Saturday, July 7, 2012

నా మంచి మాటలు తరువాయి భాగం పార్ట్ -4

నా మంచి మాటలు తరువాయి భాగం పార్ట్ -4 (ఇది కేవలం ఆరంభం మాత్రమే !!!!)



1) సమర్ధుడికి ఎదురు లేదు – అసమర్ధుడికి ఎదుగు లేదు ! కాబట్టి మీరు సమర్ధుడిగా ఉంటారో అసమర్దుడిగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి ---- రఘు

2)డబ్బు ఎంత వున్నా సంపాదించలేని విలువలు కొన్ని వుంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవరించుకొంటే మనం ధన్యులం కాగలం . మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి.. ఎదుటివారికి సాయం చేయడం, ఎదుటి వారి కష్టాలు మన కష్టాలుగా తలిచి వారిని ఆదుకోవడంలో డబ్బుని ఖర్చుచేయగలిగితే అప్పుడే ఆ ధనానికి విలువ పెరుగుతుంది. ---- రఘు

3)మనిషిలోని ఆశకూడా మంచితనాన్ని పతనం చేస్తుంది. విఘాతాన్ని కల్గిస్తుంది.. కోర్కెలు తీరినా తీరకపోయినా ఆనందంగా వుండాలి. మంచి మార్గాలలో నడవాలి. మంచినే ఆచరించాలి. చేతితో మంచి పనులు చేయాలి. నోటితో మంచిమాటలు మాట్లాడాలి. వీటవలన ఆనందం కలుగుతుంది . . మంచి పలుకు- విను- చూడు ఇవే మంచి కార్యాలు. అవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు మంచితనం అదే మనకు ఆభరణంగా నిలుస్తుంది. మంచితనమే మంచి సంస్కారం అనిపించుకుంటుంది. ---- రఘు

4)దేవుడు ప్రతి మనిషికీ విత్తనాలు యిస్తాడు. అవి మరేవో కావు,మన ఆనందం, ఆహ్లాదం, సంతోషం వాటిల్లో వుంటాయి. ఆ విత్తనాలు సక్రమంగా మొలకెత్తేలా పంటలు పండి మనల్ని పరవశింపజేసేలా చేసుకోవడమన్నది మన చేతుల్లో వుంది. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే అవి మొలకెత్తవు. మనకు దుఃఖాన్ని మిగులుస్తాయి.కాబట్టి నువ్వు సంతోషంగా ఉండి ప్రక్కవాడ్ని కూడా సంతోషపెట్టు ---- రఘు

5)దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలయినంత తొందరగా బయటపడాలని తపిస్తాం. ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే వుండిపోవాలని ఆరాటపడతాం. బాధలోనైనా, సుఖంలోనైనా ఆరాటమన్నది మామూలే . అవి రెండూ మనమనుకున్నట్లు శాశ్వతం కావు. పాదరసంలా అవి మన పట్టునుండి జారిపోతాయి. మనల్ని మనం తెలుసుకోవాలంటే మన హద్దుల్ని దాటి మనల్ని మనం చూడగలగాలి..అలా చూసినప్పుడే మన మనస్సు స్వచ్ఛమయిన సరోవరంలా తళతళలాడుతుంది ---- రఘు

6)మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే అవతలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సుకత చూపకుండా,ప్రక్క వాళ్ళతో పోల్చుకోకుండా వుంటే తప్పనిసరిగా జీవితాంతం సంతోషంగా ఉండగలము ---- రఘు

"7)అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు..
అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికి తెలుసుకోలేడు.
---- రఘు"

8)కష్టాలు నీ శత్రువులు కాదు.నీ బలాల్ని,బలహీనతలన్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. ---- రఘు

9)అందం లేని లోటును మంచి స్వభావం పురిస్తుంది మంచి స్వభావం లేని లోటును అందం పురించలేదు ---- రఘు

10)మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. ---- రఘు

11)పచ్చ నోట్లు మనల్ని కాల్చడానికి గంధపుచెక్కలని ఇస్తాయేమోగాని ,మనకోసం కనీసం రెండు కన్నీటిబొట్లు అయిన రాల్చవు.కాబట్టి డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి నీ జీవితాన్ని అధపాతాళానికి తొక్కేయ్యకు ---- రఘు

12)మనమెప్పుడూ లోపలికి చూసుకోం. బయటికే చూస్తాం. ప్రతి ఒక్కడూ ప్రపంచాన్ని మార్చడానికే సిద్ధపడతాడు. మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు మనల్ని మనం మార్చుకోవాలి . ---- రఘు

13)విజయం సాధించాలంటే దారిలో ఎదురయ్యే అవరోధాలను దాటుకుంటూ, కష్టాలను అధిగమించి ముందుకు సాగాలి. అందుకు సంకల్పం చాలా అవసరం .మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆ మనిషిలోని సంకల్పమే అతని ప్రతిభకు, సామర్థ్యానికి నిలువెత్తు అడ్డం అని చెప్పాలి. ఈ ప్రతిభ వంటివి ప్రతి మనిషిలోను దాగి వుంటాయి. వాటికి సానబెట్టి బయటకు తీసుకురాగలిగితే ప్రతి మనిషి తాను జీవితంలో అనుకున్నవి తప్పక సాధించగలుగుతాడు. సంకల్ప సిద్ధిని సాధించిన మనిషి వ్యక్తిగత జీవితంలో ఎంతోవిశిష్టమైన, గణనీయమైన పురోగతిని సాధించగలుగుతాడు . ---- రఘు

14)మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆ మనిషిలోని సంకల్పమే అతని ప్రతిభకు, సామర్థ్యానికి తార్కాణంగా చెప్పాలి. ఈ ప్రతిభ వంటివి ప్రతి మనిషిలోను అంతర్లీనంగా దాగి వుంటాయి. వాటికి సానబెట్టి బయటకు తీసుకురాగలిగితే ప్రతి మనిషి తాను జీవితంలో అనుకున్నవి తప్పక సాధించగలుగుతాడు. ఆతని సంకల్పమే ఆ పని చేయిస్తుంది. ---- రఘు

15)తనను అరగదీసి హింసిస్తున్నా మనుషుల మీద కోపగించుకోకుండా హానిచేస్తున్నవారికి శ్రమ తెలియకుండా సువాసనలు వెదజల్లుతూ సేద తీర్చుతుంది మంచి "గంధపు చెక్క".కాబట్టి మనకి ఉపకారం చేసినవారికి ఉపకారం చెయ్యడం వింత కాదు..అపకారం చేసినవారికి కారణాలు ఎంచకుండా ఉపకారం చెయ్యడమే గొప్పతనం.దీని ఫలితంగా తప్పు చేసినవాడి మనస్సులో మార్పు కలిగే అవకాశం ఉంది. ---- రఘు

16)మనసు ఒక హద్దులేని గుర్రం – బుద్దే దానిని అదుపు చేయు కళ్ళెం .దగ్గరైతేనే మనసు కలిసేది – దూరమైతేనే విలువ తెలిసేది ! ---- రఘు

17)కొత్త అనుభవం ఎదురయినపుడు మనం అంతకుముందు ఏర్పరచుకున్న అభిప్రాయాల్ని పక్కన పెట్టి వాటిని సమీపించాలి. ఏ క్షణానికాక్షణం తాజాగా వుండాలి.ఎదుకంటే ఎప్పటికప్పుడు మనసుపై దుమ్ము పేరుకుంటూ వుంటుంది. మనదృష్టిని అడ్డగిస్తూ వుంటుంది. మనసు మసకబారకుండా వుండాలంటే నిత్య చైతన్యంతంతో వున్నపుడే వీలవుతుంది. అపుడే నువ్వు స్వచ్ఛంగా వుంటావు ---- రఘు

18)భోగభాగ్యాలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మటుకు అభిమానాన్ని, ఆశీర్వచనాలను తీసుకువస్తుంది. ---- రఘు

"19)షడ్రుచుల సమ్మేళనంగా చేసేది ఉగాది పండుగ . ఈ పండుగ జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది” ...అందరికి నందన నామ సంవత్సర శుబాకాంక్షలు ---- రఘు"

20)చెడ్డ పనులు చేసి పాపాన్ని మూటకట్టుకోకు,మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో,ఆ పుణ్యమే నీ రాతను మార్చునని తెలుసుకో.. ---- రఘు

21)నీవు దాచుకున్నది చేజారిపోతుంది .ఇతరులకు ఇచ్చి సహకరించింది.,నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో..ఇది తెలుసుకొని నువ్వు వెలుగుతూ ప్రక్క వాడ్ని కూడా వెలిగించు. - రఘు

22)బలహీనత అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండేదే...కానీ దానిని భూతద్దంలో చూస్తే జీవితంలో మిగిలేది శూన్యమే..ఏమంటారు మరి? - రఘు

23)అహంతో అణువునైనా జయించలేము కానీ , ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు - రఘు

24)సంతోషం అంటే ఏమిటో తెలియడానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే, సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి
రాదు..ఏమంటారు? - రఘు

25)సమస్య వచ్చినపుడు అది మీదని కాకుండా గ్రద్ద లాగా ఆ సమస్య మబ్బు లాగా , మీరు పై నుండి ఆ సమస్య ని చూస్తున్నట్లు ఊహించుకోండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.మిగతా వాళ్ళు ఏమనుకుంటారొ అని ఆలోచిస్తె సమస్య ఇంకా పెద్దది అనిపిస్తుంది. - రఘు

26)కోపం లో మాటలు తూలి ఇతరులుని దూరం చేసుకునే దానికన్నా క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు తగ్గుతారు మీరు హాయిగా ఉంటారు - రఘు

27)క్రమశిక్షణ ఓ జీవన విధానంగా చేసుకోవడం వల్ల వ్యక్తికి,సమాజానికీ మేలే జరుగుతుంది...కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో పైకి రావాలంటే క్రమశిక్షణ తప్పనసిరి !! - రఘు

28)చేసిన పని మెచ్చుకునే 'ఆనందం' కంటే మెచ్చుకోలేదనే 'భాద' ఎక్కువసేపు ఉండటం సహజం ..ఏమంటారు మరి కరెక్టేనా ? - రఘు

29)తెలియంది తెలుసుకుంటే జ్ఞానం – తెలిసింది దాచుకుంటే అజ్ఞానం! - రఘు

30)ఏకాగ్రత ఏదైనా సాదిస్తుంది – నిరాశ నిలువునా ముంచుతుంది ! - రఘు

31)వచ్చిన అవకాశం వదులుకోకు – పొయినదాని కోసం ఏడవకు !! కాబట్టి ఆవకాశం వచ్చినప్పుడే దానిని సద్వినియోగాపరుచుకోవాలి అప్పుడే
జీవితంలో రానించగలరు - రఘు

32)సోమరిపోతుకు చిక్కదు విజయం – కష్ట జీవికి కలుగదు దుఖం! కాబట్టి శ్రమని నమ్ముకున్నవాడికే దక్కును విజయం - రఘు

33) అత్యాశ లేని చోట ఆనందముంటుంది. ఆరాటంలేని చోట ప్రశాంతముంటుంది.కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలో మన చేతులలోనే వుంది - రఘు

34)ఎవరూ చూడలేదని తప్పు చేయకు – అందరూ చేస్తారని అప్పు చేయకు!!జీవితంలో ఈ రెండూ ప్రమాదమే - రఘు

35)నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే. - రఘు

36)పుట్టే ప్రతివాడూ పుడతాడు ఎందుకో ఒకందుకు - ఏదెటుపోతే నాకెందుకు అని ప్రతిఒక్కడూ అనుకుంటే మనమిక పుట్టడం ఎందుకు? - రఘు

37)పుట్టినా బ్రతకడం ఎందుకు? రాయీ రప్పా పుట్టా మిట్టా ఉండగా మళ్లీ మనమెందుకు..?? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుంటే మీ జీవితానికి పరమార్ధం దొరికినట్టే ..ఎమన్నా ఎక్కువ మాట్లాడితే క్షమించండి - రఘు

38)సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు. కాబట్టి పరోపకార్ధాయ మిదం శరీరం అన్నారు పెద్దలు - రఘు

