Sunday, July 13, 2025

బద్ధకమే విజయానికి అతిపెద్ద అడ్డంకి

*🌱బద్ధకపు విత్తనం, కష్టపడే నేల* *నీతి కథ* 💫✨
🕉️🦚🌹🌻💎💜🌈

 *🍁ఒకప్పుడు, ఓ పెద్ద పొలంలో కొత్తగా ఓ విత్తనం నాటారు. ఆ విత్తనానికి "ఆలస్యం" అని పేరు పెట్టారు. దాని పక్కనే "కష్టపడే తత్వం" ఉన్న ఇంకో చిన్న విత్తనం కూడా ఉంది. ఆలస్యం విత్తనం ప్రతిరోజూ ఇలా అనుకునేది, "ఈరోజు ఎండ ఎక్కువ ఉంది, రేపు మొలకెత్తుదాంలే. రేపు వాన పడుతుంది, ఆ తర్వాత మొలకెత్తుదాంలే." అది ఎప్పుడూ తన పనిని వాయిదా వేస్తూనే ఉండేది.* 

 *కానీ కష్టపడే తత్వం ఉన్న విత్తనం అలా కాదు. అది రోజూ ఉదయాన్నే ఎండనీ, నీటినీ పీల్చుకుంటూ పెరిగేది. చిన్న మొలకలా మొదలై, నెమ్మదిగా బలమైన కాండంగా మారింది. దాని వేళ్ళు భూమిలోకి లోతుగా వెళ్ళిపోయాయి, తన లక్ష్యం కోసం అది కష్టపడింది.* 

 *కొన్ని నెలలు గడిచాయి. కష్టపడే తత్వం ఉన్న విత్తనం ఇప్పుడు అందమైన, పూలతో నిండిన మొక్కగా మారి, మంచి సువాసనతో సీతాకోకచిలుకల్ని ఆకర్షిస్తోంది. కానీ ఆలస్యం విత్తనం మాత్రం ఇంకా భూమిలోనే ఉంది, మొలకెత్తడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ. అది అస్సలు కష్టపడటానికి ఇష్టపడలేదు, కేవలం తన సమయం వస్తుందని ఆశపడింది.* 

 *తర్వాత చలికాలం వచ్చింది. బాగా చలి పెరిగింది. కష్టపడే తత్వం ఉన్న మొక్క తన వేళ్ళ బలం వల్ల ఆ చలిని తట్టుకుని నిలబడింది, వచ్చే వసంతం కోసం చూస్తోంది. కానీ ఆలస్యం విత్తనం మాత్రం చలికి గడ్డకట్టుకుపోయింది, అది మొలకెత్తడానికి సరిపడా బలం* *కూడబెట్టుకోలేకపోయింది. దాని బద్ధకం దానిని పూర్తిగా నాశనం చేసింది* .

 *ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు:* 

 *ఈ కథ ఇప్పటి సమాజానికి ఓ ముఖ్యమైన మాట చెబుతోంది. మనం చాలాసార్లు మన పనులని, బాధ్యతల్ని "తర్వాత చేద్దాం," "ఇంకా చాలా టైముందిలే" అనుకుంటూ వాయిదా వేస్తాం. సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం, అనవసరమైన వాటిపై దృష్టి పెట్టడం, లేదా కేవలం బద్ధకం వల్ల చేయాల్సిన పనుల్ని పట్టించుకోం.* 

 *కానీ విజయం అనేది కేవలం అదృష్టం వల్లనో, అవకాశం వల్లనో రాదు. అది కష్టపడటం, నిబద్ధతతో ఉండటం, సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. ఈరోజు మనం వాయిదా వేసే ప్రతి చిన్న పనీ, భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారొచ్చు. టైమ్‌ని వృథా చేస్తూ కేవలం కలలు కనడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు.* 

