66)డబ్బులుంటే... దేవుడి దర్శనం కూడా త్వరగా దొరుకుతుంది...అలాంటి ఈ ప్రపంచంలో...మనిషి విలువ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఈరోజు...నువ్వు ఎంత మంచివాడివో కాదు..నీ జేబులో ఎంత డబ్బుందో అదే నీ విలువను నిర్ణయించే కాలం ఇది..పుట్టిన రోజు ఆసుపత్రి బిల్లు నుంచి...చివరి ప్రయాణంలో చితికి చేరే కట్టెల వరకు...ప్రతి అడుగూ డబ్బుతోనే మొదలై..డబ్బుతోనే ముగుస్తోంది.బతికున్నప్పుడు ప్రేమ కూడా లెక్కలతో వస్తోంది..గౌరవం కూడా స్థాయిని చూసి వస్తోంది..బంధాలు కూడా అవసరాన్ని బట్టి నిలుస్తున్నాయి.చేతిలో డబ్బు ఉన్నంతవరకే...ఫోన్‌లు మోగుతాయి...ఇంటికి మనుషులు వస్తారు..మాటల్లో ఆప్యాయత కనిపిస్తుంది..అదే డబ్బు తగ్గిపోయిన రోజు..మన విలువ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది..అప్పుడు అర్థమవుతుంది..మనల్ని ప్రేమించింది మనసు కాదు..మన దగ్గర ఉన్న పరిస్థితులని అని.*అందుకే...డబ్బు సంపాదించు*..ఎందుకంటే ఈ ప్రపంచంలో అది అవసరం..కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో..డబ్బు లేకపోవడం దురదృష్టం కాదు...డబ్బు కోసం మనిషితనాన్ని కోల్పోవడమే అసలైన దురదృష్టం..*ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
77)ఈ కలియుగంలో గొప్పవాడిగా నిలవడానికి కొండంత ఆస్తులు అవసరం లేదు..చిన్న మనసు కాకుండా పెద్ద మనసు ఉంటే చాలు.నిజాయితీగా ఉండటం..ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం..తీసుకున్నది తిరిగి ఇవ్వడం..ఇవే ఈ రోజుల్లో అత్యంత అరుదైన గొప్ప గుణాలు.కొంతమంది మన జీవితంలో డబ్బు కారణంగా దూరమవుతారు.అలా దూరమైతే బాధపడాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాల్లో అలాంటి వారిని కొంత డబ్బు ఇచ్చైనా జీవితంలో నుంచి దూరం చేయడం మంచిదే.ఎందుకంటే డబ్బు కోసం బంధాలను,నమ్మకాన్ని వదిలేసే వ్యక్తులు..మనతో ఉన్నా ప్రయోజనం ఉండదు..ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
78)చిల్లులున్న పాత్రలో ఎంత నీళ్లు పోసినా..అవి నిలవవు.అలాగే కృతజ్ఞత లేని మనుషులకు ఎంత మంచి చేసినా..చివరికి మిగిలేది మన బాధే.డబ్బు మనిషిని గొప్పవాడిని చేయదు..కానీ మనిషి అసలు రూపాన్ని మాత్రం బయటపెడుతుంది.సంపద మనిషి చేతిలో ఉండాలి..మనసులో కాదు.అందుకే సంపద కంటే సంస్కారం..డబ్బుకంటే నిజాయితీ..లాభం కంటే మనిషితనం గొప్పవి.నిజాయితీని కోల్పోకుండా..విలువలను వదులుకోకుండా జీవించే ప్రతి మనిషే..ఈ కాలంలో నిజమైన గొప్ప వ్యక్తి..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
79)చప్పట్లు కొట్టడానికి డబ్బు అవసరం లేదు...మెచ్చుకోవడానికి పదవి అవసరం లేదు...అభినందించడానికి ఆస్తి అవసరం లేదు...కావాల్సింది ఒక్క పెద్ద మనసు మాత్రమే...ఎదుటివాడు గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించగలిగితే...నీ గెలుపు కూడా దూరంలో ఉండదు...ఇతరుల విజయాన్ని భరించగలిగిన మనసే... తన విజయాన్ని నిలబెట్టుకోగలదు..*ఇట్లు.. మీ.. ✍🏻 రఘురాం*
80)నిజమే..అంతా మంచికే..కొన్ని దూరాలు..మనల్ని ఒంటరివాళ్లను చేయడానికి రావు..మనతో నడిచేది ఎవరో,మధ్యలో వదిలేసేది ఎవరో తెలియ జేయడానికి వస్తాయి.కొన్ని మోసాలు..మనిషిని ద్వేషించడంనేర్పవు..ఎవరిని ఎంతవరకు నమ్మాలో నేర్పుతాయి. కొన్ని నష్టాలు..మన దగ్గర ఉన్నదాన్ని లాక్కోవు..మనకు అవసరం లేని వారిని మన జీవితంలో నుంచి తీసుకెళ్తాయి.కాలం..శిక్షించదు..తీర్పు చెప్పదు..కేవలం ముసుగులు తొలగిస్తుంది.ముఖాలు మారవు..మనం చూసే దృష్టి మారుతుంది.అందుకే..జీవితంలో జరిగిన ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది..ఆ కారణం వెంటనే అర్థం కాకపోయినా,కాలం గడిచాక"ఇది జరగడం మంచిదే"అని ఒప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది.ఎందుకంటే..కాలం ఎప్పుడూ తప్పు చేయదు...మనుషుల అసలు విలువను,బంధాల అసలు రంగును,నమ్మకాల అసలు బరువును నిశ్శబ్దంగా బయటపెడుతుంది.కష్టం..మనల్ని విరగ్గొట్టడానికి రాదు..మన వాళ్లు ఎవరో,పరాయి వాళ్లు ఎవరో పరిచయం చేయడానికి వస్తుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
81)జీవితం మనం అనుకున్నట్టు నడవదు..జరిగే ప్రతి సంఘటన మన చేతుల్లో ఉండదు..కానీ దానికి మనం ఎలా స్పందిస్తామో అది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం సులభం..దానిలోని పాఠాన్ని గుర్తించి ముందుకు సాగడమే గొప్పతనం.కాలం ప్రతి ఒక్కరినీ ఏదో ఒక రోజు ఆపి ఆలోచింపజేస్తుంది..ఆ ఆలోచనే జీవితాన్ని మార్చే అసలు మలుపు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
82)డబ్బు సంపాదించడం కష్టమే..కానీ నమ్మకం సంపాదించడం అంతకంటే కష్టం.విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లు ఎందరో ఉంటారు..కానీ ఓటమిలో నీతో నిలబడేవాళ్లే నిజమైన మనుషులు.అవసరం తీరాక మారేది మనుషులు కాదు..వాళ్ల అసలు స్వభావమే బయటపడుతుంది.అందుకే ఆస్తి కంటే మనిషి విలువను..మాట కంటే నమ్మకాన్ని కాపాడుకోవడం జీవితంలో గొప్ప సంపద..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
83)జీవితంలో ప్రతి నష్టం శాపం కాదు..కొన్ని మూసుకుపోయిన తలుపులు తప్పు దారిలో వెళ్లకుండా దేవుడు వేసిన బ్రేకులు.ప్రతి గాయం మనల్ని బలహీనులను చేయదు..మరింత బలంగా నిలబడటం నేర్పిస్తుంది.ఒంటరితనం కూడా ఎప్పుడూ శిక్ష కాదు..తప్పు మనుషుల నుంచి జీవితానికి దొరికే ప్రశాంతమైన విశ్రాంతి.జరిగినదాన్ని మార్చలేం..కానీ దానివల్ల మనం మారే విధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
84)జీవితంలో గొప్ప పాఠాలు పుస్తకాల వల్ల కాదు..కష్టాలు,కాలం,అనుభవాలు నేర్పిస్తాయి.ప్రతి వైఫల్యం మనకు మనల్ని పరిచయం చేస్తుంది..ప్రతి చిన్న నిర్ణయం మన భవిష్యత్తును నిర్మిస్తుంది.వేగంగా పరిగెత్తేవాడు ముందుకు వెళ్లవచ్చు..కానీ సరైన దారిలో నడిచేవాడే గమ్యాన్ని చేరుకుంటాడు.అదృష్టం జీవితాన్ని మార్చదు..ప్రతిరోజూ సరైన ఆలోచనతో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితాన్ని గొప్పదిగా మారుస్తాయి..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
85)జీవితం మనం అనుకున్నట్టు జరగదు..జరిగినదానికి మనం ఎలా స్పందిస్తామో అదే జీవితాన్ని నిర్ణయిస్తుంది.కాలం ఎవరినీ ఆపదు..కానీ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక రోజు ఆపి ఆలోచింప జేస్తుంది.జీవితంలో పెద్ద పాఠాలు..పెద్ద మనుషుల దగ్గర కాదు,పెద్ద కష్టాల దగ్గర నేర్చుకుంటాం.డబ్బు సంపాదించడం కష్టం..కానీ నమ్మకం సంపాదించడం ఇంకా కష్టం.కొన్ని తలుపులు మూసుకుపోవడం శాపం కాదు..తప్పు దారిలో వెళ్లకుండా జీవితం వేసే బ్రేక్..ప్రతి నవ్వు సంతోషానికి గుర్తు కాదు..చాలాసార్లు అది బాధను దాచే ముసుగు..ఎవరూ శాశ్వతంగా మనతో ఉండరు..కాబట్టి మనల్ని మనం కోల్పోవద్దు..జీవితం ఇచ్చే గాయాలు..మనల్ని బలహీనులను కాదు, బలమైన వారిని చేస్తాయి.గెలిచిన తర్వాత చప్పట్లు కొట్టేవాళ్లు చాలామంది ఉంటారు..ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్లే నిజమైన వాళ్లు.అనుభవం ఉచితంగా రాదు..దానికి కాలం, కన్నీళ్లు లేదా తప్పులు ధరగా చెల్లించాలి..జీవితం ఎవరినీ మోసం చేయదు..మన అంచనాలే మనల్ని ఎక్కువగా బాధిస్తాయి.వేగంగా నడిచేవాడు ముందుకు వెళ్లొచ్చు...సరైన దారిలో నడిచేవాడే గమ్యానికి చేరుకుంటాడు.మనిషి మారడు..అతని అసలు స్వభావాన్ని బయటకు తీసేది పరిస్థితులే.అవసరం తీరిన తర్వాత మారేది మనుషులు కాదు..వాళ్ల అసలు రూపం బయటపడుతుంది.జీవితంలో కోల్పోయిన ప్రతి దాని కోసం బాధపడకు..కొన్ని నష్టాలే పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతాయి.ఒంటరితనం శిక్ష కాదు..తప్పు మనుషుల నుంచి జీవితానికి దొరికే విశ్రాంతి..కాలం సమాధానం చెప్పదు..కానీ ప్రతి సందేహానికి ఒక రోజు జవాబు చూపిస్తుంది.జీవితం ఎవరికీ సులభం కాదు..తేడా ఒక్కటే కొంతమంది నవ్వుతూ మోస్తారు, ఇంకొందరు ఏడుస్తూ మోస్తారు..విజయం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది..వైఫల్యం మనకు మనల్ని పరిచయం చేస్తుంది.జీవితం మార్చేది అదృష్టం కాదు..ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
