Sunday, February 13, 2011

ప్రేమికుల రోజు....!

ప్రేమకు సన్నిధి ఈ రోజు.. ప్రేమికుల పెన్నిధి ఈ రోజు...
ప్రేమ మహిమాన్మిత త్యాగానికర్ధం ఈ రోజు.. ప్రేమ పరమ పధానికి పరమార్ధం ఈ రోజు...

యుగ యుగాలుగా తర తరాలుగా తరగని చరగని ప్రేమ సుగంధపు పరిమళ మీ రోజు...
ప్రేమికుల రోజు.. ప్రేమకు పుట్టిన రోజు.. హృదయ లయలో ప్రియ రాగం పలికిన రోజు...

మనసున దాగి ఉన్న మాట.. తెలుపగా పెదవి దాటు చోట...
ఇరు హృదయాల మధ్య ఆట.. రెండు ఉదయాల మధ్య వేట...
మనసున ఊగిసలాడే పాట.. పాడాలి అలుపెరుగక ఈ పూట...

హృదయ ప్రేమ గీతం :

నాలోని ప్రేమని, నీతో తెలుపమని.. మనసే తొందర చేసెనే...
మదిలోని మాటని, పెదవే దాటమని.. హృదయం తొందర చేసెనే...

మనసు ఆపుకోలేక, పెదవి దాట లేక..
మదిన దాచుకోలేక, నీకు చెప్పలేక...
చెప్పుకుంటున్నా.. చెలియకు తెలియజేస్తున్నా...

I Love You.. I Love You.. I Love You.. I Love You... ! రెండు సార్లు !

ఊహలే గుస గుస లాడే.. ఊపిరే ఊగిసలాడే...
నీ ప్రేమ సరిగమలే హృదయం అణువణువు పాడెనే...

అడుగులే తడపడ సాగే.. పిలుపులే వినపడ కాగే...
నీ ప్రేమ మధురిమలే తనువంతా నిండి ఆడెనే...

ఏ మాయ చేసేవే, ఏ మంత్ర మేసావే...
ఏదేదో చేసేవే.. నా కొంప ముంచావే...

నిదురలో కలల లాహిరి, కలలలో స్వప్న సుందరి...
కల్పనలా మదిన దూరి, దోచావు మదిని దరి చేరి...

నా మదిని దోచావే, నీ మదిన దాచావే...
నన్ను నీలా మార్చావే, నిన్ను నాలో కూర్చావే...

నీ ప్రేమ వరమును కోరి, నడిచాను నీ అడుగుల దారి...
వలపు గుడిలో వెలసిన వయ్యారి, పిలుపు జడిలో తడిసిన సుకుమారి...
బిగి కౌగిలి వడిలో మరిగి, జిగి బిగి ప్రేమ బడిలో కరిగి...

భయము మరచి.. నన్ను వలచి...
ప్రణయ లోకం తలపు తెరచి.. ప్రణవ గీతం మదిన తలచి...
ప్రేమగా తెలుపనీయవే నీ ప్రేమని, నీ మనసు మాటున మధన పడే మాటని...

I Love You.. I Love You.. I Love You.. I Love You... ! రెండు సార్లు !



:
ప్రేమికులకు ముఖ్య గమనిక


ప్రేమ ఒక్కటే జీవితం కాదు, అలాగే ప్రేమించ లేని జీవితం ఎప్పటికి పరిపూర్ణం కాదు...
ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు...
జీవితాంతం.. అనంతం నీ తోడుగా నిలిచే బంధం, నీ నీడగా సాగే అనుబంధం ఈ ప్రేమ...
కుల, మత, జాతి, వర్ణ, ప్రాంతీయ భేదాలు.. విభేదాలు లేని ఒకే ఒక్క పదం ఈ ప్రేమ...
తల్లీ బిడ్డల తోలి స్పర్సలో వికసించే కుసుమం ఈ ప్రేమ...
భార్యా భర్తల తోలి అడుగులో చిగురించే మహా వృక్షం ఈ ప్రేమ...
ప్రేమించకుండా ప్రాణం ఉండలేదేమో, ప్రేమకు అందకుండా హృదయం స్పందించలేదేమో...
ప్రేమ విజయాన్ని కోరుకోనేదే కాని అపజయాన్ని కాదు...
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కాని ఆత్మ త్యాగాన్ని కాదు...
ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకోనేదే నిజమైన ప్రేమ...
నాది నిజమైన ప్రేమ... మరి మీది...?
పిల్లలకు, పెద్దలకు, నవ యువతకు, కురు వృద్ధులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు...!

No comments:

Post a Comment