డబ్బుతో మనుషులను గెలువచ్చేమో కాని .. మనసులను గెలువలేము ..
అమ్మ అని ప్రపంచం మొత్తం పిలిచే భాగ్యం తనకు మాత్రమె సొంతం ..
ఆ అమ్మ ఏవరో కాదు .. మన మదర్ థెరిస్సా అమ్మ ..
ప్రేమతోనే సమస్తం సాధ్యం అని నిరూపించిన .. మా మాతృమూర్తి ..
ఎప్పుడూ ప్రేమ మాటలే .. ఆ కళ్లలో కనిపించే దీన మనస్సు ..
తన వృత్తిని సైతం వదులుకొని..
ఎంతకు వర్ణించలేము ... నన్ను మార్చిన తన మాటలలో కొన్ని మీతో .
ఒకరోజు ... మురికి వీధి ఆనాథ పిల్లతో .. బిక్షనికి వెళ్లినపుడు ..
ఒక పెద్ద ధనికుడు దగ్గరకు వెళ్తే .. తూ అని ఉమ్మేశాడు ..
తన కొంగు చేతితో దాన్ని తుడుచుకుంటూ .. ఇది నాకు
మరి నా పిల్లలకు ... అంది .. అతను వేంటనే అమ్మ అని పిలిచి ..
సహాయం చేశాడట ... ప్రేమతో మనుషులు మారుతారు .. మనస్సులు మారుతాయి ..
తను చెప్పింది ఒక్కటే .. అన్నం లేకపోయినా అప్యాయత కరువవడం అసలైన పేదరికం ..
అమ్మ ప్రేమకు ... ఏమి చేయగలం అంటారా .. తను చూపిన ప్రేమను మన ఎదుటి వాళ్లకు చూపటమే ..
మన ఇంట్లోనే ఎవరి మనస్సులో ఎలాంటి బాధ ఉందో .. మీకు తెలుసా?
ఎందరో అభాగ్యులు .. వారి మనస్సు లోతుల్లొకి వేళ్లావా ..
గొప్ప గొప్ప పనులు . చేయనవసరం లేదు .. చిన్న చిన్న పనులనే గొప్ప ప్రేమతో చేస్తే చాలు ..
కడుపు నిండా అన్నం పెట్టకపోయినా ... గుండే నిండా ప్రేమ చూపితే చాలు ...
ఒక్కసారి .. తన దగ్గరకు వచ్చిన వారిలో ఒకరు .. అమ్మ ఇక్కడ ఉన్న అందరూ .. సంతోషంగా ఉన్నారు ..
నీ దగ్గరా ఏదైనా మంత్ర శక్తి ఉందా అంటే ...
అవును .. నా దగ్గర ప్రేమ అనే శక్తి ఉంది .. అని మెల్లగా సమాధానం ఇచ్చింది .. ఆ ప్రశాంతమైనా వేళ ఆ మాట చూట్టు కనిపించింది అని ఆ వ్యక్తి చెప్పాడు ..
మనం అనుకుంటాం కడుపు నిండా భోజనం పెడుతున్నాం .. కదా అని కాని కంటి నిండా కునుకు ఉందా అని చూస్తున్నామా ..
ప్రపంచానికి అమ్మ పుట్టిన రోజు .....
మనముందు నలిగిపోతున్నా .. చిన్నారులను .. అభాగ్యులను .. ఆదరిద్దాం ..
అమ్మ చేసిన వాటిలో కొన్నైనా మనం చెద్దాం ఆ ప్రేమ శక్తిని అందరికి పంచుదాం ...
అమ్మ ఐ లవ్ యూ .................................
No comments:
Post a Comment