 *కాబట్టి, ఈ కథ మనకు చెప్పే పాఠం ఏంటంటే: "ప్రతి చిన్న ప్రయత్నం, మనసుపెట్టి చేసే పని చివరికి పెద్ద ఫలితాలనిస్తాయి. బద్ధకమే విజయానికి అతిపెద్ద అడ్డంకి." రేపటి కోసం ఎదురుచూడకుండా, ఈరోజే మన లక్ష్యాల వైపు అడుగులు వేద్దాం!*

చిన్న కవితలు

1)నా మనసు భావన...ఊహల సంకెళ్లలో..క్షణమొక యుగంగా నీ రాకకై చేరుకోవాలని ఎదురుచూస్తున్న నేను..నేను దొంగచాటుగా నవ్వినా ఈ వెన్నెల వెక్కిరించినా..రేపోమాపో నీవు వస్తావని
నా కంటి పాపగా నిలుస్తావని నమ్మకం..వెన్నెల మెరిసినా నీవు మబ్బు చాటుకు చేరినా..గడచిన చీకటి సాక్షిగా మధుర క్షణాలు అందిస్తావని..నీ ఎదురుగా నేను..నా ఎదురు నీవు..మన ఎదుట ఆ పున్నమి చంద్రుడితో ఎప్పుడుంటామే..అలా ఎదురుచూస్తూ గడపేయాలేమోనని.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

