Monday, July 27, 2026

మంచి మాటలు - 2027

1)నిజం తెలియాలంటే అద్దం ముందు నిలబడు..జవాబు అక్కడ కనిపిస్తుంది..ఆకలి అన్నవాడికి బువ్వ పెట్టు..అది గుళ్లో చేసే పూజ కన్నా గొప్పది..మాట తప్పబోకు..నమ్మకం పోతే దేవుడు సైతం తిరిగి ఇవ్వలేడు..తప్పు నీదైతే సారీ చెప్పు..పొగరు అడ్డురాకూడదు..కోపం వచ్చినప్పుడు నోరు మూసుకో..ఆ మౌనానికే బలం ఎక్కువ..డబ్బు కోసం మనిషిని మోసం చేయకు..సంపాదన అవసరమే కానీ గుణం ముఖ్యం..ఇంట్లో వాళ్ళని ఏడిపించకు..గుండె పగిలితే అతకడం కష్టం..రోజూ పడుకునేటప్పుడు ఆలోచించు..ఈరోజు నావల్ల ఎవరు నవ్వారు..ఎవరు బాధపడ్డారు..అని..ఆ లెక్కే కర్మ..అదే జాతకం..ఉంగరం చేతికే అందం..కానీ మంచితనం బతుక్కే వెలుగు..నువ్వు మంచిగా ఉంటే దేవుడు సైతం నీవెంట ఉంటాడు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

2)స్నేహం అంటే నమ్మకం..కానీ ఈ రోజుల్లో విలువైనది విలువ తెలియని వారికే దక్కుతుంది..అది వస్తువైనా..విలువైన బంధమైనా ఇదే నిజం..అందుకే నిజమైన ఫ్రెండ్ దొరికితే వదులుకోకు..వాడు నీ జీవితంలో దొరికిన వజ్రం లాంటివాడు..నువ్వు పడిపోతే లేపడానికి, ఓడిపోతే గెలిపించడానికి వాడుంటాడు..ఇచ్చిన మాట కోసం నిలబడు..ఎందుకంటే నమ్మకం చెడితే మనిషి విలువ చెడుతుంది..అపార్థం వస్తే మాట్లాడి క్లియర్ చేసుకో..మౌనం మంచి బంధాలను కూడా చంపేస్తుంది..కోపంలో కఠినంగా మాట్లాడకు..ఒక్క మాట మనసును విరిచేస్తుంది..సుఖంలో అందరూ ఉంటారు..దుఃఖంలో నీ చేయి పట్టుకునేవాడే నీవాడు..విలువ తెలిసినవాడివై ఉండు..విలువైన బంధాన్ని పోగొట్టుకోకు..రోజూ నిద్రపోయే ముందు గుర్తుచేసుకో..నాకున్న ఈ స్నేహం ఎంత అదృష్టమో అని..ఆ కృతజ్ఞత ఉంటే బంధం ఎప్పటికీ వాడిపోదు..నువ్వు నిజంగా ఉంటే..నీ విలువ తెలిసిన మనిషి నిన్ను వదలడు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

3)విధి రాతలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే..సమయం వచ్చినప్పుడు అన్నీ మారిపోతాయి..మనకు ముందే ఏం జరగబోతుందో తెలియదు..అందుకే మనిషి ఇంకా ఆశతో బతుకుతున్నాడు..ఒకవేళ రేపటి బాధ ముందే తెలిస్తే ఈరోజు నవ్వేవాడు కాదు..రేపటి ఆనందం ముందే తెలిస్తే ఈరోజు కష్టపడేవాడు కాదు..జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోతాయి,కొంతమంది మనుషులు దూరమవుతారు..కొన్ని కలలు విరిగిపోతాయి..కానీ అదే జీవితం కొత్త దారిని కూడా చూపిస్తుంది..కొన్నిసార్లు కొందరికి కాలం త్వరగా కలిసొస్తుంది..కొందరికి కష్టం తర్వాత ఫలితం దక్కుతుంది..కానీ గుర్తుంచుకో..అదృష్టం అవకాశం ఇస్తుంది..శ్రమ మాత్రమే ఆ స్థానాన్ని నిలబెడుతుంది..ఈ రోజు నిన్ను చూడని కళ్లు రేపు నిన్ను వెతుకుతాయి..కాలం ఒక్కసారి తిరిగితే నీ ప్రయాణమే స్ఫూర్తి అవుతుంది..చివరికి అర్థమయ్యేది ఒక్కటే..వచ్చింది వెళ్లిపోవచ్చు..సంపాదించుకున్నది మాత్రం నీతోనే ఉంటుంది..నువ్వు నమ్మకంతో నడువు..నీ సమయం రాకమానదు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

4)దేవుడు  నిన్ను రాజుని చేయాలనుకుంటే నీకు కిరీటం ఇవ్వడు..పోరాటం ఇస్తాడు.కిరీటం అనేది పోరాడి గెలిచిన వాడికే దక్కుతుంది.ఆయన ఒక్కసారిగా నిన్ను రాజును చేయడు..ముందు నీ ముందు యుద్ధం పెడతాడు.ఆ యుద్ధంలో నువ్వు నిలబడి గెలిస్తేనే నువ్వు రాజువి.జీవితం అంటే ఇదే.నువ్వు అడిగినది ఆయన వెంటనే ఇవ్వడు..నువ్వు దానికి అర్హుడివో కాదో ముందు చూపించాలి.అందుకు ధైర్యం కావాలి,త్యాగం కావాలి. ఆయన నిన్ను పూర్తిగా పరీక్షిస్తాడు.అందుకే కిరీటం కోసం బాధపడకు..ఆయన ఇచ్చిన అవకాశాన్ని పట్టుకుని పోరాడు.నీ కష్టం,నీ చెమట,నీ కన్నీళ్లు లేకుండా గెలుపు రాదు.ఆయన నీకు కష్టం పెడితే అర్థం..నిన్ను పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడని.
తట్టుకో..ఎదుర్కో..గెలిచి చూపించు.ఎందుకంటే కిరీటం అనేది ఆభరణం కాదు..అది నీ దెబ్బల మీద నువ్వు సంపాదించుకున్న గౌరవం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

5)స్నేహం అంటే చేయి..నువ్వు బురదలో కూరుకుపోతే లాగే చేయి..నువ్వు అగాధంలో పడిపోతుంటే పట్టుకునే చేయి..వెలుగులో అందరూ చప్పట్లు కొడతారు..చీకట్లో చేయి అందించేవాడే తోడు..కానీ ఆ చేయిని ఎప్పుడూ విదిలించకు..ఎందుకంటే ఒక్కసారి విడిచిపెడితే..మళ్లీ ఆ చేయి నీకోసం రాదు..కోపంలో గట్టిగా నొక్కకు..ప్రేమతో మృదువుగా పట్టుకో..నిజమైన నేస్తం నీ చేయిని గాయపరచడు..నీ వేలిని వదిలిపెట్టడు..దారి తప్పితే దారి చూపుతాడు..అలసిపోతే భుజం మీద చెయ్యేసి నడుస్తాడు..అలాంటి చేయి దొరికితే..జీవితాంతం వదలకుండా పట్టుకో..అదే నీకు దేవుడిచ్చిన వరం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

6)స్నేహం అంటే వెన్నెల..ఎండమావి కాదు..చీకటి రాత్రిలో నీకు తోడుగా నిలిచే చల్లని వెలుగు..నువ్వు కాలిపోతుంటే చల్లగా తాకుతుంది..నువ్వు భయపడుతుంటే ధైర్యం ఇస్తుంది..కానీ వెన్నెల మీద ఉమ్మేయకు..మబ్బు పట్టించకు..ఎందుకంటే ఒక్కసారి అలిగితే..అమావాస్యే మిగులుతుంది..నిజమైన స్నేహితుడు నీ రాత్రికి వెన్నెల అవుతాడు..నీ కన్నీటిని ముత్యంలా మెరిపిస్తాడు..అలాంటి వెన్నెల దొరికితే..రాత్రంతా మేలుకొనైనా కాపాడుకో..అదే నీ బతుకుకి అందం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

7)స్నేహం అంటే అద్దం..నువ్వు నవ్వితే అది నవ్వుతుంది,నువ్వు ఏడిస్తే అది కన్నీళ్లు పెడుతుంది..నీ ముఖానికి మేకప్ వేయదు,నీ లోపాలను దాచిపెట్టదు..నీవు అలసిపోతే అది నీ కళ్లలోని నిద్రను చూపిస్తుంది,నీవు బాధపడితే అది నీ గుండెలోని గాయాన్ని చూపిస్తుంది..కానీ అద్దం పగిలితే అతికించినా గీత కనిపిస్తుంది..ఆ గీతే అనుమానం,ఆ గీతే మాట,ఆ గీతే మౌనం..ఒక్క దెబ్బ చాలు..వేయి ముక్కలైపోతుంది..అందుకే కోపంలో నేలకేసి కొట్టకు,అహంలో విసిరి పారేయకు..రోజూ దాన్ని ప్రేమగా తుడుచుకో,నీ నిజాన్ని దాంట్లో చూసుకో..ఎందుకంటే దుమ్ము పట్టిన అద్దం నీ అసలు రూపాన్ని చూపించదు..పగిలిన నమ్మకం,చినిగిన బంధం తిరిగి కలవు..కలిపినా ఆ పగుళ్ల నీడ జీవితాంతం వెంటాడుతుంది..ఒక్కసారి చేయి జారితే..మళ్లీ ఆ అద్దంలో నీ మొహం నవ్వదు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

8)స్నేహం అంటే గూడు..ఎండకు,వానకు,గాలికి నువ్వు వణికిపోతుంటే అది నీకు నీడనిస్తుంది..నువ్వు పుల్ల పుల్ల పేర్చి కట్టుకున్న గూడు..ఒక్క కోపం అనే నిప్పురవ్వ చాలు..బూడిదైపోతుంది..అందుకే మాట తూకం వేసి మాట్లాడు..చేయి జారి నిప్పు అంటించకు..ఎందుకంటే కాలిపోయిన గూడు..మళ్లీ కట్టినా ఆ వెచ్చదనం రాదు..నిజమైన నేస్తం నీ గూడుకి కాపలా ఉంటాడు..తుఫాన్ వస్తే నిన్ను గుండెల్లో దాచుకుంటాడు..అలాంటి గూడు దొరికితే..జీవితాంతం అందులోనే ఉండిపో..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

9)మంచి చేయడం నేర్చుకుంటాం..కానీ ఎవరికి చేయాలో కూడా నేర్చుకోవాలి..వెలుతురు అందరికీ ఇవ్వచ్చు..కానీ కళ్లు మూసుకున్నవాడికి ఇచ్చి లాభం లేదు..నీడ అందరికీ ఇవ్వచ్చు..కానీ నీడనిచ్చిన చెట్టునే నరికేవాడికి కాదు..సహాయం విలువ తెలిసినోడికి చేస్తే అది ఆశీర్వాదం అవుతుంది..వాడుకుని పోయేవాడికి చేస్తే అది నీకే శాపం అవుతుంది..మనసు మంచిదైతే సరిపోదు..మనిషిని గుర్తుపట్టే తెలివి కూడా ఉండాలి..ఎందుకంటే అర్హత లేనివాడికి చేసిన మంచి..గాలి పాలు అయిన నీళ్లతో సమానం..విలువ తెలిసిన గుండెకే నీ సమయం ఇవ్వు..నీ శ్రమను ఇవ్వు..నీ ప్రేమను ఇవ్వు..అప్పుడే నీ మంచితనానికి గౌరవం దక్కుతుంది..లేకపోతే నీ మంచే నిన్ను కుంగదీస్తుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

10)సొంత కష్టంతో ఎదగాలి..మంచితనంతో గెలవాలి..నిజాయితీతో నవ్వుకోవాలి..ఎందుకంటే మంచి మనసుకు ఎప్పుడూ మంచి దారే దొరుకుతుంది..అందుకే ఎవరి ముందూ తలవంచకుండా బతకాలి..సొంత కలల కోసం ప్రతిరోజూ కష్టపడాలి..మాటకు కట్టుబడి నిలబడాలి..ఆత్మగౌరవం అనేది ప్రతి మనిషి గుండె చప్పుడు లాంటిది..దాన్ని ప్రేమగా కాపాడుకోవాలి..ఎవరి నీడలోనూ కాకుండా..సొంత వెలుగుతో ప్రకాశించాలి..సొంత దారిని ఏర్పరచుకుని ధైర్యంగా నడవాలి..ఎందుకంటే జీవితం ఒక అందమైన వరం..ప్రతి రోజూ ఒక కొత్త అవకాశం..ప్రతి అడుగూ విజయం వైపే వేయాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

11)చెమట చుక్కలే మెట్లయితే ఎదుగుదల ఆగదు..మంచి మనసే దారి చూపితే గెలుపు తప్పదు..నిజాయితీ నీడై నిలిస్తే నవ్వు చెరగదు..ఎందుకంటే కష్టానికి కన్నీరు తెలుసు..కలకి రెక్కలు తెలుసు..ప్రయత్నానికి ఫలితం తెలుసు..అందుకే ఓటమి ఎదురైనా మోకరిల్లకుండా లేవాలి..అవమానం తగిలినా ఆత్మగౌరవం వదలకుండా నిలవాలి..చీకటి కమ్మినా సొంత దీపం వెలిగించుకోవాలి..ఎవరి అడుగుజాడల్లో కాకుండా సొంత గుర్తుల్ని వదిలి వెళ్లాలి..ఎందుకంటే జీవితం ఒక్కసారే వస్తుంది..ప్రతి ఉదయం ఒక కొత్త పుస్తకం..ప్రతి క్షణం ఒక కొత్త అవకాశం..కాబట్టి కలలు కనాలి..వాటికోసం కదలాలి..గెలిచేవరకు ఆగకూడదు..ఎందుకంటే నువ్వు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

12)ఓడిపోయానని ఏడవకు..గెలవడానికి ఇంకో అవకాశం దొరికిందని నవ్వు..పడిపోయానని కూలబడకు..లేచి పరిగెత్తడానికి కారణం దొరికిందని ముందడుగు వెయ్..వదిలేశారని కుంగిపోకు..నిన్ను నువ్వు వెతుక్కోవడానికి దారి దొరికిందని సంబరపడు..మోసపోయానని మూలన కూర్చోకు..మనుషుల్ని చదవడం నేర్చుకున్నానని గర్వపడు..ఒంటరినయ్యానని బాధపడకు..నీ నీడే నీ తోడని నమ్ము..నమ్మకం విరిగిందని చితికిపోకు..నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు..కన్నీళ్లు వస్తున్నాయని సిగ్గుపడకు..ఆ ఉప్పునీరే నీ బలం అని తెలుసుకో..చీకటి కమ్మిందని భయపడకు..వెలుగు నీలోనే ఉందని గుర్తించు..గాయమైందని ఆగిపోకు..ఆ మచ్చలే నీ చరిత్ర అని చెప్పుకో..అలసిపోయానని అనుకోకు..ఆగకుండా నడిచావనే కదా అలసింది..వెనక్కి లాగుతున్నారని చూడకు..నీ గమ్యం ముందుందని పరిగెత్తు..చులకన చేశారని చిన్నబోకు..వజ్రాన్ని రాయని అనుకునే కళ్లు చాలా ఉంటాయి..నీ సమయం రాలేదని నిందించుకోకు..సింహం ఒక్కసారే గర్జిస్తుంది..కానీ అడవి దద్దరిల్లుతుంది..నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు..నువ్వు ఓడిపోతే నిన్ను నమ్మిన గుండెల్ని ఓడించినట్టే..లే..నడువు..పోరాడు..గెలువు..ఎందుకంటే నీ కథ ఇంకా ముగియలేదు..నీ విజయం ఇంకా మిగిలే ఉంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

