Saturday, June 11, 2011

'జీవిత రహస్యం'

'జీవిత రహస్యం'
"మానవ జీవిత౦"

ఓ మానవుల్లరా మనం జీవించు చున్నది జీవితమా ఒక్క సారి ఆలోచించండి లేక భానిసత్వమా! దీర్గాలోచన చేయవలసిన సమయం ఆసన్నమయినది ...

అసలు ముందు మనము జీవితం అర్ధం తెలుసుకోవాలి

జీ జీవించి
వి వికసించి
తం తన్మయత్వంతో

తనువు చలించడం మానవుని జీవితానికి ఒక పరమార్ధం. కాని మనకు ప్రసాదించిన ఈ అమూల్య మైన జీవితాన్ని మనలోని ఉన్న కోరికలకు బలిపరిచి ఆ అర్ధం ఒక్క అవహేళన పరుస్తున్నారు కొందరు మానవులు.

మనమందరం మనం చదువుకున్న చదువుకు, మనలో ఉన్నా విజ్ఞతకు, మనము ఈ భూమి లో ఉన్నందుకు కారకులైన ఈ భూమాత మరియు స్త్రీ మాతను మరువరాదు. ఎన్ని చెప్పుకున్న ఎన్ని విన్న, వినకున్నా ఈ శరీరం ఉన్నంతవరకే :

ఆ ఆత్మ
యు యుద్ధముతో
షు ముగించడం వరకే

ఎన్ని సంఘటనలు చూసిన, ఎన్ని జీవితాలు చూసిన, ఎన్ని విషయాలు సంగ్రయించిన మనవుడు మానవుడే.

ఈ జన్మకి మనమందరం సాధించగలిగేది ఒక్కటే మానవసేవ.

మానవసేవ అని మన పెద్దలు మంచి ఉద్దేశ్యంతో చెప్పారు మనిషిని మనిషిగా చూడమని ఓ మార్గం అన్వేషించారు:

మా మానవత్వంతో

న నమ్మకంతో

వ వ్యయమనుకోకుండా

సే సేవించు

వ వ్యక్తిగతంగా

కాని కాలానుగుణంగా ఈ ఉద్దేశాలను కొంతమంది తమ స్వలాభాలకు, కొంతమంది దురుద్దేశాకరంగా వారి వారి జీవన విధానంలో ఉంటూ పాడుచేస్తున్నారు.


ఓ మహాకవి చెప్పినట్టుగా రాజకీయనాయకుడు వలె మనవుడు మారుతున్నాడు:

రా రాక్షసుడు

జ జరాసంధుడు

కీ కీచకుడు

య యయాతి

నా నారదుడు

య యముడు

కు కుబేరుడు

డు డు డు బసవన్న వలె


మానవుని మార్పు

మా మానవత్వంలేని

న నమ్మకద్రోహి

వు నయవంచన

డు డాంబికాలు చెప్పుకునే వ్యక్తిగా

మారిపోయాడు

సేవా మార్గం లో ముందుగా మనతో పయనం చేయుటకు సిద్దమైన వ్యక్తులను క్షుణ్నంగా పరిక్షించాలి. స్వలాభం చూసుకొని, స్వాభిమానాన్ని గౌరవించధగా, స్వార్ధం ఈసింతినలేని, స్వేచ్చగా ఆలోచించగల, సొంతంగా భావించగల, మనషులను మనము చేరదీయాలి. అంతేగాని దురాశతో, దురంకరంతో, దొందుకు దొందుగా తయ్యరయ్యే వ్యక్తులను ఎప్పటికి మనము సేవా మార్గంలోకి రానివ్వకూడదు.

సే సేవించు

వా వ్యక్తిగతంగా అన్న అర్ధం మారిపోతుంది లేకుంటే.

అంతం అవబోయే జీవితం కోసం
అంతు లేని ఆశ ఎందుకు

అసలు ఆశ కి అర్ధం ఏమిటంటే

ఆ ఆత్మను

శ శపించటం

అంటే మనము ఆశ పరులం అనుకోండి మన ఆత్మని మనమే నిందించుకోవడం అన్నమాట.

