2)ఎన్నాళ్ళు దిగాలుగా కూర్చుంటావు..? దిగులుపడే నీవంటే నలుగురికీ దిగదుడుపే..ఎవరి కష్టాలు వారికున్నాయి నీ కష్టమెవరికి కావాలి...?ఓదార్పు నీవు కోరకుంటే పాపపుణ్యాల కథలు వినిపిస్తారు...నిరాశలో నీవు కూరుకునిపోతే నిట్టూర్పుల జల్లు కురిపిస్తారు.నీ కన్నీటి జడివాన నిన్ను ముంచెత్తకముందే ఆశల గొడుగు పట్టు..పోరాడితే పోయేదేముంది..గెలిస్తే గెలుపవుతావు..ఓడితే నీ జీవితానికే మలుపవుతావు...ఎడుస్తూ కూర్చుంటే ఏమవుతావు...?వెలుతురెరుగని చీకటవుతావు.. కాబట్టి ఎప్పుడు ఓటమి ఒప్పుకోకు..గెలుపు కోసం పోరాడు నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
3)జీవితంలో జరిగే ప్రతీ చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుంది..ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ప్రత్యేకంగా తయారు చేసి ఏం ఉండదు.మన ఆలోచనల్లోనే ఉంటుంది.మనం విషయాలను తీసుకునే పద్ధతిలోనే ఉంటుంది.ఆనందమనేది మనసుకు అనిపించాలి.దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు.జీవిస్తున్న ప్రతిక్షణాన్ని నువ్వేలా చూస్తున్నావో..దానిపైనే నీ సంతోషం దాగి ఉంటుంది.చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని బాధపడితే బాధే మిగులుతుంది.కాబట్టి, గతం గురించి,భవిష్యత్ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకూడదు.ప్రస్తుతం లో జీవించేవాడే ఆనందంతో ఉంటాడు.ఆనందం రాలిన జీవితం...నవ వసంతానికై ఎదురుచూస్తుంది..కారు చీకటి కమ్మిన మనసు..నిండు వెన్నెలకై ఎదురు చూస్తుంది..చివరగా మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం దొరుకుతుంది...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
4)జీవితంలో అనుకున్నంతనే అన్నీ అయిపోవు.కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు.అందుకోసం ఎంతో శ్రమించాలి.ఓపిగ్గా కష్టనష్టాలకు ఎదురీదాలి. చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహా వృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది.సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే.ఓర్పు వహిస్తేనే అనుకున్నది సాధించగలం ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
5)పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది.నాన్న కూడా అడిగిన అన్ని విషయాలకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పి సంతృప్తి పరుస్తాడు.ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు కొత్త ప్రపంచాన్ని చూడటంవేరు.కొత్తగా,అందంగా,అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి.ఈ ప్రపంచం ఎవరికి వారికే ప్రత్యేకంగా కనిపిస్తుంది.కనిపించాలి.అప్పుడే ప్రతి ఉదయం ఒక కొత్త సూర్యుడు కనిపిస్తాడు.చంద్రుణ్ని చూసి పిల్లాడు ఏడుపు ఆపి అన్నం తిన్నట్లు మనం కూడా ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దానిని దిద్ది మనకి మార్గదర్శకుడిలాగా వెలుగును చూపించి ముందుకు నడిపించే దేవుడి లాంటి మిత్రుడు కావాలి.అతడితోనే మనకు
చిట్టచివరి బంధం ఉండాలి..అలా దొరికినప్పుడు ఎటువంటి పరిస్థితిలోనైనా వారిని వదులుకోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
6)నువ్వు పర్వతంలా ఒకే చోట నిల్చుంతానంటే కుదరదు.నదిలాగా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతూ ఉండాలి.ఎలాంటి మార్పులు జీవితంలో వచ్చినా స్వీకరించి దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకోవాలి.అప్పుడే నువ్వు కలకాలం సంతోషంగా జీవించగలవు.జీవితంలో వచ్చిన చిన్న మార్పును కూడా తీసుకోలేకపోతే నీ జీవితం ఆగిపోతుంది.నీకు ఉండాలి నేర్పు,మనస్సుకి కావాల్సింది ఓర్పు,జీవితానికి కావాల్సింది కూర్పు,బాధలలో కావాల్సింది ఓదార్పు కానీ ప్రతి మనిషికి కావాల్సింది మార్పు అప్పుడే తన గమ్యాల్ని చేరుకోగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
7)గుండె లేదా మెదడు ఈ రెండింటిలో ఏది చెప్పింది వినాలో అన్న సంఘర్షణలో మీరు పడితే...కచ్చితంగా మీ హృదయాన్ని అనుసరించండి అప్పుడు జీవితంలో ఎప్పటికీ వైఫల్యం చెందరు అలాగే...మీ జీవితంలో రిస్క్ తీసుకోండి,గెలిస్తే నాయకత్వం వహిస్తారు,ఓడిపోతే మార్గ నిర్దేశం చేస్తారు.ఇది ఎంతో మంది జీవితాలలో మార్చింది..ఇప్పటికీ మారుస్తూనే ఉంది..ఇతరులు వేసిన బాటలో నడవకండి..మీ సొంత మార్గాన్ని వేసుకుని పయనించండి గ్రహించండి అప్పుడే మనం చీకటి నుంచి వెలుగులో ప్రయాణం మొదలు పెట్టినట్టే విజయం సాదించినట్టే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
8)మన జీవితానికి మనమే శిల్పి.ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపురూపమైన
విగ్రహంగా మారగలం.దేవుడి మెడలో హారంగా మారాలంటే గుండెల్లో గుచ్చే సూది బాధను పువ్వులు తట్టుకోవాలి.ఏది సాధించాలన్నా సంకల్ప బలంతో బాధలు,అపజయాలను ఎదిరించక తప్పదు.వేలసార్లు వైఫల్యం వెక్కిరించినా వెనక్కి తగ్గలేదు కాబట్టే థామస్ అల్వా ఎడిసన్ బల్బును తయారుచేశాడు.ప్రపంచానికి వెలుగులు పంచి చిరకీర్తిని సంపాదించుకున్నాడు.వైకల్యం ఉందని చింతిస్తూ కూర్చోకుండా పట్టుదలతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హా
గుండెనిబ్బరం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ఓపిక ఉన్నంత వరకు కాదు,ఊపిరి ఉన్నంత వరకు పోరాడితేనే విజయతీరాలకు చేరగలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
9)ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపెడితే ఉన్నతశిఖరాలకు చేరుకోవచ్చు.సముద్రాన్ని దాటే ప్రతిభ తనలో ఉందని వానర వీరులు చెప్పేవరకు హనుమంతుడికి తెలియదు.తనలోని లోటుపాట్లను గుర్తించి సరైన దిశానిర్దేశం చేయగల స్నేహితులను మనిషి సంపాదించుకోవాలి.అప్పుడు విజయానికి మార్గం మరింత స్పష్టమవుతుంది.బతుక్కి అసలైన అర్థమూ తెలిసివస్తుంది. జీవితానికి మించిన గ్రంథం లేదు,అనుభవానికి మించిన పాఠం లేదు.జీవితపథంలో ప్రతి అనుభవం నుంచీ పాఠం నేర్చుకోవాలి.అప్పుడు అనవసర భయాలు,ఆందోళనలు తొలగి మనసు తేలికవుతుంది.ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తే మన లక్ష్యాల్ని మనం చేరుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
10)జీవితంలో కలలు నెరవేరాలంటే- ఏకాగ్రత,నైపుణ్యం,ఆచరణ అవసరం.లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి.కొండలు, లోయలు దాటి సుదీర్ఘంగా ప్రవహిస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే నదిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.బలహీనమైన ఆలోచనలు వదిలిపెట్టాలి.విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో లక్ష్యాన్ని చేరాలి.కొంత మెరుగైన స్థితికి చేరాక నా ఇల్లు, నా కుటుంబం అంటూ గిరిగీసుకొని కూర్చోవడమూ సరికాదు.చేతనైనంతలో నలుగురికీ సాయపడటంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది. అది ఆచరణలో
పెట్టినప్పుడే జీవితానికి సార్థకత..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
11)జీవితంలో కష్టాన్ని సుఖాన్ని ఒకేలా చూడాలి అప్పుడే ఎంతటి సమస్య వచ్చినా మనం దాన్ని తట్టుకునే శక్తిని పొందుతాము.పట్టరాని సంతోషం కలిగినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా?మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎందుకంతగా ఆలోచించి విలవిలలాడి పోతున్నాము?సంతోషం కలిగినట్టే కష్టం కూడా వచ్చి అలా పోతుంది.మనం చేయాల్సినదల్లా ఆ సమస్యను తొలగించేందుకు చిన్న ప్రయత్నం.ఏరోజు ఒకేలా ఉండదు,ఏ క్షణము మనతో నిలిచిపోదు.అలాగే కష్టాలు కూడా అలా దొర్లిపోయి వెళుతూనే ఉంటాయి.తిరిగి మనల్ని సంతోష క్షణాలకు చేరువ చేస్తూనే ఉంటాయి.అలలు కూడా తీరం చేరేసరికి ఉదృతి తగ్గించు కోవాల్సిందే.సుతారంగా మన పాదాలను తడిపి వెనక్కి వెళ్లాల్సిందే..కష్టాలు కూడా అంతే...సమయం వచ్చినప్పుడు ఓసారి పలకరించి మన బలహీనతలను మనకు తెలియజేసి వెళ్ళిపోతూ ఉంటాయి.ఆ సమయంలో మనం ధైర్యంగా ఉంటే చాలు ఏ సమస్యనైనా ఛేదించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
12)మన జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి.సుఖం విలువ తెలియాలంటే కష్టాన్ని అనుభవించి తీరాలి.సంతోషం విలువ తెలియాలంటే బాధను చవి చూడాల్సిందే.కష్టాలు వస్తాయని ముందే భయపడుతూ కూర్చుంటే బతకలేము.తప్పో ఒప్పో అడుగు వేసి చూడాల్సిందే.ఓటమి పాలైతే ఆ ఓటమిలో మన బలహీనతలు ఏంటో తెలిసిపోతుంది.ఒకవేళ మనం గెలిస్తే ఆ గెలుపులో ఏది మనల్ని గెలిపించిందో మన బలం ఏంటో మనకు అర్థమవుతుంది.కష్టాలు,ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారిలో మూసుకుపోయినట్లే అనిపిస్తుంది.కానీ ధైర్యంగా ఆలోచించి చూడండి.ఎక్కడో దగ్గర ఓ దారి తెరుచుకునే ఉంటుంది.పరిసత్థులు మనకు ఒక సమస్యని తెచ్చిపెట్టినప్పుడు దానికి పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది కావాల్సింది కొద్దిగా ఓర్పు నేర్పు ఈ రెండింటితో ఎంత సమస్యనైనా మనం ఛేదించగల ధైర్యం మనకు ఉంటే చాలు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
13)జీవితంలో వచ్చే పరిస్థితులు అనూహ్యమైనవి,కానీ మనకు ఎదురయ్యే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.మన ఆలోచనలు ఎంత పాజిటివ్ గా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది.ఉదాహరణకు,మీకు ఇష్టమైన వారితో కష్టమైన చర్చ జరిగిందనుకోండి,దాని గురించి భయపడటానికి లేదా ఆందోళన చెందడానికి బదులుగా,మీరు ఎలా మాట్లాడాలో,వారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఆలోచించండి అప్పుడే మీరు ఆందోళన చెందకుండా దేనికైనా సిద్ధంగా ఉండగలరు..అలాగే మనకు నచ్చితేనే ఏదైనా పనిచేయాలి.ప్రలోభాలకు లొంగిపోయి అన్నింటికీ ఓకే చెబితే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే..కాబట్టి మనస్సుని మెదడుని ఎవరైతే అధీనపరుచుకోగలరో వారు జీవితంలో దేనినైనా సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
14)జీవితంలో మనం చేసే ఏ పని అయినా మనసా,వాచా,కర్మణా ఆచరిస్తే సత్ఫలితం కలుగుతుంది.తోటి మనిషికి మనమీద అచంచలమైన విశ్వాసం కుదురుతుంది. మనసులో మన ఆలోచన ఒక విధంగా ఉండి,నాలుక మీదకు మాటరూపంలో వేరే విధంగా వచ్చి,క్రియారూపాన్ని సంతరించుకొనేసరికి ఇంకో రకంగా ఉంటే-నిబద్ధత ఉన్నట్లేకాదు.మనం బతికే సమాజంలో నీతితో,నియతితో గడపాలని,సర్వవేళలా పక్కవ్యక్తికి మంచే జరగాలని కోరుకోవాలి.మన చేష్టలు జనహితం కోరేవిగా ఉండాలి.నలుగురికీ ప్రయోజనకరం కావాలి అప్పుడే మన జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
15)జీవితంలో ఒక లక్ష్యసాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని,దానినొక అవమానంగా భావిస్తూ కుంగిపోవడం అవివేకమే.నేడు మనం చూస్తున్న వివిధ రంగాల్లోని చాలామంది ప్రముఖులు ప్రతికూల పవనాలను అధిగమించి,విజయకేతనాలు ఎగరేసినవారే. ఉన్నతస్థితికి చేరినవారే.స్థిరచిత్తంతో అవమానాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యసాధనలో సాగిపోయేవారే ఉన్నతులు.వారే జీవితంలో విజేతలు!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
16)జీవితంలో నీది కాని బంధం కోసం ఆరాటపడి ఉన్న బంధాన్ని కోల్పోయి ఏకాకివైపోకు..లేనిదాని కోసం ఆతృతపడి ఉన్న భాగ్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోకు..పరాయి వాళ్ళకోసం పరుగులు తీసి
పరువు కోల్పోయి ప్రాణం మీదకు తెచ్చుకోకు..చెంత నుండాల్సిన చేతిని చీదరించుకుని సుమధురంగా సాగాల్సిన జీవితాన్ని ఛిద్రం చేసుకుంటే చేరదీసే వారు లేక చితికి దగ్గరైపోతావు కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి లేదంటే నీ జీవితానికి చరమాంకం పాడతారు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
17)పని చేసుకుంటూ పోవటం ఎంత ముఖ్యమో...పరిచయాలు పెంచుకుంటూ పోవటం కూడా అంతే ముఖ్యం... మనం ఎంత తోపయినా,తోపని నిరూపించుకునే అవకాశాలు, ఈరోజుల్లో పరిచయాలతోనే సాధ్యం..బావిలో కప్పల్లా ఉండకుండా..కాస్త గుమ్మం దాటి బజారుకి,అటు నుంచి ఊరులోకి, చుట్టూ ఉండే సమాజంలోకి నిత్యం తొంగిచూస్తూ ఉండాలి!!పని చేసుకుంటూ...పదిమందితో సమన్వయం చేసుకుంటూ పోవటమే విజయానికి దగ్గరి దారి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
18)జీవితంలో ఒక సెక్యూర్డ్ రిలేషన్,ఇష్టమైన పని సగం బరువుని తగ్గిస్తాయి.మంచి స్నేహితులని ఎప్పుడూ మీతో ఉండేలా చూసుకోండి.ఎవరైనా విచారంలో ఉంటే వారితో మీ సమయాన్ని పంచుకోండి.కాస్త ఓదార్పునివ్వండి.అది మీ విచారం పోయేందుకు సహాయం చేస్తుంది.నెగెటివ్‌గా మాట్లాడే మనుషులకి దూరంగా ఉండండి.పాజిటివ్ ఆలోచనలను ఇచ్చే స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి. అలాగే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా లైట్‌గా బ్రతకటం నేర్చుకోండి అప్పుడే జీవితాంతం ఆనందంగా ఉండగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
19)ఆనందం ఖర్చుతో సంబంధంలేని విషయం. కొందరు కేవలం టివిలో వచ్చే కామెడీ షోలను చూస్తూ ఆనందంగా బ్రతికేస్తారు.అలా చిన్న చిన్న విషయాల్లో ఆనందం వేతుక్కోండి. మీకు ఏ విషయం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో తెలుసుకుని అదే పని తరుచుగా చెయ్యండి.జీవితాన్ని రన్నింగ్ రేస్ లా భావించొద్దు.నిదానంగా అయినా మీకు నచ్చిన పనే చెయ్యండి.ఆలస్యం అయిపోతోంది,నేను వెనుకపడిపోతున్నా లాంటి ఆలోచనలు వద్దు.అది కేవలం సమాజం సృష్టించిన పీర్ ప్రెజర్.రోజూ ఉదయం లేవగానే ఈ రోజు నాకు ఆనందాన్నిచ్చేలా ఏ పని చెయ్యొచ్చు అని ఆలోచించి ఆ పని తప్పకుండా చెయ్యండి అప్పుడే జీవితాంతాం ఆనందంగా ఉండగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
20)ప్రతి ఒక్క మనిషి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చారు, మళ్లీ ఒంటరిగానే భూమిలో కలిసిపోతారు.మధ్యలో ఈ అందం,అధికారం,డబ్బు,మదం అవసరమారూపాన్ని,రూపాయిని చూసి మురిసిపోతున్నారా..అవి మిమ్మల్ని వదిలి వెళ్లే రోజు ఎప్పుడో ఒకసారి వస్తుందని గుర్తుంచుకోండి.ఈ మారిపోయే లోకంలో ఏదీ శాశ్వతం కాదు. తేదీలు మారుతున్నా,ఏళ్లు గడుస్తున్నా,కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే...మీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని.మీరు సాధించిన విజయాలు, ఘనతలు మాత్రం మీ మరణానంతరం కూడా కొన్ని తరాలు గుర్తు పెట్టుకుంటాయి.ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టి వంద ఏళ్లు దాటి పోయినా ఇప్పటికీ మనం ఆయన్ని మర్చిపోలేక పోతున్నాం.అలాగే మీరు చేసే మంచి మాత్రం ఎక్కువ కాలం పాటూ మీరు ఉనికిలో లేకపోయినా నిలిచే అవకాశం ఉంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
21)ఈ కలికాలంలో కొంతమంది జీవితం ఎదుటి వాళ్ల కోసమే ఉండాలి అనుకుంటారు ఆ కుటుంబాల కోసం జీవితాంతం ఎంత చేసిన ఇంకా ఏదో మిగిలిపోతుంది..ఒకటి తర్వాత ఒకటి నీకు అబద్దాలు చెప్తూ నిన్ను మోసం చేస్తూ మరి ఆడుకుంటారు వాడుకుటరు అవసరం తీరిన తర్వాత విసిరేస్తారు..ఎదుటి వాళ్ళ ఇబ్బందులు గమనించకుండా వాళ్ళ అవసరాలు తీరిస్తే చాలు అనుకునే మహాను భావులు చాలామంది ఉన్నారు..ఒక మనిషి కోసం ఇన్ని దరిద్రాల అనుభవించడం అవసరమా అని ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతాయి బంధాలు..ఇవాళ రేపు ఎవరి బ్రతుకు వాళ్ళకే కష్టంగా ఉంది అందరి బరువు మోయాలి అంటే మాటలా చెప్పే వాడికి చేసే వాడు లోకువంట..చాలావరకు అలాంటివాళ్లే ఉన్నారు ఈ రోజుల్లో అయ్యో అన్నావంటే ఆరు నెలల పాపం చుట్టుకుంటింది..మంచికి ధర్మానికి రోజులు కావివి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాంటి వారిని వెంటనే దూరం పెట్టేయండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
22)అతి మంచితనం,జాలి,దయ వంటివి మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి మహాభారతంలో కర్ణుడే ఉదాహరణ.కర్ణుడు తన అతి మంచితనంతో,దానధర్మాలతో,
తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.చివరికి చెడు వైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.జీవితంలో మీరు గెలిచి నిలవాలంటే మంచివారితోనే స్నేహం చేయాలి.అనవసరమైన వ్యక్తులకు,అనవసరమైన పరిస్థితుల్లో దానధర్మాలు చేయడం మంచి పద్ధతి కాదు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
23)డబ్బు సంపాదిస్తే సరిపోదు.దాన్ని కాపాడుకునే తెలివితేటలు ఉండాలి.చాలామంది కోట్లు సంపాదించినా,అవి వాళ్ల దగ్గర ఉండవు. చెడుఅలవాట్లు,అతిగా దానధర్మాలు చేయడం, గొప్పలకు పోయి ఎక్కవగా ఖర్చు చేయడం వల్ల సంపాదించిందంతా పోగొట్టుకుంటారు.అలాగే మనం నీతినియమాలతో కష్టపడి రక్తం పెట్టి సంపాదించిన డబ్బులు ఎక్కడికి పోవు ఆ లక్ష్మీదేవి వాళ్లను ఏదో ఒకవిధంగా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి సహాయం చేయడానికి కూడా మన స్థాయి స్తోమతని బట్టి చేయాలి అంతేగాని ఎమోషనల్ గా వాళ్ళేదో అయిపోతారని చేస్తే నడ్డి విరుగుతుంది ఇది నా స్వీయ అనుభవం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
24)ఒక స్నేహం వల్ల కోట్లు రాకపోయినా పర్వాలేదు…తల దించుకునే పరిస్థితి రాకూడదు.పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపే స్నేహం లేకపోయినా నష్టం లేదు...కానీ నీ నుంచి ఎదో ఆశించి స్నేహం చేస్తే లాభం లేదు.ఏ స్నేహం అయినా మంచి చేసేదిగా ఉండాలి మంచి దారి చూపాలి..చెడు దారిలో వెళ్ళనివ్వకుండా ఆపాలి.మంచి కోరుకోకపోయినా పర్వాలేదు గానీ చెడు ఉద్దేశంతో చేసే స్నేహం లేకపోవడమే మంచిది.ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేసిన భావన కలగకూడదు.అటువంటి స్నేహాలు కలకాలం పదిలంగా ఉంటాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
25)లాభం ఆశించి చేసేది వ్యాపారం,పుణ్యం ఆశించి చేసేది దానం,ఏమి ఆశించకుండా చేసేది సహాయం..కానీ ఎపుడైతే ఎవరన్నా మన సాయాన్ని అవకాశంగా తీసుకుంటూ మనల్ని వెధవని చేసామని వెనక ఆనందించేవాళ్ళకి పైన దేవుడనే వాడొకడున్నాడు చూస్తూనే ఉంటాడు.ఇలాంటి వారి వల్ల నిజంగా ఎవరన్నా సాయం చేయమంటూ అడిగితే మరోసారి సాయం చేయటానికి మనసొప్పదు కాబట్టి సాయం చేసేటప్పుడు ఆచితూచి చేయాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
26)యద్భావం తద్భవతి అని.అంటే,మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నా ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది…మన ఆలోచనలు,చేతలు,ఉద్దేశాలు, అంచనాలు ఎలావుంటే అలాగే మనకు జరుగుతుంది.మనము ఒకరి గురించి ఎప్పుడు అయితే తప్పుగా ఆలోచిస్తా మో అప్పటి నుంచి తప్పుగా కనిపిస్తారు మన కృషి,పట్టుదల,దీక్షలను నిర్లయించి చేతలు అలా ఉండి అవి మన గతిని నిర్ణయిస్తాయి.మతి ఎలా ఉంటే గతి అలా ఉంటుంది నువ్వు ఏదైతే ఎదురువారికి ఇద్దామనుకుంటున్నవో అదే తిరిగి నీకు వస్తుంది కాబట్టి ఆచి తూచి ఆలోచిస్తూ అడుగు వేయి నేను చేసేది ఎవరికీ తెలీదనుకోవచ్చు కానీ పైన త్రినేత్రుడు చూస్తూనే వుంటాడు కర్మ నీకు వెనక్కి తిరిగి రాడానికి కొంత సమయం పడుతుంది అంతే..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
27)జీవితం సున్నితమైనది.మన ఆలోచనలు,చేతల వల్లే జీవితం మలుపులు తిరుగుతుంది.కొన్ని సందర్భాల్లో ఆ జీవితం ఒక్కోసారి మన చేతుల్లోంచి జారి పోతుంది.దానికి కారణం కూడా మనమే.మనం చేసే కొన్ని పనులే జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి.జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మన భావోద్వేగాలు,మన చర్యలు,మన నిర్ణయాలు,మన అభిప్రాయాలు,మన ప్రతిస్పందనలు,మన మాటలు,మన ప్రవర్తన,
మన ప్రయత్నాలు,మన సమయం,మన కోరికలు, ఆకాంక్షలు,లక్ష్యాలు,అభిరుచులు, అలవాట్లు ఇవన్నీ మన నియంత్రణలో ఉంటే మన జీవితం అధ్భుతంగా ఉంటుంది.మనకు మనశ్శాంతి,ప్రశాంతత దక్కుతుంది.వీటిపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంతగా మన సామర్థ్యం పెరిగి మనం అనుకున్న గమ్యాన్ని చేరగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
28)నమ్మకం,విధేయత అనే ఇంధనం మీద నడిచే బండి స్నేహం!ప్రపంచాలు, ప్రయారిటీలు వేరైనా..మనకోసం నిలబడే ఒక్క లాయల్ ఫ్రెండున్నా చాలు.అసలు అయినవాళ్లు లేనివాడు కాదు,ఆప్తమిత్రుడు లేనివాడే అనాథ! అప్పుడే కలిసినా ఎన్నాళ్ల నుంచో తెలిసినట్టుగా పెదాల మీద విరిసే చిరునవ్వు..ఆ నవ్వును అలాగే పదికాలాలు నిలబెట్టే స్వచ్ఛమైన బంధం..నీకు వుంటే నువ్వు అదృష్టవంతుడివి అలాంటి బంధం దొరికితే వదులుకోవద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
29)మనం అవును అన్నా కాదన్నా.. కొన్ని రుణాలు బంధాలు ఉంటాయి..మనం ఎంత దూరం పారిపోతే అంతలా మన వెనకాల మనల్ని వెన్నంటే వస్తాయి..ఎందుకంటే అది మనం రాసుకున్న రాత కాదు భగవంతుడు ఎప్పుడో..ఎక్కడో రాసిన రాత..ఈ జన్మ కాకపోతే మరో జన్మ ఆ జన్మ కాకపోతే ఇంకో జన్మ బాకీ తీరేదాకా రుణానుబంధాలు వెంటాడుతూనే ఉంటాయి...మనము అవును అన్న కాదన్నా అందుకే ఎప్పుడువి అప్పుడే తీర్చేసుకోవాలి బాకీలైన బంధాలైనా మళ్లీ జన్మకి మిగిల్చకుండా..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
30)మన అనుకుంటేనే మోయలేని జ్ఞాపకాలు! మాయని గాయాలు!! మనకెందుకు అనుకుంటే ఏమి ఉండవు కదా!!ఒక్కసారి మన అనుకున్నాక తప్పదు కదా!!ఇంకెందుకు కన్నీళ్ళు!? బరువు ఎత్తుకున్నాక గమ్యం చేరే వరకు మోయాలిగా! ఒకవేళ మధ్యలో దించుకున్నా నువ్వే మళ్ళీ ఎత్తుకోవాలి!! నీ బరువు ఇంకెవరు మోస్తారు!? ఎవరి బరువు వాళ్ళకు ఉండనే ఉంది కదా!! ఓపిక ఉన్నంత కాలం కాదు..ఊపిరి ఉన్నంత కాలం ఈ బంధాలు,వారి బాధ్యతలు..తప్పనివి.తెంచుకుంటే తెగిపోయేవి కాదు..వద్దనుకుంటే వదిలిపోయేవి కాదు!!మనసుతో ముడిపడినవి! మరణంతోనే ముగిసేవి!!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
31)వంద సార్లు విను.
వేయి సార్లు ఆలోచించు.
ఒక్కసారి మాట్లాడు.
నలుగురూ నిన్ను చూసి
నీలా ఉండాలి అని అనుకోవాలేగాని.
నీలా ఉండకూడదు అని మాత్రం అనుకోకూడదు.
32)ఆకలేస్తున్నప్పుడు ఎవరైనా ఓ ముద్ద పెడితే బాగుణ్ణని ఆకాశంలోకి చూసేవేళ అనుకోకుండా వచ్చి కడుపునింపిన అన్నదాతే కంటికి కనిపించే 'దేవుడు'..రోడ్డుమీద దెబ్బలు తగిలి నెత్తురోడుతున్న అపాయకర పరిస్థితుల్లో పనులు మానుకుని మరీ ఆసుపత్రికి తరలించే ఆపద్బాంధవుడే పేరు తెలీని ఓ 'దేవుడు..'నీ కష్టకాలంలో నీ సమస్యని తన సమస్యగా అనుకుని నీకు సాయం చేయడానికి ముందుకు వచ్చే స్నేహితుడి కూడా ఓ దేవుడే..దేవుడంటే ఎవరో కాదు భయ్యా..సాయం..నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు..అంటే దైవం మనుష్య రూపేణా..మనిషి నమ్మకంతో వెతికితే దేవుడు ఎక్కడో కాదు..మనచుట్టూనే ఏదో రూపంలో కనిపిస్తాడు...కాబట్టి నీ స్థాయి స్తోమతని బట్టి సాయం చేస్తే ఆ పరమాత్మే నీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
33)మంచోళ్ళు ఉన్న చోట కొందరు ముంచేటూళ్లుంటారు తస్మాత్ జాగ్రత్త ఆ కొందరిగురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కానీ తెలుసుకుంటే తప్పేంటి జాగ్రత్త పడొచ్చు కాదా ఇది మాత్రం జగమెరిగిన సత్యం..డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇది నాకే కాదు మీకు కూడా తెలుసు..పది మందిలో మన గౌరవాన్ని నిలబెట్టేది కూడా డబ్బే...అయినవాళ్ళ ముందు నిస్సహాయుకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే మరి..అందుకే డబ్బుని గౌరవించండి
పోయేటప్పుడు ఏం పట్టుకొని పోకపోయిన
మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలి కదా..డబ్బుకి లోకం దాసోహం పైసా మే పరమాత్మ అని ఊరికే అనలేదు బహుశా ఇందుకేనేమో కదా..నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా..ప్రశాంతంగా పడుకోవాలన్నా ..నచ్చిన మనిషి మన పక్కన ఉండాలన్నా...మన దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా డబ్బే..కాబట్టి డబ్బుని గౌరవించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
34)జీవితం ఒక బాక్సింగ్ రింగ్ వంటిది..ప్రతీ క్షణమూ, పరిస్థితులు అనే ప్రత్యర్థి పంచులు విసురుతూనే ఉంటాయి.ఒక్కోసారి మనం పడిపోవచ్చు.పడిపోయినంత మాత్రాన మనం ఓడినట్టు కాదు! ఇంకా మనకు అవకాశం ఉంటుంది.మనం పడిపోగానే ఓడిపోయినట్టుగా,రెఫరీ ప్రకటించడు.మనం కోలుకుని నిలబడడానికి సమయం ఇస్తాడు.పది వరకు అంకెలు లెక్కబెడతాడు.అప్పటికీ లేవలేకపోతే,అవతలి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు.జీవితంలో కూడా అంతే!మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము.సమస్య రాగానే,ఓడిపోయామని కృంగిపోకూడదు.భగవంతుడు సమయం ఇస్తాడు.పది వరకు లెక్కబెడతాడు.నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు.వాటిని మనం అందిపుచ్చుకోవాలి.సమర్థుడైన వాడు పది లెక్క పెట్టే లోగానే లేచి నిలబడి గెలుస్తాడు.అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే పది లెక్కపెట్టే లోగా మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి.అది కూడా ఓకే.ఒక్కోసారి ఓడిపోతాం.