39)పరులలో పరమాత్మను చూడడం, సాటివారికి సాయం చేయడమే దేవుని అర్చించడం కన్నా ఉత్తమమని భావించడం లాంటివి చేయడమే మనిషిగా పుట్టినందుకు మన జీవితానికి సార్ధకతవుతుంది . మనల్ని మనిషిగా గుర్తించేది కేవలం మానవత్వంతో ఉన్నప్పుడే కాని మరొకనాడు కాదనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. అప్పుడే నరుడు నారాయణుడౌతాడు. నా’ అనే భావాన్నిమరచి ‘మా’, ‘మన’ అనే ధోరణి అలవరచుకున్ననాడు మనతోపాటు మన దేశం బాగుపడుతుంది., అలా మన జీవితాలను మలుచుకోగలిగిననాడు, మనం అనుభవించే సుఖాలన్నీ స్వర్గసుఖాలుగా మారతాయి - రఘు

40)నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం,
నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం,
ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం,
ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం,
నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం,
అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషి తత్వం,
అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం! - రఘు"

41)ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ. - రఘు

42)అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి - రఘు

43)ప్రతిమనిషిలోనూ మంచిచెడు అనే రెండు ఆలోచన్లు ఉంటాయ. అయతే ఆలోచన్లు కలగగానే న్యాయంగా నీతిగా ఆలోచించి వివేకంతో ఆచరణలో
పెట్టితే మంచి పనులే జరుగుతాయ. నలుగురికీ ఉపయోగపడతాయ. ఏపని చేసినా దాని వలన నలుగురికీ ఉపయోగం ఉందా తనొక్కడికే లాభపడతాడా అని ఆలోచించాలి. అంతేకాక ఆ పని వల్ల మరొకరు నష్టపోకుండా ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి. తనకు లాభం వచ్చినా ఇంకొకరు నష్టపోయేటట్టు అయతే ఆ పనిచేయకపోవడం తెలివైన పని..ఇలా ముందడుగు వేసుకుంటూపోతే జీవితంలో ఆ మనిషి ఉన్నతస్థానంలో ఉండగలడు. - రఘు

44)ఒక వ్యక్తి తన ఆశయాన్ని సాధించడానికి ఎన్నో మజిలీలు దాటవలసి వుంటుంది ఒక్కొకోక్కసారి నిరాశానిస్ప్రుహలకు కూడా గురికావచ్చు .అటువంటప్పుడు సహనం చూపినట్లైతే కఠిన సందర్బాలను కూడా సునాయాసంగా ఎదుర్కోవచ్చు .. తన గమ్యానికి ఎదురైనా గడ్డు పరిస్థితుల్లో జ్ఞానాన్ని ,ధైర్యాన్ని ,సహనాన్ని విడిచిపెట్టినట్లైతే మనిషి యొక్క ఆశలు నిరశాలుతాయి. అందుకే సహనం కన్నా సముద్రం చిన్న అన్నారు పెద్దలు. - రఘు

45)అదుపు లేకపోతే పొదుపు ఉండదు – అలుపు లేకపోతే జీవితంలో నీకు మలుపు ఉండదు ..కాబట్టి అదుపు అలుపు సరి సమానంగా చూసుకుంటూ పోయినవాడే జీవితంలో విజేతగా నిలువగలడు - రఘు

46) ఆవేశాన్ని, అహంకారాన్ని అరిగట్టుము ,
లోభాన్ని వదిలివెయ్యుము,
ఈర్షని ఈడ్చివెయ్యుము,
ఆసూయను అంతము చెయ్యుము,
ద్వేషాన్ని దులిపివెయ్యుము,
ఆశను అణగద్రొక్కుము ,
క్రోధాన్ని గెంటివెయ్యుము,
దుర్గునాలని వదిలివేయ్యుము,
సద్గుణాలని స్వాగతిస్తూ పోతే అప్పుడు నీకు ఉన్న రోగాలన్నీ వదిలిపోతాయి. - రఘు

47)శాంతముతో కోపాన్ని,ప్రేమతో ద్వేషాన్ని .దానంతో లోభాన్ని ,అహింసతో హింసని జయించవచ్చు.. - రఘు

48)రాయి ఉలి దెబ్బలకి ఓర్చుకుంటేనే విగ్రహములవుతాయి,అలాగే మనిషి ఓడిదొడుగుదెబ్బలకు ఓర్చుకుంటేనే మానవత్వమున్నమనిషవుతాడు. - రఘు

49)మంచి మాట,మంచి ఊహ మనిషికి,మనస్సుకు ఆరోగ్యకరము. - రఘు

50)స్వయంకృషితో తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగి సాధించేందుకు ప్రయత్నం చేయాలి.నిన్ను నువ్వే దీపంలా ప్రకాశింపజేసుకోవాలి.అంతేకాని పొరుగువారిని అణచివేయాలనుకునేవారికి ఎన్నటికి శాంతి సుఖాలు లభ్యం కావు.. - రఘు

51)చేదును రుచి చూడనివాడు తియ్యదనాన్ని యొక్క అర్ధం తెలుసుకోలేడు,అలాగే కష్టాలని రుచి చూడని వాడు సుఖములోని మాధుర్యాన్ని గ్రహించలేడు - రఘు

52)దాచుకునే స్వార్ధం వద్దు..దోచుకునే ధౌర్భాగ్యం వద్దు,అపకారం వద్దు,ఉపకారమే ముద్దు.- రఘు

53)మేలు చేసిన వారికి కీడు చేసేవాడు,
కూడు పెట్టిన వారిని క్రూలత్రోసేవాడు, ,
విద్య నేర్పినవారిని వెక్కిరించేవాడు
ఉపకారం తలపెట్టినవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడు. - రఘు

54)ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గుతుంది,ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది ,కాబట్టి పెద్దలు తన కోపమే తన శత్రువు అని అన్నారు. - రఘు

55)హింసకు ప్రతిహింస పనికిరాదు ,అలాగే చెడు చేరదీయకు,మంచి చెయ్యడం మానివేయకు. - రఘు

56)కష్టాలని ఓర్చుకో,నష్టాలని తెంచుకో,సంతోషాన్ని పంచుకో...అందరు ఈ మానసిక పరిస్థితిలో ఉంటె భాదలే ఉండవు - రఘు

57)భర్తకు ప్రేమను ఎలా చూపించాలో తెలియదు ,భార్యకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు.కాబట్టి భర్త భార్య మనస్సు అర్ధం
చేసుకొని,భార్య భర్త మనస్సు అర్ధం చేసుకుంటూ పోతే వాళ్ళు జీవితాంతం అన్యోన్యంగా ఉండగలరు. - రఘు

58)అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - రఘు

59)భగవంతునిపై భారము వేసి నిర్భయంగా నడుచువాని దరికి దుఃఖము దరిచేరదు. - రఘు

60)నేను’ అనేది అహంకారం.. మేము అనుకోవటం సహకారం.. వీటి మధ్యగల సన్నని తెరను త్వరగా తొలగించుకోకపోవటం అజ్ఞానం.ఒక్కసారి ‘నేను’ అనే అహంకారాన్ని విడిచిపెడితే.. అంతా ఆనందమే. - రఘు

61)తృప్తి లేని వాడు స్వర్గంలో కూడా జీవించలేడు ,కాబట్టి సంతృప్తియే సకల సంపదలకు మూలం - రఘు

62)సంపద వల్ల దయ,జాలి పెరగాలేగాని లోపల వున్నా అంతఃశత్రువులు పెరగకూడదు అవసరాలకు మించిన సంపదలు అనవసర సమస్యలు సృష్టిస్తాయి.సంపాదించినా ధనం సద్వినియోగం చేసే సామర్ధ్యం లేనప్పుడు అతిగా సంపాదించడం కూడా ప్రమాదమే సంపాదన ద్వారా సాధించిన వస్తువులకు మనం యజమానులం అవుతున్నామని అనుకుంటాం కానీ నిజంగా బానిసలవుతున్నాం... - రఘు

63)విజయం సాధించే క్రమంలో ఎన్నో అవరోధాలు,సవాళ్ళు,ముళ్ళలా పలకరిస్తాయి.ఆ సమయంలోనే కొండంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.ఎదిరించి నిలబడాలి.అప్పుడే అడ్డొచ్చిన ఆ సవాళ్ళని సాధించి విజయ సోపానాలు ఎక్కగలరు. - రఘు

64)లక్షమంది చెడుమార్గంలో పరిగెడుతున్నారు కదా అని నువ్వూ వాళ్ళతో పరుగుతీస్తే నీ ఉనికి భూస్థాపితం అయినట్లే లెక్క..ఆగి అది సరియనదా కాదా అని ఆలోచించడం మనిషి చేసే పని ..శోదించి సాధించడం వివేకవంతుడి పని..ఎక్కడో చదివింది - రఘు

65)జీవితం ఒక నది లాంటిది.అడ్డంకులనేన్నిటినో ఎదుర్కొంటూ ముందుకు సాగే నదీప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరగలుగుతుంది.అలాగే ఈ
జీవితమనే దారిలో రాళ్లుంటాయి,ముళ్ళుంటాయి.వాటికి భయపడి వెనక్కి తిరిగితే -అధోగతి.ధైర్యంతో ముందుకు సాగితే -సకలం మన సొంతమవుతుంది.అప్పుడు జీవితం సంపూర్ణంగా మారుతుంది --ఎక్కడో చదివింది - రఘు

66)మంచిమాటలు వినకపోవడం- ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించడం- ఎదుటివారిని బాధించడం- మూర్ఖత్వం.ఎన్ని కష్టమైన పనులు - అసాధ్యమైన వాటిని కూడా ప్రయత్నించి సాధించవచ్చును గానీ- మూర్ఖుల మనసులను మాత్రం సృష్టి కర్త బ్రహ్మ కూడా మార్చలేడన్నది పెద్దల అభిప్రాయం అయినా మార్చడానికి మన ప్రయత్నం మనం చేయాలి.మానవ ప్రయత్నానికి తప్పనిసరిగా భగవంతుని తోడు ఉంటుంది. - రఘు

67)కంటికి ఎంతెంతో కనిపిస్తుంది.ఆ కనిపించిన్దంతా సొంతం కావాలంటే సాధ్యం కాదు. ఎంత ప్రాప్తముందో అంతే చేతికందుతుంది. మనం అనుభవించగలిగినదే మనది. ఇతరమైనదేది మనది కాదు. - రఘు

68)మనిషి తనను తాను తెలుసుకుంటూ ,తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ తనలోనే దేవుడున్నాడనే సత్యాన్ని గ్రహించగలిగితే ,అలాంటి వ్యక్తి కష్టాల సముద్రంలో మునిగిపోతున్న స్వర్గంలో ఉన్నట్లే,నిరంతరం ఏదో కావాలన్న అసంతృప్తితో బ్రతికే మనిషికి అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నా నరకంలో ఉన్నట్లే..కాబట్టి ఇది అర్ధం చేసుకున్న వ్యక్తి తన అరచేతుల్లోనే స్వర్గాన్ని నరకాన్ని నిర్మించుకోగలుగుతాడు - రఘు

69)వచ్చిన సమస్యకూ,కష్టానికీ బెదిరి భయపదిపోవడం అవివివేకం,పిరికితనం .చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడి ,మరోసారి అవి రాకుండా జాగ్రత్తపడడం ,సమస్యని ధీరుడిలా అధిగమించడం వివేకవంతుడి లక్షణం.శ్రమ చేయడంలోనే సుఖం అనుభవించాలి.ఇష్టంతో చేసే కష్టానికెప్పుడూ సత్పలితమే ప్రాప్తిస్తుంది - రఘు

70)మనం గొప్పవాళ్లం అయ్యిన తర్వాత చప్పట్లు కొట్టేవారికంటే ,మన దగ్గర ఏమి లేనప్పుడు వెన్ను తట్టేవాళ్లే నిజమైన స్నేహితులు - రఘు

71)పనినిమొదలుపెట్టే ముందే చేయబోయే పనికి వచ్చే సుఖాలను ఏ విధంగా అంచనా వేస్తామో ఆ విధంగానే కష్టనష్టాలను కూడ అంచనావేసుకోవాలి. ఏపని చేయబోయనా అందుకు తగిన సామర్థ్యం ఉందాలేదా అని ఆలోచించుకోవాలి. సామర్థ్యాన్ని బట్టి, ఆటంకాలను తట్టుకొనేశక్తి బట్టి చేసిన పనిఫలితం ఆధారపడి ఉంటుంది. ఫలితం బాగుండాలి అనుకొంటే తగిన శ్రమ ఉండితీరాలి. అపుడేఅనుకొన్న ఫలితాలు వస్తాయ. ఇది ఏకాగ్రతతోనే సాధ్యం - రఘు

