🍁 *ప్రతీదీ నాకు ఆదర్శమే*🍁
తన మూలంగా లోకం ఆగిపోకూడదని రోజంతా వెలుగునిచ్చే *🌞సూర్యుడు* నాకు ఆదర్శం...
తను కరిగిపోయినా పక్కవాల్లకు వెలుగునివ్వాలనుకునే🕯️*కొవ్వొత్తి* నాకు ఆదర్శం...
పడకొట్టినవాడిపైన పగపట్టకుండా, దారం దారం పోగేసుకుని మరో గూడు కట్టుకునే *సాలేపురుగు*🕸నాకు ఆదర్శం...
తీరాన్ని సంద్రంగా మార్చాలని అనుక్షణం ప్రయత్నించే *అలలు*🌊 నాకు ఆదర్శం...
దూరం ఎంతైనా క్రంమం తప్పకుండా నడిచే *🐜చీమలు* నాకు ఆదర్శం...
మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకుని వచ్చే🌱 *మొక్క* నాకు ఆదర్శం...
ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్షం వైపే దూసుకెల్లే 🏹 *"బాణం* నాకు ఆదర్శం...
ఒక సారి అన్నం పెడితే చాలు , జన్మంతా విశ్వాసంతో ఉండే 🐕 *సునకం* నాకు ఆదర్శం...
జీవించేది కొంతకాలమే అయినా అనుక్షణం ఆనందంగా ఉండే🦋 *సీతాకోకచిలుక* నాకు ఆదర్శం...
తానెంత చిన్నదైనా ,తన వంతు భూదాహాన్ని తీర్చే *💧చినుకు* నాకు ఆదర్శం...
చుట్టూ చీకటే ఉన్నా,వెన్నెలను పంచే *🌛చందమామ* నాకు ఆదర్శం...
అసాద్యమని తెలిసినా,ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే *గాలిపటం* నాకు ఆదర్శం...
ప్రత్యర్థి పెద్దదైనా సరే,ప్రయత్నించి కాసేపైనా సూర్యున్ని కప్పి ఉంచే *మేఘం* నాకు ఆదర్శం...
తానున్న పరిసరాల చుట్టూ పరిమలాలు నింపే *🌹పువ్వు* నాకు ఆదర్శం...
వేడినంతా తానే తీసుకుని, మనకు మాత్రం చల్లని నీడనిచ్చే *🌴చెట్టు*నాకు ఆదర్శం...
ప్రతిదానిలోనూ మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమమంలో పాలని మాత్రమే తాగే *హంస🦢* నాకు ఆదర్శం...
No comments:
Post a Comment