Thursday, December 1, 2022

మంచి మాటలు -2023

1) గమ్యమెరుగని గమనంలో జీవితాన్ని అగమ్యగోచరం చేసుకోకు..చుట్టూ చేరిన కాకుల కూతలకి భయపడి వెనుకడుగు వేయకు..మునిగిపోతూ ఒడ్డుకు చేరే దారే లేదని వేదనతో రోధించకు..అణువంత సమస్యకి ఆకాశమంత ఆలోచిస్తూ అజ్ఞానపు నిర్ణయాలే నిజాలంటూ భ్రమలో బ్రతికేయకు..పుట్టినది మొదలు సమస్యల కోరల్లో చిక్కుకుంటూ విధిచేతిలో వంచింపబడ్డానని పొరబడకు..మనిషినై పుట్టినందుకు మానవత్వాన్ని మరువకు ఈ పుట్టుకకు అర్థాన్ని తెలుసుకోలేనంత అర్థాంతరంగా పుడమిలో కలిసిపోకు కాబట్టి దేనికి తొందరపడకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమయం సందర్భం వస్తుంది కావల్సింది ఓపిక మాత్రమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


2) జీవితంలో నువ్వు ఆలోచించినంత మాత్రాన ఎం మారకపోవచ్చు కానీ..ఆచరించడానికి ఎదో ఒక మార్గం దొరుకుతుంది కానీ దాంట్లో చెడు ఆలోచన ఉంటే అది ఏ మాత్రం నీ మనుసుని ప్రభావితం చేయకూడదు,ఆ ఆలోచన నీ మానసికస్థిని దెబ్బ తీయకూడదు.ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది అది వస్తే కానీ మనం ఎంత అనుకున్నా ఎం చేయలేం ఆ అదును కోసం వేచి చూడు ఆ అవకాశం చిక్కగానే చిరుతలా వేగాన్ని పుంజుకో..అప్పుడు ఆలస్యం చెయ్యకుండా ఉంటే నీ ఆలోచనలకి అర్ధముంటుంది అంతే కానీ ఒకే ఆలోచనలో ఉండిపోతే నీ చుట్టూ ఉండే అవకాశాల్ని చూడలేవు కాబట్టి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకు అప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని త్వరగా చేరగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

3) జీవితంలో అన్ని ఉంటే నువ్వెంటి ఎవడైనా కాలర్ ఎగిరేస్తాడు.ఏమి లేని నువ్వు నుంచి అన్ని ఉన్న నువ్వుగా ఎదుగు అప్పుడు తెలుస్తుంది జీవితంలో ఉండే మజా ఏంటో.వేట ఎంత గొప్పగా సాగితే విందు అంత రుచిగా ఉంటుంది.నువ్వు జీవితంలో ఎంత నలిగితే మునుముందు అంత గొప్పబాట నీకై వేచి ఉంటుంది.సూక్తులు బాగుంటాయి పడే వాడికి తెలుస్తుందనే మాట సోమరిపోతు నుంచి వస్తుంది కష్టం చేసి చూడు నువ్వనుకున్న కలిసొచ్చే కాలం రానే వస్తుంది కాబట్టి నీ లక్ష్యం కోసం కష్టపడడమే నీకున్న ఏకైక మార్గం ఎంత కష్టపడుతే అంత ఫలితం అందుకే పెద్దలు కష్టే ఫలి అన్నారు...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

4) ఎగసే కెరటం,మెరిసే మెరుపు,కదిలే కాలం..ఎవరికోసం ఆగవు దీపముండగానే ఇల్లు చక్కబెట్టు...అరచేత్తో సూర్యకాంతిని పిడికిట్లో వీచే గాలిని..ఆపాలని ప్రయత్నించడం అవివేకం, వృథా ప్రయత్నం.నేల విడిచి సాము చేయకు..గాలిలో మేడలు కట్టకు..వనరులను సమీక్షించుకొని..ఆశయాలను రూపుదిద్దుకో..చీకట్లను చీల్చుకు వచ్చే..ఉషోదయాన్ని ఆపడం ఎవరి తరం కాదు.. కాబట్టి నీ ప్రయత్న లోపం లేకుండా శ్రమిస్తే నీ విజయాన్ని ఆపేదెవరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

5) జీవితంలో నీ విలువ ఎప్పుడూ నీలోనే ఉంటుంది.దానిని గుర్తించలేని వాడి దగ్గర నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఎందుకూ పనికిరాని వాడివే.కానీ ఎప్పుడైతే నీ విలువని గుర్తించే వ్యక్తి తారసపడతాడో అప్పుడు నిన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు కాబట్టి జీవితంలో ఎదగాలనుకుంటే నువ్వు ఎక్కడ ఎవ్వరితో ఉన్నావనేది ప్రధానం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

6)చాలామంది నా వల్ల ఏమి కాదు? నాకు అంత అదృష్టం లేదు? ఇదంతా నాకు సాధ్యమయ్యే విషయం కాదు అసలు? ఇలా ఆలోచిస్తే మనం అనుకున్న గమ్యాన్ని సాధించగలమా? ఏమి చేయాలన్నా ముందు మన ఆలోచనల్లో,మన  ప్రవర్తనలో మార్పు రావాలి..మనం అలానే వుంటే  ప్రపంచం కాదు కదా మన చుట్టూ పక్కనవాళ్ళే మనల్ని గుర్తించరు అందుకే వేగంగా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా వ్యూహాలు ప్రణాళికలు తయారు చేసుకువాలి..కళలు కంటే సరిపోదు వాటిని నెరవేర్చుకోవడానికి మనం చేసే ప్రయత్నాలేంటి అని ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి మనం జీవితంలో విజయం సాధించాలంటే మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాల ,ఆలోచించే విధానం మన ప్రణాళికల మీద ఆధారపడి ఉంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

7)ఎగసే కెరటం,మెరిసే మెరుపు,కదిలే కాలం..ఎవరికోసం ఆగవు దీపముండగానే ఇల్లు చక్కబెట్టు...అరచేత్తో సూర్యకాంతిని పిడికిట్లో వీచే గాలిని..ఆపాలని ప్రయత్నించడం అవివేకం, వృథా ప్రయత్నం.నేల విడిచి సాము చేయకు..గాలిలో మేడలు కట్టకు..వనరులను సమీక్షించుకొని..ఆశయాలను రూపుదిద్దుకో..చీకట్లను చీల్చుకు వచ్చే..ఉషోదయాన్ని ఆపడం ఎవరి తరం కాదు.. కాబట్టి నీ ప్రయత్న లోపం లేకుండా శ్రమిస్తే నీ విజయాన్ని ఆపేదెవరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


8) జీవితంలో ఎవ్వరినీ భారం అనుకోకు ఎందుకంటే నువ్వు ఒకరికి భారం అయినప్పుడు నీకు అర్థం అవుతుంది మనం వారికి భారం కాదు బాధ్యత అని,చిన్నపిల్లలను అయిన పెద్దవారిని అయిన సరే బాధ్యతగా భావించు. కాలం ఎప్పుడు నీదే అవ్వదు మిత్రమా నువ్వు ఎవరినైనా భారం అని అనుకుంటే నువ్వు కూడా ఒకరికి భారం అని విషయం మర్చిపోకు.మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా  ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం.....అది మర్చిపోకూడదు చేసిన తప్పుకి ప్రతిఫలం ఎప్పటికైనా లభిస్తుంది అందుకనే అందరినీ బాధ్యతగా చూసుకుంటే నిన్ను అందరూ అలానే చూసుకుంటారు లేదా నువ్వు భారం అని అనుకుంటే అందరూ నిన్ను భారంగానే భావిస్తారు...ఆ స్థితికి దిగజారకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అప్పుడే సంబంధ బాంధవ్యాలు బలంగా ఉంటాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

9)జీవితంలో మంచిని మరింత దగ్గర చేసుకో..చెడుని చేతనైనంత దూరం పెట్టుకో...మారాలి అనుకునే ఆలోచనను మర్చిపోకు..మారను ఆనుకొని మరుగున పడి పోకు...సలహాలను సహృదయం తో స్వీకరించి సరిచేసుకో..విమర్శలను విచక్షణతో విచారించి వదులుకో...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


10)మన సమాజంలో కొందరుంటారు...ఎంతసేపూ ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ,ఎదుటివారి గెలుపులో వక్రాన్ని చూస్తూ ఎదుటివారి ఉన్నతినీ వెక్కిరిస్తూ,ఎదుటి వారి మంచితనంలో మచ్చలను వెతుకుతూ ఉంటారు..."వారంతే" వారు..మరి అలాంటి వారిని కూడా నీవు పట్టించుకుంటే ఎలా? వారిని పట్టించుకుంటే ఆగిపోయాది మీరే.కోల్పోయేది మీ మనశ్శాంతినే..వారి మాటలను వారిని రోడ్డు మీద చెత్తలా చూడాలే తప్ప "మొరిగే " ప్రతి గొంతుకూ వివరణ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఈజన్మ మనకు సరిపోదు..కాబట్టి ఎవరేమన్నా నీకు కనపడాల్సింది నీ గమ్యం నీ లక్ష్యం..మధ్యలో ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటుకుంటూ ముందుకు పో, గమ్యాన్ని ఛేదించు, విజయాన్ని సాధించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

11)ఎప్పుడయితే మీరు ప్రతి విషయానికి ఎమోషన్ అవుతూ ఉంటారో,అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం,ఆడుకోవడం,శాసించడం,మిమ్మల్ని బానిసగా చేసుకోవడం జరుగుతుంది.."ఎమోషన్ " ఒక స్పందన కానీ అది మనకు బలం కావాలే తప్ప బలహీనత కాకూడదు.మనం అన్ని చోట్లా "ఎమోషన్"అవకుండా మనల్ని మనం నియంత్రించుకోగలగాలి,ముఖ్యంగా అర్థం చేసుకోలేని మనస్తత్వాల ముందు నిబ్బరంగా ఉండగలగాలి..కాబట్టి దేనికి మనం స్పందించాలో ప్రతిస్పదించాలో తెలిస్తే మన బంధాలు అనుబంధాలకు దృడంగా ఉంటాయి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

12)ఎప్పుడైతే నీవు ఇది "నేను చేయలేను" అని అనుకుంటావో నీ మెదడు పని చేయడం ఆపేస్తుంది.ఎప్పుడైతే నీవు "నేను ఇది ఎలా చేయగలను" అని ఆలొచిస్తావో అప్పుడే నీ  మెదడు చురుకుగా అన్వేషణ మొదలు పెడుతుంది.ఎప్పుడైతే "నేను ఇది చేసి తీరాలి " అని నిర్ణయించుకుంటావో అప్పుడు  ఇక నీ మెదడుకు వేరే ఆప్షన్ లేదు సాధించి తీరుతుంది...కాబట్టి ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంది,మనలోనే ఉంది.బలమూ బలహీనత రెండూ మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

13)మంచి నీళ్లు  ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందినట్లుగా, పరిస్థితులు,పరిసరాన్ని బట్టి అడ్జస్ట్ అవ్వాలి.అలాగే మన జీవిత గమనం ఒక నదీ ప్రవాహంలా మన లక్ష్య సాధన కోసం ఒక మార్గం వేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళలే తప్ప ఆటంకం వచ్చిందని ఆగిపో కూడదు...అవసరమైతే దారిమార్చుకుని ఇంకో దారి వేసుకుంటూ సాగిపోవాలి ఏలాగంటే ఒక కొండ అడ్డు తగిలితే నది చీలి కొండను చుడుతూపోతుంది,అవసరమైతే జలపాతం లా కొండమీంచి దూకుతూ పోతుందే తప్ప ఆగపోదు...మనం చక్కగా పరీక్షిస్తే ప్రకృతి నేర్పే పాఠాలెన్నో,జీవితం నేర్పే గుణపాఠాలెన్నో కాబట్టి నువ్వు అనుకునే గమ్యాన్ని లక్ష్యాన్ని చేరేవరకు దేనిని లెక్కచెయ్యకు నదీ ప్రవాహంలా దాటుకుంటూ పోయినప్పుడే విజయం సాధించగలవు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


14)ఈ సమాజంలో కొంతమంది మనల్ని టార్గెట్ చేస్తూ చీటికిమాటికి ఎదో ఒకటి అంటూ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు..నిన్ను అన్న..! ప్రతిసారి నువ్వు మాట పడ్డావంటే..నువ్వు మంచోడివి అనుకోరు చేతకానివాడివి అంటారు.ఎందుకంటే సహనానికి ఒక హద్దు ఉండాలి లేకపోతే అది నిన్ను ఊరుమ్మడి సొత్తుని చేసి...చిన్న విషయానికి కూడా  నీ మీదకి మాటల తూటాల్లా దూసుకొచ్చేటంతలా దిగచార్చి అందరి ముందు నిన్ను నిలబెడుతుంది.అందుకే సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు తటపటాయించకు లేని సహనాన్ని ప్రదర్శించి నవ్వులపాలు కాకు అందరి ముందు అలా చేతకాని వాడిలా నిలబడిపోకు కాబట్టి నువ్వు చేసింది సరైనదని నీకు అనిపిస్తే ధైర్యంగా నిన్ను అనేవారికి తగిన గుణపాఠం చెప్పడానికి సంకోచించకు ఎందుకంటే ఇది నీ జీవితం..నీ జీవితానికి నువ్వే హీరో నువ్వే విలన్.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


15)జీవితంలో కలల గుడ్లు పెట్టి నిరాశను పొదిగితే విజయాలు వరిస్తాయా?ఊహల్లో విహరిస్తూ కాలాన్ని కరిగిస్తే ఆశలు నెరవేరుతాయా?ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసే నీవంటే విజయానికి ఇష్టం ఉండదు.నీ కల నెరవేరాలంటే నీ ఆశయం విజయరూపం దాల్చాలంటే..నీకు నీవే ఒక జ్ఞాన బోధకుడవు కావాలి.నిన్ను నీవే నడిపించే దివిటీవి కావాలి.అవకాశాన్ని నీవే శోధించి ఒడిసి పట్టుకోవాలి..శ్రీ శ్రీ గారు చెప్పినట్టు లే, లేచి నిలబడు, పరుగెత్తు పోరాడు.. సాధించు ఇక్కడ నీవు గెలవాలంటే యుద్ధం నీవే చేయాలి..రాజు మంత్రి సైన్యం ఖడ్గం అన్నీ నీవే కావాలి...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

16)జీవితంలో మనం గెలవాలి అనే ఆశ ఉన్నప్పుడు అది ఎప్పుడూ మనల్ని ఆగిపోనివ్వదు,అదే ఆగిపోదాం అనే ఆలోచన మనల్ని ఎప్పటికీ గెలవనివ్వదు కాబట్టి  ఆశకి నీ కష్టం శ్రమ తోడైతే నిన్ను ఆపేదెవ్వరు ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

17)ఒకే జోక్ నాలుగు సార్లు చెబితే నవ్వురాదు..బోర్ కొడతది మరి ఒకే సమస్యను,ఒకే కష్టాన్ని పదే పదే గుర్తుచేసుకుని ఏడవడమెందుకు? సమస్య లేదా కష్టం కలిగినప్పుడు దాని మూలాలను అన్వేషించాలి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి..వీలైతే ఆ సమస్య నుండి ఒక పాఠంనేర్చుకోవాలి...ఆ కష్టాన్ని దూదిపింజలా మార్చాలి.ఎప్పుడయితే సమస్యను నీవు కొండంతగా ఊహించుకుంటావో, నీ కొండంత బలం గోరంతవుతుంది..ఎప్పుడయితే సమస్యను గోరంతదే అనుకుంటావో నీ గోరంత బలం కొండంతవుతుంది..ఇది నిజం...ఏదయినా మనం అనుకోవడంలోనే ఉంది కాబట్టి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది దానికి ఓర్పుతో నేర్పుతో వెతికితే నువ్వు సాధించాలనుకున్నా దానిని త్వరగా అందుకో గలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

18) జీవితంలో గెలవడానికి మాత్రమే ప్రయత్నించు...గెలుస్తామా లేదా అని తనిఖీ చేసుకోవడానికి ప్రయత్నించకు.లోపం లేని ప్రయత్నం..గొప్ప విజయాలను సైతం అలవోకకగాఇస్తుంది.అసలు నువ్వు కలలు కంటేనే.. నువ్వు కలగన్న జీవితం నీకు లభిస్తుంది. గొప్పగా కోరుకుంటేనే... నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది. నిరంతరమూ నీ ప్రయత్నము లక్ష్యం వైపే ఉంచు,తప్పకుండా నువ్వుకలగన్న జీవితం లభిస్తుంది.ఇది తథ్యం.ధృడ సంకల్పంతో ప్రయత్నించే వాడిని చూసి ఓటమి ఆమడ దూరం పారిపోతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

19)ఒక్క ప్రయత్నంతో గొప్పోడివి అయిపోవాలంటే ఏలా? ఇక్కడ అందరూ గొప్పవాళ్లే కదా!..మరి ఎందుకు కాలేకపోతున్నారు..? ఓపిక ఉన్నోడికి అనుభావాలు తోడవుతూ ముందుకు నడిపిస్థాయి..ఓపిక లేనోడికి నిరాశ వెంటాడుతూ వెనక్కి లాగేస్తుంది.ప్రయత్నం అనేది నిరంతర ప్రక్రియ అనుకున్నప్పుడే  నువ్వు ఏ అంతరాయం లేకుండా ముందుకు వెళ్లగలవు.ఒక్క అడుగుతో ఏరు దాటలేం కదా..! కెరటాలకు,సుడులు తిరిగే ప్రవాహాలకు ఏదురీదుతూ ఆ ఆటుపోట్లకు తట్టుకుని ముందుకు వెల్లగలిగినప్పుడే ఏరు దాటగలం.మన జీవిత ప్రయాణం కూడా అంతే..ఓర్పు లేకుండా కష్ట పడకుండా శ్రమ చేయకపోతే ఉన్నదాంతో సరిపెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేవు కాబట్టి  నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరాలంటే ఓర్పుతో నేర్పుతో సాధించు విజయాన్ని వరించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

20)ప్రస్తుత సమాజంలో జరిగేది జరుగుతున్నది....తనని తాను గొప్పగా కనబడడం కోసం,ఎదుటివారిని తక్కువ చేసి చెప్పడం,వారి బలాన్ని బలహీనతగా చేసి చూపించడం!వాళ్ళని వాళ్ళు అదుపులో పెట్టుకోలేనప్పుడే,ఎదుటివాళ్లపై బురద జ్లుతారు.తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇతరులపై రాళ్ళు రువ్వుతారు లోకం తీరు అంతే...కానీ దేనితో అయితే కొడుతారో దానితోనే శిక్షింప బడుతారు......ఇది వాస్తవం..!!పడ్డవాడెప్పుడూ,చెడ్డవాడు కాదు....కావలసినదల్లా...కాసింత సహనం... అంతే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

21)జీవితంలో మనం గెలవాలి అనే ఆశ ఉన్నప్పుడు అది ఎప్పుడూ మనల్ని ఆగిపోనివ్వదు,అదే ఆగిపోదాం అనే ఆలోచన మనల్ని ఎప్పటికీ గెలవనివ్వదు కాబట్టి  ఆశకి నీ కష్టం శ్రమ తోడైతే నిన్ను ఆపేదెవ్వరు ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

22)దేనికైతే మనం భయపడి వెనుకడుగు వేస్తామో అదే మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడి భయ పెడుతుంది..ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు ఆ భయమే మనల్ని చూసి పారిపోతుంది.జీవితంలో ప్రతిసమస్యా ఇంతే మనం భయపడుతున్నంత సేపూ అది కొండంతలా మారి భయపెడు తుంది..ఒక్కసారి ఎదరరెళ్ళి చూడు దూదిపింజలా తేలిపోతుంది.. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేసుకుంటూపో విజయం తధ్యం!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

23)అందలేని ఆశించిన ఆనందం... కన్నా అనుభవిస్తున్న అనుకోని అనుగ్రహం  గొప్పది.ఊహలన్నీ వాస్తవాలు కావు కానీ.....వాస్తవాలు ఊహలకన్నా స్థిరమైనవి.మన పాలికి రావలసినది ఎపుడో నిర్ణయించబడింది.దానికి మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు.తలచినవన్నీ తలచినట్టే జరగకపోవచ్చు మధ్యలో దొరికేవి పాఠం చెప్పే అనుభవాలు...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

24)జీవితంలో ఎటువంటి పరిస్థితిలోనైనా,నిలిచి పోరాడే ఏకైక ఆయుధం "ఆత్మవిశ్వాసం" నిన్ను వెంటాడే భయాలను తరిమే ధైర్యంకోసం వేటాడు,నీతో పొట్లాడే దౌర్జన్యాన్ని ఎదిరిస్తూ నీతో నువ్వు మాట్లాడు,అప్పుడే నీఆశయానికి ఒక రూపం వస్తుంది,సాధించాలనే ఆత్మవిశ్వాసం కలుగు తుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

25)జీవితంలో నీ చుట్టూ నిన్ను చూసి ఈర్ష్య పడే వారున్నారంటే సంతోషపడు..ఎందుకంటే వారికన్నా నీవు ఉన్నతంగా ఉన్నావని అర్థం.పదే పదే నీ మీదకు రాళ్లు రువ్వుతున్నారంటే బలపడు...ఎందుకంటే వారి కన్నా నీవు "నిండాకాసిన"చెట్టువని అర్థం..నీకు సమస్యలు ఎదరయినప్పుడల్లా బెదరక తలపడు....జీవితం నీకు ఏదో నేర్పించబోతున్నదని అర్ధం...నీవు మార్చుకోగలిగితే ప్రతి ప్రతికూలమూ ఒక ప్రేరణే, తగిలిన ప్రతిరాయీ పునాదిరాయే.....ప్రతి అవమానమూ ఒక గుణపాఠమే...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

26)జీవితంలో నీకు ఎదరుదెబ్బలు ఎదురవుతున్న కొద్దీ నీ మెదడు చురుకవ్వాలి... నీకు కష్టాలు ఎదరు అవుతున్న కొద్దీ నీ మనసు విశాలం అవ్వాలి.నీకు అపజయాలు ఎదరువుతున్న కొద్దీ విజయంపై సాధించాలనే కసి నీలో పెరగాలి...సవాలు కు ప్రతి సవాలు విసిరే సత్తా నీదవ్వాలి..అన్ని దారులూ మూసుకున్నప్పుడు నీవే ఒక దారి వేయాలి..నీవు ఎదుగుతున్న కొద్దీ ఒదిగే తత్వం నీదవ్వాలి...అప్పుడే నువ్వనుకున్న గమ్యాన్ని చేరగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

27)జీవితంలో గెలవవచ్చు కానీ గర్వపడకూడదు భయపడవచ్చు కానీ పారిపోకూడదు,ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్ధం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు ఎందుకంటే  జీవితం అన్నాక అన్నీ ఉంటాయి కానీ వాటిని తట్టుకోని నిలబడాలి కానీ భయపడి కూలబడకూడదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

28)జీవితంలో బంధాలు అనుబంధాలు నీటి మీద రాతలే.ధనం, ఆస్తుల ముందు అన్నీ దిగదుడుపే నిన్నటి దాకా "మీరే అంత" అన్నవారు నేడు ఒక్కసారిగా "మీరెవరు" అనొచ్చు..అవసరానికి మనల్ని వాడుకున్నవారే రేపు మనకు "వెన్నుపోటు" పొడవవచ్చు...మనల్ని దేవుళ్ళు దేవతలు అన్నవారే అవసరం తీరాక గుండెని ముక్కలు చేయొచ్చు..ఏమైనా జరగొచ్చు..ఎందుకంటే పోయేటప్పుడు తమ వెంటరాని ధనానికే జనం దాసోహమయ్యారు.ఏందుకంటే ప్రపంచంలో వేగంగా మారేది "మనిషి" మాత్రమే... ఇప్పుడు ఎవరి గుండెను వాళ్లు వెన్ను"పోటు"ల నుండి కాపాడు కోవలసిన సమయం వచ్చింది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు....మీ..✍🏻 *రఘురాం*

29)జీవితంలో విజయానికి మనం యజమాని కావాలంటే ముందుగా కష్టానికి మనం బానిస కావాలి...అలాగే ఇతరుల మదిని మనం గెలవాంటే..ముందుగా మనకున్న బలహీనతలను మనం ఓడించాలి.. ఎలాగంటే ఏలాగంటే బంగారం మెరవాలంటే ముందుగా కొలిమిలో కాలాలి కదా అలాగే మన భవిష్యత్తు కాకతాళీయం కాకూడదంటే సరైన నిర్ణయం ఎంపిక మనదై ఉండాలి కాబట్టి ఎంత శ్రమిస్తే అంత ఫలితం అందుకే కష్టే ఫలి: అన్నారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

30)వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు..కానీ బురదను బురదతో కడగ లేము కదా..అలా చేస్తే బురదకు ఇంకాస్త బురద తోడవుతుంది....అందుకే చెడ్డవారితో మనం కూడా చెడుగా ప్రవర్తిస్తే ఇంకా ప్రతికూలాలు పెరిగే అవకాశం ఉంటుంది,శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది కాబట్టి..మంచివారితో ఎలాగూ మంచిగానే ఉంటాము అలాగే చెడ్డవారితో కూడా మంచిగానే ఉండాలి...ఎందుకంటె వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కదా...ప్రయత్నించి చూడండి...బురదలో ఉన్నంత మాత్రాన "తామర" అందం కోల్పోదుగా..కాబట్టి  నువ్వు ఎదగాలంటే ఈ కలికాలంలో చెడ్డ వారితో కూడా మంచిగా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

31)సూర్యుడు ఉదయించగానే నమస్కారం చేసే వ్యక్తులే మధ్యాహ్నం అయ్యే సరికి ఎండ ఎక్కువ ఉందని తిట్టుకుంటారు. ఎండాకాలంలో సూర్యుడు తొందరగా అస్తమించాలని కోరుకునే వాళ్లే చలికాలం తొందరగా ఉదయించాలని అనుకుంటారు...కానీ సూర్యుడు ఎవరి మాట వినడు. వస్తాడు, పనిచేసుకుంటాడు,వెళ్లిపోతాడు. నువ్వూ సూర్యుడిలా బతికేందుకు ప్రయత్నించు. ఎదుటివాళ్లు నీ గురించి ఏమనుకుంటారో వదిలేసి ముందుకు కదులు.నీ విజయంతో వారికి సమాధానమివ్వు...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

1st jan 2023

1)ఒక వ్యక్తి మన దగ్గరకువచ్చి మూడో వ్యక్తి గురించి చెప్పే "చాడీలకు" మనం నిజమా?అవునా? అంటూ ఆజ్యం పోయకూడదు..చెప్పేవాడికి "ఊ" కొట్టామంటే చెప్పలేని ప్రేరణ..ఒకటికి ఒకటి జతచేసి అసత్యానికి రంగులద్ది లేని విషయాన్ని సృష్టించి మరొక్కరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చెప్తుంటే,ఆ చెప్పేవారికి,వినేవారికి తేడా ఏమీ లేదు...గుర్తుపెట్డుకోండి ఒకరి గురించి మన దగ్గర మాట్లాడే వారు మరొకరి దగ్గర మన గురించి కూడా మాట్లాడుతారని..అబద్దాన్ని సృష్టించడం చాలా సులువు కానీ అవతల ఒక జీవి,ఒక వ్యక్తిత్వం ఎంత బాద పడుతుందో కదా....అందుకే మనం  అనవసర కామెంట్స్ వినకుండా ఖండించేస్థానం‌లో ఉండాలి...మనం వినడానికి సుముఖంగా లేనప్పుడు మన దగ్గర చెప్పే సాహసం ఎవరూ చేయరు..ఏ విషయాన్నయినా మనం ఎదుటి వారి స్థానంలో ఉండి ఆలోచించగలిగితే అర్థం చేసుకునే మనస్తత్వం మనదవుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

2)లక్ష్యం నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని అందుకోవడానికి ప్రణాళికా అంతే ముఖ్యం. ముఖ్యంగా అవరోధాల్ని ముందే పసిగట్టి వాటిని అధిగమించడానికి మీ దగ్గర పరిష్కారాలు ఉండాలి.ఎంత ప్రణాళికతో వెళ్లినా కొన్నిసార్లు అడ్డంకులు తప్పవు. ఫలితం కనిపించడంలేదన్న ఆలోచనలూ మొదలవుతాయి. అలాంటప్పుడు మీ లక్ష్యాన్ని అందుకుంటే జీవితంలో వచ్చే మార్పులేంటి... లాంటి ప్రశ్నలు వేసుకుని చూస్తే- వచ్చే జవాబు మీలో స్ఫూర్తిని నింపొచ్చు. అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోకుండా తొందర్లో సర్దుబాటు చేసుకోవాలేగానీ వాయిదా వేయొద్దు. ఈ సంవత్సరాన్నే జీవితానికి మలుపు సంవత్సరంగా మార్చుకోండి!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


3)మన జీవితంలో ప్రతి రోజూ ప్రతి నెలా ప్రతి సంవత్సరం ఎన్ని మంచి చెడ్డలు ప్రవహిస్తూనే ఉంటాయి వాటిని అలా ప్రవహించి దాటిపోనివ్వు అంతేగాని ఆ ప్రవాహాన్ని ఆపేసి అక్కడే నీకు నొప్పి కలిగిన చోట ఆగిపోతే అక్కదంతా మలినాలు చేరుతాయి అవి నిన్ను కలుషితం చేసి పాడు చేస్తాయి ఎంతలా అంటే మానసికంగా శారీరకంగా నీ జీవితాన్ని అందవికారంగా మార్చేస్తాయి.జీవితం అనుభవించి వదిలెయ్యక తప్పని ఓ ప్రవాహాం లాంటిది..ఎందుకంటే ప్రవహించే నీటిలో ఉన్నంత స్వచ్ఛత ఉత్సాహం నిలిచిపోయిన నీటిలో ఉండదు అందుకే దేనిని ఆపాలని ప్రయత్నించకు ప్రవహించనీ.. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే నిరంతరం కష్టపడు నువ్వు అనుకున్నది జరగకపోతే దాని నుంచి పాఠాలు నేర్చుకుని నదిలా ముందుకు సాగిపో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

4)నడుస్తున్న కాళ్ళు మనకెన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం ఉండదు  తానూ ముందు ఉన్నానని , వెనకునన్న కాలికి అవమానం ఉండదు తాను వెనకబడ్డానని ఎందుకంటే  ఆ రెంటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అనీ  మన జీవితం కూడా అంతే మనకన్నా ముందున్న వాళ్లని చూసి ఈర్ష్య పడటం మనకన్నా వెనుక ఉన్న వాళ్ళని చూసి గర్వపడటం ఈ రెండూ ప్రమాదమే ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు కాబట్టి ఈ సూత్రాన్నీ ఏవరైతే పాటిస్తారో వాఋ అనుకున్న లక్ష్యాన్ని చేరడం తధ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

5)విసిరివేయబడిన విత్తనాలు సైతం మొలకకెత్తుతాయి విమర్శించబడ్డ జీవితాలు సైతం వెలుగెత్తుతాయి అన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది అవసరం కోసం రెండు మెట్లు దిగడంలో తప్పులేదు కానీ అవకాశాల కోసం దిగజారి పోవడం చాలా బాధాకరం కాబట్టి ఎప్పుడూ నీ వ్యక్తిత్వాన్ని దేని కోసం పణంగా పెట్టకు కావాల్సింది కొంత ఓపిక దీనిని ఏవరైతే పాటించగలరో వారు దేనినైనా సాధించ గలరు..ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

6)ఏవడో ఏదో వాగాడని వాళ్ల మీద మనం గురిపెడితే మనకే నష్టం అలాంటి వారు ఎవరో ఒకరి మీద పది ఏడవకపోతే వారికి రోజు గడవదు మరి మనం అలా కాదు కదా మనకో లక్ష్యం ,బోలెడన్ని బాదేతలు ఉన్నాయి వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళు రేపన్న రోజు నీ మీద నీరు జారినవాళ్ళు నీ సలహా కోసం నీ సహాయం కోసం నీ దగ్గరకి వస్తారు..ప్రపంచం నువ్వు అనుకునేంత పెద్దదేమీ కాదు..వస్తుంది ప్రతి ఘడియ ప్రతి కర్మ అంతే వేగంగా తిరిగి వస్తుంది అప్పటి వరకు ఓపికగా ఉండు నువ్వెంటో తెలిసేవరకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

7) నువ్వు ఎంత తగ్గినా ఎంత ఒదిగినా నిన్ను అవతలి వాళ్ళు పట్టించుకోవడం లేదంటే వాళ్ళకి నీతో అవసరం లేదని అర్ధం.అలాంటి వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్లపై నీకున్న గౌరవం మర్యాద తెలపడానికి చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే అలా నువ్వు చేసే ప్రయత్నం నిన్ను మరింత దిగజారుస్తుంది తప్ప..నీకు కూసింత కూడా విలువని జోడించలేదు.ఎక్కువగా తాపత్రయ పడకు నీకు కలిసొచ్చే వాళ్ళతో ముందుకు సాగిపో అంతేగాని వాళ్ళ గురించి ఆలోచించి నీ మనస్సును పాడు చేసుకోకు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

8)మీకు కష్టం అనిపించే మీ ఉద్యోగం..ఉద్యోగం లేని వారికి జీవితకాల స్వప్నం.మీకు లభించిన ఇల్లు చిన్నదైనా,పెద్దదైనా నీడే లేని వారికి ఒక అద్భుత స్వప్నం.
మీ వద్ద గల చిరు సంపాదన చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం.మీ ముఖంపై ఉండే మీ చిరునవ్వు,
బాధతో కుంగిపోతున్న వారికి దివ్యమైన స్వప్నం.మీకు ఉన్న దాంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలి.లేని దాని కోసం ఆరాట పడితే ఉన్న ఈ క్షణం కూడా వ్యర్ధం అవుతుంది.బ్రతికి ఉన్న ఈ ప్రస్తుత క్షణానికి ఎప్పుడు కృతఘ్నత భావం చూపించాలి.సంతృప్తికరమైన జీవితాన్ని అలవరచుకునే విధంగా మీ జీవితం ఉండాలి అప్పుడే ఆనందం,సంతోషం మీ చిరునామాగా మారుతాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

9)జీవితంలో కలలు మాత్రమే కంటే సరిపోదూ ఎప్పుడూ దానిని సాకారం చేసే లక్ష్యాన్ని గురిచూడాలి సంకల్పం తోడైతే దొరకనిదేముంది.పట్టుదలతో ప్రయత్నిస్తే అందని దేముంది.ఎంచుకున్న మార్గం మంచిదైతే నీకు అడ్డం ఏముంది సాధించాలని కసి ఉంటే సాధ్యం కానిది ఏముంది వివేకంతో కష్టపడితే ఫలితం నీకు దక్కి తీరుతుంది ఏలాగంటే మనం పోయేదారిలో  చిన్న బురద గుంట అడ్డం వచ్చిందనుకోండి..వీలయితే దూకేయ్యాలి,లేదా గుంటలో దిగి అవతలికి చేరాలి..అలా కాకుండా ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఆగిపోతే గమ్యం చేరలేం..కాబట్టి నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఒక్కోసారి మంచి ఆలోచనతో విచక్షణతో ముందడుగు వేయాలి విజయం సాధించాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


10)చదువు విలువ తెలుసుకో..విద్యను నిర్లక్ష్యం చేస్తే 

ప్రవర్తన గాడి తప్పి..లక్ష్యాన్ని ఛిద్రం చేసి

భవిష్యత్తును శూన్యం చేసి..కలల్ని కల్లలుగా చేసి
కళ్ళల్లో కన్నీరు నింపి జీవితాన్ని కాలరాసి..కన్నవారి ఆశల నావను...నడి సంద్రమున ముంచేసి
అందరిలో చులకన చేసి...సమాజంలో పనికిరాని వాడిగా చేస్తుంది..కాబట్టి చదువు విలువ తెలుసుకో
అక్షరాలు నేర్చుకో...బ్రతుకును చక్కదిద్దుకో..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

11) స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని వర్ణించాడానికి పదాలు సరిపోవు, మాటలూ సరిపోవు..స్నేహమనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకి మనం ఎంచుకునే అతి గొప్ప మరియు విలువయినా బంధం ఈ స్నేహబంధం స్నేహం మనకు  ఎన్నో విషయాలు నేర్పుతుంది ఎన్నో మధురానుభూతులను పంచుతుంది..ఇన్ని నేర్పిన స్నేహాన్ని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దానిని వదులుకోకు.ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

12)జీవితంలో మితిమీరిన కోరికలుంటే వాటిని అదుపు చెయ్యి..నీ మనస్సుకు కళ్ళెం వెయ్యి..నిన్ను ఎవరైనా పొగుడుతుంటే వాటికి లొంగకు ఎవరైనా తిడితే బాధపడకు..నీ ఏకాగ్రతని వీడబోకు..నీ విజ్ఞానమే నీ మూలాధానమై..నీ శ్రమయే నీకు తోడైతే విజయాలు సాధించగలవు..నీ లక్ష్యం నీ పాదాక్రాంతమైతే   నువ్వు ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలవు కాబట్టి ఎప్పుడూ నీకు నీ లక్ష్యమే నీకు గుర్తుండాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


13)ఎవడిమాటో పట్టుకోని ఊరేగితే ఉన్నది ఊడిపోద్ది..లేని దరిద్రాలు తగిలించుకున్నట్టు అవుతుంది.నువ్వు చూడని,నువ్వు వినని నీకు తెలియని గుసగుసలను నమ్ముకుంటూపోతే మనస్సుకు దుఃఖం,ఒంటికి కష్టం మొత్తంగా బ్రతుక్కి భారం.నువ్వు విన్నదే వేదం అనుకోవడం నీ అమాయకత్వం.అందుకే ఆ అమాయకత్వం విషంగా మారకముందే తేరుకోవాలి లేకపోతే తెల్లారిపోతుంది. నీ చుట్టూ ఉన్న ఆ కొద్దిమంది మంచి మనుషులను కూడా కోల్పోవల్సి వస్తుంది ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదు..అబద్ధంలోనే కాలం మొత్తం గడిచిపోతుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా భ్రమలో బ్రతకకుండా జాగ్రత్తపడు ఇది నీ జీవితం నువ్వే సరిచేసుకొని ముందుకు సాగాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

14)జీవితంలో ఎదుర్కొనే ప్రతి క్షణం ఓ యుద్ధం లాంటిదే ఎందుకంటే కాలం ఎప్పుడూ మనిషితో ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటుంది..సిద్ధంగా లేకపోయినా జాగ్రత్తగా లేకపోయినా..అది నిన్ను ఓడిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

15)అదృష్టం అంటే అవకాశం అందుకోవడం,తెలివితేటలు అంటే అవకాశం సృష్టించుకోవడం,విజేతలంటే అవకాశం వినియోగించుకోవడం ఈ చిన్న తేడా గమనిస్తే జీవితంలో అందలం ఎక్కడం చాలా తేలికైన పని కాబట్టి వచ్చిన ఏ అవకాశాన్ని జార విడిచుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

16)జీవితంలో కొన్నిసార్లు నీ టైం బాగుండచ్చు బాగుండకపోవచ్చు కానీ ఎప్పుడూ పగబట్టిన కాలాన్ని చూసి బెదిరిపోకు..కన్నీటి అలలతో పోరాడి అలసిపోకు..మార్చలేని గతాన్ని తలచుకొని ఆగిపోకు..మంచికాలం ముందున్నదన్న ఆశనే వదులుకోకు..నిరాశతో ఎప్పుడు జీవితంలో ఏ సమయంలోను వెనుకడుగు వేయకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

17)టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మొరుగుతుంది.ఓపికతో ఉండాలి కాలం చాలా విలువైనది మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

18)మనం అంటే మన ఆలోచనలే. అవే మనల్ని రూపొందించాయి. మాటల కన్నా అవే ముందుంటాయి, జీవిస్తాయి, నడిపిస్తాయి. మనం పెంపొందించుకునే ఆలోచనా విధానమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మన మనస్సులో ఏ విత్తనాలు నాటుతామో వాటి పంటనే రేపు మనం అనుభవిస్తాం. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు అనేక అడ్డంకులు, సవాళ్లు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితానికి మనమే రూపకర్తలం.భవిష్యత్తును అద్భుత చిత్రంగా మలచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

19)మనం అంటే మన ఆలోచనలే. అవే మనల్ని రూపొందించాయి. మాటల కన్నా అవే ముందుంటాయి, జీవిస్తాయి, నడిపిస్తాయి. మనం పెంపొందించుకునే ఆలోచనా విధానమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మన మనస్సులో ఏ విత్తనాలు నాటుతామో వాటి పంటనే రేపు మనం అనుభవిస్తాం. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు అనేక అడ్డంకులు, సవాళ్లు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితానికి మనమే రూపకర్తలం.భవిష్యత్తును అద్భుత చిత్రంగా మలచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