13)రెక్కలు వచ్చిన పక్షి ఇంకా గూడులోనే మనతోనే ఉండాలంటే ఎలా..ఎగరడం వచ్చిందంటే దాని మానాన అది విహరిస్తుంది..జీవితంలో కూడా అంతే..ఎదిగిన సింహాన్ని సంకెళ్లతో కట్టలేం..ఎగరడం తెలిసిన డేగను అరచేతిలో దాచలేం..ఎందుకంటే ఆకాశం పిలిచిన తర్వాత గూడు కనిపించదు..కలలు కళ్లు తెరిచిన తర్వాత నిద్ర పట్టదు..గమ్యం దగ్గరైందని తెలిశాక అడుగులు ఆగవు..అలాగే మనిషి కూడా..తన రెక్కల బలం తెలిసిన క్షణం..తన దారి కనిపించిన క్షణం..ఆగరు తిరగరు..ఎందుకంటే అది స్వార్థం కాదు..అది బతుకు పిలుపు..అది విధి రాత..అయితే ఎగిరే ప్రతి రెక్కల చప్పుడులోనూ కృతజ్ఞత ఉండాలి..ఎందుకంటే ఆ రెక్కలు ఇచ్చింది గూడు కట్టిన చేతులే..ఆ ఎత్తు చూపించింది ఆ గుండెలే..అందుకే బంధం పేరుతో బంధించకూడదు..ప్రేమ పేరుతో పంజరం చేయకూడదు..వదిలేయాలి..నమ్మాలి..ఆశీర్వదించి ఆకాశానికి పంపాలి..ఎందుకంటే ఋణం ఉన్న పక్షి ఎంత దూరం వెళ్లినా..ఎంత ఎత్తుకు ఎగిరినా..తన మొదటి గూటిని..తన మూలాలను..తనను మనిషిని చేసిన చేతుల్ని మర్చిపోదు..కానీ ఆ చేతుల కోసం తన ఆకాశాన్ని మాత్రం సమాధి చేయదు..ఎందుకంటే ఎగిరి గెలిచి..ఆ గూటికి పేరు తేవడమే అసలైన కృతజ్ఞత..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

14)గుడ్డివాడికి కళ్ళు రాగానే మొదట వదిలేది ఇన్నిరోజులు తనకు సాయపడిన చేతికర్రనే..ఎందుకంటే అది మనిషి నైజం..అవసరం తీరాక ఆధారం అనవసరం అయిపోతుంది..చీకట్లో దారి చూపిన కర్ర వెలుతురులో భారంగా కనిపిస్తుంది..పడిపోకుండా పట్టుకున్న చెయ్యి నడక వచ్చాక అడ్డుగా తోస్తుంది..ఆకలి తీర్చిన మెతుకు కడుపు నిండాక చేదుగా మారుతుంది..కన్నీళ్లు తుడిచిన గుడ్డ కళ్ళు మెరిశాక మాసిపోయినట్టు అనిపిస్తుంది..ఒంటరితనంలో తోడై నిలిచిన నీడ జనంలో కనపడకుండా పోతుంది..బతుకు లేనప్పుడు బుజం కాసినవాడు బతుకు మారగానే బరువైపోతాడు..ఎందుకంటే కృతజ్ఞత అందరికీ ఒంటబట్టదు..కొందరికి ఎదుగుదల అంటే వెనకటిని మర్చిపోవడమే..కానీ గుర్తుంచుకో..కళ్ళు వచ్చినవాడివి కావచ్చు..కానీ ఆ చేతికర్ర లేకుంటే నువ్వు చీకట్లోనే ఉండిపోయేవాడివి..అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా..ఎంత వెలుగు చూసినా..నిన్ను నడిపించిన చెయ్యిని వదలకు..ఎందుకంటే తిరిగి చీకటి కమ్మితే ఆ చేతికర్రే నీకు దిక్కు అవుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

15)మేడ ఎక్కాక నిచ్చెనను గుర్తుంచుకోవాలి..నేల మీద ఉన్నప్పుడు ఆ మెట్లే ఆకాశం చూపించాయి..పైకి చేరాలని కలలు కన్నప్పుడు ఆ చెక్కమెట్లే తోడుగా నిలిచాయి..కష్టంలో ఉన్నప్పుడు ఆ నిచ్చెనే ఆసరా అయ్యింది..మేడ పైకి చేరాక కూడా కింద చూపు ఉండాలి..ఎక్కించిన మెట్లను గౌరవించడమే సంస్కారం..పైకి లాగిన చేతిని మర్చిపోకపోవడమే విలువ..ఎత్తుకు చేరినా వినయం వదలకూడదు..ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడమే గొప్పతనం..ఎందుకంటే మేడ ఎంత ఎత్తున్నా..పునాది మీదే నిలబడుతుంది..కింద ఉన్న నిచ్చెన లేకపోతే పైకి రావడం కష్టం..కాబట్టి ఎదిగిన తర్వాత కూడా..ఎక్కిన మెట్లకు కృతజ్ఞత చెప్పు..ఎక్కించిన నిచ్చెనను గుర్తుపెట్టుకుంటే..జీవితాంతం ఇంకా ఎత్తుకు ఎదుగుతావు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

16)వెలుగు ఇచ్చిన చమురును మర్చిపోకూడదు..చీకటి కమ్మినప్పుడు ఆ చుక్క చమురే వెలుతురు ఇచ్చింది..గాలి వీచినప్పుడు ఆ చమురే దీపాన్ని కాపాడింది..ఆశ లేనప్పుడు ఆ చుక్కే ధైర్యం నింపింది..దీపం వెలిగాక కూడా చమురు విలువ తెలియాలి..వెలిగించిన చుక్కకు కృతజ్ఞతగా ఉండడమే ధర్మం..బతుకునిచ్చిన చమురును గౌరవించడమే న్యాయం..వెలుగు వచ్చిన గర్వంతో మూలాన్ని మర్చిపోకూడదు..పేరు వచ్చినా పునాదిని వదిలేయకూడదు..ఎందుకంటే చమురు లేకపోతే దీపం వెలగదు..వత్తి ఉన్నా చమురు తోడైతేనే వెలుగు..వెలిగించిన చెయ్యికి విలువ ఇవ్వాలి..కాబట్టి నీ వెలుగుకు కారణమైన చుక్కను..ఎప్పుడూ గుండెల్లో పెట్టుకో..వెలుగు ఇచ్చిన చమురును గుర్తుంచుకుంటే..నీ జీవితం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

17)పండ్లు కాసినా వేరును ప్రేమించాలి..విత్తనంగా నేలలో ఉన్నప్పుడు ఆ వేరే బలం ఇచ్చింది..ఎండకు వాడిపోతున్నప్పుడు ఆ వేరే నీరు అందించింది..తుఫాను వచ్చినప్పుడు ఆ వేరే గట్టిగా పట్టుకుంది..కొమ్మలు విస్తరించినా కూడా వేరును మర్చిపోకూడదు..ఆకాశం అందుకున్నా ఆధారాన్ని గౌరవించడమే విజ్ఞత..పండ్లు ఇచ్చినా పుట్టిన చోటును ప్రేమించడమే సంస్కారం..పైకి ఎదిగిన కొమ్మ కింద ఉన్న వేరుకు నీడ ఇవ్వాలి..ఫలాలు ఇచ్చిన చెట్టు బతుకు ఇచ్చిన బంధాన్ని నిలుపుకోవాలి..ఎందుకంటే వేరు ఉంటేనే చెట్టు పచ్చగా ఉంటుంది..కొమ్మలు ఎన్ని ఉన్నా వేరే ప్రాణం..పునాదిని ప్రేమించే చెట్టు ఎప్పుడూ కూలదు..కాబట్టి నిన్ను నిలబెట్టిన వేరుకు..ఎప్పుడూ నీరు పోస్తూనే ఉండు..నిన్ను పెంచిన వేరును కాపాడుకుంటే..నువ్వు ఎప్పటికీ ఫలాలనిచ్చే చెట్టువే...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

18)పేరు వచ్చినా సిరాను గౌరవించాలి..అక్షరం రానప్పుడు ఆ చుక్క సిరానే అక్షరం నేర్పింది..కాగితం ఖాళీగా ఉన్నప్పుడు ఆ సిరానే కథ రాసింది..చరిత్ర లేనప్పుడు ఆ చుక్కే నీ పేరును లిఖించింది..పుస్తకం అచ్చయ్యాక కూడా సిరా విలువ తగ్గదు..రాయించిన చేతికి కృతజ్ఞత చెప్పడమే కవి లక్షణం..పేరు ఇచ్చిన సిరాను పదిలంగా చూసుకోవడమే ధర్మం..అక్షరం నేర్పిన గురువును గుండెల్లో పెట్టుకోవాలి..ఊపిరి పోసిన ఊటను ఎప్పుడూ మర్చిపోకూడదు..ఎందుకంటే సిరా లేకుండా కలం కథ రాయలేదు..చుక్క లేకుండా చరిత్ర మొదలవ్వదు..నిన్ను నింపిన సిరాను ప్రేమిస్తే..నీ కలం ఎప్పుడూ రాస్తూనే ఉంటుంది..కాబట్టి నీ అక్షరానికి ప్రాణం పోసిన చుక్కను..జీవితాంతం జాగ్రత్తగా చూసుకో..*నిన్ను రాసిన సిరాను గౌరవిస్తే..నీ పేరు కాలంతో పాటు నిలిచిపోతుంది...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

19)దాహం తీరినా తాడును దాచుకోవాలి..ఎండిపోయిన గొంతుతో ఉన్నప్పుడు ఆ నులక తాడే నీరు ఇచ్చింది..బావిలో పడిపోతానని ఉన్నప్పుడు ఆ తాడే ఆసరా అయ్యింది..ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఆ పాత తాడే పైకి లాగింది..కడుపు నిండినా కాపాడిన తాడు విలువ తెలియాలి..పైకి లాగిన చేతికి కృతజ్ఞతగా ఉండడమే మానవత్వం..బతికించిన తాడును భద్రంగా చూసుకోవడమే బుద్ధి..దాహం తీర్చిన బావిని ప్రేమించడమే సంస్కారం..ప్రాణం పోసిన తాడును ఎప్పుడూ మర్చిపోకూడదు..ఎందుకంటే ఎండాకాలం మళ్లీ వస్తుంది..గొంతు మళ్లీ ఎండిపోతుంది..దాచుకున్న తాడు ఉంటే..ఆ బావి నీళ్లు మళ్లీ తాగొచ్చు..కాబట్టి నిన్ను కాపాడిన తాడును..ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకో..*ప్రాణం పోసిన తాడును పదిలంగా ఉంచుకుంటే..జీవితంలో ఎప్పుడూ దాహం వేయదు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

20)వాన తగ్గినా గొడుగును గౌరవించాలి..ఉరుములు ఉరిమినప్పుడు ఆ గొడుగే నీకు నీడ అయ్యింది..వడగళ్లు పడుతున్నప్పుడు ఆ రెక్కలే నిన్ను కాపాడాయి..తడిసిపోతానని ఉన్నప్పుడు ఆ చిన్న గొడుగే అండగా నిలిచింది..ఎండ వచ్చినా నీడ ఇచ్చిన గొడుగును మర్చిపోకూడదు..తలమీద పెట్టుకున్న గొడుగుకు కృతజ్ఞత చెప్పడమే నీతి..కాపాడిన రెక్కలను ప్రేమించడమే మానవత్వం..అవసరంలో ఆదుకున్న దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి..కాబట్టి మబ్బులు మళ్లీ కమ్మినప్పుడు..వాన మళ్లీ కురిసినప్పుడు..ఉరుములు మళ్లీ ఉరిమినప్పుడు..దాచుకున్న గొడుగే నిన్ను కాపాడుతుంది..ఎందుకంటే మంచి గొడుగు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది..*నిన్ను తడవకుండా కాపాడిన నీడను ప్రేమిస్తే..జీవితంలో ఏ వానా నిన్ను తడపలేదు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

21)దారి దాటినా చెప్పును చూసుకోవాలి..ముళ్లబాటలో నడుస్తున్నప్పుడు ఆ చెప్పులే నిన్ను కాపాడాయి..రాళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు ఆ తోలే నీకు రక్షణ ఇచ్చింది..మంటలో నడుస్తున్నప్పుడు ఆ చెప్పులే నీకు తోడుగా నిలిచాయి..ఇల్లు చేరాక కూడా కాపాడిన చెప్పును గౌరవించాలి..కాళ్ళను కాపాడిన తోలుకు కృతజ్ఞత చెప్పడమే ధర్మం..గుచ్చుకోకుండా నడిపించిన చెప్పును ప్రేమించడమే విలువ..అవసరంలో అండగా నిలిచిన దాన్ని మర్చిపోకూడదు..ఎందుకంటే జీవితం అంతా పూలబాట కాదు..ముళ్ళు మళ్లీ ఎదురవుతాయి..రాళ్ళు మళ్లీ తగులుతాయి..దాచుకున్న చెప్పులు ఉంటే..ఏ ముళ్లూ నిన్ను బాధించలేదు..కాబట్టి నిన్ను నడిపించిన అడుగును..ఎప్పుడూ పదిలంగా చూసుకో..*నడిపించిన చెప్పును గౌరవిస్తే..జీవితంలో ఏ ముళ్లూ నీ దారికి అడ్డురావు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

22)ఆవలి ఒడ్డుకు చేరినా వంతెనను మర్చిపోకూడదు..వరద ఉప్పొంగినప్పుడు ఆ వంతెనే నీకు దారి చూపింది..ఈదలేక ఉన్నప్పుడు ఆ చెక్క వంతెనే నిన్ను దాటించింది..అవతలి గట్టు దూరంగా ఉన్నప్పుడు ఆ వారధే నిన్ను చేర్చింది..ఒడ్డు ఎక్కాక కూడా దాటించిన వంతెనకు కృతజ్ఞత చెప్పాలి..కష్టం దాటించిన దారిని గౌరవించడమే సంస్కారం..ఆధారం ఇచ్చిన వంతెనను ప్రేమించడమే విలువ..నడిపించిన దారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి..ఎదుటి ఒడ్డుకు చేర్చిన వంతెనకు విలువ ఇవ్వాలి..ఎందుకంటే నది ఒక్కసారి దాటేది కాదు..వరద మళ్లీ వస్తుంది..దారి మళ్లీ కావాలి..కాపాడుకున్న వంతెన ఉంటే..ఏ వరదా నిన్ను ఆపలేదు..కాబట్టి నిన్ను దాటించిన వారధిని..ఎప్పుడూ పదిలంగా చూసుకో..*నిన్ను దాటించిన దారిని ప్రేమిస్తే..జీవితంలో ఏ నదీ నిన్ను ఆపలేదు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

23)ముఖం అందంగా ఉన్నా అద్దాన్ని గౌరవించాలి..మసి అంటినప్పుడు ఆ అద్దమే నీకు నిజం చూపించింది..మురికి పట్టినప్పుడు ఆ గాజే నీకు తప్పు చెప్పింది..అందంగా ఉండాలన్నప్పుడు ఆ అద్దమే నీకు తోడుగా నిలిచింది..అందం వచ్చాక కూడా నిజం చెప్పిన అద్దం విలువ తెలియాలి..ముడతలు చూపించినా అద్దాన్ని ప్రేమించడమే విజ్ఞత..వయసు తెలిపినా అద్దాన్ని గౌరవించడమే సంస్కారం..లోపం చూపిస్తే అద్దానికి కృతజ్ఞత చెప్పాలి..నిజం చేదుగా ఉన్నా నిజం చెప్పినవాడిని ప్రేమించాలి..ఎందుకంటే అద్దం లేకపోతే నీ అందం నీకే తెలియదు..నిజం లేకపోతే నువ్వు ఎదగలేవు..ప్రేమించిన అద్దంలో నీ జీవితం అందంగా కనిపిస్తుంది..కాబట్టి నీకు నిజం చూపిన అద్దాన్ని..ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకో..*నిజం చూపిన అద్దాన్ని గౌరవిస్తే..జీవితాంతం నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