2)ప్రతి బంధం – మొదటగా ఒక అవకాశంతో మొదలవుతుంది.అదే అవసరంగా మారుతుంది.చివరికి అది అలవాటవుతుంది.అది ప్రేమకావచ్చు,స్నేహం కావచ్చు..ఒక కన్ను చూస్తుంది.ఒక క్షణం ఆగుతుంది..ఒక మాట మొదలవుతుంది.అదే ఒక కొత్త బంధానికి తలుపు తీయగలదు.బంధాలు మొదలయ్యే సమయంలో మనకు తెలియదు.ఇది ఎంత దూరం నడుస్తుంది?ఇది ఎంత లోతుగా ప్రవేశిస్తుంది? అని కానీ ఒక అవకాశం ఇచ్చే మనసు ఉంటే.మనిషిలో మనిషి కనిపిస్తుంది.ఎవరో చిరునవ్వుతో పలకరిస్తే,ఎవరో మన మాట వినగలిగితే.మనలో ఏదో తెలీకుండానే మెరవడం మొదలవుతుంది.ఈ *అవకాశం* అంటే ఒక బంధానికి వేసే తొలి అడుగు.అది పెద్దదైనా,చిన్నదైనా మనసును తాకగలిగితే చాలు.
అది అనుబంధమవుతుంది. *అవసరం*.బంధాన్ని పోషించే ఎవరి జీవితం లోనైనా ఒక సమయంలో
ఒకరిని అవసరంగా అనిపిస్తుంది.మన మాట వినే వ్యక్తి,మన మౌనం అర్థం చేసుకునే మనిషి,మన భయానికి అండగా నిలిచే నీడ.అవసరం అనిపించే బంధాలు జీవితంలో చాలా ఉంటాయి.ఎవరైనా మన బాధ విన్నప్పుడు,మనకు ఒక మౌనపు తోడు ఇచ్చినప్పుడు...మనసులో ఒక జాగా వాళ్ల కోసం ఖాళీ అవుతుంది.అదే *అవసరం*.అలాగని అవసరంతో మొదలైన బంధం తక్కువ అని కాదు.మన బలహీనతల్లో ఎవరు మన చేయి పట్టుకుని నడిపిస్తారో వారే మన జీవితంలో నిలిచిపోయే మనుషులు..*అలవాటు* ఆత్మకి అతుక్కున్న లేదా హత్తుకున్న తోడు ఒకప్పుడు పరిచయమైన వ్యక్తి,ఒకరోజు అవసరమయ్యాడు,తర్వాత అతనితో లేకపోతే అసహ్యం అనిపించేట్టుగా...అదే *అలవాటు*.ఇది అత్యంత శక్తివంతమైన ఘట్టం.ఇక్కడే మనం పడి పోతాం,గిలగిలలాడతాం.ఎవరో దూరమైనప్పుడు,మనలో గాయం మిగులుతుంది.ఏం జరిగిందో మనకే అర్థం కాకపోతేనూ,వాళ్ళ లేక పోవడమే బాధిస్తుంది.అలవాటు అనేది బంధానికి మనసుతో వేసిన పట్టు.అది ఒక మత్తు కాదు.
ఒక నిశ్చల ప్రేమ లక్షణం.అలవాటవ్వడం అంటే 
అలవాటు పడిన మనిషి ఎదుట లేకపోయినా,మనం స్వచ్ఛంధంగా వారి కోసం ఎదురుచూస్తాం.వారి రాక మీద మన దినచర్య,మన ఊహ,మన గడియారమే ఆధారపడిపోయింది.మన ముందు వారు చిరునవ్వు నవ్వకపోతే,మన హృదయం ఎందుకో బాధ పడుతుంది.వాళ్లు మౌనంగా ఉంటే మన కన్ను తడుస్తుంది.ఎందుకంటే అలవాటు మన భావోద్వేగాలను వారి వైపు ఆకర్షించేసింది.అలవాటు అనేది కేవలం ఒకరి జ్ఞాపకం కాదు.అది మన లోపల వారి శ్వాసలా మారిపోతుంది.వారి గమనమే మన గమనంలా అనిపిస్తుంది.వారి అసంతృప్తి మన బాధలా అనిపిస్తుంది.ఈ స్థాయికి చేరినప్పుడే అలవాటు అనేది ప్రేమకంటే లోతుగా అనిపిస్తుంది.