20) సానుకూలమైన ఆలోచనలు చెయ్యడం రాకపోతే ప్రతికూలమైన ఆలోచనలు ఆపడం అభ్యాసం చెయ్యాలి.కీడెంచి మేలెంచమన్నారు కదా అని ఎప్పుడూ కీడు గురించి ఆలోచించకూడదు.అపజయం పొందడానికి అవసరమైతే సిద్ధపడుతూ విజయం వైపు దృష్టి పెట్టాలి.బ్రహ్మాండమైన ఆలోచనలు వాటంతట అవే రావు.గొప్ప ఆలోచనలు ఈగల్లా ముసరవు. మంచి ఆలోచనలు చీమల్లా వరసగా పాకవు. అనుకూలమైన ఆలోచనలు ఆకాశంలో కాకుల్లా ఎగరవు. అరుదైన మేలు జాతి పక్షుల్లా, రాజహంసల్లా- విజయాన్నిచ్చే ఆలోచనలు అప్పుడప్పుడు మాత్రమే మనసులోకివస్తాయి.వచ్చినప్పుడు ఆ అరుదైన అవకాశాలను ఒడిసి పట్టుకోని ముందుకు సాగాలి ఆలా వెళ్ళినప్పుడే మనం అనుకున్నది సాధించగలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

21) ఏది నీకు అన్నం పెడుతుందో..దానిని దైవంగా భావించు..ఏది నీకు నీడనిస్తుందో దానిని..కోవెలగా భావించు..ఏది నీకు మంచిని నేర్పుతుందో...దానిని నిరంతరం పూజించు..ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం అనుగణించు ..అప్పుడే నువ్వు గొప్పవాడవుతావు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

22)సాధించిన వాటిని,సాధించవలసిన వాటితో తూకం వేయలేం.తెలివితేటలను,అమాయకత్వంతో తూకం వేయలేం.ప్రేమలు,అభిమానాలు,అనురాగాలు ,ఆప్యాయతలు,నైతికవిలువలు,మానవత్వాన్ని,మనిషి ప్రవర్తనను తూకం వేయలేం.వీటన్నిటిని,తూకం వేయలేని స్థితి నుండి తూకం వేసే స్థితికి దిగజారకుండా మానవత్వాన్ని,కాపాడుకుంటూ మానవ మనుగడ, ముందుకు సాధించడమే మన జీవితానికి నిజమైన కొలమానం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

23)మనం జీవితంలో ఒక పని ప్రారంభించే ముందు విజయం సాధించగలమా లేదా అనే భయం ఉండవచ్చు.దాంతో మధ్యలో సమస్యలు రావచ్చు. విజయ మార్గంలో వైఫల్యాలు ఉంటాయి తప్పదు. విజయం అనేది ప్రయాణం తప్ప,గమ్యం కాదని గుర్తించాలి. అర్థం లేని భయాలు, భీతులు మన విజయానికి ఆటంకం కాకుండా ధైర్యం తెచ్చుకోవాలి కాబట్టి ప్రతికూల ఆలోచనలు పట్టించుకోకుండా ఉండటమే మనం చేయాల్సిన ముఖ్యమైన సాధన.భయపడి వెనక్కి పారిపోతే ప్రతికూలతలు పగలబడి నవ్వుతాయి.నిలబడి ఎదురు తిరిగితే తోకముడిచిన పిల్లులవుతాయి.సముద్రం మీద ఓడ ఎన్నో తుపానులను చూసినట్లు-మనం కూడా జీవితంలో విజయం సాధించాలంటే మనతో మనమే ఎన్నో యుద్ధాలు చేయాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

24)మన జీవితంలో ఎప్పటికప్పుడు మన మెదడుకి పదునుపెట్టే ప్రయత్నాలు చేస్తూ అవసరమైన శిక్షణ పొందుతూ,ఆ పనికి అవసరమైన సాధన సంపత్తిని కూర్చుకోగలిగితే మనం అనుకన్న పని సమయానికి పూర్తిచేసుకోవచ్చు అలాగే మనం చేరాల్సిన గమ్యాన్ని లక్ష్యాన్ని త్వరగా చేరగలం అలాగే మనం చేరాల్సిన గమ్యాన్ని లక్ష్యాన్ని త్వరగా చేరగలం కాబట్టి ప్రయత్నం దైవ యత్నం అన్నారు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

25) మనం ఒక సందర్భాన్ని లేదా ఒక వ్యక్తిత్వాన్ని లేదా ఒక సంక్లిష్టాన్ని మార్చలేకపోయినప్పుడు మనం దాన్ని చూసే దృక్పథాన్ని మార్చు కోవాలి అక్కడే మనలో ఉన్న శక్తి బయటపడుతుంది....అప్పుడే మనం "నియంత్రించబడటం" అనే స్థితిలో నుండి నియంత్రించే స్థితికి చేరుతాము...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

26) నీలోని భయాన్ని తీసివేస్తే...ఫలితం నీ ధైర్యం అవుతుంది......నీలోని కోపాన్ని తీసివేస్తే....ఫలితం నీ ప్రేమ అవుతుంది.....నీలోని భాధని తీసివేస్తే....ఫలితం నీ ఆనందం అవుతుంది..నీలోని అలజడిని తీసివేస్తే..ఫలితం నీ ప్రశాంతతవుతుంది...నీలోని బలహీనతని తీసివేస్తే....ఫలితం నీ బలం అవుతుంది....నీలోని అబద్దాన్ని తీసివేస్తే.....ఫలితం నీ నిజాయితి అవుతుంది....నీలోని నిన్నను తీసివేస్తే....ఫలితం నీ రేపటి ఆశ అవుతుంది..ఈ తీసివేతలలో నిన్ను నీవు కోల్పోకు....నీ ఆశయసాధనకై సాగిపో.......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

27)జీవితంలో భారంగా ఉందని ఏ బంధాన్ని తీసివేయకు....ఒంటరివి అవుతావు....కష్టంగా ఉందని కష్టాన్ని తీసివేయకు....ఓటమికి చేరువవుతావు....భాధపెడుతుందని బాధ్యతను తీసివేయకు....అసమర్దుడివి అవుతావు....నీలోని పట్టుదలను తీసివేయకు....నీ ఆశయానికి దూరమవుతావు.....ఈ తీసివేతలలో నిన్ను నీవు కోల్పోకు....నీ ఆశయసాధనకై సాగిపో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

28)జీవితంలో ఎవ్వరూ నీకు లేకున్నా ఎవ్వరు నీకోసం రాకున్న నీతో నువ్వున్న రోజున మొదలయ్యే ప్రయాణమే నీ జీవన గమనం కాబట్టి నీకోసం దేనిని కోల్పోకు నువ్వు అనుకున్న మార్గంలో ముందుకు సాగిపో నీ విజయం తధ్యం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

29)జీవితంలో మనం ఎంచుకున్న లక్ష్యాలకు ఏవో అడ్డంకులొచ్చి వేరే మార్గానికి మళ్లవలసి రావచ్చు...అప్పుడు మన లక్ష్యాలను గురించి పునరాలోచించాలి. మరో మార్గాన్ని అన్వేషించాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరాజయమూ మన వ్యక్తిత్వంలో ఒక్కొక్క లక్షణాన్ని వెలికితీస్తుంది. అడ్డంకులను ఎదుర్కునే సమయంలో మనలో మనకి
తెలియకుండా దాగివున్న ధైర్యం బయటికివస్తుంది. మనకేదైనా పరాజయం ఎదురైనప్పుడే మనలో వుండే ఈ గుణాలను గురించి మనకి తెలుస్తుంది. ఆ
ధైర్యసాహసాలను వెతుక్కుంటూ జీవితం
కొనసాగించాలి...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


30)కొమ్మచివరున ఎంత గట్టిగా పట్టివున్న ఎదోకరోజు రాలిపోక తప్పదని చిగురాకుకు తన భవిష్యత్తు ఏనాడో తెలుసు అయిన గానీ తుఫానును సైతం లెక్కచేయక తన జీవనపోరాటన్ని ఆపదు.చిన్న విత్తనం నుండీ మహావృక్షంగా ఎదిగిన,ఎన్నో జీవరాశులకు తనపై చోటునిచ్చిన చెట్టుకు ఏనాడో తెలుసు తనకెలాంటి ప్రతిఫలం దొరకదని అయినా గానీ తన నిస్వార్థ త్యాగాన్ని ఏనాడూ మానలేదు, మనమల ఒక్కరోజైనా ఉండగలమా?హద్దులు ఎన్ని ఆపిన మలినాలు ఎంత తనలో కలిసిన నది తన ప్రవాహాన్ని ఏనాడూ ఆపలేదు సాయం మానలేదు కాబట్టి మనం కూడా వీలైతే కొంత స్వార్ధాన్ని వీడి నిస్వార్ధంగా పరులకు ఉపకారం చేయాలి అప్పుడే నీ జీవితానికి ఒక సార్ధకత!..ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

31)జీవితంలో మనం ఎదైనా పని చేసినప్పుడు దాని వల్ల కలిగే అనర్థాలు తెలిసికూడా మనం ఏం కాదులే అని చేస్తాం తర్వాత జరగాల్సిన అనర్థాలు జరిగినప్పుడు బాధపడతాం,ఎం చేస్తున్నామో తెలిసికూడా తప్పులు చేసి తర్వాత బాధపడితే ఎం ప్రయోజనం..వీలైనంతవరకు తప్పు చేయకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి..తెలిసి చేయకు తప్పు కాబట్టి తెలిసి చేయకు ఏ తప్పు ఎందుకంటే "చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం" అందుకే మొదటి నుండి చేతులు కాలకుండా చూసుకోవాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

32)గమనం లేనిదీ గమ్యం,

పయనం కోసం గమనం,

ప్రయాణం కొరకు పయనం,

జీవించడం కోసం ప్రయాణం,

రేపటి రోజు కోసం బ్రతకడం,

బ్రతుకు సాగడం కోసం జీవనం,

గమ్యం కోసం పరుగులు తీయడమే జీవితం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

33)మన జీవితాన్ని నిర్ణయించేది మన వైఖరే.మన గమ్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పయనించే వారు విజయం తప్పక సాధిస్తారు.కొన్నిసార్లు మనకెదురయ్యే పరిస్థితులను మార్చడాం సాధ్యం కాదు కాబట్టి వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి ఆ దిశగా కష్టపడి ప్రయత్నం చేయాలి అసాధ్యాన్ని తావు లేదు ఆలా చాలా మంది బ్రతికి మనకి ఆదర్శప్రాయులుగా చరిత్రలో మిగిలారు వారిని చూసి స్ఫూర్తిని పొంది మనం కూడా కష్టపడి పని చేస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని ఛేదించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

34)ఒక్కసారిగా మంచు కురిస్తే నువ్వు నమ్మగలవా, ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా,మరి నీ చుట్టూ జరిగే వీటినే నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివంటే ఈ లోకం నిన్ను ఎలా నమ్ముతుంది.అందుకే నెమ్మదిగా ఎదుగు.నిన్ను ఎవడూ పట్టించుకోలేదని,నీకు గుర్తింపు దొరకలేదని అలా నిరాశపడి ఒక్క రాత్రిలో ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలని అనుకోకు.ఎందుకంటే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టం వల్ల వచ్చినదైనా దానిని ఎవ్వరు ఒప్పుకోరు.నమ్మకం గురించి పోరాడకుండా ఫలితాన్ని పట్టుకుని వేళ్లాడకుండా ముందుకు వెళ్ళిపో మనకి రాసిపెట్టుంది మన గడపదాటి పోనేపోదు కాబట్టి నువ్వు అనుకున్నది సాధించాలంటే సహనంతో పని చేయి నీకు విజయం తధ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


35)సమయం మనది కానప్పుడు కాస్త ఓపిక పట్టాలి..సమయం మనదయినప్పుడు విశాలమైన దృక్పథంకలిగి ఉండాలి.సమస్యలు నీవైనప్పుడు గుండెనిబ్బరంతో ఉండాలి..సమస్య ఎదుటి వారి దయినపప్పుడు సున్నితత్వంతో అర్థం చేసు కోవాలి..ఒకరు చెప్పేటప్పుడుసంయమనంతో వినాలి..ఒకరు వినేటప్పుడు మెలకువగా మాట్లాడాలి..ఒకరు ప్రశంసించేటప్పుడు నేల మీద నిలబడాలి..ఒకరిని ప్రశంసించేటప్పుడు హృదయం తో పొగడాలి..ఒకరు విమర్శిస్తే నవ్వుతూ స్వీకరించి మనస్సుతో తిరస్కరించాలి..ఒకరిని విమర్శించాల్సి వస్తే నొప్పించకుండా మెప్పించగలగాలి...ఒకరు సాయం చేస్తే జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి..ఒకరికి మనం సాయం చేస్తే వెంటనే మరచిపోవాలి...ఇది కదా....జీవితం అర్థం చేసుకునే మనస్సు మనదైతే అందమైన ప్రపంచం మనచుట్టే ఉంటుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

36)కోరికయే లక్ష్యమునకు తగు కొలమానం..ప్రతిభయే నీకు తోడుండిన బహుమానం..పరుల విజయాన్ని సహించకుంటే బాధే మింగునోయ్...అక్కసులో పడి నీవు నలిగితే అవమానం..శ్రమను భరించి శ్రద్ధగ తపించి సాధనచేస్తేనే విజయము..విమర్శలు ఢీకొడుతున్నా వినయం నీతోడుంటే కీర్తి సమానం..ధైర్యము,శాంతము,సహనంతో శ్రమిస్తే బతుకు శతమానం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


37)జీవితంలో వినయంతో కూడిన ప్రవర్తన మనల్ని మంచి మార్గం వైపు మన ఆలోచనల్ని వెళ్లేలా చేస్తుంది.ఆలోచనలు ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తే మనస్సు శరీరం నిర్మలంగా ఉంటాయి. ఎప్పుడైతే మన మనసు నిర్మలంగా ఉంటుందో అప్పుడు మనకి  ఎలాంటి ఆందోళనలు, ఒత్తిడులు మన దరి చేరవు కాబట్టి ఎప్పుడు అసూయ అహంకారాలతో నువ్వు ప్రవర్తిస్తావో అప్పుడు నీకు అపజయాలు  ఎదురవుతాయి నీ యొక్క  వినయ విధేయతలే నీ విజయాలను నిర్దేశిస్తాయి...నీ వినయమే నీ ఆభరణ భూషణం......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

38)సంకోచం మరణం వ్యాకోచం జీవితం అన్నారు యోగి వివేకానందుల వారు అక్షర సత్యమైన ఈ మహత్తర సూక్తి అర్థమై ఆచరణలో పెట్టేది లక్షల్లో ఒక్కరే!! ప్రపంచంలో చాలామంది నిత్యం మరణిస్తూ అప్పుడప్పుడు జీవిస్తూ ఉంటారు.నా కుటుంబం అంటే నేను నా భార్యా పిల్లలూ మాత్రమే అనుకోవడం సంకోచం.మన కుటుంబంలోకి అందరిని చేర్చుకొని కష్ట సుఖాల లో పాలుపంచుకొని జీవించడం నిజమైన వ్యాకోచం.ఆ మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే మనకందరికీ అర్థమయ్యే నగ్న సత్యమిదే అర్థం చేసుకోవలసినదీ అదే వారిలా బతకడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నం లో మనం ఒక్క శాతం వారిలా బ్రతికితే నిస్సంశయంగా మనం విజయంసాధించి నట్లే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

39)జీవితంలో వెనుకకు తిరుగ కుండా ముందుకు సాగే వారు చివరకు విజయం సాధిస్తారు.తుఫానులో నేలకొరిగిన ఎన్నో చెట్లు తిరిగి చిగురించి ఫలాల్ని అందించడం మనం గమనిస్తూనే ఉంటాం.జీవితంలో అన్ని పోగొట్టుకున్న వ్యక్తులు విజయపథం వైపు దూసుకుపోవడం కూడా అలాంటిదే. నా జీవితం మోడు వారిపోయింది అనుకుంటే మనం నిర్జీవులుగా మారిపోతాం అలాకాకుండా నాలో ఇంకా జీవం మిగిలి ఉంది,నేను ఏదైనా సాధించగలను అనుకుంటే మన జీవితానికి అర్థం ఉంటుంది.పుట్టడానికి గిట్టడానికి మధ్యలో ఉన్న మన జీవితకాలాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆశావాదాన్ని పెంచుకోవాలి నిరాశా వాదాన్ని నిలువునా పాతి పెట్టాలి..ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

40)జీవితంలో ఎవరైనా విజయం సాధించాలంటే వెనుక ఎంతో కఠోర పరిశ్రమ ఉండాలి.ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో ఎదురుకునే ఎంతో ఓర్పు ఉండాలి.నీ సొంత మనుషులదే కాకుండా సాటి వారి సహకారం కూడా ఉండాలి, ఏ గెలుపు,నీ ఒక్కడిదే కాదు, నీతో సహకరించిన అందరిదీ అనగలిగే ధైర్యం ఉండాలి.నీ ఓటమికి మరొకరు కారణం కాదని చెప్పగలిగే సత్తా ఉండాలి.గెలిచే దాకా పట్టు విడవని ఆత్మవిశ్వాసం అణువణువునా ఉండాలి.నీ సంతోషాన్ని నలుగురికి సమానంగా పంచి పెట్టగల మంచితనం ఉండాలి.నీ గెలుపు ఓటమి రెండింటిని సమానంగా తీసుకోగల తత్వం అలవాటు చేసుకొని స్థిత ప్రజ్ఞత నీలో కలిగినప్పుడే నువ్వు దేనికోసమైనా నిలబడగలవు నువ్వు అనుకున్నది సాధించగలవు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

41)అవకాశం రాకపోవడం - దురదృష్టం.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయకపోవడం -నిర్లక్ష్యం.

అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం -ఇంగితం.

లేని అవకాశాన్ని సృష్టించడం -తెలివి.

నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం -విజయం.

నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం- ఓటమి.

 కాబట్టి "జీవితంలో మూడు విషయాలు" ఎప్పటికి తిరిగి పొందలేము 1) చేజార్చుకున్న అవకాశం, 2)కరిగిపోయిన కాలం, 3)నోటిలోంచి వచ్చిన మాట..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

42) నీ ఆలోచనల్లో సమన్వయం ఉండాలి...సమస్యను పరిష్కరించుకోగలగాలి..నీ శ్రమను నమ్ముకోవాలి..నీ పథకం ప్రకారం నడుచుకోవాలి..నీ పూర్తి సామర్ద్యాన్ని వినియోగించాలి...పట్టుదలను పెంచాలి..నీ ఆత్మస్థైర్యం పూర్తిగా నింపాలి...నీ ఆత్మవిశ్వాసం పై నమ్మకం ఉంచాలి..నీతో, నీవేపోటీ పడాలి...అప్పుడే జీవితంలో గెలుపు నీ దరి చేరుతుంది..ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

43) మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించేకన్నా..మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం..! ఎందుకంటే..మన జీవితం మనదే..మనకొచ్చే కష్టనష్టాలు మనమే భరించాలి..చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు..!! గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ..తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

44)ప్రతి ఉదయం కొత్త ఆలోచనతోనే మొదలు..ప్రతి ఆలోచన సంతోషంగా మలచుకునేటట్టు చేసుకోవాలి...కష్టాన్ని సైతం ఇష్టంగా మార్చేది కావాలి.. ఎందుకంటే మన ఆలోచనలే మన మనుగడకి కారణం..సంతోషమైనా బాధైనా మన ఆలోచన  మన నిర్ణయాలే మీదే ఆధారపడి ఉంటాయి..అలాగే ఏదైతే మనం ఆలోచిస్తామో అదే ఎదురై నిలుస్తుంది కాబట్టి నీకు చేతనైనంతవరకు మంచిగానే ఆలోచించు నీకు మంచే జరుగుతుంది..*"యద్భావం తద్భవతి"* మన మనసు దేనితోనైతే నిండి ఉందో అది భయంతోనా,అసూయతోనా,ధైర్యంతోనా,అనే దానితోనే మన చూపు,మన ఆలోచనలు,మన చేతలు ఆధారపడి ఉంటాయి.ఒకరిపై ఒకరు అసూయలతో, ద్వేషాలతో మనం మన జీవితాన్నే పూర్తిగా వ్యర్థం చేసుకుంటున్నాము.అందుకు మనం ఎదుటివారికంటే ముందు మన మనసును తెలుసుకొని,ఆ మనసు దేనితో నిండి ఉందో కనుక్కోని సరిదిద్దుకున్నప్పుడు మన జీవితం సార్ధకత మవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

45)నిన్ను ఎవరెన్ని అన్నా,నువ్వు తప్పు చేయనంత వరకు నిన్ను నువ్వు కించపరుచు కోకు....ఏడుస్తూ మూలన కూర్చోకు....తిరగబడి సమాధానం ఇవ్వకపోయినా...మాటలనే తృణప్రాయంగా తిరస్కరిస్తూ....నీ మౌనం తో వారికి సమాధానం ఇవ్వు....నీ గెలుపుని వారికీ కానుకగా ఇవ్వు...అంతేకానీ ఏడుస్తూ నీ కన్నీటి విలువని తగ్గించకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

46)ఇక్కడ ఎవ్వడూ నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేడు,ప్రతి ఒక్కడికీ ఇక్కడ బోలెడన్ని బాధలున్నాయి,బ్రతుకు నీది..బ్రతుకుతెరువు బాధ్యత నీది..కష్టం నీది..కారే చెమట చుక్క నీది..ఏది ఏమైనా కష్టం నీ ముందు నిలబడినప్పుడు నూవు మాత్రమే దానిని ఎదిరించాలి లేదా ఓడిపోవాలి..అంతేగాని చేయి పట్టుకుని నిన్ను ఆ కష్టాల కడలి దాటించెడెవడూ? ఇది జగమెరిగిన సత్యం..కానీ నువ్వే నమ్మడం లేదు...ఎవరో వస్తారని ఎదో చేస్తారని వేచి చూడకు..నీ ముందున్న లక్ష్యామే నీకు కనపడాలి దాని కోసమే కష్టించి విజయం సాధించి నువ్వేంటో తెలియచేయి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

47)దెబ్బలు తిన్న శిల శిల్పం అవుతుంది.ఆలయాన వెలసి పూజలు అందుకుంటుంది. గాయాలపాలైన వెదురు వేణువుగా మారుతుంది. చీదరింపులకు గురయ్యే గొంగళిపురుగు సీతాకోక చిలుకగా అవతరిస్తుంది. నలిగిన గింజలే కడుపు నింపుతాయి. కరిగితేనే కొవ్వొత్తి కాంతి ఇవ్వగలుగుతుంది. నిచ్చెనమెట్లు ఎక్కితే కాళ్లు నొప్పి పెడతాయనుకుంటే-ఉన్నత శిఖరాలు అధిరోహించలేం. అవరోధాలకు జంకితే సాహసాలు చెయ్యలేం. దాని తలపై అనేక దెబ్బలు తగిలితేనే మేకు లోపలి వరకూ దిగుతుంది. అప్పుడే అది బలంగా నిలదొక్కుకుంటుంది. విల్లు వంచితేనే బాణం ముందుకు దూసుకు పోతుంది.సవాళ్లే మనిషిని రాటు తేలుస్తాయి కాబట్టి కష్టాలు విజయాలకు మెట్లని భావించి ముందడుగు వేస్తే విజయం తధ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

48)మనం జీవితంలో కొన్ని సాధించలంటే కొంత కాలం నీరిక్షించక తప్పదు అప్పటిదాక తొందరకు తావివ్వకుండా ఓపిక వహించాలి. అప్పుడే అనుకున్నది ఫలిస్తుంది కాబట్టి ఏ ప‌నైనా ఓపిక‌తో చేస్తే విజ‌యం త‌ప్ప‌క సాధించ‌వ‌చ్చు.. ఓపిక‌కు అప‌జ‌యాన్ని ఓడించే శ‌క్తి.. విజ‌యాన్ని సాధించ‌గ‌లిగే నేర్పు ఉంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

49)మనిషన్నాక శారీరక, మానసిక బలహీనతలుంటాయి. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది సాధారణంగా మనుషులు ఎదుటి వ్యక్తిలోని బలాబలాలను అంచనా వేయడంలో కనబరిచే ఆసక్తి, తమను తాము పరిశీలించుకుని విశ్లేషించుకుని తదనుగుణంగా మారడం మీద చూపించరు.బలహీనమైన మనసు బయటికి కనిపించకుండా శరీరాన్ని గుప్పిట్లో ఆడిస్తుంది. నిర్వీర్యం చేస్తుంది.అందుకే మనసును కట్టడి చేయడం మీద దృష్టి పెట్టాలి.వ్యాయామం చేసి శరీరాన్ని ఎలా దృఢపరచుకొంటామో, మనసును సైతం ఆ విధంగానే నిత్య అభ్యాసాలతో రాటుతేలేలా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే ఎవరైనా ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించి విజయాన్ని సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

50)ప్రపంచం అంటేనే పోటీ.జీవితంలో ఎదగాలంటే పోటీపడాలి. పోటీ అన్నాక గెలవచ్చు, ఓడనూవచ్చు. ఓటమి పొందినప్పుడు మనోనిగ్రహం కనబరచేవాడే నిజమైన విజేత.ఎందుకంటే రేపటిరోజు ముమ్మాటికీ అతడిదే. చిన్న చిన్న అపజయాలకు కుంగిపోవడం, ఎవరో ఏదో మాట అన్నారని బాధపడడం బలహీనమైన మనసున్న వారు చేసేది.మన ప్రత్యర్థులకు మనం మన బలం కనిపించాలి కాని,బలహీనత కాదు. అలా జరిగితే మన జీవిత కళ్లాలు మనమే ఇతరుల చేతికి మనకు మనంగా ఇచ్చినవాళ్లమవుతాం. చాలామంది గెలుపు బంగ్లా, ఎదుటివాళ్ల బలహీనత పునాది మీద నిర్మాణమవుతుంది.అది ప్రపంచానికి తెలియదు.వజ్రంలాంటి శరీరమే కాదు, మనసూ ఉండాలి. అప్పుడే విజయం మన పాదాక్రాంతమవుతుంది. ఆనందం, సంతృప్తి చేరువనే ఉంటాయి.అపూరూపమైన మన జీవితం గెలిచి సాధించడానికి, అంతేకాని ఓడి విలువను శూన్యం చేసుకోవడానికి కాదు...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

51)ఆశ నీ ఆయుధమై పట్టుదలే నీ పయనమై..ఎగిసి పడే కష్టాల కనీళ్లకూ ఏదురీదు అలుపు లేని "అలవై ఆత్మస్త్థెర్యంతో సాగిపో..పోరాడి గెలిచే వరకు నీ ఆశయ తీరం చేరేవరకు..నీ గెలుపు గమ్యం చేరేవరకు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

52)ఎదగడానికి దగ్గరి దారి లేదు. ఏ కష్టమూ అనుభవించకుండా ఒకేసారి పైకి వెళ్లడం అసాధ్యం. అందుకే -” నీకు చేదు గురించి తెలియకపోతే తీపిని ఆస్వాదించలేవు.” అని చెపుతుంది ఒక పాత సామెత. నిన్ను కష్టాల్లోకి తోసిన ప్రతి సందర్భమూ నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా భావించాలి. చాలెంజ్‌లను ఎదుర్కోకుండా పరిణతిని సాధించలేం. ఎంత పెద్ద కష్టాన్ని నువ్వు అధిగమించగలిగితే అంత పటిష్టంగా తయారవుతావు....మొదలుపెట్టిన పని విఫలమైతే ,చేసినదంతా నష్టమైపోయింది కదా..అని భయపడకండి.మరొక్కసారి ప్రయత్నించివుంటే ఆపని పూర్తయ్యే అవకాశం వుండేది అన్న ఆలోచన రానందుకు చింతిచండి."సక్సెస్ ఇస్ నెవెర్ ఎండింగ్ ,ఫెయిల్యూర్ ఇస్ నెవెర్ ఫైనల్.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

53)ఒక వ్యక్తి పట్ల మన అభిమానాన్ని వెలిబుచ్చటానికి రెండు రకాల కారణాలున్నాయి.ఆ వ్యక్తిని చూసో, కలుసుకునో, అతడితో మాట్లాడో మనం ప్రేరణ పొందటం ఒక కారణం!..ఆ వ్యక్తి ఆ రంగంలో జరిపిన కృషికి అతడిని అభినందిస్తూ అతడికి కావలసిన మానసిక ఆనందాన్ని,స్థైర్యాన్ని ఇవ్వటం మరొక కారణం! ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం వల్ల అతడిని దూరం నుంచి చూడటం ద్వారా, పదిమందిలో నిలబడి చెయ్యి ఊపటం ద్వారా మనకి గొప్ప సంతృప్తి కలగవచ్చు  కానీ ఇటువంటి సంతృప్తుల నుంచి తొందరగా బయటపడి,మనం ఏం చేస్తే ఆ వ్యక్తిలాగా మారగలం అన్నది ఆలోచించగలిగి ఉండాలి.అలాంటి ఆలోచన కోసం, ఆ వ్యక్తిని దూరం నుంచి చూడటం ద్వారా కానీ,కరచాలనం ద్వారాకానీ, సంభాషణ ద్వారా కానీ ప్రేరణ పొంది మనం కూడా మనలోని లోటుపాట్లను కూడా గ్రహించి, అటువంటి లోటుపాట్లు మనలో ఉంటే వాటిని నిర్మూలించుకుంటూ ప్రగతిపథం వైపు సాగిపోవాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

54)జీవితంలో మన అనుకున్న  బంధాలు బలంగా ఉండాలంటే ప్రేమతో మాట్లాడు..ఆలోచించి మాట్లాడు..అర్థం చేసుకుని మాట్లాడు..పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు..నవ్వుతూ మాట్లాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు..మనస్సు నొప్పించకుండా మాట్లాడు...తక్కువ మాట్లాడు..అప్పుడే నీకు నా అనుకునే వాళ్ళు తోడుగా ఉంటారు..నువ్వు అనుకున్నది సాధించేదాక నీకు నీడగా ఉంటారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

55)ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణంమన జీవితాన్ని అందలమూ ఎక్కించ గలదు అందకారము లోకి నెట్టేయ గలదు...కీలకమైన ఆక్షణం నిన్ను నీవు నిగ్రహించుకో గలిగితే ఓటమి కూడా నీ విజయంగా మారుతుంది..క్షణకాలం నీ మనస్సులో ఎగిసిపడే అలలకు ఎదురీద గలిగితే నిర్దేశించిన తీరం నీదే కదా..గమనం గమ్యం కోసమే అయితే సహనం నీకు ఆయుధం కావాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

56)ఓటమి వస్తుందేమో అని భయపడకండి.ప్రయత్నించకుండా ఏ గెలుపూ రాదుకదా అని భయపడండి.ఈ పనిపూర్తవదేమో అని భయపడకండి కాలక్రమేణా పరిస్థితులన్నీ వాటంతటవే సర్దుకుంటాయిలే అన్న ఎస్కేపింగ్ దృక్పథం ఉన్నందుకు భయపడండి.రిస్క్ తీస్కుంటే ప్రమాదమేమో అనిభయపడకండి.రిస్క్ తీసుకునే మనస్తత్వం లేనందుకు భయపడండి.ఒక క్లిష్టమైన పని ప్రారంభించటం వల్ల కష్టాలొస్తాయేమోనని భయపడ కండి.ఏ కష్టం లేకుండా విజయం రాదన్న విషయం ఇంత కాలమూ తెలియనందుకు బాధపడండి.ప్రారంభించిన పని సగంలో ఆగిపోతే కష్టం కదా అని భయపడకండి.ప్రారంభించకపోతే అసలు పనే మొదలవదని భయపడండి ఇవి ఎవరైతే గమనించుంటూ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తారో అటువంటి వారెప్పుడు జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ లేదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

57)జీవితంలో గెలుపు ఓటములు నాణానికి రెండు వైపులు..ఓటమి నేలైతే....గెలుపు ఓ శిఖరం నేలకీ శిఖరానికీ మధ్య వేల కొద్దీ మెట్లు...నేల మీద చెతికిలబడడం ఓటమి..శిఖరపు సోపానపు మెట్లు ఎక్కడం గెలుపు..శిఖరాన్ని నువ్వు ఎక్కుతున్నప్పుడు...నీ కన్నావెనుక నున్నవారు నిన్ను దాటి పోవచ్చు...నీ కన్నా ముందు నున్న వారిని నువ్వు దాటి పోవచ్చు....నిరంతర ప్రయత్నమే నీ గెలుపు...నిన్నటి కంటే ఈ రోజు ఎన్ని మెట్లు ఎత్తులో ఉన్నావో చూసుకో!..నిన్ను నువ్వు గెలిచావో లేదో..బేరీజు వేసి ఆలోచించుకో...అంతేగాని నువ్వు శిఖరం ఎక్కాలని ఆలోచన గాని ప్రయత్నం చెయ్యకుండా శిఖరం ఎక్కున వాడి మీద ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతే నష్టం మనకే..కాబట్టి ప్రయత్నం చెయ్యడంలో ముందుండి గమ్యం చేరడంలో విజయాన్ని సాధించు నువ్వెంటో నిరూపించు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

58) నిన్నటికీ, ఈ రోజుకీ మధ్య మన జీవితాన్ని తీసుకుంటే అందులో తప్పనిసరిగా ఒక అనుభవమో, ఒక అనుభూతో,ఒక ఆహ్లాదమో కనీసం ఒక్కసారైనా మీ పెదవుల మీద చిరునవ్వో ఉండి తీరాలి.అలాంటి రోజు లేదంటే మీ జీవితంలో ఒక రోజు నిరర్థకమైనట్లే. ఆ విషయం సదా గుర్తుంచుకోండి కాబట్టి ఆనందమైనా బాధైనా అంతా మన చేతుల్లోనే ఉంటుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

59)జీవితంలో  మనం ఏదైతే మంచిదని నమ్ముతామో, దానిని నిజాయితీగా,మనస్ఫూర్తిగా చేస్తే, అది ఇతరులకి కూడా మంచిదై తీరుతుంది. మన స్వభావాన్నీ, మన ఆశయాల్నీ మనం గౌరవించటం నేర్చుకుంటే, ఇతరుల నుంచి మనల్ని మనం రక్షించుకోవటం తెలుస్తుంది. మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకుంటే ఇతరులని ఎలా గౌరవించాలో ప్రేమించాలో తెలుస్తుంది కాబట్టి  ఇవన్నీ ఎవరైతే  సరిగ్గా ఉపయోగించుకుంటారో వారు దేనినైనా సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

60) జీవితంలో నీకు తెలిసి నువ్వు ఏ తప్పు చేయనంత వరకు నువ్వు ఎవ్వరికీ భయపడకూడదు.నీకు తెలిసి ఎవ్వరికీ చెడు చెయ్యాలనే ఆలోచన కలలో కూడా నీకు రాకూడదు.ఎదుటివాడిని తోసేసి నువ్వు బాగుపడమనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే.ఒక వేళ నువ్వు పక్కోడి కష్టం మీద ఎదిగినా రేపన్న రోజు నీ తలదన్నేవాడు..నిన్ను నిలువునా కూల్చే రోజు మాత్రం కచ్చితంగా వచ్చి తీరుతుంది.నీ కష్టం మీద బ్రతికితే ప్రతి రోజు మనశాంతిగా గడపగలాగుతావు గుర్తుపెట్టుకో..అందుకే కష్టే ఫలి అన్నారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

61)గడుస్తున్న కొద్దీ జీవితం కొందరికి నిస్సారంగా మారితే మరికొందరికి దాని పట్ల మరింత అనుబంధం అనుభవం పెరిగి ఇష్టం ఏర్పడుతుంది బ్రతుకు పరుగులో ఆయాసం వచ్చి, క్షణం ఆగి చూసుకుంటే మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది.గమ్యం వైపు దూసుకు వెళ్ళడానికి విపరీతంగా పని చేయడం, గెలవటం,ఆ గెలుపు ద్వారా గర్వపడటం, మళ్ళీ పరుగు... చివరికొచ్చేసరికి ఇవన్నీ ఆనందం కోసమే కదా..! నిరంతరం ఆనందంగా ఉండటమే మనశ్శాంతి...ఇది లేని రోజు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన అవన్నీ వృధానే..కాబట్టి మనశ్శాంతితో బ్రతకడం మన గమ్యమవ్వాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

62)ప్రతి ఒక్కరిలో మార్చగలిగిన పరిణామాలు, మార్చలేని పరిణామాలు అని రెండుంటాయి. అందవికారం, జన్మతా వచ్చిన అనారోగ్యం - ఇవన్నీ మార్చలేని పరిణామాలు.తెలివితేటలు పెంచు కోవటం,ఆర్థికంగా నిలదొక్కు కోవటం, ఉన్నత స్థానానికి రావటం ఇవన్నీ మార్చుకోగలిగే పరిణామాలు.దురదృష్టవశాత్తూ మనలో చాలామంది 'మార్చుకోగలిగిన పరిణామాల'ని వదిలేసి, ‘మార్చలేని పరిణామాల'ని పట్టుకొని “నా జీవితం ఇలా అయిపోయిందే" అని వాపోతూ ఉంటారు. ఇది సరయిన దృక్పథం కాదు అలాగే లేదని ఏడవటం ఎంత పొరపాటో, ఉన్న కంఫర్ట్-జోన్ లో ఉండి పోవటం కూడా అంతే పొరపాటు.మార్చలేని పరిణామాలని యథాతథంగా స్వీకరిస్తూ,మార్చగలిగే పరిణామాలని మార్చటం కోసం కృషి చేయాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

63)ఓటమిని ఆస్వాదించగలిగినవారినే విజయం వరిస్తుంది. జీవితంలో జయాలుంటాయి, అపజయాలూ ఉంటాయి. తలపెట్టిన పనిలో విజయం లభించగానే మన భుజాన్ని మనమే తట్టుకొని గర్వపడతాం. అపజయానికేమో కారణాన్ని విధికి ఆపాదిస్తాం. జీవితంలో మనకు ఎదురయ్యే జయాపజయాలకు కారణం మనమే! .వీలైనంతవరకు తప్పులు చేయకుండా సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యం! జీవనమార్గంలో తప్పటడుగులు వేయటం ఎవరికైనా సహజం. జీవిత రహదారిలో ముళ్లూ గులకరాళ్లూ ఉంటాయి. వివేకాన్ని ఉపయోగించి ప్రయాణం చేయగలిగితే విజేతలం కావడం ఎప్పుడూ సంభవమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*      

64)కష్టాన్ని మరిచి సంతోషన్ని నింపుకొని..కాలంతో సావాసం కాకుండా సహవాసం చేయి..నిన్ను ముంచిన వారికి వారిని మించిన ఎత్తుకి చేరుకో.కాలం గాయం చేస్తే దానికి మందు నీ నవ్వు కావాలి..!గుండె గాయం చేస్తే నీ గెలుపు దానికి వారధి అవ్వాలి..!జీవితమే గాయం అవుతే నీ సహనం దానికి భయాన్ని ఇవ్వాలి..!కష్టమైన ,నష్టమైన..బాధైనా, సంతోషంగా..ఏదైనా సరే ఎదుర్కో..!! అంతే కానీ..భయపడి పిరికివారిలా వెనుకడుగు వేయకు..!!...ఇట్లు..మీ..✍🏻 *రఘు*

65)ప్రతి మనిషికీ జీవితంలో గెలుపు అవసరం. గెలవలేని జీవనలక్ష్యం అంటూ లేనేలేదు. ఎదురవుతున్న ఓటములకు భయపడి లక్ష్యాన్ని విడచి బతికే మనిషి హీనుడే! మనం గెలుపుకోసం చేసే ప్రయత్నాలే తరవాతి తరం వారికి స్ఫూర్తిదాయకాలవుతాయి.విజయం కోసం ఓటమిని ఎదుర్కొనక తప్పదు. ఓటమి గెలుపునకు స్ఫూర్తికావాలి కాని, భీరత్వానికి నాంది కాకూడదు. అప్పుడే జయం మనది!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

66)మీలో భయాలు కట్టుకున్న గోడల కంటే ఎదురయ్యే సవాళ్ళు పెద్ద లెక్కేమి కాదు..మీ మదిలో తిష్టేసుకున్న ఈ చీకట్ల కంటే రాత్రులోచ్చే చీకట్లు పెద్దవా? కానే కాదు..చీకట్లకు ప్రత్యేక దారులు లేకపోవచ్చు..మీలో రగిలించే జ్వాలకు ఆ జ్వాలలో ప్రయాణించే గమ్యానికి ఓ నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి...చీకటిని చీల్చే వెలుగులా గాండీవాన్ని ఎక్కుపెట్టి దాగున్న లక్ష్యాన్ని గురిపెట్టు..అగాధపు అపజయాలను దాటి నీ ఆశయాన్ని విజయ తీరాలకు చేర్చు..ఇది ముంగింపు కాదు ఇదే ఆరంభమని లోకానికి చాటు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

