2)ఎన్నాళ్ళు దిగాలుగా కూర్చుంటావు..? దిగులుపడే నీవంటే నలుగురికీ దిగదుడుపే..ఎవరి కష్టాలు వారికున్నాయి నీ కష్టమెవరికి కావాలి...?ఓదార్పు నీవు కోరకుంటే పాపపుణ్యాల కథలు వినిపిస్తారు...నిరాశలో నీవు కూరుకునిపోతే నిట్టూర్పుల జల్లు కురిపిస్తారు.నీ కన్నీటి జడివాన నిన్ను ముంచెత్తకముందే ఆశల గొడుగు పట్టు..పోరాడితే పోయేదేముంది..గెలిస్తే గెలుపవుతావు..ఓడితే నీ జీవితానికే మలుపవుతావు...ఎడుస్తూ కూర్చుంటే ఏమవుతావు...?వెలుతురెరుగని చీకటవుతావు.. కాబట్టి ఎప్పుడు ఓటమి ఒప్పుకోకు..గెలుపు కోసం పోరాడు నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
3)జీవితంలో జరిగే ప్రతీ చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుంది..ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ప్రత్యేకంగా తయారు చేసి ఏం ఉండదు.మన ఆలోచనల్లోనే ఉంటుంది.మనం విషయాలను తీసుకునే పద్ధతిలోనే ఉంటుంది.ఆనందమనేది మనసుకు అనిపించాలి.దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు.జీవిస్తున్న ప్రతిక్షణాన్ని నువ్వేలా చూస్తున్నావో..దానిపైనే నీ సంతోషం దాగి ఉంటుంది.చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని బాధపడితే బాధే మిగులుతుంది.కాబట్టి, గతం గురించి,భవిష్యత్ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకూడదు.ప్రస్తుతం లో జీవించేవాడే ఆనందంతో ఉంటాడు.ఆనందం రాలిన జీవితం...నవ వసంతానికై ఎదురుచూస్తుంది..కారు చీకటి కమ్మిన మనసు..నిండు వెన్నెలకై ఎదురు చూస్తుంది..చివరగా మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం దొరుకుతుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
4)జీవితంలో అనుకున్నంతనే అన్నీ అయిపోవు.కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు.అందుకోసం ఎంతో శ్రమించాలి.ఓపిగ్గా కష్టనష్టాలకు ఎదురీదాలి. చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహా వృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది.సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే.ఓర్పు వహిస్తేనే అనుకున్నది సాధించగలం ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
5)పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది.నాన్న కూడా అడిగిన అన్ని విషయాలకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పి సంతృప్తి పరుస్తాడు.ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు కొత్త ప్రపంచాన్ని చూడటంవేరు.కొత్తగా,అందంగా,అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి.ఈ ప్రపంచం ఎవరికి వారికే ప్రత్యేకంగా కనిపిస్తుంది.కనిపించాలి.అప్పుడే ప్రతి ఉదయం ఒక కొత్త సూర్యుడు కనిపిస్తాడు.చంద్రుణ్ని చూసి పిల్లాడు ఏడుపు ఆపి అన్నం తిన్నట్లు మనం కూడా ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దానిని దిద్ది మనకి మార్గదర్శకుడిలాగా వెలుగును చూపించి ముందుకు నడిపించే దేవుడి లాంటి మిత్రుడు కావాలి.అతడితోనే మనకు
చిట్టచివరి బంధం ఉండాలి..అలా దొరికినప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా వారిని వదులుకోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