86)కొండపై నిలబడి సముద్రాన్ని చూడాలంటే..అలల మాట వినిపించదు.కానీ ఆ అలలతో పోరాడినవాడికే వాటి బలం తెలుస్తుంది.అలాగే..మన జీవితాన్ని చూసేవాళ్లకు మన నవ్వు మాత్రమే కనిపిస్తుంది..కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కన్నీళ్లు,ఆ చిరునవ్వు కోసం చేసిన పోరాటం,ఆ బాధను మోసిన మనసు మాత్రం మనకే తెలుసు.అందుకే ఎవరి జీవితాన్నీ బయటకు కనిపించిన దానితో అంచనా వేయొద్దు..ప్రతి మనిషి మౌనంలో ఒక కథ ఉంటుంది..ప్రతి చిరునవ్వు వెనుక ఒక పోరాటం ఉంటుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
87)జీవితంలో నువ్వు ఒకడివి దాటిపోతే దాన్ని దాటడం అంటారు,కానీ నీ వెనక వచ్చే పందల మంది కాళ్లు ముళ్లు గుచ్చుకోకుండా దారి సుగమం చేస్తే దాన్ని ‘మహోన్నత విజయం’ అంటారు.సముద్రాన్ని దాటే శక్తి ఉన్నా,హనుమంతుడికి కూడా తన బలాన్ని గుర్తుచేసే జాంబవంతుడు కావాల్సి వచ్చింది.నీ బలం కేవలం నీ స్వార్థానికి పరిమితమైతే,అది ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టె ముక్క లాంటిదే..ఎదుటివారికి ఉపయోగపడేలా,మంచి వారికి అండగా నిలబడాలి.అని నువ్వు మారిన రోజే నీ బ్రతుక్కి ఒక అర్థం,పరమార్థం దక్కుతాయి...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
88)జీవితం ఎంతకాలం బ్రతికామనేది కాదు..ఎంతమంది జీవితాల్లో మంచి జ్ఞాపకంగా మిగిలామనేదే అసలు విలువ.మన కోసం మాత్రమే బ్రతికితే... మన కథ మనతోనే ముగిసిపోతుంది.ఇతరుల కోసం ఒక మంచి పని చేస్తే... మనం లేకపోయినా మన పేరు బ్రతికే ఉంటుంది.సంపాదించిన ధనం కంటే..సంపాదించిన మనుషులే గొప్ప ఆస్తి.నీ ఉనికి వల్ల ఒక్కరి జీవితమైనా మారితే..అదే నీ జన్మకు సార్థకత..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*
89)దీపం తనకోసం వెలగదు..చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలడానికే వెలుగుతుంది.మనిషి కూడా అంతే...తన విజయాన్ని మాత్రమే చూసుకునేవాడు ఎదుగుతాడు.తనతో పాటు ఇంకొంత మందిని ఎదగనిచ్చేవాడు గొప్పవాడవుతాడు.మన చేతుల్లో ఉన్న శక్తి..మనకే పరిమితమైతే అది అహంకారం.ఇతరులకు ఉపయోగపడితే అది ఆశీర్వాదం..వెలుగు పంచిన దీపాన్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*
90)చెట్టు తన కోసం పండ్లు కాయదు..నది తన కోసం ప్రవహించదు..మేఘం తన కోసం వర్షించదు..ప్రకృతిలో ఉన్న ప్రతిదీ..ఇతరులకు ఉపయోగపడడానికే తన ఉనికిని చాటు కుంటుంది.మనిషి కూడా అదే నేర్చుకోవాలి.నీ జ్ఞానం,నీ అనుభవం,నీ స్థానం..నలుగురికి ఉపయోగ పడినప్పుడే వాటికి నిజమైన విలువ..స్వార్థం జీవితం గడిపిస్తుంది..సేవ జీవితం నిలిపిస్తుంది..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*
91)కాలం ఎవరినీ గుర్తుంచుకోదు..కానీ కాలాన్ని సార్థకం చేసిన వారిని చరిత్ర గుర్తుంచు కుంటుంది.ఎత్తుకు ఎదగడం గొప్ప కాదు..ఎదిగిన తర్వాత ఎంతమందిని పైకి లేపామనేదే గొప్పది.పదవి,డబ్బు,పేరు..కాలంతో కలిసి మాయమవుతాయి..కానీ మన వల్ల ఎవరి కళ్లలోనైనా వచ్చిన ఆనందం..జీవితాంతం నిలిచిపోతుంది.మనిషి గొప్పతనం అతను ఎంత సంపాదించాడో కాదు..ఎంతమందికి ఆశగా నిలిచాడో దానిలో ఉంటుంది..*ఇట్లు... మీ...✍🏻 రఘురాం*
92)మనిషి గొప్పతనం అతను ఎంత ఎత్తుకు ఎదిగాడో చెప్పదు..అతని వల్ల ఎంతమంది ఎదిగారో చెబుతుంది.నువ్వు ఒక్కడివే ముందుకు సాగితే..అది నీ ప్రయాణం. కానీ నీ వెనక నడిచే వారికి దారి చూపించి,వారు తడబడకుండా ముందుకు వెళ్లేలా చేస్తే..అదే నీ జీవితానికి నిజమైన విజయం.సముద్రాన్ని దాటే అపార శక్తి హనుమంతుడిలో ఉన్నా..ఆ శక్తిని గుర్తు చేసే జాంబవంతుడు అవసరమయ్యాడు..అంటే బలం ఉండటం గొప్ప కాదు..ఆ బలం సరైన సమయంలో,సరైన పనికి ఉపయోగపడటమే గొప్పది.నీ జ్ఞానం,నీ అనుభవం, నీ పదవి,నీ శక్తి..ఇవన్నీ నీకే పరిమితమైతే అవి కాలంతో కలిసి మాయమై పోతాయి..కానీ అవే మరొకరి జీవితాన్ని నిలబెట్టే ఆధారంగా మారితే..అవి శాశ్వతంగా నిలిచిపోతాయి.నీ వల్ల ఒకరి కళ్లలో ఆశ కనిపిస్తే..నీ వల్ల ఒకరి అడుగుల్లో ధైర్యం పెరిగితే..నీ వల్ల ఒకరి జీవితంలో వెలుగు నిండితే..అదే నీ ఉనికికి అసలైన విలువ.నీ కోసం జీవించడం సహజం..నలుగురి కోసం ఉపయోగపడడం సార్థకం.నువ్వు వెళ్లిన దారిని మాత్రమే కాదు..నీ తర్వాత వచ్చే వారి దారిని కూడా సులభం చేసిన రోజే,నీ జీవితానికి అర్థం..పరమార్థం రెండూ దక్కుతాయి..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*
93)మనిషి వెళ్లిపోయిన తర్వాత అతని పేరు నిలబడేది..అతను కట్టుకున్న ఇల్లు వల్ల కాదు,అతను కట్టించిన జీవితాల వల్ల.ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు మాత్రమే...తమ అనుభవాన్ని నలుగురికి పాఠంగా మార్చి, తాము నడిచిన దారిని ఇతరులకు వెలుగుగా విడిచి పెడతారు.ఒక దీపం తన వెలుగును దాచుకోదు..పక్కనున్న మరో దీపాన్ని వెలిగించినా తన వెలుగు తగ్గదు.అలాగే జ్ఞానం,అనుభవం,అవకాశం కూడా పంచితే తగ్గవు..మరింత విలువ పెరుగుతుంది.శ్రీరాముడి మహిమను ప్రపంచానికి చాటింది హనుమంతుడి సేవ. హనుమంతుడి శక్తిని ప్రపంచానికి తెలియజేసింది జాంబవంతుడి ప్రేరణ.గొప్పతనం ఒక్కడిగా నిలవడంలో కాదు..మరొకరిని నిలబెట్టడంలో ఉంది.నీ వల్ల ఒకరు ధైర్యం పొందితే..నీ వల్ల ఒకరు తప్పు దారి నుంచి తిరిగివస్తే..నీ వల్ల ఒకరు జీవితంలో ముందడుగు వేస్తే..అదే నీ ఉనికికి నిజమైన గుర్తింపు.మన కోసం బ్రతికితే జీవితం ముగుస్తుంది..నలుగురి కోసం ఉపయోగపడితే జీవితం నిలిచిపోతుంది.మనం సంపాదించిన ధనం ఒకరోజు మిగలకపోవచ్చు..కానీ మనం సంపాదించిన ఆశీర్వాదాలు మాత్రం తరాలు గుర్తుంచు కుంటాయి.*ఇట్లు...మీ...✍🏻 రఘురాం*
94)నీలో తప్పులు వెతికే వాళ్లు ఎప్పుడూ ఉంటారు..నీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే మనుషులు ఉంటారు..నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా మాట్లాడతారు..నువ్వు ఎదిగినా అసూయపడతారు..కానీ ఒక విషయం మాత్రం నిజం..నీ గురించి ఎక్కువగా మాట్లాడేది,నిన్ను గమనించే వాళ్లే..ఎందుకంటే వెలుగు ఉన్న చోటే నీడ కనిపిస్తుంది..విలువ ఉన్న మనిషినే ఎక్కువగా విమర్శిస్తారు..కాబట్టి ఎవరి మాటలకి బాధపడకు..నీ ప్రయాణం ఆపకు..నీ లక్ష్యం మీద నమ్మకం కోల్పోవద్దు..ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్లే,రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
95)కాల్చే నిప్పునైనా నమ్మొచ్చు..అది తాకితే కాలుస్తుందని ముందే తెలుసు..కానీ రంగులు మార్చే మనుషుల సంగతి అలా కాదు..వాళ్లు నవ్వుతూ దగ్గరకు వస్తారు..అభిమానం పేరుతో మోసం చేస్తారు..అవసరం తీరేదాకా వెన్నంటి ఉంటారు..పని అయిపోగానే పరాయివాళ్లలా వదిలేస్తారు..నిప్పు చేసిన గాయం శరీరాన్ని మాత్రమే కాల్చుతుంది..కానీ కపట మనిషి ఇచ్చే గాయం మనసును,నమ్మకాన్ని,భవిష్యత్తునే నెమ్మదిగా బూడిద చేస్తుంది..శత్రువు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తాడు..ద్రోహి మాత్రం పక్కనే కూర్చుని చిరునవ్వుతో వెన్నుపోటు పొడుస్తాడు..అందుకే తీపి మాటలు విని మోసపోకు..కాలం చూపించే నిజమైన నడవడిక చూసి నమ్ము..మాటలు అందంగా అలంకరించు కోగలవు..ముఖాలు క్షణానికోసారి మారగలవు..కానీ స్వార్థం ఎప్పటికీ దాగదు..కాలం వచ్చినప్పుడు ముసుగు తొలగిపోయి అసలు రూపం బయట పడుతుంది..ప్రతి చిరునవ్వు వెనుక మంచి ఉండదు..ప్రతి సాయం వెనుక స్వార్థం ఉండొచ్చు..మనం అనుకుంటాం ప్రతి చేయి అండగా ఉంటుందని కానీ కొన్ని చేతులు అవసరం కోసం మాత్రమే చాస్తాయి..అందుకే కళ్లతో కాదు..కాలంతో నమ్ము..జీవితంలో అందరితో మంచిగా ఉండు..కానీ గుడ్డిగా ఎవరినీ నమ్మకు..ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
96)రైతు విత్తనం వేసేటప్పుడు ఫలితం లెక్కేయడు..తల్లి అన్నం పెట్టేటప్పుడు రేపు ఏమిస్తాడని ఎదురు చూడదు..దీపం వెలుగునిచ్చేటప్పుడు చీకటి ఎప్పుడు పోతుందని అడగదు..మరి నువ్వు మాత్రం ప్రతి పనికి లాభం ఎందుకు చూస్తావు..