పర్వాలేదు.ఇంకో పోటీ,ఇంకో మార్గం ఉండనే ఉంటుంది.
చాలా మంది 'కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు పడి లేచినందుకు!' అని అంటుంటారు కానీ,పడిన కెరటం,
లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు.విరిగి పడిన కెరటం ఛిద్రమై,పతనమై మామూలు నీటిలో కలిసి పోతుంది,అస్థిత్వాన్ని కోల్పోతుంది.మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం.కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకుని,దిశను ఎన్నుకుని,మెల్లగా ప్రారంభించి రానూరానూ వేగాన్ని పుంజుకుని,తీరాన్ని చేరుకుంటుంది.అది కొత్త కెరటం.దాని శక్తి అనంతం.మనిషి కూడా అంతే! ప్రతీ పతనం నుండి తేరుకుని, కొత్త కెరటంలా,నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి అప్పుడే కదా మనం దేనినైనా సాధించగలం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
35)జీవితంలో కొంతమంది బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకునేవారూ బద్దకస్తులూ సాకులు వెతుక్కుంటారు.ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రగతి సాధించడమే కదా జీవితం.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏ సాకు దొరుకుతుందా అని చూసేవారు,తమ ఓటమికి కారణాన్ని ఇతరులపై నెట్టేసే ప్రబుద్ధులు ఎందరో ఉంటారు.అలాంటి వాళ్లు ఎదుటివారి నుంచి తప్పించుకోగలరేమో కానీ తమ ఆత్మసాక్షి నుంచి ఎలా తప్పించుకోగలరా??అయినా ఫలితాన్ని అనుభవించాల్సింది తామైనప్పుడు ఎన్ని సాకులు చెప్పీ ఎవరి మీద నెపం పెట్టీ ఏంటి లాభం? నీ కుంటిసాకులకు గుడ్బై చెప్పి, నీకు నువ్వు నిర్దాక్షిణ్యంగా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే నీ ఆలోచనావిధానం మారుతుంది అప్పుడే మనమేదైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
36)జీవితంలో గెలవాలనుకున్న వాళ్లెవరూ గెలిచేదాకా విశ్రమించరు.విశ్రమించేవారెవరూ విజేత కాలేరు ఇది జగమెరిగిన సత్యం.సాకు,నెపం అనేవి బద్ధకానికి ప్రాణస్నేహితులు.అపజయానికి ఆత్మబంధువులు.అవి అవకాశాల్ని అవరోధాలుగా మారుస్తాయి.కలలు కనేవాళ్లకీ వాటిని నిజం చేసుకోవాలనుకునే వాళ్లకీ అవి బద్ధశత్రువులు కాబట్టి విజేతలెవ్వరు వీటి జోలికి పోకుండా అకుంఠితదీక్ష,క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టే వాళ్ళు గొప్పవాళ్ళ లాగ చరిత్రకెక్కారు మీరు కూడా ఆ స్ఫూర్తి ఆచరణతో మన గురించీ పదిమందికి తెలియాలంటే-సాకులు చెప్పకుండా..సాధించి చూపించాలి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
37)నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునే వారికి..నువ్వు దగ్గరున్నా,దూరంగా ఉన్నా,మాట్లాడినా,మాట్లాడక పోయినా..నువ్వు బాగున్నా,బాగోలేక పోయినా..అసలు నువ్వు ఉన్నా,లేకున్నా ఒకటే కదా!అలాంటివారి కోసం నువ్వెందుకు నిద్రలేని రాత్రులు గడుపు తున్నావు.అలాంటి వారి కోసం నువ్వెందుకు తల పగిలేలా ఆలోచిస్తున్నావు.అలాంటివారి కోసం నువ్వెందుకు గుండెలవిసేలా ఏడుస్తున్నావు.అలాంటివారి కోసం నువ్వెందుకు నీ మనసుని కష్టపెడు తున్నావు.అలాంటివారి కోసం నిన్ను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు.
ఒక్కరోజులో రాలిపోయే పువ్వు అరే రాలిపోతున్నా అని బాధపడక నలుగురికి నయనానందాన్ని,పరిమళాలను పంచుతుంది.మరి మనిషిగా పుట్టి,అన్నీ ఫీలింగ్స్ ఉన్న నువ్వెంత ఆనందంగా ఉండాలో,నలుగురికి ఎంత ఆనందాన్ని పంచాలో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో!!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
38)నీ గెలుపు ఓటము లను నిర్ణయించేది సామర్ధ్యమా సమాజమా??ఎంత మంచి చేసిన నీవు చేసిన ఒక తప్పు కే చేసిన మంచి మరిచి నిన్ను వేలెత్తి చూపి నీ మంచి చెడు లను నిర్ణయించే సమాజం కోసమా బ్రతుకుతున్నావ్??డబ్బుఉంటే తప్ప నిన్ను గొప్పవానిగా గుర్తించదు ఈ సమాజం ఎలా సంపాదించావ్ అనేదానికన్నా
ఎంత సంపాదించావ్ అనేదే ముఖ్యం నేటి రోజుల్లో..పక్కవాడికోసం తల్లితండ్రుల కోసం కాకుండా నీకోసం నువ్వు ఒకరోజైనా బతికి చచ్చిపో..చచ్చే సమయానికి మంచోడివా చెడ్డోడివా అని కాదు
ఉన్నోడివా లేనోడివా అనేది నీకోసం వచ్చిన జనాలే నిర్ణయిస్తారు..విలువలతో కూడిన సమాజం ఎపుడో అంతరించి పోయింది...వెల కట్టే సమాజమే నీవున్నది ఇప్పుడు.ఉన్నతంగా బతకాలి అనే రోజులు నుండి ఉన్నోడిగానే చావాలి అనే రోజుల్లో బతుకుతున్నాం.పటం లో పరమాత్మ కంటే
పైసాలో పరమాత్మ కే భక్తులు ఎక్కువ..నీకు నచ్చినట్లు బ్రతుకు నచ్చినట్లు చావు నటిస్తూ మాత్రం బ్రతుకకు.చేసే పని తప్పో ఒప్పో అని కాదు నీ selfsatisfaction ఉందా లేదా..నీ విలువ ని పెంచేది నోటి మాట కాదు నోట్ల మూట
39)ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు..తన తప్పును ఆ వ్యక్తి గుర్తించినప్పుడు లేదా తన తప్పు గురించి ఇతరులు చెప్పినప్పుడు..అది నిజంగా తప్పే అని అనిపిస్తే క్షమాపణ చెప్పడంలో ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు. తను తప్పు చేశానని నిస్సంకోచంగా ఒప్పేసుకోవాలి. తప్పు చేశానని,బాధపెట్టానని చెప్పి క్షమించమని అడగడంలో ఎలాంటి తప్పు లేదు..కానీ తప్పు లేకపోయినా తప్పు చెబితే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.విలువను తగ్గిస్తుంది.ముఖ్యంగా ఎదుటివారి దృష్టిలో మర్యాద అనేది లేకుండా పోతుంది.అందుకే తప్పు ఉంటేనే క్షమాపణ చెప్పాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
40)క్షమాపణ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది.అపార్థాలు తొలగిస్తుంది.ప్రేమ,స్నేహం, కుటుంబ బంధాలు,వైవాహిక జీవితం ఇలా ఏదైనా కావచ్చు.ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థాలు ఏర్పడినప్పుడు ఇద్దరూ ఎడముఖం,పెడముఖం పెట్టుకుని ఉంటారు.కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తగ్గి క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మళ్లీ చిగురిస్తుంది.బంధం కోసం ఇలా తగ్గడంలో తప్పులేదని పెద్దలు చెబుతారు.ముఖ్యంగా గొడవ జరిగినప్పుడు ఎవరైతే తమ బంధం కోసం తమ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పేస్తుంటారు.ఇది కూడా బంధం బలపడుతుందని తిరిగి తమ ఇద్దరి జీవితాలు ఒక్కటిగా సాగుతాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
41)కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగే వాడిని తల దించుకునేలా చేస్తుంది..!తలదించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికే లాగా చేస్తుంది..! నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది..! కొన్ని విషయాలు తేలికగా తీసుకోకు...ఎవరో ఎక్కడో తారసపడతారు నీ జీవితంలో...నీకు తెలియనివేవో నేర్పడానికి...నువ్వు చూడని లోకం చూపడానికి...ఋణానుబంధంతోనే వస్తారు వేరే పని లేక వచ్చారనుకోకు నీ కోసమే వస్తారు అది తీరిన తర్వాత వెళ్ళిపోతారు తర్వాత నువ్వు ఉండమన్న ఉండరు అదే కాలం కర్మఫలం కాబట్టి ఎప్పుడు దేనికి మథనపడకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
42)కాలం మనకి అనుకూలంగా లేనప్పుడు అణిగి మణిగి ఉండాలి..అలా అని భయపడినట్లు కాదు లేదా వెనక్కి తగ్గినట్లు కాదు...ఒక రోజు సింహం ఆవుని వేటాడుతుంది ఆవు పరిగెత్తి పరిగెత్తి ఒక బురదలో ఇరుక్కు పోయింది,వెనకాల వేటాడుతున్న సింహం కూడా అదే బురదలో ఇరుక్కొపోయింది..ఆవు - సింహం ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేకపోతున్నాయి...బురదలో ఇరుక్కుపోయిన ఆవు-సింహాన్ని చూసి కొన్ని తోడేళ్లు నవ్వుతున్నాయి..అప్పుడు ఆవు సింహాన్ని ఒక ప్రశ్న వేసింది నీ యజమాని ఎవరూ అని అడిగింది,అప్పుడు సింహం నాకు యాజమని ఎవరూ లేరు నేనే రాజునీ అని వీర్రవిగి సమాధానం చెప్పింది..అప్పుడు ఆవు నాకు యజమాని ఉన్నాడు నన్ను ఈ బురదలో నుండి బయటకు తీస్తాడు నన్ను కాపాడతాడని ధైర్యంగా చెప్పింది..ఈలోపు అనుకున్నట్లే ఆవుని వెతుక్కుంటూ యజమాని వచ్చాడు దాన్ని బయటకు లాగాడు,ప్రాణాలు కాపాడాడు..యజమాని మీద పెట్టుకున్న నమ్మకానికి ఆవు కళ్ళల్లో నీళ్ళు చెమార్చాయి..నవ్విన తోడేళ్ళ గుంపు మొఖం చాటేశాయి..అయితే వీర్రవీగిన సింహం ఆ బురదలోనే ఉంది కాపాడడానికి ఎవరూ సాహసం చెయ్యడం లేదు,అది బయటకు వస్తే ఏమి చేస్తదో అందరికి తెలుసు..అది ఆకలితో అదే బురదలో ఉంటూ ఆహారం లేక ప్రాణాలు విడిచింది..నన్ను ఎవరూ చంపలేరులేరని మూర్ఖత్వంతో ఆవును వెంటాడి బయటకు రాలేని బురదలో ఇరుక్కొపోయిన సింహం తన ప్రాణాలు ఇలా కోల్పోబోతుందని అది కూడా ఊహించి ఉండదు..అది టైం మాత్రమే నిర్ణయిస్తుంది..కాబట్టి బయట సమాజంలో ఎవరు సింహమో ఎవరు ఆవో తెల్సుకుని మసులుకోవడం చాలా మంచిది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
43)జీవితమంటేనే అనుభవాల పుట్ట పడుతూ లేస్తూ చాలా నేర్చుకుంటాం..మచ్చుకకి కొన్ని.. మన చుట్టూ మన వాళ్లే ఉన్నారని పొరబడడం..మనతో మాట్లాడే అందరూ మన మంచి కోరే వారే అని సంబర పడడం ప్రేమగా మాటలు చెబుతుంటే మురిసిపోవడం
క్షణక్షణం విచారిస్తుంటే ధైర్యం చెప్పటం అప్పుడు మనకంటే అదృష్టవంతులు ఇంకెవరిని మనసుతో మాటిమాటికీ గర్వంగా చెప్పడం..కానీ తెలుసుకోలేనిది ఏంటంటే మనతో ఆవరసం ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయి అది తెలియక కలల గూడు కట్టుకోకూడదు.మనతో అవసరం తీరాక జరిగే చిన్న చిన్న మార్పులకు మన మనసు పడే వేదన నరకం.చూసీ చూడనట్టు చూపులు మనమే తప్పంటూ ప్రచారాలు పలకరించడానికి సైతం పనికిరాని మనం పాపాత్ము లైపోవడం..ఈ కలికాలంలో కలిసి ఉండి మోసపోవడం కంటే అలాంటి వారిని దూరం పెట్టి మనకు మనమే ఉన్నామంటూ ఒంటరిగా ఉంటూ పొగరుబోతుగా మిగిలిపోవడమే ఆనందం..కాబట్టి అలాంటివారితో తస్మాత్ జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
44)ఎవరైనా మనల్ని అవమానించిన ,అవహేళన చేసిన అది మనల్ని చూసి కాదు మన పరిస్థితిని బట్టి. ఒక్కోసారి ఒక్కొక్కరి మీద అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి.కేవలం మన పరిస్థితిని బట్టి మాత్రమే మాట్లాడతారు కానీ మన వ్యక్తిత్వాన్ని చూసి మాట్లాడరు.ఎందుకంటే మన వ్యక్తిత్వం మనకు తప్ప ఇంకెవ్వరికీ ఖచ్చితంగా తెలియదు.అవతల వాళ్ళు మనల్ని అవమానించారని, అవహేళన ,చేశారని తక్కువగా చూసారని వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకుంటే నష్టం వాళ్ళకి కాదు మనకి కలుగుతుంది..ఎందుకంటే ఎవరైతే మనకి ఇష్టం ఉండదో ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళతోటే మనం కలిసి ఉండే పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి.వాళ్లతోటే మనకు అవసరాలు కలిగేలా కాలం కల్పిస్తుంది. అందుకే కొంచెం ఓర్చుకుంటే కొంచెం ఓపిక ఉంటే జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలను అయిన ఎదుర్కోవచ్చు అన్నిసార్లు అన్ని అనుకూలంగా మనకు నచ్చినట్టు జరగవు కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.ఎంతటి పెద్ద కష్టాన్ని దాటితే అంతటి ఆనందాన్ని అనుభవించగలరు ఎవరైనా సరే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
45)జీవితమంటేనే ఒక పోరాటం మనం ప్రతిరోజూ పోరాడుతూనే వుండాలి అలా పోరాడగలిగితేనే నువ్వు నీ తర్వాత వారికి చెప్పగలవు..నీ గురించి కథలు వినగలవు..నీ గెలుపును నువ్వు గర్వంగా చెప్పుకోవాలి కానీ ఈజీగా వచ్చేసిందని చెప్పుకున్నా అది నువ్వు నిజంగా అనందించలేవు..అయినా పోరాడలేని జీవితం వ్యర్థం...అసలు సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు..ఒకవేళ వచ్చినా దాన్ని నువ్వు గర్వంగా నలుగురితో పంచుకోలేవు...అలా గెలిచిన గెలుపు గెలుపే కాదని నీకూ తెలుసు..ఈ జీవితపోరటంలో ఎన్నో వడిదుడుకులు మరెన్నో ఎదురు దెబ్బలు అలాంటప్పుడే అసలు అట మొదలవుతుంది నీ జీవితంలో నీ ప్రయత్నానికి అడ్డుకట్టాలా అడ్డొస్తారు..
భయపడకు..నీకు నువ్వే ఓదార్పు..నీకు నువ్వే సపోర్ట్...ఎవరైనా నీ దగ్గరేముంది అని అడిగితే..నువ్వు మాత్రం అస్సలు తగ్గొద్దు..దైర్యంగాచెప్పు..గెలిచేవరకు ప్రయత్నించే ఓపిక ఉందని..సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తేలేదని...చేయిజారి పోయినదాని గురించి బాధపడనని...చేసే పనిని వాయిదా వెయ్యనని...అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు..ఒక్కమాటలో చెప్పాలంటే...నన్ను వెనక్కి లాగేవాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పు..ఎప్పుడూ పక్కోడి పనిలో వేలుపెట్టనని చెప్పు..ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని చెప్పు...అంతే కానీ మౌనంగా మాత్రం ఉండిపోకు...మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఇవ్వకు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
46)అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు,దానిని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే,ఆ పిచ్చి ఆనందం కన్నా,మనది కానీ డబ్బుని,ఆస్తి కాగితాలని చూస్తూ ఇది నాది అనే అపద్దపు ఆనందంకన్నా ,నీ వల్ల నాకు పునఃజన్మ దక్కిందని ఒక మనిషి చెప్పే థాంక్స్ లో ఉన్న ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది.మనం బ్రతకాలను కోవడం ఆశ,పది మంది బ్రతకాలనుకోవడం ఆశయం.ఆశ బ్రతికేలా చేస్తుంది.ఆశయం చావే లేకుండా చేస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
47)మన జీవితం సార్ధకం ఎప్పుడు అవుతుందంటే నలుగురూ మన కనీళ్లు తుడిచే స్థాయి నుంచి నలుగురి కనీళ్ళు మనం తుడిచే దశకు చేరుకోవడమే..అదే అసలైన విజయమూ,వికాసమూ! అప్పుడు సమాజం మనల్ని పన్నీటితో స్వాగతిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
48)ఆస్తిని చూసి దైర్య పడకు..కూర్చొని తింటే కొండలు కుడా కరుగుతాయి మనకు..అందాన్ని చూసి ఆనంద పడకు!!!
పూజకి పనికి రాని పువ్వు...ఎంత వికసించిన దండగే చివరకు..కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు..ఎంత ఇష్టపడిన మనకి అందవు కడవరకు..ఎంత సంపాదించిన బయటపడకు..నవ్వుతు నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు..నాకు ఎమి లేదని బాధ పడకు..తక్షణమే బతకటానికి దారిని వెతుకు...!!!!
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మస్థైర్యాన్ని మాత్రం కొల్పోకు..ఎందుకంటే అదే నీ ఆయుధం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
49)పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితికి తగ్గట్టే మారిపోవాలి.వరద వచ్చినప్పుడు చేపలు చీమలను తిని బతుకుతాయి.అదే వరద తగ్గినప్పుడు ఆ చీమలే చేపలను తింటాయి.సమయం మాత్రమే ముఖ్యం...మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్లడమే జీవితం.మనం సమస్యలో ఉన్నప్పుడు అదే ముగింపు అనుకోకండి.అది జీవితంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకోండి కాబట్టి మనం ఎదగాలనుకుంటే ప్రపంచం ఏదో ఒక రకంగా అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది మనాకు కావాల్సినదల్లా మనలో ఎదగాలన్న ఆశ పుట్టడమే ముందు ఆ కోరికకు ఆకాంక్షకు ఆద్యం పోయండి అవే అవె ఎదురొస్తాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
50)మనకు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.వాటిని మనం స్వీకరించినా, స్వీకరించకపోయినా అవి మన పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.వాటిని చూసి మనం విచారంగా ఉండకుండా ఉండాలి ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టాడు అనుకోండి.మన సమర్థత అనేది కష్ట కాలంలోనే కనిపిస్తుంది.సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ విజయవంతం అయినట్టే కనిపిస్తారు కానీ ఎవరైతే కష్టంలో ధైర్యంగా నిలుచుని ఉంటారో వారే నిజమైన విజేత.మన జీవిత ప్రయాణానికి అడ్డు తగిలే ఏ సమస్యను చూసి అక్కడే ఆగిపోకండి.దాన్ని ఎలాగైనా దాటుకొని ముందుకు వెళ్ళండి అప్పుడే మనం అనుకున్న గమ్యాల్ని చేరగలం ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
51)జీవితంలో ఒక సమస్య పరిష్కారం అవ్వగానే మరొక సమస్య వస్తూనే ఉంటుంది.అలా వస్తున్న కొద్దీ కొంతమంది డీలా పడిపోతారు.భయపడి పోతారు. కొంతమంది తమ జీవితాన్ని ముగించేసుకుంటారు.ఇలా కాకుండా వీలైనంతవరకు ఆ సమస్యను సమస్యలా చూడకండి...మీ జీవితంలో ఒక భాగంలా చూడండి.అది మీకు పెద్దగా కనిపించదు.కొత్తగా అనిపించదు కాబట్టి జీవితంలో సమస్య రాగానే తల్లడిల్లిపోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించండి అప్పుడే మనం ధైర్యంగా మనం అనుకున్నవి చేయగలం సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
52)ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటే సానుకూల దృక్పథంతో ఆలోచించడం.మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్‌తో ఉంటారో ప్రతి సమస్య దూది పింజలాగా చిన్నగా కనిపిస్తుంది.అలాకాకుండా భయపడుతూ,బాధపడుతూ ఉంటారో చిన్న సమస్య కూడా పెద్ద భూతంలా మారిపోతుంది.మీ ఆలోచనలు ప్రేరణత్మకంగా ఉంటే మీలో సానుకూల దృక్పథం కూడా పెరిగిపోతుంది.పెద్ద సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరించగలుగుతారు..కాబట్టి అంతా మంచే జరుగుతుందని ముందడుగు వేయండి అనుకున్నవి తప్పక సాధిస్తారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
53)ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని వింటూనే ఉంటాం కానీ నమ్మకం ఉండదు.చిన్న సమస్య వస్తేనే విలవిలలాడిపోయి,లేనిపోని ఆలోచనలతో అంతిమ నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు.సమస్య ఎంత కష్టమైనా కూడా దానికి కచ్చితంగా ఆ దేవుడు పరిష్కారాన్ని కూడా సృష్టించే ఉంటాడు.మీ పని దాన్ని కనిపెట్టడమే.తాళం చెవిని తయారు చేయకుండా ఎవరు తాళాన్ని రూపొందించరు.అలాగే పరిష్కారాన్ని లేకుండా ఏ సమస్య ఉండదు.సమస్య ఎంత క్లిష్టమైనదైనా దాన్ని పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉండే ఉంటుంది.దానికి కనిపెట్టడంలోనే మీ గొప్పతనం ఉంది..సమస్యకు పరిష్కారం లేదని అనుకునే బదులు ఆ సమస్య ఎందుకు వచ్చిందో గుర్తించడం, దాన్ని పరిష్కరించడానికి మార్గాలను వెతకడంలోనే మీరు ఎంతో కొంత విజయం సాధించినట్టు. ఆ సమయంలోనే మీలో ఆశలు చిగురుస్తాయి.కాబట్టి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మారడానికి ప్రయత్నించండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
54)కొన్ని బంధాలు మనల్ని బ్రతికిస్తాయి అనిపిస్తోంది ...
కొన్ని బంధాలు బ్రతకాలనే ఆశని మనకు కలిగిస్తాయి...
మరికొన్ని బంధాలు బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తాయి...అదే...మనవారికి దగ్గరగా ఉండాలి అంటే...