24)మిద్దె కట్టినా పునాదిని ప్రేమించాలి..నేలలో ఉన్న ఆ పునాదే నీ భారాన్ని మోసింది..వానకు ఎండకు ఆ పునాదే నిన్ను నిలబెట్టింది..భూకంపం వచ్చినా కదలకుండా ఆ పునాదే నిన్ను కాపాడింది..పై అంతస్తులు లేచినా కూడా కింద ఉన్న పునాదిని మర్చిపోకూడదు..అందమైన గోడలు కట్టినా అసలు ఆధారాన్ని గౌరవించాలి..పైపై మెరుగులు ఉన్నా లోపలి బలాన్ని ప్రేమించాలి..నిలబెట్టిన రాయికి కృతజ్ఞత చెప్పడమే ధర్మం..మూలాన్ని గుర్తుంచుకుని మిద్దె మీద సంతోషించాలి..ఎందుకంటే పునాది ఉంటేనే మిద్దె నిలబడుతుంది..కింద బలంగా ఉంటే పైన ఉన్నదంతా సురక్షితం..ప్రేమించిన పునాది మీద కట్టిన మేడ ఎప్పుడూ కూలదు..కాబట్టి నిన్ను నిలబెట్టిన పునాదిని..ఎప్పుడూ గుండెల్లో పెట్టుకో..*నిన్ను నిలబెట్టిన పునాదిని ప్రేమిస్తే..నువ్వు కట్టుకున్న జీవితం ఎప్పటికీ చెక్కుచెదరదు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

25)ఈ ప్రపంచంలో గొప్పవాళ్లు అంటే ఎక్కువ సంపాదించిన వాళ్లు కాదు..తమ దగ్గర ఉన్న కొద్దిలో కూడా ఇంకొకరి ఆకలి తీర్చిన వాళ్లు..ఎందుకంటే కడుపు నిండినవాడికి భోజనం పెట్టడం దానం కావచ్చు..కానీ ఆకలితో ఉన్న ప్రాణికి ఒక ముద్ద పెట్టడం జీవితం ఇవ్వడమే..మనిషి గొప్పతనం అతని మాటల్లో కనిపించదు..అతని హృదయంలో ఉన్న కరుణలో కనిపిస్తుంది..ఎదుటివాడు మనిషైనా..మూగజీవైనా..బాధ ఒకటే..ఆకలి ఒకటే..ప్రేమ కోసం ఎదురుచూపు ఒకటే..మన దగ్గర ఎంత ఉందనేది కాలం మర్చిపోతుంది..కానీ మనం ఎవరి కన్నీరు తుడిచామో..ఎవరి ఆకలి తీర్చామో..అది ఎప్పటికీ మర్చిపోదు..జీవితంలో పేరుకన్నా ప్రేమ సంపాదించు..డబ్బుకన్నా దయ పంచు..ఎందుకంటే చివరికి మన వెంట వచ్చేది సంపద కాదు..మన వల్ల నవ్విన ముఖాలు..మన వల్ల బతికిన ప్రాణాలు..మన వల్ల పొందిన ఆశీర్వాదాలే..అవి సంపాదించినవాడే నిజంగా అదృష్టవంతుడు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

26)జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ముఖ్యం కాదు..మన వల్ల ఎంతమంది నిలబడ్డారన్నదే ముఖ్యం..ఎందుకంటే ఆకలితో ఉన్న కడుపుకు అన్నం పెట్టిన చేయి..బాధలో ఉన్న గుండెకు ధైర్యం చెప్పిన మాట..ఆశ కోల్పోయిన ప్రాణానికి అండగా నిలిచిన మనసు..ఇవే నిజమైన సంపదలు..ఈ ప్రపంచం నీ డబ్బును లెక్కపెడుతుంది..కానీ కాలం నీ మంచితనాన్ని గుర్తుంచుకుంటుంది..మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పేరు నిలవాలంటే పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు..ఎదురుగా కనిపించిన బాధను మన బాధగా భావించే హృదయం ఉంటే చాలు..ఎందుకంటే మనిషి విలువ అతను ఎంత సంపాదించాడనే దాంట్లో లేదు..ఎంత ప్రేమ పంచాడనే దాంట్లో ఉంది..బతికినన్ని రోజులు మన కోసం కాకుండా..మన వల్ల ఇంకో ప్రాణం నవ్వేలా జీవించగలిగితే..అదే జీవితానికి అసలైన అర్థం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

27)ఆకలితో ఉన్న మూగజీవికి ఒక ముద్ద అన్నం పెట్టిన క్షణంలోనే మనిషిలోని మానవత్వం వెలుగుతుంది..దేవుడిని వెతుక్కుంటూ గుడులు తిరగాల్సిన అవసరం లేదు..ఆకలితో ఎదురుచూస్తున్న ప్రాణి కడుపు నింపిన చోటే దేవుడు నివసిస్తాడు..భక్తి అంటే కేవలం చేతులు జోడించడం కాదు..బాధలో ఉన్న జీవికి చేయూత ఇవ్వడం..మాటలు చెప్పలేని ఆ మూగజీవుల కళ్లలో కనిపించే కృతజ్ఞత..వేల ప్రార్థనల కంటే గొప్పది..దీపం వెలిగిస్తే చీకటి పోతుంది..కానీ దయ చూపిస్తే జీవితాలు వెలుగుతాయి..మన దగ్గర ఉన్నది ఎంత అన్నది కాదు..మనసులో ఉన్న ప్రేమ ఎంత అన్నదే ముఖ్యం..ఒక ముద్ద ఆహారం..ఒక చుక్క నీరు..ఒక క్షణం కరుణ..ఎన్నో ప్రాణాలకు ఆశగా మారుతాయి..శివుడి ఆశీర్వాదం కావాలంటే శివుడి సృష్టిని ప్రేమించాలి..ఎందుకంటే కరుణ ఉన్న హృదయం కన్నా పవిత్రమైన ఆలయం లేదు..సహాయం చేసే చేయి కన్నా గొప్ప పూజ లేదు..మూగజీవుల పట్ల ప్రేమ చూపించు..ఆ ప్రేమలోనే పరమశివుని నిజమైన రూపం కనిపిస్తుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం 🙏*

28)మనసు ఉన్న చోటే మానవత్వం ఉంటుంది..ఈ లోకంలో అందంగా కనిపించేది ముఖం కాదు..ఇతరుల బాధను చూసి కరిగిపోయే మనసు..ఎందుకంటే నవ్వుతూ ఉన్న వాళ్లతో అందరూ ఉంటారు..కానీ బాధలో ఉన్నప్పుడు అండగా నిలిచేవాళ్లే నిజమైన మనుషులు..జీవితంలో మనం ఎంత సంపాదించామన్నది ఒకరోజు మరచిపోతారు..కానీ మన వల్ల ఎవరో ఒకరు నవ్వారంటే అది ఎప్పటికీ గుర్తుంటుంది..ప్రేమ పంచడానికి ధనవంతుడు కావాల్సిన అవసరం లేదు..మంచి మనసు ఉంటే చాలు..ఎందుకంటే చిన్న సహాయం కూడా ఎవరికో పెద్ద ఆశగా మారుతుంది..ఒక మంచి మాట ఎవరికో కొత్త ధైర్యం అవుతుంది..మన వల్ల ఒక ప్రాణం సంతోషిస్తే..అదే మన జీవితానికి నిజమైన విజయం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

29)మంచితనం ఎప్పుడూ వృథా కాదు..నువ్వు చేసిన మంచి వెంటనే తిరిగి రావాలని ఆశించకు..ఎందుకంటే విత్తనం నాటిన రోజే చెట్టు నీడ ఇవ్వదు..కానీ ఒకరోజు అది వందమందికి చల్లని నీడ ఇస్తుంది..అలాగే నువ్వు పంచిన ప్రేమ..చూపిన దయ..చేసిన సహాయం కూడా ఎప్పటికైనా నీ జీవితాన్ని వెలిగిస్తాయి..ఎవరూ చూడకపోయినా..ఎవరూ మెచ్చుకోకపోయినా..మంచి చేయడం ఆపకు..ఎందుకంటే మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు..అతని హృదయంలో దాగి ఉన్న కరుణలో ఉంటుంది..చివరికి మన వెంట వచ్చేది డబ్బు కాదు..మన వల్ల సంతోషించిన మనసుల ఆశీర్వాదాలే..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

30)జీవితం చిన్నదే...కానీ మనసు పెద్దదిగా ఉంచు 🌿
మనకు ఉన్న సమయం చాలా తక్కువ..అందుకే ద్వేషం కోసం కాదు..ప్రేమ కోసం జీవించాలి..ఎందుకంటే కోపం మనిషిని ఒంటరిగా చేస్తుంది..ప్రేమ మనిషిని అందరికీ దగ్గర చేస్తుంది..ఈరోజు మనం ఎవరికైనా ఇచ్చిన చిన్న సహాయం..రేపు వాళ్ల జీవితంలో పెద్ద వెలుగవచ్చు..అందుకే ఎవరో చేస్తారని ఎదురుచూడకు..నీకు చేతనైన మంచి నువ్వే చేయి..ఎందుకంటే చీకటిని తిట్టడం కంటే ఒక చిన్న దీపం వెలిగించడం గొప్పది..అలాగే ప్రపంచాన్ని మార్చాలని అనుకోవడం కంటే..ఒక్క ప్రాణం ముఖంలో నవ్వు తీసుకురావడం గొప్పది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

31)మనిషి విలువ అతని హృదయంలో ఉంటుంది..జీవితంలో పెద్ద ఇల్లు ఉండొచ్చు..ఎక్కువ డబ్బు ఉండొచ్చు..గొప్ప పేరు ఉండొచ్చు..కానీ మంచి మనసు లేకపోతే అవన్నీ అసంపూర్ణమే..ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన చేయి..బాధలో ఉన్నవాడికి భరోసా ఇచ్చిన మాట..కన్నీరు తుడిచిన హృదయం..ఇవే నిజమైన సంపదలు..మనం వెళ్ళిపోయాక కూడా మన పేరు గుర్తుండాలంటే పెద్ద విజయాలు అవసరం లేదు..మన వల్ల ఎవరో ఒకరు "ఆ మనిషి వల్ల నేను నవ్వాను" అని చెప్పుకుంటే చాలు..అదే జీవితానికి అర్థం..అదే మనిషిగా పుట్టినందుకు గొప్పతనం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

32)మనం వెళ్ళిపోయాక కూడా మిగిలేది మన మంచితనమే..జీవితంలో ఎంతకాలం బతికామన్నది కాదు..ఎలా బతికామన్నదే ముఖ్యం..ఎందుకంటే కాలం మన వయసును గుర్తుంచుకోదు..కానీ మన వల్ల నవ్విన ముఖాలను మాత్రం గుర్తుంచుకుంటుంది..మన దగ్గర ఎంత ఉందో ప్రపంచం అడుగుతుంది..కానీ మనం ఎంత పంచామో మనసులు గుర్తుంచుకుంటాయి..ఒక చిన్న సహాయం..ఒక ప్రేమతో కూడిన మాట..ఒక కరుణతో నిండిన చూపు..ఎవరికో జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతాయి..అందుకే మంచి చేయడానికి పెద్ద కారణాలు వెతకకు..మనసు చెప్పిన చోట కరుణ చూపించు..ఎందుకంటే మనం సంపాదించినది ఒకరోజు మాయమవుతుంది..కానీ మనం పంచిన ప్రేమ శాశ్వతంగా మిగిలిపోతుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

33)ప్రేమ పంచినవాడే నిజమైన ధనవంతుడు..ప్రపంచంలో డబ్బు సంపాదించడం గొప్ప కాదు..మనుషుల మనసులు సంపాదించడం గొప్ప..ఎందుకంటే డబ్బు అవసరాలను తీరుస్తుంది..కానీ ప్రేమ జీవితాలను మారుస్తుంది..నీ చేతిలో ఉన్నది కొద్దైనా పర్వాలేదు..నీ హృదయంలో కరుణ ఉంటే చాలు..ఆ కరుణ ఎవరికో ఆశ అవుతుంది..ఎవరికో ధైర్యం అవుతుంది..ఎవరికో బతకడానికి కారణం అవుతుంది..మనిషి జీవితంలో నిజమైన విజయమంటే ఎత్తైన స్థాయికి చేరడం కాదు..తనతో పాటు ఇంకొకరిని పైకి తీసుకెళ్లడం..అదే మానవత్వం..అదే మనిషిగా పుట్టిన గొప్పతనం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

34)మంచి మనసుకు మించిన అందం లేదు..అందమైన ముఖాన్ని కాలం మార్చేస్తుంది..బలమైన శరీరాన్ని వయసు మార్చేస్తుంది..కానీ మంచి హృదయాన్ని ఏదీ మార్చలేడు..ఎందుకంటే కరుణతో నిండిన మనసు ఎప్పటికీ అందంగానే ఉంటుంది..జీవితంలో అందరూ మన విజయాలను గుర్తుపెట్టుకోకపోవచ్చు..కానీ కష్టాల్లో మనం ఇచ్చిన అండను మాత్రం ఎప్పటికీ మర్చిపోరు..అందుకే గొప్పవాడిగా కనిపించడానికి ప్రయత్నించకు..మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు..ఎందుకంటే గొప్పతనం కళ్లకు కనిపిస్తుంది..మంచితనం హృదయాలకు తాకుతుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

35)మనసు తలుపులు తెరిచి ఉంచు..ఈ ప్రపంచంలో అందరికీ ఏదో ఒక లోటు ఉంటుంది..కానీ ప్రేమకు మాత్రం లోటు ఉండకూడదు..ఎందుకంటే ప్రేమ కోసం ఎదురుచూసే గుండెలు చాలా ఉంటాయి..కానీ ప్రేమ పంచే మనసులు చాలా తక్కువ..నీ జీవితంలో వెలుగు కావాలంటే ముందు ఎవరి జీవితంలోనో వెలుగు నింపు..నీకు ఆనందం కావాలంటే ముందు ఎవరికో ఆనందం పంచు..ఎందుకంటే సంతోషం తీసుకోవడంలో కాదు..ఇవ్వడంలో ఉంది..మనిషి బతికినంతకాలం తనకోసం బతకగలడు..కానీ ఇంకొకరి కోసం బతికిన క్షణాలే అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

36)గుండె ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు..ప్రతి ఆకలి అన్నం కోసం కాదు..కొన్ని ఆకళ్లు ప్రేమ కోసం ఉంటాయి..ప్రతి కన్నీరు బాధ వల్ల కాదు..కొన్ని కన్నీళ్లు ఆదరణ కోసం వస్తాయి..ప్రతి జీవి మాట్లాడక పోవచ్చు..కానీ ప్రతి ప్రాణం ప్రేమను అర్థం చేసుకుంటుంది..అందుకే నీ మాటల కంటే నీ మనసు గొప్పది కావాలి..నీ సంపద కంటే నీ దయ పెద్దది కావాలి..ఎందుకంటే జీవితంలో మనం మిగిల్చేది ఆస్తులు కాదు..మనసుల్లో వేసిన ముద్రలు..అందుకే మంచి చేయి..ప్రేమ పంచు..కరుణ చూపు..నీ పేరు మరచిపోయినా..నీ మంచితనం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

37)ఎందుకంటే జీవితంలో ఎవ్వరినైనా తగ్గించాలని ప్రయత్నించడం గొప్పతనం కాదు,మనలోని బలహీనతకు నిదర్శనం.పక్కవాడు ఎదుగుతున్నాడని బాధపడటం వల్ల నీ ఎదుగుదల ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లదు.ఎవరి వెలుగునైనా కప్పేయాలని చూసినా నీ వెలుగు మరింత ప్రకాశించదు.కాలం ప్రతి ఒక్కరికీ వారి విలువను నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. అందుకే ఇతరులను అడ్డుకోవడంపై కాదు,నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టు. ఎందుకంటే ఎదుటివారిని ఓడించడం విజయం కాదు, నీలోని అహంకారాన్ని జయించడం నిజమైన విజయం. చివరికి మనిషిని పైకి తీసుకెళ్లేది ఆధిపత్యం కాదు అర్హత,నిలబెట్టేది శక్తి కాదు వ్యక్తిత్వం, గుర్తుండేది గొప్పతనం కాదు మంచితనం. అందుకే ఎవరినీ తగ్గించడానికి ప్రయత్నించకు...నిన్ను నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నించు.ఎందుకంటే పర్వతం ఎత్తుగా నిలబడటానికి పక్కనున్న కొండలను కూల్చాల్సిన అవసరం ఉండదు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