72)నీడ నిచ్చే చెట్టు,మంచి భోదనలు చేసే గురువుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది.చెంత చేరగానే చెట్టు నీడను,గురువు జ్ఞానాన్ని ఇస్తారు.చెట్టు లేకపోతే నీడ ఉండదు..గురువు లేకపోతే జ్ఞానం ఉండదు .జ్ఞానం ప్రసాదించిన ఆ గురువే లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండము. - రఘు

73)కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు.ఉన్న కొద్ది సుగుణం కోపం వల్ల తక్కువైపోతుంది కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల
సాధన సులభమవుతుంది ...అందుకే శాంతమే శ్రీరామరక్ష అన్నారు.. - రఘు

74)కలసికట్టుగా వుంటే ఎలాంటి కార్యాన్ని అయినా సాధించవచ్చు.అయిదు వేళ్ళు కలిపితే చేయి మరింత బలంగా మారుతుంది.ఒక కుటుంబంలోగాని ,ఒక వర్గంలోగాని అందరు సయోధ్యగా ఉంటేనే వారు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు.అందుకే ఇకమత్యమే మహా బలం అన్నారు పెద్దలు - రఘు

75)నిన్ను నీవు శోధించుకో,ఎక్కడ గాడితప్పేవో తెలుసుకో.అది సరిచేసుకుంటూ ముందుకు సాగిపో.అప్పుడు విజయం తధ్యం. - రఘు

76)మనిషి తాను ప్రేమించిన విషయం ఎపుడైనా మరిచిపోతాడేమో కాని ద్వేషించే గుణాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకొని ఉంటాడు. అందుకే ఆ
ద్వేషించేగుణాన్ని దూరం చేసుకుని ,క్షమాగుణాన్ని అలవర్చుకుని ముందుకు సాగుతుపోయేవాడే జీవితంలో ఉత్తముడు కాగలడు - రఘు

77)మంచి చేసే అలవాటున్నవారికీ, మంచిని అభినందించే లక్షణాలున్నవారికీ మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది. - రఘు

78)సృష్టిలో నాశనం లేని వస్తువే నిజమైన సౌందర్యం. నాశనం లేని వస్తువు ప్రపంచంలో ఒక్క దైవం తప్ప, ప్రతి వస్తువూ కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కాబట్టి మనం దైవాన్నే ఆశ్రయించాలి. - రఘు

79)నిండు మనస్సుతో, భక్తితో భగవంతుని ప్రార్థించితే ఆ ప్రార్థనను భగవంతుడు ఆలకించి తీరుతాడు. భగవంతునిపై విశ్వాసం ముఖ్యం. భగవంతుని స్మరణ చేస్తే క్రమంగా చిత్తశుద్ధి చేకూరుతుంది. చిత్తశుద్ధి ఉన్నవారికి భగవంతుని రక్ష దొరుకుతుంది. - రఘు

80)జన్మనిచ్చిన తల్లి, జన్మించిన భూమి ఈ రెండు స్వర్గానికంటే గొప్పవి . ‘నాస్తి మాతృ సమోగురుః’- అంటే తల్లిని మించిన గురువులు లేరు. తల్లిని మించిన దైవం లేదు.కాబట్టి నీ అభివృద్ధికి తల్లిదీవెనలు భగవంతుని దీవెనలుగా ఉపకరిస్తాయి - రఘు

81)అవివివేకం మన పతనానికి హేతువైతే ,వివేకం మనల్ని విజయ శిఖరాలకు చేర్చే నిచ్చెన అవుతుంది. అందుకే అవివేకాన్ని విడిచిపెట్టి ,వివేకంతో మసలుకోవడం మనకెంతో శ్రేయస్కరం. - రఘు

82)మనిషి ప్రవర్తనకు అతని మనస్సే మూలం.కాబట్టి మనస్సు మాట వింటూ ,కాలాన్ని వృధా చెయ్యకుండా ,అంకితభావంతో పనిచేసే మనిషి తాను కోరుకున్న ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు. ఎందుకంటే శ్రమతో నాస్తి దుర్భిక్షం : - రఘు

83)గొప్పగా పుట్టడం అనేది మనచేతుల్లో ఉండదు కాని గొప్పగా చనిపోయే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది.. మనం ఉన్నప్పుడు చేసే పనులే మనల్ని మరణించాక కూడా బ్రతికిస్తాయి - రఘు

84)మనసు పెట్టి ఆలోచించాలే గాని ప్రతి విషయంలో ఏదో మనకు తెలియని విషయం దాగి వుంటుంది. అది మనకు మేలు చేసే ఆలోచనను కలిగించవచ్చు. జీవితానికి కొత్త ఊపరి పోయవచ్చును. తెలుసుకోవాలనే ప్రయత్నం భవిష్యత్ ఉన్నతికి ఉపయోగపడుతుంది.అంతే కాక మనకి
ఒక ఉత్తమ జీవితాన్ని ఏర్పరచుకోగలిగినవాళ్ళమవుతాము - రఘు

85)గుండెనిబ్బరం, జీవితం మీద పట్టు, మనమేం చేయగలమో అది చేస్తూ స్థిరచిత్తంతో ముందుకు వెళ్ళగల నేర్పును ప్రతి ఒక్కరు అలవరచుకుంటే సమాజంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలను ఇట్టే అధిగమించవచ్చు - రఘు

86)చాలామంది కష్టాలను చూసి భయపడిపోతారు , వాటిని ఎదుర్కొనకూడదని భావిస్తారు .అది ఉత్త అపోహ , నిజానికి మనిషిని రాటుదేల్చేవి కష్టాలే!. కష్టం లేకపోతే జీవితం విలువ మనిషికి తెలియదు . ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని జయించి నట్లయతే, ఆ తర్వాత జీవితం ఎంతో మధురంగా ఉంటుంది - రఘు

87)భగవంతుడనే వాడు ఉన్నాడో లేడో ఉంటే ఎక్కడ ఉన్నాడు అంటూ సందేహాలను పెంచుకొని తన జీవితంలో కాంతిని రావడానికి వీలులేకుండా చేసుకొంటున్నారు కొందరు మనుషులు..ఇటువంటివి చేసిన వారికి జీవితపు విలువ ఏం తెలుస్తుంది. " నేను ఒక్కడే బాగుండాలి " అన్న పదాన్ని వదిలి నలుగురు మంచికోసం పాటుపడాలి. వెనువెంటనే ఆ భగవంతుడి యొక్క వెలుగు కిరణాలు మన మీద ప్రసరస్థాయి . దానితో అరణ్యం అనే మన మనస్సు కాస్తా ఆనంద నందనవనం అవుతుంది. భగవంతుడు చిరునామ కోసం వెదకకుండా ఎదుటి మనిషిలో పరమాత్మనుచూసే దృష్టిని పెంచుకొంటే ప్రతి అంగుళంలో భగవంతుడు కనిపిస్తాడు. కనుక ప్రతిఒక్కరూ ఆరోజు కోసం శ్రమిద్దాం - రఘు

88)ప్రకృతి నుంచి మనిషి సహకారమనేది నేర్చుకోవాలి. చెట్లు తమ పండ్లను తాము తినేయవు. నదులు తమ నీటిని తామే త్రాగేయవు.ఇవ్వటం నేర్చుకొంటే.. పుచ్చుకొనేందుకు ఎంతో ఉంటుందని గ్రహించాలి .. ఇవ్వటం తెలియకపోతే. అంతా శూన్యమే. కనుక పరస్పర సహకార పద్ధతిని అలవరచుకుంటే అంతా ఆనందమే! ‘ఇచ్చుట’లో ఉన్న హాయి.. వేరెచ్చటలేదని’ పెద్దల మాటలు అక్షరసత్యాలు. ప్రతి ఒక్కరు ఆ దిశగా అడుగులు వేయాలని మనం కోరుకుందాం . - రఘు

89)జీవితమంటే సమస్యల సంకలనం. ఏదో ఒక సమస్య లేనివారుండరు. ఒక్క చిన్న అబద్ధమాడితే, ఒక్క అకృత్యం చేస్తే- సమస్యలు తొలగిపోయి సుఖం కలుగవచ్చుమేగాని , న్యాయపథాన్ని వదలి పొందిన సుఖం మరణంతో సమానం - రఘు

90)తనను తాను స్తుతించుకోవటానికి అలవాటుపడిన మనిషి - ఎవరి గొప్పతనాన్నీ గుర్తించలేడు. ఈ దుర్గుణాన్ని మానుకొని ఎవరైనా మంచి పని చేసినప్పుడు అభినందించే గుణం ఉన్న మనిషికి తప్పక విజయ శికరాలని అందుకోగలడు - రఘు

91)దానగుణం మానవత్వానికి నిదర్శనం. తాము దానం చేసామన్నది ఎవరికీ తెలియకూడదని రహస్యంగా దానాలు చేసేవారున్నారు. ‘పుచ్చుకున్నవాడు కాదు- ఇచ్చినవాడు ధన్యుడు, నువ్వు దానం చేయదలిస్తే, దానిని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నవారికి నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి’..ఎందుకంటే వాళ్ళ వల్ల నువ్వు పుణ్యం మూటకట్టుకుంటున్నావ్ అనేవి స్మరణీయ సందేశాలు. ఎవరికో ఒకరికి ఎంతోకొంత ఇచ్చి- ఆ తరువాత ఎందుకిచ్చామా? అని విచారించకూడదు. సాధారణంగా మనం చేసినది వారికి అవసరం లేదని గ్రహించినపుడు ఈ విచారం కలగటం సహజం. నిజానికి దానికి కూడా విచారించవలసిన పనిలేదు. మాయమాటలు చెప్పి మన దగ్గర ఏదో ఒకటి తీసుకువెళ్లినవాడికి - ఆ పాప ఫలితం తప్పక అనుభవిస్తాడు. - రఘు

92)మనిషి మాట్లాడే విధానం వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. చదువు వల్ల కలిగిన జ్ఞానం మనిషి మాట్లాడే విధానంలో కనబడుతుంది. కొందరు చదువుకోకపోయినా ఎంతో సంస్కారవంతంగా మాట్లాడుతారు. కొందరు చదువుకొన్నా కూడా ఎంతో మూర్ఖంగా అవతలి వారు నొచ్చుకొనేటట్టు మాట్లాడుతారు. అది వారి సంస్కారహీనత్వాన్ని తెలియచేస్తుంది. దీనికి కారణం వారిలో స్వార్థం, అసూయ, ఈర్ష్య లాంటి దుర్గుణాలు చోటుచేసుకొని ఉండడమే. వీటిని దూరం చేసుకోవడానికి ప్రతిమనిషికి చదువుకావాలి. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. అందుకే భుక్తి కోసం చదవక భక్తితో చదివితే అది జ్ఞానాన్ని పెంచి మనుషులను సంస్కారవంతులను చేస్తుంది - రఘు

93)చెవులతో శబ్దాన్ని,కంటితో రూపాన్ని ,ముక్కుతో పరిమళాన్ని ,నాలుకతో రుచిని ,చర్మంతో స్పర్శని దేవుడు ప్రతి మనిషికి ఎలా ఐతే ఇచ్చాడో అలాగే మనస్సుతో మానవత్వాన్ని చూడమనికుడా ఇచ్చాడు..కాబట్టి అన్ని ఇచ్చిన ఆ దేవుడికి మన కృతజ్ఞతో ప్రక్కవాడు కష్టాలలో
ఉంటె ఆదుకోవాలని ,ఆ పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుందాం - రఘు

94)దొంగల చేత దోచ బడనిదీ, దొరల(రాజుల) చేత లాగుకొన బడనిదీ, సోదరులచేత పంచుకో బడనిదీ, ఎంత ఉన్నా భారము కానట్టిదీ, వెచ్చించిన కొద్దీ పెరిగేదీ అయినటువంటి విద్యా ధనమే అన్ని ధనములలో ప్రధానమైనది.కాబట్టి విద్య ధనం సర్వ ధన ప్రధానం - రఘు

95)వివేకి అయిన సాధకుడు గతం వేధించేదైతే ,దాన్ని పూర్తిగా సమాధి చేస్తాడు.భవిష్యత్తుకు ఉపకరించేదైతే అమ్ములపొదిలో అస్త్రంలా పదిలంగా ఉంచుతాడు.ఇలా చేయాలంటే కటోర సాధన ఎంతో అవసరం. - రఘు