6)నువ్వు పర్వతంలా ఒకే చోట నిల్చుంతానంటే కుదరదు.నదిలాగా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతూ ఉండాలి.ఎలాంటి మార్పులు జీవితంలో వచ్చినా స్వీకరించి దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకోవాలి.అప్పుడే నువ్వు కలకాలం సంతోషంగా జీవించగలవు.జీవితంలో వచ్చిన చిన్న మార్పును కూడా తీసుకోలేకపోతే నీ జీవితం ఆగిపోతుంది.నీకు ఉండాలి నేర్పు,మనస్సుకి కావాల్సింది ఓర్పు,జీవితానికి కావాల్సింది కూర్పు,బాధలలో కావాల్సింది ఓదార్పు కానీ ప్రతి మనిషికి కావాల్సింది మార్పు అప్పుడే తన గమ్యాల్ని చేరుకోగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
7)గుండె లేదా మెదడు ఈ రెండింటిలో ఏది చెప్పింది వినాలో అన్న సంఘర్షణలో మీరు పడితే...కచ్చితంగా మీ హృదయాన్ని అనుసరించండి అప్పుడు జీవితంలో ఎప్పటికీ వైఫల్యం చెందరు అలాగే...మీ జీవితంలో రిస్క్ తీసుకోండి,గెలిస్తే నాయకత్వం వహిస్తారు,ఓడిపోతే మార్గ నిర్దేశం చేస్తారు.ఇది ఎంతో మంది జీవితాలలో మార్చింది..ఇప్పటికీ మారుస్తూనే ఉంది..ఇతరులు వేసిన బాటలో నడవకండి..మీ సొంత మార్గాన్ని వేసుకుని పయనించండి గ్రహించండి అప్పుడే మనం చీకటి నుంచి వెలుగులో ప్రయాణం మొదలు పెట్టినట్టే విజయం సాదించినట్టే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
8)మన జీవితానికి మనమే శిల్పి.ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపురూపమైన
విగ్రహంగా మారగలం.దేవుడి మెడలో హారంగా మారాలంటే గుండెల్లో గుచ్చే సూది బాధను పువ్వులు తట్టుకోవాలి.ఏది సాధించాలన్నా సంకల్ప బలంతో బాధలు,అపజయాలను ఎదిరించక తప్పదు.వేలసార్లు వైఫల్యం వెక్కిరించినా వెనక్కి తగ్గలేదు కాబట్టే థామస్ అల్వా ఎడిసన్ బల్బును తయారుచేశాడు.ప్రపంచానికి వెలుగులు పంచి చిరకీర్తిని సంపాదించుకున్నాడు.వైకల్యం ఉందని చింతిస్తూ కూర్చోకుండా పట్టుదలతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హా
గుండెనిబ్బరం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ఓపిక ఉన్నంత వరకు కాదు,ఊపిరి ఉన్నంత వరకు పోరాడితేనే విజయతీరాలకు చేరగలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
9)ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపెడితే ఉన్నతశిఖరాలకు చేరుకోవచ్చు.సముద్రాన్ని దాటే ప్రతిభ తనలో ఉందని వానర వీరులు చెప్పేవరకు హనుమంతుడికి తెలియదు.తనలోని లోటుపాట్లను గుర్తించి సరైన దిశానిర్దేశం చేయగల స్నేహితులను మనిషి సంపాదించుకోవాలి.అప్పుడు విజయానికి మార్గం మరింత స్పష్టమవుతుంది.బతుక్కి అసలైన అర్థమూ తెలిసివస్తుంది. జీవితానికి మించిన గ్రంథం లేదు,అనుభవానికి మించిన పాఠం లేదు.జీవితపథంలో ప్రతి అనుభవం నుంచీ పాఠం నేర్చుకోవాలి.అప్పుడు అనవసర భయాలు,ఆందోళనలు తొలగి మనసు తేలికవుతుంది.ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తే మన లక్ష్యాల్ని మనం చేరుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
10)జీవితంలో కలలు నెరవేరాలంటే- ఏకాగ్రత,నైపుణ్యం,ఆచరణ అవసరం.లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి.కొండలు, లోయలు దాటి సుదీర్ఘంగా ప్రవహిస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే నదిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.బలహీనమైన ఆలోచనలు వదిలిపెట్టాలి.విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో లక్ష్యాన్ని చేరాలి.కొంత మెరుగైన స్థితికి చేరాక నా ఇల్లు, నా కుటుంబం అంటూ గిరిగీసుకొని కూర్చోవడమూ సరికాదు.చేతనైనంతలో నలుగురికీ సాయపడటంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది. అది ఆచరణలో
