Monday, October 7, 2024

మంచి మాటలు - 2024

1)చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే..గెలుపు గొప్పతనం తెలియాలంటే..ఓటముల దెబ్బలు తగలాల్సిందే...సుఖం అనే అనుభవం తెలియాలంటే..కష్టాల కుదుపును భరించాల్సిందే...నీలో దమ్ము ఎంతో నిజమైన నీవాళ్ళు ఎవరో తెలియాలంటే..సమస్యలు చుట్టు ముట్టాల్సిందే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

2)మనతో ఉన్న ప్రతి వ్యక్తి.. చివరి వరకు మనతో ఉండకపోవచ్చు, మన వెనుక దైర్యాన్ని, ఆశయాన్ని నింపేవాళ్ళు కొందరే ఉంటారు.. అందులో స్థానం, స్థాయిని చూసి మన వెనుక నిలబడరు, మన ప్రతిభను చూసి మనల్ని గెలిపించాలని మన వెనుకే ఉంటారు..మనం దానిని గమనిస్తూ గమ్యానికి అడుగులు వేస్తూ ముందుకు ee వెళ్లడమే విజయానికి మార్గం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

3)జరిగిపోయిన తప్పుల కన్నా, వాటి తాలూకు జ్ఞాపకాలే మనల్ని చాలా నిరాశకు గురిచేస్తాయి. ఎవరెవరు,ఏమేమనుకుంటున్నా huరో?అనే ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తాయి కానీ ప్రపంచానికి మన పొరపాట్లను పట్టించుకునే తీరిక ఉండదు.ఒకవేళ ఆక్షణాలకు అది చర్చనీయాంశమైనా, మరుక్షణం లోకం మనల్నీ, మన తప్పులనూ మరచి పోతుంది. వారి నిందలతో మనం నిరాశకు గురి కావలసిన అవసరం లేదు.'అవును! తప్పు జరిగిపోయింది; దాన్ని దిద్దుకునే అవకాశం కూడా నాకే ఉంది' అని మనకు మనమే ధైర్యం నూరిపోసు కోవాలి.నిందించే లోకం నీకు తోడుగా ఉండదు; నీకు నీవే తోడూనీడ! తప్పుకు తలదించుకోవలసిన పని లేదు.అలా అని తలబిరుసుగా,అహంకారంగా తప్పిదాన్ని సమర్థించు కోవడమూ సరి కాదు. కానీ తప్పు విశ్లేషించుకొని, సమీక్షించుకొని సవరించుకోవాలి. అందుకే మనం తప్పిదాల అనుభవం నుంచి అది నేర్పిన విజ్ఞతను మాత్రమే స్వీకరించాలి.పొరపాట్లు జరుగుతా యేమో,నిందలు పడాల్సి వస్తుందే మోనన్న అపోహలతో అసలు ప్రయత్నమే మానుకుంటే మనం ఎందుకూ కొరగాకుండా పోతాం!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

4)జీవితంలో కోరుకున్నది లభించదు నీకు అర్హత ఉంటేనే అది నీకు దక్కుతుంది.కోరికలను మన అర్హతలుగా మార్చుకోవాలి. సాధారణమైన వ్యక్తికి కీర్తిప్రతిష్ఠలు కావాలనిపిస్తుంది. కీర్తిప్రతిష్ఠలు వచ్చాక గోప్యంగా ఉంటే బావుండేదేమోననీ అనిపిస్తుంది. పేదోడు డబ్బుంటే చాలుననుకుంటాడు.ఎంతో డబ్బున్నవారు సంతోషం కరువైందని బాధపడతారు.సామాన్యంగా జీవిస్తే చాలదా అనుకుంటారు. ఒంటరిగా ఉండేవారు తోడు కోసం అలమటిస్తారు. తోడు లభించాక తమకంటూ కొంత చోటు, స్వేచ్ఛ ఉంటే బావుంటుందనిపిస్తుంది.జీవితం ఎప్పటికి పరిపూర్ణమనిపించదు ఎప్పుడైతే అసూయ దురాశలను పక్కకు నెట్టి మన లక్ష్యాల కోసం కష్టంతో ఇష్టంతో అంది పుచ్చుకుని పక్కవారిని కూడా ఆ స్థాయికి తీసుకొని వచ్చిన రోజు మన జీవితానికి ఒక సార్ధకం..లోకానికి ఒక మార్గదర్శకం అవుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

5)జీవితంలో ప్రతి పరిష్కారం ఒక సరికొత్త సమస్యకు తెరతీస్తుంది.వెలుగుందంటే కారణం చీకటి.జీవితంలో ఎదురయ్యే వాటిని స్వీకరించడమే పరిష్కారం.ప్రతిరోజు ఎదగడమెలా అని ఆలోచిస్తూ సాగిపోవాలి.జీవించడమంటే ధైర్యంగా జీవించడం.దాపరికం లేనప్పుడు తప్పించుకోవలసిన అవసరం లేనప్పుడు మనకి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది.అదే పారదర్శకమైన జీవనం.చిన్న చిన్న సమస్యలే చిక్కుల్లోకి నెట్టేస్తున్నట్లు,తలకిందులు అయిపోతున్నట్లు భావిస్తే, గొప్పగొప్ప అవకాశాలు ఎదురొచ్చినా అందుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి.ఎదురయ్యే ఏ సంఘటనైనా మనకి ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది దానిని అనుభవంలోకి తీసుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలి అప్పుడే మనం అనుకున్నవి సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

6)జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఎప్పుడూ పాత విషయాలను కొత్తగా చూడగలగాలి.ఇష్టమైన వాటినే చేయాలనుకోకుండా, చేసేవాటిని ఇష్టంతో చేయగలగాలి అప్పుడు ఏ పని చేసినా కష్టం అనిపించదు అలా కాదని కొంతమంది ఆసక్తి లేకుండా వాళ్ళు చేసే పనిని ఎప్పుడూ తిట్టుకుంటూ చేస్తూ పోతారు అలాంటివారు జీవితంలో ఎదుగు బొదుగూ లేకుండా వారు ఉన్నచోటే ఉండిపోతారు..జీవితంలో ఎప్పుడు సవాళ్ళను ఎదుర్కొనేలా మనం అన్నిటికీ సన్నాహమై ఉండాలి ఎందుకంటే ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు..ఎందుకంటే జీవితంలో ఒక రంగులరాట్నామైతే దాంట్లో మన బ్రతుకు ఒక జగన్నాటకం..దానిని అర్ధం చేసుకుని బ్రతకగలిగితే ఎప్పుడూ సంతోషంగా ఉన్నన్ని రోజులు బ్రతకగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

7)మనకు జీవితంలో అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే, రాత్రంత కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో లేక స్మశానానికో. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్నవాళ్లు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ! వాటిని సంపాదించటం అంత సులభమైన పని కాదు. దానికి ఓర్పు సహనంతో పాటు ప్రేమ ఉండాలి.

8)జీవితంలో నీ చుట్టూ నిన్ను చూసి ఈర్ష్య పడే వారున్నారంటే సంతోషపడు..ఎందుకంటే వారికన్నా నీవు ఉన్నతంగా ఉన్నావని అర్థం.పదే పదే నీ మీదకు రాళ్లు రువ్వుతున్నారంటే బలపడు...ఎందుకంటే వారి కన్నా నీవు "నిండాకాసిన"చెట్టువని అర్థం..నీకు సమస్యలు ఎదరయినప్పుడల్లా బెదరక తలపడు....జీవితం నీకు ఏదో నేర్పించబోతున్నదని అర్ధం...నీవు మార్చుకోగలిగితే ప్రతి ప్రతికూలమూ ఒక ప్రేరణే, తగిలిన ప్రతిరాయీ పునాదిరాయే..ప్రతి అవమానమూ ఒక గుణపాఠమే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

9)ఎవరికి ఎవరో అవకాశం ఇవ్వలేదని,మనల్ని మనమే తక్కువ చేసుకోనక్కర్లేదు ముందుమనకి ఎందుకు ఇవ్వలేదా అని ఆత్మవిమర్శ చేసుకుని మనల్ని మనమే తీర్చిదిద్దు కోవాలి.నీ పరిధిలో విజయసాధన అవకాశం నీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడింది.నీ ప్రవర్తనలో నీ ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తుంది.ఎల్లపుడూ గుర్తుంచుకోవాల్సింది, బాధ్యతలు నెరవేర్చే వారికే హక్కులు సాధించే అర్హత ఉంది. మనం ఒకరిని ఏ దృష్టి తో చూడగలమో వారు అదే దృష్టి మన పై చూపగలరు.సాధారణంగా మనం తక్కువ చేసి,చూసి ఏక్కువ ఆశించినపుడే ఆత్మాభిమానాల మీమాంస వస్తుంది కాబట్టి ముందు మనకి మనం గౌరవం ఇచ్చుకుంటేనే,బయట నుంచి ఎదురు చూడకుండా లభిస్తుంది అందుకని నీ పరిధి లో నీవు ఉత్తమంగా ఉండు.దానికి అడ్డు పడితే నీ విశ్వరూపం చూపించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

10)గుంపులో ఒక్కడిలా కాదు,గుంపుకే ఒక్కడిలా ఉండాలి అదే నీ లక్ష్యమైవుండాలి కాబట్టి నీ లక్ష్యం ఖరీదు ఎప్పుడూ తలదించుకునేలా ఉండకూడదు,తలెత్తుకు జీవించేలా ఉండాలి... నీ కష్టాలు నిన్ను కుంగదీసేలా నువ్వు ఉండ కూడదు...నువ్వే వాటిని లొంగదీసేలా ఉండాలి....ఇట్లు మీ..✍🏻 *రఘురాం*

11)లక్ష్యం అంటూ ఉన్నప్పుడే వడివడిగా గమ్యం వైపు అడుగులు వేయగలం ..ఈ కొత్త సంవ్సరంలో మీకంటూ ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోండి దాన్ని సాధించుకోవడానికి చక్కని ప్రణాళిక రూపొందించుకొని కచ్చితంగా అమలు చేయండి.అవుతుందో కాదో అన్న అనుమానం వద్దు.సాధించగలమా లేదా అన్న సందేహం వలదు.మీ ఆలోచన అమలైతే అదో వ్యూహం అవుతుంది.దానికి ఓ గడువంటు పెట్టుకుంటే అదో లక్ష్యమవుతుంది అవరోదాలకు నిలిచి గెలిస్తే అది విజయమవుతుంది.మిమ్మల్ని శక్తివంతులని చేసే ఆలోచనలతో కొత్త సంవ్సరంలోకి ప్రవేశించండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

12)చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వారు,అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు.జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే,మనం డబ్బుగా మారాలి..డబ్బు మాత్రమే అందరికి నచ్చుతుంది.. బంధానికీ, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు..! ఇప్పుడంతా డబ్బు.. డబ్బు..డబ్బు..ధనం మూలం ఇదం జగత్.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

13)నేడు బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి." మనీ "కి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వడం లేదు. పచ్చ నోటు తయారుచేసిన మనిషే ఆ పచ్చ నోటు వెంబట పరిగెడుతూ బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ప్రేమ, మమకారము అన్ని మర్చిపోయి పశువుగా మారుతున్నారు. డబ్బు సంపాదించు కాదనను, డబ్బు సంపాదించాలి కూడా కానీ, డబ్బే సర్వస్వం అని పరిగెట్టకు.డబ్బు అనేది నీ దైనందిక జీవితంలో ఒక అవసరం మాత్రమే."నేను "అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకు వెళుతుందో."నేనే" అనే అహంకారం అంత క్రిందకు తోసేసి అనర్థాలకు దారి తీస్తుంది. అందుకే అన్ని సందర్భాలలో ఒకే విధంగా ఉండాలి. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు అయినవారే...ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే... మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు..అలాగే మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది అదే ఒకరికి చెడు చేసుంటే అది కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ దగ్గర డబ్బులు ఎంతైనా ఉండనివ్వుగాక కర్మ నుంచి తప్పించుకోలేవు...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

14)జీవితంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది...!బ్రతుకు భారంగా అనిపిస్తుంది...!!ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది...అప్పుడు మనం వెతకవలిసింది సహాయం చేసే చేతుల కోసం కాదు...!!మనలో ఉన్న శక్తి కోసం...!! ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం...ఎప్పుడైతే ఆ ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడు జీవితాన్ని కోల్పోయినట్లే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

15)అనవసరమైన విషయాల కోసం తపన పడకు ఇబ్బంది పడకు.జీవితంలో కొన్ని అంశాలు చాలా విలువైనవి అవి నిన్ను వాటి కోసం పోరాడేలా చేస్తాయి..గెలిచేలా చేస్తాయి...
కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు.. ఎందరో ఎన్నో విమర్శలు
చేయొచ్చు ఎదురు దెబ్బలు తగలొచ్చు అవన్నీ ఒక రోజు
నీ విజయాన్ని చూసి వెనుతిరిగి వెళ్తాయి..నువు అనుకుంటే
ఏమైనా సాధించగలవ్ ఎందుకంటే,నీ ఆశయమే నీ ఆలోచన కావాలి..నీ ఆలోచనే నీ ప్రవర్తనై ఉండాలి..నీ ప్రవర్తనే నీ జీవితానికి మార్గదర్శనం కావాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

16)ఏదో ఆశించి చేసేది సహాయమని అనిపించుకోదు అని నా ఉద్దేశ్యం.అందుకే నిస్వార్థ సహాయం నా నినాదం.ఎదుటి వారిని గౌరవించు,ఎదుటి వ్యక్తి ఎలాంటి పని చేసుకొనే వారు అయినా కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ గౌరవించినప్పుడే నీకంటూ ఒక గౌరవం ఉంటుంది.మూలాలను ఎప్పుడూ మరువకు ,ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత సాధించినా సంపాదించినా నీవొచ్చినదారిని, నిన్ను ఇంత సాధించేలా నీలో స్ఫూర్తిని నింపి నీకు సాయపడి వారెవ్వరినీ మరువకు.ఎందుకంటే నిన్ను ఆదర్శంగా తీసుకునే వారు నువ్వేదుటి వారితో ఎలా ఉంటున్నావో గమనిస్తూ ఉంటారు.నీ విషయంలో కూడా అలా జరగడానికి అవకాశం లేకపోలేదు.జీవితమనే ప్రయాణంలో కష్టాలు మలుపులే కానీ అడ్డంకులు కావు,మహా సముద్రం మధ్యలో ఉన్నా ఏదో ఒక వైపు తీరముంటుందని గుర్తుంచుకో..నీ ఆత్మవిశ్వాసామే నిన్ను గమ్యానికి చేరుస్తుంది కాకపోతే కొంత సమయం పడుతుంది అప్పటిదాకా ఓర్పుతో ఉండు అన్నిటికీ కాలమే సమాధానం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

17)ప్రార్ధన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం..నిందలు వేస్తున్నప్పుడు ఉండదు..పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం..పాపం చేస్తున్నప్పుడు ఉండదు..దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం...దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు..ప్రేమలో దేవుడున్నాడని నమ్మకం...మనుషుల్ని ద్వేషించడంలో ఉండదు..ఇన్ని అసమానతలు ఉన్నా తనని తాను పర్పెక్ట్ అనుకోవడం ఇంకా మూర్ఖత్వం !నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మరచి పోయినా,దైవం మరచిపోదు..నువ్వు చేసే పాపాలను దైవం మరచి పోయినా, కర్మ మరచిపోదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


18)మనిషిగా బ్రతకటానికి...కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు.మనసు ప్రశాంతంగా ఉండటానికి కావాల్సింది..అనుభూతులు కానీ ఆలోచనలు కాదు.అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ.. ఐశ్వర్యం కాదు.ఇది ఎప్పుడైతే తెల్సుకుంటావో అప్పుడు నీ జీవితంలో సంతోషాలకి కొదవనేది ఉండదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం* 

19) జీవితంలో ఇద్దరిని మరిచిపోకూడదు..మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని..మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని..అలాగే ఆకలి తీరాక అన్నాన్ని..అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు..ఎందుకంటే ఆకలి మళ్లీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది.. గుర్తుపెట్టుకో.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

20)ఈ కలికాలంలో నువ్వు నీవాళ్ళకోసం ఎంత చేసినా చిటికెలో మరచిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?కేవలం ఒక్క మాట నీ నోటి నుంచి బయటపడనంత సమయమే పొరపాటున కోపంలో మాట జారేవా అప్పుడు నువ్వు ఏమి చేసావు ఎంత చేసావు అన్నది లెక్కలోకి రాదు,ఎంత మాట అన్నవ్ అన్నదే లెక్కలోకి వస్తుంది,మనోడు కదా అని ఎవ్వడు అనుకోవటం 
లేదు ఇక్కడ,మాట తేడా వచ్చిందంటే
నువ్వు ఎవరు అని అడుగుతారు జాగ్రత్త..మాట ఎంత పొదుపుగా వాడితే మేలు.. అవసరం ఉన్నంతవరకే మనిషి అవసరం తీరిక వాడుకుని వదిలేసే మనుషులే ఎక్కువ తస్మాత్ జాగ్రత్త.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

21)నిన్ను నిన్నుగా నిలబెట్టేది నీ ఆలోచనలు మాత్రమే..
నిన్ను నీవు ఎంతగా మలచుకుంటే అంతగా సంతోషం పొందడమేకాదు..నీ చుట్టూ కూడా పంచుతావు...
ఒక్కోసారి పాత్రలో నీటిలా పరిస్థితిని బట్టి పరిసరాలను బట్టి ఒదిగిపోవాల్సి ఉంటుంది.ఒక్కోసారి ఎగిసి పడే కెరటంలా ఎన్నిసార్లు పడినా లేచినిలబడాల్సి ఉంటుంది.ఒక్కోసారి ప్రవహించే నదిలా అడ్డంకులను దాటుకుంటూ ఉరకలు వేయాల్సి ఉంటుంది.ఒక్కోసారి జలపాతంలా దూకాల్సి ఉంటుంది...గుర్తుంచుకో ఇవన్నీ నీవే చేయాలి.నీవు నిన్ను మాత్రమే నమ్ముకో..పక్కోడి మీద ఆధారపడితే ఎప్పుడూ ఒకరివెనుకే నీవుంటావు..నిన్ను నీవు మలుచుకునే కొద్దీ నిన్ను తలచుకునేవారు పెరుగుతారు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో ఏదైనా సాధించగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

22)మనిషి జీవితంలో ప్రతికూల విషయాలు ఎలా అయితే ఎదురవుతాయో.. అదే విధంగా ప్రతికూల ఆలోచనలు కూడా వస్తుంటాయి.ఇలాంటివి ఎదురైనప్పుడు నిరాశ,నిస్పృహ, జీవితం మీద ఆశాభావం తగ్గుతాయి. కానీ అపజయాల నుండి, ప్రతికూల ఆలోచనల నుండి కూడా జీవితంలో ఎంతో నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితులలో అయినా పట్టుదలగా ఉండే విధంగా తయారవుతారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

23) 'పరిస్థితులు బాలేవ్.. అందుకే ఓటమి పాలయ్యాను' అని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి విజయం అనేది బయటి పరిస్థితుల కంటే మన మెదడు మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, లక్ష్యాలను నిర్ణయించుకోవడం,లక్ష్యాలను చేరుకోవడానికి సరిగ్గా ప్రణాళిక వేసుకోవడం వంటివన్నీ మెదడు సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటాయి కానీ చాలామంది బయట విషయాలను బాగా అర్థం చేసుకుని, తమ మెదడును మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. అందుకే ఎంత కష్టపడినా విజయం లభించదు కాబట్టి మనం ఏలా ఆలోచిస్తామో అలాగే జరుగుతుంది అందుకే యద్భావం తద్భవతి అన్నారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

24)ఇతరుల మీద గెలవడం వేరు..ఇతరుల మదిలో
నిలవడం వేరు..మొదటిది తంత్రం...రెండవది తత్వం...తంత్రంకన్నా తత్వం గొప్పది..దారంట వెల్లడం వేరు దారి వేసుకుంటూ వెల్లడంవేరు...మొదటిది అనుసరణత్వం..రెండవది మార్గదర్శకత్వం...
అనుసరణలో నీవొక "బాటసారివి"..మార్గదర్శకత్వంలో
నీవే ఎందరికో గమ్యం చేర్చే ఒక "రహదారివి"  
నీవెలా ఉండాలో నిర్ణయించుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

25)తాళి కట్టినవాడు ప్రేమించాలని లేదు ప్రేమించినవాడు తాళి కట్టాలనీలేదు..తాళికట్టినవాడు ప్రేమించకపోయినా తాళికి గౌరవం ఇస్తూ జీవనం సాగిస్తుంది ఆడది...ఎంత సర్దుకుపోతున్నా ఆ భర్తకు మాత్రం అర్ధం కాదు....అలాగే భర్త బంధాలకి భాద్యతలకి ఎంత విలువ ఇచ్చి అణిగిమణిగి ఉన్న మగాళ్లు ఎంతమందో..ఇలా కుటుంబవ్యవస్థలు మారిపోతున్నా ఆ దేవుడికి ఇదేమి సరదానో ఒకరినొకరు అర్థం చేసుకోలేని ఆ ఇద్దరిని కలిపి వేడుక చేస్తుంటాడు. చాలామంది జీవితాలలో ఇదే జరుగుతుంది కానీ ఎప్పుడు మారతాయో పరిసత్థులు అని ఎదురు చూస్తూ ఉంటారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

26)మనతో ఏ సంబంధం లేకపోయినా మన కష్టాన్ని వాళ్ల కష్టంగా భావించే వాళ్లు ఎవరో ఒకరు ఉంటారు..అలాంటి వాళ్లు ఎదురైనప్పుడు ఎంత కష్టమొచ్చినా వాళ్లని వదులు కోకూడదు.నిన్ను ఇష్టపడేవాళ్ళను వాడుకోవద్దు..నీ అవసరం ఉన్నవాళ్లను తప్పించుకొని తిరగవద్దు.నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మరిచిపోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

27)విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది...శుభరాత్రి.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

28)నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతీ ఒక్కరిది..ఒక్కొ పాత్ర ఉంటుంది.కొందరు నిన్ను పరీక్షచేస్తారు.కొందరు నిన్ను వాడుకుంటారు.కొందరు నిన్ను ప్రేమిస్తారు.కొందరు నీకు నేర్పిస్తారు.ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారొ,వారే నీ జీవితానికి అతిముఖ్యులు.విలువైన వారు.మరచిపోలేని వారవుతారు అలాంటి వారు నీకు నీ యొక్క ఎదుగుదలలో పాత్ర వహించినవారిని సదా ఎప్పుడూ కోల్పోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
29)కష్టంగా ఉండే రహదారులు..డ్రైవింగ్లో మెలకువలు నేర్పిస్తాయి.భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి అలాగే క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడూ అధైర్య పడకూడదు ఎందుకంటే అవి ఎప్పుడూ బలమైన వారినే వరిస్థాయి కొద్దిగా సహనంతో ఓర్పుతో వుంటే వాటిని అదిగమించడం సులభం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

30)మనం మంచి పని చేసినా,చెడ్డ పని చేసినా, మన పేరు అందరికి గుర్తుండిపోతుంది బ్రతికినన్ని రోజులు.మనం ఎంత డబ్బు సంపాదించాము అనేది ముఖ్యం కాదు!..మనం చనిపోయాక మన కోసం నలుగురు కన్నీరు కార్చేవాళ్ళని,మన దేహాన్ని నలుగురు మోసే వాళ్లని సంపాదించుకున్నామా లేదా అనేదే ముఖ్యం..నీకోసం నీ కష్టాల్లో నలుగురు లేనప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తే ఏంటి..కాబట్టి ఇకనైనా మనుషుల్ని సంపాదించుకోవడం మొదలెట్టు లేకపోతే ఒక్కరిగా ఎవ్వరికీ పనికి రాకుండా పోవాల్సివస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

31)ఎవడిమాటో పట్టుకోని ఊరేగితే ఉన్నది ఊడిపోద్ది..లేని దరిద్రాలు తగిలించుకున్నట్టు అవుతుంది.నువ్వు చూడని,నువ్వు వినని నీకు తెలియని గుసగుసలను నమ్ముకుంటూపోతే మనస్సుకు దుఃఖం,ఒంటికి కష్టం మొత్తంగా బ్రతుక్కి భారం.నువ్వు విన్నదే వేదం అనుకోవడం నీ అమాయకత్వం.అందుకే ఆ అమాయకత్వం విషంగా మారకముందే తేరుకోవాలి లేకపోతే తెల్లారిపోతుంది. నీ చుట్టూ ఉన్న ఆ కొద్దిమంది మంచి మనుషులను కూడా కోల్పోవల్సి వస్తుంది ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదు..అబద్ధంలోనే కాలం మొత్తం గడిచిపోతుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా భ్రమలో బ్రతకకుండా జాగ్రత్తపడు ఇది నీ జీవితం నువ్వే సరిచేసుకొని ముందుకు సాగాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

32)ఆరడుగుల నేలతో అంతమయ్యే జీవితంలో మనకంటూ, మనదంటూ మిగిలేది మనం చేసిన త్యాగమూ,పరోపకారమే ఎంత సంపాదించావ్ అన్నది లెక్కలోకి రాదు ఎంత ఇచ్చావన్నదే లెక్క !! దానగుణం చిన్న నాటి నుంచే అలవాటు చేసుకుంటే ఎదిగాక ఆ అలవాటే మన అభిరుచిగా మారుతుంది. నలుగురు మనస్సులో నీ పేరు నిలిచిపోతుంది అది ప్రవాహంగా నీ పరంపరే ముందు తరాలను నడిపిస్తుంది అందుకే వెంటనడిచే వారిలో ఒక్కడిలా కాకుండా నలుగురిని తన వెంట నడిపించుకుని ఉన్నతుడిగా ఎదగాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

33)మన జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని సంతోషాలున్నా ఒక్క నేస్తానికే మనస్సు విప్పి చెప్పుకో గలం..ఎందుకంటే ధైర్యం చెప్పడానికి గాని లేకా సహాయం చెయ్యడానికి కానీ వెనకాడరు...మన బాధను బాధ్యతగా స్వీకరిస్తారు..అలాగే ఓదారుస్తూ ధైర్యం నూరిపోస్తూ కడదాకా మనతో ఉండిపోతారు.సంతోషంలోనైనా బాధలోనైనా..మనం విజయంలో ఉన్నా ఓటమిలో ఉన్నా..మనకి అవసరమున్నా ప్రతిసారీ మన భుజం కాస్తారు అలాగే తోడుగా వెంటుండి నీడలా అనునిత్యం మన కోసం తపిస్తూ మనమే వారి ప్రపంచంగా భావించే వారు కేవలం స్నేహితులు మాత్రమే...అలాంటి వారు దొరికినప్పుడు వదులుకోకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


34)మనం బ్రతికి ఉన్నన్ని రోజులూ వీదెప్పుడు కళ్ళు మూస్తాడా అని ఎవరూ ఎదురు చూడకుండా ఉండేలా బ్రతకాలి.మనం కనులు మూశాక,"అయ్యో..! ఓ మంచి వాడు, మనకికలేడే అని కనీసం పది మంది అయినా కన్నీరు కార్చేలా బ్రతకాలి.అప్పుడే కదా మన బ్రతుక్కి ఒక అర్ధం పరమార్ధం అలాగే నువ్వు గొప్పవాడివి కలవడం కోసం పదిమందిని తొక్కుకుంటూపోతే రేపు ఉదయం నీకు కనీసం నా అన్నవారు లేకుండా ఒక్కడిగా పోతారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


35)గెలుపు అనేది బయట దొరికే వస్తువు కాదు.అది కష్టపడి పని చేసే వారి దగ్గరే దాగి వుంటుంది.కష్టపడనిదే ఏదీరాదు.కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు.అందుకనే విజయఫలం కోసం అనుక్షణం శ్రమించు,ఆ మధుర ఫలాన్ని అందుకొని ఆనందంగా ఆరగించు..సోమరితనం వీడి కష్టపడి పనిచేసిన వాడి వెంటే విజయం ఉంటుంది..కష్టే ఫలి:...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

36)రాళ్లతో కొట్టినా, గొడ్డలితో నరికినా చెట్టు పండే ఇస్తుంది కాని- పగ తీర్చుకోదు. గునపాలతో తవ్వినా నేల ఖనిజాన్నే ఇస్తుంది. ప్రకృతి నుంచి ఈ పరోపకార బుద్ధి నేర్చుకోవాలి మనిషి. ఎవరైనా మనల్ని విమర్శించినా, మనమీద పగ పెంచుకున్నా అందుకు కారణం ఏమిటో ఆత్మపరిశీలనతో తెలుసుకోవాలి. సాటివాడిలో మంచిని చూడటం అలవరచుకోవాలి. ‘అందరిలోనూ మంచిని చూడటం నీ బలహీనత అయితే, నీ అంత బలవంతుడు ఉండడు’ అంటారు మదర్‌ థెరెసా. ‘కీడు చేసినవాణ్ని క్షమించడంవల్ల వాడు మారకపోయినా, భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది’ అంటాడు చాణక్యుడు. అహంకారం మనసులోకి చేరిందంటే, తనకు తోడుండమని మొట్టమొదట ప్రతీకార ప్రవృత్తినే ఆహ్వానిస్తుంది. ముల్లు గుచ్చుకుందని గులాబీ పువ్వును తెంచి నలిపేయడమెంత అవివేకమో, ఏదోకారణంగా భ్రమలో పడి, వదంతులను నమ్మి, సాటి మనిషికి హాని తలపెట్టడమూ అంతే అవివేకం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

37)భాద నుండి ఓర్పుని ,ప్రమాదం నుండి ధైర్యాన్ని ,పొరపాట్లు నుండి గుణపాటాలను నేర్చుకున్నవాడే జీవితంలో ఎదగగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

38)టీవీకి రిమోట్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఛానల్ మార్చాలంటే రిమోట్ ఉపయోగిస్తాం. అంటే,మనం మార్చిన ఛానల్ మనకు కావాల్సిన ప్రోగ్రాం ఇస్తుంది. అలాగే మనిషి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఒక విషయం, మరొక ఆలోచనకు మారినప్పుడు మరొక విషయం మెదులుతాయి. వ్యతిరేక, ప్రతికూల భావనలను ఛానల్ మార్చినట్టుగా మార్చి అనుకూల భావనల ఛానల్ ప్రసారాలు చూడాలంటే మనసు అనే రిమోట్ మనం ఉపయోగించాలి.మనకు అక్కర లేని కలిగించే అంశాలు,విషయాల మీద,బాధ కలిగించే వాటి పైన ఆలోచనలను కేంద్రీకరించడం మాని,కావాల్సిన వాటిపై దృష్టి పెడితేనే మన జీవితం మారుతుంది.అలాగే ఎక్కువ కాలం వ్యతిరేఖ ఆలోచనాలు చేస్తుంటే మనసు మరింత ఆందోళన గురవుతుంది అందుకే మంచి ఆలోచనలు భావన చేస్తే అవి ఎక్కువ శక్తి ఇచ్చి మనల్ని గమ్యానికి చేరేలా చేస్తాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

39)మనకు బాధ కలిగినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.మనలో ప్రతికూల భావనలను దూరం చేసుకోవాలి లేకుంటే,మరింత వేదన తప్పదు.పదేపదే ప్రతికూల భావనల గురించి ఆలోచించడమంటే- నేను మరింత బాధపడే పరిస్థితి తీసుకురా అని మన మనసుకు స్వయంగా చెప్పడమే! నచ్చని ఛానల్ మార్చినట్లే,దుఃఖ భావనల ఛానల్ మార్చుకోవాలి.మనసు అనే రిమోట్ అలా శిక్షణ ఇస్తూ క్రమశిక్షణాయుత జీవనం, నిర్మలమైన భావనలతో ముందుకు సాగితే నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

40)మన ఆలోచనల మంచి చెడులకు పూర్తి బాధ్యులం మనమేనని నిత్యం భావించాలి.'నా ఆలోచనలపై నాదే అధికారం' అని మనం తరచూ అనుకోవాలి. అసలు ముందుగా మనం ఏం చేయాలో, ఏం కావాలో నిశ్చయించుకోవాలి. దాని ప్రకారమే పనిచేయాలి. అప్పుడు ఆలోచనలే మన జీవితంగా రూపుదాలుస్తాయి.మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, మన దృష్టిని దేనిపై ఎక్కువగా కేంద్రీకరిస్తామో... అదే మన జీవితం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

41)మనం ఎంతగా ఆలోచిస్తే మన మెదడు అంతగా పనిచేస్తుంది. మన ఆలోచనల ప్రతిరూపమే మనం. మనలోని బలమైన ఆలోచనలకు మన జీవితమే అద్దం. మనకు విచక్షణా జ్ఞానం ఉంది కాబట్టి మంచి ఆలోచనలను ఎంచుకునే స్వేచ్ఛఉంది.కొన్నిసార్లు సాకారం కాకపోతే ఆశించినవి జరగకపోతే అదీ మన మంచికే అనుకోవాలి.మన ఆలోచనలను పునఃపరిశీలన చేసుకొని లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. జీవితాన్ని సృష్టించుకోగల శక్తి ఈ'క్షణానికి' మాత్రమే ఉంది. యద్భావం తద్భవతి. మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను మనం మంచివేవో చెడువేవో విభజించి మంచినే తీసుకుని ముందుకువెళ్తే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

42)జీవితంలో చాలా సార్లు చాలా మంది నిన్ను కిందకి లాగాలని చూస్తుంటారు..నిద్రాహారాలు మానేసి పగబట్టి నిన్ను ఓడించాలని కంకణం కట్టుకుని ఉంటారు కానీ నువ్వు ఏ మాత్రం జంకకూండా సాలీడు పురుగుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపో..ఎన్ని సార్లు ఎంత మంది కిందకి లాగినా అది ఓటమిని అంగీకరించకుండా మళ్లి గూడును కట్టుకుంటుంది.నువ్వు కూడా అలా ఉంటేనే ఈ లోకంలో గెలవగలవు..నా వల్ల కాదు కూడదు అంటావా అదిగో చీమలాగా కాలి కింద నలిగిపోతావు కాబట్టి నీ లక్ష్యం చేరేదాకా విశ్రమించక శ్రమించు విజయాన్ని వరించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

43)మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు.మనల్ని ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు..అవసరానికి వాడుకుంటారు..అవసరం తీరాక మనల్నే ఆడుకుంటారు నేటి సమాజంలో చాలావరకు అలాంటివారే..ఎప్పుడెప్పుడు ముంచేద్దామా అని వేచి చూస్తూ ఉంటారు..కానీ కర్మ ఫలం వారిని వారి కుటుంబాల్ని వదలదు..కాబట్టి అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

44)కంటికి కనిపించకుండా మన జీవితమనే మహా నాటకాన్ని ఆడించేది మనసు ఒక్కటే.మనసంత మృదువైనది, కఠినమైనది,పవిత్రమైనది, పాపభూయిష్టమైనది,సౌఖ్యకారకమైనది, శోకకారకమైనది మరొకటి లోకంలో లేదు. పుణ్యకార్యాలూ చేయిస్తుంది.పాపకూపంలోకి నెట్టేస్తుంది.మనసు మూలంగానే మనిషి తప్పుచేస్తాడు, ఒప్పు చేస్తాడు. తనవల్ల తప్పు
జరిగినప్పుడు మనిషి అనేవాడు పశ్చాత్తాపపడాలి. సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి.తోటిమనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో అవగాహన
చేసుకోవాలి.అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరుకోవాలి అలా క్షమించే హృదయం ఉంటే ప్రతీ మనిషి అర్ధం అవుతారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


45)మన సమాజంలోఎంతటి గొప్పవాడైనా, మేధావైనా కొన్నిసార్లు అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి.జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి.అంతేగాని,చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు.క్షమాపణ కోరితే పోయేదేముంది...అహంకారం తప్ప!..చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వాడు ధైర్యవంతుడు..ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు..ఎదుటు వారి తప్పును
మరచిపోగలిగిన వాడు జ్ఞాని....తన తప్పును మరచిన వాడు అజ్ఞాని... కాబట్టి చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరినట్లైతే క్షమించేవాడి కంటేక్షమాపణ కోరేవాడే గొప్పవాడు అనిపించుకుంటాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

46)మానవ సంబంధాల్లో సమస్యలకు మూల కారణం .మనుష్యుల్లో ఉండే అహం కూడా అనేది ఎన్నోసార్లు మనం గమనించే ఉంటాం..ఓ ఇద్దరు వ్యక్తులు పరిచయమైనప్పుడో...కొత్తగా ఒక బంధంలో అడుగిడినప్పుడో నీ అంతటి వాళ్ళు లేరు అనో నా అంతటి వాళ్ళు లేరు అనో మనం ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటాం కానీ కొన్నాళ్ళు పోయాక కాస్త దగ్గరగా వాళ్ళని గమనించాక ఆ మరీ అంత గొప్పవాళ్ళేం కాదు పర్లేదులే అనే నిర్ణయానికి వస్తాం ఇంకా కొన్ని సమస్యలు వచ్చి..ఇంకొన్నాళ్ళు పోయాక..అసలు అలా ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళకి బుద్దుందా లేదా...అనుకుంటాం..ఇంకా సమస్యలు ముదిరితే..గొడవలకి దారితీస్తుంది..అప్పుడు ఆ వ్యక్తులకి దూరంగా జరగడం తప్ప తప్ప మరో మార్గం ఉండదు..అయితే ఈ దూరంగా పోవడం అనేది కూడా..నేనెందుకు తగ్గాలి..నేనే ఎందుకు తగ్గాలి అనుకునేదాకా వచ్చింది అంటే అది ఏ సమస్యలకు దారితీస్తుంది అనేది చెప్పడం కష్టం..కాబట్టి అహాన్ని ఎంత వీడితే అంత ఎదగగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

47)అసత్యంతో సాధించే విజయం కంటే సత్యంతో సాధించే పరాజయమే మేలు..ప్రారంభం సరిగా ఉంటే చాలు..విజయం దానంతట అదే వస్తుంది..చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే..క్షమించడం వలన గతం మారకపోవచ్చు..కానీ భవిష్యత్ మారుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

48)ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనపై వచ్చే విమర్శలు విజయానికి నిచ్చెనలు అవుతాయి. అందుకే విమర్శించేవారిని జీవితంలో అస్సలు దూరం చేసుకోవద్దు. ఒక్క విమర్శ మిమ్మల్ని వంద మెట్లు పైకి ఎక్కించే అవకాశం ఉంది. ఒక్క పొగడ్త మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేసేందుకు దారి చూపుతుంది. అందుకే పొగడ్తలు కాదు.. నిన్ను విమర్శించేవారే నీకు నిజమైన స్నేహితులుగా ఫీలవ్వాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

49)జీవితంలో చప్పట్లు కొట్టే 99 మంది కంటే విమర్శించే ఒక్కడు చాలు. నిజానికి అలాంటివారు ఉంటే మనం శత్రవుల్లా చూస్తాం. కానీ వారే మీకు నిజమైన మిత్రులు. మీ తప్పులను చెప్పేవారి మీద మీరు అస్సలు కోపం తెచ్చుకోకూడదు. వారి విమర్శలను స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడే మీ ఎదుగుదల ఉంటుంది. లేదంటే మిమ్మల్ని పల్లకి ఎక్కించేవారు.. ఏదో ఒక రోజు మిమ్మల్ని కింద పడేస్తారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

50)ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడొద్దు.. మనం ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కాదు. అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి కానీ మనల్ని విమర్శించేవారు మనతో ఉంటే.. మన తప్పులను మనం తెలుసుకుంటాం.ముందుకు వెళ్లేందుకు ఈజీగా ఉంటుంది. తప్పులను విననివారు తప్పుడు దారిలోనే వెళ్తారు. నిజమైన స్నేహితుడు మిమ్మల్ని విమర్శిస్తాడు.మీతో అవసరం కోసం స్నేహం చేసేవారు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు.విమర్శించే వారందరినీ దూరం చేసుకోవద్దు.. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయెుద్దు. కావాలనే విమర్శించే వారు కొందరైతే.. మీకు మంచి జరగాలని విమర్శించేవారు కొందరు ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు కొందరుంటే.ప్రతీకారం కోసం పొగిడే వారు కూడా మన చుట్టూ ఉంటారు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

51)మనకి మంచి జరుగుతుంది అనుకున్నా.. మనం చేసే పనివల్ల ఎదుటివారికి మంచి జరుగుతుంది అనుకున్నా.. రైట్ మూమెంట్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మనం చేసేది మంచి పని అయితే ఎప్పుడైనా చేసేయొచ్చు. మనం చేసే పని వల్ల ఇతరులకు హాని కలగనంతవరకు మనం ఏ పనినైనా.. ఎప్పుడైనా చేయవచ్చు. దానికోసం మంచి మూహుర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని మంచిదైతే.. ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

52)ఒక కష్టం ఉంటే దాటాలనిపిస్తుంది .
ఓ బాధ్యత ఉంటే నడవాలనిపిస్తుంది.
ఒక ఆశయం ఉంటే గెలవాలనిపిస్తుంది.
కొందరి పలకరింపులు తోడు ఉంటే
" బ్రతకాలనిపిస్తుంది ".....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

53)అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది కానీ ఆవేశం,కోపంతో విచక్షణ కోల్పోయి అంతరాత్మ చెప్పే సలహాను పట్టించుకోము అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే.ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము అందువల్ల అంతరాత్మ మనకు చెప్పేది నిజమేనని గ్రహించగలగటం వివేకం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

54)మనం ఏదైనా మంచి చేసినప్పుడు లేదా ఏదైనా సాధించినప్పుడు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. కచ్చితంగా ఇతరులు వచ్చి మన వెన్ను తట్టి మన గురించి మెచ్చుకునే మాటలు మాట్లాడాలని కోరుకుంటాం. మరొకరు మనల్ని మెచ్చుకోకపోతే, ఆ సమయంలో మనం బాధపడటం సహజం మనం చేసిన పనిని ఇతరులు మెచ్చుకునే వరకు వేచి ఉండకండి ఎందుకంటే ఈ కలికాలంలో మనం ఎంత మంచి చేసినా తొక్కాలనే చూస్తారుగానీ మెచ్చుకోవాలని చూడరు కాబట్టి బాగా చేసిన పని కోసం మీ వెన్ను మీరే తట్టుకుంటూ ముందుకు సాగినప్పుడే మనం దేనినైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*.

