రదించవచ్చును.

 

# ఆత్మ జ్ఞానం, మోక్ష జ్ఞానం తెలుసుకొని ఆద్యాత్మిక మార్గంలో వెళ్ళుటకు “గురు సన్నిధి” నిమిత్తం సంప్రదించవచ్చును.

 

# మంత్రోపదేశం పొందుటకు కూడా భక్తులు సంప్రదించవచ్చును.

 

# శక్తి నిక్షిప్తం చేసిన దైవిక వస్తువులు నిమిత్తం సంప్రదించవచ్చును.

( ధనలక్ష్మి అమ్మవారి వెండికాసు, వాస్తు యంత్రం, రత్న ధారణ, రుద్రాక్ష ధారణ, చిన్న పిల్లలకు బాలా సురక్షా లాకెట్ etc )

 

# శ్రీ వ్యాస మహర్షి గురు మఠం వారికీ Donation లేదా ఏమైనా వస్తువులు ధానం ఇవ్వటానికి కూడా భక్తులు సంప్రదించవచ్చును.



మా 30 సంవత్సరాల శాస్త్ర అనుభవంతో భక్తి సంబంధిత సమాచారం , గురు సందేశం మెసేజ్ లా రూపంలో ప్రతి రోజు మీ whatsup కి పంపిస్తూ ఉంటాము . దయచేసి మా phone number ( 8367770551 ) తప్పకుండ Save చేసుకోగలరు. తద్వారా మా నుండి ప్రతి రోజు whatsup messages పొందటంతో .. మీలో ఆధ్యాత్మిక ఆత్మ స్థైర్యం పెరిగి మీరు అనుకున్నది సాదించుకోగలరు. శుభం !!

 

శ్రీ చంద్ర భగవాన్

( రిటైర్డ్ వేద పాఠశాల ఆచార్య & Astrologer 3 వ తరం _Since 1995 )

 కర్మ సిద్ధాంత ప్రవచన కర్త ,

Specilized in వేదిక్ థెరపీ ( Healing )

Whatsup 8367770551

శ్రీ వ్యాస మహర్షి గురు మఠం – సింహాచలం

స‌ర్వేజ‌న సుఖినోభ‌వంతు - ఓ౦ శాంత

Sreeman: raghuram perla
Dob: 08-12-1983 20:44
Star: uttarashada 
Raasi: makara

Dharmapathni : prathyusha 
Dob : 19-01-1987 20:32 
Star: pubba Nakshatram
Raasi : simha 

Daughter: laasya 
Dob : 27-02-2012 00:07
Star: Aswini
Raasi: mesha

Sunday, July 13, 2025

బద్ధకమే విజయానికి అతిపెద్ద అడ్డంకి

*🌱బద్ధకపు విత్తనం, కష్టపడే నేల* *నీతి కథ* 💫✨
🕉️🦚🌹🌻💎💜🌈

 *🍁ఒకప్పుడు, ఓ పెద్ద పొలంలో కొత్తగా ఓ విత్తనం నాటారు. ఆ విత్తనానికి "ఆలస్యం" అని పేరు పెట్టారు. దాని పక్కనే "కష్టపడే తత్వం" ఉన్న ఇంకో చిన్న విత్తనం కూడా ఉంది. ఆలస్యం విత్తనం ప్రతిరోజూ ఇలా అనుకునేది, "ఈరోజు ఎండ ఎక్కువ ఉంది, రేపు మొలకెత్తుదాంలే. రేపు వాన పడుతుంది, ఆ తర్వాత మొలకెత్తుదాంలే." అది ఎప్పుడూ తన పనిని వాయిదా వేస్తూనే ఉండేది.* 

 *కానీ కష్టపడే తత్వం ఉన్న విత్తనం అలా కాదు. అది రోజూ ఉదయాన్నే ఎండనీ, నీటినీ పీల్చుకుంటూ పెరిగేది. చిన్న మొలకలా మొదలై, నెమ్మదిగా బలమైన కాండంగా మారింది. దాని వేళ్ళు భూమిలోకి లోతుగా వెళ్ళిపోయాయి, తన లక్ష్యం కోసం అది కష్టపడింది.* 

 *కొన్ని నెలలు గడిచాయి. కష్టపడే తత్వం ఉన్న విత్తనం ఇప్పుడు అందమైన, పూలతో నిండిన మొక్కగా మారి, మంచి సువాసనతో సీతాకోకచిలుకల్ని ఆకర్షిస్తోంది. కానీ ఆలస్యం విత్తనం మాత్రం ఇంకా భూమిలోనే ఉంది, మొలకెత్తడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ. అది అస్సలు కష్టపడటానికి ఇష్టపడలేదు, కేవలం తన సమయం వస్తుందని ఆశపడింది.* 

 *తర్వాత చలికాలం వచ్చింది. బాగా చలి పెరిగింది. కష్టపడే తత్వం ఉన్న మొక్క తన వేళ్ళ బలం వల్ల ఆ చలిని తట్టుకుని నిలబడింది, వచ్చే వసంతం కోసం చూస్తోంది. కానీ ఆలస్యం విత్తనం మాత్రం చలికి గడ్డకట్టుకుపోయింది, అది మొలకెత్తడానికి సరిపడా బలం* *కూడబెట్టుకోలేకపోయింది. దాని బద్ధకం దానిని పూర్తిగా నాశనం చేసింది* .

