Sunday, January 5, 2025

మంచి మాటలు - 2025

1)జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది..!మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది..ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది..రాత్రి మాట్లాడి పొద్దున మర్చిపోయే బంధాలున్న ఈ రోజుల్లో..నీకోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ..ప్రతిరోజు ఎదురు చూసే వాళ్ళు ఉండడం అదృష్టం..వాళ్ళని వద్దు అనుకోవడం దురదృష్టం..జీవితంలో మన చుట్టూ వెయ్యి బంధాలు అవసరం లేదు..మన నవ్వు వెనుక బాధను మన బాధ వెనుక కారణాన్ని తెలుసుకొని నీకు నేనున్నా అని ధైర్యం చెప్పే ఒక్క బంధం ఉన్నా చాలు..అది ప్రేమైనా కావచ్చు స్నేహమైనా కావచ్చు..బంధుత్వమైనా కావచ్చు...జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది..ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది..ఏది ఎప్పుడు వదలిపోవాలో అప్పుడే పోతుంది..ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు..నీ చేతిలో ఉన్నది ఒక్కటే..ఉన్నంతవరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

2)ఎన్నాళ్ళు దిగాలుగా కూర్చుంటావు..? దిగులుపడే నీవంటే నలుగురికీ దిగదుడుపే..ఎవరి కష్టాలు వారికున్నాయి నీ కష్టమెవరికి కావాలి...?ఓదార్పు నీవు కోరకుంటే పాపపుణ్యాల కథలు వినిపిస్తారు...నిరాశలో నీవు కూరుకునిపోతే నిట్టూర్పుల జల్లు కురిపిస్తారు.నీ కన్నీటి జడివాన నిన్ను ముంచెత్తకముందే ఆశల గొడుగు పట్టు..పోరాడితే పోయేదేముంది..గెలిస్తే గెలుపవుతావు..ఓడితే నీ జీవితానికే మలుపవుతావు...ఎడుస్తూ కూర్చుంటే ఏమవుతావు...?వెలుతురెరుగని చీకటవుతావు.. కాబట్టి ఎప్పుడు ఓటమి ఒప్పుకోకు..గెలుపు కోసం పోరాడు నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

3)జీవితంలో జరిగే ప్రతీ చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుంది..ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ప్రత్యేకంగా తయారు చేసి ఏం ఉండదు.మన ఆలోచనల్లోనే ఉంటుంది.మనం విషయాలను తీసుకునే పద్ధతిలోనే ఉంటుంది.ఆనందమనేది మనసుకు అనిపించాలి.దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు.జీవిస్తున్న ప్రతిక్షణాన్ని నువ్వేలా చూస్తున్నావో..దానిపైనే నీ సంతోషం దాగి ఉంటుంది.చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని బాధపడితే బాధే మిగులుతుంది.కాబట్టి, గతం గురించి,భవిష్యత్ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకూడదు.ప్రస్తుతం లో జీవించేవాడే ఆనందంతో ఉంటాడు.ఆనందం రాలిన జీవితం...నవ వసంతానికై ఎదురుచూస్తుంది..కారు చీకటి కమ్మిన మనసు..నిండు వెన్నెలకై ఎదురు చూస్తుంది..చివరగా మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం దొరుకుతుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

4)జీవితంలో అనుకున్నంతనే అన్నీ అయిపోవు.కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు.అందుకోసం ఎంతో శ్రమించాలి.ఓపిగ్గా కష్టనష్టాలకు ఎదురీదాలి. చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహా వృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది.సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే.ఓర్పు వహిస్తేనే అనుకున్నది సాధించగలం ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

5)పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది.నాన్న కూడా అడిగిన అన్ని విషయాలకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పి సంతృప్తి పరుస్తాడు.ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు కొత్త ప్రపంచాన్ని చూడటంవేరు.కొత్తగా,అందంగా,అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి.ఈ ప్రపంచం ఎవరికి వారికే ప్రత్యేకంగా కనిపిస్తుంది.కనిపించాలి.అప్పుడే ప్రతి ఉదయం ఒక కొత్త సూర్యుడు కనిపిస్తాడు.చంద్రుణ్ని చూసి పిల్లాడు ఏడుపు ఆపి అన్నం తిన్నట్లు మనం కూడా ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దానిని దిద్ది మనకి మార్గదర్శకుడిలాగా వెలుగును చూపించి ముందుకు నడిపించే దేవుడి లాంటి మిత్రుడు కావాలి.అతడితోనే మనకు
చిట్టచివరి బంధం ఉండాలి..అలా దొరికినప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా వారిని వదులుకోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

6)నువ్వు పర్వతంలా ఒకే చోట నిల్చుంతానంటే కుదరదు.నదిలాగా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతూ ఉండాలి.ఎలాంటి మార్పులు జీవితంలో వచ్చినా స్వీకరించి దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకోవాలి.అప్పుడే నువ్వు కలకాలం సంతోషంగా జీవించగలవు.జీవితంలో వచ్చిన చిన్న మార్పును కూడా తీసుకోలేకపోతే నీ జీవితం ఆగిపోతుంది.నీకు ఉండాలి నేర్పు,మనస్సుకి కావాల్సింది ఓర్పు,జీవితానికి కావాల్సింది కూర్పు,బాధలలో కావాల్సింది ఓదార్పు కానీ ప్రతి మనిషికి కావాల్సింది మార్పు అప్పుడే తన గమ్యాల్ని చేరుకోగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

7)గుండె లేదా మెదడు ఈ రెండింటిలో ఏది చెప్పింది వినాలో అన్న సంఘర్షణలో మీరు పడితే...కచ్చితంగా మీ హృదయాన్ని అనుసరించండి అప్పుడు జీవితంలో ఎప్పటికీ వైఫల్యం చెందరు అలాగే...మీ జీవితంలో రిస్క్ తీసుకోండి,గెలిస్తే నాయకత్వం వహిస్తారు,ఓడిపోతే మార్గ నిర్దేశం చేస్తారు.ఇది ఎంతో మంది జీవితాలలో మార్చింది..ఇప్పటికీ మారుస్తూనే ఉంది..ఇతరులు వేసిన బాటలో నడవకండి..మీ సొంత మార్గాన్ని వేసుకుని పయనించండి గ్రహించండి అప్పుడే మనం చీకటి నుంచి వెలుగులో ప్రయాణం మొదలు పెట్టినట్టే విజయం సాదించినట్టే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

8)మన జీవితానికి మనమే శిల్పి.ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపురూపమైన
విగ్రహంగా మారగలం.దేవుడి మెడలో హారంగా మారాలంటే గుండెల్లో గుచ్చే సూది బాధను పువ్వులు తట్టుకోవాలి.ఏది సాధించాలన్నా సంకల్ప బలంతో బాధలు,అపజయాలను ఎదిరించక తప్పదు.వేలసార్లు వైఫల్యం వెక్కిరించినా వెనక్కి తగ్గలేదు కాబట్టే థామస్ అల్వా ఎడిసన్ బల్బును తయారుచేశాడు.ప్రపంచానికి వెలుగులు పంచి చిరకీర్తిని సంపాదించుకున్నాడు.వైకల్యం ఉందని చింతిస్తూ కూర్చోకుండా పట్టుదలతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హా
గుండెనిబ్బరం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ఓపిక ఉన్నంత వరకు కాదు,ఊపిరి ఉన్నంత వరకు పోరాడితేనే విజయతీరాలకు చేరగలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

9)ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపెడితే ఉన్నతశిఖరాలకు చేరుకోవచ్చు.సముద్రాన్ని దాటే ప్రతిభ తనలో ఉందని వానర వీరులు చెప్పేవరకు హనుమంతుడికి తెలియదు.తనలోని లోటుపాట్లను గుర్తించి సరైన దిశానిర్దేశం చేయగల స్నేహితులను మనిషి సంపాదించుకోవాలి.అప్పుడు విజయానికి మార్గం మరింత స్పష్టమవుతుంది.బతుక్కి అసలైన అర్థమూ తెలిసివస్తుంది. జీవితానికి మించిన గ్రంథం లేదు,అనుభవానికి మించిన పాఠం లేదు.జీవితపథంలో ప్రతి అనుభవం నుంచీ పాఠం నేర్చుకోవాలి.అప్పుడు అనవసర భయాలు,ఆందోళనలు తొలగి మనసు తేలికవుతుంది.ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తే మన లక్ష్యాల్ని మనం చేరుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

10)జీవితంలో కలలు నెరవేరాలంటే- ఏకాగ్రత,నైపుణ్యం,ఆచరణ అవసరం.లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి.కొండలు, లోయలు దాటి సుదీర్ఘంగా ప్రవహిస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే నదిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.బలహీనమైన ఆలోచనలు వదిలిపెట్టాలి.విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో లక్ష్యాన్ని చేరాలి.కొంత మెరుగైన స్థితికి చేరాక నా ఇల్లు, నా కుటుంబం అంటూ గిరిగీసుకొని కూర్చోవడమూ సరికాదు.చేతనైనంతలో నలుగురికీ సాయపడటంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది. అది ఆచరణలో
పెట్టినప్పుడే జీవితానికి సార్థకత..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

11)జీవితంలో కష్టాన్ని సుఖాన్ని ఒకేలా చూడాలి అప్పుడే ఎంతటి సమస్య వచ్చినా మనం దాన్ని తట్టుకునే శక్తిని పొందుతాము.పట్టరాని సంతోషం కలిగినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా?మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎందుకంతగా ఆలోచించి విలవిలలాడి పోతున్నాము?సంతోషం కలిగినట్టే కష్టం కూడా వచ్చి అలా పోతుంది.మనం చేయాల్సినదల్లా ఆ సమస్యను తొలగించేందుకు చిన్న ప్రయత్నం.ఏరోజు ఒకేలా ఉండదు,ఏ క్షణము మనతో నిలిచిపోదు.అలాగే కష్టాలు కూడా అలా దొర్లిపోయి వెళుతూనే ఉంటాయి.తిరిగి మనల్ని సంతోష క్షణాలకు చేరువ చేస్తూనే ఉంటాయి.అలలు కూడా తీరం చేరేసరికి ఉదృతి తగ్గించు కోవాల్సిందే.సుతారంగా మన పాదాలను తడిపి వెనక్కి వెళ్లాల్సిందే..కష్టాలు కూడా అంతే...సమయం వచ్చినప్పుడు ఓసారి పలకరించి మన బలహీనతలను మనకు తెలియజేసి వెళ్ళిపోతూ ఉంటాయి.ఆ సమయంలో మనం ధైర్యంగా ఉంటే చాలు ఏ సమస్యనైనా ఛేదించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

12)మన జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి.సుఖం విలువ తెలియాలంటే కష్టాన్ని అనుభవించి తీరాలి.సంతోషం విలువ తెలియాలంటే బాధను చవి చూడాల్సిందే.కష్టాలు వస్తాయని ముందే భయపడుతూ కూర్చుంటే బతకలేము.తప్పో ఒప్పో అడుగు వేసి చూడాల్సిందే.ఓటమి పాలైతే ఆ ఓటమిలో మన బలహీనతలు ఏంటో తెలిసిపోతుంది.ఒకవేళ మనం గెలిస్తే ఆ గెలుపులో ఏది మనల్ని గెలిపించిందో మన బలం ఏంటో మనకు అర్థమవుతుంది.కష్టాలు,ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారిలో మూసుకుపోయినట్లే అనిపిస్తుంది.కానీ ధైర్యంగా ఆలోచించి చూడండి.ఎక్కడో దగ్గర ఓ దారి తెరుచుకునే ఉంటుంది.పరిసత్థులు మనకు ఒక సమస్యని తెచ్చిపెట్టినప్పుడు దానికి పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది కావాల్సింది కొద్దిగా ఓర్పు నేర్పు ఈ రెండింటితో ఎంత సమస్యనైనా మనం ఛేదించగల ధైర్యం మనకు ఉంటే చాలు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

13)జీవితంలో వచ్చే పరిస్థితులు అనూహ్యమైనవి,కానీ మనకు ఎదురయ్యే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.మన ఆలోచనలు ఎంత పాజిటివ్ గా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది.ఉదాహరణకు,మీకు ఇష్టమైన వారితో కష్టమైన చర్చ జరిగిందనుకోండి,దాని గురించి భయపడటానికి లేదా ఆందోళన చెందడానికి బదులుగా,మీరు ఎలా మాట్లాడాలో,వారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఆలోచించండి అప్పుడే మీరు ఆందోళన చెందకుండా దేనికైనా సిద్ధంగా ఉండగలరు..అలాగే మనకు నచ్చితేనే ఏదైనా పనిచేయాలి.ప్రలోభాలకు లొంగిపోయి అన్నింటికీ ఓకే చెబితే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే..కాబట్టి మనస్సుని మెదడుని ఎవరైతే అధీనపరుచుకోగలరో వారు జీవితంలో దేనినైనా సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

14)జీవితంలో మనం చేసే ఏ పని అయినా మనసా,వాచా,కర్మణా ఆచరిస్తే సత్ఫలితం కలుగుతుంది.తోటి మనిషికి మనమీద అచంచలమైన విశ్వాసం కుదురుతుంది. మనసులో మన ఆలోచన ఒక విధంగా ఉండి,నాలుక మీదకు మాటరూపంలో వేరే విధంగా వచ్చి,క్రియారూపాన్ని సంతరించుకొనేసరికి ఇంకో రకంగా ఉంటే-నిబద్ధత ఉన్నట్లేకాదు.మనం బతికే సమాజంలో నీతితో,నియతితో గడపాలని,సర్వవేళలా పక్కవ్యక్తికి మంచే జరగాలని కోరుకోవాలి.మన చేష్టలు జనహితం కోరేవిగా ఉండాలి.నలుగురికీ ప్రయోజనకరం కావాలి అప్పుడే మన జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

15)జీవితంలో ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని,దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే.నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి,విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నతస్థితికి చేరినవారే.స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు.వారే జీవితంలో విజేతలు!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

16)జీవితంలో నీది కాని బంధం కోసం ఆరాటపడి ఉన్న బంధాన్ని కోల్పోయి ఏకాకివైపోకు..లేనిదాని కోసం ఆతృతపడి ఉన్న భాగ్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోకు..పరాయి వాళ్ళకోసం పరుగులు తీసి
పరువు కోల్పోయి ప్రాణం మీదకు తెచ్చుకోకు..చెంత నుండాల్సిన చేతిని చీదరించుకుని సుమధురంగా సాగాల్సిన జీవితాన్ని ఛిద్రం చేసుకుంటే చేరదీసే వారు లేక చితికి దగ్గరైపోతావు కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి లేదంటే నీ జీవితానికి చరమాంకం పాడతారు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

17)పని చేసుకుంటూ పోవటం ఎంత ముఖ్యమో...పరిచయాలు పెంచుకుంటూ పోవటం కూడా అంతే ముఖ్యం... మనం ఎంత తోపయినా,తోపని నిరూపించుకునే అవకాశాలు, ఈరోజుల్లో పరిచయాలతోనే సాధ్యం..బావిలో కప్పల్లా ఉండకుండా..కాస్త గుమ్మం దాటి బజారుకి,అటు నుంచి ఊరులోకి, చుట్టూ ఉండే సమాజంలోకి నిత్యం తొంగిచూస్తూ ఉండాలి!!పని చేసుకుంటూ...పదిమందితో సమన్వయం చేసుకుంటూ పోవటమే విజయానికి దగ్గరి దారి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

18)జీవితంలో ఒక సెక్యూర్డ్ రిలేషన్,ఇష్టమైన పని సగం బరువుని తగ్గిస్తాయి.మంచి స్నేహితులని ఎప్పుడూ మీతో ఉండేలా చూసుకోండి.ఎవరైనా విచారంలో ఉంటే వారితో మీ సమయాన్ని పంచుకోండి.కాస్త ఓదార్పునివ్వండి.అది మీ విచారం పోయేందుకు సహాయం చేస్తుంది.నెగెటివ్‌గా మాట్లాడే మనుషులకి దూరంగా ఉండండి.పాజిటివ్ ఆలోచనలను ఇచ్చే స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి. అలాగే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా లైట్‌గా బ్రతకటం నేర్చుకోండి అప్పుడే జీవితాంతం ఆనందంగా ఉండగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

19)ఆనందం ఖర్చుతో సంబంధంలేని విషయం. కొందరు కేవలం టివిలో వచ్చే కామెడీ షోలను చూస్తూ ఆనందంగా బ్రతికేస్తారు.అలా చిన్న చిన్న విషయాల్లో ఆనందం వేతుక్కోండి. మీకు ఏ విషయం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో తెలుసుకుని అదే పని తరుచుగా చెయ్యండి.జీవితాన్ని రన్నింగ్ రేస్‌ లా భావించొద్దు.నిదానంగా అయినా మీకు నచ్చిన పనే చెయ్యండి.ఆలస్యం అయిపోతోంది,నేను వెనుకపడిపోతున్నా లాంటి ఆలోచనలు వద్దు.అది కేవలం సమాజం సృష్టించిన పీర్ ప్రెజర్.రోజూ ఉదయం లేవగానే ఈ రోజు నాకు ఆనందాన్నిచ్చేలా ఏ పని చెయ్యొచ్చు అని ఆలోచించి ఆ పని తప్పకుండా చెయ్యండి అప్పుడే జీవితాంతాం ఆనందంగా ఉండగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