55)జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. బాధ, సంతోషం ఒకేసారి వస్తే సంతోషమే చూపెట్టాలి.. ఎందుకంటే బాధను వినే తిరిక ఎవరికీ లేదు. మనసు లోతుల్లో ఎంతటి బాధ ఉన్నా మీపై మీరు శ్రద్ధ చూపాలి. ఎవరికీ ఇక్కడ ఎదుటివారి బాధలకు సమాధానం చెప్పే తిరిక లేదు.కష్టాల్లో నుంచి బయటకు రావాలంటే ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించాలి.జీవితంలో చెడు జరిగితే దానిని జీర్ణించుకునే శక్తి కొందరికి ఉండదు. ఒక్కసారిగా కుంచించుకుపోతారు.ఏదైనా చెడు జరిగితే, దాని గురించి చింతిస్తూ కూర్చుంటారు. బదులుగా ప్రతిదాని గురించి సానుకూలంగా ఆలోచిస్తే కచ్చితంగా మీ జీవితంలో ప్రతిదీ బాగుంటుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

56)ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాటలు వినాలి..ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి..ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్లకి కోపం తెప్పించాలి..ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి..ఒకరు నిజమైన మనిషో కాదో తెలియాలంటే.. ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి..ఆకలి ఉన్నవాడికి గుప్పెడు అన్నం.. ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం.. బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు. జీవితంలో దీనికి మించిన తృప్తి లేదు.వచ్చేప్పుడు ఏం తీసుకురాలేదు.. పోయేప్పుడూ ఏం పట్టుకెళ్లలేం. ఉన్న నాలుగు రోజులు నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వును ఎదుటివారిలో చూసే గొప్ప గుణం ఉండాలి. సాయానికి మంచిన దానం ఏదీ లేదు. మీరు ఎన్ని పనులు చేసినా సాయాన్ని మించి రాదు. సాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆస్తులు అమ్ముకుని ఇతరులకు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నదాంట్లో కొద్దిగా వారికి అండగా నిలిస్తే సరిపోతుంది. బతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటారు.ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన సాయంతో ప్రపంచం ఏమీ మారిపోదు.. కానీ సాయం పొందిన వారి ప్రపంచం మాత్రం తప్పకుండా మారుతుంది. ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

57)విజయావకాశాలు ఎన్ని ఉన్నాయో చూసే కన్నా, మీరు ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. చీకటిని తిట్టడం కంటే ఒక కొవ్వొత్తి వెలిగించడం మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయం లెక్కలోకి వస్తుంది. సానుకూలమైన మార్పు ఏదైనా సరే ప్రయత్నించడంలో తప్పులేదు. అంతెందుకు తొలిసారి మనం నేలపై పాదం మోపినప్పుడు వేసేవన్నీ తప్పటడుగులే. ఆ తప్పుడు అడుగులే తర్వాత చక్కటి నడకగా మారాయి. తొలిసారి మనం రాసేవి కూడా పిచ్చి రాతలే. ఆ పిచ్చి రాతలే ఇప్పుడు అక్షరాలుగా, పదాలుగా, అందమైన వాక్యాలుగా మారాయి. తొలిసారి అన్ని విఫలం అవుతూనే ఉంటాయి. అలా అని ప్రయత్నించడం మానేయకూడదు. ప్రయత్నించడం మానేస్తే అదే మీ జీవితంలో పెద్ద తప్పుగా మిగిలిపోతుంది ఏందుకంటే విజయం కన్నా దాని కోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

58)ఉన్న స్థానం నుంచి పైకి ఎదగాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మీరు కిందకి చూస్తున్నంత కాలం మీ చూపు, తల కిందకే ఉంటాయి. ఎదగాలంటే మీ చూపు ఆకాశాన్ని చూడాలి, నక్షత్రాలను చూడాలి. నేల మీదున్న ఇసుక రేణువులను చూసుకుంటున్నంత కాలం మీరు,మీ చూపు కిందనే ఉంటాయి.మీరు ఎదగాలంటే...ముందుగా కల కనాలి.ఆ కలను నెరవేర్చుకోవడం కోసం తపన పడాలి. కలామ్ ఎప్పుడో చెప్పారు...పెద్ద కలలు కంటేనే, పెద్దగా ఎదుగుతారని.'కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి’ అని అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలను ఫాలో అవ్వాలి.మీ కల ఎంత పెద్దగా ఉంటే...మీరు సాధించే విజయం కూడా అంతే పెద్దగా ఉంటుంది.కల కనడానికి భయపడే వారు జీవితంలో ముందుకు వెళ్లడం కష్టం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

59)జీవితంలో మీరు కనే కలే మీ విజయానికి మొదటి మెట్టు.ఆ మెట్టు ఎక్కేటప్పుడే మీరు భయపడ్డారంటే అక్కడే ఆగిపోతారు.కలే మిమ్మల్ని అంతగా భయపెడితే...దాన్ని నిజం చేసే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలు మిమల్ని అగాధానికి తోసేస్తాయి. ఎప్పుడైనా మొదటి అడుగు ఆత్మవిశ్వాసంతోనే వేయాలి.వైఫల్యం ఎదురైనా తట్టుకునే గుండె నిబ్బరాన్ని తెచ్చుకోవాలి.వైఫల్యమే విజయానికి మొదటి సోపానం అనే విషయాన్ని మర్చిపోకూడదు.మీరు త్వరగా విజయం సాధించాలంటే దగ్గర దారి ఒకటుంది.అది అందరూ వెళ్లే దారిని వదిలి... మీ దారిని మీరు ఎంచుకోవాలి.ఆ దారిలో మీరు ఒంటరి కావచ్చు కానీ విజయం మీకు ఎదురైవస్తుంది. ఒంటరి దారిలో ఎదురయ్యే అడ్డంకులకు భయపడితే విజయాన్ని చేరుకోవడం కష్టం.మీ దారి ఎంత కష్టంగా ఉంటే విజయం అంత పెద్దగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

60)కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని
యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం..
అందుకే మీ ప్రేమలో మీరు దాచిపెట్టుకునే విలువైన
ఆస్తి జ్ఞాపకాలే.చిన్న చిన్న జ్ఞాపకాలే పెద్ద
ఆనందాన్నిస్తాయి.వాటిని పొగేసుకునే విధానం మనకు తెలిసి ఉండాలి.మీరు ప్రేమించిన వారు తిట్టినప్పుడు ఓర్చుకోవాలి..ఎందుకంటే మీ ప్రేమ వారే కాబట్టి..!మీరు ప్రేమించిన వారు అలిగితే బతిమిలాడాలి..ఎందుకంటే వారే మీ ప్రాణం కాబట్టి..!మీతో గడిపేందుకు మీ ప్రియమైన వారు ప్రయత్నిస్తే అస్సలు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొకరు
మీమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ తెలుస్తుంది. ప్రాణం
పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గానీ..
మనం ప్రేమించినవారు నిర్లక్ష్యం చేస్తుంటే నిజంగానే
ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అందుకే దారం
తెగేదాకా లాగొద్దు. తర్వాత అతికించడం కష్టం
అవుతుంది. బంధం కూడా అంతే... కాబట్టి బంధాల్ని పదిలంగా కాపాడుకోవాలి అలాంటి బంధం దొరికినప్పుడు వదులుకోకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

61)సమస్యకి నువ్వెప్పుడు తల వంచకు..ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు బాధపడకు..కాలం కలిసి రాలేదని నిందింస్తూ కూర్చోకు..నష్టపోయా మోసపోయా అంటూ దిగులు పడకు..అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోకు..నిన్నటి వరకు నీతో నడిచిన వాళ్ళు ఈ రోజు లేరని ఆలోచించకు..ఇదొక అనుభవం అనుకో,జీవితంలో ఎదగడానికి బాగున్నప్పుడు మావాడే అని చప్పట్లు కొట్టేవారికంటే నీ కష్టంలో  నేనున్నా అంటూ ధైర్యం చెప్పేవారే నీవారు అనుకో..శిల ఉలి దెబ్బలు తింటేనే శిల్పంగా రూపు దిద్దుకునేది..కొలిమిలో కాలితేనే బంగారంకి మెరుగు వచ్చేది..మట్టిలో పోరాడితేనే విత్తు మొలకెత్తేది..చెట్టు ఆకు రాలిందని దిగులు చెందితే కొత్త చిగురు తొడుగుద్దా?ఇదో రంగుల ప్రపంచ అని మర్చిపోకు ఇక్కడ నటించగలరు కానీ జీవించలేరు కాబట్టి విమర్శలను లెక్క చేయకు నువ్వో ప్రభంజనంగా మారే సమయాన ఇవన్నీ మాములే మిత్రమా 
ఈనాడు నీతో లేని వారు కూడా నువ్వు ఎదిగిననాడు మావాడే అంటూ నీ చుట్టూ చేరతారు చూడు ఆ రోజు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*.

62)జీవితంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి
నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు..నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు..నీ కన్నీళ్ళకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

63)మంచి జ్ఞాపకం మనసులో పదిలంగా దాచుకోవాలి..చెడు జ్ఞాపకాన్ని మెదడులో నుంచి పారదోలాలి..లేకపోతే పదే పదే జ్ఞాపకానికి వచ్చి.. గుండెను కడలిని చేసి తుపాను రేగుతుంది..జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు..పోతుంటారు. మనసుకు నచ్చినవారే మనతో ఉంటారు.వారితోనే ఏదైనా షేర్ చేసుకుంటాం.అలాంటివారితోనే మీ జ్ఞాపకాలు టన్నులు టన్నులు ఉండాలి.అప్పుడే ప్రతిక్షణం ఆనందంగా బతికేస్తారు.ప్రతీఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనేక పరిచయాలు, కలయిలకలు జరుగుతూనే ఉంటాయి కానీ మనస్సుకు కొన్ని కలయికలే చేరవవుతాయి. అందులో మన గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలే మనకు అవసరం.మిగతా చెత్త అంతా అనవసరం.జీవితమంటే.. కేవలం జ్ఞాపకాలే.మనల్ని ఒకరు గుర్తుపెట్టుకోవాలన్నా..మనకు ఒకరు గుర్తుండాలన్నా జ్ఞాపకాలే ఆధారం.చివరగా 'మన జ్ఞాపకాలే.. మన జీవితం'..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

64)జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి, మీరు పైకి రావాలి అని కోరుకునేవారి కంటే, మీరు కిందపడితే చూడాలి అని కోరుకునేవారే ఎక్కువ ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా,మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో.ఇది వినటానికి కాస్త కష్టంగా అనిపించినా,చేదు నిజం ఇదే. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతో మంది తారస పడతారు, వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించే వారూ ఉండవచ్చు,మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకునే వారు ఉండవచ్చు.అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు,మారతారు, పరిస్థితులు మారతాయి. మీరు ఎంతో మంచి వారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మకద్రోహం చేయవచ్చు, మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు.సమయం వచ్చినపుడు నిజస్వరూపాలు బయటపడతాయి.మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు, మీపైనే బురద జల్లుతారు, మీరు చేసిన మంచి అంతా మరిచి మీకు చెడు జరగాలని కోరతారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మీరు జీవితంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తారు.అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి! ఎవరు ఎన్ని చేసినా, మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరెంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు,అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చునేమో, మీకు జీవితంలో దక్కాల్సిన స్థానం కచ్చితంగా దక్కితీరుతుంది.మీ బ్యాడ్ టైమ్ కొనసాగుతున్నప్పుడు మీరు దేనికీ అర్హులు కాదని మీరు భావిస్తారు, మీ కంటే ఇతరులు గొప్పవారని భావిస్తారు, కానీ కాదు.. మీదైన సమయం వస్తుంది, అప్పుడు మీ విలువేంటో అందరికీ తెలుస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

65)జీవితంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి

నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు..నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు..నీ కన్నీళ్ళకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

66)సమస్యకి నువ్వెప్పుడు తలవంచకు..ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు బాధపడకు..కాలం కలిసి రాలేదని నిందింస్తూ కూర్చోకు..నష్టపోయా మోసపోయా అంటూ దిగులు పడకు..అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోకు..నిన్నటి వరకు నీతో నడిచిన వాళ్ళు ఈ రోజు లేరని ఆలోచించకు..ఇదొక అనుభవం అనుకో,జీవితంలో ఎదగడానికి బాగున్నప్పుడు మావాడే అని చప్పట్లు కొట్టేవారికంటే నీ కష్టంలో నేనున్నా అంటూ ధైర్యం చెప్పేవారే నీవారు అనుకో..శిల ఉలి దెబ్బలు తింటేనే శిల్పంగా రూపు దిద్దుకునేది..కొలిమిలో కాలితేనే బంగారంకి మెరుగు వచ్చేది..మట్టిలో పోరాడితేనే విత్తు మొలకెత్తేది..చెట్టు ఆకు రాలిందని దిగులు చెందితే కొత్త చిగురు తొడుగుద్దా?ఇదో రంగుల ప్రపంచ అని మర్చిపోకు ఇక్కడ నటించగలరు కానీ జీవించలేరు కాబట్టి విమర్శలను లెక్క చేయకు నువ్వో ప్రభంజనంగా మారే సమయాన ఇవన్నీ మాములే మిత్రమా ఈనాడు నీతో లేని వారు కూడా నువ్వు ఎదిగిననాడు మావాడే అంటూ నీ చుట్టూ చేరతారు చూడు ఆ రోజు మాత్రం తప్పకుండాగుర్తుపెట్టుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*.

67)నీరు వున్నంతవరకే బావికి విలువ,డబ్బు వున్నంతవరకే మనిషికి విలువ,నీరు లేని బావిలో చెత్త వేస్తారు..డబ్బు లేని మనిషిని చెత్త లా చూస్తారు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

68)మనకు కావలసిన దానికోసం మనం పోరాటం చేయలేకపోతే మనం కోల్పోయిన దాని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు.సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో మంచి సలహాలు యిచ్చే మిత్రుడు వుండడం మన జీవితానికి అంతే అవసరం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

69)దైవానికి కాదు కర్మ కు భయపడు...దైవం క్షమించినా
కర్మ అనుభవించాల్సిందే కర్మకు పాప,పుణ్యాలు
తెలియదు.తెలిసింది ఒక్కటే నువ్వు ఏది ఇస్తే తిరిగి నీకు పది రెట్లు ఇవ్వడం మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు పక్క వాడికి ఏమీ చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచే చెయ్యి లేకపోతే కర్మ ఫలాన్ని అనుభవిస్తావు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

70)జీవితంలో నీ కష్టసుఖాలలో తోడుగా నీడగా ఉంటూ మన శ్రేయస్సు కోరేవాడే నిజమైన మిత్రుడు..నిజంగా ఈ కలికాలంలో అలాంటి స్నేహం పొందడం దుర్లభం..తన సుఖాన్ని సైతం త్యజించి కేవలం మిత్రుడు  బాగుండాలని కోరుకునేవాడు ఉత్తమ స్నేహితుడు.తన అవసరాలు తీరేంతవరకూ స్నేహంగా ఉండి అర్ధాంతంగా కనుమరుగై పోయేవాడు మధ్యముడు.ఐశ్వర్యం,అధికారం రాగానే స్నేహితునికే హాని తలపెట్టేవాడు అధముడు..మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో ప్రేమాప్యాయతలనూ, సానుభూతి సహకారాలనూ,సుఖదుఃఖాలనూ పంచుకోవడానికి వేరొకరి సాన్నిత్యం,సాంగత్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడం మన చేతుల్లానే ఉంది..ఎందుకంటే ఆ స్నేహమే మనకు పెన్నిధి అలాగే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా శ్రేయోభిలాషైన వ్యక్తిని స్నేహితునిగా సంపాదించ గలిగితే అదే నిజమైన శాశ్వత సంపద...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

71)మనం ఈ లోకంలోకి వచ్చేప్పుడు ఏం తీసుకురాలేదు..పోయేప్పుడూ ఏం పట్టుకెళ్లలేం.ఉన్న నాలుగు రోజులు నవ్వుతూ ఉండాలి.ఆ నవ్వును ఎదుటి వారిలో చూసే గొప్ప గుణం ఉండాలి.సాయానికి మంచిన దానం ఏదీ లేదు.మీరు ఎన్ని పనులు చేసినా సాయాన్ని మించిరాదు.సాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆస్తులు అమ్ముకుని ఇతరులకు సాయం చేయాల్సిన అవసరం లేదు.ఉన్నదాంట్లో కొద్దిగా వారికి అండగా నిలిస్తే సరిపోతుంది.బతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటారు.ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి.మనం చేసిన సాయంతో ప్రపంచం ఏమీ మారిపోదు..కానీ సాయం పొందిన వారి ప్రపంచం మాత్రం తప్పకుండా మారుతుంది.ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది.. ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

72)ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట..ఒకరి జీవితం ఇంకొకరికి చులకన.. ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ.. ఒకరి బాధ ఇంకొకరికి బరువు .. ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం.. ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం..ఒకరి బలహీనత ఇంకొకరికి బలం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

73)ఒకరు నచ్చితే చేసేదిప్రేమ..ఒకరిని నమ్మితే చేసేది స్నేహం..సూర్యుడు పడమర ఉదయిస్తాడనేది ఎంత అబద్దమో..చంద్రుడు పగటిపూట వస్తాడు అనేది ఎంత అబద్దమో..ఒక్క మాట స్నేహాన్ని విడకొడుతుంది అనేది అంతే అబద్ధం అలా విడిపోయింది అంటే అది నిజమైన స్నేహాం కాదు..నీకు నచ్చినట్లు నువ్వు వుంటే నీతో ఎవ్వరూ ఉండరంటారు కానీ నిజమైన స్నేహితుడు ఎప్పటికీ నీతోనే ఉంటాడు..మనకు అమ్మ నాన్నల్ని బంధువుల్ని పిల్లల్ని నిర్ణయించేది ఆ భగవంతుడు కానీ నీకు తోడుగా ఇష్టంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఒక్క స్నేహితుల్ని మాత్రమే..చివరిగా స్నేహమంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం..అలాగే వాడుకోవడం కాదు..వదులుకోక పోవడం..స్నేహం విలువ తెలిసినవారు ఎప్పుడూ దూరం చేసుకోరు..తెలియని వారు ఎప్పటికి అర్ధంచేసుకోరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

74)మనమాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి, ఆ మాటలే మనకు శత్రువుల్నీ కూడా తయారు చేస్తాయి.కటువైన మాటలు ఇతరుల హృదయాలను గాయపరచ గలవు, అలాగే కమ్మనైన తియ్యటి మాటలు మనసులోని గాయాలను నయం చేయనూగలవు.అందుకే అన్నారు ఎవరినీ ' నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ' అని  ఏందుకంటే అలాంటి వారికి శత్రువులే ఉండరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

75)మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేది ఏమిటంటే మాట్లాడే మాటతీరు.దానికి మెరుగులు దిద్దడం అంటే మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి ఎదుటివారి మనసును ఆకర్షించే విధంగా మాట్లాడటం.అలా ఆలోచించకుండా, అర్థం లేకుండా మాట్లాడడం అంటే "గురి చూడకుండా బాణం వదలడం లాంటిది".ఏదైనా ఒక మాట మాట్లాడితే, ఆ మాట మాట్లాడిన తరవాత తిరిగి ఆలోచించాల్సిన అవసరం రానే రాకూడదు. కాబట్టి ఏది మాట్లాడినా ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.నిజానికి మాట్లాడడం ఒక కళ.ఏది,ఎప్పుడు, ఎక్కడ, ఎలా, మాట్లాడాలి అనేది కూడా ఒక అద్భుతమైన విద్య. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంట పడతాయి.నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచు కుంటూ ఉంటే అలాంటి వాడికి ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

75)మన దగ్గర ఎంత సంపద ఉన్నా...అవి మనుషులతో సమానం కాదు.మన దగ్గర ఎన్ని కార్లు ఉన్నా,ఎంత పెద్ద విలాసవంతమైన ఇల్లు ఉన్నా...మన చుట్టూ మనల్ని ప్రేమగా చూసేవారు లేకపోతే అంతా శూన్యమే.జీవితంలో ముఖ్యమైనవి అనుబంధాలే. బంధాలను తెంచుకొని సంపదను పెంచుకోవడం వల్ల వచ్చే ఆనందం ఏమీ ఉండదు.నలుగురితో కలిసి నడిస్తేనే సంతోషంగా ఉంటుంది.ఒంటరిగా వెళితే అంత శూన్యమే. మన జీవితంలో అనుకోకుండా కలిసిన అనుబంధాలను కూడా నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి.సంపద పెరిగిందనో, హోదా పెరిగిందనో మన వాళ్ళ దగ్గర అహంకారాన్ని చూపించకూడదు దాని వల్లే ఎంతటి సంబంధమైనా చెడిపోతుంది. కనుక మనలో ఉన్న అహాన్ని దూరం పెడితే బంధాలు దగ్గరవుతాయి.ఎదుటి వ్యక్తి పేదవాడైనా, ఏమీ లేనివాడైనా అతనికి మనం గౌరవాన్ని ఇవ్వాలి అప్పుడే మన గౌరవాన్ని మనం కాపాడుకోగలం.ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు.ఇతరులను మాటలతో బాధపెట్ట కూడదు.గౌరవం ఇచ్చిపుచ్చు కుంటేనే ఏ బంధమైనా బలపడుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

76)జీవితంలో ఎదగడానికి దగ్గరి దారి లేదు. ఏ కష్టమూ అనుభవించకుండా ఒకేసారి పైకి వెళ్లడం అసాధ్యం. అందుకే -” నీకు చేదు గురించి తెలియకపోతే తీపిని ఆస్వాదించలేవు.” అని చెపుతుంది ఒక పాత సామెత. నిన్ను కష్టాల్లోకి తోసిన ప్రతి సందర్భమూ నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా భావించాలి. చాలెంజ్‌లను ఎదుర్కోకుండా పరిణతిని సాధించలేం. ఎంత పెద్ద కష్టాన్ని నువ్వు అధిగమించగలిగితే అంత పటిష్టంగా తయారవుతావు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

77)జీవితంలో సంతోషానికి పొంగకు...దుఃఖానికి కుంగకు..కష్టానికి వంగకు...కన్నీళ్లకు కరుగకు..భయానికి బెదరకు..స్నేహితుల్ని మరువకు...అందరినీ నమ్మకు...ఎవరికీ లొంగకు...విజయం నీదే చివరకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


78)అవకాశం గుర్తించాలంటే అవసరాన్ని ఏర్పరచుకోవాలి లేదా అవసరం ఏర్పడాలి.అప్పుడే అవకాశాన్ని అందిపుచ్చుకుని విజయాన్ని అధిరోహించగలుగుతాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


79)నాకు తెలిసి నా జీవితంలో నటన మత్రమే కనిపించింది..ఎవరి అవసరాలు వారివి ఎవరి స్వార్ధాలు వారివి..అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అంతే కానీ ఆ మనిషికి విలువ ఇవ్వరు నటించే మనుషుల మధ్య ఆట బొమ్మలా ఉండిపోవడం కన్నా ఒంటరిగా ఉండిపోవడం మంచిది అనిపిస్తుంది నాకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


80) కష్టకాలంలో నీ వెన్నంటి నిలిచే వ్యక్తులు, నైతికంగా మద్దతు తెలిపే మనుషులు నీ చుట్టూ ఉన్నంతకాలం సమస్యలనేవి నీ దరిచేరవు కానీ అలాంటి మనుషులు నీకు ఎదురైనప్పుడు వారిని ఎటువంటి పరిస్తతులలో వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


81)మన జీవితంలో బాధలనేవి శాశ్వతంగా ఉండిపోవు.. అలాగని సంతోషాలు కూడా శాశ్వతం కావు. ఈ క్షణాలే కరిగిపోతాయి. మళ్లీ తిరిగి రావు. మనం పీల్చుకునే ఊపిరి కూడా ఏదో రోజు ఆగిపోవాల్సిందే. అప్పటి వరకు ఇతరులతో మనం ఎంత సంతోషంగా ఉన్నామో అది ముఖ్యం. చనిపోయాక మనల్ని పట్టించుకునేవారు ఉండరు. బతికి ఉన్నప్పుడు చిరునవ్వులతో మన నవ్వును అందరికీ అందించి వెళ్లాలి..అప్పుడే ఈ జీవితానికి ఒక సార్ధకత...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


82)ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.. కానీ మనం జీవించి ఉన్నంత వరకూ జ్ఞాపకాలే శాశ్వతం. వాటిని అందంగా, ఆనందంగా పొగేసుకోవాలి. జీవితమనే ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు.. అన్నీ కలిస్తేనే జీవితం. అయినా ఏదీ శాశ్వతంగా ఉండదు.ఈరోజు జరిగింది.. రేపు జరగదు.. రేపటిది ఎల్లుండి జరగదు. రోజులే మారుతుంటే క్షణకాలం వచ్చిపోయే కోపాన్ని చచ్చేదాకా ఒకరి మీద చూపించకూడదు.అందుకే జీవితంలో ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా చూడాలి. ఎందుకంటే పాజిటివ్‌గా ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. నెగెటివ్‌గా ఆలోచిస్తే.. చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఉన్నన్ని రోజు ఆనందంగా ఉండాలి. నలుగురితో నవ్వులు పంచుతూ ఉండాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత. లేదంటే పోయాక కూడా తిట్టుకుంటూ ఉంటారు.చావు తర్వాత కూడా బతికి ఉండాలంటే..మనం ఇచ్చే జ్ఞాపకాలు మాత్రమే ఎదుటివారి జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*



83)గెలిచిన ప్రతివాడు తన గతం గురించి మాట్లాడతాడు...."కానీ"

ఓడిపోయిన ప్రతివాడు తన భవిష్యత్ గురించి ఆలోచిస్తాడు.....గెలుపు నీయొక్క గతానికి నిదర్శనం.ఓటమి నీ భవిష్యత్ కి మార్గ నిర్దేశం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*



84)కష్టించి పని చెయ్యడమొక్కటే మన చేతిలో ఉంది ఫలితాన్ని అందుకుంటామో తట్టుకుంటామో వదులుకుంటామో పట్టుకుంటామో అనేది మన కష్టం ఓపిక సహనంతో పాటు తలరాత నిర్ణయిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


85)మనం కలవటానికి, విడిపోవటానికి చూపించే తొందర ఆలోచించటానికి అర్థం చేసుకోవటానికి చూపిస్తే ప్రతి బంధం కూడా బలంగా అనందంగా పదికాలాల పాటు ..ఇట్లు..మీ..✍🏻 *రఘు*


86) నా మనస్సులో మాట - గుండెలో బాధ ఏదో గొంతు దాటి బయటికి రావాడం లేదు.గుండెలమీద తన్నిన బంధాలతో ఏం చెప్పాలో తెలియట్లేదు.గుంటనక్కలు 

అందరూ మనిషి రూపంలో బంధాల రూపంలో చుట్టూ తిరుగుతున్నాయి అనిపిస్తోంది.ఏ రోజు ఎవరు ఎలా మారిపోతారో అస్సలు ఊహించలేం.ఏ బంధాన్ని నమ్మడానికి వీలు లేదని అంటోంది.అవసరాలు తీరిపోయాక బంధాలు మారిపోతున్నాయి.మన అనుకున్న వాళ్లు అందరూ మృగాలుగా ఎలా మారి

పోతారో తెలియ దంటోంది.బంధం విలువ పూర్తిగా కోల్పోతున్నాయి అనిపిస్తోంది.మానవత్వం లేకుండా మనుషులు తయారవుతున్నారు..కపట నవ్వులని గుర్తు పట్టలేకుండా ఉంటున్నాం అంటోంది.నోటితో నవ్వుతూ మనసులతో వ్యక్తీకరించే వారిని గుర్తుపట్టలేను అంటోంది.జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేను అంటోంది.నమ్ముకున్న వాళ్ళు మోసం చేస్తే ఎంతో బాధ కలుగుతుంది అంటోంది.ఏ బంధము నాకు స్వచ్ఛంగా, నిర్మలంగా కనిపించట్లేదు అంటోంది.మొండిగా, బండగా జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలంటోంది.గుండెకి తగిలిన ప్రతి దెబ్బ నుంచి రాటుతేలాలంటోంది.పాఠాలూ, గుణపాఠాలూ నేర్చుకుంటూ ముందుకు సాగాలి అంటోంది.ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి ప్రయత్నిస్తాను అంటోంది.నాకు నేను తోడుగా, నా జీవన గమనాన్ని సాగిస్తూ,విజయాన్ని చేరుకుంటనంటోంది.జీవితంలో ఏమైపోయినా,ఎవరు వెళ్లిపోయినా,ఎవరు ఎలా ప్రవర్తించినా మన జీవితాన్ని మనమే సంతోషంగా జీవించాలి ఎందుకంటే మన పయనం మనమే కడదాకా సాగించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*


87)ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కష్టమైన సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో ఏం చేసిన పని అవ్వదు. అన్ని వైపుల నుంచి సమస్యలు ముసురుతాయి. ఏ పని చేసిన కలిసి రాదు. ఏ మాట అన్న తప్పుగానే తీసుకుంటారు.ఇక నా జీవితం ఇంతేనా???ఇక నేను మళ్ళీ గెలవలేనా? నాకు అదృష్టమే లేదా? ఎప్పటికి దరిద్రం నన్ను వదులుతుంది? ఇలా సవాలక్ష ప్రశ్నలు మదిలో మెదులుతాయి.వాటన్నిటికీ దేవుడు ఒక మిత్రున్ని నీ కోసమే పంపుతాడు..నీకు ధైర్యం చెప్తూ నీ ఎదుగుదలకి మనస్సారా నువ్వు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఒక స్నేహితుడు మాత్రమే..కొన్ని సార్లు నీ కష్టాలు తీరిపోయాయని వారిని దూరం పెడితే నష్టపోయేది నువ్వే..కాబట్టి ఎప్పూడూ అహంకారంతో మనం విర్రవీగకూడదు ఏ నిమిషంలో ఎవరి అవసరం వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని మనం మర్చిపోకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

88)మనిషి ఇతరులకు చేసిన సహాయం పుణ్య రూపంలో,సత్కర్మ రూపంలో మనిషి వెనకాలే తోడు ఉంటుంది.రాబోయే జన్మకు పునాది అవుతుంది......మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గతంలో మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్న వారిని ఎన్నటికీ మర్చిపోరాదు..స్వర్గ నరకాలు అనేవి ఎక్కడో లేవు. మనం జీవించినంత కాలం సంతృప్తిగా ఉంటే స్వర్గం,అసంతృప్తిగా ఉంటే అదే నరకం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

89)ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు అన్నం...ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం...బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు....అందించడమే నిజమైన మానవత్వం...అప్పుడే పక్కవాడు నీలోని దైవత్వాన్ని చూడగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

90)మనం మాట్లాడే మాటలు ఇతరుల జీవితాలపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి.మీ నోటి నుండి వచ్చే ఒక్కో మాటను ఆలోచించి మాట్లాడండి.అలాగే ఎదుటివారు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మకండి.మీ మీద మీరు నమ్మకంతో ముందుకు సాగండి. మిమ్మల్ని వెనక్కి లాగే వారి మాటలను పట్టించుకుంటే పప్పులో కాలేసినట్లే కాబట్టి ముందడుగు వేయాలనుకున్నవారు సానుకూలంగానే ఉండాలి.వెనక్కి లాగే వారి మాటలను వినిపించుకోకూడదు అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

91)నీ ఆశయం ఎంత గొప్పది కాకపోతే ఇన్ని కష్టాలను పడుతున్నావ్ ఎది ఏమైనా సరే తట్టుకొని నిలబడు.. అంతే కానీ వెనక్కి మాత్రం తగ్గకు నువ్వు చెరలనుకున్నా స్థానం వరకు..నువ్వు చేసే కష్టంలో నిజాయితీ ఉంటె ఎలాగైనా పంచభూతాలుతో పాటు దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిన్ను విజయతీరాలకు చేరుస్తాడు కావాల్సింది శ్రమతో పాటు కాస్త ఓపిక.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

92)జీవితంలో ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. కొంతమంది ఆ దిశగా కొన్ని రోజులు పని చేస్తారు.మహా అయితే కొన్ని నెలలు కష్టపడతారు. ఆశించిన ఫలితాలు కనిపించకుంటే తమ వల్ల కాదని ఎంతోమంది మధ్యలోనే వదిలేస్తారు.కొత్త ఏడాది రాగానే అది చేసేద్దాం..ఇది నేర్చుకుందాం అనుకుంటారు. కానీ ఓ వారం తిరిగేసరికి మళ్లీ మొదటికే వస్తారు.కల కనడం కాదు దాన్ని అందుకోవడం ముఖ్యం.గమ్యాన్ని చేరేంతవరకూ విశ్రమించకపోవడం ప్రధానం.బలమైన సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు.నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేంతవరకూ అలుపెరగని, భయమెరగని మొక్కవోనితనం ప్రదర్శించాలి.మనం వెళ్లే దారిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి కానీ ఒక్కో కారు మబ్బును దాటుకుంటూ మిరుమిట్లు గొలిపే భానుడిలా ప్రకాశిస్తూ ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించేస్తాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

93)నీ వెనకున్న ఆస్తిని చూసి మురిసిపడకు..కూర్చొని తింటే కొండలు కుడా కరుగుతాయి మనకు... అందాన్ని చూసి మిడిసి పడకు..పూజకి పనికి రాని పువ్వు ఎంత వికసించిన దండగే చివరకు..నీకే అన్ని దక్కాలని కళ్ళ ముందున్నవన్నీ చూసి ఇష్టపడకు..ఎంత ఇష్టపడిన మనకి అందవు కొన్ని కడవరకు..నీ కష్టంతో ఎంత సంపాదించిన బయటపడకు..ఎందుకంటే నవ్వుతు నాశనం చేసేవాళ్లు నీ పక్కనెే ఉంటారు నీ పతనం వరకు..నకు ఏమి లేదని బాధపడకు..జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన నీలో ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కొల్పోకు..నీకు ఎన్ని కష్టాలొచ్చినా నీ గమ్యాన్ని చేరడానికి దారిని వెతుకు!!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

94)మన సమాజంలో కొంత మంది మంచి మనుషులను ముంచి సంపాదించింది మన్నులోన కలిసిపోయే...చివరాకరికి ఏకాకివాయే..మనకు ఎందుకు అంత సంపాదన..ఆకలి వేస్తే నాలుగు మెతుకులు కొనుక్కు తినేంత కూడా పెట్టుకుంటే చాలు కదా....రోగం వస్తే చూపించుకునేంత దాచుకుంటే సరిపోదా...సాయం కోసం వచ్చే వారికి...సాయం తీర్చేటంత డబ్బు ఉంటే సరిపోదా..దానికోసం నమ్మిన మనుషులను ముంచాలా దాచుకున్న సొమ్మును దోచుకోవాలా..దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు..చేసిన పాపాలు పండి ఆస్పత్రిలో రోజులు లెక్కపెట్టేటప్పుడు గోడమీద ఇలా రాసి ఉంటుంది I C U అని అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను..దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కాబట్టి మనం పక్కవారికి ఏమి చేస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది..కర్మ అనుభవించక తప్పదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం* 

95)మనకు వంద మంది మంచి స్నేహితులు ఉంటారు.వారిలో కొంతమంది సమయానికి వచ్చి నిలబడతారు.మంచి సలహాలిస్తారు.మనకు ధైర్యం కలుగ చేస్తారు.కొంతమంది బంధువులు కూడా అలాంటి వారు ఉంటారు.మనకేదైనా కష్టం కానీ డబ్బు అవసరమైనప్పుడు కానీ అడిగితే సహాయం చేసినట్లు నటిస్తారు.తర్వాత పత్తా లేకుండా పోతారు. అలాంటి వారు నీ జాబితాలో ఎంతమండి ఉన్నా వృధానే..నీ నుంచి ఏమీ ఆశించకుండా నువ్వు బాగుండాలని కోరే ఒక్కరున్నా చాలు..వీలైతే ఒక నలిగురుని సంపాదించుకో నీ జీవితం ధన్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

96)జీవితంలో గెలిచాక మీకోసం చప్పట్లు కొట్టే చేతులకంటే..మీరు ఓటమిలో ఉన్నప్పుడు చేయి అందించేవారిని గుర్తుపెట్టుకోవాలి.వారే మీకు జీవితాంతం తోడుంటారు.ఓటమిని మెట్లుగా చేసుకుంటూ పైగి ఎదిగినప్పుడే మీ గెలుపుకు అర్థం ఉంటుంది.మీరు నేరుగా చివరి మెట్టు ఎక్కి..గెలిస్తే.. అందులో మీకు కూడా సంతృప్తి ఉండదు.జీవితంలో గెలవాలంటే కచ్చితంగా మనసుతో ఓ యుద్ధం జరగాలి.నీతో నీకు యుద్ధం జరిగినప్పుడే అసలైన నువ్వు బయటకు వస్తావ్.గెలుపు తేలికగా ఉంటే..ఏదో ఒకరోజు జీవిత ఓడిపోక తప్పదు.అందుకే గెలుపు కోసం ప్రయత్నించు..కానీ ఓడిపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

97)ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో.. దానివలన లభించే ప్రతిఫలం కూడా అంత తియ్యగా ఉంటుంది..అలాగే ఓటమి ఎంత బాధనిచ్చినా.. తర్వాత వచ్చే గెలుపు కిక్కునిస్తుంది.గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది..ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది..ప్రయత్నించి చూస్తే సాధ్యంకానిదంటూ ఏదీ లేదు..లక్ష్య సాధనలో గెలవకపోవడం ఓటమి కాదు..మళ్లీ మళ్లీ ప్రయత్నించకపోవడం ఓటమి..గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం ఓకే..కానీ ఓడిపోయినప్పుడు దాన్ని జీర్ణించుకోవడం అవసరమే.గెలుపు ఓటమి రెండు కళ్లలాంటివి.. ఏ ఒక్కటి లేకున్నా జీవితం అందంగా కనిపించదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

98)జీవితంలో చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే..ఒక్కసారి ఓడిపోతే ఇక జీవితమే అయిపోయిందని బాధపడుతుంటారు.కానీ గెలిస్తే మీరు నేర్చుకునేదానికంటే..ఓడిపోయినాక నేర్చుకునేది చాలా బలంగా ఉంటుంది. నేర్చుకోవాలనే తపనను పెంచుతుంది.ఇతర విషయాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పిస్తుంది. ఒక్కసారి గెలిచేందుకు వందసార్లు ఓడిపోయినా పర్లేదు.కానీ ఒక్కసారి ఓడిపోయామని ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు.గెలుపు రుచి కంటే ఓటమి ఇచ్చే అనుభవాలు చాలా గొప్పవి. ఏ పుస్తకంలోనూ మీకు దొరకవు.స్వతహాగా మీరే నేర్చుకోవాలి అంతే....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

99)జీవితం ఒక గెలుపు ఓటముల సమాహారం కానీ ఇక్కడ గెలిచిన వాడి మాటలకే విలువ ఎక్కువ.ఓడిన వాటి అనుభవాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు.కానీ గెలిచిన వ్యక్తి చెప్పే మాటలకంటే..ఓడిన వ్యక్తి చెప్పే మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి.ఎందుకంటే ఓడిన వ్యక్తికి ఓటమి బాధ తెలుసు.గెలిచిన వ్యక్తి తన గురించి మాత్రమే చెబుతాడు.వెళ్లే దారి గురించి అస్సలు చెప్పడు.అదే ఓడిన వ్యక్తి వెళ్లేదారిలో ఉండే ముళ్ల గురించి కూడా వివరిస్తాడు.నిజానికి జీవితంలో గెలవడం కంటే ఓడిపోవడమే ముఖ్యం అదేదో సినిమాలో చెప్పినట్టు గెలిస్తే మీరు ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది..కానీ ఒక్కసారి ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో మీకు తెలుస్తుంది.మీ వాళ్లు ఎవరు, పరాయి వాళ్లు ఎవరో అర్థమవుతుంది.మీ చుట్టు ఉండే వాళ్ల మాటలు అర్థమవుతాయి కాబట్టి ఓడిపోయానని కృంగిపోకు పడి లేచిన అలలా ఎక్కడైతే పడ్డావో అక్కడే లేచి నిలబడు అప్పుడు గెలుపు నీకు దాసోహం అవుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

100) నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు.అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం కాలేదు.ఏదో ఓ రోజు కాలమే అన్నింటి లెక్కలు తేల్చేస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

101)జీవితంలో ఒక్కోసారి అన్నీ ఎదురుదెబ్బలే ఎదురవు తుంటాయి...సమస్యల పరిష్కారాలు మనతో దోబూచు లాడుతుంటాయి..మన అనుకున్నవారు ఒక్కసారిగా పరాయిగా కనపడతారు..మానసిక నైరాశ్యం వహిస్తుందికానీ...ఎలాంటి పరిస్థితిలోనూ మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు..అన్నీ ప్రతికూలాలే ఎదురయినప్పుడు మరి ఏమి చేయాలి?....జస్ట్ మౌనం వహించాలి నిరాశను పారద్రోలడానికి నిశ్శబ్దంగా సన్నద్ధం కావాలి..మళ్ళీ లేచి నిలబడాలి... కాబట్టి కాస్త ఓర్పుతో కష్టాలన్ని దాటుకుంటూపోవాలి అప్పుడే మనం అనుకున్నవి సాధించగలం...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

102)మీరు ఎలాంటి పరిస్థితులో ఉన్నా..కష్టంగా ఉన్నా ఏది నేర్చుకోవాలో దానిపై ఫోకస్ చేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నా..కచ్చితంగా మీ ఆలోచన విధానం బాగుండాలి.అప్పుడే నేర్చుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. భయపడి ఒకే చోట ఆగిపోతే ఏదీ నేర్చుకోలేరు. జీవితానికి దొంగలా దొరికిపోతారు. అప్పుడు జీవితం మీతో ఆడుకుంటుంది. ఇతరులు మీకంటే ముందుగా వెళ్లిపోతారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