మౌనంగా ఉండిపోవాలనీ...మనవారిని దగ్గరికి చేర్చుకోవాలి అంటే..ఏ మాటను మనసులో పెట్టుకోకూడదు..అని నేర్పించింది ఈ జీవితం...అందుకే... నీ జీవితంలో ఖరీదైన బంధం కోసం కాకుండా విలువైన బంధం కోసం వెతుకు..బ్రతుకు..ఆ విలువైన బంధమే నీకు వెలకట్టలేని సంతోషాన్ని కలిగించింది సరేనా...నేనైతే నీకు పాజిటివ్ గానే చెప్పాను కాబట్టి ఈ ఉదయాన్ని నువ్వు కూడా పాజిటివ్ గా మొదలుపెడతావు అని కోరుకుంటూ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
55)గతం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.అది సంతోషకరంగాను బాధాకరంగానూ ఉంటుంది ఆ గతం తాలూకూ బాధలను, కోపాలను మనసులో పెట్టుకొని ముందుకు సాగితే నేడు నీ దగ్గరున్న ఈ క్షణం ఆవిరైపోతుంది మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించి ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. మనకు హాని చేసిన వారి పట్ల మనసులో పగ పెంచుకుంటే మన మానసిక స్థితి కూడా ఎంతో ప్రభావితం అవుతుంది.కాబట్టి మన జీవితంలో పగలను,కష్టాలను వదిలేసి ముందుకు సాగండి అప్పుడే మనం అనుకున్న గమ్యాన్ని త్వరాగా చేరగలం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
56)అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం..మనలో లోపాలు వెతికే ప్రతికూల మనుషుల దగ్గర వివరణ అనవసరం..నిన్ను నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం..మాదే కరెక్ట్ అనుకునే వారి దగ్గర సవరణ అనవసరం..అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం..బంధం విలువ తెలీని వారి కోసం రోదన అనవసరం..నిన్ను బాధించిన వారిని తిరిగి బాధ పెట్టే మార్గాలకై శోధన అనవసరం..కొన్ని సందర్భాలలో... మౌనమే పరిష్కారం..కొన్ని సందర్భాలలో... కాలమే పరిష్కారం..చాలా సందర్భాలలో పట్టించుకోక పోవడమే అసలైన పరిష్కారం.....!! ఇదే జీవితం....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
57)ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో,అంతవరకే మాట్లాడటం మంచిది అంతేగానీ..అనవసరంగా,అతిగా మాట్లాడితే అపార్థాలు రావటం పక్కా..కాబట్టి మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం అలవరుచుకో...ఎందుకంటే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు..ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు.. అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిచ్చి స్నేహితులను కోల్పోతావు..అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు..అసత్యం మాట్లాడితే నమ్మకాన్ని కోల్పోతావు....అందుకే ఆలోచించి మాట్లాడి నీ వ్యక్తిత్వాన్ని,.. నీ గౌరవాన్ని..నీ ప్రత్యేకతను కాపాడుకో...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
58)నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిందౌతుంది..ఎవ్వరైనా నీతో మాట్లాడేందుకు ఇష్టపడతారు లేదంటే మనతో సంబంధాన్ని,స్నేహాన్ని తుంచేసుకుంటారు.ఎదుటివారితో మాట్లాడేముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజూ మీరు మీతో మాట్లాడుతూ మీరు చేసే పనులను,ఫలితాలను చూసుకుంటూ మిమ్మల్ని మీరు బాగా తెలుసుకున్నపుడే ఎదుటివారితో మన బంధం బలంగా ఉంటుంది..వీటన్నిటి కంటే ముందు అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా,చిన్నవాడా అని చూడకుండా పలకరించటం చాలా గొప్ప విషయం...పలకరింపుకు పరిచయంతో పనిలేదు...ఇలా నీ వ్యక్తుత్వాన్ని పదిలంగా కాపాడుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
59)ఎవ్వడి జీవితాన్ని వాడిని జీవించనివ్వాలి అప్పుడే ఎండకు వానకు తేడా తెలుస్తుంది...మన విలువ ఇంకా తెలిసొస్తుంది..అలా కాకుండా ఏమైపోతారేమో అని అతిగా ఆలోచిస్తూ తెగ హైరానా పడిపోతే...చివరికి మనమే పడిపోతాం ఎప్పటికీ పైకి లేవకుండా..అప్పుడు మనల్ని ఆదుకునే వారెవరూ ఉండరు...నువ్వాలోచించిన వాళ్ళు అసలే రారు.ఇక్కడ ఎవ్వరూ తెలివి తక్కువ వాళ్ళు లేరు..అంతా తోపులే..పోనీలే వాళ్ళు బాగున్నారు కదా అంతే చాలు..మన మంచి మనకే ఉంటుందని నీ మనస్సుని నచ్చచెప్పుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
60)బురద నీటి నుంచి కమలాలు ఉద్భవిస్తాయి.బురదకు భయపడి తామర మొక్క పెరగడమే మానేస్తే అందమైన కమల పువ్వులు ఎలా పుట్టుకొస్తాయి?కన్నీళ్లు,కల్లోలాలు అన్నీ జీవితంలో భాగమే.ఆనందాన్ని,ఆర్థిక లాభాలను ఎలా స్వీకరిస్తారో అలాగే కష్టాలను కూడా స్వీకరించి ముందుకు వెళ్ళడానికి శక్తిని పెంచుకోండి ఎందుకంటే జీవితం అంటేనే పూలు,ముళ్ళు,రాళ్ళు అన్ని కలిసినదే.మీరు పూలను ఎలా స్వీకరిస్తారో...రాళ్లు ముళ్ళను కూడా అలాగే తట్టుకునే నిలబడాలి..సక్సెస్ అనేది ఊరికే రాదు..కష్టాలు ఎదుర్కోవాలి...బాధలు తట్టుకోవాలి !!కన్నీళ్లు పెట్టుకోవాలి..తప్పులు దిద్దుకోవాలి !!కొందరి మాటలకు గుండె ముక్కలు అవ్వాలి!!.గుణపాటాలు నేర్చుకోవాలి!!మనసుకు గాయాలు కావాలి !!ఎదురుదెబ్బలు తినాలి..సహనంతో మెలగాలి!! కొన్నిసార్లు బంధాలను కోల్పోవాలి!అప్పుడే నీ జీవితానికి విజయంవరిస్తుంది!!ప్రతిక్షణం నీతో నువ్వు యుద్ధంచేయాలి!!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
61)సమస్యలకు భయపడడం మానేయండి. భవిష్యత్తు బావుండాలని మాత్రం కోరుకోండి. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి.జీవితం మీకే కాదు ప్రతి జీవికి సవాలే.మీ ఒక్కరికే కష్టాలు వస్తున్నాయి అనుకోకండి... ఈ భూమిపై పుట్టిన చీమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవులకూ ఏదో ఒక కష్టం వస్తుంది. వాటిని తట్టుకునేందుకు కావాల్సింది మనోనిబ్బరమే.దాన్ని తెచ్చుకోండి చాలు,మీ జీవితం అలా సాగిపోతూనే ఉంటుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
62)దీపాల చుట్టూ చేరే పురుగుల్ని చూడండి. తమ రెక్కలు కాలిపోతాయని,తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఆ పురుగులు ఆ దీపం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి.అలా తిరగడమే వాటి జీవితం.కేవలం కొన్ని గంటల ఆయుష్షు మాత్రమే ఉన్న పురుగే అంత ధైర్యంగా దీపం చుట్టూ తిరుగుతూ ఉంటే...వంద ఏళ్ళు ఉన్న మనిషి మాత్రం చిన్న కష్టానికి భయపడిపోతాడు.జీవితంలో యుద్ధం ఎదురైనా కూడా...ఆ యుద్ధం చేసేందుకు సిద్ధమవ్వాలి.యుద్ధంలో గెలుస్తామా లేదా అన్నది తర్వాత విషయం... యుద్ధం చేసామా లేదా అన్నది ముఖ్యం.మీ జీవితాన్ని మీరు సార్ధకం చేసుకోవాలంటే మొదటే ఓటమిని ఒప్పుకోకూడదు...యుద్ధంలో గెలుపును పొందవచ్చు లేదా ఓటమి ఎదురవచ్చు...ఏదైనా కూడా గెలుపుతోనే సమానం ఎందుకంటే అక్కడ పోరాడం పోరాటం.ప్రయాణం ప్రయత్నం చేయకుండా ఆగిపోతే మీరు గెలిచినా ఓడినట్టే కాబట్టి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
63)జీవితమంటేనే స్నేక్ అండ్ లేడర్స్ ఆట లాంటిది.నిచ్చెనలే కాదు మింగేసే పాములు కూడా ఉంటాయి. నిచ్చెనలు మాత్రమే కావాలి,పాములు వద్దంటే కుదరదు. జీవించాలంటే అన్నింటినీ స్వీకరించాల్సిందే..మీరు నడుస్తున్న దారిలో కాలికి ముల్లు గుచ్చుకుంటే అక్కడే నడక ఆపేయరు కదా,ముళ్ళు తీసుకొని తిరిగి నడక ప్రారంభిస్తారు.అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మీ ప్రయాణాన్ని ఆపకూడదు.భగవంతుడు జీవితంలో సంతోషాన్ని,సౌందర్యాన్ని మాత్రమే కాదు...ఆ జీవితం విలువ తెలిపేందుకే కన్నీళ్ళను, కష్టాలను కూడా ఇచ్చాడు.ఇది ఉన్నప్పుడే మీకు సంతోషం విలువ తెలుస్తుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
64)నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరినవారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు..అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో... బాగున్నప్పుడు కూడా అలాగే ఉండు..రెండు సందర్భాల్లో అలాగే ఉండు.రెండు సందర్భాల్లో నీతో ఉన్న వారే నీ వారు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
65)కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని
దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచి వాళ్ళం
అయిపోము.ఎదుటివారు మనకు విలువ
ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి,ఎదుటి వాళ్ళ దగ్గర వీలైతే మంచిగా ఉండు,అంతే గాని మంచిగా నటించకు. మంచి మనసుతో మంచి చేసేవారు ఏ గుడి గోపురాలు తిరగకపోయిన వారికి దేవుడి కృప ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మంచే జరుగుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
66)నిన్ను అనేటోడు అనకుండపోడు..నిన్ను అర్థం చేసుకునేటోడు అర్థం చేసుకోకుండ పోడు..నిన్ను వద్దు అనుకునేటోడు ఎలాగైనా వదిలించు కోవాలనుకుంటాడు నువ్వు కావాలనుకునేటోడు ఏలాంటి పరిస్థితిలోనైనా నీతో కలిసివుండాలి అనుకుంటాడు..అందుకే నువ్వు ఎప్పుడూ ఎవరినీ బ్రతిమాలడకు ముఖ్యంగా అవమానించే అయినవారికి ఆమడ దూరంలోవుండు ఒకవేళ వుండాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అక్కడ నీ బాధను సంతోషంగా..నీ మాటను మౌనంగా...నీ కన్నీటిని చిరునవ్వుగా మార్చి అర్దం చేసుకోని ఆత్మీయులకు నీ వంతు ఆనందాన్ని పంచి ఎంత వీలైతే అంత త్వరగా అక్కడినుండి తప్పుకో అంతే కానీ,కారణాలు వెతుక్కుని దిగి దిగజారకు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని అవమాన పడకు ఎందుకంటే మన చుట్టూ వున్న పరిస్థితులు ఎలా వున్నా మనం మాత్రం ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవటమే జీవితం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
67)నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి నువ్వు నచ్చకపోతే అవి వృధా అలాగే నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీతో తిరిగే వారు వాటిని గుర్తించకపోతే వృదా అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ..కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని వుండక నీ అవసరం వున్న చోట..నీ తెలివి తేటలు నీ శక్తి సామర్థ్యములు చూపించి..కీర్తిని గడించి..జీవితంలో ఎదగడం నేర్చుకోవాలి ఇదే నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన..ముఖ్య విషయం!..కనుక ప్రగల్భాలు... కాలయాపనలూ చేయకుండా..మన విలువని మనమే పెంచుకుని అనుకున్న గమ్యాల్ని చేరుకోవాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
68)జీవితం ఒక ప్రయాణం లాంటిది ఆ ప్రయాణంలో మనతో పాటు ఎందరో కలిసి ప్రయాణిస్తారు!! కొందరు సగంలోనే దిగిపోతారు మరికొందరు మనతోనే ఉంటారు అనుకుంటాము కానీ వారి వారి గమ్య స్థానం రాగానే వెళ్ళిపోతారు..సగంలో వెళ్ళిపోయినా వారందరు మనకి కాకుండా పోరు...చివరి వరకు కలిసి ప్రయాణించినా వారందరు మన వాళ్ళు అవ్వరు....కనుక ఎవరితో ఎలా....?? ఎపుడు....?? ఎంతవరకు....?? రాసి పెట్టి ఉందొ అదే జరుగుతుంది..మనిషిని బాధపెట్టే విధంగా మనసుకి నొప్పి కలిగించే విధంగా ఎలాంటి బంధంతో ముడివేసుకోకండి.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
69)నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు! నీ జీవితం నీది!..ఎవడి కోసమో నువ్వు తలవంచకు!..నిన్ను వేలెత్తిచూపే ఏ ఒక్కడు ఒక్క పూట నీకు అన్నం పెట్టడు.!.mకష్టమైన నష్టమైనా భాదైన ఆనందమైనా నీతో నువ్వే అనుభవించు..ఇక్కడ జరిగేదంతా ఒక జగన్నాటకమే..ఎవ్వడిని నువ్వు నమ్మకు..అన్ని తెలుసు అనే వాడిని అస్సలు నమ్మకు..ఎందుకంటే ఇక్కడ ఎవడికి ఏమి తెలియదు.?ఇదో పెద్ద మాయ ప్రపంచం అందరూ మహా నటులే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి..అణువణునా నీ కోసం గోతులు తవ్వి కూర్చున్నారు!!ఏ గోతిలో పడతావో పడితే ఏమవుతావో గోతి తీసినవాడికి కూడా తెలియదు🔥!జాగ్రత సుమీ..!.కాబట్టి నీ కోసం నువ్వు బ్రతుకు..నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు..ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా అర్ధమైతే ఆచరించు అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
70)కొంతమందికి ప్రేమను చూపించడం చాలా కష్టం..కొంతమందిని అర్ధం చేసుకోవడం ఇంకా కష్టం!!..కొందరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కోపంతో ఊగిపోతారు..మరికొన్నిసార్లు బాధలో మునిగిపోతారు..ఇంకొన్నిసార్లు మౌనంగా మిగిలిపోతారు..చాలాసార్లు గందరగోళంలో తేలిపోతారు..ఎప్పుడు మనసు ఎలా మారిపోతుందో తెలియని పరిస్థితులలో బ్రతుకుతూ ఉంటారు.ఇలాంటి సందర్భాలలో మనతో ఉన్నవాళ్ళు ఈమె/ఇతను ఏంటి ఇలా ఉన్నారు..ఇలాంటివారితో బంధం అవసరమా అనే అభిప్రాయానికి వచ్చి ఆ బంధానికి వీడ్కోలు చెప్పడానికి క్షణం కూడా ఆలోచించరు..కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా మనల్ని అర్ధం చేసుకొని మన ప్రవర్తనకు తగినట్లుగా నడుచు కుంటూ..మనల్ని ప్రేమించాలని,మన మనోభావాలని గౌరవించాలి అనుకుంటారో వారే మనకు నిజమైన ఆత్మబంధువులు అలాంటి వారు దొరికినప్పుడు అసలు వదులుకోకండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
71)మనిషి ఆలోచన ఎలా ఉంటే మనకు ఎదుటి వాళ్ళు అలా కనిపిస్తారు చాలామంది చెప్తూ ఉంటారు నేను చాలా కరెక్ట్ గా ఉంటాను నేను అందరి లాంటి వాడిని కాదు అందరి లాంటి దాన్ని కాదు అని అసలు మీరు కరెక్ట్ గా ఉంటే ఆ మాటని చెప్పాల్సిన అవసరం లేదు మన గురించి ఏదైనా చెప్తే మనతో ఉన్నవాళ్లు మన గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి మనం మన గురించి చెప్పుకోకూడదు..కొంతమంది వాళ్లకి అనుకూలంగా మనం ఉన్నంతవరకు ఒక రకంగా మాట్లాడతారు అనుకూలంగా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడుతారు ఎప్పుడైతే నీతో ఉండే నీతో స్నేహం చేస్తూ నీతో మాట్లాడుతూ నీ గురించి పక్క వాళ్ళకి నీచంగా చెప్పు నిన్ను పదిమందిలో అల్లరి చేస్తూ నీ దగ్గర మాత్రం అతి వినయం నటించే వాళ్ళని అస్సలు దగ్గరికి రానీకండి అలాంటి వాళ్ళతో ఎప్పటికైనా చాలా డేంజర్ వాళ్ళు..ఎందుకంటే అలాంటి వారే ఉన్నారు ఇప్పుడు మన చుట్టూ..ఎంతలా దిగజారిపోతున్నారంటే మనుషులు ఎవరేమనుకుంటే మాకేంటి మా పనులు అయిపోతే చాలు.మేము సేఫ్ సైడ్ ఉన్నామా లేదా మా కోరికలు తీరాయా లేదా ఇంతే ఇలాగే ఉన్నారు.. కాబట్టి ఆదిలోనే అలాంటివారిని గుర్తించి దూరం పెడితే నువ్వు జీవితంలో త్వరగా ఎదగగలం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
72)ఒక సిస్టమ్, ఆర్గనైజేషన్, రిలేషన్‌షిప్ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్ చేయొచ్చు. 'నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో' అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు..ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటర్మైంట్ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్ నడుస్తుంటే, మీ యాక్సిస్‌కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్ చేస్తుంటాడు. మరొకడు మీ అఫీషియల్ మెయిల్ ఐడీ పాస్‌వర్డ్ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్ అప్పటికే మీ డెస్క్ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్ అయిపోగానే ఓ పెగ్ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే...ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్-జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండు సార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. 'నేనే లేకపోతే' అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది..ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్.. మనీ.. సక్సెస్.. జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి. 'నేనే లేకపోతే..' అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో అమ్మ,ఆమె చేసిన వంట తప్ప, మిగతావాటిని అందరూ మార్చవచ్చు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
73)మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''...మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు'' అయిపోతుంటారు మనవాళ్ళు.ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??మనం ఒకరితో స్నేహం చేసేది..మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...మనం ఒకరిని ప్రేమించేది..పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?ఎక్కడైతే..హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో...ఎక్కడైతే...చట్టాల ప్రస్తావన లేకుండా ఉంటుందో..ఎక్కడైతే...అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో..ఎక్కడైతే బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో..ఎక్కడైతే... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో..ఎక్కడైతే తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో.ఎక్కడైతే..."అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో..ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/మన్నించే వీలుంటుందో..ఎక్కడైతే మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో అక్కడ బంధాలు బలంగా ఉంటాయి..అక్కడ మనుషులతో పాటు మనసులూ మాట్లాడతాయి...తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే..కాబట్టి బంధాల విలువ తెల్సుకుని మెలగండి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
74)సింహం రోజు 18 గంటలు పడుకుంటుంది...గాడిద
రోజుకు 18 గంటలు పనిచేస్తుంది..కష్టపడడం వల్ల పైకి వస్తారన్నది నిజమయితే గాడిద అడవికి ఎప్పుడో రాజు కావాలి కదా..కష్టంతో పాటు కొంచెం తెలివి కూడా జోడించాలి...అర్థమైందనుకుంటా..??.. ఆవేశంతో కాదు ఆలోచించి పని చేయి..అనుకున్నది సాధించెయ్...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
75)జీవితంలో విజేత కావాలనుకుంటే పరిస్థితుల నుంచి పారిపోకూడదు..ఓటమిని ఒప్పుకోకూడదు ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో సక్సెస్ సాధించిన వారందరికి ఉండే ఉమ్మడి లక్షణం ఆశతో జీవించడమే.ఈరోజు కాకపోతే రేపైనా అనుకూల ఫలితాలు వస్తాయనే ఆశ మనల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉంచుతుంది.ముందుకే నడిపిస్తుంది..ఆయుష్షు పెంచుతుంది.ఆనందాన్ని ఇస్తుంది.బతుకు మీద ఆసక్తి పెరిగేలా చేస్తుంది.చీకట్లో దీపానికి ఎంత విలువో... మనిషికి ఆశ కూడా అంతే విలువైనది కాబట్టి ఓటమి వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడితే మనం అనుకున్నవి తప్పక సాధించగలం కావాల్సింది కాస్త ఓర్పుతో కూడిన ధైర్యం.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
76)ఆశావాదికి,నిరాశావాదికి తేడా ఒక్కటే...కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆశావాది అవకాశాన్ని వెతుకుంటాడు. కానీ నిరాశవాది వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు.ఒక ఆశావాది ముందు సగం నిండిన గ్లాసును పెట్టండి... ఇదేమిటి అని అడగండి.ఆశావాది దాంట్లో సగం నీరు నిండి ఉందని చెబుతాడు.అదే నిరాశవాది అయితే నీళ్లు నిండుగా లేవు అని చెబుతాడు.ఉన్న పరిస్థితుల్లోనే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడమే ఆశావాదం. గొప్పవారి విజయ కథలను చదివి చూడండి... అందులో వారు దాటిన కష్టాలు ఎన్నో ఉంటాయి.మొదటి కష్టానికి ఆగిపోతే వారి సక్సెస్ స్టోరీ మనదాకా వచ్చేది కాదు కాబట్టి ఆశావాదంతో జీవించి అనుకున్నవి సాధించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
77)ఆశావాదికి కష్టాలు కనిపించవు.కేవలం అవకాశాలే కనిపిస్తాయి.మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది.ఆశావాది కూడా అంతే..సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైనది మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు. కానీ మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే.అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు.ఒకచోట పడితే మరోచోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి ఇతర జీవులు కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు.రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు.అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి.ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు.ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి.అదే మీ ఆయుష్షును పెంచుతుంది.ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
78)చేస్తున్న పని మంచి అని అవతలి వ్యక్తికి తెలియనప్పుడు,మనం చేసిన పని మంచిది అని మనకు మాత్రమే అనిపించి, అవతలి వ్యక్తికి అసలు అనిపించనపుడు,చెడు ఎదురవుతూ ఉంటుంది.మన ఉన్నతిని, మనకు వచ్చే కీర్తిని చూసి అసూయపడేవారు ఉన్నప్పుడు,చేసిన "మంచి" వల్ల వాళ్ళ ఇగో దెబ్బతిన్నప్పుడు,చెడు ఎదురవుతూనే ఉంటుంది.మన కథలో మనం హీరోలం కావొచ్చు,అవతలివారి కథలో మనం విలన్ గా మారితే అది మన తప్పు ఎలా అవుతుంది..చెడు ఎదురవుతోంది కదా అని మనలో మార్పు వస్తే, మనం వారిలా మారితే, మనకూ వారికి తేడా ఉండదు.చేసేది,చేయాలని అనుకున్నది చేసుకుంటూ వెళదాం.మనం కూడా ఆపేస్తే మన తర్వాతి తరం ఇంకా అధ్వాన్నంగా తయారు అవుతారు.రేపటి రోజు, మన అనుకున్నవారికి యాక్సిడెంట్ అయి రోడ్ మీద ఉంటే,పట్టించుకునే సమాజమే ఉండాలి.కాబట్టి,ఫలితం గురించిన ఆలోచనను వదిలేద్దాం.మనం ఈ రోజు ఆలోచించి చేసిన పని వల్ల ఏది జరిగినా స్వాగతిద్దాం.పూల దండలు పడొచ్చు,రాళ్లు పడొచ్చు ఏది జరిగినా స్థితప్రజ్ఞతతో మనం నిలబడే ఉండాలి అదే కదా జీవితం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
79)పాఠశాలలో పాఠం నేర్పి పరీక్ష పెడతారు కానీ జీవితం పరీక్ష పెట్టి గుణపాఠం నేర్పుతుంది..కొన్ని గుణపాఠాలు ఏంటంటే మనకు కలిగే కష్టనష్టాలకు ఎవ్వరినీ నిందించకూడదని..మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలని..ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు బానిస కాకూడదని..బలహీనతల్ని అధిగమించలేకపోతే బాగుపడమని..ఎంత ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వు చెక్కుచెదరకూడదని..మనల్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదని క్రమశిక్షణ,ఏకాగ్రత లేకుండా ఏది సాధించలేమని నిజాయితీగా ప్రయత్నిస్తే ఆలస్యమైనా అనుకున్నది సాధించగలమని..మనలాంటి వాళ్ళు భూమి మీద ఒకరే ఉంతయారు అది మనమే అని..కాబట్టి మన ఉనికి కోసం రోజు పోరాటం తప్పదని తెల్సుకోవాలి చివరగా ఒక్క మాట… వీటిని గుణ పాఠాలు అనడం కన్నా ఇవి స్వీయానుభవంలో నేర్చుకున్న పాఠాలు అనడం సబబు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
80)జీవితంలో కొన్ని పాఠాలు మీకు ఎంత డబ్బు,పలుకుబడి,తెలివి,అందం ఉన్నా కూడా ఎదుటి వారి నుండి నిజమైన గౌరవం పొందాలి అంటే నిస్వార్ధంగా ఉండాలి..మీరు ఇతరులకు ఎంత సాయం చేసినా కూడా,వారికి చివరగా మేరు చేయని సాయం మాత్రమే గుర్తుకు ఉంటుంది కాబట్టి వారు మీరు చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటారు అని సాయం చేయకండి.ఎక్కువ శాతం మనుష్యుల మధ్య ఉండేది ప్రేమ కాదు..అవసరం మరియు బాధ్యత కాని వారు ప్రేమ అనే పేరుతో వాటిని కప్పిపుచ్చుకుంటారు కాని నిజం వారికి కూడా తెలుసు..జీవితంలో అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం.దాని విలువ మీకు తెలియాలి అంటే అప్పుడప్పుడు వైద్యశాలకు వెళ్ళి అక్కడ ఎంతో మంది రోగులు పడే ఇబ్బందులు చూడండి కాబట్టి ఆరోగ్యాన్ని దేనికోసం కూడా పణంగా పెట్టకండి.ఒకే చోట జావితాంతం గడిపేయడానికి మీరు చెట్టు కాదు,కొండ కాదు ఎప్పటికప్పుడు జీవితంలో మార్పు చెందుతూ ఎదగాలి..ఈ ప్రపంచంలో ఇంకొకరు చేసే పనిలో తప్పులు వెతికే వాళ్ళు, వారిని క్రించపరిచే వాళ్ళు, వాళ్ళను ఎదగకుండా ఆపేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎదుటివారిని ఉత్తేజపరిచి,వారిని ప్రొత్సాహించే వాళ్ళు చాలా తక్కువ.మీరు ఆ తక్కువమందిలో ఒక్కడిగా ఉండండి వీటిని తరచూ గుర్తుంచుకోగలిగితే జీవితం ఎంతో మెరుగుపడుతుంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
81)మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి.మన తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లు సన్నిహితులు, స్నేహితులు ఇలా వీళ్ళ వీళ్ళ అభిప్రాయాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకోవడంలో తప్పులేదు."తుది నిర్ణయం" మాత్రం ఖచ్చితంగా మనదే అయి ఉండాలి.మన నిర్ణయాలు పక్క వాళ్ళ ఆలోచనలలోంచి పుట్టకూడదు.మన నిర్ణయాలు అన్నివేళలా సరైనవి అయి ఉండాలని లేదు.మన నిర్ణయం అప్పుడప్పుడు బెడిసి కొట్టిన నష్టమేమీ లేదుమీరు చూడగలగాలే కానీ మీకు బెడిసి కొట్టిన నిర్ణయంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక మంచి బోధపడుతుంది.. కాబట్టి సలహా తీసుకోండి కానీ ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కొన్ని మెదడుతో కాదు మనస్సుతో తీసుకోండి అప్పుడైన మీ అంతరాత్మ సంతోషిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
82)తెలుసుకోవటం తెలివి అయితే,అర్ధం చేసుకోవడం జ్ఞానం.ఇవి రెండూ నాణేనికి బొమ్మా బోరుసుల్లాంటివి.తెలుసుకోవటానికి,అర్ధం చేసుకోవటానికి చిన్న అంతరం ఉంది. ఏది ఎక్కడ ఎలా అనేది తెలుసుకోవటం అయితే,ఎందుకు అనేది జ్ఞానం.నేర్చుకున్న నైపుణ్యాలు,తెలుసుకున్న విషయాలు,పొందిన అనుభవాలు ఇవన్నీ తెలివి,జ్ఞానం వచ్చేలా చేస్తాయి.గొప్పగా బతకడం ఎలా అనేది తెలిసినవాడు తెలివైనవాడు,ఎందుకు బతకాలి,ఆ బ్రతుక్కి అర్ధం ఏమిటని తెలిసినవాడు జ్ఞాని.తెలివైన ప్రతీవాడు జ్ఞాని కాడు కానీ ప్రతీ జ్ఞాని తెలివైనవాడే కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఆలోచించుకుని ముందడుగెయ్యి అనుకున్నది సాధించెయ్...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
83)ఏదైనా సలహా ఇవ్వడం వరకే మన పని..అది పాటించడం పాటించకపోవడం అన్నది విన్నవారి ఇష్టం.నిజమే మనం తేలికగా ఎదుటవారికి సలహాలు సూచనలు ఇచ్చేస్తూ ఉంటాము..అది వారికి ఉపయోగ పడుతుందా అని ఆలోచించము.ఉన్న సమస్యలో నుండి బయట పడేస్తుందా లేక ఇంకా సమస్యల్లోకి నెట్టేస్తుందా అని మనం కూడా చెప్పలేము.అది కేవలం ఆ సలహా తీసుకునే వారికి మాత్రమే తెలుస్తుంది పర్యవసానాలు ఎలా ఉంటాయో అని. మనకు ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.అవతలి వారి సలహా పాటించడం వల్ల కలిగే ఉపయోగాలు నష్టాలు ఏంటి అన్నవి సరైన అవగాహన ఆ సలహా ఇచ్చిన వారి కంటే తీసుకునే వారికే ఎక్కువ ఉంటుంది. వయసు ఉందని సలహాలు ఇస్తే అన్నిసార్లు అవి మంచి ఫలితం ఇవ్వదు ..ఘోరంగా బెడిసి కొడుతుంది.అనుభవం,అవగాహన అవసరం.అది కూడా కొన్నిసార్లు మంచి ఫలితం ఇవ్వకపోవచ్చు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
84)ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొదటి విసిరేసేది అప్పటిదాకా తనకి సహాయపడిన చేతికర్రనే అలాగే నువ్వు ఇతరులకి ఎంత మంచి చేసినా ఎంత సహాయం చేసినా గుర్తుపెట్టుకోలేని సమాజంలో ఉన్నాము తిరిగి మనల్నే అనే రోజులలో బ్రతుకుతున్నాం కాబట్టి నీకు ఉన్నదాంట్లోనే చేయి..ఎందుకంటే నీకు కష్టం వస్తే ఆదుకునే వాళ్లెవ్వరూ నీ పక్కన ఉండరు నీ జీవితం నువ్వే పోరాడాలి మిగతావాళ్లంతా ప్రేక్షకపాత్రే అతి దానాత్ హత: కర్ణ: అతి లోభాత్ సుయోధన: అతి కామాత్ దశగ్రీవో అతి సర్వత్ర వర్జయేత్ కాబట్టి మరీ మంచితనం వుంటే నువ్వు నటిస్తున్నావ్ అనే రోజులలో ఉన్నాం జాగ్రత్త అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు అలాగే నేల విడిచి సాము చేయకూడదు అని సామెత.మన శక్తి తెలుసుకోకుండా సహాయం చేయకూడదు.కనీసం ఆశ కూడా కలిపించ కూడదు.డబ్బు/శక్తి/సమయం/సలహా మనకి ఉన్నంతలో పదోవంతు మాత్రమే ఎదుటివారికి వినియోగించగలం.అంతకు మించి ఆలోచన చేయడం కూడా సాహసమే..ఇది తెలీక చాలా మంది ఎదో చేసేద్దామని ఉద్దరించేద్దామని అనుకుంటే పెనుప్రమాదమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
85)మనకు ఏనుగు,ముసలి గురించి తెలుసు కదా!భూమి పైన ఏనుగు కన్నా బలమైన జంతువు లేదు.పెద్ద పేద్ద చెట్లనూ నేలకూల్చ గలదూ.అది దాని స్థాన బలిమి.మరి ముసలి కన్నా బలమైన జంతువు నీటిలో ఉన్నదా?అలాంటి ముసలి భూమి పైకి వస్తే ఏమి జరుగుతూంది.మరి ఈ ఏనుగు నీటిలోకి దిగినప్పుడు తన శక్తి అలాగే ఉంటుందా?ఆలోచించండి.ఒకవేళ ఈ రెండు జంతువులు భూమి పైన,నీటి పైన పోరాడితే ఏది గెలుస్తుందో మనకి తెలుసు అలాగే మనం ఎంత సమర్థులమైనా మన మాట చెల్లుబడి కాదు అని అనిపించిన చోట మన ప్రజ్ఞ చూపించగూడదు.ఒకరు గుర్తించక పోయినా మనకు ఒరిగేదేమీ లేదు.అలాంటి చోట ఎరగనట్టు ఉండడమే మేలు.మూర్ఖుడు మంచి వినడు.పైపెచ్చు అవమానిస్తాడు.ఈ సంగతులు తెలిసి వేమన చక్కగా చెప్పాడు.కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది..అంత మాత్రాన అది చిన్నదై పోతుందా ?అలాగే గౌరవంగా బతకాలంటే అడగందే అలాంటి వాళ్లకు సలహాలివ్వ గూడదు..ఒకరికి చాలా ఉంది.మనకు చాలినంత ఉంది అయితే వాడేమీ బంగారం తినలేడు.మనం తినేదే.. ఏదైనా ఆకలి తీరడానికే..నాకింత ఉంది అన్నా నువ్వు తినేది అదే.అంతే.అందుచేత కొంచెముండుటెల్ల కొదువగాదు అన్నాడు.సంతోషం ప్రధానం.అది ఉంటే ఇంద్రుడే..అది ప్రాప్తం లేక పోతే ఎంత ఉన్నా వేరే వాళ్లు తినడానికే.నీవు దిగులు గడుస్తూ ఉండాల్సిందే..కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండు నాకు లేదు వాడికి ఉందని నీకున్న కొద్దీ సంతోషం కూడా పాడుచేసుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
86)నాణేనికి బొమ్మా బొరుసులు ఉన్నట్లే,ప్రతి మనిషిలోనూ మంచీ,చెడూ ఉంటాయి.మనం ఎటు పక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది.వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏ మూలో కాస్తంతైనా మంచితనం కనిపిస్తుంది.మంచివారిలోనూ ఏదో ఓ చిన్న తప్పు దొరుకుతుంది.
ఎదుటివారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్రా మన జడ్జిమెంట్లో ఉంటుంది. వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొస్తాం.అదే మనకు గిట్టని వ్యక్తి ఎవరైనా ఎవరెస్టు శిఖరం ఎక్కారే అనుకోండి. అతన్ని మనసారా అభినందించడానికి కూడా నోరు పెగలదు.ఆ ఇందులో గొప్పేముంది మాస్టారూ! ఈరోజుల్లో ఆర్నెల్లు ట్రైనింగ్ తీసుకుంటే నేనూ, మీరూ ఎవరైనా ఎక్కేయగలం ఆ మాత్రానికి ఎందుకీ గొప్పల అంటూ ఆ పర్వతాన్ని ఎక్కి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగింజంత చేసి మాట్లాడడానికీ వెనకాడం!ఇదంతా మన మనసు చేసే మాయ.మన మనసు దేంతో నిండి ఉంటుందో..మన చూపు,ఆలోచనలు,పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య,ద్వేషం,అసూయ,పగ,ప్రతీకారమా లేక ప్రేమ,దయ, జాలి,కరుణా అనేది మన ఆలోచనను బట్టే ఉంటుంది.మనం ఇచ్చే కమాండ్లోనే కంప్యూటర్ పనిచేసినట్లు..మన మనసుకు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి.స్వచ్ఛమైన పాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగ్గొట్టుకుంటామో...చెంచా పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో...అంతా మన చేతుల్లోనే ఉంది!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
87)*ఎప్పుడైతే మనకు సహాయం చేసిన వారిని మనం పతనం చేయాలనుకుంటామో అప్పుడే మనకు అస్సలైన పతనం ప్రారంభం అవుతుంది అని గుర్తుంచుకోవాలి ,* *మనిషికి* జీవితాంతం *తోడుగా* ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం *భ్రమ* మనిషికి నిజాంగా *జీవితాంతం* తోడు ఉండేది తన *గుండె ధైర్యం* తప్ప మరోకటి లేదు.మీరు అందరిని *గుడ్డిగా* నమ్మకండి ఎందుకంటే *మనిషి* అవసరం ఉంటే నాకు *అంతా* నువ్వే అంటారు,అదే అవసరం తీరాక *నువ్వెంత* అంటారు ఇది *మానవ నైజం* నేస్తమా ! *మనమెంత* గొప్పవారం అయిన మనం ఎంచుకునే *స్నేహితుల* బట్టే మన *ఎదుగుదల, పతనం* ఆధారబడి ఉంటాయి *కర్ణుడంతటి* వానికే *చెడు స్నేహం* వల్ల *పతనం* తప్పలేదు *మనమెంత ?*మనిషికి *అవసరం* గొప్పది . తెగిపోతున్న *బంధాన్ని* కలుపుతుంది.*కలిసున్న* బంధాన్ని *తెంపు* తుంది . *ఆస్తులు* పంచుకునే *రక్త సంబంధం* కన్నా *మమతలు* పెంచుకునే *ఆత్మీయ* సంబంధం గొప్పది .*మనిషి* ఉన్నప్పుడు మనం పట్టించుకోం , *పోయాక* మాత్రం వారి ఫోటోలపై *ప్రేమ* కురిపిస్తాం , ఫోటో మాట్లాడదు అని *తెలిసినా !* మనిషి *బ్రతికి* ఉన్నప్పుడు *ప్రేమగా* తినిపించకుండా పోయాక *సమాధి* దగ్గర *పంచభక్ష పరమాన్యాలు* పెడతాం *శవం* లేచి తినదు అని తెలిసినా.మనిషి విలువ *మరణిస్తే* కానీ *అర్థం* కాదా ? ఉన్నప్పుడే వారిని *ప్రేమగా* చూసుకుందాం ..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
88)అడిగి తీసుకునేది అనుబంధం కాదు,అడగకుండా ఇచ్చేది అప్పు కాదు,నమ్మకం లేకుండా చేసేది వ్యాపారం కాదు,సంకల్పం లేకుండా చేసేది సాధన కాదు,స్నేహితులు లేకుండా ఉండేది జీవితం కాదు!జీవితాన్ని సార్ధకంగా మార్చే నిగూఢమైన సందేశం ఇది. మన అనుబంధాలు నిబద్ధతతో, వ్యాపారం నమ్మకంతో,సాధన సంకల్పంతో,జీవితం స్నేహంతో పూర్ణత్వాన్ని పొందాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
89)*తప్పు రాసింది పెన్నైతే కాగితాన్ని చింపేస్తాం కిందుంటే ఎవరికైనా లోకువే కాబట్టి ఎప్పుడూ పైన ఉండడానికే ప్రయత్నించు ఎందుకంటే ఈ లోకం ఎదిగిన వాళ్లనే గుర్తెట్టుకుంటుంది అలాగే నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోట నిన్ను నువ్వు నమ్ముకుని గెలిచి చూపించడం అసలైన యుద్ధం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
90)నువ్వు ఇతరులకి మంచి చేసినా ఎంత సహాయం చేసినా గుర్తుపెట్టుకోలేని సమాజంలో ఉన్నాము తిరిగి మనల్నే అనే రోజులలో బ్రతుకుతున్నాం కాబట్టి నీకు ఉన్నదాంట్లోనే చేయి..ఎందుకంటే నీకు కష్టం వస్తే ఆదుకునే వాళ్లెవ్వరూ నీ పక్కన ఉండరు నీ జీవితం నువ్వే పోరాడాలి మిగతావాళ్లంతా ప్రేక్షకపాత్రే అతి దానాత్ హత: కర్ణ: అతి లోభాత్ సుయోధన: అతి కామాత్ దశగ్రీవో అతి సర్వత్ర వర్జయేత్ కాబట్టి మరీ మంచితనం వుంటే నువ్వు నటిస్తున్నావ్ అనే రోజులలో ఉన్నాం జాగ్రత్త అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
91)మనం ఎంత గొప్ప వాళ్ళయినా...ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు, స్థలము,మనుషులు.అందరూ వదిలేసి వెళ్లిపోవాల్సిందే.మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు.ఈ మనుషులు.ఈ ఆలోచన..ఈ జీవితం.అంతా...మాయ సంకల్పం.కోరికలు ఉరవడిలో కొట్టుకుపోయే మనసుకి ఆలోచించే సమయం అసలే దొరకట్లేదు.కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నా లైఫ్ ఇంత అయిపోయిందా...అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే....జ్ఞాపకాలు గా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి.కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం.గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి.అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు.వారికి ఏదైతే అవసరమో దానికోసమే వాళ్ళ కోరుకున్నది జరిగేవరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు..దాన్ని ప్రేమ, ఆప్యాయత అనుకుని పొరపడితే...ఆఖరికి బాధపడేది, గాయపడేది శూన్యమై మిగిలిపోఏది మనమే.మన అనుకున్న వాళ్లు మనలని ఏదో ఉద్ధరిస్తారనుకోవటం మన పిచ్చి,మన పొరపాటు..మనసు పిచ్చిది.అది సాగరంలా పరుగులు పెడుతూనే ఉంటుంది. కోరికలు కెరటాలై ఎగసిపడుతూనే ఉంటాయి.ఆ సముద్రాన్నికి కూడా ఆనకట్ట ఉనట్టే నీ ఆలోచనలకు కూడా ఒక అనకట్టు వేసుకో. అందులో మంచి ఏంటో,చెడేంటో అన్నది విచక్షనతో నిర్ణయం తీసుకుని అడుగులు వెయ్యి.నీ జీవిత పయనంలో ఎంతమందిని చూసావో...ఎంతమందితో మాట్లాడావో....ఎన్నో వేల కోట్ల కిలోమీటర్లు దాటుకుంటూ ప్రయాణం చేసావో..నీకు తెలియని,నువ్వు చూడని వసంతాలే మున్నాయ్.రుతువులు ఎన్ని మారినా..మారని మన తలరాతలు అలానే ఉన్నాయ్.మన జీవితంలో కొన్ని ఇవ్వాలి ,మరికొన్ని తీసుకోవాలి.స్వార్థం ఉండొచ్చు.కోరికలు ఉండొచ్చు. మోసంతో కూడిన ప్రవర్తన ఉండకూడదు.లైఫ్ ఎండింగ్ ఎలా ఉండాలి అంటే మన చావుని చూసి.ఆ స్మశానం కూడా కన్నీరు పెట్టేలా ఉండాలి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
92)కన్నీళ్లు వస్తున్నాయి అని కళ్ళు మూసినంత మాత్రాన వచ్చే కన్నీరు ఆగిపోవు..కష్టాలు వస్తున్నాయి అని కలత చెందినంత మాత్రాన పరిస్థితులు మారిపోవు.కన్నీరు వచ్చేంత కష్టం వచ్చిన,కలత చెందే అంత నష్టం జరిగిన, నీరసించి నిష్క్రమించకుండా పదిలేచిన లేచిన కెరఠంలా పదిలంగా పోరాడుతూనే ఉండాలి అప్పుడే మనం అనుకున్నవి నెరవేర్చుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
93)గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకుని కలలు కంటే సరిపోదు గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో ఎందుకు ఓడిపోతున్నామో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్ధమవుతుంది..గెలుపులా ఉండాలంటే వస్తే కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే నిలబడే స్థాయికి ఎదగాలి నా వల్ల కాదని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదని గుర్తుంచుకో..బాధ,భాద్యత ఎవ్వరికీ చెప్పకు ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఈ లోకంలో గెలుపుకన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు..కొన్నిసార్లు పరిగెడితే కూడా అందని గెలుపుకోసం కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్తారు..ఒక్క నీకు నువ్వు తప్ప ఎలా తట్టుకుంటున్నావో,ఎలా నెట్టుకోస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దదీ కాదు అంతకు ముందుకు కంటే గొప్పదీ కాదు బరువు మోసే భుజాలకే తెలుస్తుంది బ్రతుకు మార్చే విధానం..కాలంతో యుద్ధం కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశం అయ్యి తీరాల్సిందే..లే పోరాడు నీకు విజయం తధ్యం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
94)మనం బలంగా నమ్మితే సరిపోదు బలహీనతని వదిలితేనే బ్రతుకు మారుతుంది..వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు అంత బాగుంటుంది..రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు..కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదోఒక నాడు నీకు గర్జించే అవకాశం వస్తుంది..నిలబడడం నేర్చుకో ఒంటరిగా తలబడటం నేర్చుకో సింహంలా..కష్టాల్ని దాటడం నేర్చుకో సగం జీవితం అర్ధమైనట్టే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
95)జీవితంలో మితిమీరిన ఇష్టం,భయంకరమైన వ్యసనం అరణ్యవాసాలు,అజ్ఞాతవాసాలు దాటితేనే కదా పట్టాభిషేకాలు..నువ్వు బలంగా కోరుకున్న మాత్రాన ఏది రాదు..నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏది పోదు..వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు కావలి అనుకుంటే మాత్రం కడదాక వదలకు ప్రతి ఒక్కరికి టైం వస్తుందని అలా వేచి చూస్తే సరిపోదు ప్రతి రోజు కష్టపడితే నే విజయం వస్తుంది కాబట్టి కష్టే ఫలి:...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
96)జీవితంలో యుద్ధం తధ్యం అనుకుంటే కత్తి కనీళ్ళు పెట్టినా కనికరించకు..ఆద్భుతం జరుగుతుంది అనే ఆశ కంటే పరిస్థులు మారతాయన్న నమ్మకం గొప్పది..విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా,వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు కాబట్టి ఎప్పటికి ఓపిక కోల్పోకు,ఓటమిని ఒప్పుకోకు కొన్ని నచ్చకపోయినా వినాలి,కొన్ని నచ్చినా వదిలేయాలి శక్తికి మించిన అప్పులు చేస్తే,వయస్సుకి మించిన బరువులు మోయాల్సిందే..నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీతో ఉన్నవారు ఎదురు చూస్తూ ఉంటారు.బరువైన బాధ్యతలు మోసినవారే విలువైన మాటలు చెప్పగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
97)జీవితంలో మొదలెట్టడానికి,ముగించటానికి మధ్యలో భరించాల్సినవి,తెగించాల్సినవి చాలానే ఉంటాయి..చరిత్రలో చాలా చోటే ఉంది..గెలవాలి అని అనుకునేవాళ్లు కోసం కాదు..గెలిచేదాకా పోరాడేవాళ్ళ కోసం..నిన్ను నువ్వు నమ్ముకుని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం..కొన్ని ఇప్పుడు చెప్పిన అర్ధం కావు అర్ధం అయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు కాబట్టి ఈ రోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడి పోతుందని మర్చిపోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
98)జీవితంలో సరైన విధానం తెలిసేవరకు నిదానంగా వెళ్లిన తప్పులేదు ఎందుకంటే బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికి బలహీనపడవు.ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలీదుకానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి,మారి తీరాలి..నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి గాయం కూడా గర్వపడాలి..నిద్రలేని రాత్రులే కాదు ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది..ఈ రోజు దరిద్రం అని తిట్టుకున్నదే ఎదో ఒక రోజు అనుభవం అని అర్ధం అవుతుంది ఓడిపోతామన్న భయంతో గెలవగలవన్న విషయం మర్చిపోకు కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటావు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
99)జీవితంలో జ్ఞాపకం అనేది ఒక మంచి అనుభూతి..కొన్ని మంచివి కొన్ని చెడ్డవి..మంచివైతే కొనేళ్ల తరువాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడింది అనిపిస్తుంది కాలం దేనికి ఎవ్వరికీ సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప..గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో ఎందుకంటే అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగి రాదు అమ్ముకోకలగాలే కానీ ఆలోచనలే అంతులేని ఆస్తి చేసే పని దైవంలా భావిస్తే ఎదో ఒక రోజు నీ జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
100)ఎగిరేవన్నీ ఆకాశానికి చేరవు ఎవరో అన్నారని నువ్వు చేతకాని వాడివి కావు..జరిగేది జరగనివ్వు,జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్లనివ్వు రావాల్సొన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది..చేరుకుంటా అంటే ఆలస్యం చెయ్యకు,చేరుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చెయ్యకు తన గురించి బాధపడమని ఏ గతం చెప్పదు భయపడమని ఏ భవిష్యత్తు అడగదు నిరాశ నీ వల్ల కాదు వదిలేయాలి అనిపిస్తుంది ఆశ సాదిస్తావు ఇంకో అడుగు వేయి అని అడుగుతుంది..గెలుద్దాం అనుకుంటే కొంతమంది నమ్మరు అలాగే ఎవ్వరూ తోడు రారు అందుకే నీకు ఎవ్వరు అవసరం లేదు..గెలిచినా ఓడినా పరిస్థితులు దారుణమైనా ఒక్కరిమే పోరాడగలం ఒంటరిగా సాధించగలమనుకో ఒక్కటి గుర్తుపెట్టుకో బద్ధకం వదిలేసైన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది..జీవితంలో చాలా సార్లు మనవల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది కానీ వదిలేయాల్సింది ఆ ఆలోచనలు మాత్రమే బాగా గుర్తుపెట్టుకో గతాన్ని మరువడమే అతిపెద్ద గెలుపు కచ్చితంగా సాధించాలంటే ఇప్పుడే మొదలుపెట్టు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
101)పడిపోవటం,పైకి లేవటం టైమ్ రావటం,మళ్ళీ కొత్త యుద్దాలు మొదలవటం..ఇవి అందరి కథలో భాగమే.వాటి అన్నిటిని దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవాలి,ఏమి జరిగినా తట్టుకొని నిలబడేలా మనల్ని మనం తయారు చేసుకోవాలి అప్పుడే మనం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
102)మంచి పనులు అనుకుని చేసేవి అన్ని మంచి పనులు అయి ఉండాలని లేదు..అలాగే మనం చెడ్డ పనులు అనుకుని చేసేవి అన్ని చెడ్డ పనులు కూడా కావు..ప్రతి పనికి ఒక కర్మ రూపు దిద్దుకుని మనల్ని అనుసరిస్తుంది..మంచి పనులు చేస్తున్నాం అనుకుని గర్వపడి..నా అంత మంచివాడు ఈ భూ ప్రపంచంలో లేడు అని..నేను మాత్రమే ఉత్తముడిని..నా చుట్టూ ఉన్నవాళ్లు నా పేరు పలికే అర్హత కూడా లేని పాపాత్ములు అని చుట్టు పక్కల సేవలో నేనో ఐకాన్ అని..ఒక చట్రంలో బంధింపబడిన ఆలోచనలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు..అందరూ అనుకున్నంత మాత్రాన వారికా కర్మ అంత ఉత్తమంగా ఉండకపోవచ్చు..అలాగే మనం చెడ్డ పనులు చేస్తున్నాం అని మన అంత చెడ్డవాడు ఈ ప్రపంచంలో లేడు అని..నేను ఎందుకూ పనికి రాని వాడినని..నేనో స్వార్ధపరుడిని..పరుల సేవ ఎరుగని వాడినని అనుకున్నంత మాత్రాన వారి కర్మ ఉత్తమమైనది కాకుండా పోదు..ఒక్కోసారి ఏమీ చేయకుండా ఉండడం కూడా ఉత్తమ కర్మ కావచ్చు..ఏదైనా వెలగ బెట్టడం కూడా ఎవరో ఒకరికి హాని చెయ్యొచ్చు..కాబట్టి ఒక సందర్భానికి మనం ఇచ్చే జడ్జిమెంట్ మన విజ్ఞతను బట్టే ఉంటుంది చుట్టూ ఉన్నవాళ్ళ విజ్ఞతను బట్టి కాదు..అది మన దృష్టిలో కరెక్ట్ అయినా అన్నివేళలా అందరి దృష్టిలో కరెక్ట్ కాదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
103)తృప్తిలేని వాడికి ఏది దొరికినా,ఎంత దొరికినా సంతోషం కలగదు.జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది.ఉన్నదాంతో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం.ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యం త్వరగా దరిచేరదు.ఆయుష్షూ పెరుగుతుంది.ప్రకృతిలో పక్షులనూ,జంతువులనూ ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడం.మనిషి కూడా అంతే.అత్యాశలకు పోకుండా,ఈర్ష్యాసూయలకు లోనుకాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి, తృప్తిగా దేవుడిని చేరుకోవచ్చు.అయితే, విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు.నిరంతరం నేర్చుకోవాలనే తపన, నేర్చిన జ్ఞానాన్ని పదుగురికీ పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు.కొత్త విషయాలు తెలుసుకోవడం,మంచివారితో స్నేహం మనల్ని ఉన్న స్థితి నుంచీ ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
104)జీవితంలో నిజమైన ఎదుగుదల
ఎప్పుడు సాధ్యమంటే..తెలియకపోవడం తప్పు కాదు...నేర్చుకోకపోవడం తప్పు,భయపడటం తప్పు కాదు.భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు.లోపాలు ఉండటం తప్పుకాదు..వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు,మనం ఏ అంశంలో వెనకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..అందులో
మెరుగవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
105)ప్రతి వారి మాటలో ప్రేమ వెతక్కు అర్హత లేని ఎందరో జీవితంలో తారసపడుతుంటారు..అందరి ప్రేమలో ఆప్యాయత,నమ్మకం,భద్రత,బంధం ఉండవు..అవసరం మాత్రమే ఉంటుంది అందుకే నమ్మకం లేని మాట,భద్రత ఇవ్వలేని బంధం విలువనివ్వని మనిషి..ప్రేమ లేని మనసు వ్యర్థం కనుక నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో..కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యలాంటిది సునాయాసంగా చింపిరి చేసి పోతారు..కాబట్టి జరా జాగ్రత్త!ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు చెప్పకు..ఏదో రోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు..!!నవ్వే క్షణమైనా..ఏడ్చే క్షణమైనా....శాశ్వతం కాదు..జనాలు....చాలా గొప్పోళ్ళు...అవసరాల బట్టి...పలకరింపులు మారుతాయి..అవసరాల్లోనే...మన పేర్లు గుర్తుకు వస్తాయి..ఎందుకంటే చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా మనం గుర్తు వస్తున్నామని సంతోషించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
106)మనం కాకపోతే ఇంకొకరు అనుకునేవారికి మనం దగ్గరున్నా,దూరంగా ఉన్నా మాట్లాడినా,
మాట్లాడకపోయినా..మనంబాగున్నా ,బాగోలేకపోయినా..అసలు మనం ఉన్నా,లేకున్నా ఒకటే కదా!!అలాంటివారి కోసం మనమెందుకు నిద్రలేని రాత్రులు గడపాలి...తల పగిలేలా ఎందుకు ఆలోచించాలి..గుండెలు వెలిసేలా ఎందుకు ఏడవాలి..మనస్సుని ఎందుకు కష్టపెట్టుకోవాలి..మనల్ని మనమెందుకు కోల్పోవాలి..పోతే పోనీ..ఉంటే ఉండనీ..ఏది శాశ్వతం కాదు...కుండలో వండుకున్న అన్నం కడుపులోకి పోతుంది అనే గ్యారంటీ లేని బతుకులు అంతమాత్రం దానికి మనమెందుకు బాధపడాలి..ఒక్కరోజులో రాలిపోయే పువ్వు అరే రాలిపోతున్నా అని బాధపడక నలుగురికి నయనానందాన్ని పరిమళాలను పంచుతుంది.మరి మనిషిగా పుట్టి,అన్నీ ఫీలింగ్స్ ఉన్న మనమెంత ఆనందంగా ఉండాలో,నలుగురికి ఎంత ఆనందాన్ని పంచాలో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకో!! కాబట్టి మనమేమి చేసినా ఆలోచించి చేస్తేనే ఈ లోకంలో బ్రతకగలం కదా..మరి మీరేమంటారు ?? అర్ధమైతే ఆలోచించి ఆచరించండి అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
107)మనం చిన్నప్పుడు ఒక కథ వినివుంటాం అది ఏంటంటే బావిలోనుంచి బయటకు దూకి ప్రపంచాన్ని చూడాలనుకున్నాయి కొన్ని కప్పలు.ఎంత ప్రయత్నించినా అవి అంతెత్తు ఎగరలేకపోతున్నాయి.అది చూసి మిగిలిన కప్పలు 'మీ వల్ల కాదులే ఇక ఆపండి...అని ఒకటికి పదిసార్లు అనేసరికి నిజమే కాబోలని అన్నీ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి ఒక్కటి తప్ప.దానికి చెవుడు.దాంతో నిరాశపరిచే వాళ్ల మాటలేవీ దానికి వినపడలేదు.కాబట్టి తన శక్తిమీద నమ్మకం సడలలేదు, పట్టువదలకుండా ప్రయత్నించింది,బయటపడింది.తన ప్రతిభ మీద తనకి నమ్మకం,లక్ష్యాన్ని అంది పుచ్చుకోగలనన్న విశ్వాసం ఉన్న మనిషి ఎటువంటి క్లిష్టమైన పనులనైనా సాధించగలడు.అద్భుతమైన ఫలితాలను పొందగలడు.అందుకే కలలు కనండి...వాటిని సాకారం చేసుకోగలనన్న నమ్మకంతో ముందుకెళ్లండి...విజయం మీ వెంటే వస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
108)ఆత్మవిశ్వాసం,నమ్మకం పెంపొందించుకుంటే మన బాధలూ సమస్యలన్నీ సమసిపోతాయి.మనపై మనకి నమ్మకం ఉంటే ఎంత గొప్ప పనులైనా చేయవచ్చు. నమ్మకమే వ్యక్తి ఉన్నతికి బాటలు వేస్తుంది..గతం,వర్తమానం ఎలా ఉన్నా భవిష్యత్తు బాగుంటుందని విశ్వసించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశించేవారు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు.నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తుంది.ప్రవర్తనను నిర్దేశిస్తుంది.మనిషి జీవితానికి అర్థాన్ని,పరమార్థాన్ని అందిస్తుంది.కలలు కనడం,ఏదో సాధించాలని ఆశించడం మనిషికి సహజం.అయితే ఆ కలల్ని సాకారం చేసుకోడానికి కావాల్సిన మొదటి సాధనం తమలోనే ఉందన్నది అందరికీ తెలియదు ఎప్పుడైతే మనం మన లోటుపాట్లని విశ్లేషించుకుని,మనం పడుతున్న బాధల్ని,మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులెన్ని మన మనోబలంతో అధిగమించేలా అనుకున్నది సాధించేలా ముందుకు వెళితే విజయం నీ గుమ్మం ముందు వాలాల్సిందే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
109)
వర్షం ఉన్నంత వరకే గొడుగు అవసరం ఉంటుంది. ఆ తరువాత అది బరువు అనిపిస్తుంది.మనిషి కూడా అంతే. అవసరం తీరే వరకే ఆసరా,తీరాక ఓ గతంలా మర్చిపోతారు అదే జీవితం.
110)ప్రపంచంలో పగటికి *సూర్యుడు* రాత్రికి *చంద్రుడు* ఉన్నట్టుగానే ప్రతి *మనిషికి* ఒక *ప్రాణ స్నేహితుడు* ఉండాలి . అప్పుడే *ఒక రోజు* నిండుతుంది . *ఒక జీవితం* నిండుతుంది.మనం మాట్లాడే *నిజానికి వాస్తవానికి* చాలా తేడా ఉంటుంది . మన వల్ల *ఇబ్బంది * పడే వారికి మన నుండి *దూరం* కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా *మనమే దూరంగా* ఉండటం మంచిది . మనం ఒకరిని ఎక్కువగా *నమ్మడం* వలన రెండు రకాల *ఫలితాలు* ఎదురు కావచ్చు ఒకటి మనకు *జీవితాంతం* తోడుండే ఓ *మిత్రుడు* దొరకావొచ్చు మరోక్కటి మనకు *జీవితాంతం* గుర్తుంచుకో దగిన *గుణపాఠం* .నేర్పిన వ్యక్తి అవ్వొచ్చు.ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది *నిజం కాదు* మన వెనకాల ఎలా ఉన్నారన్నది వారి *నిజస్వరూపం* మనముందు ఎలా ఉన్నారో మన *వెనకాల* కూడా అలా ఉన్నవారే మనల్ని నిజంగా *అభిమానించేవారు* . అలాంటి వారిని ఎప్పుడూ *వదులుకోకూడదు*..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
111)జీవితంలో స్నేహాలు ఎంతో ముఖ్యం.కుటుంబం ఎంత అండగా నిలిచి ఉంటుందో..నిజమైన స్నేహితులు కూడా కష్టంలో అంతే బలంగా నిల్చుని పోరాడుతారు.అందుకే రక్తసంబంధం తర్వాత స్నేహబంధమే గొప్పదని ప్రపంచంలోని మేధావులంతా చాటి చెబుతారు. రోజురోజుకు స్నేహబంధం పెరగాలంటే మీరు దానికి విలువ ఇవ్వాలి.అలాగే కొన్ని విలువలను కూడా పాటించాలి.కొద్ది మంది వెంటనే స్నేహం అలవర్చుకుంటారు.మరికొందరికి మాత్రం స్నేహితులు కావడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు ఎప్పుడైనా మీ స్నేహం సాగే నదిలా అందంగా ఉండాలి లేకపోతే అడ్డంకులు వచ్చి ఏరులుగా,పాయలు పాయలుగా విడిపోతుంది కాబట్టి ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి ఉంటే ఎవరి స్నేహామైనా కలకాలం ఉండేలా కాపాడుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
112)ప్రతి మనిషి భవిష్యత్తుపై ఆశతోనే జీవిస్తారు.భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కలలు కంటారు.అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే భవిష్యత్తు అనేది నేడు మీరు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది.మీరు ఈరోజు మంచి పనులు చేస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.కష్టపడి పని చేస్తూ ఉంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు..ఈనాడు చేసే ప్రతి పనీ భవిష్యత్తులో మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి నేడు మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
113)మనుషుల్లో నూటికి 90 శాతం మంది మనకున్న శక్తి యుక్తులలో తక్కువ భాగమే వినియోగిస్తూ ఉంటాము ఒకరు నిజాయితీగా కష్టపడితే ఏదో ఒక రోజు మనం మంచి ఉన్నత స్థాయికి కచ్చితంగా చేరుతాము.ముందుగా మీఆనం మనలో ఉన్న శక్తి ఏంటో,మనం దాని గురించి ఎంతవరకు కష్టపడి పని చేయగలమో వంటి విషయాలపై అవగాహన అవసరం.అలాగే మనకు ఏ రంగంలో ఎక్కువ ఆసక్తి ఉందో,మెదడు చురుగ్గా పనిచేస్తుందో తెలుసుకోవాలి..ఆ రంగంలోనే మనం అడుగుపెట్టి ఈరోజు నుంచే ప్రతి క్షణం కష్టపడుతూ ఉండాలి.మనం కష్టపడే ప్రతి క్షణం భవిష్యత్తులో మనకు అద్భుతమైన ఆనంద క్షణాలను అందిస్తుంది కాబట్టి కష్టే ఫలి: ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
114)అడిగి తీసుకునేది అనుబంధం కాదు,అడగకుండా ఇచ్చేది అప్పు కాదు,నమ్మకం లేకుండా చేసేది వ్యాపారం కాదు,సంకల్పం లేకుండా చేసేది సాధన కాదు,స్నేహితులు లేకుండా ఉండేది జీవితం కాదు!జీవితాన్ని సార్ధకంగా మార్చే నిగూఢమైన సందేశం ఇది. మన అనుబంధాలు నిబద్ధతతో, వ్యాపారం నమ్మకంతో,సాధన సంకల్పంతో,జీవితం స్నేహంతో పూర్ణత్వాన్ని పొందాలి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
115)మనిషి ఎప్పుడూ ఒక పక్షిలా బ్రతకాలి ఎందుకంటే అది కట్టుకున్న గూడు కూలిపోయినా..తను కూర్చున్న చెట్టుకొమ్మ విరిగిపోయినా..ఎముకలు కొరికే చలిపుట్టినా..పిడుగుల వర్షం పడినా..ఎండలు నిప్పులు చెరిగినా..అది ఎగిరిపోతూనే ఉంటుంది దేన్నీ లెక్కచేయకుండా..ఎన్ని కష్టాలు ఎదురైనా తన రెక్కల మీద నమ్మకాన్ని కోల్పోదు..ఎంత పెద్ద ఆపద వచ్చిన బ్రతుకు మీద ఆశ వదులుకోదు..అలాగే పక్షి లాగా మనిషి బ్రతికగలిగితే అది ఒక అద్భుతం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
116)నేస్తమంటూ లేరే ఈ జీవితానికెవరూ పోరాడకుంటె గెలుపే నీదవదూ…గాయపడితే మనసూ సాయాన్ని కోర మాకు
ఆ బాధ లోనే బతుకూ..నువ్వు నీకు దొరికే వరకూ కాలమడిగే ప్రశ్నకే బదులు నువ్వై సాగిపోరా..రాని దేదో కాని దేదో తెలుసుకుంటూ..ఏది కాదూ శాశ్వతం మరిచిపోకూ ఈ నిజాన్నీ ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా చిల్లిగవ్వా తోడురాదూ నలుగురి లోనూ కలిసిపోతూ నువ్వు నీలా మారు..జ్ఞాపకాలనే పోగు చేసే ఆటే కదా జీవితమంటే..కన్నులతడే.. నేర్పేను మరి నువు నడవనీ.. దారే ఏదో..నీ మౌనమే.. నీ తోడు అని..గమ్యానికే.. నడిచిపోరా..పూలు పరిచిన దారే కావాలి అనుకోమాకూ ముళ్ళున్న దారి కూడా.. నీదనుకో..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
117)పూటగడవని రోజే తెలిసేను ఆకలంటే ఆ రోజు నీకెదురైతే పుడతావు మళ్ళీ నువ్వే..వాడూ వీడూ, వీడూ వాడూ ఎవ్వన్నీ నమ్మొద్దు నువ్వు తాడో పేడో తేలాలంటే నీతో నువ్వే పోరాడు..గుండె పగిలి నెత్తురొస్తె..నొప్పి అంటు మొత్తుకోకు..చిప్పకూడు చేతికొస్తె నెత్తీనోరూ బాదుకోకు చావుకోరల్లోన చిక్కి కొత్త జన్మ ఎత్తి ఆకాశాన్ని ఏలినట్టు కలల్ని కళ్ళజూడ నువ్వు మారి గెలుపు సంద్రాన్ని ఎక్కి తెలిచేయి నువ్వేవరో..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
118)పట్టిన పట్టే గట్టిగ పట్టూ పిడికిలి పిడుగులు కురిపించేట్టూ..పడుతూ లేస్తూ పంజా విసురూ మరిగిన నెత్తురు చిందేట్టూ..విడిపడి ముడిపడి తలపడి బలపడి నిలబడి కలబడి ఎగబడి తెగబడి దడవక విడవక గెలుపుని గెలవరా ఈ లోకం మూర్ఛిల్లేట్టూ నడిచి వెళ్ళే దారిలో మనిషి తనమే చల్లిపోరా తోటి వాడీ సంబరాన్నే పంచుకుంటూపో నలుగురి మేలూ కోరిన నాడే మనిషౌతావూ నీవూ ఆ సత్యాన్నే గుర్తించాకే మొదలవుతుంది నీలో మార్పూ నిన్నటి నువే నీకెదురు పడీ నువు ఎవరనీ అడిగే లాగా నీ కథ నువే రాయాలి మరి ఈ నిమిషమే తనివి తీరా..ప్రేమ లేని వాడే అసలైన పేదవాడు ఆ లోటు నీకు ఎప్పుడూ రానివ్వకు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
119)కొంతమంది మనుషులు ఉంటారు పైకి ఒకలా లోపల ఒకలాగా ఏదన్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతవరకు ఒకలాగా తర్వాత ఇంకొక లాగా ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మారిపోతూ ఉంటారు అలాంటి డేంజర్ మనుషులు మన చుట్టూనే ఉన్నారు మన ఇంటి చుట్టుపక్కల మనతోనే ఉంటారు..ఉపయోగం లేకుండా ఎవరు ఎవరిని కలవరు ఎవరు ఎవరితో ఉండరు ఒకవేళ ఎవరైనా బలవంతం మీద మన జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి అలాంటి వాళ్ళని పొరపాటున కూడా ప్రోత్సహించకండి..అలా చేస్తే భవిష్యత్తులో చిక్కులోపడి బాధపడాల్సి వస్తుంది..ఒక్కటి మాత్రం పక్కా నేను ఎలా ఉంటాను నేను ఇలా చేస్తాను నువ్వు ఇలాగే ఉండాలి అని మనం ఎవరికీ చెప్పకూడదు ఎవరిని అనకూడదు ఎందుకంటే మనలాగా వేరే వాళ్ళు ఉండరు.వేరే వాళ్ళలాగా మనం ఉండం..మన అభిప్రాయాలు మనకు ఉంటే మన అలవాట్లు మనకు ఉంటాయి మన పద్ధతి మనకు ఉంటది ఎదుటి వాళ్ళని చూసి మనం అనుసరిస్తే అది నటన అవుతుంది అలా చేస్తే జీవితమంతా నటనతోనే బతకాలి అలాంటి జీవితం వృధా అన్నమాట అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అవుతుంది కాబట్టి ఎవరినైనా మొహమాటం లేకుండా దూరం పెట్టండి.ఎవరి మీదా అంతగా ఆధారపడకండి ఎందుకంటే వాళ్ళు దూరం పెడితే మళ్ళీ మనం నిరాశ పడాల్సి వస్తుంది.దయచేసి హద్దులో ఉండండి..వాళ్ళు చూపించే ఓ..అందమైన అబద్ధపు ప్రేమ..కొంతమంది మన జీవితంలోకి వాడుకొని వదిలేయ్యడానికే వస్తారో లేక ఆడుకోవాడాని వస్తారో తెలియదు కానీ అసలు జీవితమంటేనే ఇష్టం లేకుండా..చేసి వెళ్ళిపోతారు..కాబట్టి తస్మాత్ జాగ్రత్త..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
120)నీతులు నీడ ఇవ్వక పోవచ్చు కానీ,నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి.సామెతలు సంపద ఇవ్వకపోవచ్చు కానీ,మనలో ఆలోచనలు జోడిస్తాయి.కొటేషన్లు కోరికలు తీర్చక పోవచ్చు కానీ కొత్త అర్థాన్ని చెప్తాయి.మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
121)పగ తీర్చుకునే పని మనకెందుకు కాలం ఆ పని చేసుకుంటూ వెళితుంది..ఒక చిన్న కథ..ఒక ఊర్లో ఒక రైతు కష్టపడి పొలం పని చేస్తూ కొన్ని కోళ్లను కూడా పెంచుతూ ఉండేవాడు.మాటుగా ఉండి రైతు లేని సమయంగా చూసి నక్క ఒకటి కోడిని చంపి ఎముకలు కూడా కనిపించకుండా తిని వెళ్లిపోయేది.రోజుకో కోడి మాయం అవుతుంటే రైతులో బాధ,చాటుగా కోళ్ళని ఏమవుతున్నాయో కనిపెట్టాలని ఉన్నాడు.అలా ఉండగా గుంట నక్క చప్పుడు చేయకుండా వచ్చి కోడిని పట్టుకుపోయింది.విషయం కనుక్కున్న రైతు మరుసటి రోజు నక్క రాగానే ముసుగేసి పట్టుకున్నాడు.అతడి కోపం తో బుర్ర పనిచేయలేదు నక్క తోకను కిరోసినే లో ముంచి నిప్పు పెట్టాడు.మండిన నక్క అటు ఇటు పరిగెడుతూ రైతు పండించిన పంటకు నిప్పు పెట్టి పోయింది.
