Monday, November 25, 2024

తల్లి గొప్పదా భార్య గొప్పదా అని అడిగితే...?

|| శుభోదయం మిత్రమా || ఒక మగాడికి నిజంగా ఇదొక అగ్ని పరీక్షే ఆలోచిస్తే అణువంత అపార్థం కూడా వుండదు|| మిత్రమా నిన్ను ఎవ్వరైనా తల్లి గొప్పదా భార్య గొప్పదా అని అడిగితే...?

ఎంతవరకూ త్వరగానే టైప్ చేసేసా.. కానీ... ఇక్కడ మాత్రం నా చేయి తడబడింది... ఏందుకంటె నిజాన్ని నిర్భయంగా చెప్పే నాకు కూడా ఒక్కక్షణం ఇది రాస్తే... ఆడవారు ఏమనుకుంటారో...
అనే ఆలోచనతో ఆగిన నా చేయి...ఏం పర్లేదు దైర్యంగా రాయి ప్రియా నీకు నీ మనస్సాక్షి తోడు అని ధైర్యం చెప్పింది... సో...
ఇక స్వేచ్చగా కథలోకి వెళదామా...✍️✍️

ఓయ్ అబ్బాయ్ నీ గురించి రాస్తున్నా కదా .. చదివే నీకు కనెక్ట్ కావటంకోసం నీ అని (మగాడు) రాస్తా సరేనా...స్టార్ట్ చేస్తే...
నిన్ను నవమాసాలు మోసింది నీ తల్లి అయితే...
నీ బిడ్డలను మోసేది నీ భార్య...
నిజానికి ఇద్దరు చేసింది ఒక్కటే...
ఇద్దరూ పడింది ఓకే కష్టం...
ఇద్దరు చూపించేది ఒక్కటే ప్రేమ...
నిజానికి ఈ ఇద్దరూ ఒక్కటే ఎవరికి ఎవరూ తక్కువకాదు..
కానీ తల్లి అనే బంధం మొదటినుండి వుంటుంది ...
భార్య మధ్యలో వస్తుంది అంతే తేడా..✍️

కాకపోతే తల్లి గొప్పదా అంటే మాత్రం అవును గొప్పదనే చెప్పాలి..
తల్లి స్థానం ఆకాశం లాంటిది మరి.. దానిని అందుకోవాలనుకోవటం
అమాయకత్వమే తప్పా..అసాధ్యం...✍️

తల్లి ప్రేమకు కొలతలుండవు.. 
తల్లి ప్రేమకు కోపముండదు...
తల్లి ప్రేమకు  స్వార్దముండదు...

మరి భార్యా అంటే... మ్మ్ ఏం చెప్పాలి...
భార్య గా ఎలా వున్నా చివరకి తను కూడా తల్లిగా మరాల్సిందే..
కానీ... కొంత మంది భార్యలు తమ భర్తలను  తీసుకొని వేరు కాపురాలు పెడతారు... అత్తమామలను చూడరు ...😥

నిజానికి నీ తల్లి నీకోసం ఎన్నో చేసింది...✍️
నీ తల్లి నీకోసం నీ తండ్రితో పొట్లాడింది...✍️
నీ తల్లి నీ కడుపు నింపటం కోసం తన కడుపు కాల్చుకుంది..
చివరకి నీ కాపురం బాగుండాలని నువ్వు తిట్టినా ?కొట్టినా?
ఆఖరికి ఇంట్లో నుండి నెట్టేసినా...తను మాత్రం నిన్ను నీ భార్యాబిడ్డలను బాగుపడమని ఆశీర్వదించిందే కానీ..✍️
శపించలేదు..😥 ఎందుకో తెలుసా తల్లిదండ్రుల వాక్కు బిడ్డలకు దీవెన కాబట్టి..✍️✍️ బిడ్డలు ఎంత ఎదిగినా.. తల్లికి మాత్రం పడి బిడ్డలే... అది తల్లి మనసు... కాదు కాదు నీ తల్లి మనసు..

నీ భార్య కూడా ఓ తల్లిగా మారితే అప్పుడు తెలుస్తుంది తల్లి ప్రేమ అంటే ఏంటో...✍️😥
అలాగని భార్యలందరూ ఒకేలా వుండరు కదా ..✍️

బాధ్యత తెలిసిన భార్య భర్తను బాగుచేస్తుంది కానీ పాడుచేయదు..
నీ భార్యకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో...
నీకు నీ తల్లిదండ్రులు అంతే ముఖ్యం కదా...😥✍️

ఒక ఆడది (భార్య) ఆ మగాడికి దైర్యాన్ని ఇవ్వాలి కానీ.. కొంతమంది ఎలా ఉన్నారంటే...
ఆ రోజు తనకేం చేసాడు..ఆ రోజు తనను ఎక్కడికి తీసుకెళ్ళాడు 
ఆ రోజు తనకేం కొనిచ్చాడు..ఆ రోజు తననెంత సుఖపెట్టాడు...
ఇది మాత్రమే చూస్తున్నారు...✍️✍️

అంతే కానీ తన (భర్త) కి ఏం అయింది..ఆఫీస్ లో గొడవా..
హెల్త్ బాగోలేదా... అప్పుల గురించి టెన్షనా...
ఇదేం ఆలోచించరు..✍️✍️
ఏదైతే నాకేంటి నాకు కావాలంటే కావాలి...
ఇలా టార్చర్ పెడుతున్న మకుటం లేని మహారరాణులు ఎంతమందో.. కదా...😥✍️
అలాగని ఎవరిని తక్కువ చేసినా నీ జీవితం తలకిందులు ఐపోతుంది జాగ్రత్త ఎందుకంటే...✍️✍️
ఒక మగాడి జీవితంలో తల్లి భార్య ఇద్దరు ముఖ్యమే.. 
రైట్ టైంకి రైట్ డెసిషన్ తీసుకుంటే...ఇద్దరూ నీతోనే వుంటారు..
నువ్వు కూడా ప్రశాంతంగా ఉండగలవు ఆలోచించు ✍️👍
పోస్ట్ నచ్చితే దయచేసి షేర్ చెయ్ అబ్బాయ్ ❤️😂
తప్పులు రాస్తే మన్నించి సరిదిద్దు సరేనా 
ఇట్లు ,
ఎలాగైనా నీతో మాట్లాడే పిచ్చి పిల్ల (ప్రియ)
@Rowthu Priya Naidu 
@newpost
@Mitivation
@truewords
@picoftheday
@fb
@feeds

No comments:

Post a Comment