103)కొన్నిచోట్ల మనం స్పందిస్తే బాగుంటుంది..కొన్ని చోట్ల మనం నిబ్బరంగా ఉంటేనే బాగుంటుంది..కొన్నిచోట్ల మనం ఆన్సర్లా ఉంటే బాగుంటుంది..కొన్ని చోట్లమనం మాట్లాడితే బాగుంటుంది..కొన్నిచోట్ల మౌనంగా ఉంటేనే బాగుంటుంది..కొన్నిచోట్ల క్వశ్చన్ లా ఉంటేనే బాగుంటుంది..చాలా చోట్ల మనం మనలా ఉంటేనే బాగుంటుంది..ఎందుకంటే అల్పులకు మనల్ని మనం వివరించుకున్నకొద్దీ గాలి బుడగలా "తేలిపోతాము" విలువలు తెలీని మనుషుల నుండి "విలువ" ని ఆశించకూడదు..గంజాయి కేమి తెలుసు తులసిలోని అమృతగుణాలు...కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించే విజ్ఞతను పెంచుకోవడం మన బాద్యత లేకపోతే జీవితంలో మనం ఎదగలేము.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

104)ఉదాహరణకి మన దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి..సరే ఎవరో ఆపదలో ఉన్నారు ఇందులో నుండి ఒక రెండు రూపాయలు తీసిద్దాం.ఎక్కడికి పోతాయి తిరిగి ఏదొక రూపంలో మళ్ళీ మన దగ్గరకే వస్తాయి...అరే ఆపదలో ఉన్నారు మనం కాస్త సహాయం చేస్తే బ్రతుకుతారు, ఆపద నుండి బయట పడతారు..డబ్బుది ఏముంది ప్రాణంకంటే ముఖ్యమా...ఇలా చాలా గొప్ప మనసుతో ఉన్నతంగా ఆలోచించాలి..ఇక్కడ జాతి మతం కులం చూడకుండా సాయం చేయగలగాలి..మనం అందించే చిన్న సాయమైనా మనకు తెలీకుండానే ఒకరి ప్రాణంకి ఎంతగానో ఉపయోగపడింది.ఒక కుటుంబంలో మళ్ళీ కాస్త చిరునవ్వులు పూచే దానికి దారి చూపింది అని చెప్పడానికి సందేహమే లేదు కాబట్టి నీకు ఉన్న దాంట్లో చేయగలిగినంత సాయం చేయి ఆ దేవుడు చల్లని చూపుకి ప్రాప్తుడవుతావు..చివరిగా ప్రార్దించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

105)కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఈ కలిసిరాని కాలం కూడా మీకు అలాంటి జీవితానుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తుందేమో. ఇలా సానుకూలంగా ఆలోచించి ఆ కష్టాలను దాటేందుకు ఓపికగా ఉండాలి.జీవితమే ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఏ పనీ చేయకుండా నిలిచి ఉంటే మాత్రం... ఓటమి తప్పదు. కాబట్టి రోజులు బాలేదని తిట్టుకోవడం కన్నా, ఆ రోజులను ఎలా దాటాలో ఆలోచించండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

106)జీవితంలో మంచి రోజులు రావాలంటే...ఆ జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలవాలి. అప్పుడే మీకు విజయం సొంతం అవుతుంది. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం మీకు ఉండాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. మీరు ముందుగా గెలుపు గురించి కాదు, ఓటమిని తట్టుకునే శక్తిని పొందండి. కష్టాలను ఎదుర్కొనే ఓపికను పెంచుకోండి అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

107)కాలం కలిసి రాకపోయినా, అనుకున్నది జరగకపోయినా... కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా ఆ పనిని అక్కడే వదిలేసి భయంతో పారిపోతారు. ఈ రెండూ కూడా మిమ్మల్ని మనిషిని చేయవు. మనిషిగా పుట్టిన తర్వాత ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని స్వాగతించాల్సిందే. ఆ పోరాటంలో మీరు గెలిచినా, ఓడినా ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. మీరు భయపడి వెనకడుగు వేస్తూ ఉంటే ఆ భయం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయానికి ఎదురు వెళ్లి చూడండి, అది కళ్ళముందే మాయమైపోతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

108)ప్రతి ఒక్కరం రేపు అనే భవిష్యత్తు కోసమే జీవిస్తాం. ఆ భవిష్యత్తు అందంగా ఉండాలని కోరుకుంటాం. అలా అందంగా ఉండాలన్నా, ఆ అందమైన జీవితాన్ని అనుభవించాలన్నా... మంచి రోజుల కోసం వేచి ఉండడమే కాదు, ఇప్పుడు మనల్ని వేధిస్తున్న చెడు రోజులతో పోరాడాలి. లక్ష్యం ఉన్నవాడికి ఆ పోరాటం పెద్ద కష్టమేమీ కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరికను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. ఏ లక్ష్యం లేని వాడు బ్రహ్మస్త్రాన్ని కూడా గడ్డిపరకల్లాగే వదిలేస్తాడు. కాబట్టి ముందుగా గట్టి లక్ష్యాన్ని పెట్టుకోవాలి..ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పుడు కలిసి రాని కాలంతో ఓపికగా పోరాటం చేయాలి అప్పుడు తప్పక మనం అనుకున్నవి సాధించగలం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

109)విజయం కోసం వేచి ఉండడంలో తప్పులేదు, కానీ ఓటమిని చూసి పారిపోవడం మాత్రం అతి పెద్ద తప్పు. జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో సౌకర్యాలే కాదు... అసౌకర్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రతి దాన్ని దాటుకుంటూ పోవాలి, తప్ప అక్కడే ఆగిపోకూడదు. నడిస్తే కాలు నొప్పి వస్తాయని, నడక ఆపేస్తే మీ జీవిత ప్రయాణమే ఆగిపోతుంది. గమ్యం చేరాలన్న ఆశతో ముందుకు నడుస్తూనే ఉండాలి.ప్రశాంతంగా ఉన్న సముద్రం మంచి నావికుడిని తయారుచేయలేదు. అలాగే సమస్యలు, ఓటమి లేని జీవితం ఉత్తమ మనిషిని తీర్చిదిద్దలేదు. జీవితమంటేనే ఒక గణిత పుస్తకం. దాన్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ పోవాలి తప్ప భయపడి అక్కడే ఆగిపోకూడదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

110)జీవితం అందరికీ వడ్డించిన విస్తరిలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఒడిదుడుకలలో ఓటములను తట్టుకొని నిలిచిన వారే. చివరికి విజయం విలువను తెలుసుకుంటారు. జీవితం అంటేనే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, ముందుకు సాగిపోవడం. సమస్యలే లేకపోతే మీకు జీవితమంటే ఏంటో ఎలా తెలుస్తుంది? తల ఉన్నంతవరకు తలనొప్పి వుంటూనే ఉంటుంది. తలనొప్పి వస్తుందని తల తీసేయలేము కదా. అలాగే ఓటమి కలుగుతుందన్న భయంతో ప్రయత్నం ఆపేస్తే నువ్వు అనుకున్నవి సాధించలేవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

111)ఓడిపోతే ఎంతోమంది కృంగిపోతారు. నిజానికి ఆ ఓటమినే తొలిమెట్టుగా భావించాలి. విజయం విలువను తెలిపేది ఓటమే. జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తూ పోతే, అన్ని విజయాలే ఉంటే... మీకు ఓటమి విలువ తెలియదు. ఒకసారి ఓడినప్పుడే విజయం ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే విజయంలోని ఆనందాన్ని కూడా మీరు అనుభవించగలరు. కారు చీకట్లు కమ్ముకున్నప్పుడే కదా వెలుగు విలువ తెలిసేది. ఓటమి లేని గెలుపుకి విలువ ఉండదు. నాకు ఇక తిరుగులేదనే అహం మనిషిలో కమ్మేస్తుంది. నేల నెర్రిలిచ్చినప్పుడే ఆకాశం వైపు చూస్తుంది, అప్పుడే దానికి చినుకు విలువ తెలుస్తుంది. అలాగే ఓటమి ఎదురైనప్పుడే మీకు విజయం విలువ తెలుస్తుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

112)జీవితంలో ఒక్కసారి ఓడిపోతేనే విజయం విలువ తెలుస్తుంది. అలాగే మనవాళ్లు ఎవరో, బయట వాళ్లెవరో కూడా తెలిపేది ఓటమే. కాబట్టి ఓటమిని తక్కువ చేసి చూడకండి ఎందుకంటే ఓటమి ఎదురైనప్పుడే మళ్ళీ విజయం సాధించాలన్న కసి పుడుతుంది. ఆ కసి కావాలంటే మీరు ముందుగా ఓడిపోయి చూడాలి. సమస్యలు లేని జీవితం ఎవరికి ఉండదు. అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. కాబట్టి మీ ఓటమికి కుంగిపోకుండా... ఆ ఓటమి ఎందుకు కలిగిందో ఆలోచించి చూసినప్పుడే మనం ఎక్కడ తప్పులు చేసామో తెలుస్తుంది దానిని సరిచేసుకుంటూ పోథేబె మనం అనుకున్నవి సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

113)నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ...జీవితంలో నీవు గెలవాలంటే మాత్రం నీ తోటి వారినందరినీ ప్రేమించాలి.ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు.ఎందుకంటే...ఆకలి మళ్ళీ వేస్తుంది..!!..అవసరం మళ్ళీ కలుగుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

114)జీవితమనే పొలంలో కలుపు మెుక్కలు అనే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్లలేం కదా.. కలుపు మెుక్కలను పీకేస్తూ పైరును కాపాడుకుంటాం. అలాగే సమస్యల మీద యుద్ధం చేసి జీవించాలి. అదే సమస్యలకు లొంగిపోతే.. జీవితాంతం కుంగిపోవాల్సి వస్తుంది.సమస్యల రాళ్లు మన మీద పడుతూ ఉంటే..తెలివిగలవారు వాటిని అందుకొని కొత్త గోడలను నిర్మించుకుంటారు. అదే తెలివి లేనివారు..తల వంచుకుని రాళ్ల దెబ్బలు తింటారు.అలా దెబ్బలు తింటే నష్టపోయేది మనమే..అదే కొత్త గోడలను నిర్మించుకుంటే లాభపడేది మనమే.అందుకే సమస్య మెుదలైన మనలో నుంచే.. సమాధానం కూడా రావాలి.అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

115)గతంలో నువ్వు ఎదుర్కొన్న బాధలు, కష్టాలు.. ప్రస్తుతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల ముందు చిన్నవే.జీవితంలో గడిచిపోయిన సమస్య గురించి ఇప్పుడు ఆలోచిస్తూ సమయం వృధా చేసుకో కూడదు.ముందుకు ప్రయాణిస్తూ ఉండాలి ఎందుకంటే సమస్యలు శాశ్వతం కావు..కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు.. ఇలా ఏదో ఒక సమయంలో తీరిపోవాల్సిందే.అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి..బాధపడకూడదు. కొత్తగా వచ్చేవి సవాళ్లు,సవాళ్లతో కూడిన పరిస్థితులే..అవి సమస్యలు కావు..మన జీవితంలో అస్సలు కొత్తగా ఏమీ జరగకపోవడమే అసలు సమస్య.అందుకే జీవితంలో ఏదో ఒకటి జరగాలి. అప్పుడే జీవితం ఏంటో అర్ధం అవుతుంది.జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం...ఏ సమస్యలూ లేని జీవితం ఉండదు. అస్సలు అది జీవితమే కాదు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

116)ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎప్పుడూ మూడు ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి..నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఫలితాలు ఏంటి? నేను విజయం సాధిస్తానా? వీటి గురించి లోతుగా ఆలోచించాలి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించినప్పుడే ముందుకు సాగాలి.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..జీవితంలో ముందుకు వెళ్తుంటే ఎన్నో అవమానాలు మనకు ఎదురవుతాయి..వాటిని చూస్తూ అక్కడే ఆగిపోకూడదు.ఎందుకంటే ఇప్పుడు ఎదుర్కొన్న అవమానాలు ఏదో ఒక రోజు మనకు ఆభరణాలుగా మారతాయి.అవమానాలు ఎదుర్కొంటేనే మనిషి స్ట్రాంగ్ అవుతాడు.లక్ష్యంపై ఫోకస్ మరళి అనుకున్నవి కసితో తొందరగా సాధించగలుగుతాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

117)విజయం సాధించడానికి శత్రువులు, పోటీదారులు తప్పనిసరిగా అవసరం అంటాడు చార్లీ చాప్లిన్. నమ్మకానికి అధైర్యం మొదటి శత్రువు. విజయసాధనలో అధైర్యం కూడదు. నమ్మకాన్ని కోల్పోకూడదు.భయాన్ని బంధిస్తే ధైర్యానికి దారి దొరుకుతుంది.గొప్ప కార్యాలు సాధించడానికి సమయం పడుతుంది. ఒక్కసారి నమ్మకం సడలిందంటే భయం ఆవరిస్తుంది.ఆ భయం మన లక్ష్యాన్ని మింగేస్తుంది. మన మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చు. నమ్మకం చుట్టూ అచంచలమైన ధైర్యం ఉండాలి. సాగరమంత సహనం అవసరం. లక్ష్యసాధనకు తొలిమెట్టూ చివరి మెట్టూ నమ్మకమే అని ఎప్పుడూ మరిచిపోకూడదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

118)'కెరటం నాకు ఆదర్శం. లేచి పడినందుకు కాదు. పడి మళ్ళీ లేస్తున్నందుకు' అన్న వివేకానందుడి మాటలు నమ్మకానికి పెట్టుబడిలాంటివి. నీ మీద నీకున్న నమ్మకమే నీకు వెయ్యి ఏనుగుల బలమని మరచిపోకూడదు.బండశిల ఊరికే శిల్పం కాదు. అది శిల్పి నమ్మకానికి ప్రతిరూపం.లోకంలో ఏదీ తనంతట తాను వచ్చి చేరదు.ఒకింత ప్రయత్నం,మరికొంత నమ్మకం అవసరం. మనం చేస్తున్న పనిలో ఎప్పుడూ ఆటంకాలు ఉంటాయి.తడబడినా తట్టుకుని నిలబడాలి.తప్పటడుగు వేసినా సరిదిద్దుకోవాలి. మళ్ళీ లేవగలననే చిగురంత నమ్మకం
వల్ల విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.అలాగే పదిశాతం ప్రేరణకి, తొంభై శాతం పరిశ్రమ తోడైతే జీవితంలో ఏదైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

119)జీవితం ఒడుదుడుకులతో కూడిన గంభీర సాగరం. ఇందులో ఆటుపోట్ల వలయాలు, సమస్యల సుడిగుండాలతో పాటుగా, సంతోషం, మాధుర్య స్పర్శలూ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు.అందుకే సమస్యలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన, ప్రతి ఒక్కరికీ అవసరం. సమస్యలు చుట్టుముట్టినా, కష్టాలు ముంచుకొచ్చినా ధైర్యం వీడకుండా, ఉండటమే మనిషి ప్రథమ కర్తవ్యం... సమస్యలను మనోధైర్యం తో ఎదుర్కోవాలి, అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.... బలహీన మనస్కులు చిన్న సమస్యలకు కూడా కలత చెంది చింతాసాగరంలో మునిగి ముందుకు సాగలేరు. ధృడ సంకల్పం గల వ్యక్తులు, ఎన్ని కఠిన సమస్యలు ఎదురైనా, వాటిని పరిష్కరించుకుంటూ, ప్రయత్నాలు కొనసాగిస్తూ, చివరికి లక్ష్య శిఖరాలను అందుకుంటారు. మౌన సందేశాలు అందిస్తున్న ప్రకృతిని గమనిస్తే, ఏదీ సమస్య అనిపించదు. ఎలాగంటే ఎగిరే పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తగ్గవు, తెగించి ముందుకు దూసుకు పోతాయి. ఉప్పొంగుతూ ఉరికే నదులు అడ్డుపడిన బండరాళ్లను చీల్చుకుని ముందుకు సాగుతాయి... ప్రకృతిలో శీతోష్ణాలు, రుతుపవనాలు ఎలా వస్తూపోతూ ఉంటాయో, మనిషి జీవనగమనంలో కూడా ఆటుపోట్లు, సుఖసంతోషాలు వస్తూపోతూ ఉంటాయి. అందుకే మనం పరిస్థితులను అంగీకరించాలి, సాహసంతో సమస్యలను ఎదుర్కోవాలి, అవగాహనతో వ్యవహరిస్తూ ముందడుగు వేయాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

120)జీవితంలో సమస్యలు ఉన్నయాని ఆగిపోకూడదు. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కష్టాలు వస్తాయి.. పోతాయి.. కానీ కలల కోసం కష్టపడటం మాత్రం ఆపేయకూడదు. కల కంటే నెరవేరేదాకా నిద్రపోకూడదు. జీవితంలో విజయం సాధించేందుకు కచ్చితంగా కష్టపడాలి.జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావొచ్చు..అది కష్టంగానే ఉంటుంది..కానీ ఆ ఒంటరి తనమే..డబ్బు విలువ..చదువు విలువ..సమయం విలువ..జీవితం విలువ..అన్ని నేర్పిస్తుంది.అందుకే జీవితంలో ఏ సమస్య వచ్చినా మనసుకు తీసుకోకూడదు. దానితో యుద్ధం చేసేందుకు ముందుకు వెళ్లాలి. మీరే ఒక సైనికుడిలాగా మారాలి. అందుకోసం నిరంతరం శ్రమించాలి. పక్క నుంచి రాళ్లు పడుతూ ఉంటాయి. కానీ భయపడి ఆగిపోవద్దు. ముందుకు సాగిపోతూ ఉండాలి.నీకు కష్టమనిపించే ఉద్యోగం..ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం..నీకు విసుగు తెప్పించే పిల్లలు..పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం..నీ వద్ద ఉన్న చిరు సంపాదన..చిల్లిగవ్వ కూడా లేనివారికి ఊరటనిచ్చే స్వప్నం..కాబట్టి సమస్యలకి ఎప్పుడూ తలవంచకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

121)సమస్యలు వస్తేనే మన జీవితం బలంగా తయారవుతుంది. లేదంటే అలాగే సాధారణంగా నడుస్తూ ఉంటుంది. సమస్యలేని జీవితం గెలుపును చూడాలంటే కష్టం. ఎందుకంటే జీవితంలో దెబ్బలు తగిలితేనే..బలంగా తయారవుతాం. లేదంటే అక్కడే ఉండిపోతాం. గెలిచేందుకు మీ మనసు మదనపడాలి. మీతో మీరు యుద్ధం చేయాలి. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

122)కష్టాలను చూసి పారిపోవడం మొదలుపెడితే, ఆ కష్టం మీ వెంటే వస్తుంది. దానికి ఎదురెళ్లి చూడండి... అదే పారిపోతుంది. మిమ్మల్ని చూసి ఈర్ష పడే కళ్ళను చూసి భయపడకండి. ఆ భయం మీకు పిరికితనాన్ని నేర్పుతుంది. అదే ధైర్యంగా ఉండి చూడండి, మీకు గెలవడం అలవాటవుతుంది. భయం, పిరికితనాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని ముందుకు సాగండి... కష్టాలన్నీ దూది పింజెల్లా ఎగిరిపోయి జీవితం విజయం బాటలో సాగుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

123)కొంతమంది తాము పిరికివారిగా ఉండడమే కాదు, ఎదుటివారిని కూడా పిరికివారుగా మార్చేటట్టు మాట్లాడతారు.మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు.మనం ఎదుటివారితో ఎప్పుడూ పిరికి మాటలు మాట్లాడకూడదు.అలాగే ఎవరైనా పిరికి మాటలు మాట్లాడినా కూడా వినకండి.అవి మన జీవిత గమనానికి పెద్ద ఆటంకాలను కలిగిస్తాయి కాబట్టి పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యంగా అడుగు వేయాలి, పరిస్థితులు ఎదురైతే పోరాడాలి తప్ప పారిపోకూడదు.ఎంత కష్టమైనా లేచి నిలబడాలే తప్ప కూలబడి పోకూడదు.ఏదైనా పని చేసినప్పుడు పిరికితనాన్ని పూర్తిగా వదిలి ధైర్యంగా చేసినప్పుడు మీకే తెలుస్తుంది,విజయం ఎంతో వేగంగా మీ చెంతకు చేరుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

124)జీవితం అందరికీ వడ్డించిన విస్తరిలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఒడిదుడుకలలో ఓటములను తట్టుకొని నిలిచిన వారే.చివరికి విజయం విలువను తెలుసుకుంటారు. జీవితం అంటేనే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, ముందుకు సాగిపోవడం. సమస్యలే లేకపోతే మీకు జీవితమంటే ఏంటో ఎలా తెలుస్తుంది? తల ఉన్నంతవరకు తలనొప్పి వుంటూనే ఉంటుంది. తలనొప్పి వస్తుందని తల తీసేయలేము కదా. అలాగే ఓటమి కలుగుతుందన్న భయంతో ప్రయత్నమే ఆపేయొద్దు.ఒక మనిషి జీవితంలో ఓటమి ఎదురైనప్పుడే మళ్ళీ విజయం సాధించాలన్న కసి పుడుతుంది. ఆ కసి కావాలంటే మీరు ముందుగా ఓడిపోయి చూడాలి. సమస్యలు లేని జీవితం ఎవరికి ఉండదు. అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. కాబట్టి మీ ఓటమికి కుంగిపోకుండా... ఆ ఓటమి ఎందుకు కలిగిందో ఆలోచించి చూడండి. జీవితంలో ఓటమి లేకపోతే ఉప్పులేని కూరలా చప్పగా అయిపోతుంది లైఫ్....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

125)మోసే వాడికి కావడి విలువ..రాసేవాడికి అక్షరం విలువ..సంపాదించేవాడికి డబ్బు విలువ..కష్టపడే వాడికి బతుకు విలువ..పండించేవాడికి పంట 
విలువ..బాధ్యత ఉన్నోడికి బంధం విలువ..భవిష్యత్తు మీద ఆశున్నోడికి చదువు విలువ..లక్ష్యం ఉన్నోడికి జీవితం విలువ తెలుస్తుంది..ఒక మంచి మనిషి యొక్క విలువ విడిపోతే తెలుస్తుంది, కాలం యొక్క విలువ గడిచిపోతే తెలుస్తుంది..జీవితం యొక్క విలువ ఒకరిమీద ఆధారపడకుండా కష్టపడితే, అనుభవిస్తేనే తెలుస్తుంది..కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు..ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలి పెట్టరు..కాబట్టి ఏదైనా కష్టపడి ఇష్టపడి మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

126)కొన్నిసార్లు మన ఆలోచనలే మనల్ని మూర్ఖులుగా సమాజానికి చూపిస్తాయి.కొన్నిసార్లు ఎదుటివారు చెప్పింది వినిపించుకోకుండా ప్రవర్తిస్తే అందరి ముందు తెలివిలేని వారిగా అవుతాం..అందుకే ఏదైనా విషయంలో కాస్త వివేకంతో ఆలోచించాలి.ఎదుటివారు చెప్పింది వినిపించు కోవాలి.జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేప్పుడు ఎదుటివారి మాటకు విలువ ఇవ్వాలి. వారు చెప్పింది మెుత్తం పాటించాల్సిన పనిలేదు.మీకు ఏది ఉపయోగ పడుతుందో చూసుకుంటే సరిపోతుంది. మూర్ఖంగా ఆలోచిస్తే ఎప్పటికైనా నష్టపోయేది మీరే.చెప్పేవారు లేక చెడిపోవడం దురదృష్టం.. చెప్పేవాళ్లు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

127)ఎన్నాళ్ళు దిగాలుగా కూర్చుంటావు? దిగులుపడే నీవంటే నలుగురికీ దిగదుడుపే..ఎవరి కష్టాలు వారికున్నాయి నీ కష్టమెవరికి కావాలి?ఓదార్పు నీవు కోరకుంటే పాపపుణ్యాల కథలు వినిపిస్తారు...నిరాశలో నీవు కూరుకునిపోతే నిట్టూర్పుల జల్లు కురిపిస్తారు
నీ కన్నీటి జడివాన నిన్ను ముంచెత్తకముందే ఆశల గొడుగు పట్టు..పోరాడితే పోయేదేముంది..గెలిస్తే గెలుపవుతావు..ఓడితే నీ జీవితానికే మలుపవుతావు
ఎడుస్తూ కూర్చుంటే ఏమవుతావు?వెలుతురెరుగని చీకటవుతావు.నమ్మకమనే చమురుపోసి ఆశల వత్తులు వెలిగించిచూడు తెరలు తెరలుగా చీకటే మాయమవుతుంది కాబట్టి ఓర్పుతో సహనంతో నీ పని నువ్వు చేయి తప్పక ప్రతిఫలం దొరుకుతుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

128)జీవితంలో జరిగే ప్రతీ చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుంది..ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ప్రత్యేకంగా తయారు చేసి ఏం ఉండదు.మన ఆలోచనల్లోనే ఉంటుంది.మనం విషయాలను తీసుకునే పద్ధతిలోనే ఉంటుంది.ఆనందమనేది మనసుకు అనిపించాలి.దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు. జీవిస్తున్న ప్రతిక్షణాన్ని నువ్వేలా చూస్తున్నావో..దానిపైనే నీ సంతోషం దాగి ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని బాధపడితే బాధే మిగులుతుంది కాబట్టి గతం గురించి,భవిష్యత్ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకూడదు.ప్రస్తుతం జీవించేవాడే ఆనందంతో ఉంటాడు.ఆనందం రాలిన జీవితం...నవ వసంతానికై ఎదురుచూస్తుంది..కారు చీకటి కమ్మిన మనసు..నిండు వెన్నెలకై ఎదురుచూస్తుంది..చివరగా మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం దొరుకుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

129)కష్టాలు వచ్చిందని కలవరపడకు, ప్రశాంతంగా కాసేపు ఆలోచించు.తప్పక నీకు ఒక పరిష్కారం దొరికే తీరుతుంది కాస్త ఓపిక పట్టు. లోకంలో ఎవరికి లేని కష్టాలన్నీ నాకే ఎందుకంటూ మదన పడకు. కష్టాలు, కన్నీళ్లు శాశ్వతంగా ఉండవు. చీకటి,వెలుగు ఎలాగో కష్టాలు సుఖాలు కూడా అంతే.. కష్టాలు లేకపోతే సుఖం యొక్క విలువ ఎలా తెలుస్తుంది..? చీకటి లేకుంటే వెలుగు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది..? కష్టాలు జీవితంలో వరాలు లాంటివి నిన్ను,నీ ఆత్మస్థైర్యాన్ని దృఢం చేయడానికి దేవుడు పంపిన బహుమతిగా భావించండి. కష్టాలు జీవితంలో ఎవరిని నమ్మాలి..? ఎవరిని నమ్మొద్దు..? అనేది తెలియజేస్తుంది. కష్టాలు నీ నిజమైన ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు ఎవరో తెలియజేస్తుంది. కష్టాలు వ్యక్తుల గుణగణాలు బయటపడేటట్టు చేస్తుంది. కష్టాలు నీ జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కష్టాలు నిన్ను నీవు మలుచుకోవడానికి ఒక గొప్ప సాధనం. కష్టాల నుండి కసి పుట్టాలి.సాధించాలనే ప్రయత్నవాదం రావాలి.మిత్రమా.. ఒక్క మాట. ☝🏾సమస్యలు లేని జీవితం ఉండదు, అలాగే పరిష్కారం లేని సమస్యలు ఉండవు. నీవు చేయవలసింది ప్రయత్నం చేయడమే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 రఘురాం

130)కొందరు ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బును చూసి గర్వంగా ఫీల్ అవుతారు. ఇతరులను చూసి చులకనగా మాట్లాడతారు. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడుతూ ఉంటారు. అలాంటివారు కుండను చూసి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నిండు కుండ దగ్గరకు వెళ్లి అడిగాడట... ‘నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు. ఇది ఎలా సాధ్యం’ అని. అప్పుడు కుండ ‘నేను ఎప్పుడూ ఒకే విషయాన్ని గుర్తు పెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టి నుంచే, మళ్లీ మట్టిలోనికే వెళ్తాను. మధ్యలో ఈ ఆవేశం, పొగరు, గర్వం లాంటివి అవసరమా’ అని నవ్విందట. ధనవంతులమని విర్రవీగుతున్నవారు ఈ కుండ చెప్పిన నీతిని అర్థం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉన్నా వారు కలిసేది మట్టిలోనే...కాబట్టి అహంకారం వీడి విధేయత వినయం అలవర్చుకో అప్పుడు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలవు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

131)ఎంతటి బలవంతుడికైనా ఒక బలహీనత ఉంటుంది, అలాగే ఎంతటి బలహీనుడికైనా తనకంటూ ఒక బలం ఉంటుంది. ఆ బలం వారికి తెలిసే వరకే వాళ్లు బలహీనులుగా కనిపిస్తారు. అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరిలో ఏ శక్తి దాగుందో ఎవరికి తెలుసు? ఐదు రూపాయలతో కొన్న పెన్ను కూడా ఐదు కోట్ల రూపాయల చెక్కుపై సంతకానికి ఉపయోగపడుతుంది. ఐదు రూపాయలు పెన్నే కదా అని పడేస్తే అవసరానికి అది కనిపించకపోతే అప్పుడు తెలుస్తుంది దాని విలువ.ఈరోజు మీరు సుఖంగా ఉన్నారని సంబరపడి ఎదుటివారిని చులకనగా మాట్లాడితే... రేపు మీకు ఏ కష్టం వచ్చి పడుతుందో తెలియదు. ఆ కష్టంలో మీకు ఎదుటివారి సాయం కావాల్సి రావచ్చు. అప్పుడు మీరే వెళ్లి వాళ్ళ సాయాన్ని కోరాల్సిన పరిస్థితి రావచ్చు. జీవితంలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఎదుటివారినీ తక్కువ చేసి మాట్లాడడం వెంటనే మానేయండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

132)దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక... ఈ మూడు ఎక్కడ ఉంటాయో విజయం అక్కడ తప్పక దక్కి తీరుతుంది. ఏదైనా సాధించాలన్న సంకల్పం ఒక మనిషిలో నరనరాన జీర్ణించు పోవాలి. తాను అనుకున్నది సాధిస్తానన్నా నమ్మకం తనపై తనకు ఉండాలి, ఆ విజయాన్ని సాధించాలన్న కోరిక మనసులో నాటుకుపోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాల్ని అందుకోవడం సులభం అవుతుంది కాబట్టి కలలు కనండి వాటిని కష్టపడి ఇష్టపడి సాకారం చేసుకోండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

133)విజయం దక్కే ఒక దారి మూసుకుపోయిందా? అయితే దేవుడు మరో దారి మీకు సిద్ధం చేసే ఉంటాడు. దాన్ని వెతికే పనిలో పడండి. అంతే తప్ప నిరాశలో కూరుకుపోకండి.కొంతమందికి విజయం దక్కదని తెలిసినా, విజయాన్ని అందుకునే ప్రయాణం చాలా పొడవైనదని అర్థమైనా, తృటిలో విజయం చేజారినా... చాలా నిరాశ పడిపోతారు. అలాంటి సమయంలోనే ఉత్తేజంగా ఉండాలి. ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి. విజయం దక్కే దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తే నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోవడం కాదు. ఒక దారి మూసిన దేవుడు కచ్చితంగా మీకోసం రెండోదారిని తెరిచే ఉంచుతాడు. దాని వెతుక్కుంటూ వెళ్ళండి. మీ విజయం కలలు సాకారమవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

134)విజయం అంటే విస్తరిలో వడ్డించిన ఆహారం కాదు...నేరుగా ఆరగించడానికి. మీరే దాని కోసం కష్టపడాలి. మీ ఆనందాలను, సౌకర్యాలను వదులుకోవాలి. విజయం దక్కితే జీవితంలో అన్నీ మీ వెంటే వస్తాయి. మీరు సుఖాల వెంట పరిగెడితే విజేత అవ్వడం కష్టం.క్రమశిక్షణ, నిరంతర కృషి, దృఢ సంకల్పం, సాధించాలన్న పట్టుదల,ఫోకస్...ఇవి మాత్రమే మీలో ఉండాలి.నిరాశ, నిస్పృహలను బయటకి తోసేయండి. అందమైన, అద్భుతమైన మనస్తత్వాన్ని తెచ్చుకోండి.స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

135)అపజయం అనేది జీవితానికి అంతం కాదు.ఆ అపజయాలను దాటుకుంటూ విజయ శిఖరాలను చేరుకోవాలి.చేతికి నేరుగా అందే జామకాయ కన్నా... అందని ద్రాక్ష పండే తియ్యగా ఉంటుంది.అలాగే విజయం సులువుగా అందితే దాని విలువ మనకు ఎలా తెలుస్తుంది? అందుకే విజేత అవ్వాలంటే జీవితంలో ఎంతో కష్టపడాలి.నక్షత్రాలని చూడాలనుకుంటే తల ఎత్తి ఆకాశాన్ని చూడాలి, కానీ మెడ నొప్పి పెడుతుంది కదా అని నేలవైపుగా చూస్తే నక్షత్రాలు కనిపించవు.నొప్పిని భరిస్తూ ఉంటేనే నక్షత్రం మెరుపులను మీరు చూడగలరు కాబట్టి ఎంత కష్టపడితే అంత సుఖపడగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

136)జీవితంలో ఓటమి ఎదురవగానే నిరాశపడడం, పక్క వాళ్ళ దగ్గరకు వెళ్లి ఏడవడం మానెయ్యండి.అదే మీ విజయానికి మొదటి మెట్టు అనుకోండి. విఫలమైనప్పుడల్లా రెట్టింపు వేగంతో ముందుకు సాగండి.అంతేకానీ వెనక్కి తగ్గకండి.దారి మూసుకుపోయిందనే కన్నా కొత్తదారి ఉందేమో అని వెతుక్కోవడమే విజయంలో మొదటి మెట్టు అనుకొండీ.వైఫల్యం నుంచి ఒక మంచి పాఠాన్ని నేర్చుకోండి.ఎందుకంటే ఇలాంటి అనుభవాలే మనకు విజయ సోపానాలుగా మారుతాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

137)జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.కదిలే కాలం, పారే నది,నీ ఆయుష్షు..ఇలా ఏదీ ఎల్లకాలం ఉండదు. అందుకే ప్రస్తుతంలో మనం ఆనందంతో బతకాలి. మిమ్మల్ని బాధపెట్టినవారి గురించి ఆలోచిస్తూ.. బాధపడటం చేయెుద్దు..రేపు ఏమవుతుందోనని బెంగ కూడా పెట్టుకోవద్దు.ఎందుకంటే జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. కేవలం ప్రస్తుతంలో మీ ఆలోచనలు మాత్రం దేన్నైనా నిర్ణయిస్తాయి.నలుగురితో నవ్వుతూ ఈ క్షణం జీవించాలి.ఏదో జరిగిపోయిందని బాధపెట్టుకోకూడదు.భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఆలోచనలో మనశ్శాంతిని చంపుకోకూడదు.ఎందుకంటే మీ జీవితానికి మీరే రాజు..మీరే మంత్రి.మిగతా వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.మీకోసం మీరు జీవించండి.మీ ఆనందాన్ని వెతుక్కోండి.అప్పుడే జీవితానికి అర్థం.మీకు సంతోషం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

138)మనం ఉన్నచోటనే ఉండి మన జీవితం మారిపోవాలంటే ఎలా? జీవితం మారాలంటే ముందు మనం మారాలి...నిరాశ నుండి ఆశ వైవపుకు నిరుత్సాహం నుండి ఉత్సాహం వైపు అడుగులు పడాలి...మన ఆలోచన మారితే తప్ప,ఎవరో మారితే మనజీవితం మారదు...నిట్టూర్పుల జ్వాల నిన్ను దహించకముందే మెదడు దుమ్ము దులుపు... నిత్యనూతనత్వానికి సిద్దం చేయ్...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

139)మన జీవితంలో ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్టే..అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే..విజయం మనల్ని వరించినట్టే..సూర్యుడు పగలే దారి చూపగలడు..అదే ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపిస్తుంది..లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా..అగ్గిపుల్ల వెలుగు దాచలేదు..నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే..నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది..ఆత్మవిశ్వాసం విజయపథం వైపు నడిపిస్తుంది..కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే..ప్రతీ గెలుపు మీ సొంతం అవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

140)గతం, ప్రస్తుతం, భవిష్యతు ముగ్గురు ఓదగ్గర కూర్చోని నా గురించి మాట్లాడుతున్నాయి."వాడికి పద్మవ్యూహంలోకి పంపే సమయం ఆసన్నమయింది" అని గతం అంది.'కానీ వాడికి దాని నుంచి ఎలా బయట పడాలో ఇంకా తెలీదు కదా" అని భవిష్యతు అంది."ఓడిపోయివున్న వాడికి ఉంది రెండే దారులు, ఒకటి గెలవడమ లేదంటే చావడమ".మనం చేయాల్సిందల్లా వాడి జీవితంలో ఇంకా అంధకారాన్ని పెంచడం.వాడు వెతికే వెలుగు వాడిలోనే వుంది అని తెలుసుకునేలా చేయడం.పదండి! మనం వాడితో యుద్ధం చేసే గొప్ప శత్రువులం! కానీ వాడినే గెలిపించే గొప్ప మిత్రువులం! అని ప్రస్తుతం అంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం గతంలోని తప్పుల్ని తెల్సుకుని భవిష్యత్తులో అవి మళ్ళీ రాకుండా నేర్చుకుని ప్రస్తుతంలో వాటిని ఇముడ్చుకుని బ్రతకడం జీవిస్తామో అప్పుడే ఆనందంగా ఉండగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

141)*ఎక్కువ కాయలు ఉన్న చెట్టుకే ఎక్కువ రాళ్ళు తగులుతాయి కదా!* లోకాన్ని పట్టించుకున్ననాళ్ళూ ఎవరూ ఏమీ చేయలేరు.మనం చేసే పని వల్ల ఈ లోకంలో ఎవరో ఒకరికి మంచి జరుగుతుందని అనిపిస్తే, మనస్సులో సాధించగలననే విశ్వాసం ఉంటే, ప్రపంచమంతా సాధ్యం కాదని తలిచినా ఆ పని చేయడానికి మీరు సాహసించవచ్చు.ఎందుకంటే మీకు సాధ్యం అనిపించినది ఇతరులకు అసాధ్యం అనిపించవచ్చు. ఇతరులకు సాధ్యమైనది మీకు అసాధ్యమనిపించవచ్చు.ఈ ప్రపంచంలో ఎవరి సత్తా వారిది.ఒక లక్ష్య సాధన కన్నా,ఆ లక్ష్యం సాధించడానికి చేసిన కృషి వల్ల, అనేక సందర్భాలలో వచ్చే సంఘర్షణల వల్ల వచ్చే మెచ్యూరిటీయే మనిషిని మహర్షి చేస్తుంది ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

142)జీవితంలో నీ విలువ ఎప్పుడూ నీలోనే ఉంటుంది.దానిని గుర్తించలేని వాడి దగ్గర నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఎందుకూ పనికిరాని వాడివే.కానీ ఎప్పుడైతే నీ విలువని గుర్తించే వ్యక్తి తారసపడతాడో అప్పుడు నిన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు కాబట్టి జీవితంలో ఎదగాలనుకుంటే నువ్వు ఎక్కడ ఎవ్వరితో ఉన్నావనేది ప్రధానం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

143)లోకంలో దొరికినదానితో తృప్తిపడేవారు కొందరు ఇంతకుమించి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు. ఇంకాఇంకా అంటూ వెర్రి
పరుగులు తీసేవారు మరికొందరు.ప్రపంచంలో
వెలకట్టలేని సంపదలు రెండే రెండు.ఒకటి మనశ్శాంతి,రెండు సంతృప్తి ఈ రెండూ కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం.పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి.తిన్నదాని తృప్తి భౌతికం.ఉన్నదానితో తృప్తి మానసికం.అది మనిషి మానసిక పరిణితిపై ఆధారపడి ఉంటుంది. తృప్తి కలిగిన వారి మనసులో ఆనందం,ఆలోచనల్లో ప్రశాంతత, ముఖంలో చెరగని చిరునవ్వు,
పలకరింపులో ప్రేమ ప్రస్ఫుటమవుతాయి కాబట్టి లేని వాటి గురించి బాధపడకుండా.. ఉన్నవాటితో సంతోషించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

144)స్నేహం జీవితాన్నే మార్చేస్తుంది..స్నేహం కొత్త ప్రపంచం ఇస్తుంది..స్నేహం తోడు లేని జీవితం లేదు..స్నేహం చెయ్యని చెలిమి లేదు..స్నేహంతో వెలుగుని జీవనజ్యోతి లేదు..స్నేహం కోరుకొని మనసు లేదు..స్నేహంతో అసాధ్యం కాని స్వప్నం లేదు..స్నేహం స్వార్ధం లేని ఓ బంధం..స్నేహం ఓ స్వచ్ఛమైన వరం..స్నేహం ఓ మధురానుభవం..ఏ కులం,మతం చూడని బంధం ప్రేమైతే అదే స్నేహం..ఒక గొప్ప స్నేహం కడవరకు తోడు లేకపోయిన కలకాలం కనులలో కనుపాపల కదులుతుంది..ఒక గొప్ప స్నేహితుడు నిన్ను కించపరిచిన ఇంకొకరు నిన్ను తక్కువ చేస్తే తట్టుకొడు..ఒక మంచి స్నేహం తో ఉన్న ప్రతి క్షణం విలువైన జ్ఞానం..జీవితంలో ఎందరు స్నేహితులు వస్తుంటారు పోతుంటారు కానీ ఒక గొప్ప స్నేహితుడు ఉన్న కాలం ఎంతైనా అతను నీ జ్ఞాపకాలలో మిగిలిపోతాడు..కాబట్టి అలాంటి స్నేహం దొరికినప్పుడు నీ స్వార్ధం కోసం దానిని ఎప్పుడూ చేజార్చుకోకు...ఇట్లు..మీ..y✍🏻 *రఘురాం*