 *ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు:* 

 *ఈ కథ ఇప్పటి సమాజానికి ఓ ముఖ్యమైన మాట చెబుతోంది. మనం చాలాసార్లు మన పనులని, బాధ్యతల్ని "తర్వాత చేద్దాం," "ఇంకా చాలా టైముందిలే" అనుకుంటూ వాయిదా వేస్తాం. సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం, అనవసరమైన వాటిపై దృష్టి పెట్టడం, లేదా కేవలం బద్ధకం వల్ల చేయాల్సిన పనుల్ని పట్టించుకోం.* 

 *కానీ విజయం అనేది కేవలం అదృష్టం వల్లనో, అవకాశం వల్లనో రాదు. అది కష్టపడటం, నిబద్ధతతో ఉండటం, సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. ఈరోజు మనం వాయిదా వేసే ప్రతి చిన్న పనీ, భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారొచ్చు. టైమ్‌ని వృథా చేస్తూ కేవలం కలలు కనడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు.* 

 *కాబట్టి, ఈ కథ మనకు చెప్పే పాఠం ఏంటంటే: "ప్రతి చిన్న ప్రయత్నం, మనసుపెట్టి చేసే పని చివరికి పెద్ద ఫలితాలనిస్తాయి. బద్ధకమే విజయానికి అతిపెద్ద అడ్డంకి." రేపటి కోసం ఎదురుచూడకుండా, ఈరోజే మన లక్ష్యాల వైపు అడుగులు వేద్దాం!*

చిన్న కవితలు

1)నా మనసు భావన...ఊహల సంకెళ్లలో..క్షణమొక యుగంగా నీ రాకకై చేరుకోవాలని ఎదురుచూస్తున్న నేను..నేను దొంగచాటుగా నవ్వినా ఈ వెన్నెల వెక్కిరించినా..రేపోమాపో నీవు వస్తావని
నా కంటి పాపగా నిలుస్తావని నమ్మకం..వెన్నెల మెరిసినా నీవు మబ్బు చాటుకు చేరినా..గడచిన చీకటి సాక్షిగా మధుర క్షణాలు అందిస్తావని..నీ ఎదురుగా నేను..నా ఎదురు నీవు..మన ఎదుట ఆ పున్నమి చంద్రుడితో ఎప్పుడుంటామే..అలా ఎదురుచూస్తూ గడపేయాలేమోనని.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

