1)నా మనసు భావన...ఊహల సంకెళ్లలో..క్షణమొక యుగంగా నీ రాకకై చేరుకోవాలని ఎదురుచూస్తున్న నేను..నేను దొంగచాటుగా నవ్వినా ఈ వెన్నెల వెక్కిరించినా..రేపోమాపో నీవు వస్తావని
నా కంటి పాపగా నిలుస్తావని నమ్మకం..వెన్నెల మెరిసినా నీవు మబ్బు చాటుకు చేరినా..గడచిన చీకటి సాక్షిగా మధుర క్షణాలు అందిస్తావని..నీ ఎదురుగా నేను..నా ఎదురు నీవు..మన ఎదుట ఆ పున్నమి చంద్రుడితో ఎప్పుడుంటామే..అలా ఎదురుచూస్తూ గడపేయాలేమోనని.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
2)ప్రతి బంధం – మొదటగా ఒక అవకాశంతో మొదలవుతుంది.అదే అవసరంగా మారుతుంది.చివరికి అది అలవాటవుతుంది.అది ప్రేమకావచ్చు,స్నేహం కావచ్చు..ఒక కన్ను చూస్తుంది.ఒక క్షణం ఆగుతుంది..ఒక మాట మొదలవుతుంది.అదే ఒక కొత్త బంధానికి తలుపు తీయగలదు.బంధాలు మొదలయ్యే సమయంలో మనకు తెలియదు.ఇది ఎంత దూరం నడుస్తుంది?ఇది ఎంత లోతుగా ప్రవేశిస్తుంది? అని కానీ ఒక అవకాశం ఇచ్చే మనసు ఉంటే.మనిషిలో మనిషి కనిపిస్తుంది.ఎవరో చిరునవ్వుతో పలకరిస్తే,ఎవరో మన మాట వినగలిగితే.మనలో ఏదో తెలీకుండానే మెరవడం మొదలవుతుంది.ఈ *అవకాశం* అంటే ఒక బంధానికి వేసే తొలి అడుగు.అది పెద్దదైనా,చిన్నదైనా మనసును తాకగలిగితే చాలు.
అది అనుబంధమవుతుంది. *అవసరం*.బంధాన్ని పోషించే ఎవరి జీవితం లోనైనా ఒక సమయంలో
ఒకరిని అవసరంగా అనిపిస్తుంది.మన మాట వినే వ్యక్తి,మన మౌనం అర్థం చేసుకునే మనిషి,మన భయానికి అండగా నిలిచే నీడ.అవసరం అనిపించే బంధాలు జీవితంలో చాలా ఉంటాయి.ఎవరైనా మన బాధ విన్నప్పుడు,మనకు ఒక మౌనపు తోడు ఇచ్చినప్పుడు...మనసులో ఒక జాగా వాళ్ల కోసం ఖాళీ అవుతుంది.అదే *అవసరం*.అలాగని అవసరంతో మొదలైన బంధం తక్కువ అని కాదు.మన బలహీనతల్లో ఎవరు మన చేయి పట్టుకుని నడిపిస్తారో వారే మన జీవితంలో నిలిచిపోయే మనుషులు..*అలవాటు* ఆత్మకి అతుక్కున్న లేదా హత్తుకున్న తోడు ఒకప్పుడు పరిచయమైన వ్యక్తి,ఒకరోజు అవసరమయ్యాడు,తర్వాత అతనితో లేకపోతే అసహ్యం అనిపించేట్టుగా...అదే *అలవాటు*.ఇది అత్యంత శక్తివంతమైన ఘట్టం.ఇక్కడే మనం పడి పోతాం,గిలగిలలాడతాం.ఎవరో దూరమైనప్పుడు,మనలో గాయం మిగులుతుంది.ఏం జరిగిందో మనకే అర్థం కాకపోతేనూ,వాళ్ళ లేక పోవడమే బాధిస్తుంది.అలవాటు అనేది బంధానికి మనసుతో వేసిన పట్టు.అది ఒక మత్తు కాదు.
ఒక నిశ్చల ప్రేమ లక్షణం.అలవాటవ్వడం అంటే
అలవాటు పడిన మనిషి ఎదుట లేకపోయినా,మనం స్వచ్ఛంధంగా వారి కోసం ఎదురుచూస్తాం.వారి రాక మీద మన దినచర్య,మన ఊహ,మన గడియారమే ఆధారపడిపోయింది.మన ముందు వారు చిరునవ్వు నవ్వకపోతే,మన హృదయం ఎందుకో బాధ పడుతుంది.వాళ్లు మౌనంగా ఉంటే మన కన్ను తడుస్తుంది.ఎందుకంటే అలవాటు మన భావోద్వేగాలను వారి వైపు ఆకర్షించేసింది.అలవాటు అనేది కేవలం ఒకరి జ్ఞాపకం కాదు.అది మన లోపల వారి శ్వాసలా మారిపోతుంది.వారి గమనమే మన గమనంలా అనిపిస్తుంది.వారి అసంతృప్తి మన బాధలా అనిపిస్తుంది.ఈ స్థాయికి చేరినప్పుడే అలవాటు అనేది ప్రేమకంటే లోతుగా అనిపిస్తుంది.