అవకాశం → అవసరం → అలవాటు.అది స్నేహం కావచ్చు,బంధుత్వం కావచ్చు,ప్రేమ కావచ్చు,కలుసుకున్న రహదారి కావచ్చు.ఈ చక్రాన్ని ఏ దశలోనైనా విరమించవచ్చు.కానీ మన మనసు దాని పంథాను మర్చిపోదు.ఇందుకే కొన్ని బంధాలు నిష్ఫలమైనా మనలో ఏదో మిగిలిపోతుంది.ఒక చిన్న ఆశ.ఒక చిరు వేదన.ఒక ఊహ,ఒక అలజడి.ప్రతి బంధం అవకాశంగా మొదలవుతుంది,అవసరంగా,ఎదుగుతుంది,అలవాటుగా మారుతుంది.కానీ నిజమైన బంధం.దేనికీ అర్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా మనసునే అర్థం చేసుకుంటుంది.అయితే ఈ మూడు గుండా ఏర్పడేదే అనుభవం.
అవకాశం + అలవాటు + అవసరం = అనుభవం..ఈ మూడూ కలిపిన తర్వాత జీవితంలో మిగిలేది ఒక్కటి అనుభవం.అనుభవం – బంధాన్ని బలపరిచే నాలుగవ స్థాయి.ఇది ఊహతో వచ్చే పాఠం కాదు.ఒక సన్నివేశం,ఒక బంధం,ఒక వేదన…మనలో తళుకుల్లా మెరుస్తూ శాశ్వత గుర్తుగా మారిపోతుంది.అనుభవం అంటే కాలంతో లిఖితమైన భావోద్వేగం.ఒకరి నుంచి సాయం ఆశించి నిరాశపడ్డపుడు.ఒకరి కోసం ఎదురుచూసి వారు రాకపోయినప్పుడు.ఒకటి కాదు,రెండూ కాదు ఎన్నెన్నో పర్యాయాల్లో మనం మౌనం వెచ్చించినప్పుడు.ఆ మౌనం మన హృదయాన్ని వెతికి, మనిషిని మార్చేస్తుంది.అదిఅనుభవం.అనుభవం గమనించనంత మెల్లగా మనలోకి వస్తుంది.ఒక రోజు మనం ఎదుట కూర్చున్నవారిని చూసి,
వాళ్ల మాటల్లో ఉన్న మౌనం వినగలిగితే.అది మన అనుభవం మనకు నేర్పిన అభిజ్ఞత.అనుభవం బంధాన్ని శోధిస్తుంది – నశింప జేయదు..అవకాశం వచ్చినప్పుడు మనం ఓ బంధాన్ని మొదలు పెడతాం.అలవాటయ్యాక దానికి మనసు ఎగబాకుతుంది.అవసరం ఏర్పడితే దాన్ని కోల్పోవడం భయంగా అనిపిస్తుంది.కానీ అనుభవం వచ్చిందంటే.ఈ మూడింటినీ దాటి ఆ బంధం మన మనసులో పాతుకుపోయిందని అర్థం.అప్పుడు మనం వదిలి పెట్టవచ్చు,కానీ మరిచిపోలేం.ఒక ప్రేమ విఫలమవచ్చు,కానీ దాని అనుభవం మనం ప్రేమించే తీరును మార్చేస్తుంది.ఒక స్నేహం దూరమవచ్చు,కానీ దాని అనుభవం మనలో ఒక జ్ఞాపకంలా నిలిచి పోతుంది.అనుభవం అంటే ఎదిగిన మనసు అనుభవం వచ్చాక మనం ఇక భయం కోసం బతకం.అభిప్రాయం కోసం కాదు.అర్థం కోసం ఎదురు చూస్తాం.ఎవరైనా మనల్ని పిలవకపోతే బాధపడం,మన విలువలను మర్చిపోవద్దని మనల్ని మనమే గుర్తు చేసుకుంటాం.అదే అనుభవం నిజంగా మానవత్వాన్ని నేర్పే దశ.అనుభవం తర్వాత మనం నేర్చుకునేది.ప్రేమ అనేది ఒత్తిడిలో ఉండకూడదు.బంధం పుట్టించేది దృష్టి కాదు.దాని వెనుక ఉన్న శ్రద్ధ.
అవసరం గౌరవంగా ఉంటేనే బంధం స్థిరంగా ఉంటుంది.దూరం వచ్చినా,అనుభవం కాసేపు నవ్వుతూ వెనక కనిపిస్తుంది..ప్రతి మౌనం.ఓ తలపుగా మారు తుంది..ప్రతి తేడా.ఓ సహనంగా మారుతుంది..ప్రతి అణకరం.ఓ అర్థంగా మారుతుంది..అదే అనుభవం మన బలహీనతలను మారుస్తుంది,మన సంశయాలకు జవాబుల్లా నిలుస్తుంది.అవకాశం ఓ తలుపు మాత్రమే.అవసరం ఓ నడక మాత్రమే..అలవాటు ఓ దారి మాత్రమే.కానీ అనుభవం అది మనసు ముడిపడే చివరి గమ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*