2)ప్రతి బంధం – మొదటగా ఒక అవకాశంతో మొదలవుతుంది.అదే అవసరంగా మారుతుంది.చివరికి అది అలవాటవుతుంది.అది ప్రేమకావచ్చు,స్నేహం కావచ్చు..ఒక కన్ను చూస్తుంది.ఒక క్షణం ఆగుతుంది..ఒక మాట మొదలవుతుంది.అదే ఒక కొత్త బంధానికి తలుపు తీయగలదు.బంధాలు మొదలయ్యే సమయంలో మనకు తెలియదు.ఇది ఎంత దూరం నడుస్తుంది?ఇది ఎంత లోతుగా ప్రవేశిస్తుంది? అని కానీ ఒక అవకాశం ఇచ్చే మనసు ఉంటే.మనిషిలో మనిషి కనిపిస్తుంది.ఎవరో చిరునవ్వుతో పలకరిస్తే,ఎవరో మన మాట వినగలిగితే.మనలో ఏదో తెలీకుండానే మెరవడం మొదలవుతుంది.ఈ *అవకాశం* అంటే ఒక బంధానికి వేసే తొలి అడుగు.అది పెద్దదైనా,చిన్నదైనా మనసును తాకగలిగితే చాలు.
అది అనుబంధమవుతుంది. *అవసరం*.బంధాన్ని పోషించే ఎవరి జీవితం లోనైనా ఒక సమయంలో
ఒకరిని అవసరంగా అనిపిస్తుంది.మన మాట వినే వ్యక్తి,మన మౌనం అర్థం చేసుకునే మనిషి,మన భయానికి అండగా నిలిచే నీడ.అవసరం అనిపించే బంధాలు జీవితంలో చాలా ఉంటాయి.ఎవరైనా మన బాధ విన్నప్పుడు,మనకు ఒక మౌనపు తోడు ఇచ్చినప్పుడు...మనసులో ఒక జాగా వాళ్ల కోసం ఖాళీ అవుతుంది.అదే *అవసరం*.అలాగని అవసరంతో మొదలైన బంధం తక్కువ అని కాదు.మన బలహీనతల్లో ఎవరు మన చేయి పట్టుకుని నడిపిస్తారో వారే మన జీవితంలో నిలిచిపోయే మనుషులు..*అలవాటు* ఆత్మకి అతుక్కున్న లేదా హత్తుకున్న తోడు ఒకప్పుడు పరిచయమైన వ్యక్తి,ఒకరోజు అవసరమయ్యాడు,తర్వాత అతనితో లేకపోతే అసహ్యం అనిపించేట్టుగా...అదే *అలవాటు*.ఇది అత్యంత శక్తివంతమైన ఘట్టం.ఇక్కడే మనం పడి పోతాం,గిలగిలలాడతాం.ఎవరో దూరమైనప్పుడు,మనలో గాయం మిగులుతుంది.ఏం జరిగిందో మనకే అర్థం కాకపోతేనూ,వాళ్ళ లేక పోవడమే బాధిస్తుంది.అలవాటు అనేది బంధానికి మనసుతో వేసిన పట్టు.అది ఒక మత్తు కాదు.
ఒక నిశ్చల ప్రేమ లక్షణం.అలవాటవ్వడం అంటే 
అలవాటు పడిన మనిషి ఎదుట లేకపోయినా,మనం స్వచ్ఛంధంగా వారి కోసం ఎదురుచూస్తాం.వారి రాక మీద మన దినచర్య,మన ఊహ,మన గడియారమే ఆధారపడిపోయింది.మన ముందు వారు చిరునవ్వు నవ్వకపోతే,మన హృదయం ఎందుకో బాధ పడుతుంది.వాళ్లు మౌనంగా ఉంటే మన కన్ను తడుస్తుంది.ఎందుకంటే అలవాటు మన భావోద్వేగాలను వారి వైపు ఆకర్షించేసింది.అలవాటు అనేది కేవలం ఒకరి జ్ఞాపకం కాదు.అది మన లోపల వారి శ్వాసలా మారిపోతుంది.వారి గమనమే మన గమనంలా అనిపిస్తుంది.వారి అసంతృప్తి మన బాధలా అనిపిస్తుంది.ఈ స్థాయికి చేరినప్పుడే అలవాటు అనేది ప్రేమకంటే లోతుగా అనిపిస్తుంది.
అవకాశం → అవసరం → అలవాటు.అది స్నేహం కావచ్చు,బంధుత్వం కావచ్చు,ప్రేమ కావచ్చు,కలుసుకున్న రహదారి కావచ్చు.ఈ చక్రాన్ని ఏ దశలోనైనా విరమించవచ్చు.కానీ మన మనసు దాని పంథాను మర్చిపోదు.ఇందుకే కొన్ని బంధాలు నిష్ఫలమైనా మనలో ఏదో మిగిలిపోతుంది.ఒక చిన్న ఆశ.ఒక చిరు వేదన.ఒక ఊహ,ఒక అలజడి.ప్రతి బంధం అవకాశంగా మొదలవుతుంది,అవసరంగా,ఎదుగుతుంది,అలవాటుగా మారుతుంది.కానీ నిజమైన బంధం.దేనికీ అర్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా మనసునే అర్థం చేసుకుంటుంది.అయితే ఈ మూడు గుండా ఏర్పడేదే అనుభవం.
