Wednesday, October 30, 2024

వ్యక్తిని శక్తివంతుని గా చేసే 48 సూత్రాలు .


వ్యక్తిని శక్తివంతుని గా చేసే 48 సూత్రాలు .


వివిధ పరిస్థితులలో తగినంత శక్తిని పొందడం మరియు సక్రమంగా కార్యాలను  నిర్వహించడం కోసం వ్యూహాల శ్రేణిని అందించే రాబర్ట్ గ్రీన్ రాసిన పుస్తకం. ఇక్కడ నేను మీకు 48 సూత్రాలు  సారాంశాన్ని ఇస్తున్నాను:

1. మీ బాస్‌ని మించిపోకండి: మీ ఉన్నతాధికారులను ఉన్నతంగా భావించేలా చేయండి.వారు మీకన్నా తక్కువ సమర్ధత కలవారైనా , వారిని తక్కువ చెయ్యవద్దు . వారి దగ్గర మీ ప్రతిభను ఎక్కువగా బహిర్గతం చేయవద్దు లేదా మీరు వారి అభద్రతను ప్రేరేపించవచ్చు.
2. స్నేహితులను ఎక్కువగా విశ్వసించవద్దు, మీ శత్రువులను గెలవటానికి కృషిచేయండి     
: స్నేహితులు మీకు మరింత సులభంగా ద్రోహం చేస్తారు, కానీ మీరు శత్రువును గెలవగలిగితే, వారు మరింత విశ్వసనీయంగా ఉంటారు.
3. మీ ఉద్దేశాలను వెల్లడించాల్సి అవసరంలేదు : వ్యక్తులు మీ చర్యలను ఊహించలేరు కాబట్టి బ్యాలెన్స్‌ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉంచండి.

4. ఎల్లప్పుడూ అవసరం కంటే తక్కువగా  చెప్పండి: మౌనం మానసిక శక్తిని పెంచుతుంది. ఎక్కువగా మాట్లాడటం వల్ల మీ ప్రణాళికలను వెల్లడించే అవకాశం వుంది .

5. మీ కీర్తి ప్రతిష్టలను ఎలాగైనా  కాపాడుకోండి: కీర్తి ప్రతిష్టలు అనేవి  మీకు కనబడని శక్తి ని ఇస్తాయి .

6. అవతలి వారిపట్ల సరిగ్గా స్పందించండి : అవతలివారికి సరైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ,వారు మీకు తగిన గుర్తింపు ఇస్తారు .

7. ఇతరులను మీ కోసం పని చేసేలా చేయండి మరియు దానిని గౌరవంగా ఆమోదించండి : మీ ప్రయోజనం కోసం ఇతరుల పని మరియు ప్రయత్నాల ప్రయోజనాన్ని తీసుకోండి.తప్పులేదు . మీరు కూడా తగిన సమయంలో స్పందించవచ్చు .  

8. వీలైనంతవరకు ,ఇతరులు  మీ వద్దకు వచ్చేలా చేసుకోండి : ఇతరుల దగ్గరకు అనవసరంగా  పరుగెత్తకండి, వారు మీ కోసం వెతుక్కొని రావాలి .

9. మీరు మాటలతో కాకుండా చర్యలతో ఇతరుల మెప్పు పొందండి , ఎప్పుడూ వాదనలు చేయవద్దు: పదాల ద్వారా కాకుండా చర్యల ద్వారా మీ పాయింట్‌ను నిరూపించండి.

10. ఓడిపోయినవారు మరియు అసంతృప్తి తో జీవించేవారికి దూరంగా ఉండండి : ఇతరుల దురదృష్టం అంటువ్యాధి లాంటిది ; అందువల్ల వ్యతిరేక స్వభావం కలిగినవారిని దూరంగా ఉంచండి .

11. ఇతరులు  మీపై ఆధారపడేలా చేయండి: మీరు ఇతరులపై ఆధారపడకండి .ఇతరులు మీ పై ఆధారపడినట్లయితే, వారు మీ నియంత్రణలో ఉంటారు.

12. చిత్తశుద్ధి మరియు అవసరమైన చోట  దాతృత్వం మీకు మంచిని చేస్తాయి . చేసేపనిపట్ల చిత్తశుద్ధి కలిగివుండి ,కొంచం దాన గుణం లేదా ఉదారంగా ఉండటం మీకు మంచి పేరును తెస్తుంది .అదికూడా మీ విజయానికి దోహదకారి అవుతుంది .

13. ఇతరుల ప్రయోజనాల కొరకు అవసరమైతే మీరు ఇతరులను అభ్యర్దించండి :  ఇతరులకు ప్రయోజనం కలిగించే వాటిపై మీరు చేసే విజ్ఞప్తులు మీకు మంచినే చేస్తాయి .కానీ మీకోసం మీరు ఇతరులను ప్రార్ధించటం లేదా విజ్ఞప్తి చెయ్యటం మీకు అవమానకరం అవుతుంది . 
14. మిమ్మల్ని మీరు స్నేహితునిగా పరిచయం చేసుకోండి, గూఢచారిగా వ్యవహరించండి: ఇతరుల నుండి విలువైన సమాచారాన్ని వారు గమనించకుండానే సేకరించడం నేర్చుకోండి.