145)ఒక బంధంలో విడిపోవడం వల్ల కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని విషపూరిత సంబంధాలలో విడిపోవడం మాత్రమే హాయిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సంబంధంలో ప్రేమ కంటే మోసం, బాధ, హింస, అభద్రత ఎక్కువ. అలాంటి బంధంలో ఉంటే రోజూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కానీ మనశ్శాంతి ఉండదు. మీ సంబంధం ఇలాగే ఉంటే అది విషపూరిత సంబంధం, దాని నుంచి దూరంగా ఉండటం బెటర్.మనం ఎంతగానో విశ్వసించే వ్యక్తి మోసం చేసినా వారి మోసం గురించి మీకు తెలిసి మీకు క్షమాపణలు చెప్పి, అదే తప్పును పదే పదే చేస్తే వారికి దూరంగా ఉండాలి. లేకపోతే మీరు చాలా మానసికంగా బాధపడవలసి ఉంటుంది. రిలేషన్ షిప్ లో నిబద్ధత లేకపోతే అలాంటి రిలేషన్ షిప్ లో కొనసాగడం బాధ తప్ప మరేమీ మిగలదు.మనం ఎంతగానో ఇష్టపడే వృత్తిని మన భాగస్వామి గౌరవించనప్పుడు వారి గురించి ఆలోచించాలి. మన భావాలను గౌరవించరు, చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. అలాంటి సంబంధం గురించి జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారితో రిలేషన్ షిప్ కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తే మంచిది.. లేకుంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.చివరగా చెప్పేది ఏంటంటే.. ఏదైనా బంధంలో కలిసి ఉన్నా విడిగా ఉండటం కంటే.. విడిపోయి అప్పుడప్పుడు శ్రేయభిలాషిలా కలుస్తూ హ్యాపీగా ఉండటం ఇద్దరి జీవితాలకు మంచిది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

146)అవసరం నేటి సమాజంలో మనుషుల పరిచయాలు,మనుషుల మధ్య అనుబంధాలు అన్ని అవసరం చుట్టే తిరుగుతున్నాయి.అవసరముంటేనే పలుకరిస్తారు.అనవసరమనుకుంటే చీధరిస్తారు.
అత్యవసరమయితే ప్రాధేయపడుతారు.అవసరం తీరాక మరిచిపోతారు.ఎదుటి వాడి అవసరానికి నువ్వు సాయం చేస్తే వాడి దృష్టిలో మంచివాడివి లేదంటే ముంచటోడివి నీతో ఎంత ఎక్కువ అవసరం ఉంటే అంత గొప్పోడివి ఏ బంధమైన, బంధుత్వమైన నేడు అంతా నీ అవసరం ఉంటేనే నీ దగ్గరకు వస్తారు అవసరాల మీదనే మనిషి బ్రతుకంతా ఆధారపడి ఉంది..కానీ ఇలా ఉంటే ఎదో ఒకరోజు ఒంటరివాళ్ళం అయిపోతాం కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండాలి...ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికి శాశ్వతం కావు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

147)అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఏక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది కానీ అదే ..స్వయంకృషితో వచ్చిన వాడికి చెట్టు ఏక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటి వాడు ఎప్పుడు క్రింద పడతానో అని భయపడుతూ ఉంటే రెండో వాడు పడినా మళ్ళీ ఎక్కగలననే థైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయంకృషికి ఉన్న తేడా! ఈ చిన్న వ్యత్యాసం తెలిసినవాడు విజయాన్ని తన దారికి తొందరగా చేర్చుకోగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

148)సముద్రమంతా నీటితో నింపాలంటే,ముందు ఒక చిన్న నీటి బొట్టుతో ఎలా ప్రారంభం అవ్వాలో...అడవినంతా వృక్షాలతో నింపాలంటే,ముందు ఒక చిన్న విత్తనంతో ఎలా మొదలవ్వాలో..లక్ష్య సాధనలో కూడా విజయం సాధించాలంటే,ముందు ఒక చిన్న ప్రయత్నంతోనే ప్రారంభమవుతుంది... కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా కాస్త ఓర్పుతో నేర్పుతో నువ్వు అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టక ప్రయత్నించు..యత్నం ప్రయత్నం దైవయత్నం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

149)జీవితంలో ఎదురీత తప్పదని తెలిసినప్పుడు..ఎదురుగా నిలబడింది ఎంత పెద్ద సమస్యతేనేంటి ?! ఎదిరించి నిలబడు..ఎదిగేంత దాకా తలబడు..పడగొట్టాలనే పరిస్థితులను నిలబెట్టి నిలదీయాలి కానీ నిరాశతో వెనుదిరిగితే ఎలా?!ఎంతటి సమస్యలైనా ఎదిరించగలను అనే నమ్మకం నీకుంటేనే కదా నువ్వు ఎవరితోనైనా పోరాడగలవు కాబట్టి నీ మీద నమ్మకంతో ముందుకు సాగు విజయం తథ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

150)సృష్టిలో తీయనైనది స్నేహం మాత్రమే ఏ రక్త సంబంధం లేకుండా నీ నుంచి ఏమి ఆశించకుండా చేసేదే స్నేహం.కోపాలు,అలకలు, కేరింతలు ఆలోచనలు,బాధలు పంచుకోవడాలు భాగస్వామి తో చెప్పుకోలేనివి కూడా,ఒక స్నేహితుడితో మాత్రం పంచుకుంటాం.స్నేహితుడు అస్తి పంచి ఇవ్వకపోవచ్చు కానీ దాని కన్నా విలువ అయిన ప్రాణాన్ని మన ప్రాణం కోసం అడ్డు వేస్తారు.వంద మంది రా "బంధువుల" కన్న ఒక ప్రాణ స్నేహితుడి చాలు సప్త సముద్రాలు దాటే అంతా ధైర్యం కలిగిస్తారు..అలాంటి స్నేహం పొందినప్పుడు ఎప్పుడూ చేజార్చుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

151)బంధమైన, బంధుత్వాలయినా, స్నేహమైనా... మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవడం చాలా కష్టం, దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహం, బంధం పదిలంగా ఉండాలంటే... మన మాట తీరే ముఖ్యం. ఎదుటివారి మనసు గాయపడేట్టు మాట్లాడితే.. స్నేహితులైనా, బంధువులైనా విరోధులవుతారు. మంచి మనస్సుకు, మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది కాబట్టి అహంకారంతో మాట్లాడి స్నేహాన్ని బంధాన్ని వదులుకోకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

152)స్నేహాలు బంధాలు గాజు బొమ్మలా కాపాడుకుంటూ రావాలి.ఈ రెండూ మధ్యలో తెగిపోతే కలుపుకోవాల్సిన బాధ్యత మీదే. చుట్టూ నలుగురు బంధువులు,నలుగురు స్నేహితులు లేని జీవితం వృధా.ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది..నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది..ఎలా అనుకోవాలన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది...కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు,మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు.అలాంటి వారిని దూరంగానే ఉంచండి.మీ దగ్గర ఏమీలేనినాడు ఎవరూ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మ బంధువులు.మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్లి నిలబడగలగాలి అప్పుడే అది నిజమైన బంధం,స్నేహం అని అర్థం. బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చక్కర్లేదు,కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు.మీరు విలువైన వ్యక్తిగా ఎదుగుతారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

153)గొప్పగా బ్రతకటం అంటే గొప్పలు చెప్పుకుని బ్రతకటం కాదు..గొప్ప పనులు చెయ్యటం. నలుగురి చేత చేయించటం.నలుగురు నీ గురించి మాట్లాడుకోవాలి అంటే.....నీ వెనక నలభై మంది ఉండాల్సిన అవసరం లేదు.నీ ముందు ఒకే ఒక్క గొప్ప ఆశయం ఉంటే చాలు.అదే నిన్ను నడిపిస్తుంది.నీ వెనక నలభై మంది నడిచేలా చేస్తుంది కాబట్టి ఆశయం కోసం కష్టపడి ఇష్టపడి మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని ఏది ఆపలేదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

154)పరాజయం పదేపదే పలకరిస్తున్నప్పుడు గతంలోని గెలుపు శాతం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు.ఉరకలెత్తే ఉత్సాహానికి కొంత విరామమివ్వాలి.ఆలోచనలో కానీ ఆచరణలో కానీ ఎక్కడ తప్పయ్యిందో తెలుసుకోవడానికి ఆత్మ విమర్శ చేసుకోవాలి.మనల్ని మనం తెరిచి చూసుకోవడం వల్ల బలహీనతలే కాదు,అంతర్గతంగా దాగివున్న బలాలను మరొక్కసారి సమీక్ష చేసుకున్నట్లు అవుతుంది.ఏ రంగంలో అయినా ఆత్మవిమర్శ ప్రయోజనకారిగానే ఉంటుంది.అనుకున్న విజయాన్ని సాధించడంలో సమయం,ఓర్పు,నేర్పు కీలక పాత్ర వహిస్తుంది.ఆశయ సాధనకు ప్రణాళిక రచించగానే అద్భుతాలు జరిగిపోవాలను కోకూడదు.విత్తనం నాటగానే అది చెట్టు అవ్వడానికి మలమల మాడ్చే ఎండకు తలవంచి నిలుస్తుంది.ఏటి ఒడ్డున పెరిగే గరికపోచలు ప్రవాహ ఉద్ధృతిలో ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి.నీటి వాలుకు వీలుగా నిలిచి సమయానుకూలత లభించగానే సరైనక్రమంలో ఎదుగుతాయి..పరాజయం ప్రవాహ ఉద్ధృతిలా పెకలించబోతున్నప్పుడు స్థిరంగా నిలిచేందుకు ప్రయత్నించాలి తప్పించి మొండిగా ప్రవర్తించి ఉనికినే కోల్పోకూడదు.గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా మొక్కవోని దీక్షతో నెరవేర్చుకోవాలనుకున్న లక్ష్యంపై ద్యాస ఉన్నోడికి విజయం తధ్యం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

155)అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు.ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు.ఆ సమయంలో స్థితప్రజ్ఞ అవసరం అవుతుంది.అనుకున్నది సాధించే విషయంలో పట్టువిడుపులను ప్రదర్శించడం గొప్ప నేర్పరితనం. పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలు అన్నాడు వేమన. అందుచేత ఆ విడుపును తాత్కాలికం చేసి విజయానికి ఉపయోగపడే విధంగా మలచుకోవాలి కాబట్టి ఎక్కడో తగ్గాలో ఎక్కడో నెగ్గాలో తెలుసుకున్నోడికి విజయం సాధించడానికి సమయం పట్టినా ఎప్పటికైనా అనుకున్నది నెరేవేర్చుకోగలడు దానికి కావాల్సింది కొద్దిగా ఓర్పు నేర్పు ప్రదర్శించడం వల్ల విజయం తధ్యం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

156)నువ్వు ఆకలితో కాళ్లను డొక్కలోకి ముడుచుకొని పడుకున్నా పట్టించుకునే నాథుడుండడు కానీ నువ్వు విజయ శిఖరాన్ని చేరినప్పుడు అంతా జేజేలు పలుకుతారు. ఆకాశానికి ఎత్తేస్తారు.ఈ ప్రపంచానికి కావాల్సింది అలాంటి సిసలైన విజేతలే.అలా ఎదగడానికి నేపథ్యం ఎలాంటిదైనా ఫర్వాలేదని నిరూపించడానికి చాలా మంది మన చుట్టూ ఉన్నారు వారిని ఆదర్శం తీసుకుని ముందుకు సాగినరోజు నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

157)నీ కన్నీళ్ళతో కష్టాన్ని పెద్దది చేస్తే ఎలా?!నీ కష్టాన్ని నమ్ముకొని ఆ కన్నీళ్ళను కనుమరుగు చేయాలి కానీ బాధపడుతూ కూర్చుంటే నీ బ్రతుకు మారుతుందా?!నీపిచ్చి కాకపోతే...ఓర్పుతో ధైర్యంగా ఉంటే..దారి అదే కనబడుతుంది...!! బాధపడకు.!!

158)ప్రతి గమ్యానికి దారి ఉంటుంది కాని కొన్నిదారులు పూల దారులు,కొన్ని ముళ్ళ బాటలు..ఆ బాటల్లో కష్టం ఉన్నా ఫలితం ఉంటుంది..ఆ ముళ్ళ బాట తీరు తట్టలు తట్టలుగా రాళ్ళు ఒదిగి ఉండవచ్చు,గుట్టలు గుట్టలుగా ముళ్ళు పొదిగి ఉండవచ్చు..రాళ్ళు ముళ్ళు కాదు ముఖ్యం గమ్యం కదా ప్రధానం.ఎదురు దెబ్బ తగిలిందని వెనుకకు రాబోకు..ముళ్ళు దిగిందని ముందుకు పోవడం ఆపకు..మన చెడు కోరుకునే వారు మన వెనుకనే ఉంటారు..మన ప్రయత్నానికి ముప్పు చేస్తారు..అలాంటప్పుడు తప్పదు పోరు..కష్టించి గమ్యానికి చేరు పూల దారిలో చేరిన గమ్యం ఆ పూటకే గుర్తు!!అదే ముళ్ళ దారిలో చేరిన గమ్యం మూడు దశాబ్దాలకి చిరునామా!..కాబట్టి గమ్యాన్ని చేరాలంటే "కష్టే ఫలి"...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

159)మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు..అది ఎంత మందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం మంచిపని చేసేటప్పుడు మనం కనబడాల్సిన అవసరంలేదు..కాబట్టి ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా చేయి నువ్వు అనుకున్నది ఆ దేవుడే నీకు అందేలా చూస్తాడు..ఇది నేను నచ్చే మెచ్చే ఆచరించే సూత్రం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

160)అవసరాన్ని బట్టే..మనుషులు.ఎప్పుడైతే వాళ్ళ అవసరం తీరిపోతుందో..మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండటానికి ప్రయత్నించు ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికి శాశ్వతం కాలేవు..The most selfish livingbeing on earth is only one...HUMAN..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

161)అవసరం తీరిపోయాక నిన్ను వదిలివెళ్ళే స్నేహితులు...సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు...డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం...ఇలాంటివారితో జీవించే బదులు ఎవ్వరు లేరని సంతోషంగా జీవించడం ఎంతో మేలు...ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి స్వార్ధం వారిది వాళ్ళ సమస్యలు తీరితే చాలు పక్క వాడి సమస్యలు కంటికి ఆనవు ఇలా చేసుకుంటూ పోతే నిజంగా ఇంకోసారి అవసరం అయితే దేవుడు కూడా సహాయం చేయడానికి నిరాకరిస్తాడు కాబట్టి కొంచెం స్వార్ధాన్ని వీడితే మంచిది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

162)ప్రపంచంలో 70% మంది " భగవంతుడు నా తలరాతను ఇలగే వ్రాసాడు. నాకు అదృష్టంలేదు.నాకు సృజనాత్మకత లేదు " అనుకుంటారు. వారి నెగిటివ్ (ప్రతికూల) ఆలోచనలే వారిని వెనక్కి నెట్టేస్తుంటాయి.మీరు దేనినైనా విశాలదృక్పథంతో అర్ధం చేసుకుంటే దాని పట్ల మీ భావాలను మార్చుకోగలరు.ఒక లక్ష్యంతో కృషిచేస్తే ప్రతివ్యక్తికీ నేడు కాకపోతే రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

163)కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది..మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిరస్థానాన్ని నిలుపుకుంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

164)మాట పడని అహం మనసుని కమ్మేస్తే..ఎంతటి ప్రేమైనా తుచ్చంగా కనపడుతుంది.మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏ భావాన్నైనా సరే ఆచి తూచి మనసు దాకా అవసరం అనిపిస్తేనే తీసుకువెళ్లండి.మనిషి సముద్రంలా ఉండాలి ఎందుకంటే లోపల ఎంత అలజడి ఉన్న పైకి ప్రశాతంగా ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే మనలో వుండే ఏ అంతరంగ మధనం అయినా సరే..బయటకు నెట్టివేసి మనసుని స్వచ్చంగా ఉంచుకుంటేనే..జీవితాన్ని నిండుగా ఆయుషు ఉన్నంత కాలం హాయిగా ఆస్వాదించగలం..అని నా అభిప్రాయం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

165)అవసరం అయినపుడు తోడుగా ఉండే వాళ్ళు నీ వాళ్ళు..అవసరాల కోసమే తోడుగా ఉన్నట్టు నటించే వాళ్ళు తోడేళ్ళు..!అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు..అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

166)జీవితంలో కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు అలా కాదని నాకే తెలుసు నాకేం పట్టింది అనే అహం నీలో చేరితే  సమాజంతో పాటు అందరు నిన్ను పెడుతారు..నీకు ఎంత ఆస్తి ఉన్నది ముఖ్యం కాదు నీవు ఎంతమంది మనుషుల్లో ఉన్నావు అన్నదే గొప్ప కాబట్టి ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

167)ప్రతీ మనిషి గెలవటానికి మాత్రమే పుడతాడు.కొందరు ప్రయత్నించిన మొదటి దశలోనే గెలుస్తారు. కొందరు మొదట్లో ఓడినా తర్వాత తప్పకుండా గెలుస్తారు.నిజానికి ఓటమి కూడా ఒక గెలుపే.ఓటమి నీ గెలుపుకి మొదటి మెట్టు.ఓడిపోయావని ఎప్పుడూ బాధపడకు.నీ ప్రతీ ప్రయత్నంలో నీకు నీడలా తోడులా నువ్వు దృడంగా నిలబడడానికి ఒకరు తప్పకుండా నీకు తోడుంటారు..అలాంటి వారిని ఎప్పుడూ విస్మరించకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

168)ఒక మనిషి జీవితంలో పైకి ఎదగాలంటే వారిపై వారికి నమ్మకం ఉండాలి.అప్పుడే విజయం సొంతమవుతుంది కానీ నేటి సమాజంలో ఎక్కువ మంది చేసే అతిపెద్ద తప్పు..ఇతరులను నమ్మడం.ఎవరో వస్తారు..ఏదో చేస్తారు అని ఎదురుచూస్తూ ఉంటారు.మనవాడే..నాకు ఏదో ఒకటి చేస్తాడులేనని ఆశ అందరికీ కానీ ఇది అసలైన తప్పు.ఎందుకంటే ఎవరైనా వారి ఎదుగుదలకు మిమ్మల్ని వాడుకుంటారు.మీకు పని చేసి పెట్టడం అనేది చాలా అరుదు.అందుకే అవకాశాల కోసం ఎదురుచూడకూడదు.అవకాశాలను సృష్టించుకోవాలి. గొప్ప గొప్ప వాళ్లంతా తమ దగ్గర పని చేయించుకునే వాళ్ల మైండ్ సెట్ అలానే ట్యూన్ చేస్తారు.వారి విజయం కోసం మిమ్మల్ని వాడుకుంటారు.ఆ విషయం అర్థమయ్యేలోపు జీవితం అయిపోతుంది.అందుకే మీపై మీకు నమ్మకం ఉండాలి.ఎవరు ఏం చేయరు మీ కోసం అని గుర్తించాలి.మీకోసం మీరు పోరాడాలి..మీ గెలుపు కోసం మీరే నిలబడాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

169)జీవితంలో భయపడుతూ కూర్చుంటే బతకలేవు.. తప్పో..ఓప్పో ముందు చేసి చూడు..గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది..ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.ఆడేమనుకుంటాడో..ఈడేమను కుంటాడో కాదు..నువ్వేమనుకుంటున్నావో అది చేసేయ్..నిన్ను అన్నోడెవడూ నీ కష్టం వస్తే నీకు సాయం చేయరు..ఇష్టమో.. కష్టమో.. నష్టమో..ఏదైనా నీకు అనుభవాన్నిస్తుంది..జీవితంలో విజయం సాధించాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకో.. తర్వాత ప్రకృతే నీకు సాయం చేస్తుంది.నువ్వు ముందుకు వెళ్లేందుకు నీకు దారి చూపిస్తుంది.. విజయపు వెలుగులు నీకు కనిపించేలా చేస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

170)జీవితంలో సాధ్యంకాని పని అంటూ ఏది ఉండదు. నువ్ ప్రారంభించడమే అసలు పని. ఆ తర్వాత విజయం వైపు నీ అడుగులు పడతాయి. కేవలం నమ్మకం అనే పునాది మీద కష్టంతో ముందుకు వెళ్లాలి. మీ మీద మీకు అనుమానం ఉంటే జీవితంలో ఏదీ సాధించలేరు. ముందుగా మిమ్మల్ని మీరు గెలవాలి.'నన్ను నేను నమ్ముకున్న ప్రతీసారి విజయం వరించేది..ఒకరిపై ఆధారపడిన ప్రతీసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది.. చివరకు అర్థమైంది.. స్వశక్తిని మించిన ఆస్తి లేదు అని.'..ఇది నా అభిప్రాయం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

171)జీవితంలో భయంతో చేసే ఏ పనైనా మంచి ఫలితం ఇవ్వదు. తెలివితో చేసే ఏ పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. మనల్ని మనం నమ్ముకున్న ప్రతీసారి విజయం మనకే దక్కుతుంది. అదే ఇతరులను నమ్ముకుంటే నిరాశే ఎదురవుతుంది. ఇప్పుడు ఎవరికోసమో నువ్ వృథా చేసే ప్రతీ నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.మీరు ఉదాహరణకు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ..ఏదో సాధించాలి అనుకుంటారు. కానీ కంపెనీ మాత్రం మీరు అక్కడే పని చేసేలా మీ ఆలోచనను ఆపేస్తుంది. అందుకే కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. దీనికి మీపై మీకు నమ్మకం, ధైర్యం ఉండాలి.అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు.మీరు ఏదైనా చేసే ముందు దాదాపుగా అందరూ నవ్వుతారు...తర్వాత వెక్కిరిస్తారు..గెలిచాక వాళ్లే నిన్ను ఫాలో అవుతారు కాబట్టి మీలో ఉన్న భయాన్నీ పారద్రోలి మీ మీద మీకున్న నమ్మకంతో ముందుకు సాగినరోజు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

172)జీవితంలో బ్రతకడం కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి ఒక గొంగళిపురుగులా కనిపిస్తుంది..చిరాకు పుట్టిస్తుంది..చనిపోవాలి అనిపిస్తుంది..కానీ కాస్త ఓపికతో సహనంతో వుంటే మన జీవితం గొంగళిపురుగు నుండి అందమైన సీతాకోకచిలుకలా మారుతుంది..మనిషి మారడానికి..మార్చడానికి ఏ దేవుడో రానవసరం లేద..ఒకటి మాత్రం నిజం..కాలం పరీక్షిస్తుంది..కాస్త ఓపిక పడితే ఆ కాలమే మనకి దారి చూపెడుతుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

173)జీవితంలో సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం.అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు.మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది.దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి.దేని గురించి ఎంత మాట్లాడాలో అంత వరకే మాట్లాడాలి.మనకు అవగాహన లేని అంశాలపై చర్చించ కూడదు.స్పందించాల్సిన సందర్భం కాని చోట మేధావి మౌనంగా ఉంటాడు.మనసులో యోచన,మాటలో సూచన క్రియలో దక్షత-ఈ మూడు లక్షణాలు ఏకమైనప్పుడే మన విలువేంటో బయటపడుతుంది కాబట్టి సమయానికి సందర్భానికి తగినట్లు పొందికగా విజ్ఞతగా మాట్లాడాలి అప్పుడే మనకు విలువ..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

174)మోసపోయిన పరవాలేదు కానీ..మోసం చెయ్యడం చాలా పెద్ద తప్పు..మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో..శిక్ష తప్పకుండ పడుతుంది కాబట్టి నువ్వు మోసపోయావాని ఎప్పుడూ దిగులు చెందకు..కర్మ నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

175)జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారు తుంది.జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి.ఏం కావాలో, ఎటు వెళ్ళాలో,ఏం చేయాలో...వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి.గమ్యం చేరడానికి ఒక పథకం తయారుచేసుకోవాలి.మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం ఉంటుంది. కొందరికి డబ్బు గురించి, మరికొందరికి కీర్తి గురించి,ఇంకొందరికి భౌతిక సుఖాల గురించి తపన ఉంటుంది. ఏది అవసరం,ఏది మంచి,ఏది శాశ్వతం అని తెలుసుకుని దాన్ని తమ లక్ష్యంగా పెట్టుకునేవారు చాలా కొద్దిగా,అరుదుగా కనిపిస్తారు.ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే చాలదు.అది ఎలాగైనా పొందాలన్న కోరిక లేదా ఆకాంక్ష, పట్టుదల,ఏకాగ్రత లాంటివి పోగు చేసుకోవాలి.మనసా వాచా కర్మణా ఆ లక్ష్యం అందిపుచ్చుకొనే వరకు నిద్రాహారాలు సవ్యంగా లేకపోయినా అధైర్యపడ కూడదు.అర్ధాంతరంగా వదిలిపెట్టకూడదు.కార్యసాధనపై మనసు పూర్తిగా లగ్నం అయితే- చిన్నాచితకా ఆటంకాలు, కాస్తో కూస్తో అసౌకర్యాలు ఇబ్బంది పెట్టవు.దృష్టితోపాటు మనసును దిటవుపరచుకుంటే లక్ష్యసాధన నల్లేరుమీద బండిలా,చకచకా సాగి నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

176)'కెరటం నాకు ఆదర్శం. లేచి పడినందుకు కాదు. పడి మళ్ళీ లేస్తున్నందుకు' అన్న వివేకానందుడి మాటలు నమ్మకానికి పెట్టుబడిలాంటివి.నీ మీద నీకున్న నమ్మకమే నీకు వెయ్యి ఏనుగుల బలమని మరచిపోకూడదు.లోకంలో ఏదీ తనంతట తాను వచ్చి చేరదు.ఒకింత ప్రయత్నం, మరికొంత నమ్మకం అవసరం.కార్యసాధనలో ఎప్పుడూ ఆటంకాలు ఉంటాయి.తడబడినా తట్టుకుని నిలబడాలి. తప్పటడుగు వేసినా సరిదిద్దుకోవాలి.మళ్ళీ లేవగలననే చిగురంత నమ్మకం వల్ల విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి నీ నమ్మకమే నీ జీవితానికి పునాది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

177)జీవితంలో ఏదైనా సాధించడానికి పదిశాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ ఉంటుందని చిన్నప్పుడు వైన్ ఉంటాం.ప్రేరణలో నమ్మకమూ పరిశ్రమలో మేధస్సు అంతర్భూతమై ఉంటాయి..అలాగే మనం ఓడిపోవడానికి కూడదు. నమ్మకాన్ని కోల్పోకూడదు. భయాన్ని బంధిస్తే ధైర్యానికి దారి దొరుకుతుంది.గొప్ప కార్యాలు సాధించడానికి సమయం పడుతుంది.ఒక్కసారి నమ్మకం సడలిందంటే భయం ఆవరిస్తుంది.ఆ భయం మన లక్ష్యాన్ని మింగేస్తుంది. మన మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చు.నమ్మకం చుట్టూ అచంచలమైన ధైర్యం ఉండాలి.సాగరమంత సహనం అవసరం. లక్ష్యసాధనకు తొలిమెట్టూ చివరి మెట్టూ నమ్మకమే అని ఎప్పుడూ మరిచిపో కూడదు..కాబట్టి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు భయంతో కాకుండా నీ మీద మీకున్న నమ్మకంతో మొదెలెట్టు నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

178)ఓర్పులేని మనిషి నూనె లేని దీపం వంటివాడు. దీపం వెలగడానికి నూనె ఎంత అవసరమో మనిషి ఎదుగుదల కు ఓర్పు అంత అవసరం. రాయిని చెక్కితే శిల్పంగా మారుతుంది, అద్దాన్ని చెక్కితే ముక్కలవుతుంది. ఓర్పు లేకపోతే ప్రతి చిన్న దెబ్బకి చతికిలాపడిపోతావు..కష్టాలు వస్తే కన్నీళ్లు కాదు రావలసింది, ఆలోచన రావాలి.ఆ కష్టాన్ని అదిగమించే మనోధైర్యం రావాలి..మనం ప్రారంభాన్ని సరిగ్గా ఆరంభిస్తే ఫలితం దానంతట అదే సరిగ్గా వస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

179)చెప్పడానికి రెండక్షరాలే...కానీ.. ఆ రెండక్షరాలలోనే ప్రపంచం లోని ప్రేమనంతా నింపుకున్న రూపం *అమ్మ*...చూడటానికి తను ఒక మనిషే...కానీ..మనుషుల్లో దేవతా మూర్తి అయ్యి వరాల మూట పంచే రూపం *అమ్మ*...పిలవడానికి అదీ ఒక పిలుపే...కానీ..పిలిచిన వెంటనే పలికే పరుగున వచ్చే అవసరాలు తీర్చే కరుణరూపం *అమ్మ*.... ఆలోచించడానికి తను ఒక వ్యక్తి...కానీ..తన ప్రతీ ఆలోచనల్లో, కలలోకూడా నీ సుఖం కోరుకునే కల్పవల్లి రూపం *అమ్మ*..నీకు రెక్కలొచ్చాక తను నీకు భారం..కానీ..తన రెక్కల కష్టంమీద నిన్ను పెంచిపెద్దచేసిన బాధ్యత రూపం *అమ్మ*..నీకోసం తపించి,నీ ఆనందం తన అనందంగా,నీ భాద తన బాధగా, నిన్ను ఎప్పటికి చిన్ని పాపల చూసుకుని మురిసిపోయి మదురాతి మధురం *అమ్మ*...ప్రపంచంలో ఉన్న తల్లులందరికి *మాతృదినోత్సవ శుభాకాంక్షలు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

180)నమ్మకం ఒకరి మీద పెట్టుకుంటేఅది మన బలహీనతవుతుంది నమ్మకం మనమీద మనం పెట్టుకుంటే అది మనకు బలమవుతుంది.నడి సముద్రంలో చిక్కుకున్న వారికి ఎవరోవచ్చి ఒడ్డుకు చేరుస్తారని అనుకోవడం మన బలహీనత...చేతికందిన చెక్కముక్కతో ఒడ్డుకు చేరాలనుకోవడం మన బలం కాబట్టి నీ బలంబలహీనతల్ని అర్ధం చేసుకొని ముందుకు సాగినరోజు నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

181)జీవితంలో ఒక్క మంచి పని కూడా చెయ్యని వారు ఎవరైనా ఉంటారేమో కాని ఒక్క చెడ్డ పని కూడా చెయ్యని వారు ఎవ్వరూ ఉండరు.ప్రతి మనిషీ ప్రతి రోజూ తాను చేసే ప్రతీ పనిని విశ్లేషించుకోగలిగితే, తన అనుభవం నుంచే ఏది మంచో ఏది చెడో నేర్చుకోగలడు.మంచిని నీకన్నా చిన్నవాడు చెప్పినా, చేసినా అంగీకరించాలి,అభినందించాలి, అనుసరించాలి. చెడుని నీకన్నా పెద్దవాడు చెప్పినా,చేసినా అడ్డుకోవాలి, ఆపాలి.నువ్వు సమాజానికి మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు కూడా సమాజంలో ఒక భాగం కనుక నా దృష్టిలో సాటి మనిషికి ప్రత్యక్షంగా కాని,పరోక్షంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ హాని చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా జీవించ కలిగినప్పుడే నీ జన్మసార్ధకం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

182)విమర్శ అనేది రెండంచులు ఉన్న కత్తి. అది మనసుని గాయపరచ గలదు.అలాగే మనలో కొత్త ఉత్తేజానికి ప్రాణం పోయ గలదు.విమర్శ కేవలం కఠిన మైన పదాల సమాహారం కాదు.విమర్శ మనలో పరివర్తనకు ఉత్ప్రేరకం.పురోగతికి కారకం.వృద్ధికి, మన సామర్థ్యానికి ఒక నిదర్శనం.ప్రతి విమర్శతో, మనం గతంలో కంటే బలంగా,తెలివిగా మారగలము. నిజమైన గొప్పతనం అనేది విమర్శలకు దూరంగా ఉండటం లో కాదు,దానిని స్వీకరించడంలో ఉంది, ప్రతికూల పరిస్థితులు లోనే మన నిజమైన బలం వెల్లడవుతుంది.విమర్శ మన శత్రువు కాదు. మారు వేషం లో ఉన్న గురువు.మన లోపాలును,మనం పట్టించుకోని నిజాలను ప్రతి బిబించే అద్దం.ఒక శిల్పి ఒక కళాఖండాన్ని మలచినట్లు, విమర్శ మనల్ని అద్భుతమైన వ్యక్తులు గా తీర్చిదిద్దుతుంది.విమర్శలను స్వీకరించడానికి ధైర్యం అవసరం. వాటిని ఖండించడం కాకుండా,మన ఆలోచనలను ముందుకు నడిపించే సారధిగా,మన వృద్ధికి, పురోభివృద్ధికి అవకాశాలు కల్పించే వారధిగా చూడాలి అప్పుడే మనం జీవితంలో ఎదగగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

183)జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు.ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు.మరణాన్ని అయిన ఎదిరించి నిలబడు కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మ గౌరవాన్ని కించపరచ కోకు...ఉన్నది ఒక్కటే జీవితం నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోకు..కాబట్టి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో...ఎవరికోసం కూడా నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడం కానీ..కోల్పోవడం కానీ చేసుకోకు.ఆత్మగౌరవాన్ని కోల్పోవడం అంటే మన మీద మనకున్న గౌరవం..నమ్మకం కోల్పోవడం.అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది.అయినా మన మీద మనకే గౌరవం లేకుంటే ఇంకా పక్కన వాళ్ళకి ఎం ఉంటుంది మనమీద గౌరవం.."Never loose your Identy and Self-respect for the sakeof anyone at any cost"....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

184)ఎక్కడో వీచే గాలి ఒక రోజు మన శ్వాస పెంచే గాలిగా మారుతుంది...ఎక్కడో దూరంగా ఉన్న మేఘం ఒక రోజు మనం త్రాగే నీరుగా మారుతుంది..అలాగే మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం జీవిస్తున్న ఈ జీవితం మనకి తెలుసో లేక తెలియకో కొన్ని సమయాల్లో కొంతమంది జీవితాల్ని మారుస్తుంది..జీవితంలో విశేషం ఏంటంటే మనం అనుకుంటే అనుకున్న సమయానికి అనుకున్నది మార్చుకోవచ్చు..తప్పు చేయడానికి లైఫ్ ఎలా ఛాన్స్ ఇస్తుందో..అది సరిచేయడానికి ఛాన్స్ ఇస్తుంది..గట్టిగా పట్టుకోవాలి..పట్టుకుంటే సంతోషంగా జీవించవచ్చు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

185)బంధమైన, బంధుత్వాలయినా, స్నేహమైనా..మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు,ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవడం చాలా కష్టం, దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.స్నేహం,బంధం పదిలంగా ఉండాలంటే...మన మాట తీరే ముఖ్యం.ఎదుటివారి మనసు గాయపడేట్టు మాట్లాడితే.. స్నేహితులైనా,బంధువులైనా విరోధులవుతారు.మంచి మనస్సుకు,మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది.కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు, మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు. అలాంటి వారిని దూరంగానే ఉంచండి.మీ దగ్గర ఏమీలేనినాడు ఎవరూ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మ బంధువులు.మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్లి మీరే నిలబడాలి. అప్పుడే నీది నిజమైన బంధం, స్నేహం అని అర్థం.బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చక్కర్లేదు, కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు.మీరు విలువైన వ్యక్తిగా ఎదుగుతారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

186)యస్మిన్ యథా వర్తతే యో మనుష్యహః తస్మిం తథా వర్థివ్యం స ధర్మః !!!

గీతానుశారం

కొంతమంది వ్యక్తులు మన పట్ల మంచిగా ఉంటే వాళ్ళ పట్ల మంచిగా ఉండటం..అదే వ్యక్తులు మన పట్ల చెడుగా ఉంటే అంతే చెడుగా మనం సమాధానం చెప్పడం..ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలానే ప్రవర్తించు...అదే ధర్మం...*సేకరణ భగవద్గిత*

187)నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందు కంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటి వారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు..నిజమైన వ్యక్తిత్వంతో జీవించు..అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

188)ఈ ప్రపంచం గెలిచినవారి ఎదుగుదలనే చూస్తుంది కానీ ఆ గెలుపుకు గల కారణాన్ని, దాని వెనుక ఉన్న కష్టాన్ని కాదు ఏలాగంటే అంతటి ఆకాశంలో రాత్రి పూట మెరిసేటి చంద్రుని వైపు మాత్రమే అందరూ చూస్తారు, కాని అది అంతలా మెరావటానికి నల్లగా మారిన ఆకాశాన్ని గురించి ఎవరు మాట్లాడుకోరు ఎందుకు అంటే ఈ ప్రపంచం అంతా కూడా విజయాన్ని(గుర్తింపును) మాత్రమే చూస్తుంది కానీ వారి వెనుక ఉన్న ఆకాశంలాంటీ కష్టాన్ని చూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

189)మనిషి ఆశాజీవి.మంచి భవిష్యత్తుకోసం ఎన్నో కలలు కనడం సహజం.కఠినమైన పరిశ్రమ చేసినా ఒక్కొక్కసారి ఫలితం వ్యతిరేకంగా వస్తుంది.ఆందోళన,మానసిక ఒత్తిడి ఎక్కువై తీవ్ర నిరాశకు లోనుకాకుండా, బాధ్యతను మరిచిపోకుండా ధైర్యం వహించి,ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి, తిరిగి పొందేవారే ధీరులు.శిశిరంలో ఆకులు రాలినప్పుడు చెట్టు మోడులా మారుతుంది. పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపజేస్తుంది.ఎండిన వృక్షం సైతం తాను కోల్పోయిన జీవాన్ని తన మోడు మీదే తిరిగి మొలకెత్తే మొక్కకు అందిస్తుంది. జీవిత గమనం కూడా పాతను పోగొట్టుకుంటూ,కొత్తవి సంతరించుకుంటూ సాగుతుంది.పోగొట్టుకున్న చోటే ఆనందం తిరిగి ఆవిర్భవించేలా ప్రయత్నం సాగించాలి అప్పుడే నీకు విజయం తధ్యం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

190)పరిస్థితులకు సర్దుకొనిపోతే తమను తాము తగ్గించుకున్నట్లేనన్న అపోహ చాలామందిలో ఉంది.అనవసరమైన 'అలకలకు' పోతే చివరకు నష్టపోయేది మనమే! ఏటిలో తోటిజీవులతో పడటం లేదని, చేప అలిగి ఒడ్డుపైకెళితే ఒరిగేదేముంటుంది?పైగా ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. ఓపికతో మన వంతు వచ్చే వరకు వేచిచూసి, మన ఉనికిని చాటుకోవటం వేరు..ఒకింత అసహనంతో ఏటికి ఎదురీది మొదటికే మోసం కొనితెచ్చుకోవటం వేరు. జీవితం రంగులరాట్నం లాంటిది; ఒకసారి ఒక కుర్చీపైనుంటే, మరోసారి మరోకుర్చీ పైనుంటుంది.స్థానమేదైనా సర్దుకుపోతేనే జీవనచక్రం సాఫీగా సాగిపోతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

191)జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న ఉత్సాహం ఉన్నవారికి రోజులో ఖాళీ సమయమే దొరకదు. విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు...మీకు జీవితంలో విలువైనదిగా భావించేది, మిమ్మల్ని సంతోషపరిచేది సాధించాలి. అప్పుడే మీరు నిజమైన విజేతలు.మీకు జీవితంలో సాధించేందుకు ఏదీ లేదంటే అర్థం... మీరు బద్దకస్తులని. వారికి ఎదుగూ బొదుగూ ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేట్టుగా ఉంటుంది వీరి జీవితం.విజయానికి... అపజయానికి చాలా చిన్న తేడానే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు అందుకుని పైకి ఎగబాకేవాడు విజేత అవుతాడు. అవకాశం వచ్చినా పట్టించుకోకుండా బద్దకంగా కూర్చునే వాడు అపజయం పొందినట్టే లెక్క. మీరు రోజులో ఎక్కువ సేపు ఖాళీగా కూర్చుంటే మీకు జీవితంలో ఎదురయ్యేది అపజయమేనని ఫిక్స్ అయిపోండి. కాబట్టి మిమ్మల్ని మీరు బిజీగా మార్చుకోండి. ఏదో ఒక పని చేస్తూనే ఉండండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

192)నువ్వు జీవితంలో ఎప్పుడూ వైఫల్యాన్ని చూడలేదంటే, నీ లక్ష్యాలు అంత గొప్పవి కాదని అర్ధం. నీకు ఎన్నడూ సవాళ్లు ఎదురు కాలేదంటే నువ్వు అసలు లక్ష్య సాధనకు ప్రయత్నమే చేయలేదని అర్ధం. వైఫల్యాలు మన వృద్ధికి ఇంధనంగా పనిచేస్తాయి.సవాళ్ళు మన నైపుణ్యాలనుvసానబెడతాయి.ప్రయోగించినప్పుడే ఆయుధం ఎంత శక్తిమంతమైనదో తెలుస్తుంది. ఉపయోగించినప్పుడే నీ సామర్థ్యాల సత్తా ఏంటో అర్థమవుతుంది కాబట్టి కష్టం వచ్చిందని కుమిలిపోకుండా ఓర్పు నేర్పుతో ఎలా ముందుకు వెళ్ళాలో తెల్సుకుని అడుగు వేస్తే నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

193)కోపం...రెండక్షరాల చిన్న పదం కానీ ఒక జీవితాన్ని నాశనం చేయడానికి అదే మూలం.కోపం అనేది ఎదుటివారి జీవితాన్నే కాదు,మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కోపాన్ని ఆయుధంలా కాదు, ఆలోచనగా మార్చుకోవాలి.కోపమే అన్ని అనర్థాలకు మూలం. కోపమే బంధాలను విడదీస్తుంది. స్నేహాన్ని చిదిమేస్తుంది. జీవితాలను నాశనం చేస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మీ జీవితం పూలవనమే కాబట్టి కోపాన్ని ఎంత నియంత్రణలో ఉంచుకుంటే...మీతో పాటు సమాజం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

194)తలవంచే సమయం కాదు...లొంగివుంటే జీవితం లేదు..కలలు కంటే సరిపోదు..జీవితం మారిపోదు..మార్పు అన్నది మీతోనే జరగాలి...లేచి నడుము బిగించు..నడుము వంచి కష్టపడు.. ఎవ్వరూ నిన్ను ఉద్దరించరు..ఎవ్వరూ నిన్ను ఆదుకోరూ..నీకు నువ్వే లేకపోతే అసలు లెక్క చేయరు.నిలబడు నీకోసం..తలబడు పక్కవాడి కోసం..కష్టపడు నువ్వు అనుకున్న మార్పు కోసం..నువ్వు పుట్టిన ఈ నేల మీద పోయేటప్పుడు నీ పేరు నువ్వు రాసుకోపో...నీకు నువ్వు తోడైతే సాదించలేనీదేదీ ఉండదని తెలుసుకో..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