అవకాశం + అలవాటు + అవసరం = అనుభవం..ఈ మూడూ కలిపిన తర్వాత జీవితంలో మిగిలేది ఒక్కటి అనుభవం.అనుభవం – బంధాన్ని బలపరిచే నాలుగవ స్థాయి.ఇది ఊహతో వచ్చే పాఠం కాదు.ఒక సన్నివేశం,ఒక బంధం,ఒక వేదన…మనలో తళుకుల్లా మెరుస్తూ శాశ్వత గుర్తుగా మారిపోతుంది.అనుభవం అంటే కాలంతో లిఖితమైన భావోద్వేగం.ఒకరి నుంచి సాయం ఆశించి నిరాశపడ్డపుడు.ఒకరి కోసం ఎదురుచూసి వారు రాకపోయినప్పుడు.ఒకటి కాదు,రెండూ కాదు ఎన్నెన్నో పర్యాయాల్లో మనం మౌనం వెచ్చించినప్పుడు.ఆ మౌనం మన హృదయాన్ని వెతికి, మనిషిని మార్చేస్తుంది.అదిఅనుభవం.అనుభవం గమనించనంత మెల్లగా మనలోకి వస్తుంది.ఒక రోజు మనం ఎదుట కూర్చున్నవారిని చూసి,
వాళ్ల మాటల్లో ఉన్న మౌనం వినగలిగితే.అది మన అనుభవం మనకు నేర్పిన అభిజ్ఞత.అనుభవం బంధాన్ని శోధిస్తుంది – నశింప జేయదు..అవకాశం వచ్చినప్పుడు మనం ఓ బంధాన్ని మొదలు పెడతాం.అలవాటయ్యాక దానికి మనసు ఎగబాకుతుంది.అవసరం ఏర్పడితే దాన్ని కోల్పోవడం భయంగా అనిపిస్తుంది.కానీ అనుభవం వచ్చిందంటే.ఈ మూడింటినీ దాటి ఆ బంధం మన మనసులో పాతుకుపోయిందని అర్థం.అప్పుడు మనం వదిలి పెట్టవచ్చు,కానీ మరిచిపోలేం.ఒక ప్రేమ విఫలమవచ్చు,కానీ దాని అనుభవం మనం ప్రేమించే తీరును మార్చేస్తుంది.ఒక స్నేహం దూరమవచ్చు,కానీ దాని అనుభవం మనలో ఒక జ్ఞాపకంలా నిలిచి పోతుంది.అనుభవం అంటే ఎదిగిన మనసు అనుభవం వచ్చాక మనం ఇక భయం కోసం బతకం.అభిప్రాయం కోసం కాదు.అర్థం కోసం ఎదురు చూస్తాం.ఎవరైనా మనల్ని పిలవకపోతే బాధపడం,మన విలువలను మర్చిపోవద్దని మనల్ని మనమే గుర్తు చేసుకుంటాం.అదే అనుభవం నిజంగా మానవత్వాన్ని నేర్పే దశ.అనుభవం తర్వాత మనం నేర్చుకునేది.ప్రేమ అనేది ఒత్తిడిలో ఉండకూడదు.బంధం పుట్టించేది దృష్టి కాదు.దాని వెనుక ఉన్న శ్రద్ధ.
అవసరం గౌరవంగా ఉంటేనే బంధం స్థిరంగా ఉంటుంది.దూరం వచ్చినా,అనుభవం కాసేపు నవ్వుతూ వెనక కనిపిస్తుంది..ప్రతి మౌనం.ఓ తలపుగా మారు తుంది..ప్రతి తేడా.ఓ సహనంగా మారుతుంది..ప్రతి అణకరం.ఓ అర్థంగా మారుతుంది..అదే అనుభవం మన బలహీనతలను మారుస్తుంది,మన సంశయాలకు జవాబుల్లా నిలుస్తుంది.అవకాశం ఓ తలుపు మాత్రమే.అవసరం ఓ నడక మాత్రమే..అలవాటు ఓ దారి మాత్రమే.కానీ అనుభవం అది మనసు ముడిపడే చివరి గమ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*

3)మాట్లాడకపోయినా అర్థం చేసుకోగలరు,కేవలం పక్కన ఉండి భుజాన్ని మోయగలరు,ప్రేమంటే కేవలం కలిసి నవ్వుకోవడమే కాదు, నిశ్శబ్దాన్ని కూడా తనలో కలిపేసుకుని అండగా ఉండటం.ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి..ప్రేమంటే ప్రతీ నిముషం పలకరించుకోవడమే కాదు,నిశ్శబ్దంలో కూడా నేనున్నా అనే శబ్దాన్ని మనకు ఇవ్వడం
"బ్రతుకు భారంగా అనిపించిన ప్రతి క్షణం... ఈ మాట గుర్తుంచుకో!"