రైతు పంట మొత్తం నష్టపోయి లబోధిబో అన్నాడు.అందుకే చెప్పేది పగ తీర్చుకోవడం అంటే మనం పాపం చేసేలా ఉండకూడదు మనకు నష్టం వచ్చేలా అస్సలు ఉండకూడదు.మనల్ని బాధ పెట్టినవారిని మనల్ని మోసం చేసినోళ్ళని..మనం బాగుంటే ఓర్వలేనివాళ్ళని..దేవుడు కాలంతో చేరి తప్పకుండా శిక్షిస్తాడు..మనం కాస్త సహనంగా వేచి చూడాలి అంతే..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
122)విజయం సాధించాలంటే ఏకకాలంలో అనేక విషయాల్లో ప్రావీణ్యం ఉండాలి. సామాజిక నైపుణ్యాలతో పాటు,కెరీర్ సంబంధిత నైపుణ్యాలు కూడా ఉండాలి.తద్వారా కెరీర్,కుటుంబం ముందుకు సాగుతుంది. కాబట్టి ఖాళీ సమయాల్లో సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించండి అలాగే మనం ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉంటే ఆ ఫలాలను ఆస్వాదించగలరు కాబట్టి విజయం సాధించడంలో ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించండి. మానసిక, శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటేనే, మీరు మీ కెరీర్ పై దృష్టి పెట్టగలుగుతారు.పైన చెప్పిన అంశాలను ముప్పయ్యేళ్ల లోపు సాధించి చూడండి.ఆ తరువాత జీవితం ఎంతో అందంగా,ఆనందంగా అనిపిస్తుంది.కెరీర్ ను ముప్పయ్యేళ్ల లోపే సెట్ చేసుకోవాలి,ఆర్ధికంగానూ బలపడాలి.దానికి మీరు మీ ఇరవైల్లోనే ఎంతో కష్టపడాలి కాబట్టి కష్టే ఫలి: ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
123)సాయం తీసుకుంటే.. గుర్తు పెట్టుకోవాలి...సాయం చేయకుంటే.. అర్ధం చేసుకోవాలి...బాధ పెడితే..మోసం చేస్తే.. గుణపాఠం నేర్చుకోవాలి.
విలువ ఇవ్వకుంటే.. దూరంగా జరగాలి...సందర్భానుసారంగా మారిపోయే మనుషుల మధ్య నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ప్రతి అనుభవాన్ని ఉలి దెబ్బగా చేసుకొని శిలగా ఉన్న నిన్ను శిల్పంగా మలచుకోవాలి. అన్ని సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
124)జీవితం చాలా నేర్పుతుంది అంటారు కానీ జీవితం ఏం నేర్పించదు..మన చుట్టు ఉన్నవాళ్ళే మనకి చాలా నేర్పుతారు..నువ్వు ఎంత గుడ్డిగా మనిషిని నమ్మితే అంత ఎక్కువగా నిన్ను మోసం చేస్తారు...ఈ రోజుల్లో నిజమైన ప్రేమ,ఆప్యాయతలు,నమ్మకాలు లేవు...ఈ బంధాలు,అనుబంధాలన్ని చిక్కుముడులు...
గజిబిజి అల్లికలు...వాటిని పట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు...కొన్ని పయనాలు జరగాలంటే...
కొన్ని నయనాలు చెమ్మగిల్లాలి తప్పదు...అనవసరంగా ఏ మనిషి మీద నమ్మకం పెట్టుకోకు...ఎవరు చివరిదాకా నీతో ఉండరు...నీతో ఉండేది కేవలం నువ్వు మాత్రమే కాబట్టి ఏం జరిగినా నవ్వుతూ బ్రతకడం అలవాటు చేసుకో..మళ్ళీ చెబుతున్నా జీవితం ఏం నేర్పించదు..బ్రతకమనుంటుంది అంతే... ఎందుకంటే జీవితమే ఒక జగన్నాటకం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
125)చాలామంది విజయం అనేది ఒక చివరి స్టాప్
అనుకుంటారు.విజయం అనేది గమ్యం కాదు,ప్రయాణం.
జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. మీకు ఎదురయ్యే
విజయాలు చెక్ పాయింట్లు మాత్రమే.జీవితాంతం
విజయవంతంగా నడవాలంటే మీరు ప్రయాణం చేస్తూనే
ఉండాలి.మార్పు ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం. మీకు ఎదురవుతున్న ప్రతి మార్పును ఎదుర్కొంటూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. మార్పును స్వీకరించడం నేర్చుకోండి. దానితోనే సరిపెట్టుకోండి.సమయానికి అనుగుణంగా ముందుకు సాగండి అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాల్ని సాధించగలేరు సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
126)జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులను మరిచిపోకండి..!!
*మొదటి వ్యక్తి*::: నిన్ను గెలిపించడానికి ని కోసం అన్ని కోల్పోయిన మీ నాన్న
*రెండో వ్యక్తి*::: నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ నీ తోడుంటే
మీ అమ్మ
*మూడో వ్యక్తి*:::నీ మనస్సులో ఉన్న భావాన్ని పంచుకోవడానికి ఒక స్నేహితుడైన ఉండాలి,లేకుంటే భాగస్వామైనా ఉండాలి..అలాంటి వ్యక్తులు నీకు దొరికినప్పుడు వారిని ఎప్పటికి వదులుకోకండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
127)మన జీవితంలో కొంతమంది మనం మాట్లాడితేనే,మాట్లాడుతున్నారు అంటే దానర్థం..ఇంక అక్కడ నీతో అవసరం లేదని అర్థం చేసుకోవాలి..ఒకరు మనం మాట్లాడిస్తేనే మాట్లడుతున్నారు అంటే అక్కడ నీ పాత్ర ముగిసింది అంతే వాళ్ళకి ఎదైనా అవసరం ఉంటేనే మళ్ళీ మాట్లాడతారు అంతే తప్ప ఓ నువ్వు కాల్ చేసి మాట్లాడితేనో ఆప్యాయంగా ఓ రెండు మాటలు మట్లాడేసరికి నా మీద కూడా అభిమానం ఉందని మురిసిపోకు అక్కడ వాళ్ళు నువ్వు బాధపడతావని మాట్లడతారే తప్ప నిజంగా అభిమానం ఉండి మాట్లాడరు..కొంతమంది ఎలా నటిస్తారంటే నాకేం అవసరం వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడదాం..లేదంటే లేదు పోయేదేముందీ..ఓ రెండు మాయ మాటలు తప్ప అని..ఉండని..ఇంకొంతమంది మహానుభావులు ఎలా అంటే ఎప్పుడైనా ఎదైనా అవసరం రావచ్చు ఇలా కొంచెం మైంయింటేన్ చెద్దాం అని అనుకుంటారు తప్ప నువ్ కావాలి అని ఫీల్ అయ్యి నీతో మాట్లాడరు..కాబట్టి నేటికాలంలో జెన్యూన్ గా నిన్ను నిన్నుగా ఇష్టపడేవాళ్ళని నలుగురిని సంపాదించుకో అలాగే అవసరాల కోసం నిన్ను వాడేవాళ్ళని వదిలించుకో అప్పుడే మోసపోకుండా జీవితంలో ఎదగగలం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
128)మనసును జాగ్రత్తగ చూసుకుంటున్నామని
బలహీన పరిచేస్తామేమో కాస్త కఠినంగా ఉండడానికి కూడా తెలుసుకోవాలి.ప్రాణం అంటే మనుషులు పక్షులు జంతువులు ఇవే అంటారు కానీ నా కెందుకో ప్రతి వస్తువుకి ప్రాణం ఉన్నట్టే అనిపిస్తుంది.కారు ధిద్దిన కాపురం..కారు ఓ కుటుంభం పైన చూపే విశ్వాసం అలాగే మర్యాద రామన్న చిత్రం లో సైకిల్ మాట్లాడుతుంటే చాలా నిజం అనిపించేది.ఒక వాక్యం గుర్తు వచ్చినప్పేదల్లా మనస్సు చాలా బాధతో నిండిపోతుంది..*గుడ్డివాడికి చూపొస్తే మొదటిగా అతను వదిలేసేది అప్పటివరకు తనకు తోడుగా ఉన్న చేతి కర్ర* బాధ అనిపిస్తుంది..చూపొచ్చాక కూడా కర్రను పట్టుకు తిరగమని అనట్లేదు కానీ ఆ కర్రను వదిలేయొద్దు ఆ కర్రను విసిరేయ్యొద్దు అంటున్నా ఎంత చూపు వచ్చినా ఇప్పటి వరకు నీకు చూపయింది ఆ కర్రే గా అవసరం తీరిపోయాక మనుషులనే మర్చిపోతున్నారు
మార్చేస్తున్నారు ఇక వస్తువులకు విలువ ఇవ్వమనడం ఏంటి నీ పిచ్చి కాకపోతే అని అనుకోవచ్చు మారలసింది సమాజం కాదు మార్చుకోవలసింది మనసును అంటూ
ఎక్కడి నుండో మాటలు వినిపిస్తున్నాయి..కానీ కఠినంగా ఉండాలని ప్రయత్నించినా అది అనుకునేంత సులువేం కాదు కానీ మనం బ్రతకాలంటే తప్పదు కాబట్టి నీ ధర్మం నువ్వు చేయి దేవుడు చేయాల్సింది చేస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
129)జీవితంలో కొన్నింటికైనా NO చెప్పడం నేర్చుకో...ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే అంతకన్నా మనఃశాంతి ని ఇచ్చే నిర్ణయాలు కనిపించవు.ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*.
130)మనం ఎక్కువ మాట్లాడితే మంచిదా,తక్కువ మాట్లాడితే మంచిదా? బాగా గమనిస్తే “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది,అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు..కానీ కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది…దీని వల్ల అర్ధమయ్యేది ఏంటంటే,ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు..మాట్లాడేది ఒక మాటే అయినా,అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు కాబట్టి నువ్వు కప్ప లాగ ఉంటావో కోడి లాగ మారతావో ఆలోచించుకో అప్పుడే జీవితంలో త్వరగా ఎదగగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
131)నీ జీవితంలో ఎన్ని బంధాలైనా ఉండొచ్చు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎన్ని బంధాలు ఉన్నా ఎలాంటి బంధాలు ఉన్నా అవసరానికి ఉండరు అంతే సమయానికి ఉండరు అంతే సహాయానికి ఉండరు అంతే వాళ్ళ అవసరానికి నిన్ను ఉపయోగించుకునే వాళ్ళే తప్ప నీ అవసరానికి వాళ్ళు ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు.అలాంటి బంధాల కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఎంత కష్టపడినా ఎన్ని సాధించిన ఎంత పోగొట్టుకున్న ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి జాగ్రత్త..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
132)మనతో మాట్లాడటం ఇష్టం లేని వారి దగ్గర మనం ప్రేమతో మాట్లాడు మాట్లాడు అని బ్రతిమిలాడినా అది వాళ్లకి కష్టం గానే ఉంటుంది..మనమే అర్థం చేసుకొని వాళ్లకి దూరమైపోవాలి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
133)ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారమైనా,ఎదుటివారిని
ఆదరించే మంచివాళ్లమే అయినా మన మాటతీరు సరిగాలేకపోతే ఎవ్వరూ కూడా దరిదాపుల్లోకిరారు.అవతలివారి హావభావాలను,భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అక్షరాలా కళే! మన దృష్టికోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మన భావాలను ఎదుటి వారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తే ఎవరూ జీర్ణించుకోలేరు.మాట్లాడే సమయంలో అవతలి వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి..పెదవి దాటిన మాట పృధ్వి దాటుతుందని సామెత.అందుకనే ఏం మాట్లాడబోతున్నామో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందే ఊహించు కోవాలి.అన్ని కోణాల్లోనూ ఆలోచించుకుని నలుగురిలో మాట్లాడేటప్పుడు
అప్రమత్తంగా ఉండాలి."నాలుక చివరనే లక్ష్మి తాండవిస్తుంది. అంటే మాట్లాడేతీరూ తెన్నును బట్టే సంపద లభిస్తుంది.నాలుక చివరనే బంధు మిత్రులుంటారు.అంటే మన మాటలవల్లే మిత్రులు దొరుకుతారు బంధువులు లభిస్తారు.నాలుక కారణంగానే బందీఅయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మాటని అదుపు చేసుకుంటే జీవితంలో ఎదగగలవు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
134)జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే...కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది..కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది.మనసుకు తగిలే దెబ్బ ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది.బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే జీవితం మీద తగిలిన దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కొవాలో నేర్పిస్తుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
135)జీవితం ఎప్పుడూ మనకు రెండు ఆప్షన్స్ ఇస్తుంది..మొదటిది...చస్తూ బతకాలి..రెండోది... చచ్చే వరకు మనిషిలా బతకాలి కష్టమైనా నువ్వు రెండోదే ఎంచుకో...ఎందుకంటే నిన్ను చూసి చప్పట్లు కొట్టడానికి చాలామంది మొదటిది ఎంచుకున్నారు !జీవితంలో గొప్పగా చెప్పుకునే రోజులు ఉన్న లేకపోయినా.బతికినంత కాలం ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టకుండా సచ్చిపో..చచ్చాక నీ పేరు గొప్పగా చెప్పుకుంటుంది ఈ లోకం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
136)జీవితంలో మనం ఎన్నో సవాళ్లు ఏదురుకుంటూ ఉంటాం కొన్ని సార్లు ఆ ప్రక్రియలో తప్పులు చేస్తూ ఉంటాం..కానీ చేసిన తప్పులు తెలుసుకోవాలే కానీ లక్ష్యం వైపు మనం చేసే ప్రయాణం ఆగకూడదు..నిజమైన ఎదుగుదల ఎప్పుడు సాధ్యమంటే..మనం చేసే పనులు తెలియకపోవడం తప్పు కాదు...నేర్చుకోకపోవడం తప్పు. భయపడటం తప్పు కాదు...భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు.లోపాలు ఉండటం తప్పుకాదు..వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు,మనం ఏ అంశంలో వెనకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ తప్పులు తెలుసుకుంటూ గుణపాఠాల నుంచి నేర్చుకుంటూ..అందులో మెరుగవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
137)అబద్దాల మధ్య ఆరితేరిన మనకు నిజాలు రుచించవు నాలుగు గోడల మధ్య బందీ అయిన మనకు స్వేచ్ఛకు బొత్తిగా అర్ధం తెలియదు..అర్థం కాని అర్థం లేని ఆరాటంలో పోరాటం శూన్యం అంచలంచలుగా నీ ఆశలకు ఆనందాలకు తూట్లు పడుతుంటే రెండు కన్నీటి బొట్లతో వాటిని పరామర్శించడమే తప్పా నిష్ప్రయోజనమైన చేతులతో నిండు నూరేళ్లు బతకాలనే బలమైన వాంఛ తప్పా మరొకటి లేని గుడ్డితనం..కోల్పోయింది ఏదీ కోటి సార్లు దుఃఖించినా రాదు మనం కాపాడుకోవాల్సింది ఆస్తులను ఆరోగ్యాన్నే కాదు ఆలోచనలను ఆనందాన్ని కూడా...ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
138)నీటిలో విసిరిన రాయి హృదయంలో గుచ్చుకున్న మాట మాయమై పోవు రాయి కరిగిపోదు, మాట మారిపోదు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
139)ఆస్తి, అంతస్తులు ఉన్నాయని ఎగిరి పడకు ఏమి లేదని అధైర్య పడకు ఎవరు లేరని బాధపడకు మరెవరు ఉన్నారని గర్వపడకు సుఖాలకు పొంగిపోకు దుఃఖాలకు బాధపడకు వీటన్నిటికీ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదు!!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
140)మనకున్న స్నేహం ఓ నీడ.వెలుతురున్నంత వరకు వెంటాడుతూ ఉంటుంది.చీకటి (మనదగ్గర ఏమి లేనప్పుడు)రాగానే కనుమరుగు అవుతుంది.జీవితం ఓ పెద్ద అబద్ధం.ఈ భూమి మీద మనలను ఎన్ని రోజులు ఉంచుతుందో తెలియదు..ఎలా ఉంటుందో...ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాదు..మన చుట్టూ ఉన్న సమాజం ఓ నాటక రంగం.నవరసాలు పండించి నిట్టనిలువునా ముంచేస్తారు ఈ నటులు.అయిన బ్రతకాలనే కోరికలతో బాధల బంధికానలో బలౌతునే... మన జీవనం సాగిస్తాం.తప్పదు మరి...ఆఖరి పిలుపు వచ్చేవరకు.నటించే సమాజం ముందు. మనము నటిస్తూ...రాని నవ్వుని ముకాన తగిలించుకుని ఈ గ్యారెంటీ లేని బతుకు బతకడమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
141)*కష్టం*..మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది..దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు..*కోపం*....ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది..ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు కానీ అది చేసే నష్టం జీవితకాలం. *జీవితం*..ఒక రైలు ప్రయాణం లాంటిది...మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది.ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే..మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిస్తూ ఉంటుంది...కోపం,కష్టం,జీవితం మూడూ మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు..మన మాట ఎప్పుడూ వినవు మనకు చెప్పిరావు.. కాబట్టి ఈ మూడింటితో జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
142)*తెలివితక్కువతనం*..- నీటిలో ఈదుతున్న చేపకు తెలియదు ఎర వల్ల తనకు ప్రాణం పోతుందని.*నోటిదురుసు*..- కప్పకు తెలియదు తనుచేసే శబ్దం వల్లనే పాముకు ఆహారం అవుతుందని.*అహంకారం*.. - జింక అందాన్ని పులి చూడదు.ఆకలిని చూస్తుంది కాబట్టి ఎక్కడ ఎలా తెల్సుకుని మసలాలి ..*తొందరపాటు*.. - కుడితే చస్తుందని తేలుకు తెలుసు కానీ కుట్టకుండా ఉండలేదు..ఈ తొందరపాటు వల్లే త్వరగా చస్తుంది..కాబట్టి తెలివితక్కువ,నోటిదురుసు,అహంకారం,తొందరపాటు ఇవే మనిషి పతనానికి కారణం అని తెలిసినా కొంతమంది మారరు ఎప్పుడైతే గట్టిదెబ్బ తగిలి వారు ప్రవర్తించిన తీరుని మార్చుకుంటారో వారు అనుకున్నది సాధించగలరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
143)గెలుపు ఓటములు నాణానికి రెండు వైపులు..ఓటమి నేలైతే..గెలుపు ఓ శిఖరం..నేలకీ శిఖరానికి మధ్య వేల కొద్ది మెట్లు..నేల మీద చెతికిలబడడం ఓటమి శిఖరపు సోపానపు మెట్లు ఎక్కడం గెలుపు.శిఖరాన్ని నువ్వు ఎక్కుతున్నప్పుడు..నీ కన్నావెనుక నున్నవారు నిన్ను దాటి పోవచ్చు...నీ కన్నా ముందునున్న వారిని నువ్వు దాటి పోవచ్చు...నిరంతర ప్రయత్నమే నీ గెలుపు...నిన్నటి కంటే ఈ రోజు ఎన్ని మెట్లు ఎత్తులో ఉన్నావో చూసుకో..ఈ వ్యక్తిత్వమే నిన్ను త్వరగా గమ్యానికి చేరుస్తుంది..నిన్ను నువ్వు గెలిచావో లేదో బేరీజు వేసి ఆలోచించుకో...ఈ వ్యక్తిత్వమే నిన్ను త్వరగా గమ్యానికి చేరుస్తుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
144)మనలో ఎంత మంది మన ఎదుగుదలకు దోహదం చేసిన వారిని,మనల్ని తీర్చిదిద్దిన వారిని త్రికరణశుద్ధిగా గుర్తుంచుకున్నాం ?మన వద్ద సాయం తీసుకుని, మనల్ని గుర్తుంచుకున్న మహానుభావులు ఎంత మంది ?! నన్నడిగి కన్నారా అని దబాయించే సంతాన వజ్రాలు పెరిగిపోతున్న రోజులు..నా సుదీర్ఘ ప్రస్థానంలో నాకు ఙానోదయం ఏమిటంటే సహాయం ఎవరి నుండి పొందినా మరిచి పోకూడదు.చచ్చేదాకా కృతఙ్ఞతతో ఉండాలి..మరచిపోతో చచ్చిపోయినట్లే..వీలుంటే రుణం ఏదోలా తీర్చుకోవాలి..ఎవరికైనా మనం సాయం చేస్తే చచ్చినా గుర్తుంచుకోవద్దు..గుర్తుంచుకుంటే మన సహాయాన్ని మరచిపోయిన మానవ రత్నాలు మనల్ని చంపేస్తారు..మన గుండెల్ని ఛిద్రం చేస్తారు.మరొకరికి ఇంక సాయం చేయలేం..అపకారికే ఉపకారం చేయమన్నారు పెద్దలు..అలాంటిది మనకు ఉపకారం చేసినవారిని మరిచిపోతే ఆ బతుక్కి విలువ ఏముంటుంది? ఎవ్వరికీ ఉపయోగపడని మనం బతికుంటే ఎంత ?చస్తే ఎంత ? అని నా అభిప్రాయాం నాతో ఏకీభవిస్తే ఇకనైనా కృతజ్ఞతగా ఉండడానికి ప్రయత్నిస్తూ పాఠించండి లేకపోతే నన్ను మన్నించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
145) ఎప్పుడైనా ఉన్నప్పుడు దేని విలువ తెలియదు పోగొట్టుకున్నకే అర్థమవుతుంది ఎవరికైనా పోగొట్టుకోవడం చాలా తేలిక తిరిగి పొందడమే చాలా కష్టం అది మనిషేనా వస్తువైనా..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
146)ఆకలి కోసం వేటాడే పులికి బలం దాని పంజాలో వుంటే,ప్రాణం నిలుపుకోవడం కోసం పరిగెత్తే జింకకు బలం దాని కాళ్ళలో వుంటుంది..నా బలం ముందు ఆ జింక ఎంత అని పులికి పొగరు తలకెక్కి వేగం తగ్గితే..జింక చేజారిపోతుంది కదా..దాని కన్నా నేను బలహీనమైన దానిని అని జింక భయపడి ఆగిపోతే..పులికి ఆహారం ఐపోతుంది..కాబట్టి నీ సమస్య ఏదైనా...నీ ముందు ఎంత బలవంతుడున్నా ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు నువ్వు నీ బలహీనతను పక్కన పెట్టి..నీకున్న బలాన్ని నువ్వు ఆయుధంగా మార్చుకుని ఆ సమస్యలపై పొరాడగలిగితేనే గెలవ గలవు..అలాకాకుండా ఎప్పుడైతే బలాన్ని కాకుండా బలహీనత మీద నీకు ద్యాస మళ్లిన రోజున నీవు ఓడినట్టే...కాబట్టి నమ్మకంతో ముందడుగు వేయి నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
147)కొంతమంది నావెనుక వాళ్ళున్నారు..వీళ్ళున్నారు..నాకోసం అదిచేస్తారు ఇది చేస్తారు అనుకుని భ్రమలో బ్రతికేస్తుంటారు..నీ జీవితాన్ని నువ్వెలాగైనా బ్రతుకు..కానీ నీ జీవిత ప్రయాణంలో మాత్రం నీవు ఒంటరిగా వెళ్ళు..నెమ్మదిగా వెళ్ళు కానీ వేరేవారు నీకు సహాయం చేస్తారని మాత్రం నమ్మకం పెట్టుకుని వెళ్ళకు..ఎందుకంటే ఎవరికి వారు బాగానే వుంటారు కానీ...మరొకరి విషయానికి వచ్చేసరికే ఎక్కడి లేని బాధలు సమస్యలు గుర్తుకు వస్తాయి వాళ్ళని అనడానికి కూడా ఉండదు ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి..అలాంటి వారు నీకు సాయం చేస్తారనుకోవటం నీ అమాయకత్వమే..అందుకే ఇలాంటి గుడ్డి నమ్మకాల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు..నమ్మటం తప్పు కాదు గానీ పక్కవాడు చేస్తాననే నమ్మకాలపై గోరంత ఉంచుకోవాలి..కొండంత నమ్మకం నీకు నీపై ఉండాలి అలా ఉంచుకోకలిగినప్పుడే నీ బ్రతుకు బాగుపడేది..లేదు కాదు కుదరదు అనుకుని నేను వాడికి ఒకానొకప్పుడు అది చేసాను ఇది చేసాను..నాకు కూడా చేస్తాడులే..చెయ్యందిస్తాడులే అని కలలు కంటే బురదలో కాలేసి కింద పడినట్టే అప్పుడు పైకి లేపడానికి ఒక్కరు రారు ఎందుకంటే కల్తీ లేకుండా కనీళ్ళు కూడా దొరకని కలియుగం ఇది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
148)మనల్ని అందరూ కలుపుకోవాలి..ప్రేమగా చూసుకోవాలి..మనకంటూ ఓ *మర్యాద* *గుర్తింపు* *గౌరవం* ఇవ్వాలి అనుకోవటంలో తప్పులేదు కానీ..నీతో వుండే ప్రతి ఒక్కరిలో ఆ ప్రేమను ఆ గుర్తింపును ఆ గౌరవాన్ని వెతక్కు..నిజానికి అర్హత లేని ఎంతోమంది నీ జీవితంలో నీకు తారసపడుతుంటారు..కానీ నువ్వు అనుకున్న *బంధాలు* *ఆప్యాయతలు* *నమ్మకాలు* మాత్రం అవతలి నుంచి కనపడటం కొంచం కొంచమేంటి చాలా కష్టమే..అవతలి నుంచి అవసరం మాత్రమే కనిపిస్తుంది..అందుకే ఈ *నమ్మకం లేని మాటలు*..*బాధ్యత లేని బంధాలు* *విలువ లేని విలువ ఇవ్వని మనుషులు* *బంధాలూ లేని మనసులు* వ్యర్థం..కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో..ఎందుకంటే కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి..మెత్తని కత్తిలా మనకు తెలియ కుండానే..పొడిచిపోతారు అదేనండి బాబు వెన్ను పోటు.. తస్మాత్ జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
149)ఒకరి స్థానం అనేది వారు వేసుకునే రంగు రంగుల బట్టలు లేదా వారు ధరించిన ఖరీదైన వస్తువులను బట్టి మారదు.. ఒకరు సింపుల్ గా సాదాసీదాగా కనిపించినంత మాత్రాన వారి స్థాయేమీ తగ్గిపోదు.. మరొకరు హుందాగా నిండుగా కనిపించినంత మాత్రాన వారిగౌరవం ఏమీ పెరిగిపోదు.. స్థాయిని బట్టి నిజమైన గౌరవం గుర్తింపు వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ...గుణాన్ని బట్టి గౌరవం మాత్రం కచ్చితంగా వస్తుంది..అందుకే నీ స్థాయి మారినా నీ సంస్కారాన్ని నీ నిన్నటిని మాత్రం ఎప్పటికి మర్చిపోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
150)నీ జీవితంలో ఎంతోమంది నిన్ను వదిలి వెళ్ళిపోయారు అయినవారే అవమానించారు..నీ అనుకున్న వారే నమ్మించి మోసంచేసారు..తెలిసిన వారే తోడేళ్ళ రూపంలో మాటలతో పొడిచి ఇంకా ఎన్నెన్నో మాటల్లో చెప్పలేకపోతున్నా...తలుచుకుంటేనే చాలా బాధగా భయంగా ఉంటుంది మిత్రమా...సరిగ్గా అదే సమయంలో నీకు దొరికిన మార్గం ఎవరు వేశారు?? నీకు సారి ఎవరు చూపించారు?? నీ అడుగులు తడబడినప్పుడు నిన్ను నిలబెట్టింది ఎవరు? అసలు నువ్వెంటో తెలీకపోయినా...నీకు ఏమికాకపోయినా..నీ చేయి ఎప్పటికీ వదలకుండా నీతోనే ఉన్నవారెవరు? నీకష్టంలో,నీబాధలో నీకు ధైర్యం చెపుతూ ఉన్నవారెవరు? అని ఆలోచించు ఒకసారి అలాంటివారికి వీలైతే కృతజ్ఞతగా ప్రయత్నిస్తూ అలాంటి శ్రేయోభిలాషులను ఎప్పటికి వదులుకోకుండా ఉండడానికి ప్రయత్నించు ఎందుకంటే అలాంటివారు మళ్ళీ బహుశ నీకు దొరకకపోవచ్చు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
151)మరి అంత కోపం కానే కాదు అలంకారం..నిజము అబద్ధం అయినదంటే బతుకు శున్యం..అందర్నీ కంది కాలమే అమ్మల్లే తాను సాక్ష్యమే..అహం ఉన్న దేహం దాటలేదు అంధకారం..వేదంతమేమి లేదురా నీలోని నిన్నే అడగర..చదివే ఓ పాఠము గతము గుణపాఠము
మొదలేంటో తుదలు ఏంటో తెలుపు ఓ ప్రతిబింబమేగా..సుమతి ఆ వేమన తెలిపే ఆలోచనే సరిగా అడుగేయలేవా..నడకే మానేసి రవి నడినెత్తిన ఉంటే తిరిగే..భూగోళం ఒక పెనుజ్వాలే కాదా..సంద్రం తన వేగంతో తీరం దాటిందో..ఓ యుగమే అంతమయ్యే సమయం అది కాదా
బదులే తే గలమా మరి ప్రళయం ఓ ప్రశ్నయిందో…నేననే బలుపుతో ఎదిగిన ప్రతి వాడు..గెలిచిన ఒంటరే మరి బతుకు చివరన..మత్తనే మందునే మరిగిన ప్రతి ఒక్కడు..మృగముగా మిగిలిన ఒక బానిసే కదా
గాయాలు కాలేని దేహాలు ఉండగలవా మిగిలే గురుతే నిజం చూపదా
దూరాలు పెంచేసి ప్రేమల్ని చూడగలమా..కోపాలనే కడిగేయాలి కన్నీళ్లతో..