అవకాశం → అవసరం → అలవాటు.అది స్నేహం కావచ్చు,బంధుత్వం కావచ్చు,ప్రేమ కావచ్చు,కలుసుకున్న రహదారి కావచ్చు.ఈ చక్రాన్ని ఏ దశలోనైనా విరమించవచ్చు.కానీ మన మనసు దాని పంథాను మర్చిపోదు.ఇందుకే కొన్ని బంధాలు నిష్ఫలమైనా మనలో ఏదో మిగిలిపోతుంది.ఒక చిన్న ఆశ.ఒక చిరు వేదన.ఒక ఊహ,ఒక అలజడి.ప్రతి బంధం అవకాశంగా మొదలవుతుంది,అవసరంగా,ఎదుగుతుంది,అలవాటుగా మారుతుంది.కానీ నిజమైన బంధం.దేనికీ అర్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా మనసునే అర్థం చేసుకుంటుంది.అయితే ఈ మూడు గుండా ఏర్పడేదే అనుభవం.
అవకాశం + అలవాటు + అవసరం = అనుభవం..ఈ మూడూ కలిపిన తర్వాత జీవితంలో మిగిలేది ఒక్కటి అనుభవం.అనుభవం – బంధాన్ని బలపరిచే నాలుగవ స్థాయి.ఇది ఊహతో వచ్చే పాఠం కాదు.ఒక సన్నివేశం,ఒక బంధం,ఒక వేదన…మనలో తళుకుల్లా మెరుస్తూ శాశ్వత గుర్తుగా మారిపోతుంది.అనుభవం అంటే కాలంతో లిఖితమైన భావోద్వేగం.ఒకరి నుంచి సాయం ఆశించి నిరాశపడ్డపుడు.ఒకరి కోసం ఎదురుచూసి వారు రాకపోయినప్పుడు.ఒకటి కాదు,రెండూ కాదు ఎన్నెన్నో పర్యాయాల్లో మనం మౌనం వెచ్చించినప్పుడు.ఆ మౌనం మన హృదయాన్ని వెతికి, మనిషిని మార్చేస్తుంది.అదిఅనుభవం.అనుభవం గమనించనంత మెల్లగా మనలోకి వస్తుంది.ఒక రోజు మనం ఎదుట కూర్చున్నవారిని చూసి,
వాళ్ల మాటల్లో ఉన్న మౌనం వినగలిగితే.అది మన అనుభవం మనకు నేర్పిన అభిజ్ఞత.అనుభవం బంధాన్ని శోధిస్తుంది – నశింప జేయదు..అవకాశం వచ్చినప్పుడు మనం ఓ బంధాన్ని మొదలు పెడతాం.అలవాటయ్యాక దానికి మనసు ఎగబాకుతుంది.అవసరం ఏర్పడితే దాన్ని కోల్పోవడం భయంగా అనిపిస్తుంది.కానీ అనుభవం వచ్చిందంటే.ఈ మూడింటినీ దాటి ఆ బంధం మన మనసులో పాతుకుపోయిందని అర్థం.అప్పుడు మనం వదిలి పెట్టవచ్చు,కానీ మరిచిపోలేం.ఒక ప్రేమ విఫలమవచ్చు,కానీ దాని అనుభవం మనం ప్రేమించే తీరును మార్చేస్తుంది.ఒక స్నేహం దూరమవచ్చు,కానీ దాని అనుభవం మనలో ఒక జ్ఞాపకంలా నిలిచి పోతుంది.అనుభవం అంటే ఎదిగిన మనసు అనుభవం వచ్చాక మనం ఇక భయం కోసం బతకం.అభిప్రాయం కోసం కాదు.అర్థం కోసం ఎదురు చూస్తాం.ఎవరైనా మనల్ని పిలవకపోతే బాధపడం,మన విలువలను మర్చిపోవద్దని మనల్ని మనమే గుర్తు చేసుకుంటాం.అదే అనుభవం నిజంగా మానవత్వాన్ని నేర్పే దశ.అనుభవం తర్వాత మనం నేర్చుకునేది.ప్రేమ అనేది ఒత్తిడిలో ఉండకూడదు.బంధం పుట్టించేది దృష్టి కాదు.దాని వెనుక ఉన్న శ్రద్ధ.