67)నువ్వు పని చేయకుండా ఎప్పుడూ ఫలితాన్ని ఆశిస్తూ ప్రశంసలకై పనులు చేస్తూ వాంఛలకై పాకులాడకు..జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకో..ఎలాగైతే నీరు ఆవిరై ఆకాశాన్ని అందుకుంటుందో..అలాగే పట్టుదల,కృషి,శ్రమ, సహనం..నిన్ను ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తుంది కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా బాగా కష్టపడడమే..ఫలితం దైవలిఖితం...అందుకే పెద్దలు యత్నం ప్రయత్నం దైవయత్నం అన్నారు ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

68)ఎవరి దగ్గరో మనం నిరూపించుకోవడానికి పని చేసినన్ని రోజులు మనం ఎవడొకడి కింద మన పని చేస్తూనే ఉండిపోతాం..మన కోసం మనం పని చెయ్యడం ఎప్పుడు మొదలుపెడతామో అప్పటి నుంచి మన సామ్రాజ్యానికి మనం పునాది వేయగలుగుతాం..మెప్పు కోసం పని చేసే చోట నిన్ను వాడుకునే వాళ్ళుంటారు..నీ కోసం నువ్వు చేసుకునే పని వెనుక నువ్వే యజమానివి అవుతావు.మన కల గురించి మనం కష్టపడకపోతే..వేరే వాళ్ళ కల కోసం మనం చాకిరి చేయక తప్పదు..మన జీవితం మనకు నచ్చినట్టు ఉండాలంటే మన కల కోసం మనం ఎంతో కష్టపడాలి..లేకపోతే నచ్చిన నచ్చకపోయినా జీవితాంతం బానిసగా ఊడియం చేయాల్సిందే..కాబట్టి కష్టపడి నువ్వు అనుకున్నది సాధించు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

69)కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి, అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది.. అనిపిస్తుంది.. కాబట్టి పక్క వాడికి చేతనైతే సహాయం చేయి అంతేగాని వాడి కష్టాన్ని చులకన చేసి చూడకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

70)నాన్న...తను నిన్ను భుజాల మీద మోస్తునప్పుడు..నీకు ఊహా ఉండదు,నాన్న..తనని నువ్వు భుజాల మీద మోస్తునప్పుడు తనకి ఊపిరి ఉండదు,నాన్న తన జీవితంలో ఇష్టం అనే పదానికి స్థానం ఉండదు..నీకంటూ మంచి స్థానం వచ్చేదాకా తనకి తీరిక ఉండదు,

చివరిగా ఓ మాట

ఊపిరైన నిన్ను నిమిషానికి 72 సార్లు అది కొడుతూ వదులుతుందేమో కానీ నాన్న తన కొనఊపిరి ఉన్నంతవరకు నీ చేయి వదలడు..నాన్నకు ప్రేమతో..ఈ ఎమోషన్ నాన్న అయితేగాని అర్ధం కాదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

71)నీ గమ్యం ఇదే అని నిర్ణయించుకున్నప్పుడు,అడ్డంకులు వస్తున్నాయి అని ఆగిపోవడం ఎందుకు?ఓటమి చాలా గొప్పది, పడిపోవడం,మళ్ళీ నిలబడడం, ఎదురు వెళ్ళడం మనకు నేర్పిస్తుంది,గెలుపు సంతోషాన్ని ఇస్తుంది కానీ ఓటమి ధైర్యాన్ని ఇస్తుంది,గెలిస్తే చప్పట్లు వింటాం..ఓడితే విమర్శలు వింటాం.సూర్యుడు ఉదయించి, అస్తమించి,ఆ మళ్ళీ ఉదయిస్తాడు.ఈ రోజు మనది కాకపోవచ్చు కానీ రేపు మనదే అవుతుంది.ఆ రోజు కోసం ఓపికతో పట్టుదలతో నువ్వు కష్టపడు, నీకు విజయం తధ్యం ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

72)మన పెద్దవాళ్లు ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బంధాలని కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు లేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి కోసం ఆలోచించి ఏం లాభం వాళ్ల దృష్టిలో మనం దిగజారడం తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం

73)మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం సహించడం..మనకు ఒక కష్టం వచ్చినప్పుడు కొంచెం భరించడం..మనకు ఒక ఓటమి వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తూ ధైర్యంవహించడం అలాగే ఆనందం కలిగినప్పుడు కొంచెం పంచడం..అంతే ఇవే కదా మన నుంచి ఎవరైనా కోరుకునేది లేదా మనం పక్కవారి నుంచి కోరుకునేది .ఇవి ఉంటే చాలు జీవితంలో ఆనందంగా బ్రతకడానికి..ఇంకేం కావాలి. ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

74)ఎలుక రాతిది అయితే పూజిస్తాం...ప్రాణాలతో వుంటే తరిమేస్తాం. పాము రాతిది అయితే పాలు పోస్తాం..ప్రాణాలతో వుంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం... ప్రాణాలతో వుంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం బతికి ఉన్న వాడికి చేయూతను ఇవ్వలేం. రాయిలో దైవత్వం వుందని తెలుసుకున్నాం... మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం.జీవం లేని వాటిపై ఉన్న భక్తి, ప్రేమ...ప్రాణంతో ఉన్నవాటిపై ఎందుకులేదో.... మనిషిగా ఆలోచిద్దాం కొద్దిగా..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

75)జీవితంలో ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. అసంపూర్తిగా దేన్నీ వదిలేయకూడదు.మనిషికి భగవంతుడు ప్రసాదించిన దివ్యాస్త్రాలే వివేకం, విచక్షణ. కమ్ముకొచ్చే ఎంతటి కారుమేఘాలనైనా తొలగించేవి ఇవే! జీవనయానంలో ప్రతిబంధకాలను తొలగించేవి, బతుకురథం సజావుగా సాగేట్లు చేసేవీ ఈ రెండే! కాబట్టి మనిషి వివేకం విచక్షణతో వ్యవహరించాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

76)మనసు చేసే అతి ముఖ్యమైన పని ఆలోచన. అది లేని మనసు, రాని మనిషి ఉండడు. ఆలోచన సముద్ర తరంగాల్లా నిరంతర ప్రక్రియ. అది ఎంతగొప్పదంటే..ఒక ఆలోచన భవిష్యత్తును నిర్దేశించ గలదు. భవితను మార్చగలదు. చరిత్ర గతిని తలకిందులు చేయగలదు. అంత శక్తిగల ఆలోచనలను ఉన్నతంగా ఉండేటట్లు చేసుకోవాలి... ప్రతి ఒక్కరూ. ఒక ఆశ కిరణంలా ఉత్సాహాన్ని పెంచుకోవాలి. నేను నీకు ఆసరాగా ఉన్నాను అని నోటితోనే చెప్పనక్కర్లేదు. ఒక స్పర్శ, ఒక ఆత్మీయపలకరింపు, ఒక చల్లని చూపు మీరు తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుపు తాయి.ఆ భావ వ్యక్తీకరణే ఎదుటి వారికి ఒక భరోసా అయిజీవితంలో ఒక కొత్తమార్పును తెస్తుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

77)ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైన కలత ఉన్నదా? ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైన నలత ఉన్నదా? ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైన కొరత ఉన్నదా?ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైన కోత ఉన్నదా? అన్నారు పెద్దలు..నీలో అనుక్షణం నువ్వు చేరాలనుకున్న గమ్యం మీదే నీ దృష్టి కేంద్రీకరించాలి.. నువ్వు గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కదలాడు తుండాలి అలాగే విజయం సాధించాలంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు. దాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో గుర్తించి సత్వర కార్యాచరణకు సన్నద్ధం కావడమే ముఖ్యం.ఎదురీదే చేతులుంటే ఏరు దారియివ్వక ఏం చేస్తుంది...గెలవాలన్న కసితో పయనించే అడుగులుంటే దానంతట అదే మార్గం ఏర్పడుతుంది నువ్వు చేయాల్సిందల్లా విజయం కోసం కష్టపడడమే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

78) నాన్న....నీకు కష్టాలు రాకుండా కాపాడే కాపరి,

నాన్న.....నీకు ఆనందాని ఇవ్వడం కోసం ఎన్ని బరువులు అయినా మోయగల సైనికుడు,

నాన్న...నీ భవిష్యత్తు కోసం బంగారు బాటవేశే బాటసారి..మన జీవితంలో మొదటి హీరో " నాన్న" వారు మనతో ఉన్నప్పుడే ప్రేమించండి..తర్వాత ఎంత గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు....*నాన్నకు ప్రేమతో*..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


79)జీవితంలో మనకి క్రమశిక్షణ, నడవడిక రెండూనూ కలిగి ఉండడం తప్పని సరి..ప్రస్తుతకాలంలో మంచి అన్నదానికి తావేలేకుండా పోయింది. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా.. అన్యాయాలూ, అక్రమాలూ,నేరాలూ!గొప్ప వ్యక్తిత్వం అంటే ఒక ఉద్యోగం సాధించి కాస్త డబ్బు సంపాదించి సమాజంలో హుందాగా తిరగడం కాదు… తన ప్రక్కన ఉన్న వారిని సంతోషంగా ఉంచగలడం లోనే ఉంది. చదువు సంస్కారం , మంచితనాన్ని నేర్పిస్తుంది అంటారు.. కానీ దాన్ని కళ్లతో మాత్రమే చూడగలగేవారు ఎంత చదివినా దాని నుండీ ఏమీ నేర్చుకోరన్నది మాత్రం నిజం. ప్రపంచానికి మాత్రం మంచిగా ఉండడం కోసం ఎన్నో అలవాట్లు, హావభావాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ డబ్బుకట్టిమరీ నేర్చుకొని ప్రపంచాన్ని మోసం చేస్తుంటారు. ప్రేమ అభిమానం, అప్యాయత అన్నవి కరువవుతున్న ఈ రోజులలో తన వారిని ప్రేమగా చూసుకుంటూ, లోకానికి ఉపయోగపడేలా ‘మంచి నడవడికతో’ ఉండడం ఎంతమందికి సాధ్యమవుతుంది…?...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

80)వంద ఆలోచనలు విని, ఒక్కదాన్ని కార్యరూపంలో పెట్టిన వ్యక్తి కన్నా,విన్న వెంటనే ఒకేఒక ఆలోచన కార్యరూపంలో పెట్టే వ్యక్తే విలువైనవాడు.మనం నేర్చుకునే విషయాన్ని ఎంత ఎక్కువగా నేర్చుకుంటే  ఆ పనిలో అంత వేగంగా సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. సాధన చేసిన కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనలోని లోటుపాట్లనూ అంతే వేగంగా అధిగమించ గలుగుతాం. అదే వేగంతో పనిలో పూర్తి అధికారాన్ని సంపాదించుకోగలుగుతాం. మనకు ఈ నైపుణ్యం అలవడిన తరువాత ఇక జీవితాంతం అది మన సొంతం అయిపోతుంది. మన కోసం ఏర్పరచుకున్న ఎటువంటి లక్ష్యాన్నయినా సాధించేందుకు అవసరమైన ఎటువంటి విషయాన్నయినా నేర్చుకోగలుగుతాం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

81)జీవితంలో నువ్వు ఎంత పోరాడతావో అంతగా నీ మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంటుంది కానీ ఒక్కసారి గెలిచాక..ఆ విమర్శలన్నీ చప్పట్లుగా మారిపోతాయి దీనికి కారణం నీఆత్మవిశ్వాసం,పక్కవాడి యొక్క అవకాశవాదం..అదే నువ్వు ఓడిపోయ్యుంటే మాత్రం నీ జీవితం ఓ పలకలా మారిపోతుంది అప్పుడు ఎవ్వడికి నచ్చింది వాడు రాసిపోతాడు.పోరాడేవాడిని గుర్తించని ఈ లోకం గెలిచినవాడిని కూడా ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోదు.నిరంతరం గెలుపు మారినట్టే ప్రపంచం కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి నీ లక్ష్యం నీ గమ్యం ఒక్కటే ముఖ్యం..విమర్శల గురించి లెక్కచేయకు ముందుకు సాగుతూపో నీ విజయం తధ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

82) మనిషి తలచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు.ఆ మనిషిలోని సంకల్పమే అతని ప్రతిభకు, సామర్థ్యానికి తార్కాణంగా చెప్పాలి. ఈ ప్రతిభ వంటివి ప్రతి మనిషిలోను అంతర్లీనంగా దాగి వుంటాయి.వాటిని సానబెట్టి బయటకు తీసుకురాగలిగితే ప్రతి ఒక్కరు వారి జీవితంలో అనుకున్నవి తప్పక సాధించగలుగుతారు.విజయం సాధించడానికి రహస్యం,సూత్రం మనలోనే వున్నదని గ్రహించి పట్టుదల, దీక్ష తపనలతో క్రమబద్ధమైన ప్రణాళికతో ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ ముందుకు సాగిన వారికే అనితర సాధ్యమైన విజయాలు సొంతమ వుతాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

83) మన జీవితంలో కనికరం లేని కష్టమైన రోజులు కొన్ని..కపటం లేని ఇష్టమైన రోజులు మరికొన్ని..కలలుగా మిగిలి పోయినవి కొన్ని...నిజాలుగా ఎదురైనవవి మరికొన్ని..ఎదురు దెబ్బలు కొన్ని...మధుర గాయాలు మరికొన్ని..గుణపాఠాలు కొన్ని..గుర్తిండిపోయే పాఠాలు మరికొన్ని..జీవితాన్ని చూపేవి కొన్ని...జీవితాన్ని కూల్చేవి మరికొన్ని...ఏదేమైనా పరిస్థితులను,పరిసరాలను బట్టి నడుచుకుంటూ..ఎవరినైనా ప్రేమాభినాలతో గెలుచుకుంటూ మనలోని లోపాలను మనం తెలుసుకుంటూ నిన్ను నువ్వు మంచి మనిషిగా మలుచుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

84)మనమెట్లా చూస్తే జీవితం అట్లా వుంటుంది. తెల్లని పూలతో కళకలాడే గులాబీ మొక్కని చూసినప్పుడు పూలతో బాటు ముళ్ళు కూడా వుంటాయి. పూలని చూడాలా? ముళ్ళని చూడాలా అన్నది మన చేతుల్లో వుంది. మన దృష్టిని బట్టి జీవితం మారుతుంది. మనోహరంగా వుందనుకుంటే ఆనందాన్ని పంచుతుంది. బాధతో నిండి వుందనుకుంటే బాధను యిస్తుంది. జీవితం అద్దంలాంటిది. నువ్వు నవ్వుతూ అద్దంలోకి చూస్తే నవ్వు ముఖంతో వుంటావు. ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనిపిస్తావు.మనిషి గాఢంగా జీవించాలి. జీవితాన్ని రసభరితం చేయాలి. రంగులు చిమ్మాలి. ఆశావహ దృష్టి అన్నది అన్ని వేళలా అవసరం. అది జీవితాన్ని అర్థవంతం చేస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

85)మన చుట్టూ ఉన్నదంతా మన బలం కాదు అలాగే మన చుట్టూ ఉన్నవారంతా మన వారనుకుంటే పొరపాటే..మనల్ని పొగిడిన వాళ్ళంతా మన మిత్రులు కాదు అలాగే మనల్ని తిట్టినా వాళ్ళంతా శత్రువులు కాదు..ఒక్కసారి మన దగ్గర ఏమి లేదని తెలిసిందంటే ఇక అంతే సంగతి.నువ్వు పెంచుకున్న కుక్కపిల్ల,నువ్వు తోముకున్న సబ్బు బిళ్ళ తప్ప ఇంకేం ఉండవు నీ చుట్టు...ఎవెరెన్ని చెప్పినా వెలిగే దీపాన్ని చూసి చుట్టూ చేరి..ఇల్లు చక్కబెట్టుకుంటారే తప్ప ఆరిపోయి వెలవెలబోతున్న ప్రమిద దగ్గరికి చీమలు కూడా రావు కాబట్టి ఏమి చేసిన ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే మనం కింద పడితే నవ్వేవాళ్లే ఎక్కువున్నారు ఈ లోకంలో..తస్మాత్ జాగ్రత్త.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

86)కమ్ముకొచ్చిన పొగమంచు కరగదా సూర్యరశ్మి సోకగానే,కమ్ముకున్న మేఘాలు కదలవా జాబిలీ చల్లదనం తాకగానే అలాగే నీలో ఉన్న భయాలు ఆందోళనలు తొలగావా నీలో సంకల్పశక్తి నిన్ను చేరగానే..ఏవి కలకాలం ఉండవు కాబట్టి ఇదే బలంతో ముందుకెళ్లాలి నీ గమ్యం చేరేవరకు ఆపకు నీ పయనం..ఎదో ప్రయత్నించాను నచ్చితే చెప్పండి.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

87)నువ్వు వెనక్కి తిరిగి చూడాలన్నా రెండు కళ్ళు ఒకటై చూడాలి...అడుగు ముందుకు వేయాలన్నా పాదానికి పాదం తోడివ్వాలి...చేతితో కలిపితేనే మెతుకులు ముద్దయ్యేది...పది అడుగులు వేస్తేనే దూరం దగ్గరయ్యేది...అవయవాలు సహకరిస్తేనే చలనం నీకుండేది...సహకారముంటేనే సమస్య పారిపోయేది...ఏది సాధించాలన్న ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది..కాబట్టి నువ్వు చేరాలనుకున్న గమ్యాన్ని ఛేదించుకుంటుపో ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆపకు నీ పయనం..నువ్వు ధర్మం వైపు మంచి వైపు ఉంటె ఎప్పుడు నువ్వు ఒంటరివాడిగా ఉండవు దైవం మానుష రూపేణ నీకు ఎల్లప్పుడూ ఎదో ఒక విధంగా సహకరిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

88)జీవితంలో మనం కష్టాలను అధిగమించంలేకున్నా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చినందుకు,సమస్యలు సవాళ్లు వ్యక్తిత్వ బలోపేతానికి వారధి కట్టినందుకు,విషయావగాహన లేకపోయినా నేర్చుకునే అవకాశం కలిపించి నందుకు,చేసిన తప్పులు అనుభవ పాఠాలు నేర్పినందుకు,అనుకున్నవి లభించక పోయినా ఆశగా ఎదురుచూసే అవకాశం వచ్చినందుకు,మనం పొరపాటున చేసిన తప్పులు మన చేతే లోపల రూపంలో సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

89)జీవితంలో గెలవాలంటే ఎత్తుకు పై ఎత్తువెయ్యాలి యుద్ధంలోనైనా,జీవితంలోనైనా లేకుంటే మన ఎత్తులు చిత్తవుతాయి.ఎదిరించాలంటే ధైర్యముంటే చాలదు చతురత ఉండాలి,సామర్ధ్యముండాలి లేదంటే ప్రత్యర్థి బలహీనతైనా తెలిసుండాలి.ఎదుటివాడి మదిలో ఏముందో ఊహించి పావులు కదపాలి ఏలాగైతే చదరంగంలో పోరాడాలంటే అరవైనాలుగు గళ్ళలో పోరాడాలి అప్పుడే గెలుస్తాం కానీ జీవిత చదరంగంలో మాత్రం మనమే పావులమన్న విషయాన్ని మరుస్తున్నాం.ఆడించేది, ఓడించేది మాత్రం పైవాడే అయినా మనం గెలవాలంటే కష్టపడాలి అప్పుడే అనుకున్నది మనం సాధించగలుగుతాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

90)సమస్యలు లేని జీవితం ఉంటుందా ఈ ప్రపంచంలో... సమస్యలు రాని జీవి ఉంటుందా ఈ జగంలో...సమస్యలు అన్నీ సమసిపోవాలంటే మూలమెక్కడ???సమస్యలు అన్నీ పరిష్కరించబడాలంటే అంతమెక్కడ?ఈ అనంతలోకంలో నువ్వు వెతికే సమస్యకి సమాధానం ఎక్కడుందో తెల్సా??????నీలోనే ఉంది....అవును.... నిజంగా నీలోనే....అద్భుతమైన మేధస్సు నీలోనే ఉంది... పదును పెట్టు...అపారమైన తెలివితేటలు నీలోనే ఉన్నాయి... ఉపయోగించు...అద్వితీయమైన జ్ఞానం నీ సొంతం...అనిర్వచనీయమైన వివేకం నీ సొంతం...ఇన్ని సుగుణాల కలబోత అయిన నీవు సమస్య వస్తే చతికిలపడిపోతే ఎలా???సమసిపోయే మార్గం అన్వేషించు...చిక్కుముడి వీడే దిశగా శోధించు...ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు...విజయం నీదే మరి....ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


91)అస్తమిస్తున్న వెలుగు....ఉదయించడానికి.....

ఆవిరవుతున్న నీరు....వర్షించడానికి.....

చచ్చిపోతున్న గింజ.....మొలవడానికి...

ఎండిపోతున్న కొమ్మ.....చిగురించడానికి....

పడిపోతున్న నువ్వు....జీవితంలో గెలవడానికి.....

ఓడిపోయేది గెలవడానికని మరవకు.....

ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపో....విజయం నీదే......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

92)*వినయం లేని వ్యక్తిత్వం*.......*

వివేకం లేని విద్య......*

*అణకువ లేని అందం*.....
*ఆత్మీయత లేని బంధుత్వం.....*
*అవసరానికి అందని సహాయం.....*
*నమ్మకం లేని స్నేహం.......*
*గమ్యం లేని పయనం వ్యర్ధమైనవే*
ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

93)అహం మనిషి విచక్షణా శక్తి నీ కోల్పోయేలా చేస్తుంది...అహం ఆలోచనా శక్తి నీ తగ్గించివేస్తుంది.అహం భందాలను, భందుత్వాలను విడ గొడుతుంది...అహం మిత్రులని దూరం చేస్తుంది...అహం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా...మనల్ని అన్ని విధాలా దిగజారుస్తుంది..అందుకే తెలివిగల వారు ఎవ్వరూ అహాన్ని దగ్గరకు రానివ్వరు కాబట్టి పొద్దునే మనం లేవగానే మనం మనకు వేసుకోవాల్సిన ప్రశ్న "నా వల్ల ఎవరికి ఉపయోగం" అదే ప్రశ్న మరలా నిద్ర పోయే ముందు వేసుకోవాలి అప్పుడే నువ్వు అహం లేకుండా  ఎదిగినట్టు.. జీవితంలో కొంతైనా నువ్వు సాధించినట్టు...ఇట్లు..మీ..✍🏻 *రఘు*

94) గెలిచేంత వరకు ఆటను,విజయం సాధించే వరకు జీవితాన్ని సాగించాల్సిందే తీరం చేరాలంటే తుదికంటా లంఘించాల్సిందే!! తగిలిన గాయాలు,పొందిన అవమానాలు,మోసం చేసిన మనుషులు,బాధించిన మాటలు,ఓడిపోయిన క్షణాలు కాదు మనకు గుర్తు రావల్సింది..చెయ్యాలనుకున్న పనులు,సాధించాల్సిన లక్ష్యాలు,చేరాలనుకున్న తీరాలు,నెరవేర్చాల్సిన బాధ్యతలు గుర్తుకు రావాలి..అదీ జీవించడం అంటే...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

95) మనల్ని మనం తెలుసుకోవాలి. మన శక్తిసామర్థ్యాలను మనమే అంచనా వేసుకోవాలి. మన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. మనకు ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్కరోజులో అయ్యేవి కావు. ఏళ్లతరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడులా విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తూ ముందుకెళ్లాలి...నువ్వు ఎదుగుతూ పక్క వాడిని ఎదగనిచ్చే స్థాయికి నువ్వు వచ్చినప్పుడే ఏదైనా జీవితంలో సాధించినట్టు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

96)ఏదైనాసరే మన దృష్టిలోనే ఉంది మనం వీక్షించ గలిగితే అంతటా మంచే కనిపిస్తుంది...మనం దర్శించగలిగితే ప్రతిమంచిలోనూ దైవం కనిపిస్తుంది..మనం సవరించుకో గలిగితే ప్రతి బలహీనతా ఒక బలమవుతుంది..మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి అపార్థమూ అర్థమవుతది..మనం అన్వేషించగలిగితే ప్రతి సమస్యా ఒక పరిష్కార మవుతుంది....మనం నేర్చుకోగలిగితే ప్రతి అనుభవమూ ఒక పాఠమవుతుంది..మనం స్వీకరించగలిగితే ప్రతి కష్టమూ ఒక ప్రేరణవుతుంది..మనం మలచుకోగలిగితే తగిలిన ప్రతిరాయీ పునాదిలో బాగమవుతుంది...మనం ప్రయత్నించగలిగితే ప్రతి ఓటమీ మన విజయానికి సోపానమవుతుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

97)మనం ధైర్యంగా పోరాడగలిగితే ప్రతి సవాలు సూక్ష్మమ వుతుంది..మనం ఆహ్వానించ గలిగితే ప్రతిపరిచయమూ ఒక‌ స్నేహమవుతుంది..మనం ఆస్వాదించగలిగితే ప్రతి స్నేహమూ ఒక అనుబంధ మవుతుంది..మన‌ం మన హృదయాన్ని విశాలం‌ చేసుకోగలిగితే ప్రతిఅనుబంధమూ ఒక అద్భుతమవుతుంది..మనం సంకల్పిస్తే..మన జీవితమే ఒక‌ అందమైన ప్రపంచ మవుతుంది.....ఏదయినా మనం "అనుకునేదానిలోనే" ఉంది..ఇది నిజం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

98) జీవితంలో ఓడిపోయానని దిగులు చెందకు..ఓటమి శాశ్వతం కాదని తెలుసుకో..గెలుపు దూరం అసలే కాదు ఈ ప్రయత్నంలో విఫలమయ్యావంతే..అవకాశం పోయిందనుకో మరో అవకాశం నీకు వస్తుందని తెలుసుకో..విశ్రమించక ముందుకు సాగు విమర్శలను అసలు వినిపించుకోకు...అసలు లక్ష్యం మరువకుండా అలక్ష్యం చేయకూడదని తెలుసుకో ఆగని కాలంతో పోటీపడుతూ అలుపెరుగక సాగిపో..నిరాశను అధిగమిస్తూ పోతుంటే గమ్యం చేరువవుతుందని తెలుసుకో..అలా సాగితే సలాము చేయదా ప్రపంచం?? ..గులాము కాదా నీకు విజయం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

99)జీవితంలో ఫలితాన్ని ఆశిస్తూ ప్రశంసలకై పనులు చేస్తూ వాంఛలకై పాకులాడ కూడదు..ఎలాగైతే నీరు ఆవిరై ఆకాశాన్ని అందుకుంటుందో..అలాగే పట్టుదల, కృషి, శ్రమ, సహనం..మనిషినీ ఉన్నంత శిఖరాలవైపు తీసుకెళ్తుంది..అందుకే పెద్దలు కష్టే ఫలి: అన్నారు కాబట్టి కష్టమైనా ఇష్టంతో పని చేయి విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

100)జీవితంలో నిన్ను దిగజార్చాలన్న వాడిని వదిలిపెట్టకు.. నిన్ను ఎగతాళి చేసిన వాడిని మర్చిపోకు..నీతో ఏమి కాదు  అన్నవాడిని విడిచిపెట్టకు..ఇక్కడేది ఊరికినే రాదు ఉరుకుల పరుగుల జీవితంలో మందను వదిలి ఒంటరిగా పోరాడితేనే వస్తుంది..కష్టనష్టాలు ఆటుపోట్లను ఎదుర్కో రేపటి విలాసం కోసం ఓర్చుకో..కొడితే కొండనే కొట్టాలి చిన్న చిన్న గుర్తల్ని కాదు..చేతగాని వారి మాటల్ని విని నీకున్న ధైర్యాన్ని చంపుకోకు..ఎందుకంటే యుద్ధం చేతగాని వాడే ఆ పిచ్చి మాటలు మాట్లాడతారు కాబట్టి ఏదైనా సరే ధైర్యంగా కష్టాన్ని నమ్ముకొని ఎదుగు నీకు విజయం తధ్యం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

101)ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదురవుతాయి.ఊహించని బాధలు, భయాలు చుట్టుముట్టి మనసుకు స్థిమితం లేకుండా చేస్తుంది.జీవితంలోని సవాళ్ల నుంచి తప్పుకోవడంకన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటేనే మనలో ఆత్మస్థైర్యం,ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతాయి.చిన్న కష్టం వచ్చిందని, ఓటమి ఎదురైందని ఎక్కడికో పారిపోవాలనుకోవడం పిరికితనం. ఎప్పుడైనా ఎదురొడ్డి పోరాడినవారే అనుకున్నది సాధిస్తారు. సమస్యల వలయం నుంచి బయటపడతారు.కొమ్మలు నరికినా సరే చెట్టు మళ్ళీ చిగురిస్తుంది అలాగే సమస్యలకు భయపడి పారిపోకుండా ముందుకు సాగిపోవాలనే స్ఫూర్తినిస్తుంది.నిజానికి పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ ఉండదు.ఉండాల్సింది సరైన ఆలోచన.పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకుసాగితే మనకి ఏదీ కష్టంగా అనిపించదు కాబట్టి ఆలోచన ఎంత ముఖ్యమో ఆచరణ అంతే ముఖ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

102)మనం చేసిన తప్పులకంటే...చెయ్యని తప్పులకు..మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళే మనచుట్టూ ఎక్కువగా ఉన్నారు.వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

103)గతం నుండి నేర్చుకోవాలి. భవిష్యత్ కు ప్లాన్ చేసుకోవాలి. వర్తమానంలో జీవించాలి. అయితే భవిష్యతను సృష్టించాలంటే ముందుగా అనవసర గతాన్ని వదిలేయాలి. మనసుకు స్ఫూర్తినిచ్చి,కదిలించి, చైతన్య పరిచే లక్ష్యాలను సాధించాలంటే వర్తమానంలో ఆనందంగా కర్తవ్య నిర్వహణచేయాలి. ఏ సమయంలో అయినా, ఏ వ్యక్తికయినా 3 అవకాశాలు ఉంటాయి. *1. మార్చడం 2. ఆమోదించడం. 3. వదిలేయడం*. మార్చలేనివి ఆమోదించాలి. ఆమోదించలేనివి మార్చాలి. ఈ రెండూ చేయలేనివి వదిలేయాలి అంటే పట్టించుకోవడం మానేయాలి. Ignorence is Bliss అన్నారు.అంటే అనవసర విషయాలు, రేపటికి ఏ మాత్రం విలువలేని విషయాలను Ignore అంటే పట్టించుకోకపోతే, అవసరమైనవి పట్టించుకునే సమయం స్థిత ప్రజ్ఞత (calm state of mind and positive attitude to life)రెండూ లభిస్తాయి. అర్ధమైతే ఆచరించండి అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించండి-రఘు

104)చెప్పుల్లో కాళ్లు పెట్టి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించం.ఆలోచించిన తరవాత చెప్పుల్లో కాళ్లు పెడతాం. గమ్యం లేకుండా ప్రయాణం మొదలు పెట్టం. ఏ పనికైనా, ఏదిచెయ్యాలన్నా ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం..తెగిన గాలిపటం- ఒకటే. లక్ష్యసాధనకు విశ్వాసం పట్టుదల, ఓర్పు, దీక్ష, నిర్విరామకృషి, నిరంతర ఆత్మపరిశీలన కావాలి.కష్టాలు వస్తాయనో, వచ్చాయనో మధ్యలో వదిలిపెట్టకూడదు. ఆశయాలు స్థాయికి మించి ఉన్నప్పుడే  మనలో శక్తియుక్తిలన్నీ ఒక్కటి అవ్వాలి..జీవితానికి ఎంచుకొన్న లక్ష్యమెంత ఉన్నతమో, చేరుకునే మార్గం కూడా అంత ఉన్నతంగా ఉండాలి. అనైతికంగా అడ్డదారిలో సాధించిన లక్ష్యానికి ఆత్మతృప్తి కలగవచ్చు కానీ విలువ ఉండదు.లక్ష్యం మహత్తరమైనది ఆశయం ఉన్నతమైనది అయినప్పుడు, కొన్నిసార్లు విఫలమైనా ఆ ప్రయత్నానికి ఒక విలువ ఉంటుంది. అది తదుపరి తరానికి ప్రేరణగా నిలిచి స్ఫూర్తినిచ్చి కార్యోన్ముఖుల్ని చేస్తుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

105)మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి చుట్టూ చాలా మందే ఉంటారు...నిజానికి వీళ్ళకి కష్టాలు ఎప్పుడు వస్తాయా వీళ్ళని ఓదార్చడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళే ఎక్కువమంది ఉంటారు కానీ మనం ఆనందంలో విజేతలుగా ఉన్నప్పుడు మనల్ని చూసి ఈర్ష్య పడకుండా ఆ ఆనందాన్ని రెట్టింపు చేసే వాళ్ళు దొరికినప్పుడు వదులుకోవడం మన మూర్కత్వం అవుతుంది అలాగే మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కన్నా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి మన దగ్గరే ఉండడం అదృష్టం కాబట్టి అలాంటి మనుషుల్ని,బంధాల్ని పదిలంగా చూసు కుందాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

106)నీకు లేదని ఇతరులకు కలదని ఎప్పుడు బాధ పడుతూ కృంగిపోకు...దేవుడికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో... ఎప్పుడు ఎవరిని పైకి తేవాలో...ఎప్పుడు ఎవరిని క్రిందికి దించాలో...అది పైవాడిలీల...దాని కోసం ఆరాట పడటం... అత్యాశ పడటం... దక్కక పోతే కృంగిపోవటం వృధా...కాబట్టి మనం చేయవలసినది మన కర్తవ్యం.... చేసుకుంటూ వెళ్తేచాలు అన్ని వాటంతట అవే వస్తాయి మన నిజాయితీని బట్టి...కాబట్టి ఎవరిని చూసి ఈర్ష పడకు...ఎవరికీ అన్యాయం చేయకు... నిజాయితీగా ఉండు...నీతిగా బ్రతుకు...అప్పుడు నీకు నువ్వే సాటి...అప్పుడూ నీ దగ్గర సంపద ఉన్నా..లేకున్నా నీ అంతటి గొప్ప వాడు ఎవడు ఉండడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

107)నీకు జీవితంలో ఏదురైన సవాళ్లను చిరునవ్వుతో ఎదురుకుంటూ ఓడిపోయిన ప్రతిసారి నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకుంటూ అలసిపోక...ఆగిపోక..భయపడ..నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా ఎవరిని అనుకరించుకుండా నీకంటూ ఒక ప్రత్యేక రహదారిని ఎంచుకొని అడుగు వేస్తానే కదా ఈ జీవిత ప్రయాణంలో నువ్వు ముందు కెళ్లగలిగేది విజయాన్ని వరించేది ఎందుకంటే విజయం నీకు ధైర్యన్నీ ఇస్తుందేమో అపజయం నీకు దేనినీనైనా తట్టుకునే బలాన్ని ఇస్తుంది కాబట్టి ఓటమి వస్తుందని విజయం కష్టపడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

108)జీవితంలో నువ్వు కింద పడ్డ ప్రతిసారీ పైకి లేవడం నేర్చుకో..అవసరంలేని ఆలోచనల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం మొదలు పెట్టు..కష్టాలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు..సమాధానం లేని ప్రశ్నలు ఉండవు..పరిష్కారం లేని సమస్య అనేది ఉండనే ఉండదు..ఓటమి వస్తుంది అని అడుగు వేయడం ఆపకు..గెలుపు వచ్చేసింది అని సంబర పడకు..వ్యత్యాసం తెలుసుకొని నడుచుకో..నిన్నటి బాధను వదిలిపెట్టి..రేపటి గురించి ఆశ పడుతూ..ఓటిమి నుంచి నేర్చుకుంటూ...వెనుకంజ వేయక ఆగిపొని ప్రవాహంలా నీ పయనం మొదలు పెట్టు..నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

109)నిన్న బలగం చిత్రం చూడటం జరిగింది దర్శకుడు వేణు ఎంతో చక్కగా ఉన్న వాస్తవాలని చూపించాడు..దాని గురించి నా యొక్క స్పందన.. మన జీవితంలో కోల్పోయినప్పుడు కాని తెలియదు..నీకోసం మాత్రమే ఒక బంధం ఎప్పుడు..ఎదురుచూస్తూ ఉంటుందని,కోల్పోయినప్పుడు మాత్రం తెలియదు..కోల్పోయిన మనిషి విలువలు,వారితో పంచుకున్న ఆనందాలు,విషాదాలు,అందుకే కోల్పోపక ముందే మనం మేల్కోంటే మంచిది,బంధాలను,అనుబంధాలను ఎలా నిలబెట్టుకోవటం అని ఆలోచించటం,ఆచరించటం,బంధాలను నిలబెట్టుకోవడానికి మన వంతు సహాకారం,ఏది పోయినా తిరిగి పొందవచ్చు కాని మనుషులు మనుషుల్లోని మమతలు ఒకసారి-కోల్పోతే మనకు తిరిగిరావు ఆ విషయం తెలుసుకొని మసలుకోవటం "మనం చేయగలిగింది"  వీలైతే మీరు మీ కుటుంబ సభ్యులతో చూడండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

110)యుద్ధం మొదలయింది..నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూసాడంట అలాగే నా వెనుక ఎవరున్నారని అర్జునుడూ చూసాడంట..బలగాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు..భగవంతుడ్ని నమ్ముకున్నోడు గెలిచాడు ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటుంది..భగవంతుడెప్పుడూ ప్రత్యేకంగా బలాన్నివ్వడు మన బలాన్ని మనకు గుర్తుచేస్తాడంతే.....కాబట్టి ఎప్పుడూ నీ బలాన్ని,కష్టాన్నీ నిన్ను నువ్వు నమ్ముకుని నీ లక్ష్యం కోసం పని చేయి..పైవాడి మీద భారం వేయి తక్కినది అయన చూసుకుంటాడు..కష్టే ఫలి:.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

111)జీవితంలో నీ గమ్యం చేరడానికి చేసే ఈ గమనం లో పూలుంటాయు..ముళ్ళుంటాయ్....రాళ్ళుంటాయ్ రత్నాలుంటాయ్...ఆవేశాలుంటాయి..ఆలోచనలుంటాయి.. ప్రశంసలుంటాయి..విమర్శలుంటాయి...అయినా ఆపకు నీ పయనం ఎందుకంటే ఇది జీవనయానం!! ఈ దారిలో.... అలుపొస్తే కుంగిపోకు....గెలుపోస్తే పొంగిపోకు.... బలముందని బలగముందని మిడిసి పడకు...! అందలమెక్కినా అడుసులో కాలిడినా ఏదీ శాశ్వతం కాదని తెలుసుకో....లక్ష్యం చేరానని లక్షలొచ్చాయని లక్షణాన్ని వీడకు...గమ్యాన్ని చేరానని ఆపకు నీ గమనం...ఎందుకంటే గమ్యం గమనమూ రెండు నిరంతర ప్రక్రియలే...గమ్యం ఒక మజిలీ మాత్రమే...మరో లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు సాగిపో నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

112)ఒక్కసారి కాలాన్ని చూపించే గడియారం వైపు చూడు....అందులో ఉన్న రెండు ముళ్లులు ఒకరి వెంట ఒకరు పరిగెడుతూనే ఉంటాయి... నేను ఒకరి వెంట పడటం ఏంటి అని అందులో ఉన్న ఏ ఒక్క ముళ్ళు నిష్క్రమిస్తే కాలమే ఆగిపోతుంది...అందులో ఉన్న ముళ్లులు అన్ని నా పని నేను చేస్తున్న అనే భావన తో ఉంటాయి కాబట్టే కాలం సాగిపోతూ ఉంటుంది..నువ్వు కూడా అంతే నీ ఆశయం కోసం అలుపెరుగని పయనం మొదలుపెట్టు...ఆ పయనం లోనే నీ ఆశయం తనకు తానుగా నీకు తారస పడుతుంది..కష్టపడుతూ ఉంటె అదే నిన్ను విజయతీరాలకు చేరుస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

113)అర్థం చేసుకోని వారి దగ్గర వాదన అనవసరం..అందరిలో లోపాలు మాత్రమే వెతికే ప్రతికూల మనుషుల దగ్గర వివరణ అనవసరం..నిన్ను నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం..మాదే కరెక్ట్ అనుకునే వారి దగ్గర సవరణ అనవసరం..అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం..బంధం విలువ తెలీనివారి కోసం రోదన అనవసరం..నిన్ను బాధించిన వారిని తిరిగిబాద పెట్టే మార్లాలకై శోధన అనవసరం...కొన్ని సందర్భాలలో మౌనమే పరిష్కారం..కొన్ని సందర్భాలలో కాలమే పరిష్కారం..చాలా సందర్భాలలో పట్టించుకోక పోవడమే పరిష్కారం... తిరస్కారానికి,విమర్శలకు ప్రతీకారం పరిష్కారం కాదు నిన్ను నీవు నిరంతరం మెరుగు పరుచుకోవడమే అసలైన ప్రతీకారం....ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

