ఒక్కసారి ఊహించుకుని చూడండి. సినిమాల్లో చూపించినంత అందంగా అయితే ఉండదుఆ ఊహే...దుర్భరంగా ఉంటుంది.ఎందుకంటే..
మనుషులు,వారి మధ్య మమతలే మానవాళి సుఖ జీవన ప్రస్థానానికి అసలు సిసలు హేతువులు.ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
2)నువ్వు కోరుకున్న జీవితం కావాలంటే..నీ అవసరాలకి మించి ఆస్థైనా ఉండాలి..నిన్ను నీ అవసరాల్ని పోషించే మద్దతైనా ఉండాలి..అవి రెండూ లేవా? అయితే మూసుకొని పని చేసుకోవాలి..జీవితాన్ని కొంచెం సీరియస్ తీసుకునే టైం వచ్చింది..కాబట్టి ఏది లైటుగా తీసుకోవద్దు..లే లేచి తలపడు నువ్వు అనుకున్నవి నెరేవేరేదాకా....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
3)జీవితంలో పని చేస్తుంటే దెబ్బలు తగలవచ్చు.అది చేయి మీద కావచ్చు,మనసు మీద కావచ్చు,కానీ ప్రతి దెబ్బ మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది.చేతికి తగిలిన గాయమే మనం తర్వాత జాగ్రత్తగా ఎలా ఉండాలో గుర్తు చేస్తుంది.మనసుకు తగిలిన గాయం మనలో సహనం పెంచుతుంది.జీవితం ఇచ్చే దెబ్బలు గట్టిగ ఉండి బాధ పెడతాయి,కానీ అవే దెబ్బలు మనకు బలం కూడా ఇస్తాయి.కాబట్టి తగిలే ప్రతి దెబ్బను శిక్షగా కాక,శిక్షణగా చూడాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
4)కాలమే తెలియజేస్తుంది మనం నమ్మే మనుషులు ఎలాంటి వారో అని..కాలం రాగానే,అదే మిత్రుడ్ని శత్రువుగా చూపిస్తుంది…అదే శత్రువుని గౌరవంగా మార్చేస్తుంది.నువ్వు ఎవరు అన్నది కాదు,కాలం ఎదుట నిలబడగలిగావా లేదా అన్నదే నీ అసలు పరిచయం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
5)మనం దేవుడ్ని అడిగే ముందు,దైవం మన భక్తిని కొలుస్తాడు..పరీక్షిస్తాడు.ఒక మెట్టు ఎక్కే ధైర్యం చూపించు..దారి లేదనుకుంటావ్ కానీ..భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో నీకు మార్గం చూపిస్తాడు..కానీ ఒకటి గుర్తుపెట్టుకో అడుగులు మాత్రం నువ్వే వేయాలి..అప్పుడే దేవుడు నీకు దారి చూపించ గలుగుతాడు..దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డుపెట్టకుండా దేవుడా దీపం ఆరిపోకుండా చూడు అంటే చూడడు..నువ్వు చెయ్యాల్సిన కర్తవ్యం నువ్వు చేయి..తక్కినది దేవుడు మీద భారం..కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన..తిరువణ్ణామలైలో నాకు జరిగిన అనుభవం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
6)ఎప్పుడు ఇతరులా మాటలు,చూపులు తప్పు..ఒప్పుల గురించి మాట్లాడుకోవడం గొప్ప అనుకుంటున్నావేమో ముందు నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది తెలుసుకో..ఒక వేలు నువ్వు చూపిస్తే మిగతా నాలుగేళ్లు నీకే చూపిస్తాయి,అని గుర్తుపెట్టుకో.. కాబట్టి ఎప్పుడూ పక్కవారిని విమర్శించే బదులు నిన్ను నువ్వు సరిచేసుకో అప్పుడు తొందరగా ఎదగగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