నడకే మానేసి రవి నడినెత్తిన ఉంటే తిరిగే..భూగోళం ఒక పెనుజ్వాలే కాదా..సంద్రం తన వేగంతో తీరం దాటిందో..ఓ యుగమే అంతమయ్యే సమయం అది కాదా..బదులే తే గలమా మరి ప్రళయం ఓ ప్రశ్నయిందో…ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
152)వెళ్ళిపోవాలి అనుకున్న బంధాన్ని బలవంతంగా
ఆపేయాలని అన్ని ప్రయత్నాలు ఎందుకు..కన్నీళ్లతో కట్టిపడేయాలని కవచంగా మార్చుకోవాలని మనసులో ఆ ఆలోచన మనకెందుకు..నిజాయితీగా ఉన్న నాతో నాటకాలు నువ్వు ఆడుతుంటే అర్థం చేసుకోలేని అమాయకపు హృదయమా నాది..ఒంటరిగా ఉన్నా హాయిగా నవ్వడం తెలుసుకో అబద్ధపు బంధం పక్కన ఉండడం కంటే మనల్ని వదిలేసాక మళ్ళీ కలవాలని కన్నీళ్లు రాల్చాలి ఆ అహంకారపు కళ్ళు..ఒక్కసారి రాయిగా మారిన హృదయాన్ని కరిగిపోకుండా చూసుకోవడమే మన నిర్ణయం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
153)మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తీ ఒక్కో విధంగా స్పందిస్తారు.అది వారి మనస్తత్వాల మీద,ఆలోచనా విధానాల మీద ఆధారపడి ఉంటుంది.లోకంలో ఎంత మంది మనుషులున్నారో అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి..మంచి చేయకపోయినా సాటివాడికి చెడుచేయకు అంటారు కొందరు కానీ మన బాగు మాత్రమే మనం చూసుకుంటే చుట్టూ ఉన్న మీ కుటుంబాలలో సమస్యల్లో వుంటే వాళ్ళనెవరు చూసుకుంటారు? వారికి నీకు తోచిన సాయం చేయడం మన ధర్మం కాదా! మనకెందుకులే అనుకుంటామా! అది మానవత్వం అనిపించుకుంటుందా??భగవంతుడు మానవజన్మ అనే గొప్ప వరాన్ని ఎందుకు ప్రసాదించాడు? ఇవ్వడం తెలుసుకొమ్మని..అలవరచుకొమ్మని.
ఆపదల్లో ఉన్నవారిని ఆదుకొమ్మని.సమస్యలతో సతమతమవుతున్న వారికి తగిన సలహాలివ్వమని..మన జ్ఞానాన్ని పంచమని,మన సంపదలో కొంతయినా తోటివారికి సాయం చెయ్యమని.నువ్వు చేసింది ఏది ఒట్టిగా పోదు దేవుడు చూస్తూ ఉంటాడు వడ్డీతో సహా తిరిగి ఎదో ఒక రూపంలో ఇచ్చేస్తాడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
154)పరీక్షార్థులందరికీ ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. జీవితమనే ప్రశ్నపత్రం మాత్రం మనిషి మనిషికీ వేరుగా ఉంటుంది.విజ్ఞతతో ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకోగలవాడే సమర్థుడు.దేవుడు న్యాయానికి,ధర్మానికి పక్షపాతి.నిర్లిప్తంగా ఏనాడూ ఉండడు.మన కళ్ళకు ప్రత్యక్షంగా కనపడడు కానీ ప్రతి ఆపదలోను ఎదో ఒకరి రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు.అలాగని మన కృషి,ప్రయత్నం మానుకోకూడదు.కెరటం పడేది లేవడానికే.శిల అడ్డం వచ్చినా,ప్రవాహం పక్కనుంచి దారి చూసుకుంటుంది..అలాగే మనకున్నదాంట్లో కొంతయినా ఎదో ఒక రూపంలో సాయం చేయగలిగితే ఆ రూపంలో సాయం చేయాలి..ప్రకృతి నుంచి మనం ఎన్నో పొందుతున్నప్పుడు తిరిగి ఎంతో కొంత ఇవ్వడం మనవిధి. 'చిన్ని నా పొట్టకే శ్రీరామరక్ష అనుకునే వాడికి 'శ్రీరామరక్ష' కలగదు..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
155)మనకన్నా గొప్పవారైతే అనుసరించాలి.వెనుక ఉన్న వారైతే చేయి అందించాలి.మంచిగుణం కలవాడే ధనికుడు.ఆ గుణం లేనివాడు ఎంత ఉన్నా నిర్ధనుడే! మనసుంటే మార్గం ఉంటుంది.మనసు లేకపోతే సాకు దొరుకుతుంది.ఆ సాకే మనకి బాకు అవుతుంది. 'మనకెందుకులే’ అనుకుంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరులూ అలాగే అనుకోరా? కాబట్టి నీకు ఉన్నదాంట్లో నీ వాళ్ళకి సాయం చేయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
156)జీవితంలో పట్టువిడుపులు అనేవి ఉండాలి ఎలా ఐతే మన గుండె రక్తాన్ని పట్టుకొని వదిలేస్తదో అలాగే మనం కూడా పట్టుకొని వదిలేయాలి గుండె వదలను అంటే ప్రాణం పోతుంది అలాగే మూర్ఖత్వం వదలను అంటే జీవితమే పోతుంది నువ్వు ఎవరి విషయంలోనైనా ఇలాజె ప్రవర్తిస్తే నువ్వు అందరికి దూరమైపోతావు,ఎవరికి రావు కోపాలు?ఆ కోపాలతో దూరాలు పెంచుకుంటే ప్రేమని చూడలేం అలాగే మనకి కనీళ్ళు వచ్చేది ఆ కోపాల్ని కడిగేయడానికే కాబట్టి ఎక్కడ తగ్గాలో కొంచెం తెలుసుకుంటే బంధాలు నిలబడతాయి లేదా కోల్పోతాయి..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
157)జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కాని దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే..జీవితం నిజాయితీపరులు ఏడిపిస్తుంది నిందలు వేసే వారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది చనువు ఎక్కువ అయితే చులకన తప్పదు దగ్గర ఎక్కువ అయితే దూరం తప్పదు నమ్మకం ఎక్కువ అయితే ద్రోహం తప్పదు ప్రేమ ఎక్కువ అయితే బాధ తప్పదు ఆశ ఎక్కువ అయితే దురాశ దుఃఖం తప్పవు..ఇదే జీవిత సత్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
158)కొన్ని కాళ్లే నీతో వెంట నడుస్తాయి..కొన్ని మనసులే నిన్ను తలుస్తాయి..కొన్ని కళ్లే నీ కంటిలోని కన్నీటి తడిని గమనిస్తాయి...ఆ ''కొన్నే" నీకు అన్నీ...ఆ కొన్నిటినే జాగ్రత్తగా ఎంచుకో..ఆగిపోతావేమో అన్న భయం కోసం కాదు..జీవితంలో సాగిపోవాలన్న నమ్మకం కోసం..!!అలాంటి మనుషులను సంపాదించుకో వాళ్ళే నీకు విలువైన ఆస్తిగా మిగులుతారు అలాంటి వాళ్ళు దొరికినప్పుడు జాగ్రత్త కాపాడుకో....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
159)నీకు 100 కోట్లు ఆస్తి ఉన్న... వందేళ్లు బ్రతకలేవు... నీవు 10 ఇల్లు కట్టుకున్న... ఉండేది మాత్రం ఒకే ఇంట్లో... డబ్బులు సంపాదించడం కాదు... మనుషులను సంపాదించుకో అదే నీకు విలువైన ఆస్తి.......ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
160)ఒక మనిషి మూర్ఖంగా ఆలోచించి చేసే కొన్ని పనుల వల్ల కొన్ని జీవితాలు తలకిందు లైపోతాయి.ఆవేశంలోనో కోపంలోనో తనలో ఉన్న మూర్ఖున్ని బయటికి తెచ్చి తన నిర్ణయాలే ఒప్పని,తనకి తిరుగులేదని విర్రవీగి పోతుంటాడు మనిషి.తీరా తను చేసింది తప్పుని తెలుసుకునేలోపు అంతా పోగొట్టుకుంటాడు.తనింకా ఈ భూమ్మీద బ్రతికున్నా, తిరిగి తీసుకురాలేని మాటల్ని, మనుషుల్ని, తన సర్వస్వాన్ని కోల్పోతాడు.క్షణికమైన ఆవేశం ఎంత బాధనిస్తుందో కదా! మన తెలుగులో ఒక సామెత ఉంది..తన కోపమే తన శత్రువు..ఇది తెల్సుకుని ప్రవర్తిస్తే అంతా మేలే జరుగుతుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
161)నీ చేతిలో లేని దాని గురుంచి ఎక్కువ ఆలోచించకు..రాతలో రాసిపెట్టి ఉంటే ఎక్కడికీ పోదు..నీది కానిది అయితే ఎన్నటికి రాదు..తలరాతకు ఆ దేవుడే అతీతుడు కాదు..ఇక నువ్వెంత ..? మాములు మనిషివి.. కష్టమే కానీ ప్రయత్నించు..ఆపై ఫలితమేది అయినా స్వీకరించు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
162)మనిషిని బతికుండగానే..నిలువునా దహించి రగిల్చేవి..రెండేరెండు..అనుమానం..అవమానం..ఆ రెండు ఒక మనిషిని జ్వాలలా దహిస్తాయి..కానీ అనుమానంతో..నువ్వు చేసే అవమానం తిరిగబడితే..? ఒక రోజు ఆ జ్వాలే పెనుజ్వాలలై..నిన్ను సమూలంగా కాల్చేస్తాయి..అందుకే..ఒకరిని అవమానించేప్పుడు..బాగా గుర్తుంచుకోండి..నేటి కఠిక రాయే..నువ్వు చేసే ఉలి దెబ్బలకు..రేపు శిల అయ్యి..కోవెల చేరి..నీవు చేసే అవమానానికి బదులుగా..నిన్ను శిథిలం చేస్తుందనీ.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
163)భూమి ఆకాశాన్ని చేరాలి..అనుకోవటం తప్పు కాదు..తనకు అందదని తెలిసినా..ఆశపడటం తప్పు కాదు..కానీ ఎప్పటికీ అందదని తెలిసినా..అన్ని వదిలి ఆరాటపడటం..తప్పే కదా...ఆశ సంతోషాన్ని ఇస్తుంది..ఆరాటం బాధని ఇస్తుంది..మనిషి ఆశ మెదడు..ఆరాటం మనస్సు..ఇవే మనిషికి..అతి పెద్ద శత్రువులు..మనలోని మెదడు భూమి..మనస్సు ఆకాశం..మెదడుకు తెలుసు..భూమే స్థిరం అని..మనస్సుకు తెలిసిన నమ్మదు.ఆకాశం అంతులేని శూన్యం అని...కాబట్టి మనం కలలు కంటే సరిపోదు దానికోసం కష్టపడి సాధించే పట్టుదల ఉంటేనే మన గమ్యాల్ని చేరుకోగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
164)ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎవరి నుంచీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు,అప్పుడే లైఫ్ లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది...సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే గురూజీ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
165)సమస్య వస్తే మాట్లాడు..సంఘర్షణ వస్తే ఆలోచించు...సంగతులు హద్దులు దాటితే సరిహద్దులు మూసివేయి...యుద్ధం అనివార్యమైతే మొదట భయపెట్టు..తప్పకుంటే బలం పెంచు...ఆగకుంటే ఆయుధం పట్టు...విచక్షనతో..వివేకంతో పరిష్కరించు కొంతమంది చిన్న సమస్యను పెద్దదిగా మార్చి మనకు మనశాంతిని దూరం చేయాలనీ చూస్తూ ఉంటారు అలాంటి అనివార్య పరిస్థితుల్లో అదుపు తప్పడం తప్పు కాదు.నది కూడా అప్పుడప్పుడు గట్టు తెగితేనే అది నదిగా ఉండగలుగుతుంది.అగ్ని కూడా దావణమై దహిస్తేనే అజ్ఞానం హతం అవుతుంది.. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలో తెల్సుకొని ముందడుగు వేయాలి అలాంటప్పుడే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
166)తప్పును క్షమించవచ్చు కానీ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు..నువ్వు గెలిచాక వచ్చే బంధం కన్నా నువ్వు గెలుస్తావని నిన్ను నమ్మే నీతో ఉండే బంధం చాలా గొప్పది..అది స్నేహమైన,ప్రేమైన ఆఖరికి రక్తసంబంధమైన బ్రతుకులో కష్టం ఎలాగూ తప్పదు,అదేదో నచ్చిన మనిషి కోసం,జీవితం కోసం,పడితే నయం కదా..నీకు నేనున్నాను అనే మాట చాలా చిన్నదే!! కానీ ఆ మాట చెప్పాల్సిన వాళ్ళు చెపితే చెప్పలేనంత ధైర్యం వస్తుంది కాబట్టి అలాంటి మనుషులు దొరికితే వదులుకోకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
167)డిఫిట్(defeat)అన్న పదమే ఒక ఫీట్. అప్పటి దాకా విజయంతో విర్రవీగే శాల్తీని ఒక్కసారి పల్టీ కొట్టించి తనెక్కడున్నాడో తెలియజేసే విన్యాసమే ఆపజయం.విజయకాంక్షకు మంచిచెడుల విచక్షణ ఉండదు.అందుకే జాగ్రత్తగా సానుకూల దృక్పథాన్ని ఎంచుకోవాలి.తత్ఫలితంగా ఉద్భవించే సృజనాత్మక శక్తి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ప్రేరణవుతుంది.సవాళ్లు అనేవి మనల్ని చురుకుగా ఉంచే షార్కుల్లాంటివి.వాటిమీద పైచేయి సాధించే క్రమంలో తెలియకుండానే మనలో మరింత శక్తి ఉద్భవిస్తుంది.గెలుపు కేవలం సంతృప్తినే కాదు..సంతోషాన్ని అందిస్తుంది.సంతోషంగా జీవించడమంటే ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లపై గెలవడమే కాబట్టి మన జీవితాల్లోకి ఎప్పుడూ సరికొత్త సవాళ్లను ఆహ్వానించడానికి ముందుండాలి అప్పుడే కదా జీవితం నుంచి మనం నేర్చుకోగలిగేది అనుకున్నవి సాధించగలిగేది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
168)తేలు నీళ్లలో పడింది అని మనం జాలిపడి దాన్ని బయటికి తీస్తే అది మనల్ని కచ్చితంగా కుడుతుంది..అలాగే చెడ్డవారికి కృతజ్ఞత లేని వారికి అయ్యో అని మనం దయ తలచి సహాయం చేస్తే అది కచ్చితంగా మనకి తెలియకుండా మనకే చెడు చేస్తుంది..తిరిగి పూడ్చుకోలేని నష్టాన్ని కలుగజేస్తుంది...కాబట్టి నీ స్థాయికి తగట్టు ఎవరికీ చేస్తున్నావో చూసుకొని చేయి అప్పుడే నువ్వు నిలబడగలవు లేదంటే అథః పాతాళమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
169)ఎవరికైనా నీ సమస్యలు గురించి చెప్తే నీ సమస్యలు సంగతి పక్కన పెట్టేసి వాళ్ల సమస్యలు గురించి చెప్తూ వాళ్ల సమస్యలోకి నిన్ను లాగేస్తారు..అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ సమస్యల్లోకి పడిపోతావు అందుకని ఎవ్వరి మాట వినకుండా..ఎవరి జోలికి ఎవ్వరి సమస్యల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవడమే నీ సమస్యలకు నువ్వు ఇవ్వగలిగే పరిష్కారం..నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు ఎవరిని కాపాడనవసరం లేదు నిన్ను నువ్వు కాపాడుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో..అర్థమైతే ఆచరించండి అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించండి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
170)ఒక్కోసారి వదిలేయడం కూడా తెలిసుండాలి..కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, లేదా ఆలోచనలు మన హృదయాన్ని గాయపరుస్తుంటాయి.అలాంటి సందర్భాల్లో వాటిని వదిలేయడం అవసరం. వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, అది మన ప్రశాంతత కోసం తీసుకునే మంచి నిర్ణయం.🌱 వదిలేయడం వల్ల ప్రయోజనాలు:మనసుకు తేలికపడ్డ అనుభూతి.మన జీవితంలో కొత్త అవకాశాలకు చోటు ఇవ్వడం.మన శక్తి, సమయాన్ని అవసరాలపై అవసరాలమీద కేంద్రీకరించగలగడం.అందుకే,వదిలేయడం గర్వకారణంగా భావించండి..మనలో ఉన్న అసలు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక కీలకమైన అడుగు అవుతుంది.మన మనశ్శాంతికి అడ్డుగా ఉన్నదానిని వదిలేయండి.హృదయానికి కాస్త శాంతిని, మనసుకు ప్రశాంతతని అందించండి అప్పుడే మనమేదైనా సాధించగలం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
171)మనిషికి "కోపం" ఉండొచ్చు...కానీ,మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు..మనస్సుకి "ప్రేమ" ఉండొచ్చు...కానీ విరక్తి కలిగే అంత ప్రేమ ఉండకూడదు.మాటలతో "నవ్వించ" వచ్చు...కానీ ఏ ఒక్కరిని నొప్పించేటంత నవ్వు ఉండకూడదు.పక్కవారికి "సహాయం" చెయ్యొచ్చు..కానీ ఇబ్బంది పడేంత సహాయం చెయ్యకూడదు.డబ్బుతో "అవసరాలు" ఉండొచ్చు...కానీ ఎదుటి వారిని మోసం చేసి దోచుకునే అంతా ఏ అవసరం రాకూడదు కాబట్టి ఏమీ చేసినా ఆలోచించి చేయాలి,ఆలోచన లేకుండా చేస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
172)ప్రతి మనిషి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి..కొన్ని నవ్వొస్తాయి కొన్ని ఏడుపొస్తాయి కానీ కొన్ని మాత్రమే దిక్కుతోచని పరిస్థితికి తీసుకొస్తాయి..ఇలాంటప్పుడే మనం తెలిసో తెలియకో మన అనుకొని మన పరిస్థితిని వేరొకరికి చెప్పేసుకుంటాం..చివరికి ఏమవుతుందంటే చెప్పుకున్న పాపానికి చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది..మన అనుకోని మనం నమ్మిన నమ్మకమే అక్కడ పెద్ద పొరపాటు..ఆ రోజుల్లో ఒక్క నమస్కారంతో మనిషిలోని సంస్కారాన్ని గుర్తించేవారు..ఈ రోజుల్లో ఏ మనిషిని ఎలా గుర్తించాలో తెలియడం లేదు.. కాబట్టి ఎవరో వచ్చి ఎదో చేస్తారాని ఆశించడం ఆపి నువ్వు ఏమి చేద్దామనుకుంటున్నావో అది చేయి ఎవరు వచ్చి ఏమీ చెయ్యరు ఒక్క నీకు నువ్వు తప్ప..నీ కష్టాన్ని నీ ప్రతిభని నమ్ముకో అనుకున్నది సాధించడానికి అహర్నిశలు కష్టపడడానికి ప్రయత్నించు ఈ రోజు కాకపోతే ఎదో ఒక రోజు నీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది ఇది వదిలేసి వారికి వీటికి చెపితే నీ సమస్యలు తీరవు..అర్ధమైతే ఆచరించు అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
173)ఎప్పుడూ మార్పు పక్క వాళ్ళ నుండి ఆశిస్తాం కానీ మనం మాత్రం మారము...ఆనందంగా మనం ఉండాలి అని ఆశిస్తాం కానీ,పక్కవాళ్ళు బాధపడ్తారేమో మన మాటలు,చేతల వలన అని ఆలోచించం...అవకాశం దొరకనంత వరకు మంచి వాళ్లల భలే చక్కగా నటిస్తాం...
ఎప్పుడూ మన కుటుంబ బాగుండాలి అనుకుంటాం కానీ ఇరుగుపొరుగు ఎం అయిన చలించం..ఇంత స్వార్ధం మనలో ఉండగా...మనకి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి...మనమేలా బాగుపడతాం..స్వార్ధం ఉండాలి కానీ పక్కవాడిని వాడు జీవతాన్ని ముంచేంత ఉండకూడదు కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవతాన్ని ఒకరి నాశనం కోసం జీవించకు అది దేవుడికి నీ తోటి వారికి కూడా నచ్చదు అప్పుడు నువ్వు ౧౦౦ ఏళ్ళు బ్రతికిన నీకు నీ తోటివారికి కూడా ఉపయోగపడకుండా పోతావు కాబట్టి జర జాగ్రత్తగా జీవించు పోతే మళ్లిరాదు ఈ జన్మ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
174)నిన్ను ఎక్కువ ప్రేమించేవాళ్లే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు...నీ సంతోషం, నీ బాధ అన్నీ తమవి అనుకుంటారు...ఆ క్రమంలో వాళ్ళు తమను తాము కోల్పోతూ ఉండొచ్చు..నీ నిర్లక్ష్యం ఒకింత బాధపెడుతుంది..ఓ చిరునవ్వు,ఓ పలకరింపు ఇంతకుమించి నిన్ను ప్రేమించేవాళ్ళు నీనుండి ఏం కోరుకుంటారు..చిరునవ్వు, పలకరింపు కంటే ఖరీదైన బహుమతులు ఏముంటాయి..స్వచ్ఛమైన స్నేహానికి,ఇష్టానికి, అభిమానానికి,ప్రేమకు ఇవి చాలునేమో.చిరునవ్వు,పలకరింపు ఏ బంధానికైనా విలువనిస్తుంది,వెలుగునిస్తుంది,ఆరిపోకుండా వెలగనిస్తుంది..కాబట్టి నిన్ను అభిమానించే వారిని ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యకు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
175)ఉన్నది ఒకటే జీవితం కదా..అందుకే మనసు చంపుకొని కాదు..మనస్పూర్తిగా జీవించు సరేనా..మనమేమి బాధకు బంధువులము కాదు..సంతోషానికి చుట్టలము అంతకంటే కాదు..ఈ బాధ ,సంతోషం అనేవి వచ్చిపోయే చుట్టలాంటివి..బాధలు ఉన్నాయని..ఆ బాధలకు బంధివి అవ్వకు..నీకు ఎన్ని బాధలు ఉన్నా..నీ పెదవుల పై చిన్న చిరునవ్వు వస్తే. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా..ఎంత పెద్ద కష్టమైనా సరే...నీ చిరునవ్వుని చూసి నీకు కలిగే బాధే...నిన్ను చుట్టుముట్టే కష్టమే నిన్ను చూసి అసూయ పడేలా ఉండాలి నువ్వు..అంతేకాని ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకు..కాబట్టి ఏమి జరిగినా అన్ని మన మంచికే అనుకొని ముందడుగు వేయి అనుకున్నది కష్టపడి సాధించేయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
176)నిన్ను మరచిన స్నేహం కోసం ఆరాటపడుకు..నిన్ను తలచిన స్నేహాన్ని ఊపిరి ఉన్నంతవరకు మరువకు..చెడ్డ వారితో బలమైన స్నేహం కలిగి ఉండటం కంటే,మంచి వారితో చిన్న పరిచయం ఉన్నా చాలు...అది నీకు ఎప్పుడూ మంచి అనుభవాన్ని మిగుల్చుతుంది...నీ చిరునవ్వు తెలిసిన మిత్రుల కన్నా,నీ కన్నీళ్లు తెలిసిన మిత్రులు మిన్న....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
177)మన ఇష్టమైన వారితో మాట్లాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది
కానీ అదే ఫీలింగ్ అవతలి వారికీ కూడ ఉండాలి...ఇష్టం అవతలి వాళ్లకు
కష్టంగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం మంచిది!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
178)వయసుతో సంబంధం లేకుండా పుట్టేదే కామం..కారణం లేకుండా వదిలేసి వెళ్లిపోయేదే ప్రేమ..మనిషి జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు.. కానీ ఈ రెండు పరిచయమైన కొత్తలో తెలియని సంతోషాన్ని,ఎన్నడూ ఎరుగని అనుభూతుని పరిచయం చేస్తూ ముగింపు మాత్రం మరెన్నడు ఎరుగని రీతిలో అనుభవంగా మారుస్తూ మనిషి యొక్క మనశాంతిని ముగిస్తాయి..కాబట్టి ఏది అతిగా ఉండకూడదు ఆచితూచి అడుగులు వేయి అప్పుడే నిలబడగలవవు లేకపోతే పాతాళంలోకే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
179)ప్రూవ్ చేసుకోవలసిన పని లేదు 🌟
ఇక్కడ ఎవరికీ నిన్ను నీవు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
✅ తప్పులను ఒప్పుకొని నేర్చుకోండి
✅ మీ ప్రగతిపై దృష్టి పెట్టండి, ఇతరులతో పోల్చుకోకండి
✅ కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోండి
✅ మీ సత్తా మీ పనితో చాటండి, మాటలతో కాదు
ప్రతిదీ నిరూపించుకోవాలనే ఒత్తిడికి దూరంగా ఉండండి
మీరు మెరుగుపడే కొద్దీ, ప్రపంచమే మిమ్మల్ని గుర్తించి నెత్తిన పెట్టుకోక తప్పదు! ✨🔥..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
180)నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడం లోకకళ్యాణం..సాధనాత్ సాధ్యతే సర్వం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
181)నువ్వు ఒక అబద్ధం చెబితే ఆ అబద్ధానికి కూడా ఒక విలువ ఉండాలి..అంతేకాని..ఆ క్షణం గడవటానికి..ఏది నోటికి వస్తే అది చెప్పి ప్రతిక్షణం గడుపుతుంటే..నీ బతుకే ఒక అబద్ధమని..అవసరం లేని చోట..నువ్వు ఆడే అబద్ధం..నిన్ను దిగజారుస్తుంది..నలుగురూ నిన్ను అసహ్యించుకునేలా చేస్తుంది..నీపై శాశ్వత నమ్మకం పోగొడుతుంది..ఎంతగా అంటే..నీవు ఎంత నిజం చెప్పినా..ఇకపై నిన్ను ఎవరూ నమ్మలేనంతగా..కాబట్టి చిన్నచిన్నవి ఆడచ్చు కానీ నీమీద ఎదుటివారికి నమ్మకం పోయేంతవరకు తెచ్చుకోకూడదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
182)గుండెకు గాయం కొత్తేమి కాదు మనసుకి బాధ తెలియంది కాదు..జీవతమనే బడిలో రోజుకో అనుభవ పాఠం నేర్చుకోవాలి మనదంటూ మనకంటూ ఏది లేదని తెలిసి అరాటపడటం అవివేకం అని చెప్పి గాయమవుతుందని గమ్యం మరువను కన్నీరు కారుస్తుందని గమనం మరల్చను విచ్చిన్నమవు తుందని వెనుదిరిగి చూడను నాకు నేనే ప్రశ్న నాకు నేనే సమాధానం సముదాయించు కునేలోపు సమస్య సందిడి చేస్తుంది అయినా ఆగిపోను అలసిపోను అంతిమ విజయం కోసం ఆఖరి క్షణం వరకు పోరాడటమే...ఇలా అనుకుని ముందుకు సాగుతే మనం సాధించలేనిది ఏది లేదు కాబట్టి అడుగులు ఆచితూచి వేయి అనుకున్నది సాధించేయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
183)నీ మీద నీకు నమ్మకం ఉండాలి..నీ నిర్ణయం మీద నీకు ధైర్యం ఉండాలి..నీ నిశ్చయత మీద నీకు ప్రణాళిక ఉండాలి..నీ ఆలోచన మీద నీకు నిలకడ ఉండాలి..ఎన్నో ఆశలు లేకున్నా ఉన్నదానిలో తృప్తిగా ఉండాలి..ఎదో చేయలేకున్న చేసేదానిలో సంతృప్తి పొందాలి..లోకమంతా విహరించకున్న విరహం లేకుండా బ్రతకగలగాలి..ఆశించటం అంటే కనపడే చెట్టు..కాయ కోసినంత సులువు కాదు..ఆశించిన దానిని పొందడం దానికి ఎంతో నిబద్ధతతో నిజాయితీగా ఉన్నప్పుడు అనుకున్నవి పొందగలం అలాగే ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా అవన్నీ నీకు తల వంచుతాయి..ఎప్పుడు ఏమరుపాటు వద్దు నేర్పుగా ముందుకుపో నీ నిర్ణయం సరైంది అయితే పైవాడు తప్పక అనుగ్రహం చూపిస్తాడు నమ్మటం నీ చేతనైతే నమ్మకం నీలో ఉంటే ఆ దేవుడు నీకు దారి చూపుతాడు కాకపోతే కొంచెం సమయం పడుతుంది అప్పటిదాక పోరాటం విజయం కోసం ఆరాటం తప్పదు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
184)విజయం అనేది ఊరికే రాదు..కన్నీళ్లు పెట్టికోవాలి..కష్టాలు ఎదుర్కోవాలి..బాధలు తట్టుకోవాలి..మనస్సుకి గాయాలు చేసుకోవాలి..మాటలకు గుండె ముక్కలు కావాలి..ఎదురు దెబ్బలు తినాలి..కొన్నిసార్లు బంధాలను కోల్పోవాలి..సహనంతో మెలగాలి..గుణపాఠాలు నేర్చుకోవాలి..చేసిన తప్పులను దిద్దికోవాలి..ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయాలి అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
185)ఒకసారి సముద్రుడికి పెద్ద సందేహం వచ్చింది. గంగానదిని అడిగాడు,నువ్వు నా దగ్గరకు పెద్ద పెద్ద చెట్లను మొసుకొస్తుంటావు కదా,గడ్డి పరకల్ని ఎందుకు తీసుకురావు అని.అప్పుడు గంగానది ఇలా సమాధానం చెప్పింది.చెట్లు వంగవు. అవి కఠినంగా ఉంటాయి.అందుకే వాటిని వేళ్ళతో సహా పెళ్ళగిస్తూ ఉంటాను. గడ్డిపరకలు వేరు.వాటికి ఆణుకువ తెలుసు. నేను మహోధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నా వేగానికి,బలానికీ అవి వినయంగా తల వంచుతాయి.అప్పుడు నా వేగమూ,శక్తీ ఓడిపోతాయి.నా వరద తగ్గిన వెంటనే గడ్డిపరకలు మళ్ళీ తలెత్తుతాయి.అలాగే ఇతరులతో సర్దుకోవడం చేతకాక అహంకారంతో,అతిశయంతో మిడిసిపడేవారు తమకంటే బలమైన శక్తులకు ఓడిపోయి నశిస్తారు.వినయంతో,ఇతరులతో సామరస్యభావనతో జీవించేవారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుంటూ పదికాలాల పాటు జీవిస్తారని చెబుతుంది మహాభారతంలోని ఈ ఉదాహరణ.