114)సమస్యలు రెండు రకాలు ఒకటి మన సమస్య మీద మన ఆలోచన...రెండవది ఇతరుల సమస్య మీద మన ఆలోచన..సమస్య మనదైనప్పుడు మన ఆలోచనలు ఎక్కువ భావోద్వేగంతో ఉంటాయి అలాంటప్పుడు తప్పుడు ఆలోచనలు రావచ్చు...సమస్య ఎదుటి వాళ్ళదైనప్పుడు మన ఆలోచనలు లాజికల్గా ఉంటాయి అలాంటప్పుడు చాలా వరకు మంచి ఆలోచనలు వస్తాయి అందుకే చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు..తర్వాత బాధపడతారు..ఇక మీదట మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకో కుండా ఉండాలంటే సమస్య మనది అయినప్పుడు ఎదుటి వాళ్ళలా సమస్య ఎదుటి వాళ్ళది అయినప్పుడు మనదిలా ఆలోచించాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

115)ఓడినపుడు ఆశపడే స్థాయి లేదనుకోకు..గెలిచినపుడు సాధించాననుకోకు..నీ ఓటమిని గెలుపుని మరొకరి చేతిలో పెట్టకు..సాధన చేయాలి పోటీ పడాలి ఆటను ఆస్వాదించాలి ఫలితాన్ని ఆహ్వానించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

116)ఈతిబాధలెన్ని ఎదురైనా వెనుకడుగన్నదే వేయకు ప్రపంచంలోని కష్టాలన్నీ నాకే అన్న భ్రమలో లేకుండా నాకు వచ్చిన కష్టాలు అంతకు మించిన ఆటుపోట్లు ఎదుర్కొని విజేతలుగా నిలిచి ఆదర్శప్రాయంగా ఉన్న వారెందరో ఉన్నారని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగు..సమస్య ఎదురైతే భయపడిపోకు ఆ సమస్యని ఎదిరించి పోరాడు చీకటిలో ఉన్నప్పుడు వెలుగులోకి రావాలని కోరుకున్నట్టే..నీ సమస్యల కారుచీకట్లను దాటాలని తిమిరంతో సమరం చేయి నీ ధైర్యాన్ని చూసి నీకొచ్చిన కష్టం వెనకడుగేస్తుంది గెలుపు నీ తలుపు తడుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

117)మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు..అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం మంచిపని చేసేటప్పుడు మనం కనబడాల్సిన అవసరంలేదు..కాబట్టి ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా చేయి నువ్వు అనుకున్నది ఆ దేవుడే నీకు అందేలా చూస్తాడు..ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

118)నీ ప్రమేయం లేకుండా నీ తప్పు లేకుండా లోకం నీ కోసం మాట్లాడే మాటలకు భయపడకు..నీ మీద నింద మోపుతున్నారంటే వాళ్లు నిన్ను చూసి ఈర్ష్య పడుతున్నారనేగా!!!ఓర్వలేని తనం తో నీ మీద నింద మోపే వారిది నరంలేని నాలుక అందుకే ఎటుకావాలంటే అటుతిరుగుతోంది ఏది పడితే అది మాట్లాడుతోంది..దానికే భయపడి వెనకడుగు వేస్తే ఆ నిందే నిజం అంటారు !!! ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్టు..నీ ఉన్నతి చూసి ఓర్వలేక సృష్టిస్తారు ఈ నిందలు శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు నీలాప నిందలు మనలాంటి సామాన్యులకు తప్పుతాయా!! ఎవరెన్ని  నింద లేసినా నీవేంటో నీకు తెలుసు నిజమేంటో నీ మనస్సాక్షి కి తెలుసు నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు అది తెలిసాక నీవేంటో ఈ ప్రపంచానికి అర్థం అవుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

119)నీ కంటే లేనివాడిని చూసి నవ్వుకోకు..నీకంటే ఉన్నవాడిని చూసి కుళ్ళుకోకు..ఎవరితో ఎప్పుడూ నిన్ను పోల్చుకోకు..కుదిరితే సంపాదించుకో లేకుంటే ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించు..ఎన్ని రోజులు ఉంటామో..ఎప్పుడు పోతామో తెలియని బతుకుల్లో ఈర్యా, ద్వేషాలను విడిచిపెట్టు అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు సంతోషంగా గడపగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

120)ఒక ఆకు రాలుతూ చెప్పింది - ఈ జీవితం శాశ్వతం కాదని..ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది - జీవితం ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని..ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది - చేదుని గ్రహిస్తూ మంచిని పంచమని..ఒక మెరుపు మేరుస్తూ చెప్పింది - ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని..ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది - చివరి వరకు పరులకు సాయ పడమని..ఒక వృక్షం చల్లగా చెప్పింది - తనలాగే కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని..ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది - తనలా కష్టసుఖాల్లో చలించకుండా సాగమని జాబిల్లి వెలుగుతూ చెప్పింది - తనలాగే ఎదుటి వారిలో వెలుగు నింపమని కాబట్టి ప్రకృతితో మమేకమైనప్పుడు అది చాలా నేర్పిస్తుంది మనకి అలాగే మనం నేర్చుకుందాం ఆచరిద్దాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

121)ఒక్క రోజులో రాదు ఏ మార్పు కృషి చేస్తే రానిదంటూ లేదు ఏ గెలుపు..నీ అడుగులకు తోడవ్వాలి నేర్పు శాంతి సహనం ఆయుధమై గొప్పవాళ్ళు నీకు నిదర్శనమై..నీ ప్రతి పనిలో ఆదర్శం కొలువై..పదిమందికి మార్గదర్శకుడుగా మారాలి.ఎదురొచ్చే ఏ అడ్డంకులకి తలవంచక అదరక బెదరక దారి మార్చక..నీ సంకల్పమే సమిధగ ప్రతి అడుగు ప్రభంజనమై సాగాలి..నీ తెగువకి ప్రపంచమే దాసోహం కావాలి..మంచికి నాంది పలకాలి...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

122)నీ గురించి ఎవరో ఏదో అనుకుంటారేమో అని ఆలోచించి నిన్ను నువ్వే అనగతొక్కుకో కూడదు..నిన్ను నువ్వు ఓ సూర్యుని కిరణంల నీ ఆలోచనలను విస్తరించేలా చేయి ఎందులోనూ నువ్వు ఎవ్వరికీ తక్కువ కాను అనుకుంటే నీలో సత్తా భువిని చీల్చుకుని మొలిచే విత్తనంలా నువ్వు అనుకున్న నీ లక్ష్యం సిద్ధిస్తుంది...!ఒకరు గొప్ప గురించి నువ్వు చెప్పేది ఏంటి అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకునేలా ఎదగడం ఆరంభించు కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించు విజయం సాధించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

123)వెనుక ఎవరూ లేరని బయపడకు పుట్టినప్పుడు ఒంటరిగానే వచ్చావు పోయినప్పుడు ఒంటరిగానే పోతావు ఇక భయమెందుకు? నిన్ను నువ్వు శోధించటానికి నీతో పదుగురెందుకు? నువ్వు వేసే ఒక్క అడుగే...వేల అడుగులు దాటిపోగలదు!కష్టానికి తలొంచకుండా సుఖాన్ని కోరకు,ఏదీ ఊరికే రాదు మనం అడుగు వేయాలన్న ఆలోచన లో నుండి బయటకు వచ్చి అడుగు వేసేయాలి...చెమట చుక్క ఫ్యాన్ కింద కూర్చుంటే రాదు కష్టపడితే వస్తుంది..ప్రయత్నం చెయి ఫలితం ఆశించకు ఒకప్పటి మాట..."ప్రయత్నం చెయ్ ఫలితం వచ్చేదాకా ఇది నేటి మాట"...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

124)మన గడియారంలో పెద్ద ముళ్ళు గిరగిరా తిరుగుతువుంటే చిన్న ముళ్ళు అడిగిదంట ఏంటే నాకంటే ఎక్కువ తిరిగేస్తున్నావ్ అని అప్పుడు పెద్ద ముళ్ళు చెప్పిందంట నేనలా తిరిగితేనే నీ స్థానం రెట్టింపవుతుందని చెప్పిందంట అలాగే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలోనూ అమ్మ నాన్న తమ కొడుకులు కూతుళ్ళ భవిష్యత్తు కోసం వారి స్థానాలు రెట్టింపు అవ్వడం కోసం నిద్ర నీళ్లు ఆహరం మానేసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు అలాంటి వారిని బ్రతుకున్నప్పుడే ప్రేమిద్దాం పూజిద్దాం వారు పోయిన తర్వాత ఫోటోలు చూస్తూ ఎంత బాధపడినా ప్రయోజనం లేదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

125)ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు..ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా గావించు..ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిరంతరం పూజించు..ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిత్యం ధ్యానించు...అప్పుడే నువ్వు గొప్పవాడవవుతావు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

126)ఆకాశమే హద్దుగా సాగిపో..చిరుతల పంజా విసురుతూపో..పడిపోతానని భయపడకు..పడి లేవడమే..జీవితమని తెలుసుకో..జీవితమే ఓ పరుగు పందెం.గెలుపోటములు కాదు ముఖ్యం పాల్గొనడమే నీ కర్తవ్యం..బరిలో దిగడమే నీ లక్ష్యం చావో రేవో తేల్చుకో..విజయుడవైతే కీర్తి కిరీటం..అపజయము నేర్పును పాఠం.. కాబట్టి భయపడకుండా కృషి పట్టుదలతో అంతరంగాన్ని శోధించు.సత్యాన్ని అన్వేషించు..నీలో దాగి ఉన్న ఆలోచన తరంగాల్ని మధించు అనుకున్నది సాధించు విజయం వరించు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

127)నిజం నిప్పులాంటిది అది నివురుగప్పి ఉంటుంది...మనసనే కుంపటి లోనా..కొందరు పనిగట్టుకొని...చలువలు పలువలుగా చెప్పుకునే అబద్ధాలే నిజాలై రాజ్యాలు ఏలుతుంటాయి అప్పుడప్పుడు అందుకే మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు కనిపించని వన్నీ అబద్ధాలు కావు..ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి జరగవలసిన నష్టం కాస్త జరిగిపోయిన తర్వాత నిదానంగా బయట పడుతుంది అప్పుడు మనం ఎన్ని క్షమాపణలు చెప్పినా..ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రయోజనం అంతంత మాత్రమే కోల్పోయిన జీవితం తిరిగి రాదు అందుకే అన్నారు పెద్దలు కరిగిన కాలం..తరిగిన వయసు..పోయిన పరువు..గాయపడిన మనసు తిరిగి పొందలేమని.. కాబట్టి ఏది నిజం ఏది అబద్దమని తెలుసుకొని మసలడం ముఖ్యం లేకపోతే జీవితంలో చాలా కోల్పోతాం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

128)నిన్ను నీవు తెలుసుకో..శక్తి యుక్తి పెంచుకో..నీ ఆశయాలు మంచివైతే..నీ లక్ష్యాలు గొప్పవైతే..నీకు అడుగడుగునా ఎన్ని కష్టాలొచ్చినా అడ్డదారి తొక్కకుండా.నిరాశా నిస్పృహలకు మనసులోన చోటివ్వకుండా కష్టాలను అధిగమిస్తూ సాగిపో..నువ్వు చేరాలనుకున్న ఎంత పెద్ద గమ్యాన్నైనా నీకున్న చిత్తశుద్ధితో చేరుకోగలవు ఎందుకంటే గెలుపు ఓటములు సహజమని తెలుసుకో..ఒకవేళ ఓడిపోతే మరల మరల ప్రయత్నించు అనుకున్నది సాధించు..పట్టుదలతో ప్రయత్నించు విజయాన్ని వరించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

129)జీవితం... అన్నింటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులు మరియు తినడానికి కూడా టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను,నిద్ర లేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువును, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని అలాగే ఎవరి కంటికి కనిపించనంత దీన స్థితిని... అలా జీవితం అందరి సరదా తీర్చేస్తుంది..కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా వీటిని అన్నింటినీ తట్టుకుని ఎదుర్కోవాల్సిందే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

130)జీవితంలో మనం ఏదైనా కొత్త విషయాన్ని కానీ లేదా కొత్త దారిని కనుకొనే సమయంలో ఎన్నో ముళ్లను తొలగించాలీ,ఎన్నో రాళ్లను పగులగొట్టి దారిని సృష్టించాలి.ఎగుడు దిగుడు నేలను దున్ని సమతలం చేయాలి.ఎన్నో పాట్లు పడుతూ బాటలు వేయాలి. చీకటిలో నడుస్తూ వెలుతురు కోసం వెదకాలి. అగాధ లోయలో నుంచి ఉన్నత పర్వతాలను అధిరోహించాలి. ఇదే జీవితమంటే! దానికి పట్టుదల చాలా ముఖ్యం. అది లేకుంటే మనంకాలు కదపలేం. నోరు మెదపలేం.అసాధ్యం అని తెలిసినా, ఎలాగైనా సాధించాలనే పట్టుదల ఉంటే చాలు అన్నీ వశమవుతాయి.అన్వేషించాలనే శ్రద్ధ ఉంటే ఎంతటి సమున్నత లక్ష్యమైనా వచ్చి ముంగిట వాలుతుంది. ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

131)నిరాశలో...... ఆశ ఉంది..తిరస్కారంలో పరిష్కారం ఉంది..ఓటమిలో..... ఓరిమి ఉంది..నిర్లక్ష్యంలో.... లక్ష్యం ఉంది..నిధానంగా ఆలోచిస్తే అన్నిటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది..కావాల్సింది కాసంత ఓపిక అంతే కాబట్టి అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

132)నీ జీవితంలో నిన్ను హేళన చేసి నవ్వే వాళ్ళని.. నవ్వనీ..మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని.. చేయనీ..నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని..ఏడ్వనీ నువ్వు మాత్రం నీలాగే ఉండు నీ వ్యక్తిత్వాన్ని దేని కోసమైనా సరే ఎవ్వరి దగ్గర తాకట్టు పెట్టకు..ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా..నీ మనస్సుకి మరియు భగవంతుడొక్కడికి నచ్చితే చాలు ఎందుకంటే "సంస్కారమే స్థిరాస్తి"..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

133)మనల్ని ఎప్పుడైనా విధి వక్రించితే దానిని మనకి అనువుగా మలచుకోవాలే కాని అనవసరంగా బాధపడకూడదు. విధి వక్రించినపుడు మనోనిబ్బరంతో ధైర్యంతో ముందుకు నడవాలి. జీవితం అంటే ఇంతేనా అని బాధపడకూడదు. బాధల్లోనే సుఖం ఉంటుంది. కష్టాల్లోంచి వచ్చి సుఖంగా బ్రతకడం మంచిదే. కానీ సుఖంగా ఉండి భవిష్యత్తులో కష్టం అంటే భరించరానిదిగా ఉంటుంది. అందుకే భగవంతుడు మనకి ఎంత అవకాశం ఇచ్చాడో అంత అవకాశాన్ని వినియోగించుకోవాలి. అంతేకాని లేనిదాని కోసం నిరంతరం బాధపడుతూ కూర్చోకూడదు. రాముడంతటివాడు అరణ్యవాసానికి వెళ్లినపుడు తన అవస్థకు కారణం ఎవరా అని ఆలోచించకుండా, తాను ఉన్న పరిసరాలను ప్రశాంతంగా ఉంచాడు కాబట్టి ప్రశాంతంగా దృఢచిత్తంతో కష్టపడి పని చేస్తే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

134)ఈ రోజుల్లో చాల మంది చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరు.మనుషులు మనసులు మారవు కానీ ప్రపంచాన్ని మార్చేయడానికి ముందుకు వచ్చేస్తారు మారాల్సింది ప్రపంచం కాదు మన ఆలోచన విధానం.పక్క  వాడికి సాయం చేయరు కానీ సలహాలు ఇస్తారు.ఆపద ఎదురైతే పారిపోతారు మాటలు చెప్తారు.కష్టం వచ్చింది అంటే కనిపించకుండా పోతారు కాకుల్లా పొడుస్తారు.ఏదైనా నష్టం జరిగాక సానుభూతి చూపిస్తారు చేయూత మాత్రం ఇవ్వరు.బంధాలకి విలువిస్తాం అని నోటితో చెప్తారు..కళ్ళతో వాళ్ళ ఆస్తులు అంచనా వేస్తారు.నేను నా కుటుంబం అని స్వార్థంతో కాకుండా కొంచెం ప్రేమతో మంచి తనంతో ప్రపంచాన్ని చుస్తే అంత మంచే కనపడుతుంది.నలుగురి కోసం బ్రతకలేకపోయినా మన వలన ఎవరికీ కష్టం రానీకుండా బ్రతకగలిగితే అదే నువ్వు చేసే పెద్ద మంచి పని..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

135)ఈ సమాజంలో మనల్ని అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒక్కటే దూరంగా ఉన్నా ఒక్కటే అలాంటివాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తాము.. కాబట్టి అలాంటివాళ్లతో తస్మాత్ జాగ్రత్త.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

136)దేవుణ్ని ఏం కోరుకోవాలి? నీలోని బలహీనతలను విన్నవించి వాటిని అధిగమించే శక్తిని, కష్టాలను అధిగమించే మానసిక స్థైర్యాన్ని కలిగించమని అర్థించాలి ఆ దేవుడు  ప్రసాదించిన తెలివి తేటలు, సంపద దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే బుద్ధి కలిగించమని కోరుకోవాలి. లభించిన దానితో తృప్తిపడే మనసునిమ్మని కోరుకోవాలి. అంతకు మించిన ధనం లేదు.అర్హతను చూసి ఎవరికి ఏమి కావాలో ఎంతవరకు ఇవ్వాలో అది ఏదో రకంగా భగవంతుడు కలగజేస్తాడు.అర్హత లేకుండా దైవాన్ని ప్రార్థించడం ఇతరులను అర్ధించడం కేవలం అవివేకం, అత్యాశ...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

137)మనం అందరితో వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇతరుల తప్పులను ఎంచడం మానాలి.నువ్వు తప్పు చేసానని నీకు అనిపిస్తే ఆ తప్పును తెలుసు కొని మళ్ళీ అది జరగకుండా చూసుకోవాలి, ఇతరులు గొప్ప పని చేస్తే నిజాయతీగా ఒప్పు కోవాలి. సంకోచమే మరణం, వ్యాకోచమే జీవితం అంటారు.నిస్వార్థంగా ఇతరులకు ఏమి ఇవ్వగలమో అవి ముందు ఇవ్వడం నేర్చుకోవాలి.ఈర్ష్య అసూయద్వేషాలకు దూరంగా ఉండ గలగాలి అప్పుడే పొందే అర్హత మనకు కలుగు తుంది అలాగే ఆ దేవుడి అనుగ్రహం లభించాలన్నా అర్హత కావాలి కాబట్టి నువ్వు చేసేదానిలో నిజాయితీ ఉంటే విజయం పొందే అర్హత దక్కుతుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

138)జీవితంలో మనం ఎదగడానికి లభించిన అవకాశాలను దూరం చేసుకొని మరొక అవకాశం కోసం ఎదురుచూసే వారికి తెలుస్తుంది చేజార్చుకున్న సమయం యొక్క విలువ.ప్రతి ఒక్కరం జీవితాన్ని అందంగా మలచుకోవాలని కలలు కంటాం.అందుకోసం అహో రాత్రాలు శ్రమిస్తాం.మనకు శక్తి ఉన్నంతవరకు మన అభ్యున్నతి కోసం కృషి చేయడం మంచిదే. అదే సమయంలో గతించిపోయే కాలం పట్ల స్పృహ కలిగి ఉండాలి ఎందుకంటే కరిగిపోయిన ఏ ఒక్క క్షణాన్ని అయినా తిరిగి రాబట్టలేము కాబట్టి నీ దగ్గర ఉన్న ఏ నిమిషాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచు కుంటూ నీ గమ్యాన్ని చేరుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

139)ఏ పని చేస్తే నీకు ఆనందంగా ఉంటుందో ఎలా బ్రతికితే నీకు నచ్చుతుందో ఆ పనిలోనే ఉంది నీ గమ్యం.పనిలోనే ఉంది నీ లక్ష్యం. నీకు నచ్చే పనిలోనే నీ గొప్ప లక్ష్యాన్ని గుర్తించు. ఎప్పుడైతే నీ గొప్ప లక్ష్యాన్ని నువ్వు తెలుసుకో గలవో అపుడే నీ విజయపు ప్రయాణానికి తొలి అడుగు వేసినట్లు.వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది.” ఎప్పుడైతే నీ లక్ష్యం నీకు అవగతమైందో అపుడే నువ్వు నీ విజయాన్ని సాధించినట్లు లెక్క ఏ సందేహమూ లేదు. నువ్వు ఎలాంటి వాడైనా సరే, ఎంత బలహీనుడైనా సరే, అంగవికలాంగుడైనా సరే ... నీ లక్ష్యాన్ని నువ్వు చేరగలవ్....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

140)గొప్పగా జీవించగలను అని నిన్ను నువ్వు నమ్ము ...ఖచ్చితంగా గొప్పగా జీవించగలవు..గొప్పగా బ్రతకాలని, గొప్ప విజయాలు పొందాలని సాటిలేని జీవితాన్ని గడపాలని నీలో ఉన్న కోరికను నమ్ము ...ఆ కోరిక తీరడానికి నువ్వు చేసే ప్రయత్నాన్ని నమ్ము.ప్రయత్నంలో కష్టాలు నిన్ను ఏమీ చేయలేవని నిన్ను నువ్వు నమ్ము.చివరకు విజయం నీదేనని పూర్తిగా నమ్ము....కేవలం నమ్మకంతో కూడిన ప్రయత్నమే నిన్ను విజయతీరాలకు చేరుస్తుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

141)జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దానిని దిగమింగడం నేర్చుకో.. ఇంకా భయంకరమైనది నిరాశ దానిని ఎలా తుంచెయ్యడమో తెలుసుకో దాని కంటే నీచమైనది ఈర్ష్యాస్సూయ దానిని నీలోంచి ఎలా తరిమికట్టలో అలవర్చుకో ఈ మూడింటిని ఎవరైతే దాటగలరో వారు దేనినైనా సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

142)నువ్వు ప్రయత్నిస్తే ఆకాశాన్ని అందుకోగలవు. మనిషివి అయితే ఖచ్చితంగా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కేవలం నీకు గొప్ప కలగనే ధైర్యం ఉండాలే గానీ! ఎంత అనితర సాధ్యమైన కలకూడా సాధ్యం అవుతుంది. నువ్వు ఏది కోరుకుంటావో అదే లభిస్తుంది. అందుకే గొప్పగా కోరుకో, గొప్ప ఆలోచనలు చెయ్... గొప్ప లక్ష్యం పెట్టుకో.... అన్నీ దొరుకుతాయి. ఈ ప్రపంచం నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తుంది. నువ్వెంత అడగాలని నీవే నిర్ణయించు కోవాలి.గుర్తుంచుకో ప్రతి నిముషాన్ని అతి విలువైనదిగా మార్చుకో..ఒక్క నిముషంలో గొప్ప నిర్ణయాలు తీసుకోగలవు..ఒక్క నిముషంలో ఓటమిని గెలుపుగా మార్చగలవు..నువ్వు చెయ్యాలే గానీ ఒక నిముషం తక్కువేమీ కాదు..అందుకే మనం గొప్ప నిర్ణయం తీసుకుందాం..ఇకనైనా మారాలని ఒక గొప్ప లక్ష్యం చేసుకుందాం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

143)జీవితంలో విజయం సాధించాలంటే ముందు నీ దగ్గర ఉన్న సమయాన్ని హారతి కర్పూరంలా వృథాగా కరిగించేసే పద్ధతి మార్చుకోవాలని అలాగే నీలోని సామర్థ్యాలను ఒక్కొక్కటిగా పెంచుకోవాలని నిర్ణయం తీసుకోవాలి.ఎటువంటి పరిస్థితుల్లోనైనా,ఎంతటి కష్టమైనా సరే... నీ చెమటను రక్తంలా చిందించి అయినా సరే.. సవాళ్ళను ఎదుర్కోనైనా సరే నీ కలలకు కోర్కెలకు బలాన్ని ఇవ్వాలని నిర్ణయించు కోండి.అందుకే నీ మార్పుకై, ఉన్నతికై, విజయానికై ఈ రోజే మీరు గొప్ప నిర్ణయం తీసుకోండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

144) జీవితంలో గెలవడానికి మాత్రమే ప్రయత్నించు... గెలుస్తామా లేదా అని తనిఖీ చేసుకోవడానికి ప్రయత్నించకు'.లోపం లేని ప్రయత్నం.. గొప్ప విజయాలను సైతం అలవోకకగా ఇస్తుంది.అసలు నువ్వు కలలు కంటేనే.. నువ్వు కలగన్న జీవితం నీకు లభిస్తుంది. గొప్పగా కోరుకుంటేనే... నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది. నిరంతరమూ నీ ప్రయత్నము లక్ష్యం వైపే ఉంచు,తప్పకుండా నువ్వు కలగన్న జీవితం లభిస్తుంది.ఇది తథ్యం.ధృడ సంకల్పంతో ప్రయత్నించే వాడిని చూసి ఓటమి ఆమడ దూరం పారిపోతుంది.నమ్మకమే విజయం....సందేహమే అపజయం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

145)అద్భుతమైన జీవితం నీదవ్వాలంటే ఒకవైపు సుఖాలు మరోవైపు కష్టాలు రెండూ ఉండాలి.ఉత్త సుఖమే ఉంటే జీవితంపై మొహం మొత్తు తుంది.అలాగే ఉత్త కష్టాలే ఉంటే జీవితంపై విరక్తి పుడుతుంది.ప్రతిరోజూ పగలు తర్వాత రాత్రి రాత్రి తర్వాత పగలు ఎట్లా వస్తున్నాయో జీవితాన కూడా సుఖాల తర్వాత కష్టాలు..కష్టాల తర్వాత సుఖాలు వస్తుండాలి...అప్పుడే జీవిత స్వారస్యాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది.కష్టాలైనా సుఖాలైనా వచ్చిన ప్రతిసారీ నీకు ఎన్నో జీవితపాఠాలను నేర్పించి వెళుతుంటాయి.అదేవిధంగా రేపటిపైన నమ్మకం నీలో ఎనలేని శక్తిని నింపి నిన్ను ముందుకు నడిపిస్తుంటుంది.కష్టసుఖాలనేవి ఎక్కువ తక్కువలు కాకుండా సమపాళల్లో వస్తుంటేనే జీవితం హ్లాదకరంగా మలచుకోవటానికి వీలుంటుందన్నది ముమ్మాటికీ నిజం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

146)ఓ కొండను దగ్గర నుంచి చూస్తే అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది...ఓ 100 అడుగుల దూరం లో నుంచి చూస్తే ఇంకొంచెం చిన్నదిగా కనిపిస్తుంది...ఓ 1000 అడుగుల దూరం నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది....కొండ పరిమాణంలో, ఆకారంలో తేడా ఏం లేదు....మనం చూసే దూరంలో,మన దృక్కోణంలోనే వ్యత్యాసం ఉంది....మన జీవనశైలి సంతోషంగా ఉన్నా,బాధాకరం గా ఉన్న మన మీదే ఆధారపడి ఉంటుంది..మన సంతోషానికైనా, మన విషాదానికైనా మనమే కారణం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

147)ఇది రంగుల ప్రపంచం...సందర్భానుసారంగా ఒక్కో విధంగా ప్రవర్తించాలి...ఏ మనిషికి ఆ మనిషి మాట చెప్పాలి...ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి...అప్పుడే మనం ఈ లోకంలో జీవించగలం.సంఘటనను బట్టి సంయమనం పాటించాలి.అవసరాన్ని బట్టి వ్యవహరించాలి.మాటలు తక్కువ మాట్లాడాలి.గతం గురించి గొప్పలు పోరాదు.భవిష్యత్ గురించి ఊహాలు చేయరాదు.వర్తమానంలో జీవించాలి.ప్రస్తుతం గురించే పోరాటం చేయాలి.మన బలహీనతలు సాధ్యమైనంత వరకు బైట పెట్టకూడదు ఎందుకంటే నీ శత్రువులు అవకాశం చూసుకొని ఆట ఆడతారు.మనకి మనమే ముఖ్యం ఆ తర్వాతే ఎవరైనా....ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆత్మగౌరవం కోల్పోవద్దు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

148)సమస్యలు మానవ సహజం. వాటికి ఎదురొడ్డి పోరాడాలి. సమస్యలను పరిష్కరించు కోవటంలోనే విజ్ఞత తెలుస్తుంది. సమస్యలకు భయపడేది పిరికివారు మాత్రమే. ధైర్యవంతుడు వాటిని ఢీకొని ఎదుర్కొంటాడు. దాని నుండి బయట పడతాడు. సమస్య ఎందుకు వచ్చిందో దాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. దానికి పరిష్కార మార్గం ఏదో ఒకటి తప్పక ఉంటుంది. దాని కోసం అన్వేషించాలి,పరిష్కరించుకోవాలి.నీవు వెళ్లే మార్గంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని చూస్తూ భయపడుతూ ఉంటే ముందుకెలా వెళతావు.ఆ అడ్డంకులను దాటుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ, అనుకున్న స్థానం చేరాలి. అదే విజయమంటే.మనం గమ్యం చేరే అవకాశం లేకపోయినా ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అలా ప్రయత్నించే వారే ఒక్కోసారి విజయం సాధిస్తారు.ప్రయత్నంలో తప్పక విజయం ఉంటుంది. సమస్యల పరిష్కారానికి ప్రయత్నమే కీలకం. ప్రయత్నించ కుండా ఏ సమస్య పరిష్కారం కాదు. సమస్యలనేవి మనిషికి ఒక దిక్సూచి నీ లోని నిగూడ శక్తిల్ని బయటకి తీసి నువ్వెంతో చెప్పేదే సమస్య కాబట్టి సమస్యలకు ఎప్పుడు బయపడకు ఆత్మ విశ్వాసంతో సమస్యను ఛేదించు విజయం సాధించు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

149)నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటి వారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు..నిజమైన వ్యక్తిత్వంతో జీవించు..అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

150)విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది...మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది..చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా “పతనం తప్పదు” అందుకే విధిరాత కన్నా “కర్మ ఫలం" చాలా గొప్పది.... కాబట్టి ఎవ్వరికీ అన్యాయం చెయ్యకుండా మంచి చేసుకుంటూపో అదే నిన్ను రక్షిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

151)ప్రపంచంలో ఎందరో రకరకాల మనుషులు...వివిధ రకాల మనస్తత్వాలు.కొంతమంది నిజంగానే నీ మేలు కోరే వారుంటారు.కొంతమంది నీ మేలుకోరినట్లు నటిస్తూనే...నీ భుజాల పై చేతులు వేసి నిన్ను అభినందిస్తూనే...నీ కాళ్ళ క్రింద భూమిని తొలిచేసి అందులోకి తోసేయడానికి ప్రయత్నిస్తుంటారు.అటువంటి వారి నుండి నీవు ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి...అలాంటి వారిని గుర్తించడం కష్టమే!అయినా నీ జాగ్రత్తలో నీవుండటం నీకు మంచిది...నిజం చెప్పాలంటే అనుభవాలు నేర్పే పాఠాలే ఇవి! నీవు అందరినీ గమనిస్తూ ఉండు...వారిని వీరిని చూసి నేర్చుకోవడం...అనుకరించడం వద్దే వద్దు.ఎవరిని చూసినా...ఎవరిని ప్రేరణగా తీసుకున్నా కూడా చివరకు..అనుభవంలోకి వచ్చే ఆచరణ నీకెన్నో పాఠాలు నేర్పిస్తాయి... నేర్చుకోవడం వరకే కాక నేర్చుకున్న ప్రతి పాఠాన్ని సరైన రీతిలో నీ జీవితానికి అన్వయించుకొని నీ భవిష్యత్తును ఎప్పటికప్పుడు చక్కదిద్దుకుంటూ ఉండు...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

152)జీవితంలో మనం అప్పుడప్పుడు ఓటమి పాలవుతుంటాం దానికి అనేక కారణాలు ఉండవచ్చు.మనం మన కోసం చేసే పనులు కొన్ని, ఇతరుల కోసం చేసేవి కొన్ని ఉంటాయి.ఏ పనులైనా ధర్మబద్ధంగా ఉండాలి. కేవలం మనకోసమే జీవితం అనుకోవడం స్వార్థం అనిపించు కుంటుంది. 'పుట్టుక నీది, చావు నీది,మధ్య బతుకు దేశానిది' అంటాడో కవి.అవి అక్షరసత్యాలు. మన కోసం,మన కుటుంబం కోసం శ్రమించగా వచ్చిన ఫలితానికి, విజయానికి మనం సంతుష్టి చెందాలి.అత్యాశకు పోయి అక్రమార్జన చేసి అంతులేని సంపదను కూడబెట్టుకోవడం విజయం అనిపించుకోదు.అది సంతృప్తిని ఇవ్వకపోగా, దుఃఖానికి దారితీస్తుంది. భయాన్నీ పెంచు తుంది. ప్రేమతో, సేవాభావంతో పరులకు చేసే ఉపకారం మనకి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అసలైన విజయం అంటే అదే! అటువంటి విజయం మనల్ని శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. అఖండమైన ఖ్యాతిని తెచ్చిపెడుతుంది.ఆ విజయం సత్యమైనది, శాశ్వతమైనది,ఆదర్శవంతమైనది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

153)జీవితంలో ఓ మంచి ఆలోచనవల్ల, మాటవల్ల, ప్రవర్తనవల్ల,పరోపకార ప్రవృత్తివల్ల లభించే ఆనందం,మన జన్మకు సార్థకత చేకూరుస్తాయి.దుఃఖాన్ని సహించడంలో నష్టాన్ని భరించడంలో మనకి అణకువ అలవడుతుంది.ఆ అణకువే అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది.మంచి మాట దానం లాంటిది.ప్రతిఫలంగా పుణ్యం ఇస్తుంది. చెడ్డమాట అప్పులాంటిది.ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. నోరు విప్పేవరకు మాటపైన పెత్తనం మనదే. నోరు జారితే ఆ మాటే మనపైన పెత్తనం చేస్తుంది. కష్టాలను చిరునవ్వుతో,ఒత్తిడిని మనోబలంతో, విమర్శలను ఆత్మవిశ్వాసంతో అధిగమించడమే విజయం.విజయ రహస్యాలన్నీ తెలిసి కూడా పని ప్రారంభించనివాడు ఏదీ తెలియనివాడితో సమానం. సంశయం, ఆలస్యం, అశ్రద్ధ- విజయ సాధనకు మూలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

154)ఒకరు నీ సాయం కోరి వస్తే,వారిని హేళన చేయకు.చేతనైతే సహాయం అందించు,లేదంటే మౌనంగా ఉండిపో,మాట ఇచ్చి తప్పకు,నీకోసం వచ్చిన వారిని గంటల తరబడి నిరీక్షింప జేయకు.కాసింత సాయం చేసి,ఎన్నో చేసినట్టు గొప్పలు చెప్పుకోకు,ఎంత సాయం చేసినా సరే,ఏమీ చేయనట్టే ఉండు.సాయంలో చిన్నా,పెద్దా అని ఏమీ ఉండదు.డబ్బు ఇస్తేనే సాయమా...కొన్నిసార్లు మాట సాయం కూడా చాలా గొప్పదే.సాయం చేసినవారి నుంచి తిరిగి ఏమీ ఆశించకు.భగవంతుడు నీకు మరలా ఏదోక రూపంలో మంచి చేస్తాడు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

155)ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు చెదరనీయకు, ఎంత కోపం వచ్చినా నోటి మాట జారనియకు, ఎందుకంటే..ఒకటి నీ బలం అయితే రెండోది నీ బలహీనత,నవ్వు మిత్రులను పెంచుతుంది, మాట స్నేహాన్ని తుంచుతుంది కాబట్టి దేనిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకొని వాడితే జీవితంలో పైకి రాగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

156)జీవితంలో ఏ బంధమైనా నిలిచి ఉండేది నమ్మకం పైనే.మరి ముఖ్యంగా స్నేహం.నమ్మకంగా ఉండాలి.పరస్పరం పారదర్శకంగా ఉంటూ,తన వ్యక్తిగత విషయాలు చర్చించినా,ఏ విషయాల గురించి అయినా సరే... అబద్ధాలు,మోసపూరిత మాటలు ఉండకూడదు.ఒకరు మనల్ని నమ్మారు అంటే...మనపై ఎంతో భరోసాగా ఉన్నారు అని అర్థం.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.మరింత బలపరచాలే కానీ పోగొట్టకూడదు.నమ్మకమైన మిత్రుడు ఒకడు ఉంటే చాలు అనేంతగా ఉండాలి స్నేహం..అంతేగాని ఇంకోసారి స్నేహం చేయాలి అంటే భయపడేలా ఉండకూడదు ఎందుకంటే దేనికైనా నమ్మకమే పునాది కదా...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

157)మనం గతాన్ని తలచుకొని జీవించడం, భవిష్యత్తు గురించి బెంగపెట్టు కోవడం ధీరుల లక్షణం కాదు.సంకట పరిస్థితుల్లో కుంగి పోకుండా అవరోధాలను ఓర్పుతో ఎదుర్కొంటూ జీవితాన్ని సుఖ మయం చేసుకోవాలి.మన మనస్సుని అదుపులో ఉంచు కొంటూ వివేకంతో, విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవడం, తమను తాము సంస్కరించుకోవడం గొప్ప వాళ్ళ లక్షణం.మనకు లభించిన దాన్ని ఆనందంగా అనుభవించడం,మనది కాని దాని కోసం ఆరాట పడక పోవడం-రెండూ మంచివే అలాగే ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవచేయడం, ప్రతిఫలా పేక్ష లేకుండా పరులకు ఉపకారం చేయడం, సకల ప్రాణుల పట్ల దయకలిగి ఉండటం వంటి విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉన్న వాడికి దేవుడే విజయ ద్వారాలు తెరిచి మనల్ని గమ్యానికి చేరుస్తాడనడంలో సందేహములేదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

158)వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడి ఉంటావా?చిరునవ్విక రాదని, వేదనతోనే సర్దుకు పోతావా..?ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగేస్తావా..? నీ ధైర్యము తోటి, భయాన్ని దాటి ముందుకు పోలేవా.? నువ్వు పోగలవు కాక పోతే నీకు కావాల్సింది కొండంత ఓపిక ధైర్యం.. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నిటిని తొక్కుకుంటూపో విజయం తప్పక నీదే.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

159)ప్రకృతి సమాజం మనకి జీవితంలో ఎదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది అది ఎలా అంటే సముద్రంలోని అల తనలా ప్రయత్నించ మంటుంది..కల తనలా కరిగి పోవద్దంటుంది..ఆకాశం ఉన్నతంగా ఎదగ మంటుంది...అవని ఓర్పుతో గెలవ మంటుంది..మొక్క పరిస్థితిని బట్టి నడుచు కోమంటుంది..చెట్టు ధైర్యంగా ఎదుర్కొమంటుంది..దారి గమ్యం చేరేదాకా నడవ మంటుంది.సమస్య తెలివిగా పరిష్కరించమంటుంది..ఇలా ప్రకృతి ఒడిలో జీవితానికి సరిపడా ఉదాహరణలెన్నో పరిశీలించి పరీక్షించి మన జీవితానికి అన్వయించుంటే మనం ఏదైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

160)గడిచిన క్షణాలు తిరిగి రా eeనివి,మరిచిపోలేనివి, మార్చలేనివి.కొన్ని క్షణాలు చేదు జ్ఞాపకాలని మిగిలేస్తే మరి కొన్ని క్షణాలు మధురమైన జ్ఞాపకాలను మదిలో ముద్ర పడిపోతాయి..కొన్ని క్షణాలు అంతులేని బాధని మిగిలిస్తే మరి కొన్ని క్షణాలు అవధులు లేని ఆనందాన్ని పంచుతాయి కొన్ని క్షణాలు ఆవేశాన్ని కలగజేస్తే మరి కొన్ని క్షణాలు ఆలోచనను కలగ జేసాయి..కొన్ని క్షణాలు కొత్త బంధాలను కలిపి బంధాలను విలువ తెలియజేస్తే.మరి కొన్ని క్షణాలు బంధాలను దూరం చేసాయి..కొన్ని క్షణాలు క్రుంగదీసి బలహీనం చేస్తే మరి కొన్ని క్షణాలు తప్పులని తెలియ జేసి పాఠాలను నేర్పి ముందుకు సాగేలా చేస్తాయి.గడిచిన క్షణాలు అన్ని రకాల రకాల అనుభూతుల కలబోత అవి మంచివైనా..చెడ్డవేనా మనతోనే ఉంటాయి..గతించిన గతం తాలూకు నీలి చాయాలు భవిష్యత్తు పై పడకుండా ముందుకు సాగిపోవాలి నిరంతరం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