4)బ్రతుకు భారంగా మారిన ప్రతిసారీ ఒక్కసారి నీ గుండెను నువ్వే అడుగు.."నేను ఇంత దూరం వచ్చాను... ఇక ఎందుకు ఆగాలి...?" అని.జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.ఈరోజు కన్నీళ్లు పెట్టించిన కాలమే,రేపు నీ చిరునవ్వుకు కారణం అవుతుంది.ఈరోజు నిన్ను కిందకు లాగిన పరిస్థితులే, రేపు నిన్ను శిఖరానికి చేర్చే మెట్లుగా మారతాయి.మనసు అలసిపోతుంది..శరీరం నీరసిస్తుంది..నమ్మిన మనుషులే దూరమవుతారు... ప్రేమించినవాళ్లే బాధ పెడతారు...నమ్మినవాళ్లే మోసం చేస్తారు...కష్టాలు ఒక్కసారిగా తుఫానులా వచ్చి జీవితాన్ని చుట్టుముడతాయి.అప్పుడు మనసు అడుగుతుంది..."ఇంకా ఎందుకు బ్రతకాలి...?" కానీ విను...చీకటి ఎంత గాఢంగా ఉంటే,ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. తుఫాను ఎంత భీకరంగా ఉంటే,దాని తర్వాత వచ్చే ప్రశాంతత అంత గొప్పగా ఉంటుంది.ఒక్కసారి ఆగు...ఓపిక పట్టి నిలబడిపో..నీ కోసం ఎదురుచూసే మనుషులు ఇంకా ఉన్నారు.నీ నవ్వును చూసి ఆనందపడే హృదయాలు ఉన్నాయి. ఈరోజు నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా, ఒకరోజు నీ కథే వేల మందికి స్ఫూర్తిగా మారుతుంది.
జీవితం అంటే సుఖాలు మాత్రమే కాదు...పడిపోయిన ప్రతిసారి మళ్లీ లేవడం కూడా.ఓడిపోయిన ప్రతిసారి మళ్లీ పోరాడడం కూడా.కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ నవ్వడం కూడా.అదే నిజమైన విజయం..అదే అసలైన జీవితం.ఆఖరిగా ఒక మాట..గుర్తుంచుకో..ఓటమి శాశ్వతం కాదు..బాధ శాశ్వతం కాదు..కష్టం శాశ్వతం కాదు..కానీ ధైర్యంగా నిలబడిన మనిషి విజయం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.గుండె గట్టిగా ఉంటే కాలమే నీకు దారి చూపిస్తుంది. గాయపడిన గుండె ఒకరోజు మరొకరి జీవితానికి ధైర్యం చెప్పే స్థాయికి ఎదుగుతుంది. కన్నీళ్లు కార్చిన కళ్లే ఒకరోజు విజయంతో మెరిసిపోతాయి. అవమానాలను భరించిన మనిషే ఒకరోజు అందరి గౌరవాన్ని పొందుతాడు.ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు..కానీ నువ్వు నిన్ను నమ్ము.పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు..కానీ నీ సంకల్పం నీకు అనుకూలంగా ఉంటే ఏ శక్తీ నిన్ను ఆపలేదు.బ్రతుకు భారంగా అనిపించిన ప్రతిసారీ ఈ ఒక్క మాటను నీ హృదయంలో చెక్కించుకో..."ఈ బాధ కూడా పోతుంది..ఈ చీకటి కూడా తొలగిపోతుంది..ఈ కన్నీళ్లు కూడా ఆగిపోతాయి..నా సమయం కూడా వస్తుంది..నేను కూడా గెలుస్తాను..నేను పడిపోవడానికి పుట్టలేదు..లేచి ప్రపంచానికి నా విలువ చూపించడానికి పుట్టాను!"
గుర్తుంచుకో..ఓడిపోయిన మనిషి కథ అక్కడితో ముగియదు..లొంగిపోయిన మనిషి కథ మాత్రమే ముగుస్తుంది కాబట్టి..లొంగిపోకు..పోరాడు..నిలబడు... గెలువు!

5)

నిలబడటమే నిజమైన గెలుపు

🙏 జై శ్రీరామ్ 🙏

ఇక్కడ నువ్వు ఎంత అరిచినా ఓటమే…
నువ్వు ఎంత మౌనంగా ఉన్నా అవమానమే…

ఎందుకంటే నువ్వు ఒక్కడివి కాదు—
నీ వెనుక ఒక కుటుంబం ఉంది.
నీ ప్రతి నిర్ణయం వాళ్ల జీవితాలను ప్రభావితం చేస్తుంది.

నువ్వు ఆవేశంతో ఎదురు తిరిగితే
నలిగిపోయేది నువ్వే…
నువ్వు పరిస్థితులకు తలవంచితే
కుంగిపోయేది కూడా నువ్వే…

ఈ వ్యవస్థ ఎవరి కోసం ఆగదు.
నువ్వు ఆగిపోతే నీ స్థానంలోకి ఇంకొకరు వస్తారు.
కానీ నువ్వు కూలిపోతే…
నీతో పాటు నీ ఇంటి ధైర్యం కూడా కూలిపోతుంది.