186)ధైర్యమంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు.ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం.నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే..వాటికి దూరం అయి ఒంటరిగా బ్రతకడం మేలు.ఉరుకుల పరుగుల జీవితంలో నీలో నువ్వే అదృశ్యం అయిపోతావ్.ఒకసారి ఆగి చూడు నీకు నువ్వే కొత్తగా తారసపడతావు.రేపు ఏమి అవుతుందో అనే భయం మాను ఇలా ఆలోచిస్తే గడిచిన క్షణాలు తిరిగిరావు.ఊహిస్తే రాబోయే క్షణాలూ మారిపోవు.ఆ ఆలోచనలతో ముందుకు సాగలేం.ఈ ఊహలతో బ్రతికితే ముందడుగు వేయలేం..అందుకే ఆలోచనలతో కుస్తీ వదిలి ఉహాలతో దోస్తీ మాని ఆచరణతో ఓ అడుగు ముందుకువెయ్యి.అడుగు అడుగు కలిసి నీ గమనం మొదలవుతుంది.నీ గమ్యం చేరువవుతుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
187)ఇప్పుడున్న సమాజంలో తెలియని పరిచయం వద్దు..తెలియని మనిషి కూడా వద్దు.తెలియని వాళ్ళతో దగ్గరితనం అంతకంటే వద్దు..ఏదైనా పరిచయం మరువలేని అనుబంధంగా మారలి.. అంతే కానీ ఎప్పటికీ మాయని మరకలా..ఎంత కాలం గడిచిన కరగని బాధగా మాత్రం మిగిలిపోకూడదు..ఇద్దరి పరిచయం ఇంకొకరితో గర్వంగా చెప్పుకునేదిగా మాత్రమే ఉండాలి..అంతే కానీ అల్లరి పాలు కాకూడదు..వాళ్ళ పరిచయం నీకు నవ్వుల్ని కాకూడదు..వాళ్ల పరిచయం నీకు బాధని బాధ్యతలను పంచాలి..అంతే కానీ మోయలేని భారంగా మారకూడదు..నిజమే గాయం చాలా బలమైనది..అది ఎంతటి మనిషిని అయినా మౌనంగా మార్చేస్తుంది..జీవితాంతం చిరునవ్వు అనే చిరునామాను కూడా లేకుండా చేసేస్తుంది.. మిత్రమా..వాళ్ళ పరిచయం చిరునవ్వుల జల్లులు కావాలి అంతే కానీ కన్నీటి జలపాతం మాత్రం కాకూడదు..అది ముదిరితే సముద్రపు అలలుగా మారి..ఉప్పెనై ముంచేస్తుంది..అందుకే వాళ్ళ పరిచయం నీకు వరంగా మారాలి కానీ..శాపం కాకూడదు..కాబట్టి వెనుకాముందు ఆచితూచి పరిచయాలు పెట్టుకో లేదంటే అథః పాతాళమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
188)ఓడిపోవడం వేరు,లొంగిపోవడం వేరు.చిరుత పులులు జింకలను వేటాడే దృశ్యాలను మనం తెరపై ఎన్నోసార్లు చూస్తుంటాం.పులి చాలా బలమైన జంతువు.అయినా దాని పంజాకు చిక్కరాదన్న పట్టుదలతో జింక శక్తికి మించిన వేగంతో పరుగెడుతుంది.అది ఓడిపోతుందేమో తప్ప- లొంగిపోదు..! కాబట్టి ఏ సమస్యకి లొంగకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది ఓడిపోతామనే ఆలోచన రాకుండా నిత్యం ప్రయత్నించు తప్పక విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
189)లోకంలో ఏ జీవీ తనంత తానుగా చావును కోరుకోదు…ఒక్క మనిషి తప్ప..!శ్రమ నిష్ఫలమైనప్పుడు,బతుకు నిష్ఠురమైనప్పుడు-మృత్యువు అక్షయపాత్రలా ఎదురవడం ఒక్కటే సత్యం..మానవ జీవితంలో పుట్టుక, మరణం-రెండే వాస్తవాలు.ఆ రెండింటి మధ్యలో మనుగడ సవ్యంగా ఒక సరళరేఖలా పూర్తికాలం నిలకడగా ఉండదు.దేవుడు ఇచ్చిన జీవితాన్ని పాడుచేసుకోకుండా నువ్వు ఎందుకు పుట్టేవో తెలుసుకుని దానిని అమలు చేయి అంతేగాని ఎదో ఒక చెడ్డ సంఘటనకి జరిగిందని నువ్వు అలా కుమిలిపోతూ కూర్చుంటే ఎలా ? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అది లేకుండా దేవుడు సమస్యల్ని సృష్టించడు దానిని శోధించి సాధించాల్సింది నువ్వే..అప్పటిదాకా నీ ప్రయత్నాన్ని ఆపకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
190)జయాపజయాలనేవి మనిషిలో నిరంతరం ఘర్షణపడే రెండు జంతువులు.వాటిలో ఏది ఎక్కువసార్లు గెలుస్తుందంటే...దేనికి మనం మేత ఎక్కువ పెడతామో- అది! ఆ మేతపేరు బుద్ధి.వివేకం దానికి ఎరువు.ఆ రెండూ మసకేసినప్పుడు మనిషి ప్రయత్నానికి ముందే ఓడిపోతాడు..కాబట్టి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని సిరివెన్నెల గారు చెప్పింది అనుసరిద్దాం అనుకున్నవి సాధిద్దాం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
191)మన జీవితంలో ఏది కోల్పోయినా పరవాలేదు కానీ..ఇంకొకరి కోసం మనల్నీ మనం కోల్పోకూడదు ఎందుకంటే..మన ఇష్టాఇష్టాలు కష్టనష్టాలు ఏంటి అనేది..మనకి మాత్రమే తెలుసు కాబట్టి..ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది..జీవితంలోఎవరు ఎవరికి శాశ్వతము కాదు..ఎవరి మీద అంత ఆధారపడకుండా..ఎవరి మీదా నమ్మకం పెట్టుకోకుండా..నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు..నీ లైఫ్ నువ్ నీకు నచ్చినట్టు జీవించు అంతే కానీ ఎవరో..ఏదో చేస్తారు అని ఆశించకు..అందరూ స్వార్థపరులే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
192)మద్యలో వచ్చి పోయే పరిచయం ..రుణానుబంధం లాంటివి.....రుణం తిరిపోగానే వెళ్ళిపోతాయ్....ఏ పరిచయం అయిన శాశ్వతం కాదు....మద్యలో వస్తాయి మద్యలోనే వెళ్లిపోతాయి..నన్ను అర్దం చేసుకునే వాళ్ళకి నేను ఎప్పుడు దూరం కాను...
నన్ను వద్దు అనుకునే వాళ్ళకి ఎప్పుడు దగ్గర కావాలనుకోను...నీకు నాకు రుణం తీరిపోయింది అనుకుంటా.. అంతే!..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
193)ఒకటి చెప్తా గుర్తు పెట్టుకోండి మరి కాలికి ముల్లు గుచ్చుకుంటుంటే భరిస్తామా లేదు కదా వెంటనే ఎలా తొలగించేస్తామో...అలాగే మనసుకి నొప్పి కలిగించే వారిని గాని అలోచనలకు అడ్డు తగిలే వారిని గాని
ఇటు సంతోషాన్ని ఇస్తున్నట్టే ఇస్తూ ప్రతీసారి తీవ్రమైన బాధని కలిగించేవాళ్ళని గాని పోనీలే కానిలే అని ఉరికే భరిస్తున్నామనుకో మనంత మూర్ఖులు పిచ్చివాళ్ళు ఇంకొకరు ఉండరు..అయినా ఎంతకని భరిస్తాం మన లైఫ్ ఇంకొకళ్ళ తో లాలూచీ ఏంటి పిచ్చి కాకపోతే మానసిక ప్రశాంతత కన్నా ఏది ఎక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
194)మనం చనిపోయిన తరువాత ఏడుపు రాకున్నా ఏడ్చే వందమంది కన్నా..మన గురించి నిజాలు తెలిసి మన కోసం ఏడ్చే ఒక్కరైనా చాలు.ఆ ఒక్కరిని సంపాదించుకో గలిగితే నీ అంత అదృష్టవంతులు ఉండరు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
195)కొన్ని అనుభవాలతో చెప్పాలనుకున్నది ఏంటంటే మీ గురించి పట్టించుకోకుండా ఉన్న వారిని మీరు పట్టించుకోవడం మానండి..అవసరానికి మించిన మాటలు మాట్లాడకండి.ఎవరైనా అవమానిస్తే,వెంటనే ఎదుర్కొని ప్రశ్నించండి..మిమ్మల్ని మీరే అభివృద్ధి చేసుకోండి.మీ ఆనందాన్ని మీరే సృష్టించుకోండి.మాట్లాడేముందు ఆలోచించండి..మీ విలువలో 80% మీ మాటల్లోనే ఉంటుంది..మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి.గట్టిగా అనుకున్నది ఏదైనా సాధించండి..మీ సమయాన్ని మీరు గౌరవించండి.మిమ్మల్ని గౌరవించని సంబంధాన్ని కొనసాగించకండి..వదిలేయడానికి వెనుకాడకండి.మీపై మీరు ఖర్చు పెట్టడం నేర్చుకోండి.అప్పుడు మాత్రమే ఇతరులు కూడా మీపై ఖర్చు పెడతారు.కొన్ని సమయాల్లో మీరు అరుదైన వారిగా ఉండండి మీ విలువ ఉంచుకోండి.ఇతరుల నుంచి తీసుకునే వారిలా కాక ఇచ్చేవారిగా ఉండండి.ఆహ్వానం లేకుండా ఎక్కడికీ వెళ్ళకండి. ఆహ్వానిస్తే,ఎక్కువ సేపు ఉండకండి.ఇతరులతో వారి గుణగణాలు బట్టి ప్రవర్తించండి.డబ్బు అప్పుగా ఇచ్చి, పదేపదే అడుక్కోకండి మీరు విలువైన వ్యక్తి అయితే,వారే మీకు తిరిగి ఇచ్చేస్తారు.మీరు చేస్తున్న పనిలో మరింత నైపుణ్యం సాధించండి,ఉత్తమమైన వారిలో ఒకరిగా నిలవండి....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
196)వృత్తిపరమైన జీవితం..వ్యక్తిగత జీవితం..రెండూ ముఖ్యమే..కానీ వృత్తిపరమైన జీవితం మీద ఎక్కువ ధ్యాస పెడితే ఖచ్చితంగా వ్యక్తిగత జీవితం దెబ్బతింటుంది.ఎందుకంటే మన జీవితంలో మనతో ఉన్న మనుషులకు సమయం కేటాయించకుండా,కేర్ చూపించకుండా ప్రేమ తెలుపకుండా ఉంటే మనతో ఎవరుంటారు..ఎవరు ఉండరు.ఇక ఓన్లీ పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టి అంటే గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడుకొని,సోది కబుర్లు చెప్పుకుంటూ,ప్రొఫెషనల్ లైఫ్ మీద దృష్టి పెట్టకపోతే అసలు ఏ లైఫ్ ఉండదు..So రెండింటిని బ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి.ఎవరికి ఇచ్చే టైం వారికి ఇస్తూ ఉండాలి.అప్పుడే ఏదైనా బాగుంటుంది.ఆఖరిగా ఒక్క మాట No one is too busy in the world..It's all about priorities.
197)పాలు కాస్త మారితే అది పెరుగు అవుతుంది. పెరుగు పాలు కంటే ఖరీదైనది.అదే పాలు ఇంకా విరిగితే, అది కోవా అవుతుంది, ఇది పెరుగు,పాలు రెండింటి కంటే మరింత విలువైనది.ద్రాక్ష రసం పులిసిపోతే,అది వైన్ అవుతుంది, ఇది ద్రాక్ష రసం కంటే ఎక్కువ విలువైనది.మీరు చేసిన తప్పుల వల్ల మీరు చెడ్డ మనిషి కాలేరు. తప్పులు అంటే అనుభవాలు, అవే మిమ్మల్ని విలువైన వ్యక్తిగా మారుస్తాయి.క్రిస్టోఫర్ కొలంబస్ భారత దేశానికి దారి కనుక్కోవడానికి చేసిన నావిగేషన్ తప్పు, అతన్ని అమెరికా కనుగొనెలా చేసింది..అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేసిన తప్పు, అతని పెనిసిలిన్ ఆవిష్కరణకు దారి తీసింది.మీరు చేసే తప్పులు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి. పరిపూర్ణతకు సాధన మాత్రమే సరిపోదు, నేర్చుకునే క్రమంలో చేసే తప్పులే మనకు సరైన దారి చూపిస్తాయి!తప్పులకు భయపడవద్దు.గొప్ప అడుగులు మీ కోసం ఎదురుచూస్తున్నాయి.ముందుకు సాగుతూ ఉండండి!.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
198)గాయాలు కూడా అందమే..జపాన్ సంస్కృతిలో “కింట్సుగి” అనే కళ ఉంది. ఇందులో విరిగిపోయిన పింగాణీ పాత్రలను బంగారు పూతతో మళ్లీ అతికిస్తారు, అప్పుడు ఆ పగుళ్లు కనుమరుగుకావు,సరికదా సరికొత్త అందమే అవుతాయి! ఆ వస్తువుకు ఓ ప్రత్యేకతను తెస్తుంది..మన సంబంధాలకు కూడా ఇది వర్తిస్తుంది..మనది నిజంగా గట్టి బంధమే అయితే, అది పూర్తిగా విచ్ఛిన్నం కావడం అసాధ్యం.పగుళ్లు రావచ్చు,కొన్ని గాయాలు మిగిలి పోవచ్చు, కానీ ప్రేమ, గౌరవం, అర్ధం చేసుకోవడం అనే బంగారు మిశ్రమంతో అద్దితే,ఆ బంధం మరింత బలంగా, మరింత అందంగా మారుతుంది.మన ప్రేమ నిజమైనదైతే, కింట్సుగి లాగా, విరిగిన ఆనవాళ్లు ఒకరోజు ఆ బంధానికి గౌరవంగా మారతాయి..కావాల్సిందల్లా – ఓర్పు,నిబద్ధత,పగుళ్లను సరైన మార్గంలో అందంగా,నేర్పుగా పూరించాలనే చిత్తశుద్ధి!..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
199)అందాన్ని పెంచుకుంటే..చిత్రాల్లో బంధించి
ఆనందిస్తారు..ఆస్తిని పెంచుకుంటే..గంధపు చెక్కల్లో తగలపెడతారు..పేరుని పెంచుకుంటే.. సన్మాన పత్రాలతో సత్కరిస్తారు..హోదాని పెంచుకుంటే..ప్రచారంలో నిలబెడతారు. అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే..జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు..కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలో ఆలోచించి జీవితాన్ని సాగించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
200)జీవితాన్ని ఎలా మొదలు పెట్టావు అనే దానికంటే ఎలా ముగించావు అనేదే ముఖ్యం..మనిషి పుట్టినప్పుడు ప్రేమగా ఎత్తుకోవడానికి ఎంతమంది ఉన్నా..మనిషి చనిపోయినప్పుడు మనస్పూర్తిగా కన్నీళ్ళు కారుస్తూ ఎత్తే నలుగురు మనుషులను సంపాదించుకో లేనప్పుడు నువ్వేంత పెద్ద హోదా పదవిలో ఉన్నా,నీ దగ్గర ఎంత ఆస్థిపాస్తులున్నా అది నిరుపయోగమే..కాబట్టి అలాంటి వారిని పొందిన వారిదే నిజమైన జీవితం..అర్ధమైతే ఆచరించండి అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
201)ఒకరు ప్రతిరోజు నిన్ను పలకరిస్తున్నారంటే అర్థం!...వాళ్ళకి ఏ పని లేక కాదు!...వాళ్ల చుట్టూ ఎంత మంది ఉన్నా వాళ్ల మనసులో ప్రత్యేక స్థానం
నీకే ఉంటుందని అర్థం!...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
202)భాదల సమయంలో ఆడదాని కన్నీరు కార్చినంత సులువుగా మగాడు కన్నీరు బయటకి రానివ్వడు..కానీ ఆ దాగి ఉన్న కన్నిటి వెనుక ప్రపంచమే తలకిందులయ్యేంత భాద గుండెల్లో భారంగా ఊపిరాడకుండా చేస్తుంది..ఆ క్షణం మగాడి మనసు తెలుసుకుంటే ఉప్పెన ఎగిసిపడే కన్నీరు కనిపిస్తుంది ఒంటరిగా మనసుని కృంగాతిస్తున్న భాదలు కనిపిస్తాయి తనలో తానే సమాధానం లేని ప్రశ్నలకి యుద్ధం చేసే కనిపిస్తుంది..చాలా కనిపిస్తుంది..చాలామంది మగాళ్లు ఒంటరిగా కూర్చొని జీవితంలో ఎలా ఎదగాలి..మనకి నచ్చినట్టు సంతోషంగా ఏమి చేస్తే బిడ్డలా భవిషత్తు బాగుంటుంది అని తనలో తానే కన్నీటితో కుమిలి పోయిన క్షణాలు చాలానే ఉంటాయి కాబట్టి ఆడాళ్లు కొంచెం మనస్సు ఎరిగి మసులుకోండి అప్పుడు ఏ బంధాలైనా దృడంగా ఉంటాయి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
203)ఎప్పుడైనా ఎవరైనా నిన్ను తేలికగా తీసుకున్నా,నువ్వేమి చేయకపోయినా నిన్ను సూటిపోటి మాటలతో బాధపెడుతున్న తొందరపడి నువ్వేమీ అనకు అన్ని గమనించు కానీ నీ మనస్సుని అన్ని విధాలా బలపడేలా చేసుకో నువ్వు కారుస్తున్న కన్నీళ్లను పదిలంగా భద్రపరుచుకో,రేపటి కోసం ఖచ్చితంగా వెలుగు అప్పుడు నిన్ను అన్నవారందరు నీ మనసు అమూల్యమని,సంతోషం నీ ఇంటి సంపదనీ,సహనం నీ ఓంటిమీద బంగారమని,నిన్ను తక్కువ చేసి చూసే వారికి నిజంగా నీ విలువ తెలుస్తుంది,నీ కష్టమే నిన్ను గెలిపించిందని..కాలం నీకు బలాన్నిచ్చిందని నీ స్వప్నాలు మెరిసే నక్షత్రాలనీ నీ కృషి నీ ఖజానా అని తెలియజేయి
ఎవరి మాటలు నీ గమ్యాన్ని మార్చలేవు అన్నింటికి నీ గెలుపే చెప్పాలి గట్టి సమాధానం అప్పటివరకు అలుపు ఎరగకుండా పోరాడు..గెలుపు తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
204)మీరు నిజంగా ఎవరినైనా గౌరవిస్తే, మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తారు.“ఈ నిర్ణయం వారిని బాధపెడుతుందా?” అని మీరు మీలో మీరే ప్రశ్నించుకుంటారు.మీరు వారి అభిప్రాయాలను వినేందుకు సిద్ధంగా ఉంటారు,మీకు అసహనం ఉన్నా.వారు మీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటారు,అది ఎంత కష్టమైనా సరే.ఏందుకంటే ప్రేమ కాలక్రమేణా తగ్గవచ్చు.కానీ గౌరవం?? గౌరవం స్థిరంగా ఉంటుంది.“ఇవాళ మనసులో కోపం ఉన్నా, వాళ్లు నా జీవితానికి ముఖ్యమే” అని చెప్పే నిశ్శబ్దమైన గళం ఈ గౌరవం..కాబట్టి, మీ సంబంధాన్ని ప్రేమతో కాక, ముందుగా గౌరవంతో నిర్మించుకోండి..ఎందుకంటే గౌరవంలేని ప్రేమ ఒక బలహీనమైన భవనం వంటిది—దాన్ని బయట నుంచి చూసే వారికి బలంగా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న గాలివాన వస్తే మాత్రం అది నిలబడదు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
205)నీ సంతోషాల్ని అవతలి వాళ్ళతో పంచుకో తప్పులేదు..నీ బాధని పంచుకోకు నువ్వు బాధలో ఉన్నప్పుడు నీతో మాట్లాడే కొంత మంది మనుషులకి నువ్వు అనే ప్రతి మాట వాళ్లకు ఒక టాపిక్ అయిపోతుంది అవతలి వాళ్లకు ఎంటర్టైన్ ఎందుకు ఇస్తున్నావ్ నువ్వు వేరే వాళ్ళకి నీ బాధ చెప్పగానే తీరిపోయేటట్టు అయితే ఇంక బాధపడటం దేనికి..బాధపడుతుంటే అయ్యో పాపం బాధ పడుతున్నారు అని ఎవరు ఆలోచిస్తారు నీ గురించి అసలు ఎవరు జాలి పడతారు నిన్ను జడ్జ్ చేసే ఛాన్స్ అవతలి వాళ్లకు నువ్వు ఎందుకు ఇస్తున్నావ్ చాలామంది నువ్వు ఏడిస్తే చూడాలి..నువ్వు నాశనం అయిపోతే చూడాలి..నువ్వు దిగజారి పోతే చూడాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు
వాళ్లందర్నీ ఎంటర్టైన్ చేసె జోకర్ అవ్వకు..బాధ వస్తే మౌనంగా ఉండు, వీలైతే నీ మనస్సుని మెదడుని ఇంకోదాని మీదకి మరులుచుకో..అంతే ఎవరికైనా నీ బాధ చెప్పుకుంటే వాళ్లు పదిమందికి చెప్పి నిన్ను ఒక చేతకాని వారిలా జమ చేస్తారు..ఈ సమాజంలో ఎవరి జీవితాలు వాళ్ళు చూసు కోవట్లేదు పక్క వాళ్ళ జీవితాల్లో తొంగిచూసే వాళ్ళే ఎక్కువ..మొదటిగా గుడ్డిగా ఎవరిని నమ్మకు నమ్మి నీ విషయాలన్నీ చెప్పుకోకు గుర్తుపెట్టుకో అనుభవంతో చెప్తున్నా ఇక్కడ నీ మంచి కోరే వాళ్ళ కంటే నువ్వు ఏడిస్తే చూసి ఆనందపడే వాళ్ళు ఎక్కువ.అందుకే ఆ దేవుడికి చెప్పు వింటాడేమో..నీ రాత మారుస్తాడేమో..మనుషుల్ని గుడ్డిగా నమ్మకు ఇక్కడ నీ బాధని వాడుకునే వాళ్ళే ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
206)మనం ఎలా చూస్తామో అలానే కనిపిస్తుంది అందరు ఒకేలా చూడాలి అని లేదు ప్రతి మనిషి లో మంచి చెడు రెండు ఉంటాయి మనకి నచ్చినంత కాలం మంచి కనిపిస్తుంది
నచ్చని రోజు మంచి కూడా చెడుల కనిపిస్తుంది మనస్పర్థలు వచ్చిన రోజు లేదా మనకి ఎదుటి వారు మంచి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఈ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు అని ఆలోచించగలిగితే
చాలా వరకు విభేదాలురావు..కాబట్టి మనం చూసే కోణమే ముఖ్యం ఎలా చుస్తే ఆలా...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
207)చేదు నీ జీవితానికి మంచే చేస్తుంది .....ఏంటి నమ్మవా??చేదుగా ఉండే వేపాకు మన కడుపులో నులిపురుగుల్ని చంపేస్తుంది. చర్మవ్యాధుల్ని అరికడుతుంది.చేదుగా ఉండే కాకరకాయ చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది..చేదుగా ఉండే కుంకుడుకాయ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.మన కంటిలో ఉన్న మలినాలని దూరం చేస్తుంది..కన్నీరు రూపంలో బయటకు తోసేస్తుంది..చేదుగా ఉండే కరక్కాయ దగ్గుని మాయం చేస్తుంది కఫాన్ని కరిగిస్తుంది అలానే మన జీవితంలో జరిగే చెడు అనుభవాలు చేదు జ్ఞాపకాలు కూడా మనుషులు మనస్తత్వాల గురించి నీకు తెలిసేలా చేస్తాయి..ఇప్పుడు చెప్పు చేదు మంచిదే కదా 😄 జీవితంలో వచ్చే ప్రతి చేదు అనుభవం నిన్ను మార్చాలని నీకు కొన్ని పాఠాలు నేర్పాలని చూస్తుంది..కొంచెం ఓర్చుకొని చూడు అంతా మంచే జరుగుతుంది...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
208)నీ ఒంటి మీద రవ్వంత బంగారం లేకపోయినా..నీ వెనుక ఆస్తులు లేకపోయినా..నువ్వు మంచి హోదాలో లేకపోయినా..నీకు అందం లేకపోయినా..నిన్ను అవతలి వాళ్ళు గౌరవిస్తున్నారు అంటే అది నీకు ఈ సమాజంలో ఉన్న నిజమైన గౌరవం..డబ్బు ,హోదా,అందం ఇవన్నీ కొన్ని రోజులే ఉంటాయి ఎప్పుడు ఉంటాయో..ఎప్పుడు పోతాయో కూడా తెలియదు..ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి చనిపోయాక కూడా మనుషుల గుండెల్లో అలానే ఉండిపోతాడు..నీ ప్రవర్తన అవతలి వాళ్ళ గుండెల్లో నీకోసం గుడి కట్టేసేలాగా ఉండాలి..బ్రతికితే గుళ్లో దేవుళ్ళ బతుకు రోడ్డు పక్కన రాయిలా మాత్రం బ్రతక్కు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
209)భగవంతుడైన శ్రీకృష్ణునికే తప్పలేదు మనోవేదన..ఈ భూమి మీద ఒక చిన్న ప్రాణం మనది..దేవుడు మనకు కష్టాలు ఇచ్చాడని ఆయన్ని నిందిస్తూ మనం ఏడుస్తూ ఉంటాం..కష్టాలు వచ్చేది సుఖం విలువ తెలియటానికి..మనుషుల విలువ తెలియటానికి మనకి మనమేంటో చూపించడానికి మనతో కష్టంలో ఎవరుతోడుంటారు తెలియజేయటానికి..మనం ప్రేమించిన వారి ప్రేమ బయటకు రావటానికి..ఈ కష్టాల మధ్యలో నిశ్శబ్దాల సృష్టిలో నీకు నువ్వేంటో తెలుసుకో నీకు ఎవరు ముఖ్యమో తెలుసుకో..కన్నీళ్లు పెట్టొద్దని నేను చెప్పను కన్నీళ్లు పెడితేనే కళ్ళు స్వచ్ఛంగా మారుతాయి..కష్టాన్ని ఎదుర్కొంటేనే నీలో ఉన్న ఆ ఇంకో నువ్వు నీకు పరిచయం అవుతావు అలాగే కన్నీళ్లు విలువైన వారి కోసం కార్చాలి విలువ లేని వారి కోసం కన్నీళ్లు వ్యర్థం చేసుకోకూ అప్పుడు నీ కన్నీటికి విలువ ఉండదు..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
210)మనం పుడతాం..పోతాం..ఈ చిన్న జీవితం ఏ గుర్తింపు లేకుండా పోతే అసలు నువ్వు పుట్టావో చనిపోయావొ ఎవరికి తెలుసు ఇన్ని కోట్ల మందిలో..చనిపోయే చివరి క్షణంలో అనిపిస్తుంది అసలు మనం ఈ భూమి మీదకు వచ్చి ఏం చేశామని అసలా అని..నీ గురించి నీ తల్లిదండ్రులు చెప్పుకోవాలి..నీ తల్లిదండ్రుల గురించి నువ్వు చెప్పుకోవటం కాదు..నీ పిల్లలు చెప్పుకోవాలి నీ గురించి గొప్పగా..నువ్వు ఆపినా ఈ కాలం ఆగదు..జరిగిపోయిన ఏ నిమిషం తిరిగిరాదు..పుట్టినందుకు పదిమందికి గుర్తుండిపోయేలా పోదాం..ఒక చిన్న సైజు బ్రాండ్ క్రియేట్ చేసి పోదాం..అప్పుడే కదా మనం పుట్టినందుకు ఒకఅర్థం..ఈగోలు,ఆటిట్యూడ్,బలుపు..
ఇవన్నీ పరమ దండగ..నువ్వు తోపు తురుము అని నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు..కఠినమైన పరిస్థితి వస్తే నువ్వు ఎంత తోపు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి అర్థం అయిపోతుంది..బయట పదిమంది నీ గురించి మంచిగా చెప్పుకున్న చాలు ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటే అది గొప్పతనం అయిపోదు..ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాళ్ళకి విలువ ఎక్కువ..కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ..మనం ఎవరికీ సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికి కూడా చెడు చేయొద్దు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
211)కొన్ని బంధాల్ని పట్టుకోవడం కంటే వదిలేయటం లోనే సంతోషం ఉంటుంది..మొదట మనల్ని మనం ప్రేమించుకోవాలి..ఎవరి ప్రేమకి బానిస అవద్దు..బలి తీసుకునే ప్రేమ కన్నా ప్రాణం పోసే స్నేహం గొప్పది..మన జీవితంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు..మన డిప్రెషన్ నీ చిటికలో తీసేసే వాళ్ళు..బాధను కూడా కామెడీగా మార్చేసే వాళ్ళు..ఏడవలసిన టైం లో నవ్వించే వాళ్ళు..కష్టం వస్తే కాపాడే వాళ్ళు..ప్రాణం పోతుంటే అడ్డుపడే వాళ్ళు..మనం మాట్లాడకపోతే బాధపడేవాళ్లు..ఇగ్నోర్ చేస్తే తట్టుకోలేని వాళ్ళు..మన మాటల కోసం పిచ్చిగా ఎదురు చూసేవాళ్ళు..మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళు..మన లైఫ్ లో కూడా ఉంటారు అలాంటి స్నేహం ముందు ఈ పనికిరాని ప్రేమలు వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది..తల్లిదండ్రుల తర్వాత స్నేహితులే కదా మన సంతోషాన్ని కోరుకునేది..అలాంటి మంచి స్నేహితులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
212)ఇది కలియుగం ఆకలియుగం..ఇక్కడ రూపాయిదే రాజ్యం పుట్టిన దగ్గర నుంచి చావు దాకా బంధాలు నిలబడాలన్న మనిషి బతకాలి అన్న ప్రతి నిమిషం రూపాయలు లేనిదే ఏది జరగదు..ఆ నలుగురు చిత్రంలో చెప్పినట్టు రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే ? పిల్లలు తల్లితండ్రుల్ని విడదీస్తాను..ప్రేమికులను విడదీస్తాను పెళ్లిళ్లని చెడగొడతాను..బంధాలు నిలబడాలన్నా,
పలుచబడాలన్న విడిపోవాలన్నా నేనే చేస్తాను..నిన్ను కొట్టాలని వచ్చిన వాడిని కూడా సలాం కొట్టేలా చేస్తాను..అబద్ధాలు ఆడిస్తాను,మాటలు మారుస్తాను..అక్రమ సంబంధాలకు తెరతీస్తాను..కూర్చున్న చోట నుంచి శాసిస్తాను..