161)భరించటానికి కష్టంగా ఉన్నా నిజం అబద్దం అయిపోదు...మనం ఆశపడటంలో తప్పులేదు కానీ మన ఆశ అడియాస అయినప్పుడు..నిజాన్ని ఒప్పుకుని తీరాలి...అబద్ధంలో ఆనందంగా బ్రతికినా అది కొన్నాళ్లే...నిజం మొదట కష్టంగానే ఉన్నా, దాన్ని భరించి ముందడుగు వేస్తే భవిషత్తులో మరింత బలంగా మన సమస్యలను ఎదుర్కోగలుగుతాము...అలా కాదని అబద్ధంలో బ్రతకటం అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళకి మన బ్రతుకే అబద్దం అయిపోతుంది..కష్టమో నష్టమో నిజాన్ని ఎంత త్వరగా అంగీకరించి ముందడుగు వేస్తే మన జీవితం అంతముందుకు వెళ్తుంది.అలాకాదని అబద్దంలో బ్రతికితే మన బ్రతుకు అక్కడే ఆగిపోతుంది కాబట్టి నిజం దారిలో వెళితేనే విజయం .....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

162)సముద్రం అందరికి ఒక్కటే కాని ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి.వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి.నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే.అందరికి ఒక్కటే జీవితం కాకపోతే మన ప్రయత్నబలం ఎంతవుంటే అంతే దక్కుతుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

163)ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు అణువంత అర్థం చేసుకునే మనసుండాలి..సముద్రమంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సాయం చేసేగుణం ఉండాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘు*

164)జీవితంలో మీరు ఏ పని తలపెట్టాలని అనుకున్న ముందు అవహేళన, ప్రతిఘటన అనుకరణ అనే మూడు దశల్లో సమాజం మీకు ఎదురొస్తుంది..ముందు మిమ్మల్ని గేలి చేస్తుంది.తరవాత మీరు చేస్తున్న పనిని అడ్డుకుంటుంది.అప్పటికీ మీరు ఆగకపోతే ఇక మిమ్మల్ని అనుకరిస్తుంది..మీరేమైన సాధించాలంటే ఈ మూడు దశలను దాటాల్సిందే. ప్రపంచవీరు లందరూ ఈ దశలు దాటినవారే అని గుర్తెరగండి..కాబట్టి ఇంకెందుకు ఆలస్యం పోరాడి విజయం సాధించు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

165)జీవితం నదిలా పారుతున్నప్పుడు నిజాలను ఏరుకుంటూ,నడతను మార్చుకుంటూ గమనం సాగాల్సిందే అప్పుడే రాయిని డీకొన్నా,గుండెను పిండేసే దుఃఖం ఎదురైనా..వెన్నెల మొగ్గలా వెండి నురగలా నవ్వగలిగేది లేకపోతే మన గమనం చతికిలపడుతుంది కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా చేరాల్సిన గమ్యాన్ని మరువకు పట్టు విడవకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

166)నీ దారి నీవే వెతుక్కో, నీ గమ్యం నీవే నిర్దేశించుకో,దానిని చేరడానికి అసలు సిసలైన నిజాయితీ, నీతి, ఓర్పు, సహనం వంటి ఆయుధాలు పెంచుకోవాలి.అందరితో జ్ఞానాన్ని పంచుకోవాలి.ఇవన్నీ చేయటానికి సమయ పాలన, నిబద్ధత, నిరంతర అభ్యాసన కావాలి. ఈ అందమైన జీవితం అద్భుతమైన, ఆదర్శవంతమైన ఒక వంతెనగా నిలవాలి. ఈ లోకానికి రాజువి కాకపోయినా ఫర్వాలేదు కానీ నీ మనఃసాక్షికి జవాబుదారిగా వుండు, నీ ప్రతి పనినీ చర్యను, చర్చను, నీ మనస్సుతో పంచుకో, తప్పొప్పులు నీవే పరిశీలించుకుని ముందుకు సాగు విజయం తధ్యం!!...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

167)మనకు దేవుడు ప్రసాదించిన ఈ జీవితం ఎంతో అమూల్యమైనది.జీవించిన కాలం ఎంత అనేదాని కన్నా ఎలా జీవించారనేది ముఖ్యం.గడచిన కాలాన్ని తలచుకుని బాధ పడుతూ,రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనం ఎప్పుడూ గతంలోనూ,భవిష్యత్తులోనూ బతుకుతున్నామే కానీ వర్తమానంలో కాదు.నిన్నటిరోజు తిరిగిరాదు.రేపు ఉందో లేదో తెలియదు. ఈ రోజే నీ చేతిలో ఉండేది దాన్ని ఆహ్లాదంగా గడపాలి.విజయాలు ఆనందంగా,సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి.సార్థకత చేకూరాలి కలలు కనడం వాటిని నిజం చేసుకునేలా పరిశ్రమించాల్సింది నేడే.అందుకోసం బలమైన పునాదినివెంటనే నిర్మించాలి.అదే భవిష్యత్తులో నిన్ను శికరాగ్రాన్ని చేర్చేది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

168)చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? దేనికైనా ముందుగానే మనం ప్రణాళిక, వివేకం,విచక్షణా జ్ఞానంతో సిద్ధం కావాలి. చికిత్స కన్నా నివారణ ముఖ్యం. జీవితం విలువ తెలిస్తే ఒక్కక్షణమైనా వృదా కాదు. కాలం గడపడం ముఖ్యం కాదు. సద్వినియోగం చేసుకోవడం ప్రధానం. 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైంది. ఏదైనా సాధించే శక్తికలది మానవ జీవితం అంటారు పెద్దలు. జననం ముందు అజ్ఞానం,మరణం తరవాత ఆజ్ఞానం... మధ్యలో విలువైన జీవితకాలం సుసంపన్న జ్ఞానం.ప్రతి నీటిబొట్టును భద్రపరిస్తే నీటి కరవు ఉండదు. ప్రతి క్షణాన్ని వివేకంతో గడిపితే శాశ్వత కీర్తి సొంతమ వుతుంది.జీవితం విలువ కాలం వేగం అంచనా వేస్తే ప్రతి క్షణం సద్వినియోగమే.ఏదైనా త్వరగా ప్రారంభించు, నిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకో అనేది ఆ నాటి మాట.రేపటి పని ఈరోజే చెయ్యి, ఇవాల్టి పని ఇప్పుడే చెయ్యి అనేది నేటి మాట.కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేయకు ప్రతిపనీ నిర్మాణాత్మకంగా ప్రతిభతో ప్రగతి వైపుగా ఉండాలివిజయాన్ని ఒడిసిపట్టాలి. ప్రతి క్షణం జీవించాలి..భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం మానవ జీవితం.ఆస్వాదిస్తూ అనుభవించేవారే చరితార్థులు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

169)మనకు దేవుడు ప్రసాదించిన ఈ జీవితం ఎంతో అమూల్యమైనది. ఎంత కాలం జీవించాం అనే దాని కన్నా ఎలా జీవించారనేది ముఖ్యం.గడచిన కాలాన్ని తలచుకుని బాధ పడుతూ,రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనం ఎప్పుడూ గతంలోనూ,భవిష్యత్తులోనూ బతుకుతున్నామే కానీ వర్తమానంలో కాదు.నిన్నటిరోజు తిరిగిరాదు.రేపు ఉందో లేదో తెలియదు. ఈ రోజే నీ చేతిలో ఉండేది దాన్ని ఆహ్లాదంగా గడపాలి.విజయాలు ఆనందంగా,సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి.సార్థకత చేకూరాలి కలలు కనడం వాటిని నిజం చేసుకునేలా పరిశ్రమించాల్సింది నేడే.అందుకోసం బలమైన పునాదినివెంటనే నిర్మించాలి.అదే భవిష్యత్తులో నిన్ను శికరాగ్రాన్ని చేర్చేది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

170)అడుగు వేశాక మడమ తిప్పకు.. ఆఖరి ఘడియ దాకా పట్టువీడకు.. ఆచరణ లేకుంటే ఆశపడకు.. ఆత్మవిశ్వాసాన్ని వీడి వెళ్ళకు..ఎదురేమైనా రానీ..ఏమైనా కానీ.. ఎత్తిన బావుటా కింద దించకు..తలపెట్టిన కార్యం విడిచిపెట్టకు..అప్పుడే విజయం నీకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

171)పక్కవాళ్ళ ఎత్తులను పోల్చుకుని చేస్కుంటూ అడుగులు వేస్తే....పాముల రూపంలో సమస్యలే వస్తాయ్..నీ వ్యూహాలనే నమ్ముకొని అడుగులు వేస్తే....నిచ్చెనల రూపంలో పరమపద సోపానానికి దారి చూపిస్తాయ్..!!కాబట్టి నీ గురుంచి నువ్వు ఆలోచించనంతగ పక్క వారి గురుంచి ఆలోచిస్తావు, అందుకే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎందుకంటే నీ గురుంచి వాళ్ళు ఆలోచించరు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో ఆలోచించాల్సిందే ఎవరి గురించో కాదు నీ గురుంచి నువ్వే ఆలోచించాలని తెలుసుకో!! జీవితం..వైకుంటపాళి...రెండూ ఒకటే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

172)మనిషి కేవలం తనకోసం తానుకాక,తన విలువైన సమయంలో అమూల్యమైన మాటల్లో, తన సంపదలో తన సేవలో కొంతైనా నిస్వార్థంగా ఏ కొద్దిమందికి అందించగలిగినా కలిగే సంతృప్తి, సంతోషం సమాజంలోని ఏ కొలమానాలకు అందనివి. అందమైన జీవితంలో సద్వినియోగం అన్న పదానికి ఇంతకన్న సార్థకత మరేముంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

173)జీవితంలో మనకు సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చెయ్యడానికి ప్రయత్నించండి.మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది.అదే నువ్వు వేరొకరికి చెడు చేయాలని చూస్తే పైన నిన్ను ఆ దేవుడు చూసుకుంటాడు ఏందుకంటె బలహీనుడ్ని బలవంతుడు కొడితే బలవంతుడ్ని ఆ భగవంతుడు కొడతాడు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

174)మెరవాలని,కురవాలని, ఘర్జించాలని ప్రతి మబ్బుకు ఉంటుంది అలాగే గెలవాలని, ఎదగాలని, గర్వించాలని ప్రతి మనిషికి ఉంటుంది కాకపోతే ప్రయత్నంతో పాటు అదృష్టం ఉంటే ప్రతి మనిషికి విజయం తోడై వరించి వర్షిస్తుంది..కాబట్టి నువ్వు చేయాల్సింది కష్టపాడడం మాత్రమే.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం* 

175)ప్రకృతి నుంచి మనిషి సహకార మనేది నేర్చుకోవాలి. చెట్లు తమ పండ్లను తాము తినేయవు. నదులు తమ నీటిని తామే త్రాగేయవు.ఇవ్వటం నేర్చుకొంటే.. పుచ్చుకొనేందుకు ఎంతో ఉంటుందని గ్రహించాలి..ఇవ్వటం తెలియకపోతే.అంతా శూన్యమే. కనుక పరస్పర సహకార పద్ధతిని అలవరచుకుంటే అంతా ఆనందమే! ‘ఇచ్చుట’లో ఉన్న హాయి.. వేరెచ్చటలేదని’ పెద్దల మాటలు అక్షరసత్యాలు. ప్రతి ఒక్కరు ఆ దిశగా అడుగులు వేయాలని మనం కోరుకుందాం.పుట్టడంగొప్పకాదు..బతకడం గొప్ప...ముంచి బతకడం గొప్పకాదు..మంచిని పంచి బతకడం గొప్ప..నీకు నీవే గొప్ప అనుకోకు..నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

176)మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు.అది ఎంతమందికి..ఉపయోగపడింది అనేదే ముఖ్యం.మంచిపని చేసేటపుడు..మనం కనపడాల్సిన అవసరంలేదు.మంచితనం కనపడితే చాలు....ఇట్లు..మీ..✍🏻 *రఘు*

177)జీవితంలో ఏదైనా గెలుపొందాలంటే అతి ముఖ్యమైన గుణం స్వయం ప్రేరణ మాత్రమే.మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఇష్టమైన రీతిలో జీవితాన్ని అనుభవించే హక్కు మీకు మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని ఎవరో తట్టి లేపి ప్రోత్సహిస్తారని అనుకోవడం పొరపాటు. మీరు ఇతరుల మీద ఆధారపడి, వారు మీ జీవితాన్ని ఏదో ఉద్ధరిస్తారని ఆశించడం బుద్ధి తక్కువే అవుతుంది. ఎలాగంటే ఒక రైలుకు ఎన్ని పెట్టెలుంటే ఏమి లాభం, ఆ పెట్టెలన్నీ ఇంజిన్ పై ఆధారపడి పరుగుత్తాలి. ఇంజినకు ఆ అవసరం లేదు. పెట్టెలున్నా... లేకపోయినా పరుగెత్తగలదు. మీ జీవితం రైలు ఇంజిలా ఉండాలని కోరుకోవాలి.కానీ పెట్టెలా జీవిస్తామని అనుకోవద్దు. మీ జీవితపు రైలుకు మీరే ఇంజిన్ అని గుర్తించుకోవాలి.కాబట్టి "జీవితంలో స్వయం ప్రేరణ లేనిచో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు".....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

178)నీ చేతికున్న ఐదు వేళ్ళు సమానంగా ఉండవు కానీ అవే కాస్త వంగి ముడిచినపుడు ఐదు వేళ్ళూ సమానంగా కనిపిస్తాయి.నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంతే...ఏవీ ఒకేవిధంగా నీకనుకూలంగా ఉండవు కానీ నీవే కొంచెం ఓపికతో సర్దుకుపోతే అన్నిటినీ నీకనుకూలంగా మార్చుకో గలవు.నీ చుట్టూ ఉన్న వ్యక్తులూ అంతే...ఎవరూ నీకు మల్లే ఉండరు.ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. అంతెందుకు!?...నీ కుటుంబంలో ఉన్న నలుగురువ్యక్తుల ఆలోచనా విధానాలే ఒక విధంగా ఉండనే ఉండవు.నీవే అప్పుడప్పుడు కాస్తంత తగ్గి ఉంటే అందరితో అన్ని విధాలా కలసిపో గలవు.సర్దుబాటు గుణం నీలో ఉంటే ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా...ఎవరితోనైనా ఇట్టే కలసిపో గలవు.కలసిపోవడమంటే ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా నిన్ను నీవు మార్చుకోవడం...ఆ కాస్సేపు అడ్జస్ట్ అవడం.ఇక్కడ కూడా ఇంకో విషయం నీవు గుర్తు పెట్టుకోవాలి...మార్చుకోవడం అంటే నిన్ను నీవు నీ గుణగణాలతో సహా మారిపోవడం కాదు.నీ వ్యక్తిత్వం నీదే... అది ఎవరికోసమూ మార్చుకోనక్కర లేదు.చుట్టూపరిస్థితులతో...వ్యక్తులతో మమేకమై ఒదిగిపోవడ మంతే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

179)అమ్మ నవ మాసాలూ మోసి బిడ్డకు ప్రాణం పోస్తే... ఆపై వారి భవిష్యత్తు భారాన్ని భుజాలకెత్తుకుంటాడు నాన్న. బయటకు గంభీరంగా కనిపించినా...ఆయన మనసంతా ఎనలేని ప్రేమ... వేలు పట్టి లోకాన్ని చూపిస్తూ... బంగారు బాటలో నడిపిస్తాడు. అందుకే నాన్నంటే ఓ భరోసా,ధైర్యం, స్ఫూర్తి..తమ బిడ్డలా భవిష్యత్తుకై తాను కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగులు పంచే తండ్రులందరికి..హ్యాపీ ఫాదర్'స్ డే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

180)సమయం, ఆరోగ్యం, నమ్మకం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి...ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి...నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

181)మనిషి మాట్లాడే విధానం వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. చదువు వల్ల కలిగిన జ్ఞానం మనిషి మాట్లాడే విధానంలో కనబడు తుంది.కొందరు చదువుకోక పోయినా ఎంతో సంస్కారవంతంగా మాట్లాడుతారు.కొందరు చదువుకొన్నా కూడా ఎంతో మూర్ఖంగా అవతలి వారు నొచ్చుకొనేటట్టు మాట్లాడుతారు. అది వారి సంస్కారహీనత్వాన్ని తెలియచేస్తుంది. దీనికి కారణం వారిలో స్వార్థం, అసూయ, ఈర్ష్య లాంటి దుర్గుణాలు చోటుచేసుకొని ఉండడమే.వీటిని దూరం చేసు కోవడానికి ప్రతిమనిషికి చదువు కావాలి.చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. అందుకే భుక్తి కోసం చదవక భక్తితో చదివితే అది జ్ఞానాన్ని పెంచి మనుషులను సంస్కారవంతులను చేస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

182)నువ్వు బాధలో ఉన్నప్పుడు..నిన్ను కష్టాలు చుట్టుముట్టి నప్పుడు..నువ్వు మానసిక వేదనకు గురైనప్పుడు..నువ్వు ప్రశాంతతను కోల్పోయినప్పుడు..నీ ప్రయాణం ఆగిపోయినప్పుడు..నువ్వు ఓడిపోయినప్పుడు..ఎవరూ నీ దరికి రారు...కానీ మిత్రమా!నువ్వు గెలిచావో..ఇక నీ చుట్టూ,బెల్లం మీద వాలిన ఈగల్లా వస్తారు.ఈ లోకం తీరు ఇదే! కానీ కొందరుంటారు,మన ఒంటరి ప్రయాణంలో..నీ కష్టాల కడలిలో..ఎల్లపుడు మనతోనే ఉంటారు.వాళ్ళు మాత్రమే మన ఆత్మ బంధువులు.వాళ్ళను మాత్రమే గుర్తించి గుండెల్లో గుడి కట్టు.నీ చుట్టూ ఉన్న గుంపును వదిలేయ్.నీ జీవితాన్ని నువ్వే శాసించు..నీ ఓటమిని నువ్వే భరించు..నీ గెలుపును నువ్వే ఆశ్వాదించు..ఏందుకంటే నీ ప్రయాణం నీదే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

183)అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది కానీ.. ఆలస్యమవు తుంది..పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది.. కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది ఆలస్యమెందుకంటే.. ఆలస్యమయ్యేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష చెడ్డోడికి మంచిగా మారడానికిచ్చే అవకాశం..దానిని ఎప్పుడూ జారవిడుచు కోకు..ఇట్లు..మీ..✍🏻 *రఘు*

Daddy 

184)నాన్న ఓ నాన్న నువ్వు నడుస్తూనే మాకు గమనం నేర్పావు..పరిగెడుతూనే పోరాటం తెలిపావు..రహదారిలో ముళ్ళు గుచ్చుకున్న ఎంతటి దరహసిగా మెలిగావు..కష్టాలను కాళ్ళపై మోస్తూనే..భుజాలను సింహాసనంగా చేశావు నీ నవ్వులన్నీ మాకు పంచేసి కష్టాలను ధారణ చేసేసుకున్నావు...గమ్యం తెలిపే మార్గం చూపెడుతూ మార్గదర్శిగా పయనం చేశావు..నేటి భవితకు నిర్దేశం చేస్తూ..నీ జ్ఞానంతో భాష్యం చెబుతూ..రేపటి భావ వీచిక నేడు వల్లించి విజయ రహస్యం తెలిపావు...ఓటమి నేర్పే పాఠం..కష్ట కాలంలో నెమ్మది...అలుపు లేని యత్నం..మిత సంతోష మది..నీవు నేర్పిన పాఠం..మాకిచ్చిన నీ పాశం...ఎల్లలు దాటేను నీ పయనం..దరి చేర లేని ఆ సమయం నీవు చూపిన మార్గం..పాశం నేర్పిన జీవనయానం అదే మాకు శిరోధార్యం...అందుకే అయ్యావు నాకు నువ్వు ఆదర్శప్రాయం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

185)జీవితంలో తప్పటడుగు వేస్తున్నప్పుడు, అప్పుడది పెద్దగా అనిపించదు.ఒక తప్పును కప్పిపుచ్చుకొ నేందుకు మరొకటి చేస్తూ... ఇలా చివరికి బయట పడలేనంతగా తప్పుల ఊబిలో కూరుకుపోతారు. లోకంలో మంచి చెడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రతి మనిషినీ అవి ప్రభావితం చేస్తూనే ఉంటాయి. శ్రద్ధ కలిగిన వ్యక్తి మంచిని గ్రహించి లోపాలను సరిచేసు కుంటూ ఉంటాడు.లోపాలు లేని కార్యాలే ఉండవు. వాటిని గుర్తించడం,ఎదుటివారిపై నెట్టకపోవడం, సాకులు చెప్పకపోవడం,తన తప్పిదాలను తానే సరిదిద్దుకుంటూ పనిలో మరింత ప్రగతి సాధించడం- శ్రద్ద ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యం.కొందరు అసూయా పరులు ఓర్వలేక ఎదుటివారి తప్పులను వెతుకుతూ కించపరచడానికి గురిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రద్ధ కలిగిన వ్యక్తి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లోను, గెలుపు ఓటముల్లోను మేరుపర్వతంలా దృఢంగా స్థిరంగా ఉంటాడు.కాలాన్ని దుర్వినియోగం చెయ్యడు.అవకాశాలను జారనివ్వడు.పరిస్థితులను సరిగ్గా అంచనావేస్తాడు. జయాపజయాల మధ్య సూక్ష్మాన్ని గ్రహిస్తాడు. తన బలాబలాలను అంచనావేసి బలహీనతలను అధిగమించినవారే తమ లక్ష్యాన్ని చేరుకోగలు గుతారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

186)ఈ రోజుల్లో బంధాలు స్నేహాలు అంటూ ఏమీలేవు..అవసరం ఉంటే వాడుకుంటున్నారు..లేకుంటే దూరంపెడు తున్నారు....కేవలం ఒకరితో..ఒకరు అవసరం మాత్రమే అంతే..మనకి తెలిసి "జీవితం" లో "నటన" మాత్రమే కనిపిస్తోంది...ఎవరి "అవసరాలు" వారివి..ఎవరి "స్వార్థాలు" వారివి అవి తీర్చడానికి ఒక "మనిషి" ఉండాలి అంతే కాని ఆ మనిషికి "విలువ" ఇవ్వరు "నటించే" మనుషుల మధ్య "ఆటబొమ్మ"గా ఉండిపోవడం కన్నా "ఒంటరి"గా మిగలడం ఎంతో ఉత్తమం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

187)100 ఆలోచనలు చేసి బయపడి ఒక్కదాన్ని కూడా ఆచరణలో పెట్టని వాళ్ళు గొప్పకాదు.10 ఆలోచనలు చేసి అందులో ఒక్కదానినైనా ఆచరణలో పెట్టి ముందుకు వెళ్ళకల్గినవాడే గొప్పవాడు అందుకే పెద్దలు ఆలోచన కన్నా ఆచరణ మిన్న అని అన్నారు కాబట్టి నీలో ఉన్న భయాన్ని ప్రాలద్రోలి ఆచరణతో ముందడుగేయి నీకు విజయం తధ్యం!!....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

188)విజయం ఊరకనే తనంత తాను మనల్ని వరించదు.సాధించేందుకు ఎంతో శ్రమించాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదురవవచ్చు. అంతమాత్రాన మనం ఈ పనికి తగినవారము కాదనే నిర్ణయానికి రాకూడదు. సాధించేవరకూ పట్టు వదల కూడదు.అవమానించిన వారితోనే భేష్ అనిపించుకోవాలి. ప్రతి ఒక్కరికీ తమదైన ఆత్మస్థైర్యం ఉండాలి. దాన్ని వెలికి తీసి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దు కునేందుకు ప్రయత్నించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

189)జీవితంలో ఎటువెళ్ళాలో తెలీనప్పుడు ఆదరాబాదరాగా అటుఇటూ పరుగులు తియ్యకూ..కొంత కాలం నిలకడగా నిలబడిపో..నీ దగ్గరకి వచ్చిన నీకు ఇష్టంలేని అవకాశాల్ని కూడా నవ్వూతూ తీస్కో..కొద్దిగా నెమ్మదించు..కాలంతో పాటు ఎటు తోస్తే అటు ఎగురుతూ విహరించు..కొన్నాళ్ళకి నువ్వు చేయవల్సిన పని..నీకై నిర్ణయించబడ్డ విధి..నీ ముందుకు వచ్చి తీరుతుంది అప్పుడు మాత్రం శక్తికి మించి కష్టపడి చాలు..ఇదే జీవితం మనం ఎంత గింజుకున్నా కాదనలేని నిజం కాబట్టి నీ శక్తియుక్తులు మీద నమ్మకం పెట్టుకుని కష్టపడితే నువ్వు అనుకున్న విజయాన్ని సాధించగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

190)ఒక ఉన్నత ఉద్యోగంలో ఉన్నా ,ఒక పెద్ద వ్యాపారవేత్త గా రాణించినా,ఒక అవార్డు అందుకున్నా,ఒక గొప్ప పదవి లో ఉన్నా,ఎంత రిచ్ గా బతికినా నువ్వు సక్సెస్ అయినట్టు కాదు..!సక్సెస్ అంటే నీతో పాటు ఉండే వాళ్ళ గుండెల్లో నిలిచి పోవడం..చీకట్లో మూలుగుతున్న వారికి  వెలుతురును పరిచయం చేయడం బానిసల్లా బతుకుతున్న వారికి ఆత్మగౌరవాన్ని,స్వాభిమానాన్ని రుచి చూపించడం!!చివరాఖరికి  ఈ ప్రపంచానికి ప్రశ్నించడం నేర్పడం.. కాబట్టి చెడును ప్రశ్నించడం నేర్చుకో మంచిని అభినందించడం నేర్చుకో ఎందుకంటే అది నీలోని మంచిని పెంచుతుంది చెడును తొలగిస్తుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

191) పనికి వచ్చినంత వరకు వస్తువలకి విలువ..పని చేసినంత వరకు మనుషులకి విలువ..అవసరం తీరితే వస్తువు అమ్మకానికి మనిషి అవతలకి.గడియారంలో ముళ్లులా నిత్యం మాట మారుస్తూ స్వార్ధానికి మంచి వాడిలా నటిస్తూ అవసరాలు తీరక ఆ బంధాల్ని కాలరాస్తూ మానవత్వం కూడా లేని మరమనుషులులా ఈప్రపంచంలో తలపిస్తున్నారు కొందరు ఎందుకోసం ఈ పరుగులు ఎవరికోసం ఈ నటన ఏది శాశ్వతం చివరికి అందరం ఎదో ఒక రోజు ఈ మట్టిలోనే కదా కలిసేది.అడ్డు చెప్పేవారు లేరని హద్దు దాటకూ నమ్మకంగా ఉన్నారులే అని నమ్మకద్రోహం చెయ్యకు.సహాయం చేస్తున్నారులే అని అన్యాయం చెయ్యకు కాబట్టి స్వార్ధాలకు స్వలాభాలకు మనుషుల మనుస్సులని ఆడుకుంటే వాడుకుంటే వారిపై నాలుగు కన్నీటీ బొట్లు రాల్చాడానికి కూడా మనుషుల మిగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

192)జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు.ఏ సమయానికి ఏమి జరగాలో అదే జరుగుతుంది.కష్టం అయ్యోపాపం వద్దులే అనుకుని వెనక్కి వెళ్లదు,సుఖం వరించి కావాలని ముందుకు రాదు.నీకు ఏది ప్రాప్తమని ఉందో అదే అందుతుంది.నాడు మనం చేసుకున్న కర్మల ఫలితమే నేటి ఈ జీవితం.అందుకే అందని దాని కోసం అర్రులు చాచనుకూడదు.అందిన దానిని చేయి జార్చుకోనుకూడదు."విలాసకరమైన జీవితం కన్న,సంతోషకరమైన జీవితం మిన్న"!!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

193)కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు..కర్మ రూపంలో గుర్తుచేస్తూనే ఉంటుంది..కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే..సాక్షాలై నిలువునా దహించి వేస్తాయి..కళ్ళతో చూసిన నిజాలకూ..చెవులతో విన్న ప్రశ్నలకూ..నోటితో విసిరిన నిందలకూ తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే 'కర్మ' కాబట్టి కర్మ చాలా శక్తివంతమైనది నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

194)రాత్రంతా సూర్యుడు ఓపిక పడుతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు.రోజంతా చంద్రుడు ఓపిక పడుతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు ప్రతీ ఒక్కరికీ టైమొస్తుంది కావాల్సిందల్లా ఓపిక.. కాబట్టి నీ చేతిలో ఉండే విద్యను సానపెడుతూ కష్టపడడం మాత్రమే నువ్వు చెయ్యాల్సింది.. మిగతావి పై వాడు చూసుకుంటాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం* 

195)ఒక లక్ష్యంతో, ఆదర్శంతో బ్రతకాలనుకునే వారికి నేను చెప్పేది ఒక్కటే - "మనిషి ఏదుగుదలకి అడ్డువచ్చేది ఏమిటో తెలుసా? అతనికి సామర్థ్యం లేకపోవడమో, స్తోమత లేక పోవడమో కాదు. తనకిక ఏ అవకాశమూ రాదు, వేరే దారే లేదు అనే నిర్ణయానికి రావడమే. నిరాశకి లోను కావడమే! "Opportunity is No WHERE" అని నీరసపడి కూర్చోకండి!.."Opportunity is Now HERE" అని ఆశాభావంతో జీవితంలో పురోగమించండి!ఇది అర్ధం చేసుకున్నవాడికి విజయం తధ్యం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

196) ఏ పరిస్థితుల్లో ఉన్న చేయి చాపకు రేపు అదే నీకు మచ్చగా మారచ్చు..ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి మీద ఆధారపడకు.. ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపచేస్తుంది..ఎవ్వడికోసము ఎదురు చూడకు అలా చేస్తే నీకొచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు. నడిచి వెళ్ళు తప్ప లేని ఆర్భాటాల కోసం ప్రాకులాడకు..అలా చేస్తే నువ్వెళ్ళే గమ్యానికి చేరుకునే సమయం తరిగిపోతుంది..చివరిగా చెప్పేది ఒక్కడివే వెళ్ళు గుంపుతో కాదు..నువ్వెంటో తెలిసేది నీకు అప్పుడే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

197)మన మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.ఒక్కొక్కసారి మంచి సంకల్పంతో మొదలుపెట్టిన పనులు కూడా వెంటనే మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అంత మాత్రం చేత మన ఆలోచనలు చెడ్డవిగానో అపసవ్యంగా వున్నాయనో దిగులు చెందకూడదు. సంకల్పంలో వున్న నిజాయితీని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న తడబాటులున్నా ఓర్పు వహించాలి. వీలైతే మంచి సలహా తీసుకొని మన సంకల్పాన్ని నెరవేర్చకోవడానికి మార్గాన్ని వెతుక్కోవాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

198)జీవితమంటే గొప్ప గొప్ప బాధ్యతలు త్యాగాలు కాదు.. చిన్న చిన్న ఆనందాలు నిరంతరం చిరునవ్వే కదా జీవితమంటే! నేటి రోజుల్లో ఇది ఎంత వరకు జరుగుతూ ఉంది ? ప్రతి ఒక్కరి జీవితం రోజురోజుకి ఒక యద్ధంలా మారుతోంది.ఇందులో ప్రత్యర్థి ఎవ్వరు ఉండకపోవచ్చు పరిస్థితులు కావచ్చు ఆకస్మిక విపత్తులు కావచ్చు.ఏది ఏమైనా నిరంతరం యుద్ధం చేయాల్సిన పరిస్థితి మాత్రం తప్పేలాలేదు. యుద్ధాలు కేవలం స్వార్ధం కోసమే రావు కొన్ని సార్లు మన మనుగడ కోసం చెయ్యక మానదు.నేను యుద్ధం చెయ్యను అని కూర్చుంటే శత్రువు మిమ్మల్ని కబళించేస్తాడు.తన జీవితాలలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వారంతా నిరంతరం యుద్ధం చేస్తూ గెలిచినవాళ్ళే.యుద్ధం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ జీవితంలో నిరాసక్తత ప్రారంభమవుతుంది.మనం ఒక్కొకొక్క సారి ఓడిపోవచ్చు. కానీ అక్కడ నుండి తిరిగి జీవితాన్ని ప్రారంభించి మనం విజయం సాధించేలా కష్టపడాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

199)పూజలు చేసి, మనం దేముణ్ణి వెదుక్కుంటూ వెళితే దానం చేసే వారిని వెతుక్కుంటూ భగవంతుడే వారి దగ్గరకు వస్తాడట. ఒక మనిషి మరణించినా, అతడు చేసిన దానధర్మాలవలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.కృష్ణార్పణం అని చెప్తూ చేసే దానలన్నీ నేరుగా ఆ భగవంతునికే చెందుతాయి. మనసా వాచా కర్మణా చేసే దానానికే ఫలితం ఉంటుంది. మనం చేసే దాన ధర్మాలన్నీ మనం పైజన్మకు దాచుకున్న నిధులవంటివేనని చెప్పవచ్చు. మానవ సేవే మాధవ సేవగా ఎంచి చేసే దానం అన్నిటికన్నా విశిష్టమైనది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

200)‘మాటల్లో ఓర్పు - మనసులో నేర్పు’’ ఉండాలి.ఈ మాటలు కూడా మితంగా ఉండాలి. అతిగా మాట్లాడడం వల్ల ఆ మాటలు పేలవంగా తయారవుతాయ. వినేవారికి విసుగును కలిగిస్తాయ. ఒక్క మాట మాట్లాడగానే వారు ఎలాంటివారో నిశితంగా చెప్పవచ్చు,మాట తీరును బట్టి మనిషిని అంచనా వేయొచ్చు. మాట విలువ తెల్సిన వారికి మాటలోని మర్మం తెలుస్తుంది. చేతులున్నందుకు దానం చేయాలి. చెవులున్నందుకు మంచిమాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాట మాట్లాడాలి.ఎవరికైనా మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి, బలీయమైంది. మనసులు కలవడానికి, మనసులో ఉన్నది తెల్పడానికి, పని సాధించడానికి మాటే సాధనం..కాబట్టి మాట మాట్లాడేముందు ఆచితూచి మాటలాడటం వల్లన నీ విలువ పెరుగుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

201)ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకాలంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి.మంచితనం మనుషులు మీద..మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎవ్వరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది కాబట్టి ఆశించడం ఆపేస్తే ఆనందం..శాసించడం ఆపేస్తే సంతోషం మిగులుతాయి..అలాగే దేనిపైనా గాని మోతాదు మించి ప్రేమ పెంచుకోకూడదు ఎందుకంటే విడిపోయే సమయం వచ్చినప్పుడు ఏడ్చేది నీ కనులు కాదు నీ హృదయం అది వస్తువు గాని మనిషి గాని సంస్థ గాని!! ఎందుకంటే ఏది జరిగిన అంత మన మంచికే అనుకోని ముందుకి సాగిపోవాలి గాని నిరాశచెందకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

202)నీకు ఎవ్వరినీ తిట్టే అధికారం లేదు నమ్మింది నువ్వు,మోసపోయింది నువ్వు కేవలం అది నీ తప్పే...అయినా మనిషిని నమ్ముతున్నావ్ అంటే అక్కడ నుంచి నీ పతనం మొదలైనట్టే..నమ్మకానికి అర్హులు ఎవ్వరూ లేరు ఇక్కడ..కేవలం అవసరానికి వేసే ఒట్లు తప్ప..ప్రతి పరిచయం వెనుకా..ప్రతి అవసరం వెనుకా ఏదొక మోసం ఉంటుంది..అలా అని అందరు అలాంటి వాళ్ళే అని కాదు..కొంత మందికి మాత్రమే ఇది  అన్వయిస్తుంది.పరిస్థితి బట్టి అవసరాన్ని బట్టి అది కొంచెం అటుఇటూగా బయటపడు తుందంతే..అప్పుడు అనిపిస్తుంది నీకు అనవసరంగా నమ్మనని.. కాబట్టి ఎప్పుడు జాగురతతో ఉండు ఎలాంటివాళ్ళో పసిగట్టి అప్రమత్తంగా ఉండు అప్పుడే ఈ లోకం మోసపోకుండా బ్రతకగలవు నిట్టేలేవునా ముంచేవాళ్ళు నీ పక్కనే ఉంటారు..జర జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

203)పక్క వాడి కన్నీరు నీ కళ్ళని తడిపితే నీ మనస్సుకు ఆలోచన ఉన్నట్టు..వారి కష్టాలు నీకు బాధ్యత నేర్పితే నీలో ఒక గొప్ప నాయకుడు ఉన్నట్టు..చేయి కదుపుతూ పక్క వాడికి  సాయం చేస్తే నీలో మానవత్వం ఉన్నట్టు అందుకే అన్నారు "ప్రార్ధించే పెదవులు కన్నా ,సాయం చేసే చేతులే మిన్న అని".....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

204)జీవితంలో మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి..అలాగే మిమ్మల్ని బలహీనపరిచే ప్రతీ ఆలోచనని తిరస్కిరించండి అప్పుడే మీరు పైకి ఎదగగలరు దేనినైనా సాధించగలరు కాబట్టి మీ బలాబలహీనతల్ని తెలుసుకొని మసలుకుంటే విజయం తధ్యం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*🙏 *జై శ్రీరామ్* 🙏


205)జీవితంలో పొగిడేవారు నీ చుట్టూ ఉండి నీకు భజన చేసినా నువ్వు గెలిచినట్టు కాదు....విమర్శించే వారు నీ చుట్టూ ఉండి నిన్ను గేళి చేసినా నువ్వు ఓడినట్టు కాదు..ఎందుకంటే.. గెలిచినవాడు మళ్ళీ ఓడిపోయే ప్రమాదం ఉంది.. ఓడినవాడు మల్లి గెలిచే అవకాశం ఉంది కాబట్టి గెలుపోటములు ప్రక్కన పెట్టి నువ్వు అనుకున్నది సాధించడానికి నిరంతర ప్రయత్నంతో మున్ముందుకు సాగిపో నీకు విజయం తధ్యం!!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

206)మనం ప్రపంచాన్ని పరిశీలించినంతగా మనల్ని మనం పరిశీలించుకోం. అసలు సమస్య ఇదే.అందరూ మనల్ని గౌరవించాలని ఆశిస్తాం తప్ప మనం కూడా అందర్నీ గౌరవించాలనుకోం.మనకున్న కొద్దిపాటి ప్రత్యేకతలకు మనమే మురిసిపోతూ అహంకరిస్తుంటాం.ప్రపంచంలో మనకు మించిన ఘనులు ఎందరో ఉంటారనే స్పృహ ఉంటే పొరపాటునైనా మనలోకి అహం రాదు.అద్దంలో శరీరాన్ని పరిశీలించుకున్నట్లే, ఆత్మ పరిశీలనతో మనసు, బుద్ధి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి అలాంటి దుస్థితి కలగకూడదంటే, మనల్ని మనం సంస్కరించుకోవాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

207)జీవితంలో మనకి ధనం,కీర్తి ,అధికారం, పదవులు వీటన్నిటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి కావలసింది సంతృప్తి.అది లేనప్పుడు పైవన్నీ ఉన్నా వ్యర్థమే." "జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము.ఏ ఆట చివరిదో.ఏ మాట చివరిదో.అందుకే వీలైనంత వరకు అందరినీ పలకరిస్తా ఉండు.వీలైతే కలుస్తా ఉండు.ఏందుకంటే నీకంటే గుణవంతులు,ధనవంతులు,తెలివైనవారు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించి అందరూ వచ్చిన చోటుకే మళ్ళీ తిరిగి వెళ్లిపోయారు కాబట్టి ఉన్నంతకాలం మంచి మనిషిగా జీవించు..కష్టసుఖాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగిపో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

208)మన బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చేయడం కానే కాదు..మనలో నిబిడీకృతమై ఉన్న బలాన్ని గూర్చి ఆలోచించడమే అందుకు ప్రతిక్రియ.మనపై మనకు విశ్వాసాన్ని చేకూర్చే ఆదర్శం,మనకు అత్యంత ప్రయోజనకరం.మనం అంతకన్నా అధికంగా ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించడం చేయాలి అలా ఉంటే ఈ అనర్థాలూ,దుఃఖాలూ ఎప్పుడూ మన దరిచేరవు కాబట్టి పట్టుదలతో నువ్వు అనుకున్న లక్ష్యం వైపు సాగిపో..నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

209)కళ్ళతో చూసిన నిజాలకూ..చెవులతో విన్న ప్రశ్నలకూ..నోటితో విసిరిన నిందలకూ..తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే 'కర్మ'..అది కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్షాలై నిలువునా దహించివేస్తాయి..నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు.చేసిన పాపాలు పండి ఆస్పత్రిలో రోజులు లెక్కపెట్టేటప్పుడు గోడమీద ఇలా రాసి ఉంటుంది ICU అని అంటే అర్థం దేవుడు పైనుంచి అన్ని చూస్తూనే ఉంటాబు కాబట్టి మనం మంచి చేసినా..చెడు చేసినా అది తిరిగి మనకే చేరుతుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

