Tuesday, August 27, 2024

ఓటమి

జీవితంలో ఎన్నోసార్లు ఓటమి ఎదురవుతుంది. ఓటమి భయాన్ని వదిలించుకుని ముందుకు వెళ్లాలి. ఒక్కోసారి ఆ ఓటమి లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశలోకి నెట్టేస్తాయి. అలాంటప్పుడు కొంతమంది జీవితాన్ని ముగించేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయంలో మీకు కావాల్సింది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపే స్ఫూర్తి. ఒక మంచి స్నేహితుడు మీలో స్ఫూర్తినింపగలడు.ప్రతిసారీ మీ స్నేహితుడు మీ పక్కన ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన స్ఫూర్తి వాక్యాలను మీ ఫోన్ లో భద్రపరచుకోండి. మీకు నిరాశ కమ్మినప్పుడు,జీవితంలో ఏదీ సాధించలేం అన్నప్పుడు ఈ మోటివేషనల్ కోట్స్ చదవండి. ఖచ్చితంగా మీలో కొత్త అసలు చిగురిస్తాయి. స్ఫూర్తి రగులుతుంది. జీవితంపై అసలు పెరుగుతాయి. జీవితాన్ని ముగించేయాలన్న కోరిక చచ్చిపోతుంది. కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తారు.

మోటివేషనల్ కోట్స్
1. దృఢసంకల్పం,తరగని ఆత్మవిశ్వాసం,బలమైన కోరిక
ఈ మూడు ఉన్నచోట విజయం తప్పక వచ్చి తీరుతుంది
2. గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించక పోవడమే అసలైన ఓటమి
3. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయి
4. జీవితం ఎన్నడూ నువ్వు ఎదురుచూస్తున్నట్లు మారదు కానీ నువ్వు ఎదురుచూస్తున్నట్లు నువ్వే మార్చుకోవచ్చు అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే.
5. భయపడుతూ కూర్చుంటే బతకలేరు అడుగు ముందుకు వేసి చూడు..గెలుపు దక్కితే అది నిన్ను మరింత ముందుకు నడిపిస్తుంది..ఓటమి ఎదురైతే ఒక అనుభవాన్ని మిగులుస్తుంది ఏదైనా మీ మంచికే
6. పర్వతాన్ని చూసి నిరుత్సాహపడకండి మీరు ఆ పర్వతాన్ని ఎక్కితే అది మీ పాదాల కింద ఉంటుందని గుర్తుంచుకోండి
7. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది
8. ప్రపంచంలోని చీకటంతా ఏకమైనా కూడా ఒక చిన్న దీపం వెలుగును అడ్డుకోలేదు లక్ష్యసాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు
9. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి దానికి ఎదురెళ్లి చూడు..ఆ భయమే దూరంగా పారిపోతుంది
10. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులమని అనుకుంటే మీరు బలహీనులే అవుతారు..మీరు శక్తివంతులం అనుకుంటే మీరు మరింత శక్తివంతంగా తయారవుతారు ఎలా ఆలోచించాలో మీరే నిర్ణయించుకోండి
11. విధి వెయ్యి తలుపులు మూసేసినా..ఒక్క ప్రయత్నం చేసి చూడండి కనీసం ఒక్క కిటికీ అయినా తెరుచుకుంటుంది
12. యుద్ధం తప్పదనుకుంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది..మీ సంకల్పబలం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం
13. కెరటాన్ని ఆదర్శంగా తీసుకోండి అది ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేవడానికి ప్రయత్నిస్తుంది..మీరు కూడా ఎన్ని ఓటములు ఎదురైనా విజయం దక్కే వరకు పోరాడుతూనే ఉండండి
14. లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం మీ సొంతం అవుతుంది
15. జీవితంలో విజయం సాధించడానికి ముందుగా మనల్ని మనం నమ్మాలి..మనల్ని మనం ప్రేమించుకోవాలి
16. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ
దానిని చేరుకునే మార్గం మాత్రం మీ పాదాల కిందనే మొదలవుతుంది
17. పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు
కానీ ఏ పని చేయకపోతే ఏ ఫలితము రాదు
18. నీ జీవితం నీది ఎవరు నీతో వచ్చినా, రాకపోయినా
నీ ప్రయాణాన్ని ఆపకు నీకు నువ్వే తోడు
19. విజయం కావాలని కోరుకుంటున్నారా? అది అసాధ్యం. సక్సెస్ మీ వెంట రావాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడి తీరాలి. విజయానికి దగ్గర దారి ఏదైనా ఉందంటే అది కష్టపడడమే. కొంతమంది ఎలాంటి కష్టం లేకుండానే విజేతగా నిలవాలని కోరుకుంటారు. అలాంటి వారికి దక్కేది ఏమీ ఉండదు.విజయం దక్కాలంటే ప్రతి మనిషిలో ఉండాల్సింది కృషి, పట్టుదల. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలనే తపన. ఈ మూడే మనల్ని విజయతీరాలకు చేరుస్తాయి. విజయమంటే ఏదో ఒకటి సాధించడం కాదు, మీరు కావాలనుకున్నది, మీ జీవితంలో విలువైనదిగా భావించేది గెలిచి చూపించండి. అప్పుడే మీ మనసు సంతృప్తిని పొందుతుంది.

No comments:

Post a Comment