అందుకే ఒక్క మాట విను…

ఎదుటివాడిని మార్చాలని ప్రయత్నించే ముందు
నిన్ను నువ్వు నిలబెట్టుకో.

నువ్వు నిలబడితేనే
నీ చుట్టూ ఉన్నవాళ్లు ధైర్యంగా నిలబడగలరు.
నువ్వు గెలిస్తేనే
నీ ఇంట్లో నిజమైన పండుగ మొదలవుతుంది.

ఆవేశాన్ని వదిలేయ్…
దాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకో.

కోపాన్ని వదిలేయ్…
దాన్ని కసిగా కాదు, కృషిగా మార్చుకో.

నీ ఆయుధం అరుపు కాదు…
నీ ఓర్పు.

నీ బలం ఎదురు తిరగడం కాదు…
ఎన్ని తుఫాన్లు వచ్చినా కూలిపోకుండా నిలబడటం.

గుర్తుపెట్టుకో…

అరిచేవాడు బలవంతుడు కాదు.
అణచుకుని, ఆలోచించి, సరైన సమయం కోసం నిలబడేవాడే అసలైన రాజు.

ఈరోజు నిన్ను ఎవరూ గుర్తించకపోవచ్చు.
నీ బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు.
నీ మౌనాన్ని బలహీనతగా భావించవచ్చు.

కానీ నువ్వు మాత్రం పడిపోకు…

ఎందుకంటే
ఈరోజు నీ ఓర్పు రేపటి నీ విజయానికి పునాది.

నువ్వు నిలబడితే చాలు…
రేపు నీ కుటుంబం గర్వంగా నీ వైపు చూస్తుంది.
నీ ప్రయాణమే ఒక కథ అవుతుంది.
నీ పేరు ఒక గుర్తింపవుతుంది.

చివరి మాట రాయితో రాసిపెట్టుకో—
పరిస్థితులు మనిషిని ఓడించవు…
మనిషి తనలోని ధైర్యాన్ని వదిలేసినప్పుడే ఓడిపోతాడు.

నిలబడు… ఓర్పుగా నిలబడు…
రేపటి చరిత్ర నీ పేరుతో మొదలవుతుంది.

ఇట్లు…
మీ… ✍🏻 రఘురాం


కొందరు మనుషులు మన జీవితంలోకి ఎందుకు వస్తారో మనకు ఎప్పటికీ అర్థం కాదు…కానీ వారు వచ్చిన తర్వాత మన హృదయంలో ఎంత లోతైన స్థానం సంపాదించారో మాత్రం ప్రతి క్షణం అనుభూతి చెందుతూనే ఉంటాం.టికెట్ లేకుండా వచ్చిన ప్రయాణికుల్లా మన జీవితంలోకి అడుగుపెట్టి,మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు.అయితే ఒక దశలో,మనసు వారిని వెళ్లనివ్వకపోయినా..పరిస్థితులు మాత్రం వారిని మన జీవిత రైలు నుంచి దిగిపోవాల్సిన స్థితికి తీసుకువస్తాయి.“నేను దిగిపోనా?” అని ఆమె అడిగినప్పుడు,నా హృదయం పగిలేంతగా కేక వేసింది—“వెళ్లిపోవద్దు” అని.కానీ ఆమెను ఆపే పరిస్థితి గానీ,ఆమెకు తోడుగా నిలిచే శక్తి గానీ నా దగ్గర లేకపోవడంతో,కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుంటూ,గొంతు వణుకుతుండగా ఎంతో బాధతో “దిగిపో” అని చెప్పాల్సి వచ్చింది.ఆ మాట నా పెదవుల నుంచి బయటకు వచ్చినా,నా మనసు మాత్రం ఆమెను ఒక్క క్షణం కూడా వెళ్లనివ్వలేదు.“కుదిరినప్పుడు మళ్లీ రా” అని చెప్పాను.ఆ మాటలో ఆశ కంటే ఎక్కువగా,ఆమెను శాశ్వతంగా కోల్పోవద్దన్న నా ఆర్తి,ఆమె తిరిగి వస్తుందన్న నా నమ్మకం దాగి ఉన్నాయి.అదే బాధతో,అదే ఆశతో,అదే అనుబంధాన్ని గుండెల్లో మోస్తూ ఆమె కూడా అడిగింది.ఇది ఇద్దరి మధ్య జరిగిన శాశ్వత విరహం కాదు..మనసులు కలిసే ఉన్నప్పటికీ,పరిస్థితులు దూరం చేసిన ఒక చిన్న విరామం మాత్రమే.బహుశా దీన్నే కర్మ అంటారేమో! కానీ నా హృదయం మాత్రం దాన్ని కర్మగా అంగీకరించదు..మళ్లీ కలుసుకునే బంధం ఎంత నిజమైనదో,ఎంత బలమైనదో నిరూపించడానికి దేవుడు పెట్టిన ఒక కఠినమైన పరీక్షగా మాత్రమే భావిస్తుంది.ఖాళీ అయిన సీటు బయటికి ఖాళీగా కనిపించవచ్చు..కానీ ఆ సీటుపై కూర్చున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ ఖాళీ కావు.మనసులో ఒకసారి చోటు సంపాదించిన వారు దూరంగా వెళ్లినా,మన ఊపిరిలో,మన జ్ఞాపకాలలో,మన ప్రతి నిశ్శబ్దంలో జీవిస్తూనే ఉంటారు.వారి లేని లోటు ప్రతి క్షణం కనిపించినా,వారు తిరిగి వస్తారన్న ఆశ మన హృదయాన్ని నిలబెడుతూనే ఉంటుంది.ఆ స్థానం నిజంగా మనదే అయితే,కాలం ఎంత గడిచినా..దూరం ఎంత పెరిగినా..ఒక రోజు మళ్లీ వచ్చి అదే చోట కూర్చోవచ్చు.ప్రతి బంధాన్ని కాపాడలేకపోవచ్చు..ప్రతి మనిషిని మనతోనే ఉంచుకోలేకపోవచ్చు..కానీ నిజమైన అనుబంధం ఉంటే,దూరం మనుషులను వేరు చేయగలదేమో గానీ,హృదయాలను మాత్రం ఎప్పటికీ విడదీయలదు.నిజమైన ప్రేమకు ముగింపు ఉండదు..కొన్నిసార్లు అది కేవలం ఒక నిశ్శబ్ద విరామం తీసుకుంటుంది—కన్నీళ్లను జ్ఞాపకాలుగా మార్చుకుని, ఆశను ఊపిరిగా చేసుకుని,మళ్లీ కలుసుకునే ఆ మధురమైన రోజు కోసం..*ఇట్లు…మీ రఘురాం ✍🏻*