*_కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన_*
నీ చేతిలో ఉండేది కర్మ మాత్రమే..ఫలితం నీ చేతిలో లేదు..నువ్వు చేయగలిగింది ప్రయత్నం మాత్రమే..గెలుపు కాదు..గెలుపు ఒక రోజు వచ్చి పోతుంది..కానీ కర్తవ్యం నిన్ను మనిషిగా నిలబెడుతుంది..నువ్వు చిందించిన చెమట చుక్కలు..నువ్వు రాల్చిన కన్నీటిబొట్లు ఎప్పటికి వృథా కావు..అవే రేపు నీ విజయానికి పునాది రాళ్లు..ప్రపంచం చప్పట్ల కోసం కాదు..నీ మనసు గర్వపడే జీవితం కోసం కష్టపడు..నువ్వు చేసే పనిని ధర్మంగా చేయి..ఫలితాన్ని కాలానికి,దేవుడికి వదిలేయి..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
97)అవసరం తీరేవరకు దగ్గరగా ఉంటారు..అవకాశం వచ్చేవరకు మాట్లాడతారు..పని అయిపోగానే పలకరింపు ఆగిపోతుంది..సాయం చేసిన చెయ్యి కూడా గుర్తుండదు..నీ దగ్గర లాభం ఉన్నంతవరకే నీకు గౌరవం..నువ్వు పడిపోతే తొక్కేందుకు వచ్చేవాళ్ళే ఎక్కువ..లేపేందుకు వచ్చేవాడు ఒక్కడు కూడా ఉండడు..ఇదే నేటి లోకం తీరు..స్వార్థం లేకుండా పలకరించేవాడు దొరకడం అరుదైపోయింది..అవసరం కోసం వాడేవాడు ఎక్కువ..ఆపదలో ఆదుకునేవాడు తక్కువ..మనిషి విలువ అతని పదవితో..డబ్బుతో లెక్కేస్తున్నారు..మనసుతో కాదు..అందుకే ఎవరి మీద ఆశ పెట్టుకోకు..నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు..నీ కష్టమే నీకు అండ..నీ నిజాయితీయే నీకు బలం..నీ చెమటే నీకు విజయాన్ని ఇస్తుంది..నీ కష్టమే నీకు పేరు తెస్తుంది..ఎవరూ లేకున్నా నువ్వు నీకు తోడుగా ఉండు..ఎందుకంటే ఈ లోకంలో నీకు నువ్వే దేవుడివి..మనిషితనం చూపేవాడే నిజమైన మనిషి...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
98)ఆలోచిస్తున్నావా?లేక బాధలో మునిగిపోతున్నావా?కళ్ళ ముందు ఆశలు కాలిపోతుంటే నమ్మకం జారిపోతుంది..జారకుండా పట్టుకున్నోడే జీవితంలో నిలబడతాడు..చావు మనిషి పుట్టుకతోనే రాసి ఉంటుంది..దాన్ని తెలుసుకోలేని మనిషి "నా బంధం..నా బంధం"అని వెంట పడుతూ ఉంటాడు..దేవుడు పుట్టుకకి తొమ్మిది నెలలు ఇస్తాడు..ప్రాణం మాత్రం పుట్టుకునే తీస్తాడు..ఎప్పుడైనా ఆలోచించావా?చావుకి కూడా సమయం ఇస్తే బ్రతుకుతా..పాడు చేసుకుంటాడని దేవుడు సమయం ఇవ్వడు..పోయినోళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలను తలుచుకుంటా..వదిలేసిన ప్రశ్నలని వెతుకుతా వెళ్ళడమే జీవితం..నీ కోసం చేసేది కర్తవ్యం..నలుగురి కోసం చేసేది ధర్మం..వదిలితే భారం దిగుతుంది..కలుపుకుంటే బాధ పెరుగుతుంది..అందుకే దేనికీ అతుక్కోకు..ముందుకు సాగడమే నిజమైన బతుకు..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
99)పుట్టేటప్పుడు ఒంటరిగా వస్తాం..పోయేటప్పుడు ఒంటరిగా పోతాం..మధ్యలో ఉన్నన్నాళ్ళు మాత్రమే "నాది..నాది" అంటాం..ఈ ప్రపంచంలో శాశ్వతం ఏంటో తెలుసా?సత్యం నీకు కన్నతల్లి..జ్ఞానం నీకు కడుపున పుట్టిన తండ్రి..ధర్మం నీడలా వెంటుండే తోడు..దయ చేయి చాచే స్నేహితుడు..శాంతి కన్నీళ్ళు తుడిచే ఇల్లాలు..క్షమ కౌగిలించుకునే బిడ్డ..ఈ ఆరు దగ్గరుంటే చాలు..మిగతావన్నీ తెర మీద నాటకాలే..నువ్వు ఎందుకు పుట్టావో కాలమే ఒకరోజు లెక్క అడుగుతుంది..నీ పుట్టుకకి అర్థం నువ్వే వెతుక్కోవాలి..దొరుకుతుంది కానీ దారి మాత్రం ఎవ్వరూ వేయరు..నువ్వే నడవాలి..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
100)కలలు కనడం అందరికీ వస్తుంది..కానీ ఆ కలను నిజం చేయడానికి నిద్రను త్యాగం చేసేవాడే చరిత్ర సృష్టిస్తాడు.
"ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః॥"
*అర్థం ఏంటో తెలుసా?*
ఆకలి ఉన్నా నిద్రపోతున్న సింహం నోట్లోకి ఆహారం రాదు.అలాగే,కోరికలు ఉన్నంత మాత్రాన జీవితంలో విజయం దక్కదు.ప్రయత్నమే విజయానికి మొదటి అడుగు,పట్టుదలే చివరి మెట్టు.కోరికలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి,కానీ వాటి కోసం చెమటోడ్చే వాళ్లే గమ్యాన్ని చేరుకుంటారు.అదృష్టం అవకాశం ఇవ్వొచ్చు,కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది నీ కష్టం,నీ క్రమశిక్షణ,నీ అచంచలమైన పట్టుదల.ఈరోజు చేసే ప్రతి చిన్న ప్రయత్నం రేపటి గొప్ప విజయానికి పునాది.ఈరోజు సోమరిగా ఉంటే ప్రపంచం నిన్ను చూసి నవ్వుతుంది.ఈరోజు కష్టపడితే అదే ప్రపంచం రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడుతుంది.గుర్తుంచుకో..గెలుపు ఎవరి ఇంటి తలుపు తట్టదు.దానిని వెతికి,పోరాడి,సాధించాలనే తపన ఉన్నవారినే గెలుపు ఆలింగనం చేసుకుంటుంది.కలలు కనకు,వాటి కోసం జీవించు.కోరికలు పెట్టకు,వాటి కోసం పోరాడు.అదృష్టం కోసం ఎదురు చూడకు.నీ ప్రయత్నంతో అదృష్టాన్నే నీ వైపు నడిపించు.ఎందుకంటే విజయానికి దారి అదృష్టం కాదు,ప్రతిరోజూ ఆగకుండా వేసే నీ అడుగులు,కార్చే నీ చెమట,వదలని నీ పట్టుదలే నిజమైన విజయం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
101)కనిపించేదే నిజం కాదు..దూరం నుంచి చూసిన దృశ్యానికి "నిజం" అనే పేరు పెట్టకూడదు ..కొండలు కలిసినట్టు కనిపిస్తాయి..కానీ కలవు..ఎడారిలో నీరు కనిపిస్తుంది..కానీ దాహం తీర్చదు..అలాగే మనిషి నవ్వుతున్నాడని అతని గుండె ప్రశాంతంగా ఉందని అనుకోకు..ఓడిపోయాడని అతని జీవితం అయిపోయిందని తీర్పు ఇవ్వకు..గెలిచాడని అతనికి బాధలే లేవని నమ్మకు..కళ్ళకు కనిపించేది రూపం మాత్రమే..నిజం మాత్రం కాలం,అనుభవం మాత్రమే చూపిస్తాయి..అందుకే కనిపించేదాన్ని కాదు,అర్థమయ్యేదాన్ని నమ్ము..వినిపించేదాన్ని కాదు నిజాన్ని వెతుకు..ఎందుకంటే మాయ ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది..సత్యం మాత్రం నిశ్శబ్దంగా నిలబడుతుంది..అదే జీవిత ధర్మం..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
102)కొన్నిసార్లు జీవితం కారణం లేకుండానే శిక్షిస్తుంది..ఏ తప్పూ చేయకున్నా మన అనే మన ప్రపంచం ఒక్కసారిగా మన ముందే కూలిపోతుంది..ప్రాణం పెట్టి నమ్మిన బంధాలే రోజు గుండెను ముక్కలు చేస్తాయి..ఏడిస్తే తుడిచేవారు ఉండరు..బాధ చెప్తే వినేవారు ఉండరు..అద్దంలో తనను తాను చూసుకుని "ఎందుకు బతకాలి" అని ప్రశ్నించుకునే రోజులు వస్తాయి..అవును జీవితం కొన్నిసార్లు శరీరాన్ని కాదు..ఆశలను..నమ్మకాన్ని చంపేస్తుంది..కానీ ఆగాలి..చీకటి ఎంత పొడవుగా ఉంటే వెలుగు అంత ప్రకాశంగా వస్తుంది..విరిగిన చోటు నుంచే కొత్త బలం పుడుతుంది..ఈరోజు మౌనాన్ని చూసి నవ్వినవాళ్ళే..రేపు లేచి నిలబడటం చూసి భయపడతారు..గుర్తుంచుకోవాలి..కథ ఇక్కడితో అయిపోలేదు..ఇది ఇప్పుడే మొదలైంది..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
103)జీవితం ప్రతి రోజు ఒక కొత్త పాఠం నేర్పుతుంది..ఎవరినీ బాధపెట్టకుండా బ్రతకడం గొప్ప విషయమే..కానీ ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలని చూడటం మాత్రం మనశ్శాంతిని దూరం చేస్తుంది..అందరినీ మెప్పించడం అసాధ్యం..అందరి మాటలు మోస్తే అడుగులు భారంగా మారిపోతాయి..నీ విలువను అర్థం చేసుకునే వాళ్ల కోసం బ్రతకడమే చాలు..నీ మంచితనాన్ని కోల్పోకు..కానీ నీ ప్రశాంతను అమ్ముకుని మంచిగా ఉండటం మాత్రం నేర్చుకోకు..ఎందుకంటే నువ్వు అందరికీ మంచిగా ఉండేసరికి..నువ్వు విరిగిపోయినా పట్టించుకునేవాడు ఉండడు..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
104)జీవితంలో గెలుపు వచ్చినప్పుడు చుట్టూ వేల మంది ఉంటారు..కానీ ఓటమి వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఉండరు..గెలుపును చూసి దగ్గరకు వచ్చేవారు అందరూ తమ స్వార్థం కోసమే..కానీ నువ్వు ఓడిపోయినా, కిందపడిపోయినా కూడా నీ చేయి పట్టుకుని లేపేవారే నిజమైన బంధం..గుర్తుంచుకో..నీ గెలుపును బట్టి నీతో ఉండేవారు స్నేహితులు కాదు..నీ ఓటమిలో సైతం నీతో నిలబడేవారే నిజమైన నీవాళ్ళు..అలాంటి ఒకే ఒక్కడు ఉంటే చాలు..వేయి మంది అవసరం లేదు.._ఇట్లు..మీ..✍🏻రఘురాం_
105)ఈ లోకంలో ఒక విషయం మాత్రం నిజం..నీకోసం నువ్వు బతకపోతే ఇక్కడ నిన్ను అర్థం చేసుకునేవాళ్లు చాలా తక్కువ మంది..అవసరానికి వచ్చి..పని అయ్యాక వెళ్లిపోయేవాళ్లే ఎక్కువ..అందుకే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో..నీ విలువ నీకు తెలియాలి..గుర్తుంచుకో..నీ వెంట నిజంగా ఉండే ఒకే ఒక్కరు ఉంటే చాలు..వంద మంది పేరుకే "మనవాళ్లు" అనేవాళ్లు వద్దు..ఎందుకంటే ఈ ప్రపంచం నీ కన్నీళ్లను చూడదు..నీ విజయాన్ని మాత్రమే గుర్తుంచుకుంటుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
106)ప్రతి మనిషికి ఒక కల ఉండాలి..ఆ కలే జీవితానికి బలం ఇవ్వాలి..ఆ కలను మనసులో గట్టిగా నమ్మాలి..ఆ కల కోసం రోజు కష్టపడాలి..ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గొద్దు..ఎన్ని అవమానాలు ఎదురైనా ఆగొద్దు..కన్నీరు వచ్చినా తుడుచుకొని ముందుకు సాగాలి..ఎందుకంటే ఈ లోకం కష్టం గుర్తుంచుకోదు..గెలిచాకే గౌరవిస్తుంది..ఒక రోజు నువ్వు గెలిచి నిలబడినప్పుడు..నిన్ను చూసి నవ్విన వాళ్లే నీ దగ్గరికి వస్తారు..గుర్తుంచుకో..కలలు కనడం అందరి పని..కలలు నిజం చేయడం కొందరి పని..నువ్వు ఆ కొందరిలో ఒకడివి కావాలి..ఎందుకంటే నీ కలే ఒక రోజు నిన్ను అందరి ముందు గొప్పగా నిలబెడుతుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