7)మోసం చేసే గుణం ఉండకూడదు..ఇంకొకరి మంచే కోరుకోవాలి..ఎన్ని కష్టనష్టాలు వచ్చిన వీలైనంత వరకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం అలవర్చుకునే మనస్తత్వం ఉండేలా చూసుకోవాలి..తెలిసి ఎవర్ని బాధపెట్టకూడదు..తెలియకపోతే అడిగి తెలుసుకునే ధైర్యం ఉండాలి..ఎప్పుడూ అందమైన చిరునవ్వు చిందించాలి..ఎప్పుడూ ఓపికతో ఉండడం నేర్చుకోవాలి..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి..గర్వలేని మనిషిగా మారాలి..కొనుసార్లు మనవాళ్ళని బాధపెట్టకుండా ఉండడానికి లోపల కుమిలిపోతున్నా పైకి నవ్వుల పువ్వులు కురిపించాలి..మన అనుకుంటే ఎంత దూరమైన వెళ్లగలగాలి..వీలైతే ఇంకొకరి జీవితంలో వెలుగు నింపడం తప్ప చీకట్లు చేయకుండా ఉండాలి..కొన్నిసార్లు ఎందరు ఎంత బాధ పెట్టిన సర్దుకొనిపోవాలి..ఎందుకంటే వారికి కలం సమాధానం చెబుతుంది..ఇలా చేస్తూపోయే వారిని దేవుడు సదా తోడై నీ పక్కనే ఉండి నడిపిస్తాడు..అర్ధమైతే ఆచరించు..అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
8)బ్రతకడం నేర్చుకోండి..చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది...నవ్వడం నేర్చుకోండి...ఏడ్వడం ఎలాగో మన అనుకున్న మనుషులు నేర్పిస్తారు..నిలబడడం నేర్చుకోండి..పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్లు నటించేవారు నేర్పిస్తారు..జీవించడం నేర్చుకోండి..మరణం ఎవ్వరికి బంధువు కాదు,
ఏదోకరోజు కచ్చితంగా వస్తుంది...తేలడం నేర్చుకోండి...ముంచడం ఎలాగో నువ్వు నమ్మిన
వ్యక్తులు నేర్పిస్తారు... కాబట్టి దేనికీ అతిగా స్పందిచద్దు ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది..నువ్వు చెయ్యాల్సిన మంచి మాత్రమే చేయి ఫలితం దేవుడు ఇస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
9)ఇద్దరి వ్యక్తులు కలిసుండాలంటే ప్రేమ ఎంత ముఖ్యమో..బాధ్యత కూడా అంతే ముఖ్యం..ఈ రెండిటిలో ఏది తగ్గినా..ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు..ఇక్కడ అసలు సమస్య ఇదే..ప్రేమని పంచుకోడానికి ముందుండే మనుషులు..బాధ్యతలు పంచుకోడానికి మాత్రం వెనకడుగు వేస్తారు..బహుశా అందుకేనేమో మాటల్లో..కవితల్లో అందంగా కనిపించే ప్రేమ..జీవితాల్లోకి వచ్చేసరికి కాస్త ఇబ్బందిగా మారుతుంది..అందరికి తాజ్ మహల్ వెనుక షాజహాన్ ప్రేమ కనిపిస్తుంది కానీ..అతను ప్రేమించాడు కాబట్టి తాజ్ మహల్ కట్టలేదు..అది తన బాధ్యతగా భావించాడు కాబట్టి ఆ అద్భుతాన్ని సృష్టించాడు..చివరిగా నేను చెప్పేది ఒక్కటే..ఒక వ్యక్తి మీద నీకు ఎంత ప్రేమున్నా..అది చేతల్లో(బాధ్యతగా)కనపడకపోతే..అది అసలు ప్రేమే కాదు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
