ప్రతీ లోహానికి ఒక మెల్టింగ్ పాయింట్ ఉన్నట్టు..ప్రతీ మనిషికి ఒక పరీక్షా సమయం ఉంటుంది!పరీక్షా సమయం వస్తే కానీ,మనిషి సంగతి తెలియదు!మనిషి స్వభావం,పరీక్షా సమయంలో తెలుస్తుంది!పరీక్షలు అంటే,క్లాస్ రూమ్ పరీక్షలు కావు,జీవితంలో ఎదురయ్యే పరీక్షలు.జీవితంలో ఎదురయ్యేవి అంటే?సాటి మనుషులతో కలిసి మెలిసి వ్యవహారాలు నడపవలసి వచ్చినప్పుడు, కొన్ని విషయాల్లో,కొన్ని పరీక్షా సమయాలు మనిషికి ఎదురౌతాయి.మనకు కూడా ఎదురౌతాయి,మనం కూడా తేల్చుకోవలసి వస్తుంది.'అటా? ఇటా?' ఎటువైపు?మనకు కష్టాలు ఎదురౌతాయి,ఏవో పనులు పడతాయి,ఒక్కరమే చేసుకోలేని పెద్దపెద్ద పనులు ఉంటాయి.మనతో వీళ్లంతా ఉన్నారని మనం అనుకుంటాం కానీ, వాళ్లంతా మనవాళ్ళు కాదని,అందులో కొందరు మాత్రమే అని,ప్రతీ అనుభవం మనకు ఒక పాఠం చెప్తుంది.ఎవరు ఎటువంటి వారో,ప్రతీ అనుభవం బోధిస్తుంది!పరీక్షా సమయం వస్తే కానీ,మనిషి ఎటువైపో తెలియదు!ప్రతీ లోహానికి కరిగే దశ ఒకటి ఉన్నట్టు గానే,ప్రతీ మనిషికి పరీక్షా సమయం ఒకటి ఉంటుంది!పరీక్షా సమయంలో కానీ, మనిషి నైజం బయటకు రాదు.మనతో ఉన్నట్టు ఉంటారు,మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు,మనం కూడా వాళ్లను మనవాళ్లే అనుకుంటాం,మన చుట్టూ మనవాళ్ళు ఉన్నారని నమ్మకంతో ఉంటాం.మనకు కష్టాలు ఎదురైనప్పుడు,మనం నమ్మినవారు మనకు సపోర్ట్ గా నిలబడరు,డబ్బు సాయం కాదు సుమా,మాట సాయం, చెయ్యి సాయం చెయ్యకపోయిరి అని,మనకు దిగ్భ్రాంతి కలుగుతుంది.ఇంత నమ్మకం ఉన్న మనుషులు ఇట్లా వ్యవహరిస్తారా?ఏమీ చెయ్యకపోయినా సరే,మనతో ఉన్నారు అని మనకు ఒక భరోసా ఉండాలి.కొన్ని పనుల్లో, కొన్ని కష్టాల్లో,భరోసా ఉంటే సరిపోతుంది,ఏమీ ఇవ్వనక్కరలేదు,ఏమీ చెయ్యనక్కరలేదు.వెంట ఉంటే చాలు.మనుషుల మీద నమ్మకాలు వమ్మైన సందర్భాల్లో,చాలా సార్లు మనసులో మెదిలిన మాట , ' డోంట్ డిపెండ్,ఆన్ అదర్స్ ' అనే, చిన్నప్పుడు చదువుకున్న ఇంగ్లీష్ పాఠం.కొన్ని పాఠాలు చిన్నవే కాని,జీవితం పొడవునా బోధిస్తాయి!కొందరు కొన్ని పనుల్లో మనతో ఉన్నారు కదాని భరోసాతో ఉంటాం కానీ,వెనక్కి తిరిగి చూస్తే,వాళ్లు కనపడరు,ఏదో కారణం చెప్తారు.మరికొందరు వస్తామని మాట ఇచ్చి..సమయానికి తప్పుకుంటారు.ఏదో అత్యవసర పని పడ్డదని,రాలేకపోతున్నామని,సమయానికి చేతులు ఎత్తేస్తారు.వాళ్ల ప్రాధాన్యతలు మారుతాయి,మనం దాంట్లో ఉండం.ఇంత నమ్మిన మనిషి ఇలా చేసాడేమిటి అని, కాసేపు మనం దిక్కుతోచని స్థితిలో పడతాం,తరువాత మన బాధలేవో మనం పడతాం,ఆగదు కద!