ఒక ఆడ – ఒక మగ స్నేహం గురించి మాట్లాడడం అంటే, సమాజం వెంటనే దాన్ని శరీర సంబంధంగా చూడాలనుకుంటుంది.కాని కొన్ని బంధాలు, కొన్ని పరిచయాలు,కొన్ని అనుబంధాలు – శరీరాన్ని తాకకుండానే మనసులను నిండి పోయే ప్రేమను పంచుతాయి.ఆ స్నేహనికి పునాది భరోసా, బాధ్యత, బాధల్ని వినగల గుండె, నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.ఇది రొజూ కనిపించే స్నేహం కాదు.అది ఓ అందమైన అనుభూతి.
ఒకరికి ఒకరు తాకాల్సిన అవసరం లేకుండా,
వారి మధ్య ఏమీ జరుగాల్సిన అవసరం లేకుండా,
మనసులో ఓ ప్రాముఖ్యతను పొందిన బంధం.కొందరితో మనం మాట్లాడకపోయినా, వారు మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటారు.
వారితో మాటలు లేకున్నా, మనం ఏదో ఓ విధంగా కనెక్ట్ అయిపోతాం.అది శరీరబంధం కాదు.
అది ఓ జీవబంధం.ఆ బంధాన్ని గుర్తించడం, గుర్తేరిగి మసులుకోవడం, ఇంగిత జ్ఞానంతో హుందాగ వ్యవహరించడం చాలా అవసరం.ఒకరికి ఒకరు శారీరకంగా దగ్గరవాల్సిన అవసరం లేకపోయినా, మనసుకు ఒకరికొకరు అవసరంగా మారిపోతారు, ఈ ప్రపంచంలో తమ జీవిత కాలంలో ఒకటో రెండో సార్లు మాత్రమే కలిసిన వారు సైతం కేవలం వారి భావాలను అక్షరాల రూపంలో లేఖల ద్వారా.. ఎన్నో ఊసులను టెలిఫోన్ లో మాటల ద్వారా పంచుకున్నారు... ఇప్పటికి పంచుకుంటూనే ఉన్నారు కూడా.. జీవితం నేర్పే గొప్ప పాఠాలలో ఇలాంటి కంపెనీయన్ మనకొక కాన్ఫెషన్ బాక్స్, ఒకరి శరీరానికి దగ్గరవ్వడం కాదు. జీవితం అంతా వాళ్లతో పాటు ఉండాలనిపించడమే అసలైన బంధం.ఈ విధమైన బంధాలు కొంతకాలం మన జీవితాల్లో ఉంటే చాలు. మనం మనమయ్యే మార్గాన్ని చూపుతాయి.మన జీవితానికి ప్రేరణ అవుతాయి.ఆత్మను తాకే ఆ అనుబంధాలు, ప్రతి రోజు మనలో కొత్త వెలుగు నింపుతాయి.వాళ్లు మన జీవితాల్లోకి ఎందుకు వచ్చారో మనకి అర్ధం కావొచ్చు కాకపోవచ్చు. కానీ వాళ్ల వల్ల మనం ఎలా మారామో చెప్పలేం.ఆ బంధానికి శబ్దం ఉండదు.కాని ప్రతి నిశ్శబ్దంలో వాళ్ల ఉనికిని మనం వినగలుగుతాం.
కొన్ని స్నేహాలు సెక్స్‌కి మించినవిగా ఉంటాయి.
వాటి వెనుక శరీరం లేదు – హృదయం ఉంది.
వాటి వెనుక స్వార్థం లేదు – శ్రద్ధ ఉంది.
వాటి వెనుక మాటలు ఉండకపోయినా – అంతరంగికత ఉంది.ఇది తెలియని వారికి అసాధ్యం అనిపించొచ్చు.కానీ తెలిసిన మనకు – ఇది ఓ పునీతమైన బంధం అనిపిస్తుంది.ఇలాంటి బంధాలు మనలో మంచితనాన్ని నమ్మే నమ్మకాన్ని బలంగా నిలబెడతాయి.ప్రేమ, బంధం, హృదయ సంబంధాలకు శరీరాన్ని అద్దంగా చూపే ఈ ప్రపంచంలో –
మనసుల బంధమే శాశ్వతం అనే నిజాన్ని గుర్తు చేస్తాయి.ఈ బంధాలకు పేరు అవసరం లేదు... కానీ వారి ప్రెసెన్స్ మాత్రం మనసులో ఎప్పటికి చెరిగిపోదు.
శరీరం తాకకుండానే, మనసులు ఒకదానితో ఒకటి కలిసి పోయిన చోటే ఈ బంధాల పుట్టుక.
ఈ బంధం లో వేదన ఉంది – కానీ భారం కాదు,మౌనం ఉంది – కానీ దూరం కాదు,ఆత్మీయత ఉంది – కానీ అవసరం కాదు.ఇది ఒకరికోసం ఒకరిగా పుసే సుగంధ అనుబంధం,ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఒకసారి వీచిన పరిమళం మరిచిపోలేనిది.
మన జీవితంలో అలాంటి ఒక్క బంధం ఉండడం చాలా అవసరం.జీవితాన్నే ఓ మధురమైన గాథలా భావించడానికి. ఎంతమంది వచ్చినా, ఎవరూ అర్థం కాకపోయినా – ఈ ఒక్క బంధం మన అంతరంగాన్ని అర్థం చేసుకుంటుంది.ఈ బంధాల మధ్య
ప్రేమకు అర్థం ఉంది,స్నేహానికి గంభీరత ఉంది,
సంభాషణలకంటే మౌనం ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి బంధాలు మన జీవితం లోకి రావడం,మన ఉనికిని మరింత మానవీయంగా, మరింత సంపూర్ణంగా మార్చడం…అదే జీవితం ఇచ్చే గొప్ప వరం.ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఇది స్నేహానికి ఉన్న పరమార్థం.ఇది జీవితంలో ఒక అందమైన వసంతం.
ఇది మనకి దేవుడు ఇచ్చిన ఓ అణగారిన ఆశీర్వాదం.
ఇలాంటి బంధాన్ని కలవడం అరుదు,దాన్ని అర్థం చేసుకోవడం మరింత అరుదు,కానీ దాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మన జీవితాన్ని మరింత అందంగా మార్చుతుంది..మన జీవితంలో ఒకరైన సరే – అలాంటి వ్యక్తి ఉండగలిగితే, మనం ఈ జీవితాన్ని మరోలా ప్రేమించగలుగుతాం....
No comments:
Post a Comment