జీవితం అన్నది మూడక్షరాలే,కానీ ఏ బాషకీ అందని,ఏ భావంలోనూ ఇమడని మహత్తర శక్తి ఉంది దానిలో…
జీవితాన్ని క్షణికమని అనబోయేముందు ఈ సృష్టిలో శాశ్వతమైనదేదో చెప్పగలగాలి.
ఆశ మనిషికి నిజమైన ఊపిరి అందుకే జీవితం క్షణికమని తెలిసికూడా అదంటే ఏదో తెలియని మమతని పెంచుకుంటాడు మనిషి…
తామరాకు మీద నీటిబిందువు ముత్యంలా మెరుస్తుంది. అది శాశ్వతం కాదని తెలుసు.
అయినా దాని ముత్యపు మెరుపు చుసినపుడు ఎందుకు హృదయంలో స్పందన?
ఈ సాయంత్రం విరిసిన పువ్వు మరునాటికి వాడిపోతుందని తెలిసినా ఎందుకు ఆ మల్లెపై అంత మమకారం..
పసిపాప నవ్వులో ఎందుకు చూడగలుగుతాడు వెన్నెల వెలుగులు.. ఆశ గురించి ప్రశ్నించే వ్యక్తి నిరాశలో ఏమి చూసుకొని బ్రతుకుతాడు. మనిషి మనిషిగా బ్రతికేందుకు మంచి చెడుల్ని విడివిడిగా చూడగలిగే వివేకం కావాలి. విచక్షణ ఉండాలి. స్థూల దృష్టే కాదు,సూక్ష్మ దృష్టి ఉండాలి.
అసలు మనిషికి కావలసింది తనమీద తనకు నమ్మకం. మంచి చేస్తున్నానన్న అత్మవిశ్వాసం. దేన్నయినా ఎదురించి నిలబడగలిగే దైర్యం. అనుకున్న పనిని చివరకంటూ సాధించగలిగే పట్టుదల. ఇవన్నీ అశలకు అండ. అపుడు జీవితానికి సరైన అర్థం వుంటుంది. వ్యర్థజీవి అన్న పదం నిఘంటువులోనుండి తొలగించబడుతుంది.
జీవితమే ఒక కవితగా మరపురాని మమతగా మిగిలిపోతుంది.
No comments:
Post a Comment