3)మాట్లాడకపోయినా అర్థం చేసుకోగలరు,కేవలం పక్కన ఉండి భుజాన్ని మోయగలరు,ప్రేమంటే కేవలం కలిసి నవ్వుకోవడమే కాదు, నిశ్శబ్దాన్ని కూడా తనలో కలిపేసుకుని అండగా ఉండటం.ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి..ప్రేమంటే ప్రతీ నిముషం పలకరించుకోవడమే కాదు,నిశ్శబ్దంలో కూడా నేనున్నా అనే శబ్దాన్ని మనకు ఇవ్వడం

Saturday, July 12, 2025

ఒక ఆడ – ఒక మగ స్నేహం

ఒక ఆడ – ఒక మగ స్నేహం గురించి మాట్లాడడం అంటే, సమాజం వెంటనే దాన్ని శరీర సంబంధంగా చూడాలనుకుంటుంది.కాని కొన్ని బంధాలు, కొన్ని పరిచయాలు,కొన్ని అనుబంధాలు – శరీరాన్ని తాకకుండానే మనసులను నిండి పోయే ప్రేమను పంచుతాయి.ఆ స్నేహనికి పునాది భరోసా, బాధ్యత, బాధల్ని వినగల గుండె, నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.ఇది రొజూ కనిపించే స్నేహం కాదు.అది ఓ అందమైన అనుభూతి.
ఒకరికి ఒకరు తాకాల్సిన అవసరం లేకుండా,
వారి మధ్య ఏమీ జరుగాల్సిన అవసరం లేకుండా,
మనసులో ఓ ప్రాముఖ్యతను పొందిన బంధం.కొందరితో మనం మాట్లాడకపోయినా, వారు మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటారు.
వారితో మాటలు లేకున్నా, మనం ఏదో ఓ విధంగా కనెక్ట్ అయిపోతాం.అది శరీరబంధం కాదు.
అది ఓ జీవబంధం.ఆ బంధాన్ని గుర్తించడం, గుర్తేరిగి మసులుకోవడం, ఇంగిత జ్ఞానంతో హుందాగ వ్యవహరించడం చాలా అవసరం.ఒకరికి ఒకరు శారీరకంగా దగ్గరవాల్సిన అవసరం లేకపోయినా, మనసుకు ఒకరికొకరు అవసరంగా మారిపోతారు, ఈ ప్రపంచంలో తమ జీవిత కాలంలో ఒకటో రెండో సార్లు మాత్రమే కలిసిన వారు సైతం కేవలం వారి భావాలను అక్షరాల రూపంలో లేఖల ద్వారా.. ఎన్నో ఊసులను టెలిఫోన్ లో మాటల ద్వారా పంచుకున్నారు... ఇప్పటికి పంచుకుంటూనే ఉన్నారు కూడా..  జీవితం నేర్పే గొప్ప పాఠాలలో ఇలాంటి కంపెనీయన్ మనకొక కాన్ఫెషన్ బాక్స్, ఒకరి శరీరానికి దగ్గరవ్వడం కాదు. జీవితం అంతా వాళ్లతో పాటు ఉండాలనిపించడమే అసలైన బంధం.ఈ విధమైన బంధాలు కొంతకాలం మన జీవితాల్లో ఉంటే చాలు. మనం మనమయ్యే మార్గాన్ని చూపుతాయి.మన జీవితానికి ప్రేరణ అవుతాయి.ఆత్మను తాకే ఆ అనుబంధాలు, ప్రతి రోజు మనలో కొత్త వెలుగు నింపుతాయి.వాళ్లు మన జీవితాల్లోకి ఎందుకు వచ్చారో మనకి అర్ధం కావొచ్చు కాకపోవచ్చు. కానీ వాళ్ల వల్ల మనం ఎలా మారామో చెప్పలేం.ఆ బంధానికి శబ్దం ఉండదు.కాని ప్రతి నిశ్శబ్దంలో వాళ్ల ఉనికిని మనం వినగలుగుతాం.
