Friday, November 20, 2009

అందమైన జీవితం

“ప్రతి వాళ్ళకి ఓ ఫిలాసఫీ లేదా ఓ నమ్మకం ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళ జీవితం నడుస్తుంది. ’చక్కగా జీవించడం ’ అన్నది మా ఫిలాసఫి. ”

“ప్రతిరోజు కనీసం ఒక్క ఆనందమయిన అనుభూతి అయినా పొందాలన్నది మా ధ్యేయం. ఆనందం అంటే బ్యాంక్ బాలన్స్ కాదు, ఆస్తులు కాదు. మంచి ఉద్యోగం లేదా కారు కాదు. ఆనందం అంటే సింపుల్ ప్లెషర్స్. సాధారణమయినవి, చిన్నవి, అతి చిన్నవి కూడా, మనకిష్టమైన పాట వినడమో, ఉదయమే వెచ్చని నీరెండలో చేతులు పట్టుకొని అయిదు నిముషాలు నడవడమో, చకటి పుస్తకంలోని కొన్ని పేజీలు చదవడమో, వసంతకాలంలో కోకిల గానం వినడమో, ఆ సంవత్సరంలో ఆరోజు మొదటిసారి మామిడిపండు తినడమో, పూర్తిగా విచ్చుకొన్న గులాబి పువ్వుని కోసి మనకి పరిచయంలేని చిన్నపిల్లకి ఇచ్చి ఆ పాప మొహంలో చిరునవ్వు చూడడమో … ఇలాంటి ఆనందమయిన అనుభూతులని వెదుక్కోడం వాటితో జీవించడం ఎంత చక్కటి ఆనందరకమైన జీవితమో కదా.”

అతను చెప్పేది ఆసక్తితో కూడిన శ్రద్ధ తో వింటోంది ఆమె. అతను అకస్మాత్తుగా చెప్పటం ఆపేసి ఆమె వంక చూసి..

“సారి మీకు విసుగేసే మాటలు చెప్పా కదా! ఒకోసారి ఎదుటివాళ్ళని గమనించకుండా మాట్లాడుతాను.” అన్నాడు.

“నాదీ మీ స్వభావమే, కాని మనలాంటివారిని చాలా మంది పిచ్చివాళ్ళు , సెంటిమెంటల్ ఫూల్స్, అనుకుంటారు, వాటిల్లో ఆనందం అందరికీ అర్థం కాదు”.

నిజమే ప్రస్తుత యాంత్రిక జీవితాలకి, ఉరుకుల పరుగుల సంపాదన జీవితాలకి కొన్ని ఆనందాలు అర్థం కావు. చెప్పేవాళ్ళని పిచ్చివాళ్ళనుకొంటారు.

పైన అతను - ప్రియతమ్, ఆమె – శాంతి. వీరిద్దరికి ఏ రక్త సంబంధంలేదు. ఏ బీరకాయ పీచు చుట్టరికంలేదు. కాలేజ్ లో కాని, స్కూల్లో కాని కలిసి చదువుకోలేదు. ఒక లోకల్ రైల్ లోని యాదృచ్ఛికంగా పరిచయమయిన ఒక ఆడ – మగ, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కాని ఆ పెళ్ళి వాళ్ళ స్నేహానికి అడ్డురాలేదు.

GETTING MARRIED IS EASY. STAYING MARRIED IS DIFFICULT. STAYING HAPPILY MARRIED FOR A LIFETIME SHOULD RANK AMONG THE FINE ARTS

No comments:

Post a Comment