15. మీ శత్రువును పూర్తిగా నలిపివేయండి: మీ శత్రువును కోలుకోవడానికి వీలు లేకుండా చెయ్యండి లేదా  మీ జోలికి రాకుండా చూచుకోండి. లేకపోతే అతను మీ నాశనాన్ని కోరు కుంటాడు .

16. మీ గౌరవం పెంచుకోవటానికి మీ అనేక వ్యవహారాలతో బిజీగా ఉన్నట్లు వ్యవహరించండి .
 : కొరతతో లేదా సులభంగా అందుబాటులో లేకపోవటం దేనికైనా విలువను పెంచుతుంది .

17. ఇతరులను సస్పెన్స్‌లో ఉంచండి అనగా పూర్తిగా తెరిచిన పుస్తకంగా లేదా భోళాశంకరుడుగా ఉండకండి .గోప్యత కలిగివుండటం అవసరం : ఇతరుల ఊహలకు అందకుండా  ఉండండి, అందువల్ల  ఇతరులు  గందరగోళానికి గురౌతారు అందువల్ల మీ విలువ లేదా  శక్తి పొందుతారు.

18. మీరు ఒంటరిగా సాధించగలమనే భావన నుండి బయటపడండి  : ఒంటరితనం మిమ్మల్ని బలహీనపరుస్తుంది;  మీకు లక్ష్యం సాధించటంలో ఉపయోగపడే వ్యక్తులు ,సంస్థలు లేదా సమూహాలతో కలవటం లేదా టచ్ లో ఉండటం అలవర్చుకోండి .

19. మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి: వారు మీ శత్రువులా ? లేదా  భాగస్వాములా ? లేదా హితులా ? అన్న విషయం తెలుసుకొని  తెలివిగా వ్యవహరించండి .

20. మీ స్వతంత్రతను ఎప్పుడు కోల్పోవద్దు అంటే ఏవిషయంలోనూ  ఎవరితోనూ రాజీ పడకండి : ఇతర వ్యక్తుల వ్యవహారాల్లో మీరు చిక్కుకోకుండా మీ స్వతంత్రతను కాపాడుకోండి.

21. మోసగాడిని పట్టుకోవడానికి ఫూల్‌గా నటించండి: ఇతరులు మీపై తమకు ప్రయోజనం ఉందని భావించనివ్వండి.

22. లొంగిపోయే వ్యూహాన్ని ఉపయోగించండి: కొన్నిసార్లు సరైన సమయంలో ఇవ్వడం మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది.ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవటం తోపాటు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకొని ,అవసరమైతే తగ్గటం అవసరం .

23. మీ బలాలపై లేదా అనుకూలతలపై ద్రుష్టి కేంద్రీకరించండి: మీ శక్తి ని అంతా నిజంగా ముఖ్యమైన వాటిపైనే  దృష్టి కేంద్రీకరించండి.

24. సందర్భానుసారంగా మీరు ప్రవర్తించటం నేర్చుకోవటం అవసరం .

25.మీ స్వంత గుర్తింపును పునఃసృష్టించండి: మీ భవిష్యత్ కు మీరే బాధ్యులుగా గుర్తించండి .

26. మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి: ఏవిషయంలోనైనా మీరు మాటలు పడే పరిస్థితి తెచ్చుకోవద్దు . ఇతరుల సమస్యల బాధ్యత వారే తీసుకోవాల్సి ఉంటుంది .

27. ప్రజల అవసరాలను తీర్చే చర్యలద్వారా వారిని ఆదుకోండి : ఇతరులను విధేయులుగా మార్చుకోవటానికి వారి అవసరాలలో సహాయపడటం చెయ్యండి . వారి విధేయత మీకు మంచి గుర్తింపు ను ఇస్తుంది .

28. ఎప్పుడూ ధైర్యంగా ఉండండి: పిరికితనం ప్రమాదకరం, మన పిరికితనం అవతలివారికి ప్రయోజనకరంగా మారుతుంది . మీ ధైర్యం మీకు శక్తి ని ఇస్తుంది 

29.  ప్రతిదీ పూర్తిగా  ప్లాన్ చేయండి: వివరణాత్మక ప్రణాళికను కలిగి ఉండటం వలన మీరు అనుహ్యమైన పరిణామాలను ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు .

30. మీ విజయాలను బహిర్గతం చేయండి: మీ విజయాలతో అవతలి వారి గౌరవం పొందండి .

31. ఇతర వ్యక్తుల సలహాలను  నియంత్రించండి: మీరు  ఇతరులకు నిర్ణయాలను తెలిపి  వారికి మార్గనిర్దేశం చేయండి.