అవసరం గౌరవంగా ఉంటేనే బంధం స్థిరంగా ఉంటుంది.దూరం వచ్చినా,అనుభవం కాసేపు నవ్వుతూ వెనక కనిపిస్తుంది..ప్రతి మౌనం.ఓ తలపుగా మారు తుంది..ప్రతి తేడా.ఓ సహనంగా మారుతుంది..ప్రతి అణకరం.ఓ అర్థంగా మారుతుంది..అదే అనుభవం మన బలహీనతలను మారుస్తుంది,మన సంశయాలకు జవాబుల్లా నిలుస్తుంది.అవకాశం ఓ తలుపు మాత్రమే.అవసరం ఓ నడక మాత్రమే..అలవాటు ఓ దారి మాత్రమే.కానీ అనుభవం అది మనసు ముడిపడే చివరి గమ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*
3)మాట్లాడకపోయినా అర్థం చేసుకోగలరు,కేవలం పక్కన ఉండి భుజాన్ని మోయగలరు,ప్రేమంటే కేవలం కలిసి నవ్వుకోవడమే కాదు, నిశ్శబ్దాన్ని కూడా తనలో కలిపేసుకుని అండగా ఉండటం.ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి..ప్రేమంటే ప్రతీ నిముషం పలకరించుకోవడమే కాదు,నిశ్శబ్దంలో కూడా నేనున్నా అనే శబ్దాన్ని మనకు ఇవ్వడం
"బ్రతుకు భారంగా అనిపించిన ప్రతి క్షణం... ఈ మాట గుర్తుంచుకో!"
4)బ్రతుకు భారంగా మారిన ప్రతిసారీ ఒక్కసారి నీ గుండెను నువ్వే అడుగు.."నేను ఇంత దూరం వచ్చాను... ఇక ఎందుకు ఆగాలి...?" అని.జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.ఈరోజు కన్నీళ్లు పెట్టించిన కాలమే,రేపు నీ చిరునవ్వుకు కారణం అవుతుంది.ఈరోజు నిన్ను కిందకు లాగిన పరిస్థితులే, రేపు నిన్ను శిఖరానికి చేర్చే మెట్లుగా మారతాయి.మనసు అలసిపోతుంది..శరీరం నీరసిస్తుంది..నమ్మిన మనుషులే దూరమవుతారు... ప్రేమించినవాళ్లే బాధ పెడతారు...నమ్మినవాళ్లే మోసం చేస్తారు...కష్టాలు ఒక్కసారిగా తుఫానులా వచ్చి జీవితాన్ని చుట్టుముడతాయి.అప్పుడు మనసు అడుగుతుంది..."ఇంకా ఎందుకు బ్రతకాలి...?" కానీ విను...చీకటి ఎంత గాఢంగా ఉంటే,ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. తుఫాను ఎంత భీకరంగా ఉంటే,దాని తర్వాత వచ్చే ప్రశాంతత అంత గొప్పగా ఉంటుంది.ఒక్కసారి ఆగు...ఓపిక పట్టి నిలబడిపో..నీ కోసం ఎదురుచూసే మనుషులు ఇంకా ఉన్నారు.నీ నవ్వును చూసి ఆనందపడే హృదయాలు ఉన్నాయి. ఈరోజు నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా, ఒకరోజు నీ కథే వేల మందికి స్ఫూర్తిగా మారుతుంది.
జీవితం అంటే సుఖాలు మాత్రమే కాదు...పడిపోయిన ప్రతిసారి మళ్లీ లేవడం కూడా.ఓడిపోయిన ప్రతిసారి మళ్లీ పోరాడడం కూడా.కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ నవ్వడం కూడా.అదే నిజమైన విజయం..అదే అసలైన జీవితం.ఆఖరిగా ఒక మాట..గుర్తుంచుకో..ఓటమి శాశ్వతం కాదు..బాధ శాశ్వతం కాదు..కష్టం శాశ్వతం కాదు..కానీ ధైర్యంగా నిలబడిన మనిషి విజయం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.గుండె గట్టిగా ఉంటే కాలమే నీకు దారి చూపిస్తుంది. గాయపడిన గుండె ఒకరోజు మరొకరి జీవితానికి ధైర్యం చెప్పే స్థాయికి ఎదుగుతుంది. కన్నీళ్లు కార్చిన కళ్లే ఒకరోజు విజయంతో మెరిసిపోతాయి. అవమానాలను భరించిన మనిషే ఒకరోజు అందరి గౌరవాన్ని పొందుతాడు.ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు..కానీ నువ్వు నిన్ను నమ్ము.పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు..కానీ నీ సంకల్పం నీకు అనుకూలంగా ఉంటే ఏ శక్తీ నిన్ను ఆపలేదు.బ్రతుకు భారంగా అనిపించిన ప్రతిసారీ ఈ ఒక్క మాటను నీ హృదయంలో చెక్కించుకో..."ఈ బాధ కూడా పోతుంది..ఈ చీకటి కూడా తొలగిపోతుంది..ఈ కన్నీళ్లు కూడా ఆగిపోతాయి..నా సమయం కూడా వస్తుంది..నేను కూడా గెలుస్తాను..నేను పడిపోవడానికి పుట్టలేదు..లేచి ప్రపంచానికి నా విలువ చూపించడానికి పుట్టాను!"
