నీలాల కళ్ళు... చిలిపి చూపుల బాణాలు సంధించి వేసావు యదకు సంకెళ్ళు...
ముత్యాల పళ్ళు... చిరు నవ్వుల జల్లులు కురిపించి ముత్యాలతో నింపావు దోసిళ్ళు...
కెంపుల ఒళ్ళు... చిన్నగా తాకితే చాలు సిగ్గుతో ఎరుపెక్కే నునులేత చెక్కిళ్ళు...
పగడాల అధరాలు... అదరహొ అనిపించే దరహాస కుసుమాల సుగంఘ మధురాలు...
బంగారు మేని ఛాయ... చూసి చూడగనే చేసావు నన్ను మాయ...
నుదుటిపై ఉదయించిన రవి సిందూరం... సిగలో వికసించిన ముద్ద మందారం...
వజ్రాల కర్ణాలు... అణువణువున నిండిన వైడూర్య వర్ణాలు...
అయ్యారే చెలి అందాల సిరుల సాటి... జగమున లేదోయి ఆమెకు మేటి...
ముద్దొచ్చే ముగ్ధ మనోహర రూపం... నయనాలయంలో సదా అపురూపం...
వెన్నెల వెలుగు విరజిమ్మే శశి ముఖి... నీ వన్నెల వగలు నావేలే ప్రియ సఖి
No comments:
Post a Comment