32. ప్రజల ఊహలను లేదా కలలను ముందుగానే ఊహించండి : ప్రజల తో సరిగ్గా కనెక్ట్ అవ్వటానికి ,వారి  భావోద్వేగాలు మరియు కలలను ముందుగానే ఉహించి వాటిని సాధించడానికి సహాయ పడే ఉత్పత్తులు లేదా సేవలను అందించండి . వారు మిమ్మల్ని గుర్తుచేసుకొంటారు .

33. ఇతరుల బలహీనతలను గుర్తించండి : ఇతరుల బలహీనతలను మార్చటానికి ప్రేరేపించే ఉత్పత్తులు లేదా సేవలను అందించటానికి కృషిచేయండి .

34. సరైన నియమాలను  పాటించండి : సరైన నియమ నిష్ఠలు మీకు గొప్పతనం మరియు గౌరవంను అందిస్తాయి .

35. సమయపాలనలో నైపుణ్యం సాధించండి: దేనికి తొందరపడకండి; ప్రతిదానికీ సరైన సమయం ఉంది.

36. మీరు పొందలేని వాటిని తృణీకరించండి: మీకు అందుబాటులో లేని వాటిపై మక్కువ చూపకండి.

37. ఆకర్షణీయమైన పధకాలను  సృష్టించండి: ఎక్కువమందిని దృష్టిని ఆకర్షించే విధమైన పథకాలను రచించండి .

38. మీరు కోరుకున్నట్లు ఆలోచించండి, కానీ అందరిలా ప్రవర్తించండి: బహిరంగంగా సామాజిక నిబంధనలను వ్యతిరేకించవద్దు . సమాజానికి విరుద్ధంగా ప్రవర్తించటం అసలుకు మోసం తెస్తుంది .

39.చేపలను పట్టుకోవడానికి నీటిని కదిలించండి తప్పుకాదు.లక్ష్య సాధన కొరకు పరిసరాలను అనుగుణంగా మార్చుకోవటం తప్పుకాదు .

40. ఉచితాన్ని వ్యతిరేకించండి : ఉచితం అంటే సాధారణంగా పూర్తిగా ఉచితం కాదు . దానికి పరోక్షంగా ఖర్చుచేయాల్సి ఉంటుంది .

41. గొప్ప వ్యక్తులను గుడ్డిగా అనుకరించడం మానుకోండి: ఇతరుల అడుగుజాడల్లో నడవడానికి బదులుగా మీ స్వంత మార్గాన్ని ఏర్పరచుకోండి. మీకు మీరే హీరో అన్న విషయాన్నీ గుర్తించండి .

42.  గొర్రెలను  చెదరకొట్టటానికి ,ప్రతి గొర్రెను కొట్టాల్సిన పనిలేదు . గొర్రెల కాపరిని బెదిరించి పంపితే గొర్రెలు చెల్లా చెదురౌతాయి. అంటే అవసరమైనప్పుడు క్రిందివారికి బదులుగా ,ఉన్నతస్థానాలలో ఉన్నవారిని నియంత్రణలోకి తెచ్చుకోండి .

43. మంచిపనులు చెయ్యటం ద్వారా ఇతరుల హృదయాలు మరియు మనస్సులను జయించండి .

44. అద్దంలో బూచిని చూపించటం ద్వారా ఇతరులను నియంత్రణలోకి తెచ్చుకోండి : ఇతరులను అస్థిరపరిచేందుకు వారి చర్యల పర్యవసానాలను వారికీ వ్యతిరేకంగా చూపించి వారిలో భయాన్ని కలిగించండి .

45. మార్పు ఆవశ్యకతను బోధించండి, కానీ ఎప్పుడూ ఎక్కువగా సంస్కరించవద్దు అనగా బలవంతంగా అవతలి వారిలో మార్పుతీసుకొనిరావాలని ఆలోచించవద్దు . ఎందుకంటే తీవ్రమైన మార్పు ప్రతిఘటనను (బలమైన వ్యతిరేకతను ) సృష్టించగలదు.

46. ​​ఎప్పుడూ చాలా పరిపూర్ణంగా లేదా పర్ఫెక్ట్ గా కనిపించవద్దు: పరిపూర్ణత అసూయ మరియు ద్వేషించేవారిని పెంచుతుంది.

47. మీ లక్ష్యాన్ని అధిగమించవద్దు: మీరు అనుకున్నది సాధించినప్పుడు, సమయానికి పదవీ విరమణ చేయండి.

48. మొండిగా  ఉండవద్దు . అనుకూల దృక్పధం ను కలిగి ఉండండి. వీడు మారడు. ఇక వదిలివేస్తేనే మంచిది అన్న అభిప్రాయం అవతలవారిలో  రాకుండా ప్రవర్తించండి . 

ఈ సూత్రాలు  విధులను శక్తివంతంగా  నిర్వహించడానికి రూపొందించబడ్డాయి, అయితే వాటిని వర్తించేటప్పుడు సందర్భం మరియు వ్యక్తిగత నీతిని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం

No comments:

Post a Comment