పెట్టినప్పుడే జీవితానికి సార్థకత..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
11)జీవితంలో కష్టాన్ని సుఖాన్ని ఒకేలా చూడాలి అప్పుడే ఎంతటి సమస్య వచ్చినా మనం దాన్ని తట్టుకునే శక్తిని పొందుతాము.పట్టరాని సంతోషం కలిగినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా?మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎందుకంతగా ఆలోచించి విలవిలలాడి పోతున్నాము?సంతోషం కలిగినట్టే కష్టం కూడా వచ్చి అలా పోతుంది.మనం చేయాల్సినదల్లా ఆ సమస్యను తొలగించేందుకు చిన్న ప్రయత్నం.ఏరోజు ఒకేలా ఉండదు,ఏ క్షణము మనతో నిలిచిపోదు.అలాగే కష్టాలు కూడా అలా దొర్లిపోయి వెళుతూనే ఉంటాయి.తిరిగి మనల్ని సంతోష క్షణాలకు చేరువ చేస్తూనే ఉంటాయి.అలలు కూడా తీరం చేరేసరికి ఉదృతి తగ్గించు కోవాల్సిందే.సుతారంగా మన పాదాలను తడిపి వెనక్కి వెళ్లాల్సిందే..కష్టాలు కూడా అంతే...సమయం వచ్చినప్పుడు ఓసారి పలకరించి మన బలహీనతలను మనకు తెలియజేసి వెళ్ళిపోతూ ఉంటాయి.ఆ సమయంలో మనం ధైర్యంగా ఉంటే చాలు ఏ సమస్యనైనా ఛేదించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
12)మన జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి.సుఖం విలువ తెలియాలంటే కష్టాన్ని అనుభవించి తీరాలి.సంతోషం విలువ తెలియాలంటే బాధను చవి చూడాల్సిందే.కష్టాలు వస్తాయని ముందే భయపడుతూ కూర్చుంటే బతకలేము.తప్పో ఒప్పో అడుగు వేసి చూడాల్సిందే.ఓటమి పాలైతే ఆ ఓటమిలో మన బలహీనతలు ఏంటో తెలిసిపోతుంది.ఒకవేళ మనం గెలిస్తే ఆ గెలుపులో ఏది మనల్ని గెలిపించిందో మన బలం ఏంటో మనకు అర్థమవుతుంది.కష్టాలు,ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారిలో మూసుకుపోయినట్లే అనిపిస్తుంది.కానీ ధైర్యంగా ఆలోచించి చూడండి.ఎక్కడో దగ్గర ఓ దారి తెరుచుకునే ఉంటుంది.పరిసత్థులు మనకు ఒక సమస్యని తెచ్చిపెట్టినప్పుడు దానికి పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది కావాల్సింది కొద్దిగా ఓర్పు నేర్పు ఈ రెండింటితో ఎంత సమస్యనైనా మనం ఛేదించగల ధైర్యం మనకు ఉంటే చాలు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
13)జీవితంలో వచ్చే పరిస్థితులు అనూహ్యమైనవి,కానీ మనకు ఎదురయ్యే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.మన ఆలోచనలు ఎంత పాజిటివ్ గా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది.ఉదాహరణకు,మీకు ఇష్టమైన వారితో కష్టమైన చర్చ జరిగిందనుకోండి,దాని గురించి భయపడటానికి లేదా ఆందోళన చెందడానికి బదులుగా,మీరు ఎలా మాట్లాడాలో,వారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఆలోచించండి అప్పుడే మీరు ఆందోళన చెందకుండా దేనికైనా సిద్ధంగా ఉండగలరు..అలాగే మనకు నచ్చితేనే ఏదైనా పనిచేయాలి.ప్రలోభాలకు లొంగిపోయి అన్నింటికీ ఓకే చెబితే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే..కాబట్టి మనస్సుని మెదడుని ఎవరైతే అధీనపరుచుకోగలరో వారు జీవితంలో దేనినైనా సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