Saturday, July 12, 2025

ఒక ఆడ – ఒక మగ స్నేహం

ఒక ఆడ – ఒక మగ స్నేహం గురించి మాట్లాడడం అంటే, సమాజం వెంటనే దాన్ని శరీర సంబంధంగా చూడాలనుకుంటుంది.కాని కొన్ని బంధాలు, కొన్ని పరిచయాలు,కొన్ని అనుబంధాలు – శరీరాన్ని తాకకుండానే మనసులను నిండి పోయే ప్రేమను పంచుతాయి.ఆ స్నేహనికి పునాది భరోసా, బాధ్యత, బాధల్ని వినగల గుండె, నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.ఇది రొజూ కనిపించే స్నేహం కాదు.అది ఓ అందమైన అనుభూతి.
ఒకరికి ఒకరు తాకాల్సిన అవసరం లేకుండా,
వారి మధ్య ఏమీ జరుగాల్సిన అవసరం లేకుండా,
మనసులో ఓ ప్రాముఖ్యతను పొందిన బంధం.కొందరితో మనం మాట్లాడకపోయినా, వారు మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటారు.
వారితో మాటలు లేకున్నా, మనం ఏదో ఓ విధంగా కనెక్ట్ అయిపోతాం.అది శరీరబంధం కాదు.
అది ఓ జీవబంధం.ఆ బంధాన్ని గుర్తించడం, గుర్తేరిగి మసులుకోవడం, ఇంగిత జ్ఞానంతో హుందాగ వ్యవహరించడం చాలా అవసరం.ఒకరికి ఒకరు శారీరకంగా దగ్గరవాల్సిన అవసరం లేకపోయినా, మనసుకు ఒకరికొకరు అవసరంగా మారిపోతారు, ఈ ప్రపంచంలో తమ జీవిత కాలంలో ఒకటో రెండో సార్లు మాత్రమే కలిసిన వారు సైతం కేవలం వారి భావాలను అక్షరాల రూపంలో లేఖల ద్వారా.. ఎన్నో ఊసులను టెలిఫోన్ లో మాటల ద్వారా పంచుకున్నారు... ఇప్పటికి పంచుకుంటూనే ఉన్నారు కూడా..  జీవితం నేర్పే గొప్ప పాఠాలలో ఇలాంటి కంపెనీయన్ మనకొక కాన్ఫెషన్ బాక్స్, ఒకరి శరీరానికి దగ్గరవ్వడం కాదు. జీవితం అంతా వాళ్లతో పాటు ఉండాలనిపించడమే అసలైన బంధం.ఈ విధమైన బంధాలు కొంతకాలం మన జీవితాల్లో ఉంటే చాలు. మనం మనమయ్యే మార్గాన్ని చూపుతాయి.మన జీవితానికి ప్రేరణ అవుతాయి.ఆత్మను తాకే ఆ అనుబంధాలు, ప్రతి రోజు మనలో కొత్త వెలుగు నింపుతాయి.వాళ్లు మన జీవితాల్లోకి ఎందుకు వచ్చారో మనకి అర్ధం కావొచ్చు కాకపోవచ్చు. కానీ వాళ్ల వల్ల మనం ఎలా మారామో చెప్పలేం.ఆ బంధానికి శబ్దం ఉండదు.కాని ప్రతి నిశ్శబ్దంలో వాళ్ల ఉనికిని మనం వినగలుగుతాం.
కొన్ని స్నేహాలు సెక్స్‌కి మించినవిగా ఉంటాయి.
వాటి వెనుక శరీరం లేదు – హృదయం ఉంది.
వాటి వెనుక స్వార్థం లేదు – శ్రద్ధ ఉంది.
వాటి వెనుక మాటలు ఉండకపోయినా – అంతరంగికత ఉంది.ఇది తెలియని వారికి అసాధ్యం అనిపించొచ్చు.కానీ తెలిసిన మనకు – ఇది ఓ పునీతమైన బంధం అనిపిస్తుంది.ఇలాంటి బంధాలు మనలో మంచితనాన్ని నమ్మే నమ్మకాన్ని బలంగా నిలబెడతాయి.ప్రేమ, బంధం, హృదయ సంబంధాలకు శరీరాన్ని అద్దంగా చూపే ఈ ప్రపంచంలో –
మనసుల బంధమే శాశ్వతం అనే నిజాన్ని గుర్తు చేస్తాయి.ఈ బంధాలకు పేరు అవసరం లేదు... కానీ వారి ప్రెసెన్స్ మాత్రం మనసులో ఎప్పటికి చెరిగిపోదు.
శరీరం తాకకుండానే, మనసులు ఒకదానితో ఒకటి కలిసి పోయిన చోటే ఈ బంధాల పుట్టుక.
ఈ బంధం లో వేదన ఉంది – కానీ భారం కాదు,మౌనం ఉంది – కానీ దూరం కాదు,ఆత్మీయత ఉంది – కానీ అవసరం కాదు.ఇది ఒకరికోసం ఒకరిగా పుసే సుగంధ అనుబంధం,ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఒకసారి వీచిన పరిమళం మరిచిపోలేనిది.
మన జీవితంలో అలాంటి ఒక్క బంధం ఉండడం చాలా అవసరం.జీవితాన్నే ఓ మధురమైన గాథలా భావించడానికి. ఎంతమంది వచ్చినా, ఎవరూ అర్థం కాకపోయినా – ఈ ఒక్క బంధం మన అంతరంగాన్ని అర్థం చేసుకుంటుంది.ఈ బంధాల మధ్య
ప్రేమకు అర్థం ఉంది,స్నేహానికి గంభీరత ఉంది,
సంభాషణలకంటే మౌనం ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి బంధాలు మన జీవితం లోకి రావడం,మన ఉనికిని మరింత మానవీయంగా, మరింత సంపూర్ణంగా మార్చడం…అదే జీవితం ఇచ్చే గొప్ప వరం.ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఇది స్నేహానికి ఉన్న పరమార్థం.ఇది జీవితంలో ఒక అందమైన వసంతం.
ఇది మనకి దేవుడు ఇచ్చిన ఓ అణగారిన ఆశీర్వాదం.
ఇలాంటి బంధాన్ని కలవడం అరుదు,దాన్ని అర్థం చేసుకోవడం మరింత అరుదు,కానీ దాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మన జీవితాన్ని మరింత అందంగా మార్చుతుంది..మన జీవితంలో ఒకరైన సరే – అలాంటి వ్యక్తి ఉండగలిగితే, మనం ఈ జీవితాన్ని మరోలా ప్రేమించగలుగుతాం.... 