మనము ఆస్తి కావలనుకుంటాము కాని, మనము ముందుగా దాని స్వరూపము, అర్ధం తెలుసుకోవాలి

ఆ ఆత్మను

స్థి స్థిరముగా ఉంచనిది

అటువంటి ఆస్తిని మనము సంపాదించి మన తదనంతరము ( ఇప్పుడు ఆ పరిస్తితి లేదనుకోండి)
మన సంతానానికి ఇస్తాము. ఇలా సంపాదించి ఇచ్చే ముందు మనకి సంతానము ఒక్క అర్ధం తెలుసుకోవటం ముఖ్యం:

సం సంపాదనకోరకు

తా తన్న డానికైన

న నాంది పలికి

ము ముందు కొచ్చువారు

అనగా మన జీవిత కాలం అంతా మన కొరకు బతకకుండా, మన ఆశయాలను అణచివేసుకొని, ఆలోచనలకు పదును పెట్టకుండా బతికి, బతికి నంతకాలం సంపాదిస్తున్న సంపాదన ఆఖరికి మన గౌరవాన్ని, ఆత్మని, స్వాభిమానాన్ని కాలదోసి, మన దేహానికి దెబ్బలు, తన్నులు ప్రసాదిస్తుంది అన్నమాట. అలాంటి ఆస్తి మనకు అవసరమా ఆలోచించండి!!

కనుక రండి కదలిరండి, మనము మన కొరకు, మన ఆశయాల కొరకు, మన ఆలోచనల విధంగా, మన అభిమానాన్ని కాపాడే విధంగా, ఉండే జీవితాన్ని జీవిధామని ప్రమాణం చేద్దాం.

సంఘ జీవి

కాకి " సంఘ జీవి"
తనకి కనిపించిన కొంత ఆహారమైన
తన జాతిని కావ్ కావ్ అని పిలిచి తింటుంది
ఎందుకంటే సంఘ జీవి అంటే, సంఘంలో కలసి మెలసి బతకాలని కాకి కి తెలుసుగనక
అందుకే స్వార్ధంతో తానోక్కటే తినాలని ఆశపడదు ...
జ్ఞానం బుద్దికుశలత లేక పోయినప్పటికీ విచక్షణతో కాకి మెసులుకుంటుంది

కాని మనిషికి బుద్ది, జ్ఞానం కలిగి ఉన్నా....
తన జాతి వారికి ఆహరం పెట్టడానికి,
సంకుచించి అంతా తానె స్వార్ధంతో తినేద్దమనుకుంటాడు
అంటే ఎవరు బ్రతికి ఉండకూడదు , తానొక్కడే బ్రతికి ఉండాలని భావిస్తాడు
సంఘంలో కలసి మెలసి వుండవలసిన మానవుడు
అదే సంఘానికి ద్రోహం చేస్తాడు,
ఇదే ఇప్పుడున్న మానవ జాతి గొప్పతనం ....
--
by raghu

'మగవాడు - మగువ'

'మగవాడు - మగువ'
" మగవాడు కావాలనుకుంటాడు కాంతను

కాని, పోగొట్టుకుంటాడు తన జీవిత కాంతిని"

" మగవాడు అనుకుంటాడు ఆడది తన జీవితంలో ఆడంబరాలు తెస్తుంది అని,

కాని ఊహించలేకపోతాడు ఆడది తన జీవితంతో ఆడుకుంటుంది అని"

" మగవాడు కోరుకుంటాడు రొమాన్స్ చెయ్యాలని

ఇక ఉండదు అతని రోషం అని మరుస్తాడు"

" మగువ తన చూపులతో పడవేస్తుంది మగవాడిని తన ప్రేమలో

అప్పుడే చెప్పకనే చెప్తుంది ఇక జీవితంలో అన్ని విషయాలు తను సైగలతోనే చెప్తానని"

" మగువ తన ముని వెళ్ళు కదుపుతూ మాట్లాడుతుంది అంటే

ఇక మగవాడిని తన ముని వేళ్ళతో ఆడిస్తానని"

" ఆడ వాళ్ళు ఇష్టపడతారు ఎక్కువగా స్వీట్స్ ని అంటే

తను ఎ పని చేసిన ముందు తీపిగా ఉండి తర్వాత చేదుగా విషంగా ఉంటుంది కనుక"