20)ప్రతి ఒక్క మనిషి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చారు, మళ్లీ ఒంటరిగానే భూమిలో కలిసిపోతారు.మధ్యలో ఈ అందం,అధికారం,డబ్బు,మదం అవసరమారూపాన్ని,రూపాయిని చూసి మురిసిపోతున్నారా..అవి మిమ్మల్ని వదిలి వెళ్లే రోజు ఎప్పుడో ఒకసారి వస్తుందని గుర్తుంచుకోండి.ఈ మారిపోయే లోకంలో ఏదీ శాశ్వతం కాదు. తేదీలు మారుతున్నా,ఏళ్లు గడుస్తున్నా,కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే...మీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని.మీరు సాధించిన విజయాలు, ఘనతలు మాత్రం మీ మరణానంతరం కూడా కొన్ని తరాలు గుర్తు పెట్టుకుంటాయి.ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టి వంద ఏళ్లు దాటి పోయినా ఇప్పటికీ మనం ఆయన్ని మర్చిపోలేక పోతున్నాం.అలాగే మీరు చేసే మంచి మాత్రం ఎక్కువ కాలం పాటూ మీరు ఉనికిలో లేకపోయినా నిలిచే అవకాశం ఉంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

21)ఈ కలికాలంలో కొంతమంది జీవితం ఎదుటి వాళ్ల కోసమే ఉండాలి అనుకుంటారు ఆ కుటుంబాల కోసం జీవితాంతం ఎంత చేసిన ఇంకా ఏదో మిగిలిపోతుంది..ఒకటి తర్వాత ఒకటి నీకు అబద్దాలు చెప్తూ నిన్ను మోసం చేస్తూ మరి ఆడుకుంటారు వాడుకుటరు అవసరం తీరిన తర్వాత విసిరేస్తారు..ఎదుటి వాళ్ళ ఇబ్బందులు గమనించకుండా వాళ్ళ అవసరాలు తీరిస్తే చాలు అనుకునే మహాను భావులు చాలామంది ఉన్నారు..ఒక మనిషి కోసం ఇన్ని దరిద్రాల అనుభవించడం అవసరమా అని ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతాయి బంధాలు..ఇవాళ రేపు ఎవరి బ్రతుకు వాళ్ళకే కష్టంగా ఉంది అందరి బరువు మోయాలి అంటే మాటలా చెప్పే వాడికి చేసే వాడు లోకువంట..చాలావరకు అలాంటివాళ్లే ఉన్నారు ఈ రోజుల్లో అయ్యో అన్నావంటే ఆరు నెలల పాపం చుట్టుకుంటింది..మంచికి ధర్మానికి రోజులు కావివి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాంటి వారిని వెంటనే దూరం పెట్టేయండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

22)అతి మంచితనం,జాలి,దయ వంటివి మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి మహాభారతంలో కర్ణుడే ఉదాహరణ.కర్ణుడు తన అతి మంచితనంతో,దానధర్మాలతో,
తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.చివరికి చెడు వైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.జీవితంలో మీరు గెలిచి నిలవాలంటే మంచివారితోనే స్నేహం చేయాలి.అనవసరమైన వ్యక్తులకు,అనవసరమైన పరిస్థితుల్లో దానధర్మాలు చేయడం మంచి పద్ధతి కాదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

23)డబ్బు సంపాదిస్తే సరిపోదు.దాన్ని కాపాడుకునే తెలివితేటలు ఉండాలి.చాలామంది కోట్లు సంపాదించినా,అవి వాళ్ల దగ్గర ఉండవు. చెడుఅలవాట్లు,అతిగా దానధర్మాలు చేయడం, గొప్పలకు పోయి ఎక్కవగా ఖర్చు చేయడం వల్ల సంపాదించిందంతా పోగొట్టుకుంటారు.అలాగే మనం నీతినియమాలతో కష్టపడి రక్తం పెట్టి సంపాదించిన డబ్బులు ఎక్కడికి పోవు ఆ లక్ష్మీదేవి వాళ్లను ఏదో ఒకవిధంగా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి సహాయం చేయడానికి కూడా మన స్థాయి స్తోమతని బట్టి చేయాలి అంతేగాని ఎమోషనల్ గా వాళ్ళేదో అయిపోతారని చేస్తే నడ్డి విరుగుతుంది ఇది నా స్వీయ అనుభవం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

24)ఒక స్నేహం వల్ల కోట్లు రాకపోయినా పర్వాలేదు…తల దించుకునే పరిస్థితి రాకూడదు.పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపే స్నేహం లేకపోయినా నష్టం లేదు...కానీ నీ నుంచి ఎదో ఆశించి స్నేహం చేస్తే లాభం లేదు.ఏ స్నేహం అయినా మంచి చేసేదిగా ఉండాలి మంచి దారి చూపాలి..చెడు దారిలో వెళ్ళనివ్వకుండా ఆపాలి.మంచి కోరుకోకపోయినా పర్వాలేదు గానీ చెడు ఉద్దేశంతో చేసే స్నేహం లేకపోవడమే మంచిది.ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేసిన భావన కలగకూడదు.అటువంటి స్నేహాలు కలకాలం పదిలంగా ఉంటాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

25)లాభం ఆశించి చేసేది వ్యాపారం,పుణ్యం ఆశించి చేసేది దానం,ఏమి ఆశించకుండా చేసేది సహాయం..కానీ ఎపుడైతే ఎవరన్నా మన సాయాన్ని అవకాశంగా తీసుకుంటూ మనల్ని వెధవని చేసామని వెనక ఆనందించేవాళ్ళకి పైన దేవుడనే వాడొకడున్నాడు చూస్తూనే ఉంటాడు.ఇలాంటి వారి వల్ల నిజంగా ఎవరన్నా సాయం చేయమంటూ అడిగితే మరోసారి సాయం చేయటానికి మనసొప్పదు కాబట్టి సాయం చేసేటప్పుడు ఆచితూచి చేయాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

26)యద్భావం తద్భవతి అని.అంటే,మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నా ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది…మన ఆలోచనలు,చేతలు,ఉద్దేశాలు, అంచనాలు ఎలావుంటే అలాగే మనకు జరుగుతుంది.మనము ఒకరి గురించి ఎప్పుడు అయితే తప్పుగా ఆలోచిస్తా మో అప్పటి నుంచి తప్పుగా కనిపిస్తారు మన కృషి,పట్టుదల,దీక్షలను నిర్లయించి చేతలు అలా ఉండి అవి మన గతిని నిర్ణయిస్తాయి.మతి ఎలా ఉంటే గతి అలా ఉంటుంది నువ్వు ఏదైతే ఎదురువారికి ఇద్దామనుకుంటున్నవో అదే తిరిగి నీకు వస్తుంది కాబట్టి ఆచి తూచి ఆలోచిస్తూ అడుగు వేయి నేను చేసేది ఎవరికీ తెలీదనుకోవచ్చు కానీ పైన త్రినేత్రుడు చూస్తూనే వుంటాడు కర్మ నీకు వెనక్కి తిరిగి రాడానికి కొంత సమయం పడుతుంది అంతే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

27)జీవితం సున్నితమైనది.మన ఆలోచనలు,చేతల వల్లే జీవితం మలుపులు తిరుగుతుంది.కొన్ని సందర్భాల్లో ఆ జీవితం ఒక్కోసారి మన చేతుల్లోంచి జారి పోతుంది.దానికి కారణం కూడా మనమే.మనం చేసే కొన్ని పనులే జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి.జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మన భావోద్వేగాలు,మన చర్యలు,మన నిర్ణయాలు,మన అభిప్రాయాలు,మన ప్రతిస్పందనలు,మన మాటలు,మన ప్రవర్తన,
మన ప్రయత్నాలు,మన సమయం,మన కోరికలు, ఆకాంక్షలు,లక్ష్యాలు,అభిరుచులు, అలవాట్లు ఇవన్నీ మన నియంత్రణలో ఉంటే మన జీవితం అధ్భుతంగా ఉంటుంది.మనకు మనశ్శాంతి,ప్రశాంతత దక్కుతుంది.వీటిపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంతగా మన సామర్థ్యం పెరిగి మనం అనుకున్న గమ్యాన్ని చేరగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

28)నమ్మకం,విధేయత అనే ఇంధనం మీద నడిచే బండి స్నేహం!ప్రపంచాలు, ప్రయారిటీలు వేరైనా..మనకోసం నిలబడే ఒక్క లాయల్ ఫ్రెండున్నా చాలు.అసలు అయినవాళ్లు లేనివాడు కాదు,ఆప్తమిత్రుడు లేనివాడే అనాథ! అప్పుడే కలిసినా ఎన్నాళ్ల నుంచో తెలిసినట్టుగా పెదాల మీద విరిసే చిరునవ్వు..ఆ నవ్వును అలాగే పదికాలాలు నిలబెట్టే స్వచ్ఛమైన బంధం..నీకు వుంటే నువ్వు అదృష్టవంతుడివి అలాంటి బంధం దొరికితే వదులుకోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

29)మనం అవును అన్నా కాదన్నా.. కొన్ని రుణాలు బంధాలు ఉంటాయి..మనం ఎంత దూరం పారిపోతే అంతలా మన వెనకాల మనల్ని వెన్నంటే వస్తాయి..ఎందుకంటే అది మనం రాసుకున్న రాత కాదు భగవంతుడు ఎప్పుడో..ఎక్కడో రాసిన రాత..ఈ జన్మ కాకపోతే మరో జన్మ ఆ జన్మ కాకపోతే ఇంకో జన్మ బాకీ తీరేదాకా రుణానుబంధాలు వెంటాడుతూనే ఉంటాయి...మనము అవును అన్న కాదన్నా అందుకే ఎప్పుడువి అప్పుడే తీర్చేసుకోవాలి బాకీలైన బంధాలైనా మళ్లీ జన్మకి మిగిల్చకుండా..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

30)మన అనుకుంటేనే మోయలేని జ్ఞాపకాలు! మాయని గాయాలు!! మనకెందుకు అనుకుంటే ఏమి ఉండవు కదా!!ఒక్కసారి మన అనుకున్నాక తప్పదు కదా!!ఇంకెందుకు కన్నీళ్ళు!? బరువు ఎత్తుకున్నాక గమ్యం చేరే వరకు మోయాలిగా! ఒకవేళ మధ్యలో దించుకున్నా నువ్వే మళ్ళీ ఎత్తుకోవాలి!! నీ బరువు ఇంకెవరు మోస్తారు!? ఎవరి బరువు వాళ్ళకు ఉండనే ఉంది కదా!! ఓపిక ఉన్నంత కాలం కాదు..ఊపిరి ఉన్నంత కాలం ఈ బంధాలు,వారి బాధ్యతలు..తప్పనివి.తెంచుకుంటే తెగిపోయేవి కాదు..వద్దనుకుంటే వదిలిపోయేవి కాదు!!మనసుతో ముడిపడినవి! మరణంతోనే ముగిసేవి!!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

31)వంద సార్లు విను.
వేయి సార్లు ఆలోచించు. 
ఒక్కసారి మాట్లాడు.
నలుగురూ నిన్ను చూసి 
 నీలా ఉండాలి అని అనుకోవాలేగాని.
నీలా ఉండకూడదు అని మాత్రం అనుకోకూడదు.

32)ఆకలేస్తున్నప్పుడు ఎవరైనా ఓ ముద్ద పెడితే బాగుణ్ణని ఆకాశంలోకి చూసేవేళ అనుకోకుండా వచ్చి కడుపునింపిన అన్నదాతే కంటికి కనిపించే 'దేవుడు'..రోడ్డుమీద దెబ్బలు తగిలి నెత్తురోడుతున్న అపాయకర పరిస్థితుల్లో పనులు మానుకుని మరీ ఆసుపత్రికి తరలించే ఆపద్బాంధవుడే పేరు తెలీని ఓ 'దేవుడు..'నీ కష్టకాలంలో నీ సమస్యని తన సమస్యగా అనుకుని నీకు సాయం చేయడానికి ముందుకు వచ్చే స్నేహితుడి కూడా ఓ దేవుడే..దేవుడంటే ఎవరో కాదు భయ్యా..సాయం..నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు..అంటే దైవం మనుష్య రూపేణా..మనిషి నమ్మకంతో వెతికితే దేవుడు ఎక్కడో కాదు..మనచుట్టూనే ఏదో రూపంలో కనిపిస్తాడు...కాబట్టి నీ స్థాయి స్తోమతని బట్టి సాయం చేస్తే ఆ పరమాత్మే నీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

33)మంచోళ్ళు ఉన్న చోట కొందరు ముంచేటూళ్లుంటారు తస్మాత్ జాగ్రత్త ఆ కొందరిగురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కానీ తెలుసుకుంటే తప్పేంటి జాగ్రత్త పడొచ్చు కాదా ఇది మాత్రం జగమెరిగిన సత్యం..డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇది నాకే కాదు మీకు కూడా తెలుసు..పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది కూడా డబ్బే...అయినవాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే మరి..అందుకే డబ్బుని గౌరవించండి
పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన 
మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి కదా..డబ్బుకి లోకం దాసోహం పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు బహుశా ఇందుకేనేమో కదా..నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా..ప్రశాంతంగా పడుకోవాలన్నా ..నచ్చిన మనిషి మన పక్కన ఉండాలన్నా...మన దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా డబ్బే..కాబట్టి డబ్బుని గౌరవించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

34)జీవితం ఒక బాక్సింగ్ రింగ్ వంటిది..ప్రతీ క్షణమూ, పరిస్థితులు అనే ప్రత్యర్థి పంచులు విసురుతూనే ఉంటాయి.ఒక్కోసారి మనం పడిపోవచ్చు.పడిపోయినంత మాత్రాన మనం ఓడినట్టు కాదు! ఇంకా మనకు అవకాశం ఉంటుంది.మనం పడిపోగానే ఓడిపోయినట్టుగా,రెఫరీ ప్రకటించడు.మనం కోలుకుని నిలబడడానికి సమయం ఇస్తాడు.పది వరకు అంకెలు లెక్కబెడతాడు.అప్పటికీ లేవలేకపోతే,అవతలి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు.జీవితంలో కూడా అంతే!మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము.సమస్య రాగానే,ఓడిపోయామని కృంగిపోకూడదు.భగవంతుడు సమయం ఇస్తాడు.పది వరకు లెక్కబెడతాడు.నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు.వాటిని మనం అందిపుచ్చుకోవాలి.సమర్థుడైన వాడు పది లెక్క పెట్టే లోగానే లేచి నిలబడి గెలుస్తాడు.అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే పది లెక్కపెట్టే లోగా మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి.అది కూడా ఓకే.ఒక్కోసారి ఓడిపోతాం.
పర్వాలేదు.ఇంకో పోటీ,ఇంకో మార్గం ఉండనే ఉంటుంది.
చాలా మంది 'కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు పడి లేచినందుకు!' అని అంటుంటారు కానీ,పడిన కెరటం,
లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు.విరిగి పడిన కెరటం ఛిద్రమై,పతనమై మామూలు నీటిలో కలిసి పోతుంది,అస్థిత్వాన్ని కోల్పోతుంది.మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం.కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకుని,దిశను ఎన్నుకుని,మెల్లగా ప్రారంభించి రానూరానూ వేగాన్ని పుంజుకుని,తీరాన్ని చేరుకుంటుంది.అది కొత్త కెరటం.దాని శక్తి అనంతం.మనిషి కూడా అంతే! ప్రతీ పతనం నుండి తేరుకుని, కొత్త కెరటంలా,నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి అప్పుడే కదా మనం దేనినైనా సాధించగలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

35)జీవితంలో కొంతమంది బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకునేవారూ బద్దకస్తులూ సాకులు వెతుక్కుంటారు.ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రగతి సాధించడమే కదా జీవితం.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏ సాకు దొరుకుతుందా అని చూసేవారు,తమ ఓటమికి కారణాన్ని ఇతరులపై నెట్టేసే ప్రబుద్ధులు ఎందరో ఉంటారు.అలాంటి వాళ్లు ఎదుటివారి నుంచి తప్పించుకోగలరేమో కానీ తమ ఆత్మసాక్షి నుంచి ఎలా తప్పించుకోగలరా??అయినా ఫలితాన్ని అనుభవించాల్సింది తామైనప్పుడు ఎన్ని సాకులు చెప్పీ ఎవరి మీద నెపం పెట్టీ ఏంటి లాభం? నీ కుంటిసాకులకు గుడ్బై చెప్పి, నీకు నువ్వు నిర్దాక్షిణ్యంగా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే నీ ఆలోచనావిధానం మారుతుంది అప్పుడే మనమేదైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