14)జీవితంలో మనం చేసే ఏ పని అయినా మనసా,వాచా,కర్మణా ఆచరిస్తే సత్ఫలితం కలుగుతుంది.తోటి మనిషికి మనమీద అచంచలమైన విశ్వాసం కుదురుతుంది. మనసులో మన ఆలోచన ఒక విధంగా ఉండి,నాలుక మీదకు మాటరూపంలో వేరే విధంగా వచ్చి,క్రియారూపాన్ని సంతరించుకొనేసరికి ఇంకో రకంగా ఉంటే-నిబద్ధత ఉన్నట్లేకాదు.మనం బతికే సమాజంలో నీతితో,నియతితో గడపాలని,సర్వవేళలా పక్కవ్యక్తికి మంచే జరగాలని కోరుకోవాలి.మన చేష్టలు జనహితం కోరేవిగా ఉండాలి.నలుగురికీ ప్రయోజనకరం కావాలి అప్పుడే మన జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
15)జీవితంలో ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని,దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే.నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి,విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నతస్థితికి చేరినవారే.స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు.వారే జీవితంలో విజేతలు!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
16)జీవితంలో నీది కాని బంధం కోసం ఆరాటపడి ఉన్న బంధాన్ని కోల్పోయి ఏకాకివైపోకు..లేనిదాని కోసం ఆతృతపడి ఉన్న భాగ్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోకు..పరాయి వాళ్ళకోసం పరుగులు తీసి
పరువు కోల్పోయి ప్రాణం మీదకు తెచ్చుకోకు..చెంత నుండాల్సిన చేతిని చీదరించుకుని సుమధురంగా సాగాల్సిన జీవితాన్ని ఛిద్రం చేసుకుంటే చేరదీసే వారు లేక చితికి దగ్గరైపోతావు కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి లేదంటే నీ జీవితానికి చరమాంకం పాడతారు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
17)పని చేసుకుంటూ పోవటం ఎంత ముఖ్యమో...పరిచయాలు పెంచుకుంటూ పోవటం కూడా అంతే ముఖ్యం... మనం ఎంత తోపయినా,తోపని నిరూపించుకునే అవకాశాలు, ఈరోజుల్లో పరిచయాలతోనే సాధ్యం..బావిలో కప్పల్లా ఉండకుండా..కాస్త గుమ్మం దాటి బజారుకి,అటు నుంచి ఊరులోకి, చుట్టూ ఉండే సమాజంలోకి నిత్యం తొంగిచూస్తూ ఉండాలి!!పని చేసుకుంటూ...పదిమందితో సమన్వయం చేసుకుంటూ పోవటమే విజయానికి దగ్గరి దారి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
18)జీవితంలో ఒక సెక్యూర్డ్ రిలేషన్,ఇష్టమైన పని సగం బరువుని తగ్గిస్తాయి.మంచి స్నేహితులని ఎప్పుడూ మీతో ఉండేలా చూసుకోండి.ఎవరైనా విచారంలో ఉంటే వారితో మీ సమయాన్ని పంచుకోండి.కాస్త ఓదార్పునివ్వండి.అది మీ విచారం పోయేందుకు సహాయం చేస్తుంది.నెగెటివ్‌గా మాట్లాడే మనుషులకి దూరంగా ఉండండి.పాజిటివ్ ఆలోచనలను ఇచ్చే స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి. అలాగే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా లైట్‌గా బ్రతకటం నేర్చుకోండి అప్పుడే జీవితాంతం ఆనందంగా ఉండగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
19)ఆనందం ఖర్చుతో సంబంధంలేని విషయం. కొందరు కేవలం టివిలో వచ్చే కామెడీ షోలను చూస్తూ ఆనందంగా బ్రతికేస్తారు.అలా చిన్న చిన్న విషయాల్లో ఆనందం వేతుక్కోండి. మీకు ఏ విషయం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో తెలుసుకుని అదే పని తరుచుగా చెయ్యండి.జీవితాన్ని రన్నింగ్ రేస్ లా భావించొద్దు.నిదానంగా అయినా మీకు నచ్చిన పనే చెయ్యండి.ఆలస్యం అయిపోతోంది,నేను వెనుకపడిపోతున్నా లాంటి ఆలోచనలు వద్దు.అది కేవలం సమాజం సృష్టించిన పీర్ ప్రెజర్.రోజూ ఉదయం లేవగానే ఈ రోజు నాకు ఆనందాన్నిచ్చేలా ఏ పని చెయ్యొచ్చు అని ఆలోచించి ఆ పని తప్పకుండా చెయ్యండి అప్పుడే జీవితాంతాం ఆనందంగా ఉండగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