38)నీ అహంకారంతో పక్కవాడిని అణిచివేయాలనుకుంటే... ఓడిపోయేది అతను కాదు,నువ్వే.ఎందుకంటే అద్దాన్ని కొట్టిన ప్రతిసారీ...గాయపడేది ప్రతిబింబం కాదు,నువ్వే.ఎందుకంటే జీవితంలో...ఎవ్వరినీ తగ్గించడం వల్ల మనం పెరగం,ఎవ్వరినీ ఆపడం వల్ల మనం ముందుకువెళ్లం.పక్కవాడి అడుగులను అడ్డుకున్నంత మాత్రాన నీ ప్రయాణం వేగం పెరగదు...పక్కవాడి వెలుగును కప్పేసినంత మాత్రాన నీ వెలుగు ప్రకాశించదు...కాలం చాలా గొప్ప గురువు... అది ఒక నిజాన్ని తప్పకుండా నిరూపిస్తుంది..ఎదుటివాడిని దాటిపోవాలని పరుగెత్తినవాడి కంటే,తనను తాను మెరుగుపరుచు కోవాలని నడిచినవాడే చాలా దూరం వెళ్తాడు.ఎందుకంటే...మనిషిని పైకి తీసుకెళ్లేది అహంకారం కాదు,అర్హత.నిలబెట్టేది ఆధిపత్యం కాదు, వ్యక్తిత్వం.చివరికి గుర్తుండేది గొప్పతనం కాదు...మంచితనం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

39)కొన్ని మాటలు నవ్వు తెప్పిస్తాయి కానీ వాటి వెనక దాగి ఉన్న నిజం మాత్రం గుండెను నొక్కేస్తుంది..మన జీవితంలో కూడా కొన్ని బంధాలు అచ్చం అలాంటివే..ఎదుటివాళ్లు మనల్ని ఉపయోగించు కుంటున్నారని తెలుసు..మన మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారని తెలుసు..అవసరం ఉన్నప్పుడే గుర్తు చేసుకుంటారని కూడా తెలుసు అయినా వాళ్లు ఒక్కసారి పిలిస్తే చాలు మనసు మళ్ళీ వారి వైపే పరుగెత్తుతుంది..ఎందుకంటే మనం బంధాన్ని ప్రేమించాం వాళ్లు మాత్రం అవసరాన్ని ప్రేమించారు..వాళ్లకు అవసరం వచ్చినప్పుడల్లా మన తలుపు తట్టారు..మనం ప్రతిసారి చిరునవ్వుతో తలుపు తీశాం..అవసరం తీరాక మళ్ళీ దూరమవుతారు..మన విలువ మరిచిపోతారు..మన ప్రేమను మన బాధను పట్టించుకోరు అయినా మనం మారము ఎందుకంటే ప్రేమించడం మన స్వభావం మరిచిపోవడం కాదు కానీ ఒక నిజం మాత్రం ఎప్పటికైనా అర్థమవుతుంది..ఎదుటివాళ్లకు బంధం మీద విలువ లేనప్పుడు మనం ఎంత ప్రేమించినా..ఎన్ని నియమాలు పాటించినా..ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూలిపోవాల్సిన బంధం కూలిపోతుంది..కొన్ని బంధాలు చెడిపోవడానికి
కారణం పరిస్థితులు కాదు..వాటిని కాపాడాలనే మనసు ఒక్కవైపు ఉండటమే..ఎక్కడో విన్నది చదివినది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

40)తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం పిల్లలమే,వాళ్ల నీడలో మనకు ఏ భయం ఉండదు,కానీ మనం ఉన్నంతకాలం వాళ్లు ఉండరు,అది కాలం రాసిన శాసనం,ఈరోజు వాళ్ల చేతి గోరుముద్ద తింటున్నాం,రేపు ఆ చెయ్యి ఉండకపోవచ్చు,ఈరోజు వాళ్ల మందలింపు వింటున్నాం,రేపు ఆ గొంతు వినిపించకపోవచ్చు,వాళ్లు అడక్కుండానే వాళ్ల అవసరం తెలుసుకో,వాళ్లు చెప్పకుండానే వాళ్ల బాధ అర్థం చేసుకో,వాళ్ల కళ్లలోని నీళ్లని నవ్వుగా మార్చు,వాళ్ల ముడతల్లో నీ భవిష్యత్తు ఉంది,పోయాక ఫోటోకి దండ వేసి ఏడిస్తే ఏం లాభం,బతికుండగానే గుండెల్లో గుడి కట్టు,ఎందుకంటే తల్లిదండ్రులు దేవుడికి ప్రతిరూపం,వాళ్లని చూసుకో,అదే నీకు మోక్షం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

41)నిన్న నువ్వు తప్పించుకున్న బాధ్యతే నేడు నీ కష్టంగా మారి నీ ముందు నిలబడింది..చేయాల్సిన పనిని వాయిదా వేస్తే అది వడ్డీతో సహా తిరిగి వచ్చి నీ గుమ్మం తడుతుంది..ఈ జన్మలో పడే ప్రతి కష్టం వెనక గతంలో మనం తిరగేసిన బాధ్యత ఉంది..బరువు దించేస్తే అది బరువుగానే నీ భుజాల మీద కూర్చుంటుంది..పారిపోయిన పని నీడలా వెంటపడుతుంది కర్మ ఎవరినీ వదిలిపెట్టదు..ఈ రోజు నువ్వు ఎవరికి సహాయం చేయవో రేపు నీకు సహాయం ఆగిపోతుంది..మనం నాటిన విత్తనమే మనకు పంటగా మారుతుంది..కష్టం శిక్ష కాదు మనం మర్చిపోయిన పనికి రిమైండర్..బాధ్యతను ఎత్తుకుంటే కష్టం కరిగిపోతుంది..తప్పించుకుంటే అదే కొండలా నీ మీద పడుతుంది..నీ జీవితపు లెక్కలన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి..బాధ్యతను భుజాన వేయని వాడికి కష్టం తప్ప మరో గతి ఉండదు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

42)జీవితంలో పరిచయాలు రకరకాలు..మంచి చేసేవారు మోసం చేసేవారు సాయం చేసేవారు సాయం కోరేవారు..ఎవరి పని ఎంతవరకు ఉంటుందో అంతవరకే వారి నడక సాగుతుంది..వచ్చి పోయేవారి కోసం ఆలోచనలను వృధా చేయడం వృధా..మోసపోయామని ఆవేశం వద్దు నాశనం చేస్తామని శపథాలు వద్దు..కష్టంలో చేయి పట్టినవారు..కన్నీళ్లలో ధైర్యం చెప్పినవారు,ప్రతిఫలం ఆశించకుండా మంచి చేసినవారు మాత్రం మరచిపోకుండా ఉంటారు..ఋణం డబ్బుతో తీర్చవచ్చు,మనసుతో చేసిన సాయం జీవితాంతం గుండెల్లో నిలుస్తుంది..అడగకుండా ఇచ్చిన ధైర్యం..కాలం గడిచినా వాడిపోదు..నమ్మకాన్ని వాడుకుని మోసం చేసేవారు అవసరం తీరాక దూరమయ్యేవారు,మనసు గాయపరిచేవారు ఎదురైనా..కోపం అవసరం లేదు..కర్మకి జ్ఞాపకం చాలా ఎక్కువ..కాలం మర్చిపోవచ్చు కర్మ మర్చిపోదు..చేసిన మంచికి రెట్టింపు మేలు చేసి కర్మ తిరిగి ఇస్తుంది..చేసిన కీడుకి రెట్టింపు కీడు చేసి కర్మ తిరిగి ఇస్తుంది..ఎవరి వెనకా పడకుండా,ఎవరి పతనం కోసం ఎదురుచూడకుండా దారి తానే చూసుకుంటుంది..మంచి చేసినవారిని గుండెల్లో పెట్టుకుంటుంది కీడు చేసినవారిని కర్మకి వదిలేస్తుంది..ప్రతీకారం మీద నమ్మకం వద్దు..కర్మ మీద నమ్మకం ఉంటే చాలు..కర్మ ఇచ్చే తీర్పు చాలా భయంకరమైనది...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

43)ఇది మగవాడికి అంకితం..మగవాడంటే భరించే యంత్రం కాదు బాధపడే గుండె కలిగిన మనిషి..ఏడవకు అనే ఒక్క మాటతో చిన్నప్పటి నుంచే కన్నీటికి తాళం వేశారు..కారని కన్నీరు గుండెల్లో సుడిగుండంగా మారిపోయింది..నవ్వు ముసుగులో రాత్రంతా తనతోనే యుద్ధం చేస్తాడు..కుటుంబం అనే పదానికి మగవాడు తన కలను తాకట్టు పెట్టేస్తాడు..పిల్లల కలలు తల్లిదండ్రుల బాగోగులు,సహచరి భద్రత అన్నీ మగవాడి భుజం మీదే ఊగుతాయి..సమాజం మగవాడి మౌనాన్ని బలం అంటుంది అరిచినా వినదు..వయసు పెరిగేకొద్దీ మగవాడి మాట చచ్చిపోతుంది ఒంటరితనం పెరుగుతుంది..బలం అంటే రాయిలా ఉండడం కాదు విరిగిపోయాను అని ఒప్పుకోగలగడం..ఒక్క ప్రశ్న చాలు నువ్వు నిజంగా ఎలా ఉన్నావు అని అడిగే గుండె చాలు..సలహాలు వద్దు తీర్పులు వద్దు మౌనంగా పక్కన కూర్చునే చేయి చాలు...మగవాడి గుండెకు కూడా స్పర్శ కావాలి..వినే చెవి దొరికితే విరిగిన వాడు మళ్లీ సింహంలా లేస్తాడు..మగవాడు బ్రతకాలంటే మాట వినేవారు కావాలి...ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

44)ఇది రోజంతా అందరికీ ఇచ్చి తనకు మిగిలేది ఏమీ లేని ఆడవాళ్ళకి అంకితం..పొద్దుపొడిచే లోపు లేచి అందరి ఆకలి తీర్చే ఆమె ఆకలి గురించి ఎవరూ అడగరు..నొప్పి వచ్చినా ఇది సాధారణం అని నవ్వేసి పని చేసేస్తూ ఉంటుంది..తన కలలు ఎప్పుడో తలుపు వెనక వదిలేసి ఇంటి కలను మోస్తూ బతుకుతుంది..అందరి సంతోషం ఆమె సంతోషంగా మారిపోయింది అందరి కన్నీరు ఆమె ఒడిలో ఆరిపోతుంది..సమాజం ఆమెను అమ్మ అంటుంది అలసిపోయాను అంటే మాత్రం అది నీ బాధ్యత కదా అంటుంది..వయసు పెరిగేకొద్దీ ఆమె కోరికలు చచ్చిపోతాయి కోపం కూడా కన్నీరుగా మారిపోతుంది..బలం అంటే అన్నీ ఒంటరిగా మోయడం కాదు మోయలేను అని చెప్పగలగడం..ఒక్క క్షణం చాలు ఆమె కళ్లలోకి చూసి నిజంగా బాగున్నావా అని అడిగే మనసు చాలు..సలహాలు వద్దు సానుభూతి వద్దు మౌనంగా చేయి పట్టుకునే మనిషి చాలు..ఆమె రాయి కాదు మాంసం రక్తం ఉన్న గుండె..ఆమెను దేవత అని దూరం పెట్టకండి మనిషిగా దగ్గరకు తీయండి..వినే చెవి దొరికితే ఆమె చీలిన గుండె మళ్లీ తామరలా విచ్చుకుంటుంది..ఒక్క మాట చాలు..ఒక్క అర్థం చాలు..ఆమె బతుకు మళ్లీ పండగ అవుతుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

45)నీ దగ్గరకు సలహా కోసమో,సహాయం కోసమో వచ్చేవాళ్లు...వారి సమస్య తీరిన తర్వాత నిన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కనీసం కృతజ్ఞత కూడా చెప్పకపోవచ్చు..దానికి బాధపడకు.
ఎందుకంటే మనం కూడా జీవితంలో మనకు దారి చూపిన ప్రతి గురువుని,కష్టంలో అండగా నిలిచిన ప్రతి మనిషిని, మన జీవితాన్ని సులభం చేసిన ప్రతి చేతిని తిరిగి వెతికి వెళ్లి ధన్యవాదాలు చెప్పడం జరగదు.అది వారి తప్పు కాదు..అది మనుషుల స్వభావం..అవసరం ఉన్నప్పుడు అందరికీ తోడు కావడం గొప్ప విషయం..కానీ అవసరం తీరిన తర్వాత కూడా గుర్తుండిపోవాలని ఆశించడం బాధకు కారణం.సహాయం చేసినందుకు గుర్తింపు రాకపోయినా బాధపడకు...ఎందుకంటే నీ మంచితనం వాళ్ల జ్ఞాపకాలలో లేకపోయినా,నీ మనసాక్షి ముందు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది.అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చే మనిషిగా కాకుండా...ఆపదలో అండగా నిలిచిన మనిషిగా మిగిలిపోవడం జీవితంలో అతిపెద్ద గౌరవం.మంచి చేయి..మర్చిపో.సహాయం పొందినవారు మర్చిపోయినా,చేసిన మంచిని కాలం ఎప్పటికీ మర్చిపోదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

46)నీ వల్ల ఎవరి కన్నీరు ఆగిందో...వాళ్లు నిన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు.నీ వల్ల ఎవరి భారము తగ్గిందో...వాళ్లు నీ పేరును గుర్తు చేసుకోకపోవచ్చు..కానీ ఒక విషయం మాత్రం నిజం...నువ్వు చేసిన మేలు వారి జ్ఞాపకాలలో లేకపోయినా,వారి జీవిత కథలో ఒక అందమైన పేజీగా మిగిలిపోతుంది.గుర్తింపు కోసం కాదు..గుండె చెప్పినది చేయడానికి జీవించు.ఎందుకంటే మనిషి మరిచిపోవచ్చు...కానీ మంచితనం ఎప్పటికీ మాయమవదు.*ఇట్లు.. మీ.. ✍🏻 రఘురాం*

47)నువ్వు చేసిన మేలు ఎవరి జ్ఞాపకాలలో నిలవకపోవచ్చు...కానీ అది ఎవరి జీవితంలోనో ఒక వెలుగై మిగిలి ఉంటుంది.నువ్వు ఇచ్చిన చేయూతకు చప్పట్లు రాకపోవచ్చు..కానీ ఆ క్షణంలో విరిగిపోతున్న ఒక మనసుకు అది బలంగా మారి ఉండొచ్చు..ప్రతి మంచికి గుర్తింపు రావాలని లేదు...ప్రతి సహాయానికి కృతజ్ఞత దక్కాలని లేదు...అయినా మంచితనాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే పువ్వు తన పరిమళాన్ని ఎవరికి ఇచ్చానో లెక్క పెట్టదు...దీపం తన వెలుగుకు ఎవరు విలువిచ్చారో అడగదు...అలాగే నిజమైన మనసు చేసిన మంచికి ప్రతిఫలం ఆశించదు..జీవితంలో గొప్ప విజయాలు సాధించినవారిని కాలం గుర్తుంచుకోవచ్చు...కానీ విరిగిన హృదయానికి ధైర్యం చెప్పినవారిని భగవంతుడు గుర్తుంచు కుంటాడు.అందుకే....మంచి చేయి... మర్చిపో...ఎందుకంటే మనిషి మరచినా,మనసుతో చేసిన మేలు ఎప్పటికీ మరుగున పడదు.*ఇట్లు.. మీ.. ✍🏻 రఘురాం*

48)నీడ మారిందని బాధపడకు..వెలుగు దిశ మారిందని గుర్తించు..మనుషులు మారారని ఆశ్చర్యపడకు..వారి అవసరం మారిందని అర్థం చేసుకో..గౌరవం అడిగి పొందేది కాదు..గుర్తించి ఇచ్చేదే నిజమైన గౌరవం..మన విలువ తెలియని చోట నుండి నిశ్శబ్దంగా దూరమవడమే మన ఆత్మగౌరవానికి ఇచ్చే గొప్ప గౌరవం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

49)నీడ ఎప్పుడూ మనతోనే ఉంటుంది..కానీ వెలుగు మారితే దాని రూపం కూడా మారిపోతుంది..మనుషులు కూడా అంతే..అవసరం ఉన్నంతవరకే విలువ ఇస్తారు,అవకాశం మారగానే తీరు మార్చుకుంటారు..అందుకే గౌరవం లేని చోట గుర్తింపు కోసం ఎదురుచూడకు..నీ విలువ తెలియని వారి ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాలని తపించకు..ఎందుకంటే.. మన విలువను గుర్తించని చోట నిలబడటమే మనం చేసే పెద్ద తప్పు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