195)పరిస్థితులు వింతగా, విచిత్రంగా మారిపోతుంటాయి.కొన్నిసార్లు పరిస్థితులు ఎదురు తిరిగినా, ఎవరి ఆత్మశక్తి వాళ్లను తప్పక కాపాడుతుంది.బలం బయట ఉండదు మన లోపలే ఉంటుంది. ఆలోచన, శక్తిపుంజుకొనే కొద్దీ ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది.పరిస్థితులు వాటికవి రూపు దాల్చవు.ఎక్కడో మనం పెట్టిన నిప్పే ఈరోజు కార్చిచ్చుగా మన ఇంటిని కాల్చడానికి సిద్ధపడవచ్చు. ఏం చేశాం,ఎలా చేశాం, ఎందుకు చేశాం అని ఆత్మావలోకనం చేసుకుంటే-పరిస్థితులు మారిపోవడానికి మనవంతు పాత్ర ఎంతనేది తెలుస్తుంది.వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది. ఆరోగ్యం మారిపోతుంటాయి.విషపు మొక్కను నాటితే అది చివరికి విషాన్నే చిమ్ముతుంది కాబట్టి ఎప్పుడూ మనం ఆచితూచి అడుగులెయ్యాలి అప్పుడే నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

196)నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు..మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

197)ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించపోవచ్చు..కానీ వానలో బండారం బయటపడుతుంది.. మనిషి కూడా అంతే.ఏ సమయంలోనైనా అసలు రంగు బయటపడవచ్చు.మనం మాత్రం ఒక్క వ్యక్తిని నమ్మితే పూర్తిగా నమ్మేస్తాం.సాధారణంగా మనుషులు చేసే అతిపెద్ద తప్పు.. ఇదే.నమ్మితేనే కదా మోసం చేసేది అని మాత్రం ఎవరూ అనుకోరు. గుడ్డిగా నమ్మేస్తారు.అక్కడే పప్పులో కాలేస్తారు.మీకు సమస్య వచ్చినప్పుడు పక్కన నిలబడి ఉండకుండా వెళ్లిపోయినప్పుడు మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

198)జీవితంలో మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారు అనుకునేవారు.. మిమ్మల్ని వదిలేసిన రోజులు చాలనే ఉంటాయి.అప్పుడు అసలు బండారం బయటపడుతుంది. అందుకే మీకు మీపై నమ్మకం ఉండాలి. ఈ లోకంలో ఎవడూ ఎవడికీ ఏం చేయడు. కేవలం మిమ్మల్ని పైకి లేపుకొనేది మీరు మాత్రమే. మనిషి అంటేనే స్వార్థపరుడు కానీ బయటకు కనిపించనివ్వడు.మీతో భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో లెక్కలేసుకుని మీ దగ్గరకు వస్తారు.మీ నుంచి లాభం లేదనుకున్నప్పుడు మిమ్మల్ని నెమ్మదిగా సైడ్ చేస్తారు.ఆ విషయం మీకు అర్థమయ్యేసరికా చాలా రోజులు పడుతుంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ముందుగానే పసిగట్టి దూరం పెట్టడం ఉత్తమం అప్పుడే నువ్వు బాధపడకుండా ఉండగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

199)మనిషి బుద్ధి చాలా తిక్కది..అవసరమైతే తేనెలా మాట్లాడిస్తుంది..లేదంటే కంట్లో కారం కొట్టి మంట పుట్టించేలా చేస్తుంది.అందుకే ఏ బంధమైనా వాళ్ల మీదకు వస్తే మీమ్మల్ని ఒంటరి చేస్తుంది.మీకు మీరే తోడుగా ఉండాలి.మీకంటూ కొండంత ధైర్యం ఉండాలి.మీ ఎమోషన్స్ కోసం ఇతరుల మీద ఆధారపడటం మెుదలుపెడితే..మీతో ఆడుకుంటుంది ఈ సమాజం.మనుషులను అర్థం చేసుకోవడం మెుదలుపెట్టినప్పుడు జీవితానికి అర్థం అర్థమవుతుంది లేదంటే వేరేవారి స్వార్థంలో పడి మీరు బతుకు బండిని నడిపిస్తూ ఉండాలి కాబట్టి జాగ్రత్త..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

200)జీవితంలో ఏ బంధమైనా నమ్మకమే పునాది. కానీ ఆ పునాది మీరు అనుకున్నంత స్ట్రాంగ్‌గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవడి లైఫ్ వాడితే. పీకల దాగా వచ్చిందంటే ఎవరైనా మిమ్మల్ని ఎడారిలో వదిలేసి.. నీళ్ల బాటిల్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోతారు. ప్రపంచంలో ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ అని చెప్పలేం. కచ్చితంగా కనిపించని మరో కోణం ఉంటుంది. కానీ అది నమ్మినవారు తెలుసుకోలేరు.మీకు నమ్మకం ఉన్న వ్యక్తులను వంద శాతం నమ్మకండి.. 70, 80, 90.. ఇలా లెక్కలు వేసుకోండి. ఎందుకంటే పూర్తిగా వందకు వంద శాతం నమ్మకమైన వ్యక్తులు లేరిక్కడ. మీరు పూర్తిగా నమ్మేస్తే.. చివరిగా బాధపడేది మీరే. ఎందుకంటే మీకు వారిపై కొన్ని అంచనాలు ఉంటాయి. నా కష్టంలో నాకు తోడు ఉంటారు అని మీకు పెద్ద పెద్ద ఊహలు ఉంటాయి.. కానీ కష్టం వస్తే నీ కాంపౌండ్ వాల్ కూడా తొక్కరు. నీ సమస్యకు నువ్వే సమాధానం కావాలి. నీ కష్టాన్ని నువ్వే తీర్చుకోవాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

201)ప్రపంచంలో ఏ మనిషి వంద శాతం మంచోడు అని చెప్పలేం. ప్రతీ మనిషిలో కచ్చితంగా నెగెటివ్ లక్షణాలు ఉంటాయి కానీ సమయంలో వచ్చినప్పుడు మాత్రం బయటపడతాడు.కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా...దానికి రక్తం చిందించడమే తెలుసు..కొన్ని బంధాలు కూడా అంతే.. ఎంత ప్రేమగా ఉన్న నమ్మకద్రోహం చేయడమే తెలుసు చివరిగా గుర్తు పెట్టుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే..నీలోని ప్రశ్నలకు సమాధానం నువ్వే అవ్వాలి..నీలోని సమాధానాలకు ప్రశ్నవు నువ్వే కావాలి అప్పుడే నువ్వు జీవితంలో ఆనందంగా ఉండగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

202)మనసు అదుపులో పెట్టడం అంటే మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవడమే.గడిచిపోయిన విషయాలను తలచుకోవడం మానేయాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించడం ఆపాలి.ఈ రెండూ చేస్తే మనసు వర్తమానంలోనే ఉంటుంది. అప్పుడు మనోనిగ్రహం కూడా వస్తుంది. నిజానికి మనసు ప్రస్తుత విషయాలను పక్కకు పెట్టి జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తుంది. అందుకే ఎక్కువమంది అనుకున్న పనులు సాధించలేక అపజయం పాలవుతూ ఉంటారు.గతాన్ని తలుచుకోవడం వల్ల కలిగేది కష్టమే తప్ప, భవిష్యత్తులో ఏదో వస్తుందని భయపడడం కూడా ఇప్పటి కాలాన్ని నిరాశలోకి తోసేస్తుంది. కాబట్టి వర్తమానంపై దృష్టి పెట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవాడికే విజయం అందుకోవడం సులభం అవుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

203)ఇంట్లో సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ విజయం ఎలా సాధించాలో అని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే... మీరు విజేతగా నిలవాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టండి. సౌకర్యాలు, విశ్రాంతి వంటి పదాలను మరచిపోండి. కష్టపడి పనిచేయండి. విజేత కావాలనుకునే వారు ఎవరూ కూడా ఒకచోట కూర్చుని నిద్రపోతూ ఆలోచించరు. పనిచేస్తూనే ఆలోచిస్తారు.మీరు కోరుకున్నది మీకు ఊరికే లభించదు.కష్టపడి పని చేస్తే మాత్రమే మీకు అది దక్కుతుంది. విజయం అంత సులభం కాదు. సోమరితనం ఉంటే విజయం ఆమడ దూరం ఉండడం ఖాయం..కాబట్టి ఏదైనా పని చేయాలంటే బద్దకాన్ని వీడి ఇష్టపడుతూ కష్టపడు అప్పుడే నువ్వు అనుకున్నవి సాధించగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

204)జీవితంలో మనం చాలా కోరికలు కోరుకుంటాం దేవుడ్ని కానీ కోరిక మనది కాదు..వేదన మనది కాదు బంధం మనది కాదు..కన్నీళ్లు మనవి కావు..ధనమూ,కీర్తీ, న్యాయాన్యాయమూ,సౌందర్యము,వికారమూ,సాధ్యాసాధ్యమూ...ఏవీ మనవి కావు..చైతన్యమైనా..మనోకల్పమైనా..మాలిన్యమైనా,మంద బుద్ధి అయినా మనము కాము ఎందుకంటే..ఇవి అన్నీ...ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు పోతాయో మనకే తెలియదు.. కానీ..'సాధన' మనదే..సంకల్పం మనదే..తపన మనదే..అందుకు తగిన సిద్ధి మనదే జీవితంలో విరామం లేకుండా మన సంకల్పం కోసం ఇష్టపడి కష్టపడి గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే మనం చెయ్యవలసింది ఇదే..ముమ్మాటికీ ఇదే.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

205)జీవితంలో ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే అది పుట్టుక ద్వారా కాదు, తాను చేసే పనుల ద్వారా అవుతాడు. విజయం సాధించాలనుకునే వ్యక్తి అడ్డదారులు తొక్కడం ద్వారా గొప్పవాడు కాలేడు. కేవలం సరైన పద్ధతిలో అనుకున్న లక్ష్యాన్ని చేరితేనే గొప్పవాడు అవుతాడు. ఆ ప్రయాణంలో మీరు ఎవరికీ హాని కలిగే పనులు చేయకూడదు. ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయకూడదు.మంచి మార్గంలో నే సాగుతూ ముందుకు వెళ్లాలి..కాబట్టి విజయానికి దగ్గర దారి నిరంతరం కృషి చేయడం, కష్టపడడం. ఏం చేయాలనుకుంటున్నారో ఆ విషయంపై స్పష్టతను కలిగి ఉండడం. ఇవన్నీ మీకు ఉంటే విజయం సాధించడం చాలా సులువు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

206)జీవితంలో దేనికి నిరాశపడకు..రెండు చేతులిచ్చాడు దేవుడు ఎంత బరువైనా మోయమని..రెండు కాళ్ళు ఇచ్చాడు మోసే చేతులకి సాయం చేయమని...కండలు గట్టిపడుతున్నాయి నీకు కష్టం తెలియొద్దని.చర్మం చెమటను చిందిస్తుంది. అంటే నీ కష్టాన్ని గుర్తిస్తుంది.మెదడు నీకోసమే ఎప్పుడు ఆలోచిస్తుంది నువ్వు గొప్పోడివి కావాలని కళ్ళు నీ గెలుపుని చూడాలని అనుకుంటున్నాయి.చెవులు నీకోసం కొట్టే చప్పట్లు, ఈలలు, పది మంది మాట్లాడుకునే మంచి మాటలు వినాలని అనుకుంటున్నాయి.నీకోసం ఇంత మంది ఆలోచిస్తుంటే..నీకు సాయం చేస్తుంటే..సాయం చెయ్యని స్వార్ధపు సమాజం మాటలు ఎందుకు విని నిరాశ పడుతున్నావు.నీ రక్తం ఉడుకు నీకు తెలియట్లేదా?? నీ ఊపిరి గాలికి ఉన్న శక్తి నీకు అర్ధం కావట్లేదా?బద్దకం అనే సంకెళ్లు తెంచి ఓటమి అనే శత్రువు పైన యుద్ధం చెయ్.గెలుపు కోసమే పోరాడు,ఓడిపోతే నీ వల్ల కాదు అనే వారి మాటలను పట్టించుకోకు..నీ తోటివారు మాట్లాడుకోడానికి నీ సక్సెస్ ఒక ఉదాహరణ కావాలి అంతేకాని దేనికి నిరాశపడకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

207)ఆలోచన ఉన్న వ్యక్తి గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుని విజయాలను సాధిస్తాడు. ఏం చేయాలో ఆలోచన లేని వ్యక్తికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చిన గడ్డిపరకలా పక్కన పడేస్తాడు. మీరు తెలివైన వారో, తెలివి తక్కువ వారో నిర్ణయించుకోండి. మొదటిసారి గెలిచేయాలని అనుకోవద్దు. ఎన్నిసార్లు ఓడినా కూడా చివరికి గెలుపు తలుపు తట్టాలని మాత్రమే అనుకోండి. ఆలోచన పెద్దగా ఉన్నా ప్రయత్నం చిన్నగానే మొదలవుతుంది. మొదటే కుంభస్థలాన్ని కొట్టాలని అనుకోవద్దు, చిన్న చిన్న విజయాలు పెద్ద విజయాలకు మార్గాన్ని వేస్తాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

208)సగం జీవితం ఏం చేయాలో ఆలోచించడానికే సరిపోతుంది. ఏం చేయాలో,ఎలా విజయం సాధించాలో నిర్ణయించుకున్నాక వెంటనే ప్రయత్నాన్ని మొదలుపెట్టండి.నేను చేయగలను అనే నమ్మకం మీకు ఉంటే ఎలా చేయాలన్న మార్గం అదే కనిపిస్తుంది.మీరు కావాలనుకున్న దానికోసం క్షణం కూడా వృధా చేయకుండా ప్రయత్నాలు మొదలు పెట్టండి.తీరిపోయిన గతం గురించి,తెలియని భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు.ఈరోజు ఏం కావాలో, ఏం చేయాలో ఆలోచించి అడుగులు వేయండి.మార్పు మనం అనుకున్నంత తేలికగా రాదు...అలా అని పూర్తిగా అసాధ్యం కూడా కాదు.ప్రయత్నం చేస్తే జీవితాలు మారడం చాలా సులువు..యత్నం ప్రయత్నం దైవయత్నం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

209)జీవితంలో ఏది సాధించాలన్నా ముందడుగు వేయాలి.అడుగుల ముందుకు కదలకుండా నిలుచున్న చోటే విజయాన్ని అందుకోవడం చాలా కష్టం. ఎంతోమంది తనపై తమకు నమ్మకం లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోతారు. ముందుగా మీ ఆలోచన తీరును మార్చుకోండి.ప్రతి అంశాన్ని సానుకూలంగా చూడండి.ప్రతి చర్యలోను ప్రతికూలతలను ఆలోచించకండి.ఎన్నో అడ్డంకులను,సమస్యలను దాటి వెళితేనే మీ సుందర స్వప్నం సాకారం అవుతుంది..దానికి మీపై నమ్మకం ఆత్మవిశ్వాసమే ముఖ్యం.మంచి రోజులు రావాలంటే కనిపిస్తున్న చెడు రోజులతో సహనంతో పోరాడితే తప్పక విజయం దక్కుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

210)జీవితంలో విజయం సాధించాలంటే గతంతో పని లేదు, కేవలం వర్తమానం, భవిష్యత్ మీదనే ఆలోచిస్తూ మన ప్రయాణం ఉండాలి...జీవితంలో దేనితో ఆగిపోకూడదు...చాలా మంది గెలుపును గమ్యంగా చూస్తారు. దీనితో అక్కడే ఆగిపోతారు. గెలుపును గమ్యంగా కాకుండా ప్రయాణంలా అనుకుంటే ఎన్నో విజయాలు మన ఖాతాలో పడతాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

211)సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చెయ్యడానికి ప్రయత్నించండి.మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది.అదే నువ్వు వేరొకరికి చెడు చేయాలని చూస్తే పైన నిన్ను ఆ దేవుడు చూసుకుంటాడు ఏందుకంటె బలహీనుడ్ని బలవంతుడు కొడితే బలవంతుడ్ని ఆ భగవంతుడు కొడతాడు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

212)ఈ బిజీ ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మారడం అనేది విజయానికి అత్యంత అవసరమైన లక్షణాలలో ఒకటి. విజయవంతమైన వ్యక్తులు మార్పుకు వెనుదిరగరు.పరిస్థితిని బట్టి విధానాలను మార్చుకుంటారు.ఆలోచనలతో మార్చేస్తారు.. ఎప్పుడూ అప్డేట్‌గా ఉంటారు...అలాగే ఈ రోజుల్లో శ్రమ సరిపోదు...తెలివిగా పని చేయాలి..హార్డ్ వర్క్ మాత్రమే కాదు..స్మార్ట్ వర్క్ కూడా నేర్చుకోవాలి. విజయ రహస్యం తెలిసిన వారు పనులు ఎలా చేయాలో ప్రణాళిక వేసుకుని దాని అనుగుణంగా వ్యూహాలు వేస్తారు..ఇలా పని చేసినీవాడికి ఎప్పుడో ఒకప్పుడు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

213)విజయం గమ్యం కాదు,ప్రయాణం మాత్రమే.అప్పుడే మరో మైలురాయి మీ ముందు కనిపిస్తుంది.ప్రతి వ్యక్తి విజయం సాధించాలంటే తాను చేసిన పొరపాట్లు అనుభవాల నుంచి జీవిత పాఠాలను నేర్చుకోవాలి ఎందుకంటే అది మన జీవితాన్ని మార్చేస్తుంది.విజయం వైపు నడిపిస్తుంది. అవి వైఫల్యాలు, పరీక్షలు కావచ్చు కానీ అవి మన లక్ష్యాలను,కలలను చేరుకోవడానికి ప్రేరేపిస్తాయి ఎందుకంటే ప్రయత్నం ద్వారానే విజయం సాధ్యం.అపజయం విజయానికి వ్యతిరేకం అంతే.. కానీ వైఫల్యం జీవితంలో విజయానికి సోపానంగా చెప్పుకోవాలి...కాబట్టి వైఫల్యాన్ని మన జీవిత ప్రయాణంలో ఒక అనివార్యమైన అభ్యాసం, పైకి లేచేందుకు అవకాశంగా చూడాలి అప్పుడే మనకి ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

214)విజయం రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు.ఓర్పు, దృఢ సంకల్పం,బుద్ధి ఉంటే ఎన్ని పెద్ద అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగవచ్చు..ఎదురుదెబ్బలు, సవాళ్లను ఎదుర్కోకుండా విజయం రాదు.అయితే ఆ సమయాల్లో కూడా పరాజయాల నుంచి పుంజుకునే ధైర్యం,పట్టుదల ఉన్నవారే విజయపథంలో దూసుకెళ్తారు.అందుకే గమ్యాన్ని ప్రయాణంగా చూడు..ఊహించని టార్గెట్ మన సొంతం అవుతుంది.కష్టపడే తత్వం ఉంటే..ఎంతటి విజయమైనా మనcకాళ్ల కిందకు వస్తుంది.. కాకపోతే మనకు ఉండాల్సిందల్లా వెళ్లే దారిపై అవగాహన...ఇవి ఉంటే మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

215)ప్రయత్నం,అవకాశాలు వాటికవే రావు,నీవే వాటిని సృష్టించు కోవాలి..వేసే ప్రతి అడుగు..గడిపే ప్రతి ఘడియ..పలికే ప్రతి పలుకు..చేసే ప్రతి చర్య..ఆలోచన అనే ఆయుధంతో,నీ శ్రమను నమ్ముకుని సంకల్పంతో ముందుకు వెళ్ళు...జీవితం నేర్పింది ఒక్కటే..దేనికి ఎదురు చూడవద్దని...ఎవరి మీద ఆధారపడవద్దని...నీకు నువ్వే తోడని...ఆత్మవిశ్వాసంతో నువ్వు వేసే ప్రతి అడుగు నీ విజయానికి తొలిమెట్టు కావాలి..కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకుని సంకల్పంతో ముందడగు వేయి నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

216)జీవితంలో నీకు బాధ కలిగితే మందు అయ్యేది నీవాళ్ళు..నువ్వు ఓడిపోతే అక్కున చేర్చుకునేది నీ వాళ్ళు..నువ్వు ఎలా ఉన్నా ఒప్పుకునేది నీవాళ్ళు..ఎవరికోసం నిన్ను నువ్వు తగ్గించు కుంటూ..నీకు నువ్వే ఏమి లేని వాడిలా మారిపోకు..ఏందుకంటే పరిచయం అయ్యే ప్రతి బంధం తీపి జ్ఞాపకాలను ఇస్తుంది అనుకోకు ఎప్పటికీ కోలుకొని చేదు నిజాలను పరిచయం చేసి మరీ వెళ్తుంది...తెలుసుకో పరిస్థితిని తగ్గట్టుగా నిన్ను నువ్వు మలచుకో..నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో...నీ పనిని, నీ చుట్టూ ఉన్న నీ వాళ్లను ఇష్టపడుతు సాగిపో...ఏమి లేదు అనుకోకు ఎవరు లేరు అనుకోకు..నీ చుట్టూ ప్రకృతి ఎదో ఒక రూపంలో ఉంటుంది..పంచ భూతలు నీకు తోడుగా ఉన్నంత వరకు..నువ్వు ఏకాకి ఎప్పటికీ కావు....ఈ జీవిత పోరాటంలో ఎప్పటికీ..నీకై తోడుగా నిలిచేది నీపై నీకున్న నమ్మకం...అదే నీ బలం అవ్వాలి...ఎవరికోసమో ఆలోచిస్తూ నీ ముందున్న కాలాన్ని వృథా చేయడం తగునా!??? మాటల మాయాజాలంలో ఎప్పటికీ ఉండకు..వాస్తవ జీవితంలో బ్రతకడం నేర్చుకో.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

217)బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది.భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది.మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది.జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం.ఈరోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

218)జీవితంలో సక్సెస్ అనేది ఊరికేరాదు,కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది,కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది,మనసుకి గాయాలు అవుతాయి,బాధలు తట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొందరి మాటల వల్ల బంధాల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది,గుండె ముక్కలవుతుంది..అయినాసరే సంకల్పంతో నువ్వు అనుకున్న లక్ష్యం కోసం ఎదురు దెబ్బలు తిను..సహనంతో మెలుగు,గుణపాఠాలు నేర్చుకో..అనుభవ పాఠాలు దిద్దుకో...ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయి నీ గమ్యం చేరుకునేదాక.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

219)జీవితంలో ఎవరితోనైనా ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి.అతిగా వెళ్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు.నమ్మకం అనేది పునాదిలాంటిది. అయితే దీనిని సరిగా నిర్మించుకోవాలి కేవలం పైపైన చూసి నమ్మకం పెంచుకుంటే ఏదో ఒకరోజు మిమ్మల్ని ముంచేసి వెళ్తారు.మంచి వ్యక్తిలాగా ముసుగు వేసుకున్నవారిని ఎక్కువగా నమ్మకూడదు.మంచివారిగా నటించేవారి ప్రవర్తనను కొన్ని సందర్భాల్లో గమనించండి. అది డబ్బు గురించి కావచ్చు,మీ స్నేహం గురించి కావచ్చు, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోండి. మిమ్మల్ని డబ్బు కోసం ఉపయోగిస్తున్నాడా లేదా అనేది కూడా అంచనాకు రావాలి.ఏ బంధంలోనైనా నిజాయితీ ముఖ్యం కాబట్టి మంచివారమనే ముసుగు వేసుకున్న వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

220)ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా కూడా ఒక్క దీపం వెలుగును ఆపలేవు.అలాగే మీ లక్ష్యానికి సాధించాలన్నా, పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు.మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. విజయం సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు రావచ్చు, కన్నీళ్లు ఎదురవచ్చు, అవాంతరాలు అడ్డు తగలొచ్చు.కష్టాలు మీ శత్రువులు కాదు.మీ బలాలను,బలహీతల్ని తెలియజేసే నిజమైన మిత్రులు.సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని కనిపెట్టాలన్నా ఆలోచన వస్తుంది.సమస్య లేకపోతే పరిష్కారమే ఉండదు కాబట్టి సమస్యను స్వీకరించడం నేర్చుకోండి అప్పుడే విజయానికి దగ్గర దారులు కనపడతాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

221)విజయం సాధించాలన్న నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరుకోవాల్సిందే.జీవితం ఎప్పుడూ కూడా మనం ఎదురు చూస్తున్నట్టు మారదు.మనమే మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రయత్నిస్తే అది తప్పకుండా అవుతుంది.మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో ఎదురయ్యే మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.సమయం వృధా చేసే అర్థరహితమైన మాటలకన్నా,అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

222)విజయం సాధించాలన్న పట్టుదలతో పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రావాలని కోరుకోవద్దు.ఏ పనీ చేయకపోతే ఏ ఫలితం రాదు కదా దానికి కావాల్సింది ఓపిక.ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.ఎవరూ తోడు లేకపోవచ్చు,మీకు ఎవరూ తోడు లేకపోయినా మీలో ఉన్న ధైర్యం మిమ్మల్ని కచ్చితంగా లక్ష్యం వైపు నడిపిస్తుంది కాబట్టి ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ విడవకండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

223)జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి..దానిని సాధించే ప్రక్రియలో మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాని గురించి ఒకసారి కూర్చుని ఆలోచించి విశ్లేషించండి.దేనికైతే మీరు ఎక్కువ భయపడతారో,దేనికైతే ఎక్కువగా మీరు వెనకడుగు వేస్తారో...అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. దానికి ఒక్కసారి ఎదురెళ్లి చూడండి.మీ భయం పోతుంది.దీనివల్ల లక్ష్యసాధన కూడా సులువు అవుతుంది...కొన్నిసార్లు లక్ష్యసాధనలో ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తుంది.ఎవరి కోసమో వేచి చూసే కన్నా మీరు చేయగలిగింది చేయండి.ఇతరుల మీద ఆశ పెట్టుకుంటే విజయం ఆమడ దూరం వెనక్కి వెళ్తుంది.కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు, ఎప్పుడైతే మీలో ఉంటాయో...అప్పుడు మీరు జీవితంలో గెలవబోతున్నారని అర్థం.ఆ గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

224)జీవితంలో మనకి కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయం,సమస్యలు అనూ అడ్డుగోడలకు అవతలే ఉంటాయి ఆ అడ్డు గోడలను పగలగొట్టి వెళితేనే మనకు కావలసినది మనకు దక్కుతుంది వాటిని చూసి భయపడితే ఎప్పటికీ విజయాన్ని అందుకోలేము.ఓటమి అనేది గెలుపుకి ఒక మార్గం. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును సాధించడం చాలా కష్టం.తుఫానులను తట్టుకుని బలమైన చెట్లు నిలబడతాయి.అలాగే జీవితంలో కూడా బలమైన తుఫానులను ఎదుర్కొన్ని నిలిచి ఉంటే ఆ వ్యక్తి... తిరుగులేని వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. ఒక్క జీవితాన్ని గొప్పగా చూడాలి.అప్పుడే ఆ జీవితం కూడా గొప్పగా మారుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

225)కష్టాలు లేకుండా,సమస్యలు ఎదుర్కోకుండా ఏ వ్యక్తీ పెద్దవారు కాలేరు.మన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.విజయం సాధించే ప్రయాణంలో పక్కవారు ఎన్నో రాళ్ళను విసురుతూనే ఉంటారు.ఆ రాళ్ళను ఎవరైతే మన ఎదుగుదలకు పునాదులుగా వేసుకొని ముందుకు సాగాలి...నువ్వు అనుకున్నది సాధించాలంటే ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి.అందరికీ నచ్చేలా కాకుండా మీకు నచ్చేలా ఉండాలి ఎందుకంటే మనకు ఒక్కటే జీవితం...చేయాలనుకున్నవన్నీ చేసేయాలి. లేకుంటే 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చెప్పుకోవడానికి,గర్వపడేందుకు ఏమీ ఉండదు...కాబట్టి నీకు నచ్చేలా అందరు మెచ్చుకునేలా జీవించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

226)ఉదయం లేవగానే మీ దగ్గర రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి.ఒకటి ఆ రోజును పాజిటివ్‌గా కొనసాగించడం లేదా నెగిటివ్‌గా కొనసాగించడం. మీరు ఎలా కొనసాగిస్తారో...మీ జీవితం కూడా అలానే ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళండి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు.నెగిటివ్‌గా మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.నువ్వు చేయలేవని, చాలా కష్టపడాల్సి వస్తుందని... మాటలతో తొక్కేవారు ఎంతోమంది.అలాంటి వారి మాటలు ఈటెల్లా గుచ్చుకుంటాయి.అవి పైన పడే బండరాళ్లలా అనిపిస్తాయి.ఆ బండరాళ్లను మీ విజయానికి పునాదిగా మార్చుకొని ముందుకు సాగు..నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

227)జీవితంలో మొదటిగా సాధించాల్సిన విషయం ఒకటి ఉంది...అది మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించగలగడమే.ఎదుటివారి కోసం జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతారో...అప్పుడే మీలో అసహనం పెరుగుతుంది. మీ విజయం ఆమడ దూరం పరిగెడుతుంది. కాబట్టి మీకు నచ్చేట్టు మీరు జీవించడం మొదలు పెట్టండి.జీవితం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. జీవితం ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది.దానిపై ఏ రంగులు చల్లాలి అనుకుంటున్నారో,ఎలాంటి పెయింటింగ్ వెయ్యాలనుకుంటున్నారో,ఎంత కలర్ ఫుల్‌గా మార్చాలనుకుంటున్నారో...అంతా మీ ఇష్టమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

228)ప్రతి మనిషికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి.ఎంతోమంది సూటిపోటి మాటలు విసురుతూనే ఉంటారు.అలాంటివి పట్టించుకోకుండా ముందుకు సాగితేనే మనం సంతోషంగా జీవించగలం.ఎప్పుడూ ఆశావాదిగా ఉండేందుకే ప్రయత్నించండి.నిరాశ వాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో కూడా కష్టాన్ని గుర్తిస్తాడు. కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లో కూడా అవకాశాలను వెతుకుతాడు...కాబట్టి ఎప్పుడూ ఆశావాదంతో కష్టపడుతూ ఇష్టపడుతూ ముందుకు సాగు నువ్వు అనుకున్న లక్ష్యాల్ని ఛేదించగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

229)ఒక విషయం గురించి తెలియకపోతే మాట్లాడకుండా ఉండడం మౌనం.ఒకవేళ ఆ విషయం గురించి తెలిసినా, అనవసర సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే జ్ఞానం. తెలిసీ తెలియక అనవసరంగా వాడడం మూర్ఖత్వం.బదులు దొరకని ఎన్నో ప్రశ్నలకు సైతం మౌనం బదులు ఇవ్వగలదు.నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మౌనాన్ని సాధన చేయండి. గొప్ప గొప్ప ఆలోచనలు మౌనంగా ఉన్నప్పుడే రూపు దాల్చుకుంటాయి.గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం మాత్రమే కాదు. మన మాటల వల్ల లేదా మన చేతల వల్ల ఎవరినీ బాధ పెట్టకుండా ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి మన మాటలపై అదుపు సాధించాలంటే ముందుగా మౌనాన్ని ఆశ్రయించాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

230)చిరునవ్వు, మౌనం... ఈ రెండూ గొప్ప ఆయుధాలు. అవి మీ దగ్గర ఉన్నంతవరకు మీకు ఓటమి ఉండదు. అనువు కానీ చోట అధికుల మనరాదు... అని ఎప్పుడో చెప్పారు పెద్దలు. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బాలో రాలేసినట్టు వాగుతూ ఉంటే విలువ ఉండదు. రోజులో ఎక్కువ సమయం మౌనంగా ఉంటేనే మంచిది.చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది.ఒక వ్యక్తి మౌనంగా ఉంటాడంటే అతడు చేతకాని వాడని,చేవలేదని భావించకండి. అతని మౌనంలో పెద్ద సముద్రమే దాగి ఉండవచ్చు. కొన్నిసార్లు వాదించి బాధపడే కన్నా మౌనంగా ఉండడమే మంచిది.అయితే ఏ సమయంలో మాట్లాడాలో,ఏ సమయంలో మౌనంగా ఉండాలో తెలుసుకుంటే నువ్వు ఏ పనైనా చాకచక్యంగా చేయగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

231)జీవితంలో మీకు విజయాలను సాధించేందుకు, మీ కలలను సహకారం చేసుకునేందుకు మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకోండి. ఇతరులను నమ్ముకుని వారిపై ఆధారపడి జీవిస్తే ఎదురయ్యేది నిరాశే. అందరూ సాయం చేయాలని లేదు, ఎవరో కొందరు మాత్రమే సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారు మీకు ఎదురవ్వచ్చు లేదా ఎదురు కాకపోవచ్చు. కాబట్టి గుడ్డిగా ఇతరులను నమ్మడం కన్నా, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్లడమే మంచిది. ముఖ్యంగా మీరు చేసే పనిని ప్రేమించండి. అది ఏ పనైనా కావచ్చు, మీ వృత్తిని మీరు ప్రేమిస్తే ఆ వృత్తిలో మీరు ఉన్నత శిఖరాలకు వెళతారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

232)జీవితంలో ప్రతి మనిషీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.ఇంతవరకు సమస్యలు లేని మనిషి ఈ భూమిపై జీవించలేదు.కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అన్నింటినీ తట్టుకుంటూనే ప్రతి మనిషి నిలిచి చూపించాలి. మిమ్మల్ని మీరే ముందుగా గుర్తించాలి. మీకు ఏది కావాలో ఎంచుకోవాలి.ప్రణాళిక వేసుకొని విజయం సాధించేందుకు ముందడుగు వేయాలి. జీవితంలో ఉన్న సమస్యలను ఒకచోట రాసుకుని ఒక్కొక్క దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్లాలి. అప్పుడు మీరు వెళ్లే దారి మరింత సునాయాసంగా ఉంటుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

233)బంగారం నుంచి వజ్రం వరకు అన్ని తళతళ మెరుస్తూ మనిషికి లభించవు. ముందు మట్టి గడ్డలాగే కనిపిస్తాయి. వాటికి వందలసార్లు సాన పెట్టి రుద్ది రుద్ది పెడితేనే వాటిలోని మెరుపు బయటపడేది. ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి ఇంతవరకు శిల్పంగా మారలేదు.అలాగే కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఎదుర్కోకుండా ఏ మనిషి విజయం సాధించలేడు. విజయం కావాలనుకున్న ప్రతి మనిషీ... ఎదురుపడే సమస్యలను దాటి వెళ్లేందుకు సిద్ధపడాలి.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం* 

234)జీవితంలో మనం విజయం సాధించాలంటే అన్నిటికంటే ముందుగా ఆత్మవిశ్వాసం కావాలి.అనుకున్నంత సులభంగా దేనిని సంపాదించలేము.ముందుగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. అంటే మీరే ఏ పనైనా చేయగలరు. ఎవరికీ తీసిపోరని మనసుకు గట్టిగా చెప్పుకోండి. మిమ్మల్ని ఎవరైనా నొప్పించే విధంగా ప్రవర్తిస్తే వారిని వెంటనే మన్నించండి. అలా చేయడంతో వారి తప్పు వారికే తెలిసొస్తుంది. అలాగే మీ ప్రక్క వారిలో మంచి గుణాలు మీకు లేవని మీరు అనుకుంటే వాటిని సాధించడం కోసం ఏమి చేయాలో ఆలోచించండి. అంతే కానీ వారిపై ఈర్ష్యా, ద్వేషాలను పెంచుకోకండి. విజయం సాధించడానికి తొలి మెట్టుగా "టేకిట్ ఈజీ" విధానాన్ని అలవర్చుకోవాలి. అంటే మీకు కావలసిన విషయాలను మెదడులోకి ఎక్కించండి. అక్కరలేని విషయాలను అక్కడే వదిలేయండి. లేదంటే వాటి గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అనవసర విషయాలను మనసులోకి ఎక్కించుకోకుండా ప్రశాంతంగా ఉండగలిగితే అదే మీరు సాధించే తొలి విజయమ వుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

235)జీవితంలో కొన్ని రిస్క్‌లు తీసుకోండి. తరచుగా రిస్క్ తీసుకునే వారు చరిత్రను మార్చి లక్షలాది ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. కంఫర్ట్ జోన్‌లో ఉన్నవారు అక్కడ నుంచి కదల్లేరు.ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు డబ్బు కోసం పరిగెత్తకూడదు, అద్భుతమైన జ్ఞాపకాల కోసం పరిగెత్తాలి. అప్పుడే విజయం మీ వైపు వస్తుంది.ఇబ్బందులకు భయపడకండి, మీ ఆశావాద, సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోండి.. లక్ష్యం వైపు వెళ్లండి.చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి, మీ బలమైన సంకల్ప శక్తితో వాటిని సాధించండి. ఈ చిన్న లక్ష్యాలు మీకు పెద్ద లక్ష్యాలను అందిస్తాయి.కష్ట సమయాలల్లో మీ సహనాన్ని ఎన్నడూ బలహీనపరచవద్దు. ఎందుకంటే సహనమే మిమ్మల్ని ముందుకు నడిపే ఇంధనం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

236)ఏగరాలి గాలిలా...ఏదగాలి శిఖరంలా...నీకు కృషి చేసే తెగువే ఉంటే...అవరోధాలను మెట్టులుగా చేసుకుని..నిీ సంకల్పానికి సాధనను ఇంధనం గా చేసి,అలుపు ఎరుగని గెలుపు దిశకు సాగిపో,నీ వెంట ఉన్నావారే నేస్తలు,తప్పులను చూపువారు..గురువులు గా భావించు...నీది అనేది ఏదొ ఓక్కటి సాధించు..అర్ధమైతే ఆచరించు అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

237)కొన్నిసార్లు కొంతమంది దగ్గర మనం వినే మాటేంటంటే ఏ పని చేసినా కలిసి రావట్లేదు.ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదు అని అంటుంటారు కానీ ఇలా ఆలోచిస్తూ చాలా సార్లు బాధ పడతారు.ఎక్కడ ఏ లోపం ఉందో అర్థం కాదు.మన పక్క వాడు ఏం పట్టినా బంగారమే, ఏం చేసినా బంగారమే. నేనేం ముట్టుకున్నా బూడిదే.ఇక చివరికి అతడి అదృష్టం బాగుంది,అందుకే అన్నీ కలిసొస్తున్నాయని ఫిక్స్ అయిపోతాం కానీ ఆ అదృష్టం వెనక అతను పడ్డ కష్టం అర్థం చేసుకోం.కోటిలో ఒకరికి తప్ప ఇంకెవరికీ కష్టం లేకుండా ప్రతిఫలం రాదు.అదృష్టం అవకాశం రూపంలో అందరి తలుపులు తడుతుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్లు మాత్రమే అదృష్టవంతులుగా మారతారు.మనదాకా వచ్చిన అవకాశాన్ని మనకు తెలిసో తెలీకో వద్దనుకుని మళ్లీ బాధపడటంలో అర్థం లేదు.ఒక అవకాశం వచ్చినప్పుడు నేనేం చేసినా కలిసి రావట్లేదు కాబట్టి ఇంకోసారి ప్రయత్నించినా మళ్లీ నష్టమే తప్ప ఇంకేమీ ఉండదు అనే ఆలోచన గనక మన మనసులో వస్తే ఇక నీ విజయానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే.నువ్వు అనుకున్న మెట్టు ఎక్కేదాకా ప్రయత్నం ఆపకూడదు. ఏ అవకాశం వచ్చినా తీసి పడేయకూడదు.అందుకే మనం అనుకున్నది సాధించేదాకా, కష్టాలు తీరేదాకా ఓపిగ్గా ఉండాలి అప్పుడే విజయం తధ్యం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

238)నేర్పు,ఓర్పు,కూర్పు-మూడూ జీవితానికి అన్వయించు కోవాలి.పరిస్థితి ఎదురు తిరిగినప్పుడు,ఆపదలు చుట్టుముట్టినప్పుడు,దారీతెన్నూ కానరానప్పుడు,కనువిప్పు కలిగించే గుణపాఠాలు సూత్రాలు జ్ఞప్తి చేసుకుంటే- ధైర్యం,సాహసం తోడై కార్యాచరణకు ప్రోత్సాహకాలు అవుతాయి.నీటిలో ఒడ్డును ఒరుసుకుని,గడ్డి అడ్డదిడ్డంగా పెరుగుతుంది.నీళ్లలో దిగేవాడికి చీకాగ్గా అనిపిస్తుంది.కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోకుండా ఆపడానికి అదే ఉపయోగ పడుతుంది.ప్రవాహంలో ఆ గడ్డిపోచలే గునపాలుగా మునిగిపోయేవాటిని ఆదుకుంటాయి...కాబట్టి వేటిని,ఎవ్వరిని తక్కువ అంచన వేయకూడదు..చీకటిపోగానే వెలుగు కనిపిస్తుంది. కష్టాలు తీరగానే తప్పకుండా సుఖపడతామన్న ధీమా ఉన్నవారినే 'నేర్పరి' అంటారు.ఓర్పు నేర్పరితనంలోని భాగం.అనవసరమైన వాటిని గురించి ఆలోచించి,బుర్ర బద్దలు కొట్టుకునే జనాభా చాలామందే ఉన్నారు...ఏది అవసరమో,ఎలా సాధించాలో,ముందుగా కూడిక తీసివేతలు చేసుకుంటే,మనస్సు ఏకాగ్రమవుతుంది ఆ సంకల్పంతో దేనైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

239)ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడం, అందరితో నవ్వుతూ మాట్లాడడం,పరిధి దాటి ఆలోచించకపోవడం, ప్రశాంతంగా జీవించాలనుకోవడం...ఇవన్నీ మంచి లైఫ్‌ను అందిస్తాయి.మనలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొలిపితేనే మనం జీవితాంతం సంతోషంగా జీవించగలం.ప్రతి ఒక్కరు మనలో ఉన్న శాంతిని మేల్కొల్పితేనే మన జీవితం సవ్యంగా సంతోషంగా సాగుతుంది.దీనికోసం మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది.మరికొన్ని అలవాటు చేసుకోవాల్సి కూడా రావచ్చు కాబట్టి మనం ఎప్పుడు మంచినే ఆస్వాదించాలి అప్పుడే మనం దేనినైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