210)మనకు *కష్టాలు* రావడం కూడా *మంచిదే* , కష్టాలు వస్తేనే కదా మన *కన్నీళ్లు* తుడవాడానికి ఎవరు *ఉన్నారో* తెలుస్తుంది . నీ *జీవితం* ఒకడి చేతిలో *ఆటబొమ్మ* కాకూడదు . *ఓట* మైన *గెలు* పైనా *బాదైన , బరువైనా , నష్టం* అయినా ఎంత *కష్టం* అయినా *నీ జీవితం నీ చేతుల్లోనే* ఉండాలి . *ప్రాణం* పోతున్నా *బానిస బ్రతుకు* మాత్రం *బ్రతక* వద్దు .ఈ *సమాజంలో* రెండు రకాల మనుషులుంటారు . *మనం* సంపాదిస్తే *ఓర్వలేని* వారు , మనం *ఖాళీగా* ఉంటే *ఎగతాళి* చేసేవారు , కొందరు మనం *మంచిగా* బతికితే *అబ్బా* వాళ్ళకేంది అని అంటారు , అదేమీ లేకుంటే *చులకనగా* చూస్తూ నవ్వుతారు . *సంపద శాశ్వతం* కాదు . మన *జీవితం శాశ్వతం* కాదు *శాశ్వతంగా* నిలిచేది ఒక్కటే అదే *మన మంచితనం*...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

211)మనకు కావలసింది స్పందించే హృదయం, ఆలోచించే మెదడు,పనిచేసే బలిష్టమైన సంకల్పం ,కర్మ చేసే యోగ్యతను సంపాదించు.హృదయానికి మనసుకి సంఘర్షణ జరిగినప్పుడు, హృదయాన్ని అనుసరించు.నీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతే, మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతే,నువ్వు ఓటమిపాలవుతావు కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు.అలా అని అసాధ్యమైన దాన్ని విడవకుండా సాధన చేయాలి.ఉన్నత ఆదర్శంతో ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచడానికి ప్రయత్నించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

212)దెబ్బ లేనిదే రాయి శిలగా మారునా....వేడి లేనిదే ధాన్యం మెతుకుగా మారునా..ముఖముపై ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ...పట్టుదలను ప్రేమిస్తూ...ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా ధరించి...శ్రమను ఆయుధంగా మార్చి...శ్రమ విజయాల మైత్రితో విజయశిఖరాన్ని అధిరోహించి నువ్వెంటో నిరూపించుకో ఏందుకంటె  విజయం అనేది గొప్పవాళ్లకు వరం కాదు కష్టపడేవారికి అందానిచ్చే హారం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*

213)ప్రతి రోజూ నీవు అన్ని విషయాలలో "ఒకరి" కన్నా "మిన్న" గా ఉండాలి మరి ఎవరు ఆ "ఒకరు"? అని అనుకుంటున్నారా అది ఎవరో కాదు నిన్నటి నీవే..ప్రతి రోజూ నిద్రించే ముందు ఒక్కసారి మనలోకి తొంగి చూసుకుని కొన్నిటిని చెరిపేయాలి,కొన్నిటిని జోడించుకోవాలి..కొన్నిటిని మార్చుకోవాలి..అంతే అప్పుడు నువ్వు నిన్నటికన్నా ఈ రోజు "మిన్న"గా అవుతావు కాబట్టి నీతో నువ్వు పోటీపడి నిరంతరం గెలువు అప్పుడు నువ్వే ఎవ్వరినైనా గెలగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

214)కాళ్ళు లేనివాడు నడిస్తే చాలు అనుకుంటాడు..చూపులేనివాడు చూడగలిగితే చాలనుకుంటాడు..చెవులు లేనివాడు వినాలని ఆశ పడతాడు..ఎందుకంటే వాళ్ళకు వాటి విలువ ఏంటో తెలుసు! ఎవరిసాయం లేకుండా కాళ్ళతో నడిచి వెళ్ళడంలో ఉండే ఆనందం..గాడాంధకారం నుండి బైటపడి పకృతి అందాలను చూడడంలోని ఉల్లాసం... భయంకరమయిన నిశ్శబ్దాన్ని చేదించి మధురమయిన సంగీతాన్ని చెవులతో ఆస్వాదించడం లోని సంతోషం..కానీ కొంత మంది అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదని..ఏదో కావాలని ఉన్నదాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకలిగిన వాళ్ళు ఆనందంగా ఉండి దేనినైనా సాధించగలరు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*   

215)జీవితమనేది కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ను ఎదురుగా ఉంచుతుంది. ఈ ఛాలెంజెస్ ను తప్పించుకోవడం ఎవరి వలనా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదో ఒక విధమైన ఛాలెంజ్ కచ్చితంగా ఉంటుంది. ఛాలెంజెస్ ని ఎదుర్కోవడంలోనే మన నేర్పు కనిపిస్తుంది. కాబట్టి, రోజును ఉత్సాహపూరితంగా ప్రారంభించడం వలన మీకు ఆయా ఛాలెంజెస్ ను ఎదుర్కొనే మనోబలం లభిస్తుంది.కారణమేదైనా, మనసు ఇబ్బందిపడే విషయాలను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ పాజిటివ్ నోట్ తో ముందుకు వెళ్లడం వలన జీవితంలోని సక్సెస్ ను ఎంజాయ్ చేసే అవకాశం లభిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

216)విజయాన్ని సాధించాలన్న ప్రయత్నంలో ఎన్నో సార్లు ఓటమిని ఎదుర్కోవలసి రావచ్చు. అయితే, అటువంటి ఫెయిల్యూర్ మూమెంట్స్ మీ జర్నీని నిర్వచించకూడదు. వాటిలోంచి మీరు తప్పులను దిద్దుకొని తిరిగి పైకెదగడానికి కృషి చేయాలి. కాలం అనేది అన్నిటికంటే బలమైనది.మీరు కిందపడిపోయారన్నది ప్రశ్న కాదు, మళ్ళీ పైకెప్పుడు ఎదుగుతారన్నది ప్రశ్న.ఇది తెలుసుకొని సరైన దారిలో నడిచేవాడికి విజయం త్వరగా లభిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

217)ఇతరులతో మనని పోల్చి చూసుకున్నప్పుడు ఎక్కడో అక్కడ ఒకానొక సందర్భంలో మన పట్ల మనకి అసంతృప్తి కలుగుతుంది. మనం ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన సజీవ రూపం. మన రూపం కాని, రంగు కాని, ఆలోచనలు కాని, అంతెందుకు మన వేలి ముద్రలు కాని, మన కనుగుడ్డు కాని వేరొకరి వాటితో పోలవు. మనం మనకే ప్రత్యేకమైన వారమని గుర్తించిన రోజు మన ప్రత్యేకతను చాటుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి.కాబట్టి పోలిక మానుకో నీ పాటికి నువ్వు మంచిని చేసుకుపో నిన్ను కిందకి చూసుకోవడం మానుకో నీలో ఉన్నది అందరికి లేదని తెలుసుకో అందుకే ఉన్న దానితో తృప్తిపొందే వారు ఉత్తములు.ఎదుటివారిని చూసి ఏడ్చేబదులు ,కష్టార్జితాన్ని ఇష్టంగా అనువభించడం నేర్చుకున్నవాళ్ళు అదృష్టవంతులు .. ఆశబోతుకు ఆనందం ఉండదు.సంతృప్తి లేనివాడికి సప్తద్వీపాలు రాసిచ్చినా చక్కబడడని పెద్దలు చెప్తారు..కాబట్టి సంతృప్తే సగం బలం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

218)మనలోని చికాకులన్ని ఎగిరిపోవడానికి చిన్న *చిరునవ్వు* చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి *చల్లనిచూపు చాలు* గుండెమంటను చల్లార్చడానికి *తియ్యని మాటలు చాలు* నేనున్నాను అనే భరోసా ఇవ్వడానికి ఒక *మంచి నేస్తం* దొరకితే చాలు, చెడ్డ రోజులు ఎల్లకాలం వుండవు, కానీ చెడ్డమనుషులు జీవితమంతా తారసపడుతూనే ఉంటారు, మనల్ని వెలెత్తి చూపించే వాలేవరూ ఒక్కపూట ముద్దకూడా పెట్టరు, అందుకే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు, అది కష్టమైనా సుఖమైనా, బాదైనా,సంతోష మైనా నీ జీవితం నీది నీకు నువ్వు జవాబుదారి ఎవ్వరికీ కాదు, జీవితంలో ఏది సాధించాలన్నా ఓపికగా ఉండడం అవసరం, అలా ఉంటానే విజయాలు మనల్ని చేరుతాయి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

219)ఒక్కొక్కసారి రీసెర్చ్ చేసి, అవసరమైన దానికంటే ఎక్కువగా అన్ని కోణాల్లో నుండి ఆలోచించి, ప్లాన్ వేసి ఎంతో కష్టపడి తయారుచేసిన ఒక ఆలోచన కంటే మామూలుగా ఆలోచించి చేసే పని వల్ల ఎన్నో ఊహించని గొప్ప ఫలితాల్ని పొందే అవకాశాలు ఉంటాయి.అందుకే కొన్నిసార్లు కష్టపడి ఆలోచించడం కంటే తెలివిగా ఆలోచించడం అనేది ముఖ్యం. ఇంకా మీ తెలివిని ప్రదర్శించడానికి మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది అస్సలు ముఖ్యం కాదు. ఒక అడుగు ముందుకేసి మీరనుకుంటున్నది ధైర్యంగా చెప్పడం వల్ల మీ సలహా తీసుకున్న వాళ్ళే కాకుండా మీరు కూడా ఎంతో గొప్పస్థాయికి చేరుకుంటారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

220)ఆకాశం లోకి ఏగరాలి అనుకోవడం ఆశ ఆకాశం కన్నా ఎత్తుకి ఎగరాలనుకోవడం అత్యాశ ఆశ నెరవేర్చాలనుకో అది నిన్ను బ్రతికిస్తుంది అదే అత్యాశ నెరవేర్చాలనుకో అది బ్రతుకుతూ నిన్ను చంపేస్తుంది.కాబట్టి ఆశ పడండి దాని కోసం శ్రమించండి విజయం వరించండి అంతే కానీ దురాశ పడి తప్పు మార్గాన్ని ఎంచుకుంటే జీవితంలో పైకి ఎదగకుండా అదః పాతాళానికి తొక్కేస్తుంది కాబట్టి కష్టే ఫలీ:..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

221)మనం ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు చూస్తూవుంటాయి...ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెదకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మంచే కనిపిస్తుంది...నా దృష్టిలో తప్పులు చేయని వారు వుండరు కాని తప్పును ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు ఎంతో ఉన్నతులు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

222)నొప్పి తెలియాలి అంటే గాయపడాలి..పైకి లేవాలంటే క్రిందపడాలి..గెలవాలంటే ఓడిపోవటం తెలియాలి...ఎందుకంటే జీవితం నేర్పించే ప్రత్ పారం బాధతోనే మొదలౌతుంది ఎలా అంటే జ్వరం తగ్గించే మందు ఎప్పుడూ చేదుగా ఉంటుంది చూడు అలా...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

223)మేఘంనుంచి జాలువారిన ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారు ఎవరికో ఒకరికి ఉపయోగపడ్తు వాళ్ళ జీవితం చరితార్థం చేసుకుంటారు అందుకే పెద్దలు ఏమన్నారంటే పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

224)నువ్వు జీవితంలో ఒక పెద్ద స్థాయిలో వచ్చామంటే చాలామంది దానికి అదృష్టం కావాలంటారు కానీ దానికి కావాల్సింది కష్టేపడేతత్త్వం,ఓర్పు,నిజాయితీ..మనం దేనినైతే ప్రేమిస్తామో దేనికోసమైతే మనం నమ్మకంతో పని చేస్తామో..అలాగే ఆ నమ్మకం పట్ల భక్తి భయం వుంటే మనం ఏ స్థాయికి ఎదగలమని ఇప్పటికే చాలామంది నిరూపించారు అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకుని కష్టపడితే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించి సాధించగలం దానికి కావాల్సింది కొండంత ఓర్పు నేర్పు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

225)గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు – ఓపిక.కాబట్టి సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

226)జీవితంలో మనం ఇష్టపడేది లభించకపోవచ్చు, కానీ లభించేదాన్ని ఇష్టపడాలి' అనే ఈ సూత్రాన్ని అర్థం చేసుకొంటే మనం ఏ పని చేస్తున్నా ఇష్టపడి చేయగలుగుతాం. ఆ తరువాత పరిస్థితులే మనకు అన్నివిధాల సహకరిస్తాయి. కాబట్టి గతం నుండి నేర్చుకో! నేటి కోసం జీవించు! రేపటి కోసం ఆశించు!' ఈ మాటల్ని ఆచరిస్తూ ముందుకు సాగండి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

227)తెల్లకాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది తర్వాత దాని పైన రాసే రాతలు బట్టి దాని విలువ మారుతుంది!మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో పుడతాడు జీవితంలో వాడు చేసే పనులు మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది.కాబట్టి విలువ తెలుసుకున్న వాడికే విజయం దక్కుతుంది అది బయటైనా సరే బజారులో అయినా సరే ..విలువ తెలుసుకొని బ్రతుకు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

228)మనం ఉన్నచోటనే ఉండి మన జీవితం మారిపోవాలంటే ఎలా? జీవితం మారాలంటే ముందు మనం మారాలి...తిట్టుకుంటూ ఉన్న చోటే ఉండాకుండా నువ్వెంటో నిన్ను నువ్వు పరిశీలించుకుని నిరాశ నుండి ఆశ వైవపుకు..నిరుత్సాహం నుండి ఉత్సాహం వైపు అడుగులు పడాలి...మన ఆలోచన మారితే తప్ప, ఎవరో వచ్చి ఎదో చేస్తారని వుంటే  మనజీవితం ఎప్పటికి మారదు...నిరాశానిస్పృహలు నిన్ను కాటెయ్యకముందే నీలో ఉన్న శక్తీ సామర్ధ్యాల్ని మేలుకొలుపు కార్యోన్ముఖుడివై ముందుకు కదులు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

229)జీవితంలో ఏదైనా వదులుకోవడం ఎంత సేపు..క్షణం పట్టదు..కానీ అదే పట్టుకోవాలి అంటేనే దానికి ఎంతో దమ్ము ధైర్యం సహనం కావాలి అలాగే కష్టం వచ్చినప్పుడు తుంచుకోవడం కాదు మన వాళ్ళతో  పంచుకోవడం నేర్చుకోవాలి కాబట్టి పరిస్థితి తగ్గట్టు ఉంటేనే జయించుకో జయించికోగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

230)మన జీవితంలో అంతరంగ శుద్ధి, అమలిన ప్రేమభావన, అనితర సాధ్యమైన భావ నియంత్రణ-ఈ మూడు అంశాలూ వ్యక్తుల సంస్కార స్థాయుల్ని నిర్ణయిస్తాయి. ప్రజ్ఞ, విజ్ఞత, ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధాన మైనవి.స్థితప్రజ్ఞ సమయోచిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తాయి.జీవితం అశాశ్వతం, యౌవనం,ధనం అస్థిరాలు.కుటుంబ బంధాలన్నీ తాత్కాలికం. అయితే లోకంలో శాశ్వతమైనవి, నశించనివి- వ్యక్తులు సంస్కార వైభవంలో చేసిన ధర్మం,ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి!సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తారు కాబట్టి మనస్సుకి మమకారం ఎంతో మనిషికి సంస్కారం అంతఉండాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

231)జీవితం చాలా చిన్నది అంటారు కానీ దానిలో కష్టాలు కన్నీళ్లు చాలా పెద్దవి..అలలు లేని సముద్రంలాగే ఆటుపోట్లులేని జీవితం చాలా చప్పగా ఉంటుంది.ఎప్పుడూ ఒకేలా జీవితం సాగిపోతే ఇంకేం నేర్చుకుంటాం మనం? కష్టం వచ్చాకనే కదా చిన్న చిన్న విషయాలని కూడా ఆస్వాదించడం మొదలుపెడతాం. పరిగెడతాం...పడిపోతాం.అంత మాత్రాన పరుగు ఆపేసి ఏడుస్తూ కూర్చోవటమా? మట్టి దులుపుకొని మళ్ళీ పరుగు మొదలుపెట్టడమే!!కాబట్టి జీవితం కూడా ఒక పరుగు పందెంలా అనుకుని గెలుపోటములను పక్కనపెట్టి ముందుకు సాగుతూ పోవడమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

232)మిమ్మల్ని రెండు విషయాలు ప్రపంచానికి పరిచయం చేస్తాయి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు పాటించే సహనం,అన్నీ ఉన్నప్పుడు మీరు ప్రదర్శించే సంయమనం.వంద బిందెలతో ఒకేసారి నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. మనం కోరుకున్నట్లు ఏ పనులూ క్షణాల్లో జరిగిపోవు. దేనికైనా సమయం రావాలి.సహనం కావాలి.ఓర్పు అనేది ఎంతో చేదుగా ఉంటుంది. కానీ దాని వల్ల లభించే ప్రతిఫలం మాత్రం తీయగా ఉంటుంది.అనుభవానికి ప్రతిస్పందనకు మధ్య తలెత్తే అద్భుతమైన స్థితే సహనం. అది ఉన్న చోట స్థితప్రజ్ఞ స్థిమితంగా ఉంటుంది. ఏ సాధన శిఖరం పై పతాక ఎగరేసే వారందరి యశస్సులోని రహస్యం ఒక్కటే.సహనంతో నిరంతర సాధనతోనే ఏదైనా సాధ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

233)ఓ శిల్పి బండరాయిని అందమైన శిల్పంలా మలచడానికి సమయం కావాలి. ఓ గొంగలిపురుగు అందమైన సీతాకోక చిలుకలా రూపాంతరం చెందడానికి సమయం,సహనం రెండూ కావాలి అలాగే జీవితంలో వినే సహనం లేనివారు అర్ధజ్ఞాని గానే మిగిలిపోతారు.ఎక్కడైతే వినే సహనం, వేచి ఉండే ఓర్పు ఉంటాయో,అక్కడ కచ్చితంగా మంచి భావనలు నిత్య సత్యాలుగా భాసిస్తాయి. అవి సహన సాధనకు సహజ ఉత్ప్రేరకాలుగా మారి నువ్వు సాధించబోయే లక్ష్యానికి దిశానిర్దేశం చేసి నిన్ను విజయం ముంగిట్లో నిలబెడుతుంది కానీ దానికి కావాల్సింది కొద్దిగా ఓపిక నీకున్న పట్టుదల...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

234)జీవితం సాపీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది. కానీ మన జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని మనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడే మనమేంటో అందరికీ తెలుస్తుంది.మనుషులు ఎలాంటి  వారంటే, పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ, లోపల ఈర్ష్యతో  రగిలిపోతారు. అదే ఒకరు నాశనం అవుతుంటే, లోపల సంతోషిస్తూ బైట బాధగా  నటిస్తారు.ప్రపంచమే రంగస్థలం. మనుషులే  మహానటులు అని ఊరికే  అనలేదు మహానుభావులు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

235)డబ్బు పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది.పేదరికం నీకోసం నిలబడే వాడెవడో తెలియజేస్తుంది.అవసరం ఎంతటి నీచనికైనా దిగదారుస్తుంది.ఆకలి పిచ్చుకలు తినే ఆ నాలుగు వడ్ల గింజల లెక్క చెబుతుంది.అన్నీ ఉన్నప్పుడు తెలియదు వాటి విలువ. దొరకవు,దరిచేరవు అనుకున్నప్పుడే తెలుస్తుంది కాబట్టి విలువ తెల్సుకుని జీవించు లేకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

236)ఈరోజు మాత్రమే నీది..రేపు నీ కల..మిగతాది అంతా నీ భ్రమ ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం.మరి ఎందుకు ఎప్పుడో చేసే దానికోసం అంత తీవ్రంగాఆలోచించి గొప్పగా మొదలైన ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు.ఈ క్షణం నీ చేతిలో ఉంది నీ సొంతం.వదలకు ఈ క్షణాలని...ఎందుకంటే రాబోయే కాలం ఏమి తెస్తుందో నీకు తెలియదు కాబట్టి,ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని,అనుభవాలను మూటగట్టుకుని పదిలంగా దాచుకో రేపటికోసం ఎదురుచూడు అంతేకానీ, ఆశలు పెట్టుకోకు.. ఎందుకంటే ఈ క్షణం పోతే తిరిగిరాదు దానిని మనస్సులో పెట్టుకుని మెలుగు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

237)మనం చెయ్యవలసిన పని మనం ఎల్లప్పుడూ క్రమశిక్షణతో చేస్తూ ఉంటే మనకు రావాల్సింది రావాల్సిన సమయంలో వస్తూనే ఉంటుంది! గుర్తు ఉంచుకోండి! ఎక్కువుగా చింతించకండి! కాబట్టి ఎవ్వరికోసమూ దేనికోసమూ ఎదురుచూడకండి మీ  పనిలో మీరెప్పుడు నిమగ్నమై ఎన్ని ఆటంకాలు వచ్చినా ఛేదించుకుంటూ మీ లక్ష్యాన్ని చేరే దిశగ్రీ పయనించండి అప్పుడు మీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

238)మనల్ని ఎవరు మోటివేట్ చేయరు. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి.ఒకప్పుడు మినరల్ వాటర్ సృష్టి కర్త, జోసఫ్ హాకిన్ వాటర్ అమ్ముతాను అంటే అందరు నవ్వారు. నీళ్లు ఎవరుకొంటారు అని ఆయన్ని ఎగతాళిచేసారు. ఆ రోజు జోసెఫ్ హాకిన్ అందరు నవ్వారు అని ఆగిపోలేదు. భాద పడుతూ కూర్చోలేదు. ఎవరి మాట వినకుండా తన పని తను చేసుకున్నాడు. మినరల్ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసారు, చరిత్ర సృష్టిoచ్చారు ఈ రోజు మినరల్ వాటర్ లేకపోతే ఒక పూట గడవదు, కొన్ని వేల కోట్లు టర్నవర్ చేసారు. ఏ పని చేసిన ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే, డిస్కరేజ్ చేసే వాళ్లే ఎక్కువ, అందుకే మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎవరి జీవితంలో వాళ్లే వెలుగులు నింపుకోవాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

239)జీవితం,గమ్యం,స్వప్నం,కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే..పడితే లేవాల్సింది మనమే బాధ,గాయాన్ని దిగమించాల్సింది మనమే..ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే..ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలుంటే ఎగతాళి చేస్తారు కాబట్టి ఎవరినీ పట్టించుకోవద్దు అన్నీ గమనిస్తూ లక్ష్యం వైపు ముందుకు సాగు విజయం నీదే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

240)బ్రతకాలి..నలుగురిని బ్రతికించాలి ఆ సదాశయం ముందు ఎంతటి సమస్యైనా చాలా చిన్నదిగా కనపడుతుంది.పోరాడి గెలవాలి అంతే కాబట్టి మన నుండి వచ్చే ప్రతీ ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలిగాని చీకట్లో నెట్టేసేలా ఉండకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

241)నీకో సమస్య వుందని చెప్పుకొంటే,నిన్ను చిన్న చూపు చూస్తూ...నీ వీక్నెస్ ఆధారంగా నిన్ను వాడుకోవాలను కొనే మనుషులున్న సమాజం మనది.మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక.. చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది కాబట్టి దేనిని ఎక్కువగా మనస్సులో తీసుకోకు నువ్వు చేయాల్సింది చేయి మిగతాది దేవుడు చూసుకుంటాడనుకుంటేనే నువ్వు ఆనందాంగా ఉండగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

242)జీవితంలో ఓటమి అనేది ముగింపు కాదు, ఓటమి అనేది మరలా ప్రయత్నించటానికి ఒక అవకాశం. వ్యక్తులు, పరిస్థితులు, కాలం నీ శత్రువులు కాదు. నీ ఓటమినే నీ శత్రువు అనుకో, నీ ఓటమి ఎంత గొప్పగా ఉంటే అంతకు మించిన ప్రయత్నం చేయి. ఓటమితో పోరాడుతూనే ఉండూ ఆ తర్వాత నీకు దక్కే విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది జరగని పని, ఇది అసాధ్యం అనుకునే వారికి నువ్వే ఒక ఉదాహరణగా నిలువు...నీ గెలుపే ఒక సమాధానంగా మార్చు..మన ప్రయత్నంలో లోపం లేనపుడు, మనం ఓటమి చెందినా కొన్నిసార్లు పరిస్థితులే మనకు మళ్లీ అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి మన చుట్టూ ఘటనలే మనకు స్ఫూర్తి, మన ఓటమే మనకు అవకాశం..ప్రయత్నమే నీ గెలుపు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

243)మన స్వభావం మూడు విషయాలమీద ఆధారపడి ఉంటుంది.అవి మన ఆలోచన,మనం పలికే మాట,మన చేసే కర్మ వీటికి మూలం మన మనస్సు.మనం ఏ పని చెయ్యాలన్నా దానికి అనుగుణమైన ఆలోచన లేదా దృఢసంకల్పం మనసులో కలగాలి.ఈ మూడింటిని మధ్య సమన్వయము ఉండాలి..అప్పుడే మన ప్రవర్తన నిటారుగా ఉంటుంది...అందుకే మనం ఏ ఆలోచన నాటితే అదే మన మాట అవుతుంది అల్లాగే మనం ఏది మాట్లాడితే అదే మన చర్య అవుతుంది అలాగే మనం చర్య చేస్తే,అదే మన నడవడిక అవుతుంది..కాబట్టి ఈ త్రికరణాలని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలిగితే మనం దేనినైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

244)మనం బావున్నప్పుడు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడతారు,అదే బాధల్లో ఉంటే మాట్లాడటమే దండగ అనుకుంటారు.ఇష్టం గా ఉంటే కాకమ్మ కబుర్లు చెప్తారు,కష్టం వస్తే కంటికి కూడా కనిపించరు.బంధాలు పైకి బలంగా ఉంటూనే,బలహీన పరిస్థితుల్లో భారంగా మారిపోతాయి.మనం పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు వద్దన్నా అందరూ చుట్టాలే, కానీ నష్టాల్లో ఉన్నప్పుడు నలుగురూ ఒంటరిని చేసేవారే.కఠినం అయినా, కష్టం అయినా నీకు తోడు ఉండేది..ఇష్టమైనా, ఇబ్బంది అయినా వెన్నంటే నీడగా ఉండేది ఒక్క నీ స్నేహితుడి ఒక్కడే అలాంటి స్నేహాన్ని చిన్న చిన్న పట్టింపులకు దూరంచేసుకోకు ఎందుకంటే చితి వరకు అంతులేని అనుబంధం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

245)జీవితంలో జరిగిపోయింది కాదు జరగబోయేది చూడు గతంలో వుండి భవిష్యత్తు వదిలేస్తే..నిన్ను నమ్మిన వాళ్ళు కూడా ఓడిపోతారు..నువ్వు గెలిచి నీమీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపిస్తావో నువ్వు ఆగిపోయి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఓడిస్తావో ఎటువైపు నడవాలో నిర్ణయం నీదే..కానీ ఒకసారి నువ్వు ఆలోచించుకొని అడుగు వేసినతర్వాత వెనకడుగు వెయ్యకు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

246)కష్టంలో కూడా కంటతడి పెట్టకుండా కాలంతో తలపడే శక్తి మనలో ఉండాలి..జీవితంలో ప్రయత్నమే ఓ ఆయుధంగా మలుచుకునే ఓపిక మనలో ఉండాలి..క్రింద పడ్డ ప్రతి సారి అందుకోలేనంత పైకి ఎగసి పడే కసి మనలో ఉండాలి ..కాళ్ల కింద అణచిపెట్టాలి అని చూసే వాళ్ళకి అందనంత పైకి ఎదిగి వాళ్ళని తల దించునేలా చేసే అంత కష్టం మనలో దాగి ఉండాలి..కన్నీళ్లను ఎరగా వేయకు..కాలాన్ని వృధా చేయకు పరిస్థితులను కారణంగా చూపకు...సమయం లేదని సాకు చెప్పకు..పట్టుదల, ఓపిక, సహనం మాత్రమే నిన్ను విజయతీరానికి చేరుస్తాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

247)అక్కరకు రాని ఆలోచనలు ఎన్ని ఉంటే ఏమి లాభం ఉపయోగం లేని వాటి కోసం ఉచిత సలహాలు ఎన్ని తీసుకుంటే ఏమి లాభం..ప్రాశాంతమైన జీవితం లేనప్పుడు మీ దగ్గర ఎన్ని కోట్లు ఉంటె ఏం లాభం? సరైన నిర్ణయాలు తీసుకోనప్పుడు ఎంత గొప్ప నాయకులుండి ఎం లాభం..నిస్సహాయులకి  ఉపయోగపడని దానం నీ దగ్గర ఎంతవుంటే ఎం లాభం..కాబట్టి నీ కోసం నీకై తీసుకునే ఓకే ఒక్క నిర్ణయం ఒక తరాన్ని తీర్చిదిద్దేలా ఉండాలి..అలా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన జన్మకు అర్ధం పరమార్ధం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

248)జీవితంలో నీకు ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఎదో ఒక అద్భుతం ఎదురు చూస్తుందని అర్ధం..శక్తికి మించి అడ్డంకులు దాటాల్సి వస్తోంది అంటే నువ్వు మరింత బలవంతుడివి అవుతున్నావని అర్ధం.. ప్రతి ప్రయత్నం ఫలించాలి అనేది నీ ఆశ కావచ్చు కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ మొదలవుతుందో..సమయం,సందర్భం మంచి ముహూర్తాలు అక్కర్లేదు ఒక్క క్షణం చాలు నీ కలలు నిజమవ్వడానికి అందుకే ఊరికే ఉండిపోకు..ప్రతి క్షణం నీ లక్ష్యం కష్టపడు విజయం నీదే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

249)నీ జీవితంలో నలుగురు ఏమనుకుంటున్నారో నీకనవసరం..ఎదుటివాడి మాటలు పట్టించుకుని బాధపడుతూ.సమయాన్ని వృధా చేసుకోకు..నీకు తోచిన మంచేదో చేసేయ్..నువ్వేంటో నీకు తెలుసు ప్రతీది ఒకరి దగ్గర నిరూపించు కోవాల్సిన అవసరం లేదు..చెప్పేటోడు చేరదీస్తాడా...?అనేటోడు ఆదుకుంటాడా...? వినేటోడు విలువిస్తాడా?.సలహాలు మాత్రం వంద ఇస్తారు నీకు చేసోటోడు నీ స్నేహితుడి ఒక్కడే అలాంటి వారిని ఎప్పుడు దూరం చేసుకోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

250)ఒక లక్ష్యం పైన మనం దృష్టిపెట్టాలి,అది పొందాలన్న ఆలోచన కలగాలి దానికి ప్రేరణ తోడవ్వాలి ఆ ప్రేరాణే సాధించాలన్న దృఢసంకల్పంగా మారి పట్టుదల మొదలవుతుంది.అది ప్రణాళికారచనకు నాంది అవుతుంది.మొదటి అడుగు వేసేముందే గమ్యం ఎక్కడుందో, ఎంతదూరంలో ఉందో,అక్కడికి చేరుకునేందుకు కావాల్సిన ఉపకరణాలేమిటో అన్నీ సిద్ధపరచుకుని ప్రయాణానికి సన్నద్ధం కావడం గొప్ప  లక్షణం. 'అ ఆ' అన్న అక్షరాలు పక్క పక్కనే ఉన్నా,వాటి అర్థాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.'అ' అంటే అలసత్వం,'ఆ' అంటే ఆచరణ.అలసత్వం ఉన్నవాడికి ఆచరణ చాలా దూరంలో ఉన్నట్టుగా గోచరిస్తుంది. అడుగు వేసేవాడికి ఆవరణ నీడగానే ఉంటుంది.సాధనను మించిన ధనం లేదు. పట్టుదలను మించిన ప్రతిభ లేదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

251)జీవితం ఎవరికీ పూల బాట కాదు మనం సాగే దారిలో కొందరికి పూలు ఎక్కువ కనబడితే,కొందరికి ముళ్ళు ఎక్కువ ఎదురవుతాయి అది మనం ఎంచుకునే దారిని బట్టీ,మనం చేసే కష్టం విలువని బట్టీ ఉంటుంది.ఏది ఎమైనా, మన బాటలో ఒక్కొక్కసారి ముళ్ళు, ఒక్కొక్కసారి పువ్వులు దాటాల్సిందే.సమయం మారుతుందేమో కానీ జీవితంలో ఏదో సమయంలో కష్టాలు మాత్రం తప్పవు.ఆ కష్టాన్ని పంచుకునే వ్యక్తులు మన తోడు ఉంటే,మన బతుకు బండి ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా అధిగమించడం సులభతరం అవుతుంది.ఏది ఎమైనా, నీ కష్టం విలువ ఎప్పటికీ నీకె దక్కుతుంది. నీ శ్రమకు ప్రకృతి కూడా ఏదో రూపం లో నీకు తోడు ఉంటుంది.అది దైవ నిర్ణయం కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా కష్టపడడం మాత్రమే "కష్టే ఫలి:".....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

252)సీతాకోక చిలుకకు ఎగరడమెలాగో మనం నేర్పనక్కరలేదు.చేపకు ఈత నేర్పనక్కరలేదు.కోయిలకు పాడటంలో సూచనలు ఇవ్వనక్కరలేదు.ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునేబాధలేదు.అవి సహజంగా వాటికి అబ్బుతాయి.నేర్చుకోవడం మాత్రం మనిషే చెయ్యాలి..నిరంతరం ఎదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అలా కాకపోతే నువ్వు ఇప్పుడున్న ఆధునిక కాలంలో పోటీ పడలేవు..ఎవరైతే శ్రద్ధతో పట్టుదలతో నైపుణ్యం సంపాదించుకుంటారో అలాంటి వారిని ప్రపంచం ఎప్పుడోకప్పుడు గుర్తిస్తుంది..మనం ఏమి చేయకుండా సమయం లేదు అని సాకు చెప్తూ వుంటే త్వరలో నువ్వు కనుమరుగై పోవడం తధ్యం కాబట్టి నిత్యవిదార్థివై సాధించాలనే పట్టుదల,కృషి, నీ మీద నీకు నమ్మకం ఉంటే మీరు సాధించలేనిది ఏమి లేదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

253)అనాలోచిత ఆలోచనల్లో కూడుకున్న మనస్సు సంఘర్షణలకు నెలవై యుద్దబెరి చేస్తుంది.ఆలోచనాత్మక సందేశాల తలంపులు చెసే మన మేధస్సు వికృత ఆలోచనా చేష్టలతో పరాకాష్టకు చేరుతుంది!! పుర్రెకో బుద్ధి అన్నమాట నిజమే కదా!! ఎవరి మనసు బుద్ది ఎలా ఆలోచిస్తుందో ఊహించడం కూడా సాద్యపడక పోవచ్చు !! ఒక సవ్యమైన ఆలోచన మనిషిని నలుగురు ముందు మంచి వాడిని చేయగలదు!! అదే ఒక విషతుల్య ఆలోచన అదే మనిషిని నలుగురు ముందు చెడ్డవాడిగా నిలిబెడుతుంది కానీ ఇక్కడ కావలసింది మంచి-చెడు ఆలోచనల్ని విభేదించే చిన్న గీతను గుర్తించడం!!!కాబట్టి నీ ఆలోచనల్ని మంచి వైపు మల్లించు విజయాన్ని వరించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

254)ఆలోచనల కొసలు పట్టుకుని వెతుక్కుంటూ వెళితే మొక్క మొదలు అంకురంలో ఉన్నట్లు..ఆలోచనల మొదలు కుదురుమనసేగా అని తెలిసింది కాసేపు నా అనే భావన నుంచి దానిని తప్పించి చెప్పాలంటే ఒక సినిమాలా దానిని చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది..మన మనసేమిటో దాని చలనమేమిటో...దానిని మార్చాలో లేక మనం మారాలో..ఎందుకంటే కొన్ని సార్లు మనసు వద్దన్నా మనం ఆ పని కారణం ఏదైనా చేస్తాం నష్టపోతే మధనపడి పోతాం అలాగే మనసు కూడా మనం వద్దన్నా ఆకర్షణల మాయలో పడుతుంది మనలను అతలాకుతలం చేస్తుంది..విత్తనం ప్రకారమే చెట్టు అన్నట్లు కాబట్టి  లక్ష్యం దిశగా మనసు నడిస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది విజయం వరిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

255)చెట్టుని నరికినా అది తిరిగి చిగురిస్తుంది.చంద్రుడు  క్షీణించినా తిరిగి వృద్ధి చెందుతాడు. కష్టాలు వచ్చినా, అపజయాలు ఎదురైనా బాధపడకూడదు ఏందుకంటే "No pain no gain, No rain no grain - కష్టాలు లేకుండా ఫలితాలు రావు, వర్షాలు పడకుండా పంటలు పండవు "Every successful person has a painful story.Every painful story has a successful ending" బాధపడకుండా ఎవరూ విజయం సాధించలేరు. విజయం సాధించిన వారందరూ బాధపడినవారే అన్నమాట...కేవలం నోటిమాట కాదు, ఉన్నమాటే! విజయాన్ని తెలిపే ప్రతీ కథలోనూ అపజయాన్ని గురించిన కథ దాగి ఉంటుంది. చరిత్రను అధ్యయనం చేస్తే విజయాన్ని తెలిపే కథలన్నీ అపజయాన్ని కూడా తెలిపేవిగా ఉంటాయి. విజేతలందరూ అపజయాలను సోపానాలుగా చేసుకొని విజయభవనంలోకి ప్రవేశించినవారే అందుకే కష్టే ఫలి అన్నారు పెద్దలు.ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*

256)భాదలు దాటుకొని,భయాన్ని నెట్టుకొని,భాధ్యతను పెట్టుకొని,ప్రాణం పట్టుకొని,పట్టుదలగ పరిగెడుతూపో...పడి లేచే సంద్రపు అలలా ఎగసిపడి ఎగిరెగురుతుపో.ఓటమి విడచి..ధైర్యమె తలచి..గెలపనె శిఖరము నధిరోహించగ విమర్శ హేళన..కష్టం,కాలము.. కన్నీరా నీ కడ్డంకి..దేనినడ్డుగ యోచన చేయక జీవిత పయనం సాగిస్తూ..ముందడుగెయి నీకు విజయం తధ్యం!!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

257)మన బలహీనతలు మనం తెలుసుకొని వాటినే మనకుపయోగ పడేట్లు మార్చుకోగలిగితే మనంత దృఢ మనస్కులు వేరెవరూ ఉండరు...మనలోని లోపాలను మనం స్వీకరించి వాటితో సహా మనలను మనం ప్రేమించుకో గలిగితే మనంత అందమైనవారు వేరెవరూ ఉండరు.మన తప్పులను మనం గ్రహించి ప్రయత్నంతో వాటిని మనం సరిదిద్దుకోగలిగితే మనంత తెలివైనవారు వేరెవరూ ఉండరు!! బలహీనతలు, లోపాలు, తప్పులను తెలుసుకుంటూ జీవితాన ముందుకు సాగుతూ ఉంటే మనకు సాటిగా మనకు పోటీగా వేరెవరూ ఉండరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

258)మన జీవితంలో కొన్నిసార్లు మనం వీళ్ళు మాత్రమే మంచివాళ్ళు మిగిలినవాళ్ళు అవకాశ వాదులు అని ట్యాగ్ వేసేస్తాం.అవకాశం,అవసరం రానంతవరకు అందరు ఉత్తములే.ఎవరికి వారు ముఖానికి ముసుగు వేసుకొని మాట్లాడే వారే.పైకి పలికేది ఒకటి,అంతర్గత సంభాషన మరొకటి.ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెంత ఒకరు కూడా ఉండరు.సో,అవసరాలప్పుడే మనం గుర్తుకు వస్తున్నాం అని అనుకోకండి,ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని కలిపే దారం లాగా కనిపిస్తున్నాయి, అని సర్దుకు పోండి ఎందుకంటే...ఉరుకుల పరుగుల ఈ బిజీ లైఫ్లో ఎవ్వరిని నిందించటానికి కూడా లేదు......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

259)*జీవితంలో* మనతో *కలిసి* ఉండాలి అనుకునేవారు మనల్ని *అర్థం* చేసుకోవడానికి ప్రయత్నిస్తారు,అదే మనల్ని *వదలించుకోవాలి* అనుకునే వారు మనల్ని *బాధపెట్టి* దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఈ *ప్రపంచంలో* ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి *సమయం*,దాన్ని పదిలంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం *ఎన్ని కోట్లు పోసినా* తిరిగిరానిది , మనం తిరిగి *సంపాదించలేనిది* నేస్తమా !జీవితంలో *పోరాడి* గెలవలేని బలహీనులు *రాజీ* పడతారు , గెలుస్తామనే *నమ్మకం* ఉన్న బలవంతులు *యుద్దం* చేస్తారు , బ్రతకడం కోసం *రాజీపడడం* కంటే నీకు నచ్చేలా *బ్రతకడం* కోసం *యుద్దం* చేయడమే *ఉత్తమం* ....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