50)స్నేహం అంటే లాభం చూసే లెక్క కాదు నష్టంలోనూ నిలిచే నమ్మకం..నువ్వు ఏమీ లేకపోయినా నిన్ను తక్కువగా చూడనిదే నిజమైన తోడు..కన్నీరు వచ్చినప్పుడు భుజం ఇచ్చేది నవ్వు వచ్చినప్పుడు కలిసి పంచుకునేది స్నేహం..పొగడదు కానీ తప్పు చేస్తే గట్టిగా మందలించి దారి చూపిస్తుంది..ప్రపంచం అంతా దూరం అయినా ఒక్క అడుగు వెనక నిలిచే బలం స్నేహం..డబ్బు పోతే తిరిగి వస్తుంది కానీ మాట తప్పని మనసు దొరకడం వరం..వెయ్యి పరిచయాల కంటే ఒక్క నమ్మకమైన చేయి చాలు..గుండెలోతులకు గుండెలోతులతో అతుక్కుపోయే బంధం స్నేహం..స్నేహం అంటే పేరు కాదు ప్రాణం..ప్రాణం పోయే వరకు తోడుగా ఉండే వరం..అలాంటి స్నేహం దొరికితే గుండె తేలిక అయిపోతుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

51)ఇచ్చేది లేకపోతే పలకరింపు ఆగిపోతుంది మాటలు కూడా ఆగిపోతాయి..కలియుగ బంధాలు లెక్కలతో నడుస్తాయి లాభం లేకపోతే దూరం అయిపోతాయి..ఉన్నంత వరకు దగ్గరగా ఉంటారు అవసరం తీరగానే మౌనం పాటిస్తారు..పలకరింపు వెనక ఆప్యాయత ఉండదు అవసరం మాత్రమే కనిపిస్తుంది..నీ విలువ వాళ్లకు తెలియదు నీ నుండి వచ్చేది మాత్రమే లెక్క అవుతుంది..ఇచ్చే చేతిని గట్టిగా పట్టుకుంటారు తీసుకున్న తర్వాత ఆ చేయి వదిలేస్తారు..నువ్వు వాళ్లకు మనిషివి కాదు ఒక అవసరం ఒక లెక్కవు..కన్నీరు కారినా వాళ్ల కళ్లు తడవు వాళ్లు మాత్రం చలనం లేని రాయిలా ప్రవర్తిస్తారు..అర్థం చేసుకునే మనసు దొరికినా స్వార్థంతో వారు మారిపోతారు..మారిపోయిన మనసును నిలబెట్టడం కష్టం అవుతుంది..వాడుకున్న తర్వాత వదిలేసే వాళ్ల కోసం నువ్వు విరిగిపోవద్దు..నీ విలువ నీకు తెలిస్తే చాలు ఎవరి అవసరం నీకు అక్కరలేదు..*ఇచ్చేది ఆగితే వెళ్లిపోయేవాళ్లు నీవాళ్లు కారు..నిలబడేవాళ్లే నీ నీడ అవుతారు..ముసుగు తొలిగిన నిజం గుండెకు గుచ్చుకున్నా..నిజం తెలిస్తే గుండె తేలిక అయిపోతుంది*...._ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

52)ఈ కలికాలంలో ఎదుటోడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడో తెలుసా?? నువ్వు దరిద్రంలో ఉన్నానని చెప్పినప్పుడు..నువ్వు రాత్రంతా నిద్ర లేకుండా బాధపడుతున్నావని తెలిసినప్పుడు..నువ్వు నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయానని ఒప్పుకున్నప్పుడు..నువ్వు ఓడిపోయానని తలదించుకున్నప్పుడు వాడి కళ్లలో వెలుగు వస్తుంది..ఎందుకంటే నీ కష్టం చూసి బాధపడేవాళ్లు కొందరే నీ కష్టంతో తమ జీవితంతో పోల్చుకుని..గొప్పదని సంతోషపడేవాళ్ళే చాలా మంది..నీ కన్నీరు తుడిచేవాళ్లు చాలా అరుదు కానీ నీ కన్నీటి కథ వినడానికి గుంపులుగా వస్తారు..నీ ఓటమి వార్త గాలిలా పాకుతుంది కానీ నీ గెలుపు మాత్రం శత్రువు నోరు మూసిన తర్వాతే బయటకు వస్తుంది..అందుకే నీ బాధను అందరికీ చెప్పకు సగం మంది పట్టించుకోరు మిగతా సగం మంది లోపల పండగ చేసుకుంటారు..నీ గాయాలు నీవే ఆ గాయాలు తగ్గించడానికి ఆ మందు కూడా నీ దగ్గరే ఉంది..బలహీనత చూపించిన చోటే అవమానం మొదలవుతుంది..పడిన చోటే లేచి పోరాడేవాడే అసలైన వాడు..ప్రపంచానికి నీ నవ్వు మాత్రమే చూపించు కన్నీరు నీకే సొంతం..బాధను బజారున పెట్టకు మౌనంగా రగిలి అగ్నిలా లేచి అందరి కళ్లు తెరిపించు..నీ కన్నీరు చూసి నవ్వినోళ్లు నీ విజయం చూసి కాలి బూడిద అవుతారు....*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

53)ఒక తలుపు మూసుకుపోయిందని ఏడవకు..దేవుడు నీ కోసం తెరవబోయే తలుపు నువ్వు కోల్పోయిన దానికంటే గొప్పదై ఉంటుంది..ప్రతి ఓటమి నిన్ను ఆపడానికి రాదు నువ్వు ఇంకా ఎంత దూరం వెళ్లగలవో నిరూపించడానికి వస్తుంది..ప్రతి కన్నీటి బొట్టు బలహీనతకు గుర్తు కాదు రేపటి నవ్వుకు పునాది వేస్తుంది..జీవితం నీ దగ్గర నుండి ఏదో తీసుకుందని లెక్కపెట్టకు నీలో ఇంకా మిగిలి ఉన్న ధైర్యాన్ని గుర్తించు..పడిన ప్రతిసారీ నీ ఎముకలు బలపడతాయి లేచిన ప్రతిసారీ నీ నడక స్థిరపడుతుంది..చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత త్వరగా పుడుతుంది..నువ్వు కోల్పోయింది చిన్నదే కావచ్చు కానీ నీకు దక్కబోయేది చరిత్ర అవుతుంది..ఎవరూ చూడని నీ పోరాటం ఎవరూ ఊహించని విజయంగా మారుతుంది..కన్నీరు ఆగిపోయిన చోటే గెలుపు మొదలవు తుంది..ఆగిపోయేవాడు ఓడిపోతాడు కదిలేవాడే కథ రాస్తాడు..తలుపు మూసిందని బాధపడకు..నువ్వు తట్టే సరికి స్వర్గపు తలుపే తెరుచుకుంటుంది..నీ కన్నీరు ఎక్కడ ఆగిందో అక్కడే నీ కథ మొదలవుతుంది....*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

54)ఒకటి కోల్పోతేనే వేరే దానికి యొక్క విలువ అర్థమవుతుంది..ఎలాగంటే చీకటి రాకపోతే వెలుగు గొప్పతనం తెలియదు..కష్టం ఎదురుకాకపోతే మన బలం బయటపడదు..బాధ తాకకపోతే బంధాల నిజస్వరూపం కనిపించదు..జీవితం తీసుకెళ్లేది ఏదో ఒకటి కాదు,నేర్పేది ఎన్నో పాఠాలు..కోల్పోయిన దాని కోసం కన్నీరు పెట్టుకోవడం కన్నా..అది నేర్పిన పాఠంతో ముందుకు సాగడమే నిజమైన విజయం..ఎందుకంటే ప్రతి నష్టం వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉంటుంది,ప్రతి ముగింపు వెనుక ఒక కొత్త ఆరంభం ఎదురుచూస్తూ ఉంటుంది..పడిపోయిన చోటే ఆగిపోవద్దు..లేచి నిలబడిన క్షణమే నీ అసలు గెలుపు ప్రారంభమవుతుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

55)ఒక విషయం గుర్తుంచుకో...ఈ ప్రపంచంలో డబ్బుతో చాలా వాటిని కొనగలవు..సౌకర్యాలను కొనగలవు..గౌరవంలా కనిపించే గుర్తింపును కూడా సంపాదించగలవు..డబ్బు ఉంటే చాలా మంది నీ చుట్టూ చేరతారు..నీ మాటకు విలువ ఇస్తారు..ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అనేది కూడా జీవితంలోని ఒక నిజం..కానీ మరో నిజం ఏమిటంటే..డబ్బు నీ కోసం కన్నీరు కార్చే మనిషిని కొనలేదు..నీ బాధను తన బాధగా భావించే హృదయాన్ని సంపాదించలేదు..డబ్బు ఉన్నప్పుడు నీతో ఉండేవాళ్లు ఎందరో ఉంటారు..కానీ నువ్వు ఏమీ లేకపోయినా నీ పక్కనే నిలబడేవాళ్లే నీ అసలు సంపద..అందుకే డబ్బును తక్కువ అంచనా వేయకు..అది అవసరం..గౌరవించు..సంపాదించు..కానీ జీవితంలో అన్నిటికంటే గొప్పదిగా కూడా భావించకు..ఎందుకంటే డబ్బు మనిషిని నీ దగ్గరకు తీసుకురాగలదు..కానీ మనసును నీకు దగ్గర చేయలేదు..డబ్బు సౌకర్యాలను ఇవ్వగలదు..కానీ ఆప్యాయతను కాదు..డబ్బు ప్రపంచాన్ని ఆకర్షించగలదు..కానీ నిజమైన అనుబంధాన్ని కాదు..చివరికి మనిషి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు గుర్తుండేది ఎంత సంపాదించాడో కాదు..ఎంతమంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడో అదే..ఎందుకంటే ధనం జీవితాన్ని నడిపిస్తుంది..కానీ మనుషులే జీవితానికి అర్థాన్ని ఇస్తారు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

56)కష్టాలకు కారణం ప్రపంచం కాదు..మన నిర్ణయాలే..బంధనాలకు కారణం కాలం కాదు..మన కర్మలే..విముక్తికి మార్గం ఇతరులు చూపగలరు..కానీ నడవాల్సిన బాధ్యత మాత్రం మనదే..మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది..బయటి వాళ్ల మీద నింద వేస్తే సమస్య తీరదు..మన ఆలోచన మారితే దారి తెరుచు కుంటుంది..పడిన ప్రతి దెబ్బకు బయటి కారణాలు వెతికితే కాలం వృథా..లోపల మార్పు తెచ్చుకుంటే కష్టం కూడా గుణపాఠం అవుతుంది..ఎవరో వచ్చి బ్రతుకు బాగు చేయరు..మార్గం చూపిస్తారు కానీ నడక మనదే..మనం కదలకుండా కాలం కదలదు..మనం మారకుండా పరిస్థితులు మారవు..విముక్తి అనేది దొరికేదికాదు..సాధించేది..కారణం వెతకడం ఆపి కర్తవ్యం మొదలుపెట్టిన రోజు..జీవితం గెలిచిన రోజు అవుతుంది..మార్గం చూపేవాళ్లు ఎందరో ఉంటారు..కానీ నడిచి గెలిచేది మాత్రం నువ్వే..లేచి నడువు..నీ బాధ్యత నీ భుజాల మీదే ఉంది...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

57)జీవితంలో మనం ఎదుర్కొనే చాలా సమస్యలకు కారణం పరిస్థితులు కాదు..మన స్పందన..ప్రపంచం ఎలా ఉందో మన చేతుల్లో ఉండదు..కానీ దాన్ని ఎలా స్వీకరించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది..వాన పడితే నేల బురదగా మారుతుంది..అదే వానలో విత్తనం మొక్కగా మారుతుంది..తేడా పరిస్థితుల్లో కాదు..స్వభావంలో ఉంటుంది..అందుకే కష్టాలు వచ్చినప్పుడు వాటిని శాపంగా చూడకు..నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశంగా చూడు..ఎందుకంటే జీవితాన్ని మార్చేది కాలం కాదు..కాలాన్ని ఉపయోగించుకునే మన ఆలోచనే..నిన్ను నువ్వు గెలిచిన రోజు ప్రపంచాన్ని గెలవడం మొదలవుతుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

58)జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి అదృష్టాన్ని నిందించడం సులభం..కానీ బాధ్యత తీసుకోవడం కష్టం..విజయం వచ్చినప్పుడు అది మన కష్టం అంటాం..అపజయం వచ్చినప్పుడు పరిస్థితులను కారణం చేస్తాం..కానీ నిజం ఏమిటంటే..మన నిర్ణయాల ఫలితమే మన జీవితం..ఎవరో వచ్చి మన భవిష్యత్తును నిర్మించరు..మన బదులు ఎవరూ పోరాడరు..మన బదులు ఎవరూ గెలవరు..అందుకే తప్పులను దాచిపెట్టడం కాదు..వాటినుంచి నేర్చుకోవడం మొదలుపెట్టు..ఎందుకంటే బాధ్యతను స్వీకరించిన మనిషిని ఓటమి కూడా ఎక్కువకాలం ఆపలేడు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

59)ప్రపంచం మారాలని కోరుకునేవాళ్లు ఎందరో ఉంటారు..కానీ తాము మారడానికి సిద్ధపడేవాళ్లు చాలా తక్కువ..మన ఆలోచనలు మారకపోతే పరిస్థితులు మారినా ప్రయోజనం ఉండదు..స్థలం మారితే జీవితం మారదు..మనసు మారితే జీవితం మారుతుంది..చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపం వెలిగించడం గొప్పది..అలాగే సమస్యలను లెక్కపెట్టడం కంటే పరిష్కారం కోసం అడుగు వేయడం గొప్పది..మార్పు బయట నుంచి రాదు..లోపల మొదలవుతుంది..నిన్నటి నువ్వు కంటే ఈరోజు నువ్వు మెరుగ్గా ఉంటే అదే నిజమైన విజయం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

60)ఫలితం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేస్తే ప్రయాణమే మొదలుకాదు..గెలుస్తానో ఓడిపోతానో అనే భయం అడుగులను ఆపేస్తుంది..కానీ కర్తవ్యాన్ని నమ్మినవాడు ఫలితాన్ని చూసి ఆగడు..ఎందుకంటే విత్తనం నాటిన రోజే చెట్టు నీడ దొరకదు..ఓపిక కావాలి..ప్రయత్నం కావాలి..నమ్మకం కావాలి..జీవితం కూడా అంతే..ఈరోజు చేసే కష్టం రేపటి ఫలితంగా తిరిగి వస్తుంది..అందుకే ఫలితం గురించి ఆందోళన పడకు..నీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించు..ఎందుకంటే గమ్యాన్ని చేరేది వేగంగా పరుగెత్తినవాడు కాదు..ఆగకుండా నడిచినవాడే..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

61)జీవితంలో మనుషులు *మూడు రకాలుగా* ఎదురవుతారు..*కొంతమంది ఆకుల్లా ఉంటారు*..అవసరం ఉన్నంత వరకు నీతో ఉంటారు..కాలం మారగానే రాలిపోతారు..*మరికొందరు కొమ్మల్లా ఉంటారు*..నీకు కొంత దూరం వరకు అండగా నిలబడతారు..కానీ కష్టాల భారం పెరిగినప్పుడు విరిగిపోతారు..*ఇంకొందరు వేరుల్లా ఉంటారు*..వాళ్లు కనిపించకపోయినా నీ బలానికి కారణమవుతారు..నీ విజయాన్ని చూసి హృదయపూర్వకంగా సంతోషిస్తారు..నీ కష్టాల్లో నీకు ధైర్యంగా నిలబడతారు..*ప్రపంచం మొత్తం నిన్ను వదిలినా..వాళ్లు మాత్రం నీ పక్కనే ఉంటారు*..అలాంటి మనుషులే జీవితంలో నిజమైన వరం...ఎందుకంటే ఆకులు చప్పట్లు కొడతాయి..కొమ్మలు నీడ ఇస్తాయి..కానీ జీవితాన్ని నిలబెట్టేది వేరులే..అందుకే నీ జీవితంలో నిశ్శబ్దంగా నీకు బలం ఇచ్చే వారిని గుర్తించు..వారిని గౌరవించు..ప్రేమించు..ఎందుకంటే తుఫాన్లను తట్టుకుని నిలబడే చెట్టుకు బలం ఇచ్చేది కనిపించని వేరులే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

