నాలుగు పదాలు రాసి
కవితని మురిసిపోతా..
అక్షరాలను పద మాలికలు చేసి
నా భావాల పరిమళలను గుబాలిస్తా..
సందిగ్దవస్థలో కొట్టుమిట్టాడుతున్న
మిత్రుల భ్రమలు తొలగిస్తా..
బాధల బందీలలో బరువెక్కిన
గుండెలకు ప్రమోదమౌతా..
మోడుబారిన ఆశయాలకు
శక్తినిచ్చే ఔషధమౌతా..
నీలో నిద్రణంగా దాగిపోయిన
నిన్ను నీకు పరిచయం చేస్తా..
నా మాటలు చేరలేని ప్రాంతానికి సైతం
ఓ కవితా సందేశాన్ని పంపి పలకరిస్తా..!!
No comments:
Post a Comment