Tuesday, September 1, 2020

దానగుణం

 బిచ్చగాడు అడుక్కునేటప్పుడు 'దానం చెయ్యండి' అనేబదులు "ధర్మం చెయ్యండి" అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి.🙏


పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే: సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి.

మొదటి రెండు భాగాలు స్వంతానికి.

మూడోభాగం పన్నులు, తదితరాలు.

నాలుగో భాగం కళాకారులు ,గురువులు,పురోహితులు, సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి. ఇది మన కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరం.

వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించడం అంటారు.మన ధర్మం మనకి రక్ష. లేదంటే మన అహంకారానికి మనమే బలికాకతప్పదు


.దానగుణం🙏


ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. "నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా

వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.


అప్పుడు సముద్రం ఇలా అంది. "నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది" అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు" అని మన పెద్దలంటారు.🙏

No comments:

Post a Comment