62)జీవితంలో ప్రతి ఒక్కరూ నీతో చివరి వరకు ప్రయాణించరు..కొంతమంది కాలంతో పాటు మారిపోతారు..మరికొందరు పరిస్థితులకు తలవంచి దూరమైపోతారు..కానీ కొందరు మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా నీకు అండగా నిలుస్తారు..వాళ్లు ఎప్పుడూ ముందుకు వచ్చి తమ గురించి చెప్పుకోరు..కనిపించకపోయినా నీ బలానికి కారణమవుతారు..నీ విజయాన్ని చూసి హృదయపూర్వకంగా సంతోషిస్తారు..నీ కష్టాల్లో నీకు ధైర్యంగా నిలబడతారు..అలాంటి మనుషులే జీవితంలో నిజమైన వరం..ఎందుకంటే ఆకులు చప్పట్లు కొడతాయి..కొమ్మలు నీడ ఇస్తాయి..కానీ జీవితాన్ని నిలబెట్టేది వేరులే..అందుకే నీ జీవితంలో నిశ్శబ్దంగా నీకు బలం ఇచ్చే వారిని గుర్తించు..వారిని గౌరవించు..ప్రేమించు..ఎందుకంటే తుఫాన్లను తట్టుకుని నిలబడే ప్రతి చెట్టుకు బలం ఇచ్చేది కనిపించని వేరులే..మనిషి జీవితానికీ అదే నిజం....*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

63)మాట్లాడి సరిచేయలేని విషయం..ఈ లోకంలో ఏదీ లేదు..మాట్లాడి మార్చలేని మనుషులు ఈ లోకంలోనే లేరని అర్థం చేసుకుంటే చాలు..ప్రతి గొడవకు మూలం అర్థం కాని మాటలే..ప్రతి బంధం తెగిపోయేది మాట్లాడక పోవడం వల్లనే..మనసులో మాట బయటకు వస్తే బాధ సగం తగ్గిపోతుంది..మౌనంగా ఉండిపోతే బంధం మొత్తం చచ్చిపోతుంది..కోపంలో మాట్లాడితే గాయం..ప్రేమతో మాట్లాడితే మందు..వాదనతో మాట్లాడితే శత్రువు..వివరణతో మాట్లాడితే స్నేహితుడు అవుతాడు..మార్పు రావాలంటే ముందు మాట రావాలి..మాట రాకపోతే మనిషి దూరం అవుతాడు..ఈ లోకంలో ఎంత కఠినమైన గుండె అయినా నిజమైన మాటకు కరిగిపోతుంది..ఎంత దూరమైన బంధమైనా ఒక మంచి మాటతో దగ్గర  అవుతుంది..మాట్లాడు..మాట్లాడకపోవడం వల్ల పోయిన బంధాలు కోకొల్లలు..మాట్లాడడం వల్ల బతికిన జీవితాలు లెక్కలేనన్ని..మాటే మందు..మాటే మరణం..నీ నిర్ణయం ఏంటి....ఇట్లు..మీ..✍🏻 రఘురాం

64)జీవితం చాలా విచిత్రమైనది...తప్పు చేసే సమయంలో ఏది మంచిదో మనకు అర్థం కానివ్వదు.అది అర్థమయ్యే సమయానికి,చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం చాలాసార్లు ఉండదు.మనం పొరపాటు చేస్తున్నప్పుడు బుద్ధి నిద్రపోతుంది...మనసు మంచి మాట వినదు...పాఠం నేర్చుకున్న తర్వాతే కళ్లు తెరుచుకుంటాయి.జీవితం పరీక్ష పెట్టే ముందు పాఠం చెప్పదు...పరీక్ష పూర్తయ్యాకే ఫలితాలను చూపిస్తుంది..అవసరమైన సమయంలో తెలివి రాదు...అవసరం దాటిపోయాక జ్ఞానం వస్తుంది.చేసిన తప్పు ఊబిలాంటిది..తెలియక దానిలో పడిపోతాం..తెలిసిన తర్వాత కూడా దాని నుంచి బయటపడటం అంత సులభం కాదు.పడిపోయిన తర్వాత మాత్రం వేల సలహాలు గుర్తొస్తాయి..కానీ ఒక సరైన ఆలోచన ముందే వచ్చి ఉంటే,ఆ పరిస్థితి వచ్చేది కాదు. జీవితం మన సమయాన్ని వృథా చేయదు..మనమే ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలతో విలువైన సమయాన్ని,అవకాశాలను కోల్పోతాం.తప్పు చేసేటప్పుడు మంచి విలువ తెలియదు...మంచి విలువ తెలిసే సమయానికి తప్పును సరిదిద్దుకునే అవకాశం దూరమై ఉండొచ్చు.అదే జీవితం ఆడే కఠినమైన ఆట.ఆ ఆటలో ఓడిపోకుండా ఉండాలంటే...తొందరపడి నిర్ణయాలు తీసుకోకు..ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు..పర్యవసానాలను అంచనా వేయి...ఆ తర్వాతే అడుగు వేయి...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*

65)మన జీవితం ఎప్పుడూ బయట పరిస్థితుల వల్ల కాదు... మన ఆలోచనలు,మన నిర్ణయాలు,మన చేతల వల్లే రూపుదిద్దుకుంటుంది.*ఇట్లు..మీ..✍🏻రఘురాం*

66)డబ్బులుంటే... దేవుడి దర్శనం కూడా త్వరగా దొరుకుతుంది...అలాంటి ఈ ప్రపంచంలో...మనిషి విలువ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఈరోజు...నువ్వు ఎంత మంచివాడివో కాదు..నీ జేబులో ఎంత డబ్బుందో అదే నీ విలువను నిర్ణయించే కాలం ఇది..పుట్టిన రోజు ఆసుపత్రి బిల్లు నుంచి...చివరి ప్రయాణంలో చితికి చేరే కట్టెల వరకు...ప్రతి అడుగూ డబ్బుతోనే మొదలై..డబ్బుతోనే ముగుస్తోంది.బతికున్నప్పుడు ప్రేమ కూడా లెక్కలతో వస్తోంది..గౌరవం కూడా స్థాయిని చూసి వస్తోంది..బంధాలు కూడా అవసరాన్ని బట్టి నిలుస్తున్నాయి.చేతిలో డబ్బు ఉన్నంతవరకే...ఫోన్‌లు మోగుతాయి...ఇంటికి మనుషులు వస్తారు..మాటల్లో ఆప్యాయత కనిపిస్తుంది..అదే డబ్బు తగ్గిపోయిన రోజు..మన విలువ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది..అప్పుడు అర్థమవుతుంది..మనల్ని ప్రేమించింది మనసు కాదు..మన దగ్గర ఉన్న పరిస్థితులని అని.*అందుకే...డబ్బు సంపాదించు*..ఎందుకంటే ఈ ప్రపంచంలో అది అవసరం..కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో..డబ్బు లేకపోవడం దురదృష్టం కాదు...డబ్బు కోసం మనిషితనాన్ని కోల్పోవడమే అసలైన దురదృష్టం..*ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

67)నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలి అన్నా...నాలుగు గంటలు మనం ప్రశాంతం గా పడుకోవాలి అన్నా..నచ్చిన మనిషి మన పక్కన ఉండాలి అన్నా..మన దగ్గర ఉండాల్సింది డబ్బు...పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే...ఐనవాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే..కట్నం డబ్బులు తేని భార్యని బానిసగా చూస్తాడు భర్త..ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకువగా చూస్తుంది బార్య..డబ్బులు కూడబెట్టడం చేతకాని తండ్రిని అసమార్థులుగా చూస్తారు బిడ్డలు..సంపాదించడం చేతకాని బిడ్డలని చేతకాని వాళ్ళకింద చూస్తాడు తండ్రి...డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్దపడు తుంది.అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబన్ని, ఐనవాళ్ళని వదిలి రాష్టాలు దేశాలు దాటి వెళ్తాడు..ఆస్తి పంపకాలలో తేడా ఉంది అని తోడబుట్టిన వారితో సంవత్సరాలు మాట్లాడుకొని అన్నదమ్ములు..పంపకాలలో అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కా చెల్లెళ్ళు..అందుకే డబ్బుని గౌరవించండి..పోయేటప్పుడు ఏంపట్టుకొని పోకపోయినా..మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి.డబ్బుకి లోకం దాసోహం.పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు మరీ...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

68)✨ కర్మ ఎప్పుడూ మౌనంగా పని చేస్తుంది...కంగారు పడకు...ఇది కలియుగం..నువ్వు సహాయం చేసినవారే...నీ మీద నిందలు వేయొచ్చు..కానీ...నీ మంచితనం వృథా కాదు..మనుషులు మర్చిపోయినా...దైవం ఎప్పటికీ మర్చిపోదు.
🙏 మంచి చేస్తూ ముందుకు సాగు.🙏

69)ఒక మనిషి దగ్గర లాభం లేదని తెలిసిన క్షణం నుంచి,అతని చుట్టూ తిరిగిన అడుగులు దూరంగా వెళ్లడం మొదలుపెడతాయి,ఎందుకంటే ఈ లోకంలో చాలా బంధాలు మనిషిని కాదు,అతని వల్ల వచ్చే ఉపయోగాన్ని మాత్రమే ప్రేమిస్తాయి,అవసరం ఉన్నంతవరకు అన్నీ దగ్గర,అవసరం తీరగానే అన్నీ దూరం,ఇచ్చే చేయి ఉంటే వేల మంది పలకరిస్తారు,తీసుకునే చేయి అయితే ఎవరూ కనిపించరు,అవసరం ముగిసిన చోట అనుబంధం కూడా ముగిసిపోతుంది,మిగిలేది మనుషులు కాదు,మనిషి విలువ ఎంత అనే పాఠం మాత్రమే,ఆ పాఠం నేర్పేది నష్టమే అయినా,బతకడం నేర్పేది కూడా అదే,గుర్తుంచుకో,నీ విలువ నీ వ్యక్తిత్వంతో కాదు,నీ దగ్గర ఏముందో దానితో కొలుస్తారు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

70)జీవితం ప్రశాంతంగా ఉండాలంటే..ఎదురు చూడని ఇంటి గుమ్మం ఎక్కొద్దు..నిర్లక్ష్యం చేసే మనుషుల ముందు నీ విలువను నిరూపించుకోవద్దు..పట్టించుకోని వారి కోసం నీ సమయాన్ని, నీ మనసును వృథా చేయొద్దు..మర్యాద లేని చోట నీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవద్దు..ప్రేమ లేని చోట అనురాగం కోసం ఎదురు చూడొద్దు..నిందించే వారితో వాదించి నీ నిజాయితీని నిరూపించుకోవాలని ప్రయత్నించొద్దు..ఎందుకంటే...బలవంతంగా పొందిన గౌరవం..గౌరవం కాదు..అడిగి తెచ్చుకున్న ప్రేమ..ప్రేమ కాదు..వేడుకొని నిలబెట్టుకున్న బంధం..బంధం కాదు..నిన్ను కోరుకునే చోటే నీ అడుగులు వేయి..నిన్ను గౌరవించే వారికే నీ సమయాన్ని ఇవ్వు..నిన్ను అర్థం చేసుకునే మనుషులనే నీ జీవితంలో ఉంచుకో..ప్రశాంతమైన జీవితం అంటే..అందరినీ సంతోషపెట్టడం కాదు..నీ మనశ్శాంతిని పోగొట్టే వారిని,పరిస్థితులను వదిలి ముందుకు నడవడం.ఎందుకంటే..నీ మనశ్శాంతి కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

71)నువ్వు ఎవరితో తిరుగుతున్నావో ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావో దాని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..నీ చుట్టూ ఉండే ఐదుగురి సగటుగానే నువ్వు ఉంటావు..మంచి మనుషులతో ఉంటే మనసు ఎదుగుతుంది..చెడు దారిలో నడిచే వారితో ఉంటే బ్రతుకు దిగజారుతుంది..నీతో ఎక్కువగా మాట్లాడే వారి మాటలే నీ మనసులో నిలిచిపోతాయి..వారు ఏమి ఆలోచిస్తారో నువ్వు కూడా అదే ఆలోచించడం మొదలు పెడతావు..గెలిచే వారితో స్నేహం చేస్తే నువ్వు కూడా గెలవాలని అనుకుంటావు..సాకులు చెప్పే వారితో ఉంటే నువ్వు కూడా ఆగిపోతావు..స్నేహం అంటే కాలక్షేపం కాదు..దారి చూపించే దీపం..మంచి మనుషులు నిన్ను పైకి తీసుకెళ్తారు..చెడు మనుషులు నిన్ను కిందకు లాగేస్తారు..నీతో ఉండే స్నేహితులే నీ ఎదుగుదలను నిర్ణయిస్తారు..నీతో ఉండే సమూహమే నీ స్థాయిని నిర్ణయిస్తుంది..ఈరోజు నువ్వు ఎవరితో కూర్చుంటున్నావో రేపు నువ్వు ఎక్కడ కూర్చుంటావో అది చెబుతుంది..మంచిని కలుపుకో..చెడును వదిలేయ్..ఏందుకంటే మంచి గుంపు నిన్ను పైకి తీసుకెళ్తుంది..చెడు గుంపు నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది..ఎవరితో ఉంటే ఏమవుతావో ఆలోచించుకో..నీ జీవితపు చక్రం నీ చేతిలోనే ఉంది..ఎంపిక నీదే..ఎదుగుదల నీదే..విజయం నీదే...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

72)చీకటిని తిట్టి కూర్చుంటే వెలుగు రాదు..వెలుగు కావాలంటే చీకట్లోకి దిగాల్సిందే..చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్లాలి..అక్కడ భయపడితే నువ్వు కూడా చీకటివైపోతావు..నిలబడితే నీలోని దీపం రగులుకుంటుంది..సమస్యల్లోకి దూకనిదే పరిష్కారం దొరకదు..బాధలోకి వెళ్లనిదే ఆనందపు విలువ తెలియదు..కష్టం లేకుండా సుఖం ఉండదు..ఓటమి రుచి చూడనిదే విజయపు మాధుర్యం అర్థం కాదు..జనం ఏమనుకుంటారో అని ఆగిపోకు..నీ యుద్ధం నీదే..నీ వెలుగు నీదే..చీకటి ఎంత గట్టిదైనా ఒక్క దీపం చాలు..నువ్వే ఆ దీపానివి కా..భయాన్ని వదిలి చీకట్లోకి వెళ్లు..అక్కడే నీ విజయం రాసి ఉంది..నీ కథ నీ చేతిలోనే ఉంది..లే..వెలిగించు..గెలుచు...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

73)రెక్కలు వచ్చిన పక్షి ఇంకా గూడులోనే మనతోనే ఉండాలంటే ఎలా..ఎగరడం వచ్చిందంటే దాని మానాన అది విహరిస్తుంది..జీవితంలో కూడా అంతే..ఎదిగిన సింహాన్ని సంకెళ్లతో కట్టలేం..ఎగరడం తెలిసిన డేగను అరచేతిలో దాచలేం..ఎందుకంటే ఆకాశం పిలిచిన తర్వాత గూడు కనిపించదు..కలలు కళ్లు తెరిచిన తర్వాత నిద్ర పట్టదు..గమ్యం దగ్గరైందని తెలిశాక అడుగులు ఆగవు..అలాగే మనిషి కూడా..తన రెక్కల బలం తెలిసిన క్షణం..తన దారి కనిపించిన క్షణం..ఆగరు తిరగరు..ఎందుకంటే అది స్వార్థం కాదు..అది బతుకు పిలుపు..అది విధి రాత..అయితే ఎగిరే ప్రతి రెక్కల చప్పుడులోనూ కృతజ్ఞత ఉండాలి..ఎందుకంటే ఆ రెక్కలు ఇచ్చింది గూడు కట్టిన చేతులే..ఆ ఎత్తు చూపించింది ఆ గుండెలే..అందుకే బంధం పేరుతో బంధించకూడదు..ప్రేమ పేరుతో పంజరం చేయకూడదు..వదిలేయాలి..నమ్మాలి..ఆశీర్వదించి ఆకాశానికి పంపాలి..ఎందుకంటే ఋణం ఉన్న పక్షి ఎంత దూరం వెళ్లినా..ఎంత ఎత్తుకు ఎగిరినా..తన మొదటి గూటిని..తన మూలాలను..తనను మనిషిని చేసిన చేతుల్ని మర్చిపోదు..కానీ ఆ చేతుల కోసం తన ఆకాశాన్ని మాత్రం సమాధి చేయదు..ఎందుకంటే ఎగిరి గెలిచి..ఆ గూటికి పేరు తేవడమే అసలైన కృతజ్ఞత..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