240)జీవితంలో కొన్ని విషయాలను మనం మార్చలేం.ఉదాహరణకి పొట్టిగా పుట్టిన వారు పొడవుగా మారలేరు.అలాగే పొడవుగా పుట్టిన వారు పూర్తిగా మారలేరు.మనం మార్చలేని విషయాల గురించి పదేపదే ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు.మనం నియంత్రించే వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి.మన చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించడం మానేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.ఈ క్షణం మనం ఆనందంగా,ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించండి.మన చుట్టూ ఉన్న సానుకూల అంశాలను చూడాలి.ముఖ్యంగా అధిక ఆలోచనలను తగ్గించుకోవాలి.మనం జీవించి ఉన్న రోజును ఆనందంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలీ.రేపటి గురించి ఆలోచిస్తూ నేటి రోజును నాశనం చేసుకోవద్దు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

241)కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు..కర్మ రూపంలో గుర్తుచేస్తూనే ఉంటుంది..కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే..సాక్షాలై నిలువునా దహించి వేస్తాయి..కళ్ళతో చూసిన నిజాలకూ..చెవులతో విన్న ప్రశ్నలకూ..నోటితో విసిరిన నిందలకూ తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే 'కర్మ' కాబట్టి కర్మ చాలా శక్తివంతమైనది నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది.జీవితంలో నువ్వు ఎవ్వరి వల్లనైనా మోసపోయినప్పుడు నీకు ఎవ్వరినీ తిట్టే అధికారం లేదు ఎందుకంటే నమ్మింది నువ్వు,మోసపోయింది నువ్వు కేవలం అది నీ తప్పే...అయినా మనిషిని నమ్ముతున్నావ్ అంటే అక్కడ నుంచి నీ పతనం మొదలైనట్టే..నమ్మకానికి అర్హులు ఎవ్వరూ లేరు ఇక్కడ..కేవలం అవసరానికి వాడుకునేవారు మాత్రమే.ప్రతి పరిచయం వెనుకా..ప్రతి అవసరం వెనుకా ఏదొక మోసం ఉంటుంది..అలా అని అందరు అలాంటి వాళ్ళే అని నేననను కానీ, కొంత మందికి మాత్రమే ఇది అన్వయిస్తుంది.పరిస్థితి బట్టి అవసరాన్ని బట్టి అది కొంచెం అటుఇటూగా బయటపడు తుందంతే..అప్పుడు అనిపిస్తుంది నీకు అనవసరంగా నమ్మనని.. కాబట్టి ఎప్పుడు జాగురతతో ఉండు ఎలాంటివాళ్ళో పసిగట్టి అప్రమత్తంగా ఉండు అప్పుడే ఈ లోకంలో మోసపోకుండా బ్రతకగలవు.నట్టేట ముంచేవాళ్ళు నీ పక్కనే ఉంటారు..జర జాగ్రత్త మిత్రమా..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

242)ఈ కలికాలంలో ఎలాంటి తప్పు చేసినా గుట్టుగా దాచగలిగిన శక్తీ కలిగినది...ఎంతటి విడిపోయిన బంధాలనైనా కలపగల స్థోమత కలిగినది.... ఛీ అని చీదరించ్చుకున్న వారిచేత సైతం చేతులెత్తి మొక్కించ్చేది...దేవుడి వద్ద కూడా ప్రత్యేకా స్థానం కల్పించ్చగలినా బాటసారి....మానవ సంబంధాలను కూడా ధరి చేర్చేది...మనిషి బాధలను మరుపు రాని విధముగా దూరం చేసి సంతోషాన్ని ఇచ్చేది...ఎవరు ప్రేమను చూపిస్తారు ఎవరు విషాన్ని కక్కుతారు అనే పోలికను వివరించేది ....దైవాన్ని సైతం భూమి మీదకు రప్పించగలిగినా మంత్రసాని....నిన్నటి వరకు నిన్ను పేరుతో పిలిచినా వారి చేతనే అన్న అని పిలిపించే శక్తి...చివరికి నువ్వు చచ్చిన తరువాత కూడా నీ శరీరానికి పలు రకాలా గౌరవ పేరును పెట్టించ్చేది కేవలం *డబ్బు మాత్రమే...!!* డబ్బు లేకపోతే నిన్ను పీనుగ,శవం అనేస్తారు అదే డబ్బు ఉంటె పార్థివ దేహం,ఆకాశంలో తార మట్టికింద పేడా అంటారు....!!మనుషులు ప్రేమా,జాలి,కరుణా,మానవత్వం,మంచితనం,అనే ఇలాంటి పదాలను తమ జీవితంలో నుండి తీసేసి మనిషి సృష్టించిన డబ్బు అనే మహమ్మారి చుట్టూ అవసరానికోక ముసుగు వేసుకొని తిరుగుతున్నారు...!! కనుక మాయమాటలు చెప్పటం మానేసి డబ్బు సంపాదించండి..అది ఎంతలా అంటే నీ ఫోన్ నెంబర్ నీ బ్యాంకు బ్యాలెన్స్ అవ్వాలి..అప్పుడే మనకు ఈ సమాజంలో నిజమైన గౌరవం దక్కేది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

243)జీవితంలో ఒక మనిషి నికార్సయిన వ్యక్తిత్వంతో నిప్పులా బతకడానికైనా,గడ్డిపోచకన్నా తేలికైపోవడానికైనా మనసు ప్రధానం.శరీరానిదేముంది,మనసు ఎటు తిప్పితే అటు నడుస్తుంది.చేయమన్నది చేస్తుంది.శరీరం సుఖపడినా,బాధపడినా మనసుదే ముఖ్యపాత్ర.మనలో ఉండి మనల్ని తప్పుదారి పట్టించేది మనసే.తాడును పాముగా భ్రమింపజేస్తుంది.ఎండమావుల వెంట పరిగెత్తిస్తుంది. తెల్లనివన్నీ పాలు,నల్లనివన్నీ నీళ్లుగా నమ్మిస్తుంది.మంచిని చూడలేనంతగా,నిజాన్ని నమ్మలేనంతగా కళ్లకు పొరలు కమ్మిస్తుంది.మనసు గారడీ అర్ధం కాదు.ఒక్కోసారి నిజాన్ని నిలదీస్తుంది.అబద్ధాన్ని అలవోకగా నమ్మి అనుసరిస్తుంది.అలవాటైన దానినుంచి కొత్త మార్గానికి పోనియ్యకుండా భయపెడుతుంది కాబట్టి మనస్సుని అదుపులో పెట్టుకున్నవాళ్ళకి త్వరగా జీవితంలో ఎదగగలరు అలాగే మనిషిలో పైకి కనిపించే ఆకారం కాదు,కనిపించని మనసే ముఖ్యమైనది.ఇది తెలుసుకుని మసలుకోవడమే పరిణతి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

244)కాలాలే మారిపోతూ ఉన్నప్పుడు మనకొచ్చే బాధలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి...వస్తుంటాయి పోతుంటాయి.కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకుని నిలబడాలి.వాటివల్ల క్రుంగిపోకూడదు. మార్పు మాత్రమే శాశ్వతం కాబట్టి దేని గురించి దిగులుపడకండి జరిగిపోయింది మీ మంచికే, జరుగుతోంది మీ మంచికే,జరగబోయేదీ మంచికే. గతం గురించి తలచుకోవడం,భవిష్యత్తు గురించి దిగులుపడటం అనవసరం.మనకు ఏది జరగాలనుందో అదే జరుగుతుంది.ప్రతి విషయంలో ఏం జరిగినా మంచికే అనే సానుకూల దోరణి ఉండాలి.సమయం మీకు ఇప్పుడు అనుకూలంగా లేదేమో,కానీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి.నమ్మకంతో ముందుకెళ్లండి విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

245)జీవితంలో ఒడుదొడుకులు,గెలుపు ఓటములు,చీకటి వెలుగులు,కష్ట సుఖాలు...అన్నీ ఉంటాయి.వాటన్నింటినీ సమదృష్టితో చూడాలి.అలాగైతేనే జీవనగమనం సరైన తీరున సాగుతుంది.అంతేగాని కష్టాలకు కుంగిపోవడం, సుఖానికి పొంగిపోవడం అనేవి స్థిరచిత్తుల లక్షణం కాదు.ఒక్కొక్కసారి మనం తలపెట్టిన పని ఎంత ప్రయత్నించినా నెరవేరదు.అయినా నిరాశతో కుంగిపోకూడదు ఎలాగైతే సాలీడు తన చెదిరిపోయిన గూడిని కట్టడానికి మళ్ళీమళ్ళీ ప్రయత్నం చేస్తుందో అలాగే మనం పట్టు విడవకూడదు.ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా తన శక్తినంతా వినియోగిస్తారో వారికి విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

246)మనం పోటీ ప్రపంచంలో జీవిస్తున్నాం.అందరికన్నా ముందు పరుగెట్టాలన్న కాంక్షతో ఉంటారు ప్రతి ఒక్కరూ. ఈ అనారోగ్యకర వాతావరణం వల్ల ఆందోళనలు,ఒత్తిడి పెరిగిపోతాయి.దీని వల్ల ప్రతికూల ఆలోచనలు ఎక్కువైపోతాయి.ఈ ప్రతికూలత మన దైనందిన జీవితంపై చాలా ప్రభావం పడుతుంది.మెరుగ్గా ఆలోచించడానికి మిమ్మల్ని మీరు పాజిటివ్ గా మార్చుకోవాలి.మంచి కంపెనీ అంటే మనతో ఉండే వ్యక్తులు.మనం ఎంతో పాజిటివ్ గా ఉండే వారిని ఎంత ఎంపిక చేసుకుంటే అంత మంచిది.మంచిని పెంచే పాజిటివ్ వ్యక్తుల మధ్య ఉండడం వల్ల మనకు కూడా సానుకూలత పెరుగుతుంది. కుటుంబం, సంబంధాలు, స్నేహాల నుంచి వచ్చే సానుకూలత సాటిలేనిది.అసూయ పడే, నిరాశావాద వ్యక్తుల మధ్య ఉంటే మనకు కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది కాబట్టి ఎవరితో ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మనమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

247)ఒక చిన్న కథ..ఏనుగును కట్టేయడానికి మావటి వాడు పెద్ద పెద్ద ఇనుప గొలుసులు వాడడు.ఏనుగు కాలికి చిన్న తాడు కట్టి దాన్ని చెట్టుకో,స్తంబానికో ముడేస్తాడు కానీ ఏనుగు ఆ తాడును తెంచుకునే ప్రయత్నమే చేయదు.మావటి వాడి నుంచి దూరంగా పరిగెత్తదు.దానికి కారణం ఏనుగులో స్థిరపడిన ఆలోచన.ఏనుగు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న తాడుతో దాన్ని కట్టేస్తారు.అప్పుడది పారిపోలేదు.పెద్దయ్యాక కూడా దాంతోనే కట్టేసినా దాన్నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచన ఏనుగుకు రాదు.ఆ తాడును తెంచుకుని పారిపోవడం అసాధ్యం అనే ఆలోచనలోనే ఉంటుంది.ఏనుగు కాళ్లల్లో ఉండే బలం ముందు ఆ చిన్న తాడు ఏపాటిది కానీ అపనమ్మకం వల్ల ఏనుగుంతటి బలశాలి కూడా చిన్న తాడును తెంచుకోలేకపోతుంది.వాటిని తాను విడదీయలేని సంకెళ్లు అని ఊహించుకుంటుంది. చిన్న అపనమ్మకం మన బలాన్ని మర్చిపోయేలా చేస్తుంది.ఏనుగు లాగే మనం కూడా ఎప్పుడో ఒకసారి అపజయం పాలయ్యామని దాన్ని ప్రయత్నించడం ఆపేస్తాము...ఓడిపోతామనే భయం ఏనుగు కాలికున్న తాడు లాంటిది..కాబట్టి ఎప్పుడూ మనలో ఉన్న ఆలోచనలే మనల్ని బలహీనులుగా, బలవంతులుగా మారుస్తాయి వాటిని అర్థం చేసుకుని లక్ష్య సాధన కోసం కష్టపడుతే విజయం వరిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

248)జీవితంలో ఒక విషయం గురించి ఏం ఆలోచిస్తే అదే జరుగుతుందట.ఒక పనిని చేయగలం అని గట్టిగా నమ్మితే దానికి కావాల్సిన శక్తి ఎలాగైనా వస్తుంది. అసాధ్యమని నమ్మితే ఉన్న శక్తి పోతుంది.చెడు జరుగుతుంది అని ముందుగానే భయపడితే చెడు మాత్రమే జరుగుతుంది.అంతా మంచే జరగాలని విశ్వసిస్తే ఆశించిన ఫలితం ఉంటుంది.అందుకే మీ బలాలను నమ్మి ముందుకెళ్లండి.పరీక్షలైనా, ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా మీ పట్టుదలతో పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే గట్టి నమ్మకంతో క్యాన్సర్ వంటి రోగాల్ని కూడా జయించవచ్చు. అధైర్యపడితే కడుపునొప్పితో కూడా చనిపోవచ్చు కాబట్టి దేనికి నిరాశపడకుండా లక్ష్యం కోసం కష్టపడితే విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

249)అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది.ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది.కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది.బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది.సమస్య తలెత్తినపుడే మన సామర్థ్యం బయటపడుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

250)నమ్మినవారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు..బొగ్గువల్ల చేతికి మసి అంటిందని,వజ్రం దొరికితే వదులుకోలేం కదా....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

251)జీవితమంటే పుట్టుక నుంచి మరణం వరకు జరిగే ఒక ప్రయాణం.ఆ ప్రయాణం నేషనల్ హైవేలా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలంటే కుదరదు.గ్రామాలకు వెళ్లే డొంక దారుల్లా కూడా ఉంటుంది. ఒకప్పుడు నేషనల్ హైవేలు కూడా డొంక దారులే.కష్టపడి ఆ దారుల్లో రాళ్లు రప్పలు పోసి... తారును వేసి హైవేలుగా మార్చారు.మీరు కూడా రాళ్లు రప్పలమయంగా ఉన్న జీవితాన్ని పూలతో నింపుకోవాలి.నేను ఎందుకు అంబానీల కుటుంబంలో జన్మించలేదని బాధపడే కన్నా, మీరే అంబానీ అయ్యేందుకు,ఓ చరిత్రను సృష్టించేందుకు ప్రయత్నించండి.ఒక మూల కూర్చొని కుంగిపోవడం మానేయండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

252)జీవితంలో గెలిచిన సందర్భాల కన్నా, ఓడిపోయిన సందర్భాల నుంచి మనం ఎక్కువ నేర్చుకుంటాం.జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు.ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఆకలితో ఉన్న పొట్ట,ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు...ఈ మూడూ జీవితంలో మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతాయి.అందుకే జీవితంలో ఎదురైన ప్రతి కష్టం నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకొని లక్ష్యాల్ని సాధించాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

253)ప్రతి మనిషికి ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది. సాధ్యమైతే ఆ లోటును లేదా లోపాన్ని పూడ్చుకోవాలి.లేకపోతే ఆ లోటుతోనే బతకడం అలవాటు చేసుకోవాలి.అంతేగాని ప్రతిసారీ దాన్ని తలుచుకొని మనసుకు గాయం చేసుకోవడం మంచిది కాదు.కష్టాలు రాగానే కాలాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమీ లాభం లేదు.ఆ ఉన్న కాలం కూడా కరిగిపోతుంది.నాకే ఎందుకు ఇలా అవుతుందని బాధపడే కన్నా...ఆ కష్టాన్ని దాటేందుకు ప్రయత్నించి చూడండి.కాలం మంచి ఆటగాడికే సవాలు విసురుతుంది.చేతగాని చవటలను పక్కన పెట్టేస్తుంది.కాలం విసిరిన సవాలును మీరు ఎదుర్కొని గెలుపు పొందండి.ఆ గెలుపు ఎంతో గొప్పగా ఉంటుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

254)పని కోసం సమయం కేటాయిస్తే సంతృప్తి దొరుకుతుంది, వ్యాయామం కోసం సమయం కేటాయిస్తే ఆరోగ్యం దొరుకుతుంది, నవ్వడానికి సమయం కేటాయిస్తే ఆహ్లాదాన్నిస్తుంది,చదవడానికి సమయం కేటాయిస్తే వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది,ఇతరులకు సేవ చేయడానికి సమయం కేటాయిస్తే ఆనందాన్నిస్తుంది, మనసును ఆలోచనల్లో నిమగ్నం చేసేందుకు సమయమిస్తే మేధాశక్తి పెరుగుతుంది,ప్రార్థించడానికి సమయం కేటాయిస్తే మనశ్శాంతి దొరుకుతుంది.కాబట్టి ఆరోగ్యం, ఆనందం అన్నీ సమయంతోనే. మన అకౌంట్లో ప్రతి రోజూ పడే 86,400 సెకన్లుంటాయి వాటిని ఎంత జాగ్రత్తగా,దేనికోసం ఖర్చు పెడుతున్నామనేది చాలా ముఖ్యం.దాంతో జీవితం రూపు రేఖలే మారిపోతాయి ఎందుకంటే సమయం డబ్బు కన్నా విలువైనది.దాన్ని వాడుకోవడంలో విఫలమైతే ఏ విజయం మన ధరి చేరదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

255)విడిపోవడానికి చిన్న కారణం చాలు. ఎంత దగ్గరి స్నేహితులైనా అభిప్రాయ బేధాలు సహజం. మనస్పర్థలుతలెత్తడం ఖాయం. అప్పుడే వాదన ముదురుతుంది. తప్పు నీదంటే నీదని బెట్టు చేస్తారు. మెట్టు దిగడానికి ఎవరూఇష్టపడరు. ఇది ఏళ్ల స్నేహానికి గండి కొడుతుంది. ఒకప్పుడు యూ ఆర్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్న స్నేహితులేశత్రువుగా మారిపోతారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

256)ఈ సృష్టిలో గ్రీష్మ రుతువు,వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరువాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి.కాని కష్టాలు వచ్చినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు.ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు.కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు.నిజానికి కష్టాలు ఎలా బతకాలో మనిషికి నేర్పిస్తాయి.ఎన్నో గుణపాఠాలు అందిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం అయ్యేలా చేస్తాయి.అందుకే కష్టాలు వచ్చినప్పుడు వాటినుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలి కానీ వాటినుంచి పారిపోవడానికి ప్రయత్నించకూడదు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

257)ఈ జీవన ప్రయాణంలో ఎగుడు, దిగుళ్ళుంటాయి. గెలుపు,ఓటములు తప్పవు.ఓడినా,గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకూడదు.మన కష్టం వెంటనే ఫలించి గెలుపుని ఇవ్వకపోవచ్చు కానీ ఏదో ఒక రోజున మనం కోరుకున్న గెలుపును మనకు అందిస్తుంది.నిజానికి ఏ రంగంలోనైనా,ఎవరికైనా కష్టాలు ఉండి తీరతాయి. రైతుకు ఎలాంటి ఈతిబాధలు లేకుండా పంట చేతికి రాదు.వ్యాపారులకు ఎల్లప్పుడూ లాభాలే ఉండవు.సంకల్పబలం,కృషిని నమ్ముకున్న వారు మాత్రం ఏటికి ఎదురీదినట్లుగా ధైర్యంతో కష్టాలను ఎదుర్కొని అద్భుతమైన విజయాలను అందుకుంటారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

258)ప్రకృతి అంటే అందమైన పర్వతాలు,శిఖరాలు మాత్రమే కాదు.లోయలు కూడా.అలాగే జీవితమంటే ఆనందమే కాదు.ఆవేదన,కష్టాలు కూడా ఉండకతప్పవు. అందుకే మనకు కష్టాలు ఎదురయ్యాయని ఎవరినీ నిందించకూడదు.కలకాలం ఉండని కష్టాల గురించి కలత చెందకుండా స్థిత ప్రజ్ఞతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.మనోనిబ్బరాన్ని అలవరచు కోవాలి.కొందరు దైవంపై విశ్వాసాన్ని కోల్పోతారు. కాని ఎందరెందరో దైవభక్తులు మాత్రం ఎన్ని కష్టాలు, దుఃఖాలు అనుభవించినా తాము నమ్ముకున్న దైవాన్ని వీడలేదు.బాలభక్తుడైన ప్రహ్లాదుడిలా కష్టాల్లో కూడా స్థిరచిత్తులైనవారే ఆ దైవానికి ప్రీతి పాత్రులవుతారు కాబట్టి నువ్వు చేయాల్సింది చేయి మిగతాది దేవుడి చూసుకుంటాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

259)జీవితంలో మనకి కష్టాలు ఎదురైనప్పుడు,సమస్యలను పరిష్కరించుకోలేనప్పుడు చాలామంది నిరాశకు గురవుతారు.నిజానికి మనం ఉన్న పరిస్థితులకి మనమే కారకులం.అందుకే ఆ పరిస్థితులను మార్చుకోగల శక్తి కూడా మనలోనే ఉంది.మంచివాళ్లకి కష్టాలు వస్తే వారు రాటుదేలుతారు కాని కఠినులుగా మారరు.ప్రతీ మనిషి కష్టాలను ధైర్యంతో ఎదుర్కొని,సానుకూల దృక్పథంతో ముందుకు ప్రయాణించాలి.సాధారణంగా చాలా మంది కష్టం వచ్చినప్పుడే ఆ దేవుడిని కొలుస్తారు.కాని ఆయనను నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి,దాన్ని సులువుగా దాటే శక్తి మనకిస్తాడు.కష్టాలు కుంభవృష్టిలా మనల్ని ముంచేస్తే మనల్ని గొడుగుపట్టి కాపాడుతాడు.అప్పుడు మనం ఎలాంటి కష్టాలనైనా అవలీలగా అధిగమించగలం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

260)పక్షులు గూడు కట్టుకునే విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది.ఒక్కో కొమ్మ, పుల్ల తెచ్చి గూడును అల్లేస్తాయి.అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు వానకో, వరదకో,గాలికో,మన వల్లో నాశనం అయిపోతుంది. అలాగని అవి ఓడిపోయామని,అలిసి పోయామని ఊరుకుంటాయా? లేదు..మళ్లీ మరో చోటు వెతుక్కుని కొత్త గూడు కట్టుకుంటాయి.మనం కూడా ఇలా ఓటమి ఒప్పుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటే విజయమే మన వెంట వస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

261)ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనీ మొదలు పెట్టకండి.ఆ పని విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మొదలు పెట్టండి.ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ముందుగా ఆ పని నేర్చుకొని దానిపై దృష్టి పెట్టాలి. ఆ పని వల్ల వచ్చే ప్రతిఫలంపైనే దృష్టి పెడితే...మీరు ఆ పనిని పూర్తి చేయలేరు.మనసును లగ్నం చేయలేరు కాబట్టి ఫలితం మీద కాకుండా చేసే పనిపై మనసు పెట్టడం ముఖ్యం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

262)మనసు వెళ్లిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు.మనిషి ఎక్కడుంటాడో మనసు కూడా అక్కడే ఉండాలి.మనసు ఒకచోట, మనిషి ఒకచోట ఉంటే ఆ వ్యక్తి ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేయడం చాలా కష్టం కాబట్టి పని చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మీ మనసు ఉండేలా చూసుకోండి.అది స్థిరంగా మీతో పాటే ఉండాలి.అంతే తప్ప దాని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరగకూడదు.ఇది మీరు చేసే పనిపై దృష్టిలో నిలపకుండా చేస్తుంది కాబట్టి మనసును మీరు అదుపులో ఉంచుకుంటే విజయం దక్కి అవకాశాలు పెరుగుతాయి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

263)భయమే మీ ప్రధాన శత్రువు ఎప్పుడైతే మీలో భయం వస్తుందో విజయం ఆమడ దూరం పారిపోతుంది.అందుకే శ్రీకృష్ణుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని భయాన్ని విడిచిపెట్టమని చెప్పాడు యుద్ధంలో మరణిస్తే స్వర్గం లభిస్తుంది,ఒకవేళ గెలిస్తే రాజ్యం దొరుకుతుందని హితబోధ చేశాడు.మనం కూడా అంతే..చేసిన పనిలో వైఫల్యం చెందితే అనుభవం వస్తుందను కోవాలి,అదే విజయం సాధిస్తే మనం అనుకున్నది సాధించామనే తృప్తి దొరికిందనుకోవాలి.అంతే తప్ప విజయం సాధిస్తానో లేదో అన్న భయం మనసులొంచి తీసేసి ప్రయత్నిస్తే విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

264)ఏ మనిషిని ఎవడూ నాశనం చేయలేడు...అలాగే ఏ మనిషి ఇంకొకడిని బాగు కూడా చేయలేడు....అన్నింటికి మన ఆలోచనలు మన ప్రవర్తనే కారణం...మంచిగా ఆలోచించి మంచిగా ప్రవర్తిస్తే శిఖరాన కూర్చోబెడతాయి..పొగరుతో ఆలోచించి తలతిక్క పనులు చేస్తే సంక నాకించేస్తాయి..మన కధ మెదటి పేజీలో మనం ఎంత గొప్పోళ్ళుగా ఉన్నా సరే సుఖాంతమయ్యే చివరి పేజీలో మాత్రం గొప్ప మనిషి అనిపించు కోకపోతే... అప్పటి వరకూ బ్రతికిన మన బ్రతుకు అంతా చాలా చులకనయి పోతుంది...చివరిగా...ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోవద్దు పనికిరానివి పట్టించు కోవద్దు..విరిచేయడం, విసిరేయడం ఎంత పని... భద్రంగా చూసుకోవడం,పెట్టుకోవడం కష్టం..ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు కాలమే సమాధానం చెబుతుంది.కోల్పోయింది ఎప్పటికి తిరిగి రాదు.ఒకవేళ వచ్చిన అది ముందులా ఉండదు..అది ప్రేమైనా,స్నేహమైనా, వస్తువైనా,బంధమైనా.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

265)జీవితంలో కొన్ని కొన్ని వదిలేస్తేనే సంతోషంగా ఉండగలం చెప్పినంత సులభం కాదు అంటారేమో కానీ ఒక్క సారి మీ మనసుకి వద్దనుకున్నది కాదనుకున్నది వదిలేసి చూడు మునుపటి కన్నా కొన్ని వందల రేట్లు సంతోషం నీ చేరువవుతుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

266)జీవితంలో కోపం వల్ల మనకి నష్టమే తప్ప ఆవగింజంత లాభం కూడా ఉండదు.ఇది మనల్నే కాదు,మనతో జీవిస్తున్న వారిని కూడా నాశనం చేస్తుంది.భావోద్వేగాల్లో కోపం కూడా ఒకటి.కానీ కోపం మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటే మీకు జీవితమే లేకుండా పోతుంది.కోపం ఎన్నో అనర్థాలకు కారణం కోపం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.ముఖ్యంగా అసంతృప్తి కారణంగా కోపం పుట్టుకొస్తుంది.అయితే ఆ కోపం కట్టలు పెంచుకునే వరకు ఉంచుకోకూడదు..కాబట్టి ఎప్పటికప్పుడు కోపాన్ని వదిలి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

267)నేను చేయగలను అని అనుకునేదే ఆత్మవిశ్వాసం.ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే మాత్రం ఏ రంగంలోనైనా ఎవరైనా సరిగ్గా రాణించలేరు.ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.దృఢమైన సంకల్పం ఉంటే ఎవరైనా దేన్నైనా సాధించగలరు..ఏ పనైనా సాధించే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుందన్నది ఆయన మాట.ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి.ఈ అవగాహన మన మాటల్లో ధ్వనించాలి.ఓటమి విజయానికి మెట్టు..అందుకే అపజయానికి కుంగిపోకూడదు. ఎందుకు ఓటమిపాలయ్యాను అని తనను తాను ప్రశ్నించుకునేవాడే విజయం సాధిస్తాడు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

268)జీవితంలో వేసే ప్రతి అడుగుకు భయపడడం మానేయాలి.అలా అడుగులు వేసాక వచ్చే పరిణామాలను స్వీకరించాలి.అంతే తప్ప పశ్చాత్తాప పడుతూ కూర్చోకూడదు.అది మంచైనా చెడైనా ఒక పని చేశాక పశ్చాత్తాపాన్ని వీడి ముందుకే సాగడం అలవాటు చేసుకోవాలి అలాగే చేసే పనిని భయంతో చేసినా, ఆ పని పూర్తయ్యాక పశ్చాత్తాప పడినా కూడా ఫలితాలు సవ్యంగా రావు. మీరూ చేసే ప్రతి పని,తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీకు మీరు స్వీకరించాలి,అంగీకరించాలి.అప్పుడే మీకు అది ప్రోత్సాహాన్ని అందిస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

269)నెమలికి నాట్యం అందం..కోకిలకు గానం అందం..కాకికి నలుపు అందం..హంసకు తెలుపు అందం..సెలయేరుకు గలగల అందం..సముద్రానికి శాంతం అందం..అడవికి పచ్చదనం అందం..ఎడారికి ఇసుక అందం..చంద్రునికి వెన్నెల అందం..సూర్యునికి మండే భగభగ సెగలే అందం..కాబట్టి ఎవరి సుగుణాలు వాళ్లకుంటాయి.కోకిల నాట్యం చేయలేదు.నెమలి కోకిలలాగా వినసొంపుగా కూయలేదు.ఇసుక అడవిలో ఉంటే విలువ లేదు...ఎడారిలో చెట్టు బ్రతకలేదు.కాబట్టి ప్రతి మనిషి తనకున్న మంచి గుణాల్ని గుర్తించి వాటికి పదును పెట్టాలి కానీ, వాళ్లకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదు...దేవుడు ప్రతి ఒక్కరికి ఎదో ఒక అద్భుతమైన ప్రతిభని ఇచ్చే భూమి మీదకి తీసుకుని వస్తాడు దానిని గుర్తించి సాదించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

270)జీవితంలో అత్యంత అందమైన సంబంధాలలో స్నేహం ఒకటి. ఎలాంటి రక్తసంబంధం లేకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్టు జీవించేలా చేసేదే స్నేహబంధం. అమ్మా నాన్నని మనం ఎంపిక చేసుకోలేం,కానీ స్నేహితులను మాత్రం మనం ఎంపిక చేసుకోగలం. మనం నవ్వినా,ఏడ్చినా,గొడవ పడినా అది స్నేహంలో అందమైన అనుభవాలే.స్నేహమంటే ఒక నమ్మకం...ఒక భరోసా నాకు ఎం జరిగినా నా దోస్త్ ఉన్నడులే అని ధైర్యంగా చెప్పుకోవడానికి నలుగురిని సంపాదించుకోమని పెద్దలు చెప్పారు..స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'.హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది..కాబట్టి ఆ స్నేహ పరిమళాన్ని ఎంత మీరు విస్తరించుకుంటే అంత విశాలంగా మారుతుంది మన హృదయం.. స్నేహితుల రోజు శుభాకాంక్షలు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

271)అద్దం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా!మనం అద్దంలో కి చూడగానే మన ముఖం ఎలా ఉంటే అలానే చూపెడుతుందిగా అందంగానే అందవిహీనంగా చూపదుగా?”అలాగ్ అద్దం లాగ నువ్వు కూడా నీ స్నేహితులకు నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి!’ అని అర్థం. తప్పైతే తప్పని,ఒప్పైతే ఒప్పని, అంతే కానీ ఎక్కువతక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు!” అన్నారు.అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది! నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు..అలాగే ‘ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి,వారి వెనుక మాట్లాడకూడదు!’ అని అర్థం.అద్దం మన ముఖంపైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో ఆ అద్దాన్ని పగలకొట్టం కదా, అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా, మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి!’అని చెబుతుంది..కాబట్టి ఉంటే మనం అద్దంలా అయినా లేక దీపంలా అయినా ఉండాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

272)ఎంతో అందమైన బంధం కదా కళ్ళది.మన మనస్సు ఎలా స్పందిస్తే దానికి అనుగుణంగా ఒకేసారి స్పందిస్తాయి.ఎప్పటకి అవి కలుసుకో లేకపోయినా ఒకరిని ఒకరు చూసుకోక పోయినా కలిసి నవ్వుతాయి,కన్నీరు,అలక,కోపం,భాద అన్నీ కలిసే.నిజమే కదా కలిసి దగ్గర ఉంటేనే బంధం ఉంటుందా మనస్సులు కలిస్తేనేగా దగ్గర అనే భావం పెరిగేది.కళ్ళు పలికించే భావాలు అన్నీ మనసు నుంచే కనిపిస్తాయి.మనసులోని భావాలు మనసు చెప్పలేని రోజు మాట తడబడిన రోజు కళ్ళు చూస్తే మనసులోని భావం అర్థం అవుతుంది.ప్రేమున్న చోట మాటలు అవసరం లేదు.కళ్ళు చూసి చెప్పొచ్చు అవి ఎన్నో భాషలు మాట్లాడతాయి.అర్థం చేసుకునే మనసు ఉంటే కళ్ళు ఎన్నో మాట్లాడతాయి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

273)జీవితంలో ఎదగడం అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.మానసికంగాఎదగడం,భావోద్వేగాల విషయంలో పరిపక్వత రావడం,చిన్న పెద్దా సమస్యలకు తేడా తెలియడం..ఇలా చాలా ఉంటాయి.అన్నీ సాధించిన మనిషి, అన్నీ తెలిసిన మనిషి నిజ జీవితంలో ఉండరు.మనం అన్నీ సాధించేశాం అని విజయ గర్వంతో ఉప్పొంగిపోతే కష్టపడి కట్టుకున్న జీవితం అనే కోట కుప్ప కూలుతుంది.అందుకే ఆనందమైన, సంపూర్ణమైన జీవితం అనుభవించాలంటే..మనకంటూ కొన్ని నియమాలు మనమే పెట్టుకోవాలి..అవి ఏంటంటే కోపం, ద్వేషం, బాధ.. ఏవైనా క్షణికం అని తెల్సుకోవాలి..ఏం జరిగినా స్వీకరించడం నేర్చుకోవాలి..ప్రతిసారీ ఒప్పు చేయాలనే ఆలోచన నుంచి బయటకు రావడం.తప్పులు చేయడం పెద్ద తప్పు కాదని తెలియాలి.తప్పుల నుంచి నేర్చుకోవాలి.తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అది తప్పుకాదని తెల్సుకోవాలి..మనవల్ల ఏ పనైనా కాకపోతే,ఎట్టి పరిస్థితుల్లో ఇక కాదని తెలిస్తే విరమించుకోవాలి.మనవల్ల కాదని చెప్పగలగాలి.నో చెప్పడం నేర్చుకుంటే సగం సమస్యలు మనకు రానే రావు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

274)ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు వినే వాళ్ళు ఉన్నప్పుడు విషయం విలువ అర్థాలు కూడా మారిపోతాయి.చెప్పే వాళ్ళు ఉండాలి వినే వాళ్ళు కూడా ఉండాలి.ఎప్పుడైతే ప్రేమ లేకుండా ఉంటుందో అప్పుడు కూడా అర్ధాలు మారిపోయి అపార్థంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.వినే ఓపిక సహనం కూడా ఎవ్వరికి ఉండదు.కొంత మందికి చెప్పే వాళ్ళు ఉన్న వినే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.కొంత మందికి వినే అవకాశం ఉన్న చెప్పే వాళ్ళే ఎవ్వరు ఉండరు.చెప్పే వాళ్ళు ఉండటం ఎంత అవసరమో వినే వాళ్ళు ఉండటం కూడా అంతే అవసరం.విలువ అనేది అధికారాన్ని బట్టి ఆస్తిని బట్టి కాదు వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది విలువ ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించు కోవాల్సింది విలువ ఇచ్చేవాళ్ళు ఎవరికి ఎలా విలువ ఇవాలన్నది నువ్వు నిర్ణయించుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళ అవకాశాన్ని బట్టి కాదు అంటే తప్పు నీలోనే ఉంటుంది ఎవరికి విలువిస్తున్నావు అనేదాన్ని బట్టి కేవలం డబ్బును బట్టి విలువిస్తున్నావంటే నీ వ్యక్తిత్వానికి వెలకట్టి అమ్మేస్తున్నట్టే.నిర్ణయం నీకే వదిలేస్తున్నా నువ్వు ఎవరికి విలువస్తున్నావో దేనికి విలువిస్తున్నవో నీ ఊహకే వదిలేస్తున్నా...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

275)కాలం ఎప్పుడూ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది..అలాగే జీవితం కూడా నీకు రెండు విధాలుగా పరీక్ష పెడుతుంది.మొదటిది...నువ్వు కోల్పోయిన జీవితాన్ని మర్చిపోవాలి...రెండోది...కొత్త జీవితాన్ని ప్రారంభించాలి...కష్టమైనా నువ్వు రెండోదే ఎంచుకో...కొత్తగా జీవితాన్ని ప్రారంభించు..వచ్చిన అవకాశాలు నిన్ను నువ్వు నిలబెట్టకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి..లేదంటే మళ్లీ నీ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే నిన్ను చూసి చప్పట్లు కొట్టడానికి చాలామంది ఉంటారు కానీ సహాయం చేయడానికి ఒక్కడు రాడు..కాబట్టి నిన్ను నువ్వు సెల్ఫమోటీవేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే విజయం దానంతట అదే నీ దగ్గరకి వచ్చి తీరుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

276)ఒక మనిషిని  ఒక్క రోజు మోయడం కంటే..ఒక మనసు ని కొన్ని వేల సంవత్సరాలు మోయడం కష్టం అలా మోసే వారు ఎందరో ఉన్నారు.కేవలం ప్రేమ అనే ఒక్క కారణం వల్ల మనిషి వేరొక మనిషిని మోసే బరువు పైకి కనిపిస్తుంది కానీ మనసు ఇంకొక మనసును మోసే బరువు ఎవరికి కనిపించదు.మోసే మనసుకు తెలుసు ఎంత బరువు బాధ ఉందో అయినా కూడా మోస్తూనే ఉంటుంది.బరువుగా ఉందని ఒక మనసును తీసేసి ఇంకొక మనసుని పెట్టలేదు అలా తీసేసి పెట్టే మనసుకు ఇంకొక మనసు విలువ తెలియదు ఎందుకంటే మోసే వాళ్ళకి బరువు తెలుస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

277)జీవితంలో నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు..ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను అర్థం చేసుకునేవారు..నీవు ఏ స్థాయిలో ఉన్నా గౌరవించేవారు..నీవు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారు నిజమైన స్నేహితులు.జీవితంలో పరిచయాలు చాలా మందితో ఉంటాయి కానీ చొరవ కొందరితోనే ఉంటుంది.మీ గురించి ఆలోచించేవారు చాలా మందే ఉంటారు కానీ నిస్వార్థంగా ఆలోచించేవారు కొందరే ఉంటారు..ఈ ప్రపంచమంతా ఒక్కటై మీ మీద యుద్ధం ప్రకటించినా సరే.. వారు మాత్రం మీ తరఫునే నిలుస్తారు.మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు.కష్టాల నుంచి గట్టెక్కించే మార్గం చూపుతారు.ఆలోచనల్లో,ఆచరణలో మీ వెన్నంటే ఉంటారు.అందుకే స్నేహం గొప్పదని,విలువైనదని అంటారు పెద్దలు.ఫైనల్లీ..స్నేహం ఒక భరోసా,స్నేహం ఒక ధైర్యం.స్నేహం ఒక ఆత్మస్థైర్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

278)ఇవ్వడం తెలిసిన వాళ్లకి తీసుకోవడం కూడా తెలిసి ఉండాలి అది వస్తువైనా ప్రేమైనా సరే.తీసుకునే అర్హత ఉన్నప్పుడు ఇచ్చే బాధ్యత కూడా ఉండాలి.ఇవ్వడం తెలియనప్పుడు మళ్లీ తీసుకునే అర్హత కోల్పోతారు వాళ్ళు ఎవరైనా సరే.కోల్పోయింది ఎప్పుడు గతంలా ఉండదు కోల్పోక ముందే నిలబెట్టుకోవాలి ప్రేమ అయినా నమ్మకమైన...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

279)జీవితంలో అంతా కోల్పోయినా సరే, Zero based స్థాయి నుండి జీవితాన్ని పునః ప్రారంభించే శక్తి, ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు, కావాల్సిందల్లా కాస్త పట్టుదల, దీక్ష, శ్రమ.. ఈశ్వరానుగ్రహం ఎలాగో ప్రతీ ఒక్కరికి ఉంటుంది, దానికేం కొదవ లేదు. లేదనుకొంటే మీ పొరపాటే. కానీ ఒక్కటే సూత్రం మైండ్లో ఎప్పుడూ ఉండాలి, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు జీరో🤷‍♂️పోయేటప్పుడు ఏం తీసుకువెళ్ళం అది కూడా జీరోనే🤷‍♂️ మధ్యలో ఇదంతా చిన్న ప్రయత్నం అంతే, మహా అయితే ఏమైతుంది మళ్ళీ Zeroకే పడతావ్ అంతే కదా..🤔 అంతకుమించి ఏమైన జరుగుతుందా..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

280)చిగురు నుండే చెట్టు..సంకల్పం నుండే ఆశ..ఆత్మ అభిమానం నుండే అహంకారం..అణిచివేత నుండే తెగింపు..నమ్మకం నుంచే ఆత్మవిశ్వాసం పుట్టుకొస్తుంది..జీవితం ఇంకా ఉంది..చిట్ట చివరి అవకాశం ఇంకా ఉంది.వేరులోనే చెట్టు ఉన్నప్పుడు చిగురించే అవకాశం వాన చినుకు వల్ల చుట్టూ ఉండే గాలి వల్ల చిగురు పుట్టుకొస్తుంది..అలాగే మనం ఎంత ఓడిపోయిన శక్తి ఉన్నంత వరకు గెలిచే అవకాశం కాలమే తీసుకొస్తుంది పరిస్థితులను అనుకూలించే వరకు ఓపికతో సహనంతో ఎదురు చూడాలి అంతేకాని ఓడిపోయానని ఎప్పుడూ అనుకోకూడదు..అంతా అయిపోయింది ఇంకేం లేదు వాన చినుకులా వచ్చే ఆ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

281)కొందరి జీవితాల్లో కొంతమంది చేసే కొన్ని తప్పులేంటో తెలుసా?..అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మేయడం..మనల్ని పట్టించుకోని వాళ్ళను కూడా కేర్ చేయడం..అన్నీటికన్నా ముఖ్యమైనది మోసం చేయడం నటించడం రాకపోవడం..వెంటనే క్షమించేయడం..సాయం అడిగితే లేదని చెప్పకపోవడం ఇవి ఈ కలికాలంలో చేసే అతిపెద్ద తప్పులని కొంతమంది ప్రవర్తించే తీరు చూస్తే ఏదోగా ఉంటుంది అలాగే అతి స్నేహం,అతి ప్రేమ అతి చనువు మన మనశాంతికి హానికరం ఎందుకంటే అతిగా దేనైనా పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సివస్తుంది కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో ఆలోచించి చేయండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