ఏ మనిషిని అయినా సరే,నడవడి మీదనే నమ్మాలి!మాట మీద నమ్మకూడదు,నడవడి మీదనే నమ్మాలినమ్మకం పెట్టుకున్న మనుషులు,వెనుక కనపడనప్పుడు,మాట ఇచ్చిన మనుషుల మాట తప్పినప్పుడు,మనసుకు బాధ కలిగినా,అప్పటికప్పుడు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలి.మనతో ఉన్నవారు అందరూ,మనవారు కాదని అనుకోవాలి!ఉన్న భరోసాను నిలబెట్టుకున్నవారు,ఇచ్చిన మాటను తప్పని వారు,రిస్క్ తీసుకోవలసిన అవసరం పడ్డప్పుడు,వెనక్కి తగ్గని వారు,తల తాకట్టు పెట్టైనా మనది మనకు ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో,వారు మాత్రమే మనవారు,అప్పుడు మాత్రమే మనవారు.మాటలు ఎన్నో చెప్తారు, మనతో పాటే వస్తుంటారు,మంచివాళ్లని మనం భ్రమపడతాం.కష్టకాలంలో కానీ,
భ్రమలు తొలగవు!మనిషి ఎటువంటి మనిషో,నడవడి మీద అర్థం అవుతుంది..మనవాళ్లు మనతో ఉన్నారని నమ్మకూడదు,వాళ్లు మాట ఇచ్చినా నమ్మకంతో ఉండకూడదు, మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి.నమ్మకంతో ఉన్న స్నేహితుల కంటే,డబ్బు తీసుకుని చేసే వారు నయం!ఇచ్చిన మాట తప్పారా?తీసుకున్న డబ్బు ఇవ్వలేదా?వస్తామని చెప్పి రాలేదా? వెనుక ఉన్నట్టుండి మాయమయ్యారా? వాళ్లు ఎంతటివారైనా,మనవాళ్ళు మాత్రం కాదు.నమ్మడానికి లేదు.వాళ్లు మనతో ఉంటే ఉండవచ్చు కానీ,మనం వాళ్ల మీద నమ్మకంతో ఉండకూడదు.నమ్మకం మీద ఉండకూడదు!ఆధారం మీద ఆధారపడాలి!..మనుషుల మీద నమ్మకాలతో సాగకూడదు,మనుషుల నడవడి మీద ఆధారపడి సాగాలి!రూపాయి దగ్గర మనిషి సంగతి బయట పడ్డట్టు,పరీక్షా సమయంలో మనవాళ్ల సంగతి తెలుస్తుంది!జీవన యానంలో మనకు ఎన్నో కష్టకాలాలు ఎదురౌతాయి.కష్టకాలాల్లో మనవాళ్ల నిజస్వరూప దర్శనం కలుగుతుంది!'ఓ! వీడు మనవాడు,వీడు కాదు' అనే లెక్కలు ఉండాలి.లెక్క ప్రకారం వెళ్లకపోతే,జీవితపు లెక్క తప్పుతుంది..మనవాళ్ళు ఎవరో,కాని వారు ఎవరో,మన కష్టకాలంలో అర్థం మవుతుంది!ఎక్కడో ఎవరిదో ఒక కొటేషన్ చదివిన జ్ఞాపకం ఉంది!'నీకు కష్టకాలం వచ్చిందా? నీ స్నేహితులెవరో తెలుస్తుంది' అని!మనతో ఉన్నవారందరూ మనవాళ్లు కాలేరు,పరీక్షల్లో నిలిచిన వారు మాత్రమే మనవాళ్లు..ఓ పరీక్షా సమయంలో నెగ్గిన వారు,మరో పరీక్షా సమయంలో నెగ్గక పోవచ్చు కష్టాలు ఎదురైనప్పుడల్లా,మనవాళ్లెవరో తెలుస్తుంది!ఏ విషయంలో ఏ మనిషిని నమ్మవచ్చు ?ఏ విషయంలో ఏ మనిషిని నమ్మకూడదు?మనం మందిని నమ్మడం కన్న..మనల్ని మనం నమ్మడం మిన్న!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
No comments:
Post a Comment