107)పరిస్థితులు ఎంత కఠినంగా మారినా..బతకడం కోసం నీ మనసును అమ్ముకోకు..ఆకలి బాధపెట్టొచ్చు..అవసరాలు కన్నీళ్లు పెట్టించొచ్చు..కాలం నిన్ను పరీక్షించొచ్చు..కానీ.. గెలవడం కోసం నీ విలువలను తాకట్టు పెట్టకు..ఎందుకంటే..కోల్పోయిన డబ్బు మళ్లీ సంపాదించవచ్చు..చేతుల నుంచి జారిపోయిన అవకాశాలు మళ్లీ రావచ్చు..కానీ..ఒకసారి ఆత్మగౌరవం విరిగిపోతే..ఒకసారి వ్యక్తిత్వం మసకబారితే..ఆ గాయం జీవితాంతం మనసును వెంటాడు తుంది..ప్రపంచం ముందు గొప్పవాడిగా కనిపించడం కంటే..రాత్రి నిద్రపోయే ముందు అద్దంలో నీ ముఖాన్ని చూసి..నేను తప్పు చేయలేదు అని గర్వంగా చెప్పుకోగలగడం గొప్ప విషయం..అందుకే..గుణాన్ని కాపాడుకో..నిజాయితీని నిలబెట్టుకో..ఆత్మగౌరవాన్ని వదులుకోకు.ప్రపంచం నిన్ను గుర్తించకపోవచ్చు..నీ మంచితనాన్ని అర్థం చేసుకోక పోవచ్చు..నిన్ను ఓడిపోయిన వాడివని అనుకోవచ్చు..కానీ..నీ మనసాక్షి ముందు నువ్వు తలెత్తుకుని నిలబడ గలిగితే..నువ్వు గెలిచినట్టే..ఎందుకంటే జీవితంలో అతిపెద్ద విజయం..డబ్బు సంపాదించడం కాదు..మనిషిగా మనల్ని మనం కోల్పోకుండా ఉండటం..ధనం పోతే కొంతే పోయింది..ఆరోగ్యం పోతే ఎక్కువే పోయింది..కానీ వ్యక్తిత్వం పోతే..అన్నీ పోయినట్టే..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
108)నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత తేలికగా నిన్ను వాడుకుంటారు..నీ మంచిని అలుసుగా తీసుకుంటారు..నీ ఓర్పును చేతగానితనం అంటారు..నీ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటారు..అందుకే అందరికీ మంచోడిగా పేరు కోసం నిన్ను నువ్వే పోగొట్టుకోకు..ఎవరి దగ్గర ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండు..ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడు..ఎక్కడ గీత గీయాలో అక్కడ గీత గీయి..లేకపోతే నిన్ను నీవే వదులు కుంటావు..గుర్తుంచుకో..పని ఉన్నంత వరకు దగ్గరగా ఉంటారు..పని అయ్యాక పట్టించుకోరు..ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆదుకునేది..కింద పడ్డప్పుడు లేపేది..మళ్లీ నడిపేది..అన్నీ నువ్వే..అందుకే రాయి లా కఠినంగా మారొద్దు..నీళ్లలా కరిగిపోయేంత మెత్తగా కూడా ఉండొద్దు..ఈ లోకంలో ఆఖరికి నిన్ను నిలబెట్టేది నీలో ఉన్న నీవే..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
109)బ్రతుకు బరువుగా అనిపించిన ప్రతిసారి ఆగకు..ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు..ఈరోజు ఏడిపించినదే రేపు నవ్విస్తుంది..మనసు అలసిపోతుంది..మనుషులు దూరమవుతారు..నమ్మినవాళ్లే మోసం చేస్తారు..కష్టాలు ఒకేసారి వచ్చి చుట్టుకుంటాయి..అప్పుడు బ్రతకడమే ఎందుకు అనిపిస్తుంది..కానీ చీకటి ఎంత గాఢంగా ఉంటే పొద్దు అంత అందంగా వస్తుంది..ఒక్కసారి ఆలోచించు..నీ కోసం ఎదురు చూసే వాళ్లు ఉన్నారు..నీ నవ్వు కోసం ఎదురు చూసే గుండెలు ఉన్నాయి..ఈరోజు నిన్ను అర్థం చేసుకోకపోయినా రేపు నీ విలువ అందరికీ తెలుస్తుంది..జీవితం అంటే సుఖం మాత్రమే కాదు..పడటం..లేవడం..అన్నీ నేర్పే పాఠాలే..ఓటమి శాశ్వతం కాదు..బాధ కూడా శాశ్వతం కాదు..మనసు గట్టిగా పెట్టుకుంటే కాలమే నీకు తోడు అవుతుంది..ఒకరోజు నీ గాయాలే ఇతరులకు ధైర్యం అవుతాయి..కన్నీళ్లు పెట్టిన కళ్లే ఒకరోజు విజయంతో మెరుస్తాయి..అందుకే గుర్తుంచుకో..ఈ బాధ కూడా వెళ్లిపోతుంది..కానీ నువ్వు గెలిచే రోజు ఇంకా రావాలి..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
110)నీలో తప్పులు వెతికేవాళ్లు ఎప్పుడూ ఉంటారు..నీ మంచిని కూడా తప్పుగా చూసే మనుషులు ఉంటారు..నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా మాట్లాడతారు..నువ్వు ఎదిగినా ఈర్ష పడతారు..కానీ ఒక విషయం గుర్తుంచుకో..నీ గురించి ఎక్కువగా మాట్లాడేది నిన్ను గమనించే వాళ్లే..ఎందుకంటే వెలుగు ఉన్న చోటే నీడ ఉంటుంది..విలువ ఉన్న మనిషినే ఎక్కువగా విమర్శిస్తారు..అందుకే ఎవరి మాటలకు బాధపడకు..నీ ప్రయాణం ఆపకు..నీ లక్ష్యం మీద నమ్మకం వదులుకోకు..ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్లే రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు..సమయం వచ్చే వరకు సహనంగా ఉండు..అన్నీ నీకు చేకూరతాయి..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
111)అనుకున్న పనులు ఆలస్యమైనంత మాత్రాన ఆగిపోకు..ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫలితం రాకపోయినా తలవంచకు..ఈ ప్రకృతిలో అన్ని పువ్వులు ఒకేసారి పూయవు..దేని కాలం వచ్చినప్పుడే అది వికసిస్తుంది..ప్రతిదానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది..సమయం కంటే ముందు,ప్రాప్తం కంటే ఎక్కువ ఏదీ ఎవరికీ రాదు..ఒక పువ్వు ఆలస్యంగా వికసించినా,వికసించాక దాని సువాసనకు ఊరంతా పడిపోతుంది..గుర్తుంచుకో..నీ కష్టం కూడా అంతే..ఈరోజు నీ ఆలస్యాన్ని చూసి నవ్వేవాళ్లే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు..కాబట్టి ధైర్యంగా ఉండు,ఓపికగా ఉండు..నీ సమయం వచ్చిన రోజు నీ జీవితం అందరి కళ్లలో మెరుస్తుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
112)నీలోని మంచితనమే కొన్నిసార్లు ఇతరులు నిన్ను మోసం చేయడానికి అసలైన ఆయుధం అవుతుంది..అందుకే ఈ లోకంలో నీ ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు నువ్వు కూడా కాస్త స్వార్థంగా ఆలోచించాలి..అందరినీ నమ్మడం మంచిదే కానీ గుడ్డిగా నమ్మితే మోసపోతావు..అప్పుడే ఈ బతుకు సత్యం నీకు పూర్తిగా బోధపడుతుంది..నీ జీవిత చదరంగంలో ఎందరు వచ్చి కలిసినా,ఎందరు మధ్యలో వదిలి వెళ్ళినా కడదాకా నీకు తోడుగా నిలిచేది నీవు చేసే కర్మ,నీ నడవడి,నీకు నువ్వు మాత్రమే..ఎవరికోసం ఎదురు చూడకు..నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు..పడ్డా లేచే శక్తి నీలోనే ఉంది..గెలిచినా ఓడినా గుణం వదులుకోవద్దు..ఎందుకంటే గుణమే మనిషికి అసలైన ఆభరణం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
113)ఈ లోకంలో బతకాలంటే మంచితో పాటు మెలకువ కూడా తెలిసి ఉండాలి..అందరినీ నమ్మితే మోసపోతావు..ఎవరినీ నమ్మకపోతే ఒంటరిగా మిగిలిపోతావు..అందుకే ఎదుటి వాడి మాట విను కానీ నీ బుద్ధితో ఆలోచించు..అవసరమైన చోట గట్టిగా నిలబడు..అవసరమైన చోట సర్దుకుపో..నీ జీవిత చదరంగంలో ఎందరు వచ్చినా వెళ్ళినా చివరికి నీకు తోడు నీ కర్మే..నీ నిర్ణయాలే..ఎవరి కోసం ఆగకు..నీ దారి నువ్వు వేసుకో..పడితే లేచే ధైర్యం,గెలిస్తే గర్వపడని గుణం ఉంటే చాలు..అదే నీకు అసలైన రక్ష..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
114)జీవితం అంటే ఒక జత చెప్పులాంటిది..ఒకటి దెబ్బ తింటే రెండోది నడవలేదు..నువ్వు చేసిన తప్పు కాకపోయినా,నువ్వు నమ్మిన వాళ్ళ నిర్లక్ష్యానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది..నీ నిశ్శబ్దాన్ని బలహీనత అనుకుంటారు..నీ సహనాన్ని స్వార్థానికి వాడుకుంటారు..గుర్తుంచుకో..అందరి బరువులు మోయడానికి నువ్వేం బండి కాదు..నీ వెన్నుపై ఎక్కి పైకి వెళ్ళేవాడికి,నువ్వు కనపడవు..తప్పు చేసినవాడు తప్పించు కుంటాడు..నిలబడినవాడు నలిగి పోతాడు..ఇదే లోక నీతి..అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయి..నీతో పాటు నిన్ను నమ్మిన వాళ్ళ జీవితం కూడా నడుస్తుంది..పడిపోయినా పర్వాలేదు..కానీ పడేసే వాళ్ళకు అవకాశం ఇవ్వకు..నీ కిరీటం నీ తలపైనే ఉండాలి..ఇతరుల కాళ్ళ కింద కాదు..నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి..ఇతరుల ఇష్టాల్లో కాదు..కాబట్టి నీ కోసం నువ్వు నిలబడు..ఎందుకంటే నిన్ను కాపాడుకోగలిగేది నువ్వు మాత్రమే..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
115)బలం అంటే గొంతు పెంచి అరవడం కాదు..కన్నీరు తుడిచి ధైర్యం చెప్పడం..బలవంతుడు అంటే ఎదుటివారిని కింద పడేసేవాడు కాదు..బలహీనుడై కింద పడిపోయినవాడికి చేయి అందించి పైకి లేపేవాడే..ప్రపంచం గెలిచిన వాళ్లని పొగుడుతుంది..కానీ ఓడిపోయిన వాణ్ణి లేపిన వాడే నిజమైన హీరో..నీ నీడలో ఇంకొకరికి వెలుగు ఇవ్వగలిగితే అదే నీ గొప్పతనం..నీ ఎదుగుదలతో ఇంకొకరి జీవితం బాగుపడితే అదే నీ విజయం..ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి..ఎదుటివాడు పడితే చూసి నవ్వకూడదు..ఆప్యాయంగా చెయ్యి పట్టి లేపాలి..ఎందుకంటే ఈరోజు నువ్వు ఎవరికో ఆసరా అయితే..రేపు నువ్వు కూలినప్పుడు ఎవరో నీకు ఆసరా అవుతారు..గుర్తుంచుకో..రాజు కావడం పెద్ద కాదు..రాజు లేకుండా రాజ్యం నడిపించడం గొప్ప..కింద పడేయడం సులభం..కానీ కింద పడ్డవాణ్ణి పైకి తీసుకురావడమే నిజమైన బలం కాబట్టి మనిషిగా పుట్టినందుకు మనిషిని మనిషిగా చూడు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