20)ప్రతి ఒక్క మనిషి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చారు, మళ్లీ ఒంటరిగానే భూమిలో కలిసిపోతారు.మధ్యలో ఈ అందం,అధికారం,డబ్బు,మదం అవసరమారూపాన్ని,రూపాయిని చూసి మురిసిపోతున్నారా..అవి మిమ్మల్ని వదిలి వెళ్లే రోజు ఎప్పుడో ఒకసారి వస్తుందని గుర్తుంచుకోండి.ఈ మారిపోయే లోకంలో ఏదీ శాశ్వతం కాదు. తేదీలు మారుతున్నా,ఏళ్లు గడుస్తున్నా,కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే...మీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని.మీరు సాధించిన విజయాలు, ఘనతలు మాత్రం మీ మరణానంతరం కూడా కొన్ని తరాలు గుర్తు పెట్టుకుంటాయి.ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టి వంద ఏళ్లు దాటి పోయినా ఇప్పటికీ మనం ఆయన్ని మర్చిపోలేక పోతున్నాం.అలాగే మీరు చేసే మంచి మాత్రం ఎక్కువ కాలం పాటూ మీరు ఉనికిలో లేకపోయినా నిలిచే అవకాశం ఉంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
21)ఈ కలికాలంలో కొంతమంది జీవితం ఎదుటి వాళ్ల కోసమే ఉండాలి అనుకుంటారు ఆ కుటుంబాల కోసం జీవితాంతం ఎంత చేసిన ఇంకా ఏదో మిగిలిపోతుంది..ఒకటి తర్వాత ఒకటి నీకు అబద్దాలు చెప్తూ నిన్ను మోసం చేస్తూ మరి ఆడుకుంటారు వాడుకుటరు అవసరం తీరిన తర్వాత విసిరేస్తారు..ఎదుటి వాళ్ళ ఇబ్బందులు గమనించకుండా వాళ్ళ అవసరాలు తీరిస్తే చాలు అనుకునే మహాను భావులు చాలామంది ఉన్నారు..ఒక మనిషి కోసం ఇన్ని దరిద్రాల అనుభవించడం అవసరమా అని ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతాయి బంధాలు..ఇవాళ రేపు ఎవరి బ్రతుకు వాళ్ళకే కష్టంగా ఉంది అందరి బరువు మోయాలి అంటే మాటలా చెప్పే వాడికి చేసే వాడు లోకువంట..చాలావరకు అలాంటివాళ్లే ఉన్నారు ఈ రోజుల్లో అయ్యో అన్నావంటే ఆరు నెలల పాపం చుట్టుకుంటింది..మంచికి ధర్మానికి రోజులు కావివి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాంటి వారిని వెంటనే దూరం పెట్టేయండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
22)అతి మంచితనం,జాలి,దయ వంటివి మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి మహాభారతంలో కర్ణుడే ఉదాహరణ.కర్ణుడు తన అతి మంచితనంతో,దానధర్మాలతో,
తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.చివరికి చెడు వైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.జీవితంలో మీరు గెలిచి నిలవాలంటే మంచివారితోనే స్నేహం చేయాలి.అనవసరమైన వ్యక్తులకు,అనవసరమైన పరిస్థితుల్లో దానధర్మాలు చేయడం మంచి పద్ధతి కాదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
23)డబ్బు సంపాదిస్తే సరిపోదు.దాన్ని కాపాడుకునే తెలివితేటలు ఉండాలి.చాలామంది కోట్లు సంపాదించినా,అవి వాళ్ల దగ్గర ఉండవు. చెడుఅలవాట్లు,అతిగా దానధర్మాలు చేయడం, గొప్పలకు పోయి ఎక్కవగా ఖర్చు చేయడం వల్ల సంపాదించిందంతా పోగొట్టుకుంటారు.అలాగే మనం నీతినియమాలతో కష్టపడి రక్తం పెట్టి సంపాదించిన డబ్బులు ఎక్కడికి పోవు ఆ లక్ష్మీదేవి వాళ్లను ఏదో ఒకవిధంగా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి సహాయం చేయడానికి కూడా మన స్థాయి స్తోమతని బట్టి చేయాలి అంతేగాని ఎమోషనల్ గా వాళ్ళేదో అయిపోతారని చేస్తే నడ్డి విరుగుతుంది ఇది నా స్వీయ అనుభవం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
