Saturday, November 5, 2011

నీతి

పూచిన ప్రతి మల్లెపువ్వు వాడిపోక తప్పదు.. అరుదెంచిన యవ్వనం సడలిపోక తప్పదు..

ఉదయించిన భాస్కరుడు అస్తమించక మానడు.. పుట్టిన ప్రతివాడు మట్టికాక మానడు..

కానీ ! ఆ బ్రతికిన కొద్దికాలం మహనీయుడిగా మారలేకపోయినా..

నీతిగా బ్రతికితే చాలు.. మంచిగా జీవిస్తే మేలు.. మన మనుగడకది చాలు..

మన జీవిత ఘట్టాలు పదిమందికి పాఠాలై మిగిలితే చాలు..

లోకమనే చీకట్లో మన బ్రతుకొక చిరుదివ్వె అయి పరులకు వెలుగులందిస్తే సమాజానికి మేలు .

No comments:

Post a Comment