74)అబద్ధం పాటలా పలుకుతుంది..వినే చెవికి తేనెలా తగులుతుంది..నిజం ముల్లులా గుచ్చుతుంది..వినే గుండెకు వేదనలా మండుతుంది..కానీ తేనె తాత్కాలికపు మైకం ఇస్తుంది..ముల్లు శాశ్వతపు మేలు చేస్తుంది..మురిపించే అబద్ధం మనిషిని కుళ్లబెడుతుంది..బాధించే నిజం మనిషిని నిలబెడుతుంది..చెవికి ఇంపుగా ఉన్నదంతా మేలు కాదు..గుండెను చీల్చినా నిజం బతుకునిస్తుంది..ఓదార్చే అబద్ధం ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది..నిలదీసే నిజం ఆయువును పెంచుతుంది..పంచదార పూసిన విషం కన్నా చేదు మందే మేలు..అబద్ధపు మురిపం వద్దు..నిజం చేదైనా ముద్దు..నిలిచే నిజాన్నే ఎంచుకో..అదే నీ ఆరోగ్యం..అదే నీ ఎదుగుదల....*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

75)డబ్బు విలువ తెలియాలి అంటే ఒకసారి పోగొట్టుకుని చూడు,అప్పుడు ఒక్క రూపాయి ఎంత బాధ పెడుతుందో తెలుస్తుంది,నా అనుకునే వాళ్ల దగ్గర నీ విలువ ఏంటో తెలుసుకోవాలి అంటే,ఒకసారి అప్పు అడిగి చూడు,అప్పుడే వాళ్ల నిజస్వరూపం బయటపడుతుంది,ఇన్నాళ్లు నవ్వుతూ పలకరించిన గొంతు,డబ్బు అడిగేసరికి మాట మారుతుంది,ఇన్నాళ్లు భుజం మీద చేయి వేసిన చేయి,అవసరం వచ్చేసరికి దూరంగా జరుగుతుంది,ఎందుకంటే ఈ రోజుల్లో స్నేహం ఐనా,ప్రేమ ఐనా,గౌరవం ఐనా,బంధుత్వం ఐనా,అంతా డబ్బుతోనే కొలుస్తారు,నీ జేబు నిండుగా ఉంటే నువ్వు దేవుడివి,ఖాళీ అయితే నువ్వు ఎవడివో కూడా గుర్తుండదు,అందుకే మనుషుల్ని కాదు,మనిషి దగ్గర ఉన్న దాన్ని నమ్ము...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

76)తీసుకోవడం గొప్ప కాదు..తిరిగి ఇవ్వడం గొప్ప.తీసుకోవడానికి ముందుండే వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు..కానీ తీసుకున్న దాన్ని బాధ్యతగా,కృతజ్ఞతతో తిరిగి ఇచ్చే వాళ్లు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే.తిరిగి ఇవ్వడం అనేది ఒక లావాదేవీ కాదు..అది మనిషి సంస్కారానికి అద్దం.ఒక వ్యక్తి అసలు స్వభావం..అతను ధన వ్యవహారాల్లో ఎలా ప్రవర్తిస్తాడో దానిని బట్టే తెలుస్తుంది.తీసుకున్నది సమయానికి తిరిగి ఇవ్వడం..అవసరంలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయడం..డబ్బు కోసం బంధాలను అమ్ముకోకుండా విలువలను కాపాడుకోవడం..ఇవే ఒక మనిషి గొప్పతనాన్ని నిరూపించే నిజమైన లక్షణాలు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

77)ఈ కలియుగంలో గొప్పవాడిగా నిలవడానికి కొండంత ఆస్తులు అవసరం లేదు..చిన్న మనసు కాకుండా పెద్ద మనసు ఉంటే చాలు.నిజాయితీగా ఉండటం..ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం..తీసుకున్నది తిరిగి ఇవ్వడం..ఇవే ఈ రోజుల్లో అత్యంత అరుదైన గొప్ప గుణాలు.కొంతమంది మన జీవితంలో డబ్బు కారణంగా దూరమవుతారు.అలా దూరమైతే బాధపడాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాల్లో అలాంటి వారిని కొంత డబ్బు ఇచ్చైనా జీవితంలో నుంచి దూరం చేయడం మంచిదే.ఎందుకంటే డబ్బు కోసం బంధాలను,నమ్మకాన్ని వదిలేసే వ్యక్తులు..మనతో ఉన్నా ప్రయోజనం ఉండదు..ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

78)చిల్లులున్న పాత్రలో ఎంత నీళ్లు పోసినా..అవి నిలవవు.అలాగే కృతజ్ఞత లేని మనుషులకు ఎంత మంచి చేసినా..చివరికి మిగిలేది మన బాధే.డబ్బు మనిషిని గొప్పవాడిని చేయదు..కానీ మనిషి అసలు రూపాన్ని మాత్రం బయటపెడుతుంది.సంపద మనిషి చేతిలో ఉండాలి..మనసులో కాదు.అందుకే సంపద కంటే సంస్కారం..డబ్బుకంటే నిజాయితీ..లాభం కంటే మనిషితనం గొప్పవి.నిజాయితీని కోల్పోకుండా..విలువలను వదులుకోకుండా జీవించే ప్రతి మనిషే..ఈ కాలంలో నిజమైన గొప్ప వ్యక్తి..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

79)చప్పట్లు కొట్టడానికి డబ్బు అవసరం లేదు...మెచ్చుకోవడానికి పదవి అవసరం లేదు...అభినందించడానికి ఆస్తి అవసరం లేదు...కావాల్సింది ఒక్క పెద్ద మనసు మాత్రమే...ఎదుటివాడు గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించగలిగితే...నీ గెలుపు కూడా దూరంలో ఉండదు...ఇతరుల విజయాన్ని భరించగలిగిన మనసే... తన విజయాన్ని నిలబెట్టుకోగలదు..*ఇట్లు.. మీ.. ✍🏻 రఘురాం*

80)నిజమే..అంతా మంచికే..కొన్ని దూరాలు..మనల్ని ఒంటరివాళ్లను చేయడానికి రావు..మనతో నడిచేది ఎవరో,మధ్యలో వదిలేసేది ఎవరో తెలియ జేయడానికి వస్తాయి.కొన్ని మోసాలు..మనిషిని ద్వేషించడంనేర్పవు..ఎవరిని ఎంతవరకు నమ్మాలో నేర్పుతాయి. కొన్ని నష్టాలు..మన దగ్గర ఉన్నదాన్ని లాక్కోవు..మనకు అవసరం లేని వారిని మన జీవితంలో నుంచి తీసుకెళ్తాయి.కాలం..శిక్షించదు..తీర్పు చెప్పదు..కేవలం ముసుగులు తొలగిస్తుంది.ముఖాలు మారవు..మనం చూసే దృష్టి మారుతుంది.అందుకే..జీవితంలో జరిగిన ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది..ఆ కారణం వెంటనే అర్థం కాకపోయినా,కాలం గడిచాక"ఇది జరగడం మంచిదే"అని ఒప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది.ఎందుకంటే..కాలం ఎప్పుడూ తప్పు చేయదు...మనుషుల అసలు విలువను,బంధాల అసలు రంగును,నమ్మకాల అసలు బరువును నిశ్శబ్దంగా బయటపెడుతుంది.కష్టం..మనల్ని విరగ్గొట్టడానికి రాదు..మన వాళ్లు ఎవరో,పరాయి వాళ్లు ఎవరో పరిచయం చేయడానికి వస్తుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

81)జీవితం మనం అనుకున్నట్టు నడవదు..జరిగే ప్రతి సంఘటన మన చేతుల్లో ఉండదు..కానీ దానికి మనం ఎలా స్పందిస్తామో అది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం సులభం..దానిలోని పాఠాన్ని గుర్తించి ముందుకు సాగడమే గొప్పతనం.కాలం ప్రతి ఒక్కరినీ ఏదో ఒక రోజు ఆపి ఆలోచింపజేస్తుంది..ఆ ఆలోచనే జీవితాన్ని మార్చే అసలు మలుపు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

82)డబ్బు సంపాదించడం కష్టమే..కానీ నమ్మకం సంపాదించడం అంతకంటే కష్టం.విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లు ఎందరో ఉంటారు..కానీ ఓటమిలో నీతో నిలబడేవాళ్లే నిజమైన మనుషులు.అవసరం తీరాక మారేది మనుషులు కాదు..వాళ్ల అసలు స్వభావమే బయటపడుతుంది.అందుకే ఆస్తి కంటే మనిషి విలువను..మాట కంటే నమ్మకాన్ని కాపాడుకోవడం జీవితంలో గొప్ప సంపద..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

83)జీవితంలో ప్రతి నష్టం శాపం కాదు..కొన్ని మూసుకుపోయిన తలుపులు తప్పు దారిలో వెళ్లకుండా దేవుడు వేసిన బ్రేకులు.ప్రతి గాయం మనల్ని బలహీనులను చేయదు..మరింత బలంగా నిలబడటం నేర్పిస్తుంది.ఒంటరితనం కూడా ఎప్పుడూ శిక్ష కాదు..తప్పు మనుషుల నుంచి జీవితానికి దొరికే ప్రశాంతమైన విశ్రాంతి.జరిగినదాన్ని మార్చలేం..కానీ దానివల్ల మనం మారే విధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

84)జీవితంలో గొప్ప పాఠాలు పుస్తకాల వల్ల కాదు..కష్టాలు,కాలం,అనుభవాలు నేర్పిస్తాయి.ప్రతి వైఫల్యం మనకు మనల్ని పరిచయం చేస్తుంది..ప్రతి చిన్న నిర్ణయం మన భవిష్యత్తును నిర్మిస్తుంది.వేగంగా పరిగెత్తేవాడు ముందుకు వెళ్లవచ్చు..కానీ సరైన దారిలో నడిచేవాడే గమ్యాన్ని చేరుకుంటాడు.అదృష్టం జీవితాన్ని మార్చదు..ప్రతిరోజూ సరైన ఆలోచనతో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మన జీవితాన్ని గొప్పదిగా మారుస్తాయి..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

85)జీవితం మనం అనుకున్నట్టు జరగదు..జరిగినదానికి మనం ఎలా స్పందిస్తామో అదే జీవితాన్ని నిర్ణయిస్తుంది.కాలం ఎవరినీ ఆపదు..కానీ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక రోజు ఆపి ఆలోచింప జేస్తుంది.జీవితంలో పెద్ద పాఠాలు..పెద్ద మనుషుల దగ్గర కాదు,పెద్ద కష్టాల దగ్గర నేర్చుకుంటాం.డబ్బు సంపాదించడం కష్టం..కానీ నమ్మకం సంపాదించడం ఇంకా కష్టం.కొన్ని తలుపులు మూసుకుపోవడం శాపం కాదు..తప్పు దారిలో వెళ్లకుండా జీవితం వేసే బ్రేక్..ప్రతి నవ్వు సంతోషానికి గుర్తు కాదు..చాలాసార్లు అది బాధను దాచే ముసుగు..ఎవరూ శాశ్వతంగా మనతో ఉండరు..కాబట్టి మనల్ని మనం కోల్పోవద్దు..జీవితం ఇచ్చే గాయాలు..మనల్ని బలహీనులను కాదు, బలమైన వారిని చేస్తాయి.గెలిచిన తర్వాత చప్పట్లు కొట్టేవాళ్లు చాలామంది ఉంటారు..ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్లే నిజమైన వాళ్లు.అనుభవం ఉచితంగా రాదు..దానికి కాలం, కన్నీళ్లు లేదా తప్పులు ధరగా చెల్లించాలి..జీవితం ఎవరినీ మోసం చేయదు..మన అంచనాలే మనల్ని ఎక్కువగా బాధిస్తాయి.వేగంగా నడిచేవాడు ముందుకు వెళ్లొచ్చు...సరైన దారిలో నడిచేవాడే గమ్యానికి చేరుకుంటాడు.మనిషి మారడు..అతని అసలు స్వభావాన్ని బయటకు తీసేది పరిస్థితులే.అవసరం తీరిన తర్వాత మారేది మనుషులు కాదు..వాళ్ల అసలు రూపం బయటపడుతుంది.జీవితంలో కోల్పోయిన ప్రతి దాని కోసం బాధపడకు..కొన్ని నష్టాలే పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతాయి.ఒంటరితనం శిక్ష కాదు..తప్పు మనుషుల నుంచి జీవితానికి దొరికే విశ్రాంతి..కాలం సమాధానం చెప్పదు..కానీ ప్రతి సందేహానికి ఒక రోజు జవాబు చూపిస్తుంది.జీవితం ఎవరికీ సులభం కాదు..తేడా ఒక్కటే కొంతమంది నవ్వుతూ మోస్తారు, ఇంకొందరు ఏడుస్తూ మోస్తారు..విజయం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది..వైఫల్యం మనకు మనల్ని పరిచయం చేస్తుంది.జీవితం మార్చేది అదృష్టం కాదు..ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

86)కొండపై నిలబడి సముద్రాన్ని చూడాలంటే..అలల మాట వినిపించదు.కానీ ఆ అలలతో పోరాడినవాడికే వాటి బలం తెలుస్తుంది.అలాగే..మన జీవితాన్ని చూసేవాళ్లకు మన నవ్వు మాత్రమే కనిపిస్తుంది..కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కన్నీళ్లు,ఆ చిరునవ్వు కోసం చేసిన పోరాటం,ఆ బాధను మోసిన మనసు మాత్రం మనకే తెలుసు.అందుకే ఎవరి జీవితాన్నీ బయటకు కనిపించిన దానితో అంచనా వేయొద్దు..ప్రతి మనిషి మౌనంలో ఒక కథ ఉంటుంది..ప్రతి చిరునవ్వు వెనుక ఒక పోరాటం ఉంటుంది..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

87)జీవితంలో నువ్వు ఒకడివి దాటిపోతే దాన్ని దాటడం అంటారు,కానీ నీ వెనక వచ్చే పందల మంది కాళ్లు ముళ్లు గుచ్చుకోకుండా దారి సుగమం చేస్తే దాన్ని ‘మహోన్నత విజయం’ అంటారు.సముద్రాన్ని దాటే శక్తి ఉన్నా,హనుమంతుడికి కూడా తన బలాన్ని గుర్తుచేసే జాంబవంతుడు కావాల్సి వచ్చింది.నీ బలం కేవలం నీ స్వార్థానికి పరిమితమైతే,అది ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టె ముక్క లాంటిదే..ఎదుటివారికి ఉపయోగపడేలా,మంచి వారికి అండగా నిలబడాలి.అని నువ్వు మారిన రోజే నీ బ్రతుక్కి ఒక అర్థం,పరమార్థం దక్కుతాయి...*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

88)జీవితం ఎంతకాలం బ్రతికామనేది కాదు..ఎంతమంది జీవితాల్లో మంచి జ్ఞాపకంగా మిగిలామనేదే అసలు విలువ.మన కోసం మాత్రమే బ్రతికితే... మన కథ మనతోనే ముగిసిపోతుంది.ఇతరుల కోసం ఒక మంచి పని చేస్తే... మనం లేకపోయినా మన పేరు బ్రతికే ఉంటుంది.సంపాదించిన ధనం కంటే..సంపాదించిన మనుషులే గొప్ప ఆస్తి.నీ ఉనికి వల్ల ఒక్కరి జీవితమైనా మారితే..అదే నీ జన్మకు సార్థకత..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*

89)దీపం తనకోసం వెలగదు..చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలడానికే వెలుగుతుంది.మనిషి కూడా అంతే...తన విజయాన్ని మాత్రమే చూసుకునేవాడు ఎదుగుతాడు.తనతో పాటు ఇంకొంత మందిని ఎదగనిచ్చేవాడు గొప్పవాడవుతాడు.మన చేతుల్లో ఉన్న శక్తి..మనకే పరిమితమైతే అది అహంకారం.ఇతరులకు ఉపయోగపడితే అది ఆశీర్వాదం..వెలుగు పంచిన దీపాన్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*