10)జీవితం అనేది దేవుడి పరీక్ష..రాముడు అరణ్యంలో ఉన్నా,కృష్ణుడు యుద్ధంలో ఉన్నా,వారిని నిలబెట్టింది వారి యొక్క ధైర్యం ,ధర్మం.మనకు కూడా కష్టాలు వస్తాయి..కానీ దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకం ఉంటే..ఆ కష్టాలు ఆశీర్వాదాలుగా మారిపోతాయి.భగవంతుణ్ని హృదయంలో పెట్టుకో...నీ జీవితం విజయగాథ అవుతుంది.. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
11)మన జీవితానికి సార్ధకత ఎప్పుడు వస్తుందంటే నీకు చేతకాదు అని హేళన చేసేవారి చేత చప్పట్లు కొట్టించు కోవాలి..నువ్వు పనికిరావని నిన్ను దూరం పెట్టినవారు నిన్ను వెతుక్కుంటూ రావాలి..నువ్వు ఏమీ చేయలేవు అని చులకనగా మాట్లాడిన వారు మమ్మల్ని ఏమీ చేయద్దని ప్రాధేయపడాలి..నీకు ద్రోహం చేసిన వారే నీ సాయం కోసం నీ ముందు తలవంచాలి..నీకు కన్నీళ్లను పరిచయం చేసినవాళ్లే ఆ కన్నీళ్లకు క్షమాపణ చెప్పు కోవాలి..నువ్వు వెళ్లేదారిలో
ముళ్ళను వేసినవాళ్లే నీకు పూలస్వాగతం పలికేలా నువ్వు మారాలి..నిన్ను భయపెట్టాలి అని అనుకున్న వారికి నీ ధైర్యాన్ని రుచి చూపించాలి..నువ్వు నిలబడడమే కష్టం అని అనేవారి ముందు అడుగులు వేసి చూపించాలి..నువ్వు ఓడిపోతే నవ్వాలని వేచి చూస్తున్నవారికి నీ గెలుపును కానుకగా మార్చి వారికివ్వాలి అప్పుడే నీ జన్మకి ఒక అర్ధం..పరమార్ధం దక్కుతుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
12)జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం.కొన్ని తెలిసి చేస్తాం.ఇంకొన్ని తెలియక చేస్తాం.కొన్ని మన స్పృహలో జరుగుతాయి,ఇంకొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగి పోతాయి. అయితే,చాలా సార్లు మన మీద పెట్టుకున్న అంచనాలు,అపోహలు,
మితిమీరిన అంచనాల వల్లే మనల్ని తప్పుల పాలు చేస్తారు.మన జీవితం ఒక రహదారి అయితే,ఆ రహదారిలో నడిచే ప్రతి మనిషి తనకంటూ ఒక దారిని ఊహించుకుంటాడు.కానీ మనం ఎంచుకున్న దారి వాళ్ల ఊహలకు సరిపోకపోతే,మన అడుగులకే తప్పు అనే ముద్ర వేసేస్తారు..నువ్వు చేయాల్సిందల్లా నువ్వు నమ్మిన నీ దారిలో నువ్వు ప్రయాణించడమే ఎక్కడ ముళ్ళు రాళ్లు ఉంటాయో చూసుకొని జాగ్రత్తగా అడుగైడమే అప్పుడే నీ ప్రయాణం ఏ అడ్డంకి లేకుండా ముందుకు సాఫీగా సాగేది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