36)జీవితంలో గెలవాలనుకున్న వాళ్లెవరూ గెలిచేదాకా విశ్రమించరు.విశ్రమించేవారెవరూ విజేత కాలేరు ఇది జగమెరిగిన సత్యం.సాకు,నెపం అనేవి బద్ధకానికి ప్రాణస్నేహితులు.అపజయానికి ఆత్మబంధువులు.అవి అవకాశాల్ని అవరోధాలుగా మారుస్తాయి.కలలు కనేవాళ్లకీ వాటిని నిజం చేసుకోవాలనుకునే వాళ్లకీ అవి బద్ధశత్రువులు కాబట్టి విజేతలెవ్వరు వీటి జోలికి పోకుండా అకుంఠితదీక్ష,క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళ లాగ చరిత్రకెక్కారు మీరు కూడా ఆ స్ఫూర్తి ఆచరణతో మన గురించీ పదిమందికి తెలియాలంటే-సాకులు చెప్పకుండా..సాధించి చూపించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

37)నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునే వారికి..నువ్వు దగ్గరున్నా,దూరంగా ఉన్నా,మాట్లాడినా,మాట్లాడక పోయినా..నువ్వు బాగున్నా,బాగోలేక పోయినా..అసలు నువ్వు ఉన్నా,లేకున్నా ఒకటే కదా!అలాంటివారి కోసం నువ్వెందుకు నిద్రలేని రాత్రులు గడుపు తున్నావు.అలాంటి వారి కోసం నువ్వెందుకు తల పగిలేలా ఆలోచిస్తున్నావు.అలాంటివారి కోసం నువ్వెందుకు గుండెలవిసేలా ఏడుస్తున్నావు.అలాంటివారి కోసం నువ్వెందుకు నీ మనసుని కష్టపెడు తున్నావు.అలాంటివారి కోసం నిన్ను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు.
ఒక్కరోజులో రాలిపోయే పువ్వు అరే రాలిపోతున్నా అని బాధపడక నలుగురికి నయనానందాన్ని,పరిమళాలను పంచుతుంది.మరి మనిషిగా పుట్టి,అన్నీ ఫీలింగ్స్ ఉన్న నువ్వెంత ఆనందంగా ఉండాలో,నలుగురికి ఎంత ఆనందాన్ని పంచాలో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో!!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

38)నీ గెలుపు ఓటము లను నిర్ణయించేది సామర్ధ్యమా సమాజమా??ఎంత మంచి చేసిన నీవు చేసిన ఒక తప్పు కే చేసిన మంచి మరిచి నిన్ను వేలెత్తి చూపి నీ మంచి చెడు లను నిర్ణయించే సమాజం కోసమా బ్రతుకుతున్నావ్??డబ్బుఉంటే తప్ప నిన్ను గొప్పవానిగా గుర్తించదు ఈ సమాజం ఎలా సంపాదించావ్ అనేదానికన్నా
ఎంత సంపాదించావ్ అనేదే ముఖ్యం నేటి రోజుల్లో..పక్కవాడికోసం తల్లితండ్రుల కోసం కాకుండా నీకోసం నువ్వు ఒకరోజైనా బతికి చచ్చిపో..చచ్చే సమయానికి మంచోడివా చెడ్డోడివా అని కాదు
ఉన్నోడివా లేనోడివా అనేది నీకోసం వచ్చిన జనాలే నిర్ణయిస్తారు..విలువలతో కూడిన సమాజం ఎపుడో అంతరించి పోయింది...వెల కట్టే సమాజమే నీవున్నది ఇప్పుడు.ఉన్నతంగా బతకాలి అనే రోజులు నుండి ఉన్నోడిగానే చావాలి అనే రోజుల్లో బతుకుతున్నాం.పటం లో పరమాత్మ కంటే
పైసాలో పరమాత్మ కే భక్తులు ఎక్కువ..నీకు నచ్చినట్లు బ్రతుకు నచ్చినట్లు చావు నటిస్తూ మాత్రం బ్రతుకకు.చేసే పని తప్పో ఒప్పో అని కాదు నీ selfsatisfaction ఉందా లేదా..నీ విలువ ని పెంచేది నోటి మాట కాదు నోట్ల మూట

39)ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు..తన తప్పును ఆ వ్యక్తి గుర్తించినప్పుడు లేదా తన తప్పు గురించి ఇతరులు చెప్పినప్పుడు..అది నిజంగా తప్పే అని అనిపిస్తే క్షమాపణ చెప్పడంలో ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు. తను తప్పు చేశానని నిస్సంకోచంగా ఒప్పేసుకోవాలి. తప్పు చేశానని,బాధపెట్టానని చెప్పి క్షమించమని అడగడంలో ఎలాంటి తప్పు లేదు..కానీ తప్పు లేకపోయినా తప్పు చెబితే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.విలువను తగ్గిస్తుంది.ముఖ్యంగా ఎదుటివారి దృష్టిలో మర్యాద అనేది లేకుండా పోతుంది.అందుకే తప్పు ఉంటేనే క్షమాపణ చెప్పాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

40)క్షమాపణ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది.అపార్థాలు తొలగిస్తుంది.ప్రేమ,స్నేహం, కుటుంబ బంధాలు,వైవాహిక జీవితం ఇలా ఏదైనా కావచ్చు.ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థాలు ఏర్పడినప్పుడు ఇద్దరూ ఎడముఖం,పెడముఖం పెట్టుకుని ఉంటారు.కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తగ్గి క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మళ్లీ చిగురిస్తుంది.బంధం కోసం ఇలా తగ్గడంలో తప్పులేదని పెద్దలు చెబుతారు.ముఖ్యంగా గొడవ జరిగినప్పుడు ఎవరైతే తమ బంధం కోసం తమ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పేస్తుంటారు.ఇది కూడా బంధం బలపడుతుందని తిరిగి తమ ఇద్దరి జీవితాలు ఒక్కటిగా సాగుతాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

41)కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగే వాడిని తల దించుకునేలా చేస్తుంది..!తలదించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికే లాగా చేస్తుంది..! నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది..! కొన్ని విషయాలు తేలికగా తీసుకోకు...ఎవరో ఎక్కడో తారసపడతారు నీ జీవితంలో...నీకు తెలియనివేవో నేర్పడానికి...నువ్వు చూడని లోకం చూపడానికి...ఋణానుబంధంతోనే వస్తారు వేరే పని లేక వచ్చారనుకోకు నీ కోసమే వస్తారు అది తీరిన తర్వాత వెళ్ళిపోతారు తర్వాత నువ్వు ఉండమన్న ఉండరు అదే కాలం కర్మఫలం కాబట్టి ఎప్పుడు దేనికి మథనపడకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

42)కాలం మనకి అనుకూలంగా లేనప్పుడు అణిగి మణిగి ఉండాలి..అలా అని భయపడినట్లు కాదు లేదా వెనక్కి తగ్గినట్లు కాదు...ఒక రోజు సింహం ఆవుని వేటాడుతుంది ఆవు పరిగెత్తి పరిగెత్తి ఒక బురదలో ఇరుక్కు పోయింది,వెనకాల వేటాడుతున్న సింహం కూడా అదే బురదలో ఇరుక్కొపోయింది..ఆవు - సింహం ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేకపోతున్నాయి...బురదలో ఇరుక్కుపోయిన ఆవు-సింహాన్ని చూసి కొన్ని తోడేళ్లు నవ్వుతున్నాయి..అప్పుడు ఆవు సింహాన్ని ఒక ప్రశ్న వేసింది నీ యజమాని ఎవరూ అని అడిగింది,అప్పుడు సింహం నాకు యాజమని ఎవరూ లేరు నేనే రాజునీ అని వీర్రవిగి సమాధానం చెప్పింది..అప్పుడు ఆవు నాకు యజమాని ఉన్నాడు నన్ను ఈ బురదలో నుండి బయటకు తీస్తాడు నన్ను కాపాడతాడని ధైర్యంగా చెప్పింది..ఈలోపు అనుకున్నట్లే ఆవుని వెతుక్కుంటూ యజమాని వచ్చాడు దాన్ని బయటకు లాగాడు,ప్రాణాలు కాపాడాడు..యజమాని మీద పెట్టుకున్న నమ్మకానికి ఆవు కళ్ళల్లో నీళ్ళు చెమార్చాయి..నవ్విన తోడేళ్ళ గుంపు మొఖం చాటేశాయి..అయితే వీర్రవీగిన సింహం ఆ బురదలోనే ఉంది కాపాడడానికి ఎవరూ సాహసం చెయ్యడం లేదు,అది బయటకు వస్తే ఏమి చేస్తదో అందరికి తెలుసు..అది ఆకలితో అదే బురదలో ఉంటూ ఆహారం లేక ప్రాణాలు విడిచింది..నన్ను ఎవరూ చంపలేరులేరని మూర్ఖత్వంతో ఆవును వెంటాడి బయటకు రాలేని బురదలో ఇరుక్కొపోయిన సింహం తన ప్రాణాలు ఇలా కోల్పోబోతుందని అది కూడా ఊహించి ఉండదు..అది టైం మాత్రమే నిర్ణయిస్తుంది..కాబట్టి బయట సమాజంలో ఎవరు సింహమో ఎవరు ఆవో తెల్సుకుని మసులుకోవడం చాలా మంచిది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

43)జీవితమంటేనే అనుభవాల పుట్ట పడుతూ లేస్తూ చాలా నేర్చుకుంటాం..మచ్చుకకి కొన్ని.. మన చుట్టూ మన వాళ్లే ఉన్నారని పొరబడడం..మనతో మాట్లాడే అందరూ మన మంచి కోరే వారే అని సంబర పడడం ప్రేమగా మాటలు చెబుతుంటే మురిసిపోవడం
క్షణక్షణం విచారిస్తుంటే ధైర్యం చెప్పటం అప్పుడు మనకంటే అదృష్టవంతులు ఇంకెవరిని మనసుతో మాటిమాటికీ గర్వంగా చెప్పడం..కానీ తెలుసుకోలేనిది ఏంటంటే మనతో ఆవరసం ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయి అది తెలియక కలల గూడు కట్టుకోకూడదు.మనతో అవసరం తీరాక జరిగే చిన్న చిన్న మార్పులకు మన మనసు పడే వేదన నరకం.చూసీ చూడనట్టు చూపులు మనమే తప్పంటూ ప్రచారాలు పలకరించడానికి సైతం పనికిరాని మనం పాపాత్ము లైపోవడం..ఈ కలికాలంలో కలిసి ఉండి మోసపోవడం కంటే అలాంటి వారిని దూరం పెట్టి మనకు మనమే ఉన్నామంటూ ఒంటరిగా ఉంటూ పొగరుబోతుగా మిగిలిపోవడమే ఆనందం..కాబట్టి అలాంటివారితో తస్మాత్ జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

44)ఎవరైనా మనల్ని అవమానించిన ,అవహేళన చేసిన అది మనల్ని చూసి కాదు మన పరిస్థితిని బట్టి. ఒక్కోసారి ఒక్కొక్కరి మీద అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి.కేవలం మన పరిస్థితిని బట్టి మాత్రమే మాట్లాడతారు కానీ మన వ్యక్తిత్వాన్ని చూసి మాట్లాడరు.ఎందుకంటే మన వ్యక్తిత్వం మనకు తప్ప ఇంకెవ్వరికీ ఖచ్చితంగా తెలియదు.అవతల వాళ్ళు మనల్ని అవమానించారని, అవహేళన ,చేశారని తక్కువగా చూసారని వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకుంటే నష్టం వాళ్ళకి కాదు మనకి కలుగుతుంది..ఎందుకంటే ఎవరైతే మనకి ఇష్టం ఉండదో ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళతోటే మనం కలిసి ఉండే పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి.వాళ్లతోటే మనకు అవసరాలు కలిగేలా కాలం కల్పిస్తుంది. అందుకే కొంచెం ఓర్చుకుంటే కొంచెం ఓపిక ఉంటే జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలను అయిన ఎదుర్కోవచ్చు అన్నిసార్లు అన్ని అనుకూలంగా మనకు నచ్చినట్టు జరగవు కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.ఎంతటి పెద్ద కష్టాన్ని దాటితే అంతటి ఆనందాన్ని అనుభవించగలరు ఎవరైనా సరే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

45)జీవితమంటేనే ఒక పోరాటం మనం ప్రతిరోజూ పోరాడుతూనే వుండాలి అలా పోరాడగలిగితేనే నువ్వు నీ తర్వాత వారికి చెప్పగలవు..నీ గురించి కథలు వినగలవు..నీ గెలుపును నువ్వు గర్వంగా చెప్పుకోవాలి కానీ ఈజీగా వచ్చేసిందని చెప్పుకున్నా అది నువ్వు నిజంగా అనందించలేవు..అయినా పోరాడలేని జీవితం వ్యర్థం...అసలు సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు..ఒకవేళ వచ్చినా దాన్ని నువ్వు గర్వంగా నలుగురితో పంచుకోలేవు...అలా గెలిచిన గెలుపు గెలుపే కాదని నీకూ తెలుసు..ఈ జీవితపోరటంలో ఎన్నో వడిదుడుకులు మరెన్నో ఎదురు దెబ్బలు అలాంటప్పుడే అసలు అట మొదలవుతుంది నీ జీవితంలో నీ ప్రయత్నానికి అడ్డుకట్టాలా అడ్డొస్తారు..
భయపడకు..నీకు నువ్వే ఓదార్పు..నీకు నువ్వే సపోర్ట్...ఎవరైనా నీ దగ్గరేముంది అని అడిగితే..నువ్వు మాత్రం అస్సలు తగ్గొద్దు..దైర్యంగాచెప్పు..గెలిచేవరకు ప్రయత్నించే ఓపిక ఉందని..సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తేలేదని...చేయిజారి పోయినదాని గురించి బాధపడనని...చేసే పనిని వాయిదా వెయ్యనని...అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు..ఒక్కమాటలో చెప్పాలంటే...నన్ను వెనక్కి లాగేవాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పు..ఎప్పుడూ పక్కోడి పనిలో వేలుపెట్టనని చెప్పు..ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని చెప్పు...అంతే కానీ మౌనంగా మాత్రం ఉండిపోకు...మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఇవ్వకు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

46)అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు,దానిని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే,ఆ పిచ్చి ఆనందం కన్నా,మనది కానీ డబ్బుని,ఆస్తి కాగితాలని చూస్తూ ఇది నాది అనే అపద్దపు ఆనందంకన్నా ,నీ వల్ల నాకు పునఃజన్మ దక్కిందని ఒక మనిషి చెప్పే థాంక్స్ లో ఉన్న ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది.మనం బ్రతకాలను కోవడం ఆశ,పది మంది బ్రతకాలనుకోవడం ఆశయం.ఆశ బ్రతికేలా చేస్తుంది.ఆశయం చావే లేకుండా చేస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

47)మన జీవితం సార్ధకం ఎప్పుడు అవుతుందంటే నలుగురూ మన కనీళ్లు తుడిచే స్థాయి నుంచి నలుగురి కనీళ్ళు మనం తుడిచే దశకు చేరుకోవడమే..అదే అసలైన విజయమూ,వికాసమూ! అప్పుడు సమాజం మనల్ని పన్నీటితో స్వాగతిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

48)ఆస్తిని చూసి దైర్య పడకు..కూర్చొని తింటే కొండలు కుడా కరుగుతాయి మనకు..అందాన్ని చూసి ఆనంద పడకు!!!
పూజకి పనికి రాని పువ్వు...ఎంత వికసించిన దండగే చివరకు..కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు..ఎంత ఇష్టపడిన మనకి అందవు కడవరకు..ఎంత సంపాదించిన బయటపడకు..నవ్వుతు నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు..నాకు ఎమి లేదని బాధ పడకు..తక్షణమే బతకటానికి దారిని వెతుకు...!!!!
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మస్థైర్యాన్ని మాత్రం కొల్పోకు..ఎందుకంటే అదే నీ ఆయుధం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

49)పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితికి తగ్గట్టే మారిపోవాలి.వరద వచ్చినప్పుడు చేపలు చీమలను తిని బతుకుతాయి.అదే వరద తగ్గినప్పుడు ఆ చీమలే చేపలను తింటాయి.సమయం మాత్రమే ముఖ్యం...మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్లడమే జీవితం.మనం సమస్యలో ఉన్నప్పుడు అదే ముగింపు అనుకోకండి.అది జీవితంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకోండి కాబట్టి మనం ఎదగాలనుకుంటే ప్రపంచం ఏదో ఒక రకంగా అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది మనాకు కావాల్సినదల్లా మనలో ఎదగాలన్న ఆశ పుట్టడమే ముందు ఆ కోరికకు ఆకాంక్షకు ఆద్యం పోయండి అవే అవె ఎదురొస్తాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

50)మనకు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.వాటిని మనం స్వీకరించినా, స్వీకరించకపోయినా అవి మన పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.వాటిని చూసి మనం విచారంగా ఉండకుండా ఉండాలి ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టాడు అనుకోండి.మన సమర్థత అనేది కష్ట కాలంలోనే కనిపిస్తుంది.సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ విజయవంతం అయినట్టే కనిపిస్తారు కానీ ఎవరైతే కష్టంలో ధైర్యంగా నిలుచుని ఉంటారో వారే నిజమైన విజేత.మన జీవిత ప్రయాణానికి అడ్డు తగిలే ఏ సమస్యను చూసి అక్కడే ఆగిపోకండి.దాన్ని ఎలాగైనా దాటుకొని ముందుకు వెళ్ళండి అప్పుడే మనం అనుకున్న గమ్యాల్ని చేరగలం ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

