Friday, August 17, 2012

లక్ష్యం

మనిషి సందర్భానుసారంగా తన ఆలోచనలను మారుస్తూ వుంటాడు. ఎన్ని ఆలోచనలు మారిన తను అనుకున్నది సాధించాలంటే అన్నింటికన్నా ముందు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోగలననే నమ్మకముండాలి. ఆ నమ్మకాన్ని నిజం చేసే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలకు సడలని ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రతతో మనం చేసే పని మీద దృష్టి నిలుస్తుంది. నువ్వు చేసే ఆ పనే నీ లక్ష్యాన్ని చేదించే ఆయుధమవుతుంది.నువ్వు చేయాల్సిన పేని ఏంటో నీకు మాత్రమే తెలుస్తుంది. పని మొదలపెట్టు, ఆ పనిమీదే నీ దృష్టి.ఆ దృష్టి ఏకాగ్రతగా మారుతుంది.ఆ ఏకాగ్రత నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకం నీ లక్ష్యాన్ని చేదిస్తుంది....ఇక మొదలుపెట్టు...లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టూ..

No comments:

Post a Comment