కొన్ని స్నేహాలు సెక్స్‌కి మించినవిగా ఉంటాయి.
వాటి వెనుక శరీరం లేదు – హృదయం ఉంది.
వాటి వెనుక స్వార్థం లేదు – శ్రద్ధ ఉంది.
వాటి వెనుక మాటలు ఉండకపోయినా – అంతరంగికత ఉంది.ఇది తెలియని వారికి అసాధ్యం అనిపించొచ్చు.కానీ తెలిసిన మనకు – ఇది ఓ పునీతమైన బంధం అనిపిస్తుంది.ఇలాంటి బంధాలు మనలో మంచితనాన్ని నమ్మే నమ్మకాన్ని బలంగా నిలబెడతాయి.ప్రేమ, బంధం, హృదయ సంబంధాలకు శరీరాన్ని అద్దంగా చూపే ఈ ప్రపంచంలో –
మనసుల బంధమే శాశ్వతం అనే నిజాన్ని గుర్తు చేస్తాయి.ఈ బంధాలకు పేరు అవసరం లేదు... కానీ వారి ప్రెసెన్స్ మాత్రం మనసులో ఎప్పటికి చెరిగిపోదు.
శరీరం తాకకుండానే, మనసులు ఒకదానితో ఒకటి కలిసి పోయిన చోటే ఈ బంధాల పుట్టుక.
ఈ బంధం లో వేదన ఉంది – కానీ భారం కాదు,మౌనం ఉంది – కానీ దూరం కాదు,ఆత్మీయత ఉంది – కానీ అవసరం కాదు.ఇది ఒకరికోసం ఒకరిగా పుసే సుగంధ అనుబంధం,ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఒకసారి వీచిన పరిమళం మరిచిపోలేనిది.
మన జీవితంలో అలాంటి ఒక్క బంధం ఉండడం చాలా అవసరం.జీవితాన్నే ఓ మధురమైన గాథలా భావించడానికి. ఎంతమంది వచ్చినా, ఎవరూ అర్థం కాకపోయినా – ఈ ఒక్క బంధం మన అంతరంగాన్ని అర్థం చేసుకుంటుంది.ఈ బంధాల మధ్య
ప్రేమకు అర్థం ఉంది,స్నేహానికి గంభీరత ఉంది,
సంభాషణలకంటే మౌనం ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి బంధాలు మన జీవితం లోకి రావడం,మన ఉనికిని మరింత మానవీయంగా, మరింత సంపూర్ణంగా మార్చడం…అదే జీవితం ఇచ్చే గొప్ప వరం.ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఇది స్నేహానికి ఉన్న పరమార్థం.ఇది జీవితంలో ఒక అందమైన వసంతం.
ఇది మనకి దేవుడు ఇచ్చిన ఓ అణగారిన ఆశీర్వాదం.
ఇలాంటి బంధాన్ని కలవడం అరుదు,దాన్ని అర్థం చేసుకోవడం మరింత అరుదు,కానీ దాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మన జీవితాన్ని మరింత అందంగా మార్చుతుంది..మన జీవితంలో ఒకరైన సరే – అలాంటి వ్యక్తి ఉండగలిగితే, మనం ఈ జీవితాన్ని మరోలా ప్రేమించగలుగుతాం.... 