96)ఆశలానే కోరలతో,కోరికలనే పాములు మన మనస్సును ,బుద్ధిని వేదిస్తూ పెడదారులు పట్టిస్తాయి.తప్పుడు పనులకు ప్రోత్సహించి మన వ్యక్తిత్వానికి కళంకం తెస్తాయి..కాబట్టి ప్రతి ఒక్కరు మనస్సును అనునయిస్తూ మన సంకల్పానికి అనుగుణంగా మార్చుకోగలిగితే మనస్సే మన వశం అవుతుంది..అప్పుడు తప్పులు జరగడానికి ఆస్కారమే ఉండదు. - రఘు

97)కాలం గడపడానికి ఎన్నో మార్గాలు.కానీ కరిగిపోయిన క్షణాలను తిరిగి తీసుకుచ్చే మార్గం మాత్రం ఒక్కటీ లేదు..కాబట్టి కాలాన్ని వృధా చెయ్యకండి.. - రఘు

98)ఒక మంచి మాట దేని నుండి వచ్చినదో అని ఆరా తియ్యడం కంటే అది మన జీవితంలో అలవారించుకోవడం అత్యుత్తమ లక్షణం - రఘు

99)స్వార్ధంతో చేసే ఎంత మంచి పనైనా గొప్ప ఫలితాలనివ్వదు .సాటివాడిని మనిషిగా చూడటంతోనే నీలోని మానవత్వానికి రెక్కలు వస్తాయి.మంచిని గ్రహించడంలో,మంచి పనులు చేయడంలోనే దైవత్వం దాగి ఉంది.జ్ఞానం నీ నేత్రం తెరిపిస్తే ,ఆచరణ నీకు చూపునిస్తుంది .కాబట్టి మానవత్వాన్ని తెలుసుకున్న వ్యక్తికి దైవత్వం ఎక్కడో ఉండదు అది వాడిలోనే ఉంటుంది. - రఘు

100)అహం పెచ్చుమీరితే నీలోని విచక్షణా జ్ఞానం అంతరిస్తుంది.అది అంతరిస్తే పలు విధ్వంస క్రియలకుమూలహేతువౌతుంది. కాబట్టి క్రోధం, అహం, హింస మొదలగు దుర్గుణాలను అదుపులో పెట్టుకోవాలి. అపుడు మాత్రమే విజేతలగు లక్షణాలు నీలో వస్తాయి - రఘు

101)చుట్టురా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునేకంటే ప్రయత్నించి చిరుదీపం వెలిగించడం మంచిది..కాబట్టి మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా ప్రయత్నంతో మనం విజయ తీరానికి చేరవచ్చు - రఘు

102)క్రోధం, అహం, హింస మొదలగు దుర్గుణాలు మానవ జీవిత పతనానికి, అధోఃపాతాళానికి అంచులు వంటివి. వాటి పర్యవసానం వినాశనం కావటమే.కాబట్టి వీటిని అదుపులో పెట్టిన వాడు విశ్వవిజేత కాగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు - రఘు

103)మనకి ఏ కష్టం వచ్చినా సరే తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మెలుగుతూ తనను తాను సన్మార్గంలో నడిచేలా చేసుకొంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండేలా జీవనం సాగించాలి.ఇలా చేసే ప్రతి ఒక్కడికి కష్టమంటే ఏంటో తెలీకుండా జీవితం సాగుతుంది - రఘు

104)అమ్మ.. సృష్టిలో ఒక మధురభావన. ఆప్యాయత నిండిన అనుభూతి. అమ్మలో ఏదో తెలీని ఆరాధన ఉంది. అభిమానం ఉంది.. పద్యం... గద్యం... పాట... గేయం ఏదైనా... అమ్మ గురించి రాస్తే అది సూటిగా హృదయాన్ని తాకుతుంది. దేవుడు తాను అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు.కాబట్టి ఆకాశాన్ని మొత్తం కెమెరాలో ఎలా బంధించలేమో ‘అమ్మ’ని పూర్తిగా అక్షరాలలో ఆవిష్కరించడం సాధ్యం
కాదు. - రఘు

105)ఏ పనిని గర్వంగా చేయరాదు.తొందరపడి కూడా చేయరాదు..అది ఎలాగంటే చెట్టుకున్న పచ్చికాయ అక్కడే ఉంటే,నెమ్మది నెమ్మదిగా ,క్రమ క్రమంగా పండుగా మారుతుంది ..అలాగే ఆ కోసిన పచ్చి కాయ మగ్గపెడితే 'పండు' అవుతుందో లేదో తెలియదుగాని చెడిపోవడం మాత్రం జరుగుతుంది .దీనిబట్టి ఏ పనైనా ,మొదలుపెట్టె ముందు ఎలా చేస్తే తేలికో,ఎలా చేస్తే కష్టమో,అంచనా వేసి నిదానంగా చేసేపని తప్పినసరిగా సత్ఫలితాలనిస్తుంది - రఘు

106)మాటలలో పరిమితిని,చేతలలో అపరిమిత సామర్ధ్యాన్ని చూపించగలగడమే ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం - రఘు

107)మనిషి జీవితంలో కొంత దూరం ప్రయాణించాక ,అత్యున్నత స్థాయికి ఎదగాలనుకుంటే క్రమశిక్షణ ఒక్కటే దగ్గర మార్గం.అయితే ఇది అలవరచుకోవడానికి బాగా శ్రమ పడాలి.శ్రమతో క్రమశిక్షణగా ఏ పని చేసే మనిషికైనా సరే సత్ఫలితాలు తద్యం !!! - రఘు

108)ఒక మనిషి అత్యున్నత స్థాయిలో ఉన్నా లేక అత్యల్ప స్థాయిలో ఉన్నా .. ఆ మనిషినీ ప్రేమించేది ఒక అమ్మ ఒక్కటే..అందుకనే ఆమె ఋణం ఏ జన్మలోను తీర్చుకోలేనిది..కాబట్టి తల్లిని మరిచినవాడిని భగవంతుడు కూడా రక్షించలేడు. - రఘు

109)మాట్లాడిన మాట,వదిలిన బాణం ,జరిగిపోయిన కాలం,పోయిన అవకాశం ఎప్పటికీ తిరిగి రావు..కాబట్టి ఆచితూచి అడుగు వెయ్యండి ..అప్పుడే జీవితంలో పైకి ఎదగగలరు - రఘు