13)తప్పు అనేది నిజానికి పరిమితి దాటి చేసిన ప్రయత్నం.కొన్నిసార్లు అది పతనమవుతుంది, ఇంకొన్నిసార్లు పాఠమవుతుంది..కానీ చివరికి అది మన అనుభవాలను గాఢంగా మలచే శక్తి.ఎప్పుడూ తప్పులు చేయని మనిషి,జీవితాన్ని లోతుగా అనుభవించని వాడే అవుతాడు.ఎందుకంటే తప్పులు లేకుండా జ్ఞానం వూరదు.తప్పులు లేకుండా మనిషి పెరగడు.. కాబట్టి తప్పు చేయచ్చు..కానీ ఆ తప్పు నుంచి గుణపాఠం నేర్చుకుని మళ్ళీ ఆ తప్పు తిరిగి చేయకుండా ఉండడమే జ్ఞానం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
14)మన తప్పులు మన సొంత కళ్ళతో చూస్తే ఎప్పుడూ చిన్నవిగా కనిపించవచ్చు.కానీ ప్రపంచం అనే అద్దంలో అవి విపరీతంగా పెరిగి,మన విలువలనే మింగేస్తాయి.మనిషి తన హృదయాన్ని ఎవరికి చూపించలేడు గానీ,ప్రపంచం మాత్రం ఆ ఒక్క క్షణాన్ని పట్టుకుని జీవితం మొత్తం తీర్పు చెబుతుంది.అక్కడే నిజమైన బాధ మొదలవుతుంది.తప్పు వల్ల కాదని,తప్పును ఎవరూ అర్థం చేసుకోకపోవడం వల్ల.తప్పులు – మన మానవత్వానికి అద్దం.తప్పు చేసినప్పుడు సరిదిద్దుకునే అలవాటు ఉండాలి అప్పుడే నీకు జీవితంలో ఎదిగే లక్షణం ఉంటుంది లేకపోతే నీ జీవితం అదఃపాతాళమే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
15)కొన్నిసార్లు తప్పులు మన అహంకారాన్ని కరిగిస్తాయి,మన సహనాన్ని పెంచుతాయి,
మన హృదయాన్ని మృదువుగా చేస్తాయి.తప్పులు చేయకూడదనేది అసాధ్యం.కానీ తప్పు చేసిన తర్వాత లేచి ముందుకు నడవడమే గొప్పతనం.ప్రపంచం మన తప్పుల ద్వారా మనల్ని కొలుస్తుంది,కానీ మన జీవితం మాత్రం ఆ తప్పులనుంచి మనం ఏమి నేర్చుకున్నామనే దానితో నిర్ణయించబడుతుంది.తప్పు పాఠం అవ్వాలి,ఆ పాఠం జ్ఞానంతో దారి చూపాలి..అదే నీ జీవితంలో ఎదుగుదలకు అడుగుగా మారాలి..అప్పుడే నువ్వు చేసిన తప్పు నుంచి నేర్చుకుని అందరికి మార్గదర్శకుడిగ అవ్వగలవు..నిన్ను చూసి పదిమంది మారగలరు అప్పుడే నీ జీవితానికి తగిన న్యాయం చేయగలవు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
16)తప్పులు చేస్తాం.అవి మనల్ని బలహీనులుగా చేయడానికి కాదు,మనలో ఇంకా మనిషి బతికే ఉన్నాడని గుర్తు చేయడానికి.ప్రపంచం తీర్పు చెబుతుంది,అపోహలు ముద్ర వేస్తాయి,
కానీ మన హృదయం మాత్రం మెల్లగా చెబుతుంది.నువ్వు చేసే ప్రతి తప్పు నీ ఎదుగుదలకు ఒక మెట్టే అని... కాబట్టి తప్పు చేసానని దిగులు చెందకుండా ఆ తప్పు నుంచి ఏమి నేర్చుకుని ముందుకు వెళ్ళమనదే ముఖ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
17)జీవితం అస్థిరతల తీగపై నడిచే ఆట.అక్కడ ప్రతి అడుగు జారిపోవచ్చు,ప్రతి క్షణం కొత్త సవాలు విసరచ్చు.కానీ ఒకసారి మనం సమతుల్యం పట్టుకోవడం నేర్చుకున్నాక,ఆ తీగపై నడకే మనకు సత్యం,సౌందర్యం,శాంతి అవుతుంది.
అందుకే తప్పులు చేసేసానే అని భయపడ కూడదు.ఒంటరితనం వచ్చిందని ఆగిపోవకూడదు.మనసు జారిపోయిందని మనల్ని తక్కువ చేసుకోవకూడదు.ఎందుకంటే...