24)ఒక స్నేహం వల్ల కోట్లు రాకపోయినా పర్వాలేదు…తల దించుకునే పరిస్థితి రాకూడదు.పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపే స్నేహం లేకపోయినా నష్టం లేదు...కానీ నీ నుంచి ఎదో ఆశించి స్నేహం చేస్తే లాభం లేదు.ఏ స్నేహం అయినా మంచి చేసేదిగా ఉండాలి మంచి దారి చూపాలి..చెడు దారిలో వెళ్ళనివ్వకుండా ఆపాలి.మంచి కోరుకోకపోయినా పర్వాలేదు గానీ చెడు ఉద్దేశంతో చేసే స్నేహం లేకపోవడమే మంచిది.ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేసిన భావన కలగకూడదు.అటువంటి స్నేహాలు కలకాలం పదిలంగా ఉంటాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
25)లాభం ఆశించి చేసేది వ్యాపారం,పుణ్యం ఆశించి చేసేది దానం,ఏమి ఆశించకుండా చేసేది సహాయం..కానీ ఎపుడైతే ఎవరన్నా మన సాయాన్ని అవకాశంగా తీసుకుంటూ మనల్ని వెధవని చేసామని వెనక ఆనందించేవాళ్ళకి పైన దేవుడనే వాడొకడున్నాడు చూస్తూనే ఉంటాడు.ఇలాంటి వారి వల్ల నిజంగా ఎవరన్నా సాయం చేయమంటూ అడిగితే మరోసారి సాయం చేయటానికి మనసొప్పదు కాబట్టి సాయం చేసేటప్పుడు ఆచితూచి చేయాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
26)యద్భావం తద్భవతి అని.అంటే,మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నా ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది…మన ఆలోచనలు,చేతలు,ఉద్దేశాలు, అంచనాలు ఎలావుంటే అలాగే మనకు జరుగుతుంది.మనము ఒకరి గురించి ఎప్పుడు అయితే తప్పుగా ఆలోచిస్తా మో అప్పటి నుంచి తప్పుగా కనిపిస్తారు మన కృషి,పట్టుదల,దీక్షలను నిర్లయించి చేతలు అలా ఉండి అవి మన గతిని నిర్ణయిస్తాయి.మతి ఎలా ఉంటే గతి అలా ఉంటుంది నువ్వు ఏదైతే ఎదురువారికి ఇద్దామనుకుంటున్నవో అదే తిరిగి నీకు వస్తుంది కాబట్టి ఆచి తూచి ఆలోచిస్తూ అడుగు వేయి నేను చేసేది ఎవరికీ తెలీదనుకోవచ్చు కానీ పైన త్రినేత్రుడు చూస్తూనే వుంటాడు కర్మ నీకు వెనక్కి తిరిగి రాడానికి కొంత సమయం పడుతుంది అంతే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
27)జీవితం సున్నితమైనది.మన ఆలోచనలు,చేతల వల్లే జీవితం మలుపులు తిరుగుతుంది.కొన్ని సందర్భాల్లో ఆ జీవితం ఒక్కోసారి మన చేతుల్లోంచి జారి పోతుంది.దానికి కారణం కూడా మనమే.మనం చేసే కొన్ని పనులే జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి.జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మన భావోద్వేగాలు,మన చర్యలు,మన నిర్ణయాలు,మన అభిప్రాయాలు,మన ప్రతిస్పందనలు,మన మాటలు,మన ప్రవర్తన,
మన ప్రయత్నాలు,మన సమయం,మన కోరికలు, ఆకాంక్షలు,లక్ష్యాలు,అభిరుచులు, అలవాట్లు ఇవన్నీ మన నియంత్రణలో ఉంటే మన జీవితం అధ్భుతంగా ఉంటుంది.మనకు మనశ్శాంతి,ప్రశాంతత దక్కుతుంది.వీటిపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంతగా మన సామర్థ్యం పెరిగి మనం అనుకున్న గమ్యాన్ని చేరగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
28)నమ్మకం,విధేయత అనే ఇంధనం మీద నడిచే బండి స్నేహం!ప్రపంచాలు, ప్రయారిటీలు వేరైనా..మనకోసం నిలబడే ఒక్క లాయల్ ఫ్రెండున్నా చాలు.అసలు అయినవాళ్లు లేనివాడు కాదు,ఆప్తమిత్రుడు లేనివాడే అనాథ! అప్పుడే కలిసినా ఎన్నాళ్ల నుంచో తెలిసినట్టుగా పెదాల మీద విరిసే చిరునవ్వు..ఆ నవ్వును అలాగే పదికాలాలు నిలబెట్టే స్వచ్ఛమైన బంధం..నీకు వుంటే నువ్వు అదృష్టవంతుడివి అలాంటి బంధం దొరికితే వదులుకోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