గుర్తుంచుకో..ఓడిపోయిన మనిషి కథ అక్కడితో ముగియదు..లొంగిపోయిన మనిషి కథ మాత్రమే ముగుస్తుంది కాబట్టి..లొంగిపోకు..పోరాడు..నిలబడు... గెలువు!
5)
నిలబడటమే నిజమైన గెలుపు
🙏 జై శ్రీరామ్ 🙏
ఇక్కడ నువ్వు ఎంత అరిచినా ఓటమే…
నువ్వు ఎంత మౌనంగా ఉన్నా అవమానమే…
ఎందుకంటే నువ్వు ఒక్కడివి కాదు—
నీ వెనుక ఒక కుటుంబం ఉంది.
నీ ప్రతి నిర్ణయం వాళ్ల జీవితాలను ప్రభావితం చేస్తుంది.
నువ్వు ఆవేశంతో ఎదురు తిరిగితే
నలిగిపోయేది నువ్వే…
నువ్వు పరిస్థితులకు తలవంచితే
కుంగిపోయేది కూడా నువ్వే…
ఈ వ్యవస్థ ఎవరి కోసం ఆగదు.
నువ్వు ఆగిపోతే నీ స్థానంలోకి ఇంకొకరు వస్తారు.
కానీ నువ్వు కూలిపోతే…
నీతో పాటు నీ ఇంటి ధైర్యం కూడా కూలిపోతుంది.
అందుకే ఒక్క మాట విను…
ఎదుటివాడిని మార్చాలని ప్రయత్నించే ముందు
నిన్ను నువ్వు నిలబెట్టుకో.
నువ్వు నిలబడితేనే
నీ చుట్టూ ఉన్నవాళ్లు ధైర్యంగా నిలబడగలరు.
నువ్వు గెలిస్తేనే
నీ ఇంట్లో నిజమైన పండుగ మొదలవుతుంది.
ఆవేశాన్ని వదిలేయ్…
దాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకో.
కోపాన్ని వదిలేయ్…
దాన్ని కసిగా కాదు, కృషిగా మార్చుకో.
నీ ఆయుధం అరుపు కాదు…
నీ ఓర్పు.
నీ బలం ఎదురు తిరగడం కాదు…
ఎన్ని తుఫాన్లు వచ్చినా కూలిపోకుండా నిలబడటం.
గుర్తుపెట్టుకో…
అరిచేవాడు బలవంతుడు కాదు.
అణచుకుని, ఆలోచించి, సరైన సమయం కోసం నిలబడేవాడే అసలైన రాజు.
ఈరోజు నిన్ను ఎవరూ గుర్తించకపోవచ్చు.
నీ బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు.
నీ మౌనాన్ని బలహీనతగా భావించవచ్చు.
కానీ నువ్వు మాత్రం పడిపోకు…
ఎందుకంటే
ఈరోజు నీ ఓర్పు రేపటి నీ విజయానికి పునాది.
నువ్వు నిలబడితే చాలు…
రేపు నీ కుటుంబం గర్వంగా నీ వైపు చూస్తుంది.
నీ ప్రయాణమే ఒక కథ అవుతుంది.
నీ పేరు ఒక గుర్తింపవుతుంది.
చివరి మాట రాయితో రాసిపెట్టుకో—
పరిస్థితులు మనిషిని ఓడించవు…
మనిషి తనలోని ధైర్యాన్ని వదిలేసినప్పుడే ఓడిపోతాడు.
నిలబడు… ఓర్పుగా నిలబడు…
రేపటి చరిత్ర నీ పేరుతో మొదలవుతుంది.
ఇట్లు…
మీ… ✍🏻 రఘురాం