282)జీవితంలో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్ని కష్టాలు,ఎన్ని కన్నీళ్లు,ఇవన్నీ దాటుకుని ఈరోజు నిలబడ్డావో..ఎన్ని సవాళ్లతో ఈరోజుకి నువ్వు పోరాడుతున్నావో..ఒక్కసారి గుర్తు తెచ్చుకో జీవితమనే యుద్ధంలో నీ కన్నా గొప్ప యోధుడు మరి ఎవరూ లేరని.నీకు నువ్వే ఇన్స్పిరేషన్ అని అందుకే అలాగే అన్నింటికి..ఎక్కువగా ఆలోచించకు..అది మనఃశాంతికి హానికరం..నీ లోపల నుండి నిన్ను చంపేస్తుంది అని నీకు తెలుసు కానీ,నువ్వు ఆపలేవు ఎందుకంటే నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే..యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంత కన్నా ఎక్కువ కష్టం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

283)ఎప్పుడైనా ఒక విషయం గురించి అవగాహన లేనప్పుడు,తప్పులు మాట్లాడుతామేమో అన్న భయం ఉన్నప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.అలాగే ఎదుటివారి పెడార్థాలు తీసే అవకాశం ఉన్నప్పుడు కూడా చాలా పరిమితంగా మాట్లాడాలి.కట్టె,కొట్టె,తెచ్చే...పద్దతిలో మాట్లాడాలి ఏందుకంటే ముఖ్యంగా మాట్లాడే వ్యక్తి కన్నా వినే వ్యక్తితో శక్తి తక్కువగా ఖర్చు అవుతుంది.వినే వాళ్లు కేవలం చెవులకు పని చెబితే చాలు.కానీ మాట్లాడాలంటే మాత్రం ముందుగా ఆ విషయం గురించి నేర్చుకోవాలి.ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు.తక్కువ మాట్లాడే వ్యక్తులకు ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. వివేకంతో స్పందిస్తారు.మాట్లాడేటప్పుడు క్లారిటీగా ఉంటారు. తక్కువ మాట్లాడే వారి మాటలకు విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవసరమైన సమయంలో మాత్రమే నోరు విప్పండి.అనువుగాని చోట శాంతంగా ఉండడమే మంచిది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

284)మీ జీవితంలో ఎదురయ్యే వారిని ఎవరినీ చులకనగా చూడకండి.ఎప్పుడో ఒకసారి వారు మళ్ళీ మీ జీవితంలో తారసపడవచ్చు.వారి అవసరమే మీకు పడవచ్చు.జీవితం గుండ్రని చక్రంలాంటిది.ఆ చక్రంలోనే మనం తిరుగుతూ ఉండాలి.ఆ క్రమంలో ఎవరి అవసరం ఎప్పుడు పడుతుందో అంచనా వేయడం కష్టం కాబట్టి మీకు మంచిగా జరుగుతున్నప్పుడు ఎదుటివారిని చులకనగా చేసి,తక్కువగా అంచనా వేసి మాట్లాడవద్దు.ఎప్పుడో ఒకసారి మీ తలరాత బాగోకపోతే వారే మీకు సాయం చేయాల్సి వస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

285)ప్రేమని పొందలనుకోవడం తప్పు కాదు కానీ అది లేదు అని తెలిసికూడా దానికోసం వెతకడం మూర్ఖత్వం.ప్రేమలో ఎప్పుడూ మనం గమనించాల్సింది..వాళ్ళు లేకపోతే మనం ఉండలేకపోతున్నామా అన్నది కాదు.మనం లేకపోతే వాళ్ళు ఉండలేకపోతున్నారా అనేది చూడాలి.ఒక వస్తువుకి,కట్టే బట్టకి, ఖర్చు చేసే డబ్బుకి,తిరిగేచోటుకి, మాట్లాడే మనుషులకి వారు ఇచ్చే ప్రాధాన్యం ఎలా ఉంటుందో చూసి నిర్ణయించుకోవాలి....వారు మన జీవితంలో ఉండాలా...వద్దా...అని..! అప్పుడు ప్రేమించండి...ఇవన్నీ ఎందుకంటే...వారి ప్రేమను,వారి వ్యక్తిత్వాన్ని,వారి నిలకడను నిర్ణయించే అంశాలు ఇవే.ఒకరు మనతో మాట్లాడడం లేదు అనే బాధ కంటే అస్సలు ఎందుకు మాట్లాడడం లేదో అని తెలియక పోవడమే మరింత బాధని ఇస్తుంది.మనల్ని..నిజంగా ప్రేమించేవారు ఎప్పుడూ మనతో భవిష్యత్తు ఎలా ఉండాలో ఆలోచన చేసుకుంటూనే ఉంటారు...ప్రస్తుత జీవితాన్ని...ఎప్పటికప్పుడు భవిష్యత్తుకి అన్వయిస్తూనే ఉంటారు..ప్రేమ అని భ్రమ పడే వారికి,ప్రేమ అని మోసం చేసే వారికి ప్రస్తుతం ఉన్న జీవితం మాత్రమే ముఖ్యం..వాళ్ళు మనతో భవిష్యత్తు నీ అసలు ఊహించుకోరు.అలాంటివారిని తక్షణమే పక్కన పెట్టినరోజు జీవితం మారుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

286)మన జీవిత లక్ష్యాన్ని కనుగొనడానికి ఒక మార్గం మన బలాన్ని అంచనా వేయడం.మనకు ఉన్న నైపుణ్యాలు,సామర్థ్యాల గురించి ఆలోచించాలి.మనం దేనిలో మేటి? మనల్ని దేనిపై అభినందిస్తారు?వాటిని గుర్తించాలి ఆ తర్వాత, వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశాల కోసం చూడాలి అలాగే మన జీవిత లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడంలో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించడం కీలకమైన దశ. మన జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో ఆలోచించడానికి కొంత సమయం కేటాయించాలి..మన దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు ఏమిటి? వాటిని సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలి అప్పుడే మనకు ఒక దిశను ఇస్తుంది..ఆ మార్గాల్లోనే ప్రయాణిస్తూ లక్ష్యాల్ని ఛేదిస్తే విజయం తధ్యం ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

287)కష్టం ఎప్పుడూ ఉండిపోదు..సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా ఓర్చుకో..సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి..మనసుకు ఆశ ఎక్కువ దేన్నైనా కావాలంటుంది..కాలానికి అనుభవం ఎక్కువ..ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది..అందని దానికోసం ఆశపడకు..నచ్చని దానికోసం కష్టపడకు..నీకోసం కష్టపడే వారిని మర్చిపోకు..నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

288)వరదలు వచ్చినప్పుడు తేలే చీమల్ని చేపలు తింటాయి.వరదలు వచ్చిపోయాక చచ్చిపడే చేపల్ని చీమలు తింటాయి.టైం మేటర్స్!! సబ్బు తయారు చేయాలంటే నూనె కావాలిన అదే నూనె మరక పోవాలంటే సబ్బు కావలి.డ్రామా చూసేందుకు ముందు వరసలో కూర్చుంటాం అదే సినిమా చూసేందుకు వెనక వరుసలో కూర్చుంటాం అందుకే..ముందు వెనకాల జయాలు..అపజయాలు ..అనేవి వేరేవాటితో పోల్చి చూసుకున్నప్పుడు కనిపించే పరిణామాలు మాత్రమే.ప్రామాణికాలు కావు.అవి కేవలం సాపేక్షకాలు.అందుకే..సమస్య వచ్చిపడింది..జీవితం అయిపోయిందని అనుకోకూడదు.దానిని ఓ సవాలుగా స్వీకరించాలి.అందరికి అవకాశం వస్తుంది.దానికోసం ఎదురు చూడాల్సిందే....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

289)జీవితం ముళ్ళబాట అని చింతిస్తూ కూర్చునేకంటే ,గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని నిర్మించుకుని ప్రయత్నాలు ఆరంభించడం ధీరుల లక్షణం.అటువంటివారే  ముళ్ళబాటైన  జీవితాన్ని సైతం పూలబాటగా మార్చుకోగలరు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

290)నేను చేయగలను అని అనుకునేదే ఆత్మవిశ్వాసం.ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే మాత్రం ఏ రంగంలోనైనా ఎవరైనా సరిగ్గా రాణించలేరు.ఆత్మవిశ్వాసం అనేది మనకి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.దృఢమైన సంకల్పం ఉంటే ఎవరైనా దేన్నైనా సాధించగలరు.మనకి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అలాగే ఏ పనైనా సాధించే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుంది..ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి.ఈ అవగాహన మన మాటల్లో ధ్వనించాలి.ఓటమి విజయానికి మెట్టు..అందుకే అపజయానికి కుంగిపోకూడదు.ఎందుకు ఓటమిపాలయ్యాను అని తనను తాను ప్రశ్నించుకునేవాడే విజయం సాధిస్తాడు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

291)విజయం సాధించినవారికి,సాధించనివారికి మధ్య తేడా ఈ ఆత్మవిశ్వాసమే అని తెలుసుకోగలిగితే గెలుపు మన అందుబాటులో ఉంటుంది..ఆత్మవిశ్వాసం అనేది మహాద్భుతమైన గుణం. ఒక వ్యక్తి తన సరిహద్దులను అధిగమించి,తనలోని నమ్మకాన్ని ప్రోత్సహించే మానసికస్థితిని చేరుకోవాలి..సందేహం నుంచి విముక్తి పొందడానికి, తనను తాను ప్రేమించు కోవడానికి,విజయానికి నమ్మకం సాయం చేస్తుంది. వైఫల్యాలను ఎదుర్కోవడానికీ ఈ నమ్మకమే దోహదపడుతుంది.ఆశావాదం ఆత్మవిశ్వాసానికి మరో రూపం.ఆశయాలను సాధించేందుకు తనను తాను నమ్మే గుణాన్ని కలిగిఉండాలి..ఇలాంటి వారు సొంత సామర్థ్యంపై ఆధారపడితే వల్ల ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. అప్పుడు ఎల్లెడలా విజయం మనదే!...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

292)విలువ లేని చోటుకి అసలు వెళ్ళనే కూడదు ఒకవేళ వెళ్లవలసిన పరిస్థితి వస్తే వెళ్లి అక్కడ ఉండకూడదు ఒకవేళ ఉండ వలసిన పరిస్థితి వస్తే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేయాలి..గౌరవం లేని చోట నిలబడటం అంటే అవమానాన్ని ఆహ్వానించినట్టే..ఒకసారి అవమానం పడినంత మాత్రాన ఏమీ కాదులే అనుకో కూడదు..అవమానం ఎప్పటికీ అవమానంలానే ఉంటుంది..అవమానం కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మళ్లీ అవమానం పడే పరిస్థితి రాకుండా ఉండటం కోసం..అలాగే పడి లేచిన కెరటంలా మళ్ళీ పైకి నిలబడి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా మలుచుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

293)ఏదైనా పనిచేసినప్పుడు వైఫల్యం ఎదురవ్వచ్చు కానీ వాటిని మనం తప్పులుగా భావించకూడదు వాటిని పాఠాలుగా భావించాలి మనం ఒక పనిలో వైఫల్యం చెందితే ఆ తరువాత విజయం ఎలా పొందాలో ఆలోచించాలే తప్ప ఒక ఓటమితో ఆగిపోకూడదు ఓటమి విజయానికి మొదటి మెట్టుగా భావించాలి.మన చుట్టూ సానుకూల వ్యక్తులు, సానుకూల దృక్పథాలు,సానుకూల కథనాలు వంటివి మాత్రమే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి..రేపటి గురించి ఆలోచిస్తూ లేదా నిన్న జరిగిన దాని గురించి బాధపడుతూ ఉండకూడదు.వర్తమానంలో బతికేందుకు ప్రయత్నించాలి ఎందుకంటే వర్తమానంలోనే మనకు మనం నచ్చినట్టుగా ఆనందంగా జీవించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

294)సానుకూల ఆలోచనలు శారీరక,మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం ఎందుకంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనం అంతా బావుందనుకుంటే... మనకంతా మంచిగానే కనిపిస్తుంది.మన బుర్రలో నెగిటివ్ ఆలోచనలు నిండిపోతే మనల్ని కాపాడడం ఎవరితరం కాదు. నిత్యం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటూనే ఉంటాము.సానుకూల ఆలోచనలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.సమస్యల నుంచి బయటపడేస్తాయి.చిన్న సాయమైనా కూడా మీరు ఇతరులకు కృతజ్ఞతగా ఉండండి.చిన్న సవాళ్లు ఎదురైనా కూడా వాటిని నెగిటివ్ గా చూడకుండా, వాటిని దాటేందుకు ప్రయత్నించండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

295)నీళ్ళు ఇంటికి రాగానే మొట్టమొదట చేసే పని ఫిల్టర్ చేయడం.తరువాత ప్రస్తుత పరిస్తితులను బట్టి కాచి తాగాలి..అలానే పాలు తేగానే మరగ కాచి,ఉపయోగిస్తాము..లేకపోతే బాక్టీరియా ప్రభావం వలన పాలు విరిగి పోతాయి..అలానే అసహ్యం,అసూయ,కోపం,బాధలోంచి వచ్చే మాటలు పెదవి దాటక ముందే వడబోయాలి ఇంకా చెప్పాలంటే ఇలాంటి సందర్భాలలో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎంతో మంచిది.ఎందుకంటే మాటలకు మనసులను విరిచే శక్తి ఉంటుంది..పాలు విరిగితే నష్టమేమీ  లేదు..ఇంకొకటి కొనుక్కోవచ్చు..మనసు విరిగితే తిరిగి అతుక్కోదు,పైగా బంధం దూరమైపోతుంది..మనం మాట్లాడే మాటలు ఎదుటివారి మనసును తట్టినట్లు ఉండాలి కానీ కొట్టినట్లు ఉండకూడదు..ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి..మన నోటి నుండి వచ్చే మాట మన ఆధీనంలో ఉంటే,ప్రపంచమంతా మన ఆధీనంలో ఉంటుంది..ఎందుకంటే మాటే మంత్రం.మాటే అనుబంధం,ఆత్మీయం!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

296)ఒకరి మంచితనాన్ని ఎవరైనా సరే చేతకానితనంగా తీసుకోకూడదు ఆ మంచితనం మర్చిపోతే వాళ్ళ కంటే రాక్షసులు ఇంకెవరూ ఉండరు..స్వార్థం మనిషి జన్మ హక్కు కానీ ఆ స్వార్థానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది స్వార్థం శృతిమించితే జీవితాలు తారుమారవుతాయి..నిజాయితీ లేని బంధాలకి..బజార్లులోని వస్తువలకి పెద్ద తేడా ఏమి ఉండదు.అవసరానికి వాడుకోవాదం లాంటివే రెండునూ..ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మాటల గారడీ అయినా వచ్చి ఉండాలి లేక నటన ప్రావిణ్యమైనా ఉండాలి..మంచితనం నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాదిగా చేసుకుని ఎదుగుతుంది ఈ సమాజం..కాబట్టి కొంచెం లౌక్యం ప్రదర్శించడం చాలా అవసరం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

297)నీ జీవితంలో ఎక్కువగా నీకు చెడు జరుగుతుంది అంటే అంతకంటే మంచి ఏదో గొప్పది ఏదో నీ జీవితంలో జరగబోతుంది అని అర్థం..నీకు ఎంత చెడు జరుగుతుందో నీకు అంతే మంచి జరుగుతుంది..నీకు మొదట మంచి జరిగితే తర్వాత చెడు జరుగుతుంది ఆ తర్వాత మంచి జరుగుతుంది రెండు సమానంగా నీకు జరుగుతాయి..ఒకరు దూరమైతే ఒకరు దగ్గర అవుతారు..ఒకరితో ప్రేమ ఉంటే వేరొకరితో పెళ్లి ఉంటుంది.అందరికీ ఇలాగే జరుగుతుంది కొంతమందికి ముందు జరుగుతుంది కొంతమంది వెనకాల జరుగుతుంది..ఇంతకంటే గొప్పగా ఏమి జరగదు..జీవితం మొదట అందంగా ఉంటే చివరి దశ కష్ట కాలంలో ఉంటుంది జీవితం మొదటి దశ కష్టకాలంగా ఉంటే చివరి దశ అద్భుత కాలం ఉంటుంది..ఎప్పుడో చచ్చిపోవాల్సిన నువ్వు ఇంకా బదుకున్నావంటే ఏదో ఒక కారణం వల్లే బ్రతికి ఉంటావు..ఒకటి నీవల్ల ఎవరైనా ఏడవడానికి లేదా ఎవరి వలన అయినా నువ్వు ఏడవడానికి నువ్వు బ్రతికి ఉంటావు..ఒకరి వల్ల నువ్వు సంతోషంగా ఉండటానికి లేదా మీ వల్ల ఇంకొకరు ఎవరో సంతోషంగా ఉండడానికి నువ్వు బ్రతికి ఉండాలి.నువ్వు ఎవరినైనా ప్రేమించడానికి నిన్ను ఎవరైనా ప్రేమించడానికి నువ్వు బ్రతికి ఉండడానికి కారణ మవుతుంది.ఈరోజు నువ్వు బాధపడుతున్నావంటే ఏదో ఒక రోజు నువ్వు సంతోషంగా ఉండబోతున్నావని అర్థం..ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావంటే మళ్ళీ బాధపడటానికి ఉండబోతున్నావు అని అర్థం..సుఖం సంతోషం కష్టం బాధ నీ జీవితంలో వచ్చే చుట్టాలంటివి ఎల్లకాలం నీతో ఉండవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

298)సమస్య కంటే ఆ సమస్యకు మనం స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళంగా తయారవుతోంది.సమస్యల పట్ల స్పందించడం కన్నా, సమస్యను అధిగమించడం ముఖ్యం.స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకుని ఉంటాయి.సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది.ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు.తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటి పట్లా అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

299)చావు అనేది జన్మించిన ప్రతి జీవికి చివరగా వచ్చేది చావే ప్రతి ఒక్క జీవి చివరికి మృత్యువు ఒడిలోకి చేరవలసిందే అది తప్పదు కానీ ఇన్ని విధాలుగా ఎంతో ఎందరికో ఇన్స్పిరేషన్ గా ఉండే పోస్టులు రాస్తున్న మీరు ఇంతటి నిర్బలులని నేను ఊహించలేదు అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. దానికి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ఆ ప్రాబ్లం నుండి బయటపడి సంతోషంగా జీవించగలిగిన నాడు మనిషి జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది అంతేగాని జరుగుతున్న చెడును తలుచుకొని కేవలం చావు ఒకటే నాకు ప్రశాంతతనిస్తుంది అని ఎదురు చూడటం అంత తెలివి తక్కువ పని ఇంకోటి ఏమీ లేదు అని నా అభిప్రాయం ఇప్పటికైనా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి ఒక మంచి మార్గాన్ని అన్వేషించి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి సంతోషంగా జీవించే ఆలోచన చేయండి మీ పరిస్థితి తెలియకుండా ఏదో ఉచిత సలహా ఇచ్చానని మీరు భావిస్తే కనుక నన్ను డైరెక్ట్ గా తిట్టేయండి యువర్ మై ఫ్రెండ్ థాంక్యూ

300)నిజమైన స్నేహితుడు మీరు సమస్యలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే మీతో మాట్లాడడమో,మీ దగ్గరికి రావడమో,మీ సమస్యను తేలికపరచడానికి ప్రయత్నించడమో చేస్తారు.మీతో వారు ప్రతిరోజూ మాట్లాడకపోవచ్చు,కానీ మీకు సమస్య ఉందని తెలియగానే వెంటనే రెస్పాండ్ అయ్యే మొదటి వ్యక్తులు వారే.మీ జీవితంలోని ఒడిదుడుకులను అవసరమైన సమయాల్లోనూ మీకు సహాయం చేసేందుకు ముందుంటారు కాబట్టి ఏ స్నేహితులైన మీలోని తప్పులను చెబితే వెంటనే కోపం తెచ్చుకోకండి.వారి సాయంతో మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు ఎదిగేందుకు ప్రయత్నించండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

301)నిజమైన స్నేహితులు మిమ్మల్ని పొగిడే కన్నా మీ చుట్టూ జరుగుతున్న తప్పుల గురించి,మీ వల్ల జరుగుతున్న నష్టాల గురించి చెప్పేందుకు ముందుంటారు.అలాంటి వారిని మీరు కచ్చితంగా ఇష్టపడరు కానీ వారే మీ నిజమైన స్నేహితులు.అలాంటి స్నేహితులు జీవితంలో ఉంటేనే మీ తప్పులను మీరు దిద్దుకుంటూ ముందుకు వెళ్ళగలరు.మీ పతనాన్ని కోరుకునే వ్యక్తి మీరు చేసిన తప్పులను కూడా ఒప్పుల్లానే చెబుతారు.మీ వెనక జరుగుతున్న కుట్రలను మీకు తెలియకుండా చేస్తారు.మీరు నష్టపోతున్నా కూడా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఏ స్నేహితులైన మీలోని తప్పులను చెబితే వెంటనే కోపం తెచ్చుకోకండి.వారి సాయంతో మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు ఎదిగేందుకు ప్రయత్నించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

302)నిజమైన స్నేహితుడు దొరకడం దేవుని ఆశీర్వాదమే. అవసరమైన సమయాల్లో వారు మనకి సహాయం చేయడానికి,ఆదుకోవడానికి ముందుంటారు.వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదు...మన సంరక్షకులు,సలహాదారులు.మనం ఎంత తెలివిగా స్నేహితులని ఎన్నుకుంటే,అంతగా మన జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది.కొందరు స్నేహితులుగా నటించే వ్యక్తులు కూడా ఉంటారు.వారు నిజానికి మనకు శత్రువులతోనే సమానం కాబట్టి మన చుట్టూ ఉన్న స్నేహితులు...నిజమైన వారా?లేక ఫేక్‌గా నటిస్తునారా అనేది మనం తెలుసుకోవాలి.మన అమ్మా,నాన్న,అక్కా,చెల్లి...ఈ కుటుంబాన్ని మనం ఎంచుకోలేం కానీ స్నేహితులు మాత్రం మనం ఎన్నుకోబడతాము ఎంత మంచి స్నేహితులను ఎంచుకుంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

303)ఆత్మవిశ్వాసం అంటే ఇతరుల కన్నా మీరే మెరుగ్గా ఉన్నారని అనుకోవడం కాదు.ఈ ప్రపంచంలో ఏ విషయంలోనూ ఏ ఒక్కరితోనూ మిమ్మల్ని పోల్చుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం.జీవితమనేది ఇతరులతో పోటీ కాదు.ఎవరికి నచ్చిన దారుల్లో వారు కొనసాగించే వ్యక్తిగత ప్రయాణం,అనుభవాల సమాహారం అలాగే మనకు జరిగే అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మనల్ని మనం ఎలా మల్చుకుని ఎదుగుతున్నామనేదే ముఖ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

304)దయ,సానుభూతి లక్షణాలు కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం. ఇది మీ ప్రపంచాన్ని అందంగా మారుస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది.కానీ..ఈ మంచి హద్దులు దాటితే మాత్రం పరిస్థితులు మారిపోతాయి.ఈ ప్రపంచం మీతో ఆడుకుంటుంది! మిమ్మల్ని మీరే ఒత్తిడిలోకి నెట్టేసుకుంటారు!మానసిక ఆందోళనలు చుట్టు ముడతాయి! చివరకు జీవితంలో ప్రశాంతత కరవైపోతుంది!.మితిమీరిన మంచితనం ఉన్నవారు..ఎవరు ఏం అడిగినా సరే..మొహమాటంతో "ఓకే" చెప్పేస్తుంటారు.ఆ తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చడానికి నానా అవస్థలు పడుతుంటారు.ఇలా..తాము చేయగలిగే దానికంటే ఎక్కువ బాధ్యతలను మోస్తుంటారు..కాబట్టి పక్కవాడికి సహాయం చేయాలి కానీ నువ్వు దానివల్ల కష్టాల్లో కూరుకుపోయేంతలా చేయకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

305)ప్రతి దానికీ హద్దు ఉంటుందని గుర్తించండి. సహాయం చేయడానికి కూడా ఓ పరిమితి ఉంటుంది.దాన్ని దాటి ముందుకు వెళ్లకూడదు.హద్దు దాటితో వ్యక్తిగతంగా ఇబ్బంది పడడంతోపాటు ఒక్కోసారి కుటుంబం మొత్తం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది.మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది.వెనకొచ్చే ఆపదను గుర్తించకుండా.. ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగితే ఇక అంతే సంగతి..కాబట్టి.. మీ స్థాయికి మించిన పని చేయాల్సి వస్తే..నిర్మొహమాటంగా నో చెప్పడానికి వెనుకాడకూడదు..లేకపోతే నీ బలహీనతని ఎదుటువారు వారి బలంగా మార్చుకుని మిమ్మల్ని అవసరం కోసం వాడుకోవడానికి చూస్తారు..మీ మెడలో "మంచివారు" అనే ట్యాగ్లైన్ వేళాడుతోందా? జాగ్రత్త అది మీ మెడకు బిగుసుకుపోయే అవకాశం ఉంది!త్వరగా మేల్కొనకపోతే..ఊపిరాడకుండా చేసే ప్రమాదం కూడా ఉంది!!తస్మాత్ జాగ్రత్త!....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

306)మనం ఎంత గట్టిగా కోరుకున్నా...కొన్ని జరగవు..ఎందుకంటే మన జీవితంలో జరగాల్సిన అద్భుతం వేరే చోట ఉంది కాబట్టి..ఆ అద్భుతాన్ని సరైన సమయంలో సరైన విధంగా వచ్చేలా చేసేదే "విధిరాత" దాన్నే Destiny అంటాం..!ఆ అద్భుతాన్ని చూడాలి అన్నా...అది మన జీవితంలోకి రావాలి అన్నా...మనం వేచి చూడాలి..!..అలా కాకుండా తొందరపడి సరైన నిర్ణయం తీసుకోకుండా వుంటే...మన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం మూర్ఖత్వం... కాబట్టి Just Wait For That Moment To Happen a Magic ✨ For Your Life..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

307)నువ్వు నా వాళ్లు అనుకునే ఎవ్వడూ నువ్వు కష్టాల్లో ఉంటే దగ్గరకు రారు..నీ ప్రాణం మీదకి వచ్చింది అని..నీ Contact List లో ఉన్న నీ Close Circle ని ఒక పది మందిని పదివేలు అడిగిచూడు..పది పైసలు కూడా దొరకదు నీకు..Bonusగా ఉచిత సలహాలు వస్తాయి..డబ్బు శాశ్వతం కాదు అంటారు..కానీ.. డబ్బే Ultimate!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

308)ఎవడికి కావాలోయ్ ఓడిపోయినోడి సంజాయిషీ..పెద్ద అలకే కొట్టుకుపోయినోడికి ఈ లోకం జలసమాధి కడుతుంది..కానీ ఒడ్డున చేరినోడికి మాత్రం వంగి సలాం పెడుతుంది.. కాబట్టి ఎన్ని సర్వర్లు ఓడినా ప్రయత్నం ఆపకు..గెలిచి చూపించు నువ్వు ఏంటో ఈ లోకానికి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

309)నీలో అంతర్లీనంగా దాగి ఉన్న పుస్తకాన్ని తెరవనంత వరకు ఎన్ని పుస్తకాలు చదివినా వృదాయే అలాగే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చే కిందకి పంపుతాడు అది మనలోనే ఉంటుంది దానిని తట్టి లేపే బాధ్యతో మనమే తీసుకోవాలి అప్పుడు మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

310)మన జీవితం ఎలా ఉన్నా మనం ఎన్ని బాధల్లో ఉన్నా ఎప్పుడూ నువ్వు ఎవరికీ సంజాయిషీ చెప్పే పరిస్థితుల్లో ఉండకూడదు.ఒకరికి నువ్వు సంజాయిషి ఇస్తున్నావంటే నువ్వు నిన్ను తక్కువగా చేసుకుంటున్నావు అని అర్థం.మాటైనా మనైషైనా కరెక్ట గా ఉంటేనే స్నేహమైనా బంధమైన ముందుకు వెళుతుంది.ఇక్కడ అధికారాలు ఆజామాషీలతో.. మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కానీ ఎప్పటికీ తరగదు.ప్రతి పరిచయానికి స్నేహం అనే కొత్త పేరు పెడతాము నిజంగా వాళ్లకు ఆలాంటి అర్హత ఉందా లేదా అని ఆలోచించాలి.స్నేహితులు అంటే మన గురించి ఆలోచించేవాడు మనం బాగుండాలని కోరుకునేవాడు మన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళు మనము కనిపించకపోతే బాధపడేవాడు వాళ్లని స్నేహితులు అని అంటాం.అవసరాలకి స్నేహామనే పేరు పెట్టి ఎదుటి వాళ్ళ బ్రతుకులు ఆడుకునేవాళ్ళు స్నేహితులు కాదు అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి నేనైనా మీరైనా..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

311)ఎప్పుడైనా మనం ఒక పాడుపని చేసినప్పుడు లోపల ఏదో చివుక్కుమంటుంది. 'నువ్వు దారి తప్పుతున్నావు సుమా!' అని ఒక గొంతు మెల్లగా హెచ్చరిస్తుంది. అది అంతరాత్మ పిలుపు. గుండె తలుపు తెరిచి ఆ పిలుపు వింటే ఆపద తప్పుతుంది. పెడచెవిన పెడితే ప్రమాదం ముంచుకువస్తుంది. చేసిన తప్పునకు తగిన శిక్ష పడుతుంది.ఆ శిక్ష అనుభవించక తప్పదు.మనల్ని పెడదారి పట్టించేది మరొకటి ఉన్నది.దాని పేరు 'అహం'కారం.ఒక వ్యక్తికి అహం, లేదా గర్వం పెరిగినప్పుడు.. అతను కోరుకున్నప్పటికీ ఎవరినీ దగ్గరకు తీసుకోలేడు. ఒక చుక్క నిమ్మరసం వేల లీటర్ల పాలను ఎలా పాడు చేయగలదో..అదే విధంగా మానవ సంబంధాల అంతానికి గర్వం ప్రధాన కారణం అవుతుంది కాబట్టి భగవంతుడు వరంగా ఇచ్చిన ఆలోచనను,శక్తిని బాధ్యత కలిగి ఉపయోగించాలే గాని అహంకారం గర్వం ప్రదర్శించకూడదు అలాగే నీ అంతర్మ ఏమి చెప్తుందో దానినే విని నడువు నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగడానికి తోడ్పడుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

312)జీవితంలో నీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికోసం నువ్వేం చేస్తున్నావన్న దానిమీద నీ జీవితం ఆధారపడుతుంది.నీకేం కావాలనుకుంటున్నావో అది నీకు మాత్రమే తెలుసు ఇతరులు చెప్పింది వాళ్ళ అభిప్రాయం అంతే నీ అభిప్రాయం కాదు నీ ఇష్టం కాదు.ఎప్పుడైతే నువ్వు కష్టపడిన దానికోసం ప్రతిఫలం ఆశిస్తావో ఆ రోజు నీకు నిరాశ,నీకు బాధే మిగులుతుంది అలా కాదని ఏమి ఆశించకుండా నీ పని నువ్వు చేస్తూ నీకు కావాల్సింది దాని కోసం కష్టపడుతూ ప్రయత్నిస్తూ పోరాడుతూ ఉంటావో ఏదో ఒక రోజు అది నీ దగ్గరికి కచ్చితంగా వచ్చి తీరుతుంది.ఒకసారి నీకు కావాల్సింది వచ్చిందని ఎప్పుడూ దాని చులకన చేయకు..ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉండాలి ఎందుకంటే వచ్చింది పోగొట్టుకోకుండా ఉండటం కోసం అదిప్రేమైన,డబ్బయినా,గౌరవమైన,ఆరోగ్యమైన..ఏదైనా సరే నీకు కావాల్సిందని కోసం నువ్వే పోరాడాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

313)అనుకూలంగా ఉన్నప్పుడు అందరికీ మన గురించి తెలుస్తుంది కానీ,ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది.భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవరైనా మోస్తారు కానీ, మనసులో ఉన్న బాధని,బంధాల విలువ తెలిసినోడు ఒక్కడు మాత్రమే మోయగలడు.ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము.మనవాళ్లే కదా! అని అతిగా నమ్మితే మోసం యొక్క రుచి జీవితంలో చూపించేది వాళ్లే..కోలుకోలేని దెబ్బతీస్తారు.నమ్మకం,ప్రాణం ఈ రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు.నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు.ఒంటరి తనం ఒక అదృష్టమే. బ్రతుకు మీద ఆశ ఉండదు.చావంటే భయం ఉండదు.అలాగే జీవితంలో నిశ్శబ్దం,చీకటి ఇవి నేర్పే పాఠాలు ఎంతో లోతైనవి.మన అనుకున్న మనుషుల యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేస్తుంది దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికికాదు.ఎంత మంది నీతో నిజాయితీగా ఉన్నారో,అలాగే ఎంతమంది నటిస్తున్నారో..నీకు తెలియడానికి మాత్రమే గుర్తుపెట్టుకో..ఎక్కడో విన్నది చదివినదిఎవడికి కావాలోయ్ ఓడిపోయినోడి సంజాయిషీ..పెద్ద అలకే కొట్టుకుపోయినోడికి ఈ లోకం జలసమాధి కడుతుంది..కానీ ఒడ్డున చేరినోడికి మాత్రం వంగి సలాం పెడుతుంది.. కాబట్టి ఎన్ని సర్వర్లు ఓడినా ప్రయత్నం ఆపకు..గెలిచి చూపించు నువ్వు ఏంటో ఈ లోకానికి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

314)ఎవడికి కావాలోయ్ ఓడిపోయినోడి సంజాయిషీ..పెద్ద అలకే కొట్టుకుపోయినోడికి ఈ లోకం జలసమాధి కడుతుంది..కానీ ఒడ్డున చేరినోడికి మాత్రం వంగి సలాం పెడుతుంది.. కాబట్టి ఎన్ని సర్వర్లు ఓడినా ప్రయత్నం ఆపకు..గెలిచి చూపించు నువ్వు ఏంటో ఈ లోకానికి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*.

315)ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలగే అత్యంత ఖరీదైన బహుమతి ‘సమయం’.మీ సమయం ఎంతో విలువైనది.ఎవరికి పడితే వారికి ఆ సమయాన్ని ఇచ్చి వృధా చేయకండి.దాన్ని పదిలంగా ఉపయోగించుకోవాలి ఏందుకంటే ఏన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేని విలువైన బహుమతి సమయం.సమయం,సముద్రంలోని ఆటుపోట్లు ఒకలాంటివే.అవి ఎవరి కోసం వేచి ఉండవు. తమ పని తాము చేసుకుంటూ పోతాయి.రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకుండా ఈరోజే మీరు చేయాల్సింది చేయండి.లేకుంటే ఈరోజు సమయం రేపు ఉండదు...ఎల్లుండికి మిగలదు.మీరు జీవితంలో కోల్పోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి పొందలేరు. సమయాన్ని వెచ్చించడం అంటే మీరు పెట్టుబడి పెట్టినట్టే. దానికి తగిన ఫలితం రావాల్సిందే. ఏ ఫలితం రాలేదంటే మీరు సమయాన్ని వృధా చేశారని అర్థం. డబ్బు కన్నా సమయమే విలువైనది. మీరు కావాలనుకుంటే ఎంత డబ్బు నైనా సంపాదించగలరు కానీ సమయాన్ని మాత్రం సంపాదించలేరు.మనముండే తీరు మన ఎదుగుదలకు మూలమైతే మనం గడిపే సమయం మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కాబట్టి సమయాన్ని ఎవరైతే సద్వినియోగ పరుచుకుంటారో వారే జీవితంలో తొందరగా ఎదగగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

316)ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక తప్పు చేసుంటాం,ఆ తప్పునే తలుచుకుంటూ గతంలోనే ఆగిపోతే భవిష్యత్తును నిర్ణయించుకోవడం కష్టం..జరిగిపోయిన గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తును మాత్రం బంగారంలా నిర్మించుకోగలము.భవిష్యత్తు బాగుండాలంటే వర్తమానంలో పనిచేయాలి.గతించిపోయిన గతాన్ని మరిచి,నేటి వర్తమానాన్ని,రాబోయే భవిష్యత్తును ఎలా జీవించాలో ఆలోచించండి.జీవితంలో ఆనందాన్ని, విజయాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే,మరో తలుపు తెరుచుకునేందుకు సిద్ధంగా ఉంటుంది కానీ మనం మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటే మన కోసం తెరిచి ఉన్న తలుపులను గుర్తించలేం. మీరు గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ మూసి ఉన్నా తలుపును చూస్తున్నట్టే కాబట్టి గతం గతః అని వదిలేసి భవిష్యత్తులో ఎం చేయాలో ఆలోచించి ముందడుగు వేయి విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

317)ప్రశ్నించినదే దేనికీ సమాధానం దొరకదు, ప్రయత్నించినదే కోరుకున్నది ఏదీ దక్కదు.అలాగే ధైర్యంగా ముందడుగు వేయనదే..మీరు ఏది సాధించలేరు.మిమ్మల్ని వెంటాడే భయాన్ని వీడి మీరే  పరిగెట్టాలి..దేనికైతే నువ్వు భయపడి అడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఆ సమస్యకు ఎదురెళ్ళి చూడు మీలో ఉన్న భయం మాయమైపోతుంది.మీలో ఉన్న శక్తిమంతుడు బయటికి వస్తాడు.మీలో ఉన్న శక్తిని బయట పెట్టే అవకాశం మీకే ఉంది..పర్వతాన్ని చూసి భయపడితే మీరు బలహీనులుగా ఉండిపోతారు, ఒక్కసారి పర్వతం ఎక్కి చూడండి అది మీ పాదాల కిందనే కనిపిస్తుంది కాబట్టి భయపడి బ్రతుకుతావో రాజీపడకుండా యుద్ధం చేస్తావో మీ చేతిలోనే ఉంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

318)జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం...తాము బలహీనులమని భావించడమే.గెలవాలన్న ఆశలేని వాడు ఆటకు ముందే ఓడిపోతాడు.అతడే బలహీనుడు.వెనుక ఏముందో,ముందు ఏముందో అనేది ఆలోచించడం మానేయండి.మీలో ఏముందో అదే ముఖ్యం.బలహీనులని భావించి ఏ వ్యక్తినీ చిత్తు కాగితంలా చూడకండి,రేపు ఆ కాగితం గాలిపటంలా మారి అంత ఎత్తుకు ఎగరొచ్చు.దాన్ని చూసేందుకు మీరు తల బాగా ఎత్తాల్సివస్తుంది కాబట్టి ఉన్నంతలో ప్రతి వ్యక్తితో మర్యాదగా,మానవత్వంగా ప్రవర్తించడం ఎంతో ముఖ్యం. అలాగే మీలో ఉన్న బలహీనతను దూరం చేసుకుని ధైర్యంగా జీవించండి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

319)ఒక వ్యక్తి ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలంటే వాళ్ళ రూపాన్ని చూసి తెలుసుకోలేము.వాళ్ళ గుణాలను చూసే అంచనా వేయాలి..మన దగ్గర ఉన్న డబ్బును చూసి మిడిసి పడేవారు,అందాన్ని చూసి ఎగసిపడేవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రెండింటి కన్నా గొప్పది సుగుణం.ఖర్చు పెడితే డబ్బు కరిగిపోతుంది.వయసు ముదిరితే అందం తరిగిపోతుంది కానీ వయసు పెరిగే కొద్దీ ప్రకాశించేది మంచి లక్షణాలలో మచ్చుకకి కొన్ని ఇవి..ఇతరులను బాధ పెట్టకపోవడం,తెలిసీ తెలియక చేసిన తప్పుల ద్వారా కూడా ఇతరులకు హాని కలగకుండా చేయడం,ఏ పరిస్థితుల్లో అయినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం,ఎదుటివారికి సాయం చేయడం, నమ్మి వచ్చిన వారిని కాపాడుకోవడం..ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి పైన ఆ దేవుడు సదా మీ వెంట నీడలా ఉండి కాపాడతాడు..ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడో తెలీదు కానీ రాక మానదు కాబట్టి ఎప్పుడు మంచి లక్షణాలు కలిగి ఉండడం మేలు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

320)అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒక్కటే దూరంగా ఉన్నా ఒక్కటే...అలంటివాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము.తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తాము అయినా ఫర్వాలేదు సాయం చెయ్యండి..తనచుట్టూ ఎందరున్నా కష్టంలో నువ్వే గుర్తొచ్చావంటేనే అర్థంచేసుకో నువ్వు వాళ్ళకి ఎంత ముఖ్యమో..ఆనందంలో మనిషికి అయినోళ్లు పక్కనుంటారు కానీ కష్టంలో మనసుకి కావల్సినోళ్లే గుర్తుకొస్తారు..ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు ఎలాంటి పరిస్ధితుల్లో గుర్తొచ్చాము అన్నది ముఖ్యం..ఎంత సాయం చేశామన్నది మరీ ముఖ్యం..ఒక కంటిలో నలక పడితే పక్కనే ఉన్న కన్నే స్పందించి నలకను తొలిగించదు ఆ కంటికి కలిగిన బాధని తీసెయ్యదు..కానీ ఎక్కడో ఉన్న చేయి స్పందించి నలకను తీసేసి బాధని శాశ్వతంగా తొలిగిస్తుంది..కాబట్టి కష్టంలో ఎవరైనా మీ సాయం కోరితే దయచేసి నేనే దొరికానా,ఇప్పుడు గుర్తొచ్చానా అని దెప్పిపొడుపు మాటలతో వాళ్ళ బాధని మరింత పెంచకుండా చేతనైనంత సాయం చెయ్యండి అప్పుడే మనం మనుషులమనిపించుకుంటాం..నువ్వేం మంచి చేసిన,చెడు చేసినా అది కర్మానుసారమే జరుగుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