Wednesday, July 9, 2025

ప్రతి బంధం

ప్రతి బంధం – మొదటగా ఒక అవకాశంతో మొదలవుతుంది.అదే అవసరంగా మారుతుంది.చివరికి అది అలవాటవుతుంది.అది ప్రేమకావచ్చు,స్నేహం కావచ్చు..ఒక కన్ను చూస్తుంది.ఒక క్షణం ఆగుతుంది..ఒక మాట మొదలవుతుంది.అదే ఒక కొత్త బంధానికి తలుపు తీయగలదు.బంధాలు మొదలయ్యే సమయంలో మనకు తెలియదు.ఇది ఎంత దూరం నడుస్తుంది?ఇది ఎంత లోతుగా ప్రవేశిస్తుంది? అని కానీ ఒక అవకాశం ఇచ్చే మనసు ఉంటే.మనిషిలో మనిషి కనిపిస్తుంది.ఎవరో చిరునవ్వుతో పలకరిస్తే,ఎవరో మన మాట వినగలిగితే.మనలో ఏదో తెలీకుండానే  మెరవడం మొదలవుతుంది.ఈ *అవకాశం* అంటే ఒక బంధానికి వేసే తొలి అడుగు.అది పెద్దదైనా,చిన్నదైనా మనసును తాకగలిగితే చాలు.
అది అనుబంధమవుతుంది. *అవసరం*.బంధాన్ని పోషించే ఎవరి జీవితం లోనైనా ఒక సమయంలో
ఒకరిని అవసరంగా అనిపిస్తుంది.మన మాట వినే వ్యక్తి,మన మౌనం అర్థం చేసుకునే మనిషి,మన భయానికి అండగా నిలిచే నీడ.అవసరం అనిపించే బంధాలు జీవితంలో చాలా ఉంటాయి.ఎవరైనా మన బాధ విన్నప్పుడు,మనకు ఒక మౌనపు తోడు ఇచ్చినప్పుడు...మనసులో ఒక జాగా వాళ్ల కోసం ఖాళీ అవుతుంది.అదే *అవసరం*.అలాగని అవసరంతో మొదలైన బంధం తక్కువ అని కాదు.మన బలహీనతల్లో ఎవరు మన చేయి పట్టుకుని నడిపిస్తారో వారే మన జీవితంలో నిలిచిపోయే మనుషులు..*అలవాటు* ఆత్మకి అతుక్కున్న లేదా హత్తుకున్న తోడు ఒకప్పుడు పరిచయమైన వ్యక్తి,ఒకరోజు అవసరమయ్యాడు,తర్వాత అతనితో లేకపోతే అసహ్యం అనిపించేట్టుగా...అదే *అలవాటు*.ఇది అత్యంత శక్తివంతమైన ఘట్టం.
ఇక్కడే మనం పడిపోతాం,గిలగిలలాడతాం.ఎవరో దూరమైనప్పుడు,మనలో గాయం మిగులుతుంది.ఏం జరిగిందో మనకే అర్థం కాకపోతేనూ,వాళ్ళ లేక పోవడమే బాధిస్తుంది.అలవాటు అనేది బంధానికి మనసుతో వేసిన పట్టు.అది ఒక మత్తు కాదు.
ఒక నిశ్చల ప్రేమ లక్షణం.అలవాటవ్వడం అంటే 
అలవాటు పడిన మనిషి ఎదుట లేకపోయినా,మనం స్వచ్ఛంధంగా వారి కోసం ఎదురుచూస్తాం.వారి రాక మీద మన దినచర్య,మన ఊహ,మన గడియారమే ఆధారపడిపోయింది.మన ముందు వారు చిరునవ్వు నవ్వకపోతే,మన హృదయం ఎందుకో బాధ పడుతుంది.వాళ్లు మౌనంగా ఉంటే మన కన్ను తడుస్తుంది.ఎందుకంటే అలవాటు మన భావోద్వేగాలను వారి వైపు ఆకర్షించేసింది.అలవాటు అనేది కేవలం ఒకరి జ్ఞాపకం కాదు.అది మన లోపల వారి శ్వాసలా మారిపోతుంది.వారి గమనమే మన గమనంలా అనిపిస్తుంది.వారి అసంతృప్తి మన బాధలా అనిపిస్తుంది.ఈ స్థాయికి చేరినప్పుడే అలవాటు అనేది ప్రేమకంటే లోతుగా అనిపిస్తుంది.
అవకాశం → అవసరం → అలవాటు.అది స్నేహం కావచ్చు,బంధుత్వం కావచ్చు,ప్రేమ కావచ్చు,కలుసుకున్న రహదారి కావచ్చు.ఈ చక్రాన్ని ఏ దశలోనైనా విరమించవచ్చు.కానీ మన మనసు దాని పంథాను మర్చిపోదు.ఇందుకే కొన్ని బంధాలు నిష్ఫలమైనా మనలో ఏదో మిగిలిపోతుంది.ఒక చిన్న ఆశ.ఒక చిరు వేదన.ఒక ఊహ,ఒక అలజడి.ప్రతి బంధం అవకాశంగా మొదలవుతుంది,అవసరంగా,