110)ఎంతో కొంత సంపాదించి కూడ బెట్టుకున్నా మనిషికి తృప్తి కలుగదు. ఇంకా సంపాదించాలనే ఆశ. ఈ అంతంలేని కోరికలే మనిషిని కుప్పలా కూలదోస్తాయి. అసలు ఎవరికి ఎంత దక్కాలో అంతే దక్కుతుంది. ఇది ఏనాడో నిర్ణయించి ఉంటుంది. అత్యాశతో కోరికలు పెంచుకొని భగవంతుని మరచి ఉండడం అనేది మన జీవితాన్ని వృథా చేసుకోవడమే!!.కనుక మనం మానవ జన్మ ఎత్తింది సుఖాలను అనుభవించడం కోసం కాదు భగవత్ ప్రార్ధన చేయడం ఏ కొంత అయినా అవసరమని గుర్తించాలి - రఘు
111)అహంకారం అనేది వ్యక్తిపైనే కాదు సమాజం పైన కూడా ప్రభావం చూపిస్తుంది .ఈ సమాజంలో మనం ఎప్పుడూ కూడా ఇతరులు మెచ్చేవిధంగా ప్రవర్తించాలి . మంచి వ్యక్తిత్వం అనేది జీవితంలో విజయాలు సాధించాలనుకునే వారికి చాలా అవసరం. కాబట్టి అహంకారాన్ని పూర్తిగా అణిచి వేయడానికి ప్రయత్నం చేయాలి - రఘు
112)తన మంచిని కోరేవాడు పరాయివాడైనా సరే వాడిని స్వీకరించాలి..తన మంచిని కోరినవాడు తనవాడైనా సరే వాడిని వదిలివేయాలి. - రఘు
"113)మన జననం మన చేతుల్లో లేదు మన మరణం కూడా మన చేతుల్లో లేదు కానీ ఎలా జీవించాలనేది మన చేతుల్లోనే వుంది కాబట్టి … మీ జీవితం లో ప్రతి రోజు ఒక మరపురాని రోజు గా మలచుకోండి ! - రఘు
" 114)శరీరాన్ని అద్దంలో చూడవచ్చు..వ్యక్తిత్వాన్ని కర్మలలో చూడవచ్చు - రఘు
115)మంచి ప్రవర్తన హుందాతనముతో నిండి వుంటుంది, చెడు ప్రవర్తన అవమానకరముగా వుంటుంది - రఘు
116)ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఓర్పుతో దానిని పరిష్కరించుకోవడం మంచి పద్ధతి. సహనం వీడితే సమస్య మరింత జటిలమై ఎదురుదెబ్బలు తగలడం ఖాయం. మన ఎదుట ఉన్న సమస్యారూపాన్ని అర్థం చేసుకోవడానికి సహనం ఎంతో పనికివస్తుంది. ఓర్పు వహిస్తే కొండంత సమస్య సైతం చప్పున మాయమైపోతుంది. - రఘు
117)నిన్ను చెడగొట్టే మాటలు ఎప్పుడు వినవద్దు.విని చెడిపోవద్దు - రఘు
118)నక్షత్రాలు ఎంత ఎత్తునున్నా ఎలా ఆకాశానికి ఒదిగి ఉంటాయో అలాగే మనం ఎంత ఎదిగినా , మనల్ని ఇంత స్థాయికి తెచ్చిన మన తల్లిదండ్రులకు ఎప్పటికి అలాగే ఒదిగే ఉండాలి - రఘు
119)లేని వాటి కోసం బాధ పడి మనసు పాడు చేసుకుంటే .. ఉన్నదాంట్లో కూడా నీకు ఆనందం ఉండదు ..అందుకే ఏమో అమ్మ ఎప్పుడు చెప్తుంది దేంట్లో అయిన సహనం ఓర్పు ఓరిమి ఉండాలి అని ,అవి ఉంటె ఆనందం మీ వెంటే అని.. - రఘు
120)జీవితములో జీవించే కళ నేర్చుకునట్లయతే మనోబలం ఆత్మ విశ్వాసము వృద్ది అవుతాయి. - రఘు
121)నిజాయితీ పరుడువైతే నీకు చెడు నుండి పూర్తి స్వేఛ్చ లభిస్తుంది - రఘు
122)ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తే కలత చెందకు వారికీ ఆనందాన్ని చేకురుస్తునాను అని బావించు - రఘు
123)బాహ్యముగా దు:ఖించుట కంటే మనసులో విలపించుట ప్రమాదకరము - రఘు
"124)గులాబీ పువ్వుని చూసి ప్రేమించకు అందులో ముళ్ళు ఉంటాయి, డబ్బుని చూసి ప్రేమించకు దానిలో ద్వేషం ఉంటుంది , మనుషులను చూసి ప్రేమించకు వారిలో మోసం ఉంటుంది, మనసుని చూసి ప్రేమించు అందులో ఉంటుంది మమతనురాగం. - రఘు
" 125)నువ్వు పంచిన ఆ మంచితనమే రేపు ఓ చెట్టు గా మొలచి నిన్ను ఆదరించక మానదు. మనిషికి వెల కట్టలేం కాని ఆదర్శ ప్రాయం గా ఉంటె ఆ మనిషి మహోన్నత శికరాలను తాకగలడు - రఘు
126)నీలో జ్యోతిని వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు - రఘు
127)అవరోధాలు,కష్టాలు పరోక్షంగా మనిషి అభివృద్దికి దోహదపడతాయి.సమస్యలే మనలోని మనోబలాన్ని పెంచి ఎంత పెద్ద కార్యాన్నైనా మనతో చేసేలా చేస్తాయి..కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలే భవిష్యత్తులో మనకి పెద్ద ఆపదలు ఎదురైనా వాటిని ఎదురుకొనే సత్తానిస్తాయి - రఘు
128)కష్టకాలములో ధైర్యముగా ఉండటమే ఉత్తమమైన లక్షణము - రఘు
129)సంకల్ప బలం ఉన్నవాడికి సమస్యనేది ఒక అవరోధమే కాదు..నీ శక్తి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు సాధించలేనిదేది ఉండదు. కాబట్టి మన లక్ష్య సాధనలో చిత్తశుద్ధి ఉంటె ప్రతి ఆపదనూ అధిగమించి విజయతీరాలని సులువుగా చేరగలం - రఘు
130)నీవు ఉత్సాహవంతముగా ఉండటానికి నీ అంతరాత్మని, ఇతరుల ప్రత్యేకతలను అభినందించు. - రఘు
131)నిగ్రహం లేకుండా ప్రవర్తించేవారికి కలిగే ఫలితాలు,సంక్రమించే సంపదలు సైతం వినాశానానికే దారితీస్తాయి ..కాబట్టి బ్రాంతి వల్ల కల్పించుకున్న ఆశ కన్నా,వివేకంతో చూసే సత్యమే గొప్పదైనది. - రఘు
132)ప్రపంచం అంత పెనుతుఫాను రూపం దాల్చినపుడు అతిసుందరమైన ఆశ్రయం భగవంతుని గుడి మరియు అమ్మ ఒడి మాత్రమే - రఘు
133)సంకల్ప బలం ఉన్నవాడికి సమస్యనేది ఒక అవరోధమే కాదు..నీ శక్తి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు సాధించలేనిదేది ఉండదు. కాబట్టి మన లక్ష్య సాధనలో చిత్తశుద్ధి ఉంటె ప్రతి ఆపదనూ అధిగమించి విజయతీరాలని సులువుగా చేరగలం - రఘు
134)ఆయుధాలు వాటంతట అవి ఎన్నడు ప్రమాదకరం కావు,మనిషిలో ఉన్న క్రోధమే హానికరం - రఘు
135)శత్రువులు లేకుండా చేసుకోవటనికి ఉత్తమ మార్గం వారిని నీ మిత్రులుగా మార్చుకోవటం - రఘు
136)ఆశలు, అవసరాలు మన చేయి దాటిపోతే మనశ్శాంతీ ఉండదు, ఆరోగ్యమూ ఉండదు. ఆత్మ సంతృప్తి ఉన్నవాడికి ఆనందమూ ఉంటుంది, ప్రశాంతతా ఉంటుంది. కాబట్టి నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో - రఘు
137)నీ అంతరాత్మే నీకు మంచి మిత్రుడు,తరచూ దానిని నిను. - రఘు
138)అదృష్టం అనేది తలుపు తట్టే సమయాన్ని గ్రహించి తలుపులు తెరిచి ఉంచాలి. ఆ సమయంలో తలుపులు మూసి ఇప్పుడు తలుపులు తెరిస్తే వచ్చేది అదృష్టం కాదు దురదృష్టం.కాబట్టి ఎప్పుడూ ఎలా ఉండాలో ఆచి తూచి అడుగు వేయాలి - రఘు
139)నిన్ను రక్షించుకునేందుకు ఇతరుల పై నింద వేయకు,కాలానికి నిజాన్ని నేరుపించే శక్తీ ఉంది - రఘు
140)మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం, సామాన్యునిలా ప్రవర్తించటం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది. ఎవరో, ఏదో అన్నారని కుంగిపోకండి. అలా అనే అవకాశం ఎదుటివారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి. ఎదిగే కొలదీ ఒదిగిపొండి. తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చుగా ఎదుగుతాడు. ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. - రఘు
"141)అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అలా అనుకోవడమే మనిషి పని .. - రఘు
" 142)భాద్యతలను నిరాకరించినా వయోభారానికి భయపడినా వ్యక్తిలో పరిపక్వత లేనట్లే - రఘు
143)ప్రతి మనిషికి జీవితంలో తగిన లక్ష్యం అంటూ వుండాలి. మనిషి వ్యక్తిత్వానికి తగినట్లు తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, భవిష్యత్తుపట్ల స్పష్టమైన అవగాహన వుంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవితంలో దేనినైనా సాధించగలరు - రఘు
144)బ్రతకడం నేర్చుకో..చావడం కాదు.....మంచి ఏలా చేయాలో నేర్చుకో...చెడు గురించి కాదు....సర్వం నువ్వు అని కాదు..సర్వస్వం నిది అనుకుని బ్రతుకు...అశోక్... - రఘు
145)సంతోషం కన్నా శక్తివంతమైనది మరొకటి లేదు - రఘు
146)అపోహ,అనుమానం భయంకరమైన అనారోగ్యం,.దానిని నీలోకి రానీయకు! - రఘు
147)ప్రతి పరిస్తితిలో సహనసీలురుగా ఉన్నట్లయితే సంతోషము అనుభవం అవుతుంది - రఘు
148)నేటి కన్నా నిన్న తీపి..నిన్న కన్నా రేపు తీపి..నిన్న లేనే లేదు! రేపు రానే రాదు!! కాబట్టి సమయ పాలన ఉన్నవాడికే విజయం. - రఘు
149)నీ మార్గములో అవరోధాలు వస్తే భాదపడటం మాని, నీ ప్రయత్నం ప్రారభించు - రఘు
150)ఆత్మవిస్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాదించిన గొప్ప వ్యక్తుల జీవతాలన నిసితంగా పరిశీలించండి వారిని నడిపించింది ఆత్మవిశ్వసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిస్వాసం లేనివాడు నాస్తికుడు అనేది నేటి మాట. - రఘు
151)శ్రేష్టమైన ఆలోచనల బలంతో నీవు ఏది కావాలంటే అది చేయగలవు. - రఘు
152)ఇతరులును మెప్పించటం కోసం జీవించటం కాదు.పరమాత్ముని మెప్పించేందుకు జీవించు - రఘు
153)విజయం మేధావిని వినయవంతుడిగా, సామాన్యుడుని ఆశ్చర్యచకితునిగా, అవివేకిని అహంభావిగా చేస్తుంది - రఘు
154)మౌనం అన్నిటికి సమాధానం చెప్తుంది.....మాటల్లో లేని అర్ధం, పరమార్ధం.. మౌనంలో ఉంది...అశోక్.. - రఘు
155)మనసుతో ప్రేమిస్తే గెలుస్తావు..కళ్ళతో ప్రేమిస్తే ఓడిపోతావు.. - రఘు
156)పేరు సంపాదించుకోవడం అంటే అమ్మ నాన్న నికు పెట్టిన పేరు కాదు..నువ్వు సంపాదించుకున మంచి పేరు ..అది నువ్వు పోయాక కూడా నలుగురు చెప్పుకుంటె దానిని పేరు సంపాదించుకోవడం అంటారు. - రఘు
157)జీవితం అంటే గడిచిన కాలం కాదు...నువ్వు చేసిన మంచి..నువ్వు సంప్పదిన్చుకున్న పేరు..... - రఘు
158)వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించినవాడికన్నా తన మనస్సును జయించినవాడే పరాక్రమవంతుడు’’. కనుక మనస్సును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని. మనో నిగ్రహం లేని వ్యక్తి అసాధారణమైన పోకడలకూ, విపరీతమైన అంతర్మథనం వల్ల కలిగే మానసిక పతనానికి గురి అవుతాడు. అత్యంత సానుకూలమైన పరిస్థితులలోకూడా అతడు తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతాడు. - రఘు
159)మన ఆలోచనలు తయారుచేసినట్లుగానే మనం తయారవుతాం. కాబట్టి మీరు దేన్నిగురించి ఆలోచిస్తున్నారన్న విషయాన్ని గురించి జాగ్రత్తపడాలి. మాటలు కాదు ముఖ్యం ఆలోచనలు! ఆలోచనలు జీవిస్తాయి. అవి ఎంత దూరమైనా పోతాయి. మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మన వ్యక్తిత్వపు రంగును పులుముకుని బయటకు వెలువడుతుంది. - రఘు