260)కర్మ చాలా బలీయమైనది. తెలిసి ముట్టుకున్నా,తెలియక ముట్టుకున్నా నిప్పు కాలినట్లు, కర్మ కూడా మనిషిని చుట్టుకుంటుంది. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే! అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డున పడేసి ఇష్టం వచ్చిన రీతిగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించి, గర్వంతో విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు ఎలాంటివో!!..కర్మ ఎంతో కాలం ఓపిక పట్టలేదు.. చేసిన కర్మలకు పాపం పండి ఆస్పత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు ఎవరూ కూడానూ పట్టించుకోకుండా జీవిచ్చవంలా పడి ఉన్నపుడు అర్థం అవుతుంది! అప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించినా దేవుడు కూడానూ కాపాడనికి రాలేడు! మీరు గమనిస్తే ఆస్పత్రిలో *ICU* అని వ్రాసి ఉంటారు అంటే దేవుడు చూసుకుంటాడని అర్ధం.కనుక కర్మ చేసేటపుడు విచక్షణతో చేయండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

260)మనిషి విజయానికి ప్రథమ శత్రువు అహంకారం. ఉన్నత శిఖరాల కూల్చివేతకు కారణం అహంభావం. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం అలవర్చుకోవాలి. వైఫల్యం ఇహాన్ని మరిపిస్తుంది. విజయం అహాన్ని కురిపిస్తుంది. వైఫల్యంలోను, విజయంలోను తటస్థంగా ఉండాలి. కాబట్టి అహంభావాన్ని త్యజించి విజయ లక్ష్యంతో ఏక దీక్ష, కఠోరశ్రమ, పట్టుదల, కార్యాచరణ అనే నాలుగు మూలస్తంభాల చుట్టూ తిరగాలి. అప్పుడే విజయాన్ని అందుకోవచ్చు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

261)విలువ లేని దుమ్ము కూడా,ఒక్కోసారి నీ కంట్లో పడి,నిన్ను విలవిలలాడేలా చేస్తుంది..! అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా,చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు,ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం...మన వ్యక్తిత్వం గురించి,ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే,వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం..అంతేకానీ మన వ్యక్తిత్వం చెడ్డది అవ్వదు,వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు కాబట్టి ఒకరి మెప్పు కోసం కాకుండా నీ కోసం నువ్వు బ్రతుకడం నేర్చుకున్న రోజే నువ్వు ఏదైనా సాధించగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

262)ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే...నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? నవ్వుతూ.నవ్విస్తూ బ్రతికేద్దాం...ఉన్నది ఒక్కటే జీవితం...!కాబట్టి సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారితరచూ నీ ఇంటి తలుపును తడుతూ తిష్ట వేసుకుని కూర్చుంటాయి.ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ ఉండు.నీ నవ్వుల శబ్దానికి భయపడి బాధలు నీ ఇంటి గేటును కూడా తాకకుండా పారిపోతాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

263)చెమట విలువ తెలుసుకుంటూ..త్యాగాలని తలుచుకుంటూ ఓటములని బాటలు గా మార్చుకుంటూ సాగించగా నీ పయనం శిఖరాలను తాకదా..అనుసరిస్తూ లోకం నిన్ను హర్షించదా.....చీకటినీ తరుము కుంటూ వెలుగన్నది రాదా..నిశి రాతిరి వెను వెంటనే మెరిసే వెన్నెలా రాదా..కలలను కన్నప్పుడే కునుకేరుగని ప్రయత్నం సాధ్యమౌను కదా...ఓటములను రుచి చూసిన విజయ వైభవంగా అనిపించదా......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

264)మన ఇష్టాలకు విలువ ఇవ్వని మనుషులు మన కష్టాలను గుర్తిస్తారా? మనం చేసిన మంచి మరిచి మన మనసుని గాయం చేసి నిందలు వేసిన వారు మనల్ని ఆదుకుంటారా? అవసరానికి వాడుకొనే మనుషులు మన మంచి తనం నిజాయితీనీ గౌరవిస్తారా??దీపం పెట్టి వెతికిన స్వచ్ఛ మైన మనసున్న వారు కనిపించట్లేదు.నిజాయితీ, మంచితనం ఉన్నవారు వాళ్ళ జీవితాలో ఏదో ఒక రూపంలో గాయపడ్డ వారే అధికం...అవసరం కోసం నటన, మోసం, కుట్ర, కపటం, కల్మషం ఉన్నవారు ఈకాలం లో కోదవేలేదు...కాబట్టి నిస్వార్ధంగా ఏది ఆశించకుండా నీ వంతు నీ స్థోమత స్థాయిని బట్టి సహాయం చేసి మర్చిపో...పైన దేవుడున్నాడు మిగతాదంతా ఆయన చూసుకుంటాడు.ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

265)మన పుట్టుకకి ఓ విలువ కావాలి.మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలి.మన బ్రతుక్కు ఒక చరిత్ర ఉండాలి.ఆ చరిత్ర చిరకాలం చిరస్మరణీయం కావాలి.ఇదంతా ఎలా జరుగుతుంది? నీవు అత్యున్నతమైన విజయం సాధించినపుడు, నీ జీవితానికి అర్థం తెలుసు కొన్నపుడు.ఈ గొప్ప విజయం ఎలా వస్తుంది? నీకొక గొప్ప లక్ష్యం ఉన్నపుడు దానికోసం, నీవు ప్రయత్నించి నపుడు.ఈ గొప్ప లక్ష్యం ఎలా పుడుతుంది? గొప్పగా మారాలని నువ్వు కోరుకున్నపుడు, ఆమార్పు దిశగా నిన్ను నువ్వు మలుచు కున్నపుడు.ఈ గొప్ప మార్పు ఎలా వస్తుంది ?ఎంతటి విజయమైనా సాధించగలనని నిన్ను నువ్వు నమ్మినపుడు.ఈ ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది? గొప్పవాళ్ళ అనుభవాలు తెలుసు కున్నపుడు వారు చెప్పినవి, రాసినవి నిజమని నమ్మినపుడు.ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘు*

266)తాళం తనను పగలకొట్టినా సరే ఊరుకుంటుంది కానీ, వేరే తాళంచెవితో తెరుచుకోదు. అలాగే, నీతిమంతుడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాడు కానీ, తన వ్యక్తిత్వాన్నిమాత్రం. మార్చుకోడు. ఒంటరిగా వస్తాం. ఒంటరిగా పోతాం. అది మారేది కాదు. అసలు ఆగేది కాదు. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. నలుగురికి సహాయపడు. ఒంటరితనాన్ని నవ్వుతో జయించు. నీకున్న కష్టాలని ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలో అయినా చెక్కుచెదరని స్థానం సంపాదించు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

267)ధైర్యశాలికి విజయం అందుబాటులోనే ఉంటుంది. స్థితప్రజ్ఞుడికి ఖ్యాతి చేతికే చిక్కుతుంది.సంస్కారశీలికి గౌరవం చెంతకే చేరుతుంది.మనం చేసిన మంచే పుణ్యంగా మనకి మన పిల్లలకి సంప్రాప్తమవుతుంది.మనకి అసలైన ఆనందాన్ని ఇచ్చేది సంతృప్తి. నిజమైన సుఖాన్ని ఇచ్చేది జ్ఞానం.జీవితాంతం శాంతినిచ్చేది మనం చేసే చిన్న సహాయం..మనం ఎన్ని కోల్పోతున్నా వీటిని మాత్రం కోల్పోకూడదు. అప్పుడు “ఏదో కోల్పోతున్నాం' అన్న దిగులే ఉండదు అలాగే అందనిదానికి ఆశపడకూడదు. నచ్చినదాని కోసం ఆరాటపడకూడదు. మనల్ని ఇష్టపడేవారిని వదులుకోకూడదు. ఎంతటి సమస్య ఎదురైనా కుంగిపోకూడదు ఎందుకంటే మన నిజాయతీయే మనకు రక్ష..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

268)పడిపోతున్న కొద్దీ ఎలా పోరాడాలో నేర్చుకోవడం..ఓడిపోతున్న కొద్దీ వ్యూహాలు ఎలా మార్చాలో తెలుసుకోవడం  వెన్నువెరిగే కష్టమొచ్చినా..నీ వాళ్ళ కోసం ఓక  వీరునిలా నిలబడడం జీవితంలో ఎంతో ముఖ్యం ఇవి నిజమైన నాయకత్వ లక్షణం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

269)జీవితంలో మనం ఏవేవో కలలు కంటాం ఏదో కోరుకుంటాం కాని ప్రయత్నించం,డబ్బు కావాలను కుంటాం, కాని శ్రమించం. పదవి కావాలనుకుంటాం కానీ అర్హతను పొందం. కీర్తి కావాలనుకుంటాం చేయాల్సిన మంచి మాత్రం చేయం..దైవానుగ్రహం కోరు కుంటాం కానీ చిత్తశుద్ధితో అర్చించం.ఫలితం కోరుకుంటాం కాని కర్మ చేయం..ఇలా అయితే మనం ఏమి సాధించలేము కాబట్టి గీతలో కృష్ణుడి చెప్పినట్టు 'కర్మ చెయ్యి, ఫలితం సంగతి దేవుడు చూసుకుంటాడు...అలా కాక నువ్వు ఏమి చేయకుండా ఉంటె నువ్వు ఇప్పడు ఎక్కడైతే ఉన్నవో అక్కడే ఉంటావుగాని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేవు కాబట్టి నీ కలలు సాకారం చేసుకోవడానికి కష్టపడు ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

270)మన జీవితంలో మనం ఎంత నమ్మితే అంత సులువుగా ఉంటుంది బంధమైనా బాధ్యతైనా..మనం ఎంత బరువనుకుంటే అంత భారంగా మారుతుంది ఏ పనైనా..నిన్ను నమ్మించి మోసంచేస్తే దాని నుంచి పాఠం నేర్చుకుని పక్కకు తోసెయ్..నీ చుట్టే తిరుగుతూ నిన్ను ముంచితే మళ్ళీ పైకెగసి పడు సముద్రపు కెరటంలా ఎందుకంటే నువ్వు ఎప్పుడు అలిసిపోని అలవని గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపో అప్పుడే నువ్వు ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయతీరాన్నీ చేరగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

271)మీ స్నేహితులు ఎవరన్నది చాలా ముఖ్యం.లక్ష్యాల గురించి మాట్లాడేవారితో, భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళిక ఉన్నవారితో, ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో నిజం చెప్పేవారితో, ఎల్లప్పుడూ మీకు అండగా నిలబడేవారితో స్నేహాన్ని పెంచుకోండి. ఇది మీ ఉన్నతికి దోహదపడుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

272)ఇక్కడ ఎవ్వరికోసం ఎవరు ఆగిపోరు..నువ్వుంటే నీతో నడుస్తారు లేకపోతే వేరొకరితో కలుస్తారు!! కాలం ఎలాగో మనిషి అలాగే!! ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన వరం మర్చిపోవడం.బెంగ,బాధ కొన్ని రోజులే!! రోజు మారితే రాటుదేలక తప్పదు గుండెను బండలా మార్చి బ్రతుకు చక్రం లాగక తప్పదు!! ఈ సత్యం తెలిసి కూడా అక్కడే ఆగిపోతానంటే కుదరదు!! నీ పాత్ర పూర్తయ్యేవరకు ముందడుగు వేయక తప్పదు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

273)ఇది మన జీవితం - మన యుద్ధం..మనమే ఓపిక కూడగట్టుకొని చెయ్యాలి..అంతా అయిపోయిందే అనికాకుండా అనుక్షణం నీ తుది శ్వాస ఆఖరిరక్తపు బొట్టు వరకు ఇంకొక్క అడుగు ముందుకు మనల్ని మనం నెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి..అలా చేసే ప్రక్రియలో అప్పటి వరకు మనతో ఉన్న వాళ్ళందరూ మనల్ని వదిలేయచ్చు..లేదా అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర కూడా పోషించచ్చు..కానీ రావాల్సిన సమయం లో ఆపద్బాంధవులు రానే వస్తారు..కాకపోతే మనం ఓటమి ఒప్పుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటేనే వస్తారు.. కాబట్టి నువ్వు నిర్విఘ్నంగా నీ ప్రయత్నాన్ని లక్ష్యం కోసం కొనసాగించు..విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

274)రేపటి గురించి ఆలోచించి ఆందోళన పడొద్దు. గతం, భవిష్యత్తు కాలాల సుడిగుండంలో చిక్కుకునే వాళ్లు ఎందరో ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఏ రోజు సమస్యలు ఆ రోజు ఉంటాయి. రేపటి బెంగలను ఈ రోజులోకి లాగితే ఫలితం.. ఆందోళన, అనవసరపు పరిణామాలు. గతం ఒక చరిత్ర. భవిష్యత్తు ఓ రహస్యం. ఏం జరుగుతుందో తెలియని రేపటి గురించి ఆలోచిస్తూ మన చేతుల్లో ఉన్న ఈ రోజును వృథా చేసుకోవద్ధు వర్తమానం దేవుడిచ్చిన బహుమతి. వర్తమానంలో జీవించాలి. కర్తవ్యాన్ని పాటించాలి. అలా జీవించగలిగితే గెలుపు మీదే!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

275)మనది అని రాసిపెట్టి లేకుంటే అది కంటికి ఎదురుగా చేతికి అందేటంత అందుబాటులో ఉన్నా చేజిక్కించుకో లేము!! మనకే చెందాలి అని రాసిపెట్టి ఉంటే,సప్త సముద్రాలు అవతల ఉన్నా,వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది!! అది వస్తువైనా, స్నేహమైన,బంధమైన!!ప్రాప్తం ఉండాలి, అదృష్టం తోడవ్వాలి, సంకల్ప బలం బలంగా ఉండాలి !! అప్పుడే ఏదైనా దైవానుగ్రహం తో మన వాకిలి ద్వారాలను దాటి, లోపలికి వస్తుంది!!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

276)నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే అది అద్దంలాగా మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది..నీటిలోచిన్న కదలిక ఉన్నా ప్రతిబింబం అస్తవ్యస్తమవుతుంది.అలాగే మన మనస్సు నిశ్చలంగా నిలకడగా ఉన్నప్పుడే స్పష్టమైన ఆలోచన చేయగలం స్పష్టమైన పరిష్కార మార్గన్ని వెతకగలం..అందుకే ఎన్ని సమస్యలొచ్చినా మన మనస్సును స్థిరంగా ఉంచుకోగలిగితే పరిష్కారం అదే చూపిస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

277)మాటలు, మనసుకి ప్రతిబింబాలు.మాటలను బట్టి ఒక మనిషి మనస్సును అంచనా వేయవచ్చు.మన మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడే మనం ఉన్నతమైన విషయాలను చర్చించడంలో ఆసక్తిని చూపగలం. లేదంటే అల్పమైన విషయాలను చర్చించడంలోనే ఆనందిస్తాం.ఉన్నతులు ఉత్తమ భావాలనూ, మధ్యములు వివిధ సంఘటనలనూ చర్చించగా, అధములు ఎప్పుడూ ఇతరుల గురించే చర్చిస్తారు”. మనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో పరిశీలన చేసుకొని, వీలైనంత వరకు ఉన్నతమైన స్థితికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

278)ఏ పని చేస్తూనప్పుడైనా స్వల్ప ఆటంకాలు సహజం.వాటిని పూర్తిగా నియంత్రించే సామర్ధ్యం లేకపోవచ్చు,కానీ వాటి గురుంచి ఆలోచించి ,ఎప్పటి కప్పుడు మెరుగు పరుచు కుంటూ ,లక్ష్యాలను విస్తరించు కుంటూ సాగినప్పుడే ప్రతికూలతలు తగ్గుతాయి.అలా ఎదురువచ్చే సమస్యను ఓ సవాలుగా అనుకుంటే మనం ఎదగడానికి సోపానం అవుతుంది.మనకెందుకు అనుకుంటే వెనకబడేలా చేస్తుంది..కాబట్టి నీ లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఛేదించుకుంటూపో నీకు విజయం తధ్యం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

279)దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు.అది చీకటిని ఎంతమేరకు తన వెలుగుతో దూరం చేసింది అనేది ముఖ్యం.అలాగే స్నేహితుడు డబ్బున్నవాడా పేదవాడా అన్నది ముఖ్యం కాదు..ఆపదలో ఉన్నపుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంతమేరకు ఉన్నాడనేది ముఖ్యం అలాగే నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే పది వేళ్ళ కంటే,నువ్వు కనీళ్ళుపెట్టినప్పుడు తుడిచే ఒక్క వేలు గొప్పది కాబట్టి నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అలాంటి బంధాన్ని  నేస్తాన్ని ఎప్పుడు వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

280)ఒకసారి 9 అంకె.. 8 అంకెను లాగి చెంపపై కొట్టింది. ఎందుకు కొట్టావని 8 అడగ్గా.. 'నువ్వు నా కంటే చిన్న.. అందుకే కొట్టా' అని 9 చెప్పింది. ఈ కారణాలతోనే 8 అంకె 7ని, 7 అంకె 6ని, 6 అంకె 5ని,5 అంకె 4ని, 4 అంకె 3ని, 3 అంకె 2ని, 2 అంకె 1ని కొట్టాయి.1 మాత్రం అలా చేయక ప్రేమతో తన కింద ఉన్న సున్నాను తన పక్కన చేర్చుకుని 10గా మారింది. ఇప్పుడు భయపడటం 9 వంతైంది.

*నీతి: జీవితంలో ఎవరో ఒకరు పక్కన ఉంటేనే విలువ ఉంటుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

281)స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమై ఆకారం పొందాలంటే..కాలక తప్పదు..కరగక తప్పదు..నలగక తప్పదు.దెబ్బలు తప్పవు..మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుకులు తప్పవు.. కాబట్టి కష్టం వచ్చిందని కృంగిపోకుండా దానిని ఎలా తట్టుకుని నిలబడాలో తెలుసుకుంటే నీకు ఎప్పుడు ఎదురుండదు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

282)కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది.అదే కోపం వెనకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది.అలా ఉండగలగడానికి మనకు కావలసిన రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వు, మౌనం.చిరునవ్వుతో చాల సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనం తో చాల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

283)జీవితంలో నీకు వచ్చిన సమస్య ఏదైనా కానీ నీ మనస్సుని విల్లు చేసి నీ ఆలోచనను బాణంగా మార్చి సమస్య పై విసిరితే అది రామబాణంలా దిగి సమస్యకు సమాధానం అవ్వాలే గాని వెనుతిరిగి రాకూడదు..కొన్ని సార్లు పరిష్కారం దొరకడం ఆలస్యమవుతుందేమో కానీ మనం గురిచూసి కొడితే ఏదైనా మన దరికి చేరాలసిందే విజయం వరించాలసిందే కాకపోతే దానికి కొంత ఓర్పు సహనం కావలసిందే..అది వచ్చేదాకా ఆగాలసిందే....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

284)నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే పది వేళ్ళ కంటే,నువ్వు కనీళ్ళుపెట్టినప్పుడు తుడిచే ఒక్క వేలు గొప్పది కాబట్టి నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అలాంటి బంధాన్ని నేస్తాన్ని ఎప్పుడు వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

285)మనలో చాలామంది కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నాకు అదృష్టం లేదు అని అనుకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే ఏమీ సాధించలేము.ఆగినచోటే ఉండిపోతే గెలుపు గమ్యాన్ని చేరలేము.కాబాట్టి మనం ముందు మనలో ఉన్న బలహీనతల్ని గెలిస్తే విజయం దానంతట అదే మనముందు వాలుతుంది.ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*

286)నీకున్న ఆవేశాన్ని ఆలోచనగా మార్చి....కాలాన్ని ఖర్చు చేసి..ఆశయాన్ని ఆయుధంగా చేర్చి.....ఆరాటాన్ని పోరాటంగా మలిచి.....తయారు చేసిన ఒక ఆకారమే గెలుపు.... ప్రతి ఒక్కరు చూడాల్సింది....జీవితంలో గెలుపు దాని తో నీ జీవితం తిరగాలి ఒక మలుపు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

287)మనం వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాం,పోయేటప్పుడు ఒంటరిగా పోతాం..మన చేతిలో ఏది ఉండదు..ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు... ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు..నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు...పోయేటప్పుడు ఒక్కగుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు..ఎందుకంటే మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది..ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

288)ఈ కష్టాలూ, సుఖాలూ అన్నీ మనం చేతగాక సృష్టించు కున్నవే. ఈ ప్రపంచంలో విధిరాత, అదృష్టమూ, కర్మ ఫలమూ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయో లేవో కానీ మన జీవితం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది.మనుషులు రెండు రకాలుగా బ్రతుకు తున్నారు.కొందరు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ...మరికొందరు భవిష్యత్తును నిర్మించ కుంటూ...భవిష్యత్తు కోసం అంటే రేపటికోసం ఎదురు చూసేవాళ్ళు జీవితం వాళ్ళకు ఏమిస్తే దాంతో తృప్తి పడతారు. కష్టాలనిచ్చినా, సుఖాలనిచ్చినా ఏమిచ్చినా దాంతోనే జీవిస్తారు మరి భవిష్యత్తును నిర్మించుకొనే వాళ్ళు వాళ్ళకేంకావాలో వాటినే సృష్టించుకొంటారు అది సంతోషమైనా, ఆనందమైనా...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘు*

289)విజయం ఎప్పుడూ తనంతట తానుగా రాదు..అయాచితంగా వచ్చేది విజయం కాదు.విజయం కావాలంటే అందుకు శ్రమ అనే పెట్టుబడి పెట్టాల్సిందే!విజేతలు ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురుచూడరు... అవకాశాలు సృష్టించుకుంటారు...! ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 'గెలుపు' తమ స్వంతం చేసుకుంటారు...! ఏ పనీ చేయ్యక పోయినా ఒక్కోసారి అదృష్టం కలిసివచ్చి గొప్పవాళ్ళయిపోవచ్చు..! ఆ అదృష్టం తిరగబడితే గొప్పవాళ్ళు కాస్తా సాదాసీదా వ్యక్తులుగా మిగిలిపోవచ్చు...! స్థిరత్వం లేని అదృష్టం శాశ్వతం కాదు.....! అందుకే-విజేతలెప్పుడూ అదృష్టం గురించి పగటికలలు కనరు..! కాబట్టి విజయాన్ని సాధించేవారు మిగతా వారికన్నా విభిన్నమైన పనులు చెయ్యరు.అందరూ చేసే పనులనే విభిన్నంగా చేస్తారు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

290)సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు..ప్రయత్నించి చుడు పోయే దేముంది..గెలిస్తే సంతోషంతో పాటు,నీకు ఒక లక్ష్యం ఏర్పడుతుంది.ఓడితే అనుభవంతో పాటు ఎలా గెలవాలన్న ఆలోచన నీలో పుడుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

291)గతం తలలోను, భవిష్యత్తు చేతుల్లోను ఉండాలి.గతం ఎప్పుడో వెళ్లిపోయింది. దాన్ని మనసులో, హృదయంలో మోస్తూ ఉండకూడదు..దాని ప్రభావానికి గురవ్వాల్సిన పనిలేదు.గతంలోనే బతకడం వల్ల కలిగే ఇబ్బందే మిటంటే- భవిష్యత్తును, యథార్థాలను గీతలు, మరకలు పడ్డ కళ్లద్దాలతో చూసినట్లు అవుతుంది.స్పష్టత లోపిస్తుంది. ఉన్నది ఉన్నట్లు చూసే అవకాశం ఉండదు.సమయం కోల్పోయిన తరువాత విలువ తెలుసుకోవడం కాదు..ఈ క్షణమే బంగారు క్షణం అని మనసులో నాటుకోవాలి. జీవితమంటే గతంలో జారిపోయిన అవకాశాలు కాదు... భవిష్యత్తులో సృష్టించుకోబోయే అద్భుతాలు. 'నా భవిష్యత్తు ఈ రోజే ప్రారంభమవుతుంది' అన్న విశ్వాసంతో కష్టపడి పని చేస్తే విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

292)ఎదుటి వారి మీద కూసింత నీ మీద కొండంత నమ్మకం ఉంచు....మనం ఒకనాడు వారికి సహాయం చేసామని వారు మన ఆపదలో మనకు సాయం చేస్తారనుకోకు...ఎదుటివారిని నమ్ముకున్నప్పుడు నీ సమస్యలు తీరుతాయో లేదో తెలీదు కానీ నీమీద నీవు నమ్మకం ఉంచుకుని ప్రయత్నం చేసి చూడు...ఒక్కసారే కాకపోయినా..ఒక్కొక్కటిగా నీ బాదలు తొలగి పోతాయి..బాదలు చుట్టిముట్టాయని ఎవరివైపు చేయూతకోసం చూడకు...వారి నిర్లక్ష్యం నిన్నింకా బాదపెట్టొచ్చు...ఈ ప్రపంచంలో ఒకరి బాదలను చూసి అయ్యో అనుకునే వారికంటే హేళన చేసే వారే ఎక్కువ...నీవిచ్చే వినోదం అందరికీ కావాలి...కానీ నీవు దుఃఖిస్తున్నపుడు నీతో నిలిచేది నీవు మాత్రమే...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

293)ఆచరణకు నోచుకోని కోటి మాటలకన్నా తక్షణం చెయ్యగలిగే చిన్న పని ఎంతో మిన్న!! కాబట్టి ఎవరైతే మాటలలో చెప్పక చేతల్లో చూపించాగాలరో వారి యొక్క జీవితంలో ముసురుకున్న చీకట్లను దూరం చేసే వెలుగురేఖగా మారగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

294)మంచితనం మన వెంట ఉంటే మనం ఎక్కడున్నా,ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా మనం ఉన్నా, లేకున్నా మన గురించి మంచిగా అనుకునేవారు ఒక్కరైనా ఉంటారు..అదే చెడు గురించి మాట్లాడుకోవడానికి వంద మంది ఉన్నా ఒక్కరు మన గురించి మంచిగా మాట్లాడుకునే వారే లేకపోతే ఆ జీవితమే వృథా..కాబట్టి వీలైతే నలుగురికి మంచి చేయండి అది మళ్ళీ తిరిగి నీకే వస్తుంది అదే కీడు చేయాలని చూస్తే రెట్టింపై వస్తుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

295)మన జీవితంలో లక్ష్యసాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నప్పుడు జయాపజయాలు ఎదురవుతాయి. ప్రయత్నలోపం లేనప్పుడు అపజయం కూడా విజయం అంత విలువైనదే. కొన్నిసార్లు ఓటమి గెలుపును మించిన గుర్తింపునిస్తుంది. ఓటమి మనమేమిటో మనం తెలుసుకునే ఏకాంతం వంటిది. మనలో అహాన్ని, అజ్ఞానాన్ని తొలగించే వేదాంతం వంటిది.అపజయాన్ని ధైర్యంగా స్వీకరించగలిగితే అది ఆత్మవిమర్శ చేసుకోవడానికి అంతర్ముఖుల్ని చేస్తుంది. 'గెలిస్తే ఏముంది? మహా అయితే నువ్వేమిటో ప్రపంచానికి తెలుస్తుంది.ఒక్కసారి ఓడిపోయి చూడు..ప్రపంచమేమిటో నీకు తెలుస్తుంది' అన్నాడో సినీ రచయిత.చాలామంది వైఫల్యాన్ని పరాభవంగాభావిస్తారు.అపజయం నమ్మకాన్ని రెట్టింపు చెయ్యాలి. ప్రయత్నాన్ని పదింతలు పెంచాలి కాబట్టి జయాపజయాలు పక్కన పెట్టి నీ ప్రయత్నలోపం లేకుండా కష్టపడి నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

296)జీవితంలో చాలా మంది ఓడిపోయిన ఎక్కువమంది చేసే తప్పిదం - గెలిచిన వారితో పోల్చుకోవడం.పోలిక అపజయానికి ఆయువుపట్టు.చాలామంది గెలుపును ఆస్వాదిస్తారు. కాని, ఓటమిని విశ్లేషించుకోరు. ఆత్మావలోకనం చేసుకున్నప్పుడే ఓటమి గెలుపులో మలుపులా కనిపిస్తుంది.తస్మాత్ జాగ్రత్త అని తనకు తాను చెప్పు కొంటూ పరాజయంలోనూ జయాన్ని మాత్రమే వెతుక్కునే వాడే విజేత.మనం చేసే పనిమీద మనకు ఎప్పుడైతే ఆత్మ విశ్వాసం తగ్గుతుందో అప్పుడే మన ఓటమికి పునాది పడుతుంది. 'జయాప జయాలు దైవాధీనాలు'- ఇది ఒకనాటి మాట. ఆ రెంటినీ తన అధీనంలోకి తెచ్చుకోగలవాడే సాధకుడు..ఇది నేటి మాట.ఓటమి వస్తే చేసే పనిని మధ్యలో వదిలెయ్యడం పిరికితనం.ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేసి అపజయం నుంచి (అప) 'అ'డ్డుపడే 'ప'నులను తొలగించి జయం వైపు అడుగులువెయ్యడం..విజయం...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

297)జీవితంలో మన అపజయానికి కారణాలను మనమే విశ్లేషించుకోవాలి. పోగొట్టుకున్నది మనకోసం ఏదో మూల ఉండే ఉంటుంది.దాన్ని శోధించి సాధించు కోవాలి.ఓటమి వస్తే యుద్ధం వేరొకరిపై చెయ్యడం ఎందుకు? నీలో దాగిన అరిషడ్వర్గాలే నీకు ప్రథమ శత్రువులు. వాటిని నీ అధీనంలోకి తెచ్చుకో.వాటిపై యుద్ధం మొదలు పెట్టు. ఓటమి ప్రసక్తే ఉండదు. నీ జయాపజయా లకు నువ్వే నాయకుడివి, నావికుడివి అయినప్పుడే విజయం నీ వెంట ఉంటుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

298)నీకు నువ్వుగా..గొప్పోడినని పక్కోడితో చెప్పుకోకు...చులకనైపోతావ్...అలా అని...నిన్ను నువ్వు గట్టోడివని అనుకోకపోతే....వెనుకబడిపోతావ్ కాబట్టి...చెప్పుకోవడం మీద కాకుండా..చేయటంమీద దృష్టిపెట్టు..!!అప్పుడు...పక్కోడే వాడంత వాడుగా....నిన్ను గట్టోడు అంటాడు.,ప్రపంచం దృష్టిలో...నిన్ను గొప్పోడిగా నిలబెడతాడు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

299)జీవితంలో నీకు ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురుచూస్తుంది అని అర్ధం.శక్తికి మించిన అడ్డంకులను దాటాల్సి వస్తుంది అంటే నువ్వు మరింత బలవంతుడివి అవుతావని అర్ధం. ప్రతీ ప్రయత్నం ఫలించాలి అనేది నీ ఆశ కావచ్చు కానీ ఫాలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుంచి మొదలవుతుంది.సమయం సందర్భం మంచి ముహుర్తాలు అక్కర్లేదు కావాల్సింది నీకు అనుకూలించే ఆ ఒక్క క్షణం నీ ఊహలు నిజం అవ్వడానికి అందుకే ఊరికే ఉండిపోకు ప్రతీ క్షణం స్పృహలో ఉండు కాబట్టి ఎట్టి పరిస్థితిలో నీ ప్రయత్నాన్ని ఆపకుండా లక్ష్యం కోసం ముందుకు తీసుకెళ్ళు నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

300)ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి.సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి.నీకు అవసరం ,పని ఉన్నప్పుడే కాకుండా పని కట్టుకుని మాట్లాడండి.పోయాక ప్రేమాభిమానాలు చూపకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి అప్పుడే బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

301)మనకోసం ఏడ్చేవారు ఉంటే అది మన అదృష్టంగా భావించాలి అదే మనల్ని చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని మంచితనం మనలో ఉందని సంతోషించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

302) ఒక ఒంటరి మనసు ప్రశాంతత కోరుకున్నప్పుడు తీసే ఊపిరిలో "ఉచ్చ్వాస నిచ్చ్వాసలు వినిపించడం"...అదే ప్రశాంతత దూరం అయినపుడు మనసారా ఏడిస్తే వచ్చే "కన్నీటి ధారలు కనిపించడం"..మనతో పాటు కొందరికే తెలుస్తుంది ! జీవితంలో అలాంటి వారు దొరకడం ఎంతో అదృష్టం !! అలాంటి వారి నీకు ఎదురైనప్పుడు వారిని ఎప్పుడు జీవితంలో వదులుకోకు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

303)మన జీవితంలో మనం ఏం చేసామో వెనకకు తిరిగి చూసుకోవాలి..అలాగే అనుభావాల్ని పొందాలి.దీని భావం తెలియాలంటే జీవితపు లోతుల్లోకి వెళ్ళాలి. అనుభవం అనేది ఒక్కసారిగా ఏర్పడేదికాదు.జీవితం గడిచేకొద్దీ కొద్దికొద్దిగా అనుభవం పెరుగుతుంది..వెనుదిరిగి చూసుకుంటే...అందులో మంచి-చెడు, కష్టం-సుఖం లాంటివన్నీ అనుభవానికి గుణపాఠాలుగా ఎన్నో విషయాలను చెబుతాయి.అందుకే ముందడుగు వేసే ప్రతిసారీ గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకోవాలి. అలా అయినప్పుడే గతం ఎలా ఉండేది, వాస్తవం ఎలా ఉంది, రెండింటికీ తేడా ఏమిటి, ఇకపై ఎలా ఉంటే బాగుంటుంది...అప్పుడే మనకు అనేక విషయాల మీద అవగాహన, స్పష్టత ఏర్పడి మన లక్ష్యాన్ని ఛేదించడంలో మనకు ఇవే తోడుగా నిలబడేవి కాబట్టి ఆత్మపరిశీలన చేసుకుంటూ,తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లినరోజే మన గెలుపు మొదలైనట్టు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

304)మనకి ధైర్యం ఉంటె ఒక్క నిమిషంలో మన జీవితాన్నీ ముగించుకోవచ్చేమో గాని అదే ఒక్క నిమిషం మనం ధైర్యం చేస్తే జీవితాన్ని గెలవచ్చు కాబట్టి మనం తీసుకునే నిర్ణయంబట్టే మన ముందున్న జీవితం ఆధారపడుతుంది అందుకే ఆచి తూచి అడుగు వేస్తే మనం అనుకున్నది సాధించగలం అలాగే వచ్చిన కష్టాల్ని రాబోయే సుఖాల్ని ఆహ్వానించడానికి  తయారుకావడమే జీవితమంటే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

305)జీవితంలో విజయాన్ని వరించాలంటే ఓపిక కావాలి...దానికి మంచి సమయం రావాలి..ఆకాశంలో ఉరుములు వచ్చినంత మాత్రాన పిడుగులు పడవు,మెరిసినంత చేతనే వర్షాలు పడవు దానికీ కూడా సహనం కావాలి అలాగే చరిత్ర చెప్పుకునే విజయం కోసం ప్రయత్నం చేయాలి దాని కోసం అచంచలమైన ఆత్మవిశ్వాసం,నమ్మకం,పట్టుదల,శ్రమ,కృషితో పాటు ఆగిపోనీ కావాలి అవి నీ చెంతన ఉన్నప్పుడు నువ్వు ఏది అనుకుంటే వారిని సాధించగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

306)గర్వం ఒక్కటి చాలు..సర్వం కోల్పోవడానికి..కోపం ఒక్కటి చాలు.. ఆప్తులను కోల్పోవడానికి..ధైర్యం ఒక్కటి చాలు..గెలిచి చూపించడానికి..చిరునవ్వు ఒక్కటి చాలు..ఎందరినో మిత్రులుగా చేసుకోడానికి..కాబట్టి ఎప్పుడూ నిండు మనస్సుతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు నీకు సద ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది..యదభావం తద్భవతి మనం ఎలా భావిస్తామో మనకు అలాగే జరుగుతుంది అందుకే ఎప్పుడూ మంచినే తలచు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

307)మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని అనుకునే వ్యక్తులు ఉండడం అదృష్టం.చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్ట లేవు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు కాబట్టి అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

308)నీకు నచ్చని చోట నువ్వు ఉండలేని చోట సర్దుకు పోవాలనుకువడం గొప్ప కాదు..నువ్వు ప్రశాంతంగా ఉండగలిగే చోటు వెతుక్కోవడం గొప్ప..ఎన్నేళ్లు భరిస్తావు ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటావ్ నీ మనస్సుకి ఎవరు ఏమనుకున్నా నీ సంతోషం నీకు ముఖ్యం అది నీ ఆరోగ్యానికి నీ కుటుంబానికి మంచిది..భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేతగానివాడిలా తీసిపారేస్తారిక్కడ ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో..ఆత్మస్తైర్యంతో ఉండు అప్పుడే దేనినైనా తట్టుగోలవు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

309)మన జీవనయానంలో ఎంతో మంది కలుస్తూ ఉంటారు. కొందరు తటస్థ పడతారు కొందరు స్థిరపడతారు. అభిమానంతో కొందరు, పరిచయాలతో కొందరు, చుట్టరికంతో మరికొందరు స్నేహితులుగా కొందరు మిగిలిపోతారు. చాలా కొద్దిమంది మన హృదయంలో చోటు సంపాదిస్తారు. వారే ఆత్మీయులు. అన్ని వేళలా మనకు దగ్గరగా ఉండేది వారే....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

310)జీవితంలో ఎవ్వరికి ఎవ్వరూ శాశ్వతం కాదు. ఆ విషయం అవగాహన ఎవరికి వారికే రావాలి. మంచితనం ముసుగులో బ్రతికేవారు ఎక్కువ. మాటల ఆర్భాటాలు మాత్రమే, క్రియ శూన్యం. అందరితో సమభవంగా మెలగడం మన ఉత్తమ లక్షణం ... ఔన్నత్యం..మనం మన పంథాలో సాగిపోవడం మన వ్యక్తిత్వం కాపాడుకోవడం అవుతుంది కాబట్టి ప్రశాంతంగా పలకరిస్తూ నిశ్శబ్దంగా మన ప్రయాణం చేయడం ఉత్తమం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

311)జీవితంలో ఓడిపోవడం,మోసపోవడం,చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏం ఉండవు..కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది..కొందరు ఓడిపోయి..ఎలా గెలవాలో నేర్చుకుంటారు...ఇంకొందరు మోసపోయి... ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు,మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడలో నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు..జీవితం అనేది ఒక పాఠశాల...ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది..*ఎందుకంటే నీ ఆలోచన విధానమే నీ జీవన నిర్మాణం!!*...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

312)అంటుకునే శక్తి అగ్గి పుల్లకు వున్నా,కానీ అది మండాలంటే ఒక చేయి వుండాలి,అమోఘమైన శక్తి మనిషికి వున్నా అది ప్రపంచానికి కనబడాలంటే,ఆ మనిషికి ఒక అవకాశం కావాలి.ఒక్కసారి వెలిగించే చేయి దొరికితే అగ్గి పుల్ల చీకటిని పారద్రోలి నట్లు అవకాశం దొరికితే మనలో నిగూఢమైన శక్తికూడా వెలుగులా అందరికీ గోచరిస్తుంది.అవకాశం తలుపు తట్టినపుడే మనం మెలకువతో వుండి..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటూ..మన అభివృద్ధికి మనమే బాటలు వేస్తూ..మనతో వున్నవారికి కూడ చేయూత నిచ్చి వారిని కూడా మనతో పాటూ ముందుకు తీసుకు వెళ్ళినప్పుడు...వారు కూడా వారి వంతు వచ్చినపుడు మనకి తోడ్పడతారు..అదే కదా సమాజ ధర్మం,కలసి బ్రతకడం,కలసి ముందుకు పోవడం..ఏందుకంటే కొందరు మనుష్యులు కలిస్తే సమాజం,కొన్ని ఆలోచనలు కలిస్తే ఒక కార్యం,కొన్ని కార్యాలు కలిస్తే ఒక అభివృద్ధి పథం,ఇలా వ్యక్తిగత నిబద్దతలు అన్ని ఐక్యమైన వేళ,మనకు,మన సమాజ పురోగతికి ఏదీ అవరోధం కాదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

313)జీవితంలో కష్టమొస్తే కృంగిపోకు..గుండె ధైర్యం కోల్పోకు.నిరాశను దరిచేరనీకు..నీ లక్ష్యం వదులుకోకు.బాధలన్నవి దాచుకోక..దించుకో ఎద బరువు ప్రశాంతంగా ఉంచుకో మనసు తరువు.నిరాశను దరిచేరనీయక ఆపుకో ఆలోచనల పరుగు అపుడే నీలోని భయాలు వదిలి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