ఎదుగుతుంది,అలవాటుగా మారుతుంది.కానీ నిజమైన బంధం.దేనికీ అర్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా మనసునే అర్థం చేసుకుంటుంది.అయితే ఈ మూడు గుండా ఏర్పడేదే అనుభవం.
అవకాశం + అలవాటు + అవసరం = అనుభవం..ఈ మూడూ కలిపిన తర్వాత జీవితంలో మిగిలేది ఒక్కటి అనుభవం.అనుభవం – బంధాన్ని బలపరిచే నాలుగవ స్థాయి.ఇది ఊహతో వచ్చే పాఠం కాదు.ఒక సన్నివేశం,ఒక బంధం,ఒక వేదన…మనలో తళుకుల్లా మెరుస్తూ శాశ్వత గుర్తుగా మారిపోతుంది.అనుభవం అంటే కాలంతో లిఖితమైన భావోద్వేగం.ఒకరి నుంచి సాయం ఆశించి నిరాశపడ్డపుడు.ఒకరి కోసం ఎదురుచూసి వారు రాకపోయినప్పుడు.ఒకటి కాదు,రెండూ కాదు ఎన్నెన్నో పర్యాయాల్లో మనం మౌనం వెచ్చించినప్పుడు.ఆ మౌనం మన హృదయాన్ని వెతికి, మనిషిని మార్చేస్తుంది.అదిఅనుభవం.అనుభవం గమనించనంత మెల్లగా మనలోకి వస్తుంది.ఒక రోజు మనం ఎదుట కూర్చున్నవారిని చూసి,
వాళ్ల మాటల్లో ఉన్న మౌనం వినగలిగితే.అది మన అనుభవం మనకు నేర్పిన అభిజ్ఞత.అనుభవం బంధాన్ని శోధిస్తుంది – నశింప జేయదు..అవకాశం వచ్చినప్పుడు మనం ఓ బంధాన్ని మొదలు పెడతాం.అలవాటయ్యాక దానికి మనసు ఎగబాకుతుంది.అవసరం ఏర్పడితే దాన్ని కోల్పోవడం భయంగా అనిపిస్తుంది.కానీ అనుభవం వచ్చిందంటే.ఈ మూడింటినీ దాటి ఆ బంధం మన మనసులో పాతుకుపోయిందని అర్థం.అప్పుడు మనం వదిలి పెట్టవచ్చు,కానీ మరిచిపోలేం.ఒక ప్రేమ విఫలమవచ్చు,కానీ దాని అనుభవం మనం ప్రేమించే తీరును మార్చేస్తుంది.ఒక స్నేహం దూరమవచ్చు,కానీ దాని అనుభవం మనలో ఒక జ్ఞాపకంలా నిలిచి పోతుంది.అనుభవం అంటే ఎదిగిన మనసు అనుభవం వచ్చాక మనం ఇక భయం కోసం బతకం.అభిప్రాయం కోసం కాదు.అర్థం కోసం ఎదురు చూస్తాం.ఎవరైనా మనల్ని పిలవకపోతే బాధపడం,మన విలువలను మర్చిపోవద్దని మనల్ని మనమే గుర్తు చేసుకుంటాం.అదే అనుభవం నిజంగా మానవత్వాన్ని నేర్పే దశ.అనుభవం తర్వాత మనం నేర్చుకునేది.ప్రేమ అనేది ఒత్తిడిలో ఉండకూడదు.బంధం పుట్టించేది దృష్టి కాదు.దాని వెనుక ఉన్న శ్రద్ధ.అవసరం గౌరవంగా ఉంటేనే బంధం స్థిరంగా ఉంటుంది.దూరం వచ్చినా,అనుభవం కాసేపు నవ్వుతూ వెనక కనిపిస్తుంది..ప్రతి మౌనం.ఓ తలపుగా మారు తుంది..ప్రతి తేడా.ఓ సహనంగా మారుతుంది..ప్రతి అణకరం.ఓ అర్థంగా మారుతుంది..అదే అనుభవం మన బలహీనతలను మారుస్తుంది,మన సంశయాలకు జవాబుల్లా నిలుస్తుంది.అవకాశం ఓ తలుపు మాత్రమే.అవసరం ఓ నడక మాత్రమే..అలవాటు ఓ దారి మాత్రమే.కానీ అనుభవం అది మనసు ముడిపడే చివరి గమ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘు*