Monday, September 29, 2025

మంచి మాటలు - 2026

1)లోకంలో అందరూ మోసం చేసే వాళ్లే,ముంచేసేవాళ్లే.కనుక ఎవ్వరితోనూ నీకు పని లేదు.ఎవరూ లేకపోయినా నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవు.ఎవరితోనూ అనుబంధాలు పెంచుకోవాల్సిన పనిలేదు.నీ బ్రతుకు నువ్వు స్వేచ్ఛగా బ్రతుకు.నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు.ఏ బరువులు,బంధాలు,బాధ్యతలు లేకుండా బ్రతుకు.అనే పనికిమాలిన వాదం ఒకటి వినిపిస్తోంది ఈమధ్యన.ఈ వాదాల ప్రభావం కారణంగానూ, సహజంగా పెరిగిన ఆర్థిక స్వావలంబన కారణంగానూ...చిన్ని చిన్ని కారణాలకే దగ్గరి వాళ్ళని కూడా ఒక్కొక్కసారి అపార్థం చేసుకుని దూరమైపోతున్నాం. "ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు,సోషల్ మీడియా పోస్టులకి సరిగా స్పందించడం లేదు." లాంటి సిల్లీ కారణాలతో కూడా దూరమవుతున్న వారు ఉన్నారు.ఇలాంటి చిన్న చిన్న కారణాలతోనే... దగ్గరి స్నేహితులు,అన్నదమ్ములు,చివరికి భార్యాభర్తలు కూడా దూరమైపోతూ ఉండడమే వింతల్లో వింత.ఎవరికైనా దూరమవడం తేలిక. దగ్గరవడమే కష్టం.ఎవరినైనా అపార్థం చేసుకోవడం తేలిక. అర్థం చేసుకోవడమే కష్టం.మనసు విప్పి మాట్లాడితేనే మనుషులు అర్థమవుతారు.మనసుల మధ్య మమతలు పెనవేసుకుంటాయ్.అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరికీ దూరంగా మసలితే... అవసరమైనప్పుడు ఆదుకోవడానికి ఆప్తులు ఎవరుంటారు? ఏ మనిషితోనూ పని లేకుండా, అవసరం పడకుండా నిండు నూరేళ్లూ సుఖంగా బ్రతికేసిన మనిషిని ఒక్కడిని చూపించండి. "మనుషులే లేని ఒకదీవిలో..మనమొక్కరమే...
ఒక్కసారి ఊహించుకుని చూడండి. సినిమాల్లో చూపించినంత అందంగా అయితే ఉండదుఆ ఊహే...దుర్భరంగా ఉంటుంది.ఎందుకంటే..
మనుషులు,వారి మధ్య మమతలే మానవాళి సుఖ జీవన ప్రస్థానానికి అసలు సిసలు హేతువులు.ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

2)నువ్వు కోరుకున్న జీవితం కావాలంటే..నీ అవసరాలకి మించి ఆస్థైనా ఉండాలి..నిన్ను నీ అవసరాల్ని పోషించే మద్దతైనా ఉండాలి..అవి రెండూ లేవా? అయితే మూసుకొని పని చేసుకోవాలి..జీవితాన్ని కొంచెం సీరియస్ తీసుకునే టైం వచ్చింది..కాబట్టి ఏది లైటుగా తీసుకోవద్దు..లే లేచి తలపడు నువ్వు అనుకున్నవి నెరేవేరేదాకా....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

3)జీవితంలో పని చేస్తుంటే దెబ్బలు తగలవచ్చు.అది చేయి మీద కావచ్చు,మనసు మీద కావచ్చు,కానీ ప్రతి దెబ్బ మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది.చేతికి తగిలిన గాయమే మనం తర్వాత జాగ్రత్తగా ఎలా ఉండాలో గుర్తు చేస్తుంది.మనసుకు తగిలిన గాయం మనలో సహనం పెంచుతుంది.జీవితం ఇచ్చే దెబ్బలు గట్టిగ ఉండి బాధ పెడతాయి,కానీ అవే దెబ్బలు మనకు బలం కూడా ఇస్తాయి.కాబట్టి తగిలే ప్రతి దెబ్బను శిక్షగా కాక,శిక్షణగా చూడాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

4)కాలమే తెలియజేస్తుంది మనం నమ్మే మనుషులు ఎలాంటి వారో అని..కాలం రాగానే,అదే మిత్రుడ్ని శత్రువుగా చూపిస్తుంది…అదే శత్రువుని గౌరవంగా మార్చేస్తుంది.నువ్వు ఎవరు అన్నది కాదు,కాలం ఎదుట నిలబడగలిగావా లేదా అన్నదే నీ అసలు పరిచయం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

5)మనం దేవుడ్ని అడిగే ముందు,దైవం మన భక్తిని కొలుస్తాడు..పరీక్షిస్తాడు.ఒక మెట్టు ఎక్కే ధైర్యం చూపించు..దారి లేదనుకుంటావ్ కానీ..భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో నీకు మార్గం చూపిస్తాడు..కానీ ఒకటి గుర్తుపెట్టుకో అడుగులు మాత్రం నువ్వే వేయాలి..అప్పుడే దేవుడు నీకు దారి చూపించ గలుగుతాడు..దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డుపెట్టకుండా దేవుడా దీపం ఆరిపోకుండా చూడు అంటే చూడడు..నువ్వు చెయ్యాల్సిన కర్తవ్యం నువ్వు చేయి..తక్కినది దేవుడు మీద భారం..కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన..తిరువణ్ణామలైలో నాకు జరిగిన అనుభవం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

6)ఎప్పుడు ఇతరులా మాటలు,చూపులు తప్పు..ఒప్పుల గురించి మాట్లాడుకోవడం గొప్ప అనుకుంటున్నావేమో ముందు నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది తెలుసుకో..ఒక వేలు నువ్వు చూపిస్తే మిగతా నాలుగేళ్లు నీకే చూపిస్తాయి,అని గుర్తుపెట్టుకో.. కాబట్టి ఎప్పుడూ పక్కవారిని విమర్శించే బదులు నిన్ను నువ్వు సరిచేసుకో అప్పుడు తొందరగా ఎదగగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

7)మోసం చేసే గుణం ఉండకూడదు..ఇంకొకరి మంచే కోరుకోవాలి..ఎన్ని కష్టనష్టాలు వచ్చిన వీలైనంత వరకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం అలవర్చుకునే మనస్తత్వం ఉండేలా చూసుకోవాలి..తెలిసి ఎవర్ని బాధపెట్టకూడదు..తెలియకపోతే అడిగి తెలుసుకునే ధైర్యం ఉండాలి..ఎప్పుడూ అందమైన చిరునవ్వు చిందించాలి..ఎప్పుడూ ఓపికతో ఉండడం నేర్చుకోవాలి..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి..గర్వలేని మనిషిగా మారాలి..కొనుసార్లు మనవాళ్ళని బాధపెట్టకుండా ఉండడానికి లోపల కుమిలిపోతున్నా పైకి నవ్వుల పువ్వులు కురిపించాలి..మన అనుకుంటే ఎంత దూరమైన వెళ్లగలగాలి..వీలైతే ఇంకొకరి జీవితంలో వెలుగు నింపడం తప్ప చీకట్లు చేయకుండా ఉండాలి..కొన్నిసార్లు ఎందరు ఎంత బాధ పెట్టిన సర్దుకొనిపోవాలి..ఎందుకంటే వారికి కలం సమాధానం చెబుతుంది..ఇలా చేస్తూపోయే వారిని దేవుడు సదా తోడై నీ పక్కనే ఉండి నడిపిస్తాడు..అర్ధమైతే ఆచరించు..అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

8)బ్రతకడం నేర్చుకోండి..చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది...నవ్వడం నేర్చుకోండి...ఏడ్వడం ఎలాగో మన అనుకున్న మనుషులు నేర్పిస్తారు..నిలబడడం నేర్చుకోండి..పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్లు నటించేవారు నేర్పిస్తారు..జీవించడం నేర్చుకోండి..మరణం ఎవ్వరికి బంధువు కాదు,
ఏదోకరోజు కచ్చితంగా వస్తుంది...తేలడం నేర్చుకోండి...ముంచడం ఎలాగో నువ్వు నమ్మిన
వ్యక్తులు నేర్పిస్తారు... కాబట్టి దేనికీ అతిగా స్పందిచద్దు ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది..నువ్వు చెయ్యాల్సిన మంచి మాత్రమే చేయి ఫలితం దేవుడు ఇస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

9)ఇద్దరి వ్యక్తులు కలిసుండాలంటే ప్రేమ ఎంత ముఖ్యమో..బాధ్యత కూడా అంతే ముఖ్యం..ఈ రెండిటిలో ఏది తగ్గినా..ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు..ఇక్కడ అసలు సమస్య ఇదే..ప్రేమని పంచుకోడానికి ముందుండే మనుషులు..బాధ్యతలు పంచుకోడానికి మాత్రం వెనకడుగు వేస్తారు..బహుశా అందుకేనేమో మాటల్లో..కవితల్లో అందంగా కనిపించే ప్రేమ..జీవితాల్లోకి వచ్చేసరికి కాస్త ఇబ్బందిగా మారుతుంది..అందరికి తాజ్ మహల్ వెనుక షాజహాన్ ప్రేమ కనిపిస్తుంది కానీ..అతను ప్రేమించాడు కాబట్టి తాజ్ మహల్ కట్టలేదు..అది తన బాధ్యతగా భావించాడు కాబట్టి ఆ అద్భుతాన్ని సృష్టించాడు..చివరిగా నేను చెప్పేది ఒక్కటే..ఒక వ్యక్తి మీద నీకు ఎంత ప్రేమున్నా..అది చేతల్లో(బాధ్యతగా)కనపడకపోతే..అది అసలు ప్రేమే కాదు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

10)జీవితం అనేది దేవుడి పరీక్ష..రాముడు అరణ్యంలో ఉన్నా,కృష్ణుడు యుద్ధంలో ఉన్నా,వారిని నిలబెట్టింది వారి యొక్క ధైర్యం ,ధర్మం.మనకు కూడా కష్టాలు వస్తాయి..కానీ దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకం ఉంటే..ఆ కష్టాలు ఆశీర్వాదాలుగా మారిపోతాయి.భగవంతుణ్ని హృదయంలో పెట్టుకో...నీ జీవితం విజయగాథ అవుతుంది.. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

11)మన జీవితానికి సార్ధకత ఎప్పుడు వస్తుందంటే నీకు చేతకాదు అని హేళన చేసేవారి చేత చప్పట్లు కొట్టించు కోవాలి..నువ్వు పనికిరావని నిన్ను దూరం పెట్టినవారు నిన్ను వెతుక్కుంటూ రావాలి..నువ్వు ఏమీ చేయలేవు అని చులకనగా మాట్లాడిన వారు మమ్మల్ని ఏమీ చేయద్దని ప్రాధేయపడాలి..నీకు ద్రోహం చేసిన వారే నీ సాయం కోసం నీ ముందు తలవంచాలి..నీకు కన్నీళ్లను పరిచయం చేసినవాళ్లే ఆ కన్నీళ్లకు క్షమాపణ చెప్పు కోవాలి..నువ్వు వెళ్లేదారిలో
ముళ్ళను వేసినవాళ్లే నీకు పూలస్వాగతం పలికేలా నువ్వు మారాలి..నిన్ను భయపెట్టాలి అని అనుకున్న వారికి నీ ధైర్యాన్ని రుచి చూపించాలి..నువ్వు నిలబడడమే కష్టం అని అనేవారి ముందు అడుగులు వేసి చూపించాలి..నువ్వు ఓడిపోతే నవ్వాలని వేచి చూస్తున్నవారికి నీ గెలుపును కానుకగా మార్చి వారికివ్వాలి అప్పుడే నీ జన్మకి ఒక అర్ధం..పరమార్ధం దక్కుతుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

12)జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం.కొన్ని తెలిసి చేస్తాం.ఇంకొన్ని తెలియక చేస్తాం.కొన్ని మన స్పృహలో జరుగుతాయి,ఇంకొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగి పోతాయి. అయితే,చాలా సార్లు మన మీద పెట్టుకున్న అంచనాలు,అపోహలు,
మితిమీరిన అంచనాల వల్లే మనల్ని తప్పుల పాలు చేస్తారు.మన జీవితం ఒక రహదారి అయితే,ఆ రహదారిలో నడిచే ప్రతి మనిషి తనకంటూ ఒక దారిని ఊహించుకుంటాడు.కానీ మనం ఎంచుకున్న దారి వాళ్ల ఊహలకు సరిపోకపోతే,మన అడుగులకే తప్పు అనే ముద్ర వేసేస్తారు..నువ్వు చేయాల్సిందల్లా నువ్వు నమ్మిన  నీ దారిలో నువ్వు ప్రయాణించడమే ఎక్కడ ముళ్ళు రాళ్లు ఉంటాయో చూసుకొని జాగ్రత్తగా అడుగైడమే అప్పుడే నీ ప్రయాణం ఏ అడ్డంకి లేకుండా ముందుకు సాఫీగా సాగేది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

13)తప్పు అనేది నిజానికి పరిమితి దాటి చేసిన ప్రయత్నం.కొన్నిసార్లు అది పతనమవుతుంది, ఇంకొన్నిసార్లు పాఠమవుతుంది..కానీ చివరికి అది మన అనుభవాలను గాఢంగా మలచే శక్తి.ఎప్పుడూ తప్పులు చేయని మనిషి,జీవితాన్ని లోతుగా అనుభవించని వాడే అవుతాడు.ఎందుకంటే తప్పులు లేకుండా జ్ఞానం వూరదు.తప్పులు లేకుండా మనిషి పెరగడు.. కాబట్టి తప్పు చేయచ్చు..కానీ ఆ తప్పు నుంచి గుణపాఠం నేర్చుకుని మళ్ళీ ఆ తప్పు తిరిగి చేయకుండా ఉండడమే జ్ఞానం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

14)మన తప్పులు మన సొంత కళ్ళతో చూస్తే ఎప్పుడూ చిన్నవిగా కనిపించవచ్చు.కానీ ప్రపంచం అనే అద్దంలో అవి విపరీతంగా పెరిగి,మన విలువలనే మింగేస్తాయి.మనిషి తన హృదయాన్ని ఎవరికి చూపించలేడు గానీ,ప్రపంచం మాత్రం ఆ ఒక్క క్షణాన్ని పట్టుకుని జీవితం మొత్తం తీర్పు చెబుతుంది.అక్కడే నిజమైన బాధ మొదలవుతుంది.తప్పు వల్ల కాదని,తప్పును ఎవరూ అర్థం చేసుకోకపోవడం వల్ల.తప్పులు – మన మానవత్వానికి అద్దం.తప్పు చేసినప్పుడు సరిదిద్దుకునే అలవాటు ఉండాలి అప్పుడే నీకు జీవితంలో ఎదిగే లక్షణం ఉంటుంది లేకపోతే నీ జీవితం అదఃపాతాళమే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

15)కొన్నిసార్లు తప్పులు మన అహంకారాన్ని కరిగిస్తాయి,మన సహనాన్ని పెంచుతాయి,
మన హృదయాన్ని మృదువుగా చేస్తాయి.తప్పులు చేయకూడదనేది అసాధ్యం.కానీ తప్పు చేసిన తర్వాత లేచి ముందుకు నడవడమే గొప్పతనం.ప్రపంచం మన తప్పుల ద్వారా మనల్ని కొలుస్తుంది,కానీ మన జీవితం మాత్రం ఆ తప్పులనుంచి మనం ఏమి నేర్చుకున్నామనే దానితో నిర్ణయించబడుతుంది.తప్పు పాఠం అవ్వాలి,ఆ పాఠం జ్ఞానంతో దారి చూపాలి..అదే నీ జీవితంలో ఎదుగుదలకు అడుగుగా మారాలి..అప్పుడే నువ్వు చేసిన తప్పు నుంచి నేర్చుకుని అందరికి మార్గదర్శకుడిగ అవ్వగలవు..నిన్ను చూసి పదిమంది మారగలరు అప్పుడే నీ జీవితానికి తగిన న్యాయం చేయగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

16)తప్పులు చేస్తాం.అవి మనల్ని బలహీనులుగా చేయడానికి కాదు,మనలో ఇంకా మనిషి బతికే ఉన్నాడని గుర్తు చేయడానికి.ప్రపంచం తీర్పు చెబుతుంది,అపోహలు ముద్ర వేస్తాయి,
కానీ మన హృదయం మాత్రం మెల్లగా చెబుతుంది.నువ్వు చేసే ప్రతి తప్పు నీ ఎదుగుదలకు ఒక మెట్టే అని... కాబట్టి తప్పు చేసానని దిగులు చెందకుండా ఆ తప్పు నుంచి ఏమి నేర్చుకుని ముందుకు వెళ్ళమనదే ముఖ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

17)జీవితం అస్థిరతల తీగపై నడిచే ఆట.అక్కడ ప్రతి అడుగు జారిపోవచ్చు,ప్రతి క్షణం కొత్త సవాలు విసరచ్చు.కానీ ఒకసారి మనం సమతుల్యం పట్టుకోవడం నేర్చుకున్నాక,ఆ తీగపై నడకే మనకు సత్యం,సౌందర్యం,శాంతి అవుతుంది.
అందుకే తప్పులు చేసేసానే అని భయపడ కూడదు.ఒంటరితనం వచ్చిందని ఆగిపోవకూడదు.మనసు జారిపోయిందని మనల్ని తక్కువ చేసుకోవకూడదు.ఎందుకంటే...
తప్పులు మనల్ని బలహీనులను చేయవు,
మనల్ని మరింత బలవంతులుగా మారుస్తాయి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

18)నేను జీవితంలో కచ్చితంగా గెలుస్తా..నాకు ఆ విషయం తెలుసు..నాకు కొన్ని దెబ్బలు తగలొచ్చు!!
కొన్నిసార్లు కింద పడొచ్చు!!..నా శక్తి మొత్తం అయిపోయే స్టేజ్ కి నేను రావచ్చు!!..అప్పటికి నేను నించుంటా..ఓటమిని అంగీకరించి!! నేను జీవితం అంటే ఏంటో నేర్చుకుంటున్నా!!ఎందుకంటే..నాకు తెలుసు ఉన్నది ఒకటే జీవితం అని!! ఓడిపోయాను అనే బాధలోనో ఓడిపోతాను అని భయం లోనో
గడపాలన్న ఉద్దేశం లేదు!! ఈరోజు నాది కాకపోవచ్చు!! నాకంటూ ఒకరోజు వచ్చేదాకా 
నేను నాలాగే ఉంటా నేను ఎదురు చూస్తూ ఉంటా...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

19)డబ్బు లేని జీవితం ఎప్పుడూ శూన్యతనే మిగిలిస్తుంది,గుండెలో ఖాళీ,స్నేహాలు,బంధాలు నిర్వీర్యంగా మారిపోతాయి,డబ్బు లేకపోతే ప్రతి ఆశ,ప్రతి అవకాశం – చీకటిలో కలసిపోతాయి.
డబ్బు అంటే,అది కేవలం పేపర్ కాదు,మనం ప్రేమించగల,గౌరవించగల పవర్,చిన్న సంతోషాలను,చిన్న నవ్వులను,భవిష్యత్తును ఇస్తుంది.కానీ దాంతో జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యం చేస్తే,అది మన జీవితాన్ని నిర్మూలిస్తుంది,బంధాలను వణికిస్తుంది,ఆశలు అడియాశలుగా మారి పోతాయి..ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు పట్ల ప్రేమ, కృతజ్ఞత, జాగ్రత్త – ఇవే మన జీవనానికి రుచి, బంధాలకు బలం,అది లేకపోతే,మనసు,జీవితం ఖాళీ,శూన్యం..అవునన్నా కాదన్నా..ధనం మూలం ఇదం జగత్..సినిమాలో చూపించినట్టు జీవితం ఉండదు..మన జీవితంలో అతి ముఖ్యమైన పవర్ మనీ..దానిని ప్రేమించు,గౌరవించు,మంచి విషయాలకు ఉపయోగించు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

20)గతం గాయాలకు కారకులెవరు??..భవిష్యత్ భయాలకు భాద్యులెవరు??..ప్రస్తుత ప్రశ్నలకు సమాధానం ఎవరు?...గతం గాయాలు మాన్పుకుంటు భవిష్యత్ భయాలను చేదిస్తూ ప్రస్తుత ప్రశ్నలను పరిష్కరిస్తూ సాగాల్సింది నీకు నీవే నీతో నీవే..ప్రతికూల పరిస్థితి చూసి నీరసించి పోకు..భయాలకు లొంగిపోకు..చేయాల్సిన యుద్ధం ఇంకా ఉంది గెలవాల్సిన పోరాటం చాలా ఉంది..అనుభవించాల్సిన ఆధిక్యత ఎదురు చూస్తుంది..అందుకోవాల్సిన నీరాజనాలు వేచి ఉన్నాయి..తడబడుతున్న అడుగులను సరిచేసుకుంటు..సతమత అవుతున్న ఆలోచనలను సర్దిచెప్పుకుంటూ నీలో నీవే నీతో నీవే సాగిపోవాలి ఎందుకంటే కడదాకా నీ ప్రయాణం నువ్వొక్కడివే చేయాలి..కాబట్టి నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకో..అప్పుడే ప్రశాంతంగా బ్రతకగలవు లేకుంటే నీ బ్రతుకు అదఃపాతాళమే.. ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

21)ఓ మనిషి..తీర్చుకోవాలి రుణం ఈ భూమి మీదకు వచ్చినందుకు..ఎవర్ని మోసం చేయకుండా..ఎవరికి అపకారం కోరకుండా...పగలు ప్రతీకారాలు పెంచుకోక.అందరి ప్రాణం ఒక్కటే అని ఆలోచించి..తోచినంతా సహాయ సహకారాలు అందించి..చెడును దూరం చేసుకొని..మంచిని నమ్ముకొని..నా అనుకునే వాళ్లకు ధైర్యంగా నిలబడి...ఏ కష్టం రానీయకుండా చూసు కోవాలి.వీలైతే మంచిచేసి..అందరి మనస్సు లో స్థానం సంపాదించి..ఆశతో కాకుండా..ఆశయం కోసం పరిగెత్తి చేరుకోవాలి..ఇచ్చిన మానవ అదృష్టాన్ని స్వార్థం ఆశ మోసం నమ్మక ద్రోహం వెన్నుపోటు..కక్షలు కార్పన్యాలు లేకుండా అందరితో అందరిలో ఒక్కడిగా మిగిలిపోవాలి..ఇచ్చిన పుట్టుకకు సార్థకతను సంపాదించుకొని వచ్చిన చావుతో వెళ్ళి పోవాలి..రుణం తీర్చుకోవాలి మనిషి జన్మగా..భూమి మీద లేకున్నా గుర్తుచేసుకోవాలి మంచి చేసిన మనిషిని ఈ లోకం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

22)ప్రతి ఒక్కరి జీవితంలో పరిస్థితులు ఒకలా ఉండవు.ఎవరో ఒకరు ఆప్తుడిని కోల్పోతారు,ఎవరో ఒకరు నమ్మిన వాళ్ల చేత ద్రోహం అనుభవిస్తారు,దాంతో మనం కన్న కలలు ఒక్క క్షణంలో చిద్రమైపోతాయి.కానీ ఒకటి మాత్రం నిజం అందరికీ ఎదో ఒక బాధ పెడుతూనే ఉంటాడు దేవుడు..కానీ ఒకటే బాధతో జీవితం ఆగిపోదు...మనం ఆగిపోతేనే ఆగిపోతుంది.ఎంత కఠినమైన రాత్రైనా ముగియాల్సిందే..సూర్యోదయం రావాల్సిందే.. కాబట్టి ఒకదారి మూసుకుపోతే,కొత్త దారిని మనమే సృష్టించుకోవాలి.ఆ దారి ఎంత కఠినమైనదైనా,ఒకసారి నడక మొదలుపెట్టాక...ఆపకూడదు ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రయాణమే ఇంకొకరికి ప్రేరణ అవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

23)ఒక్కటి గుర్తుపెట్టుకో..నిశ్శబ్దంగా పని చెయ్యి,పని పూర్తయ్యాక నీ స్థితి స్వయంగా ప్రకటిస్తుంది.మొక్క ఒక విత్తనం నుండి ఆకాశాన్ని తాకే చెట్టుగా మారినంత కాలం ఎప్పుడూ గర్వంగా నేను పెరుగుతున్నా అని కేకలు వేయదు.అది తన వేర్లను నేలలోకి పంపుతుంది.ఆ వేర్లు ఎవరికీ కనిపించవు.కానీ ఒకరోజు ఆ వేర్లు దృఢమై పోయినప్పుడు,ఆ చెట్టు నీడగా,జీవంగా అందరికీ కనబడుతుంది..వీలవుతే మనం కూడా అలాగే జీవించాలి...చిన్న చిన్న కష్టాలు,త్యాగాలు,నిద్రలేని రాత్రులు ఇవన్నీ ఎవరికీ కనబడవు.కానీ ఒకరోజు ఫలితం రూపంలో అవన్నీ మాట్లాడతాయి.ఈ వేగవంతమైన సమాజంలో చాలా మంది ప్రయాణం మొదలుపెట్టినదాన్నినే జయంగా భావిస్తున్నారు.కానీ నిజమైన విజయం చేరుకున్నప్పుడు మాత్రమే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

24)మన మాటలు తేలికగా ఉండొచ్చు,మన వాగ్దానాలు మరచిపోవచ్చు,కానీ మన కృషి,మన సాధన, మన చేరుకున్న గమ్యం ఇవే ఎప్పటికీ నిలుస్తాయి.కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో ప్రకటనలతో కాకుండా,ఫలితాలతో నిలబడు.ప్రతిజ్ఞలతో కాకుండా,సాధనతో నిరూపించు.ఎందుకంటే ప్రయాణం గురించి ఎక్కువగా చెప్పడం అవసరం లేదు.చేరుకున్నప్పుడు ప్రపంచమే గమనిస్తుంది..ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు వెనక్కి చూసినప్పుడు…నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు అని అనుకోకుండా..నువ్వు నిజంగా అక్కడికి చేరుకున్నావు అని ప్రపంచం చెప్పాలి.అదే అసలు గెలుపు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

25)మనం గెలుస్తున్నామని చెప్తే ఎవరు నమ్మరు..మనల్ని చూసి నవ్వుతారు.మనం పోరాడుతుంటే ఏవరు నిలబడరు వెనక్కి లాగేస్తారు..మనం మంచిగా ఉన్నా మన మీద రాళ్లు వేస్తారు..లాభం ఆశిస్తున్నామని అనుమానిస్తారు.. మనం సాయం చేసినా మన వెనుక గోతులు తవ్వుతారు..మనకు కీర్తి దక్కితే సహించరు.. మనం చేసే దానికి పేర్లు పెడతారు అసలు నిన్నో అబద్దంలా చూస్తారు !!కానీ మనం ఇవి ఏమీ పట్టించుకోకూడదు ఎందుకంటే మనం వాళ్ళలాగా కాదు...అందుకే మనకి లోకంతో పనిలేదు మనం నిజాయితీగా ఉండి దేవుడు తోడుంటే చాలు మరెవ్వరి అవసరం లేకుండా..నిజాయతీగా కష్టపడితే ఫలితం దైవేచ్ఛ ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

26)ప్రేమలో కోపాలు ఉండాలి కానీ ప్రేమ
దూరం అయ్యేంత కోపాలు ఉండకూడదు.
ప్రేమంటే అర్ధం చేసుకుని కలిసిపోవడం
అంతే కాని అపార్ధాలతో విడిపోవడం కాదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

27)మన జీవితంలో చీకటి లేకపోతే,వెలుగు విలువ ఏమిటో మనం ఎప్పటికీ తెలుసుకోలేం.రాత్రి చీకటి కమ్ముకున్నప్పుడే ఆకాశం అంతా నక్షత్రాల వేదికగా మారుతుంది.అదే విధంగా,మన హృదయాన్ని కమ్మేసే బాధలు,ఒంటరితనం, నిశ్శబ్దం ఇవన్నీ కలిసే మనలోని కాంతిని బయటపెడతాయి.నేనూ చాలాసార్లు అనుకున్నాను ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు ఈ నిరాశ,ఈ మౌనం,ఈ చీకటి నన్ను వెంబడిస్తోంది? కానీ కాలక్రమంలో గ్రహించాను.ఇవన్నీ నా లోపల నిద్రిస్తున్న నక్షత్రాలను మేల్కొలిపే శక్తులని.ప్రతి విఫలమైన కల వెనుక ఒక పాఠం ఉంది,ప్రతి బాధ వెనుక ఒక బలం ఉంది,ప్రతి చీకటి వెనుక ఒక కొత్త ఉదయం ఉంది.నక్షత్రాలు రాత్రిని చూసి భయపడవు.అవి రాత్రిని ఆలింగనం చేసుకుంటాయి.ఎందుకంటే,రాత్రి లేకపోతే వాటి అస్తిత్వమే కనబడదు.అదే తత్వం మనకు వర్తిస్తుంది.మనం ఎదుర్కొనే చీకటిని తప్పించుకోవడం కాదు,దానిని మన ప్రకాశానికి ఆధారంగా మార్చుకోవడం నేర్చుకోవాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

28) *మనం* ప్రేమించే వాళ్ళకంటే *మనల్ని* ప్రేమించే వాళ్లతోనే మన *జీవితం* బాగుంటుంది . అందరం *బాగుండాలి* అందులో మనముండాలి అనే చిన్న స్వార్థం నాది .ఈ రోజుల్లో *మాయ* మాటలకు ఉన్న విలువ *మంచి* మాటలకు లేదు *జీవితంలో* గొప్పగా చెప్పుకోవడానికి *ఏం సాధించావని* అడిగితే *గర్వంగా* చెబుతాను, నేను *నమ్ముకున్న* వాళ్ళని నెనెప్పుడు *మోసం* చేసింది లేదని..వదిలేస్తే *జారిపోయేవి* ఎన్ని ఉంటాయో పట్టుకుంటే *మనతో* ఉండిపోయేవి కూడా *అంతకు* మించి ఉంటాయి.అది *జీవితమైనా , బంధాలైనా,మిత్రులైనా , ఇంకేమైనా ? .*మనం *నిజాయితీగా* ఉండడం కూడా *ఓ యుద్దంలాంటిదే ! . యుద్దంలో *ఒంటరిగా* నిలవడం ఎంత *కష్టమో* సమాజంలో *నిజాయితీగా* ఉండడం కూడా అంతకన్నా *కష్టం*.మనం ఎంత *మంచిగా* ఉన్నా ఎవరో ఒకరి *కధలో* చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని *నటిస్తూ* బతకడం కన్నా మనకు *నచ్చినట్లు* బతికేయడం *మంచిది*

29)మనం యవ్వనంలో ఉన్నప్పుడు,కష్టపడి సంపాదించిన డబ్బే వృద్ధాప్యంలో మనకు చేతికర్రలా ఉపయోగపడుతుంది.డబ్బుని ఆదా చేయడం చాలా అవసరం.డబ్బు పోతే సంపాదించుకోవచ్చు అని ఎవరన్నా చెప్తే ఆ మాటని కొట్టిపడేయండి..ఎందుకంటే ఆ మాటలన్నీ వినడానికి బాగుంటాయే తప్ప నిజ జీవితంలో పనికిరావు.. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుంటేనే విలువ..లేకపోతే మనిషికి శిలువ వేసే కలియుగంలో ఉన్నాం..ధనం మూలం ఇదం జగత్ అని ఊరికినే అనలేదు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

30)అవసరానికి వాడుకొని వదిలేయడం నా స్వభావం కాదు…ఒక్కసారి ప్రేమగా పిలిస్తే,వాళ్లే అనిపించి మురిసిపోతాను.చిన్న చిన్న మాటల్లోనూ స్నేహం వెతికే మనసు నాది.మోసం చేయడం రాదు,నిజాయితీగా ఉండటమే తెలుసు.మనసులో నిండినది ప్రేమే,దానిని పంచడమే నాకు ఆనందం.ఇలాంటి మనసు కలిగినప్పుడు,జీవితం ఎంతో అందంగా మారుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

31)ఏ క్షణం ఏం జరుగుద్దో ఎవరికి అందదు. 
నిన్న అనేది నిజం. 
రేపు అనేది అబద్ధం
ఇవాళ అనేది అదృష్టం.
కాబట్టి ఉన్న ఈ క్షణాన్ని దీని కోసం దాని కోసమని వృధా చేసావా పోయిన సమయాన్ని నువ్వు ఏమి చేసినా తిరిగి తీసుకురాలేవు అందుకే నీకున్న ఈ కొద్ది సమయాన్ని నీ ఎదుగుదల కోసం పక్కవారి బాగు కోసం సద్వినియోగపరుచు దేవుడు ఇచ్చిన జీవితానికి అప్పుడే అర్ధం..పరమార్ధం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

32)అడ్డుకట్టతో నీటి ప్రవాహాన్ని ఆపచ్చు కానీ డబ్బు కట్టలతో ఊపిరిని ఆపలేము..ధనము ఇచ్చే దైర్యము కంటే కష్ట సమయంలో మన అనుకున్నవాళ్ళు ఇచ్చే దైర్యమే గొప్పది ధనము ఉందని అయిన వాళ్ళని దూరం చేసుకోకండి..అలా అని వ్యక్తిత్వాన్ని చంపుకొని బంధుత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

33)మనం మంచోళ్ళమా చెడ్తోళ్ళమా ఈ సమాజానికి అవసరం లేదు.వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళను 
చేస్తారు.అవసరం తీరిన తరువాత చెడ్తోళ్ళను చేసేస్తారు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

34)కాలం మారుతోంది.మనుషుల్లోఈర్ష్య అసూయ ద్వేషాలు పెరిగిపోతున్నాయి.చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకునే వారు ఎక్కువగా కన్పిస్తున్నారు..అందరూ బాగుండాలి అందులో నేనుండాలి..అని అనుకునే వారికన్నా ,నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు.కాని వాడికి మాత్రం రెండు కళ్ళు పోవాలి.అని అనుకునే వారి శాతమే ఎక్కువ..అయితే వీరి శాపనార్ధాల వలన ప్రయోజనం ఉంటుందా ? అని అనుకుంటే,వీరి నరఘోష ఎంతో కొంత హాని కలిగిస్తుందనే భావించాలి.అయితే దీని వలన వీరికి ధీర్ఘకాల ప్రయోజనం ఏమీ కలగదు,అయినా ఒకరి చెడు కోరిన వారు ఎవ్వరూ బాగు పడిన దాఖలాలు లేవు...కాబట్టి నీ ధర్మం కర్మ నువ్వు చేయి తక్కినది దేవుడే చూసుకుంటాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

35) అసూయ పడే వారితో మన అభివృద్ధి...!
ఆవేశపడే వారితో మన ఆలోచనలను.........!! పంచుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

36)కోపం బాధ ఏదైనా చూపించారంటే దాని వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది..కోపంలో మనం ఎవరినైన ఏదైన అన్నామంటే అది కోపంతో కాదు..ప్రేమతో అని తెలుసుకోవాలి..అలాగే మనం ఇష్టపడేవారు ఎప్పుడైనా బాధలో వుంటే వాళ్ళ కోసం మన కన్నీళ్ల వెనుక దాగి ఉన్న ప్రేమెంతో తెలుసుకోవాలి..అలాగే మనకు వచ్చే కోపం దాని వెనుక ఉన్న బాధ ఏమిటో అర్థం అవుతోంది.కోపం..బాధ ఉన్న చోటే అంతకు మించి రెట్టింపు ప్రేమ కూడా ఉంటుంది అని అర్ధం చేసుకోవాలి..అలాంటి ప్రేమ ఒక్కసారి చేజరితే జీవితకాలం ప్రాధేయపడిన దొరకదు..దొరకని చోట ప్రేమ వెతకకు..దొరికిన చోట ప్రేమని వదలకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

37)తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్‌..పడిన అవమానాలు,ఓడిపోయిన ఆనవాలు,కార్చిన కన్నీరు,ఎగతాళి చేసిన బంధువులు..పక్కనే ఉంటూ డబ్బు కోసమే వెన్నుపోటు పొడిచే వాళ్ళు..కొన్ని గెలుపులు,ఎన్నో మలుపులు..అతి కొన్ని సంతోషాలు పడిపోతూనే పైకి లేపిన కష్టాలు ఎందరో పాత్ర సూత్ర ధారులు..ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నో ఎనెన్నో..నువ్వుఏమి ఒట్టిగా ఈ స్థాయికి రాలా..అన్ని చూసి నెట్టుకుని..కష్టాలన్నీ తట్టుకుని వచ్చి నిలబడ్డావని గుర్తుపెట్టుకో..కాబట్టి దేనికి తలవంచక నువ్వు అనుకున్న గమ్యాల్ని ఛేదించి సాధించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

38)ఒకటి గుర్తుపెట్టుకో దాచుకున్న రూపాయి ధనవంతుడ్ని చేస్తుంది..సాయం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడ్ని చేస్తుంది..కూడబెట్టింది కాటివరకు వస్తుంది..సాయం చేసింది నీ తరతరాలు నిలుస్తుంది..కుదిరితే ఒకరికి తోడుగా నిలబడే ప్రయత్నం చేయి..ఆ దేవుడే నీకు నీడగా నిలబడతాడు..నువ్వు చేసిన కర్మే నిన్ను రక్షిస్తుంది..ఎందుకంటే కర్మకి..కాలానికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ..ఎంత కాలం తర్వాతైనా సరే నువ్వు చేసిన మంచి..చెడులకు కర్మ ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు..కాబట్టి నాకేంటిలే అని విర్రవీగి పక్కవాడి ఉసురుపోసుకుంటే అది నిన్ను ఖచ్చితింగా ఇవ్వాల్సినంత ఇచ్చి వెళ్ళిపోతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

39)ప్రతిభ అనేది దేవుడిచ్చిన వరం..దానిని ఉపయోగించుకుంటూ వినయంతో మెలగాలి..ప్రఖ్యాతి మనుషులు ఇచ్చేది – దానికి కృతజ్ఞత చూపాలి..ఏకాగ్రత మనసు ఇచ్చేది – దాన్ని జాగ్రత్తగా కాపాడాలి..ప్రేరణ తాత్కాలికం – క్రమశిక్షణ మాత్రం శాశ్వతం.. ఎందుకంటే విజయం ఒక్కరోజులో రాదు – ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే గొప్ప ఫలితాలను ఇస్తాయి.పరాజయం అనేది శిక్ష కాదు అది ఒక పెద్ద పాఠం..ఎవరూ సంపూర్ణులు కారనే నిజాన్ని అంగీకరించాలి..జీవితంలో కావలసింది నేర్చుకునే మనసు,ఎదగాలనే ఆతృత,ముందుకు సాగాలనే పట్టుదల..కాబట్టి ఎప్పుడూ న్యూ ప్రయాణాన్ని ఆపకు..ఎందుకంటే జీవితం ఒక పందెం కాదు,ఒక గమ్యం దానిని చేధించి..సాధించి నేర్చుకోవడమే అసలైన గెలుపు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

40)మనస్పర్థలు పెరుగుతున్నాయంటే,ఇంకాస్త అర్థం చేసుకోవాలని అర్థం.గొడవలు పెరుగుతున్నాయంటే,
మరికొంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఉందని అర్థం.దూరం పెరిగిపోతోందని అనిపిస్తే,సమయం కేటాయించాలని అర్థం.కష్టం వచ్చిందనో, మనస్పర్థలు పెరిగాయనో,ప్రేమించిన వ్యక్తికి దూరం అవడానికంటే ముందు కలిసి పరిస్థితులను అధిగమించాలి..అప్పుడే ఏ బంధమైనా పటిష్టంగా ఉండేది..అర్ధమైతే ఆచరించండి అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

41)అర్జునుడు చెడ్డోడు కాదు…దుర్యోధనుడూ చెడ్డోడు కాదు కానీ…ఇద్దరిలో ఒకరు చెడుగా చూప బడ్డారు.ఎలానో తెలుసా? ఒకరికి సలహాదారుడిగా శ్రీకృష్ణుడు,ఇంకొకరికి సలహాదారుడిగా శకుని ఉన్నాడు.పాండవులు ఐదుగురే… కౌరవులు వందమంది…కానీ..ఇద్దరి మధ్య యుద్ధంలో పాండవులే గెలిచారు.ఎందుకో తెలుసా??ఒకరి వెంట దర్మం నిజాయితీ తోడు ఉంటేమరొకరి వెంట అహంకారం,చెప్పుడు మాటలు తోడు ఉన్నాయి..రాముడు మానవుడు..రావణుడు జ్ఞాని,శక్తివంతుడు...కానీ..ఒకరు దేవుడు ఇంకొకరు దానవుడు అయ్యారు..ఎందుకో తెలుసా??రాముని సుగుణల వల్ల అతనికి తోడుగా తమ్ముడు లక్ష్మణుడుని నిలబెట్టుకోగలిగాడు..కానీ రావణుడి దుర్బుద్ది వలన తమ్ముడు విభిషనుడు తోడుగా ఉండలేక పోయాడు..కాబట్టి మనతో ఉండే వారు,మనకు సలహా ఇచ్చే వారు, ప్రపంచానికి మనమేంటో చూపిస్తారు..అందుకే స్నేహితుడిని, తోడుని జాగ్రత్తగా ఎంచుకోండి.మన గమ్యం,మన గుర్తింపు వారి చేతిలోనే ఉంటుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*

42)