90)చెట్టు తన కోసం పండ్లు కాయదు..నది తన కోసం ప్రవహించదు..మేఘం తన కోసం వర్షించదు..ప్రకృతిలో ఉన్న ప్రతిదీ..ఇతరులకు ఉపయోగపడడానికే తన ఉనికిని చాటు కుంటుంది.మనిషి కూడా అదే నేర్చుకోవాలి.నీ జ్ఞానం,నీ అనుభవం,నీ స్థానం..నలుగురికి ఉపయోగ పడినప్పుడే వాటికి నిజమైన విలువ..స్వార్థం జీవితం గడిపిస్తుంది..సేవ జీవితం నిలిపిస్తుంది..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*

91)కాలం ఎవరినీ గుర్తుంచుకోదు..కానీ కాలాన్ని సార్థకం చేసిన వారిని చరిత్ర గుర్తుంచు కుంటుంది.ఎత్తుకు ఎదగడం గొప్ప కాదు..ఎదిగిన తర్వాత ఎంతమందిని పైకి లేపామనేదే గొప్పది.పదవి,డబ్బు,పేరు..కాలంతో కలిసి మాయమవుతాయి..కానీ మన వల్ల ఎవరి కళ్లలోనైనా వచ్చిన ఆనందం..జీవితాంతం నిలిచిపోతుంది.మనిషి గొప్పతనం అతను ఎంత సంపాదించాడో కాదు..ఎంతమందికి ఆశగా నిలిచాడో దానిలో ఉంటుంది..*ఇట్లు... మీ...✍🏻 రఘురాం*

92)మనిషి గొప్పతనం అతను ఎంత ఎత్తుకు ఎదిగాడో చెప్పదు..అతని వల్ల ఎంతమంది ఎదిగారో చెబుతుంది.నువ్వు ఒక్కడివే ముందుకు సాగితే..అది నీ ప్రయాణం. కానీ నీ వెనక నడిచే వారికి దారి చూపించి,వారు తడబడకుండా ముందుకు వెళ్లేలా చేస్తే..అదే నీ జీవితానికి నిజమైన విజయం.సముద్రాన్ని దాటే అపార శక్తి హనుమంతుడిలో ఉన్నా..ఆ శక్తిని గుర్తు చేసే జాంబవంతుడు అవసరమయ్యాడు..అంటే బలం ఉండటం గొప్ప కాదు..ఆ బలం సరైన సమయంలో,సరైన పనికి ఉపయోగపడటమే గొప్పది.నీ జ్ఞానం,నీ అనుభవం, నీ పదవి,నీ శక్తి..ఇవన్నీ నీకే పరిమితమైతే అవి కాలంతో కలిసి మాయమై పోతాయి..కానీ అవే మరొకరి జీవితాన్ని నిలబెట్టే ఆధారంగా మారితే..అవి శాశ్వతంగా నిలిచిపోతాయి.నీ వల్ల ఒకరి కళ్లలో ఆశ కనిపిస్తే..నీ వల్ల ఒకరి అడుగుల్లో ధైర్యం పెరిగితే..నీ వల్ల ఒకరి జీవితంలో వెలుగు నిండితే..అదే నీ ఉనికికి అసలైన విలువ.నీ కోసం జీవించడం సహజం..నలుగురి కోసం ఉపయోగపడడం సార్థకం.నువ్వు వెళ్లిన దారిని మాత్రమే కాదు..నీ తర్వాత వచ్చే వారి దారిని కూడా సులభం చేసిన రోజే,నీ జీవితానికి అర్థం..పరమార్థం రెండూ దక్కుతాయి..*ఇట్లు... మీ... ✍🏻 రఘురాం*

93)మనిషి వెళ్లిపోయిన తర్వాత అతని పేరు నిలబడేది..అతను కట్టుకున్న ఇల్లు వల్ల కాదు,అతను కట్టించిన జీవితాల వల్ల.ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు మాత్రమే...తమ అనుభవాన్ని నలుగురికి పాఠంగా మార్చి, తాము నడిచిన దారిని ఇతరులకు వెలుగుగా విడిచి పెడతారు.ఒక దీపం తన వెలుగును దాచుకోదు..పక్కనున్న మరో దీపాన్ని వెలిగించినా తన వెలుగు తగ్గదు.అలాగే జ్ఞానం,అనుభవం,అవకాశం కూడా పంచితే తగ్గవు..మరింత విలువ పెరుగుతుంది.శ్రీరాముడి మహిమను ప్రపంచానికి చాటింది హనుమంతుడి సేవ. హనుమంతుడి శక్తిని ప్రపంచానికి తెలియజేసింది జాంబవంతుడి ప్రేరణ.గొప్పతనం ఒక్కడిగా నిలవడంలో కాదు..మరొకరిని నిలబెట్టడంలో ఉంది.నీ వల్ల ఒకరు ధైర్యం పొందితే..నీ వల్ల ఒకరు తప్పు దారి నుంచి తిరిగివస్తే..నీ వల్ల ఒకరు జీవితంలో ముందడుగు వేస్తే..అదే నీ ఉనికికి నిజమైన గుర్తింపు.మన కోసం బ్రతికితే జీవితం ముగుస్తుంది..నలుగురి కోసం ఉపయోగపడితే జీవితం నిలిచిపోతుంది.మనం సంపాదించిన ధనం ఒకరోజు మిగలకపోవచ్చు..కానీ మనం సంపాదించిన ఆశీర్వాదాలు మాత్రం తరాలు గుర్తుంచు కుంటాయి.*ఇట్లు...మీ...✍🏻 రఘురాం*

94)నీలో తప్పులు వెతికే వాళ్లు ఎప్పుడూ ఉంటారు..నీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే మనుషులు ఉంటారు..నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా మాట్లాడతారు..నువ్వు ఎదిగినా అసూయపడతారు..కానీ ఒక విషయం మాత్రం నిజం..నీ గురించి ఎక్కువగా మాట్లాడేది,నిన్ను గమనించే వాళ్లే..ఎందుకంటే వెలుగు ఉన్న చోటే నీడ కనిపిస్తుంది..విలువ ఉన్న మనిషినే ఎక్కువగా విమర్శిస్తారు..కాబట్టి ఎవరి మాటలకి బాధపడకు..నీ ప్రయాణం ఆపకు..నీ లక్ష్యం మీద నమ్మకం కోల్పోవద్దు..ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్లే,రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

95)కాల్చే నిప్పునైనా నమ్మొచ్చు..అది తాకితే కాలుస్తుందని ముందే తెలుసు..కానీ రంగులు మార్చే మనుషుల సంగతి అలా కాదు..వాళ్లు నవ్వుతూ దగ్గరకు వస్తారు..అభిమానం పేరుతో మోసం చేస్తారు..అవసరం తీరేదాకా వెన్నంటి ఉంటారు..పని అయిపోగానే పరాయివాళ్లలా వదిలేస్తారు..నిప్పు చేసిన గాయం శరీరాన్ని మాత్రమే కాల్చుతుంది..కానీ కపట మనిషి ఇచ్చే గాయం మనసును,నమ్మకాన్ని,భవిష్యత్తునే నెమ్మదిగా బూడిద చేస్తుంది..శత్రువు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తాడు..ద్రోహి మాత్రం పక్కనే కూర్చుని చిరునవ్వుతో వెన్నుపోటు పొడుస్తాడు..అందుకే తీపి మాటలు విని మోసపోకు..కాలం చూపించే నిజమైన నడవడిక చూసి నమ్ము..మాటలు అందంగా అలంకరించు కోగలవు..ముఖాలు క్షణానికోసారి మారగలవు..కానీ స్వార్థం ఎప్పటికీ దాగదు..కాలం వచ్చినప్పుడు ముసుగు తొలగిపోయి అసలు రూపం బయట పడుతుంది..ప్రతి చిరునవ్వు వెనుక మంచి ఉండదు..ప్రతి సాయం వెనుక స్వార్థం ఉండొచ్చు..మనం అనుకుంటాం ప్రతి చేయి అండగా ఉంటుందని కానీ కొన్ని చేతులు అవసరం కోసం మాత్రమే చాస్తాయి..అందుకే కళ్లతో కాదు..కాలంతో నమ్ము..జీవితంలో అందరితో మంచిగా ఉండు..కానీ గుడ్డిగా ఎవరినీ నమ్మకు..ఇట్లు..మీ..✍🏻 రఘురాం*

96)రైతు విత్తనం వేసేటప్పుడు ఫలితం లెక్కేయడు..తల్లి అన్నం పెట్టేటప్పుడు రేపు ఏమిస్తాడని ఎదురు చూడదు..దీపం వెలుగునిచ్చేటప్పుడు చీకటి ఎప్పుడు పోతుందని అడగదు..మరి నువ్వు మాత్రం ప్రతి పనికి లాభం ఎందుకు చూస్తావు..

*_కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన_*

నీ చేతిలో ఉండేది కర్మ మాత్రమే..ఫలితం నీ చేతిలో లేదు..నువ్వు చేయగలిగింది ప్రయత్నం మాత్రమే..గెలుపు కాదు..గెలుపు ఒక రోజు వచ్చి పోతుంది..కానీ కర్తవ్యం నిన్ను మనిషిగా నిలబెడుతుంది..నువ్వు చిందించిన చెమట చుక్కలు..నువ్వు రాల్చిన కన్నీటిబొట్లు ఎప్పటికి వృథా కావు..అవే రేపు నీ విజయానికి పునాది రాళ్లు..ప్రపంచం చప్పట్ల కోసం కాదు..నీ మనసు గర్వపడే జీవితం కోసం కష్టపడు..నువ్వు చేసే పనిని ధర్మంగా చేయి..ఫలితాన్ని కాలానికి,దేవుడికి వదిలేయి..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*

97)అవసరం తీరేవరకు దగ్గరగా ఉంటారు..అవకాశం వచ్చేవరకు మాట్లాడతారు..పని అయిపోగానే పలకరింపు ఆగిపోతుంది..సాయం చేసిన చెయ్యి కూడా గుర్తుండదు..నీ దగ్గర లాభం ఉన్నంతవరకే నీకు గౌరవం..నువ్వు పడిపోతే తొక్కేందుకు వచ్చేవాళ్ళే ఎక్కువ..లేపేందుకు వచ్చేవాడు ఒక్కడు కూడా ఉండడు..ఇదే నేటి లోకం తీరు..స్వార్థం లేకుండా పలకరించేవాడు దొరకడం అరుదైపోయింది..అవసరం కోసం వాడేవాడు ఎక్కువ..ఆపదలో ఆదుకునేవాడు తక్కువ..మనిషి విలువ అతని పదవితో..డబ్బుతో లెక్కేస్తున్నారు..మనసుతో కాదు..అందుకే ఎవరి మీద ఆశ పెట్టుకోకు..నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు..నీ కష్టమే నీకు అండ..నీ నిజాయితీయే నీకు బలం..నీ చెమటే నీకు విజయాన్ని ఇస్తుంది..నీ కష్టమే నీకు పేరు తెస్తుంది..ఎవరూ లేకున్నా నువ్వు నీకు తోడుగా ఉండు..ఎందుకంటే ఈ లోకంలో నీకు నువ్వే దేవుడివి..మనిషితనం చూపేవాడే నిజమైన మనిషి...*ఇట్లు..మీ..✍🏻రఘురాం*

98)ఆలోచిస్తున్నావా?లేక బాధలో మునిగిపోతున్నావా?కళ్ళ ముందు ఆశలు కాలిపోతుంటే నమ్మకం జారిపోతుంది..జారకుండా పట్టుకున్నోడే జీవితంలో నిలబడతాడు..చావు మనిషి పుట్టుకతోనే రాసి ఉంటుంది..దాన్ని తెలుసుకోలేని మనిషి "నా బంధం..నా బంధం"అని వెంట పడుతూ ఉంటాడు..దేవుడు పుట్టుకకి తొమ్మిది నెలలు ఇస్తాడు..ప్రాణం మాత్రం పుట్టుకునే తీస్తాడు..ఎప్పుడైనా ఆలోచించావా?చావుకి కూడా సమయం ఇస్తే బ్రతుకుతా..పాడు చేసుకుంటాడని దేవుడు సమయం ఇవ్వడు..పోయినోళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలను తలుచుకుంటా..వదిలేసిన ప్రశ్నలని వెతుకుతా వెళ్ళడమే జీవితం..నీ కోసం చేసేది కర్తవ్యం..నలుగురి కోసం చేసేది ధర్మం..వదిలితే భారం దిగుతుంది..కలుపుకుంటే బాధ పెరుగుతుంది..అందుకే దేనికీ అతుక్కోకు..ముందుకు సాగడమే నిజమైన బతుకు..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*

99)పుట్టేటప్పుడు ఒంటరిగా వస్తాం..పోయేటప్పుడు ఒంటరిగా పోతాం..మధ్యలో ఉన్నన్నాళ్ళు మాత్రమే "నాది..నాది" అంటాం..ఈ ప్రపంచంలో శాశ్వతం ఏంటో తెలుసా?సత్యం నీకు కన్నతల్లి..జ్ఞానం నీకు కడుపున పుట్టిన తండ్రి..ధర్మం నీడలా వెంటుండే తోడు..దయ చేయి చాచే స్నేహితుడు..శాంతి కన్నీళ్ళు తుడిచే ఇల్లాలు..క్షమ కౌగిలించుకునే బిడ్డ..ఈ ఆరు దగ్గరుంటే చాలు..మిగతావన్నీ తెర మీద నాటకాలే..నువ్వు ఎందుకు పుట్టావో కాలమే ఒకరోజు లెక్క అడుగుతుంది..నీ పుట్టుకకి అర్థం నువ్వే వెతుక్కోవాలి..దొరుకుతుంది కానీ దారి మాత్రం ఎవ్వరూ వేయరు..నువ్వే నడవాలి..*ఇట్లు..మీ..✍🏻రఘురాం*

100)కలలు కనడం అందరికీ వస్తుంది..కానీ ఆ కలను నిజం చేయడానికి నిద్రను త్యాగం చేసేవాడే చరిత్ర సృష్టిస్తాడు.

"ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః।

న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః॥"

*అర్థం ఏంటో తెలుసా?*

ఆకలి ఉన్నా నిద్రపోతున్న సింహం నోట్లోకి ఆహారం రాదు.అలాగే,కోరికలు ఉన్నంత మాత్రాన జీవితంలో విజయం దక్కదు.ప్రయత్నమే విజయానికి మొదటి అడుగు,పట్టుదలే చివరి మెట్టు.కోరికలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి,కానీ వాటి కోసం చెమటోడ్చే వాళ్లే గమ్యాన్ని చేరుకుంటారు.అదృష్టం అవకాశం ఇవ్వొచ్చు,కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది నీ కష్టం,నీ క్రమశిక్షణ,నీ అచంచలమైన పట్టుదల.ఈరోజు చేసే ప్రతి చిన్న ప్రయత్నం రేపటి గొప్ప విజయానికి పునాది.ఈరోజు సోమరిగా ఉంటే ప్రపంచం నిన్ను చూసి నవ్వుతుంది.ఈరోజు కష్టపడితే అదే ప్రపంచం రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడుతుంది.గుర్తుంచుకో..గెలుపు ఎవరి ఇంటి తలుపు తట్టదు.దానిని వెతికి,పోరాడి,సాధించాలనే తపన ఉన్నవారినే గెలుపు ఆలింగనం చేసుకుంటుంది.కలలు కనకు,వాటి కోసం జీవించు.కోరికలు పెట్టకు,వాటి కోసం పోరాడు.అదృష్టం కోసం ఎదురు చూడకు.నీ ప్రయత్నంతో అదృష్టాన్నే నీ వైపు నడిపించు.ఎందుకంటే విజయానికి దారి అదృష్టం కాదు,ప్రతిరోజూ ఆగకుండా వేసే నీ అడుగులు,కార్చే నీ చెమట,వదలని నీ పట్టుదలే నిజమైన విజయం..*ఇట్లు..మీ..✍🏻 రఘురాం*