116)ఇక్కడ నువ్వు అరిచినా ఓటమే..నువ్వు ఊరుకున్నా అవమానమే.ఎందుకంటే నువ్వు ఒక్కడివి కాదు..నీ వెనుక నీ కుటుంబం ఉంది.నీ బలం మీదే వాళ్ల భరోసా ఉంది..నీ ప్రతి నిర్ణయం వాళ్ల జీవితాలను ప్రభావితం చేస్తుంది.అందుకే ప్రతి సమస్యకు ఆవేశంతో సమాధానం చెప్పకు..ప్రతి మాటకు తిరిగి మాట చెప్పాలని ఆరాటపడకు..ప్రతి అన్యాయానికి వెంటనే ఎదురు తిరగాలని తొందరపడకు.ఎందుకంటే నువ్వు వేసే ప్రతి అడుగుకూ నీతో పాటు నీ కుటుంబం కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.నువ్వు ఎదురు తిరిగితే నలిగిపోయేది నువ్వే..తలొంచితే కుంగిపోయేది కూడా నువ్వే..కాబట్టి ముందుగా ఎదుటివాడిని మార్చాలని చూడకు..పరిస్థితులను మార్చాలని తొందరపడకు..ముందు నిన్ను నువ్వు నిలబెట్టుకో.నువ్వు నిలబడితేనే నీ చుట్టూ ఉన్నవాళ్లు నిలబడతారు..నువ్వు బలంగా ఉంటేనే నీ కుటుంబానికి భరోసాగా ఉంటావు.ఎందుకంటే నీకు కావాల్సింది ప్రతి యుద్ధంలో గెలవడం కాదు..జీవితంలో ఓడిపోకుండా నిలబడటం..*ఇట్లు… మీ… ✍🏻 రఘురాం*
117)ఆవేశాన్ని అదుపులో పెట్టుకో..ఆ ఆవేశాన్నే ఆత్మవిశ్వాసంగా మార్చుకో.కోపాన్ని గుండెల్లో పెట్టుకుని కాలిపోకు..ఆ కోపాన్నే కసిగా కాదు..కృషిగా మార్చుకో.ఎందుకంటే నీకు ఉన్న గొప్ప ఆయుధం అరుపు కాదు..ఓర్పు.ఈరోజు నీ మౌనాన్ని బలహీనతగా భావించవచ్చు..నీ ఓర్పును చేతకానితనంగా అనుకోవచ్చు..నీ మంచితనాన్ని నీ బలహీనతగా తీసుకోవచ్చు.కానీ ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు..కొన్ని సమాధానాలు మాటలతో కాదు,కాలంతో చెప్పాలి.ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా..నీ లక్ష్యాన్ని వదలకుండా,సరైన సమయం కోసం ఎదురుచూస్తూ నిలబడగలగడమే అసలైన బలం.గుర్తుపెట్టుకో..అరిచేవాడు గొప్పవాడు కాదు..అణచుకుని,ఆలోచించి,సరైన సమయం కోసం నిలబడేవాడే అసలైన రాజు.ఎదుటివాడిని ఓడించడం కంటే… నీ కోపాన్ని ఓడించడం గొప్ప విజయం.ప్రపంచానికి నీ బలం నిరూపించాల్సిన అవసరం లేదు… ఒకరోజు నీ ఎదుగుదలే నీ తరఫున మాట్లాడు తుంది..*ఇట్లు… మీ… ✍🏻 రఘురాం*
118)జీవితంలో ప్రతి యుద్ధానికి కత్తి అవసరం లేదు..కొన్ని యుద్ధాలను గెలవడానికి ఓర్పు చాలు.నువ్వు పడిపోవచ్చు..అలసిపోవచ్చు..బాధపడవచ్చు కానీ ఆగిపోకు.ఎందుకంటే ఈరోజు నువ్వు భరిస్తున్న ప్రతి బాధ..రేపు నీ విజయానికి ఒక కారణం అవుతుంది.ఈరోజు నీ కష్టాన్ని ఎవరూ గుర్తించకపోవచ్చు..నీ మౌనాన్ని ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు..నిన్ను కిందకు లాగాలని చూసేవాళ్లు కూడా ఉండొచ్చు కానీ నువ్వు మాత్రం నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకు.నువ్వు నిలబడితే నీ కుటుంబం నిలబడుతుంది..నువ్వు గెలిస్తే నీ ఇంట్లో నవ్వులు పూస్తాయి.ఒకరోజు నిన్ను కూల్చాలని చూసినవాళ్లే… నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావో చూస్తారు.అందుకే ఈరోజు ఎదురయ్యే అవమానాన్ని తట్టుకో..ఈరోజు ఎదురయ్యే బాధను భరించు కానీ నీ రేపటిని మాత్రం వదులుకోకు.నువ్వు పడకుండా ఉంటే చాలు… నీ రేపు నీదే.ఈరోజు నీ పోరాటం అది అవ్వాలి రేపు నీ చరిత్ర..*ఇట్లు… మీ… ✍🏻 రఘురాం*
119)సింహానికీ..లేడికీ మధ్య పరుగు పందెం జరిగితే చాలాసార్లు లేడే గెలుస్తుంది..ఎందుకంటే సింహం ఆకలి కోసం పరుగెడుతుంది..లేడి బతుకు కోసం పరుగెడుతుంది..ఆకలి కంటే బతుకు బలమైనది..అవసరం కంటే ఉద్దేశ్యం గొప్పది..జీవితంలో కూడా అంతే..నువ్వు ఎందుకు పోరాడుతున్నావో అనే కారణం ఉంటే..ఎన్ని అవరోధాలు వచ్చినా..ఎన్ని కష్టాలు వచ్చినా..నువ్వు ఆగవు..అలసిపోవు..ఎందుకంటే నీ పరుగు వెనుక నీ కుటుంబం ఉంది..నీ కలలు ఉన్నాయి..నీ భవిష్యత్తు ఉంది..కేవలం అవసరం కోసం పనిచేసేవాడు అలిసిపోతాడు..కానీ ఒక లక్ష్యం కోసం..ఒక కారణం కోసం పనిచేసేవాడు ఎప్పటికీ ఆగడు..అందుకే గుర్తుపెట్టుకో..నీకు ఉన్న ఉద్దేశ్యం ఎంత గొప్పదైతే..నీ విజయం అంత గొప్పగా ఉంటుంది..నువ్వు పరుగెడుతున్నది కేవలం డబ్బు కోసం కాదు..నీ ఇంటి గౌరవం కోసం..నీ పిల్లల భవిష్యత్తు కోసం..అందుకే ఆగకు..పరుగు ఆపకు..నువ్వు లేడిలా పరుగెత్తితే..సింహం కూడా నిన్ను ఆపలేదు..ఈరోజు నీ కష్టం..రేపు నీ కథ అవుతుంది..నువ్వు గెలిస్తే నీ ఇంట్లో వెలుగు నిండుతుంది..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
120)దేవుడు దారి చూపిస్తాడు..దారిలో నడవాల్సింది నువ్వే..ధైర్యం దేవుడు ఇస్తాడు..ధైర్యంగా నిలవాల్సింది నువ్వే..ఆశీర్వాదం పైనుండి దొరుకుతుంది..అడుగు ముందుకు వేయాల్సింది నువ్వే..తలుపు దేవుడు తెరుస్తాడు..తలుపు దాటి వెళ్లాల్సింది నువ్వే..కల నీది..కష్టం నీది..కీర్తి కూడా నీదే..కన్నీళ్లు తుడిచి లేచి నిలబడు..భయాన్ని వదిలి ముందుకు సాగు..నీ జీవితాన్ని నిర్మించాల్సింది నువ్వే..నీ రేపటిని రాయాల్సింది నువ్వే..ఈరోజు నీ శ్రమ..రేపు నీ విజయంగా మారుతుంది..నువ్వు ఆగకుండా సాగితే..దారి నిన్ను గమ్యానికి చేరుస్తుంది..గుర్తుంచుకో..తోడు దేవుడు..కానీ గెలుపు మాత్రం నీదే..ఎందుకంటే ప్రార్థనతో పాటు శ్రమ ఉంటే..ప్రతి అసాధ్యం సుసాధ్యమవుతుంది..నువ్వు పడకుండా ఉంటే..నీ కథే ఒకరోజు ఎవరికో స్ఫూర్తి అవుతుంది..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
121)జీవితం ఒక తలుపు మూస్తే..మళ్లీ తెరవడానికి ప్రయత్నించు..ఎందుకంటే అది తలుపు..అలాగే పని చేస్తుంది..ఒక దారి మూసుకుపోయింది అని కుంగిపోవద్దు..మూసిన తలుపు వెనుక గుణపాఠం ఉంటుంది..తెరిచే తలుపు వెనుక భవిష్యత్తు ఉంటుంది..పడిపోయావని ఓడిపోయావని అనుకోవద్దు..లేచి నిలబడడం నీ బలం..కన్నీళ్లు తుడిచి ముందుకు సాగు..తలుపులు మూసినా కిటికీలు తెరుచుకుంటాయి..అవకాశాలు అన్ని వైపుల నుండి వస్తాయి..నువ్వు నమ్మకం వదలకుండా తట్టితే..ఏదో ఒక తలుపు తప్పకుండా తెరుచుకుంటుంది..ఎందుకంటే ప్రయత్నం ఆపని వరకు..ఓటమి అనేది ఉండదు..గుర్తుంచుకో..మూసిన తలుపు అంతం కాదు..అది మొదలయ్యే కొత్త అధ్యాయానికి సంకేతం..నువ్వు ఆగకపోతే..గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
122)వర్షం ఉన్నంత సేపే గొడుగు అవసరం..వర్షం ఆగగానే అదే గొడుగు భారం అవుతుంది..అలాగే కొందరు మనుషులు కూడా..అవసరం ఉన్నంత వరకే దగ్గర..అవసరం తీరగానే దూరం..కృతజ్ఞత లేని చేతికి సాయం చేస్తే చేయి నొప్పిస్తుంది..విశ్వాసం లేని వాడితో స్నేహం చేస్తే గుండె నొప్పిస్తుంది..నటించే బంధాలను నమ్మితే జీవితమే నొప్పిస్తుంది..అందుకే ఎవరి కోసం కరిగిపోవద్దు..ఎవరి కోసం విరిగిపోవద్దు..నీ విలువ తెలిసిన చోటే ఉండు..నీ మనసు అర్థమయ్యే వారికే ఇవ్వు..ఎందుకంటే గొడుగు లేకుండా తడిసినా పర్వాలేదు..కానీ భారం మోసే గొడుగు కంటే..నీ ఒంటరి తనమే వెయ్యి రెట్లు విలువైనది..లే..నీ కాళ్లపై నిలబడు..నీవే నీకు అసలైన ఆశ్రయం...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
123)జీవితంలో అన్నిటికంటే గొప్ప సంపద రెండే..ఒకటి ఆరోగ్యం..రెండు మనశ్శాంతి..ఇవి పోయాక తెలుసుకుంటే లాభం లేదు..నలభై సంవత్సరాల తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి..సమయానికి తిను..కదులు..రోజు కాసేపు నీ కోసం బతుకు..మనసు విషయంలో ఒకే సూత్రం..ఆశించకు..అంచనాలు పెట్టుకోకు..జరిగిపోయింది వదిలేయ్..రేపటి గురించి భయపడకు..ఎవరు ఏమన్నా పట్టించుకోకు..ఏది ఎలా జరిగితే అలా జరగనీ..నీ చేతిలో లేనిదాన్ని మోసి నీ రాత్రులు పాడు చేసుకోకు..అన్నీ ఆ దేవుడికి వదిలేసి నువ్వు నవ్వుతూ ఉండు..గుర్తుంచుకో..డబ్బుతో మంచం వస్తుంది..కానీ నిద్ర రాదు..పేరు వస్తుంది..కానీ ప్రశాంత రాదు..ప్రపంచమంతా గెలిచినా నీకు నిద్ర లేకపోతే అసలు గెలిచినట్టే కాదు..అందుకే ముందు నువ్వు బాగుండు..ఆరోగ్యం..మనశ్శాంతి ఉంటేనే అసలైన గెలుపు..అవి లేకుండా ఎంత ఉన్నా సుఖం ఉండదు..మిగతాదంతా తనంతట అదే బాగుంటుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
124)ఒక తలుపు మూసుకుంటే ఏమైంది..మూసిన తలుపు వైపే చూస్తూ కూర్చుంటే ఇంకో తలుపు ఎలా కనిపిస్తుంది..నీకు అర్హత ఉంటే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది..కానీ ముందు ఆ అర్హత నువ్వు సంపాదించుకోవాలి కదా..రాత్రి ఎంత నల్లగా ఉన్నా తెల్లారక మానదు..కష్టం ఎంత పెద్దదైనా తీరకపోదు..కింద పడ్డావని కూర్చుంటే అది ఓటమి..దుమ్ము దులిపి ముందుకు నడిస్తే అదే విజయం..నువ్వు ఇప్పుడు పడుతున్న ప్రతి కష్టం..రేపు నీ గెలుపు కథలో బంగారు అక్షరాలు అవుతుంది..నువ్వు ఆగిపోతే అది ముగింపు..నువ్వు నడుస్తూ ఉంటే అది కొత్త ఆరంభం..చివరికి ఒకటే గుర్తుంచుకో..నువ్వు అర్హుడివైతే..నువ్వు కోరుకున్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది..కాబట్టి నది రాళ్ళకు తగిలి కొట్టుకుంటూ వెళ్ళినప్పుడే..సముద్రాన్ని చేరుకుంటుంది..అలాగే నువ్వు కూడా ప్రతి కష్టాన్ని దాటి..నీ గమ్యం అనే సముద్రాన్ని తప్పకుండా చేరుకుంటావు...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
125)మాటవినేవాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు..వాడు అర్థం చేసుకుంటాడు..వాడితో చర్చించొచ్చు..వాడిని మార్చొచ్చు..కానీ మూర్ఖంగా గర్వంగా మాట్లాడేవాడికి ఏం చెప్తాం..వాడు వినడు..వాడు విన్నట్టు నటిస్తాడు..వాడికి నచ్చింది మాత్రమే నిజమనుకుంటాడు..అలాంటోడికి మాటలు వృధా..సమాధానం కూడా వృధా..అందుకే మూర్ఖుడితో వాదించకు..నీ సమయాన్ని కాపాడుకో..నీ ప్రశాంతతను కాపాడుకో..మౌనమే వాడికి సరైన సమాధానం..నీ గెలుపే వాడి గర్వానికి సరైన దెబ్బ...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
126)ఈ కలియుగంలో మంచికి రోజుల్లేవు..నువ్వు ఎంత మంచి చేసినా నీకే చెడు ఎదురవుతుంది..ఇదే కదా ఇప్పుడు జరుగుతున్నది..ఇక్కడ అవసరం ఉన్నప్పుడు నీ విలువ తెలుస్తుంది..అవసరం తీరాక అదే విలువను మర్చిపోతారు..నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా..చివరికి చిన్న తప్పునే పెద్దది చేసి చూపిస్తారు..నీ మంచితనం కంటే వాళ్ళ స్వార్థమే వాళ్ళకు ముఖ్యం అయిపోతుంది..నీ వెనుక నీ గురించే మాట్లాడతారు..నీ ఎదుట నవ్వుతూ నటిస్తారు..అందుకే ఇక్కడ మంచివాడికి పరీక్షలు ఎక్కువ..మంచిగా బతికేవాడికి బాధలు ఎక్కువ..కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి..నటించేవాడు నాలుగు రోజులు గెలుస్తాడు..నిజాయితీగా బతికేవాడు జీవితాంతం గెలిచి నిలబడతాడు..నువ్వు చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు..మనుషులు మర్చిపోవచ్చు..కానీ కర్మ మర్చిపోదు..కాలం మర్చిపోదు..పైనున్నవాడు అస్సలు మర్చిపోడు..నీ మంచితనాన్ని నీవు పదిలంగా పెట్టుకో..అదే నీకు ఒకరోజు ఆయుధమై కవచం అవుతుంది..కాబట్టి ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా..నీ మంచికి విలువ ఇవ్వకపోయినా..నువ్వు మారకు..నువ్వు మంచిగానే ఉండు..నీ మంచితనమే ఒకరోజు నిన్ను ఎత్తులో నిలబెడుతుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
127)ఒకరు కష్టాల ఊబిలో కొట్టుకుంటుంటే..ఆ చేయి అందిస్తే మనం కూడా ఆ ఊబిలోకి జారిపోతామని తెలిసినా..అయ్యో అని మన చేయి అందిస్తాం..మానవత్వంతో బయటకు లాగుతాం..కానీ బయటకు వచ్చాక కొంతమంది తమ దారి తాము చూసుకోవడం మర్చిపోతారు..సాయం చేసిన చేతినే మళ్ళీ మళ్ళీ పట్టుకుని..ఆ ఆసరాకే అలవాటుపడిపోతారు..అప్పుడు తెలియకుండానే మన ఓపిక..మన సమయం..మన మంచితనం అంతా కరిగిపోతుంది..చివరికి మనం చేసిన మంచిని కూడా గుర్తుపెట్టుకోలేని స్థితిలో ఉంటారు..అప్పుడే అనిపిస్తుంది..ఈ కాలంలో మంచికి విలువ లేదు కదా..ఇంకెందుకు మంచి చేయాలి అని..కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో..మంచి చేయడం మానేస్తే..వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది..? మంచిని ఆపకు..కానీ ఎవరికి..ఎంతవరకు చేయాలో తెలుసుకుని చెయ్యి..నీ సాయాన్ని ఆసరాగా తీసుకుని ఎదిగేవారికి చెయ్యి..నీ చేతినే ఆధారంగా పట్టుకుని ఆగిపోయేవారికి కాదు..ఎందుకంటే సాయం చేయడం నీ సంస్కారం..దాన్ని గుర్తించడం వాళ్ళ సంస్కారం..మనుషులు మర్చిపోయినా..నీ మంచిని చూసిన కాలం..పైవాడు ఎప్పటికీ మర్చిపోడు..నీ మంచితనమే చివరికి నిన్ను నిలబెడుతుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
128)మంచి రోజులు ఊరికే రావు..మనమే వాటిని తెచ్చుకోవాలి..అని అనుకుంటాం కానీ కూర్చుని ఎదురుచూస్తే అవి ఎప్పటికీ రావు..మనం లేచి అడుగు వేయాలి..పడుతూ లేస్తూ నడవాలి..మన కష్టాన్ని మనమే నమ్ముకోవాలి..ఈ లోకంలో ఎవరో వచ్చి మన జీవితాన్ని బాగుచేస్తారని ఎదురుచూడడం వృధా..మన బ్రతుకును బాగుచేసుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది..చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులను తీసుకొస్తాయి..ఓపికతో చేసే ప్రతి పని ఒకరోజు మంచి రోజుగా మారుతుంది..కష్టం నీ నీడలా నీ వెంట ఉంటే..మంచి రోజు కూడా నీ వెలుగులా నీ వెంటే ఉంది..నువ్వు నడవడం ఆపేస్తే అది ఆగిపోతుంది..నువ్వు నడుస్తూనే ఉంటే అది ఒకరోజు నిన్నే వచ్చి హత్తుకుంటుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
129)పెద్ద పెద్ద కలలు నిజమయ్యే క్రమంలో పెద్ద పెద్ద దెబ్బలు తగలడం మామూలే..సముద్రాన్ని ఈదాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద అలలు రాకుండా ఉంటాయా..పర్వతాన్ని ఎక్కాలనుకున్నప్పుడు దారి సులువుగా ఉంటుందా..కలలు పెద్దవి అయినప్పుడు పరీక్షలు కూడా పెద్దవిగానే ఉంటాయి..అలా అని కృంగిపోతే ఎలా..తగిలిన ప్రతి దెబ్బ నిన్ను పడేయడానికి కాదు..నిన్ను మరింత గట్టివాడిని చేయడానికే..నీ కల ఎంత పెద్దదో..నీకు తగిలే దెబ్బ కూడా అంతే పెద్దదిగా ఉంటుంది..దెబ్బ తగిలిందని ఆగిపోతే కల కలగానే మిగిలిపోతుంది..దెబ్బను తట్టుకుని లేచి నిలబడితే ఆ కలే నీ కథగా మారిపోతుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
130)నేను అనే అహంకారాన్ని తగ్గించండి..మనం అనే మమకారాన్ని పెంచండి..తప్పు చేస్తే ఒప్పుకోండి..తప్పు చేసినవారిని క్షమించడం నేర్చుకోండి..అవసరం లేని మాటలతో ఎవరి మనసును గాయపరచకండి..ఎందుకంటే మాటల గాయం మందుతో మానదు..జీవితం చాలా చిన్నది..ఎవరినో ఓడించడానికి కాదు ఎవరితోనో పోటీ పడటానికి కాదు..మన వల్ల ఒక్క మనిషైనా సంతోషంగా ఉంటే చాలు అదే మనం బతికే గొప్ప జీవితం..చివరికి మన దగ్గర ఎంత డబ్బు ఉందనేది కాదు..మనల్ని గుర్తుచేసుకున్నప్పుడు ఎంతమంది కళ్ళల్లో ఆనందబాష్పాలు రాలాయో..మన కోసం ఎన్ని మనసులు నిజంగా ప్రార్థిస్తాయో అదే మనిషిగా మనం జీవించిన అసలైన గుర్తింపు..మనిషిగా పుట్టడం ప్రకృతి ఇచ్చిన వరం..మంచి మనిషిగా గుర్తుండిపోవడం మన జీవితానికి మనమే ఇచ్చే గొప్ప బహుమతి...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
131)ఎవరైనా జీవితంలో ఓటమితో కుంగిపోతే..నలిగిపోతే ఎగతాళిగా నవ్వకండి..వీలైతే చేయిపట్టి లేపండి..లేకపోతే మౌనంగా పక్కకు జరగండి..ఎవరైనా దుఃఖంలో ఉంటే పెద్ద పెద్ద నీతులు చెప్పకండి..నేను ఉన్నాను అనే చిన్న భరోసా ఇవ్వండి..ఆ ఒక్క మాటే వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది..ఎవరైనా విజయం సాధిస్తే లోలోపల కుళ్ళిపోకండి..మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టండి..ఎందుకంటే ఇతరుల వెలుగును చూసి కళ్ళు మూసుకునేవాడు తన జీవితంలో ఎప్పటికీ వెలుగును చూడలేడు..పక్కవాడి సంతోషాన్ని చూసి నిజంగా సంతోషపడే మనసే అసలైన ఐశ్వర్యం...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
132)సాయం చెయ్యడం మంచి అలవాటే..కానీ ఆ సాయం నిన్ను కష్టాల్లోకి నెట్టేదిగా ఉండకూడదు..ఎదుటివారి కన్నీళ్ళు తుడవాలి..కానీ ఆ కన్నీళ్ళు నీ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి..ఎవరైనా మునిగిపోతుంటే చేయి ఇచ్చి పైకి లాగాలి..కానీ నువ్వు జారిపోకుండా జాగ్రత్త పడాలి..నీకు ఉన్నదాంట్లో సాయం చెయ్..నీకు లేనిది అప్పు చేసి మరీ చెయ్యకు..ఎందుకంటే నీ ఇంట్లో వెలుగు ఆరిపోయేలా పక్కింటికి దీపం ఇవ్వకు..ముందు నీ కుటుంబాన్ని నిలబెట్టు..తరువాతే సమాజాన్ని ఆదుకో..మంచితనానికి హద్దు లేకపోతే ఆ మంచితనమే నిన్ను తిరిగి బాధపెడుతుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
133)ఏది నీకు ప్రశాంతతను ఇవ్వదో..ఏది నీకు లాభం చేకూర్చదో..ఏది నిన్ను నీ లక్ష్యానికి దగ్గర చేయదో..దాని నుండి నీ సమయాన్ని..నీ శ్రద్ధను..నీ శక్తిని మెల్లగా వెనక్కి తీసుకో..ఎవరితోనూ పోట్లాట వద్దు..ఎవరినీ ద్వేషించాల్సిన పనిలేదు..నీ విలువైన సమయాన్ని..నిన్ను ప్రేమించే మనుషులకే..నిన్ను పెంచే పనులకే..నీ మనసుకు నచ్చే కలలకే కేటాయించు..గుర్తుంచుకో..నీ శక్తి చాలా విలువైనది..దానిని నిన్ను బాధపెట్టే వాటి కోసం కాదు..నిన్ను నిలబెట్టే వాటి కోసమే వాడాలి..నీ ఉనికిని గౌరవించని చోట నీ నీడ కూడా ఉండకూడదు..నీ విలువ తెలియని చోట నీ మాట కాదు..నీ ఎదుగుదలే వారికి సరైన సమాధానం...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
134)చేసిన పాపమైనా..చెట్టుకు ఉన్న కాయ అయినా..పండితేనే రాలుతుంది..ఇదే ప్రకృతి నియమం..ఇదే కర్మ సిద్ధాంతం..చెట్టు మీద కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఎవరూ తెంపరు..పండే వరకు చెట్టే దానిని జాగ్రత్తగా మోస్తుంది..అలాగే మనిషి చేసిన పాపం కూడా అంతే..వాడు మర్చిపోయినా..ప్రపంచం మర్చిపోయినా..వాడి కర్మ మాత్రం ప్రతీ రోజూ దానికి లెక్క రాస్తూనే ఉంటుంది..దానికి తగిన సమయం రాగానే..అదే వాడి ముందు నిలబడి లెక్క అడుగుతుంది..గుర్తుంచుకో..నీ కన్నీళ్లకు కారణమైన వారి కర్మ..ఎప్పటికైనా వారి కళ్ల ముందే కన్నీరై కనిపిస్తుంది..పండిన ప్రతీ కాయ తనంతట తానే రాలినట్టు..పండిన ప్రతీ కర్మ తన లెక్కను తానే తేల్చుకుంటుంది..నువ్వు చేయాల్సిందల్లా ఆ రోజు వరకు నీ నవ్వును కాపాడుకోవడమే...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
135)కొన్ని నిజాలు తెలిసినా నమ్మాలనిపించవు..మనల్ని మనవాళ్లే వాడుకుంటున్నారని తెలిసినా..మన మంచితనాన్ని చేతకానితనంగా చూస్తున్నారని తెలిసినా..అవసరం తీరాక మనల్ని మర్చిపోతారని తెలిసినా..మన మనసు మాత్రం ఇంకా వాళ్లకోసమే ఎదురుచూస్తుంది..ఎందుకంటే మనం పెంచుకుంది మమకారాన్ని..వాళ్లు చూసుకుంది అవసరాన్ని..నిజానికి తప్పు వాళ్లది కాదు..ఎవరి స్వార్థం కోసం వాళ్లున్నారు..తప్పు మనదే..లేని మమకారాన్ని ఉన్నట్టు ఊహించుకున్నందుకు..ఒక్కటి మాత్రం నిజం..ఒకే వైపు నుంచి మోసే బంధం..ఎంత బలంగా ఉన్నా ఒకరోజు మనకు కోపం వచ్చినప్పుడు మన ప్రతాపాన్ని ఎక్కువగా విలువ తక్కువైన వాటిపైనే చూపిస్తాం… ఎందుకంటే నిజంగా విలువైన వాటిని ఎదిరించే ధైర్యం మన కోపానికి కూడా ఉండదు! బలమైన గాలికి పర్వతాన్ని కదిలించే శక్తి లేకపోతే… దాని దారిలో ఉన్న చిన్న ఆకులను,బలహీనమైన కొమ్మలను విరిచేస్తుంది. అలాగే కొందరి కోపం కూడా అంతే… ఎదురుగా ఉన్న నిజమైన శక్తిని ప్రశ్నించే ధైర్యం లేక, తమకంటే బలహీనులైన వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంది. గుర్తుంచుకోండి… కేక వేయడం శక్తి కాదు… ఎదుటివారిని బాధించడం గెలుపు కాదు… బలహీనుడిని ఓడించడం గొప్పతనం కాదు… మన కోపాన్ని మనం జయించగలిగిన రోజే… మనలోని నిజమైన శక్తి ప్రపంచానికి తెలుస్తుంది! ఎందుకంటే… అగ్ని ఏదైనా కాల్చగలదు… కానీ తనను తాను అదుపులో పెట్టుకోలేదు. మనిషి గొప్పతనం కోపంలో కాదు… కోపం వచ్చినా సంయమనం కోల్పోకుండా ఉండటంలో ఉంది. ఎదుటివారిని గాయపరచడం చాలా సులభం… కానీ గాయపరిచే అవకాశం ఉన్నా క్షమించడం చాలా గొప్పది. ప్రతాపం చూపించడానికి బలం అవసరం కావచ్చు… కానీ ప్రతాపాన్ని అదుపు చేసుకోవడానికి వ్యక్తిత్వం అవసరం! కాబట్టి… నీ కోపం నీ చేతిలో ఉండాలి… నీ చేతులు నీ కోపం చేతిలో కాదు! ఎందుకంటే చివరికి… నిన్ను ఓడించేది నీ శత్రువు కాకపోవచ్చు… నువ్వు అదుపు చేసుకోలేని ఒక్క క్షణం కోపమే కావచ్చు..*ఇట్లు…మీ…✍🏻రఘురాం*
136) మనకు కోపం వచ్చినప్పుడు మన ప్రతాపాన్ని ఎక్కువగా విలువ తక్కువైన వాటిపైనే చూపిస్తాం..ఎందుకంటే నిజంగా విలువైన వాటిని ఎదిరించే ధైర్యం మన కోపానికి కూడా ఉండదు! బలమైన గాలికి పర్వతాన్ని కదిలించే శక్తి లేకపోతే…దాని దారిలో ఉన్న చిన్న ఆకులను,బలహీనమైన కొమ్మలను విరిచేస్తుంది.అలాగే కొందరి కోపం కూడా అంతే..ఎదురుగా ఉన్న నిజమైన శక్తిని ప్రశ్నించే ధైర్యం లేక,తమకంటే బలహీనులైన వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంది. గుర్తుంచుకోండి…కేక వేయడం శక్తి కాదు… ఎదుటివారిని బాధించడం గెలుపు కాదు…బలహీనుడిని ఓడించడం గొప్పతనం కాదు…మన కోపాన్ని మనం జయించగలిగిన రోజే…మనలోని నిజమైన శక్తి ప్రపంచానికి తెలుస్తుంది! ఎందుకంటే…అగ్ని ఏదైనా కాల్చగలదు…కానీ తనను తాను అదుపులో పెట్టుకోలేదు. మనిషి గొప్పతనం కోపంలో కాదు…కోపం వచ్చినా సంయమనం కోల్పోకుండా ఉండటంలో ఉంది.ఎదుటివారిని గాయపరచడం చాలా సులభం…కానీ గాయపరిచే అవకాశం ఉన్నా క్షమించడం చాలా గొప్పది.ప్రతాపం చూపించడానికి బలం అవసరం కావచ్చు…కానీ ప్రతాపాన్ని అదుపు చేసుకోవడానికి వ్యక్తిత్వం అవసరం! కాబట్టి..నీ కోపం నీ చేతిలో ఉండాలి..నీ చేతులు నీ కోపం చేతిలో కాదు! ఎందుకంటే చివరికి..నిన్ను ఓడించేది నీ శత్రువు కాకపోవచ్చు..నువ్వు అదుపు చేసుకోలేని ఒక్క క్షణం కోపమే కావచ్చు..*ఇట్లు…మీ…✍🏻రఘురాం*
137)మన జీవితంలో కొందరు మనకు అవకాశం ఇస్తారు..మనం ఎదగాలని మనకంటే ఎక్కువగా ప్రయత్నిస్తారు..మన కోసం మాట మాట్లాడతారు,దారులు వెతుకుతారు,తలుపులు తెరిపిస్తారు..కానీ మనకు విజయం వచ్చిన తర్వాత,మనం పైకి వెళ్లిన తర్వాత,అదే దారిలో వెనుక వస్తున్న వాళ్లకు చేయి అందించడం మాత్రం చాలామంది మర్చిపోతారు..మనకు దారి చూపించినప్పుడు అది సహాయం అనిపిస్తుంది..కానీ మనం ఇంకొకరికి దారి చూపాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం స్వార్థం అడ్డుగా నిలుస్తుంది..గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే..మన విజయానికి కారణమైన చేతులను మర్చిపోవచ్చు,కానీ అవసరం వచ్చినప్పుడు మళ్లీ అదే చేతులు మనకు గుర్తుకు రావడం మాత్రం జీవితం ఇచ్చే గొప్ప వ్యంగ్యం..ఎదిగిన తర్వాత మనిషి ఎంత ఎత్తుకు వెళ్లాడన్నది కాదు గొప్పది..తనతో పాటు ఇంకెంతమందిని పైకి తీసుకెళ్లాడన్నదే అతని అసలు విలువ..ఎందుకంటే అవకాశం పొందడం అదృష్టం కావచ్చు..కానీ అవకాశం ఇచ్చిన మనిషిని గుర్తుంచుకోవడం సంస్కారం..తనకు తెలిసిన దారిని ఇంకొకరికి చూపించడం మానవత్వం..అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తొచ్చే సంబంధాల కంటే,అవసరం లేకపోయినా గుర్తుండిపోయే మనిషిగా ఉండటం గొప్పది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
138)మనం లేని స్థాయి నుండి ఉన్న స్థాయికి రావడానికి వెనుక ఎంతోమంది చేయి ఉంటుంది..ఆ చేయిని మర్చిపోవడం మనిషి లక్షణం కాదు..మనకు దారి దొరికినప్పుడు మనతో కష్టపడినవాడికి కూడా ఆ దారి చూపించడమే నిజమైన కృతజ్ఞత..అంతేగానీ మనకు వచ్చిన అవకాశాన్ని స్వార్థంగా మన దగ్గరే దాచుకుని..మన దారి మనం వెళ్లిపోవడం కాదు..నీకు తెలిసిన చిన్న ప్రశ్న..నీతో ఉన్నవాడి జీవితాన్నే మార్చేస్తుంది..ఆ చిన్న సాయం చేయకుండా దాటేస్తే..నువ్వు సంపాదించినది డబ్బే కావచ్చు..కానీ పోగొట్టుకున్నది మనిషిగా విలువను..గుర్తుపెట్టుకో..కష్టంలో నీకు చేయి అందించినవాడిని..నువ్వు కష్టం తీరాక మర్చిపోతే..రేపు నీకు కష్టం వచ్చినప్పుడు ఆ చేయి మళ్లీ దొరకదు...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
139)పోటీ లేనిదే ఎదుగుదల లేదు,పోటీ లేనిదే పురోగతి లేదు..కానీ ఆ పోటీ నిన్ను ఒక్కడినే ఎదిగేలా చేస్తే దానికి అర్థం లేదు..ఒకచోటే నిలబడి ఎదగడం ఎదుగుదల కాదు..నలుగురికి ఉపయోగపడుతూ నలువైపులా విస్తరించినప్పుడే అది నిజమైన ఎదుగుదల..లేకపోతే అది ఎదుగుదల కాదు,కేవలం ఒంటరితనం..నువ్వు గెలవడం గొప్ప కాదు..నీ వల్ల నలుగురు గెలిచారంటే అదే నిజమైన గెలుపు..చెట్టు ఎదిగినప్పుడు దాని నీడలో ఎంతోమంది సేదతీరాలి,నది ప్రవహించినప్పుడు దాని నీటితో ఎంతోమంది దాహం తీరాలి..అలాగే నీ ఎదుగుదల కూడా..అందుకే పోటీపడు..పక్కవాడిని తొక్కుతూ కాదు..నీతో పాటు అందరినీ నడిపిస్తూ ముందుకు సాగు..అప్పుడే నీ ఎదుగుదలకు అర్థం ఉంటుంది,నీ పురోగతికి విలువ ఉంటుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
140)జీవితం కూడా ఒక వైకుంఠపాళీ లాంటిదే..ఆటలో తొంభై దాటి,విజయానికి అడుగు దూరంలో ఉన్నామనుకునే సమయంలోనే..ఒక్కసారిగా పెద్ద పాము నోటపడతాం.క్షణాల్లో ఎంతో ఎత్తు నుంచి కిందకు జారిపోతాం.అయితే అలా జారిపడినంత మాత్రాన ఆట ముగిసిపోదు..మన ప్రయాణం ఆగిపోదు... మనం ఆట నుంచి బయటకు వెళ్లిపోము..పడిన చోటే నిలబడాలి...అదే గడిలో ఉండాలి..మళ్లీ పాచిక పడే వరకు ఓపికగా ఎదురు చూడాలి..అవకాశం వచ్చినప్పుడు మరోసారి ముందుకు అడుగు వేయాలి.ఎందుకంటే..కిందకు జారడం మన చేతిలో ఉండకపోవచ్చు,కానీ మళ్లీ పైకి ఎక్కేందుకు ప్రయత్నించడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది.మన జీవితమూ అంతే..ఎన్నో ఆశలతో,ఎన్నో కలలతో ముందుకు సాగుతున్నప్పుడు అనుకోని ఓటములు ఎదురవుతాయి..నమ్మినవారు దూరమవుతారు..పరిస్థితులు మనల్ని వెనక్కి నెట్టేస్తాయి..ఒక్క క్షణంలో మనం ఎంతో ఎత్తు నుంచి కిందపడిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోవాలి..జారిపోవడం జీవితానికి ముగింపు కాదు..అది మళ్లీ బలంగా నిలబడేందుకు వచ్చిన ఒక అవకాశం మాత్రమే..ఒకసారి ఓడిపోయామని ప్రయాణాన్ని వదిలేస్తే గమ్యం ఎప్పటికీ చేరదు.పడిన చోటే ధైర్యంగా నిలబడి, మనపై మనం నమ్మకం ఉంచి,వచ్చిన ప్రతి అవకాశాన్ని మరో పాచికగా భావించి ప్రయత్నిస్తే..ఒకప్పుడు మనల్ని కిందకు జారవేసిన అదే జీవితం..ఒకరోజు మనల్ని ఊహించని ఎత్తులకు తీసుకెళ్తుంది.ఎందుకంటే వైకుంఠపాళీలో అయినా..జీవితంలో అయినా..గెలిచేది ఎప్పుడూ పడనివాడు కాదు,ఎన్ని సార్లు పడినా మళ్లీ లేచి ముందుకు సాగినవాడే..పడిపోవడం సహజం..నిలబడటం ధైర్యం..మళ్లీ ప్రయత్నించడం విజయం వైపు ప్రయాణం..*ఇట్లు... మీ✍🏻 రఘురాం*
141)పక్కవాడు కష్టంలో ఉంటే చూసి చలించి,నీకున్నదాంట్లో కొంత సాయం చేస్తున్నావు..అది మానవత్వం,అది చాలా గొప్పది..కానీ నీ దగ్గర లేకపోయినా,ఎక్కడి నుంచో సమకూర్చి మరీ సాయం చేస్తే..అది దైవత్వం,అది మానవత్వం కంటే చాలా గొప్పది..కానీ అదే కష్టం నీకు వచ్చినప్పుడు,నువ్వు సాయం కోసం ఎదురుచూసినప్పుడు ఎవ్వరూ రాలేదని దేవుణ్ణి నిందిస్తే ఎలా..నువ్వు చేసిన మంచికి ప్రతిఫలం వెంటనే రావాలని లేదు,నువ్వు చేసిన సాయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కూడా లేదు..ఎందుకంటే నీ మంచితనానికి లెక్క రాసేది మనుషులు కాదు,దేవుడు..మనుషులు నువ్వు చేసిన సాయాన్ని మర్చిపోవచ్చు,నీ కష్టకాలంలో నీ పక్కన నిలబడకపోవచ్చు,కానీ దేవుడు మాత్రం నీ ప్రతి మంచి మనసును,ప్రతి కన్నీటిని చూస్తూనే ఉంటాడు..ఈరోజు నీకు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావు,నీ కోసం నువ్వు ఎంత చేశావో తెలిసిన వాళ్లే నిన్ను వదిలేశారని కన్నీళ్లు పెట్టుకుంటున్నావు..కానీ ఒక్కసారి ఆలోచించు..నీ కష్ట సమయంలో కొందరు దూరమయ్యారంటే,దేవుడు నిన్ను వదిలేశాడని కాదు,నీ చుట్టూ ఉన్నది నిజమైన మనుషులా,లేక అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరయ్యే ముసుగులా అని నీకు చూపిస్తున్నాడు..కాబట్టి కన్నీళ్లు పెట్టుకో,బాధపడు,కానీ నీ మంచితనాన్ని మాత్రం మార్చుకోకు..ఎందుకంటే నిన్ను బాధపెట్టిన వాళ్లలా నువ్వు మారిపోతే,ఈ ప్రపంచం ఒక మంచి మనిషిని కోల్పోతుంది..ఈరోజు నీకు ఎవ్వరూ లేరని ఏడుస్తున్నావే,అది దేవుడు నిన్ను వదిలేయడం కాదు..“నువ్వు అందరి కోసం ఉన్నావు,ఇప్పుడు నీ కోసం నేనున్నాను” అని దేవుడు నీకు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం..నమ్మకం ఉంచు,ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం కాదు,దేవుడి దగ్గర నీ మంచితనానికి,నీ కన్నీటికి తప్పకుండా ఒక దారి చూపించే సమాధానం ఉంటుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
142)ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు,కాలం తప్ప..జననమరణాలకి ఒక సమయం ఉన్నట్టే,మన కష్ట సుఖాలకు కూడా ఒక సమయం ఉంటుంది కదా..ఈరోజు నీ సమయం బాగోకపోవచ్చు,ఏం చేసినా కలిసి రాకపోవచ్చు..కానీ ఇదే శాశ్వతం కాదు..ప్రతి చీకటి రాత్రికి ఒక ఉదయం ఉన్నట్లే,నీ కష్టానికి కూడా ఒక ముగింపు ఉంటుంది..నువ్వు నమ్మిన నీ మంచితనం,నువ్వు చేసిన నీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కావు..నీ సమయం వచ్చినప్పుడు అవే నిన్ను ఉన్నతంగా నిలబెడతాయి..ఇప్పుడు నిన్ను చిన్నచూపు చూసిన కళ్లే రేపు నిన్ను ఆశ్చర్యంగా చూస్తాయి..కాబట్టి సానుకూలంగా ఆలోచించు,నమ్మకంగా ముందుకు సాగు..ఈరోజు నీది కాకపోయినా,రేపు తప్పకుండా నీదే..కాలం మారుతుంది,నీ కథ కూడా గొప్పగా మారుతుంది...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
143)ఒక వస్తువు పాడైందని వెంటనే పారేసి కొత్తది కొనేయడం చాలా సులభం...కానీ దాన్ని బాగుచేసుకుని మళ్లీ మనతో నడిపించుకోవడం అంత సులభం కాదు.ఎందుకంటే కొత్తది కొనడానికి డబ్బు ఉంటే చాలు...కానీ పాతదాన్ని కాపాడుకోవడానికి ఓపిక,శ్రమ,మమకారం ఉండాలి.జీవితంలో కూడా అంతే...మనకు నచ్చలేదని మనుషుల్ని మార్చేయడం కాదు,మనతో ఉన్న బంధాన్ని నిలబెట్టుకోవడానికి మనల్ని మనం కొంచెం మార్చుకోవాలి.పగిలిన వస్తువును అతికిస్తే దాని మీద పగుళ్లు కనిపిస్తాయి...కానీ ఆ పగుళ్ల వెనుక దాన్ని వదులుకోకుండా కాపాడిన మనసు కనిపించదు.అలాగే కొన్ని బంధాల్లో గాయాలు ఉంటాయి,మాటలతో వచ్చిన పగుళ్లు ఉంటాయి...కానీ వాటిని ప్రేమతో నయం చేసుకున్న బంధాలే జీవితాంతం మనకు తోడుగా ఉంటాయి.పాడైందని పారేయడం తెలివి కాదు...చివరి వరకు దాని విలువను గుర్తించి కాపాడుకోవడమే అసలైన గొప్పతనం.కొత్తది మన కోరికను తీర్చొచ్చు...కానీ మనం కాపాడుకున్న పాతది మన జ్ఞాపకాలను,మన అనుబంధాన్ని,మన జీవితాన్ని మోస్తుంది.అందుకే వస్తువులైనా...బంధాలైనా..మొదటి ఆలోచన ‘వదిలేయాలా?’ అని కాదు...‘ఎలా బాగుచేసుకోవాలి?’ అని ఉండాలి.ఎందుకంటే సంపాదించడం గొప్ప కాదు...సంపాదించినదాన్ని నిలబెట్టుకోవడం గొప్ప.కొనడం గొప్ప కాదు...విలువ తెలిసి కాపాడుకోవడం గొప్ప.గుర్తుపెట్టుకో...జీవితంలో మన చేతుల్లోకి వచ్చేవన్నీ మన కోసం రావు...కొన్ని మనల్ని పరీక్షించడానికి వస్తాయి,కొన్ని మనల్ని మార్చడానికి వస్తాయి,మరికొన్ని మనం వాటి విలువ తెలుసుకున్నామా లేదా అని చూడటానికి వస్తాయి. అందుకే చిన్న లోపం కనిపించగానే వదిలేయకు...కొంచెం ప్రేమ పెడితే పాడైనది కూడా మళ్లీ మన జీవితంలో వెలుగునిస్తుంది.నిజమైన విలువ కొత్తదానిలో ఉండదు...మనం వదులుకోకుండా కాపాడుకున్నదానిలో ఉంటుంది..నేర్చుకో...కాపాడుకో...విలువైనదాన్ని చివరి వరకు నిలబెట్టు.*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
144)డబ్బు,హోదా ఉంటే సౌకర్యంగా బతకాలి..పొగరుగా కాదు..నేనే గొప్ప..నన్ను మించినవాడు లేడు అనే అహంకారం నీలోకి వచ్చిన ప్రతిసారీ..నీకన్నా గొప్పవాడిని నీ కళ్ళ ముందుకు తెచ్చి దేవుడు నీకు తల వంచడం నేర్పిస్తాడు..డబ్బు వచ్చిందని నేల మీద నడవడం మర్చిపోతే..ఆ డబ్బే ఒకరోజు నిన్ను నేల మీదకు లాగుతుంది..హోదా వచ్చిందని నీతో నడిచిన మనుషుల్ని చిన్నచూపు చూస్తే..ఆ హోదా పోయాక నీ పక్కన ఒక్కరు కూడా మిగలరు..ఎగిరే గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా దారం ఇంకొకరి చేతిలోనే ఉంటుంది..అలాగే మన జీవితం ఎంత ఎత్తుకు ఎదిగినా దాని తాళం ఆ దేవుడి చేతిలోనే ఉంటుంది..ఈరోజు నీ చేతిలో ఉన్నది రేపు ఇంకొకరి చేతిలో ఉంటుంది..కానీ నువ్వు డబ్బు లేని రోజుల్లో కూడా చూపించిన మంచితనం..నీకు ఏమీ లేని రోజుల్లో కూడా నీ పేరును బతికిస్తుంది..వినయంగా ఉండు..ఎందుకంటే తల వంచిన చెట్టుకే ఎక్కువ కాయలు ఉంటాయి...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*
145)నీ కలను వదులుకోమని ప్రపంచం నీకు వంద కారణాలు చెబుతుంది…కానీ దాన్ని నిజం చేయడానికి “ఇది నా కల” అన్న ఒక్క నమ్మకం చాలు! మనసులో పుట్టిన ప్రతి కల అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు,అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.కానీ దాన్ని నిజం చేయాలనే పట్టుదల మాత్రం నీలో ఉండాలి.నీ కల కోసం ఎంత దూరమైనా వెళ్లు,ఎన్ని కష్టాలొచ్చినా భరించు,అవసరమైతే ఎన్నో విషయాలను వదులుకో…కానీ ఎవరి కోసం కూడా నీ కలను మాత్రం వదులుకోకు.ఎందుకంటే కల అనేది కేవలం ఒక కోరిక కాదు…మన గుండెల్లో దేవుడు వెలిగించిన ఒక దీపం.ఆ దీపాన్ని మనమే ఆర్పేస్తే మన జీవితంలో మిగిలేది చీకటే.మనుషులు ఈరోజు నీతో ఉండొచ్చు,రేపు దూరం కావొచ్చు.నీ సామర్థ్యాన్ని నమ్మొచ్చు,లేదా నిన్ను చూసి నవ్వొచ్చు.కానీ నీ కల మాత్రం నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టదు.నువ్వు నీ కలను ప్రేమించు,దాని కోసం నిశ్శబ్దంగా కష్టపడు,విమర్శలను పట్టించుకోకు,అవమానాలను విజయానికి మెట్లుగా మార్చుకో.ఎందుకంటే ఒకరోజు నీ విజయం నీ తరపున మాట్లాడుతుంది.అప్పుడు నిన్ను తక్కువగా చూసిన వాళ్లే నీ ప్రయాణాన్ని గొప్పగా చెబుతారు,నిన్ను అర్థం చేసుకోని వాళ్లే నీ పట్టుదలను అర్థం చేసుకుంటారు.కాబట్టి ఎవరి మాట విని నీ కలను వదిలేయకు…అందరి మాటలు విను,కానీ నీ గుండె చెప్పే కలను మాత్రమే నమ్ము.కల కనడం నీ హక్కు…దాని కోసం పోరాడటం నీ ధైర్యం…దాన్ని నిజం చేయడం నీ విజయం!..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*
146)అద్దం ముందు నిలబడితే మనం ఎలా ఉంటామో అదే కనిపిస్తుంది...మనుషులను మనం ఏ దృష్టితో చూస్తామో,వాళ్లు కూడా మనతో అదే భావంతో మెలుగుతారు...ఈ ప్రపంచాన్ని మనం ఏ మనసుతో చూస్తామో,అదే ప్రపంచం మనకు తిరిగి కనిపిస్తుంది...మనలో ప్రేమ ఉంటే ప్రేమ కనిపిస్తుంది,గౌరవం ఉంటే గౌరవం ఎదురవుతుంది,నమ్మకం ఉంటే నమ్మకం తోడవుతుంది,అనుమానం ఉంటే అనుమానాలే కనిపిస్తాయి...అందుకే మన చుట్టూ ఉన్న మనుషులను,పరిస్థితులను,ప్రపంచాన్ని మార్చాలని ఆరాటపడే ముందు ఒక్కసారి మనలోకి మనం తొంగి చూడాలి...ఎందుకంటే మనకు ఎదురయ్యే ప్రతి మనిషి మన స్వభావానికి ఒక ప్రతిబింబం,మనకు కనిపించే ప్రతి పరిస్థితి మన ఆలోచనలకు ఒక ప్రతిఫలనం...అద్దాన్ని నిందిస్తే ముఖం మారదు,ప్రపంచాన్ని నిందిస్తే జీవితం మారదు...మారాల్సింది బయట కాదు,మనలోని చూపు...మనసు మారితే మాట మారుతుంది,మాట మారితే మనుషులు మారతారు,మనుషులు మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోయినట్టు అనిపిస్తుంది...చివరికి మనం వెతుకుతున్న ప్రశాంతత ప్రపంచంలో లేదు,మనసులో ఉంది...మనకు కావాల్సిన ప్రపంచం ఎక్కడో లేదు...మన హృదయంలో మనం ఎలా నిర్మించుకుంటామో,అదే మన నిజమైన ప్రపంచం...కాబట్టి జీవితం మీద ఫిర్యాదు చేసే ముందు,జీవితాన్ని చూస్తున్న మన కళ్లను ఒక్కసారి శుభ్రం చేసుకుందాం...ఎందుకంటే ప్రపంచం మనకు శత్రువు కాదు,మన మనసుకు కనిపిస్తున్న ప్రతిబింబం మాత్రమే...మనసు మంచిదైతే,జీవితం కూడా మనకు ఒకరోజు మంచిగానే తిరిగి నవ్వుతుంది....ఇట్లు..మీ..✍🏻 రఘురాం