Saturday, July 19, 2025

జీవితం అంటేనే...అందమైన అనుభూతుల పుష్పగుచ్చం

జీవితం అంటేనే...అందమైన అనుభూతుల పుష్పగుచ్చం.ఆనందం, ఆశ్చర్యం, ఆశ, ప్రేమ అనే వాసనలతో నిండిన పూలబాకెట్..కాని చాలా సార్లు ఇది ఒక అనుకోని సంఘటనల సమాహారం కూడా అవుతుంది.మనం ఊహించని మలుపులు, ఎదురుచూచే కన్నీళ్లు,నిశ్శబ్దాల్లో ఒంటరితనాలు ఇవీ కూడా జీవితంలో భాగాలు.

ఒక గాయం మాత్రమే కాదు, దాన్ని మోయగల శక్తి కూడ మనలో ఉందని గుర్తు చేసే సాక్ష్యం.ఒక బాధ మాత్రమే కాదు, మన మనస్సు ఎంత లోతైనదో అర్థమయ్యే క్షణం.ఒక అలజడి మాత్రమే కాదు, అంతకన్నా లోతుగా మనశ్శాంతిని కోరే మన తత్వం.
ఒక ఆందోళన మాత్రమే కాదు, మనకు అవసరమైన ప్రశాంతతను వెతికే మన ఆత్మ...ఇలా...ఒక సంఘటన ఎదురయ్యాకే తెలుస్తుంది.ఈ జీవితంలో నీ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో,ఈ ప్రపంచంలో నీ స్థానం ఎంత ప్రత్యేకమైనదో.

ప్రతీ గాయం,ప్రతీ ఎదురుదెబ్బ మనని కొట్టివేయాలనే కాదు,అవి మనలోని లోతులను బయటకు తీస్తాయి.
మన పరిమితులు ఏవో, మన బలం ఎక్కడ ఉందో మనకు నేర్పిస్తాయి.ఇది మనం జీవితాన్ని ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే ఆధారపడుతుంది.

ఒక చెదురు కాగితంలా తేలిపోతూ ఉండే మన ఆత్మ...ఒక్క మాట, ఒక్క అర్ధం, ఒక్క ప్రేమతో అణచివేయబడుతుంది,లేదా గగనాన్ని తాకే రీతిలో లేచిపడుతుంది.ఇది గమనించే కన్ను ఉంటే, ప్రతి అనుభవం ఓ గురువు అవుతుంది.ఒక అర్ధరాత్రి కన్నీటిలో తడుస్తే, ఉదయం మృదువైన తేజస్వితను తీసుకురాగలదు.ఈ జీవితాన్ని గౌరవించాలి.
అది మన నుండి మనకు తిరిగి ఇచ్చుకునే 
బహుమతి అవుతుంది...కొందరు మన జీవితంలో ఎలా భాగం అవుతారో తెలీదు. ఇంకొందరు మన పరిస్థితిని అలా ఎలా అర్థం చేసుకోగలరో అస్సలు అంతుబట్టదు. అప్పుడే అనిపిస్తుంది మనుషులకు ఎంతదూరం ఉందాం అనుకున్న ఎవరో ఒకరు, సందర్భం వచ్చినప్పుడు, వారి మానవత్వపు సుగంధద్రవ్యం మనపై కురిపిస్తారు.అది ఒక మాటవ్వచ్చు. ఒక చూపవ్వచ్చు.ఒక్క చిన్న సందేశం గానీ, చేతి సాయం కాని సాహచర్యంగా తలుస్తుంది. మనం అడగకపోయినా,ఆకాంక్షించకపోయినా, అవసరమైన నిమిషంలో వాళ్ల మౌనం కూడా ఓ బలాన్నిస్తుంది. అప్పుడే తెలుస్తుంది ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా రాలేదు. అనుకోని తలుపు తెరిచి ఎవరో మన లోపలకి వచ్చి, మనకన్నా ముందే మనను తాము గుర్తించగలిగినప్పుడు, అదే ప్రేమ. అదే బంధం.జీవితంలోని గొప్ప అనుభవాలు, విలువైన గుర్తులు సజీవంగా మిగిలిపోవడం అలాంటి క్షణాలతోనే. మనకన్నా ముందే మన మనస్సు ఎవరో చదవగలిగితే, అదే దేవుడి దివ్య ఆశీర్వాదం లాంటిది.మనం ఒకరికి అవసరమవ్వడం,ఎవరో మనకోసం ఇలా అవసరమవ్వడం... ఈ రెండూ జీవితాన్ని తేలిక చేస్తాయి, బోధనగా మారతాయి, శాంతిగా మారతాయి.జీవితం అంటేనే అది కదా.
అనుకోని అనుభూతుల పరంపర.అనుభవాల లోతుల్లో మనల్ని మనమే పునఃపరిచయం చేసుకునే ప్రయాణం.మనమంతా జీవితంలో ఒకోసారి తిరుగులేని పేజీలమైతే,కానీ మన మాటలు ఎవరికో కొత్త అధ్యాయాలుగా మారుతాయి.రూమీ అన్నట్టు
You were born with wings, 
why prefer to crawl through life?
మన జీవితంలో అనుభవాలే రెక్కలుగా మారి, మనల్ని మేఘాల లోకి నడిపిస్తాయి. అవి సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా… ప్రతి క్షణమూ మనలో ఏదో మార్చేస్తుంది. అందుకే, జీవితాన్ని ప్రేమించాలి, దాన్ని ఎదుర్కొనాలి not just with courage, but with గ్రాతీతుడే too.

No comments:

Post a Comment