29)మనం అవును అన్నా కాదన్నా.. కొన్ని రుణాలు బంధాలు ఉంటాయి..మనం ఎంత దూరం పారిపోతే అంతలా మన వెనకాల మనల్ని వెన్నంటే వస్తాయి..ఎందుకంటే అది మనం రాసుకున్న రాత కాదు భగవంతుడు ఎప్పుడో..ఎక్కడో రాసిన రాత..ఈ జన్మ కాకపోతే మరో జన్మ ఆ జన్మ కాకపోతే ఇంకో జన్మ బాకీ తీరేదాకా రుణానుబంధాలు వెంటాడుతూనే ఉంటాయి...మనము అవును అన్న కాదన్నా అందుకే ఎప్పుడువి అప్పుడే తీర్చేసుకోవాలి బాకీలైన బంధాలైనా మళ్లీ జన్మకి మిగిల్చకుండా..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
30)మన అనుకుంటేనే మోయలేని జ్ఞాపకాలు! మాయని గాయాలు!! మనకెందుకు అనుకుంటే ఏమి ఉండవు కదా!!ఒక్కసారి మన అనుకున్నాక తప్పదు కదా!!ఇంకెందుకు కన్నీళ్ళు!? బరువు ఎత్తుకున్నాక గమ్యం చేరే వరకు మోయాలిగా! ఒకవేళ మధ్యలో దించుకున్నా నువ్వే మళ్ళీ ఎత్తుకోవాలి!! నీ బరువు ఇంకెవరు మోస్తారు!? ఎవరి బరువు వాళ్ళకు ఉండనే ఉంది కదా!! ఓపిక ఉన్నంత కాలం కాదు..ఊపిరి ఉన్నంత కాలం ఈ బంధాలు,వారి బాధ్యతలు..తప్పనివి.తెంచుకుంటే తెగిపోయేవి కాదు..వద్దనుకుంటే వదిలిపోయేవి కాదు!!మనసుతో ముడిపడినవి! మరణంతోనే ముగిసేవి!!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
31)వంద సార్లు విను.
వేయి సార్లు ఆలోచించు.
ఒక్కసారి మాట్లాడు.
నలుగురూ నిన్ను చూసి
నీలా ఉండాలి అని అనుకోవాలేగాని.
నీలా ఉండకూడదు అని మాత్రం అనుకోకూడదు.
32)ఆకలేస్తున్నప్పుడు ఎవరైనా ఓ ముద్ద పెడితే బాగుణ్ణని ఆకాశంలోకి చూసేవేళ అనుకోకుండా వచ్చి కడుపునింపిన అన్నదాతే కంటికి కనిపించే 'దేవుడు'..రోడ్డుమీద దెబ్బలు తగిలి నెత్తురోడుతున్న అపాయకర పరిస్థితుల్లో పనులు మానుకుని మరీ ఆసుపత్రికి తరలించే ఆపద్బాంధవుడే పేరు తెలీని ఓ 'దేవుడు..'నీ కష్టకాలంలో నీ సమస్యని తన సమస్యగా అనుకుని నీకు సాయం చేయడానికి ముందుకు వచ్చే స్నేహితుడి కూడా ఓ దేవుడే..దేవుడంటే ఎవరో కాదు భయ్యా..సాయం..నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు..అంటే దైవం మనుష్య రూపేణా..మనిషి నమ్మకంతో వెతికితే దేవుడు ఎక్కడో కాదు..మనచుట్టూనే ఏదో రూపంలో కనిపిస్తాడు...కాబట్టి నీ స్థాయి స్తోమతని బట్టి సాయం చేస్తే ఆ పరమాత్మే నీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
33)మంచోళ్ళు ఉన్న చోట కొందరు ముంచేటూళ్లుంటారు తస్మాత్ జాగ్రత్త ఆ కొందరిగురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కానీ తెలుసుకుంటే తప్పేంటి జాగ్రత్త పడొచ్చు కాదా ఇది మాత్రం జగమెరిగిన సత్యం..డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇది నాకే కాదు మీకు కూడా తెలుసు..పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది కూడా డబ్బే...అయినవాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే మరి..అందుకే డబ్బుని గౌరవించండి
పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన
మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి కదా..డబ్బుకి లోకం దాసోహం పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు బహుశా ఇందుకేనేమో కదా..నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా..ప్రశాంతంగా పడుకోవాలన్నా ..నచ్చిన మనిషి మన పక్కన ఉండాలన్నా...మన దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా డబ్బే..కాబట్టి డబ్బుని గౌరవించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
34)జీవితం ఒక బాక్సింగ్ రింగ్ వంటిది..ప్రతీ క్షణమూ, పరిస్థితులు అనే ప్రత్యర్థి పంచులు విసురుతూనే ఉంటాయి.ఒక్కోసారి మనం పడిపోవచ్చు.
