Tuesday, May 3, 2016

చందమామ కథ
🍀
ఆరోజు వారి పెళ్ళిరోజు, నీలిమ భర్త సoతోష్ కోసం ఎదురుచూస్తూ వుంది. వారికి పెళ్లయి కొన్ని సoవత్సరాలు అయ్యింది. మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది. రాను రాను చిన్న చిన్న సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి. ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం లేదు, కాని ఇద్దరు ఒకే ఇంట్లోనే వుంటున్నారు.
నీలిమ ఆలోచన అoతా ఒకటే !
ఈరోజు తమ పెళ్ళిరోజు గుర్తున్నదా లేదా అని. అంతలొ కాలింగ్ బెల్ మోగింది. నీలిమ ఆనందంతొ తలుపు తెరిచింది. వర్షంలొ తడిసి వున్నాడు, చేతిలో పువ్వుల బోకే వుంది. ఇద్దరు గత స్మృతులలోకి వెళ్ళి మాట్లాడు కుంటున్నారు. అంతలో ఫొన్ రింగ్ వినపడింది. నీలిమ పక్క గదిలోకి వెళ్లి ఫోన్ తీసింది. అటువైపునుండి . . . ఇది సంతోష్ గుప్త గారి ఇల్లేనా? సారి మేడమ్ ఇక్కడ ఒక accident అయ్యింది. ఒకతను చనిపోయాడు, పర్సులో మీ భర్త గారి ఫొటో వుంది, మీరు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి.
నీలిమ ఒక్కసారి shock!!!!!!
అయిన వెంటనే తేరుకొని నా భర్త నా దగ్గరే వున్నాడు. అది ఎలా సాద్యం? లేదు మేడమ్ ఈరోజు 4. 30pm కి train accident జరిగింది , మీ భర్త పర్సు వుంది ఇక్కడ.
నీలిమ పరుగు పరుగున ఆ గదిలోకి వెల్లి చూస్తే సంతోష్ లేడు. నీలిమ ఒక్కసారి కూలబడింది. ఎవురు మరి? సంతోష్ ఆత్మ ? చివరగా నన్ను సంతోష పెట్టడానికి ఆత్మరూపంలో వచ్చాడా !!!! దేవుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు. నేను కూడ అతనితో పాటు చనిపోతే బాగుండు. మరో జన్మలోనైనా కలిసి వుండేవాళ్ళం. ఒకటే ఆవేదన !ఆవేదన .
ఇంతలొ బాత్రూమ్ తెరుచుకున్న సౌండు , ఎదురుగా సంతోష్.
సారీ నీలిమ నీకొక విషయం చెప్పడం మరిచాను. ఈరోజు station లో
నా పర్సు పోయింది అని ఇంకా ఏదో చెపుతున్నాడు. అవి ఏవీ నీలిమ చెవిని చేరడం లేదు ! అతనికోసo తన గుండె వేదన ! తనకున్న పట్టరాని సంతొషంతొ !!!!! ఒక్కసారి వెళ్ళి మనసారా హత్తుకుంది.
జీవితo అనేది ఇంకొక అవకాశం కోసం కాదు , అది వున్నప్పుడే మనం ఉపయోగిన్చుకోవాలి., ఆనందంగా వుండాలి
ఈజన్మలో .......
అది అమ్మ - -నాన్నలతో
అది మన జీవిత బాగస్వాములతో అది మన తోబుట్టులతో,....,
అది మన మిత్రులతో . . .
జీవితం ఆస్వాదించండి ! ఆనందంగా వుండండి . . .
💟 🍀 💟 🍀 💟 🍀 💟


No comments:

Post a Comment