Saturday, July 20, 2024

Never be too much available for someone

'never be too much available for someone, otherwise you will lose your value' అనే line చాలా circulate అవుతూ ఉంటుంది. 'పూర్తిగా అందుబాటులో ఉండకూడదు' అనే extreme version కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. 

అయితే, ఈ lines, ఏ context ఇంకా experience నుంచి చెప్పబడిందో ఎక్కువగా రాయరు. అదొక universal rule లాగా వింటూ ఉంటాం. 

....ఇది ఒక వ్యక్తి ఇంకొకరికి ఎంత అందుబాటులో ఉన్నా కూడా, తమకి విలువ లేకపోవటం - granted గా తీసుకోబడటం - reciprocation రాకపోవటం అనే bitter experience నుంచి వస్తూ ఉంటుంది. 

ఏది ఎంత ఎక్కువ available గా ఉంటే - మనిషి దానికి అంత తక్కువ విలువని ఇస్తాడు. సైకాలజీ లో దీన్ని 'scarcity principle' అని చెప్తారు. economics అయినా - life లో ఏ aspect అయినా, మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఇది వర్తిస్తుంది. 

ఉదాహరణకి, water మన existence కి చాలా విలువైనది . కానీ అది abundant గా ఉంటే, ఏ మాత్రం స్పృహ లేకుండా బకెట్ లకి బకెట్లు పారబోస్తాం. అదే scarce ఉంటె, కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి అయినా - డబ్బిచ్చి మరీ కొనుక్కుని ఒక్కో drop జాగ్రత్తగా వాడుకుంటాం. 

....ఈ లైన్ జనాలు తమకి ఆపాదించుకునేటప్పుడు 3 విషయాలు వాళ్ళకి తెలియవు... 

1) మనకి విలువ ఉండాలి అంటే, మొదటగా మనం 'resourceful' గా ఉండాలి. అంటే మనం ఒక capable person అయ్యి ఉండాలి. 

2) దాని తరవాతే selective availability....మన effort ఇంకా time, మనకుండే ఒక valuable resource. అది అర్హత ఉన్న వ్యక్తి - situation మీదే ఖర్చు చేయాలి. అది కూడా వాటికి సరిపోయేంత మోతాదులోనే చేసి వదిలేయాలి. 

ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఇంకొకరు మనల్ని valuable గా చూడరు. resourceful గా ఉండకపోయినా - ఉండి కూడా తేరగా ఇచ్చేసినా... 

3) అందుబాటులో లేకపోవడం అనే behavior కే స్వాభావికంగా value ని generate చేసే గుణం ఉండదు. అది కేవలం మనుషులు మనల్ని చూసే perception ని alter చేస్తుంది. 

అంటే మనం resourceful అయినా కాకపోయినా, దానితో సంబంధంగా లేకుండా, ఈ behavior ఎదుటి మనిషి దృష్టిలో మనం valuable అని వాళ్ళు పరిగణించేలా చేస్తుంది. 

తమలో ఏ substance లేకపోయినా, కొంతమంది ఈ principle ని వాడుతూ, ఇతరుల దృష్టిలో valuable గా ఉంటారు. 

కొంతమందికి ఇది temporary benefits ని మాత్రమే ఇస్తుంది. ఇంకొంతమంది బాగానే manage చేయగలుగుతారు లాంగ్-term లో..

కానీ ఇది superficial గా ఉంటుంది. ఎందుకంటే ఆ behavior వాళ్ళ genuine confidence నుంచి రాదు - ఇంకా అసలు నిజం తెలిసిపోయే risk ఎప్పుడూ ఉంటుంది. 

----

So, మనం resourceful గా ఉండటం mandatory. ఎదుటి మనిషి ఇంకా పరిస్థితి బట్టి, తక్కువ available గా ఉండాలా - అవసరమైనంత వరకూ ఉండాలా (if we are choosing outcome over value) లేదా అస్సలు అందుబాటులో ఉండకూడదా అనే evaluation చేసుకోవడం మన life కి చాలా ఆరోగ్యకరం.