పడిపోయినంత మాత్రాన మనం ఓడినట్టు కాదు! ఇంకా మనకు అవకాశం ఉంటుంది.మనం పడిపోగానే ఓడిపోయినట్టుగా,రెఫరీ ప్రకటించడు.మనం కోలుకుని నిలబడడానికి సమయం ఇస్తాడు.పది వరకు అంకెలు లెక్కబెడతాడు.అప్పటికీ లేవలేకపోతే,అవతలి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు.జీవితంలో కూడా అంతే!మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము.సమస్య రాగానే,ఓడిపోయామని కృంగిపోకూడదు.భగవంతుడు సమయం ఇస్తాడు.పది వరకు లెక్కబెడతాడు.నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు.వాటిని మనం అందిపుచ్చుకోవాలి.సమర్థుడైన వాడు పది లెక్క పెట్టే లోగానే లేచి నిలబడి గెలుస్తాడు.అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే పది లెక్కపెట్టే లోగా మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి.అది కూడా ఓకే.ఒక్కోసారి ఓడిపోతాం.
పర్వాలేదు.ఇంకో పోటీ,ఇంకో మార్గం ఉండనే ఉంటుంది.
చాలా మంది 'కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు పడి లేచినందుకు!' అని అంటుంటారు కానీ,పడిన కెరటం,
లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు.విరిగి పడిన కెరటం ఛిద్రమై,పతనమై మామూలు నీటిలో కలిసి పోతుంది,అస్థిత్వాన్ని కోల్పోతుంది.మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం.కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకుని,దిశను ఎన్నుకుని,మెల్లగా ప్రారంభించి రానూరానూ వేగాన్ని పుంజుకుని,తీరాన్ని చేరుకుంటుంది.అది కొత్త కెరటం.దాని శక్తి అనంతం.మనిషి కూడా అంతే! ప్రతీ పతనం నుండి తేరుకుని, కొత్త కెరటంలా,నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి అప్పుడే కదా మనం దేనినైనా సాధించగలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
35)జీవితంలో కొంతమంది బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకునేవారూ బద్దకస్తులూ సాకులు వెతుక్కుంటారు.ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రగతి సాధించడమే కదా జీవితం.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏ సాకు దొరుకుతుందా అని చూసేవారు,తమ ఓటమికి కారణాన్ని ఇతరులపై నెట్టేసే ప్రబుద్ధులు ఎందరో ఉంటారు.అలాంటి వాళ్లు ఎదుటివారి నుంచి తప్పించుకోగలరేమో కానీ తమ ఆత్మసాక్షి నుంచి ఎలా తప్పించుకోగలరా??అయినా ఫలితాన్ని అనుభవించాల్సింది తామైనప్పుడు ఎన్ని సాకులు చెప్పీ ఎవరి మీద నెపం పెట్టీ ఏంటి లాభం? నీ కుంటిసాకులకు గుడ్బై చెప్పి, నీకు నువ్వు నిర్దాక్షిణ్యంగా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే నీ ఆలోచనావిధానం మారుతుంది అప్పుడే మనమేదైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
36)జీవితంలో గెలవాలనుకున్న వాళ్లెవరూ గెలిచేదాకా విశ్రమించరు.విశ్రమించేవారెవరూ విజేత కాలేరు ఇది జగమెరిగిన సత్యం.సాకు,నెపం అనేవి బద్ధకానికి ప్రాణస్నేహితులు.అపజయానికి ఆత్మబంధువులు.అవి అవకాశాల్ని అవరోధాలుగా మారుస్తాయి.కలలు కనేవాళ్లకీ వాటిని నిజం చేసుకోవాలనుకునే వాళ్లకీ అవి బద్ధశత్రువులు కాబట్టి విజేతలెవ్వరు వీటి జోలికి పోకుండా అకుంఠితదీక్ష,క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళ లాగ చరిత్రకెక్కారు మీరు కూడా ఆ స్ఫూర్తి ఆచరణతో మన గురించీ పదిమందికి తెలియాలంటే-సాకులు చెప్పకుండా..సాధించి చూపించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*