51)జీవితంలో ఒక సమస్య పరిష్కారం అవ్వగానే మరొక సమస్య వస్తూనే ఉంటుంది.అలా వస్తున్న కొద్దీ కొంతమంది డీలా పడిపోతారు.భయపడి పోతారు. కొంతమంది తమ జీవితాన్ని ముగించేసుకుంటారు.ఇలా కాకుండా వీలైనంతవరకు ఆ సమస్యను సమస్యలా చూడకండి...మీ జీవితంలో ఒక భాగంలా చూడండి.అది మీకు పెద్దగా కనిపించదు.కొత్తగా అనిపించదు కాబట్టి జీవితంలో సమస్య రాగానే తల్లడిల్లిపోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించండి అప్పుడే మనం ధైర్యంగా మనం అనుకున్నవి చేయగలం సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

52)ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటే సానుకూల దృక్పథంతో ఆలోచించడం.మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్‌తో ఉంటారో ప్రతి సమస్య దూది పింజలాగా చిన్నగా కనిపిస్తుంది.అలాకాకుండా భయపడుతూ,బాధపడుతూ ఉంటారో చిన్న సమస్య కూడా పెద్ద భూతంలా మారిపోతుంది.మీ ఆలోచనలు ప్రేరణత్మకంగా ఉంటే మీలో సానుకూల దృక్పథం కూడా పెరిగిపోతుంది.పెద్ద సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరించగలుగుతారు..కాబట్టి అంతా మంచే జరుగుతుందని ముందడుగు వేయండి అనుకున్నవి తప్పక సాధిస్తారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

53)ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని వింటూనే ఉంటాం కానీ నమ్మకం ఉండదు.చిన్న సమస్య వస్తేనే విలవిలలాడిపోయి,లేనిపోని ఆలోచనలతో అంతిమ నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు.సమస్య ఎంత కష్టమైనా కూడా దానికి కచ్చితంగా ఆ దేవుడు పరిష్కారాన్ని కూడా సృష్టించే ఉంటాడు.మీ పని దాన్ని కనిపెట్టడమే.తాళం చెవిని తయారు చేయకుండా ఎవరు తాళాన్ని రూపొందించరు.అలాగే పరిష్కారాన్ని లేకుండా ఏ సమస్య ఉండదు.సమస్య ఎంత క్లిష్టమైనదైనా దాన్ని పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉండే ఉంటుంది.దానికి కనిపెట్టడంలోనే మీ గొప్పతనం ఉంది..సమస్యకు పరిష్కారం లేదని అనుకునే బదులు ఆ సమస్య ఎందుకు వచ్చిందో గుర్తించడం, దాన్ని పరిష్కరించడానికి మార్గాలను వెతకడంలోనే మీరు ఎంతో కొంత విజయం సాధించినట్టు. ఆ సమయంలోనే మీలో ఆశలు చిగురుస్తాయి.కాబట్టి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మారడానికి ప్రయత్నించండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

54)కొన్ని బంధాలు మనల్ని బ్రతికిస్తాయి అనిపిస్తోంది ...
కొన్ని బంధాలు బ్రతకాలనే ఆశని మనకు కలిగిస్తాయి...
మరికొన్ని బంధాలు బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తాయి...అదే...మనవారికి దగ్గరగా ఉండాలి అంటే...
మౌనంగా ఉండిపోవాలనీ...మనవారిని దగ్గరికి చేర్చుకోవాలి అంటే..ఏ మాటను మనసులో పెట్టుకోకూడదు..అని నేర్పించింది ఈ జీవితం...అందుకే... నీ జీవితంలో ఖరీదైన బంధం కోసం కాకుండా విలువైన బంధం కోసం వెతుకు..బ్రతుకు..ఆ విలువైన బంధమే నీకు వెలకట్టలేని సంతోషాన్ని కలిగించింది సరేనా...నేనైతే నీకు పాజిటివ్ గానే చెప్పాను కాబట్టి ఈ ఉదయాన్ని నువ్వు కూడా పాజిటివ్ గా మొదలుపెడతావు అని కోరుకుంటూ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

55)గతం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.అది సంతోషకరంగాను బాధాకరంగానూ ఉంటుంది ఆ గతం తాలూకూ బాధలను, కోపాలను మనసులో పెట్టుకొని ముందుకు సాగితే నేడు నీ దగ్గరున్న ఈ క్షణం ఆవిరైపోతుంది మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించి ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. మనకు హాని చేసిన వారి పట్ల మనసులో పగ పెంచుకుంటే మన మానసిక స్థితి కూడా ఎంతో ప్రభావితం అవుతుంది.కాబట్టి మన జీవితంలో పగలను,కష్టాలను వదిలేసి ముందుకు సాగండి అప్పుడే మనం అనుకున్న గమ్యాన్ని త్వరాగా చేరగలం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

56)అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం..మనలో లోపాలు వెతికే ప్రతికూల మనుషుల దగ్గర వివరణ అనవసరం..నిన్ను నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం..మాదే కరెక్ట్ అనుకునే వారి దగ్గర సవరణ అనవసరం..అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం..బంధం విలువ తెలీని వారి కోసం రోదన అనవసరం..నిన్ను బాధించిన వారిని తిరిగి బాధ పెట్టే మార్గాలకై శోధన అనవసరం..కొన్ని సందర్భాలలో... మౌనమే పరిష్కారం..కొన్ని సందర్భాలలో... కాలమే పరిష్కారం..చాలా సందర్భాలలో పట్టించుకోక పోవడమే అసలైన పరిష్కారం.....!! ఇదే జీవితం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

57)ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో,అంతవరకే మాట్లాడటం మంచిది అంతేగానీ..అనవసరంగా,అతిగా మాట్లాడితే అపార్థాలు రావటం పక్కా..కాబట్టి మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం అలవరుచుకో...ఎందుకంటే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు..ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు.. అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిచ్చి స్నేహితులను కోల్పోతావు..అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు..అసత్యం మాట్లాడితే నమ్మకాన్ని కోల్పోతావు....అందుకే ఆలోచించి మాట్లాడి నీ వ్యక్తిత్వాన్ని,.. నీ గౌరవాన్ని..నీ ప్రత్యేకతను కాపాడుకో...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

58)నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిందౌతుంది..ఎవ్వరైనా నీతో మాట్లాడేందుకు ఇష్టపడతారు లేదంటే మనతో సంబంధాన్ని,స్నేహాన్ని తుంచేసుకుంటారు.ఎదుటివారితో మాట్లాడేముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజూ మీరు మీతో మాట్లాడుతూ మీరు చేసే పనులను,ఫలితాలను చూసుకుంటూ మిమ్మల్ని మీరు బాగా తెలుసుకున్నపుడే ఎదుటివారితో మన బంధం బలంగా ఉంటుంది..వీటన్నిటి కంటే ముందు అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా,చిన్నవాడా అని చూడకుండా పలకరించటం చాలా గొప్ప విషయం...పలకరింపుకు పరిచయంతో పనిలేదు...ఇలా నీ వ్యక్తుత్వాన్ని పదిలంగా కాపాడుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

59)ఎవ్వడి జీవితాన్ని వాడిని జీవించనివ్వాలి అప్పుడే ఎండకు వానకు తేడా తెలుస్తుంది...మన విలువ ఇంకా తెలిసొస్తుంది..అలా కాకుండా ఏమైపోతారేమో అని అతిగా ఆలోచిస్తూ తెగ హైరానా పడిపోతే...చివరికి మనమే పడిపోతాం ఎప్పటికీ పైకి లేవకుండా..అప్పుడు మనల్ని ఆదుకునే వారెవరూ ఉండరు...నువ్వాలోచించిన వాళ్ళు అసలే రారు.ఇక్కడ ఎవ్వరూ తెలివి తక్కువ వాళ్ళు లేరు..అంతా తోపులే..పోనీలే వాళ్ళు బాగున్నారు కదా అంతే చాలు..మన మంచి మనకే ఉంటుందని నీ మనస్సుని నచ్చచెప్పుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

60)బురద నీటి నుంచి కమలాలు ఉద్భవిస్తాయి.బురదకు భయపడి తామర మొక్క పెరగడమే మానేస్తే అందమైన కమల పువ్వులు ఎలా పుట్టుకొస్తాయి?కన్నీళ్లు,కల్లోలాలు అన్నీ జీవితంలో భాగమే.ఆనందాన్ని,ఆర్థిక లాభాలను ఎలా స్వీకరిస్తారో అలాగే కష్టాలను కూడా స్వీకరించి ముందుకు వెళ్ళడానికి శక్తిని పెంచుకోండి ఎందుకంటే జీవితం అంటేనే పూలు,ముళ్ళు,రాళ్ళు అన్ని కలిసినదే.మీరు పూలను ఎలా స్వీకరిస్తారో...రాళ్లు ముళ్ళను కూడా అలాగే తట్టుకునే నిలబడాలి..సక్సెస్ అనేది ఊరికే రాదు..కష్టాలు ఎదుర్కోవాలి...బాధలు తట్టుకోవాలి !!కన్నీళ్లు పెట్టుకోవాలి..తప్పులు దిద్దుకోవాలి !!కొందరి మాటలకు గుండె ముక్కలు అవ్వాలి!!.గుణపాటాలు నేర్చుకోవాలి!!మనసుకు గాయాలు కావాలి !!ఎదురుదెబ్బలు తినాలి..సహనంతో మెలగాలి!! కొన్నిసార్లు బంధాలను కోల్పోవాలి!అప్పుడే నీ జీవితానికి విజయంవరిస్తుంది!!ప్రతిక్షణం నీతో నువ్వు యుద్ధంచేయాలి!!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

61)సమస్యలకు భయపడడం మానేయండి. భవిష్యత్తు బావుండాలని మాత్రం కోరుకోండి. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి.జీవితం మీకే కాదు ప్రతి జీవికి సవాలే.మీ ఒక్కరికే కష్టాలు వస్తున్నాయి అనుకోకండి... ఈ భూమిపై పుట్టిన చీమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవులకూ ఏదో ఒక కష్టం వస్తుంది. వాటిని తట్టుకునేందుకు కావాల్సింది మనోనిబ్బరమే.దాన్ని తెచ్చుకోండి చాలు,మీ జీవితం అలా సాగిపోతూనే ఉంటుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

62)దీపాల చుట్టూ చేరే పురుగుల్ని చూడండి. తమ రెక్కలు కాలిపోతాయని,తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఆ పురుగులు ఆ దీపం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి.అలా తిరగడమే వాటి జీవితం.కేవలం కొన్ని గంటల ఆయుష్షు మాత్రమే ఉన్న పురుగే అంత ధైర్యంగా దీపం చుట్టూ తిరుగుతూ ఉంటే...వంద ఏళ్ళు ఉన్న మనిషి మాత్రం చిన్న కష్టానికి భయపడిపోతాడు.జీవితంలో యుద్ధం ఎదురైనా కూడా...ఆ యుద్ధం చేసేందుకు సిద్ధమవ్వాలి.యుద్ధంలో గెలుస్తామా లేదా అన్నది తర్వాత విషయం... యుద్ధం చేసామా లేదా అన్నది ముఖ్యం.మీ జీవితాన్ని మీరు సార్ధకం చేసుకోవాలంటే మొదటే ఓటమిని ఒప్పుకోకూడదు...యుద్ధంలో గెలుపును పొందవచ్చు లేదా ఓటమి ఎదురవచ్చు...ఏదైనా కూడా గెలుపుతోనే సమానం ఎందుకంటే అక్కడ పోరాడం పోరాటం.ప్రయాణం ప్రయత్నం చేయకుండా ఆగిపోతే మీరు గెలిచినా ఓడినట్టే కాబట్టి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

63)జీవితమంటేనే స్నేక్ అండ్ లేడర్స్ ఆట లాంటిది.నిచ్చెనలే కాదు మింగేసే పాములు కూడా ఉంటాయి. నిచ్చెనలు మాత్రమే కావాలి,పాములు వద్దంటే కుదరదు. జీవించాలంటే అన్నింటినీ స్వీకరించాల్సిందే..మీరు నడుస్తున్న దారిలో కాలికి ముల్లు గుచ్చుకుంటే అక్కడే నడక ఆపేయరు కదా,ముళ్ళు తీసుకొని తిరిగి నడక ప్రారంభిస్తారు.అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మీ ప్రయాణాన్ని ఆపకూడదు.భగవంతుడు జీవితంలో సంతోషాన్ని,సౌందర్యాన్ని మాత్రమే కాదు...ఆ జీవితం విలువ తెలిపేందుకే కన్నీళ్ళను, కష్టాలను కూడా ఇచ్చాడు.ఇది ఉన్నప్పుడే మీకు సంతోషం విలువ తెలుస్తుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

64)నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరినవారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు..అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో... బాగున్నప్పుడు కూడా అలాగే ఉండు..రెండు సందర్భాల్లో అలాగే ఉండు.రెండు సందర్భాల్లో నీతో ఉన్న వారే నీ వారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

65)కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని
దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచి వాళ్ళం
అయిపోము.ఎదుటివారు మనకు విలువ
ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి,ఎదుటి వాళ్ళ దగ్గర వీలైతే మంచిగా ఉండు,అంతే గాని మంచిగా నటించకు. మంచి మనసుతో మంచి చేసేవారు ఏ గుడి గోపురాలు తిరగకపోయిన వారికి దేవుడి కృప ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మంచే జరుగుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

66)నిన్ను అనేటోడు అనకుండపోడు..నిన్ను అర్థం చేసుకునేటోడు అర్థం చేసుకోకుండ పోడు..నిన్ను వద్దు అనుకునేటోడు ఎలాగైనా వదిలించు కోవాలనుకుంటాడు నువ్వు కావాలనుకునేటోడు ఏలాంటి పరిస్థితిలోనైనా నీతో కలిసివుండాలి అనుకుంటాడు..అందుకే నువ్వు ఎప్పుడూ ఎవరినీ బ్రతిమాలడకు ముఖ్యంగా అవమానించే అయినవారికి ఆమడ దూరంలోవుండు ఒకవేళ వుండాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అక్కడ నీ బాధను సంతోషంగా..నీ మాటను మౌనంగా...నీ కన్నీటిని చిరునవ్వుగా మార్చి అర్దం చేసుకోని ఆత్మీయులకు నీ వంతు ఆనందాన్ని పంచి ఎంత వీలైతే అంత త్వరగా అక్కడినుండి తప్పుకో అంతే కానీ,కారణాలు వెతుక్కుని దిగి దిగజారకు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని అవమాన పడకు ఎందుకంటే మన చుట్టూ వున్న పరిస్థితులు ఎలా వున్నా మనం మాత్రం ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవటమే జీవితం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

67)నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి నువ్వు నచ్చకపోతే అవి వృధా అలాగే నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీతో తిరిగే వారు వాటిని గుర్తించకపోతే వృదా అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ..కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని వుండక నీ అవసరం వున్న చోట..నీ తెలివి తేటలు నీ శక్తి సామర్థ్యములు చూపించి..కీర్తిని గడించి..జీవితంలో ఎదగడం నేర్చుకోవాలి ఇదే నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన..ముఖ్య విషయం!..కనుక ప్రగల్భాలు... కాలయాపనలూ చేయకుండా..మన విలువని మనమే పెంచుకుని అనుకున్న గమ్యాల్ని చేరుకోవాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

68)జీవితం ఒక ప్రయాణం లాంటిది ఆ ప్రయాణంలో మనతో పాటు ఎందరో కలిసి ప్రయాణిస్తారు!! కొందరు సగంలోనే దిగిపోతారు మరికొందరు మనతోనే ఉంటారు అనుకుంటాము కానీ వారి వారి గమ్య స్థానం రాగానే వెళ్ళిపోతారు..సగంలో వెళ్ళిపోయినా వారందరు మనకి కాకుండా పోరు...చివరి వరకు కలిసి ప్రయాణించినా వారందరు మన వాళ్ళు అవ్వరు....కనుక ఎవరితో ఎలా....?? ఎపుడు....?? ఎంతవరకు....?? రాసి పెట్టి ఉందొ అదే జరుగుతుంది..మనిషిని బాధపెట్టే విధంగా మనసుకి నొప్పి కలిగించే విధంగా ఎలాంటి బంధంతో ముడివేసుకోకండి.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