శత్రువుల్ని పెంచుతాను..వ్యసనాలకు బానిస చేస్తాను అంతులేని సంతోషాలు ఇస్తాను..కొత్త కొత్త బంధాలను నీ చుట్టూ తిప్పిస్తాను...ప్రేమని పలచన చేస్తాను..కళ్ళు నెత్తికెక్కి అయిన వాళ్ళని కష్టపడేలా మాటలనేలా చేస్తాను..రూలర్ గా చేయాలన్న రోడ్డు మీదకి లాగాలన్నా నేనే చేస్తాను ఈ ప్రపంచాన్ని శాసించాలన్నా ప్రాణం నిలబెట్టాలన్న నేనే చేస్తాను అంటుంది..ఎంతన్న డబ్బు డబ్బే..ఎందుకంటే ధనం మూలం ఇధం జగత్...అయితే,ధర్మం లేని ధనం అర్థరహితం అని గుర్తుంచుకోవాలి..ధర్మం లేని వ్యక్తి సంపదను సృష్టించినా,సంపాదించినా,ఆనందంగా అనుభవించ లేరు.అందుకే,ధనం మరియు ధర్మం రెండింటినీ సమతుల్యంగా పరిగణించడం చాలా ముఖ్యం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
213)గుండెకు గాయం కొత్తేమి కాదు..మనసుకి బాధ తెలియంది కాదు..జీవితం అనే బడిలో రోజుకోక అనుభవ పాఠం నేర్చుకోవాలి..మనదంటూ,
మనకంటూ ఏది లేదని తెలిసి.అరాట పడటం అవివేకం అనిచెప్పి..గాయమవుతుందని గమ్యం మరువకు..కన్నీరు వస్తుందని గమనం మరల్చకు..విచ్చిన్నం అవుతుందని వెనుదిరిగి చూడకు..నీకు నువ్వే ప్రశ్న సమాధానం అవ్వాలి..సముదాయించుకునే లోపు సమస్యకి పరిష్కారం అయిపోవాలి..ఎప్పుడూ ఆగిపోకు..అలసిపోకు..అంతిమ విజయం కోసం..ఆఖరి క్షణం వరకు పోరాడితే విజయం నీ బానిస అవడం తధ్యం..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
214)జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి అది ఏంటంటే సరైన ప్రదేశం మాత్రమే మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళుతుంది అనే జీవిత సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి,ఒక చోట మీకు విలువ ఇవ్వకపోతే,కోపం తెచ్చుకోకండి, వాళ్ళు విలువ ఇవ్వలేదు అంటే మీరు తప్పు స్థానంలో ఉన్నారని అర్థం.మీ విలువ తెలిసినవారే మిమ్మల్ని నిజంగా అభినందిస్తారు.మీ విలువను గుర్తించని ప్రదేశంలో ఎప్పుడూ ఉండకండి.. కాబట్టి మీ విలువ తెల్సుకుని మసులుకోండి అనుకున్నది సాధించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
215)
#నాన్నా..
మూడు తరాల తర్వాత ఇంట మొదటి అడపిల్లనని..
తతగారివైపు..నానమ్మ వైపు ఇంట్లో మొదటి బిడ్డనని నన్నెంతో ముద్దుగా పెంచారు..నాన్నా అని మిమ్మల్ని ఒక్కరినే పిలిచినా...మీ నాన్న కూడా నాకు నాన్నేగా..మీరు అమ్ములు అంటే తాతగారు అమ్మా అంటూ ఎప్పుడూ నా వెన్నంటి ఉండేవారు..ఒకరి కూతురుగా ...మరొకరి మనవరాలిగా..నేనెంతో అదృష్టవంతురాలిని..మీరెప్పుడూ నాకు గొప్పగానే కనిపిస్తారు..గంభీరంగా..కోపంగా..అచ్చంగా మన పెంకుటింటి పెద్ద దూలంలా..మీ మీదనే ఇల్లంతా ఉన్నా..ఓ మాట అనరు..కర్తవ్యమే అది అన్నట్టు ఉంటారు..నీ కాళ్ళపై ఊగిన ఉయ్యాల ఇంకా గుర్తే..వద్దులే నాన్నా అంటే..రా తల్లీ నా కాళ్ళ నొప్పులు తగ్గుతాయని మీరన్నప్పుడు..నీ వేలు పట్టుకు నడిచిన అడుగులు..ఎలా ఉండాలో నేర్పుతూ చెప్పిన కథలు..వద్దన్నది చేసినప్పుడు అలకలు..కాస్త జ్వరానికే మీ కళ్ళలో నీళ్ళు..అలసి ఇంటికొచ్చినా వాడని చిరునవ్వులు..
ప్రతీ పుట్టినరోజున వేసిన మొక్కలు..అవి పెరుగుతుంటే ఆ కళ్ళలో మెరుపు ఇప్పటికీ గురుతే...
చిన్న విషయాలకు పెద్ద హోదా ఇచ్చే పల్లెల్లో..
కొన్ని అనవాయితీలను....మరికొన్ని అనవసర సంప్రదాయాలను కుదరదంటే కుదరదని
మీ అమ్మ మాటని కూడా కాదని మాకెంతో స్వేచ్చనిచ్చి పెంచారు..ఏడవ తరగతిలో అనుకుంటా సైకిల్ నేర్చుకుంటా అంటే..సైకిల్ తొక్కటం నేర్పించొద్దని నానమ్మ దెబ్బలాటకి..నానమ్మకు నచ్చ చెబుతూ మీరు..నాకు మీ బజాజ్ చేతక్ నేర్పుతూ తాతగారు..ఊరంతా ముక్కున వేలేసుకున్నా గర్వంగా తలెత్తి చూస్తూ .నా కూతురనేవారు.. ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తే..నేనెప్పుడు పెరిగానో..
అంత పెద్దదాన్ని ఎప్పుడు అయ్యానో అప్పుడే పెళ్లా..
అని ఆలోచనల్లో ఉండగానే పెళ్లి పిల్లలు..
#నాన్నా..
అప్పటివరకు మీరు నాకు నాన్న..
నేను అమ్మయ్యాక మీరు నాకు పసిపిల్లాళ్ళా అనిపించారు.నా పిల్లలతో పిల్లల్లా కలసిపోయి మీరాడే ఆటలు..అమ్మ నాదంటే నాదని పిల్లలంటంటే
అమ్ములు నాదని మీరు చేసే అల్లరి..అలకలు...
పిల్లలకు నా గురించి మీరు చెప్పే కథలు..
మీలో మరో పసివాడిని గుర్తు చేస్తాయి..
వారికి జాగ్రత్తలు చెబుతూ మీకు కూడా చెబుతుంటే
మీ పెదాలపై విరిసే నవ్వు... కళ్ళలో సన్నటి నీటి పొర..
మీ నుండి దూరం పంపిన ప్రతీసారి ఎదో పనుందని మేం బయలుదేరే వరకు వచ్చేవారు కాదు..
రాకుండా ఉండలేక వచ్చాక వదల్లేక మీరు పడే వేదన తెలుస్తూనే ఉంటుంది..మీరు చెప్పిన కొన్ని మాటలు ఎప్పటికీ గుర్తే..మనపై మనకున్న నమ్మకాన్ని కానీ...
ఎదుటి మనుష్యులపై ఉండే నమ్మకాన్ని కానీ వదలొద్దని...నమ్మకమే మనల్ని నడిపించే శక్తి అని..
నిజమే అనిపిస్తుంది...
#నాన్నా...
నమ్మకాన్ని..విశ్వాసాన్ని నింపి..నడకను...నడవడికను నేర్పే నాన్నకు....నీడై...తోడుండే నాన్నకు ధైర్యమై...దారి చూపే నాన్నకు నిజమై..నిలకడై నిలిచే నాన్నకు...
కష్టమైనా....ఇష్టమై సాగే నాన్నకు కన్నీటిని దాచేసి..గాంభీర్యాన్ని మాత్రమే చూపే నాన్నకు..
మూసినా తెరిచినా కంటిలోనే నిలుపుకునే నాన్నకు...
కలవరాల్ని సైతం కలల వరాలుగా ఇచ్చే నాన్నకు...
ఇంకో తరాన్ని చూసినా తన బిడ్డ మాత్రం ఇంకా చంటి పాపే అనుకునే నాన్నకి...బిడ్డల బిడ్డలతో ఆడుకుంటూ తానూ పసిబిడ్డయ్యే నాన్నకు..ఎక్కడ ఏం తప్పటడుగులు వేస్తామో అని అడుగులు తడబడనీయని నాన్నకు ప్రేమతో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
216)మనం జీవితంలో ఎవరితో ఎక్కువసేపు ఉండాలో తెలుసా..మంచి గురించి,లోకం తీరు గురించి,ఎదుగుదల గురించి,కలల ఛేదన గురించి,లక్ష్యాల సాధన గురించి,రూపాయి సంపాదన గురించి,మాట్లాడే చోట ఉండాలి అంతేకానీ మన మధ్య లేని మనుషుల గురించి మాట్లాడే వారితో కాదు ఒకవేళ నిజంగా ఏదైనా పనికిరాని సంభాషణలు మాట్లాడినా ఆ సారాంశంలోంచీ మంచే తీసుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
217)జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వ సాధారణం.అయితే కష్టాలను తలుచుకుంటూ జీవిస్తే జీవితంలో ముందుకు సాగలేం..నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే,నిన్ను ఎవరూ విమర్శించినా,ఎంత విఫలమైనా,ఎన్ని కష్టాలొచ్చినా అవన్నీ కనిపించవు.నీ దారి నువ్వే నిర్ణయించుకోవాలి.జీవితంలో ఎంత కోల్పోయినా,ఎన్ని కష్టాలు వచ్చినా చివరి అవకాశం ఎప్పటికీ ఉంటుంది.దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మళ్లీ ముందు కెళ్లొచ్చు..కాబట్టి సమస్యకు పరిష్కారం తెలుసు కొని,లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగినవాడే ఏదైనా సాధించగలడు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
218)ఇది నాది వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం తప్పు ఎందుకంటే ఏది మనది కాదు..ఎవరూ మనవాళ్ళు కాలేరు కాలంతో పాటు సాగి పోవడమే ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేవాళ్లే రేపు నువ్వు లేకపోయినా ఉండగలనని అంటారు అందుకే జీవితంలో ఎవరిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు..నిన్ను బారం అనుకునే బంధాలను దగ్గర చేర్చుకోకు నువ్వు కావాలి అని అనుకునే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు..రోజులు గడిచే కొద్దీ ఎంతగా బాధలు వేధిస్తున్నా..కష్టాలు గుండెను బాధిస్తున్నా..సమస్యలు మన మెదడును చుట్టు ముట్టినా..చిగురించిన ఆశలన్నీ ఆవిరవుతున్నా రేపటి లక్ష్యం కోసం పోరాడి నువ్వు విజేతగా మారినప్పుడు నిన్ను భారం బరువు అనుకున్న బంధాలే నిన్ను భుజాలపై మోస్తారు కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా లక్ష్యం వైపే అడుగులై నీకు విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
219)ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో లోపల వారితో వారు ఎప్పుడూ ఒక యుద్ధం చేస్తూనే ఉంటారు కానీ అది ఎవ్వరికీ తెలియనివ్వరు..ఎందుకంటే ఎవరి వంతు యుద్ధం వారు చేస్తున్నారుగా..ఈ బతుకుపోరాటంలో..ఏదో తెలీని ఒకప్రశ్న..ఊహూ..చాలానే కొన్నో,ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలే వెంటాడు తుంటాయి..కానీ సమాధానం ఇచ్చేవారు ఇవ్వరు..మీకూ ఇలానే ఉంటాయిగా కొన్ని ప్రశ్నలు..అలా అలా సమాధానం దొరకక,ప్రశ్న నిద్రపోతుంది..మనసులోనే ఒక సమాధిని కట్టుకుని మరీ నిద్రిస్తుంది..అలా ఎన్ని సమాధులను మోస్తున్నామో..మనిషి చనిపోయాక ఒకటే సమాధి..కానీ బతికున్న మనిషి మనసులో ఎన్నో సమాధులు..రోజురోజుకి దూది తడిసి మొయ్యలేనంత బరువైనట్లు..మన బాధాతప్ప కన్నీటి ధారలతో మనసు కూడా దూదిపింజెలా చాలా బరువు పెరుగుతూ ఉంటుంది..అయినా ఇదంతా బతుకు సత్యం తెలిసేవరకే..ఒకసారి బతుకేంటో అర్ధమైతే..ప్రశ్నలే ఉండవు..సమాధానాలు అసలే అక్కర్లేదు..ఏదొస్తే ఆ అనుభవమే జీవితం..నవ్వొస్తే నవ్వాలి..ఏడుపొస్తే ఏడవాలి..అంతా ఆ క్షణానికి మాత్రమే పరిమితం..ఏ అనుభవాన్నీ మొయ్యద్దు అనుక్షణమూ..వచ్చేవి వస్తాయి పొయ్యేవి పోతాయి..అంతే జీవితము..ఏదీ కాదు శాశ్వతము..నీతో సహా ఏదో రోజు చెయ్యక తప్పదు ఖాళీ ఈ స్థలము నీది అనుకుంటున్న నీ స్థానము..కాబట్టి దేనిని మనస్సుకి తీసుకోకుండా శ్రమించి కష్టపడి పని చేయండి అనుకున్నది సాధించండి...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
220)ఒక్కొక్కసారి విలువ లేని దుమ్ము కూడా విలవిలలాడేలా చేస్తుంది!..అలాగే విలువ లేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో బాధపెట్టాలని చూస్తారు..ఆ మాటలు పట్టించుకుంటూ బాధపడితే అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణం ఒంటరి అయిపోతావ్ నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు..ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా! ఆ పని చేసి వాళ్ల నోర్లు మూతపడేలా చెయ్యి అంతేకాని వాళ్ళాన్నారని..వీళ్ళన్నారని ఏడుస్తూ నువ్వు చేయాల్సిన ఆపేస్తే నువ్వు సాధించాల్సిన లక్ష్యాలు మూలాన పడిపోతాయి..కాబట్టి ఏమి జరిగినా వాటిని దులుపుకుని నువ్వు చేరాల్సిన గమ్యానికి వెనుతిరగకుండా సాగిపో విజయం తధ్యం...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
221)జీవితంలో కొన్నిసార్లు నీ కలలు కూలిపోయే టప్పుడు,కళ్ళలో కనీళ్ళు ఉన్నా కళ్ళెదురుగా నువ్వు అనుకున్న మనుషులెవ్వరూ నీ దగ్గర ఉండరు అలాగే కొన్నిసార్లు నీ కుటుంబం కూడా వెలివేసే సందర్భాలు చాలానే ఉండచ్చు కానీ నిన్ను నమ్మిన నీ కంటికి రెప్పలా కాపాడే ఒకే ఒక్కడు స్నేహితుడు..అలాంటి వారు దొరికినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
222)నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి నువ్వు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా అతి విలువైన నీ సమయం,నీ ధైర్యం..నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నువ్వు ఎదుటి వాళ్ళకి ఇవ్వగలిగేవి ఈ రెండు మాత్రమే..నువ్వు సాధించలేని ఎన్నో గొప్ప విజయాల వెనక ఈ రెండు ఖచ్చితమైన ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.ప్రయత్నించి చూడు ఎదుటివారిని గెలిపించడం కూడా నీ గెలుపే అవుతుంది నువ్వు గెలిస్తే నువ్వొక్కడివే గెలుస్తావ్ అదే ఎదుటి వాళ్ళని గెలిపిస్తే ఎంతో మందికి మనం స్ఫూర్తిదాయకం మిగిలిపోతాము..కాబట్టి మీకు తోచిన ఏ చిన్న ప్రయత్నంతో ఒక కుటుంబం బాగుపడుతుందని ఆకాంక్షిస్తూ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
223)ధనబలం కన్నా దైవబలం గొప్పది
భుజబలం కన్నా బుద్ధిబలం గొప్పది
అతిశయం కన్నా అణకువ గొప్పది
వీరత్వం కన్నా వినయం గొప్పది
అభిమానం కన్నా ఆత్మీయత గొప్పది
ఆవేశం కన్నా ఆలోచన గొప్పది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
224)నీ ప్రయత్నాలు చిన్నవైనా సరే, నిరంతరం
చేస్తూ ఉండు. చిన్న చిన్న బిందువులే నదిగా
మారుతాయి..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
225)మనం అందరితో చాలా సరదాగా ఉండడానికి ప్రయత్నించాలి..ఎవరైనా సూటిపోటి మాటాలన్నప్పుడు మనస్సు విరిగిపోకుండా ఉండేలా గట్టిగా తయారవ్వాలి..కొన్నిసార్లు మన దగ్గరి వారు ఏదైనా అన్నప్పుడు బాధ కలిగిన వెంటనే కలిసిపోవాలి..అంతేకాని సంభాదల్ని దూరం చేసుకోకూడదు..ఏడ్చే వాళ్ళని ఓదార్చాలి..నచ్చే వాళ్ళని ప్రేమించాలి..నిన్ను ద్వేషించే వాళ్ళని..ఇబ్బంది పెట్టే వారిని దూరం పెట్టాలి..నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళకి ఆసరాగా..తోడుగా ఉండాలి..ఎందుకంటే నువ్వు చేసే మంచే నిన్ను కాపాడుతుంది.. అర్ధమైతే ఆచరించు అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు..ఇట్లు మీ..✍🏻 *రఘురాం*
226)తప్పు చేసిన తర్వాత చెప్పే క్షమాపణకి ,అవసరం తీరిపోయాక చెప్పే థాంక్స్ కి నా దృష్టిలో కొన్నిసార్లు రెండింటికి విలువ ఉండకుండా పోతుంది ఎందుకంటే..తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి..అలాగే అవసరం రాకుండా కూడా చూసుకోవాలి ఏది జరిగినా కొన్ని రోజులకి మనిషి మీదున్న మర్యాద పోతుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
227)ఇప్పుడు వదిలేసి వెళ్ళినవారంతా ఒకప్పుడు నిన్ను వదిలి వెళ్ళను అని ప్రమాణాలు చేసినా వారే..ఈ రోజు నీ కన్నీటికి కారణమైన వారంతా ఒకప్పుడు నువ్వే ప్రపంచం అని చెప్పిన వారే...ఎంత మంది నీ చుట్టూ ఉన్న ఒంటరిగా ఉండిపోయవంటే ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం నువ్వు ఉంటే చాలు అని నమ్మించినా ఒంటరిని చేసినా వారే..మనిషినే నమ్మే రోజులే కావివి మరి మాటలని ఎలా నమ్మాలి మిత్రమా ఎందుకంటే ఒకరికి అవసరం ఇంకొకరికి అవకాశం అంతా నటనే కాబట్టి జాగ్రత్త ముందుగానే పసికట్టి ఏరుకుగా ఉండూ మిత్రమా లేదంటే అదఃపాతాళమే...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
228)నీ కంటూ నీదంటూ ఏదైనా ఆస్తి ఉందని అంటే అది నీ మర్యాద ఒక్కటే అని తెలిసిన రోజున నిన్ను నువ్వే కాదు..నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే కోణం కూడా మారుతుంది..కాబట్టి నీ మర్యాదని(సెల్ఫ్ రెస్పెక్ట్ ని) ఎవ్వరి కాళ్ళ దెగ్గర పెట్టకు..ఎందుకంటే ఇది పోయిన రోజున నీ దగ్గర ఎంతఉన్నా ఏమున్న అది నిరుపయోగమే.. అర్ధమైతే ఆచరించు అసలు అర్ధమే లేదనుకుంటే మన్నించు...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
229)ఈరోజు కష్టాలు ముంచేసినా,కన్నీళ్లు ముద్ద చేసినా..రేపు ఇలా ఉండదు, బాగుంటుంది అన్న నమ్మకం ఒక రోజు జీవితాన్ని నిజంగా మారుస్తుంది.దీని వెనక ఉద్దేశాలు ఉపదేశాలు ఏమీ లేవు,ఈ క్షణం శాశ్వతం కాదు అన్న నిజం తప్ప!! జీవితం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.అది మంచిగానా లేక చెడ్డగానా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది.తీసుకునే నిర్ణయాలు,సమస్యను చూసే కోణం మీద ఆధారపడి ఉంటుంది.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
230)కొన్నిసార్లు ఉత్తమమైన మందు అంటే,ఎవరో ఒకరు మన కోసం నిజంగా కేరింగ్ చేయడం,మన పరిస్థితిని గుండెతో అనుభవించడం, నిజాయితీగా మనతో ఉండటం…ముఖ్యంగా మన భావాలను వ్యక్తపరచడానికి మాటలు లేకపోయినప్పటికీ, మన మనస్థితిని పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఉండడం...అలాంటి వారిని సంపాదించుకో...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
231)నీ జీవితం కోసమే నువ్వు కష్ట పడుతున్నావు.నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు.నీవు చిందించే ప్రతీ
చెమట చుక్క వందరెట్లు ఆనందాన్ని,జారే ప్రతీకన్నీటి బొట్టు వెయ్యిరెట్లు సంతోషాన్ని తీసుకొస్తాయి.ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి,మొక్కనాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు.అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు.దేనికైనా సమయం రావాలి,దానికై ఎదురు చూడాలి.నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేసినా,నిన్ను నమ్మిన వారిని నీవు మోసం చేయకు.ఎందుకంటే నువ్వు మోసం చేసేది మనుషుల్ని కాదు వారు నీపై పెట్టుకున్న నమ్మకాలని.ఒకవేళ నువ్వు నిజంగా మోసం చేయాలనుకొన్నా కర్మ అనేది ఒకటి ఉంటుంది అది వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది..కాబట్టి వీలైతే నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడు నువ్వు చేసింది ధర్మమే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
232)నీ సంతోషంలో,నీ బాధలో,నీ కష్టంలో,నీ ప్రతి పరిస్థితిలో నీ గురించి అన్నీ తెలిసిన ఒక నేస్తం కాలాలు మారిన కలిసి ఉండే నేస్తం ఒకరుంటే నువ్వు జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా చాలా సులభంగా పరిష్కరించ గలవు..మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండదు అలా అర్థం చేసుకునే తోడు నీకుంటే అసలు వదులుకోకు..ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా అలాంటి మనుషులు దొరకరు....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
233)ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే.. ప్రయత్నిస్తూ విరమిస్తే మరణించినట్టే..కాబట్టి మనస్సు పెట్టి చేసే ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకు..ఎదో ఒక రోజు గెలిచి తీరుతావు..ఇట్లు మీ రఘురాం
234)నీకు తెలిసిన ప్రతి ఒక్కరి ముఖం వెనకాల మరో ముఖం ఉంటుంది.నీకు తెలిసిన ప్రతి కథ వెనకాల మరో కథ ఉంటుంది..అలోచించి అడుగేయ్...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
235)అందరూ ఎలా ఉంటే అలానే ఉండాలని తప్పు చేయకండి.నిన్ను పుట్టించిన తల్లిని,నీకు పుట్టిన కూతురిని,నీతో పుట్టి రక్తం పంచుకున్న నీ తోబుట్టువును.నిన్ను తండ్రిని చేసిన భార్యని ప్రేమించండి.బంధాలను బాధ్యతగా భావించండి.బరువు అనుకోవద్దు.జీవితం అంటేనే బంధాలు, అనుబంధాలు కలయిక.వాటి విలువ తెలుసుకుని నిలబెట్టుకోవాలి..వయసులో పెద్దవారు అయితే పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. మీరే తప్పు దారిలో వెళితే మీ పిల్లలు కూడా అదే బాటలో నడవాలి అనుకుంటారు..కాబట్టి ఆదర్శంగా గౌరవంగా బ్రతకండి అప్పుడే కదా దేవుడు ఇచ్చిన ఈ జన్మకి విలువ ...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
236)జీవితంలో మనం ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని మనసా వాచా కర్మణా నమ్మి పూర్తి చేయ గలగాలి..ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధిగమించాలి.తలపుల్లోగాని, వాక్కుతో గాని,చేష్టలతోగాని,ఏవ్వరికీ హాని తలపెట్టకుండా గమ్యాన్ని చేరాలి..దానికి మనోసంకల్పం చాలా అవసరం..దీనివల్ల ఆలోచనలకు స్థిరత్వం సిద్ధిస్తుంది.. కాబట్టి సంకల్పంతో ముందడుగై అనుకున్నది సాధించెయ్...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
237)జీవితంలో ఏ సందర్భంలోనైనా విజయాన్నే కోరుకుంటాం.అయితే కొంతమంది మాత్రమే దాన్ని సాధిస్తారు.కొంతమంది విజయం దిశగా పరుగు పెట్టి మధ్యలోనే ఆగిపోతారు.జీవితంలో జయాపజయాలకు కారణాలెన్ని ఉన్నా,సంకల్పశక్తి బలంగా లేకపోవడమే ఓటమికి ముఖ్య కారణమని చెప్పొచ్చు.అలాగే మనిషి నైతికంగా బతకాలి,మంచి మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు సంకల్పబలం స్థిరంగా ఉండాలి.అది లేకపోతే గమనం పక్కదారి పడుతుంది.ఆలోచనలు స్థిమితంగా
ఉండవు.వ్యక్తిత్వం బీటలు వారుతుంది..కాబట్టి ఏదైనా నెరవేర్చు కోవాలంటే ఈ సంకల్పశక్తి
బలంగా ఉంటేనే దేన్నైనా సాధించగలము గమ్యాన్ని చేరుకోగలము...ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
238)ఒక కోడి అనుకుందంట పొద్దున్నే నేను కూయకపోతే తెల్లారదని దాని దృష్టిలో అది కూస్తేనే తెల్లారు తుందని అనుకుంటుంది కానీ నిజమేంటంటే కోడి కూసినా కూయకపోయినా తెల్లవారటం చీకటి పెట్టడం ఏది ఆగదు..కోడికి తెలీదు దాని పుట్టుక చనిపోవడం కోసమే అని అవతలి వాళ్ళు ఆహారంలా ఆస్వాదించడానికి అని అలాగే నీక్కూడా తెలియదు నువ్వు అవతల వాళ్ళకి ఉపయోగపడటం కోసం వాళ్ళ జీవితంలో ఉన్నావని..మనలో కూడా చాలా మంది ఉంటారు..మనం లేకపోతే అవతలి వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచిస్తూ ఉంటారు అసలు ఇదే పిచ్చితనం అంటే..ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరి జీవితం ఎక్కడ ఆగిపోదు పుట్టిన దగ్గరనుంచి చచ్చిపోయే దాకా కొత్త కొత్త వాళ్లు జీవితాల్లోకి వస్తూనే ఉంటారు కాలాన్ని సమయాన్ని,మనుషులని మనం పట్టుకుని ఆపలేం అలానే ఎవరి జీవితాల్లో అయిన మనం ఉన్నందు వల్ల వాళ్లకి వచ్చే ఉపయోగం కానీ లేక పోవడం వలన నష్టం కానీ ఏమి ఉండదు..అనవసరమైన ఆలోచనలు మానేసి నీ జీవితంలో సంతోషానికి తప్ప బాధకి ప్రాధాన్యత ఇవ్వకు..ఏమో ఈరోజు ఉన్నం రేపు ఉంటామో లేదో మనది చాలా చిన్న జీవితం..చిటికలో అయిపోవచ్చేమో..ఈ నిమిషం మనకేమన్న జరిగితే రెండు గంటల్లో..తీసుకెళ్లి స్మశానంలో పడేస్తారు...కొన్ని రోజుల జ్ఞాపకంలా అవతలి వాళ్లకు గుర్తు ఉంటుంది తర్వాత కాలంతో పాటు అన్ని మర్చిపోతారు...నీతో సహా కాబట్టి ఎక్కువ ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండటం నేర్చుకో....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
239 ఇద్దరు అన్నాదమ్ములు.ఒకడు తాగుబోతు.ఒకడు ప్రయోజకుడు.తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని.."అంతా మా నాన్న వల్లే... ఆయన తాగుబోతు.మమ్మల్ని పట్టించుకోలేదు.ఎప్పుడూ కొట్టేవాడు.ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు..అందుకే నేనిలా తయారయ్యాను." అన్నాడు.
ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే..“అంతా మా నాన్న వల్లే...ఆయన తాగుబోతు.మమ్మల్ని పట్టించుకోలేదు.ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు.. అమ్మని కొట్టేవాడు..ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను.అందుకే నేనిలా తయారయ్యాను.
"అన్నాడు.
ఒకే పరిస్థితి.ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది.
తేడా పాఠంలో లేదు.నేర్చుకునేవాడిలో ఉంది..కాబట్టి నువ్వెలా తయారవ్వాలనేది నువ్వు ఎంచుకునే మార్గంలోనే ఉంది..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
240)వయసు పెరిగే కొద్దీ స్నేహాలు తగ్గిపోతాయి..
బాధ్యతలు ఒకదానికొకటి తోడవుతాయ్..భుజాలు బరువెక్కుతాయ్..వచ్చే సంపద సరిపోదు..కలలు కనడం ఆపేస్తాం..సర్దుకుని బతకడం అలవాటు చేసుకుంటాం..జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయ్..
కష్టాలు దెబ్బ మీద దెబ్బలా పెరుగుతూనే ఉంటాయి.
నిశ్శబ్దం,ఒంటరితనం అలవాటవుతాయ్..
ఏడిస్తేనేమో కన్నీళ్లు రావు...నవ్వడం తప్ప ఇంకేదీ చేయలేం..పొద్దున్నోచ్చే టెన్షన్లు పోవు..రాత్రిళ్ళు నిద్ర రాదు.. మనశాంతి కరువైతుంది..మగాడిగా బతకడమంటే కృష్ణుడులేకుండా కురుక్షేతం చేసినంత కష్టం..శుభోదయం నేస్తం..ఎక్కడో విన్నది చదివినది..ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*
241)సమస్య చిన్నదైనా పెద్దదైనా ప్రయత్నించి చూడు గెలవకపోయినా ప్రయత్నం చేయకుండానే ఓడిపోయాను అన్న ఆలోచన నీకు ఉండదు..ఈ ప్రపంచంలో ఎంత విచిత్రమైనది అంటే అన్నీ ఉన్నవాడికి చేయాలన్న జ్ఞానం ఉండదు. అవయవాలు సరిగా లేకపోయినా వాళ్ళు ఏంటో నిరూపించుకోవాలి ప్రపంచంలో విజేతలుగా నిలబడాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని మనం అభినందించాలి.. కొంతమందిని చూసినప్పుడు కాళ్లు చేతులు అన్నీ ఉండీ కూడా సోమరిలాగా తిరిగే మనుషులను చూస్తే చాలా బాధ వేస్తుంది ప్రయత్నం చేసిన తర్వాత ఓడిపోతే ఒక సంతృప్తి ఉంటుంది ఏ ప్రయత్నం చేయకుండా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఓటమినీ అంగీకరించే వాళ్ళు ఈ ప్రపంచంలో పైకి రాలేరు..నీ చుట్టూ ఉన్న సమస్యలను నువ్వే పరిష్కరించకపోతే ఇంకెవరు పరిష్కరిస్తారు నీ పని నువ్వు చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అనవసరంగా కాలయాపన చేస్తూ మరొకరికి ప్రాబ్లం గా బ్రతికే దానికన్నా మనకి చేతనైతే మనం చేస్తూ ముందుకు వెళ్తే ఆ జీవితమే వేరు ఆ తృప్తి వేరు..ఓడిపోయిన కూడా ఆగిపోకుండా ప్రయత్నం చేస్తూనే ఉండు నీ ప్రయత్నం ఏదో ఒకరోజు తప్పకుండా ఫలిస్తుంది విజయం నిన్ను వరిస్తుంది కష్టే:ఫలి అన్నారు పెద్దవాళ్ళు.....ఇట్లు..మీ..✍🏻 *రఘురాం*