160)భిన్నత్వాన్ని ఏకత్వములోకి,చెడును మంచిలోకి ,పరివర్తన చేయడమే సర్వోత్తమ గుణం - రఘు
161)ఇతరులను పరిహాసం చెయ్యవద్దు నిన్ను పరిహసించటానికి అవకాశం ఇవ్వవద్దు. - రఘు
162)ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చినా, పవిత్ర నదీ జలాలలో స్నానాలు ఆచరించినా, వేదాలు ఎన్నిసార్లు చదివినా సత్యవాక్కుతో సమానం కావు. అన్ని ధర్మాలలోకల్లా సత్యమే గొప్పది..అబద్ధాలు చెప్పడంవల్ల తాత్కాలిక ప్రయోజనాలున్నా చివరికి సత్యమే జయిస్తుంది. భగవంతుడు ఇతర జంతు జాలానికి ఇవ్వని బుద్ధి, జ్ఞానం మానవుడికి మాత్రమే ప్రసాదించాడు. వాటిని వికసింపజేసుకునేందుకు అహర్నిశలూ ప్రయత్నిద్దాం. సత్యమేవ జయతే అనే నినాదానికి జీవంపోద్దాం. - రఘు
163)అహంకారాన్ని , అజ్ఞానాన్ని వదిలివేయుము త్యాగం చేసే గుణం, ఇతరులను ప్రేమించే తత్వాన్ని అలవర్చుకొనుము - రఘు
164)సత్యమే తల్లి; జ్ఞానే తండ్రి; ధర్మమే సోదరుడు; దయయే స్నేహితుడు; శాంతమే భార్య; ఓర్పే పుత్రుడు. ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు. మనల్ని వెన్నంటి వచ్చే నిజ బంధువు సత్యం ఒక్కటే - రఘు
165)కల్మషం లేని వారు ఇతరులలో మంచినే చూస్తారు,కలుషితమైన మనసు గల వారు ఎపుడ్డు చెడునే చూస్తారు. - రఘు
166)కర్మ నిడవలె మనిషిని వెన్నంటే వుంటుంది.కావున శ్రేష్ట కర్మలనే చెయ్యాలి - రఘు
167)ప్రాణులన్నీటిల్లోకల్లా ఒక్క మనిషికే ఆలోచనాశక్తి ఎక్కువగా ఉంటుంది. మనం జంతువులంకాదు మనుషులం కాబట్టి మాటలు ఆలోచించి సక్రమంగా మాట్లాడితే నీతో పాటు నిన్ను అభిమానించే పదిమంది ఉంటారు. లేదు అనాలోచితంగా, అసహనంగా, అసభ్యకరంగా, అవ్యవహరికంగా, అనుచితంగా మాట్లాడితే మిగిలేది నువ్వొక్కడివే.. - రఘు
168)పొగిడే వాడి కన్నా తిట్టే వాణ్ణి నమ్ము బాగుపడతావు...తిట్టే వాడు నువ్వు చెసే తప్పు ఏంటో చెప్తాడు ..మార్చుకునే వీలుంటుంది..నికు నువ్వు ఎలాగో తెలుసుకోలేవుగా. - రఘు
169)తక్కువ సంపాదించేటప్పుడు పొదుపు చేయ్...ఎక్కువ సంపదించేటప్పుడు తెలివిగా ఖర్చు పెట్టు..అప్పుడే జీవితంలో సుఖంగాని సంతోషం గాని ఉంటాయి - రఘు
170)నీకు అన్ని తెలుసు అని నీవు చెప్పవచ్చు కాని నీ పనులని బట్టే ఆ విషయం తెలుస్తుంది - రఘు
171)మాట అనే ఆయుధాన్ని పద్దతిగా వాడితే పైకోస్తావ్ - పద్ధతి తప్పి మాట్లాడితే అదే ఆయుధానికి నువ్వే బలైపోతావ్.అందుకే సభ్యత సంస్కారంతో మాట్లాడుతూ అందరిచేత గౌరవాన్ని అభిమానాన్ని అందుకుంటూ మనిషి అనే పదానికి మనం సరైన అర్దాన్ని ఇవ్వాలి. - రఘు
172)ఇతరులను బాధించే వారికీ నిజమైన సుఖ సంతోషాలు ఉండవు - రఘు
173)మీ జీవిత విలువను గ్రహించి నడిచినట్లుయితే ఇతరులు కూడా మీకు విలువనిస్తారు. - రఘు
174)సృష్టిలో ప్రతి ప్రాణీ కోరుకునేది ఆనందం. ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా వారి స్థితిగతులు ఏవైనా కూడా వారి వారి స్థాయిలో ఆనందం పొందాలనే అనుకొంటారు. అయితే ఆనందం అత్యున్నతంగా, అత్యుత్తమంగా వుండాలి అంటే ఎదుటివాడి ఆనందాన్ని, స్వేచ్ఛనూ దోచుకొని మనం ఆనందాన్ని పొందాలనే దుర్మార్గపు ఆలోచన రానంతవరకూ మనిషిగా మన జన్మ సార్థకమైనట్లే.మనమంతా ఆ దిశగా జీవిద్దాం. మానవులుగా తరిద్దాం. విశ్వశాంతి సమకూరుద్దాం. - రఘు
175)కోపం పిచ్చివానిగా చేస్తుంది.కావున కోపం తగ్గించుకుని వివేకవంతుని గా నడుచుకో - రఘు
176)మనిషి బ్రతకడానికి నీరు, గాలి, కూడు, గుడ్డ ఉంటె చాలు కాని మనిషి మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి....! విశ్వ.... - రఘు
177)డబ్బు ఎంత సంపాదించినా మనిషికి సంతృప్తి అనేది తీరదు.అదే మనశ్శాంతి కాస్త ఉన్నా తృప్తిగా ,ఆనందంగా ,సంతోషంగా బ్రతుకు జీవనం సాగించగలం - రఘు
178)మనము ఇంకొకరికి సహాయము చేసినప్పుడు కలిగే తృప్తి ఎన్ని లక్షలున్నా,కోట్లున్నా రాదు. - రఘు
179)జీవితానికొక అర్ధం పరమార్ధం కలగాలంటే మన జీవన శైలిని ఆదర్శప్రాయంగా తీర్చి దిద్దుకోవాల్సిన అవసరం ఉంది....! విశ్వ..! - రఘు
180)చెప్పుట-చేయుటలో సమానత్వం కలిగి ఉండుట మహాత్ముల లక్షణం - రఘు
181)ఆలోచించే విధానము, జ్ఞాపకము ఉంచుకునే శక్తి, మాట్లాడే పధ్ధతి, విశ్లేషణ చేసే దృక్పథము మరియు విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక వీటన్నింటిని నిరంతరమూ మెరుగు పరచుకుంటూ నడిచే మనిషి తను తలపెట్టిన ప్రతి పనిని అత్యంత సామర్ధ్యం తో నిర్వహించగలుగుతాడు. - రఘు
182)మనము పుట్టుకకు ముందు మనము లేము మన మరణము తరువాత మనము ఈ భూమిపై ఉండము..అంటే జీవితమంటే మనము ఈ భూమిపై గడిపే సమయము..అది అత్యంత విలువైనది అని గమనించవచ్చు..జీవితమంటే సమయమే..సమయనాన్ని వృదా చేయటము అంటే జీవితాన్ని వృదా చేయటము తో సమానము అన్నమాట..సమయాన్ని బాగా ఉపయోగించటము అంటే జీవితాన్ని సార్ధకము చేసుకోవటము....కాబట్టి ప్రతి ఒక్కరు సమయాన్ని సద్వినియోగాపరుచు కోవాలి . - రఘు
183)నూనె లేని దీపం వెలగదుదైవ చింతన లేని జీవితము మెరువదు - రఘు
184)చెడు స్వభావం గల వ్యక్తి సదా ఎల్లప్పుడూ కోపగించుకోనును - రఘు
185)ప్రతి మనిషి లోను కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి. నీలో అటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అని విశ్లేషించి తెలుసుకోవాలి. నీవు ఇష్ట పడేవి ఏమిటి, నీవు బాగా చేయ గలిగేవి ఏమిటి అనేవి తెలుసుకొని వాటిని ఇంకా అబివృద్ది చేసుకొని వాటి ద్వారా నీకు మంచి గుర్తింపు వచ్చే దారిలో ప్రయత్నము చేయాలి వాటిని నిరంతరము అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించాలి..అలా చేసినప్పుడు నీపై నీకు విశ్వాసము పెరిగి కొత్త పనులు చేయటానికి కావలసిన మానసిక సంసిద్దత పెరుతుంది.దాని వలన కార్య దీక్ష పెరిగి విజయం సాధించవచ్చు. - రఘు
186)అర్ధము లేని భయాలతో , ఆందోళనలతో,ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అవసరమైన పనులను మనము చేయకుండా అదృష్టాన్నినిందిస్తూ పరిస్థితులను దూషిస్తూ, పనికిమాలిన సంభాషణలతో జీవితాన్ని గడుపుతారు కొందరు. సోమరితనము, నిరాశ ,నిస్పృహ,పిరికితనము మొదలైన గుణాలు వారి వ్యక్తిత్వంలో కలిసిపోయి ఇంక ఎమీ చేయలేమని భావిస్తూ జీవిస్తారు.కానీ తమలోనే దాగి ఉన్నపరిష్కారాన్ని ,మానసిక ఉత్తేజాన్ని తెలుసుకోలేరు.ఆ అమృత ప్రవాహాన్ని గుర్తించినప్పుడు వారు తప్పక విజయం పొందుతారు. - రఘు
187)మనకు జీవితంలో నిజమైన ఆనందం లక్ష్యాలను చేసుకుని వాటిని సాధించటం ద్వారానే వస్తుంది. మన జీవిత చివరి దశలో మనము వెనుకకి తిరిగి చూస్తే మనము సాధించిన విజయాలే మనకు ఆనందాన్ని ఇస్తాయి. విజయము అంటే డబ్బు సంపాదన కాదు. మానసిక శాంతి, అన్ని విధాల అభివృద్ధి చెందిన వ్యక్తిత్వం. క్రమశిక్షణ మరియు పట్టుదలలు మనిషిని తన లక్ష్యాలు సాధించే విధముగా నడిపించి, ప్రోత్సహించి, ప్రేరేపించి మరియు స్ఫూర్తినిచ్చి విజయాలు సాధించే విధముగా తయారు చేస్తాయి. - రఘు
188)మనకు జీవితంలో కనిపించే ప్రతిసమస్యా అనుకున్నంత తీవ్రంగా ఉండదు. మనకు ఎదురయ్యే ప్రతికూల సంఘటనలనుండి మనము బలంగా ఎదుగుతాము. మనశక్తి పెరుగుతుంది. క్రమముగా ప్రయత్నించినపుడు సమస్య మనకు లొంగిపోతుంది. మనలో సమస్యలపై వ్యతిరేక భావాలను సాలోచనతో అనుకూలంగా మార్చుకొని మనమీద మనము నమ్మకాన్ని పెంచుకొని జయించగలము అనే నమ్మకంతో సాగిపోవటం అవసరం. - రఘు
189)ఎవరూ పుడుతూనే గొప్ప వారిగా జన్మించరు.గొప్ప గొప్ప విషయాలను సాదించిన వారు కూడా నిరంతర ప్రయత్నము ఎన్నో ఓటముల అనంతరము విజయాలు పొందారని గుర్తించాలి. ఎవరూ ఏ పనినైనా మొదలు పెట్టిన వెంటనే పూర్తి చేయలేక పోవచ్చు కానీ ఏకాగ్రతతో చేయాలనే తపనతో చేస్తే సాదించగలరు అనే నమ్మకాన్ని బలంగా మనలో నింపుకొని మనకు ఎదురయ్యే ఓటమిని విశ్లేషిస్తూ కొత్త పదకాలతో ముందుకు నడిచే యోచనను అనుక్షణము ఆచరించిన విజయం తధ్యం! - రఘు
190)మన జీవితములో సమయము ఖర్చు పెడితే చేజారిపోతుంది.మన ప్రమేయము లేకుండానే మనము ఏ పని చేయకుండా కూర్చున్నా సమయము దొర్లిపోతుంది...ఒక్కొక్క క్షణము వజ్రము కంటే విలువైనది...అందువలన సమయ దుర్వినియోగము జీవిత దుర్వినియోగము తో సమానము..మనము ఖర్చు చేసే ప్రతినిమిషము ఎటువంటి పనిమీద చేస్తున్నాము అనే విచక్షణ అవసరము..అలా అలోచించి చేసే వ్యక్తి తనకున్న పరిమిత కాలాన్ని మంచి పనులకి  ఉపయోగించుకొని మంచి పేరు సంపాదించుకొగలడు - రఘు
191)వర్తమానంలో జీవించటానికి ప్రయత్నించు,వీలైనంతగా శ్రమంచి,వివేకవంతుని గా జీవించు - రఘు
192)ఆలోచించే విధానము, జ్ఞాపకము ఉంచుకునే శక్తి, మాట్లాడే పధ్ధతి, విశ్లేషణ చేసే దృక్పథము మరియు విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక వీటన్నింటిని నిరంతరమూ మెరుగు పరచుకుంటూ నడిచే మనిషి తను తలపెట్టిన ప్రతి పనిని అత్యంత సామర్ధ్యం తో నిర్వహించి విజయాన్ని పొందగలుగుతాడు  - రఘు
193)ఆత్మవిశ్వాసం అనేది చాలా గొప్ప లక్షణం . ఏ పనైనా మనము చేసే కొద్ది మనకు అనుభవము పెరిగి మనకు నైపుణ్యము వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఆ పని చేయాటానికి కావలసిన మెలుకవలను సానుకూల దృక్పదంతో ఆసక్తిగా గమనించి రోజు రోజుకూ కొద్ది కొద్దిగా విజయాలను పొందుతూ ముందుకు కదలాలి. మనము చేసిన పొరపాట్లను విశ్లేషించి వాటిని రాబోయే కాలములో ఆపటానికి కావలసిన మార్గాలను గుర్తించి పాటించి సాదించాలి..అంతే కాని మొదటి ప్రయత్నము లోనే పూర్తి నాణ్యత రావాలని రాకపోతే అపజయము పొందామని భావించరాదు..మన ఆలోచనా విదానమే మన విశ్వాసము, మన శక్తి, మన కదలిక, మన జీవిత సాఫల్యము.. ఈ సిద్దాంతాలు పాటిస్తే ఆత్మ విశ్వాసం నిరంతరం మన వెంటే ఉంటుంది దానితో దేనినైనా సాధించగ - రఘు
194)వృత్తిని ఎంచుకునేటప్పుడు చాలామంది సమాజంలో బాగా డబ్బువస్తున్న, తమకు తెలిసినవారు చెప్పినవాటిని ఎంచుకుంటారు. కాని, అది మన ప్రవృత్తికి సరిపడనప్పుడు, దానిపై మనకు సంపూర్ణవిశ్వాసము లేనపుడు మనము దానిలో రాణించలేము. గొప్ప స్థానానికి చేరలేము. అందుకే మనమనసుకు నచ్చేటటువంటి వృత్తిని ఎంచుకోవాలి. దానిలో ఉన్నతికి కృషిచేసి సంపూర్ణ విజయం సాధించగలరు - రఘు
195)ప్రతి ఒక్కరూ తమ దిన చర్య ఎంత తీరిక లేకుండా వున్నప్పటికీ తమలోకి తాము తొంగి చూసుకునేందుకు ప్రతినిత్యం ఎంతో కొంత సమయం కేటాయించుకోవాలి. తమ పనుల్లోని పొరపాట్లను గుర్తించి సకాలంలో సరిదిద్దుకోవాలి. వీలైనంత మేరకు అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ఎప్పటికప్పుడు ఎదుటివారి సుగుణాలను స్వీకరిస్తూ వారి వారి దోషాలను, ద్వేషాలను పొరపాటుగానైనా తమపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడగలగాలి. ఇలాంటి సందర్భాల్లోనే అభిమానాన్ని అహంభావంగా పొరపడే వారు లేకపోలేదు. స్వాతిశయానికి దారితీయని స్వాభిమానం ఎప్పుడైనా ఎక్కడైనా స్వాగతించదగిందే! - రఘు
196)సత్యము, పవిత్రత, నిస్వార్ధం అను మూడు సుగుణములు కలిగిన వ్యక్తి తనకు ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నను తను చేసే మంచి పనులను కొనసాగించగలడు. అతనిలో ఉన్న నైతిక బలము అతనికి ధైర్య సాహసాలను, మానశిక శక్తిని ఇచ్చి ప్రోశ్చాహించి నడుపుతుంది. - రఘు
197)మాటలను మనిషికి మాత్రమే భగవంతుడిచ్చిన వరం. దానిని సద్వినియోగం చేసుకోవడం మనిషి యొక్క కర్తవ్యం. మధురంగా మాట్లాడడం మనిషి అలవాటు చేసుకోవాలి. దానివలన మనకి ఎన్నో లాభములను పొందగలము . మధురమైన మాట, యితరుల మనస్సులను ఆకర్షిస్తుంది..అంతే కాక ప్రతి ఒక్కరు సత్యం అన్న ఆయుధాన్ని తీసుకోవాలి. స్వార్థాన్ని విడనాడాలి. నలుగురు బాగుండాలి అన్న విశాల హృదయాన్ని అలవర్చుకోవాలి..అందుకే నలుగురితో మంచిగా ఉంటే నాలుగుకాలాలపాటు నీవు చల్లగా బతుకుతావు అని పెద్దలు ఆశీర్వదించుతారు - రఘు
198)పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తూ ఉంటారు, అది నిజమే కాని అది కేవలం భౌతిక ఆరోగ్యం మాత్రమె....ఈష్యా.. అసూయ.. అహంభావం.. గర్వం.. స్వార్ధం.. కామం.. క్రోదం.. లోభం వంటి హానికారక క్రిములను.... మన మనసు పరిసరాలకు చేరకుండా జాగ్రత్త పడితే కలిగే ఆరోగ్యం మానసికంగా ఉపకరిస్తుంది....ఎన్నో మానసిక రోగాలకు మనసు కలుషితం కావడమే ముఖ్య కారణంగా నేను భావిస్తున్నాను.... మనసుని నిష్కల్మషంగా ఉంచుకోండి - ఆరోగ్యవంతులు కండి.... - రఘు
199)లక్ష్యాలాను, ధ్యేయాలను మరచి.. హక్కుల కోసం పోరాటాలు చెయాడం ఒక బాధ్యతాయుతమైన వైద్యుడు చేసే పని కాదు....! - రఘు
200)మనిషి యొక్క స్వభావం, అతని మాటలలో వ్యక్తమవుతుంది. అతని మాట తీరును బట్టి అతని వ్యక్తిత్వం తెలియబడుతుంది. అందుకే బాగా ఆలోచించిన తరువాతనే మాటలాడాలి కాని, మాటలాడిన తరువాత ఆలోచించడం వ్యర్థం - రఘు
201)ధనం మూలం ఇదం జగత్’ ఇది సత్యమే. అంతమాత్రాన అధర్మమార్గాన ధనాన్ని పొందడం సరికాదు. అందుకు ఆ శ్రీలక్ష్మి సైతం ఆమోదించదు. కష్టార్జితం కాని ధనానికి స్థిరత్వం ఉండదు. ధనమునకు అధిదేవత లక్ష్మీదేవి. ఆ దేవత కరుణా కటాక్షాలు పొందాలంటే ధర్మమార్గాన ధనధాన్యాలు, సిరిసంపదలు పొందాలి. అందుకు దానమే సరియైన మార్గం. నిజానికి దానం చేస్తే ధనం తరిగిపోతుందన్న భావన మనలో కల్గడం సహజమే. కాని ఇది సరికాదు. ధర్మబద్ధంగా పొందిన ధనంలో మన శక్తిమేరకు దానం చేయడమన్నది గమనార్హం. సక్రమార్జన సత్ఫలితాలనిస్తుంది. అక్రమార్జనతో చేసిన దానం నిలువదు గాక నిలువదు. అలా సంపాదించిన ధనం అనారోగ్యానికి మనశ్శాంతి కరవుకావడానికి అష్టకష్టాలకు కారణం కాగలదు. - రఘు
202)నీ ఆత్మ గౌరవాన్ని పెంపొందిచుకోనక పోయినట్లయితే నీవు ఎప్పటికి మరొకరి కింద ఉండిపోవల్సిందే ! - రఘు
203)మనము బ్రతకటానికి ఎంచుకున్న వృత్తి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సాగకూడదు. మనం బ్రతుకుతూ, మనచుట్టూ వున్న సమాజాన్ని అభివృద్ధి చేయాలి. మన పనులు సమాజ నిర్మాణానికి తోడ్పడాలికాని వినాశమువైపు పోరాదు. అలా యితరులకు నష్టము కలుగచేసేవృత్తి కాలక్రమములో నాశనము కాకతప్పదు. నీవు ఈసమాజంలో అంతర్భాగము. యితరులకు నష్టము జరిగితే నీకు జరిగినట్లే. నీకు కూడా ఆ నష్టము కాలక్రమములో సంక్రమిస్తుం - రఘు
204)తమ స్వార్ధపు హక్కుల కోసం రోగుల ప్రాణాలను గాలికొదిలేసిన యువ వైద్యులకు ఇదే నా విన్నపం.... - రఘు
205)ప్రస్తుత ప్రపంచంలో సాధ్యమైనంత వరకూ కోరికలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తూ పోతే అసూయ, ద్వేషాలు కూడా చాలావరకూ తగ్గిపోతాయి. అసూయ మనసులో తిష్టవేసిందీ అంటే ఖచ్చితంగా అనారోగ్యమే. ఆరోగ్యాభివృద్ధి కోసమైనా ‘అసూయ’ను తరిమేయటం ఉత్తమ లక్షణం. - రఘు
"206)ఏదైన పని ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి దానిని కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చెయ్యడానికి పట్టుదల ఉండాలి ఈ మూడు ఉండాలనుకుంటే మొహం మీద చిరునవ్వు ఎప్పుడు ఉండాలి.. కాబట్టి నవ్వుతు,ఆనందగా ఎ పనైనా ప్రారంభిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరగలవు - రఘు
" 207)మనకు సంతోషం అనేది ఎదుటివాడి నవ్వులో నుండి వస్తుంది అంతే గని నువ్వు కర్చు పెట్టె డబ్బు నుండి కాదు...నలుగురితో నారాయణ అన్నట్లు నలుగురిలోనే ఉంది సంతోషం.... - రఘు
208)చింతలను వీడి దైవ చింతన చేయండి.ఎల్లవేళలా మనసు ప్రశాంతంగా ఉంటుంది - రఘు
209)మనిషి ఎన్ని దానాలు చేస్తే అంతగా సంపన్నుడవుతాడు .అదే లోభంతో ప్రవర్తిస్తే మాత్రం అదే శత్రువై ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది ..మంచి ప్రవర్తన ఆభరణంలా ఆదుకుంటుంది .సంతోషం ధనంలా ఉపయోగపడుతుంది..కనుక నీతి మార్గమే మనిషికి శ్రేయస్కరం.నీతిపధమే ఫలదాయకం.నీతితో కూడిన జీవనమే శాశ్వతం.అదే పరమార్ధం - రఘు
210)సత్వగుణం,సత్ర్పవర్తన ,సమర్ధత,భాద్యత,సేవాభావం,క్రమశిక్షణ,సృజనాత్మకత ,ప్రణాళిక ..ఇవన్ని మనిషి లక్ష్యం నేరవేరడానికి బలాన్నిస్తాయి కాబట్టి పై గుణాలన్నీ కలిగి ఉన్న వ్యక్తులకి విజయాన్ని దక్కించుకోవడం చాలా తేలిక !!! - రఘు
211)మనస్సును బట్టి ఆలోచనలు,ఆలోచనలు బట్టి పనులు,పనులుబట్టి విజయాలు,విజయాలను బట్టి వ్యక్తిత్వమూ రూపుదిద్దుకుంటాయి.కాబట్టి ఎవరైతే మనస్సుని అధీనపరుచుకుంటారో వారికి ఎటువంటి కార్యక్రమంలోయినా సరే విజయం తధ్యం !!! - రఘు
212)మనకు సంతోషం అనేది ఎదుటివాడి నవ్వులో నుండి వస్తుంది అంతే గని నువ్వు కర్చు పెట్టె డబ్బు నుండి కాదు...నలుగురితో నారాయణ అన్నట్లు నలుగురిలోనే ఉంది సంతోషం.... - రఘు
213)దయ కలిగిన మనసులో మంచి మర్యాదలకుగాని, ప్రేమానురాగాలకుగాని లోటుండదు .దయ కలిగిన మనసు దైవసన్నిధికన్నా గొప్పది..కాబాట్టి ప్రతి ఒక్కరికి దయ అనే సద్గుణం కలిగి ఉండాలి - రఘు
214)ఆచరణకు నోచుకోని కోటి మాటలకన్నా తక్షణం చెయ్యగలిగే చిన్న పని ఎంతో మిన్న!! కాబట్టి ఎవరైతే మాటలలో చెప్పక చేతల్లో చూపించాగాలరో వారి యొక్క జీవితంలో ముసురుకున్న చీకట్లను దూరం చేసే వెలుగురేఖగా మారగలరు - రఘు
215)ఇతరుల పొరపాట్లను క్షమించటం మరియు మర్చిపోవటమే సహనశీలత - రఘు
216)నేర్చుకున్నాము అనే అహం కన్నా తెల్సుకోవాలి అని ఆసక్తి చాల గొప్పది - రఘు
"217)చెయ్యడానికొక పని ప్రేమించడానికొక మనిషి, జీవించడానికొక ఆశ, పై మూడూ ఉన్నావాళ్ళు జీవితంలో నిత్యం సంతోషంగా ఉంటారు. - రఘు
" 218)అటక ఎక్కడానికి మనం నిచ్చెన వేస్తాం. ఆ నిచ్చెన తొలి మెట్టు ఎక్కగానే అటక చేరలేం. అన్ని మెట్లు ఎక్కాల్సిందే. అలాగే మానవ ప్రయత్నాలు కూడా. ఒకటి ప్రయత్నించి ఫలితం రాకపోతే దానిని మధ్యలోనే విరమించకూడదు. మరో ప్రయత్నం చేయాలి. అప్పుడే గమ్యం చేరుకోగలం ..కాబట్టి మనిషి తను అనుకున్న గమ్యాన్ని చేరాలంటే నిరంతర సాధనతో పాటు సాధించాలనే తపన ,కఠోర దీక్ష ఎంతో అవసరం - రఘు
219)తమలో ఉన్న సూక్ష్మ బలహీనతలను పరిశీలించి తొలిగించుకోవడన్నే ఆత్మ పరిశీలన అంటారు - రఘు
220)పేరు ప్రతిష్ట కోసం లక్షలు కర్చు చేయటం కన్నా ప్రేమ నిజాయితిలతో పెట్టె పిడికెడు అన్నం ఎంతో గొప్పది - రఘు
221)పుట్టుకతో భోగి అయినవాడు కూడా రోగాల పాలుకాగలడు.పుట్టుకతో రోగి అయినవాడు తరువాత భోగాలను అనుభవించగలడు ..కాబట్టి సుఖమనేది ఏ ఒక్కరి సొత్తు కాదు,అలాగని దుఖం అనేది ఎవరినో ఒకర్ని పట్టుకొని జీవితాంతం పీడించదు..ఇది అర్ధం చేసుకున్నవాడి దగ్గరకి దుఖం దరిదాపుల్లోకి కూడా రాలేదు. - రఘు
222)మనకి ఎవరో సహాయము చేయాలి, మనలను ఎవరో కాపాడాలి, మనలను ఎవరో మార్చాలి అని భావిస్తూ నడవటము వ్యర్ధజీవుల లక్షణము. సహాయము ఎక్కడనుంచో రాదు. అది మనలోనుండే ఉద్భవించాలి. మనకుమనమే నిజమైన సహాయము చేసుకోగలము. మనకుమనము సహాయము చేసుకోలేనపుడు వేరెవరూ సహాయము చేయలేరు. మనము మన మానశిక శక్తిని ఉపయోగించగలిగినపుడు అనుకున్నది సాధించగలుగుతాము. అందరూ మెచ్చుకునే నాయకునిగా ఎదుగుతాము. మనము నడిచే బాట ఆదర్శముగా మారుతుంది. - రఘు
223)మనిసి ఉన్నతికి అతని పనులే కారణం. అతని అభివృద్దికి తను తీసుకున్న నిర్ణయాలే కారణం.మన నిర్ణయాల నాణ్యత మన మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన గమ్యానికి మనమే భాద్యులము.ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును. - రఘు
224)ఒక అవకాశం చేజారిపోతే కళ్ళ నీళ్లు పెట్టుకోకు, మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడు - రఘు
225)సహనాన్ని బాధతో కాక, సంతోషంతో స్వీకరించే వారె సత్యమైన సహనశీలులు. - రఘు
226)ప్రతి మనిషి తనకు ఉన్నంతలో సమాజంలోనివారికి ఏదో ఒక సహాయం చెయ్యగలగాలి , ఎంతో కొంత ఇవ్వగలగాలనుకోవడం అసలైన సంపదకు ఆనవాలమవుతుంది. వస్తూ తాను తెచ్చిందేమీ లేదని వెళ్తూ తాను తీసుకెళ్లగలిగేది ఏమీ వుండదని తన పని తాను శక్తివంచన లేకుండా చేస్తూ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో ఆ దిశలో అడుగులు వేస్తూ, ఆలోచిస్తూ ఆరాధిస్తూ.. ముందడుగు వెయ్యగలిగితే ఊహకైనా అందని రీతిలో అసలు సంపద చేకూరి జీవితానికో సార్థకత ఏర్పడుతుంది. - రఘు
227)ఇతరులలో మంచిని చూడకపోవడం మనలో మంచితనం లేకపోవడాన్నే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో మంచినే చూడడానికి ప్రయత్నం చెయ్యండి - రఘు
228)ఒక మనిషి విజయం సాధించడానికి ప్రతిభ అనేది ఒక్క శాతం అయితే తొంబై తొమ్మిది శాతం నిరంతర కృషి...కాబట్టి కృషి లేనిదే విజయం రాదు - రఘు
229)మీ మాటలు ఎంత మహాత్తరముగా ఉన్నప్పటికీ, అవి మీ కర్మల ద్వారానే గుర్తింపబడతాయి. - రఘు
230)తయారయ్యే ప్రతి వస్తువు తప్పనిసరిగా ఎప్పటికైనా పాడవుతుంది,వాటి గురుంచి ఎక్కువగా అలోచించి నీ మనసు పడుచేసుకోవద్దు - రఘు
231)నీవు బయపడే పనులను మరల మరలా చేయటం ద్వారా నీలో కొంచెము కొంచెముగా భయము పోయి దైర్యము పెరుగుతుంది. ఎప్పుడు ఆనందముగా ఉండటానికి, నీగురించి నీవు సంతృప్తిగా ఉండటానికి ప్రాదాన్యత ఇవ్వాలి. నీవు తలపెట్టి చిత్తశుద్ది తో చేస్తే ఎటువంటి పనినైనా చేయగలవు అనే విషయాన్ని నీకు నీవే పదే పదే చెప్పుకోవాలి. అప్పుడు మనకు ఆ పని చేయటానికి కావలసిన శక్తి వచ్చి భయం తొలిగి ఏ పనినైనా చేయగలిగేలా చేస్తుంది - రఘు
232)అసత్యానికెప్పుడూ అపజయం తప్పదు , విజయం సదా సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది .కాబట్టి ప్రతి ఒక్కరు విజయం సాధించాలంటే సత్యంతో,ధర్మంతో ముందుకు నడవాలి. - రఘు
233)ఈ జీవితం గెలుపు,ఓటముల ఆట దీనిని నాటకమని భావించి నటిస్తే సదా సంతోషంగా ఉంటారు - రఘు
234)మనిషికి ఉన్న ఉత్తమ సంపదలో దయ మొట్టమొదటిది. మనిషి ఎప్పుడు ఆర్తులయందు ఆదరణ , పేదలయందు దయ, దీనులయందు దాతృ స్వభావం, కష్టాలలోబాధపడేవారిపై కరుణ ఇలాంటి పరోపకార బుద్ధితో కూడిన సహృదయం కలవాడై ఉండాలి. మానవుడు తన హృదయాన్ని దైవ సంపదతో నింపుకొని దైవ నిలయంగా తీర్చిదిద్దుకోవటమే లక్ష్యం కావాలి. - రఘు
235)చదరంగంలో మాదిరిగానే జీవితంలో కూడా ముందుచూపు ఎంతో అవసరం - రఘు
236)చిరునవ్వుకు ఖర్చు లేదు దాని విలువ అమూల్యం ,కావున సదా చిరునవ్వుతో ఉండండి - రఘు
237)నలుగురికీ మేలు చేయాలనే సత్సంకల్పం, తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఉన్నదానిలోనే నలుగురికి పెడుతూ, సత్యవాక్కుతో, దీక్షతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో జీవించడం అనేవి మంచి లక్షణాలు . సంఘ శ్రేయస్సుకూ, వ్యక్తి వికాసానికీ పనికివచ్చే ఈ మంచి లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉండాల్సినవి...ఇవి సదా ఆచరణీయం . - రఘు
238)మంచి లక్షణాలు మనసుకు ప్రశాంతతను కూర్చి ఆశావాదాన్ని కల్గించడానికి దోహదపడతాయి .ఎప్పుడైతే మనిషిలో ఆశావాదం ప్రభవించిందో, అప్పుడే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఒక్కసారి మనిషిలో ఆత్మ విశ్వాసమేర్పడిందంటే అతనింక అద్భుతాలనే సృష్టించగల్గుతాడు, దురదృష్టాల్ని సైతం అదృష్టాలుగా మలచుకునే శక్తిని సంపాదించుకోగల్గుతాడు.అప్పుడిక భవిష్యత్తుపై భయపడకుండా ప్రతి పనినీ తానే చేపట్టగల్గుతాడు. అంతవరకూ- గడిచిన నిరాశా జీవనం అన్నీ క్రమక్రమంగా ఆనందమయంగాను, ఆశల హరివిల్లుగాను పరివర్తనం చెందుతాయి. అప్పుడిక మనిషి జీవితం- నిత్య సుఖ సంతోషాల ఆనంద నిలయమే మరి. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి లక్షణాలను అలవరచుకోవాలి. - రఘు
"239)కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం.కృషి చేస్తే అసాధ్యం వుండదు,వ్యవసాయం చేస్తే కరువుండదు, తపస్సు చేస్తే పాపముండదు, మౌనంగా ఉంటే దెబ్బలాట ఉండదు, జాగ్రత్తగా ఉంటే భయం ఉండదు., వీటన్నిటికి కృషి ఉండాలి,కాబట్టి ""కృషి"" చేయనిదే ఏదీ కూడా సిద్ధించదు - రఘు
" 240)మాటలలో సత్యత,సబ్యత మరియు సమతుల్యత ఉన్నట్లయితే ప్రతి మాట అముల్యమైనదిగా అవుతుంది - రఘు
241)నాయకునిగా ఎదగాలనుకున్న వ్యక్తికి బలహీనతలు ,దురలవాట్లు ,అత్మ న్యూనత, అధైర్యము ఉండరాదు.వాటిని జయించటానికి తాను కష్టమైన మార్పు పొందే ప్రక్రియను చేపట్టాలి.ఆ మార్పును పొందటానికి తాను నిరంతరం మానసిక శక్తిని ఉత్తేజ పరచుకోవాలి.తనకు ఎదురైన కష్టాలను, విమర్శలను తాను పైకి ఎక్కటానికి ఉపయోగపడే నిచ్చెనగా మార్చుకొని ఎదుగుతూ సాగాలి.అనుక్షణం తనతో తాను పోరాడాలి,బలపడాలి,సాధించాలి - రఘు
242)భౌతిక విజ్ఞానం మేదస్సు పెంచితే ఆద్యాత్మిక జ్ఞానం విధేయతను పెంచుతుంది - రఘు
243)బలమైన బలహీనతలను అధిగమిస్తూ, బలమైన బలాలపట్ల అచంచలమైన విశ్వాసం కలవారే జీవితంలోని మధురానుభూతుల్ని స్వంతం చేసుకోగలుగుతారు. - రఘు
244)సంతోషంగా ఉండేవారి వలన అనేక మంది సంతోషంగా ఉంటారుకావున మీరు సంతోషంగా ఉండి అందరిని సంతోషంగా ఉంచండి - రఘు
245)మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్యఫలం ఒక్కొక్కసారి మనం చేసే చెడ్డ పనుల వల్ల తన శక్తినంతా కోల్పోయి నిర్వీర్యమై మనిషిని కష్టాలుపాలు చేస్తుంది. మనిషి స్వర్గసుఖాలని సిరిసంపదలను, భోగభాగ్యాలను అనుభవిస్తూ ఆదమరిచి పుణ్యకార్యాలను చేయడం మానుకొంటే , తాను నిలువ వుంచుకొన్న పుణ్యఫలం కాస్త హరించుకొనిపోయి తిరిగి మనిషి కష్టాలు పాలవుతాడు. దానికై మనిషి పాపకర్మలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించి, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని ఫలితం ఎలా ఉంటుంది? అది మనల్ని ఎలా వెంబడిస్తుందనే విజ్ఞత ప్రదర్శించిన వాడు సుఖ సంతోషాలతో సాఫీగా జీవితం గడపగలడు - రఘు
246)మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అది మనల్ని కాదు,మనం సాధిస్తున్న విజయాలను కీర్తిస్తున్నారని గుర్తించాలి.మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే అది మనల్ని కాదు మన వైఫల్యాలని గుర్తించాలి.మన మనస్సుని వైఫల్యాలకి అతీతంగా పని చేసే స్థితికి ఎప్పుడూ తీసుకేల్తామో అప్పుడే నిజమైన గెలుపని అర్ధం - రఘు
"247)జీవితంలో ఒకసారి పోతే తిరిగి రాని నాలుగు అంశాలు : కాలం,మాట,అవకాశం, ప్రాణం. జీవితంలో ఏ నాడు కోల్పోకూడని నాలుగు అంశాలు : శాంతి,ఆశ,నిజాయితి, ఆశయం. జీవితంలో అత్యంత విలువైన నాలుగు అంశాలు : ప్రేమ,విశ్వాసం,నమ్మకం, మానవత్వం. జీవితంలో స్థిరంగా ఉండే నాలుగు అంశాలు : మార్పు,మరణం,దైవం, మాతృ ప్రేమ. జీవితంలో వ్యక్తిని నిర్మించే ప్రధానమైన నాలుగు అంశాలు : శ్రమ, చిత్తశుద్ధి,పట్టుదల, సంకల్పం. జీవితంలో వ్యక్తి పతనాన్ని శాసించే నాలుగు అంశాలు : కామం,గర్వం,కోపం, స్వార్ధం. - రఘు
" 248)జీవితం ఓ గొప్ప విద్యాలయం. ఇందులో నేర్చుకోగలిగినంత నేర్చుకోవచ్చు. - రఘు
249)పరచింతన పతనానికి మూలము స్వచింతన స్వర్గానికి సోపానము - రఘు
250)జీవితం ఏ ఆటంకం లేకుండా సాఫీగా, ప్రశాంతంగా సాగుతున్నంతసేపు, కష్టాలు తన దరిదాపుల్లోకి రానంతసేపు మనిషి దేనిని గురించి కూడా ఆలోచించడు. అదే అనుకోకుండా ఏదైనా ప్రమాదంగాని, చేస్తున్న పనిలో ఆటంకంగాని, అకస్మాత్తుగా జబ్బుపడడం లాంటిది జరగగానే అది నా కర్మ! నా కర్మ అట్లా కాలింది, దానికి ఎవ్వరు ఏమి చేస్తారు అని దిగులుపడతారు .కాబట్టి కర్మ చేయడమే నీ వంతు. కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు. ఫలమేదో దక్కుతుందని మాత్రం పనిచేయడం తగదు. అలా అని అసలు పని చేయకుండా ఉండడం మహాపాపం. - రఘు
251)అపజయాన్ని తలుచుకుంటూ దుఃఖించేవాడు ఎప్పటికీ ఏడుపులోనే ఉంటాడు తప్ప విజేత కాలేడు. ఇలాంటివాడికి ప్రయత్నాలే తప్ప ఫలితాలు రావు. దుఃఖాన్ని ఛేదించి ముందడుగువేసి శ్రమించినవాడు గత అపజయాల ఛాయలు కూడా కనపడని అత్యున్నత విజయ సౌధాలను నిర్మించి సుఖిస్తాడు. ఇది జీవన సత్యం. - రఘు
252)ఆరుంగుళాల నాలుకను అదుపులో ఉంచుకోకపోతే ఆరుఅడుగుల శరీరం ఇబ్బందులకు గురవుతుంది. - రఘు
253)మనిషి ప్రతి అవకాశంలో ఒక సమస్యని వెతికేకంటే ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని వెతుక్కునే వాడికి విజయం తధ్యం - రఘు
254)అమ్మ వాళ్ళ అందము.. నాన్న వాళ్ళ ఐశ్వర్యం వస్తుంది అనుకునే వాళ్ళకి ...వాళ్ళ ఇద్దరి వాళ్ళ వందేళ్ళ జీవితం.. సంతోషం వస్తుందని అర్ధం కావటం లేదు .. - రఘు
255)నీ దగ్గర ఉన్న అపూరూపమైనదాన్ని అందరికీ ఇవ్వడానికి నువ్వు సిద్దపడితే ,అందరి దగ్గర నుంచి కూడా ఆ అపూరూపమైన ఫలితమే నీకు దక్కుతుంది - రఘు
256)నిరాడంబరతలో చాల ఆనందం ఉంటుంది.అది సత్యతకు దగ్గరగా ఉంటుంది - రఘు
257)గెలుపంటే ఇతరుల కన్నా నువ్వు గొప్పవాడివి అవ్వడం కాదు.నిన్నటి "నువ్వు" కన్నా ఈ రోజు "నువ్వు" బాగుండడం. - రఘు

No comments:

Post a Comment