69)నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు! నీ జీవితం నీది!..ఎవడి కోసమో నువ్వు తలవంచకు!..నిన్ను వేలెత్తిచూపే ఏ ఒక్కడు ఒక్క పూట నీకు అన్నం పెట్టడు.!.mకష్టమైన నష్టమైనా భాదైన ఆనందమైనా నీతో నువ్వే అనుభవించు..ఇక్కడ జరిగేదంతా ఒక జగన్నాటకమే..ఎవ్వడిని నువ్వు నమ్మకు..అన్ని తెలుసు అనే వాడిని అస్సలు నమ్మకు..ఎందుకంటే ఇక్కడ ఎవడికి ఏమి తెలియదు.?ఇదో పెద్ద మాయ ప్రపంచం అందరూ మహా నటులే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి..అణువణునా నీ కోసం గోతులు తవ్వి కూర్చున్నారు!!ఏ గోతిలో పడతావో పడితే ఏమవుతావో గోతి తీసినవాడికి కూడా తెలియదు🔥!జాగ్రత సుమీ..!.కాబట్టి నీ కోసం నువ్వు బ్రతుకు..నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు..ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా అర్ధమైతే ఆచరించు అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

70)కొంతమందికి ప్రేమను చూపించడం చాలా కష్టం..కొంతమందిని అర్ధం చేసుకోవడం ఇంకా కష్టం!!..కొందరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కోపంతో ఊగిపోతారు..మరికొన్నిసార్లు బాధలో మునిగిపోతారు..ఇంకొన్నిసార్లు మౌనంగా మిగిలిపోతారు..చాలాసార్లు గందరగోళంలో తేలిపోతారు..ఎప్పుడు మనసు ఎలా మారిపోతుందో తెలియని పరిస్థితులలో బ్రతుకుతూ ఉంటారు.ఇలాంటి సందర్భాలలో మనతో ఉన్నవాళ్ళు ఈమె/ఇతను ఏంటి ఇలా ఉన్నారు..ఇలాంటివారితో బంధం అవసరమా అనే అభిప్రాయానికి వచ్చి ఆ బంధానికి వీడ్కోలు చెప్పడానికి క్షణం కూడా ఆలోచించరు..కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా మనల్ని అర్ధం చేసుకొని మన ప్రవర్తనకు తగినట్లుగా నడుచు కుంటూ..మనల్ని ప్రేమించాలని,మన మనోభావాలని గౌరవించాలి అనుకుంటారో వారే మనకు నిజమైన ఆత్మబంధువులు అలాంటి వారు దొరికినప్పుడు అసలు వదులుకోకండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

71)మనిషి ఆలోచన ఎలా ఉంటే మనకు ఎదుటి వాళ్ళు అలా కనిపిస్తారు చాలామంది చెప్తూ ఉంటారు నేను చాలా కరెక్ట్ గా ఉంటాను నేను అందరి లాంటి వాడిని కాదు అందరి లాంటి దాన్ని కాదు అని అసలు మీరు కరెక్ట్ గా ఉంటే ఆ మాటని చెప్పాల్సిన అవసరం లేదు మన గురించి ఏదైనా చెప్తే మనతో ఉన్నవాళ్లు మన గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి మనం మన గురించి చెప్పుకోకూడదు..కొంతమంది వాళ్లకి అనుకూలంగా మనం ఉన్నంతవరకు ఒక రకంగా మాట్లాడతారు అనుకూలంగా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడుతారు ఎప్పుడైతే నీతో ఉండే నీతో స్నేహం చేస్తూ నీతో మాట్లాడుతూ నీ గురించి పక్క వాళ్ళకి నీచంగా చెప్పు నిన్ను పదిమందిలో అల్లరి చేస్తూ నీ దగ్గర మాత్రం అతి వినయం నటించే వాళ్ళని అస్సలు దగ్గరికి రానీకండి అలాంటి వాళ్ళతో ఎప్పటికైనా చాలా డేంజర్ వాళ్ళు..ఎందుకంటే అలాంటి వారే ఉన్నారు ఇప్పుడు మన చుట్టూ..ఎంతలా దిగజారిపోతున్నారంటే మనుషులు ఎవరేమనుకుంటే మాకేంటి మా పనులు అయిపోతే చాలు.మేము సేఫ్ సైడ్ ఉన్నామా లేదా మా కోరికలు తీరాయా లేదా ఇంతే ఇలాగే ఉన్నారు.. కాబట్టి ఆదిలోనే అలాంటివారిని గుర్తించి దూరం పెడితే నువ్వు జీవితంలో త్వరగా ఎదగగలం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

72)ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. 'నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో' అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు..ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్‌ నడుస్తుంటే, మీ యాక్సిస్‌కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్‌ చేస్తుంటాడు. మరొకడు మీ అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్‌ అప్పటికే మీ డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్‌ అయిపోగానే ఓ పెగ్‌ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే...ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌-జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండు సార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. 'నేనే లేకపోతే' అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది..ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి. 'నేనే లేకపోతే..' అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో అమ్మ,ఆమె చేసిన వంట తప్ప, మిగతావాటిని అందరూ మార్చవచ్చు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

73)మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''...మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు'' అయిపోతుంటారు మనవాళ్ళు.ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??మనం ఒకరితో స్నేహం చేసేది..మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...మనం ఒకరిని ప్రేమించేది..పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?ఎక్కడైతే..హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో...ఎక్కడైతే...చట్టాల ప్రస్తావన లేకుండా ఉంటుందో..ఎక్కడైతే...అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో..ఎక్కడైతే బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో..ఎక్కడైతే... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో..ఎక్కడైతే తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో.ఎక్కడైతే..."అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో..ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/మన్నించే వీలుంటుందో..ఎక్కడైతే మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో అక్కడ బంధాలు బలంగా ఉంటాయి..అక్కడ మనుషులతో పాటు మనసులూ మాట్లాడతాయి...తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే..కాబట్టి బంధాల విలువ తెల్సుకుని మెలగండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

74)సింహం రోజు 18 గంటలు పడుకుంటుంది...గాడిద
రోజుకు 18 గంటలు పనిచేస్తుంది..కష్టపడడం వల్ల పైకి వస్తారన్నది నిజమయితే గాడిద అడవికి ఎప్పుడో రాజు కావాలి కదా..కష్టంతో పాటు కొంచెం తెలివి కూడా జోడించాలి...అర్థమైందనుకుంటా..??.. ఆవేశంతో కాదు ఆలోచించి పని చేయి..అనుకున్నది సాధించెయ్...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

75)జీవితంలో విజేత కావాలనుకుంటే పరిస్థితుల నుంచి పారిపోకూడదు..ఓటమిని ఒప్పుకోకూడదు ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో సక్సెస్ సాధించిన వారందరికి ఉండే ఉమ్మడి లక్షణం ఆశతో జీవించడమే.ఈరోజు కాకపోతే రేపైనా అనుకూల ఫలితాలు వస్తాయనే ఆశ మనల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉంచుతుంది.ముందుకే నడిపిస్తుంది..ఆయుష్షు పెంచుతుంది.ఆనందాన్ని ఇస్తుంది.బతుకు మీద ఆసక్తి పెరిగేలా చేస్తుంది.చీకట్లో దీపానికి ఎంత విలువో... మనిషికి ఆశ కూడా అంతే విలువైనది కాబట్టి ఓటమి వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడితే మనం అనుకున్నవి తప్పక సాధించగలం కావాల్సింది కాస్త ఓర్పుతో కూడిన ధైర్యం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

76)ఆశావాదికి,నిరాశావాదికి తేడా ఒక్కటే...కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆశావాది అవకాశాన్ని వెతుకుంటాడు. కానీ నిరాశవాది వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు.ఒక ఆశావాది ముందు సగం నిండిన గ్లాసును పెట్టండి... ఇదేమిటి అని అడగండి.ఆశావాది దాంట్లో సగం నీరు నిండి ఉందని చెబుతాడు.అదే నిరాశవాది అయితే నీళ్లు నిండుగా లేవు అని చెబుతాడు.ఉన్న పరిస్థితుల్లోనే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడమే ఆశావాదం. గొప్పవారి విజయ కథలను చదివి చూడండి... అందులో వారు దాటిన కష్టాలు ఎన్నో ఉంటాయి.మొదటి కష్టానికి ఆగిపోతే వారి సక్సెస్ స్టోరీ మనదాకా వచ్చేది కాదు కాబట్టి ఆశావాదంతో జీవించి అనుకున్నవి సాధించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

77)ఆశావాదికి కష్టాలు కనిపించవు.కేవలం అవకాశాలే కనిపిస్తాయి.మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది.ఆశావాది కూడా అంతే..సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైనది మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు. కానీ మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే.అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు.ఒకచోట పడితే మరోచోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి ఇతర జీవులు కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు.రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు.అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి.ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు.ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి.అదే మీ ఆయుష్షును పెంచుతుంది.ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

78)చేస్తున్న పని మంచి అని అవతలి వ్యక్తికి తెలియనప్పుడు,మనం చేసిన పని మంచిది అని మనకు మాత్రమే అనిపించి, అవతలి వ్యక్తికి అసలు అనిపించనపుడు,చెడు ఎదురవుతూ ఉంటుంది.మన ఉన్నతిని, మనకు వచ్చే కీర్తిని చూసి అసూయపడేవారు ఉన్నప్పుడు,చేసిన "మంచి" వల్ల వాళ్ళ ఇగో దెబ్బతిన్నప్పుడు,చెడు ఎదురవుతూనే ఉంటుంది.మన కథలో మనం హీరోలం కావొచ్చు,అవతలివారి కథలో మనం విలన్ గా మారితే అది మన తప్పు ఎలా అవుతుంది..చెడు ఎదురవుతోంది కదా అని మనలో మార్పు వస్తే, మనం వారిలా మారితే, మనకూ వారికి తేడా ఉండదు.చేసేది,చేయాలని అనుకున్నది చేసుకుంటూ వెళదాం.మనం కూడా ఆపేస్తే మన తర్వాతి తరం ఇంకా అధ్వాన్నంగా తయారు అవుతారు.రేపటి రోజు, మన అనుకున్నవారికి యాక్సిడెంట్ అయి రోడ్ మీద ఉంటే,పట్టించుకునే సమాజమే ఉండాలి.కాబట్టి,ఫలితం గురించిన ఆలోచనను వదిలేద్దాం.మనం ఈ రోజు ఆలోచించి చేసిన పని వల్ల ఏది జరిగినా స్వాగతిద్దాం.పూల దండలు పడొచ్చు,రాళ్లు పడొచ్చు ఏది జరిగినా స్థితప్రజ్ఞతతో మనం నిలబడే ఉండాలి అదే కదా జీవితం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

79)పాఠశాలలో పాఠం నేర్పి పరీక్ష పెడతారు కానీ జీవితం పరీక్ష పెట్టి గుణపాఠం నేర్పుతుంది..కొన్ని గుణపాఠాలు ఏంటంటే మనకు కలిగే కష్టనష్టాలకు ఎవ్వరినీ నిందించకూడదని..మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలని..ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు బానిస కాకూడదని..బలహీనతల్ని అధిగమించలేకపోతే బాగుపడమని..ఎంత ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వు చెక్కుచెదరకూడదని..మనల్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదని క్రమశిక్షణ,ఏకాగ్రత లేకుండా ఏది సాధించలేమని నిజాయితీగా ప్రయత్నిస్తే ఆలస్యమైనా అనుకున్నది సాధించగలమని..మనలాంటి వాళ్ళు భూమి మీద ఒకరే ఉంతయారు అది మనమే అని..కాబట్టి మన ఉనికి కోసం రోజు పోరాటం తప్పదని తెల్సుకోవాలి చివరగా ఒక్క మాట… వీటిని గుణ పాఠాలు అనడం కన్నా ఇవి స్వీయానుభవంలో నేర్చుకున్న పాఠాలు అనడం సబబు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

80)జీవితంలో కొన్ని పాఠాలు మీకు ఎంత డబ్బు,పలుకుబడి,తెలివి,అందం ఉన్నా కూడా ఎదుటి వారి నుండి నిజమైన గౌరవం పొందాలి అంటే నిస్వార్ధంగా ఉండాలి..మీరు ఇతరులకు ఎంత సాయం చేసినా కూడా,వారికి చివరగా మేరు చేయని సాయం మాత్రమే గుర్తుకు ఉంటుంది కాబట్టి వారు మీరు చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటారు అని సాయం చేయకండి.ఎక్కువ శాతం మనుష్యుల మధ్య ఉండేది ప్రేమ కాదు..అవసరం మరియు బాధ్యత కాని వారు ప్రేమ అనే పేరుతో వాటిని కప్పిపుచ్చుకుంటారు కాని నిజం వారికి కూడా తెలుసు..జీవితంలో అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం.దాని విలువ మీకు తెలియాలి అంటే అప్పుడప్పుడు వైద్యశాలకు వెళ్ళి అక్కడ ఎంతో మంది రోగులు పడే ఇబ్బందులు చూడండి కాబట్టి ఆరోగ్యాన్ని దేనికోసం కూడా పణంగా పెట్టకండి.ఒకే చోట జావితాంతం గడిపేయడానికి మీరు చెట్టు కాదు,కొండ కాదు ఎప్పటికప్పుడు జీవితంలో మార్పు చెందుతూ ఎదగాలి..ఈ ప్రపంచంలో ఇంకొకరు చేసే పనిలో తప్పులు వెతికే వాళ్ళు, వారిని క్రించపరిచే వాళ్ళు, వాళ్ళను ఎదగకుండా ఆపేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎదుటివారిని ఉత్తేజపరిచి,వారిని ప్రొత్సాహించే వాళ్ళు చాలా తక్కువ.మీరు ఆ తక్కువమందిలో ఒక్కడిగా ఉండండి వీటిని తరచూ గుర్తుంచుకోగలిగితే జీవితం ఎంతో మెరుగుపడుతుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

81)మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి.మన తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లు సన్నిహితులు, స్నేహితులు ఇలా వీళ్ళ వీళ్ళ అభిప్రాయాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకోవడంలో తప్పులేదు."తుది నిర్ణయం" మాత్రం ఖచ్చితంగా మనదే అయి ఉండాలి.మన నిర్ణయాలు పక్క వాళ్ళ ఆలోచనలలోంచి పుట్టకూడదు.మన నిర్ణయాలు అన్నివేళలా సరైనవి అయి ఉండాలని లేదు.మన నిర్ణయం అప్పుడప్పుడు బెడిసి కొట్టిన నష్టమేమీ లేదుమీరు చూడగలగాలే కానీ మీకు బెడిసి కొట్టిన నిర్ణయంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక మంచి బోధపడుతుంది.. కాబట్టి సలహా తీసుకోండి కానీ ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కొన్ని మెదడుతో కాదు మనస్సుతో తీసుకోండి అప్పుడైన మీ అంతరాత్మ సంతోషిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

82)తెలుసుకోవటం తెలివి అయితే,అర్ధం చేసుకోవడం జ్ఞానం.ఇవి రెండూ నాణేనికి బొమ్మా బోరుసుల్లాంటివి.తెలుసుకోవటానికి,అర్ధం చేసుకోవటానికి చిన్న అంతరం ఉంది. ఏది ఎక్కడ ఎలా అనేది తెలుసుకోవటం అయితే,ఎందుకు అనేది జ్ఞానం.నేర్చుకున్న నైపుణ్యాలు,తెలుసుకున్న విషయాలు,పొందిన అనుభవాలు ఇవన్నీ తెలివి,జ్ఞానం వచ్చేలా చేస్తాయి.గొప్పగా బతకడం ఎలా అనేది తెలిసినవాడు తెలివైనవాడు,ఎందుకు బతకాలి,ఆ బ్రతుక్కి అర్ధం ఏమిటని తెలిసినవాడు జ్ఞాని.తెలివైన ప్రతీవాడు జ్ఞాని కాడు కానీ ప్రతీ జ్ఞాని తెలివైనవాడే కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఆలోచించుకుని ముందడుగెయ్యి అనుకున్నది సాధించెయ్...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

83)ఏదైనా సలహా ఇవ్వడం వరకే మన పని..అది పాటించడం పాటించకపోవడం అన్నది విన్నవారి ఇష్టం.నిజమే మనం తేలికగా ఎదుటవారికి సలహాలు సూచనలు ఇచ్చేస్తూ ఉంటాము..అది వారికి ఉపయోగ పడుతుందా అని ఆలోచించము.ఉన్న సమస్యలో నుండి బయట పడేస్తుందా లేక ఇంకా సమస్యల్లోకి నెట్టేస్తుందా అని మనం కూడా చెప్పలేము.అది కేవలం ఆ సలహా తీసుకునే వారికి మాత్రమే తెలుస్తుంది పర్యవసానాలు ఎలా ఉంటాయో అని. మనకు ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.అవతలి వారి సలహా పాటించడం వల్ల కలిగే ఉపయోగాలు నష్టాలు ఏంటి అన్నవి సరైన అవగాహన ఆ సలహా ఇచ్చిన వారి కంటే తీసుకునే వారికే ఎక్కువ ఉంటుంది. వయసు ఉందని సలహాలు ఇస్తే అన్నిసార్లు అవి మంచి ఫలితం ఇవ్వదు ..ఘోరంగా బెడిసి కొడుతుంది.అనుభవం,అవగాహన అవసరం.అది కూడా కొన్నిసార్లు మంచి ఫలితం ఇవ్వకపోవచ్చు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

