అమ్మ <............>పెళ్ళామా "
అమ్మ అడుగులు నేర్పింది.ఎందుకో తెలుసా? నీ అడుగుల్లో నడవాలని,
అమ్మ గోరు ముద్దలు పెట్టింది ఎందుకో తెలుసా?నిన్ను గారాబంగా చూసుకోమని,
అమ్మ కొంగుతో మూతి తుడిచింది ఎందుకో తెలుసా?నీ భార్య కొంగు విడవకని,
అమ్మ ఒడిలో పడుకోపెట్టింది ఎందుకో తెలుసా ?నిన్ను కంట్లో పెట్టుకొని చూసుకోమని ,
అమ్మ నాకు జన్మ ఇచ్చింది ఎందుకో తెలుసా?నీకు తోడుగా ఉండమని ,
అమ్మ.నీను తప్పు చేస్తే దెబ్బలు వేసింది ఎందుకో తెలుసా ?
ఆ దెబ్బ కూడా నీకు పడకూడదని ,
అమ్మ నాకు జ్వరం వస్తే సేవ చేసింది ఎందుకో తెలుసా?అలంటి సేవ నీకు చేయమని,
అమ్మ అని మొదటి పదం నేర్పింది ఎందుకో తెలుసా?ఆ పదం నీకు ప్రసాదించమని,
అమ్మ నాకు తెలివి నేర్పింది ఎందుకో తెలుసా?నీ మీద తెలివిలేకుండా ముర్కకంగా ప్రవర్తించవద్దని ,
అమ్మ విద్య బుద్దులు సెప్పించింది ఎందుకో తెలుసా?నిన్ను బుద్దిగా,ముద్దుగా చూసుకోమని,
అమ్మ నన్ను పెద్దవాన్ని చేసింది ఎందుకో తెలుసా?నీకోసమేనని ,ఆ జీవితం నీకే అంకితమని
No comments:
Post a Comment