321)ఒక పుస్తకంలో చివరి పేజీకి తెలిసిన నిజాలు మొదటి పేజీకి తెలీవు అలాగే మొదటి పేజీలో ఉన్న అబద్దాలు చివరి పేజీకి తెలీవు అందుకే జీవితం చివరి పేజీ వరకు ఓపికతో చదవమంటారు అలా కాకుండా మధ్యలో ఎదో ఎత్తుపల్లాలకి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీస్కొని జీవితాన్ని ముగించేసుకుంటుంటారు...కాబట్టి మనల్ని నడిపించేది ఎప్పుడు ఓపిక సహనం..మంచిగా ఉండేవారికి ఎప్పుడూ కష్టాలే ఉంటాయి జీవితమంతా వాళ్ళకి అలాగే ఉంటుందా అంటే కాదనే చెప్తా దేనికైనా సమయం సందర్భం రావాలి అది వచినప్పుడు మిమ్మల్ని ఆపేవారెవరు ఉండరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

322)స్థూలంగానూ సూక్ష్మంగానూ గమనించితే మంచి చెడ్డలు మానవ మనోజనితాలే.దేశ,కాల,సామాజిక పరిస్థితులను పట్టి మారుతూవున్నాయి.ఇవి నాణేనికి ఇరువైపులు.మన ఆలోచన సరళి బట్టి అటూఇటుగా మారుతాయి.ఎవరికైనా వారు చేసేది ఎటువంటి పనైనా చేసేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది.దొంగతనం దొంగకు మంచిది. ఇతరులకు చెడ్డది.సినిమాలో చెప్పినట్టుగా ఈ కలికాలంలో ఏ ఎండకా ఆ గొడుగు పట్టాలేమో.నువ్వు పట్టకుంటే నీ నోట్లో మట్టే ఏమో.మంచి చెడు భావనలు సమాజంలో పుట్టి సమాజంతో పెరుగుతూ మారుతున్న సమాజంతో క్రొత్త పుంకలు తొక్కుతూంటాయి.మనసులో జనించిన భావనలు మెదడులో మధించబడి కార్యరూపం దాల్చి వచ్చిన ఫలితాలను చూసి మంచి చెడులుగా సమాజంలో రూపుదిద్దుకుంటాయి. కాలక్రమేణా,ముందు తరాలకు మార్గదర్శకాలుగా గౌరవించబడ్డాయి.కాకపోతే,ప్రతి సూత్రంకు మినహాయింపు ఉన్నట్లు, వీటికి వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా ఉన్న వ్యవస్థల్లో లేదా పరిస్థితులలో ఆచరణలో కష్టసాధ్యంగా మారాయి. మంచి చెడుగానూ చెడు మంచిగానూ తోచాయి కాబట్టి నువ్వు చేయాల్సినది చెయ్యి మిగతాది దేవుడు చూసుకుంటాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

323)కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తూ ఓడిస్తుంది..అది మనకు అర్ధం కాదు..అది అర్ధమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు..కళ్ళల్లో కన్నీరు..గుండెల్లో బాధ తప్ప..మంచిగా ఆలోచించు..మంచిగా మాట్లాడు..మంచి పని చేయి..నీ గురించి సాయం చేసిన వారిని నట్టేట ఎప్పుడు ముంచకు ఎందుకంటే నువ్వు ఎం చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది..ఈ రోజు కాకపోయినా అది రేపు నిన్ను నీ కుటుంబాన్ని వదలక మానదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

324)చాలామందికి కాస్త ఇగో ఉంటుంది.తప్పు తమదైనా కూడా తలొంచేందుకు ఇష్టపడరు.పైగా దాన్ని ఆత్మవిశ్వాసం,ఆత్మ గౌరవం అని చెప్పుకుంటారు..అంటే తప్పు చేశాక కూడా తప్పు నాది కాదు అని వాదించడం కాదు,తప్పుని ఒప్పుకొని సంబంధాలు తెగిపోకుండా కాపాడుకోవడం. ఏదైనా అనుబంధంలో తగాదాలు సహజం.ఆగ్రహంలో నోటికి వచ్చిన మాటలను అంటూనే ఉంటారు.ఒక వాదన జరిగాక లేదా ఒక గొడవ జరిగాక తప్పు ఎవరిదో అర్థం చేసుకొని హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తే ఆ బంధం నిలుస్తుంది.లేకపోతే చిన్న చిన్న వాదనాలకే అనుబంధాలు తెగిపోతాయి...కాబట్టి వీలైతే సూదిలా అందరిని కలుపుకుంటూ మారండి..కత్తెరలా విడదీస్తూ కాదు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

325)బంధం అనేది ఒక పుస్తకమైతే దాంట్లో తప్పు అనేది ఆ పుస్తకంలో ఒక పేజీ లాంటిది..అవసరమైతే ఆ తప్పు అనే పేజీని చించేయ్యండి...కానీ ఆ ఒక్క పేజీ కొరకు మొత్తం పుస్తకాన్నే పోగొట్టుకోకండి...అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కో పేజీని చించేస్తూపోతే చివరాఖరికి అట్టనే మిగులుతుంది.ఎదుటివారిలో తప్పులు వెతకడానికి బదులు సరిదిద్దడానికి, అవసరమైతే క్షమించడానికి ముందుకు రండి..అంతే కానీ ఎలాగైనా బంధాన్ని తెంచుకోవాలి అనుకునే వారికి మన ప్రతీ మాటలో,ప్రతీ కదలికలో తప్పు కనబడుతుంది.అదే మనతో బంధాన్ని కలుపుకోవాలి అనుకునే వారికి మన ప్రతీ తప్పులోను ఆ సరిదిద్దే మార్గం కనబడుతుంది.వారిలో దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది.కాబట్టి ఎదుటివారిలోని తప్పుల్ని వెతకకుండా, వారితో బంధాలని బలపరచుకోవడానికి మార్గాలను అన్వేషించాలి అప్పుడే బంధాలకి అనుబంధాలికి మీరు విలువ ఇచ్చిన వారవుతారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

326)అందరికీ జీవితం ఒకేలా ఉండదు.ఇంట్లో మహారాణి/రాజులా పెరిగినా కాలం చేసే గారడీ విద్యతో ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది.ఎన్నెన్నో అనుభవాలు పొందాల్సి వస్తుంది.నిన్నటి సుఖం రేపటి కష్టం!..నిన్నటి కష్టం రేపటి సుఖం!!కష్టసుఖాలు జీవితం అనే గడియారంలో ముళ్ళు లాంటివి.ఎప్పుడు ఒకే చోట ఆగిపోవు వస్తూ,పోతూ ఉంటాయి.ఈరోజు నీది కావొచ్చు కానీ ప్రతి ఒక్కరికి రేపు అనే అవకాశం ఉంటుంది.చెప్పలేము ఏది ఎక్కడ అగుతుందో!?ఎక్కడ నుండి మొదలవుతుందో!? విమర్శించడం మానేసి ప్రయత్నించు వీలైతే ఇతరుల ప్రయత్నానికి సహకరించు..ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేయి.ఆ ఒక్క అడుగు వేల అడుగులై నిన్ను విజయం వైపుకి తీసుకెళ్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

327)నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం !తట్టుకుంటే రత్నమై వెలుగుతావు..తప్పుకుంటే రాయిలానే మిగులుతావు!....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

328)ఋణానుబంధం.. పూర్వజన్మ ఋణాన్ని బట్టి బంధాలు ఏర్పడతాయి. ఋణం తీరేవరకు ఆ బంధాలు కొనసాగుతాయి తీరాక కావాలి అని కోరుకున్న ఉండవు.. ఎవరు ఎక్కడికి ఎవరి దగ్గరికి చేరాలి అనేది ఆ ఋణమే నిర్ణయిస్తుంది. అంతా ఋణానుబంధం. అందుకే ఎంత కలవరించినా కొన్ని బంధాలు ముడిపడవు. ఎంత వద్దనుకున్నా కొన్ని బంధాలు వదలవు.. జీవి ఉన్నంతవరకు తప్పవు ఇవన్నీ.. శాశ్వతమైన ఋణనుబంధం ఒకటి మాత్రం భగవంతుడు కి భక్తునికి!....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

329)బంధం అనేది ఒక పుస్తకమైతే దాంట్లో తప్పు అనేది ఆ పుస్తకంలో ఒక పేజీ లాంటిది..అవసరమైతే ఆ తప్పు అనే పేజీని చించేయ్యండి...కానీ ఆ ఒక్క పేజీ కొరకు మొత్తం పుస్తకాన్నే పోగొట్టుకోకండి...అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కో పేజీని చించేస్తూపోతే చివరాఖరికి అట్టనే మిగులుతుంది.ఎదుటివారిలో తప్పులు వెతకడానికి బదులు సరిదిద్దడానికి, అవసరమైతే క్షమించడానికి ముందుకు రండి..అంతే కానీ ఎలాగైనా బంధాన్ని తెంచుకోవాలి అనుకునే వారికి మన ప్రతీ మాటలో,ప్రతీ కదలికలో తప్పు కనబడుతుంది.అదే మనతో బంధాన్ని కలుపుకోవాలి అనుకునే వారికి మన ప్రతీ తప్పులోను ఆ సరిదిద్దే మార్గం కనబడుతుంది.వారిలో దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది.కాబట్టి ఎదుటివారిలోని తప్పుల్ని వెతకకుండా, వారితో బంధాలని బలపరచుకోవడానికి మార్గాలను అన్వేషించాలి అప్పుడే బంధాలకి అనుబంధాలికి మీరు విలువ ఇచ్చిన వారవుతారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

330)కావాలని వెళ్లే బంధాలకు, అనుకోకుండా కలిసే బంధాలకు మధ్య సాగేదే మనిషి జీవితం.కొందరు కొంతవరకే మనతో ప్రయాణిస్తారు.కొందరు మాత్రం ఎంతవరకు ప్రయాణించినా,అనుక్షణం మనల్ని నడిపిస్తారు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

331)జ్ఞానం కొద్దిగా ఉన్న సరే ఉపయోగించాలి.ఉపయోగించకపోతే ఎంత జ్ఞానం ఉన్న వ్యర్థం..బావిలో నీరు రోజు తోడుతూ ఉంటేనే కొత్తనీరు బాగా వూరి బయటకు వస్తుంది.అలాగే జ్ఞానాన్ని ఉపయోగించే కొద్దీ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది.బావిని ఉపయోగించకపోతే అందులో ఎంత నీరు ఉన్నా తాగడానికి, వాడడానికి పనికిరాదు.అలాగే జ్ఞానాన్ని ఉపయోగించకపోతే ఎంత జ్ఞానం ఉన్నా సరే ఎవరికి ఉపయోగం లేదు.తెలివితేటలు ఎదుటి వ్యక్తి మనసులో స్థానం సంపాదించడానికి ఉపయోగించాలి గాని ఎదుటి వ్యక్తిని నాశనం చేయడానికి కాదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

332)మనకు జీవితం ఏమి నేర్పిస్తుంది.మంచిగా బతకమని..!చదువు ఏమి నేర్పిస్తుంది జీవితంలో దైర్యంగా బతుకు అని అలాగే ఒక ఆలోచన కలిగిస్తుంది..!!నమ్మకాన్ని ఇస్తుంది..!! కన్నవాళ్ళు.. ఏమి నేర్చుకోమని చెప్తారంటే.. మంచి చెడూ రెండూ ఉంటాయి వాటి మధ్య జీవితాన్ని తెలుసుకోమని చెప్తారు..సమాజం ఎలా ఉండాలి అని చెప్తుంది అంటే మనిషిని మనీతో కాకుండా మనిషిలా చూడమని చెప్తుంది కానీ మనం మాత్రం ఏమి చేస్తున్నాం..!!జీవించడానికి "భయం"..కలిసి బతకడానికి "భయం"..ఒకరికి సహాయపడాలి అన్న "భయం"..ఒక్కరినీ నమ్మాలంటే "భయం"..ప్రేమంటే "భయం"..పెళ్లి అంటే "భయం"..సంసార బాధ్యతలు అంటే భయం"..సమాజంలో జరుగుతున్న దారుణాలు చూసి "భయం"..సగం భయం తోనే మన జీవితాన్ని గడిపేస్తున్నాం..కానీ ఎప్పుడైతే ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

333)కుక్క మొరుగుతోందని..సింహం వెనుతిరిగి చూడదు.మొరగడం దాని జాతి లక్షణమని తన దారిన అది పోతుంది కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా మన మీద ఎన్ని రాళ్లు విసిరినా ఎన్ని అభియోగాలు వేసి మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు కానీ మనం ఏ మాత్రం పట్టించుకోకుండా వెనుతిరిగి చూడకుండా గమ్యం చేరేదాకా ఆగకుండా వెళ్తేనే మన లక్ష్యాల్ని మనం చేరగలం అలా కాకుండా ప్రతి ఒక్కరికి మనం సమాధారం చెప్తూపోతే అక్కడే ఆగిపోతావు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

334)జీవితంలో ఏదైనా కోరుకుంటే సరిపోదు,దానికోసం కష్టపడాలి.స్థిరంగా నడుస్తూ వచ్చే అడ్డంకులను అధిగమించాలి.మనల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి.అలా ఎప్పుడైతే పోల్చుకుంటామో మనల్ని మనం పాతాళానికి తొక్కేసుకున్నట్టే, మన స్థాయి మనమే తగ్గించుకున్న వాళ్ళమావుతాం కాబట్టి ఇతరులతో పోలికలు చేయకండి,మనతోనే మనల్ని పోల్చుకోవాలి నిన్నటికీ ఈరోజుకి మనం ఎంత మారామో గమనించుకోవాలి.నెలరోజులు కిందట మనం ఎలా ఉన్నాము మనం ఇప్పుడున్న రోజుకి ఏదైనా సాధించామా లేదా అని అంచనా వేసుకోవాలి అది మనలో ఉత్సాహాన్ని,శక్తిని నింపుతుంది.ఎప్పుడైతే మన పక్కనున్న వారితో పోల్చుకుంటామో అది మనలో భయాన్ని నిరాశను కమ్మేలా చేస్తుంది కాబట్టి ఎవ్వరితోనూ పోలిక వద్దు ఎందుకంటే మన జీవితం మనదే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

335)జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మనల్ని మనమే ప్రేరేపించుకోవాలి.మనాలి మనమే ధైర్యాన్ని నింపుకోవాలి.జీవితంలో రాణించాలంటే స్వీయ ప్రేరణ చాలా అవసరం.పరిస్థితులు ఎంత నిరాశపరిచినా కూడా మన మనస్సును మన లక్ష్యాల వైపు నడిపించాల్సింది మనమే.కష్టాలను అధిగమించడానికి అవసరమైన శక్తిని కూడగట్టాల్సింది కూడా మనకు మనమే.కష్ట సమయాల్లో నిరుత్సాహపడితే యుద్ధం ముగియకముందే ఓడిపోవడం ఖాయం కాబట్టి అలాకాకుండా ధైర్యంగా మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ఒకవేళ ఈసారి ఓడిపోయినా …మరోసారి గెలిచి తీరుతా అని చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి అప్పుడే మనం అనుకున్నవి సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

336)జీవితంలో ఏ రంగంలోనైనా సరే - ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలని ప్రయత్నించకండి..అది దాదాపు అసాధ్యం..చిత్తశుద్ధితో మీ శక్తీ మేరకు పనిచేస్తూ వెళ్లడం పైనే దృష్టిసారించండి..అందరిని మెప్పించాలని ప్రయత్నించినా..ఎవరో ఒకారు తమ కథలో మిమ్మల్ని విలన్ గానే చూస్తారు ఆ వాస్తవాన్ని గ్రహించునప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం మానేయండి..దానికి బదులు- నిన్నటి మీతో నేటి మిమ్మల్ని పోల్చి చూసుకోండి..నిన్నటి కంటే ఇవాళ ఏ విషయంలో ఇంకాస్త మెరుగుపడచ్చో గుర్తించండి..ఏ బలహీనతని అధిగమించచ్చో ఆలోచించండి..ప్రతిసారీ నిన్నటి మిమ్మల్ని ఓడించగలిగే స్థాయిలో నేటి మీరు ఉండాలి..అర్ధవంతమైన పోటీ అంటే అదే.. జీవితంలో ఎదగడానికి వీలైతే ఈ రెండు పాటించండి ఇవి మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి తోడ్పడతాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

337)జీవితం చాలా నేర్పుతుంది అంటారు..కానీ జీవితం ఏం నేర్పించదు..మన చుట్టు ఉన్నవాళ్ళే మనకి చాలా నేర్పుతారు..నువ్వు ఎంత గుడ్డిగా మనిషిని నమ్మితే అంత ఎక్కువగా నిన్ను మోసం చేస్తారు..ఈ రోజుల్లో నిజమైన ప్రేమ,ఆప్యాయతలు,నమ్మకం లేవు ఈ బంధాలు,అనుబంధాలన్ని చిక్కుముడులు...గజిబిజి అల్లికలు..వాటిని పట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు...కొన్ని పయనాలు జరగాలంటే...కొన్ని నయనాలు చెమ్మగిల్లాలి తప్పదు...అనవసరంగా ఏ మనిషి మీద నమ్మకం పెట్టుకోకు...ఎవరు చివరిదాకా నీతో ఉండరు...ఏం జరిగినా నవ్వుతూ బ్రతకడం అలవాటు చేసుకో...మళ్ళీ చెబుతున్నా జీవితం ఏం నేర్పించదు...బ్రతకమనుంటుంది అంతే.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

338)జీవితంలో మన చుట్టూ వెయ్యి బంధాలు అవసరం లేదు..మన నవ్వు వెనక బాధని..మన బాధలు వెనక కారణాలు తెల్సుకుని నీకు నేను ఉన్నాని ధైర్యం చెప్పే ఒక బంధం ఉన్నా చాలు..అది ప్రేమైనా కావచ్చు లేక స్నేహమైనా కావచ్చు..అలాంటి బంధం నీకు దొరికితే దానిని ఎప్పుడూ చిన్న చిన్న కారణాలతో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఎందుకంటే ఉన్నప్పుడు తెలుసుకోలేకపోతే వెళ్లిపోయాక వెతుక్కోవాల్సిందే అది ఏదైనా సరే మనిషైనా, వస్తువైనా......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

339)మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉంటారు ఎవరు మనల్ని పక్కన పెట్టేస్తారు..మన సంతోషం చూసి ఎవరు కుళ్ళుకుంటారు..మన బాధను చూసి ఎవరు ఆప్యాయంగా పలకరిస్తారు అని తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మనల్ని ఊబిలో నెట్టయ్యడానికి మన పక్కనే ఉంటూ గోతులు తీస్తారు ఎవరైతే ఇది తెల్సుకుని అప్రమత్తంగా ఉండటానికి ప్రయత్నిస్తారో వాళ్లే జీవితంలో నెగ్గగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

340)ఒక యుగంలో నాన్న మాట విని రాముడు దేవుడైతే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహల్లాదుడు మహనీయుడు అయ్యాడు..చూసావా మాట అనేది యుగానికి యుగానికి తేడా వచ్చేసింది కాబట్టి నీ మాట నీ ఆలోచన మంచిదైతే నువ్వు ఎక్కడైనా గెలుస్తావు ఆ దేవుడు కూడా నీకు తోడుగా నీడగా ఉంటాడు ఎందుకంటే విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది.. కాబట్టి నువ్వు చేయాల్సిన పని చేయి మిగతాది దైవేచ్ఛ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

341)ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో,ఓడిన మనిషికి ఓదార్పు అంత అవసరం.ఓడిన వ్యక్తి వాళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటారు.అలాంటి సమయంలో,గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని,ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసిపట్టుకుని,ఎక్కువ ఉత్సాహంతో తలపడితే విజయం తథ్యమన్న మాటలు చెబితే వాళ్ళ మనసు కుదుటపడి,తదుపరి పోటీకి సిద్ధంగా ఉంటారు అలా కాకుండా వారిలోని ధైర్యాన్ని చంపేసి వాళ్ళని ఎదగనీయకుండా చెయ్యడానికి మన పక్కనే ఉంటారు..అలాంటి వారెవరో ముందే పసిగట్టి పక్కన పెడితేనే జీవితంలో ఎదగగలం లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

342)విజయానికి మిత్రులుంటారు,అపజయం ఒంటరిదన్నది లోక విదితం.పోటీ ఏదైనా ఓటమిపాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం వాళ్ళకి వెన్నుదన్నవు తుంది.విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరచిపోలేడు.జీవితమంటే కష్టసుఖాల పడుగుపేక.ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి,రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు.ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం.అందుకే బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం,కొంచెం బుజం తట్టి నేనున్నాని భావనను కలిగించండి ఎందుకంటే ఈనాటి మన ప్రవర్తన,రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడమ వుతుంది కాబట్టి వీలైతే నలుగురిని ఆదుకోండి అంతేకాని వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

343)మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటివారి మనసును గాయపరుస్తారు.శరీరానికి తగిలిన దెబ్బలా,మానసిక గాయం బయటకి కనిపించదు కానీ ఆలోచనలను అస్థిరపరుస్తుంది.మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు,వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి.ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా ఫర్వాలేదు.బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి.కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగి పోతుంటారు.సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు.మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారదోలాలి ఏందుకంటే మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం.మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మన జన్మ ప్రయోజనం సిద్ధించినట్లే. మన నుంచి దేవుడు ఆశించేది అదే!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

344)కొన్ని పరిస్థితుల కారణంగా సమస్యలు ఎక్కువై ఇబ్బందులు పడవచ్చు..కానీ మన చుట్టూ వున్న వారు హేళన చేయవచ్చు..మన దగ్గర వాళ్ళు మన మిత్రులు అవసరానికి అనేక విధులుగా సాయం పొంది ఇప్పుడు మనల్ని గుర్తించక పోవచ్చు..కానీ ఎప్పుడు వాటిని ఆలోచించవద్దు,నువ్వు చేయాల్సింది చేసావు ఇక మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు..గీతలో కూడా అదే చెప్పాడు *కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన* పని చేయి ప్రతిఫలాన్ని దేవుడే ఇస్టాడు కాబట్టి ఎన్ని అవమానాలు పొందిన మనం ధర్మం,నిజాయితీగానే ఉందాం బహుశా ఇప్పుడు కొంచం బాడ్ టైమ్ అంతే మరి కొద్ది రోజుల్లో మళ్ళీ మన స్థాయి సక్సెస్ కు మించి ఉంటుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

345)జీవితంలో ఏదో ఒక చోట అవమానాలు,అపజయాలు ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ వెళ్ళాలి..ఏవ్వరి జీవితం కూడా పూలబాటలా ఉండదు.ప్రతి మనిషి ముళ్ళబాటలను దాటాల్సిందే . ముళ్లబాటను,పూలబాటుగా మార్చుకునే శక్తి కూడా దేవుడు మనకే ఇస్తాడు కానీ కొంతమంది చిన్న సమస్య రాగానే తమకే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వస్తున్నాయని తెగ బాధ పడిపోతూ ఉంటారు.ఆ బాధలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ మీద నిందలు మోపి తమ తప్పులేదని, ఈ కష్టాలకు ఎదుటివారే కారణం అని చెబుతూ ఉంటారు కాబట్టి సమస్యలు,కష్టాలు నాకే వస్తాయని పదేపదే అనుకోకుండా వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించండి.సమస్యలను స్వీకరించడం మొదలుపెడితే అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి.కొన్నాళ్లకి అవి సమస్యలుగా కూడా కనిపించవు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

346)తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మనం ఒంటరిగా పోరాడినప్పుడు ఇక్కడ ఒంటరిగా పోరాడలేమా?.!! తల్లి గర్భంలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు లోకంలో ఉండే వెలుగుని చూడలేక గట్టిగా ఏడుస్తాం ఎంత గట్టిగా ఏడుస్తాం అంటే చుట్టుపక్కల మన ఏడుపు వినిపించేంత గట్టిగా ఏడుస్తాం.అలా ఏడ్చినప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళందరూ సంతోషంగా నవ్వుతారు ఎందుకంటే మనం క్షేమంగా ఉన్నామనే కదా ఆ ఏడుపు సంకేతం..అంత ధైర్యం చేసి తల్లి గర్భంలోంచి లోకాన్ని ఎదుర్కోవడానికి మనం బయటకు వచ్చినప్పుడు ఉండే ధైర్యం చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవడానికి మనకి ఎందుకు రాదు.నిరాశ నిస్పృహలని వదిలేసి మనం వెలుగును చూడాలంటే చీకటిని దాటాలి అలాగే జీవితంలో ఎదగాలంటే ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి..జీవితం చివరి అంచుల వరకు పోరాడిన వాళ్లే విజయం సాధించగలరు..కాబట్టి ఎప్పుడూ నువ్వు కష్టపడే ప్రయత్నాన్ని ఆపకు..కష్టే ఫలి:..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

347) జీవితం_చాలా_చిన్నది బ్రతికున్నన్ని రోజులు సంతోషంగా ఉందాం...మనవల్ల ఒకరు బాగుపడక పోయిన పర్లేదు కానీ నాశనం మాత్రం అవ్వకుండా చూసుకుందాం...మనం బాధ పడినా పర్వాలేదు కానీ మనం ఒకరిని బాధ పెట్టకుండా ఉంటే చాలు..ఒంటరిగా ఉన్న సమయాలలో తోడు నిలుద్దాం..సమస్యల ఊబిలో ఉన్నప్పుడు మేమున్నాం అనే ధైర్యాన్ని ఇద్దాం!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

348) కొన్ని మంచి పనులు చేసేటప్పుడు చెడ్డ వాళ్ళు వస్తారు మనల్ని నాశనం చేయడానికి.. కుదిరితే మనం వాళ్ళని మార్చాలిగాని వారిలా మనం మారకూడదు..అలా మారితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది..చేసే మంచి పనికి అర్థమేముంటుంది.. కాబట్టి నువ్వు చేసే మంచి చేయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

349)మనకు భయమేస్తే హనుమంతుడికి దండం పెట్టుకుంటాం కానీ సీతాదేవిని వెతికేటప్పుడు ఆమె దొరకక రాముడికి మొహం చూపించలేక ఆంజినేయుడంతటి వాడే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట..కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా రాముడిని నమ్ముకొని మళ్ళీ వెతకడం మొదలుపెట్టిన తర్వాతనే ఆమె జాడ తెల్సుకున్నాడంట..అలా సమస్య వచ్చినప్పుడు మనకు ఉండాల్సింది బాధ కాదు..నమ్మకం.ఎవ్వరిని నమ్మాలి అనేది నీ మనస్సు చెప్తే ఎంత నమ్మాలనేది మన అనుభవం చెప్తుంది దాదాపు ఓడిపోయాము అనుకున్నప్పుడే గట్టిగా ప్రయత్నిస్తే అప్పుడే అద్భుతాలు జరుగుతాయి...యత్నం ప్రయత్నం దైవయత్నం అన్నారు..కాబట్టి ఎప్పుడు నీ లక్ష్యం చేరేదాకా మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు చేసే ప్రయత్నాన్ని ఆపకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

350)నీ జీవితంలో ఎన్ని బంధాలైనా ఉండొచ్చు..ఉంటాయి..నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు అపార్థం  చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎన్ని బంధాలు ఉన్నా ఎలాంటి బంధాలు ఉన్నా అవసరానికి ఉండరు అంతే..సమయానికి ఉండరు అంతే...సహాయానికి ఉండరు అంతే.వాళ్ళ అవసరానికి నిన్ను ఉపయోగించుకునే వాళ్ళ తప్ప నీ అవసరానికి వాళ్ళు ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు.అలాంటి బంధాల కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఎంత కష్టపడినా ఎన్ని సాధించిన ఎంత పోగొట్టుకున్న ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి కుదిరితే నిస్వార్ధంగా నీ గురించి తెల్సుకుని సహాయం చేసే నలుగురిని సంపాదించుకో అప్పుడే నీ జీవితానికి ఒక అర్ధం పరమార్ధం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

351)నమ్మకం అనేది ఇద్దరి మధ్య ఓ వారధి దానిని నిలబెట్టుకోవడం చాలా గొప్పతనం..అది జీవిత కాలం పట్టిన పోగొట్టుకుంటానికి క్షణం చాలు. అలాగే మితిమీరిన నమ్మకం పెను ప్రమాదం..ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం.ఒక వ్యక్తిని నమ్మే ముందు కాస్త వాళ్ళ గురించి తెలుసుకొని మసలుకోవడం చాలా మంచిది.ఎందుకంటే అత్యంత ఖరీదైన అరుదైన గౌరవం నమ్మకం వలనే కలుగుతుంది..ఒకసారి పోతే మళ్ళీ రాదు..నమ్మకం దారుణంగా గాయపడిన చోట క్షమాపణ అర్ధరహితం.నమ్మకం కుదరని బంధాల గురించి బాధపడే కంటే వారికి దూరంగా మనశ్శాంతితో బ్రతకడం మేలు.నమ్మకం అనేది బంధానికి బలమైన పునాది కావాలి అది ప్రేమ బాధ్యతలతో పెనవేసుకున్న అనుబంధాల నిలయం అవ్వాలి. ఆ నమ్మకమే లేనప్పుడు ప్రేమ, బాధ్యత అనేవి కూలిపోయిన గూడు వంటివి.మనిషి మాటే నమ్మకం ఆ మనిషే నమ్మకం కానప్పుడు కాస్తంత జరిగి ఉండటం మంచిది.నమ్మకం లేని ప్రేమ..నమ్మకం లేని బంధం..నమ్మకం లేని స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే అవి మనశ్శాంతిని దూరం చేసే ఆయుధాలే గనుక నమ్మకంగా ఉండండి మనశ్శాంతిగా హాయిగా బ్రతకండి బ్రతికించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

352)ఇవాళ రేపు సాఫ్ట్ గా ఉంటే బ్రతకడం కష్టం నీ మంచితనం అనేది నీకు లేని ఇబ్బందులు తేచిపెడుతోంది..నీకు నచ్చని పని ఎవరి కోసం చేయకు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్లేమనుకుంటారు అని ఎవరికోసం ఆలోచించకు.నువ్వు హ్యాపీగా ఉన్నావా నువ్వు ప్రశాంతంగా ఉన్నావా ఈ చిన్ని ప్రపంచంలో నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అని   ఆలోచించు..ఇక్కడ ఎవరికి ఎవరు సొంతంగారు ఈరోజు నీతో ఉన్న వాళ్ళు రేపు మరొకరితో ఉంటారు ఇదొక ప్రయాణం కాలంతో పాటు మనుషులు కూడా కదిలిపోతూనే ఉంటారు.నా మాటలు ఎవరికీ నచ్చిన నచ్చకపోయినా ఇది వాస్తవం జీవితం విలువ తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ అనుభవించిన వాళ్లు కొంతమంది ఉంటారు ఇలాంటివి హ్యాండిల్ చేయగలుగుతారు.మనిషి బ్రతకడానికి కావాల్సింది డబ్బు అది ఉంటే అన్నీ ఉంటాయి అందరూ ఉంటారు మనిషికి విలువ లేదు ప్రేమకు విలువ లేదు బంధాలకు విలువలేదు.కేవలం డబ్బుకి మాత్రమే విలువ ఉంది ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచంలో వాటిని నమ్ముకుని అమ్ముకునే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కానీ అందరూ అలా ఉండలేరుగా కొందరు మనలాగా పిచ్చోళ్ళు కూడా ఉంటారు వాళ్లు బంధాలను పట్టుకుని పాకులాడుతూ ఉంటారు స్నేహాలకి విలువిస్తారు అందరూ మనలాగే ఉంటారు అనుకుంటారు కానీ అది తప్పు ఎవరు అలా లేరు ఉండరు..అలా అని మీరు కూడా చెడిపోండి అని చెప్పట్లేదు ఆ చెడిపోయిన వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను.నిజమైన స్నేహితుడు ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టారు నీకు ఇష్టం లేని పనులు చేయరు నీకు కష్టం కలిగేలా ప్రవర్తించరు అలా ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

353)తొలిశ్వాస.. తుది శ్వాస -మధ్యదే జీవితం, జీవనం!..ఆశించకు దేనినీ - నీది కాని దానిని..సాధించు నీదిగా - సాధన కృషి మార్గన!..మంచికే మతం - అంతే కానీ ద్వేషానికి.. రోషానికి కాదు..సహనమే సంస్కారం - సమన్వయతే పరిష్కారం..ఆరోహణమే మొదటిది - దానిలోనిదే అవరోహణం..స్వయంకృషి సాఫల్యం, వ్యక్తిత్వ వికాసం..మన జన్మకు సార్ధకం.. మనిషికది.. సామర్థ్యం!...మార్పును కోరండి, మనసును మార్చండి,మనిషిని మనీషిగా చేయండి, మానవత్వాన్ని ఉంచండి,పెంచండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

354)భగవంతుని విషయం పక్కన పెడితే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది "అవసరం" ఒక్కటే. బంధమైనా కావచ్చు,ప్రేమ-ఆకర్షణ మరేదైనా కావచ్చు...అన్నీ అవసరం మీదనే ఆధారపడి ఉన్నాయి..మానసిక ఆలంబన కావచ్చు, శారీరక ఆలంబన కావచ్చు..అన్నీ అవసరం పైనే ఆధారపడి ఉన్నాయి.బంధాలు ఎలాంటివైనా ఇచ్చి పుచ్చుకోవడాల మీద ఆధారపడి ఉంటాయి. అక్కడక్కడా మినహాయింపులు ఉన్నట్లుగా కనిపించినా లోతుల్లోకి పోతే ఏదో ఒక మోస్తరుగా ఏదైనా ఒక కోణంలో నిలబడడం లేదా విడిపోవడం అనేది జరుగుతుంది.పనికిమాలిన బంధాలను సంబంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మన మనశ్శాంతి పొందుతారు.ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా బ్రతుకుతారు.నటించే బంధాలు ఎప్పుడూ తీయగా మధురంగానే ఉంటాయి.నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగా ఉంటాయి.అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాల్ని ఎక్కువగా నమ్ముతాం.ఎందుకంటే మనం మనుషులమే కదా....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

355)కారుకి అప్పు..ఫొనుకు అప్పు..ఇంటికి అప్పు..ఇలా అలివికాని ఆశలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సగటు బడుగు జీవి..గతంలో మన పెద్దవాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎంతో స్వేచ్చ తో కూడిన "విలువైనది".."నిరాడంబరమైనది"..."నిజమైనది".."నాన్యమైనది"..మనం ఇప్పుడు బ్రతుకుతున్న బానిసబ్రతుకు..అల్పమైనది..నకిలిది...నిస్తేజమైనది ఎప్పుడు అయినా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఎదుటి వారితో పోల్చుకుంటూ వెళ్తే మన ఆశలు గుర్రాలు అవుతాయి..మనల్ని మనం ఎప్పుడు ఎదుటివారితో పోల్చుకోకుండా చూసుకోవాలి..అదే నలుగురిలో ఆత్మగౌరవం నిలిపేల చేస్తుంది..అదే మనల్ని జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చిన ముందుకు వెళ్ళేలా చేస్తుంది..మనకున్న దాంట్లో మనం తృప్తి గా బ్రతకాలి.. ఎదుటి వారిని బ్రతికించాలి...అదే మనిషి విలువ తెలిసేలా చేస్తుంది అదే మమత విలువ ఎరిగేలా చేస్తుంది..మనం బ్రతికే బ్రతుకు కి ఒక అర్థం తెలిసేలా చేస్తుంది..అలివికాని ఆశలతో అంధకారంలోకి కూరుకుపోవద్దు...మనకి ఉన్నదాంతో తృప్తిగా బ్రతుకుదం..బానిసత్వ భావజాలాన్ని వదిలిపెడదాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

356)గ్రద్దలాగా ఎత్తైన స్థాయికి చేరాలంటే మనం ఆ పక్షిని చూసి కొన్ని నేర్చుకోవాలి అవి ఏంటంటే ఇతర పక్షుల్లాగా గద్దలు గుంపులు గుంపులుగా ఉండేందుకు ఇష్టపడవు. ఎత్తైన ప్రదేశంలో ఏకాంతంగా ఉంటాయి. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతాయి. దాని మార్గం ఎంతో స్పష్టంగా ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధిని కోరుకునే వారు ఎవరైనా ఇలా గద్దలాగా తమని తాము నమ్ముకుని ముందుకు వెళ్లాలి. అంతే తప్ప గుంపులు గుంపులుగా, గుంపులో ఒకరిగా వెళ్లేందుకు ప్రయత్నించకూడదు. ఒంటరితనం ఒక్కోసారి కష్టంగా అనిపించవచ్చు కానీ విజయం సాధించాక అది మిమ్మల్ని ఎంతోమందికి దగ్గర చేస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

357)ఏవరైతే వాళ్ళ స్వార్ధం కోసం మన జీవితంలోకి వచ్చి....మన జీవితంలో నుండి తిరిగి వెళ్లిపోడానికి చూస్తారో..అలాంటి స్నేహనికి..వెళ్ళిపోడానికి ఎప్పుడు తలుపులు తెరిచే ఉంచాలి...స్వార్థంతో వెళ్ళేవాళ్ళని ఎప్పుడు బతిమిలాడ కూడదు...మనం బతిమిలాడేకొద్దీ వాళ్ళు మనల్ని నిందించడానికి కూడా వెనకాడరు..అలాంటి స్వార్ధపు స్నేహనికి సమాధికట్టండి.ప్రతి ఒక్కరి జీవితం..డబ్బు కాగితాల కోసమే ఆని తల్చుకున్న ప్రతి సారి ఎదో భాధ అది సంపాదించడానికి కొంతమంది కొన్నిసార్లు ఏమి చేయడానికైనా వెనుకాడరు కాబట్టి అలాంటివారితో జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

358)ఒకరి స్థాయిని బట్టి గౌరవించే వారితో,ఒకరి సామర్ధ్యాన్ని బట్టి సమాధానం ఇచ్చేవారితో,ఒకరి హోదాని బట్టి విలువ ఇచ్చేవారితో,ఒకరితో ఉన్న అవసరాన్ని బట్టి మర్యాదిచ్చే వారితో,వారికి ఉన్న బలగాన్ని బట్టి గుర్తుపెట్టుకునే వారితో కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండటం మేలు.. ఎందుకంటే ఇవి ఏమి శాశ్వతం కావు..కొన్ని రోజులు వరకే ఇవి ఏవైనా పరిమితం.ఇక్కడ ఎవడి స్వార్థం కొరకు వాడు పని చేసుకుంటాడే గాని సహజత్వమైన మానవ విలువలతో పనిలేదు...కాబట్టి ఈ కలికాలంలో మనుషులతో కలిసేటప్పుడు ఎవరు ఎలాంటివారో తెలుసుకొని మసలడం చాలా ముఖ్యం...ఇవి తెల్సుకున్నప్పుడే జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలో తెలుస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

359)మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన ఆలోచనల్లో లోతుండాలి...మన నిర్ణయాల్లో వేగం ఉండాలి...కానీ మన ఆచరణల్లో మాత్రం వ్యూహం ఉండాలి..అప్పుడే కదా మనం అనుకున్నవన్నీ సాధించగలం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

360)జీవితంలో కష్టాలు వస్తాయి..వాటిని ఎదుర్కోవాలి..ప్రతికూలతలను ఎలా జయించాలో తెలుసు కోవడమే జీవితం...దానికి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం కలిగి ఉండాలి..మనం దానిని ఎలా పొందాలో ఒక ఆలోచన ఉండాలి..ఆలా చేసేటప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు,బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి వాటిని తృణీకరించకుండా,నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి...సవాళ్లను ఎదుర్కొవాలి,ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలి కాబట్టి కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

361)మనం ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చాము..తిరిగి ఒంటరిగానే వెళతాము..ఖాళీ చేతులతోనే ఈ భూమిపై అడుగు పెట్టాము..తిరిగి ఖాళీ చేతులతోనే భూమిలో కలిసిపోతాము..ఏ భౌతిక ఆస్తులు మన వెనుక రావు కాబట్టి ఓపెన్ మైండ్ తో ఉండాలి ఉన్నంతలో సంతోషంగా జీవించేందుకు ప్రయత్నించాలి ఎందుకంటే మన ఆలోచనల రూపమే మన జీవితం కాబట్టి మనల్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలను రానివ్వకండి..ఏదైనా చేసే ముందు మన మనసును సానుకూలంగా ఉంచుకుంటే అది తప్పక నెరవేరుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

362)మన కోసం,మనకంటే..ఎక్కువ ఆలోచించే వాళ్ళు..మన కోసం ఏడ్చే వాళ్ళు..మన నవ్వు కోసం ఎదురు చూసేవాళ్ళు..మన కష్టం పంచుకునే వాళ్ళు..మన లోపాలను అర్ధం చేసుకునే వాళ్ళు..మనతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సావాసం కోరుకునేవాళ్ళు..మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది కదా?! అలాంటి మిత్రులు మన లైఫ్ లో ఉంటే ఏ రోజు ఎన్ని ఇబ్బందులు వచ్చిన,కిందపడి పైకి లేచిన మొహం మీద చిరు నవ్వు పోకుండా ధైర్యంగా బ్రతుకుతాము కాబట్టి వీలైతే అలాంటి స్నేహితుల్ని సంపాదించుకో నీ జన్మ సార్ధకమవు తుంది ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

363)ఎప్పుడు ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా నేర్చుకోవాలి తీసుకోవడం నేర్చుకోకపోతే ఇస్తూనే ఉండవలసి వస్తుంది.ఇచ్చేవాళ్ళకి తీసుకునే అధికారం హక్కు కూడా ఉంటుంది.ఇస్తూ పోతూ ఉంటే తీసుకునే వారికి వాటి విలువ తెలియదు.తెలియాలంటే అప్పుడప్పుడుతీసుకోవాలి.సమయమైన,డబ్బైన,ప్రేమైన,గౌరవమైన విలువైన సరే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి..ఇవ్వడం కాదు తీసుకోవడం అలవాటు చేసిన వాళ్ళకి ఇవ్వడం అలవాటు చేయాలి తీసుకోవడం మాత్రమే అలవాటు చేస్తే అది ఇచ్చే వాళ్లది తప్పు తీసుకునే వాళ్ళది కాదు.ఇవ్వడం మొదలు పెట్టింది నువ్వు..తీసుకోవడం మొదలు పెట్టేది కూడా నువ్వే కావాలి ఎప్పటికైనా,ఎవరికైనా,ఏదైనా..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

No comments:

Post a Comment