Wednesday, July 9, 2025

ప్రతి బంధం

ప్రతి బంధం – మొదటగా ఒక అవకాశంతో మొదలవుతుంది.అదే అవసరంగా మారుతుంది.చివరికి అది అలవాటవుతుంది.అది ప్రేమకావచ్చు,స్నేహం కావచ్చు..ఒక కన్ను చూస్తుంది.ఒక క్షణం ఆగుతుంది..ఒక మాట మొదలవుతుంది.అదే ఒక కొత్త బంధానికి తలుపు తీయగలదు.బంధాలు మొదలయ్యే సమయంలో మనకు తెలియదు.ఇది ఎంత దూరం నడుస్తుంది?ఇది ఎంత లోతుగా ప్రవేశిస్తుంది? అని కానీ ఒక అవకాశం ఇచ్చే మనసు ఉంటే.మనిషిలో మనిషి కనిపిస్తుంది.ఎవరో చిరునవ్వుతో పలకరిస్తే,ఎవరో మన మాట వినగలిగితే.మనలో ఏదో తెలీకుండానే  మెరవడం మొదలవుతుంది.ఈ *అవకాశం* అంటే ఒక బంధానికి వేసే తొలి అడుగు.అది పెద్దదైనా,చిన్నదైనా మనసును తాకగలిగితే చాలు.
అది అనుబంధమవుతుంది. *అవసరం*.బంధాన్ని పోషించే ఎవరి జీవితం లోనైనా ఒక సమయంలో
ఒకరిని అవసరంగా అనిపిస్తుంది.మన మాట వినే వ్యక్తి,మన మౌనం అర్థం చేసుకునే మనిషి,మన భయానికి అండగా నిలిచే నీడ.అవసరం అనిపించే బంధాలు జీవితంలో చాలా ఉంటాయి.ఎవరైనా మన బాధ విన్నప్పుడు,మనకు ఒక మౌనపు తోడు ఇచ్చినప్పుడు...మనసులో ఒక జాగా వాళ్ల కోసం ఖాళీ అవుతుంది.అదే *అవసరం*.అలాగని అవసరంతో మొదలైన బంధం తక్కువ అని కాదు.మన బలహీనతల్లో ఎవరు మన చేయి పట్టుకుని నడిపిస్తారో వారే మన జీవితంలో నిలిచిపోయే మనుషులు..*అలవాటు* ఆత్మకి అతుక్కున్న లేదా హత్తుకున్న తోడు ఒకప్పుడు పరిచయమైన వ్యక్తి,ఒకరోజు అవసరమయ్యాడు,తర్వాత అతనితో లేకపోతే అసహ్యం అనిపించేట్టుగా...అదే *అలవాటు*.ఇది అత్యంత శక్తివంతమైన ఘట్టం.
ఇక్కడే మనం పడిపోతాం,గిలగిలలాడతాం.ఎవరో దూరమైనప్పుడు,మనలో గాయం మిగులుతుంది.ఏం జరిగిందో మనకే అర్థం కాకపోతేనూ,వాళ్ళ లేక పోవడమే బాధిస్తుంది.అలవాటు అనేది బంధానికి మనసుతో వేసిన పట్టు.అది ఒక మత్తు కాదు.
ఒక నిశ్చల ప్రేమ లక్షణం.అలవాటవ్వడం అంటే 
అలవాటు పడిన మనిషి ఎదుట లేకపోయినా,మనం స్వచ్ఛంధంగా వారి కోసం ఎదురుచూస్తాం.వారి రాక మీద మన దినచర్య,మన ఊహ,మన గడియారమే ఆధారపడిపోయింది.మన ముందు వారు చిరునవ్వు నవ్వకపోతే,మన హృదయం ఎందుకో బాధ పడుతుంది.వాళ్లు మౌనంగా ఉంటే మన కన్ను తడుస్తుంది.ఎందుకంటే అలవాటు మన భావోద్వేగాలను వారి వైపు ఆకర్షించేసింది.అలవాటు అనేది కేవలం ఒకరి జ్ఞాపకం కాదు.అది మన లోపల వారి శ్వాసలా మారిపోతుంది.వారి గమనమే మన గమనంలా అనిపిస్తుంది.వారి అసంతృప్తి మన బాధలా అనిపిస్తుంది.ఈ స్థాయికి చేరినప్పుడే అలవాటు అనేది ప్రేమకంటే లోతుగా అనిపిస్తుంది.
అవకాశం → అవసరం → అలవాటు.అది స్నేహం కావచ్చు,బంధుత్వం కావచ్చు,ప్రేమ కావచ్చు,కలుసుకున్న రహదారి కావచ్చు.ఈ చక్రాన్ని ఏ దశలోనైనా విరమించవచ్చు.కానీ మన మనసు దాని పంథాను మర్చిపోదు.ఇందుకే కొన్ని బంధాలు నిష్ఫలమైనా మనలో ఏదో మిగిలిపోతుంది.ఒక చిన్న ఆశ.ఒక చిరు వేదన.ఒక ఊహ,ఒక అలజడి.ప్రతి బంధం అవకాశంగా మొదలవుతుంది,అవసరంగా,
ఎదుగుతుంది,అలవాటుగా మారుతుంది.కానీ నిజమైన బంధం.దేనికీ అర్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా మనసునే అర్థం చేసుకుంటుంది.అయితే ఈ మూడు గుండా ఏర్పడేదే అనుభవం.
అవకాశం + అలవాటు + అవసరం = అనుభవం..ఈ మూడూ కలిపిన తర్వాత జీవితంలో మిగిలేది ఒక్కటి అనుభవం.అనుభవం – బంధాన్ని బలపరిచే నాలుగవ స్థాయి.ఇది ఊహతో వచ్చే పాఠం కాదు.ఒక సన్నివేశం,ఒక బంధం,ఒక వేదన…మనలో తళుకుల్లా మెరుస్తూ శాశ్వత గుర్తుగా మారిపోతుంది.అనుభవం అంటే కాలంతో లిఖితమైన భావోద్వేగం.ఒకరి నుంచి సాయం ఆశించి నిరాశపడ్డపుడు.ఒకరి కోసం ఎదురుచూసి వారు రాకపోయినప్పుడు.ఒకటి కాదు,రెండూ కాదు ఎన్నెన్నో పర్యాయాల్లో మనం మౌనం వెచ్చించినప్పుడు.ఆ మౌనం మన హృదయాన్ని వెతికి, మనిషిని మార్చేస్తుంది.అదిఅనుభవం.అనుభవం గమనించనంత మెల్లగా మనలోకి వస్తుంది.ఒక రోజు మనం ఎదుట కూర్చున్నవారిని చూసి,
వాళ్ల మాటల్లో ఉన్న మౌనం వినగలిగితే.అది మన అనుభవం మనకు నేర్పిన అభిజ్ఞత.అనుభవం బంధాన్ని శోధిస్తుంది – నశింప జేయదు..అవకాశం వచ్చినప్పుడు మనం ఓ బంధాన్ని మొదలు పెడతాం.అలవాటయ్యాక దానికి మనసు ఎగబాకుతుంది.అవసరం ఏర్పడితే దాన్ని కోల్పోవడం భయంగా అనిపిస్తుంది.కానీ అనుభవం వచ్చిందంటే.ఈ మూడింటినీ దాటి ఆ బంధం మన మనసులో పాతుకుపోయిందని అర్థం.అప్పుడు మనం వదిలి పెట్టవచ్చు,కానీ మరిచిపోలేం.ఒక ప్రేమ విఫలమవచ్చు,కానీ దాని అనుభవం మనం ప్రేమించే తీరును మార్చేస్తుంది.ఒక స్నేహం దూరమవచ్చు,కానీ దాని అనుభవం మనలో ఒక జ్ఞాపకంలా నిలిచి పోతుంది.అనుభవం అంటే ఎదిగిన మనసు అనుభవం వచ్చాక మనం ఇక భయం కోసం బతకం.అభిప్రాయం కోసం కాదు.అర్థం కోసం ఎదురు చూస్తాం.ఎవరైనా మనల్ని పిలవకపోతే బాధపడం,మన విలువలను మర్చిపోవద్దని మనల్ని మనమే గుర్తు చేసుకుంటాం.అదే అనుభవం నిజంగా మానవత్వాన్ని నేర్పే దశ.అనుభవం తర్వాత మనం నేర్చుకునేది.ప్రేమ అనేది ఒత్తిడిలో ఉండకూడదు.బంధం పుట్టించేది దృష్టి కాదు.దాని వెనుక ఉన్న శ్రద్ధ.అవసరం గౌరవంగా ఉంటేనే బంధం స్థిరంగా ఉంటుంది.దూరం వచ్చినా,అనుభవం కాసేపు నవ్వుతూ వెనక కనిపిస్తుంది..ప్రతి మౌనం.ఓ తలపుగా మారు తుంది..ప్రతి తేడా.ఓ సహనంగా మారుతుంది..ప్రతి అణకరం.ఓ అర్థంగా మారుతుంది..అదే అనుభవం మన బలహీనతలను మారుస్తుంది,మన సంశయాలకు జవాబుల్లా నిలుస్తుంది.అవకాశం ఓ తలుపు మాత్రమే.అవసరం ఓ నడక మాత్రమే..అలవాటు ఓ దారి మాత్రమే.కానీ అనుభవం అది మనసు ముడిపడే చివరి గమ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*