తప్పులు మనల్ని బలహీనులను చేయవు,
మనల్ని మరింత బలవంతులుగా మారుస్తాయి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
18)నేను జీవితంలో కచ్చితంగా గెలుస్తా..నాకు ఆ విషయం తెలుసు..నాకు కొన్ని దెబ్బలు తగలొచ్చు!!
కొన్నిసార్లు కింద పడొచ్చు!!..నా శక్తి మొత్తం అయిపోయే స్టేజ్ కి నేను రావచ్చు!!..అప్పటికి నేను నించుంటా..ఓటమిని అంగీకరించి!! నేను జీవితం అంటే ఏంటో నేర్చుకుంటున్నా!!ఎందుకంటే..నాకు తెలుసు ఉన్నది ఒకటే జీవితం అని!! ఓడిపోయాను అనే బాధలోనో ఓడిపోతాను అని భయం లోనో
గడపాలన్న ఉద్దేశం లేదు!! ఈరోజు నాది కాకపోవచ్చు!! నాకంటూ ఒకరోజు వచ్చేదాకా
నేను నాలాగే ఉంటా నేను ఎదురు చూస్తూ ఉంటా...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
19)డబ్బు లేని జీవితం ఎప్పుడూ శూన్యతనే మిగిలిస్తుంది,గుండెలో ఖాళీ,స్నేహాలు,బంధాలు నిర్వీర్యంగా మారిపోతాయి,డబ్బు లేకపోతే ప్రతి ఆశ,ప్రతి అవకాశం – చీకటిలో కలసిపోతాయి.
డబ్బు అంటే,అది కేవలం పేపర్ కాదు,మనం ప్రేమించగల,గౌరవించగల పవర్,చిన్న సంతోషాలను,చిన్న నవ్వులను,భవిష్యత్తును ఇస్తుంది.కానీ దాంతో జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యం చేస్తే,అది మన జీవితాన్ని నిర్మూలిస్తుంది,బంధాలను వణికిస్తుంది,ఆశలు అడియాశలుగా మారి పోతాయి..ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు పట్ల ప్రేమ, కృతజ్ఞత, జాగ్రత్త – ఇవే మన జీవనానికి రుచి, బంధాలకు బలం,అది లేకపోతే,మనసు,జీవితం ఖాళీ,శూన్యం..అవునన్నా కాదన్నా..ధనం మూలం ఇదం జగత్..సినిమాలో చూపించినట్టు జీవితం ఉండదు..మన జీవితంలో అతి ముఖ్యమైన పవర్ మనీ..దానిని ప్రేమించు,గౌరవించు,మంచి విషయాలకు ఉపయోగించు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
20)గతం గాయాలకు కారకులెవరు??..భవిష్యత్ భయాలకు భాద్యులెవరు??..ప్రస్తుత ప్రశ్నలకు సమాధానం ఎవరు?...గతం గాయాలు మాన్పుకుంటు భవిష్యత్ భయాలను చేదిస్తూ
ప్రస్తుత ప్రశ్నలను పరిష్కరిస్తూ సాగాల్సింది
నీకు నీవే నీతో నీవే..ప్రతికూల పరిస్థితి చూసి నీరసించిపోకు..భయాలకు లొంగిపోకు..చేయాల్సిన యుద్ధం ఇంకా ఉంది
గెలవాల్సిన పోరాటం చాలా ఉంది..అనుభవించాల్సిన ఆధిక్యత ఎదురుచూస్తుంది..అందుకోవాల్సిన నీరాజనాలు వేచి ఉన్నాయి..తడబడుతున్న అడుగులను సరిచేసుకుంటు..సతమత అవుతున్న ఆలోచనలను సర్దిచెప్పుకుంటూ నీలో నీవే నీతో నీవే సాగిపోవాలి ఎందుకంటే కడదాకా నీ ప్రయాణం నువ్వొక్కడివే చేయాలి..కాబట్టి నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకో..అప్పుడే ప్రశాంతంగా బ్రతకగలవు లేకుంటే నీ బ్రతుకు అదఃపాతాళమే.. ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*