84)ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొదటి విసిరేసేది  అప్పటిదాకా తనకి సహాయపడిన చేతికర్రనే అలాగే నువ్వు ఇతరులకి ఎంత మంచి చేసినా ఎంత సహాయం చేసినా గుర్తుపెట్టుకోలేని సమాజంలో ఉన్నాము తిరిగి మనల్నే అనే రోజులలో బ్రతుకుతున్నాం కాబట్టి నీకు ఉన్నదాంట్లోనే చేయి..ఎందుకంటే నీకు కష్టం వస్తే ఆదుకునే వాళ్లెవ్వరూ నీ పక్కన ఉండరు నీ జీవితం నువ్వే పోరాడాలి మిగతావాళ్లంతా ప్రేక్షకపాత్రే అతి దానాత్ హత: కర్ణ: అతి లోభాత్ సుయోధన: అతి కామాత్ దశగ్రీవో అతి సర్వత్ర వర్జయేత్ కాబట్టి మరీ మంచితనం వుంటే నువ్వు నటిస్తున్నావ్ అనే రోజులలో ఉన్నాం జాగ్రత్త అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు అలాగే నేల విడిచి సాము చేయకూడదు అని సామెత.మన శక్తి తెలుసుకోకుండా సహాయం చేయకూడదు.కనీసం ఆశ కూడా కలిపించ కూడదు.డబ్బు/శక్తి/సమయం/సలహా మనకి ఉన్నంతలో పదోవంతు మాత్రమే ఎదుటివారికి వినియోగించగలం.అంతకు మించి ఆలోచన చేయడం కూడా సాహసమే..ఇది తెలీక చాలా మంది ఎదో చేసేద్దామని ఉద్దరించేద్దామని అనుకుంటే పెనుప్రమాదమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

85)మనకు ఏనుగు,ముసలి గురించి తెలుసు కదా!భూమి పైన ఏనుగు కన్నా బలమైన జంతువు లేదు.పెద్ద పేద్ద చెట్లనూ నేలకూల్చ గలదూ.అది దాని స్థాన బలిమి.మరి ముసలి కన్నా బలమైన జంతువు నీటిలో ఉన్నదా?అలాంటి ముసలి భూమి పైకి వస్తే ఏమి జరుగుతూంది.మరి ఈ ఏనుగు నీటిలోకి దిగినప్పుడు తన శక్తి అలాగే ఉంటుందా?ఆలోచించండి.ఒకవేళ ఈ రెండు జంతువులు భూమి పైన,నీటి పైన పోరాడితే ఏది గెలుస్తుందో మనకి తెలుసు అలాగే మనం ఎంత సమర్థులమైనా మన మాట చెల్లుబడి కాదు అని అనిపించిన చోట మన ప్రజ్ఞ చూపించగూడదు.ఒకరు గుర్తించక పోయినా మనకు ఒరిగేదేమీ లేదు.అలాంటి చోట ఎరగనట్టు ఉండడమే మేలు.మూర్ఖుడు మంచి వినడు.పైపెచ్చు అవమానిస్తాడు.ఈ సంగతులు తెలిసి వేమన చక్కగా చెప్పాడు.కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది..అంత మాత్రాన అది చిన్నదై పోతుందా ?అలాగే గౌరవంగా బతకాలంటే అడగందే అలాంటి వాళ్లకు సలహాలివ్వ గూడదు..ఒకరికి చాలా ఉంది.మనకు చాలినంత ఉంది అయితే వాడేమీ బంగారం తినలేడు.మనం తినేదే.. ఏదైనా ఆకలి తీరడానికే..నాకింత ఉంది అన్నా నువ్వు తినేది అదే.అంతే.అందుచేత కొంచెముండుటెల్ల కొదువగాదు అన్నాడు.సంతోషం ప్రధానం.అది ఉంటే ఇంద్రుడే..అది ప్రాప్తం లేక పోతే ఎంత ఉన్నా వేరే వాళ్లు తినడానికే.నీవు దిగులు గడుస్తూ ఉండాల్సిందే..కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండు నాకు లేదు వాడికి ఉందని నీకున్న కొద్దీ సంతోషం కూడా పాడుచేసుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

86)నాణేనికి బొమ్మా బొరుసులు ఉన్నట్లే,ప్రతి మనిషిలోనూ మంచీ,చెడూ ఉంటాయి.మనం ఎటు పక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది.వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏ మూలో కాస్తంతైనా మంచితనం కనిపిస్తుంది.మంచివారిలోనూ ఏదో ఓ చిన్న తప్పు దొరుకుతుంది.
ఎదుటివారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్రా మన జడ్జిమెంట్లో ఉంటుంది. వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొస్తాం.అదే మనకు గిట్టని వ్యక్తి ఎవరైనా ఎవరెస్టు శిఖరం ఎక్కారే అనుకోండి. అతన్ని మనసారా అభినందించడానికి కూడా నోరు పెగలదు.ఆ ఇందులో గొప్పేముంది మాస్టారూ! ఈరోజుల్లో ఆర్నెల్లు ట్రైనింగ్ తీసుకుంటే నేనూ, మీరూ ఎవరైనా ఎక్కేయగలం ఆ మాత్రానికి ఎందుకీ గొప్పల అంటూ ఆ పర్వతాన్ని ఎక్కి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగింజంత చేసి మాట్లాడడానికీ వెనకాడం!ఇదంతా మన మనసు చేసే మాయ.మన మనసు దేంతో నిండి ఉంటుందో..మన చూపు,ఆలోచనలు,పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య,ద్వేషం,అసూయ,పగ,ప్రతీకారమా లేక ప్రేమ,దయ, జాలి,కరుణా అనేది మన ఆలోచనను బట్టే ఉంటుంది.మనం ఇచ్చే కమాండ్లోనే కంప్యూటర్ పనిచేసినట్లు..మన మనసుకు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి.స్వచ్ఛమైన పాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగ్గొట్టుకుంటామో...చెంచా పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో...అంతా మన చేతుల్లోనే ఉంది!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

87)*ఎప్పుడైతే మనకు సహాయం చేసిన వారిని మనం పతనం చేయాలనుకుంటామో అప్పుడే మనకు అస్సలైన పతనం ప్రారంభం అవుతుంది అని గుర్తుంచుకోవాలి ,* *మనిషికి* జీవితాంతం *తోడుగా* ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం *భ్రమ* మనిషికి నిజాంగా *జీవితాంతం* తోడు ఉండేది తన *గుండె ధైర్యం* తప్ప మరోకటి లేదు.మీరు అందరిని *గుడ్డిగా* నమ్మకండి ఎందుకంటే *మనిషి* అవసరం ఉంటే నాకు *అంతా* నువ్వే అంటారు,అదే అవసరం తీరాక *నువ్వెంత* అంటారు ఇది *మానవ నైజం* నేస్తమా ! *మనమెంత* గొప్పవారం అయిన మనం ఎంచుకునే *స్నేహితుల* బట్టే మన *ఎదుగుదల, పతనం* ఆధారబడి ఉంటాయి *కర్ణుడంతటి* వానికే *చెడు స్నేహం* వల్ల *పతనం* తప్పలేదు *మనమెంత ?*మనిషికి *అవసరం* గొప్పది . తెగిపోతున్న *బంధాన్ని* కలుపుతుంది.*కలిసున్న* బంధాన్ని *తెంపు* తుంది . *ఆస్తులు* పంచుకునే *రక్త సంబంధం* కన్నా *మమతలు* పెంచుకునే *ఆత్మీయ* సంబంధం గొప్పది .*మనిషి* ఉన్నప్పుడు మనం పట్టించుకోం , *పోయాక* మాత్రం వారి ఫోటోలపై *ప్రేమ* కురిపిస్తాం , ఫోటో మాట్లాడదు అని *తెలిసినా !* మనిషి *బ్రతికి* ఉన్నప్పుడు *ప్రేమగా* తినిపించకుండా పోయాక *సమాధి* దగ్గర *పంచభక్ష పరమాన్యాలు* పెడతాం *శవం* లేచి తినదు అని తెలిసినా.మనిషి విలువ *మరణిస్తే* కానీ *అర్థం* కాదా ? ఉన్నప్పుడే వారిని *ప్రేమగా* చూసుకుందాం ..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

88)అడిగి తీసుకునేది అనుబంధం కాదు,అడగకుండా ఇచ్చేది అప్పు కాదు,నమ్మకం లేకుండా చేసేది వ్యాపారం కాదు,సంకల్పం లేకుండా చేసేది సాధన కాదు,స్నేహితులు లేకుండా ఉండేది జీవితం కాదు!జీవితాన్ని సార్ధకంగా మార్చే నిగూఢమైన సందేశం ఇది. మన అనుబంధాలు నిబద్ధతతో, వ్యాపారం నమ్మకంతో,సాధన సంకల్పంతో,జీవితం స్నేహంతో పూర్ణత్వాన్ని పొందాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

89)*తప్పు రాసింది పెన్నైతే కాగితాన్ని చింపేస్తాం కిందుంటే ఎవరికైనా లోకువే కాబట్టి ఎప్పుడూ పైన ఉండడానికే ప్రయత్నించు ఎందుకంటే ఈ లోకం ఎదిగిన వాళ్లనే గుర్తెట్టుకుంటుంది అలాగే నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోట నిన్ను నువ్వు నమ్ముకుని గెలిచి చూపించడం అసలైన యుద్ధం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

90)నువ్వు ఇతరులకి మంచి చేసినా ఎంత సహాయం చేసినా గుర్తుపెట్టుకోలేని సమాజంలో ఉన్నాము తిరిగి మనల్నే అనే రోజులలో బ్రతుకుతున్నాం కాబట్టి నీకు ఉన్నదాంట్లోనే చేయి..ఎందుకంటే నీకు కష్టం వస్తే ఆదుకునే వాళ్లెవ్వరూ నీ పక్కన ఉండరు నీ జీవితం నువ్వే పోరాడాలి మిగతావాళ్లంతా ప్రేక్షకపాత్రే అతి దానాత్ హత: కర్ణ: అతి లోభాత్ సుయోధన: అతి కామాత్ దశగ్రీవో అతి సర్వత్ర వర్జయేత్ కాబట్టి మరీ మంచితనం వుంటే నువ్వు నటిస్తున్నావ్ అనే రోజులలో ఉన్నాం జాగ్రత్త అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

91)మనం ఎంత గొప్ప వాళ్ళయినా...ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు, స్థలము,మనుషులు.అందరూ వదిలేసి వెళ్లిపోవాల్సిందే.మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు.ఈ మనుషులు.ఈ ఆలోచన..ఈ జీవితం.అంతా...మాయ సంకల్పం.కోరికలు ఉరవడిలో కొట్టుకుపోయే మనసుకి ఆలోచించే సమయం అసలే దొరకట్లేదు.కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నా లైఫ్ ఇంత అయిపోయిందా...అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే....జ్ఞాపకాలు గా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి.కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం.గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి.అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు.వారికి ఏదైతే అవసరమో దానికోసమే వాళ్ళ కోరుకున్నది జరిగేవరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు..దాన్ని ప్రేమ, ఆప్యాయత అనుకుని పొరపడితే...ఆఖరికి బాధపడేది, గాయపడేది శూన్యమై మిగిలిపోఏది మనమే.మన అనుకున్న వాళ్లు మనలని ఏదో ఉద్ధరిస్తారనుకోవటం మన పిచ్చి,మన పొరపాటు..మనసు పిచ్చిది.అది సాగరంలా పరుగులు పెడుతూనే ఉంటుంది. కోరికలు కెరటాలై ఎగసిపడుతూనే ఉంటాయి.ఆ సముద్రాన్నికి కూడా ఆనకట్ట ఉనట్టే నీ ఆలోచనలకు కూడా ఒక అనకట్టు వేసుకో. అందులో మంచి ఏంటో,చెడేంటో అన్నది విచక్షనతో నిర్ణయం తీసుకుని అడుగులు వెయ్యి.నీ జీవిత పయనంలో ఎంతమందిని చూసావో...ఎంతమందితో మాట్లాడావో....ఎన్నో వేల కోట్ల కిలోమీటర్లు దాటుకుంటూ ప్రయాణం చేసావో..నీకు తెలియని,నువ్వు చూడని వసంతాలే మున్నాయ్.రుతువులు ఎన్ని మారినా..మారని మన తలరాతలు అలానే ఉన్నాయ్.మన జీవితంలో కొన్ని ఇవ్వాలి ,మరికొన్ని తీసుకోవాలి.స్వార్థం ఉండొచ్చు.కోరికలు ఉండొచ్చు. మోసంతో కూడిన ప్రవర్తన ఉండకూడదు.లైఫ్ ఎండింగ్ ఎలా ఉండాలి అంటే మన చావుని చూసి.ఆ స్మశానం కూడా కన్నీరు పెట్టేలా ఉండాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

92)కన్నీళ్లు వస్తున్నాయి అని కళ్ళు మూసినంత మాత్రాన వచ్చే కన్నీరు ఆగిపోవు..కష్టాలు వస్తున్నాయి అని కలత చెందినంత మాత్రాన పరిస్థితులు మారిపోవు.కన్నీరు వచ్చేంత కష్టం వచ్చిన,కలత చెందే అంత నష్టం జరిగిన, నీరసించి నిష్క్రమించకుండా పదిలేచిన లేచిన కెరఠంలా పదిలంగా పోరాడుతూనే ఉండాలి అప్పుడే మనం అనుకున్నవి నెరవేర్చుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

93)గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకుని కలలు కంటే సరిపోదు గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో ఎందుకు ఓడిపోతున్నామో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్ధమవుతుంది..గెలుపులా ఉండాలంటే వస్తే కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే నిలబడే స్థాయికి ఎదగాలి నా వల్ల కాదని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదని గుర్తుంచుకో..బాధ,భాద్యత ఎవ్వరికీ చెప్పకు ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఈ లోకంలో గెలుపుకన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు..కొన్నిసార్లు పరిగెడితే కూడా అందని గెలుపుకోసం కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్తారు..ఒక్క నీకు నువ్వు తప్ప ఎలా తట్టుకుంటున్నావో,ఎలా నెట్టుకోస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దదీ కాదు అంతకు ముందుకు కంటే గొప్పదీ కాదు బరువు మోసే భుజాలకే తెలుస్తుంది బ్రతుకు మార్చే విధానం..కాలంతో యుద్ధం కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశం అయ్యి తీరాల్సిందే..లే పోరాడు నీకు విజయం తధ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

94)మనం బలంగా నమ్మితే సరిపోదు బలహీనతని వదిలితేనే బ్రతుకు మారుతుంది..వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు అంత బాగుంటుంది..రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు..కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదోఒక నాడు నీకు గర్జించే అవకాశం వస్తుంది..నిలబడడం నేర్చుకో ఒంటరిగా తలబడటం నేర్చుకో సింహంలా..కష్టాల్ని దాటడం నేర్చుకో సగం జీవితం అర్ధమైనట్టే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

95)జీవితంలో మితిమీరిన ఇష్టం,భయంకరమైన వ్యసనం అరణ్యవాసాలు,అజ్ఞాతవాసాలు దాటితేనే కదా పట్టాభిషేకాలు..నువ్వు బలంగా కోరుకున్న మాత్రాన ఏది రాదు..నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏది పోదు..వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు కావలి అనుకుంటే మాత్రం కడదాక వదలకు ప్రతి ఒక్కరికి టైం వస్తుందని అలా వేచి చూస్తే సరిపోదు ప్రతి రోజు కష్టపడితే నే విజయం వస్తుంది కాబట్టి కష్టే ఫలి:...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

96)జీవితంలో యుద్ధం తధ్యం అనుకుంటే కత్తి కనీళ్ళు పెట్టినా కనికరించకు..ఆద్భుతం జరుగుతుంది అనే ఆశ కంటే పరిస్థులు మారతాయన్న నమ్మకం గొప్పది..విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా,వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు కాబట్టి ఎప్పటికి ఓపిక కోల్పోకు,ఓటమిని ఒప్పుకోకు కొన్ని నచ్చకపోయినా వినాలి,కొన్ని నచ్చినా వదిలేయాలి శక్తికి మించిన అప్పులు చేస్తే,వయస్సుకి మించిన బరువులు మోయాల్సిందే..నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీతో ఉన్నవారు ఎదురు చూస్తూ ఉంటారు.బరువైన బాధ్యతలు మోసినవారే విలువైన మాటలు చెప్పగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

97)జీవితంలో మొదలెట్టడానికి,ముగించటానికి మధ్యలో భరించాల్సినవి,తెగించాల్సినవి చాలానే ఉంటాయి..చరిత్రలో చాలా చోటే ఉంది..గెలవాలి అని అనుకునేవాళ్లు కోసం కాదు..గెలిచేదాకా పోరాడేవాళ్ళ కోసం..నిన్ను నువ్వు నమ్ముకుని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం..కొన్ని ఇప్పుడు చెప్పిన అర్ధం కావు అర్ధం అయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు కాబట్టి ఈ రోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడి పోతుందని మర్చిపోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

98)జీవితంలో సరైన విధానం తెలిసేవరకు నిదానంగా వెళ్లిన తప్పులేదు ఎందుకంటే బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికి బలహీనపడవు.ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలీదుకానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి,మారి తీరాలి..నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి గాయం కూడా గర్వపడాలి..నిద్రలేని రాత్రులే కాదు ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది..ఈ రోజు దరిద్రం అని తిట్టుకున్నదే ఎదో ఒక రోజు అనుభవం అని అర్ధం అవుతుంది ఓడిపోతామన్న భయంతో గెలవగలవన్న విషయం మర్చిపోకు కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటావు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

99)జీవితంలో జ్ఞాపకం అనేది ఒక మంచి అనుభూతి..కొన్ని మంచివి కొన్ని చెడ్డవి..మంచివైతే కొనేళ్ల తరువాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడింది అనిపిస్తుంది కాలం దేనికి ఎవ్వరికీ సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప..గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో ఎందుకంటే అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగి రాదు అమ్ముకోకలగాలే కానీ ఆలోచనలే అంతులేని ఆస్తి చేసే పని దైవంలా భావిస్తే ఎదో ఒక రోజు నీ జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

100)ఎగిరేవన్నీ ఆకాశానికి చేరవు ఎవరో అన్నారని నువ్వు చేతకాని వాడివి కావు..జరిగేది జరగనివ్వు,జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్లనివ్వు రావాల్సొన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది..చేరుకుంటా అంటే ఆలస్యం చెయ్యకు,చేరుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చెయ్యకు తన గురించి బాధపడమని ఏ గతం చెప్పదు భయపడమని ఏ భవిష్యత్తు అడగదు నిరాశ నీ వల్ల కాదు వదిలేయాలి అనిపిస్తుంది ఆశ సాదిస్తావు ఇంకో అడుగు వేయి అని అడుగుతుంది..గెలుద్దాం అనుకుంటే కొంతమంది నమ్మరు అలాగే ఎవ్వరూ తోడు రారు అందుకే నీకు ఎవ్వరు అవసరం లేదు..గెలిచినా ఓడినా పరిస్థితులు దారుణమైనా ఒక్కరిమే పోరాడగలం ఒంటరిగా సాధించగలమనుకో ఒక్కటి గుర్తుపెట్టుకో బద్ధకం వదిలేసైన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది..జీవితంలో చాలా సార్లు మనవల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది కానీ వదిలేయాల్సింది ఆ ఆలోచనలు మాత్రమే బాగా గుర్తుపెట్టుకో గతాన్ని మరువడమే అతిపెద్ద గెలుపు కచ్చితంగా సాధించాలంటే ఇప్పుడే మొదలుపెట్టు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

101)పడిపోవటం,పైకి లేవటం టైమ్ రావటం,మళ్ళీ కొత్త యుద్దాలు మొదలవటం..ఇవి అందరి కథలో భాగమే.వాటి అన్నిటిని దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవాలి,ఏమి జరిగినా తట్టుకొని నిలబడేలా మనల్ని మనం తయారు చేసుకోవాలి అప్పుడే మనం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

102)మంచి పనులు అనుకుని చేసేవి అన్ని మంచి పనులు అయి ఉండాలని లేదు..అలాగే మనం చెడ్డ పనులు అనుకుని చేసేవి అన్ని చెడ్డ పనులు కూడా కావు..ప్రతి పనికి ఒక కర్మ రూపు దిద్దుకుని మనల్ని అనుసరిస్తుంది..మంచి పనులు చేస్తున్నాం అనుకుని గర్వపడి..నా అంత మంచివాడు ఈ భూ ప్రపంచంలో లేడు అని..నేను మాత్రమే ఉత్తముడిని..నా చుట్టూ ఉన్నవాళ్లు నా పేరు పలికే అర్హత కూడా లేని పాపాత్ములు అని చుట్టు పక్కల సేవలో నేనో ఐకాన్ అని..ఒక చట్రంలో బంధింపబడిన ఆలోచనలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు..అందరూ అనుకున్నంత మాత్రాన వారికా కర్మ అంత ఉత్తమంగా ఉండకపోవచ్చు..అలాగే మనం చెడ్డ పనులు చేస్తున్నాం అని మన అంత చెడ్డవాడు ఈ ప్రపంచంలో లేడు అని..నేను ఎందుకూ పనికి రాని వాడినని..నేనో స్వార్ధపరుడిని..పరుల సేవ ఎరుగని వాడినని అనుకున్నంత మాత్రాన వారి కర్మ ఉత్తమమైనది కాకుండా పోదు..ఒక్కోసారి ఏమీ చేయకుండా ఉండడం కూడా ఉత్తమ కర్మ కావచ్చు..ఏదైనా వెలగ బెట్టడం కూడా ఎవరో ఒకరికి హాని చెయ్యొచ్చు..కాబట్టి ఒక సందర్భానికి మనం ఇచ్చే జడ్జిమెంట్ మన విజ్ఞతను బట్టే ఉంటుంది చుట్టూ ఉన్నవాళ్ళ విజ్ఞతను బట్టి కాదు..అది మన దృష్టిలో కరెక్ట్ అయినా అన్నివేళలా అందరి దృష్టిలో కరెక్ట్ కాదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

103)తృప్తిలేని వాడికి ఏది దొరికినా,ఎంత దొరికినా సంతోషం కలగదు.జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది.ఉన్నదాంతో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం.ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యం త్వరగా దరిచేరదు.ఆయుష్షూ పెరుగుతుంది.ప్రకృతిలో పక్షులనూ,జంతువులనూ ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడం.మనిషి కూడా అంతే.అత్యాశలకు పోకుండా,ఈర్ష్యాసూయలకు లోనుకాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి, తృప్తిగా దేవుడిని చేరుకోవచ్చు.అయితే, విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు.నిరంతరం నేర్చుకోవాలనే తపన, నేర్చిన జ్ఞానాన్ని పదుగురికీ పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు.కొత్త విషయాలు తెలుసుకోవడం,మంచివారితో స్నేహం మనల్ని ఉన్న స్థితి నుంచీ ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

104)జీవితంలో నిజమైన ఎదుగుదల
ఎప్పుడు సాధ్యమంటే..తెలియకపోవడం తప్పు కాదు...నేర్చుకోకపోవడం తప్పు,భయపడటం తప్పు కాదు.భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు.లోపాలు ఉండటం తప్పుకాదు..వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు,మనం ఏ అంశంలో వెనకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..అందులో
మెరుగవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

105)ప్రతి వారి మాటలో ప్రేమ వెతక్కు అర్హత లేని ఎందరో జీవితంలో తారసపడుతుంటారు..అందరి ప్రేమలో ఆప్యాయత,నమ్మకం,భద్రత,బంధం ఉండవు..అవసరం మాత్రమే ఉంటుంది అందుకే నమ్మకం లేని మాట,భద్రత ఇవ్వలేని బంధం విలువనివ్వని మనిషి..ప్రేమ లేని మనసు వ్యర్థం కనుక నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో..కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యలాంటిది సునాయాసంగా చింపిరి చేసి పోతారు..కాబట్టి జరా జాగ్రత్త!ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు చెప్పకు..ఏదో రోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు..!!నవ్వే క్షణమైనా..ఏడ్చే క్షణమైనా....శాశ్వతం కాదు..జనాలు....చాలా గొప్పోళ్ళు...అవసరాల బట్టి...పలకరింపులు మారుతాయి..అవసరాల్లోనే...మన పేర్లు గుర్తుకు వస్తాయి..ఎందుకంటే చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా మనం గుర్తు వస్తున్నామని సంతోషించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

106)మనం కాకపోతే ఇంకొకరు అనుకునేవారికి మనం దగ్గరున్నా,దూరంగా ఉన్నా మాట్లాడినా,
మాట్లాడకపోయినా..మనంబాగున్నా ,బాగోలేకపోయినా..అసలు మనం ఉన్నా,లేకున్నా ఒకటే కదా!!అలాంటివారి కోసం మనమెందుకు నిద్రలేని రాత్రులు గడపాలి...తల పగిలేలా ఎందుకు ఆలోచించాలి..గుండెలు వెలిసేలా ఎందుకు ఏడవాలి..మనస్సుని ఎందుకు కష్టపెట్టుకోవాలి..మనల్ని మనమెందుకు కోల్పోవాలి..పోతే పోనీ..ఉంటే ఉండనీ..ఏది శాశ్వతం కాదు...కుండలో వండుకున్న అన్నం కడుపులోకి పోతుంది అనే గ్యారంటీ లేని బతుకులు అంతమాత్రం దానికి మనమెందుకు బాధపడాలి..ఒక్కరోజులో రాలిపోయే పువ్వు అరే రాలిపోతున్నా అని బాధపడక నలుగురికి నయనానందాన్ని పరిమళాలను పంచుతుంది.మరి మనిషిగా పుట్టి,అన్నీ ఫీలింగ్స్ ఉన్న మనమెంత ఆనందంగా ఉండాలో,నలుగురికి ఎంత ఆనందాన్ని పంచాలో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో!! కాబట్టి మనమేమి చేసినా ఆలోచించి చేస్తేనే ఈ లోకంలో బ్రతకగలం కదా..మరి మీరేమంటారు ?? అర్ధమైతే ఆలోచించి ఆచరించండి అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

107)మనం చిన్నప్పుడు ఒక కథ వినివుంటాం అది ఏంటంటే బావిలోనుంచి బయటకు దూకి ప్రపంచాన్ని చూడాలనుకున్నాయి కొన్ని కప్పలు.ఎంత ప్రయత్నించినా అవి అంతెత్తు ఎగరలేకపోతున్నాయి.అది చూసి మిగిలిన కప్పలు 'మీ వల్ల కాదులే ఇక ఆపండి...అని ఒకటికి పదిసార్లు అనేసరికి నిజమే కాబోలని అన్నీ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి ఒక్కటి తప్ప.దానికి చెవుడు.దాంతో నిరాశపరిచే వాళ్ల మాటలేవీ దానికి వినపడలేదు.కాబట్టి తన శక్తిమీద నమ్మకం సడలలేదు, పట్టువదలకుండా ప్రయత్నించింది,బయటపడింది.తన ప్రతిభ మీద తనకి నమ్మకం,లక్ష్యాన్ని అంది పుచ్చుకోగలనన్న విశ్వాసం ఉన్న మనిషి ఎటువంటి క్లిష్టమైన పనులనైనా సాధించగలడు.అద్భుతమైన ఫలితాలను పొందగలడు.అందుకే కలలు కనండి...వాటిని సాకారం చేసుకోగలనన్న నమ్మకంతో ముందుకెళ్లండి...విజయం మీ వెంటే వస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

108)ఆత్మవిశ్వాసం,నమ్మకం పెంపొందించుకుంటే మన బాధలూ సమస్యలన్నీ సమసిపోతాయి.మనపై మనకి నమ్మకం ఉంటే ఎంత గొప్ప పనులైనా చేయవచ్చు. నమ్మకమే వ్యక్తి ఉన్నతికి బాటలు వేస్తుంది..గతం,వర్తమానం ఎలా ఉన్నా భవిష్యత్తు బాగుంటుందని విశ్వసించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశించేవారు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు.నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తుంది.ప్రవర్తనను నిర్దేశిస్తుంది.మనిషి జీవితానికి అర్థాన్ని,పరమార్థాన్ని అందిస్తుంది.కలలు కనడం,ఏదో సాధించాలని ఆశించడం మనిషికి సహజం.అయితే ఆ కలల్ని సాకారం చేసుకోడానికి కావాల్సిన మొదటి సాధనం తమలోనే ఉందన్నది అందరికీ తెలియదు ఎప్పుడైతే మనం మన లోటుపాట్లని విశ్లేషించుకుని,మనం పడుతున్న బాధల్ని,మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులెన్ని మన మనోబలంతో అధిగమించేలా అనుకున్నది సాధించేలా ముందుకు వెళితే విజయం నీ గుమ్మం ముందు వాలాల్సిందే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

109)
వర్షం ఉన్నంత వరకే గొడుగు అవసరం ఉంటుంది. ఆ తరువాత అది బరువు అనిపిస్తుంది.మనిషి కూడా అంతే. అవసరం తీరే వరకే ఆసరా,తీరాక ఓ గతంలా మర్చిపోతారు అదే జీవితం.

110)ప్రపంచంలో పగటికి *సూర్యుడు* రాత్రికి *చంద్రుడు* ఉన్నట్టుగానే ప్రతి *మనిషికి* ఒక *ప్రాణ స్నేహితుడు* ఉండాలి . అప్పుడే *ఒక రోజు* నిండుతుంది . *ఒక జీవితం* నిండుతుంది.మనం మాట్లాడే *నిజానికి వాస్తవానికి* చాలా తేడా ఉంటుంది . మన వల్ల *ఇబ్బంది * పడే వారికి మన నుండి *దూరం* కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా *మనమే దూరంగా* ఉండటం మంచిది . మనం ఒకరిని ఎక్కువగా *నమ్మడం* వలన రెండు రకాల *ఫలితాలు* ఎదురు కావచ్చు ఒకటి మనకు *జీవితాంతం* తోడుండే ఓ *మిత్రుడు* దొరకావొచ్చు మరోక్కటి మనకు *జీవితాంతం* గుర్తుంచుకో దగిన *గుణపాఠం* .నేర్పిన వ్యక్తి అవ్వొచ్చు.ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది *నిజం కాదు* మన వెనకాల ఎలా ఉన్నారన్నది వారి *నిజస్వరూపం* మనముందు ఎలా ఉన్నారో మన *వెనకాల* కూడా అలా ఉన్నవారే మనల్ని నిజంగా *అభిమానించేవారు* . అలాంటి వారిని ఎప్పుడూ *వదులుకోకూడదు*..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

111)జీవితంలో స్నేహాలు ఎంతో ముఖ్యం.కుటుంబం ఎంత అండగా నిలిచి ఉంటుందో..నిజమైన స్నేహితులు కూడా కష్టంలో అంతే బలంగా నిల్చుని పోరాడుతారు.అందుకే రక్తసంబంధం తర్వాత స్నేహబంధమే గొప్పదని ప్రపంచంలోని మేధావులంతా చాటి చెబుతారు. రోజురోజుకు స్నేహబంధం పెరగాలంటే మీరు దానికి విలువ ఇవ్వాలి.అలాగే కొన్ని విలువలను కూడా పాటించాలి.కొద్ది మంది వెంటనే స్నేహం అలవర్చుకుంటారు.మరికొందరికి మాత్రం స్నేహితులు కావడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు ఎప్పుడైనా మీ స్నేహం సాగే నదిలా అందంగా ఉండాలి లేకపోతే అడ్డంకులు వచ్చి ఏరులుగా,పాయలు పాయలుగా విడిపోతుంది కాబట్టి ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి ఉంటే ఎవరి స్నేహామైనా కలకాలం ఉండేలా కాపాడుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

112)ప్రతి మనిషి భవిష్యత్తుపై ఆశతోనే జీవిస్తారు.భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కలలు కంటారు.అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే భవిష్యత్తు అనేది నేడు మీరు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది.మీరు ఈరోజు మంచి పనులు చేస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.కష్టపడి పని చేస్తూ ఉంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు..ఈనాడు చేసే ప్రతి పనీ భవిష్యత్తులో మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి నేడు మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

113)మనుషుల్లో నూటికి 90 శాతం మంది మనకున్న శక్తి యుక్తులలో తక్కువ భాగమే వినియోగిస్తూ ఉంటాము ఒకరు నిజాయితీగా కష్టపడితే ఏదో ఒక రోజు మనం మంచి ఉన్నత స్థాయికి కచ్చితంగా చేరుతాము.ముందుగా మీఆనం మనలో ఉన్న శక్తి ఏంటో,మనం దాని గురించి ఎంతవరకు కష్టపడి పని చేయగలమో వంటి విషయాలపై అవగాహన అవసరం.అలాగే మనకు ఏ రంగంలో ఎక్కువ ఆసక్తి ఉందో,మెదడు చురుగ్గా పనిచేస్తుందో తెలుసుకోవాలి..ఆ రంగంలోనే మనం అడుగుపెట్టి ఈరోజు నుంచే ప్రతి క్షణం కష్టపడుతూ ఉండాలి.మనం కష్టపడే ప్రతి క్షణం భవిష్యత్తులో మనకు అద్భుతమైన ఆనంద క్షణాలను అందిస్తుంది కాబట్టి కష్టే ఫలి: ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

114)అడిగి తీసుకునేది అనుబంధం కాదు,అడగకుండా ఇచ్చేది అప్పు కాదు,నమ్మకం లేకుండా చేసేది వ్యాపారం కాదు,సంకల్పం లేకుండా చేసేది సాధన కాదు,స్నేహితులు లేకుండా ఉండేది జీవితం కాదు!జీవితాన్ని సార్ధకంగా మార్చే నిగూఢమైన సందేశం ఇది. మన అనుబంధాలు నిబద్ధతతో, వ్యాపారం నమ్మకంతో,సాధన సంకల్పంతో,జీవితం స్నేహంతో పూర్ణత్వాన్ని పొందాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

115)మనిషి ఎప్పుడూ ఒక పక్షిలా బ్రతకాలి ఎందుకంటే అది కట్టుకున్న గూడు కూలిపోయినా..తను కూర్చున్న చెట్టుకొమ్మ విరిగిపోయినా..ఎముకలు కొరికే చలిపుట్టినా..పిడుగుల వర్షం పడినా..ఎండలు నిప్పులు చెరిగినా..అది ఎగిరిపోతూనే ఉంటుంది దేన్నీ లెక్కచేయకుండా..ఎన్ని కష్టాలు ఎదురైనా తన రెక్కల మీద నమ్మకాన్ని కోల్పోదు..ఎంత పెద్ద ఆపద వచ్చిన బ్రతుకు మీద ఆశ వదులుకోదు..అలాగే పక్షి లాగా మనిషి బ్రతికగలిగితే అది ఒక అద్భుతం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

116)నేస్తమంటూ లేరే ఈ జీవితానికెవరూ పోరాడకుంటె గెలుపే నీదవదూ…గాయపడితే మనసూ సాయాన్ని కోర మాకు
ఆ బాధ లోనే బతుకూ..నువ్వు నీకు దొరికే వరకూ కాలమడిగే ప్రశ్నకే బదులు నువ్వై సాగిపోరా..రాని దేదో కాని దేదో తెలుసుకుంటూ..ఏది కాదూ శాశ్వతం మరిచిపోకూ ఈ నిజాన్నీ ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా చిల్లిగవ్వా తోడురాదూ నలుగురి లోనూ కలిసిపోతూ నువ్వు నీలా మారు..జ్ఞాపకాలనే పోగు చేసే ఆటే కదా జీవితమంటే..కన్నులతడే.. నేర్పేను మరి నువు నడవనీ.. దారే ఏదో..నీ మౌనమే.. నీ తోడు అని..గమ్యానికే.. నడిచిపోరా..పూలు పరిచిన దారే కావాలి అనుకోమాకూ ముళ్ళున్న దారి కూడా.. నీదనుకో..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

117)పూటగడవని రోజే తెలిసేను ఆకలంటే ఆ రోజు నీకెదురైతే పుడతావు మళ్ళీ నువ్వే..వాడూ వీడూ, వీడూ వాడూ ఎవ్వన్నీ నమ్మొద్దు నువ్వు తాడో పేడో తేలాలంటే నీతో నువ్వే పోరాడు..గుండె పగిలి నెత్తురొస్తె..నొప్పి అంటు మొత్తుకోకు..చిప్పకూడు చేతికొస్తె నెత్తీనోరూ బాదుకోకు చావుకోరల్లోన చిక్కి కొత్త జన్మ ఎత్తి ఆకాశాన్ని ఏలినట్టు కలల్ని కళ్ళజూడ నువ్వు మారి గెలుపు సంద్రాన్ని ఎక్కి తెలిచేయి నువ్వేవరో..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

118)పట్టిన పట్టే గట్టిగ పట్టూ పిడికిలి పిడుగులు కురిపించేట్టూ..పడుతూ లేస్తూ పంజా విసురూ మరిగిన నెత్తురు చిందేట్టూ..విడిపడి ముడిపడి తలపడి బలపడి నిలబడి కలబడి ఎగబడి తెగబడి దడవక విడవక గెలుపుని గెలవరా ఈ లోకం మూర్ఛిల్లేట్టూ నడిచి వెళ్ళే దారిలో మనిషి తనమే చల్లిపోరా తోటి వాడీ సంబరాన్నే పంచుకుంటూపో నలుగురి మేలూ కోరిన నాడే మనిషౌతావూ నీవూ ఆ సత్యాన్నే గుర్తించాకే మొదలవుతుంది నీలో మార్పూ నిన్నటి నువే నీకెదురు పడీ నువు ఎవరనీ అడిగే లాగా నీ కథ నువే రాయాలి మరి ఈ నిమిషమే తనివి తీరా..ప్రేమ లేని వాడే అసలైన పేదవాడు ఆ లోటు నీకు ఎప్పుడూ రానివ్వకు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

119)కొంతమంది మనుషులు ఉంటారు పైకి ఒకలా లోపల ఒకలాగా ఏదన్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతవరకు ఒకలాగా తర్వాత ఇంకొక లాగా ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మారిపోతూ ఉంటారు అలాంటి డేంజర్ మనుషులు మన చుట్టూనే ఉన్నారు మన ఇంటి చుట్టుపక్కల మనతోనే ఉంటారు..ఉపయోగం లేకుండా ఎవరు ఎవరిని కలవరు ఎవరు ఎవరితో ఉండరు ఒకవేళ ఎవరైనా బలవంతం మీద మన జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి అలాంటి వాళ్ళని పొరపాటున కూడా ప్రోత్సహించకండి..అలా చేస్తే భవిష్యత్తులో చిక్కులోపడి బాధపడాల్సి వస్తుంది..ఒక్కటి మాత్రం పక్కా నేను ఎలా ఉంటాను నేను ఇలా చేస్తాను నువ్వు ఇలాగే ఉండాలి అని మనం ఎవరికీ చెప్పకూడదు ఎవరిని అనకూడదు ఎందుకంటే మనలాగా వేరే వాళ్ళు ఉండరు.వేరే వాళ్ళలాగా మనం ఉండం..మన అభిప్రాయాలు మనకు ఉంటే మన అలవాట్లు మనకు ఉంటాయి మన పద్ధతి మనకు ఉంటది ఎదుటి వాళ్ళని చూసి మనం అనుసరిస్తే అది నటన అవుతుంది అలా చేస్తే జీవితమంతా నటనతోనే బతకాలి అలాంటి జీవితం వృధా అన్నమాట అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అవుతుంది కాబట్టి ఎవరినైనా మొహమాటం లేకుండా దూరం పెట్టండి.ఎవరి మీదా అంతగా ఆధారపడకండి ఎందుకంటే వాళ్ళు దూరం పెడితే మళ్ళీ మనం నిరాశ పడాల్సి వస్తుంది.దయచేసి హద్దులో ఉండండి..వాళ్ళు చూపించే ఓ..అందమైన అబద్ధపు ప్రేమ..కొంతమంది మన జీవితంలోకి వాడుకొని వదిలేయ్యడానికే వస్తారో లేక ఆడుకోవాడాని వస్తారో తెలియదు కానీ అసలు జీవితమంటేనే ఇష్టం లేకుండా..చేసి వెళ్ళిపోతారు..కాబట్టి తస్మాత్ జాగ్రత్త..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

120)నీతులు నీడ ఇవ్వక పోవచ్చు కానీ,నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి.సామెతలు సంపద ఇవ్వకపోవచ్చు కానీ,మనలో ఆలోచనలు జోడిస్తాయి.కొటేషన్లు కోరికలు తీర్చక పోవచ్చు కానీ కొత్త అర్థాన్ని చెప్తాయి.మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

121)పగ తీర్చుకునే పని మనకెందుకు కాలం ఆ పని చేసుకుంటూ వెళితుంది..ఒక చిన్న కథ..ఒక ఊర్లో ఒక రైతు కష్టపడి పొలం పని చేస్తూ కొన్ని కోళ్లను కూడా పెంచుతూ ఉండేవాడు.మాటుగా ఉండి రైతు లేని సమయంగా చూసి నక్క ఒకటి కోడిని చంపి ఎముకలు కూడా కనిపించకుండా తిని వెళ్లిపోయేది.రోజుకో కోడి మాయం అవుతుంటే రైతులో బాధ,చాటుగా కోళ్ళని ఏమవుతున్నాయో కనిపెట్టాలని ఉన్నాడు.అలా ఉండగా గుంట నక్క చప్పుడు చేయకుండా వచ్చి కోడిని పట్టుకుపోయింది.విషయం కనుక్కున్న రైతు మరుసటి రోజు నక్క రాగానే ముసుగేసి పట్టుకున్నాడు.అతడి కోపం తో బుర్ర పనిచేయలేదు నక్క తోకను కిరోసినే లో ముంచి నిప్పు పెట్టాడు.మండిన నక్క అటు ఇటు పరిగెడుతూ రైతు పండించిన పంటకు నిప్పు పెట్టి పోయింది.
రైతు పంట మొత్తం నష్టపోయి లబోధిబో అన్నాడు.అందుకే చెప్పేది పగ తీర్చుకోవడం అంటే మనం పాపం చేసేలా ఉండకూడదు మనకు నష్టం వచ్చేలా అస్సలు ఉండకూడదు.మనల్ని బాధ పెట్టినవారిని మనల్ని మోసం చేసినోళ్ళని..మనం బాగుంటే ఓర్వలేనివాళ్ళని..దేవుడు కాలంతో చేరి తప్పకుండా శిక్షిస్తాడు..మనం కాస్త సహనంగా వేచి చూడాలి అంతే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

122)విజయం సాధించాలంటే ఏకకాలంలో అనేక విషయాల్లో ప్రావీణ్యం ఉండాలి. సామాజిక నైపుణ్యాలతో పాటు,కెరీర్ సంబంధిత నైపుణ్యాలు కూడా ఉండాలి.తద్వారా కెరీర్,కుటుంబం ముందుకు సాగుతుంది. కాబట్టి ఖాళీ సమయాల్లో సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించండి అలాగే మనం ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉంటే ఆ ఫలాలను ఆస్వాదించగలరు కాబట్టి విజయం సాధించడంలో ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించండి. మానసిక, శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటేనే, మీరు మీ కెరీర్ పై దృష్టి పెట్టగలుగుతారు.పైన చెప్పిన అంశాలను ముప్పయ్యేళ్ల లోపు సాధించి చూడండి.ఆ తరువాత జీవితం ఎంతో అందంగా,ఆనందంగా అనిపిస్తుంది.కెరీర్ ను ముప్పయ్యేళ్ల లోపే సెట్ చేసుకోవాలి,ఆర్ధికంగానూ బలపడాలి.దానికి మీరు మీ ఇరవైల్లోనే ఎంతో కష్టపడాలి కాబట్టి కష్టే ఫలి: ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

123)సాయం తీసుకుంటే.. గుర్తు పెట్టుకోవాలి...సాయం చేయకుంటే.. అర్ధం చేసుకోవాలి...బాధ పెడితే..మోసం చేస్తే.. గుణపాఠం నేర్చుకోవాలి.
విలువ ఇవ్వకుంటే.. దూరంగా జరగాలి...సందర్భానుసారంగా మారిపోయే మనుషుల మధ్య నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ప్రతి అనుభవాన్ని ఉలి దెబ్బగా చేసుకొని శిలగా ఉన్న నిన్ను శిల్పంగా మలచుకోవాలి. అన్ని సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

124)జీవితం చాలా నేర్పుతుంది అంటారు కానీ జీవితం ఏం నేర్పించదు..మన చుట్టు ఉన్నవాళ్ళే మనకి చాలా నేర్పుతారు..నువ్వు ఎంత గుడ్డిగా మనిషిని నమ్మితే అంత ఎక్కువగా నిన్ను మోసం చేస్తారు...ఈ రోజుల్లో నిజమైన ప్రేమ,ఆప్యాయతలు,నమ్మకాలు లేవు...ఈ బంధాలు,అనుబంధాలన్ని చిక్కుముడులు...
గజిబిజి అల్లికలు...వాటిని పట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు...కొన్ని పయనాలు జరగాలంటే...
కొన్ని నయనాలు చెమ్మగిల్లాలి తప్పదు...అనవసరంగా ఏ మనిషి మీద నమ్మకం పెట్టుకోకు...ఎవరు చివరిదాకా నీతో ఉండరు...నీతో ఉండేది కేవలం నువ్వు మాత్రమే కాబట్టి ఏం జరిగినా నవ్వుతూ బ్రతకడం అలవాటు చేసుకో..మళ్ళీ చెబుతున్నా జీవితం ఏం నేర్పించదు..బ్రతకమనుంటుంది అంతే... ఎందుకంటే జీవితమే ఒక జగన్నాటకం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

125)చాలామంది విజయం అనేది ఒక చివరి స్టాప్
అనుకుంటారు.విజయం అనేది గమ్యం కాదు,ప్రయాణం.
జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. మీకు ఎదురయ్యే
విజయాలు చెక్ పాయింట్లు మాత్రమే.జీవితాంతం
విజయవంతంగా నడవాలంటే మీరు ప్రయాణం చేస్తూనే
ఉండాలి.మార్పు ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం. మీకు ఎదురవుతున్న ప్రతి మార్పును ఎదుర్కొంటూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. మార్పును స్వీకరించడం నేర్చుకోండి. దానితోనే సరిపెట్టుకోండి.సమయానికి అనుగుణంగా ముందుకు సాగండి అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాల్ని సాధించగలేరు సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

126)జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులను మరిచిపోకండి..!!
*మొదటి వ్యక్తి*::: నిన్ను గెలిపించడానికి ని కోసం అన్ని కోల్పోయిన మీ నాన్న
*రెండో వ్యక్తి*::: నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ నీ తోడుంటే 
మీ అమ్మ
*మూడో వ్యక్తి*:::నీ మనస్సులో ఉన్న భావాన్ని పంచుకోవడానికి ఒక స్నేహితుడైన ఉండాలి,లేకుంటే భాగస్వామైనా ఉండాలి..అలాంటి వ్యక్తులు నీకు దొరికినప్పుడు వారిని ఎప్పటికి వదులుకోకండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

127)మన జీవితంలో కొంతమంది మనం మాట్లాడితేనే,మాట్లాడుతున్నారు అంటే దానర్థం..ఇంక అక్కడ నీతో అవసరం లేదని అర్థం చేసుకోవాలి..ఒకరు మనం మాట్లాడిస్తేనే మాట్లడుతున్నారు అంటే అక్కడ నీ పాత్ర ముగిసింది అంతే వాళ్ళకి ఎదైనా అవసరం ఉంటేనే మళ్ళీ మాట్లాడతారు అంతే తప్ప ఓ నువ్వు కాల్ చేసి మాట్లాడితేనో ఆప్యాయంగా ఓ రెండు మాటలు మట్లాడేసరికి నా మీద కూడా అభిమానం ఉందని మురిసిపోకు అక్కడ వాళ్ళు నువ్వు బాధపడతావని మాట్లడతారే తప్ప నిజంగా అభిమానం ఉండి మాట్లాడరు..కొంతమంది ఎలా నటిస్తారంటే నాకేం అవసరం వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడదాం..లేదంటే లేదు పోయేదేముందీ..ఓ రెండు మాయ మాటలు తప్ప అని..ఉండని..ఇంకొంతమంది మహానుభావులు ఎలా అంటే ఎప్పుడైనా ఎదైనా అవసరం రావచ్చు ఇలా కొంచెం మైంయింటేన్ చెద్దాం అని అనుకుంటారు తప్ప నువ్ కావాలి అని ఫీల్ అయ్యి నీతో మాట్లాడరు..కాబట్టి నేటికాలంలో జెన్యూన్ గా నిన్ను నిన్నుగా ఇష్టపడేవాళ్ళని నలుగురిని సంపాదించుకో అలాగే అవసరాల కోసం నిన్ను వాడేవాళ్ళని వదిలించుకో అప్పుడే మోసపోకుండా జీవితంలో ఎదగగలం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

128)మనసును జాగ్రత్తగ చూసుకుంటున్నామని
బలహీన పరిచేస్తామేమో కాస్త కఠినంగా ఉండడానికి కూడా తెలుసుకోవాలి.ప్రాణం అంటే మనుషులు పక్షులు జంతువులు ఇవే అంటారు కానీ నా కెందుకో ప్రతి వస్తువుకి ప్రాణం ఉన్నట్టే అనిపిస్తుంది.కారు ధిద్దిన కాపురం..కారు ఓ కుటుంభం పైన చూపే విశ్వాసం అలాగే మర్యాద రామన్న చిత్రం లో సైకిల్ మాట్లాడుతుంటే చాలా నిజం అనిపించేది.ఒక వాక్యం గుర్తు వచ్చినప్పేదల్లా మనస్సు చాలా బాధతో నిండిపోతుంది..*గుడ్డివాడికి చూపొస్తే మొదటిగా అతను వదిలేసేది అప్పటివరకు తనకు తోడుగా ఉన్న చేతి కర్ర* బాధ అనిపిస్తుంది..చూపొచ్చాక కూడా కర్రను పట్టుకు తిరగమని అనట్లేదు కానీ ఆ కర్రను వదిలేయొద్దు ఆ కర్రను విసిరేయ్యొద్దు అంటున్నా ఎంత చూపు వచ్చినా ఇప్పటి వరకు నీకు చూపయింది ఆ కర్రే గా అవసరం తీరిపోయాక మనుషులనే మర్చిపోతున్నారు
మార్చేస్తున్నారు ఇక వస్తువులకు విలువ ఇవ్వమనడం ఏంటి నీ పిచ్చి కాకపోతే అని అనుకోవచ్చు మారలసింది సమాజం కాదు మార్చుకోవలసింది మనసును అంటూ
ఎక్కడి నుండో మాటలు వినిపిస్తున్నాయి..కానీ కఠినంగా ఉండాలని ప్రయత్నించినా అది అనుకునేంత సులువేం కాదు కానీ మనం బ్రతకాలంటే తప్పదు కాబట్టి నీ ధర్మం నువ్వు చేయి దేవుడు చేయాల్సింది చేస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*