314)రెక్కలు విరిగిన పక్షి ఎగరలేదు. అలా చూస్తూ దానిని వదిలివేస్తే ఏ కుక్కకో,పిల్లికో ఆహారంగా మారిపోతుంది. ఆ సమయంలో దానికి కావలసింది సానుభూతి కాదు. కాస్తంత సహాయం మాత్రమే.దానిని ఆ సమయంలో గమనించి ఆ రెక్కలు అతుక్కునేలా వైద్యం చేసి విశాల విశ్వంలో ఎగురు కుంటూపోయేలా చేయాలి మనిషన్నవాడు.ఈ సమాజంలో మన చుట్టుపట్ల ఉండేవారిలో అనేకమంది అటువంటివారు తారసపడు తుంటారు.అనుకోకుండా సమస్యల వలయంలో చిక్కుకు పోతారు.నిస్సహాయస్థితిలో భగవంతుడు ఏ రూపంలోనైనా వచ్చి సహాయ పడతాడేమోనని ఎదురు చూస్తూ ఉంటారు.ఆ సమయంలో మనం వారికి అందించిన చిన్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారితో బాటు వారి మీద ఆధారపడిన వారు కూడా మనం చేసిన పనితో బాగుపడతారు.మనం చేస్తున్నది చిన్న సహాయం మాత్రమేననీ, దానికి వారు వారి జీవితాంతం మనకు కృతజ్ఞతగా ఉండాలని ఆశించడం అవివేకమే అవుతుంది.వారి కళ్లలో ఆ క్షణంలో మెరిసిన ఆనందం చాలని భావించాలి..ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయమే కదా మానవత్వమంటే..అది నాకు ఉందని ఆశిస్తున్నాను..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

315)చీకటి లో ఉన్నానని చింత పడకు దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు.ఓటమి పొందానని కలత చెందకు ఓటమినే ఓడించి గెలిచే మర్గాన్ని వెతుకు.నమ్మకం నీ చేతిలో ఒక ఆయుథం ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

316)మన భావాలు మొక్కల్లాంటివి. మనం ఏ భావానికి చక్కగా నీళ్లు పోసి శ్రద్ధగా పెంచుతామో ఆ భావం చక్కగా అభివృద్ధి పొందుతుంది.నిర్లక్ష్యానికి నీళ్లు పోసి పెంచుతే జీవితమే నిర్లక్ష్యంగా మారి పతనం వైపు తీసుకు వెళుతుంది.దు:ఖానికి నీళ్లు పోసి పెంచుతే జీవితమే దుఃఖంగా మారి విషాదం వైపు తీసుకు వెళుతుంది.కోపావేశాలకు నీళ్లు పోసి పెంచుతే జీవితమే ఆవేశంగా మారి అశాంతి వైపు తీసుకు వెళుతుంది.శ్రద్ధకు నీళ్లు పోసి పెంచుతే జీవితమే శ్రద్ధగా మారి శాంతి వైపూ అభివృద్ధి వైపు తీసుకు వెళుతుంది కాబట్టి నీళ్లు పోసి మనసులో ఏ భావాన్ని వృద్ధి పరుస్తున్నామో గమనిస్తూ ప్రతీక్షణం జాగరూకతతో ఉన్నప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని సాధించగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

317)తొలి ప్రయత్నంలో గెలిచిన వాడిని అడిగితే, ఎలా గెలవాలో మాత్రమే చెప్తాడు.అదే ఓడి గెలిచిన వాడినడిగితే, ఓటమిని సైతం గెలుపుగా ఎలా మలచుకోవాలో చెప్తాడు.గెలుపంటే బొమ్మా బొరుసు వేసినప్పుడు టాస్ గెలవడం కాదు.టాస్ తరువాత ఆటలో పోరాడి గెలవడం.పడిన ప్రతి సారి లేచి నిలబడటం, లేని ఓపికను సైతం కూడదీసుకొని, తన పోరాటాన్ని పడిన చోట నుంచే మొదలు పెట్టడం. ఇదే గెలుపంటే...ఓడిపోయిన నాడు తలరాతని సరిపెట్టుకోకు,విజయం కోసం నువు చిందించిన చెమట సరిపోలేదని గమనించు.అదే నీ విజయం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

318)మనకి ఎప్పుడూ మంచి జరుగుతుందని అనుకోవడం మన నమ్మకం కానీ ఆ మంచి జరుగుతున్న టైం లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగి మనం చాలా ఇబ్బందికి గురవుతాము..అప్పుడే దేవుడు అయన రూపంలో మనకోసం ఒకరు ఉంటారు మనకి ధైర్యం చెప్పి కష్టాలు నుంచి గట్టు ఎక్కించడానికి అలాంటి వారిని జీవితంలో వదులుకోవద్దు అలాగే మనం ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో  అప్పుడు మనతో మంచి కూడా పయనం చేస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

319)నవ్వుతూ ఉన్నవాడు, నాలుగు రకాలుగా మాట్లాడతాడు.బాధతో ఉన్నవాడు, భావంతో మాట్లాడతాడు.ప్రేమతో ఉన్నవాడు, చనువుతో మాట్లాడతాడు.కోపంతో ఉన్నవాడు, కేకలు వేసి మాట్లాడతాడు.మంచివాడు, మార్పుకోసం మాట్లాడతాడు.అసూయతో ఉన్నవాడు, చులకనగా మాట్లాడతాడు.కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ' ఆలోచించి మాట్లాడతాడు.నిజానికి మాట మనిషిని మారుస్తుంది.మౌనం మన మనస్సుని మారుస్తుంది.కాబట్టి మాటను ఎంత పొదుపుగా సొంపుగా వాడితే అంతా మంచే జరుగుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

320)గౌరవం లేని పలకరింపు..మర్యాద ఇవ్వని మాట..మనశ్శాంతి లేని సంపద..ఆరోగ్యం లేని ఆయుష్షు నిరుపయోగం...అర్థం చేసుకోలేని బంధం..అలాగే మన అవసరానికి కానరాని స్నేహం కూడా ఉన్నా.. లేకున్నా.. ఒకటే..!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

321)మన జీవిత యుద్దం లో గెలవటానికి ప్రతి ఒక్కరికి  రెండు బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఒకటి చిరునవ్వు, రెండవది మౌనం. ఈ రెండు ఆయుధాలతో ఎంత పెద్ద సమస్యల నుండి అయిన తప్పించుకోవచ్చు.జీవితం లో వచ్చే ఎన్నో సమస్యలకు రెండే కారణాలు. ఒకటి అనాలోచితంగా పని చేయటం, రెండవది పని చేయకుండా ఆలోచించటం.ఈ రెండింటినీ తగినట్టుగా ఆచరణలో పెడితే ఏ సమస్యా ఉండదు. సాటి వారికి మన కష్టాలను తెలపకండి ఏందుకంటే మన సమస్యలను తెలిపితే పైకి సానుభూతి చూపిస్తూ లోన ఆనంద పడతారు అందుకే సమస్య ఏది వచ్చిన భగవంతునితో నివేదించి, సమస్య నాది కాదు అని వ్యవహరిస్తే సర్వం తానై నిలుస్తాడు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

322)జీవితంలో అహంభావం మనిషి పతనానికి..తొలిమెట్టు.....నాకేంటి అని..విర్రవీగితే..చివరికి..నువ్వేంటిఅనేలా అవుతుంది నీ పరిస్థితి..ఏదీ శాశ్వతం కాదు..నీ అందం...నీ డబ్బు..నీ పరపతి..వీటినిచూసుకుని...రెచ్చిపోతే..ఇవి కోల్పోయిన నాడు...అవుతావు..ఒంటరి...ఆత్మాభిమానానికి...అహంభావానికి...అడ్డు ఓ సన్నని..గీత మాత్రమే...అది తెలుసుకుని...నడుచుకుంటే....నీ జీవితం రాచబాట..లేకపోతే ముళ్లబాట..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

323)ఒక మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోవటం ఒక ఎతె్తైతే, ఆ స్నేహాన్ని నిలుపుకోవటం దానిని మించినది.స్నేహాన్ని వంచనా స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటం ప్రారంభిస్తే అక్కడితో ఆ స్నేహమే అంతరిస్తుంది. కాబట్టి స్నేహనికియోక్క విలువ తెలుసుకొనిమసలడం ఎంతో అవసరం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

324)జీవితంలో కొన్నిసార్లు మనం ఓడిపోయినప్పుడు ప్రయత్నం చెయ్యడం ఆపేస్తాము..ప్రయత్నిస్తే కదా ఫలితం వచ్చేది.యుద్దమే ప్రారంభించకుండా శత్రువు చంపేస్తాడేమో అని సందేహించి అస్త్ర సన్యాసం చేస్తే విజయం ఎందుకు సిద్ధిస్తుంది?ప్రయత్నించు..పోతే పోనీ ప్రాణం.సందేహంతో ప్రాణం పోయేకంటే యుద్ధంలో పోతే వీరస్వర్గం ప్రాప్తిస్తుంది..ప్రయత్నం చేశావన్న పేరుంటుంది.ఎదిరించి నిలబడితే శత్రువు కూడా తడబడతాడు. ఎందుకంటే వాడు నీలాంటి వాడే..అన్ని అందరికీ సమానమే పుట్టి పెరిగిన వాతావరణం బట్టి ఒక్కొక్కరికి ఒక్కో గుణం ప్రకాశిస్తుంది.కనుక విరమించకుండా ప్రయత్నం చేయి ఫలితం అదే వస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

325)ప్రయత్నిస్తే కదా ఫలితం వచ్చేది.యుద్దమే ప్రారంభించకుండా శత్రువు చంపేస్తాడేమో అని సందేహించి అస్త్ర సన్యాసం చేస్తే విజయం ఎందుకు సిద్ధిస్తుంది?ప్రయత్నించు పోతే పోనీ ప్రాణం.సందేహంతో ప్రాణం పోయేకంటే యుద్ధంలో పోతే పీకులాట ఉండదు. ప్రయత్నం చేశావన్న పేరుంటుంది. విజయం కూడా దక్కొచ్చు. ఎదిరించి నిలబడితే శత్రువు కూడా తడబడతాడు. ఎందుకంటే వాడు నీలాంటి వాడే..అన్ని అందరికీ సమానమే పుట్టి పెరిగిన వాతావరణం బట్టి ఒక్కొక్కరికి ఒక్కో గుణం ప్రకాశిస్తుంది.కనుక ప్రయత్నం చెయ్ ఫలితం అదే వస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

326)మనం బాధ పడితే ఓదార్చే వాళ్ళు కొందరు,మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురు చూసే వాళ్ళు మరి కొందరు..మనతో ఏ బంధంలేక పోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు...అలాంటివారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకో కూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

327)జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు నేస్తమై చెంత చేర్చేది స్నేహం..బాధలో ఉన్నప్పుడు భుజాన్ని తట్టి ఆసరా ఇచ్చేది స్నేహం..అలాగే ఆనందంలో ఉన్నప్పుడు ఆడిపాడాలి..ఏడిస్తే ఓదార్పవాలి..నవ్వితే ఆ కారణమవ్వాలి..ఏ నాడు వదిలి వెళ్లక ప్రతీ కష్టంలో తోడుండాలి..ఎన్ని సార్లు విడిపోయినా మళ్ళీ మళ్ళీ కలిసుండాలి..అలాగే కలిసిన మాట్లాడిన ప్రతీ సారి ఆరోగ్యం ఎలా ఉంది తిన్నావా అని అడిగే వ్యక్తిని ఎప్పుడూ నీ జీవితంలో వదిలిపెట్టకు అదే కదా స్నేహమంటే.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

328)జీవితంలో మనం చేసే ఏ ప్రతి పని పొట్టకూటి కోసమే....పనిలో చిన్న, పెద్ద పనులు అంటూ తేడాలుండవు...ఇష్టమైన పని, కష్టమైన పని అని మాత్రమే ఉంటాయి....ఏ పనైనా ఇష్టమైతే కష్టం అనిపించదు...కష్టమైతే ఇష్టం అనిపించదు...ఇష్టంగా చేద్దాం అనుకొంటే వంద మార్గాలు మనసే చూపెడుతుంది...కష్టంగా ఎగ్గొడదాం అనుకుంటే వెయ్యి సాకులు మనసే చూపెడుతుంది..అలాగే మనతో పాటు ఉండే వారికి వీలైతే పని చేసుకుని సంపాదించుకొవడానికి సరైన మార్గాన్ని చూపించాలి..అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక ఉంటారు..అలాంటి వారిని ఎప్పుడు వదులుకోకండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

329)దేవుడు నిన్ను ఓటమి అంచుకు నెట్టివేసినప్పుడు అతనిని పూర్తిగా నమ్మండి ఎందుకంటే అప్పుడే రెండు విషయాలు జరగవచ్చు ఒకటి మీరు పడిపోయినప్పుడు అతను పట్టుకుంటాడు లేదా ఆ స్థాయి నుంచి ఎలా ఎగరాలో నేర్పిస్తాడు దేవుడు ఎదో ఒక మనిషి రూపంలోనే ఆదుకోడానికి వస్తాడు అలా వచ్చే వ్యక్తిని ఎప్పుడు వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

330)మనల్ని ఏదో ఒకటి అనడానికి ఎవరోఒకరు ఉంటూనే ఉంటారు ! మనల్ని ఏదో ఒకటి చెయ్యాలని ఎవరోఒకరు చూస్తూనే ఉంటారు ! వాళ్ళ పని వాళ్ళని చెయ్యని , వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు ! నీ పని నువ్వు చేసుకుపో వాళ్ళకి అందనంత ఎత్తుకు ఎదిగిపో.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

331)విజయాలు పరాజయాలు మానవ జీవితంలోసహజం...పరాజయాలు ఎదురైతే ,నిస్పక్షపాతంగా విశ్లేషణ చేసుకో...కారణాలు గమనించి సరిదిద్దుకో ,తప్పు చేయడం తప్పు కాదు ,తప్పుని సరిదిద్దుకొక పోవడమే తప్పు..,ఆటంకాలని ఎదురుకోవడం నేర్చుకో ..మరింత ఉత్సాహంగా అడుగు ముందుకి వెళ్ళు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

332)మనుషుల మధ్య ఆత్మీయత,అనుబంధాలకు బంధువులే అయ్యుండక్కరలేదు, మనసుకు నచ్చిన వారందరు ఆత్మబంధువులే..అందరితో అన్ని చెప్పుకోలేం..పంచుకునే ప్రతి బాధ వెనకాలా...బలమైన బంధం ఉంటే తప్ప..!!అలాగే విలువైన వాళ్లతో కాదు విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

333)మనం జీవితంలో ఎన్ని సాధించినా.. మనం ఎక్కడినుంచి వచ్చాము అనేది మరచి పోకూడదో..అలానే మనతో ఎవరూతోడుగా ఉన్నారనేది కూడా మరచిపోకూడాదు.మన అనుకునే వాళ్లని దూరం పెట్టారంటే.. మీరు అన్ని ఉన్నా..సంతోషంగా ఉండలేరు. మీరు కష్టంలో ఉన్నా.. బాధలో ఉన్నా..మీకు సంతోషాన్ని అందించేవారికి ఎప్పుడూ దూరంగా ఉండకండి.మీకు ఆనందాన్ని ఇస్తూ..కష్టాల్లో కృంగిపోకుండా చూసేవారితో మీ జీవితం చాలా బాగుంటుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

334)జీవితంలో మనం చేసే ఏ ప్రతి పని పొట్టకూటి కోసమే....పనిలో చిన్న, పెద్ద పనులు అంటూ తేడాలుండవు...ఇష్టమైన పని, కష్టమైన పని అని మాత్రమే ఉంటాయి....ఏ పనైనా ఇష్టమైతే కష్టం అనిపించదు...కష్టమైతే ఇష్టం అనిపించదు...ఇష్టంగా చేద్దాం అనుకొంటే వంద మార్గాలు మనసే చూపెడుతుంది...కష్టంగా ఎగ్గొడదాం అనుకుంటే వెయ్యి సాకులు మనసే చూపెడుతుంది..అలాగే మనతో పాటు ఉండే వారికి వీలైతే పని చేసుకుని సంపాదించుకొవడానికి సరైన మార్గాన్ని చూపించాలి..అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక ఉంటారు..అలాంటి వారిని ఎప్పుడు వదులుకోకండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

335)ఎవ్వడైనా చేసే ప్రతి పని విజయం పొందాలనే చేస్తాడు...బాగా బ్రతకాలనే చూస్తాడు..వ్యాపారం చేసేవాడు లాభన్ని ఆశిస్తాడు  కానీ ప్రతిఫలం మాత్రం రాసిపెట్టి ఉన్నంతవరకే దక్కుతుంది.అలాగని మన ప్రయత్నం ఆపేస్తే మాత్రం అసలు మనం చేసే ఏ పనికీ  అర్ధం ఉండదు.నువ్వు చేయాల్సింది నువ్వు చేయి మిగతాది దైవేచ్ఛ..నేను ఎంత కష్టపడ్డా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటా వెందుకు? ఏమో నీ కోసం ఇంకా మంచి అవకాశం ఎదురుచూస్తుందేమో.. కాబట్టి ఓపిక కష్టపడే తత్త్వం ఉంటే ఎప్పటికైనా విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

336)ఒంటరి ప్రయాణం తో అలసి వెనకడుగేస్తే ఎలా! అలసి సొలసి వెనకకు వెళ్ళిన అలకూడ ఉవ్వెత్తున ఎగసి పడుతుందని గుర్తుంచుకో !! కష్టాలు కలవర పెడుతున్నాయని, విమర్శల వంటి రాళ్ళు పడి మనసు గాయపడుతోందని కృంగిపోతే ఎలా! కటినమైన రాయి కూడా అనేక గాయాలతోనే అపురూపమైన శిలగా మారుతుందని గుర్తుంచుకో!! గమ్యాన్ని చేరే నీ దారి అంధకారమని అధైర్యపడితే ఎలా! దీపానికి మాత్రమే చీకటిని జయించే గుణముందని గుర్తుంచుకో!! పరాజయం వెక్కిరిస్తోందని ప్రయాణమాపితే ఎలా! మాపటికి అస్తమించిన సూర్యుడు కూడా తిరిగి మెల్కోపుతాడని గుర్తుంచుకో!! ఒంటరిగా యుద్ధం చేయడం ఎంత కష్టమో..అందరికి తెలుసు..సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతే కష్టం దానికే యుద్ధాన్ని ఆపి సంగ్రామాన్ని వదిలి పారిపోతే ఎలా!! చివరగా, జీవితం అనే మహా యుద్ధాన్ని గెలవాలంటే...చివరివరకూ పట్టుదల అనే ఆయుధాన్ని విడవకూడదని గుర్తుంచుకో!! లే! లేచి పరిగెత్తు!!ఆయాసం వచ్చి ప్రయాస పడెవరకూ కాదు,ఆయువు ఆగి ప్రాణం పోయె వరకూ పరిగెత్తు..చమట చుక్క చిందేవరకూ కాదు,రక్తపు బొట్టు నేల జారేవరకూ.. విజయ తీరాలు చేరేవరకూ శ్రమించు..నీకు విజయం తధ్యం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

337)చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు..సలహాలు ఇచ్చే వారందరు సాయం చెయ్యరు..సలహాలు ఒకటి అడుగు వెయ్యి చెప్తారు "*ఉచితం*" కాబట్టి అదే ఓ పదివేలు అప్పు అడుగు అడ్రస్ ఉండరు అది డబ్బు కాబట్టి..ఇదే నేటి సమాజం.. ఎందుకంటే ఈ సమాజంలో ఉండేవారు ఎప్పుడు ఎదో ఒకటి అంటూనే ఉంటారు నీ వల్ల కాదు నువ్వు చెయ్యలేవు అని..కానీ వాటిని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవద్దు..నీ శక్తిని యుక్తిని నమ్ముకో..అలాగే సరికాని దారిలో పెద్ద గుంపుతో వెళ్లేకంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే పయనించు విజయాన్ని వరించు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

338)మన కష్టాలను చూసి,దూరంగా పోయేవాడు కాదు అసలైన మిత్రుడంటే,మన బాధలను చూసి,నేనున్నానంటూ దగ్గరికి వచ్చేవాడే నిజమైన మిత్రుడు. తాను కష్టాల సముద్రంలో మునుగుతున్నా తన వారిని సుబ్యాల తీరానికి చేర్చడానికి ప్రయత్నించే వాడే నిజమైన స్నేహితుడు.నవ్వు వెనుక బాధను మౌనం వెనుక మాటలను..కోపం వెనుక ప్రేమను అర్థం చేస్కొనే వాళ్ళే నిజమైన స్నేహితులు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

339)గొప్ప తనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన మాటల వల్ల కానీ చేతులవల్ల కానీ ఎవరిని బాధపెట్టకుండా బతకగలిగితే మనం గొప్పవాళ్ళమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

340)జయ,అపజయాలనేవి ప్రతి మనిషికి ఒక పరీక్షా లాంటిది.అపజయం అనేది నిన్ను పరీక్షా పెట్టటమే కానీ పాలించేది కాదు.అపజయం ఆనేది నీ సొత్తు కాదు ,నీలో సత్తా ఎంతో చూస్తుంది.జయం అపజయం ఎప్పుడు శాశ్వతం కాదు..కానీ ద్యాస శ్వాస లక్ష్యం వైపు ఉన్నప్పుడు విజయం నేది రాక మానదు కాబట్టి నువ్వు చేయాల్సింది మాత్రామే చేయి మిగతాది అంతా దైవేచ్ఛ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

341)పడిపోవడం తప్పు కాదు. నిలబడకుండా పడిపోయిన చోటే ఉండిపోవడం తప్పు.ఓడిపోవడం తప్పు కాదు. ఓటమి నుండి నేర్చుకుని మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం తప్పు.ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే భావం,విమర్శలను భరించే సహనం ఉండాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

342)మంచి స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి బాధపెట్టినా..నీ వెనుక నిన్ను గౌరవిస్తాడు..కానీ ఓ చెడు స్నేహితుడు..నీ ముందు ప్రేమగా నటిస్తాడు ఆ కపట ప్రేమలో స్వార్థాన్ని నింపి నిన్ను కోలుకోలేనంతగా నాశనం చేస్తాడు అలాంటి మంచి స్నేహితుల్ని సంపాదించుకో నీ కష్టాల్లో అండగా ఉంటారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

343)మౌనం వెనుక మాటనూ,అలక వెనుక ఉన్న ప్రేమనూ,నవ్వులో దాచిన బాధనూ అర్థం చేసుకోగలిగిన స్నేహితుడు ఒక్కడున్నా చాలు..మనల్ని మన లాగానే చూడాలి..మన మౌనం అర్థం చేసుకోవాలి...మన బాధ ని దూరం చేసేలా ఉండాలి...మనల్ని ఊహల్నించి వాస్తవంలో ఆలోచించగలిగేలా చేయాలి..నిజంగా అలాంటి స్నేహితులు అరుదు..కొందరికే లభ్యం...మనల్ని అవసరానికి వినియోగించుకుని మన అవసరానికి అడ్రస్ లేకుండా ఉండే వారు అవసరవాదులు తప్ప ఆప్త మిత్రులు కారు...అలాంటి వారు వెయ్యిమంది ఉన్నా నీకు అక్కరికి రారని గుర్తించి మెలుగు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

344)ఈ రోజు నిజాయితీ ఉన్నోడు ఓడిపోవచ్చు కానీ మానసికంగా వారిని ఎవ్వరు గెలవలేరు స్వచ్ఛమైన మనస్సుని అర్ధం చేసుకోలేకపోవచ్చు కానీ దాని పవిత్రతకు ఎవ్వరూ సాటిరాలేరు ధైర్యవంతుడు ఒక్కోసారి వెనకడుగు వేయచ్చు అయితే వాడు వేసే ముందడుగును ఎవ్వరూ తట్టుకోలేరు కష్టపడినవాడు ఆలస్యంగా వెలుగులోకి రావచ్చు కానీ వచ్చే ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు ముత్యం సముద్రంలో ఉన్నా ఖరీదైన షోరూంలో ఉన్నా దాని విలువ ఒక్కటే నువ్వు ఎక్కడున్నా నీలో నిజాయితీ ఉండాలి స్వచ్ఛత ఉండాలి ధైర్యం ఉండాలి ముత్యంలా నీ విలువ ఎప్పుడూ ఒకేలా ఉండాలి కాబట్టి ధైర్యంగా ముందడుగు వేసి గమ్యాన్ని చేరుకో నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

345)స్నేహమంటే ఆడుకోవడం,వాడుకోవడం కాదు..వదులుకోకుండా ఉండడం.స్నేహం విలువ తెలిసిన వారు ఎప్పటికీ దూరం చేసుకోరు తెలియని వారు..ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.స్నేహమంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు నీకు ఎన్ని కష్టాలు..వచ్చినా నీ వెనుక నేను ఉన్నాను అని భుజం తట్టి చెప్పడం అలాంటి వారు దొరొకడం చాలా అరుదు ఒకవేళ దొరికితే చిన్న చిన్న గొడవల కోసం వాళ్ళని వదులుకోకండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

346)అందరు అయ్యో అంటారు కానీ కొందరే చెయ్యందిస్తారు.అలాంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు.ఒకవేళ నువ్వు మర్చిపోతే నీకేం నష్టం కాదు.రేపు వేరొకడు ఆపదలో ఉన్నప్పుడు..ఆ సాయం చేసే చేతులు వెనకడుగు వేస్తాయి..నీలాగే వారు కూడా అవసరం తీరాక పట్టించుకోదేమో..అని అనుకుని..చెయ్యందించడం మానేస్తారు.నువ్వు చేసిన తప్పు నీతో పోదు ఆకలితో,అవసరంలో ఉన్న వేరొకడి మెడకు చుట్టుకుంటుంది కాబట్టి నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకూడదు ఎందుకంటే నమ్మకం అనే బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం నీ తోడు రాదు అందుకే సహాయం చేసినవారిని మర్చిపోకూడదు,నమ్మినవారిని వంచించకూడదు నువ్వు మోసం చేసినా కర్మ వాళ్ళని వదిలిపెట్టదు

347)ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషికి డబ్బు అవసరం, ఆ డబ్బు కోసం కొంతమంది  కష్టపడి పని చేయకుండా అమాయకులను వాళ్ళ స్వార్థం కోసం మోసం చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. మనిషికి మనిషి పై ఉండే నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి మోసాన్నే ఆయుధంగా చేసి డబ్బును సంపాదిస్తున్నారు.ప్రస్తుతం సరికొత్తగా స్నేహం అనే అస్త్రాన్ని నమ్మకమనే ధనుస్సుతో మానవత్వం అనే మనస్సును ముక్కలు చేస్తున్నారు ...మోసం చేసిన వాళ్ళు చాలా తెలివిగా మోసం చేశామని విర్రవీగుతారు కానీ దేవుడనేవాడు పైనుంచి అన్ని లెక్కలేసుకుని వాళ్ళని అంతకంతకు ఏడ్చేలా చేస్తారు ఇది తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

348)జీవితంలో ఏదైనా పని ప్రారంభించినప్పుడు చాలా మందికి ఉదయించే ప్రశ్న- చేపట్టే పని పూర్తి అవుతుందా లేక మధ్యలో ఏదైన ఆటంకాలు జరిగి, సమస్యలు ఎదురై అపకీర్తి పాలవుతామా అని. అర్థరహితమైన సందేహాలు క్షణక్షణం ఎదురై మనోబలాన్ని బలహీనపరుస్తాయి. కార్యనిర్వహణ పట్ల అవగాహనా లేమి, స్వశక్తిపై అపనమ్మకమే దీనికి కారణం. సంకల్పం బలంగా నిలిస్తే ఎలాంటి సందేహాలనైనా తరిమికొట్టవచ్చు. భయం, పిరికితనం ఎంతటి బలవంతుడినైనా పిరికివాడిగా మారుస్తాయి. అసాధారణ వ్యక్తి సైతం అతి సామాన్యుడిగా ప్రవర్తిస్తాడు. స్వశక్తిని మరచి బెంబేలుపడతాడు.అలాంటి తరుణంలో వెన్నుతట్టి నడిపించే అండ కావాలి.నేనున్నాననే తోడు లభించాలి అలాంటివారు నీ జీవితంలో తారసపడినప్పుడు ఎప్పటికి వారిని వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

349)జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే బలమైన పునాది అచంచల విశ్వాసం.అడుగడుగునా అడ్డుతగిలే అపనమ్మకమనే ముళ్లను, రాళ్లను దాటుకుంటూ ముందుకు సాగాలి. గాఢాంధకారంలోనూ నిర్భయంగా నడిపించే దివిటీ ఎలా మనల్ని నడిపిస్తుందో అలాగే మన నమ్మకం మనల్ని మన లక్ష్యం వైపు నడిపిస్తుంది.ఈ కార్యాన్ని నేను నెరవేర్చగలననే విశ్వాసం ఎవరినైనా విజేతగా నిలబెడుతుంది.ఆత్మవిశ్వాసం తోడుగా, తిరుగులేని సంకల్పం నీడగా ముందుకు సాగితే కఠినమైన యాత్ర సైతం కడు సులభంగా సాగి గమ్యాన్ని చేరుస్తుంది కాబట్టి నీపై నమ్మకం నిలిపి ముందుకు సాగు నీకు విజయం తధ్యం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

350)మన ఎదురుగానే మాట్లాడే వారు స్నేహితుడు. నలుగురిలో విమర్మించే వారు శత్రువు. మనం లేనప్పుడు మాట్లాడే వారు ద్రోహి.మీరు మీ జీవితంలో ఎవర్ని విమర్శించకండి...వీలైతే ప్రోత్సహించండి..లేదా మౌనంగా ఉండండి.అంతే కాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది.నేటి సమాజంలో  సాయం చేసే వారు తక్కువ. నీతులు  చెప్పేవారు ఎక్కువ. తనను తాను మలుచుకోలేని వారు కూడా ఇతరుల జీవితాల్లో  మలుపులు  తిప్పడంలో అనుభవజ్ఞులు అవుతున్నారు కాబట్టి అలాంటివారితో తస్మాత్ జాగ్రత్త.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

351)పాలల్లో చక్కెర వేసినా చెక్కరలో పాలు పోసినా కరిగేది చెక్కరే.!* *బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కొల్పోయేది మన జీవితమే. చెక్కర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా భాదపడుతూ ఉండకుండా, ఓ మంచిపాఠం నేర్చుకున్నామని ముందుకుసాగండి......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

352)జీవితంలో మాటనేది అగ్గిపుల్ల లాంటిది. దానితో దీపం వెలిగించు కోవచ్చు.దేన్నైనా తగల బెట్టవచ్చు.ఏ విధంగా చూసినా మన మాట చాలా శక్తిమంత మైనది.ఏది ఒకరికి మేలు చేస్తుందో అది మంచి మాట. ఏది ఒకరికి కీడు చేస్తుందో అది చెడ్డ మాట.వాడిన మాట, విసిరిన రాయి తిరిగి రావు.ఎవరితో మాట్లాడుతున్నాం,ఎందుకు మాట్లాడుతున్నాం అనే స్పృహ కచ్చితంగా ఉండాలి.మనకంటే చిన్న వాళ్ళతో మాట్లాడే సందర్భాల్లో మనకు తెలీకుండానే ఒక విధమైన అహం మనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని నియంత్రించుకుంటే మన మాటలు ఎదుటివారి మెడలో ముత్యాల మాలలవుతాయి కనుక మాటను వదలడంతో పాటు మాటను స్వీకరించడంలోనూ జాగ్రత్త వహించాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

353)ఒంటరిగా దిగులు బరువు మోయకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనే కదా గుండె బరువు తెలిసేది దు:ఖానికి తలవంచితే తెలివికి విలువేదీ అన్నారు పెద్దలు అలాగే  సమస్య వచ్చింది కదా అని దిగులు చెంది  సాధించే ప్రయత్నాన్ని ఎప్పటికి ఆపకు..నువ్వు ఏ రోజైతే ఆపుతావో ఆ రోజు నుంచే నీ పతనం ప్రారంభం కాబట్టి యత్నం ప్రయత్నం దైవ యత్నం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

354)సుఖాలు అనుభవించేటప్పుడు సమయం అసలు తెలియదు కానీ అదే కష్టాలు పడేటప్పుడు క్షణాలు యుగాలై వేధిస్తాయి.కష్టాలు బాధలు చుట్టుముట్టిన సమయంలో మనిషి వాటిని భరించాలి.ఓర్పు మనిషిని బ్రతికిస్తుంది.ధైర్యాన్ని కోల్పోక నిలదొక్కుకునే ప్రయత్నం కొనసాగించడమే విజయానికి పునాది అవుతుంది అది ఏలాగంటే విరిగిన భాగం అతుక్కొక మానదు కదా!! కాలమే గాయాల్ని మాన్పగలదు. మేఘాలు కదిలి సూర్యకాంతి పరుచుకోక తప్పదు. అంత వరకు ఓర్పుతో గడపటమే విజయానికి మార్గం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

355)జీవితంలో ఎప్పుడైతే నీవు ఇది "నేను చేయలేను" అని అనుకుంటావో నీ మెదడు పని చేయడం ఆపేస్తుంది.ఎప్పుడైతే నీవు "నేను ఇది ఎలా చేయగలను" అని ఆలొచిస్తావో అప్పుడే నీ  మెదడు చురుకుగా అన్వేషణ మొదలు పెడుతుంది.ఎప్పుడైతే "నేను ఇది చేసి తీరాలి " అని నిర్ణయించుకుంటావో అప్పుడు  ఇక నీ మెదడుకు వేరే ఆప్షన్ లేదు సాధించి తీరుతుంది...కాబట్టి ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంది,మనలోనే ఉంది.బలమూ బలహీనత రెండూ మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

356)జీవితంలో కలల గుడ్లు పెట్టి నిరాశను పొదిగితే విజయాలు వరిస్తాయా?ఊహల్లో విహరిస్తూ కాలాన్ని కరిగిస్తే ఆశలు నెరవేరుతాయా?ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసే వారి వెంట విజయం రాదు..నీ కల నెరవేరాలంటే నీ ఆశయం విజయ రూపం దాల్చాలంటే..నీకు నీవే ఒక ఆయుధం అవ్వాలి..నిన్ను నీవే నడిపించే దివిటీవి కావాలి.అవకాశాన్ని నీవే శోధించి ఒడిసి పట్టుకోవాలి..శ్రీ శ్రీ గారు చెప్పినట్టు..లే, లేచి నిలబడు, పరుగెత్తు పోరాడు.. సాధించు..ఇక్కడ నీవు గెలవాలంటే యుద్ధం నీవే చేయాలి..రాజు మంత్రి సైన్యం ఖడ్గం అన్నీ నీవే కావాలి...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

357)ఎంతో శక్తి కలిగిన సూర్యుడే గ్రహణ సమయంలో నిస్సహాయుడు అవుతాడు..అలాంటిది మన జీవితంలో కూడా గ్రహణం వంటి కష్టాలు రాగానే మన శక్తిని కోల్పోయినట్టు కాదు అర్థం.. సమయం సహనం కాలం అన్ని ఎదుర్కొవటమే జీవితం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

358)ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్థోమత నీకు లేకున్నా...ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నువ్వు దేవుడుగా మారగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

359)ఒకే జోక్ నాలుగు సార్లు చెబితే నవ్వురాదు..బోర్ కొడతది మరి ఒకే సమస్యను,ఒకే కష్టాన్ని పదే పదే గుర్తుచేసుకుని ఏడవడమెందుకు? సమస్య లేదా కష్టం కలిగినప్పుడు దాని మూలాలను అన్వేషించాలి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి..వీలైతే ఆ సమస్య నుండి ఒక పాఠంనేర్చుకోవాలి...ఆ కష్టాన్ని దూదిపింజలా మార్చాలి.ఎప్పుడయితే సమస్యను నీవు కొండంతగా ఊహించుకుంటావో, నీ కొండంత బలం గోరంతవుతుంది..ఎప్పుడయితే సమస్యను గోరంతదే అనుకుంటావో నీ గోరంత బలం కొండంతవుతుంది..ఇది నిజం...ఏదయినా మనం అనుకోవడంలోనే ఉంది కాబట్టి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది దానికి ఓర్పుతో నేర్పుతో వెతికితే నువ్వు సాధించాలనుకున్నా దానిని త్వరగా అందుకో గలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

360)నీవు ఎంత ఎత్తుకు ఎదిగావు అనేది కాదు ముఖ్యం....ఎవర్ని పునాదిగా చేసుకొని ఎదిగావు అనేది ముఖ్యం....నీ ఎదుగుదలకు కారణమైన నీ వాళ్ళని ఎంత సంతోషంగా చూసుకున్నావు అనేది ముఖ్యం వారి సంతోషమే నీ ఎదుగుదల అప్పుడే కదా నీ అసలైన వ్యక్తిత్వం బయటపడేది.. అలాగే నీ ఎదుగుదలకి కారణమైన వారిని ఎప్పటికి మర్చిపోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

361)ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే,అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే,అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందుకే ప్రేరణ పొందే ఏ సందర్భాన్నీ వదులుకోకూడదు. ఆ పని నా వల్ల ఎక్కడవుతుంది. వాళ్ల స్థాయి నాకెక్కడ ఉంది అంటూ ఎవరికి వారు తమను తక్కువగా భావించు కుంటే,తక్కువగా అంచనా వేసుకుంటే ఫలితమూ అలాగే వుంటుంది. ఈ విధమైన ఆత్మన్యూనతా భావం చాలా ప్రమాదం. దానిని వదిలించుకోకపోతే పురోగతి సంగతేమోగానీ తిరోగమనం వైపు నడిచినట్లే. అందుకే తక్షణమే ఆత్మన్యూనతా భావాన్ని వదిలించు కోవడానికి ప్రయత్నించాలి. ఓర్పూ, నేర్పూ, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

362)ఓపిక పట్టినంత కాలం మనం మంచివాళ్ళం...ఎప్పుడూ అయితే ఓపిక నశించి...పొరపాటున ఒక్క మాట అన్నామో...అంత వరకూ చేసింది అంతా వదిలేసి...ఒక శత్రువులా చూస్తారు...ఎవరో కాదు మనం ప్రేమించిన వాళ్ళే,మనల్నీ ప్రేమించిన వాళ్ళే..మన అనుకున్న వాళ్ళే.అందుకే కొన్ని సార్లు అహంకారం గర్వం, పొగరు చాలా ఖరీదైనవిగా మారుతాయి..వాటిని మది లోపలకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యకూడదు...అందుకే చవగ్గా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు,ఆప్యాయత, సర్దుకుపోవడం అనే వాటితోనే సరిపెట్టుకున్నవాడే జీవితంలో పైకి ఎదగగలడు అనుకున్నది సాధించగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

363)జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు ఏదైనా కొనవచ్చు కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి..సంతోషం,ఆరోగ్యం,స్నేహితులు,ప్రేమ,కాలం,నమ్మకం..వాటిని ఎపుడూ కోల్పోకండి..అలాగే కొన్నిసార్లు నీ కన్నీళ్లు తుడవడానికి, నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవరూ రారు.నీ కష్టకాలంలో నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన రోజున నువ్వు అనుకునే నీ వాళ్లంతా నీ నుంచి దూరంగా పారిపోతారు..ఆ చెడు కాలంలో దేవుడు *స్నేహితులు* అనే వాళ్ళని పంపుతారు..నీకు అలాంటి వారు దొరికినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

364)జీవితంలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే తెలుసా...ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనంగా ఉండి..మౌనంగా ఉండాల్సిన చోట మన నోటికి పని చెప్పి పది మందితో మాటలు పడతారు ఇది మనకు అవసరమా అని ఆలోచించారు..మహాభారతంలో కృష్ణుడు భగవద్గిత ఒక్క అర్జునిడికి మాత్రమే చెప్పాడు..అలాగే మనం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్న జ్ఞానాన్ని అర్హత ఉన్నవాళ్ళకి పంచాలి ఎందుకంటే మూర్కుడికి ఎన్ని సార్లు చెప్పినా వృధానే కాబట్టి మనం ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మౌనంగా ఉండాలి అని తెలుసుకుంటే మనం అడివిలోనైనా బ్రతికేయగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

365)స్నేహితులు మనం పెంచుకోవాలంటే పెరుగుతారా లేదా మనం అభిరుచులు నచ్చితేనే స్నేహితులం అవుతామా అంటే రెండోది కొంత వరకు నయం. మీరు వంద మందిని స్నేహితులుగా చేసుకోలేరు. ఒకరు లేరా ఇద్దరు బాగా మీ గురించి తెల్సిన వారు,మీ వ్యక్తిత్వం తెల్సినవారు, మిమ్మలని స్నేహితులుగా భావిస్తారు.అలా అని మీరు వారిని భావించాల్సిన పని లేదు. ఇది వైస్వర్సా. అందుకే అందరూ అందరికీ స్నేహితులు అవ్వలేరు.కొందరికే అనుకోకుండా ఆ కనెక్టివ్ బాండింగ్ఉం టుంది.స్నేహితులు, మరీ ముఖ్యంగా మంచి స్నేహితులు ఉండటం జీవితంలో అవసరం.అయితే పరిచయమున్న ప్రతివాడు స్నేహితుడు కాడు.అలాగే స్నేహితుడనుకున్న ప్రతివాడూ మంచి స్నేహితుడు కాడు. మరి గుర్తు పట్టేదెలా? మనకు కష్టమొస్తే అప్రయత్నంగానే బయటపడిపోతారు..కొన్ని సార్లు నీకు డబ్బుకానీ ఏ సహాయం చేయలేకపోవచ్చు కానీ నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి నీతో నిలబడేవాడు ఉంటే వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

No comments:

Post a Comment